World Athletics Championship
-
శభాష్ శ్రీరాములు!
విశాఖ స్పోర్ట్స్: వయసు 100 దాటినా అది అంకె మాత్రమే అంటూ అథ్లెటిక్స్‌లోనూ దూసుకుపోతున్నారు విశాఖకు చెందిన నేవీ కమాండర్ వల్లభజోస్యుల శ్రీరాములు. ఈ నెల 13–25 వరకు స్వీడన్‌లోని గోథెన్బర్్గలో జరిగిన వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఫీల్డ్ అంశాలైన జావెలిన్ త్రో, డిస్కస్‌త్రో పాటు షాట్‌పుట్‌లోనూ 101 ఏళ్ల వయసులో విజేతగా నిలిచి 3 స్వర్ణ పతకాలను శ్రీరాములు సాధించారు. స్వాతంత్య్రానికి ముందే రాయల్ ఇండియన్ నేవీలో చేరిన శ్రీరాములు రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం స్వతంత్ర భారత్‌లోనూ భారత నావికా దళంలో అధికారిగా నియమితులయ్యారు. కళాశాల రోజుల నుంచే క్రీడాకారుడైన శ్రీరాములు అప్పట్లో ఫుట్‌బాల్‌తో పాటు అథ్లెటిక్ అంశాల్లో పాల్గొనేవారు. పదవీ విరమణ అనంతరం విశాఖలోని తన స్వగృహంలో గతేడాది నూరు వసంతాల్ని పూర్తి చేసుకున్నారు. జూలైలో 101వ జన్మదినాన్ని నిర్వహించుకున్న ఈయన మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని 3 స్వర్ణాల్ని అందుకుని, మంగళవారం విశాఖ చేరుకున్నారు. ఆయన సాక్షితో మాట్లాడుతూ.. 2011 నుంచి 15 వరకు కాలికి గాయం కావడంతో కాస్త విరామం ఇచ్చినా, తిరిగి పోటీల్లో పాల్గొని విజేతగా నిలవడం ఆనందాని్నస్తోందని చెప్పారు. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ మాస్టర్స్ పోటీల్లో 24 పతకాల్ని సొంతం చేసుకున్నట్లు తెలిపారు. 81 ఏళ్ల వయసులో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించినట్లు శ్రీరాములు చెప్పారు. -
పారిస్ ఒలింపిక్స్‌కు భారత రిలే జట్లు అర్హత
నసావు (బహామస్): వరల్డ్ అథ్లెటిక్స్ రిలే పోటీల్లో రాణించిన భారత పురుషుల, మహిళల 4 x 400 రిలే జట్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి దండి జ్యోతిక శ్రీ, రూపల్ చౌధరీ, పూవమ్మ, శుభ వెంకటేశన్‌లతో కూడిన భారత మహిళల రిలే జట్టు రెండో హీట్‌లో 3 నిమిషాల 29.35 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానాన్ని దక్కించుకొని పారిస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. 4 400 మీటర్ల విభాగంలో భారత మహిళల జట్టు ఒలింపిక్స్‌కు అర్హత పొందడం ఇది ఎనిమిదోసారి కావడం విశేషం. గత టోక్యో ఒలింపిక్స్‌లో ఈ విభాగంలో భారత జట్టు అర్హత పొందలేదు. మరోవైపు అనస్ యాహియా, మొహమ్మద్ అజ్మల్, అరోకియా రాజీవ్, అమోజ్ జేకబ్‌లతో కూడిన భారత పురుషుల 4 x 400 మీటర్ల రిలే జట్టు కూడా పారిస్ ఒలింపిక్స్ టికెట్‌ను దక్కించుకుంది. రెండో హీట్‌లో అనస్, అజ్మల్, అరోకియా, అమోజ్ బృందం 3 నిమిషాల 3.23 సెకన్లలో లక్ష్యానికి చేరి రెండో స్థానంతో ఒలింపిక్స్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. ఒలింపిక్స్‌కు అర్హత పొందడం భారత పురుషుల రిలే జట్టుకిది నాలుగోసారి. టోక్యో ఒలింపిక్స్‌లో, ప్రపంచ చాంపియన్íÙప్లో భారత రిలే జట్టు పతకాలు సాధించకపోయినా కొత్త ఆసియా రికార్డులను నెలకొలి్పంది. వరల్డ్ రిలే పోటీల ద్వారా మొత్తం 70 జట్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి. -
మరో విజయంపై నీరజ్ దృష్టి
జ్యూరిక్ (స్విట్జర్లాండ్): ఈ ఏడాది బరిలోకి దిగిన ప్రతి టోర్నీలోనూ అగ్రస్థానంలో నిలిచిన ఒలింపిక్, ప్రపంచ చాంపియన్, భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరో విజయంపై దృష్టి సారించాడు. ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్‌లో భాగంగా నేడు జ్యూరిక్‌లో జరిగే మీట్లో నీరజ్ పోటీపడనున్నాడు. ఈ సీజన్లో నీరజ్ రెండు డైమండ్ లీగ్ మీట్లలో (మే 5 దోహా; జూన్ 30 లుజానె) అగ్రస్థానంలో నిలిచాడు. అనంతరం ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించాడు. నేడు అర్ధరాత్రి 12 తర్వాత మొదలయ్యే జావెలిన్ త్రో ఈవెంట్లో నీరజ్‌తోపాటు జాకుబ్ వాద్లెచ్ (చెక్ రిపబ్లిక్), ప్రపంచ మాజీ చాంపియన్ పీటర్స్ అండర్సన్ (గ్రెనెడా), వెబెర్ (జర్మనీ) తదితర స్టార్స్ పోటీపడనున్నారు . ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం బిడ్..! 2027 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ఆతిథ్య హక్కుల కోసం భారత్ బిడ్ వేస్తుందని బుధవారం ఇక్కడి మీడియాతో నీరజ్ చోప్రా వ్యాఖ్యానించాడు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోద ముద్ర లభిస్తే భారత అథ్లెటిక్స్ సమాఖ్య చొరవ తీసుకుంటుంది. 2027 ప్రపంచ చాంపియన్‌షిప్ నిర్వహణ కోసం అక్టోబర్ 2లోపు బిడ్ దాఖలు చేయాలి. ఇప్పటికే 2027 ప్రపంచ చాంపియన్‌షిప్ ఆతిథ్యం కోసం బీజింగ్ తమ బిడ్ దాఖలు చేసింది. -
195 దేశాలు.. 2100 మంది అథ్లెట్లు! చరిత్రకెక్కిన నీరజ్, అర్షద్..
World Athletics Championships 2023 Medal Tally: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పతకాల పట్టికలో భారత్ 18 స్థానంలో నిలిచింది. ఒక్కో స్వర్ణ పతకం గెలిచిన బహ్రెయిన్, బుర్కినా ఫాసో, డొమినికన్ రిపబ్లిక్, వెనిజులా, సెర్బియా దేశాలతో కలిసి భారత్ సంయుక్తంగా 18వ ర్యాంక్ సాధించింది. ప్రపంచ చాంపియన్‌షిప్-2022లో జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా రజత పతకం కారణంగా భారత జట్టు మరో ఐదు దేశాలతో కలసి సంయుక్తంగా 33వ స్థానంలో నిలిచింది. ఈసారి మన బంగారు కొండ నీరజ్ చోప్రా రజతాన్ని స్వర్ణంగా మార్చి దేశానికి గర్వకారణమయ్యాడు. చరిత్రకెక్కిన నీరజ్, అర్షద్ నదీం హంగేరీలోని బుడాపెస్ట్‌లో ఆదివారం జరిగిన జరిగిన జావెలిన్ త్రో ఫైనల్స్‌లో అత్యధికంగా 88.17 మీటర్ల దూరం ఈటెను విసిరాడు. పోటీలో ప్రథమ స్థానంలో నిలిచి ప్రపంచ చాంపియన్‌గా అవతరించాడు. ఇక దాయాది పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీం 87.82 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి నీరజ్ తర్వాతి స్థానం దక్కించుకున్నాడు. రజత పతకం గెలిచి తొలిసారి పాక్‌కు మెడల్ అందించిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఈ విషయాలు తెలుసా! ఇప్పటి వరకు 19 సార్లు ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు జరిగాయి. ఈసారీ అమెరికా తమ ఆధిపత్యాన్ని చాటుకుంటూ పతకాల పట్టికలో 15వసారి అగ్రస్థానంలో నిలిచింది. అమెరికా 12 స్వర్ణాలు, 8 రజతాలు, 9 కాంస్యాలతో మొత్తం 29 పతకాలతో టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. ఈసారి ప్రపంచ చాంపియ న్షిప్లో పాల్గొన్న దేశాలు 195. మొత్తం 2100 మంది అథ్లెట్లు పోటీపడ్డారు. 120 దేశాల నుంచి నాలుగు లక్షల మంది ప్రేక్షకులు వచ్చి ఈ మెగా ఈవెంట్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు. తాజా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కనీసం ఒక్క పతకమైనా సాధించిన దేశాలు 46. జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ రజత పతకంతో ఈ పోటీల చరిత్రలో తొలిసారి పాకిస్తాన్ ఖాతాలో తొలి పతకం చేరింది. చదవండి: ఇష్టాయిష్టాలతో పనిలేదు.. ఆరోజు యువరాజ్ సింగ్ నన్ను ఓదార్చాడు: రోహిత్ -
నీరజ్ చోప్రా మూన్ షాట్ వీడియో వైరల్: ఆనంద్ మహీంద్ర మళ్లీ కారు గిఫ్ట్?
World Athletics Championships first goldNeeraj Chopra బుడాపెస్ట్ (హంగేరి) వేదికగా జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో గోల్డెన్ బోయ్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. వరల్డ్ అథ్లెటిక్స్‌లో ఇండియాకు తొలి స్వర్ణం అందించిన ఘనతను దక్కించుకునాడు. దీనిపై ప్రధానమంత్రి నరంద్రే మోదీ సహా పలువురు ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా నీరజ్ అద్భుత విజయంపై బిలియనీర్, ఎం అండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్ర స్పందించారు. ఇండియా.. చోప్రా.. గోల్డ్ అంటూ అతడిని అభినందించారు. అంతేకాదు మూన్‌షాట్ అంటూ ఆయన సహోద్యోగి రూపొందించిన ఒక ఆసక్తికర వీడియోను ట్వీట్ చేశారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. అలాగే నీరజ్ చోప్రా విజయం మండే మోటివేషన్ కాకపోతే మరేమిటి అంటూ సోమవారం మరో ట్వీట్ చేశారు. అయిదే ఈ మోటివేషన్ కేవలం స్వర్ణం సాధించడ వల్ల మాత్రమే కాదు..సహజమైన ప్రతిభ ఉంటే సరిపోదు సక్సెస్రాదు నీరజ్ గుర్తు చేశారు. ప్రిపరేషన్ పట్ల రాజీలేని నిబద్ధతకు ఫలితం ఈ గొప్ప విజయం అని చాటి చెప్పారంటూ నీరజ్‌ను అభినందించారు. How could my #MondayMotivation this morning be anything other than this man’s latest victory? But it’s not because he won Gold. It’s because he is a reminder that success is not an outcome of only natural talent; it is the result of an uncompromising commitment to preparation…… pic.twitter.com/VQMM98L7li — anand mahindra (@anandmahindra) August 28, 2023 కాగా పురుషుల జావెలిన్ త్రోలో స్వర్ణం పతకం సాధించిన నీరజ్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిస్తున్నారు. లెజెండ్ అథ్లెట్ అంటూ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. అంతేకాదు నీరజ్‌కు మరో కారు ఇస్తారా సార్ అంటూ ఒక యూజర్ ప్రశ్నించడం గమనార్హం. INDIAAAAA. CHOPRAAAA. GOLLLDDD. 💪🏽🇮🇳 His moonshot does it… (The clip in this video my colleague made is from the qualifier…) pic.twitter.com/3HSWUZ3PUI — anand mahindra (@anandmahindra) August 27, 2023 ఇదీ చదవండి: ఊరట! పసిడికి ఫెడ్ బ్రేకులు: ఎంత తగ్గిందంటే..! వావ్...అందరి చూపు ఆకాశానికే..మన చిరుతల వేగం చూడండి! -
భారత రిలే జట్టుకు ఐదో స్థానం
బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత పురుషుల 4x400 మీటర్ల రిలే జట్టు తమ ప్రదర్శనతో అకట్టుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో అనస్ యాహియా, అమోజ్ జేకబ్, అజ్మల్, రాజేశ్ రమేశ్‌లతో కూడిన భారత బృందం ఐదో స్థానాన్ని దక్కించుకుంది. భారత బృందం 2 నిమిషాల 59.92 సెకన్లలో గమ్యానికి చేరింది. అదే విధంగా 2:57.31 సెకన్లలో గమ్యానికి చేరిన అమెరికా జట్టు అగ్రస్ధానంలో నిలిచింది. ఆ తర్వాతి స్ధానాన్ని ఫ్రాన్స్(2:57.45 సెకన్లు) కైవసం చేసుకుంది. మరోవైపు మరోవైపు మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఫైనల్లో భారత అథ్లెట్ పారుల్ చౌధరీ 11వ స్థానంలో నిలిచింది. పారుల్ 9 నిమిషాల 15.31 సెకన్లలో గమ్యానికి చేరి కొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది. చదవండి: భారత ట్రిపుల్ సెంచరీ వీరుడి సంచలన నిర్ణయం.. ఇకపై! -
World Athletics Championships: నీరజ్ స్వర్ణ చరిత్ర
నాలుగు దశాబ్దాల ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో ఏ భారతీయ అథ్లెట్‌కు సాధ్యంకాని ఘనతను జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సాధించాడు. ఈ మెగా ఈవెంట్ చివరిరోజు ఆదివారం నీరజ్ చోప్రా భారత అభిమానుల్లో పసిడి కాంతులు నింపాడు. అందరి అంచనాలను నిజం చేస్తూ నీరజ్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. తద్వారా ఈ ప్రతిష్టాత్మక చాంపియన్‌షిప్‌లో పసిడి పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్‌గా కొత్త చరిత్రను లిఖించాడు. బుడాపెస్ట్ (హంగేరి): భారతీయులు కూడా ఇక సగర్వంగా చెప్పవచ్చు... ప్రపంచ అథ్లెటిక్స్‌లో మాకు ఉన్నాడు ఒక ప్రపంచ చాంపియన్ అని... గత ఏడాది ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం నెగ్గిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈసారి పతకం రంగు మార్చాడు. ‘రజత’«దీరుడి నుంచి ‘పసిడి’వీరుడిగా మారాడు. ఆదివారం ముగిసిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా స్వర్ణ పతకం సాధించాడు. నీరజ్ రెండో ప్రయత్నంలో విసిరిన జావెలిన్ అత్యధికంగా 88.17 మీటర్ల దూరం వెళ్లింది. మొత్తం ఆరు ప్రయత్నాల్లో ఈ దూరాన్ని మరో అథ్లెట్ అధిగమించలేకపోయాడు. ఫలితంగా నీరజ్‌కు బంగారు పతకం ఖరారైంది. పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ 87.82 మీటర్లతో రజత పతకం దక్కించుకోగా... జాకుబ్ వాద్లెచ్ (చెక్ రిపబ్లిక్) 86.67 మీటర్లతో కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. భారత్‌కే చెందిన కిశోర్ కుమార్ జేనా 84.77 మీటర్లతో ఐదో స్థానంలో, మనూ 84.14 మీటర్లతో ఆరో స్థానంలో నిలిచారు. ఫౌల్‌తో మొదలు... క్వాలిఫయింగ్‌లో అగ్రస్థానంలో నిలిచిన నీరజ్ చోప్రా ఫైనల్‌ను నిరాశాజనకంగా ప్రారంభించాడు. నీరజ్ తొలి ప్రయత్నమే ఫౌల్ అయింది. దాంతో భారత అభిమానులు కాస్త ఆందోళన చెందారు. కానీ నీరజ్ వెంటనే తేరుకున్నాడు. రెండో ప్రయత్నంలో నీరజ్ జావెలిన్‌ను ఏకంగా 88.17 మీటర్ల దూరం విసిరాడు. ఈ ప్రదర్శనతో నీరజ్ చివరిదైన 12వ స్థానం నుంచి అగ్రస్థానానికి దూసుకొచ్చాడు. నిరీ్ణత ఆరు ప్రయత్నాల వరకు నీరజ్ అగ్రస్థానాన్ని కొనసాగించాడు. అన్నీ సాధించాడు... 2016లో ప్రపంచ అండర్–20 చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచి వెలుగులోకి వచి్చన నీరజ్ ఈ ఏడేళ్ల కాలంలో ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగాడు. 2017 ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో తొలిసారి పాల్గొని 15వ స్థానంలో నిలిచిన నీరజ్ ఆ తర్వాత రాటుదేలాడు. అదే ఏడాది భువనేశ్వర్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెలిచిన నీరజ్... 2018 ఆసియా క్రీడల్లో, 2018 కామన్వెల్త్ గేమ్స్‌లోనూ పసిడి పతకాలు సొంతం చేసుకున్నాడు. 2021లో టోక్యో ఒలింపిక్స్‌లో అందరి అంచనాలను తారుమారు చేస్తూ స్వర్ణ పతకం నెగ్గిన ఈ హరియాణా స్టార్ 2022 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం, 2022 ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో స్వర్ణంతో మరింత ఎత్తుకు ఎదిగాడు. అదే జోరును కొనసాగిస్తూ తాజా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకంతో యావత్ భారతాన్ని ఆనందడోలికల్లో ముంచాడు. తాజా స్వర్ణంతో నీరజ్ అథ్లెటిక్స్‌లోని అన్ని మేజర్ ఈవెంట్లలో పతకాలు నెగ్గిన జావెలిన్ త్రోయర్‌గా నిలిచాడు. భారత రిలే జట్టుకు ఐదో స్థానం ఆదివారమే జరిగిన పురుషుల 4్ఠ400 మీటర్ల రిలే ఫైనల్లో అనస్ యాహియా, అమోజ్ జేకబ్, అజ్మల్, రాజేశ్ రమేశ్‌లతో కూడిన భారత బృందం ఐదో స్థానాన్ని దక్కించుకుంది. భారత బృందం 2 నిమిషాల 59.92 సెకన్లలో గమ్యానికి చేరింది. మరోవైపు మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఫైనల్లో భారత అథ్లెట్ పారుల్ చౌధరీ 11వ స్థానంలో నిలిచింది. పారుల్ 9 నిమిషాల 15.31 సెకన్లలో గమ్యానికి చేరి కొత్త జాతీయ రికార్డు నెలకొలి్పంది. 3: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు లభించిన మొత్తం పతకాలు. 2003లో మహిళల లాంగ్‌జంప్‌లో అంజూ జార్జి కాంస్యం సాధించగా... 2022లో నీరజ్ రజతం, 2023లో నీరజ్ స్వర్ణం గెలిచాడు. 2: ఒలింపిక్స్‌తోపాటు ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ స్వర్ణ పతకాలు గెలిచిన రెండో భారతీయ క్రీడాకారుడు నీరజ్ చోప్రా. గతంలో షూటర్ అభినవ్ బింద్రా ఈ ఘనత సాధించాడు. అభినవ్ బింద్రా 2006 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో పసిడి పతకాలు గెలిచాడు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నీరజ్ మెరిసె... తొలిసారి ఒకే ఈవెంట్ ఫైనల్లో ముగ్గురు భారత అథ్లెట్లు
బుడాపెస్ట్ (హంగేరి): కొన్నేళ్లుగా అంతర్జాతీయ అథ్లెటిక్స్ వేదికపై భారత ముఖచిత్రంగా మారిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరోసారి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన నీరజ్ చోప్రా తొలి అడ్డంకిని విజయవంతంగా అధిగమించాడు. శుక్రవారం జరిగిన క్వాలిఫయింగ్‌లో నీరజ్ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. తన మొదటి ప్రయత్నంలోనే ఈటెను ఏకంగా 88.77 మీటర్ల దూరం విసిరిన నీరజ్ ఆదివారం జరిగే ఫైనల్‌కు అర్హత సాధించాడు. అంతేకాకుండా పారిస్ ఒలింపిక్స్ అర్హత ప్రమాణాన్ని (85.50 మీటర్లు) కూడా దాటేసి వచ్చే ఏడాది జరిగే విశ్వ క్రీడలకు బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన క్వాలిఫయింగ్‌లో 12 మంది బరిలో ఉన్న గ్రూప్ ‘ఎ’లో నీరజ్ పోటీపడ్డాడు. మైదానంలోని అభిమానులు ఉత్సాహపరుస్తుండగా నీరజ్ జావెలిన్‌ను 88.77 మీటర్ల దూరం విసిరి ఒక్క త్రోతో రెండు లక్ష్యాలను సాధించాడు. జావెలిన్‌ను 83 మీటర్ల దూరం విసిరిన వారు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తారు లేదా టాప్–12లో నిలిచిన వారికి ఫైనల్ చేరే అవకాశం లభిస్తుంది. నీరజ్ తప్ప గ్రూప్ ‘ఎ’ నుంచి మరెవరూ నేరుగా ఫైనల్ చేరలేకపోయారు. గ్రూప్ ‘ఎ’లోనే పోటీపడ్డ మరో భారత అథ్లెట్ డీపీ మనూ (81.31 మీటర్లు)... గ్రూప్ ‘బి’లో బరిలో నిలిచిన కిశోర్ కుమార్ జేనా (80.55 మీటర్లు) కూడా ఫైనల్‌కు చేరారు. ఓవరాల్‌గా మనూ ఆరో స్థానంలో, కిశోర్ తొమ్మిదో స్థానంలో నిలిచారు. ఫలితంగా ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో తొలిసారి ఒకే ఈవెంట్లో ముగ్గురు భారత అథ్లెట్లు ఫైనల్లో పోటీపడనున్నారు. నీరజ్‌తోపాటు అర్షద్ నదీమ్ (పాకిస్తాన్; 86.79 మీటర్లు), జాకుబ్ వాద్లెచ్ (చెక్ రిపబ్లిక్; 83.50 మీటర్లు) మాత్రమే క్వాలిఫయింగ్ మార్క్‌ను అధిగమించి నేరుగా ఫైనల్ చేరారు. డిఫెండింగ్ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా; 78.49 మీటర్లు) ఓవరాల్‌గా 16వ స్థానంలో నిలిచి ఫైనల్ చేరలేకపోయాడు. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా చాంపియన్‌షిప్, టోక్యో ఒలింపిక్స్, డైమండ్ లీగ్ మీట్‌లాంటి ప్రతిష్టాత్మక ఈవెంట్స్‌లో స్వర్ణ పతకాలు గెలిచిన 25 ఏళ్ల నీరజ్ ఖాతాలో ప్రపంచ చాంపియన్‌షిప్ స్వర్ణ పతకం మాత్రమే చేరాల్సి ఉంది. గత ఏడాది అమెరికాలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఈ హరియాణా జావెలిన్ త్రోయర్ రెండో స్థానంలో నిలిచి రజత పతకం గెల్చుకున్నాడు. అంతా అనుకున్నట్లు జరిగితే ఆదివారం జరిగే ఫైనల్లో నీరజ్‌ను ఈసారి విశ్వవిజేతగా చూడవచ్చు. -
3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్ ఫైనల్లో పారుల్
బుడాపెస్ట్ (హంగేరి): ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్ ఈవెంట్లో భారత అథ్లెట్ పారుల్ చౌధరీ ఫైనల్‌కు అర్హత సాధించింది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన హీట్స్‌లో పారుల్ ఐదో స్థానంలో నిలిచి ఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. రెండో హీట్‌లో పోటీపడ్డ పారుల్ తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. పారుల్ 9 నిమిషాల 24.29 సెకన్లలో గమ్యానికి చేరి ఐదో స్థానంలో నిలిచింది. మొత్తం మూడు హీట్స్ నిర్వహించారు. ప్రతి హీట్‌లో తొలి ఐదు స్థానాల్లో నిలిచిన అథ్లెట్లు ఫైనల్‌కు అర్హత పొందారు. ఫైనల్ ఆదివారం జరుగుతుంది. మరోవైపు పురుషుల లాంగ్‌జంప్ ఈవెంట్ ఫైనల్లో భారత అథ్లెట్ జెస్విన్ ఆ్రల్డిన్ నిరాశపరిచాడు. 12 మంది పాల్గొన్న ఫైనల్లో జెస్విన్ తొలి రెండు ప్రయత్నాల్లో ఫౌల్ చేశాడు. మూడో ప్రయత్నంలో 7.77 మీటర్ల దూరం దూకి 11వ స్థానంలో నిలిచాడు. చదవండి: Asia Cup 2023: విరాట్ కోహ్లికి బీసీసీఐ వార్నింగ్.. కారణమిదే! మరోసారి అలా చేయొద్దంటూ! -
లాంగ్‌జంప్ ఫైనల్లో జెస్విన్
బుడాపెస్ట్ (హంగేరి): ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తొలి నాలుగు రోజులు భారత్‌కు నిరాశ ఎదురవగా... ఐదోరోజు మిశ్రమ ఫలితాలు లభించాయి. పురుషుల లాంగ్‌జంప్‌లో జెస్విన్ ఆ్రల్డిన్ ఫైనల్‌కు అర్హత సాధించగా... మరో లాంగ్‌జంపర్ మురళీ శ్రీశంకర్ అనూహ్యంగా క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరిగాడు. మహిళల జావెలిన్ త్రో ఈవెంట్లో అన్ను రాణి కూడా ఆకట్టుకోలేకపోయింది. క్వాలిఫయింగ్‌లో గ్రూప్ ‘బి’లో పోటీపడ్డ తమిళనాడుకు చెందిన 21 ఏళ్ల జెస్విన్ 8 మీటర్ల దూరం దూకి చివరిదైన 12వ క్వాలిఫయర్‌గా ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు. గత ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు అర్హత సాధించడంతోపాటు ఏడో స్థానంలో నిలిచిన శ్రీశంకర్ ఈసారి నిరాశపరిచాడు. శ్రీశంకర్ 7.74 మీటర్ల దూరం దూకి ఓవరాల్‌గా 22వ ర్యాంక్‌లో నిలిచాడు. ఫైనల్ నేడు జరుగుతుంది. మహిళల జావెలిన్ త్రో క్వాలిఫయింగ్‌లో అన్ను రాణి ఈటెను 57.05 మీటర్ల దూరం విసిరి 19వ ర్యాంక్‌లో నిలిచింది. -
హీట్స్‌లోనే జ్యోతి నిష్క్రమణ
బుడాపెస్ట్ (హంగేరి): తొలిసారి ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ లో పోటీపడ్డ భారత మహిళా అథ్లెట్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ ఒత్తిడికిలోనై నిరాశపరిచింది. మంగళవారం జరిగిన మహిళల 100 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్లో విశాఖపట్నం జిల్లాకు చెందిన 23 ఏళ్ల జ్యోతి హీట్స్‌ను దాటి ముందుకెళ్లలేకపోయింది. ఇటీవల ఆసియా చాంపియన్‌షిప్ లో స్వర్ణ పతకం సాధించిన జ్యోతి ప్రపంచ చాంపియన్‌షిప్ లో మాత్రం ఓవరాల్‌గా 29వ స్థానంలో నిలిచి సెమీఫైనల్ దశకు అర్హత పొందలేకపోయింది. నాలుగో హీట్‌లో పోటీపడ్డ జ్యోతి 13.05 సెకన్లలో గమ్యానికి చేరి ఏడో ర్యాంక్ లో నిలిచింది. మొత్తం ఐదు హీట్స్ జరగ్గా... ఒక్కో హీట్‌లో టాప్–4లో నిలిచిన వారు నేరుగా సెమీఫైనల్‌కు చేరారు . మిగిలిన వారిలో బెస్ట్–4 టైమింగ్ నమోదు చేసిన అథ్లెట్లు కూడా సెమీఫైనల్లోకి ప్రవేశించారు. జ్యోతి తన అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన (12.78 సెకన్లు) సమయాన్ని ఇక్కడ పునరావృతం చేసి ఉంటే ఆమెకు సెమీఫైనల్ బెర్త్ కచి్చతంగా ఖరారయ్యేది. ఎందుకంటే ఇక్కడ 12.92 సెకన్ల సమయం నమోదు చేసిన మేకీ జిన్లిమ్ (నెదర్లాండ్స్)కు చివరిదైన 24వ సెమీఫైనల్ బెర్త్ లభించింది. ‘సూపర్’ షకేరీ... మహిళల 100 మీటర్ల స్ప్రింట్‌లో కొత్త ప్రపంచ చాంపియన్ అవతరించింది. ఫైనల్లో అమెరికాకు చెందిన 23 ఏళ్ల షకేరీ రిచర్డ్సన్ 10.65 సెకన్లలో అందరికంటే వేగంగా గమ్యానికి చేరి విజేతగా నిలిచింది. ప్రపంచ చాంపియన్‌షిప్ లో పాల్గొన్న తొలిసారే షకేరీ స్వర్ణ పతకం సాధించడం విశేషం. షకేరీ ధాటికి ఐదుసార్లు 100 మీటర్ల వరల్డ్ చాంపియన్ షెల్లీ ఆన్ ఫ్రేజర్ (జమైకా; 10.77 సెకన్లు) మూడో స్థానానికి పరిమితమై కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. -
నీరజ్... నంబర్‌వన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ వేదికపై భారత అథ్లెటిక్స్ ముఖచిత్రంగా మారిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తన కెరీర్లో మరో గొప్ప ఘనతను సాధించాడు. సోమవారం విడుదల చేసిన వరల్డ్ అథ్లెటిక్స్ పురుషుల జావెలిన్ త్రో ర్యాంకింగ్స్‌లో నీరజ్ చోప్రా ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు. తద్వారా ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో వరల్డ్ నంబర్‌వన్‌గా అవతరించిన తొలి భారతీయ అథ్లెట్‌గా నీరజ్ గుర్తింపు పొందాడు. ప్రస్తుతం నీరజ్ 1455 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉండగా... ప్రపంచ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా; 1433 పాయింట్లు) రెండో స్థానంలో, జాకుబ్ వాద్లెచ్ (చెక్ రిపబ్లిక్; 1416 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నారు. గత ఐదేళ్లుగా నీరజ్ అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్నాడు. 2017 ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం... 2018 ఆసియా క్రీడల్లో స్వర్ణం... 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం... 2021 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం... 2022 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రజతం... 2022 డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో స్వర్ణం... ఇలా నీరజ్ అంతర్జాతీయ వేదికలపై పతకాల పంట పండిస్తున్నాడు. తాజా సీజన్లో భాగంగా ఈనెలలో దోహాలో జరిగిన డైమండ్ లీగ్ తొలి సిరీస్‌లో నీరజ్ అగ్రస్థానంలో నిలిచాడు. తదుపరి వచ్చే నెలలో ఫిన్లాండ్లో జరిగే పావో నుర్మీ గేమ్స్‌లో నీరజ్ బరిలోకి దిగనున్నాడు. -
95 ఏళ్ల వయసులో అథ్లెటిక్స్‌లో అద్భుతాలు
ఇండియాకు చెందిన భగవానీ దేవి డాగర్ 95 ఏళ్ల వయసులో అథ్లెటిక్స్‌లో అద్భుతాలు చేస్తోంది. వయసు పెరుగుతున్నా..మెడల్స్ కొట్టాలన్న ఆమె ఆకాంక్ష మరింత ఎక్కువైంది. తాజాగా పోలాండ్లోని టొరున్లో జరిగిన తొమ్మిదో వరల్డ్ మాస్టర్ అథ్లెటిక్స్ ఇండోర్ చాంపియన్‌షిప్(World Master Athletics Indoor Championship)లో సత్తా చాటింది. 60 మీటర్ల రన్నింగ్, షాట్‌పుట్, డిస్క్‌త్రో ఈవెంట్స్‌లో భగవానీ దేవి డాగర్ స్వర్ణ పతకాలు సాధించింది.ఈ బామ్మ గతేడాది కూడా వరల్డ్ మాస్టర్ అథ్లెటిక్స్ ఇండోర్ చాంపియన్‌షిప్‌లో మెడల్స్ సాధించింది. 2022లో ఒక గోల్డ్, రెండు బ్రాంజ్ మెడల్స్ గెలుచుకుంది. హర్యానాలోని ఖేడ్కా గ్రామానికి చెందిన భగవానీ దేవి డాగర్‌కు 12 ఏళ్ల వయసులోనే వివాహం జరిగింది. 30 ఏళ్ల వయసులో భర్తను కోల్పోయింది. ఆ తర్వాత రెండో వివాహం చేసుకోవడానికి ఆమె ఇష్టపడలేదు. అప్పటికే తన నాలుగేళ్ల కూతురు, కడుపులో పెరుగుతున్న మరో బిడ్డ కోసం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే నాలుగేళ్ల తర్వాత అనారోగ్యం తన ఎనిమిదేళ్ల కూతురిని బలి తీసుకుంది. అయితే తాను ధైర్యం కోల్పోకుండా కూలీ, వ్యవసాయ పనులు చేసి కొడుకును పెంచి పెద్ద చేసింది. ఆమె కొడుక్కి ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్లో క్లర్క్‌గా ప్రభుత్వం ఉద్యోగం రావడంతో ఆర్థిక పరిస్థితి మెరుగైంది. కొడుక్కి పెళ్లి చేసిన అనంతరం అథ్లెటిక్స్‌పై దృష్టి సారించింది. అక్కడి నుంచి తన ఫిట్నెస్ను కాపాడుకుంటూ వచ్చిన ఆమె 80 ఏళ్ల వయసులో తొలిసారి 100 మీటర్ల రన్నింగ్‌లో పాల్గొంది. అక్కడినుంచి ఆమె వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అంచెలంచెలుగా ఎదుగుతూ తాజాగా 95 ఏళ్ల వయసులో మూడు స్వర్ణ పతకాలు కొల్లగొట్టి ఔరా అనిపించింది. ఇక భగవానీ దేవి పెద్ద మనుమడు వికాస్ డాగర్ పారా అథ్లెట్‌గా రాణిస్తున్నాడు. ఇప్పటికే అథ్లెటిక్స్‌లో ఎన్నో పతకాలు సాధించిన వికాస్ డాగర్ ఖేల్‌రత్న అవార్డు గెలుచుకున్నాడు. India's 95-year-old Bhagwani Devi Dagar won 3 gold medals in the 9th World Master Athletics Indoor Championship 2023 at Toruń, Poland. She clinched the medals in 60-meter running, shotput and discus throw. pic.twitter.com/CaR6pj1PRW — ANI (@ANI) March 29, 2023 🙏🙏🙏🙏🙏 https://t.co/IUdldckOOc — ATHLETE BHAGWANI DEVI DAGAR (@BhagwaniDevi94) March 6, 2023 చదవండి: 70 కోట్ల విలువైన కారు.. కొన్నాడా లేక గిఫ్ట్‌గా వచ్చిందా? 'ఆడేది మెగాటోర్నీ.. అలా కుదరదు'; ప్లాన్ బెడిసికొట్టిందా? -
సెమీ ఫైనల్లో తెలంగాణ ముద్దుబిడ్డ అగసార నందిని
కొలంబియాలోని కాలిలో జరుగుతున్న అండర్–20 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో అగసార నందిని సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. 100 మీ. హర్డిల్స్ పరుగును ఆమె 13.58 సెకన్లలో పూర్తి చేసింది. ఈ క్రమంలో తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసిన నందిని కొత్త జాతీయ రికార్డు నెలకొల్పడం విశేషం. గతంలో ఆమె అత్యుత్తమ ప్రదర్శన 13.70 సెకన్లుగా ఉంది. హీట్స్‌లో మూడో స్థానంలో నిలవడంతో నందిని సెమీస్‌కు అర్హత సాధించింది. ఇదే ఈవెంట్లో పాల్గొన్న మరో భారత అథ్లెట్ ఉన్నతి అయ్యప్ప 36వ స్థానంలో నిలిచి నిష్క్రమించింది. గత ఏడాది జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కూడా నందిని సెమీస్ చేరగలిగింది. సెమీస్‌లో 14.16 సెకన్ల టైమింగ్ నమోదు చేసిన ఆమె ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. -
భారత్‌కు భారీ షాక్.. కామన్వెల్త్ గేమ్స్ నుంచి నీరజ్ చోప్రా ఔట్!
బర్మింగ్‌హామ్ వేదికగా జరగనున్న కామన్వెల్త్ గేమ్స్-2022కు ముందు భారత్‌కు భారీ షాక్ తగిలింది. ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా గాయం కారణంగా కామన్వెల్త్ గేమ్స్‌కు దూరమయ్యాడు. కాగా తాజాగా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్-2022లో నీరజ్ చోప్రా రజత పతకం సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఫైనల్ సమయంలో అతడి గజ్జలో గాయమైంది. ఫైనల్లో కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నానని, పరుగెత్తుతున్నప్పుడు తొడ కండరాలు పట్టేశాయని నీరజ్ చోప్రా పతకం సాధించిన అనంతరం చెప్పాడు. అయితే అతడి గాయం ప్రస్తుతం తీవ్రం కావడంతో కామన్వెల్త్ గేమ్స్ నుంచి తప్పుకున్నట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తెలిపింది. "ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా గాయం కాణంగా కామన్వెల్త్ గేమ్స్‌లో భాగం కాలేకపోతున్నాడు. అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము" అని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ట్విటర్లో పేర్కొంది. చదవండి: Lovlina Borgohain: బీఎఫ్ఐ అధికారులు వేధిస్తున్నారు.. టోక్యో ఒలింపిక్స్ మెడలిస్ట్ సంచలన ఆరోపణలు Our Olympic Champ @Neeraj_chopra1 will not be defending his title at @birminghamcg22 due to concerns regarding his fitness. We wish him a speedy recovery & are supporting him in these challenging times.#EkIndiaTeamIndia #WeareTeamIndia pic.twitter.com/pPg7SYlrSm — Team India (@WeAreTeamIndia) July 26, 2022 -
నీరజ్ చోప్రా 'రజతం'.. డ్యాన్స్‌తో ఇరగదీసిన కుటుంబసభ్యులు
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో కొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ చోప్రా రజత పతకం సాధించాడు. ఈ నేపథ్యంలో నీరజ్ చోప్రా స్వస్థలమైన హర్యానాలోని పానిపట్ కేంద్రంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. నీరజ్ పతకం సాధించాడని తెలియగానే అతని కుటుంబసభ్యులు, బంధు మిత్రులు మిఠాయిలు పంచుకొని బాణసంచాలు కాల్చారు. అనంతరం డ్యాన్స్‌లతో ఇరగదీశారు. దీనికి సంబంధించిన వీడియోనూ ఏఎన్ఐ ట్విటర్లో షేర్ చేయగా క్షణాల్లో వైరల్‌గా మారింది. ఇక ఆదివారం జరిగిన ఫైనల్లో తొలి ప్రయత్నంలో ఫౌల్ చేసిన నీరజ్ చోప్రా.. నాలుగో ప్రయత్నంలో ఈటెను 88.13 మీటర్ల దూరం విసిరి రజతం కొల్లగొట్టాడు. తద్వారా 19 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. 2003 వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో లాంగ్ జంప్ విభాగంలో భారత మహిళా అథ్లెట్ అంజూ బాబీ జార్జీ కాంస్యం గెలుచుకుంది. అప్పటి నుంచి భారత్‌కు అథ్లెటిక్స్ విభాగంలో పతకం రాలేదు. తాజాగా నీరజ్ చోప్రా వరల్డ్ అథ్లెటిక్స్‌లో పతకం సాధించిన రెండో భారత అథ్లెట్‌గా చరిత్రకెక్కాడు. గ్రెనేడియన్ జావెలిన్ త్రోయర్ అండర్సన్ పీటర్స్ 90.54 దూరం విసిరి స్వర్ణం సాధించగా.. 88.09 మీటర్లతో జాకుబ్ వడ్లేజ్ కాంస్యం గెలుచుకున్నాడు. కాగా భారత్‌కు చెందిన మరో అథ్లెట్ రోహిత్ యాదవ్ ఫైనల్లో నిరాశపరిచాడు. తన మూడో ప్రయత్నంలో ఈటెను 78.72 మీటర్ల దూరం విసిరిన రోహిత్ ఓవరాల్‌గా 10వ స్థానానికి పరిమితమయ్యాడు. #WATCH Family and friends celebrate Neeraj Chopra's silver medal win in the World Athletics Championships at his hometown in Panipat, #Haryana Neeraj Chopra secured 2nd position with his 4th throw of 88.13 meters in the men's Javelin finals. pic.twitter.com/khrUhmDgHG — ANI (@ANI) July 24, 2022 చదవండి: రజత పతకం సాధించిన నీరజ్ చోప్రా.. రెండో భారత అథ్లెట్‌గా రికార్డు -
ప్రపంచ రికార్డు బద్దలు కొట్టావ్.. అంత ఆశ్చర్యమెందుకు?
అమెరికాలోని ఒరేగాన్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 400 మీటర్ల హార్డిల్స్‌లో ప్రపంచ రికార్డు బద్దలైంది. 400 మీటర్ల హార్డిల్స్‌లో అమెరికాకు చెందిన డబుల్ ఒలింపిక్ చాంపియన్.. ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ సిడ్నీ మెక్లాఫ్లిన్ కొత్త రికార్డు నమోదు చేసింది. శనివారం ఉదయం జరిగిన 400 మీటర్ల హార్డిల్స్ ఫైనల్లో మెక్లాఫ్లిన్ 50.68 సెకన్లలో గమ్యాన్ని చేరి స్వర్ణం తన ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలో మెక్లాఫ్లిన్ తన రికార్డు తానే బద్దలు కొట్టింది. ఇంతకముందు 400 మీటర్ల హార్డిల్స్‌లో లాఫ్లిన్ బెస్ట్ టైమింగ్ 51.41 సెకన్లు. జూన్‌లో యూఎస్ఏ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఔట్‌డోర్ చాంపియన్‌షిప్స్‌లో ఇదే వేదికపై పరిగెత్తి స్వర్ణం అందుకుంది. ఈ సందర్భంగా వరల్డ్ అథ్లెటిక్స్ అధికారిక ట్విటర్.. సిడ్నీ మెక్లాఫ్లిన్ ఫోటోను షేర్ చేస్తూ వరల్డ్ చాంపియన్.. వరల్డ్ రికార్డు.. మా సిడ్నీ మెక్లాఫ్లిన్..'' అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక డచ్ రన్నర్ ఫెమ్కే బోల్ 52.27 సెకన్లలో గమ్యాన్ని చేరి రతజం అందుకోగా.. అమెరికాకే చెందిన మరో అథ్లెట్ దలీలా ముహమ్మద్ 53.13 సెకన్లతో కాంస్యం చేజెక్కించుకుంది. స్వర్ణ పతకం సాధించిన అనంతరం ఆమె చెప్పిన మాట.. ''సాధించడానికి ఇంకా పరిగెడుతూనే ఉంటాను.'' ఇక్కడ మరో విచిత్రమేంటంటే ఫైనల్స్ పూర్తయిన తర్వాత.. మెక్లాఫ్లిన్ విజేత అని తెలిసిన తర్వాత కూడా ఇది నిజమేనా అన్న తరహాలో ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్ హైలైట్‌గా నిలిచింది. WORLD CHAMPION ‼️ WORLD RECORD ‼️ SYDNEY MCLAUGHLIN 🤯 OLYMPIC CHAMPION @GoSydGo 🇺🇸 DESTROYS HER OWN WORLD RECORD IN 5⃣0⃣.6⃣8⃣ TO CLAIM WORLD 400M HURDLES GOLD 🥇#WorldAthleticsChamps pic.twitter.com/Ilay0XwVz1 — World Athletics (@WorldAthletics) July 23, 2022 50.68. Watch it. Watch it again. Goosebumps all over. Sydney McLaughlin 🌟#WorldAthleticsChamps pic.twitter.com/GtQgTWLBuQ — Vinayakk (@vinayakkm) July 23, 2022 -
World Athletics Championships: జెరుటో జోరు...
ఈవెంట్ ఆరో రోజు రెండు విభాగాల్లో ఫైనల్స్ జరిగాయి. మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో నోరా జెరుటో (కజకిస్తాన్)కు స్వర్ణం దక్కింది. రేస్‌ను ఆమె 8 నిమిషాల 53.02 సెకన్లలో పూర్తి చేసి కొత్త చాంపియన్‌షిప్ రికార్డును నమోదు చేసింది. వెర్కుహ గెటాచూ (ఇథియోపియా – 8 నిమిషాల 54.61 సె.) రజతం సాధించగా, మెకిడెస్ అబీబీ (ఇథియోపియా – 8 నిమిషాల 56.08 సె.) కాంస్యం గెలుచుకుంది. ఈ ఈవెంట్లో టాప్–3లో నిలిచిన ముగ్గురు అథ్లెట్లు కూడా పరుగును 9 నిమిషాల్లోపే పూర్తి చేయడం వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో తొలి సారి కావడం విశేషం. జూనియర్ స్థాయిలో కెన్యాకు ప్రాతినిధ్యం వహించి గత ఏడాది కజకిస్తాన్‌కు వలస వెళ్లిన జెరుటో ఈ క్రమంలో టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాన్ని కూడా కోల్పోయింది. అయితే ఇప్పుడు వరల్డ్ చాంపియన్‌షిప్ బరిలోకి దిగి కజకిస్తాన్‌కు ఈ క్రీడల చరిత్రలో తొలి స్వర్ణాన్ని అందించింది. మహిళల డిస్కస్‌త్రోలో టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత వలరీ అల్మన్ (అమెరికా)కు నిరాశ ఎదురైంది. డిస్క్‌ను 68.30 మీటర్లు విసిరిన అల్మన్ మూడో స్థానంలో నిలిచి కాంస్యంతో సరిపెట్టుకుంది. చైనాకు చెందిన బిన్ ఫింగ్ స్వర్ణం గెలుచుకుంది. 69.12 మీటర్లతో ఆమె అగ్ర స్థానంలో నిలిచింది. సాండ్రా పెర్కోవిక్ (క్రొయేషియా – 68.45 మీ.)కు రజతం దక్కింది. -
WAC 2022: జావెలిన్ త్రో ఫైనల్లో భారత అథ్లెట్
అమెరికాలోని ఒరేగాన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా అథ్లెట్ అన్నూ రాణి శుభారంభం చేసింది. గురువారం ఉదయం జరిగిన జావెలిన్ త్రో క్వాలిఫయింగ్ పోటీల్లో అన్నూ రాణి రెండో ప్రయత్నంలో ఈటెను 59.06 మీటర్ల దూరం విసిరి గ్రూఫ్ బిలో 5వ స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా ఎనిమిదో స్థానంలో నిలిచిన అన్నూ రాణి ఫైనల్లో అడుగుపెట్టింది. వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో వరుసగా రెండోసారి జావెలిన్ త్రో ఫైనల్లో అడుగుపెట్టిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా నిలిచింది. 2019లో దోహా వేదికగా జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్లో అన్నూ రాణి ఎనిమిదో స్థానానికే పరిమితమైంది. మరి ఈసారైనా పతకం సాధిస్తుందేమో చూడాలి. అంతకముందు ఈటెను తొలి ప్రయత్నంలో 55.32 మీటర్లు విసిరినప్పటికి.. రెండో ప్రయత్నంలో మాత్రం 59.60 మీటర్ల దూరం విసిరి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇక 29 ఏళ్ల అన్నూ రాణి కెరీర్ బెస్ట్ 63.82 మీటర్లుగా ఉంది. జంషెడ్పూర్ వేదికగా ఈ ఏడాది మేలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో అన్నూ రాణి ఈ ప్రదర్శనను నమోదు చేసింది. ఇక జపాన్‌కు చెందిన హరుకాకిటాగుచి ఈటెను 64.32 మీటర్ల దూరం విసిరి సీజన్ బెస్ట్‌తో తొలి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో చైనాకు చెందిన షియింగ్ లిహూ(63.86 మీటర్లు), లిథువేనియాకు చెందిన లివేట జాసియునైట్(63.80 మీటర్లు) మూడో స్థానంలో నిలిచింది. మొత్తంగా గ్రూఫ్ ఏ, గ్రూఫ్ బి నుంచి కలిపి 12 మంది ఫైనల్లో పోటీ పడనున్నారు. మహిళల జావెలిన్ త్రో ఫైనల్ జూలై 22న ఉదయం 5 గంటలకు జరగనుంది. చదవండి: World Athletics Championship: 'నా కొడుకు ప్రపంచ చాంపియన్.. గర్వంగా ఉంది' -
'నా కొడుకు ప్రపంచ చాంపియన్.. గర్వంగా ఉంది'
పురుషుల 1500 మీటర్ల పరుగు...ప్రసారకర్తల కామెంటరీ బృందంలో ఒకడైన జెఫ్ వైట్మన్ రేసు ప్రారంభం కాగానే తన వ్యాఖ్యానం వినిపిస్తున్నాడు. 500 మీ...1000 మీ...1400 మీ. ముగిశాయి...అప్పటి వరకు అతను మంచి జోష్‌తో ఉత్కంఠ పెరిగేలా పరుగు గురించి మాట్లాడుతున్నాడు. రేసు పూర్తయింది... కానీ అతని మాట వినిపించలేదు. ఒక్కసారిగా అతని గొంతు ఆగిపోయింది. ప్రేక్షకులకు క్షణం పాటు ఏం జరిగిందో అర్థం కాలేదు. కొంత విరామంతో అతను మళ్లీ అనేశాడు...‘అతను నా కొడుకు, వాడు ఇప్పుడు ప్రపంచ చాంపియన్’ అంటూ వైట్మన్ ఉద్వేగంగా ముగించాడు. అంతే మైదానంలో ఒక్కసారిగా హర్షధ్వానాలు... సమీపంలో ఉన్నవారంతా చుట్టు చేరి అభినందనలతో ముంచెత్తారు. ఈ రేసును 3 నిమిషాల 29.23 సెకన్లలో పూర్తి చేసి బ్రిటన్ అథ్లెట్ జేక్ వైట్మన్ స్వర్ణం సొంతం చేసుకోవడం ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల ఐదో రోజు హైలైట్‌గా నిలిచింది. ఈ ఈవెంట్లో జాకన్ ఇన్బ్రిట్సన్ (నార్వే– 3 నిమిషాల 29.47 సెకన్లు), మొహమ్మద్ కతిర్ (స్పెయిన్–3 ని. 29.90 సె.) వరుసగా రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. Jake Wightman has become the World 1500m champion. Geoff calling his son becoming a World Champion is priceless. Helene, part of our team, filmed Dad. I sat with Mum Susan..then could not wait to give my mate a hug. Beyond proud. ❤️@JakeSWightman @WightmanGeoff @SusanWightman6 pic.twitter.com/8I8IT6ntwb — Katharine Merry (@KatharineMerry) July 20, 2022 Yaroslava Mahuchikh: బాంబుల మోత తప్పించుకొని పతకం గెలిచి.. -
బాంబుల మోత తప్పించుకొని పతకం గెలిచి..
అమెరికాలోని ఒరెగాన్‌లో జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఉక్రెయిర్ హై జంప్ క్రీడాకారిణి యారోస్లావా మహుచిఖ్ రజతం సాధించింది. అందరిలానే పతకం సాధించిందిగా ఇందులో ఏముందిలే అనుకోవద్దు. యారోస్లావా పతకం సాధించడం ఇప్పుడు పెద్ద విశేషమే. ఎందుకంటే యారోస్లావా ఉక్రెయిన్ దేశస్థురాలు కాబట్టి. దాదాపు నాలుగు నెలలుగా కంటి మీద కునుకు లేకుండా రష్యా ఉక్రెయిన్ మీద దాడులు చేస్తూనే ఉంది. యుద్ధ వాతావరణంలో ఉన్న తన దేశం నుంచి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని స్నేహితుల సాయంతో మూడురోజుల పాటు కారులో ప్రయాణించి ఉక్రెయిన్ను దాటి అమెరికాలో అడుగుపెట్టింది. ఒక పక్క ఉక్రెయిన్ బాంబుల మోతతో దద్దరిల్లుతున్నప్పటికి దేశానికి పతకం తేవాలన్న ఆమె సంకల్పాన్ని మెచ్చుకొని తీరాల్సిందే. అందుకే యారోస్లావా సాధించింది రజతమే అయినా ఆమె దృష్టిలో మాత్రం అది బంగారు పతకమేనని పేర్కొంది. బుధవారం జరిగిన మహిళల హై జంప్ ఫైనల్ రసవత్తరంగా సాగింది. 2.02 మీటర్ల ఎత్తును( దాదాపు 6 అడుగుల ఏడున్నర అంగుళాలు) ఆస్ట్రేలియాకు చెందిన ఎలినర్ పాటర్సన్ క్లియర్ చేసింది. ఆ తర్వాత వచ్చిన యారస్లావా మాత్రం తృటిలో దానిని అందుకోలేకపోయింది. దీంతో పాటర్సన్ స్వర్ణం దక్కించుకోగా.. యారోస్లావా మహుచిఖ్ రజతం గెలిచింది. పతకం సాధించిన అనంతరం యారోస్లావా ఎమెషనల్ అయింది. ''నేను సాధించింది రజతమే కావొచ్చు.. నా దృష్టిలో మాత్రం అది స్వర్ణ పతకం కిందే లెక్క. ఈ పతకం రష్యాతో యుద్దంలో అసువుల బాసిన నా దేశ సైనికులకు.. ప్రజలకు అంకితమిస్తున్నా. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బాంబుల మోతతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్ను దాటడానికి మూడు రోజులు పట్టింది. ఈ క్రమంలో నా ప్రాణాలు పోయినా దేశం కోసం ఆనందంగా ప్రాణత్యాగం చేశాననుకుంటా. దేవుడి దయవల్ల ఈరోజు వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొని పతకం సాధించా'' అంటూ చెప్పుకొచ్చింది. అయితే రష్యాకు చెందిన స్టార్ హైజంపర్.. డిపెండింగ్ చాంపియన్ మారియా లసిట్స్కేన్ తమ దేశంపై నిషేధం ఉండడంతో వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనలేకపోయింది. మారియా వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో వరుసగా మూడుసార్లు స్వర్ణం సాధించడం విశేషం. Literally flying 🦅@eleanorpatto 🇦🇺 clears a lifetime best of 2.02m on her first attempt to win world high jump title!#WorldAthleticsChamps pic.twitter.com/dSISIzOk75 — World Athletics (@WorldAthletics) July 20, 2022 చదవండి: భారత్‌కు భారీ షాక్.. డోప్ టెస్టులో పట్టుబడ్డ స్టార్ అథ్లెట్లు..! -
World Athletics Championship: ‘ట్రిపుల్’ ధమాకా
యుజీన్ (అమెరికా): వెనిజులా స్టార్ అథ్లెట్, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత యులిమర్ రోజస్ మరోసారి అద్భుత ప్రదర్శనతో ట్రిపుల్ జంప్‌లో సత్తా చాటింది. వరుసగా మూడో ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ రోజస్ స్వర్ణంతో మెరిసింది. ఫైనల్లో రోజస్ 15.47 మీటర్ల దూరం దూకి మొదటి స్థానంలో నిలిచింది. ఈ పోటీలో షనీకా రికెట్స్ (అమెరికా – 14.89 మీ.) రజతం సాధించగా, టోరీ ఫ్రాంక్లిన్ (అమెరికా – 14.72 మీ.) కాంస్యం గెలుచుకుంది. అథ్లెటిక్స్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రోజస్‌కు ఇది హ్యాట్రిక్ స్వర్ణం కావడం విశేషం. 2017 (లండన్), 2019 (దోహా)లలో కూడా ఆమె కనకపు పతకాన్ని అందుకుంది. ట్రిపుల్ జంప్‌లో ప్రస్తుత ప్రపంచ రికార్డు (15.74 మీటర్లు) రోజస్ పేరిటే ఉంది. తన రెండో ప్రయత్నంలోనే 15.47 మీటర్లు నమోదు చేసిన రోజస్ తర్వాతి నాలుగు ప్రయత్నాల్లో కూడా దానిని దాటలేకపోయింది. దాంతో పోలిస్తే చాలా తక్కువ దూరం ఆమె దూకగలిగినా...ఈ మెగా ఈవెంట్లో బంగారం గెలుచుకునేందుకు అది సరిపోయింది. ‘రికార్డు స్థాయిలో ఎక్కువ దూరం దూకాలనే బరిలోకి దిగినా అది సాధ్యం కాలేదు. అయితే తాజా ఫలితంతో చాలా సంతోషంగా ఉన్నా. ఇంత మంది ప్రేక్షకుల మధ్య మళ్లీ పోటీలో నిలవడం గొప్పగా అనిపిస్తోంది. పెద్దగా సన్నాహకాలు లేకుండానే ఇక్కడికి వచ్చాను. గాయాలతో కూడా ఇబ్బంది పడ్డాను. అయితే వాటన్నింటినీ అధిగమించి ఇక్కడ గెలవగలిగాను’ అని రోజస్ వ్యాఖ్యానించింది. సబ్లేకు 11వ స్థానం పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ ఛేజ్‌లో భారత అథ్లెట్ అవినాశ్ ముకుంద్ సబ్లే తీవ్రంగా నిరాశపర్చాడు. ఫైనల్‌ను 8 నిమిషాల 31.75 సెకన్లలో పూర్తి చేసిన సబ్లే 11వ స్థానంలో నిలిచాడు. ఇదే సీజన్లో తన అత్యుత్తమ ప్రదర్శనతో జాతీయ రికార్డు (8 నిమిషాల 12.48 సెకన్లు)ను నెలకొల్పిన అతను దాంతో పోలిస్తే చాలా పేలవ ప్రదర్శన నమోదు చేశాడు. ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించిన సబ్లే...అసలు పోరులో ప్రభావం చూపలేకపోయాడు. 2019లో దోహాలో జరిగిన గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అతను 13వ స్థానం సాధించాడు. ఈ విభాగంలో ఒలింపిక్ చాంపియన్, మొరాకోకు చెందిన సూఫియాన్ బకాలి (8 నిమిషాల 25.13 సె.), లమేచా గిర్మా (ఇథియోపియా – 8 నిమిషాల 26.01 సె.), కాన్సెస్‌లన్ కిప్రు టో (కెన్యా – 8 నిమిషాల 27.92 సెకన్లు) వరుసగా స్వర్ణ, రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. -
World Masters Athletics: 94 ఏళ్ల వయసులో స్వర్ణం సాధించిన భారత అథ్లెట్
ఫిన్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్-2022లో భారత అథ్లెట్ భగవానీ దేవీ సంచలనం సృష్టించింది. 94 ఏళ్ల వయసులో 100 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పతకం సాధించి ఔరా అనిపించింది. 35 ఏళ్లు పైబడిన వారు పోటీ పడిన ఈ రేసును భగవానీ దేవీ 24.74 సెకన్లలో పూర్తి చేసి బంగారు పతకం సాధించింది. India's 94-year-old #BhagwaniDevi Ji has yet again proved that age is no bar! She won a GOLD medal at the #WorldMastersAthleticsChampionships in Tampere in the 100m sprint event with a timing of 24.74 seconds.🥇She also bagged a BRONZE in Shot put. Truly commendable effort!👏 pic.twitter.com/Qa1tI4a8zS — Dept of Sports MYAS (@IndiaSports) July 11, 2022 లేటు వయసులో సాధించిన ఘనతకు గాను భగవానీ దేవీకి విశ్వం నలుమూలల నుంచి నీరాజనాలు అందుతున్నాయి. ఏదైనా సాధించేందుకు వయసుతో సంబంధం లేదని భగవానీ దేవీ మరోసారి నిరూపించిందని అభినందనలు అందుతున్నాయి. భగవానీ దేవీ సాధించిన ఘనతను కొనియాడుతూ భారత క్రీడా మంత్రిత్వ శాఖ ట్విట్ చేసింది. నెటిజన్లు భగవానీ దేవీని ఆకాశానికెత్తుతున్నారు. సోషల్‌మీడియాలో భగవానీ దేవీ పేరు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. చదవండి: ప్రపంచకప్ బరిలో నుంచి టీమిండియా ఔట్ -
అమిత్ ఖత్రీకి రజతం
నైరోబి: భారత అథ్లెట్ అమిత్ ఖత్రీ సుదీర్ఘ పరుగులో సత్తా చాటుకున్నాడు. ప్రపంచ జూనియర్ (అండర్–20) అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 10,000 మీ. పరుగులో అతను రజత పతకం సాధించాడు. మహిళల 400 మీ. పరుగులో ప్రియా మోహన్ తృటిలో కాంస్యం గెలిచే అవకాశాన్ని కోల్పోయింది. ఆమె నాలుగో స్థానంలో నిలిచింది. రోహ్టక్కు చెందిన 17 ఏళ్ల టీనేజ్ అథ్లెట్ అమిత్ ఖత్రీ ఓ రకంగా అద్భుతమే చేశాడు. సాధారణంగా ఆఫ్రికా అథ్లెట్లకు మాత్రమే సాధ్యమయ్యే సుదీర్ఘ పరుగులో భారత అథ్లెట్ పతకం గెలవడం విశేషం. శనివారం జరిగిన పురుషుల పదివేల మీటర్ల రేస్‌వాక్‌లో అతను పోటీని 42 నిమిషాల 17.94 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. కెన్యాకు చెందిన హెరిస్టోన్ వాన్యోని 42 ని.10.84 సెకన్ల టైమింగ్‌తో బంగారు పతకం సాధించగా, స్పెయిన్ అథ్లెట్ పాల్ మెక్‌గ్రాత్ (42ని.26.11 సె.) కాంస్యం గెలుపొందాడు. నిజానికి ఖత్రీ స్వర్ణం గెలిచే అవకాశాలు చివరి వరకు కనిపించాయి. వేగంగా దూసుకెళ్లిన అతను 8 ల్యాపులు ముగిసే సరికి అందరికంటే ముందున్నాడు. దాదాపు 9000 మీటర్ల దాకా ఇదే వేగం నమోదు చేయగా... స్థానిక అథ్లెట్ వాన్యోని అనూహ్యంగా ఆఖరి ల్యాపులో అమిత్ ఖత్రీని అధిగమించి స్వర్ణం సొంతం చేసుకున్నాడు. కెన్యా రాజధాని నైరోబి సముద్ర మట్టానికి 1800 మీ. ఎత్తులో ఉంటుంది. ఇది భారతీయులకు ప్రతికూల ప్రదేశం. ఇలాంటి చోట భారత అథ్లెట్ సుదీర్ఘ పరుగులో స్వర్ణానికి చేరువగా వెళ్లడం ఆషామాషీ విషయం కాదు. పరుగు ముగిసిన అనంతరం ఖత్రీ మాట్లాడుతూ ‘నేను ఆశించిన ఫలితం కాదిది. అయినా సరే రజతంతో తృప్తిగా ఉన్నాను. ఐదు రోజుల ముందు ఇక్కడికొచ్చిన నన్ను ప్రతికూల వాతావరణం ఇబ్బంది పెట్టింది. ఒక ల్యాప్‌లో అయితే శ్వాస తీసుకోవడం కూడా కష్టమైంది’ అని అన్నాడు. పాల్గొన్న తొలి అంతర్జాతీయ పోటీలో రజతం గెలిచిన తన శిష్యుడి ప్రదర్శన పట్ల కోచ్ చందన్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. మహిళల 10వేల మీటర్ల రేస్‌వాక్‌లో బల్జీత్‌కౌర్ (48 ని.58.17 సె) ఏడో స్థానంలో నిలిచింది. ప్రియకు చేజారిన పతకం... మహిళల 400 మీటర్ల పరుగులో అనేక అంచనాల మధ్య బరిలోకి దిగిన ప్రియా మోహన్‌కు నిరాశే ఎదురైంది. దురదృష్టవశాత్తూ ఆమె నాలుగో స్థానంలో నిలిచింది. ఫైనల్ పోటీని ప్రియ 52.77 సెకన్లలో ముగించింది. ఈ ఈవెంట్లో ఇమావోబంగ్ (నైజీరియా; 51.55 సె.), కార్నెలియా (పోలండ్; 51.97 సె.), కెన్యా అథ్లెట్ సిల్వియా చెలన్‌గట్ (52.23 సె.) వరుసగా స్వర్ణ, రజత, కాంస్యాలు గెలిచారు. పురుషుల 400 మీ. హర్డిల్స్‌లో రోహన్ గౌతమ్ కాంబ్లి ఫైనల్ చేరడంలో విఫలమయ్యాడు. సెమీస్‌లో అతను 52.88 సెకన్ల టైమింగ్‌తో ఏడో స్థానంలో నిలిచాడు. పురుషుల 4్ఠ400 మీటర్ల హీట్స్‌లో అబ్దుల్ రజాక్, సుమిత్ చహల్, కపిల్, భరత్ శ్రీధర్‌లతో కూడిన జట్టు హీట్స్‌తోనే సరిపెట్టుకుంది. -
జూనియర్ల జోరు
వుఫా (రష్యా): జూనియర్ ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ రవీందర్ ‘బంగారు’ ఆశలు ఫైనల్లో ఆవిరయ్యాయి. 61 కేజీల విభాగంలో అతను రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. ఇరాన్ రెజ్లర్ రహ్మాన్ ముసా అమోజద్కలి 9–3తో రవీందర్‌ను ఓడించాడు. రెపిచేజ్ దారిలో ఉన్న రజతం అవకాశాల్ని యశ్ (74 కేజీలు), పృథ్వీ పాటిల్ (92 కేజీలు), అనిరుధ్ (125 కేజీలు) సద్వినియోగం చేసుకున్నారు. దీంతో భారత్ ఖాతాలో మరో మూడు కాంస్య పతకాలు చేరాయి. రజతం సహా మొత్తం 6 పతకాలు ఫ్రీస్టయిల్ రెజ్లర్లు గెలిచారు. 74 కేజీల కాంస్య పతక పోరులో యశ్ 12–6తో కిర్గిజిస్తాన్‌కు చెందిన స్టాంబుల్ జానిబెక్పై గెలుపొందగా, పృథ్వీ పాటిల్ (92 కేజీలు) 2–1తో ఇవాన్ కిరిలోవ్ (రష్యా)ను కంగుతినిపించాడు. అనిరుధ్ (125 కేజీలు) 7–2తో అయిదిన్ అహ్మదోవ్ (అజర్బైజాన్)ను ఓడించాడు. ఫైనల్లో బిపాషా: మహిళల ఈవెంట్లో బిపాషా (76 కేజీలు) స్వర్ణ బరిలో నిలిచింది. ఆమె ఫైనల్ చేరడంతో భారత్‌కు కనీసం రజతం ఖాయమైంది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో బిపాషా 9–4తో మంగోలియాకు చెందిన ఒద్బాగ్ ఉల్జిబాత్పై అలవోక విజయం సాధించింది. అంతకు ముందు జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆమె 6–3తో కజకిస్తాన్ రెజ్లర్ దిల్నాజ్ ముల్కినోవాను ఓడించింది. 50 కేజీల విభాగంలో సిమ్రాన్ ఉడుం పట్టు సెమీస్‌లో సడలింది. ఎమిలీ కింగ్ షిల్సన్ (అమెరికా)తో జరిగిన పోరులో ఆమె ‘టెక్నికల్ సుపీరియారిటీ’లో పరాజయం చవిచూసింది. మిగతా రెజ్లర్లు సితో (55 కేజీలు), కుసుమ్ (59 కేజీలు), అర్జూ (68 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ► 4 X 400 మీ. మిక్స్డ్ రిలేలో భారత్‌కు కాంస్యం ► జావెలిన్‌లో ఇద్దరు ఫైనల్‌కు నైరోబీ: వరల్డ్ జూనియర్ (అండర్–20) అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ తొలి రోజు భారత్ సత్తా చాటింది. 4 X 400 మీటర్ల మిక్స్డ్ రిలేలో భారత జట్టు మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సొంతం చేసుకుంది. మన బృందం 3 నిమిషాల 20.60 సెకన్లలో లక్ష్యాన్ని చేరింది. కాంస్యం గెలిచిన భారత జట్టులో శ్రీధర్ భరత్, ప్రియా మోహన్, సుమ్మీ, కపిల్ సభ్యులుగా ఉన్నారు. శ్రీధర్ ముందుగా పరుగు మొదలు పెట్టగా...ప్రియా, సుమ్మీ తర్వాతి లెగ్‌లలో పరుగెత్తారు. చివర్లో బ్యాటన్ అందుకున్న కపిల్...తనకు పోటీగా దూసుకొచ్చిన జమైకా అథ్లెట్‌ను వెనక్కి నెట్టి భారత్‌ను గెలిపించాడు. ఈ ఈవెంట్లో నైజీరియా (3 నిమిషాల 19.70 సెకన్లు), పోలండ్ (3 నిమిషాల 19.80 సెకన్లు) స్వర్ణ, రజతాలు గెలుచుకున్నాయి. అంతకు ముందు హీట్స్‌లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఈ పరుగులో పాల్గొన్న అబ్దుల్ రజాక్ స్థానంలో ఫైనల్లో శ్రీధర్ బరిలోకి దిగాడు. వరల్డ్ జూనియర్ అథ్లెటిక్స్‌లో గతంలో భారత్ తరఫున సీమా అంటిల్ (కాంస్యం – డిస్కస్, 2002), నవజీత్ కౌర్ (కాంస్యం – డిస్కస్ 2014), నీరజ్ చోప్రా (స్వర్ణం – జావెలిన్, 2016), హిమ దాస్ (స్వర్ణం – 400 మీ., 2018) పతకాలు గెలుచుకున్నారు. షాట్‌పుట్‌లో ఫైనల్‌కు: వరల్డ్ చాంపియన్‌షిప్ మరో మూడు ఈవెంట్లలో భారత్‌కు మంచి ఫలితాలు లభించాయి. షాట్‌పుట్‌లో అమన్‌దీప్ సింగ్ గుండును 17.92 మీటర్లు విసిరి ఫైనల్‌కు అర్హత సాధించాడు. ప్రియా మోహన్ 400 మీటర్ల పరుగులో కూడా ఫైనల్‌కు చేరుకుంది. జావెలిన్ త్రోలో ఇద్దరు ఫైనల్లోకి అడుగు పెట్టడం విశేషం. అజయ్ సింగ్ రాణా (71.05 మీటర్లు), జై కుమార్ (70.34 మీటర్లు) క్వాలిఫయింగ్‌లో సత్తా చాటి ఫైనల్ చేరారు. -
ఆ జంప్... ఆహా!
స్కూల్‌గేమ్స్‌లో అంజూ తొలి గెలుపు హర్డిల్స్‌లో! హర్డిల్స్ అంటే తెలుసుగా... అన్నీ దాటుకుంటూ సాగే పరుగు పందెం. ఈ పందెం అమె కెరీర్‌కు చక్కగా నప్పుతుంది. పాఠశాల స్థాయి పోటీల నుంచి అంతర్జాతీయ స్థాయి పోటీల దాకా ఎదురొచ్చిన అన్ని అడ్డంకుల్ని దాటుకుంటూ చివరకు ప్రపంచ వేదికపై భారత పతాకాన్ని రెపరెపలాడించింది. ఏ భారతీయ అథ్లెట్‌కు సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకుంది. అంజూ బాబీ జార్జి ఎన్నో హర్డిల్స్నైతే అధిగమించింది కానీ... చరిత్రలో నిలిచింది మాత్రం హర్డిల్స్ క్రీడాంశంలో కాదు... లాంగ్‌జంప్‌తో! స్కూల్లో హర్డిల్స్‌తో మొదలైన తన ఆటల బాటలో రిలే, లాంగ్‌జంప్, హైజంప్, హెప్టాథ్లాన్లన్నీ ఉన్నాయి. ఇవన్నీ దాటుకుంటూ వెళ్లి చివరకు లాంగ్‌జంప్ వద్ద ఆగింది. ఈ జంప్‌తోనే ‘ప్రపంచ’ పతకాన్ని గెలిచింది. ఆ వెంటే ‘ఖేల్‌రత్న’ం వరించింది. కన్నోడు... కట్టుకున్నోడు... చిన్నారి అంజూ చురుకైంది. చదువులో తెలివైంది. ఆటల పోటీల్లో గెలుపు గుర్రంలాంటిది. అందుకే ఆమె కన్నతండ్రి తనకు పుట్టింది అమ్మాయేగా చదువొక్కటి అబ్బితే చాల్లే అని అనుకోలేదు. 40 ఏళ్ల క్రితం ఆయన అలా అనుకొని వుంటే 2003లో పారిస్ వేదికగా జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పతకం గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్ర సృష్టించేది కాదు. 1980లో ఆమెను చదువుకోవాలన్నాడు. పోటీపడతానంటే ‘సై’ అన్నాడు. దీంతో 1992లో స్కూల్ గేమ్స్‌లో 100 మీటర్ల హర్డిల్స్ చాంపియనైంది. తదనంతరం క్రీడాకారుడే భర్తగా రావడం ఆమె కెరీర్‌ను ఉన్నతస్థితికి తీసుకెళ్లింది. ఇలా ఆమె జీవితంలో కన్నతండ్రి కె.టి.మార్కోజ్, కట్టుకున్న భర్త బాబీ జార్జిలది అమూల్యమైన ప్రోత్సాహం. వరల్డ్ ఫైనల్స్ చాంపియన్.... రెండేళ్ల తర్వాత (2005) మొనాకోలోని మోంటెకార్లోలో ప్రపంచ అథ్లెటిక్స్ ఫైనల్ టోర్నీ జరిగింది. ఇందులో ఆమె 6.75 మీటర్ల దూరం గెంతి రజతం గెలిచింది. కానీ ఆమె రిటైరయ్యాక... తొమ్మిదేళ్లయ్యాక ఆ పతకం రంగు మారింది. ఆ పోటీల్లో స్వర్ణం నెగ్గిన తాతియానా కొటోవా (రష్యా–6.83 మీటర్లు) 2014లో డోపింగ్‌లో దొరికిపోవడంతో నిర్వాహకులు ఆమె స్వర్ణాన్ని రద్దు చేసి అంజూను చాంపియన్‌గా ప్రకటించి పసడి పతకాన్ని ఖాయం చేశారు. ఇలా భారత క్రీడాకీర్తిని ప్రపంచ పటంలో నిలిపిన అంజూ ప్రతిష్టాత్మక ‘రాజీవ్ ఖేల్‌రత్న’... ‘అర్జున’... ‘పద్మశ్రీ’ పురస్కారాలను అందుకుంది. ఆమె ఘనతలివీ.... ప్రపంచ అథ్లెటిక్స్ కంటే ముందే అంజూ మాంచెస్టర్ కామన్వెల్త్ గేమ్స్ (2002)లో కాంస్యంతో మెరిసింది. బుసాన్ (2002లో), దోహా (2006లో) ఆసియా క్రీడల్లో వరుసగా స్వర్ణం, రజతం గెలుచుకుంది. అలాగే వరుసగా ఇంచియోన్ (2005లో), అమ్మాన్ (2007లో) ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లోనూ స్వర్ణ, రజతాలను రిపీట్ చేసింది. ప్రస్తుతం 43 ఏళ్ల అంజూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకానికి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తోంది. ఐదో ప్రయత్నం... ప్రపంచ పతకం అంజూ 2003లో పారిస్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ కోసం తుది సన్నాహాల్లో ఉంది. అయితే ఈ క్రమంలో ఆమె తీవ్రమైన అలసటతో అస్వస్థతకు గురైంది. ఓ దశలో పారిస్ ఈవెంట్ నుంచి తప్పుకుందామని భావించింది. కానీ భర్త బాబీ ముందుండి ధైర్యం చెప్పాడు. బరిలో దిగేందుకు తోవ చూపాడు. అలా చివరకు ఓ మేజర్ ఈవెంట్‌కు అయిష్టంగానే వచ్చినా మొక్కుబడిగా తలపడలేదు. దేశం కోసం, పతకం కోసం వందశాతం అంకిత భావం కనబరిచింది. ప్రపంచ మేటి అథ్లెట్లు, డిఫెండింగ్ చాంపియన్లు బరిలో ఉన్న లాంగ్‌జంప్‌లో ఒక్కొక్కరి ప్రయత్నాలు మొదలయ్యాయి. అంజూ ఐదో ప్రయత్నంలో 6.70 మీటర్ల దూరం మేర దూకింది. నిజానికి ఇది ఆమె గొప్ప ప్రయత్నమేమీ కాదు. ఎందుకంటే షూస్ స్పైక్ ఒక కాలితో మరొకటి తచ్చాడటంతో ఇబ్బంది పడింది. క్షణాల్లోనే ఇదంతా జరిగినా కూడా చక్కగా బ్యాలెన్స్ చేసుకొని అంత దూరం గెంతడం అంత ఆషామాషీ కాదు. కాసేపయ్యాక ఆరో ప్రయత్నం చేసినా అదేమంతా సక్సెస్ కాలేదు. చివరకు అందరివీ అన్నీ ప్రయత్నాలు పూర్తయ్యాక చూస్తే అంజూ మూడో స్థానం ఖాయమైంది. పోడియంలో కాంస్యం అందుకొని చరిత్ర పుటలకెక్కింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన ఉత్సాహంలో 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో అడుగుపెట్టిన అంజూ ఐదో స్థానంలో నిలిచింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లోనూ ఆమె బరిలోకి దిగినా ఫైనల్ చేరలేకపోయింది. –సాక్షి క్రీడా విభాగం -
3 ఫైనల్స్... 2 ఒలింపిక్ బెర్త్‌లు
దోహా (ఖతర్): వరుసగా ఎనిమిదో ప్రపంచ చాంపియన్‌షిప్ నుంచి భారత అథ్లెట్స్ రిక్తహస్తాలతో తిరిగి వచ్చారు. ఆదివారం ముగిసిన ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మనోళ్లు మూడు విభాగాల్లో ఫైనల్స్‌కు అర్హత సాధించడం... రెండు విభాగాల్లో టోక్యో ఒలింపిక్ బెర్త్‌లు దక్కించుకోవడం చెప్పుకోతగ్గ విశేషం. పోటీల చివరి రోజు జరిగిన పురుషుల మారథాన్ రేసులో ఆసియా చాంపియన్, భారత అథ్లెట్ గోపీ థొనకల్ 21వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. 42.195 కిలోమీటర్ల దూరాన్ని 31 ఏళ్ల గోపీ 2 గంటల 15 నిమిషాల 57 సెకన్లలో పూర్తి చేశాడు. మొత్తం 73 మంది అథ్లెట్స్ మారథాన్ రేసును ప్రారంభించగా... 18 మంది రేసును పూర్తి చేయలేక మధ్యలో వైదొలిగారు. లెలీసా దెసీసా (ఇథియోపియా– 2గం:10ని.40 సెకన్లు) స్వర్ణ పతకం సొంతం చేసుకోగా... మోసినెట్ జెరెమ్యూ (ఇథియోపియా–2గం:10ని.44 సెకన్లు) రజతం... అమోస్ కిప్రుటో (కెన్యా–2గం:10.51 సెకన్లు) కాంస్యం గెల్చుకున్నారు. 2001 తర్వాత మారథాన్‌లో ఇథియోపియా అథ్లెట్‌కు స్వర్ణం రావడం ఇదే తొలిసారి. భారత్ తరఫున ఈ మెగా ఈవెంట్లో 27 మంది పాల్గొన్నారు. 4గీ400 మీటర్ల మిక్స్డ్ రిలేలో, పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో అవినాశ్ సాబ్లే, మహిళల జావెలిన్ త్రోలో అన్ను రాణి ఫైనల్‌కు చేరుకున్నారు. అవినాశ్‌తోపాటు 4గీ400 మీటర్ల మిక్స్డ్ రిలే బృందం టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. -
శివపాల్ సింగ్ విఫలం
దోహా: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారుల వైఫల్యం కొనసాగుతోంది. పురుషుల జావెలిన్ త్రో విభాగంలో భారత ఆటగాడు శివపాల్ సింగ్ క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరిగాడు. శివపాల్ సింగ్ ఈటెను 78.97 మీటర్ల దూరం విసిరి గ్రూప్ ‘ఎ’లో పదో స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా 30 మంది బరిలోకి దిగగా... శివపాల్ సింగ్ 24వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. టాప్–12లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత సాధించారు. డిఫెండింగ్ చాంపియన్ జొహనెస్ వెటెర్ (జర్మనీ–89.35 మీటర్లు) క్వాలిఫయింగ్‌లో అగ్రస్థానాన్ని సంపాదించాడు. పురుషుల 20 కిలోమీటర్ల నడక ఫైనల్లో భారత అథ్లెట్ ఇర్ఫాన్ గంటా 35 నిమిషాల 21 సెకన్లలో గమ్యానికి చేరి 36వ స్థానంలో నిలిచాడు. తొషికాజు (జపాన్–1గం:26ని.34 సెకన్లు) స్వర్ణ పతకాన్ని సాధించాడు. మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో దలీలా (అమెరికా–52.16 సెకన్లు) కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పి పసిడి పతకం గెలిచింది. పురుషుల హైజంప్‌లో ముతాజ్ ఇసా బర్షిమ్ (ఖతర్–2.37 మీటర్లు) స్వర్ణం సాధించాడు. మహిళల డిస్కస్ త్రోలో వైమి పెరెజ్ (క్యూబా–69.17 మీటర్లు) పసిడి పతకం సొంతం చేసుకుంది. పురుషుల 400 మీటర్ల ఫైనల్లో స్టీవెన్ గార్డ్నర్ (బహమాస్–43.48 సెకన్లు) బంగారు పతకాన్ని దక్కించుకున్నాడు. -
అవినాశ్‌కు 13వ స్థానం
దోహా: ప్రతిష్టాత్మక ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు పతకం రాకున్నా మరో ఒలింపిక్ బెర్త్ దక్కింది. శుక్రవారం జరిగిన పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఫైనల్లో భారత అథ్లెట్ అవినాశ్ సాబ్లే 13వ స్థానంలో నిలిచాడు. 16 మంది పాల్గొన్న ఫైనల్లో అవినాశ్ 8ని:21.37 సెకన్లలో గమ్యానికి చేరాడు. ఈ క్రమంలో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు. వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌కూ అర్హత సాధించాడు. ఇదే టోరీ్నలో క్వాలిఫయింగ్‌లో 8ని:25.23 సెకన్లతో సాధించిన జాతీయ రికార్డును అవినాశ్ బద్దలు కొట్టాడు. కిప్రుటో (కెన్యా–8ని:01.35 సెకన్లు) స్వర్ణం... లమేచా గిర్మా (ఇథియోపియా–8ని:01.36 సెకన్లు) రజతం... సుఫియాన్ ఎల్ బకాలి (మొరాకో–8ని:03.76 సెకన్లు) కాంస్యం సాధించారు. పురుషుల 1500 మీటర్ల విభాగంలో భారత అథ్లెట్, ఆసియా క్రీడల చాంపియన్ జిన్సన్ జాన్సన్ ఫైనల్‌కు అర్హత పొందలేకపోయాడు. తొలి రౌండ్ హీట్‌లో పోటీపడ్డ జాన్సన్ 3 నిమిషాల 39.86 సెకన్లలో గమ్యానికి చేరి తన హీట్‌లో పదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఓవరాల్‌గా క్వాలిఫయింగ్‌లో 43 మంది పాల్గొనగా... జాన్సన్ 34వ స్థానంలో నిలిచాడు. -
షాట్‌పుట్‌లో తజీందర్కు నిరాశ
దోహా: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్íÙప్లో మరో భారత స్టార్ నిరాశపరిచాడు. పురుషుల షాట్‌పుట్ ఈవెంట్లో భారత స్టార్, ప్రస్తుత ఆసియా చాంపియన్, ఆసియా క్రీడల చాంపియన్ తజీందర్‌పాల్ సింగ్ తూర్ ఫైనల్‌కు అర్హత పొందడంలో విఫలమయ్యాడు. గురువారం జరిగిన క్వాలిఫయింగ్‌లో గ్రూప్ ‘బి’లో పోటీపడిన తజీందర్ ఇనుప గుండును 20.43 మీటర్ల దూరం విసిరి తన గ్రూప్‌లో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్íÙప్లో, గతేడాది ఆసియా క్రీడల్లో తజీందర్ షాట్‌పుట్‌లో భారత్‌కు స్వర్ణ పతకాలు అందించాడు. అయితే అదే ప్రదర్శనను ఇక్కడ పునరావృతం చేయడంలో విఫలమయ్యాడు. గ్రూప్ ‘ఎ’లో 16 మంది... గ్రూప్ ‘బి’లో 18 మంది క్వాలిఫయింగ్‌లో పోటీపడ్డారు. టాప్–12లో నిలిచిన వారు శనివారం జరిగే ఫైనల్‌కు అర్హత సాధించారు. ఓవరాల్‌గా తజీందర్ 18వ స్థానంలో నిలిచాడు. గ్రూప్ ‘ఎ’ నుంచి ఎనిమిది మంది... గ్రూప్ ‘బి’ నుంచి నలుగురు ఫైనల్‌కు చేరారు. 20.90 మీటర్లను ఫైనల్‌కు చేరే కనీస అర్హత ప్రమాణంగా నిర్ణయించారు. ముగిసిన బ్రిటన్ నిరీక్షణ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్íÙప్లో బ్రిటన్ స్ప్రింట్ (100 లేదా 200 మీటర్లు) విభాగంలో నిరీక్షణ ముగిసింది. 36 ఏళ్ల విరామం తర్వాత బ్రిటన్‌కు 200 మీటర్ల విభాగంలో ఈ మెగా ఈవెంట్లో తొలి పసిడి పతకం లభించింది. మహిళల 200 మీటర్ల విభాగంలో దీనా యాషెర్ స్మిత్ విజేతగా నిలిచి బ్రిటన్ ఖాతాలో స్వర్ణాన్ని చేర్చింది. ఆమె 21.88 సెకన్లలో గమ్యానికి చేరి చాంపియన్‌గా నిలిచింది. బ్రిట్నీ బ్రౌన్ (అమెరికా–22.22 సెకన్లు) రజతం, ముజింగా కామ్బుండ్జి (స్విట్జర్లాండ్–22.51 సెకన్లు) కాంస్యం గెల్చుకున్నారు. ‘ఏం చెప్పాలో తెలియడంలేదు. ఈ విజయాన్ని ఇంకా ఆస్వాదిస్తున్నాను. స్ప్రింట్ స్వర్ణం కోసం కల కన్నాను. ఇప్పటికి ఇది నిజమైంది’ అని 23 ఏళ్ల దీనా వ్యాఖ్యానించింది. -
హీట్స్‌లోనే చిత్రా నిష్క్రమణ
దోహా: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ల నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. మహిళల 1500 మీటర్ల విభాగంలో ఆసియా చాంపియన్, భారత రన్నర్ చిత్రా ఉన్నికృష్ణన్ తొలి రౌండ్ హీట్స్‌లోనే ఇంటిదారి పట్టింది. బుధవారం జరిగిన ఈ హీట్స్‌లో చిత్రా 4 నిమిషాల 11.10 సెకన్లలో గమ్యానికి చేరి తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. హీట్స్‌లో ఎనిమిదో స్థానంలో నిలిచి సెమీఫైనల్ దశకు అర్హత పొందలేకపోయింది. గత ఏప్రిల్‌లో ఇదే వేదికపై ఆసియా చాంపియన్íÙప్లో స్వర్ణ పతకాన్ని నెగ్గిన చిత్రా అదే ఫలితాన్ని ప్రపంచ చాంపియన్íÙప్లో పునరావృతం చేయలేకపోయింది. ఓవరాల్‌గా హీట్స్‌లో 35 మంది పాల్గొనగా చిత్రాకు 30వ స్థానం దక్కింది. టాప్–24లో నిలిచిన వారు సెమీఫైనల్‌కు చేరుకున్నారు. -
అవినాశ్ జాతీయ రికార్డు
దోహా: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మరో భారత అథ్లెట్ తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన నమో దు చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్ ఈవెంట్లో భారత అథ్లెట్ అవినాశ్ సాబ్లే కొత్త జాతీయ రికార్డును నెలకొల్పాడు. ఫైనల్‌కు కూడా అర్హత సాధించాడు. మూడో హీట్‌లో పాల్గొన్న అతను 8 నిమిషాల 25.23 సెకన్లలో గమ్యానికి చేరుకొని ఏడో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో అవినాశ్ 8 నిమిషాల 28.94 సెకన్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు. జాతీయ రికార్డును సవరించినా తొలుత అవినాశ్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు. మొత్తం 44 మంది అథ్లెట్స్ మూడు హీట్స్‌లో పాల్గొనగా... 15 మంది ఫైనల్‌కు అర్హత పొందారు. అవినాశ్ ఓవరాల్‌గా 20వ స్థానాన్ని దక్కించుకున్నాడు. అయితే రేసు జరుగుతున్న సమయంలో అవినాశ్ దారికి అడ్డంగా రెండుసార్లు ఇథియోపియా అథ్లెట్ టెకెలె నిగేట్ వచ్చాడు. దాంతో అవినాశ్ ప్రమే యం లేకుండా అతని వేగం తగ్గిపోయింది. రేసు ముగిశాక ఈ విషయంపై నిర్వాహకులకు భారత బృందం అప్పీల్ చేసింది. నిర్వాహకులు వీడియో ఫుటేజీని పరిశీలించి అవినాశ్ తప్పు లేదని నిర్ధారించారు. అవినాశ్‌కు 16వ అథ్లెట్‌గా ఫైనల్లో పాల్గొనే అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. అన్ను రాణికి 8వ స్థానం మహిళల జావెలిన్ త్రో ఫైనల్లో భారత అమ్మాయి అన్ను రాణి 8వ స్థానంతో సరిపెట్టుకుంది. ఆమె ఆరు ప్రయత్నాల్లో అత్యుత్తమంగా ఈటెను 61.12 మీటర్ల దూరం (రెండో ప్రయత్నంలో) విసిరింది. కెల్సీ (ఆ్రస్టేలియా–66.56 మీటర్లు) స్వర్ణం... షియింగ్ లియు (చైనా–65.88 మీటర్లు) రజతం... హుయ్‌హుయ్ లియు (చైనా–65.49 మీటర్లు) కాంస్యం నెగ్గారు. సోమవారం జరిగిన క్వాలిఫయింగ్‌లో అన్ను జావెలిన్‌ను 62.43 మీటర్ల దూరం విసిరింది. ఓవరాల్‌గా ఐదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. -
షెల్లీ గెలిచింది మళ్లీ...
తల్లి హోదా వచ్చాక తమలో ప్రావీణ్యం మరింత పెరిగిందేకానీ తరగలేదని జమైకా మేటి అథ్లెట్ షెల్లీ యాన్ ఫ్రేజర్ ప్రైస్... అమెరికా స్టార్ అలీసన్ ఫెలిక్స్ నిరూపించారు. మహిళల 100 మీటర్ల విభాగంలో తనకు తిరుగులేదని షెల్లీ మరోసారి లోకానికి చాటి చెప్పగా... ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక స్వర్ణ పతకాలు గెలిచిన అథ్లెట్‌గా అలీసన్ ఫెలిక్స్ గుర్తింపు పొందింది. 11 స్వర్ణాలతో జమైకా దిగ్గజం ఉసేన్ బోల్ట్ పేరిట ఉన్న రికార్డును 12వ స్వర్ణంతో ఫెలిక్స్ బద్దలు కొట్టింది. ఓవరాల్‌గా ఈ మెగా ఈవెంట్ చరిత్రలో 33 ఏళ్ల ఫెలిక్స్‌కు 17వ పతకం కావడం విశేషం. దోహా (ఖతర్): తక్కువ ఎత్తు ఉన్నా... ట్రాక్‌పై చిరుతలా దూసుకెళ్లే అలవాటుతో... ‘పాకెట్ రాకెట్’గా ముద్దు పేరు సంపాదించిన జమైకా మేటి మహిళా అథ్లెట్ షెల్లీ యాన్ ఫ్రేజర్ ప్రైస్ మళ్లీ విశ్వవేదికపై కాంతులీనింది. తొలి సంతానం కోసం 2017 ప్రపంచ చాంపియన్ షిప్‌కు దూరమైన షెల్లీ... మగశిశువుకు జన్మనిచ్చాక ఈ ఏడాది మళ్లీ ట్రాక్‌పై అడుగు పెట్టింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రాణిస్తుందో లేదో అనే అనుమానం ఉన్న వారందరి అంచనాలను తారుమారు చేసింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో 5 అడుగుల ఎత్తు ఉన్న షెల్లీ 10.71 సెకన్లలో గమ్యానికి చేరి ఏకంగా నాలుగోసారి 100 మీటర్ల విభాగంలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. రాకెట్ వేగంతో రేసును ఆరంభించిన షెల్లీ 20 మీటర్లకే తన ప్రత్యర్థులను వెనక్కినెట్టి అందరికంటే ముందుకు వెళ్లిపోయింది. అదే జోరులో రేసును ముగించేసింది. డీనా యాషెర్ స్మిత్ (బ్రిటన్–10.83 సెకన్లు) రజతం... మేరీ జోసీ తా లూ (ఐవరీకోస్ట్–10.90 సెకన్లు) కాంస్యం సాధించారు. గతంలో షెల్లీ 2009, 2013, 2015లలో కూడా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకాలు గెలిచింది. రేసు ముగిసిన వెంటనే షెల్లీ తన రెండేళ్ల కుమారుడు జియోన్‌తో సంబరాలు చేసుకుంది. ‘మళ్లీ స్వర్ణం గెలిచి... నా కుమారుడితో విశ్వవేదికపై సగర్వంగా నిల్చోవడం చూస్తుంటే నా కల నిజమైనట్లు అనిపిస్తోంది. గత రాత్రంతా నాకు నిద్ర లేదు. 2016 రియో ఒలింపిక్స్ సమయంలోనూ ఇలాగే జరిగింది. శుభారంభం లభిస్తే చాలు రేసులో దూసుకుపోతానని తెలుసు. అదే వ్యూహంతో ఈసారీ బరిలోకి దిగాను. కొన్నాళ్లుగా తీవ్రంగా కష్టపడ్డాను. భర్త జేసన్, కుమారుడు జియోన్ నాలో కొత్త శక్తిని కలిగించారు’ అని షెల్లీ వ్యాఖ్యానించింది. ఫెలిక్స్...12వ స్వర్ణం గత నవంబర్‌లో ఆడ శిశువు కామ్రిన్కు జన్మనిచ్చాక... ఈ ఏడాది జులైలో ట్రాక్‌పైకి అడుగు పెట్టిన అలీసన్ ఫెలిక్స్ 4x400 మిక్స్డ్ రిలేలో స్వర్ణ పతకం సాధించింది. దాంతో 11 స్వర్ణాలతో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అత్యధిక పసిడి పతకాలు గెలిచిన ఉసేన్ బోల్ట్ రికార్డును 12వ స్వర్ణంతో ఫెలిక్స్ బద్దలు కొట్టింది. గతంలో ఫెలిక్స్ 2005 (1), 2007 (3), 2009 (2), 2011 (2), 2015 (1), 2017 (2) ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లోనూ పసిడి పతకాలు సాధించింది. జావెలిన్ ఫైనల్లో అన్ను రాణి... సోమవారం భారత అథ్లెట్స్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల జావెలిన్ త్రో విభాగంలో అన్ను రాణి కొత్త జాతీయ రికార్డు నెలకొల్పడంతోపాటు 12 మంది పాల్గొనే ఫైనల్‌కు అర్హత సాధించింది. క్వాలిఫయింగ్ ‘ఎ’ గ్రూప్‌లో పోటీపడిన అన్ను రాణి ఈటెను 62.43 మీటర్ల దూరం విసిరింది. ఈ క్రమంలో 62.34 మీటర్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును సవరించింది. ఓవరాల్‌గా క్వాలిఫయింగ్‌లో తొమ్మిదో స్థానంతో అన్ను రాణి నేడు జరిగే ఫైనల్‌కు అర్హత పొందింది. మహిళల 200 మీటర్ల హీట్స్‌లో అర్చన 23.65 సెకన్లలో గమ్యానికి చేరి చివరిదైన ఎనిమిదో స్థానంలో నిలిచింది. మహిళల 400 మీటర్ల హీట్స్‌లో భారత్‌కే చెందిన అంజలీ దేవి 52.33 సెకన్లతో ఆరో స్థానంలో నిలిచింది. -
భారత్‌కు నిరాశ
దోహా: ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మూడో రోజు భారత్ తరఫున పెద్ద సంచలనమేమీ నమోదు కాలేదు. పతకంపై ఆశలు రేకెత్తించిన భారత 4గీ400 మిక్సడ్ రిలే టీమ్ అద్భుతం చేయలేకపోయింది. ఫైనల్లో భారత్ 3 నిమిషాల 15:77 సెకన్ల టైమింగ్‌తో ఏడో స్థానంలో నిలిచింది. తొలిసారి ఈ మెగా టోర్నీలో ప్రవేశపెట్టిన మిక్సడ్రిలేలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన మొహమ్మద్ అనస్, వీకే విస్మయ, జిస్నా మాథ్యు, నిర్మల్ నోహ్ ఫైనల్లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. హీట్స్‌లో 3 నిమిషాల 16.14సెకన్ల టైమింగ్‌తో రాణించిన భారత బృందం ఫైనల్లో అంతకన్నా మెరుగైన ప్రదర్శన కనబరిచినప్పటికీ పతకానికి ఆమడ దూరంలోనే నిలిచిపోయింది. ఈ పోటీల్లో అమెరికా జట్టు 3 నిమిషాల 09:34 సెకన్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణాన్ని, జమైకా బృందం 3నిమిషాల 11:78 సెకన్లతో రజతాన్ని, బహ్రెయిన్ జట్టు 3నిమిషాల 11:82 సెకన్లతో కాంస్యాన్ని గెలుచుకున్నాయి. నేడు జరగనున్న జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ గ్రూప్ ‘ఎ’, ‘బి’ ఈవెంట్లో భారత్ నుంచి అన్నూ రాణి (రా.గం 7:00 క్వాలిఫికేషన్ గ్రూప్ ‘ఎ’; రా.గం 8:30; క్వాలిఫికేషన్ గ్రూప్ ‘బి’), మహిళల 200మీ. హీట్స్‌లో అర్చన సుసీంత్రన్ (రా.గం. 7:35), 400మీ. హీట్స్‌లో అంజలి దేవీ (రా.గం. 8:50)తలపడతారు. పోల్‌వాల్ట్ కొత్త తార సిదొరోవా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ మహిళల పోల్‌వాల్ట్‌లో కొత్త చాంపియన్ అవతరించింది. ఆథరైజ్ న్యూట్రల్ అథ్లెట్ (ఏఎన్ఏ) తరఫున బరిలోకి దిగిన రష్యా అథ్లెట్ ఏంజెలికా సిదొరోవా విజేతగా నిలిచింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ ఈవెంట్లో చివరి వరకు పోరాడిన అమెరికా అమ్మాయి సాండీ మోరిస్ వరుసగా రెండోసారి రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. ఫైనల్లో మోరిస్, సిదోరోవా మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఫైనల్లో భాగంగా ఐదు ప్రయత్నాల్లో పోటీపడిన వీరిద్దరూ సమంగా నిలిచారు. చివరగా 4.95మీ. ఎత్తున్న బార్‌ను లంఘించడంలో విజయవంతమైన సిదోరోవా చాంపియన్‌గా నిలిచింది. 4.95మీ. ఎత్తును దూకలేకపోయిన సాండీ మోరిస్ రజతంతోనే సంతృప్తిపడింది. బ్రిటన్‌కు చెందిన కాటరీనా స్టెఫానిది మూడోస్థానంలో నిలిచి కాంస్యాన్ని దక్కించుకుంది. 2017 లండన్ క్రీడల్లోనూ సాండీ రన్నరప్‌గా నిలిచింది. -
‘విస్మయ’ పరిచారు
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ రెండోరోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఎన్నో అంచనాలను పెట్టుకున్న మహిళల 100మీ. పరుగులో ద్యుతీ చంద్, 400మీ. హర్డిల్స్‌లో కొత్త ఆశలు రేపిన జబీర్ నిరాశపరచగా... వీకే విస్మయ అనూహ్య పరుగుతో 4x400మీ. మిక్స్డ్ రిలేలో భారత బృందం పతక ఆశలను చిగురింపజేసింది.హీట్స్‌లో సీజన్ బెస్ట్ ప్రదర్శనతో భారత్ మిక్స్డ్ రిలే ఈవెంట్లో ఫైనల్‌కు చేరడంతో పాటు టోక్యో ఒలింపిక్స్ బెర్తును కొట్టేసింది. దోహా: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత ఆటగాళ్ల సత్తాపై అనుమానాలు తలెత్తుతోన్న సమయంలో 4x400మీ. మిక్స్డ్ రిలేలో జాతీయ జట్టు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. మొహమ్మద్ అనస్, వెల్లువ కొరోత్ విస్మయ, జిస్నా మ్యాథ్యూ, టామ్ నిర్మల్ నోహ్లతో కూడిన భారత బృందం ఒకే దెబ్బతో ఫైనల్ బెర్తు, టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. రెండో హీట్‌లో పాల్గొన్న భారత్ 3 నిమిషాల 16.14 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తిచేసి మూడోస్థానంలో నిలిచింది. ఈ సీజన్లో భారత్‌కిదే ఉత్తమ ప్రదర్శన. తొలుత పోటీని అనస్ ప్రారంభించగా... అనస్ నుంచి బ్యాటన్‌ను అందుకున్న విస్మయ చిరుతలా పరుగెత్తింది. తర్వాత జిస్నా పరుగులో కాస్త వెనుకబడినా... చివరగా నిర్మల్ వేగంగా పరుగెత్తి భారత్‌ను రేసులో నిలిపాడు. అందరిలో విస్మయ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ప్రతీ హీట్‌లో టాప్–3లో నిలిచిన వారితో పాటు, అత్యుత్తమ టైమింగ్ నమోదు చేసిన మిగతా రెండు జట్లు ఫైనల్‌కు అర్హత పొందుతాయి. ఆదివారం అర్ధరాత్రి దాటాక గం.1.05లకు 4్ఠ400 మీ. మిక్స్డ్ రిలే ఫైనల్ జరుగుతుంది. నిరాశపరిచిన ద్యుతీ మహిళల 100మీ. పరుగులో సెమీస్ బెర్తు ఖాయమనుకున్న తరుణంలో భారత ఏస్ స్ప్రింటర్ ద్యుతీచంద్ తీవ్రంగా నిరాశపరిచింది. ఈ సీజన్లోనే అధ్వాన ప్రదర్శనతో అవకాశాన్ని చేజార్చుకుంది. పోటీల రెండోరోజు శనివారం మహిళల 100మీ. హీట్స్‌లో ద్యుతీచంద్ 11.48 సెకన్ల టైమింగ్ నమోదు చేసి ఎనిమిది మంది పాల్గొన్న మూడో హీట్స్‌లో ఏడో స్థానంతో... ఓవరాల్‌గా 37వ స్థానంతో పోటీల నుంచి ని్రష్కమించింది. సెమీస్‌కు అర్హత సాధించిన వారిలో చివరి అత్యుత్తమ టైమింగ్ 11.31 సెకన్లు కాగా... ద్యుతీ ఇదే వేదికగా ఏప్రిల్‌లో జరిగిన ఆసియా చాంపి యన్íÙప్లో 11.28సె. టైమింగ్ నమోదు చేసింది. కానీ ఈ మెగా టోరీ్నలో ఆ ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయింది. జమైకా స్ప్రింటర్ షెల్లీ ఫ్రేజర్ అందరికన్నా ముందుగా 10.80 సెకన్లలో లక్ష్యానికి చేరుకొని హీట్స్‌లో అత్యుత్తమ స్ప్రింటర్‌గా నిలిచింది. ముగిసిన జబీర్ పోరాటం పురుషుల 400మీ. హర్డిల్స్‌లో భారత ఆశాకిరణం ముదారి పిళ్లై జబీర్ పోరాటం సెమీస్‌లోనే ముగిసింది. హీట్స్‌లో 49.62సె. టైమింగ్‌తో సెమీస్‌కు అర్హత సాధించిన జబీర్... సెమీస్‌లో గొప్ప ప్రదర్శన కనబరిచలేకపోయాడు. తాను పాల్గొన్న మూడో సెమీస్ హీట్స్‌లో జబీర్ 49.71 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని ఐదో స్థానంలో నిలిచాడు. ప్రతీ హీట్స్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారితో పాటు, మిగిలిన వారిలో మెరుగైన టైమింగ్ ఉన్న ఇద్దరు కలిపి మొత్తం 8 మంది ఫైనల్‌కు సాధించారు. -
జబీర్ ముందంజ
దోహా: ప్రతిష్టాత్మక ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌ను భారత్ కాస్త ఆశాజనకంగా ప్రారంభించింది. ఈ మెగా టోర్నీ ప్రారంభ ఈవెంట్ లాంగ్‌జంప్‌లో భారత ఆశాకిరణం శ్రీ శంకర్ మురళీ నిరాశపరిచినా... 400మీ. హర్డిల్స్‌లో మదారి పిళ్లై జబీర్ ముందంజ వేశాడు. పోటీల తొలిరోజు శుక్రవారం 400మీ. హర్డిల్స్ తొలి హీట్స్‌లో పాల్గొన్న జబీర్ మూడో స్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించాడు. అతను 49.62 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తిచేశాడు. ఇదే ఈవెంట్లో పాల్గొన్న మరో భారత ఆటగాడు ధరుణ్ అయ్యసామి హీట్స్‌లోనే వెనుదిరిగాడు. ధరుణ్ 50.93 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని... ఎనిమిది మంది పాల్గొన్న హీట్స్‌లో ఆరో స్థానంలో నిలిచాడు. తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన వారు మాత్రమే సెమీస్‌కు అర్హత పొందుతారు. మరోవైపు లాంగ్‌జంప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఏకైక ఆటగాడు శ్రీ శంకర్ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. 20 ఏళ్ల ఈ యువ లాంగ్ జంపర్ క్వాలిఫయింగ్ ఈవెంట్లో అత్యుత్తమంగా కేవలం 7.62 మీ. మాత్రమే జంప్ చేశాడు 27 మంది పాల్గొన్న ఈ పోటీల్లో 22వ స్థానంలో నిలిచాడు. తొలి ప్రయత్నంలో 7.52మీ. జంప్ చేసిన అతను రెండో ప్రయత్నంలో కాస్త మెరుగ్గా 7.62మీ. నమోదు చేశాడు. చివరిదైన మూడో ప్రయత్నంలో ఫౌల్‌గా వెనుదిరిగాడు. ఫైనల్‌కు అర్హత సాధించాలంటే టాప్–12లో స్థానం దక్కించుకోవాల్సి ఉంటుంది. లేదా నిర్దేశిత ప్రమాణం 8.15మీ. జంప్ చేయాలి. శంకర్ పేలవ ప్రదర్శనతో పోటీల నుంచి ని్రష్కమించాడు. నేడు జరిగే పోటీల్లో భారత్ నుంచి 100మీ. మహిళల హీట్స్‌లో ద్యుతీచంద్, పురుషుల 400మీ. హర్డిల్స్ సెమీఫైనల్లో జబీర్... పురుషుల 4గీ400మీ. మిక్స్డ్ రిలే ఈవెంట్లో భారత జట్టు బరిలో దిగుతుంది. -
ప్రపంచం పరుగెడుతోంది....
సెకనులో వందో వంతు పతక విజేతను తేలుస్తుంది... సెంటీ మీటర్ తేడాతో స్వర్ణం కాస్తా రజతంగా మారిపోతుంది... నలుగురిలో ఒకరి అడుగు తడబడినా అది అందరి బాధగా మారుతుంది... ఉత్కంఠ,ఉద్వేగాలకు కేరాఫ్ అడ్రస్‌గా కనిపించే భారీ క్రీడా సంబరం అభిమానులను అలరించేందుకు మళ్లీ వచి్చంది. ఎడారి దేశం ఖతర్‌లో స్వేదం చిందించేందుకు విశ్వవ్యాప్తంగా అథ్లెట్లు ట్రాక్‌పై సిద్ధంగా ఉన్నారు. ఒలింపిక్స్ తర్వాత ఆ స్థాయి ఆకర్షణ ఉన్న ఈవెంట్ అయిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌కు నేటితో తెర లేవనుంది. దోహా (ఖతర్): ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటేందుకు అగ్రశ్రేణి ఆటగాళ్లంతా సన్నద్ధమయ్యారు. ఖలీఫా అంతర్జాతీయ స్టేడియంలో నేటి నుంచి అక్టోబరు 6 వరకు ఈ మెగా టోర్నీ జరుగుతుంది. 200 దేశాలకు చెందిన దాదాపు 2000కు పైగా అథ్లెట్లు ఇందులో పాల్గొంటున్నారు. అథ్లెట్ల కోణంలో చూస్తే వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు ముందు తమ బలాన్ని చాటేందుకు, తద్వారా సన్నద్ధతకు ఈ చాంపియన్‌షిప్ అవకాశం కలి్పస్తుండగా... 2020లో ప్రపంచ కప్ ఫుట్‌బాల్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న ఖతర్ నిర్వహణా సామర్థ్యాన్ని పరీక్షించుకునేందుకు కూడా ఇది ఉపయోగపడనుంది. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పురుషుల, మహిళల రిలేలకు తోడు తొలిసారి మిక్స్డ్ రిలే ఈవెంట్ నిర్వహిస్తుండటం విశేషం. ఇందులో పురుషులు, మహిళలు కలిసి పరుగెడతారు. బోల్ట్ లేకుండా... మొత్తం 14 పతకాలు...ఇందులో ఏకంగా 11 స్వర్ణాలు. 2007 నుంచి 2017 వరకు ఆరు ప్రపంచ చాంపియన్‌షిప్‌లను శాసించిన దిగ్గజం ఉసేన్ బోల్ట్ శకం ముగిసిన తర్వాత జరుగుతున్న తొలి పోటీలు ఇవి. దాంతో అందరి దృష్టీ కొత్తగా వచ్చే 100 మీ., 200 మీ. చాంపియన్లపై నిలిచింది. అమెరికా స్టార్ నోహ్ లైల్స్ ఈ జాబితాలో అందరికంటే ముందున్నాడు. యూఎస్‌కే చెందిన క్రిస్టియన్ కోల్మన్ నుంచి అతనికి గట్టి పోటీ ఎదురవుతోంది. మహిళల స్ప్రింట్‌లో 32 ఏళ్ల వెటరన్ అథ్లెట్ షెలీ ఆన్ ఫ్రేజర్ మళ్లీ పతకం కోసం పోరాడనుంది. పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో కార్స్టన్ వార్హోల్మ్ (నార్వే) పతకం నెగ్గే అవకాశాలు ఉన్నాయి. డిఫెండింగ్ చాంపియన్ అయిన వార్హోల్మ్ ఈసారి 46.78 సెకన్ల ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. వెస్టిండీస్ మాజీ పేసర్ విన్స్టన్ బెంజమిన్ కుమారుడు రాయ్ బెంజమిన్ కూడా ఈ విభాగంలో గట్టి పోటీదారుడు. దినా అషర్ స్మిత్ (బ్రిటన్ – 100 మీ.), యులిమర్ రోజస్ (వెనిజులా – ట్రిపుల్ జంప్), సిఫాన్ హసన్ (నెదర్లాండ్స్ – లాంగ్ డిస్టెన్స్)లు బరిలో ఉన్న ఇతర స్టార్ అథ్లెట్లు. మన బలమెంత? ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత జట్టు ఇప్పటి వరకు ఒకే ఒక్క పతకం సాధించింది. 2003 పారిస్ ఈవెంట్లో లాంగ్‌జంపర్ అంజూ బాబీ జార్జ్ కాంస్యంతో మెరిసింది. అంతే... ఆ తర్వాత పోటీలకు వెళ్లటం, రిక్తహస్తాలతో తిరిగి రావడం రొటీన్‌గా మారిపోయింది. గత రెండేళ్ల ప్రదర్శనను బట్టి చూస్తే ఎంతో కొంత ఆశలు రేపిన ఇద్దరు అథ్లెట్లు గాయాలతో ఈ పోటీలకు దూరం కావడంతో ఆమాత్రం అవకాశం కూడా లేకుండా పోయింది. జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, స్ప్రింటర్ హిమ దాస్ ఈచాంపియన్‌షిప్‌లో పాల్గొనడం లేదు. 2017లో జరిగిన గత పోటీల్లో ఒకే ఒక్కడు దవీందర్ సింగ్ (జావెలిన్) మాత్రమే ఫైనల్‌కు చేరగలిగాడు. మిగతావారంతా క్వాలిఫయింగ్/ హీట్స్‌తోనే సరిపెట్టారు. తొలిసారి ప్రవేశపెట్టిన మిక్స్డ్ 4్ఠ400 రిలేలో మనవాళ్లు ఫైనల్ చేరగలరని భారత అథ్లెటిక్స్ సమాఖ్య ఆశిస్తోంది. వ్యక్తిగత ఈవెంట్లో లాంగ్‌జంప్‌లో శ్రీశంకర్‌పై అంచనాలు ఉన్నాయి. ఫైనల్ చేరేందుకు కనీస ప్రదర్శన 8.15 మీటర్లు కాగా... శ్రీశంకర్ తన కెరీర్లో ఒకేసారి 8.15 మీటర్లకంటే ఎక్కువ దూరం దూకాడు. -
గుండెల్లో 'బోల్ట్' దిగింది!
►ట్రాక్‌పై బోల్ట్ విలవిల ►గాయంతో ఆగిన పరుగు ►పతకం లేకుండానే కెరీర్‌కు వీడ్కోలు జీవితంలో రెండు ఘటనలు ఎప్పుడూ జరగవని నమ్మాను... ఒకటి బోల్ట్ ఓడిపోవడం, రెండు బోల్ట్ పరుగు పూర్తి చేయలేకపోవడం... కానీ వారం వ్యవధిలో ఈ రెండింటినీ చూసేశాను... ఒక అభిమాని బాధ ఇది. నంబర్‌వన్‌గా నిలవకుండా మూడో స్థానంలో వచ్చిన రోజే ఆ పరుగు తడబడుతోందని అర్థమైంది. కానీ ఘనమైన ముగింపు ఇచ్చేందుకు మరో అవకాశం ఉందని ప్రపంచం సర్ది చెప్పుకుంది. కానీ ఆ వేదన ఇప్పుడు రెట్టింపయింది. బంగారు పతకాన్ని అందుకోవటాన్ని మార్నింగ్ వాక్కు వెళ్లినంత సులువుగా మార్చుకున్న ఆ పాదాలు... చివరకు దారి మధ్యలోనే ఆగిపోయాయి. మరో పది అంగల్లో ఎదురుగా లక్ష్యం కనిపిస్తున్నా ఇక నా వల్ల కాదంటూ, అడుగు పడలేదంటూ మొరాయించాయి. అవును...ఉసేన్ బోల్ట్ పరుగు పరాజయంతో ముగిసిపోయింది. ఇక ఈ ‘బ్యాటన్’ను ముందుకు తీసుకువెళ్లలేను అన్నట్లుగా కుప్పకూలిపోయి అతను పరుగు చాలించాడు. ట్రాక్‌కు కళ్లు లేవు... లేదంటే కన్నీరు కార్చేది. పతకానికి నోరు లేదు... ఉంటే గోడు వెళ్లబోసుకునేది. బ్యాటన్‌కు హృదయం లేదు... ఉంటే ద్రవించేది. నిజమే! వాటికి ఇవేవీ లేవు కాబట్టే... బోల్ట్ కథని ఇలా ముగించాయి. పరుగే ప్రాణంగా... పతకమే శ్వాసగా... విజయమే లక్ష్యంగా... ఇన్నాళ్లు సాగిన పయనం చివరకు విషాద గాయంతో ముగిసింది. బోల్ట్ అంటే చిరుత. బోల్ట్ అంటే విజేత. అతని అడుగుల వేగానికి మురిసిపోయిన అథ్లెటిక్స్ ట్రాక్‌లు కూడా ఇకపై వెక్కివెక్కి ఏడుస్తాయేమో! కానీ నిజం. ఈ వీడ్కోలు బాధించింది. 4గీ100 మీటర్ల రిలేలో విజయం చేరువైనంతలోపే దూరమైంది. పది సెకన్ల కాలం తీరని వేదనను మిగిల్చింది. పాదాల తాకిడినే మధుర స్పర్శగా భావించే ట్రాక్‌కు గుండె పగిలినంత పనైంది. బరిలోకి దిగితే పతకాల పనిపట్టే ఓ యోధుడి చివరి మజిలీ ఇలా అర్ధంతరంగా ముగిసింది. లక్ష్యం చేరే చివరి అంచెలో రాకాసి గాయం బోల్ట్‌కు అనుకోని విషాదాన్ని మిగిల్చింది. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌కే ఊహించని మలుపునిచ్చింది. లండన్: ఒక్క ఉసేన్ బోల్ట్నో... కోట్లాది మంది అభిమానుల్నో... ఆతిథ్య వేదికనో కాదు... యావత్ అథ్లెటిక్స్ ప్రపంచాన్నే నిరాశకు గురి చేసిన దృశ్యం ఆవిష్కృతమైంది. బోల్ట్ చివరి పరుగు అనూహ్యంగా ముగిసింది. కళ్లకు అందని విషాదాన్ని మిగిల్చింది. తొడ కండరాల గాయంతో జమైకన్ స్టార్ ట్రాక్‌పైనే కూలబడ్డాడు. మెరుపు టైమింగ్‌లతో రికార్డులు బద్దలు కొట్టిన అతని పరుగు అసలు లక్ష్యాన్నే పూర్తిచేయకపోవడం కెరీర్లో ఇదే తొలిసారి. చివరిసారి కూడా! క్రీడాలోకమే మూగబోయే రేస్ శనివారం అర్ధరాత్రి జరిగింది. పురుషుల 4గీ100 మీటర్ల రిలేలో బోల్ట్ పూర్తిగా విఫలమయ్యాడు. ఎప్పట్లాగే నాలుగో రేసర్‌గా బోల్ట్ చివరి అంచెలో ట్రాక్‌పై సిద్ధంగా ఉన్నాడు. సహచరుడు యోహన్ బ్లేక్ నుంచి బ్యాటన్‌ను అందుకున్న బోల్ట్ రివ్వున దూసుకెళ్తున్నాడు. అతని కంటే ముందు ఇద్దరే ఉన్నారు. ఇంకో ఏడెనిమిది సెకన్లలో స్వర్ణం, లేదంటే రజతంతో ముగించే రేసును ఎడమ తొడ కండరాల గాయం మింగేసింది. అంతే బోల్ట్ విలవిలలాడాడు. జమైకన్ ప్రజలు, అభిమానుల ‘బోల్ట్... బోల్ట్...’ కేకలు ఒక్కసారిగా నిశబ్దాన్ని ఆవహించాయి. రేసు ముగియకుండానే కెరీర్ ముగిసింది. అయ్యో... బోల్ట్‌కు ఏమిటీ విషమ పరీక్ష అంటూ క్రీడాలోకమే నివ్వెరపోయింది. నిజానికి ఈ ప్రపంచ చాంపియన్‌షిప్‌కు బోల్టే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలకాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన బోల్ట్‌పైనే అందరి కళ్లున్నాయి. కానీ ఆ కళ్లే అతని ట్రాక్ విలాపాన్ని చూశాయి. సరిగ్గా ఐదేళ్ల క్రితం (2012)... ఇదే ఒలింపిక్ స్టేడియంలో బోల్ట్ తన బీజింగ్ (2008) విశ్వరూపాన్ని మరోమారు కళ్లకు కట్టాడు. ట్రిపుల్ గోల్డ్ చాంపియన్‌షిప్‌ను నిలబెట్టుకొని ప్రపంచంలోనే చురుకైన దిగ్గజంగా ఘనతకెక్కాడు. ఇప్పుడు మాత్రం కెరీర్‌ను వీడాల్సిన సమయంలో పతకాన్ని జారవిడుచుకోవాల్సి వస్తుందని ఏ ఒక్కరు కూడా ఊహించి ఉండరు. కానీ ఊహకందనిదే జరిగింది. బోల్ట్ పరుగు పూర్తిచేయకుండానే... టైమింగ్ నమోదు కాకుండానే రేసు ఓటమితో ముగిసింది. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 2 గంటల 40 నిమిషాలకు జరిగిన ఈ రిలే రేసులో చిజిండు ఉజా, అడమ్ జెమిలి, డానియెల్ టాల్బోట్, నెథనీల్ మిచెల్ బ్లేక్‌లతో కూడిన బ్రిటన్ (37.47 సెకన్లు) జట్టు బంగారు పతకం గెలుపొందింది. రోడ్జర్స్, గాట్లిన్, బాకన్, కోల్మన్లతో కూడిన అమెరికా (37.52 సెకన్లు) జట్టు రజతం, జపాన్ (38.04 సెకన్లు) బృందం కాంస్యం చేజిక్కించుకున్నాయి. కూలబడిన బోల్ట్‌ను సహచరులు మెక్లీడ్, జులియన్ ఫోర్ట్, బ్లేక్‌లు ఊరడించారు. ట్రాక్‌పై అతని వెన్నంటే నడిచి రేస్‌ను తోడుగా ముగించి వీడ్కోలు పలికించారు. ఫలితాల జాబితాలో డీఎన్‌ఎఫ్... రికార్డు టైమింగ్‌లతో లేదంటే విజయ బావుటాతో ఫలితం జాబితా (రిజల్ట్ షీట్)లో అగ్రస్థానంలో ఉండే బోల్ట్ బృందం తొలిసారి డీఎన్‌ఎఫ్ (డిడ్ నాట్ ఫినిష్–రేసును ముగించలేదు)తో కనబడింది. అన్నీ స్వర్ణాలే... ఇక్కడికి రాకముందు బోల్ట్ ఒలింపిక్స్‌లో 8 స్వర్ణాలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 11 పసిడి పతకాలు గెలిచాడు. ఈ సారి కాంస్యం (100 మీ.) అంతకుముందు ఒసాకా ప్రపంచ చాంపియన్‌షిప్ (2007)లో రజతాలు (200 మీ., 4గీ100 మీ. రిలే) గెలిచాడు. మొత్తం మీద 22 పతకాల్లో 19 బంగారు పతకాలున్నాయి. ఆ పోజు ఇక చరిత్రే... పరుగుల చిరుతగా చరిత్రకెక్కిన బోల్ట్ రేసును విజయనాదంతో ముగించగానే ‘లైట్నింగ్ బోల్ట్’గా రెండు చేతుల్ని ఆకాశానికెత్తి చూపించే ‘టు ద వరల్డ్’ పోజు ఇక చరిత్రలో కలిసిపోయింది. మైదానంలో, టీవీల్లో ఇక ప్రత్యక్షంగా కనిపించదు. ‘బోల్ట్ గాయం నన్ను బాధపెట్టింది. నేను అర్థం చేసుకోగలను. టీవీల కోసం, ఇతరత్రా హైలైట్ల కోసం మమ్మల్ని నిరీక్షించేలా చేశారు. కానీ ట్రాక్ సూట్లను విడిచి రేస్‌కు సిద్ధం కావడంతో చలి కాస్త ఇబ్బంది పెట్టింది. అలా చాలాసేపు ఉండటం ఫలితాన్ని ప్రభావితం చేసింది.’ – గాట్లిన్, రజతం నెగ్గిన అమెరికా రిలే జట్టు సభ్యుడు నిర్వాహకులు మమ్మల్ని అదే పనిగా నిరీక్షణలో ఉంచారు. ఇది చాలా దుర్మార్గం. వార్మప్‌లో సుదీర్ఘ నిరీక్షణ వల్లే బోల్ట్ గాయపడ్డాడు. ఎవరైనా పోటీకి సిద్ధమై ఉండి... 20 నిమిషాల వెయిటింగ్లో ఉంచుతారా? దీని వల్లే ఆ దిగ్గజం (బోల్ట్) సతమతమయ్యాడు. పతకం గెలవకపోవడంతో బోల్ట్ సారీ చెప్పాడు. కానీ అతను సారీ చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్లో అతనెంతో సాధించాడు. – జమైకన్ అథ్లెట్ యోహన్ బ్లేక్ -
లాస్ట్ రేస్: కుప్పకూలిన ఉసేన్ బోల్ట్
లండన్: తన అంతర్జాతీయ కెరీర్‌ను పసిడి పతకంతో ముగించాలని ఆశించిన జమైకా దిగ్గజ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ తన అభిమానులను నిరాశపరిచాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఇటీవల జరిగిన 100 మీటర్ల రేసులో మూడో స్థానంలో నిలిచి కాంస్యంతో సంతృప్తి చెందిన బోల్ట్.. శనివారం రాత్రి జరిగిన 4X100 మీటర్ల రిలే ఫైనల్లో గాయం కారణంగా మధ్యలోనే వైదొలిగాడు. బోల్ట్ బ్యాటన్ అందుకునే సరికే అతడు నేతృత్వం వహిస్తోన్న జమైకా జట్టు మూడోస్థానంలో ఉంది. కొద్ది దూరం పరుగెత్తిన వెంటనే తొడ కండరాలు పట్టేయడం, మోకాలినొప్పితో ట్రాక్‌పై కుప్పకూలిపోయాడు బోల్ట్. దీంతో స్వర్ణంతో కాదు కదా పతకం లేకుండానే అంతర్జాతీయ కెరీర్‌ను బోల్ట్ ముగించినట్లయింది. 4X100 మీటర్ల రిలేలో వరుసగా ఐదో పతకాన్ని అందించేందుకు బోల్ట్ విశ్వ ప్రయత్నాలు చేసినా చివరి మెట్టుపై గాయం కారణంగా సాధించలేకపోయాడు. టికెండో ట్రేసీ, జూలియన్ ఫోర్టీ, మైకేల్ క్యాంప్‌బెల్, ఉసేన్ బోల్ట్‌లతో కూడిన జమైకా బృందం పతకాన్ని చేజార్చుకుంది. ట్రాక్‌పై కుప్పకూలి, బాధతో విలవిల్లాడుతున్న ఉసేన్ బోల్ట్ బ్రిటన్‌కు స్వర్ణం చిజిండు ఉజా, ఆడం గెమిలి, డానీ టాల్బాట్, నెథానీల్ మిచెల్ బ్లేక్ తో కూడిన బ్రిటన్ బృందం 37.47 సెకన్లలో రేసు పూర్తి చేసి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. జస్టిస్ గాట్లిన్ నేతృత్వంలోని అమెరికా అథ్లెట్లు 37.52 సెకన్లలో రేసు పూర్తి చేసి రజతం సాధించగా, జపాన్ బృందం 38.04 సెకన్లలో రేసు పూర్తి చేసి కాంస్యం సొంతం చేసుకుంది. -
రిలే ‘పసిడి’ రేసులో బోల్ట్
4X100 మీటర్ల రిలే ఫైనల్లో జమైకా బృందం లండన్: తన అంతర్జాతీయ కెరీర్‌ను పసిడి పతకంతో ముగించాలని ఆశిస్తున్న జమైకా దిగ్గజ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ ఆ దిశగా చివరి అడుగు వేశాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా పురుషుల 4గీ100 మీటర్ల రిలే ఈవెంట్లో టికెండో ట్రేసీ, జూలియన్ ఫోర్టీ, మైకేల్ క్యాంప్‌బెల్, ఉసేన్ బోల్ట్‌లతో కూడిన జమైకా బృందం ఫైనల్‌కు చేరింది. శనివారం జరిగిన హీట్స్‌లో... రెండో హీట్‌లో బరిలోకి దిగిన జమైకా జట్టు 37.95 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానం పొంది ఫైనల్ బెర్త్ దక్కించుకుంది. ఈ హీట్ నుంచి ఫ్రాన్స్, చైనా, కెనడా జట్లు కూడా ఫైనల్‌కు చేరాయి. అంతకుముందు తొలి హీట్‌లో మైక్ రోడ్జర్స్, జస్టిన్ గాట్లిన్, బీజే లీ, క్రిస్టియన్ కోల్మన్లతో కూడిన అమెరికా జట్టు 37.70 సెకన్లలో రేసును ముగించి ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ హీట్ నుంచి బ్రిటన్, జపాన్, టర్కీ రిలే జట్లు కూడా ఫైనల్లోకి అడుగు పెట్టాయి. మహిళల రిలే జట్టుపై అనర్హత వేటు... మరోవైపు 4గీ400 మీటర్ల రిలేలో భారత పురుషుల, మహిళల జట్లు నిరాశాజనక ప్రదర్శనతో హీట్స్‌లోనే వెనుదిరిగాయి. జిస్నా మాథ్యూ, పూవమ్మ, అనిల్డా థామస్, నిర్మలా షెరోన్లతో కూడిన భారత మహిళల రిలే జట్టు 3 నిమిషాల 28.62 సెకన్లలో రేసును ముగించి తమ హీట్స్‌లో ఏడో స్థానంలో నిలిచింది. అయితే తొలి ల్యాప్‌లో జిస్నా 250 మీటర్ల దూరం తర్వాత నిబంధనలకు విరుద్ధంగా వేరే లైన్లో పరుగెత్తినట్లు తేలడంతో నిర్వాహకులు భారత రిలే జట్టు ఫలితాన్ని రద్దు చేయడంతోపాటు అనర్హత వేటు వేశారు. కున్హు మొహమ్మద్, అమోజ్ జాకబ్, మొహమ్మద్ అనస్, రాజీవ్ అరోకియాలతో కూడిన భారత పురుషుల రిలే జట్టు 3 నిమిషాల 2.80 సెకన్లలో గమ్యానికి చేరి తమ హీట్స్‌లో ఐదో స్థానంలో, ఓవరాల్‌గా పదో స్థానంలో నిలిచింది. -
దవీందర్ ధమాకా
♦ జావెలిన్ త్రోలో ఫైనల్లోకి ♦ నీరజ్ చోప్రాకు నిరాశ ♦ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ లండన్: ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన జావెలిన్ త్రోయర్ దవీందర్ సింగ్ కాంగ్ అద్భుతం చేశాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ జావెలిన్ త్రో విభాగంలో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫయింగ్‌లో దవీందర్ సింగ్ ఈటెను 84.22 మీటర్ల దూరం విసిరి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 83 మీటర్ల దూరం విసిరిన వారందరికీ ఫైనల్‌కు చేరుకునే అర్హత ఉండగా... మొత్తం 32 మందిలో 13 మంది ఈ మార్క్‌ను అధిగమించారు. ఫైనల్ నేడు (శనివారం) జరుగుతుంది. భారత్‌కే చెందిన అండర్–20 వరల్డ్ చాంపియన్ నీరజ్ చోప్రా మాత్రం నిరాశపరిచాడు. ఈటెను 82.26 మీ. దూరం విసిరి 15వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. గత జూన్‌లో దవీందర్‌కు నిర్వహించిన డోపింగ్ పరీక్షలో అతను గంజాయి సేవించినట్లు తేలింది. అయితే ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధిత ఉత్ప్రేరకాల జాబితాలో గంజాయి లేకపోవడంతో దవీందర్‌పై సస్పెన్షన్ వేటు పడలేదు. దాంతో అతను ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు. -
‘లక్ష్మణ’ రేఖ దాటలేకపోయాడు
హీట్స్‌లోనే వెనుదిరిగిన గోవిందన్ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ లండన్: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఖాతాలో మరో నిరాశాజనక ఫలితం చేరింది. లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గోవిందన్ లక్ష్మణన్ తన అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినా...అది ఫైనల్‌కు అర్హత సాధించేందుకు సరిపోలేదు. పురుషుల 5000 మీటర్ల పరుగులో లక్ష్మణన్ తొలి రౌండ్ హీట్స్‌లో 15వ స్థానంలో సరిపెట్టుకున్నాడు. 27 ఏళ్ల లక్ష్మణన్ ఈ పోటీని 13 నిమిషాల 35.69 సెకన్లలో ముగించాడు. గతంలో అతని అత్యుత్తమ టైమింగ్ 13 నిమిషాల 36.62 సెకన్లు కాగా... ఇప్పుడు దానిని సవరించడంలో మాత్రం అతను సఫలమయ్యాడు. ఓవరాల్‌గా అతను 31వ స్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు చాంపియన్‌షిప్‌లో పోటీ పడిన భారత అథ్లెట్లలో లక్ష్మణన్ ఒక్కడే తన అత్యుత్తమ టైమింగ్కంటే మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు. భారీ వర్షం అనంతరం ఉష్ణోగ్రత 15 డిగ్రీలకు పడిపోయిన స్థితిలో అతను పూర్తిగా వెనుకంజ వేశాడు. ‘ఇది నా తొలి ప్రపంచ చాంపియన్‌షిప్. కనీసం మన జాతీయ రికార్డు బద్దలు కొడదామని ఇక్కడికి వచ్చాను కానీ అది సాధ్యం కాలేదు. అయితే వ్యక్తిగతంగా ఉత్తమ ప్రదర్శన ఇవ్వడం సంతృప్తినిచ్చింది. ఇక దిగ్గజ అథ్లెట్ మో ఫరాతో కలిసి ఈ రేసులో పరుగెత్తాను. ఆ రూపంలో నా కల నిజమైంది. మాకు అతనే స్ఫూర్తి. ఫరా ఆఖరి రేసులో నేను పక్కన ఉండటం జీవితకాలం గుర్తుండిపోయే అనుభూతి’ అని లక్ష్మణన్ వ్యాఖ్యానించాడు. శనివారం జరిగే ఫైనల్‌కు అర్హత సాధించిన మో ఫరా ఆ రేసుతో కెరీర్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. ఒకే ఒక్కడు... అథ్లెటిక్ ట్రాక్ అంతా తానే అయి పరుగెత్తుతున్న ఇతడిని చూశారా... ఇతను బోట్స్వానాకు చెందిన ఐసాక్ మక్వానా. 200 మీటర్ల పరుగులో ఫేవరెట్. అయితే కలుషిత ఆహారం తీసుకొని అనారోగ్యం బారిన పడటంతో అతను హీట్స్‌లో పాల్గొనలేకపోయాడు. అయితే ఐఏఏఎఫ్ అతనిపై కరుణ ప్రదర్శించింది. గతంలో ఎన్నడూ జరగని రీతిలో ప్రత్యేక అనుమతి ఇచ్చి మళ్లీ పరుగెత్తే అవకాశం కల్పించింది. దాంతో మక్వానా ట్రాక్‌పైకి దిగాడు. 20.54 సెక న్లలో లక్ష్యాన్ని చేరి ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. తన పతకం ఆశలను నిలబెట్టుకోగలిగాడు. ఫెలిక్స్‌కు 14వ పతకం... అమెరికా స్టార్ అథ్లెట్ అలీసన్ ఫెలిక్స్ ఖాతాలో మరో పతకం చేరింది. మహిళల 400 మీటర్ల పరుగులో ఆమె కాంస్యం (50.08 సెకన్లు) సాధించింది. ఫెలిక్స్ కెరీర్లో ఇది 14వ ప్రపంచ చాంపియన్‌షిప్ పతకం కావడం విశేషం. ఫలితంగా జమైకా దిగ్గజాలు ఉసేన్ బోల్ట్, మెర్లీన్ ఒటీ (14)లతో ఆమె సమంగా నిలిచింది. ఈ ఈవెంట్లో ఫైలిస్ ఫ్రాన్సిస్ (యూఎస్–49.92సె.), సల్వా నసీర్ (బహ్రెయిన్–50.06సె.) వరుసగా పసిడి, రజత పతకాలు గెలుచుకున్నారు. ఓవరాల్‌గా ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో 9 స్వర్ణాలు నెగ్గిన ఫెలిక్స్... ఒలింపిక్స్‌లో కూడా మరో 6 స్వర్ణాలు సాధించింది. -
వెనిజులా పసిడి బోణీ
ట్రిపుల్ జంప్‌లో రోజస్‌కు స్వర్ణం లండన్: మూడున్నర దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ... ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తొలిసారి వెనిజులా ఖాతాలో స్వర్ణ పతకం చేరింది. మహిళల ట్రిపుల్ జంప్ ఈవెంట్లో వెనిజులా క్రీడాకారిణి యులీమార్ రోజస్ పసిడి పతకాన్ని దక్కించుకొని కొత్త చరిత్ర సృష్టించింది. రోజస్ 14.91 మీటర్ల దూరం దూకి విజేతగా నిలిచింది. కాటరీన్ ఇబార్‌గుయెన్ (కొలంబియా–14.89 మీటర్లు) రజతం, ఓల్గా రిపకోవా (కజకిస్తాన్–14.77 మీటర్లు) కాంస్యం గెల్చుకున్నారు. అమెరికాకు షాక్...: పురుషుల 110 మీటర్ల హర్డిల్స్‌లో ఒమర్ మెక్లాయిడ్ 13.04 సెకన్లలో రేసును పూర్తి చేసి ఈ మెగా ఈవెంట్లో జమైకాకు తొలి స్వర్ణం అందించగా... ప్రతీ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఈ విభాగంలో కనీసం కాంస్యమైనా గెలుస్తూ వచ్చిన అమెరికాకు ఈసారి ఎలాంటి పతకం రాకపోవడం గమనార్హం. మహిళల 1500 మీటర్ల విభాగంలో ఫెయిత్ కిపియోగాన్ (కెన్యా–4ని:02.59 సెకన్లు) స్వర్ణం సాధించింది. జెన్నిఫర్ సింప్సన్ (అమెరికా), కాస్టర్ సెమెన్యా (దక్షిణాఫ్రికా) కాంస్యం నెగ్గింది. మహిళల హ్యామర్ త్రో విభాగంలో అనీటా వ్లోదార్‌జిక్ (పోలాండ్–77.90 మీటర్లు) పసిడి పతకం కైవసం చేసుకుంది. మహిళల 400 మీటర్ల సెమీఫైనల్లో భారత క్రీడాకారిణి నిర్మలా షెరోన్ 53.07 సెకన్లలో గమ్యానికి చేరి ఏడో స్థానంతో సరిపెట్టుకొని ఫైనల్‌కు చేరలేకపోయింది. అథ్లెట్స్‌కు అస్వస్థత: కలుషిత ఆహారం కారణంగా పురుషుల 400 మీటర్ల ఫైనల్లో బరిలోకి దిగాల్సిన బోట్స్వానా స్టార్ అథ్లెట్ ఐజాక్ మక్వాలా వైదొలిగాడు. మక్‌వాలాతోపాటు మరో 30 మంది అథ్లెట్లు తాము బసచేసిన హోటల్లో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు లోనయ్యారని నిర్వాహకులు తెలిపారు. -
సెమీఫైనల్స్‌కు నిర్మల అర్హత
లండన్: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మహిళల 400 మీటర్ల విభాగంలో భారత అథ్లెట్ నిర్మలా షెరోన్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఆదివారం జరిగిన 400 మీటర్ల హీట్స్‌లో 22 ఏళ్ల నిర్మల 52.01 సెకన్లలో గమ్యానికి చేరి నాలుగో స్థానంలో నిలిచింది. సోమవారం మూడు సెమీఫైనల్స్ జరుగుతాయి. పురుషుల మారథాన్ రేసులో టి. గోపీ 28వ స్థానంలో నిలువగా... 110 మీటర్ల హర్డిల్స్‌లో సిద్ధాంత్ హర్డిల్స్లోనే నిష్క్రమించాడు. -
బోల్ట్... తడబడి ఫైనల్‌కు
100 మీటర్ల సెమీస్‌లో జమైకా స్టార్‌కు రెండో స్థానం ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ లండన్: తన అంతర్జాతీయ కెరీర్‌ను ఘనంగా ముగించాలనే లక్ష్యంతో లండన్‌కు వచ్చిన ఉసేన్ బోల్ట్ ఆ దిశగా ఆఖరి అడుగు వేశాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా పురుషుల 100 మీటర్ల విభాగంలో ఈ జమైకా చిరుత ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం రాత్రి జరిగిన మూడో సెమీఫైనల్లో బోల్ట్ 9.98 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచి ఫైనల్లోకి ప్రవేశించాడు. ఈ రేసులో బోల్ట్‌ను వెనక్కి నెట్టి క్రిస్టియన్ కోల్మన్ (అమెరికా–9.97 సెకన్లు) అగ్రస్థానాన్ని సంపాదించడం విశేషం. తొలి సెమీఫైనల్ ద్వారా అకాని సింబిని (దక్షిణాఫ్రికా–10.05 సెకన్లు), జస్టిన్ గాట్లిన్ (అమెరికా–10.09 సెకన్లు)... రెండో సెమీఫైనల్ ద్వారా యోహాన్ బ్లేక్ (జమైకా–10.04 సెకన్లు), రెసి ప్రెస్కోడ్ (బ్రిటన్–10.05 సెకన్లు) ఫైనల్‌కు అర్హత పొందారు. ఈ ఆరుగురు కాకుండా అత్యుత్తమ సమయాలను నమోదు చేసిన మరో ఇద్దరు జిమ్మీ వికాట్ (ఫ్రాన్స్–10.09 సెకన్లు), బింగ్తియాన్ సు (చైనా– 10.10 సెకన్లు) కూడా ఫైనల్ బెర్త్‌లు పొందారు. హీట్స్‌లోనే ద్యుతీ చంద్, అనస్ అవుట్ మరోవైపు ఈ మెగా ఈవెంట్లో భారత క్రీడాకారులకు నిరాశ ఎదురైంది. మహిళల 100 మీటర్ల విభాగంలో ద్యుతీ చంద్... పురుషుల 400 మీటర్ల విభాగంలో అనస్ హీట్స్‌లోనే వెనుదిరిగారు. ఔరా... ఫరా! సొంతగడ్డపై బ్రిటిష్ అథ్లెటిక్స్ దిగ్గజం మొహమ్మద్ ఫరా మరోసారి మెరిశాడు. పురుషుల 10 వేల మీటర్ల ఫైనల్ రేసులో 34 ఏళ్ల ఫరా 26 నిమిషాల 49.51 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచాడు. ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో 10 వేల మీటర్ల విభాగంలో ఫరాకిది వరుసగా మూడో స్వర్ణం కావడం విశేషం. కిప్రుయ్ చెప్టెగి (ఉగాండా; 26ని:49.94 సెకన్లు) రజతం, పాల్ తనుయ్ (కెన్యా; 26ని:50.60 సెకన్లు) కాంస్యం సాధించారు. -
భారత్ ఆశాకిరణం నీరజ్
నేటి నుంచి ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ లండన్: అంతర్జాతీయస్థాయిలో మరో క్రీడా పండగకు రంగం సిద్ధమైంది. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు నేడు ప్రారంభం కానున్నాయి. ఈనెల 13 వరకు జరిగే ఈ పోటీలకు ఒలింపిక్ స్టేడియం వేదికగా నిలువనుంది. భారత్ తరఫున 25 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 34 ఏళ్ల ఈ పోటీల చరిత్రలో భారత్‌కు ఒక్కటంటే ఒక్కటే పతకం వచ్చింది. అదీ కాంస్యమే. 2003 పారిస్ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మహిళల లాంగ్‌జంప్ విభాగంలో అంజూ బాబీ జార్జ్ మూడో స్థానంలో నిలిచి భారత్‌కు ఏకైక కాంస్య పతకాన్ని అందించింది. ఆ తర్వాత పలుమార్లు భారత అథ్లెట్లు రిక్తహస్తాలతో తిరిగొచ్చారు. పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో నీరజ్ చోప్రాపై భారత్‌కు ఆశలున్నాయి. గతేడాది ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నీరజ్ 86.48 మీటర్లతో ఈ విభాగంలో ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు స్వర్ణ పతకాన్ని గెలిచాడు. ఇటీవలే భువనేశ్వర్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ నీరజ్ పసిడి పతకాన్ని సాధించాడు. దాంతో నీరజ్ చోప్రాపై అంచనాలు పెరిగాయి. పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో ఆగస్టు 10న క్వాలిఫయింగ్... 12న ఫైనల్ జరుగుతాయి. మొత్తం 33 మంది బరిలో ఉండగా... 12 మంది ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ప్రపంచం దృష్టి బోల్ట్‌పైనే.. లండన్‌లోని ఒలింపిక్ స్టేడియంలో శుక్రవారం మొదలయ్యే ఈ పోటీల్లోనే బోల్ట్ తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలకనున్నాడు. ఈసారి బోల్ట్ రెండు ఈవెంట్స్‌లలో (100 మీటర్లు, 4్ఠ100 మీటర్ల రిలే) బరిలోకి దిగనున్నాడు. ఆగస్టు 5న 100 మీటర్ల ఫైనల్... ఆగస్టు 12న 4్ఠ100 మీటర్ల రిలే ఫైనల్ జరగనున్నాయి. రెండింటిలోనూ స్వర్ణ పతకాలు సాధించి కెరీర్‌కు అద్భుతమైన ముగింపు ఇవ్వాలని బోల్ట్ పట్టుదలతో ఉన్నాడు. -
ఆఖరి పరుగుకు ప్రత్యేక బూట్లు
‘లండన్’ రేస్‌కు బోల్ట్ రెడీ లండన్: జమైకన్ దిగ్గజ అథ్లెట్ ఉసేన్ బోల్ట్. ట్రాక్‌లో అతని వేగం అందుకోలేరెవరు. ఈ మల్టీ ఒలింపిక్ చాంపియన్ పతకం రేసు ఇప్పుడు ఆఖరి మజిలీకి చేరుకుంది. లండన్‌లో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ తర్వాత ఆ పరుగు ఇక చరిత్రే. ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన ఈ సంచలన స్ప్రింటర్ ఆఖరి రేసుకు ప్రత్యేక బూట్లు సిద్ధమయ్యాయి. ప్రఖ్యాత షూ కంపెనీ ‘ప్యుమా’ బోల్ట్ వేగాన్ని, తేజాన్ని ఆవిష్కరించే విధంగా ఈ బూట్లను తయారు చేసింది. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బోల్ట్ తల్లిదండ్రులు వెలెస్లీ, జెన్నిఫర్ బోల్ట్ అతనికి అందజేశారు. ఈ రెండు బూట్లు విభిన్న రంగుల్లో ఉన్నాయి. ఒక బూటు పర్పుల్ కలర్లో ఉంది. ఇది బోల్ట్ ఓనమాలు నేర్చుకున్న ‘విలియం నిబ్ హైస్కూల్’కు సంబంధించిన కలర్ కాగా... దీనిపై ఫరెవర్ (ఎప్పటికీ) అని రాసివుంది. మరో బూటుపై ఫాస్టెస్ట్ (వేగం) అని ఒమెగా సింబల్‌తో ఉంది. ఇది ముగింపునకు నిదర్శనమని ‘ప్యుమా’ సంస్థ తెలిపింది. ఈ రెండు షూలపై ప్రత్యేక రాతలు, గీతలు అతని కెరీర్ హైలైట్స్‌ను సూచిస్తాయి. రెండు సాక్స్ అతని ఘనతల్ని తెలిపేలా ప్రత్యేకంగా ఉన్నాయి. శనివారం రాత్రి ఈ బూట్లతోనే బోల్ట్ ఆఖరి పరుగు పెడతాడు. ఆల్ ది బెస్ట్... లెజెండ్! -
సుధా సింగ్ పేరు ఉన్నట్టా.. లేనట్టా?
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనడంపై సందేహాలు న్యూఢిల్లీ : ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత క్రీడాకారుల ఎంపికపై రోజుకో వివాదం చెలరేగుతోంది. పీయూ చిత్ర వ్యవహారం ముగిసిందనుకోగానే... తాజాగా 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ అథ్లెట్ సుధా సింగ్ వార్తల్లో నిలిచింది. ఇటీవల భువనేశ్వర్‌లో ముగిసిన ఆసి యా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో సుధా స్వర్ణం సాధిం చింది. అయితే ప్రపంచ పోటీల కోసం భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) ఎంపిక చేసిన 24 మందిలో ఆమె పేరును పరిగణలోకి తీసుకోలేదు. అయితే ఆశ్చర్యకరంగా శనివారం రాత్రి అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) విడుదల చేసిన భారత అథ్లెట్ల జాబితాలో మాత్రం సుధా పేరు కూడా ఉంది. ‘ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల ఎంట్రీ జాబితాలో నేను కూడా ఉన్నట్టు తెలిసింది. అయితే నిజంగా నేను జట్టులో ఉన్నానా? లేదా? అనే విషయంలో ఏఎఫ్ఐ నుంచి ఎటువంటి సమాచారం లేదు. కానీ ఏ క్షణమైనా లండన్ వెళ్లేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఈనెల 23న ఏఎఫ్ఐ పంపిన జాబితాలోనైతే నా పేరు లేదు. ఆ తర్వాత జత పరిచారేమో. అందుకే నేను న్యాయపోరాటానికి వెళ్లదలుచుకోలేదు’ అని సుధా సింగ్ తెలిపింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 31 ఏళ్ల సుధా సింగ్ 2010 ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించి వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత లండన్, రియో ఒలింపిక్స్‌లోనూ బరిలోకి దిగింది. 2013 (మాస్కో), 2015 (బీజింగ్) ప్రపంచ చాంపియన్‌షిప్‌లలోనూ పాల్గొన్న ఆమె వరుసగా 23వ, 19వ స్థానాల్లో నిలిచింది. ఇంతకుముందు ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 1500 మీటర్ల రేసులో స్వర్ణం నెగ్గిన పీయూ చిత్ర పేరును కూడా ఏఎఫ్ఐ ఎంపిక చేయకపోవడంతో ఆమె కేరళ హైకోర్టులో రిట్ పిటిషన్ ధాఖలు చేసింది. దీంతో కోర్టు ఆమెను ఎంపిక చేయాలని ఆదేశించింది. ఐఏఏఎఫ్ అర్హత ప్రమాణాలను అందుకోలేకపోయినందుకే చిత్ర, సుధా సింగ్, అజయ్ కుమార్ సరోజ్ (పురుషుల 1500 మీటర్లలో స్వర్ణం) పేర్లను జాబితాలో చేర్చలేదని ఏఎఫ్ఐ గతంలోనే పేర్కొంది. ‘సుధ జట్టులో లేదు’ ఇక ఐఏఏఎఫ్ జాబితా ఎలా ఉన్నా ఏఎఫ్ఐ డి ప్యూటీ జాతీయ కోచ్ రాధాక్రిష్ణన్ నాయర్ మాత్రం సుధా జట్టులో లేదని ఖరాఖండిగా తేల్చారు. ప్రస్తుతం ఆయన అథ్లెట్లతో పాటు లండన్‌లోనే ఉన్నారు. నిజం గానే ఏఎఫ్ఐ సుధా పేరును చేర్చిందా.. లేక ఐఏఏఎఫ్ జాబితాలో ఏదైనా పొరపాటు జరిగిందా అనే విషయంలో ఎటువంటి స్పష్టత కనిపించడం లేదు. ఈ విషయంలో వివరణ ఇచ్చేందుకు ఏఎఫ్ఐ అధికారులెవరూ ముందుకు రావడం లేదు. అయితే ఆన్లైన్ ద్వారా పంపాల్సిన ఈ జాబితాలో సుధా పేరును తొలగించకుండానే ఐఏఏఎఫ్‌కు పంపి ఉండవచ్చని ఏఎఫ్ఐ వర్గాలు తెలిపాయి. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ లండన్‌లో ఆగస్టు 4 నుంచి 13 వరకు జరుగుతుంది. -
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌కు ద్యుతీచంద్
న్యూఢిల్లీ: అర్హత ప్రమాణ సమయం (11.26 సెకన్లు) అందుకోలేకపోయినా... ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు రావాలని భారత మహిళా స్ప్రింట్ అథ్లెట్ ద్యుతీచంద్‌కు ఆహ్వానం లభించింది. మహిళల 100 మీటర్ల విభాగంలో నిర్ణీత ఎంట్రీల సంఖ్య 56కు చేరుకోకపోవడంతో అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య ఈ సీజన్లో మెరుగైన ప్రదర్శన చేసిన వారిని ఆహ్వానించాలని నిర్ణయించింది. దాంతో ద్యుతీచంద్‌కు ఈ అవకాశం దక్కింది. ఈ సీజన్లో ద్యుతీచంద్ అత్యుత్తమ సమయం 11.30 సెకన్లు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ఆగస్టు 4 నుంచి 13 వరకు లండన్‌లో జరుగుతుంది. ఒడిషాకు చెందిన ద్యుతీచంద్‌కు కోచ్‌గా తెలంగాణాకు చెందిన నాగపురి రమేశ్ వ్యవహరిస్తున్నారు. -
టాప్–3 లక్ష్యంగా...
ఆసియా అథ్లెటిక్స్ బరిలోకి భారత్ భువనేశ్వర్: స్వదేశంలో సత్తా చాటుకొని... వచ్చే నెలలో లండన్‌లో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ బెర్త్ సంపాదించాలనే లక్ష్యంతో భారత అథ్లెట్స్ ఆసియా చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగనున్నారు. స్థానిక కళింగ స్టేడియంలో ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బుధవారం ఈ పోటీలను లాంఛనంగా ప్రారంభించగా... ఈవెంట్స్ గురువారం మొదలవుతాయి. ఆసియా పోటీల్లో స్వర్ణ పతకాలు గెలిచిన వారికి వచ్చే నెలలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలకు నేరుగా ఎంట్రీ లభిస్తుంది. 95 మంది సభ్యుల భారీ బృందంతో ఈ పోటీల్లో ఆడుతున్న భారత్ ఓవరాల్‌గా పతకాల పట్టికలో టాప్–3లో నిలవాలనే లక్ష్యంతో ఉంది. 44 దేశాల నుంచి 800 మందికి పైగా అథ్లెట్స్ పాల్గొంటున్న ఈ పోటీలు ఆదివారం ముగుస్తాయి. -
అప్పుడే రెండు లక్షల మంది బుక్ చేశారు!
బోల్ట్ చివరి పరుగుకు భారీ డిమాండ్ లండన్: జస్ట్ ఇప్పుడే ఒలింపిక్స్ ముగిశాయి... మూడు ఈవెంట్లలో స్వర్ణాలు గెలిచి ఉసేన్ బోల్ట్ అందరినీ మురిపించాడు. కానీ వచ్చే ఏడాది జరిగే అతని ఆఖరి పరుగు చూసేందుకు అభిమానులు అప్పుడే ఎగబడిపోతున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 4 నుంచి 13 వరకు లండన్‌లో ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ జరుగుతుంది. బోల్ట్‌తో పాటు బ్రిటన్ స్టార్ మో ఫరాకు కూడా ఇదే ఆఖరి ఈవెంట్ కావడంతో ఈ రెండు పోటీలపై ఆసక్తి మరింత పెరిగింది. బోల్ట్ 100 మీటర్ల రేస్‌లో పరుగెత్తనున్న స్టేడియం సామర్థ్యం 50 వేలు కాగా... ఇప్పటికే 2 లక్షల దరఖాస్తులు రావడం విశేషం. స్థానిక అథ్లెట్ కావడంతో ఫరా కోసం కూడా పెద్ద ఎత్తున టికెట్లు కొనేందుకు ఫ్యాన్స ఉత్సాహం చూపిస్తున్నారు. అన్ని ఈవెంట్లకు కలిపి 7 లక్షల వరకు టికెట్లు అందుబాటులో ఉంటే టికెట్లు కొనేందుకు దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య దానిని ఎప్పుడో దాటిపోయింది. మొత్తం 92 దేశాలనుంచి వరల్డ్ చాంపియన్‌షిప్ చూసేందుకు అభిమానులు టికెట్లు కోరుతుండటంతో నిర్వాహకులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. -
‘ఖేలో ఇండియా’ సభ్యులుగా గోపీచంద్, అంజూ
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పతక విజేత అంజూ బాబీ జార్జిలను ‘ఖేలో ఇండియా’లో సభ్యులుగా నియమించారు. దేశంలో క్రీడలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. కేంద్ర క్రీడాశాఖ కార్యదర్శి రాజీవ్ యాదవ్ అధ్యక్షుడిగా ఉండే ఈ కమిటీలో మొత్తం ఏడుగురు సభ్యులు ఉంటారు. గోపీ, అంజూ రూపంలో ఇద్దరు క్రీడాకారులకు చోటు లభించింది. హైదరాబాద్‌కు చెందిన గోపీచంద్ 2006 నుంచి జాతీయ కోచ్‌గా పని చేస్తున్నారు. ఆయన శిక్షణలోనే సైనా, సింధు, శ్రీకాంత్‌లాంటి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు వెలుగులోకి వచ్చారు. మరోవైపు లాంగ్ జంపర్‌గా అసాధారణ విజయాలు సాధించిన అంజూ... ఇటీవల కేరళ స్పోర్ట్స్ కౌన్సిల్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. క్రీడా మంత్రి ఈపీ జయరాజన్ అనుచిత ప్రవర్తనకు వ్యతిరేకంగా మొత్తం 13 మంది సభ్యులు తమ రాజీనామాలు సమర్పించారు. -
మనోళ్లు... ఎన్నాళ్లిలా..!
ఉసేన్ బోల్ట్ పరుగు తీస్తుంటే ఊపిరి బిగబట్టుకుని చూశాం. కెన్యా ఇథియోపియా లాంటి దేశాల అథ్లెట్లు పతకాలు కొల్లగొడుతుంటే అవాక్కయ్యాం. మరి విశ్వవేదికపై మనమెక్కడ? 130 కోట్ల జనాభాతో ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న భారతదేశం ప్రపంచ అథ్లెటిక్స్ వేదికపై పతకాలు తెచ్చే అథ్లెట్స్‌ను ఎందుకు తయారు చేయలేకపోతోంది? ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చైనాలో వైభవంగా ముగిసింది. బోల్ట్ మెరుపులతో, ఇతర అథ్లెట్ల విన్యాసాలతో ప్రపంచం ఆనందించింది. కానీ చైనా పక్కనే ఉన్న భారత దేశం మాత్రం ఎప్పటిలాగే కళ్లు కాయలు కాచేలా పతకం కోసం ఎదురుచూసి నిరాశ చెందింది. నిజానికి మన అథ్లెట్లు ప్రపంచ పోటీల్లో పతకం తెస్తారనే ఆశ లేకపోయినా... మెరుగైన ప్రదర్శన కనబరచాలని కోరుకున్నాం. కానీ ఎప్పటిలాగే నిరాశనే మిగిల్చారు. గతంతో పోలిస్తే ఇంకా దిగజారారు కూడా. మనతో పోలిస్తే చాలా చిన్న దేశాలు కూడా పతకాలు కొల్లగొట్టాయి. కెన్యా ఎంతుంటుంది..? చాలా చిన్న దేశం. కానీ అథ్లెటిక్స్‌లో మాత్రం చెలరేగుతుంది. ఈసారి ఏకంగా ఏడు స్వర్ణాలతో కలిపి మొత్తం 16 పతకాలతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. జమైకా ఏడు స్వర్ణాలతో కలిపి మొత్తం 12 పతకాలతో రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు చిన్న దేశాల ధాటికి గతంలో 10 సార్లు టాప్ ర్యాంక్‌లో నిలిచిన అమెరికా మూడో స్థానానికి పడిపోయింది. ఆసియా స్థాయిలో ఫర్వాలేదు: ఆసియా స్థాయిలో భారత అథ్లెట్లు ఎప్పుడూ ఫర్వాలేదనే ప్రదర్శన కనబరుస్తారు. గతేడాది జరిగిన ఆసియా క్రీడల్లో మనకు అన్నింటికంటే అత్యధికంగా అథ్లెటిక్స్‌లోనే 13 పతకాలు వచ్చాయి. ఇందులో రెండు స్వర్ణాలు కూడా ఉన్నాయి. మహిళల డిస్కస్ త్రోలో సీమా పూనియా, 4x400 మీటర్ల రిలేలో మహిళల జట్టు స్వర్ణ పతకాలు సాధించాయి. ఈసారి ప్రపంచ అథ్లెటిక్స్‌కు సీమా అర్హత సాధించలేదు. రిలే జట్టు కేవలం హీట్స్ దశలోనే ఎనిమిదో స్థానంలో నిలిచి నిరాశ పరిచింది. ఆసియా క్రీడల్లో రజతాలు, కాంస్యాలు సాధించిన వారెవరూ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తమ సత్తాను చాటుకోలేకపోయారు. ఎందుకిలా?: ప్రపంచ స్థాయిలో పతకాలు సాధించాలంటే మంచి మౌలిక సదుపాయాలతో పాటు నాణ్యమైన శిక్షణ ఉండాలి. అయితే ఇవి లేకుండా కూడా పతకాలు సాధించొచ్చని కెన్యా, ఇథియోపియా, ఎరిత్రియా లాంటి చిన్న దేశాల అథ్లెట్లు నిరూపించారు. మన దగ్గర క్రీడలకు చాలా దేశాలతో పోలిస్తే మంచి సదుపాయాలే ఉన్నాయి. అయితే శిక్షణ, సదుపాయాల్లో కచ్చితమైన ప్రమాణాలను పాటించడం లేదనేది కూడా అంగీకరించాల్సిన వాస్తవం. మూలాల్లోకి వెళ్లాలి: ఇంత పెద్ద దేశంలో నైపుణ్యం ఉన్న క్రీడాకారులు దొరకరు అనుకోలేం. కానీ ప్రాథమిక స్థాయిలోనే మంచి అథ్లెట్లను ఒడిసిపట్టుకునే వ్యవస్థ లేకపోవడం అసలు సమస్య. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో జరిగే పోటీలపై దృష్టి పెట్టడం, పాఠశాల క్రీడలను మెరుగుపరచడం ద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కానీ వీటిని ప్రణాళికా బద్ధంగా నిర్వహించే పరిస్థితి మన దగ్గర లేదు. కాబట్టి వ్యవస్థను అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. ముందు మూలాల్లోకి వెళ్లి చిన్న వయసులోనే అథ్లెట్లను గుర్తించాలి. ఆ దిశగా చర్యలు తీసుకోకపోతే... ప్రపంచ పతకం కోసం తర్వాతి తరాలు కూడా నిరీక్షించాల్సే ఉంటుంది. -సాక్షి క్రీడావిభాగం 2015 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ ప్రస్థానం - మొత్తం 206 దేశాలు పాల్గొన్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ మరో మూడు దేశాలతో సంయుక్తంగా 65వ స్థానంలో నిలిచింది. 33 ఏళ్ల ఈ చాంపియన్‌షిప్ చరిత్రలో 2003లో అంజూ జార్జి లాంగ్‌జంప్‌లో కాంస్యం సాధించింది. - 3000 మీటర్ల స్టీపుల్ చేజ్లో లలితా శివాజీ బాబర్ ఫైనల్లో ఎనిమిదో స్థానంలో నిలవడంతో ఒక్క పాయింట్ వచ్చింది. దీనివల్ల భారత్‌కు ప్లేసింగ్ టేబుల్లో కనీసం స్థానం దక్కింది. - మొత్తం 18 మంది అథ్లెట్లు ఈసారి పోటీల్లో పాల్గొన్నారు. ఇందులో ఆరుగురు 4x400 మీ. రిలే జట్టు సభ్యులు. నేరుగా ఫైనల్స్ జరిగే విభాగాలను మినహాయిస్తే... కేవలం మూడు విభాగాల్లోనే భారత అథ్లెట్లు ఫైనల్‌కు చేరారు. -
కెన్యా కేక
♦ ఏడు స్వర్ణాలతో తొలిసారి అగ్రస్థానం ♦ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ బీజింగ్ : ఈసారి ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పతకాల పట్టికలో ఊహించని దృశ్యం ఆవిష్కృతమైంది. 33 ఏళ్ల ఈ మెగా ఈవెంట్ చరిత్రలో తొలిసారి కెన్యా రూపంలో ఒక ఆఫ్రికా దేశం పతకాల పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఆదివారం ముగిసిన ఈ చాంపియన్‌షిప్‌లో కెన్యా 7 స్వర్ణాలు, 6 రజతాలు, 3 కాంస్యాలతో కలిపి మొత్తం 16 పతకాలతో టాప్ ర్యాంక్‌ను దక్కించుకుంది. జమైకా 7 స్వర్ణాలు, 2 రజతాలు, 3 కాంస్యాలతో కలిపి మొత్తం 12 పతకాలతో రెండో స్థానాన్ని పొందింది. గతంలో 10 సార్లు పతకాల పట్టికలో అగ్రస్థానాన్ని పొందిన అమెరికా ఈసారి మూడో స్థానానికి పడిపోయింది. అమెరికా జట్టు ఆరేసి స్వర్ణ, రజత, కాంస్య పతకాలతో మొత్తం 18 పతకాలను తమ ఖాతాలో వేసుకుంది. ర్యాంక్‌ను ఆయా దేశాలు సాధించిన స్వర్ణ, రజత, కాంస్య పతకాల ఆధారంగా నిర్ణయిస్తారు. ఫలితంగా జమైకా, కెన్యా సమానంగా ఏడు చొప్పున స్వర్ణాలు నెగ్గిన, మెరుగైన రజత పతకాల ఆధారంగా కెన్యాకు టాప్ ర్యాంక్ దక్కింది. మొత్తం 206 దేశాలు పాల్గొన్న ఈ పోటీల్లో 32 దేశాలకు కనీసం ఒక్క పతకమైనా దక్కింది. మరోవైపు భారత్‌కు ఈసారీ నిరాశే ఎదురైంది. మహిళల మారథాన్ రేసులో బరిలోకి దిగిన ఓపీ జైషా, సుధా సింగ్ వరుసగా 18వ, 19వ స్థానాలతో సరిపెట్టుకున్నారు. పోటీల చివరి రోజు ఆదివారం ఏడు విభాగాల్లో ఫైనల్స్ జరిగాయి. పురుషుల 1500 మీటర్ల విభాగంలో కెన్యా అథ్లెట్స్ అస్బెల్ కిప్రోప్ (3ని:34.40 సెకన్లు), మనాన్గోయ్ (3ని:34.60 సెకన్లు) వరుసగా స్వర్ణ, రజత పతకాలను నెగ్గారు. మహిళల 4ఁ400 మీటర్ల రిలేలో జమైకా జట్టు... పురుషుల 4ఁ400 మీటర్ల రిలేలో అమెరికా జట్టు పసిడి పతకాలు సాధించాయి. మహిళల మారథాన్‌లో మరె దిబాబా (ఇథియోపియా-2గం:27ని.35 సెకన్లు) విజేతగా నిలువగా... పురుషుల హైజంప్‌లో డెరెక్ డ్రూన్ (కెనడా-2.34 మీటర్లు), మహిళల జావెలిన్ త్రోలో కత్రినా మోలిటర్ (జర్మనీ-67.69 మీటర్లు) స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. మహిళల 5000 మీటర్ల రేసులో ఇథియోపియా అథ్లెట్స్ అల్మాజ్ అయానా (14ని.26.83 సెకన్లు), సెన్బెరీ తెఫెరి, గెన్‌జెబి దిబాబా స్వర్ణ, రజత, కాంస్య పతకాలను నెగ్గి ‘క్లీన్ స్వీప్’ చేశారు. -
బోల్ట్ ‘ట్రిపుల్’ ధమాకా
బీజింగ్ : బోల్ట్ బరిలో ఉంటే మిగతా వారు స్వర్ణ పతకం గురించి మర్చిపోవాలనే విషయాన్ని మరోసారి నిరూపిస్తూ ఈ జమైకా స్టార్ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మూడో పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే 100, 200 మీటర్ల వ్యక్తిగత స్ప్రింట్ రేసుల్లో స్వర్ణ పతకాలను నెగ్గిన బోల్ట్... శనివారం జరిగిన పురుషుల 4ఁ100 మీటర్ల రిలేలో తన సహచరులు నెస్టా కార్టర్, అసఫా పావెల్, నికెల్ అష్మెడ్లతో కలిసి జమైకా జట్టును విజేతగా నిలిపాడు. జమైకా బృందం 37.36 సెకన్లలో గమ్యానికి చేరుకొని స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో బోల్ట్కిది 11వ స్వర్ణం కాగా... ప్రస్తుత ఈవెంట్లో మూడో పసిడి పతకం కావడం విశేషం. రిలే ఫైనల్లో బ్రొమెల్, జస్టిన్ గాట్లిన్, టైసన్ గే, మైక్ రోడ్జర్స్లతో కూడిన అమెరికా బృందం తొలుత రెండో స్థానాన్ని పొందినా... చివరి అంచెలో నిబంధనలకు విరుద్ధంగా టైసన్ గే నుంచి నిర్ణీత పరిధి దాటి రోడ్జర్స్ బ్యాటన్ అందుకున్నట్లు తేలడంతో రేసు ముగిసిన కొన్ని నిమిషాలకు నిర్వాహకులు అమెరికా జట్టుపై అనర్హత వేటు వేశారు. దాంతో తొలుత కాంస్యం నెగ్గిన చైనా జట్టుకు రజతం, నాలుగో స్థానాన్ని పొందిన కెనడా జట్టుకు కాంస్యం ఖాయమయ్యాయి. మహిళల 4ఁ100 మీటర్ల రిలేలోనూ జమైకా జట్టు కే పసిడి పతకం లభించింది. వెరోనికా, నటాషా, ఎలానీ థాంప్సన్, షెల్లీ ఫ్రేజర్లతో కూడిన జమైకా బృందం 41.07 సెకన్లలో రేసును ముగించి విజేతగా నిలిచింది. అమెరికా, ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్లకు రజత, కాంస్య పతకాలు దక్కాయి. డెకాథ్లాన్ ఈవెంట్ లో అమెరికా అథ్లెట్ యాష్టన్ ఈటన్ ప్రపంచ రికార్డు సృష్టిం చాడు. పది అంశాలతో కూడిన ఈ విభాగంలో ఈటన్ 9045 పాయిం ట్లు సంపాదించి... 9039 పాయింట్లతో ఇప్పటివరకు తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును తిరగరాశాడు. భారత్‌కు చెందిన డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ (62.24 మీటర్లు) తొమ్మిదో స్థానాన్ని పొందగా... 50 కిలోమీటర్ల నడకలో సందీప్ కుమార్, మనీశ్ సింగ్ వరుసగా 26వ, 27వ స్థానాలతో సరిపెట్టుకున్నారు. -
తొమ్మిదితో సరి
భారత 'ఆశాకిరణం' వికాస్ గౌడ వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో డిస్కస్ త్రో లో నిరాశ పరిచాడు. ఫైనల్ కు చేరి పతకం పై ఆశలు రేపిన వికాస్ తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. శనివారం సాయంత్రం జరిగిన ఫైనల్లో ఇనప గుండును కేవలం 62.24 మీటర్లు విసిరి పాయింట్ల పట్టికలో కింది స్థానానికి పరిమితం అయ్యాడు. వికాస్ సీజనల్ బెస్ట్ 65.75మీటర్లు కూడా చేరుకోలేక పోయాడు. వికాస్ గౌడ్ ఇప్పటికి 5 సార్లు ప్రంపచ ఛాంపియన్ షిప్ కు క్వాలిఫై కాగా.. మూడు మార్లు ఫైనల్ రౌండ్ వరకూ వెళ్లాడు. మరో వైపు శనివారం ఉదయం మహిళల 4X400 రిలేలో మన రన్నర్లు హీట్స్ స్థాయిలోనే వెనుదిరిగారు. చివరి రోజు బాబర్, ఒపి జైషా, సుధాసింగ్ చివరి రోజు ఆదివారం మారథాన్ లో పోటీ పడనున్నారు. -
బోల్ట్ మూడో విజయం.. అమెరికా డిస్ క్వాలిఫై!
ప్రపంచ ఛాంపియన్ షిప్ లో మరో సారి జమైకన్ చిరుత సత్తాచాటాడు.. ముచ్చటగా మూడో గోల్డ్ మెడల్ కొట్టేశాడు. శనివారం జరిగిన 4X100 రిలే రేసులో తన టీమ్ ను అందరికంటే ముందు నిలబెట్టాడు. ఈ విక్టరీతో బోల్ట్ తన ఖాతాలో 11 గోల్డ్ మెడల్ వేసుకున్నాడు. చివరి లెగ్ లో పరుగుపెట్టిన ఈ ఏస్ రేసర్ మొత్తం 37.36 సెకండ్లలో రేస్ పూర్తి చేశాడు. 2011 ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భాగంగా 100 మీటర్ల రేస్ నుంచి డిస్ క్వాలిఫై కావడం మినహా.. పాల్గొన్న రేసులన్నింటిలో బంగారు పతకం సాధించడం విశేషం. ఇదిలా ఉంటే.. రెండో స్థానంలో నిలిచిన అమెరికా జట్టు.. ఈ రేసు నుంచి డిస్ క్వాలిఫై అయ్యింది. చివరి బ్యాటన్ అందుకోవడంలో చేసిన పొరపాటు.. ఆతిథ్య చైనా పాలిట వరంగా మారింది. అమెరికా డిస్ క్వాలిఫై కావడంతో మూడో స్థానంలో రేస్ పూర్తిచేసిన చైనా రజత పతకాన్ని గెలుచుకోగా.. నాలుగో స్థానంలో ఉన్న కెనడా.. కాంస్య పతకం అందుకుంది. -
బోల్ట్‌నే పడేశాడు..!
నాలుగోసారి 200 మీటర్ల ప్రపంచ టైటిల్ బోల్ట్ కైవసం ♦ 19.55 సెకన్లలో గమ్యానికి చేరిన జమైకా స్టార్ ♦ రెండో స్థానంలోనే గాట్లిన్ పరుగుకు ప్రాణం ఉంటే అలసిపోయేదేమో...! వేగానికి రెక్కలు ఉంటే విలవిలలాడిపోయేవేమో...! భువికే అనుభూతి ఉంటే నిలువెల్లా వణికిపోయేదేమో...! లేడి పిల్ల కోసం పులి పరుగుపెట్టినట్లుగా... మానవ చిరుత ఉసేన్ బోల్ట్... 200 మీటర్ల రేసులో ప్రకంపనలు సృష్టించాడు. బుల్లెట్‌కు సైతం భయం పుట్టేలా... ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టిస్తూ... గాట్లిన్తో సహా యోధులు, ధీరులు అనుకున్న అందర్ని తన వేగంతో వేటాడేశాడు. రికార్డులు తిరగరాయకపోయినా... పరుగులో తనను కొట్టే మొనగాడే లేడని మరోసారి నిరూపించాడు. బీజింగ్ : స్ప్రింట్‌లో అలుపెరుగని యోధుడిలా దూసుకుపోతున్న జమైకా స్టార్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్... 200 మీటర్ల రేసులోనూ తడఖా చూపెట్టాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా గురువారం జరిగిన పురుషుల 200 మీటర్ల పరుగును బోల్ట్ 19.55 సెకన్లలో ముగించి స్వర్ణాన్ని సాధించాడు. దీంతో వరుసగా నాలుగోసారి తన ఖాతాలో పసిడిని జమ చేసుకున్నాడు. అమెరికా స్టార్ స్ప్రింటర్ జస్టిన్ గాట్లిన్ 19.74 సెకన్లతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. 19.87 సెకన్లలో రేసును ముగించిన జొబోడావాన్ (దక్షిణాఫ్రికా)కు కాంస్యం దక్కింది. 2008 ఒలింపిక్స్‌లో ఇదే వేదికపై రెండు విభాగాల్లో స్వర్ణాలు సాధించిన బోల్ట్... ఈసారి కూడా తన ఆధిపత్యాన్ని చూపెట్టాడు. చివరి 12 వ్యక్తిగత ఒలింపిక్స్, వరల్డ్ స్ప్రింట్ టైటిల్స్‌లో బోల్ట్ 11 గెలవడం విశేషం. 2011 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల రేసును తప్పుగా మొదలుపెట్టి అనర్హతకు గురయ్యాడు. ఈ సీజన్లో నడుం సమస్యలతో ఇబ్బందిపడుతున్న బోల్ట్... 2009లో తాను నెలకొల్పిన ప్రపంచ రికార్డు (19.19 సెకన్లు)పై గురిపెట్టలేకపోయాడు. ఆరంభం అదుర్స్... ఈసారి గాట్లిన్ నుంచి గట్టిపోటీ ఉంటుందని భావించినా.. రేసు మొత్తంలో ఎక్కడా ఇది కనబడలేదు. అద్భుతమైన ఆరంభంతో బోల్ట్.. సహచరుల కంటే చాలా ముందుగా దూసుకుపోయాడు. మరోవైపు గాట్లిన్ తొలి 100 మీటర్లలో కాస్త వెనుకబడినా... తర్వాతి 50 మీటర్లలో బాగా పుంజుకున్నాడు. కానీ జార్నెల్ హ్యూజ్ (బ్రిటన్), జొబోడావాన్ల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొన్నాడు. బోల్ట్ మాత్రం తన సహజశైలిలో భారీ కటౌట్‌ను గాలి దిశకు అనుకూలంగా మల్చుకుంటూ చిరుతలా దూసుకుపోయాడు. తన పొడవైన కాళ్లతో ఒక్కో అడుగు వేస్తూ తొలి 100 మీటర్లలో స్పష్టమైన ఆధిక్యాన్ని చూపెట్టాడు. నడుం నొప్పితో ఆరు వారాలు శిక్షణకు దూరంగా ఉన్నా... రేసు ముగింపులో తనదైన ముద్రను చూపెట్టాడు. ఫైనల్లో వికాస్ భారత మేటి అథ్లెట్ వికాస్ గౌడ.. పురుషుల డిస్కస్ త్రో ఈవెంట్లో ఫైనల్ రౌండ్‌కు చేరాడు. గ్రూప్-ఎ అర్హత పోటీల్లో వికాస్ తొలి ప్రయత్నంలో ఇనుప గుండును 63.86 మీటర్ల దూరం విసిరాడు. దీంతో ఏడో స్థానంతో ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించాడు. శనివారం ఫైనల్ రౌండ్ పోటీలు జరుగుతాయి. బోల్ట్‌నే పడేశాడు..! ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 200 మీటర్ల పరుగులో తాను స్వర్ణం గెలుస్తానని ముందే ఊహించినట్లు బోల్ట్ చెప్పాడు. కానీ అతను ఊహించని అనూహ్య ఘటన ట్రాక్‌పైనే జరిగింది. రేస్‌లో మొదటి స్థానంలో నిలిచాక సంబరంగా మైదానం అంతా తిరుగుతున్న బోల్ట్‌కు కెమెరామెన్ రూపంలో ప్రమాదం ఎదురైంది. చక్రాలతో ఉండే ‘సెగ్వే’పై బోల్ట్‌కు సమాంతరంగా అతడిని షూట్ చేస్తూ వస్తున్న కెమెరామెన్ అదుపు తప్పి పక్కనున్న రెయిలింగ్‌ను ఢీ కొన్నాడు. తనను తాను నియంత్రించుకోలేక అతను ఒక్కసారిగా బోల్ట్‌ను ఢీకొన్నాడు. దాంతో పట్టు కోల్పోయిన బోల్ట్ బొక్కబోర్లా పడిపోయాడు. సెగ్వే నేరుగా బోల్ట్ మోకాలి కింది భాగంలోనే తాకింది. అంతా ఒక్కసారిగా ఆందోళనకు గురవుతుండగా ప్రమాదం లేదంటూ స్టార్ స్ప్రింటర్ చిరునవ్వుతో లేచి నిలబడ్డాడు. ఆ ‘బంగారు కాళ్ల’ విలువ ఏమిటో ప్రపంచానికి తెలుసు. నిజంగా ఏదైనా పెద్ద గాయం తగిలి ఉంటే బోల్ట్ కెరీరే ముగిసేపోయేదేమో! పెద్ద ప్రమాదం తప్పిన అనంతరం ‘అతను నన్ను చంపాలని చూశాడు’ అంటూ బోల్ట్ సరదాగా వ్యాఖ్యానించడం విశేషం. -
తిరుగులేని బోల్ట్
-
తిరుగులేని బోల్ట్
బీజింగ్: జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తన ఆధిపత్యాన్ని నిలుపుకున్నాడు. వరుసగా నాలుగో స్వర్ణం సాధించి సత్తా చాటాడు. గురువారం జరిగిన పురుషుల 200 మీటర్ల ఫైనల్ రేసులో విజేతగా నిలిచి గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు. 19.55 సెకన్లలో గమ్యాన్ని చేరుకున్నాడు. అమెరికా అథ్లెట్ జస్టిన్ గాట్లిన్ 19.74 సెకండ్లతో రెండో స్థానంలో సరిపెట్టుకున్నాడు. ఈ సారైనా బోల్ట్ ను ఓడించాలన్న గ్లాటిన్ కల ఫలించలేదు. గత ఆదివారం జరిగిన 100 మీటర్ల రేసులోనూ బోల్ట్ విజయం సాధించాడు. గాట్లిన్ నుంచి గట్టిపోటీ ఎదుర్కొన్న బోల్ట్ తుదకు సెకనులో వందోవంతు తేడాతో గట్టెక్కి పసిడి పతకాన్ని దక్కించుకున్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకు ఉసేన్ బోల్ట్ 10 బంగారు పతకాలు గెలిచాడు. అరడజను ఒలింపిక్స్ స్వర్ణాలు అతడి ఖాతాలో ఉన్నాయి. -
ఫైనల్స్ కు చేరిన వికాస్ గౌడ
బీజింగ్ : భారత 'ఆశాకిరణం' వికాస్ గౌడ వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో డిస్కస్ త్రో ఫైనల్స్‌కు చేరుకున్నాడు. గురవారం ఇక్కడ జరిగిన 61.61 మీటర్ల దూరానికి డిస్కన్ను విసిరి ఫైనల్స్‌కు బెర్త్ ఖరారు చేసుకున్నాడు. ఫైనల్స్ శనివారం సాయంత్రం జరగనున్నాయి. -
బోల్ట్ x గాట్లిన్
♦ 200 మీటర్ల ఫైనల్స్‌లోనూ అమీతుమీ ♦ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ బీజింగ్ : వరుసగా నాలుగో స్వర్ణం సాధించాలనే లక్ష్యంతో ఉసేన్ బోల్ట్ (జమైకా)... ఈసారైనా బోల్ట్‌ను ఓడించాలనే పట్టుదలతో జస్టిన్ గాట్లిన్ (అమెరికా)... గురువారం జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పురుషుల 200 మీటర్ల ఫైనల్ రేసులో అమీతుమీ తేల్చుకోనున్నారు. బుధవారం జరిగిన సెమీఫైనల్స్ ద్వారా బోల్ట్ (19.95 సెకన్లు), జస్టిన్ గాట్లిన్ (19.87 సెకన్లు) ఫైనల్‌కు అర్హత సాధించారు. వీరిద్దరితోపాటు ఫెమీ ఒగునోడ్ (ఖతార్), రామిల్ గులియెవ్ (టర్కీ), జర్నెల్ హ్యూస్ (బ్రిటన్), జొబోడ్వానా (దక్షిణాఫ్రికా), నికెల్ అష్మెడ్ (జమైకా), అలోన్సో ఎడ్వర్డ్ (పనామా) కూడా ఫైనల్‌కు అర్హత పొందారు. 2009, 2011, 2013 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో బోల్ట్ 200 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకాలు సాధించగా... 2005 మెగా ఈవెంట్లో గాట్లిన్ విజేతగా నిలిచాడు. గత ఆదివారం జరిగిన 100 మీటర్ల ఫైనల్లో గాట్లిన్ నుంచి గట్టిపోటీ ఎదుర్కొన్న బోల్ట్ తుదకు సెకనులో వందోవంతు తేడాతో గట్టెక్కి పసిడి పతకాన్ని దక్కించుకున్నాడు. మరోవైపు బుధవారం జరిగిన ఐదు ఈవెంట్స్ ఫైనల్స్‌లో మూడింట ఆఫ్రికా అథ్లెట్స్ స్వర్ణ పతకాలు సాధించడం విశేషం. పురుషుల జావెలిన్ త్రోలో జూలియస్ యెగో (92.72 మీటర్లు) విజేతగా నిలిచి ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో ఫీల్డ్ ఈవెంట్లో తొలిసారి కెన్యాకు పతకాన్ని అందించిన ఘనతను సొంతం చేసుకున్నాడు. మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో హువిన్ కియెంగ్ జెప్కెమోయ్ (కెన్యా-9ని:19.11 సెకన్లు) పసిడి పతకాన్ని సాధించింది. మహిళల పోల్‌వాల్ట్‌లో యారిస్లె సిల్వా (క్యూబా-4.90 మీటర్లు); పురుషుల 400 మీటర్ల విభాగంలో వేడ్ వాన్ నికెర్క్ (దక్షిణాఫ్రికా-43.48 సెకన్లు); మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో జుజానా హెజ్నోవా (చెక్ రిపబ్లిక్-53.50 సెకన్లు) స్వర్ణ పతకాలు గెలిచారు. టింటూ లూకాకు ‘రియో’ బెర్త్: పోటీల ఐదో రోజూ భారత్‌కు నిరాశే మిగిలింది. మహిళల 800 మీటర్ల విభాగంలో ప్రస్తుత ఆసియా చాంపియన్, కేరళ అమ్మాయి టింటూ లూకా 2ని:00.95 సెకన్లలో గమ్యానికి చేరుకొని తొలి హీట్‌లో ఆరో స్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత పొందలేకపోయింది. అయితే ఈ ప్రదర్శనతో టింటూ లూకా వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. లలితకు ఎనిమిదో స్థానం: మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్ ఫైనల్ రేసులో మహారాష్ట్ర అమ్మాయి లలితా శివాజీ బాబర్ 9ని:27.86 సెకన్లతో 8వ స్థానాన్ని దక్కించుకుంది. 2000 మీటర్ల వరకు అగ్రస్థానంలో ఉన్న లలిత ఆ తర్వాత వెనుకబడిపోయింది. ఈ ప్రదర్శనతో లలిత ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో ట్రాక్ ఈవెంట్లో టాప్-8లో నిలిచిన తొలి భారతీయ అథ్లెట్‌గా గుర్తింపు పొందింది. పురుషుల 200 మీటర్ల ఫైనల్ నేటి సాయంత్రం గం. 6.25కు స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం -
ఆఫ్రికా అథ్లెట్స్ అదుర్స్
మూడు విభాగాల్లో స్వర్ణాలు ♦ 200 మీటర్ల సెమీస్‌లోకి బోల్ట్, గాట్లిన్ ♦ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ బీజింగ్ : పేరుకు వెనుకబడిన దేశాలకు చెందిన వారైనా... ప్రపంచ పరుగుల వేదికపై పతకాల వేటలో తమ ఆధిపత్యాన్ని చాటుకుంటూ ఆఫ్రికా దేశాల అథ్లెట్స్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అదరగొడుతున్నారు. మంగళవారం జరిగిన ఐదు ఫైనల్స్‌లో ఆఫ్రికా అథ్లెట్స్ మూడు విభాగాల్లో స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. పురుషుల 800 మీటర్ల రేసులో కెన్యా స్టార్ డేవిడ్ రుదీషా రెండోసారి పసిడిపతకాన్ని దక్కిం చుకోగా... పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో కెన్యా యువతార నికోలస్ బెట్ తొలిసారి తమ దేశానికి స్వర్ణాన్ని అందించాడు. ఇక మహిళల 1500 మీటర్ల రేసులో గెన్‌జెబి దిబాబా విజేతగా నిలిచి ఈ మెగా ఈవెం ట్లో ఇథియోపియా పసిడి ఖాతాను తెరిచింది. నాలుగో రోజు పోటీలు ముగిశాక కెన్యా 4 స్వర్ణాలు, 3 రజతాలు, 2 కాంస్యాలతో కలిపి మొత్తం తొమ్మిది పతకాలతో అగ్రస్థానంలో ఉండటం విశేషం. ►లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన తర్వాత మోకాలి గాయంతో కొంతకాలం అథ్లెటిక్స్‌కు దూరంగా ఉన్న రుదీషా తాజా ప్రదర్శనతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. 800 మీటర్ల రేసును రుదీషా ఒక నిమిషం 45.84 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఆడమ్ క్సాజోట్ (పోలండ్-1ని:46.08 సెకన్లు) రజతం, అమెల్ టుకా (బోస్నియా-1ని:46.30 సెకన్లు) కాంస్యం సాధించారు. 2011లో తొలిసారి ప్రపంచ టైటిల్ నెగ్గిన రుదీషా 2013లో గాయం కారణంగా బరిలోకి దిగలేదు. ►పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో గతంలో ఏనాడూ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం నెగ్గలేకపోయిన కెన్యాకు నికోలస్ బెట్ ఆ కొరతను తీర్చాడు. బెట్ 47.79 సెకన్లలో రేసును పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని సాధించాడు. అంతేకాకుండా 1991లో శామ్యూల్ మెటెటె (జాంబియా) తర్వాత ఈ విభాగంలో పసిడి పతకం నెగ్గిన ఆఫ్రికా అథ్లెట్‌గా బెట్ గుర్తింపు పొందాడు. ►మహిళల 1500 మీటర్ల రేసులో ఇథియోపియా అమ్మాయి గెన్‌జెబి దిబాబా 4ని:08.09 సెకన్లలో లక్ష్యానికి చేరుకొని తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. విఖ్యాత అథ్లెట్స్ తిరునిష్, ఎజెగాయెహు దిబాబాలకు సోదరి అయిన గెన్‌జెబి గత నెలలో మొనాకోలో జరిగిన మీట్లో 3ని:50.07 సెకన్లలో తన పేరిట ప్రపంచ రికార్డును లిఖించుకుంది. పురుషుల లాంగ్‌జంప్‌లో ఒలింపిక్ చాంపియన్ గ్రెగ్ రూథర్‌ఫర్డ్ (బ్రిటన్-8.41 మీటర్లు)... మహిళల డిస్కస్ త్రోలో డెనియా కాబాలెరో (క్యూబా-69.28 మీటర్లు) స్వర్ణ పతకాలు సాధించారు. ►పురుషుల 200 మీటర్ల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ ఉసేన్ బోల్ట్ (జమైకా), మాజీ చాంపియన్ జస్టిన్ గాట్లిన్ (అమెరికా) సెమీఫైనల్లోకి ప్రవేశించారు. మూడో హీట్‌లో పాల్గొన్న బోల్ట్ 20.28 సెకన్లలో... నాలుగో హీట్‌లో బరిలోకి దిగిన గాట్లిన్ 20.19 సెకన్లలో గమ్యానికి చేరుకున్నారు. -
మందేసాడు... మెడల్ ఇచ్చేశాడు!
స్వర్ణపతక విజేత నిర్వాకం బీజింగ్ : అతను గెలిచింది సాదాసీదా ఈవెంట్లో కాదు... ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం. దాని విలువేమిటో అతనికి చాలా బాగా తెలుసు. అయితే ఆనందంలో మందు ఎక్కువై ఏకంగా ట్యాక్సీ డ్రైవర్‌కే దానిని కుదువ పెట్టేశాడు ఆ ఘనుడు! వరల్డ్ చాంపియన్‌షిప్ సందర్భంగా బీజింగ్‌లో సోమవారం ఈ ఘటన జరిగింది. పురుషుల హ్యామర్ త్రోలో 80.88 మీటర్ల దూరం గుండు విసిరి పావెల్ ఫాజ్డెక్ (పోలండ్) స్వర్ణం సొంతం చేసుకున్నాడు. 26 ఏళ్ల పావెల్ ఈ ఆనందంలో రాత్రంతా పబ్‌లో ఫుల్‌గా తాగి ఎంజాయ్ చేశాడు. అదే మత్తులో బయటికి వచ్చి ట్యాక్సీ ఎక్కిన అతను తన హోటల్‌కు చేరాడు. అయితే టాక్సీ డ్రైవర్‌కు డబ్బుకు బదులుగా తన గోల్డ్ మెడల్ ఇచ్చేసి పండగ చేస్కోమన్నాడు! ఉదయం మత్తు దిగిన తర్వాత చూస్తే మెడల్ కనబడకపోవడంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. స్థానిక పోలీసులు ఫాజ్డెక్ చెప్పిన వివరాలను బట్టి రోజంతా గాలించి ఆ డ్రైవర్‌ను పట్టుకోగలిగారు. నేనేం చేయను, అతను ఇస్తే తీసుకున్నాను...కొట్టేయలేదు కదా అంటూ డ్రైవర్ ఘాటుగా జవాబిచ్చాడు! చివరకు అతనికి ట్యాక్సీ డబ్బులు ఇచ్చి పోలీసులు స్వర్ణ పతకాన్ని పోలండ్ ఆటగాడికి అందించారు. ఎలాగైతేనేం మెడల్ దక్కిందంటూ ఫాజ్డెక్ లెంపలేసుకున్నాడు. -
ప్రపంచ అథ్లెటిక్స్ మీట్‌కు వికాస్, టింటూ
న్యూఢిల్లీ : ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 17 మంది సభ్యులతో కూడిన భారత బృందంలో గతేడాది కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం నెగ్గిన డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ... అగ్రశ్రేణి అథ్లెట్ టింటూ లూకా తదితరులు ఉన్నారు. ఈనెల 22 నుంచి 30 వరకు చైనాలోని బీజింగ్‌లో ఈ మెగా ఈవెంట్ జరుగుతుంది. అంతర్జాతీయ అథ్లెటిక్స్ సంఘాల సమాఖ్య (ఐఏఏఎఫ్) నిర్దేశించిన అర్హత ప్రమాణాలను అందుకున్న అథ్లెట్స్‌ను మాత్రమే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు ఎంపిక చేసినట్లు భారత అథ్లెటిక్స్ సమాఖ్య తెలిపింది. భారత అథ్లెటిక్స్ జట్టు : వికాస్ గౌడ (డిస్కస్ త్రో), గుర్మీత్ సింగ్, బల్జీందర్ సింగ్, చందన్ సింగ్ (20 కి.మీ. నడక), ఇందర్జీత్ సింగ్ (షాట్‌పుట్), సందీప్ కుమార్, మనీష్ సింగ్ రావత్ (50 కి.మీ. నడక), టింటూ లూకా (800 మీ., 4ఁ400 మీటర్ల రిలే) లలితా శివాజీ బాబర్ (3000 మీ. స్టీపుల్‌చేజ్, మారథాన్), పూవమ్మ, దేబశ్రీ మజుందార్, అనూ రాఘవన్, జిస్నా మాథ్యూ (4ఁ400 మీటర్ల రిలే), , ఖుష్బీర్ కౌర్, సప్నా (20 కి.మీ. నడక), ఓపీ జైషా, సుధా సింగ్ (మారథాన్). -
షెల్లీ ఫ్రేజర్ ‘డబుల్’
మాస్కో (రష్యా): ఒకవైపు తమ దేశం అథ్లెట్స్‌పై డోపింగ్ ఆరోపణలు వినిపిస్తున్నా... మరోవైపు ఇవేమీ పట్టించుకోకుండా జమైకా అథ్లెట్స్ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో దూసుకుపోతున్నారు. శుక్రవారం జరిగిన మహిళల 200 మీటర్ల ఫైనల్లో షెల్లీ ఆన్ ఫ్రేజర్ మళ్లీ మెరిసింది. 22.17 సెకన్లలో గమ్యానికి చేరుకొని విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో 22 ఏళ్ల తర్వాత ఒకే చాంపియన్‌షిప్‌లో 100, 200 మీటర్ల రేసుల్లో స్వర్ణాలు నెగ్గిన తొలి అథ్లెట్‌గా షెల్లీ గుర్తింపు పొందింది. చివరిసారి 1991లో కాట్రిన్ క్రాబీ ఈ ఘనత సాధించింది. బ్రిటన్ విఖ్యాత అథ్లెట్ మహ్మద్ ఫరా కూడా పసిడి ‘డబుల్’ నమోదు చేశాడు. ఈ చాంపియన్‌షిప్‌లో ఇప్పటికే 10 వేల మీటర్ల రేసులో స్వర్ణం నెగ్గిన ఫరా శుక్రవారం జరిగిన 5 వేల మీటర్ల రేసులోనూ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఆరంభంలో కాస్త వెనుకబడ్డా చివర్లో అనూహ్యంగా పుంజుకున్న ఈ లండన్ ఒలింపిక్ చాంపియన్ 13 నిమిషాల 26.98 సెకన్లలో లక్ష్యానికి చేరుకున్నాడు. జమైకా స్టార్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ రెండో స్వర్ణంపై గురి పెట్టాడు. 100 మీటర్లలో విజేతగా నిలిచిన అతను శనివారం జరిగే 200 మీటర్ల ఫైనల్‌కు అర్హత పొందాడు. సెమీఫైనల్స్‌లోని రెండో రేసులో బోల్ట్ 20.12 సెకన్లలో గమ్యానికి చేరుకొని ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు. పురుషుల 4ఁ400 మీటర్ల రిలేలో అమెరికా జట్టు (2ని:58.71 సెకన్లు) స్వర్ణం సాధించింది. పురుషుల షాట్‌పుట్‌లో డేవిడ్ స్టోర్ల్ (జర్మనీ-21.73 మీటర్లు); లాంగ్‌జంప్‌లో మెన్కోవ్ (రష్యా-8.56 మీటర్లు); మహిళల హ్యామర్ త్రోలో తాతియానా లిసెంకో (రష్యా-78.80 మీటర్లు) పసిడి పతకాలు గెల్చుకున్నారు. -
హర్డిల్స్‌లో హెజ్నోవాకు స్వర్ణం
మాస్కో: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఒలింపిక్ కాంస్య పతక విజేత జుజానా హెజ్నోవా (చెక్) సత్తా చాటింది. గురువారం జరిగిన మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌ను 52.83 సెకన్లలో ముగించి స్వర్ణాన్ని గెలుచుకుంది. దీంతో కెరీర్లో తొలి ప్రపంచ పతకాన్ని సొంతం చేసుకుంది. పోటీ ఆరంభం నుంచి ఆధిపత్యం కొనసాగించిన హెజ్నోవా ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దూసుకెళ్లింది. అమెరికాకు చెందిన దాలిలా మహ్మద్ (54.09 సెకన్లు), లషిండా డెముస్ (54.27 సెకన్లు)లకు వరుసగా రజతం, కాంస్య పతకాలు దక్కాయి. పురుషుల 3 వేల మీటర్ల స్టీపుల్ ఛేజ్‌లో ఒలింపిక్ చాంపియన్ ఎజాకిల్ కెంబోయ్ 8:06.01 సెకన్లలో లక్ష్యాన్ని చేరి పసిడిని సొంతం చేసుకోగా... సహచరుడు కన్సెస్లస్ కిప్రుటో (8:06.37 సెకన్లు)కు రతజం లభించింది. పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో జెహు గోర్డాన్ (ట్రినిడాడ్-47.69 సెకన్లు) విజేతగా నిలిచాడు. సెకన్లో వందో వంతు తేడాతో మైకేల్ టిన్స్లే (అమెరికా-47.70 సెకన్లు)ను ఓడించాడు. మహిళల ట్రిపుల్ జంప్‌లో క్యాటరిన్ ఇజార్జున్ (కొలంబియా), పురుషుల హైజంప్‌లో బోదాన్ బొండారెంకో (ఉక్రెయిన్-2.41 మీటర్లు), మహిళల 1500 మీటర్ల ఫైనల్లో అబెబా అర్గెవీ (స్వీడన్) స్వర్ణాలు గెలుచుకున్నారు. -
ఎట్టకేలకు పసిడి...
మాస్కో (రష్యా): ‘ఎప్పుడూ నాలుగో స్థానమే’ అని తనపై పడిన ముద్రను తొలగించుకుంటూ ఐర్లాండ్ అథ్లెట్ రాబర్ట్ హెఫర్నన్ ఈసారి ఏకంగా విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 30 ఏళ్ల తర్వాత ఐర్లాండ్‌కు తొలి పతకం అందించాడు. బుధవారం జరిగిన పురుషుల 50 కిలోమీటర్ల నడకలో 35 ఏళ్ల హెఫర్నన్ 3 గంటల 37 నిమిషాల 56 సెకన్లలో గమ్యానికి చేరుకొని స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. మిఖాయిల్ రిజోవ్ (రష్యా-3గం:38ని:58 సెకన్లు) రజతం నెగ్గగా... జారెడ్ టాలెంట్ (ఆస్ట్రేలియా-3గం:40ని:03 సెకన్లు) కాంస్యం సాధించాడు. 2010 యూరోపియన్ చాంపియన్‌షిప్‌లో హెఫర్నన్ 20 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు నడకలో నాలుగో స్థానం... 2012 లండన్ ఒలింపిక్స్‌లో 50 కిలోమీటర్ల నడకలో మరోసారి నాలుగో స్థానం పొందాడు. దాంతో అతనిపై ‘మిస్టర్ ఫోర్త్’ అని ముద్ర పడిపోయింది. అయితే ఈసారి అందరి అంచనాలను తారుమారు చేస్తూ హెఫర్నన్ విజేతగా నిలిచి ‘మిస్టర్ గోల్డ్‌మెడల్’గా పేరు తెచ్చుకున్నాడు. యాదృచ్చికంగా ఐర్లాండ్‌కు చివరిసారి ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 1983 ఆగస్టు 14న పతకం వచ్చింది. ఫిన్లాండ్లోని హెల్సింకిలో జరిగిన తొలి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఈమన్ కాగ్లాన్ పురుషుల 5000 మీటర్ల రేసులో ఐర్లాండ్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించాడు. సరిగ్గా 30 ఏళ్ల తర్వాత ఆగస్టు 14న రాబర్ట్ హెఫర్నన్ రూపంలో ఐర్లాండ్‌కు ఈ మెగా ఈవెంట్లో మళ్లీ పసిడి పతకం రావడం విశేషం. రాణాకు 33వ స్థానం మరోవైపు ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో భారత అథ్లెట్స్ నిరాశజనక ప్రదర్శన కొనసాగుతోంది. 50 కిలోమీటర్ల నడకలో పోటీపడిన బసంత బహదూర్ రాణా 3 గంటల 58 నిమిషాల 20 సెకన్లలో గమ్యానికి చేరుకొని 33వ స్థానంలో నిలిచాడు. భారత్‌కే చెందిన సందీప కుమార్ నిబంధనలకు విరుద్ధంగా నడక సాగించడంతో 35 కిలోమీటర్ల తర్వాత అతనిపై అనర్హత వేటు వేశారు. -
పసిడితో ‘పోల్‌వాల్ట్’కు వీడ్కోలు
మాస్కో (రష్యా): ‘రికార్డుల రారాణి’ ఎలీనా ఇసిన్బయేవా తన 14 ఏళ్ల కెరీర్‌కు పసిడి పతకంతో వీడ్కోలు పలికింది. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఈ రష్యా స్టార్ పోల్‌వాల్ట్‌లో విజేతగా నిలిచింది. 31 ఏళ్ల ఇసిన్బయేవా 4.89 మీటర్ల ఎత్తుకు ఎగిరి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. జెన్నిఫర్ సుర్ (అమెరికా-4.82 మీటర్లు) రజతం... యారిస్లె సిల్వా (క్యూబా-4.82 మీటర్లు) కాంస్యం సాధించారు. 2005, 2007 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో కూడా ఆమె స్వర్ణాలు నెగ్గింది. తన కెరీర్లో ఇసిన్బయేవా 30 సార్లు ప్రపంచ రికార్డులు నెలకొల్పింది. పురుషుల 400 మీటర్ల రేసులో 2009 వరల్డ్ చాంపియన్ లషాన్ మెరిట్ (అమెరికా-43.74 సెకన్లు) స్వర్ణ పతకం సాధించాడు. పురుషుల 800 మీటర్ల రేసులో మహ్మద్ అమన్ (ఇథియోపియా-1ని:43.31 సెకన్లు) విజేతగా నిలిచాడు. మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో చెమోస్ చెవా (కెన్యా-9ని:11.65 సెకన్లు) పసిడి పతకం సొంతం చేసుకుంది. మహిళల 20 కిలోమీటర్ల నడకలో లష్మనోవా (రష్యా-1గం:27ని:08 సెకన్లు) విజేతగా నిలిచింది. వికాస్ గౌడకు ఏడో స్థానం: పురుషుల డిస్కస్ త్రోలో భారత క్రీడాకారుడు వికాస్ గౌడ డిస్క్‌ను 64.03 మీటర్ల దూరం విసిరి ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. రాబర్ట్ హార్టింగ్ (జర్మనీ-69.11 మీటర్లు) స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. -
బోల్ట్‌పైనే దృష్టి
మాస్కో (రష్యా): ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌కు శనివారం తెరలేవనుంది. ఈనెల 18 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్లో అందరి దృష్టి ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్‌పైనే ఉంది. రెండేళ్ల క్రితం కొరియాలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల ఫైనల్లో ‘ఫాల్స్ స్టార్ట్’ చేసి వేటుకు గురైన బోల్ట్ ఈసారి ఆ టైటిల్‌ను సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. గాయం కారణంగా డిఫెండింగ్ చాంపియన్ యోహాన్ బ్లేక్ (జమైకా) వైదొలగడం... డోపింగ్‌లో పట్టుబడిన టైసన్ గే (అమెరికా), అసఫా పావెల్ (జమైకా) తప్పుకోవడంతో బోల్ట్ పని మరింత సులువైంది. తొలి రోజున రెండు విభాగాల్లో ఫైనల్స్ (పురుషుల 10 వేల మీటర్లు, మహిళల మారథాన్ రేసు) జరుగుతాయి. పురుషుల 100 మీటర్ల ఫైనల్ ఆదివారం జరుగుతుంది.