ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌కు ద్యుతీచంద్‌ | Duiti Chand to World Athletics Championship | Sakshi

ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌కు ద్యుతీచంద్‌

Jul 29 2017 12:19 AM | Updated on Sep 5 2017 5:05 PM

ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌కు ద్యుతీచంద్‌

ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌కు ద్యుతీచంద్‌

అర్హత ప్రమాణ సమయం (11.26 సెకన్లు) అందుకోలేకపోయినా... ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌

న్యూఢిల్లీ: అర్హత ప్రమాణ సమయం (11.26 సెకన్లు) అందుకోలేకపోయినా... ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు రావాలని భారత మహిళా స్ప్రింట్‌ అథ్లెట్‌ ద్యుతీచంద్‌కు ఆహ్వానం లభించింది. మహిళల 100 మీటర్ల విభాగంలో నిర్ణీత ఎంట్రీల సంఖ్య 56కు చేరుకోకపోవడంతో అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ సమాఖ్య ఈ సీజన్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన వారిని ఆహ్వానించాలని నిర్ణయించింది.

దాంతో ద్యుతీచంద్‌కు ఈ అవకాశం దక్కింది. ఈ సీజన్‌లో ద్యుతీచంద్‌ అత్యుత్తమ సమయం 11.30 సెకన్లు. ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ ఆగస్టు 4 నుంచి 13 వరకు లండన్‌లో జరుగుతుంది. ఒడిషాకు చెందిన ద్యుతీచంద్‌కు కోచ్‌గా తెలంగాణాకు చెందిన నాగపురి రమేశ్‌ వ్యవహరిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement