World Athletics Championships first goldNeeraj Chopra బుడాపెస్ట్ (హంగేరి) వేదికగా జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో గోల్డెన్ బోయ్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. వరల్డ్ అథ్లెటిక్స్‌లో ఇండియాకు తొలి స్వర్ణం అందించిన ఘనతను దక్కించుకునాడు. దీనిపై ప్రధానమంత్రి నరంద్రే మోదీ సహా పలువురు ప్రశంసిస్తున్నారు.
ముఖ్యంగా నీరజ్ అద్భుత విజయంపై బిలియనీర్, ఎం అండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్ర స్పందించారు. ఇండియా.. చోప్రా.. గోల్డ్ అంటూ అతడిని అభినందించారు. అంతేకాదు మూన్‌షాట్ అంటూ ఆయన సహోద్యోగి రూపొందించిన ఒక ఆసక్తికర వీడియోను ట్వీట్ చేశారు. దీంతో ఇది వైరల్‌గా మారింది.
అలాగే నీరజ్ చోప్రా విజయం మండే మోటివేషన్ కాకపోతే మరేమిటి అంటూ సోమవారం మరో ట్వీట్ చేశారు. అయిదే ఈ మోటివేషన్ కేవలం స్వర్ణం సాధించడ వల్ల మాత్రమే కాదు..సహజమైన ప్రతిభ ఉంటే సరిపోదు సక్సెస్‌రాదు నీరజ్ గుర్తు చేశారు. ప్రిపరేషన్ పట్ల రాజీలేని నిబద్ధతకు ఫలితం ఈ గొప్ప విజయం అని చాటి చెప్పారంటూ నీరజ్‌ను అభినందించారు.
How could my #MondayMotivation this morning be anything other than this man’s latest victory? But it’s not because he won Gold. It’s because he is a reminder that success is not an outcome of only natural talent; it is the result of an uncompromising commitment to preparation…… pic.twitter.com/VQMM98L7li
— anand mahindra (@anandmahindra) August 28, 2023
కాగా పురుషుల జావెలిన్ త్రోలో స్వర్ణం పతకం సాధించిన నీరజ్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిస్తున్నారు. లెజెండ్ అథ్లెట్ అంటూ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. అంతేకాదు నీరజ్‌కు మరో కారు ఇస్తారా సార్ అంటూ ఒక యూజర్ ప్రశ్నించడం గమనార్హం.
INDIAAAAA. CHOPRAAAA. GOLLLDDD. 💪🏽🇮🇳 His moonshot does it…
— anand mahindra (@anandmahindra) August 27, 2023
(The clip in this video my colleague made is from the qualifier…) pic.twitter.com/3HSWUZ3PUI
ఇదీ చదవండి: ఊరట! పసిడికి ఫెడ్ బ్రేకులు: ఎంత తగ్గిందంటే..!
Comments
Please login to add a commentAdd a comment