Neeraj Chopra
-
దోహా డైమండ్ లీగ్‌తో...
న్యూఢిల్లీ: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈ ఏడాదిలో మే నెలలో తిరిగి ట్రాక్‌పై అడుగు పెట్టనున్నాడు. దోహాలో జరగనున్న డైమండ్ లీగ్ ఈవెంట్లో నీరజ్ బరిలోకి దిగనున్నాడు. ఈ మేరకు భారత జాతీయ అథ్లెట్లిక్స్ చీఫ్ కోచ్ రాధాకృష్ణన్ నాయర్ వివరాలు వెల్లడించారు. ఇటీవల వివాహ బంధంలోకి అడుగు పెట్టిన నీరజ్ ప్రస్తుతం ప్రాక్టీస్ ప్రారంభించినట్లు రాధాకృష్ణన్ పేర్కొన్నాడు. ఒక సీజన్లో 14 డైమండ్ లీగ్ మీట్లు జరగనుండగా... దోహా ఈవెంట్ అందులో మూడోది. ఈ ఏడాది ఆగస్టు 27, 28న జ్యూరిక్‌లో డైమండ్ లీగ్ ఫైనల్ జరగనుంది. 26 ఏళ్ల నీరజ్ చోప్రా ప్రస్తుతం తన వ్యక్తిగత కోచ్ జాన్ జెలెజ్నీ (చెక్ రిపబ్లిక్)తో కలిసి పోచెఫ్స్టోమ్లో శిక్షణ పొందుతున్నాడు. ఒలింపిక్స్‌లో రెండు పతకాలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు సాధించిన నీరజ్ చోప్రా 2020 టోక్యో, 2024 పారిస్ ఒలింపిక్స్‌కు ముందు కూడా పోచెఫ్స్ట్రోమ్లోనే సాధన చేశాడు. కెరీర్లో ఇప్పటి వరకు అత్యుత్తమంగా 89.94 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరిన నీరజ్... 90 మీటర్ల మార్క్ దాటడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. -
నీరజ్ చోప్రా ప్రేమ పెళ్లి.. ‘కట్నకానుకలు’ ఎంతో తెలుసా?
ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా(Neeraj Chopra) ఇటీవలే వైవాహిక బంధంలో అడుగుపెట్టాడు. టెన్నిస్ క్రీడాకారిణి హిమానీ మోర్(Himani Mor)తో జనవరి 16న అతడి పెళ్లి జరిగింది. అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను నీరజ్ షేర్ చేసిన తర్వాతే.. ఈ విషయం బయటి ప్రపంచానికి తెలిసింది.ఈ నేపథ్యంలో నీరజ్ భార్య హిమానీ మోర్ బ్యాగ్రౌండ్‌తో పాటు.. అత్తామామల నుంచి అతడు తీసుకున్న కట్నకానుకలు, అల్లుడిగా అందుకున్న బహుమతులు ఏమిటన్న అంశాల గురించి అభిమానులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో నీరజ్‌కు పిల్లనిచ్చిన అత్తామామలు చంద్ర మోర్, మీనా మోర్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.ప్రేమ పెళ్లి‘‘దేవుడి దయ వల్ల మా అమ్మాయికి మంచి భర్త దొరికాడు. దేశం మొత్తాన్ని గర్వింపజేసిన వ్యక్తితో నా కూతురి పెళ్లి కావడం సంతోషంగా ఉంది. నీరజ్, హిమానీలకు గత రెండేళ్లుగా పరిచయం ఉంది. వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారు. అయితే, ఇరు కుటుంబాల అనుమతితోనే పెళ్లి చేసుకున్నారు’’ అని మీనా మోర్ దైనిక్ భాస్కర్‌కు తెలిపారు.‘కట్నకానుకలు’ ఎంతో తెలుసా?అదే విధంగా.. తమ అల్లుడు తమ నుంచి కట్నంగా కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకున్నాడని హిమానీ తల్లిదండ్రులు వెల్లడించారు. ఇది కాకుండా ఎలాంటి కట్నం, కానుకలు, బహుమతులు.. ఆఖరికి పెళ్లి కూతురికి తల్లిదండ్రులు ఇచ్చే వస్తువులు, దుస్తులను కూడా స్వీకరించలేదని తెలిపారు. తమ కూతురిని అచ్చంగా వాళ్లింటి అమ్మాయిని చేసుకున్నారని సంతోషంతో పొంగిపోయారు.కాగా హర్యానా అథ్లెట్లు నీరజ్- హిమానీల వివాహం హిమాచల్ ప్రదేశ్‌లో జరిగింది. ఇక ప్రి వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా జనవరి 14న నిశ్చితార్థం జరుగగా.. జనవరి 15న హల్దీ, మెహందీ, సంగీత్ నిర్వహించారు. జనవరి 16 మధ్యాహ్నం పెళ్లి తంతు పూర్తికాగా.. సాయంత్రం అప్పగింతల కార్యక్రమం జరిగింది. కేవలం అరవై మంది అతిథుల సమక్షంలోనే వివాహం జరగడం విశేషం. ఇక కొత్త జంట ఇప్పటికే హనీమూన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది.ఎవరీ హిమానీ మోర్?హర్యానాలోని లార్సౌలీ హిమానీ స్వస్థలం. సోనిపట్‌లో ప్రాథమిక విద్య పూర్తి చేసిన ఆమె.. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్ అండ్‌ఫిజికల్ సైన్స్‌లో పట్టా పుచ్చుకుంది. ఉన్నత విద్యనభ్యసించేందుకు హిమానీ అమెరికాకు వెళ్లింది.ప్రస్తుతం హిమానీ మెక్‌కోర్మాక్ ఐసెంబర్గ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చదువుతోంది. 2018లో హిమానీ ఆలిండియా టెన్సిస్ అసోసియేషన్ ఈవెంట్లలో పాల్గొనడం ప్రారంభించింది. కెరీర్లో ఉత్తమంగా సింగిల్స్ విభాగంలో 42వ, డబుల్స్‌లో అత్యుత్తమంగా 27వ ర్యాంకు సాధించింది.నికర ఆస్తుల విలువ?కాగా హర్యానాలోని పానిపట్ జిల్లాలో గల ఖాంద్రా గ్రామంలో నీరజ్ చోప్రా ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. గతంలో ఆర్మీ సుబేదార్‌గా పనిచేశాడు. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన 27 ఏళ్ల నీరజ్ చోప్రా.. ‘గోల్డెన్ బాయ్’గా ప్రసిద్ధి పొందాడు. ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం నీరజ్ రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక నీరజ్ నికర ఆస్తుల విలువ రూ. 30 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.చదవండి: ‘నా కుమారుడిపై పగబట్టారు.. కావాలనే తొక్కేస్తున్నారు’ -
ఇంటివాడైన నీరజ్ చోప్రా
న్యూఢిల్లీ: భారత దిగ్గజ అథ్లెట్, స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఓ ఇంటివాడయ్యాడు. అత్యంత సన్నిహితుల సమక్షంలో జాతీయ మాజీ టెన్నిస్ క్రీడాకారిణి హిమాని మోర్తో రెండు రోజుల క్రితం నీరజ్ చోప్రా వివాహం జరిగింది. ఈ విషయాన్ని ఆదివారం నీరజ్ చోప్రా సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. పెళ్లి ఫొటోలను జతచేస్తూ ‘జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించాను’ అని పోస్ట్ చేశాడు. హరియాణాకు చెందిన 27 ఏళ్ల నీరజ్ చోప్రా 2020 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించాడు. అంతేకాకుండా 2023 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం, 2024 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రజతం... 2018 జకార్తా, 2022 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో... 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో పసిడి పతకాలు సొంతం చేసుకున్నాడు. 2016లో ప్రపంచ అండర్–20 చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెలిచి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన నీరజ్ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. నీరజ్ భార్య హిమాని మోర్ ప్రస్తుతం అమెరికాలోని న్యూ హాంప్‌షైర్ రాష్ట్రంలోని ఫ్రాంక్లిన్ పియర్స్ యూనివర్సిటీలో స్పోర్ట్స్ మేనేజ్మెంట్ మాస్టర్స్ డిగ్రీ చేస్తోంది. 2012లో అండర్–14 జూనియర్ ఫెడ్ కప్‌లో భారత జట్టుకు ఆడిన హిమాని... 2017లో చైనీస్ తైపీలో జరిగిన వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లోనూ పోటీపడింది. అఖిల భారత టెన్నిస్ సంఘం నిర్వహించిన టోర్నీలలో కూడా ఆడింది. 2018లో ఆమె సింగిల్స్‌లో అత్యుత్తమంగా 42వ ర్యాంక్‌లో, డబుల్స్‌లో 27వ ర్యాంక్‌లో నిలిచింది. ఒకవైపు విద్యాభ్యాసం చేస్తూనే మరోవైపు ఆమె ప్రస్తుతం మసాచుసెట్స్‌లోని ఆమ్హెర్స్ట్ కాలేజీ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరిస్తోంది. -
Neeraj Chopra Marriage : పెళ్లి చేసుకున్న నీరజ్ చోప్రా.. ఫోటోలు వైరల్
-
2024 ప్రపంచ ఉత్తమ జావెలిన్ త్రోయర్ నీరజ్
న్యూఢిల్లీ: భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా 2024 సంవత్సరానికిగానూ ప్రపంచ ఉత్తమ జావెలిన్ త్రోయర్‌గా ఎంపికయ్యాడు. అమెరికాకు చెందిన ప్రముఖ మేగజైన్ ‘ట్రాక్ అండ్ ఫీల్డ్ న్యూస్’ ప్రకటించిన ర్యాంకింగ్స్ జాబితాలో... పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన 27 ఏళ్ల నీరజ్ చోప్రా అగ్రస్థానం దక్కించుకున్నాడు. ‘ట్రాక్ అండ్ ఫీల్డ్ న్యూస్’ మేగజైన్‌కు 78 ఏళ్ల చరిత్ర ఉంది. 2024లో డైమండ్ లీగ్‌లో ఒక్క విజయం కూడా సాధించని నీరజ్... దోహా, లుసానే, బ్రస్సెల్స్ ఈవెంట్లలో రెండో స్థానంలో నిలిచాడు. ఫిన్లాండ్లో జరిగిన పావో నుర్మీ గేమ్స్‌లో నీరజ్ టైటిల్ సాధించాడు. రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా)తో పోటీపడి నీరజ్ ఈ జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నాడు. పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గిన పీటర్స్... గత ఏడాది డైమండ్ లీగ్ మూడు ఈవెంట్లలో విజేతగా నిలిచాడు. 2023లోనూ నీరజ్ ఈ జాబితాలో ‘టాప్’ ప్లేస్‌లో నిలిచాడు. ‘అగ్రస్థానం కోసం నీరజ్ చోప్రా, పీటర్స్ మధ్య గట్టి పోటీ సాగింది.గత ఏడాది నీరజ్ డైమండ్ లీగ్ టైటిల్ నెగ్గకపోయినా 3–2తో పీటర్స్‌పై ఆధిక్యంలో నిలిచాడు. ఒలింపిక్ చాంపియన్, పాకిస్తాన్ త్రోయర్ అర్షద్ నదీమ్ ఐదో స్థానం దక్కించుకున్నాడు’ అని మేగజైన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. -
నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం
భారత స్టార్ జావెలియన్ త్రోయర్, హర్యానా అథ్లెట్ నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ అథ్లెటిక్స్ (డబ్ల్యూఏ) హెరిటేజ్ కలెక్షన్స్‌లో అతడి టీ షర్ట్ కొలువు తీరనుంది. వరుస ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన ఏకైక భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌గా నీరజ్ చోప్రా అరుదైన ఘనత సాధించిన విషయం తెలిసిందే. టోక్యోలో స్వర్ణంతో మెరిసిన నీరజ్.. పారిస్‌లో రజతం గెలిచాడు.తన అద్భుత ఆటతీరుతో జాతి మొత్తాన్ని గర్వపడేలా చేసిన నీరజ్‌కు చెందిన టీషర్ట్ ఇప్పుడు మ్యూజియం ఆఫ్ వరల్డ్ అథ్లెటిక్స్ (ఎమ్ఓడబ్ల్యూఏ)లో ‘షో పీస్’ కానుంది. పారిస్ మెగా ఈవెంట్లో రజత ప్రదర్శన సమయంలో వేసుకున్న టీషర్ట్‌ను డబ్ల్యూఏ మ్యూజియంకు విరాళంగా ఇచ్చాడు.కాగా పారిస్‌లో నీరజ్ చోప్రా ఈటెను 89.45 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంతో రజతం గెలుపొందాడు. మరోవైపు పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ (పాక్; 92.97 మీ.) చాంపియన్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే.. నీరజ్‌తో పాటు ఉక్రెయిన్‌కు చెందిన మహిళా అథ్లెట్లు యరోస్లావా మహుచిక్, థియా లాఫొడ్ల తీపిగుర్తులు కూడా ఆ హెరిటేజ్ కలెక్షన్లో ప్రముఖంగా కనిపించనున్నాయి. కొన్నేళ్ల పాటు ఈ విజేతల అపురూపాలను ప్రదర్శించాక క్రీడాభిమానులు, ఔత్సాహికులు కోసం సందర్భాన్ని బట్టి వేలం వేస్తారు. ఆ వేలంలో వచ్చిన మొత్తాన్ని సామాజిక సేవల కొరకు వెచ్చించడం తరచూ జరిగేదే! చదవండి: ‘అతడు కావాలనే ఓడిపోయాడు?’.. అంతర్జాతీయ చెస్ సమాఖ్య స్పందన ఇదే -
నీరజ్ కోచ్‌గా జాన్ జెలెజ్నీ
న్యూఢిల్లీ: జావెలిన్ త్రోలో ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకరు...ఇదే క్రీడాంశంలో సంచలన ప్రదర్శనతో దేశానికి ఒలింపిక్స్ స్వర్ణం అందించిన ఆటగాడు మరొకరు...వీరిద్దరు ఇప్పుడు మరిన్ని రికార్డులను సృష్టించే లక్ష్యంతో జోడీగా మారారు. భారత్ స్టార్ జావెలిన్ త్రోయర్, 2 ఒలింపిక్ పతకాల విజేత నీరజ్ చోప్రా తన కొత్త కోచ్‌గా చెక్ రిపబ్లిక్ దిగ్గజం జాన్ జెలెన్జీని కోచ్‌గా ఎంచుకున్నాడు.రాబోయే 2025 సీజన్‌కు ముందు జత కలిసిన నీరజ్, జెలెజ్నీ అద్భుతమైన ఫలితాలు సాధించాలని పట్టుదలగా ఉన్నారు. 58 ఏళ్ల జెలెజ్నీ 1988 సియోల్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన అనంతరం వరుసగా మూడు ఒలింపిక్స్ (1992, 1996, 2000)లలో స్వర్ణాలు గెలుచుకున్నాడు. మూడు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన అతని పేరిటే జావెలిన్‌ను అతి ఎక్కువ దూరం విసిరిన వరల్డ్ రికార్డు (98.48 మీటర్లు) కూడా ఉంది.2020 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో రజతం సాధించిన నీరజ్‌కు ఇటీవలి వరకు జర్మనీకి చెందిన బయోమెకానిక్స్ ఎక్స్పర్ట్ క్లాస్ బార్టొనిట్జ్ కోచ్‌గా ఉన్నాడు. ‘చిన్నప్పటినుంచి నేను జెలెజ్నీకి వీరాభిమానిని. ఆయన టెక్నిక్ అంటే ఎంతో ఇష్టం. నా ఆటను మెరుగుపర్చుకునేందుకు పెద్ద సంఖ్యలో ఆయన వీడియోలు చూస్తుండేవాడిని. ఇప్పుడు జెలెజీ్నతో కలిసి పని చేసే అవకాశం రావడం నా అదృష్టం.మా ఇద్దరి త్రోయింగ్ శైలి ఒకటే. మున్ముందు నా కెరీర్లో మరిన్ని అత్యుత్తమ విజయాలు సాధిస్తాననే నమ్మకం ఉంది’ అని నీరజ్ వ్యాఖ్యానించాడు. నీరజ్ ఆట గురించి తనకు బాగా తెలుసని.. ఎంతో మంది అథ్లెట్లు కోచింగ్ కోసం తనను సంప్రదించినా వారందరినీ కాదని భారత ఆటగాడిని ఎంచుకోవడం అతనిలో ప్రతిభను చూసేనని జెలెన్జీ వెల్లడించాడు. గతంలో ఈ దిగ్గజం శిక్షణలోనే జేకబ్ వాలెజ్, విటెస్లావ్ వెసెలి, బార్బరా స్పొటకోవా లాంటి ఆటగాళ్లు ఒలింపిక్స్‌లో పతకాలు గెలుచుకోవడం విశేషం. -
ప్రపంచ చాంపియన్‌షిప్ లక్ష్యం
సొనెపట్: కొత్త సీజన్‌ను వంద శాతం ఫిట్నెస్తో ప్రారంభిస్తానని భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా అన్నాడు. రెండు వరుస ఒలింపిక్స్‌లలో స్వర్ణ, రజత పతకాల విజేత అయిన 26 ఏళ్ల ఈ స్టార్ గాయం నుంచి కోలుకున్నట్లు చెప్పాడు. వచ్చే ఏడాది జరిగే ప్రపంచ చాంపియన్íÙప్లో టాప్–3లో నిలవడమే లక్ష్యంగా శ్రమిస్తానని పేర్కొన్నాడు. బ్రస్సెల్స్‌లో జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్లో చోప్రా రెండో స్థానంలో నిలిచి సీజన్‌ను ఘనంగా ముగించాడు. హరియాణాలోని స్పోర్ట్స్ యూనివర్సిటీలో నిర్వహించిన ‘మిషన్ ఒలింపిక్స్–2036’ పాల్గొన్న నీరజ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘ఇప్పటిదాకా జరిగిన సీజన్ ముగిసింది. కొత్త సీజన్‌పై దృష్టి పెట్టాలి. ఇందులో పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా. 2025లో టోక్యోలో జరిగే ప్రపంచ చాంపియన్íÙప్లో పతకమే లక్ష్యంగా సన్నాహాలు ప్రారంభించాల్సి ఉంది. ఒలింపిక్స్ అనేది ఎప్పటికైనా పెద్ద ఈవెంటే. కానీ దానికి ఇంకా నాలుగేళ్ల సమయముంది’ అని అన్నాడు. ఈ ఏడాది గాయంతో ఇబ్బంది పడిన తను ప్రస్తుతం కోలుకున్నానని చెప్పాడు. పూర్తిస్థాయి ఫిట్నెస్తో కొత్త సీజన్ బరిలోకి దిగుతానన్నాడు. సాంకేతిక అంశాలపై కూడా దృష్టి సారించినట్లు చెప్పిన చోప్రా జర్మన్ బయోమెకానిక్ నిపుణుడైన క్లాస్ బార్టొనిజ్తో కలిసి పురోగతి సాధించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పాడు. స్వదేశంలోనూ శిక్షణ తీసుకోవచ్చని అయితే పోటీలు విదేశాల్లో ఉండటంతో అక్కడే ట్రెయినింగ్‌లో పాల్గొంటున్నానని వివరించాడు. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో వరుస ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలు గెలిచిన భారత తొలి అథ్లెట్‌గా ఘనతకెక్కిన చోప్రా ఒలింపిక్స్‌లో ఆరు పతకాలే సాధించినా... ఎక్కువగా నాలుగో స్థానాలు వచ్చాయన్న సంగతిని గుర్తు చేశాడు. దీంతో ఒక్క స్వర్ణం లేకపోయినా మన ప్రదర్శన తీసికట్టుగా భావించాల్సిన అవసరం లేదన్నాడు. అయితే పారాలింపిక్స్‌లో మన పారా అథ్లెట్లు అసాధారణ స్థాయిలో పతకాలు సాధించారని అభినందించాడు. తదుపరి మెగా ఈవెంట్లలో భారత్ బలమైన జట్టుగా బరిలోకి దిగుతుందని, మరిన్ని పతకాలు సాధిస్తుందని చెప్పాడు. అంతకుముందు కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయతో నీరజ్ భేటీ అయ్యాడు. తాను సంతకం చేసిన జెర్సీని మంత్రికి నీరజ్ అందజేశాడు. -
నీరజ్ చోప్రా భావోద్వేగం.. స్పందించిన మనూ భాకర్
తాను ఈ ఏడాది ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని.. తిరిగి పూర్తి ఫిట్నెస్తో మళ్లీ బరిలోకి దిగుతానని భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా అన్నాడు. 2024లో తాను పాల్గొనబోయే చివరి టోర్నీని విజయంతో ముగించాలనకున్నానని.. అయితే, అంచనాలు అందుకోలేకపోయానని విచారం వ్యక్తం చేశాడు. పోటీకి ముందు తాను గాయపడ్డాడని.. అయినప్పటికీ తన టీమ్ సహకారం వల్ల రెండో స్థానంలో నిలవగలిగానని పేర్కొన్నాడు.కాగా ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ అథ్లెటిక్స్ మీట్ గ్రాండ్ ఫైనల్ ఈవెంట్లో నీరజ్ చోప్రా రెండో స్థానాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. బ్రసెల్స్‌లో శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో గ్రెనెడాకు చెందిన వరల్డ్ మాజీ చాంపియన్ అండర్సన్ పీటర్స్ విజేతగా నిలిచాడు. అతడే టైటిల్ విన్నర్పీటర్స్ జావెలిన్‌ను 87.87 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానాన్ని దక్కించుకోగా.. నీరజ్ ఈటెను 87.86 మీటర్ల దూరం విసిరాడు. ఈ క్రమంలో రెండో స్థానంలో నిలిచిన అతడికి ప్రైజ్‌మనీగా 12 వేల డాలర్లు (రూ. 10 లక్షలు) లభించాయి.ఇక జర్మనీకి చెందిన జూలియన్ వెబెర్ 85.97 మీటర్లు జావెలిన్‌ను విసిరి మూడో స్థానంలో నిలిచాడు. ఒలింపిక్స్‌లోనూ రెండోస్థానంలోకాగా ఈ ఏడాది నీరజ్ మెరుగ్గానే రాణించాడు. అయితే, ఒలింపిక్స్‌లో రెండో స్వర్ణం గెలవాలన్న అతడి కల నెరవేరలేదు. ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్‌లో పాకిస్తాన్ జావెలిన్ త్రోయర్.. అర్షద్ నదీం పసిడి పతకం గెలవగా.. నీరజ్ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక డైమండ్ లీగ్‌లోనైనా అగ్రస్థానంలో నిలుస్తాడనుకుంటే.. అక్కడే రెండో స్థానమే దక్కింది.అయితే, ఓవరాల్‌గా నీరజ్ డైమండ్ లీగ్ గ్రాండ్ ఫైనల్ ఈవెంట్లో టాప్–3లో నిలువడం ఇది మూడోసారి. 2022 గ్రాండ్ ఫైనల్లో విజేతగా నిలిచిన నీరజ్... 2023 గ్రాండ్ ఫైనల్లో రెండో స్థానాన్ని పొందాడు. ఈసారి డైమండ్ లీగ్ ఫైనల్లో ఈ సీజన్ మొత్తం నీరజ్ నిలకడగా రాణించాడు. ఆరు టోర్నీల్లో పోటీపడి ఐదింటిలో రెండో స్థానాన్ని, ఒక టోర్నీలో అగ్ర స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.అథ్లెట్‌గా.. వ్యక్తిగా మరింత మెరుగయ్యానుఈ నేపథ్యంలో నీరజ్ చోప్రా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ‘‘ఈ ఏడాది మిశ్రమ భావనలతో ముగిసింది. సోమవారం.. నేను గాయపడ్డాను. నా ఎడమఅరచేతిలోని ఎముక ఫాక్చర్ అయినట్లు ఎక్స్ రే ద్వారా తేలింది. పోటీకి ముందు ఇలా కావడం తీవ్రంగా బాధించింది. అయితే, నా టీమ్ నన్ను బ్రసెల్స్ లీగ్‌లో పాల్గొనేలా సమాయత్తం చేసింది.ఈ ఏడాది ఇదే చివరి కాంపిటీషన్. టైటిల్‌తో ముగించాలని కోరుకున్నా. కానీ అలా జరుగలేదు. ఏదేమైనా ఈ ఏడాది ఎన్నో కొత్త పాఠాలు నేర్చుకున్నాను. త్వరలోనే మళ్లీ పూర్తి ఫిట్నెస్తో తిరిగి వస్తా. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.ఈ ఏడాది అథ్లెట్‌గా.. వ్యక్తిగా మరింత మెరుగయ్యాను. 2025లో కలుసుకుందాం’’ అని ఉద్వేగపూరిత నోట్ రాశాడు. ఈ క్రమంలో.. ప్యారిస్ ఒలింపిక్స్ కాంస్య పతకాల విజేత, షూటర్ మనూ భాకర్ బదులిస్తూ.. నీరజ్ చోప్రాను అభినందించింది. స్పందించిన మనూ భాకర్‘‘2024 సీజన్లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నావు నీరజ్ చోప్రా. నువ్వు త్వరగా కోలుకోవాలని.. వచ్చే ఏడాది మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’’ అని మనూ భాకర్ ఆకాంక్షించింది.కాగా ప్యారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల తర్వాత నీరజ్ చోప్రా.. మనూ భాకర్, ఆమె తల్లితో ముచ్చటించిన దృశ్యాలు వైరలైన విషయం తెలిసిందే. దీంతో ఈ హర్యానా అథ్లెట్ల మధ్య మంచి అనుబంధం ఉందంటూ వార్తలు రాగా.. మనూ భాకర్ తండ్రి స్పందిస్తూ.. నీరజ్ తమ కుమారుడి లాంటి వాడని పేర్కొన్నారు. చదవండి: ఫైనల్ బెర్త్ లక్ష్యంగా... -
నీరజ్ చోప్రాకు షాక్.. సెంటీమీటర్ తేడాతో టైటిల్ మిస్
డైమండ్ లీగ్-2024లో పారిస్ ఒలింపిక్స్ విజేత, భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు మళ్లీ నిరాశే ఎదురైంది.బ్రెస్సెల్స్ వేదికగా జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్లో నీరజ్ రెండో స్ధానంతో సరిపెట్టుకున్నాడు. సెంటీమీటర్ తేడాతో టైటిల్‌ను భారత బల్లెం వీరుడు కోల్పోయాడు. నీరజ్ తన మూడో ప్రయత్నంలో 87.86తో అత్యుత్తమ త్రోను నమోదు చేశాడు. శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ తుది పోరులో పారిస్ బ్రాంజ్ మెడలిస్ట్, గ్రెనడాకు చెందిన అండర్సన్ పీటర్స్ ఈటెను 87.87 విసిరి అగ్రస్ధానంలో నిలిచాడు. దీంతో పీటర్స్ ప్రతిష్టాత్మక డైమండ్ ట్రోఫీని గెలుచుకున్నాడు. విజేతగా నిలిచిన పీటర్స్ కంటే కేవలం 0.01 మీటర్లు మాత్రమే నీరజ్ వెనుకబడ్డాడు. కాగా గతేడాది కూడా డైమండ్ లీగ్‌లో కూడా నీరజ్ రెండో స్ధానంలో నిలిచి టైటిల్‌ను మిస్స్ అయ్యాడు. ఆ ఈవెంట్లో నీరజ్ చోప్రా తన ఈటెను 83.80 దూరం విసిరి రెండో స్ధానంతో సరిపెట్టుకున్నాడు. చెక్ రిపబ్లిక్కు చెందిన జాకుబ్ వాడ్లేజ్ 84.24 దూరం విసిరి టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఈ ఏడాది లీగ్‌లో జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ 85.97 మీటర్లు విసిరి మూడో స్థానంలో నిలిచాడు.చదవండి: ‘బాగానే ఉన్నా.. కానీ ఇప్పట్లో ఆడలేను’ -
‘డైమండ్’ మెరుపులకు ‘సై’
బ్రసెల్స్ (బెల్జియం): అథ్లెటిక్స్ ప్రపంచంలో ప్రతిష్టాత్మక ఈవెంట్ అయిన డైమండ్ లీగ్ మీట్ ఫైనల్స్‌కు రంగం సిద్ధమైంది. శుక్ర, శనివారాల్లో రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో అగ్రశ్రేణి అథ్లెట్లంతా తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా ఇటీవల పారిస్ ఒలింపిక్స్ పతకాలతో మెరిసిన ఆటగాళ్లంతా మళ్లీ తమ స్థాయిని ప్రదర్శించాలని పట్టుదలగా ఉన్నారు. పోటీ పడేందుకు ఈ ఏడాది మొత్తం 14 డైమండ్ లీగ్ సిరీస్‌లు అందుబాటులో ఉండగా... తాము ఎంచుకున్న సిరీస్‌లలో పాల్గొనడం ద్వారా సాధించిన పాయింట్లతో ఆటగాళ్లు ఫైనల్‌కు అర్హత సాధించారు. ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లు కలిపి మొత్తం 32 అంశాల్లో పతకాలు గెలిచేందుకు అవకాశం ఉంది. పోల్‌వాల్ట్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన అర్మాండ్ డుప్లాంటిస్ (స్వీడన్), అమెరికా స్ప్రింటర్ ష కారీ రిచర్డ్సన్, స్టార్ హర్డ్లర్ సిడ్నీ మెక్‌లాలిన్, లాంగ్ డిస్టెన్స్ రన్నర్ ఫెయిత్ కిపైగాన్ లాంటి టాప్ ప్లేయర్లు ఫైనల్లో బరిలోకి దిగుతున్నారు. లెట్సిల్ టె»ొగో (బోట్స్వానా), ర్యాన్ క్రూజర్, యరస్లొవా మహుచుక్ తదితరులు కూడా తుది సమరంలో పోటీ పడుతున్నారు.ఓవరాల్‌గా 18 మంది ఒలింపిక్ విజేతలు ఇక్కడ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుండటం విశేషం. 50 వేల సామర్థ్యం గల కింగ్ బౌదిన్ స్టేడియంలో పోటీలు నిర్వహిస్తారు. ఇక్కడ విజేతగా నిలిచిన వారికి డైమండ్ లీగ్ ట్రోఫీతో 30 వేల డాలర్ల ప్రైజ్‌మనీ, వచ్చే ఏడాది జపాన్‌లో జరిగే వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్íÙప్‌కు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభిస్తుంది. అగ్రశ్రేణి అథ్లెట్ల ఆటతో రెండు రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులకు మరింత వినోదం ఖాయం. నేడు సాబ్లే... రేపు నీరజ్ డైమండ్ లీగ్ ఫైనల్లో భారత్ నుంచి ఇద్దరు అథ్లెట్స్ పోటీ పడుతుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. 3000 మీటర్ల స్టీపుల్ చేజ్లో జాతీయ రికార్డు సాధించిన అవినాశ్ సాబ్లే ఈ పోటీల్లో బరిలో నిలిచాడు. నేటి రాత్రి 12.30 గంటలకు అతని ఈవెంట్ మొదలవుతుంది. ఈ ఏడాది పారిస్, సిలేసియాలలో జరిగిన సిరీస్‌లలో పాల్గొన్న సాబ్లే మొత్తం 3 పాయింట్లతో 14వ స్థానంలో నిలిచాడు. ఫైనల్లో 12 మంది మాత్రమే పోటీ పడే అవకాశం ఉంది. అయితే తనకంటే మెరుగైన స్థానంలో నిలిచిన నలుగురు అథ్లెట్లు తప్పుకోవడంతో సాబ్లేకు చాన్స్ లభించింది. మరోవైపు భారత దిగ్గజ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఫైనల్‌కు అర్హత సాధించడంలో ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. దోహా, లుసాన్ సిరీస్‌లలో పాల్గొన్న అతను మొత్తం 14 పాయింట్లు సాధించి ఓవరాల్‌గా నాలుగో స్థానం సాధించాడు. గత ఏడాది డైమండ్ లీగ్‌లో చోప్రా రన్నరప్‌గా నిలిచాడు. రేపు అర్ధరాత్రి 12 గంటల నుంచి నీరజ్ చోప్రా ఈవెంట్ జరుగుతుంది. జ్యూరిక్ (స్విట్జర్లాండ్)లో జరిగిన 2022 డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో నీరజ్ చోప్రా విజేతగా... యూజీన్ (అమెరికా)లో జరిగిన 2023 డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో నీరజ్ రన్నరప్‌గా నిలిచాడు. -
బ్రస్సెల్స్ డైమండ్ లీగ్ ఫైనల్‌కు నీరజ్ చోప్రా అర్హత.. నదీమ్ ఔట్
భారత బల్లెం వీరుడు, ఒలింపిక్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా బ్రస్సెల్ వేదికగా జరగబోయే డైమండ్ లీగ్ ఆర్హత సాధించాడు. నీరజ్ గాయం కారణంగా జ్యూరిచ్ డైమండ్ లీగ్‌కు దూరంగా ఉన్నప్పటకి.. 14 పాయింట్లతో నాలుగో స్థానం సాధించి బ్రస్సెల్స్ లీగ్ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకున్నాడు.ఈ జాబితాలో గ్రెనడా ఆటగాడు అండర్సన్ పీటర్స్ 29 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా, జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ 21 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. చెక్ రిపబ్లిక్కు చెందిన జాకుబ్ వడ్లెజ్ 16 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. అదే విధంగా మోల్డోవాకు చెందిన ఆండ్రియన్ మర్దారే (13 పాయింట్లు), జపాన్‌కు త్రోయర్ రోడెరిక్ జెంకీ డీన్ (12 పాయింట్లు) టాప్-6లో చోటు దక్కించుకున్నారు. కాగా ఈ పోటీలు సెప్టెంబరు 13, 14 తేదీల్లో జరగనున్నాయి.నదీమ్ ఆనర్హత..అయితే ఈ పోటీలకు ప్యారిస్ ఒలింపిక్స్ బంగారు పతక విజేత, పాకిస్తాన్ స్టార్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ ఆర్హత సాధించలేకపోయాడు. కేవలం ఐదు పాయింట్లు మాత్రమే సాధించి బ్రస్సెల్ డైమండ్ లీగ్‌లో బరిలోకి దిగే అవకాశాన్ని కోల్పోయాడు. -
‘ఆరు’లో అదరగొట్టి...
సరిగ్గా రెండు వారాల క్రితం భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకంతో మెరిశాడు. ఆరు ప్రయత్నాల్లో ఐదుసార్లు అతను ఫౌల్ అయినా ఒక్క మంచి త్రో అతనికి ‘పారిస్’లో రెండో స్థానాన్ని అందించింది. ఇప్పుడు వేదిక మారింది. సమరం ఒలింపిక్స్ నుంచి డైమండ్ లీగ్‌కు మారింది... కానీ అగ్రస్థానంలో నిలవాలనే ఒత్తిడి అతనిలో తగ్గినట్లు కనిపించలేదు... ఫలితంగా అదే తడబాటు. తొలి ఐదు ప్రయత్నాల్లో ఆశించిన దూరం జావెలిన్ వెళ్లలేదు... కానీ ఎట్టకేలకు ఆరో ప్రయత్నంలో నీరజ్ తన స్థాయిని ప్రదర్శించాడు. ఒక్క త్రోతో రెండో స్థానానికి దూసుకెళ్లి మీట్‌ను ముగించాడు. లుసాన్ (స్విట్జర్లాండ్): ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ అథ్లెటిక్స్ లుసాన్ మీట్లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ మీట్లో నీరజ్ జావెలిన్‌ను 89.49 మీటర్ల దూరం విసిరాడు. ఈ సీజన్లో అతనికి ఇది అత్యుత్తమ ప్రదర్శన కాగా... మొత్తం కెరీర్ లో రెండో అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. రెండేళ్ల క్రితం స్టాక్‌హోమ్‌లో జరిగిన డైమండ్ లీగ్ పోటీల్లో జావెలిన్‌ను నీరజ్ 89.94 మీటర్ల దూరం విసిరాడు. ఈ ఈవెంట్లో 90.61 మీటర్ల దూరంతో ప్రపంచ మాజీ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనడా) మొదటి స్థానంలో నిలవగా... జూలియన్ వెబర్ (జర్మనీ; 87.08 మీటర్లు) మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలుచుకున్న పాకిస్తాన్ ఆటగాడు అర్షద్ నదీమ్ ఈ మీట్లో పాల్గొనలేదు. పారిస్ ఒలింపిక్స్‌లో 89.45 మీటర్ల దూరంతో నీరజ్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. గజ్జల్లో గాయంతో బాధపడుతున్న అతను ఒకదశలో డైమండ్ లీగ్ నుంచి తప్పుకోవాలని భావించినా... చివరకు బరిలోకి దిగాడు. ఇప్పుడు పక్షం రోజుల తేడాతో కాస్త మెరుగైన ప్రదర్శన అతడి నుంచి వచ్చింది. తొలి నాలుగు ప్రయత్నాల్లో అతని త్రో ఒక్కటీ కనీసం 85 మీటర్లు కూడా వెళ్లలేదు. నీరజ్ వరుసగా 82.10 మీటర్లు... 83.21 మీటర్లు... 83.13 మీటర్లు... 82.34 మీటర్లు మాత్రమే జావెలిన్‌ను విసరగలిగాడు. వీటి తర్వాత అతను నాలుగో స్థానంలో ఉన్నాడు. అయితే ఐదో ప్రయత్నం అతడిని మూడో స్థానానికి తీసుకెళ్లింది. ఇందులో జావెలిన్ 85.58 మీటర్లు వెళ్లింది.ఆఖరి ప్రయత్నంలో అండర్సన్ ఏకంగా 90.61 మీటర్లతో కొత్త మీట్ రికార్డు నెలకొల్పి అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. అనంతరం నీరజ్ తన శక్తిని మొత్తం ఉపయోగించి విసిరిన ఆరో అస్త్రం ఎట్టకేలకు సానుకూల ఫలితాన్ని అందించింది. 89.49 మీటర్లతో అతనికి రెండో స్థానం దక్కింది. అయితే చాలా కాలంగా నీరజ్ ఆశిస్తున్న 90 మీటర్ల మైలురాయిని మాత్రం అతను మరోసారి అందుకోలేకపోయాడు! ఫైనల్‌కు అర్హత సాధించినట్లేనా! తాజా ఈవెంట్లో రెండో స్థానంలో నిలవడంతో నీరజ్‌కు 7 పాయింట్లు దక్కాయి. దోహా డైమండ్ లీగ్‌లో కూడా రెండో స్థానం సాధించడం ద్వారా వచి్చన 7 పాయింట్లు కలిపి ప్రస్తుతం నీరజ్ ఖాతాలో 14 పాయింట్లు ఉన్నాయి. ఓవరాల్‌గా ప్రస్తుతం వెబర్‌తో సమానంగా అతను మూడో స్థానంలో ఉన్నాడు. అండర్సన్ (21), జాకబ్ వలెచ్ (16) తొలి రెండు స్థానాలతో ఇప్పటికే ఫైనల్‌కు అర్హత సాధించారు. ఫైనల్‌కు మొత్తం ఆరుగురు అర్హత పొందుతారు. సెపె్టంబర్ 5న జ్యూరిచ్‌లో జరిగే చివరి మీట్లోనూ నీరజ్ పాల్గొనబోతున్నాడు. అక్కడా రాణిస్తే అతను ఫైనల్‌కు అర్హత సాధించడం లాంఛనమే కానుంది. బ్రసెల్స్‌లో సెప్టెంబర్ 14 నుంచి ఫైనల్ పోటీలు జరుగుతాయి. ఈవెంట్ ఆరంభంలో కొంత నిరాశ కలిగింది. అయితే ఫలితం తర్వాత చూస్తే నా ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నా. ముఖ్యంగా చివరి ప్రయత్నంలో నా కెరీర్లో రెండో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలిగాను. సరిగ్గా మొదలు పెట్టకపోయినా ఆ తర్వాత నేను కోలుకోగలగడం, పోరాటస్ఫూర్తి కనబర్చడం ఆనందాన్నిచ్చింది. తొలి నాలుగు ప్రయత్నాలు 80–83 మీటర్ల మధ్యే ఉన్నా ఆఖరి రెండు త్రోలలో నా పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించాను. ఈ స్థాయి పోటీల్లో మానసికంగా కూడా దృఢంగా ఉండి చివరి వరకు పోరాడటం ముఖ్యం. అండర్సన్ 90 మీటర్ల త్రో విసిరాక నాపై ఒత్తిడి పెరిగింది. ఎలాగైనా దానిని దాటాలని అనుకున్నా. అయితే నా మిత్రుడైన కెన్యా ప్లేయర్ జూలియస్ యెగో నా వద్దకు వచ్చి తగిన సలహా ఇచ్చాడు. ప్రశాంతంగా ఉండు, నువ్వు ఎక్కువ దూరం విసరగలవు అని చెబుతూ నా ఆందోళనను తగ్గించాడు. దాంతో ఒత్తిడి లేకుండా జావెలిన్‌ను విసరగలిగాను. –నీరజ్ చోప్రా -
రెండో స్థానంలో నిలిచిన నీరజ్ చోప్రా
లూసాన్ డైమండ్ లీగ్‌లో స్టార్ జావలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. నిన్న జరిగిన పోటీలో నీరజ్ తన చివరి అవకాశంలో బల్లాన్ని 89.49 మీటర్ల దూరం విసిరాడు. ఇది ఈ సీజన్లో అతనికి అత్యుత్తమ ప్రదర్శన. ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ తన బల్లాన్ని 89.45 మీటర్ల దూరం విసిరాడు. నిన్న జరిగిన పోటీలో నీరజ్ నాలుగో రౌండ్ వరకు నాలుగో స్థానంలో నిలిచాడు. ఐదో ప్రయత్నంలో 85.58 మీటర్లు విసరగలిగాడు. చివరిదైన ఆరో ప్రయత్నంలో సీజన్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. Feeling so bad for Neeraj Chopra 💔90m will come for sure .Neeraj was nowhere close to his best in 1st 5 throws gave his all in at 6th throw with SB of 89.49m !!Common Neeraj 90m will come for sure !!#NeerajChopra #DiamondLeague #Javelin pic.twitter.com/Omuoapm3gK— Ram kapoor🇮🇳 (@Ram1947_) August 22, 2024ఈ పోటీలో టూ టైమ్ వరల్డ్ ఛాంపియన్, పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత ఆండర్సన్ పీటర్స్ (గ్రెనెడా) తన బల్లాన్ని 90.61 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. బల్లాన్ని 87.08 మీటర్ల దూరం విసిరిన జర్మనీ త్రోయర్ జూలియన్ వెబర్ మూడో స్థానంలో నిలిచాడు. కాగా, పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం కోసం జరిగిన పోటీ నీరజ్ చోప్రా పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. -
నీరజ్‌పైనే దృష్టి
లుసాన్ (స్విట్జర్లాండ్): పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచి చరిత్ర సృష్టించిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరో ఈవెంట్‌కు సిద్ధమయ్యాడు. డైమండ్ లీగ్ సిరీస్‌లో భాగంగా నేడు లుసాన్ మీట్లో నీరజ్ బరిలోకి దిగుతున్నాడు. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి గం. 12:10 నుంచి నీరజ్ ఈవెంట్ మొదలవుతుంది. పారిస్ ఒలింపిక్స్‌లో తొలి ఆరు స్థానాల్లో నిలిచిన జావెలిన్ త్రోయర్లలో పాకిస్తాన్ అథ్లెట్, స్వర్ణ పతక విజేత అర్షద్ నదీమ్ మినహా మిగిలిన ఐదుగురు లుసాన్ మీట్లో ఉన్నారు. స్పోర్ట్స్–18 చానెల్లో, జియో సినిమా యాప్‌లో నీరజ్ ఈవెంట్‌ను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. డైమండ్ లీగ్‌లో భాగంగా మొత్తం 14 మీట్లు జరుగుతాయి. అయితే జావెలిన్ త్రో మాత్రం నాలుగు మీట్లలోనే నిర్వహిస్తారు. ఇప్పటికే దోహా, పారిస్ అంచెలు ముగిశాయి. లుసాన్ మీట్ తర్వాత జ్యూరిచ్‌లో (సెపె్టంబర్ 5న) చివరిదైన నాలుగో అంచె జరుగుతుంది. అనంతరం ఈ నాలుగు మీట్లలో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా టాప్–6లో నిలిచిన వారు సెప్టెంబర్ 14న బ్రస్సెల్స్‌లో జరగనున్న ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ఈ సీజన్లో దోహా మీట్లో మాత్రం పాల్గొని రెండో స్థానంలో నిలిచిన నీరజ్ ప్రస్తుతం 7 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. లుసాన్ మీట్లో మొత్తం 10 మంది జావెలిన్ త్రోయర్లు బరిలో ఉన్నారు. మొత్తం ఆరు అవకాశాలు ఇస్తారు. తొలి మూడు ప్రయత్నాలు ముగిశాక చివరి రెండు స్థానాల్లో నిలిచిన వారు నిష్క్రమిస్తారు. మిగిలిన ఎనిమిది మంది ఆరు త్రోలను పూర్తి చేస్తారు. టాప్–8లో నిలిచిన వారికి పాయింట్లు కేటాయిస్తారు. టాప్–3లో నిలిచిన వారికి వరుసగా 8,7,6 పాయింట్లు లభిస్తాయి. అనంతరం 4,5,6,7,8 స్థానాల్లో నిలిచిన వారికి వరుసగా 5,4,3,2,1 పాయింట్లు కేటాయిస్తారు. డైమండ్ లీగ్ మీట్ ఫైనల్స్‌లో మాత్రమే పతకాలను అందజేస్తారు. ఈ సీజన్లో నీరజ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. పోటీపడ్డ ఐదు ఈవెంట్స్‌లోనూ కనీసం టాప్–2లో నిలిచాడు. గతంలో 2022లో డైమండ్ లీగ్ విజేతగా నిలిచిన 26 ఏళ్ల నీరజ్.. గత ఏడాది రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇటీవల గాయంతోనే ‘పారిస్’ క్రీడల్లో బరిలోకి దిగిన నీరజ్.. సీజన్ అత్యుత్తమ ప్రదర్శనతో రజతం చేజిక్కించుకున్నాడు. మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో పసిడి పతకం గెలిచిన నీరజ్.. విశ్వక్రీడల అథ్లెటిక్స్‌లో దేశానికి తొలి పతకం అందించిన అథ్లెట్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు.విశ్వక్రీడలు ముగియగానే స్వదేశానికి కూడా తిరిగిరాని నీరజ్‌చోప్రా.. నేరుగా స్విట్జర్లాండ్‌కు వెళ్లి ప్రాక్టీస్‌లో మునిగిపోయాడు. ‘ఒలింపిక్స్ ముగియగానే... డైమండ్ లీగ్ సన్నాహాలు ప్రారంభించా. ఇందులో భాగంగానే స్విట్జర్లాండ్‌లో శిక్షణ తీసుకుంటున్నా. గాయం గురించి పెద్దగా ఆందోళన చెందడం లేదు. మరో నెల రోజులైతే సీజన్ ముగుస్తుంది. ఆ తర్వాత వైద్యులను సంప్రదిస్తా’ అని నీరజ్ వెల్లడించాడు. -
విభజన రేఖను చెరిపిన విజేతలు
దేశ విభజనానంతరం ఎన్నో పరిణామాలు సంభవించాయి. గత నలభై ఏళ్లలో – విభజనకు ముందు తరం రాలిపోయింది. రాజకీయాల్లో అనేక మార్పులు వచ్చాయి. బాలీవుడ్ సినిమాలు మునుపటిలా లేవు. అయినప్పటికీ భారత్, పాక్ మనుషులు ఒకేలా ఉన్నారు. ఒకే ఆహారం తీసుకుంటున్నారు. ఒకే ఒక చోట వేరుపడింది ఎక్కడంటే మతంలో! బ్రిటిష్ వాళ్లు గీసిన మ్యాపులో! దాన్ని దాటగలిగేందుకు ‘పంజాబీయత’కు తగినంత బలమే ఉంది. ఆ బలమే... నీరజ్–అర్షద్ ఒకరితో ఒకరు చక్కగా కలిసిపోవటానికి కారణం అయింది. వారి క్రీడ మాత్రమే కాదు, వారి సంస్కృతి కూడా ఆ దగ్గరితనాన్ని నిర్ణయించింది. బరిలో ప్రత్యర్థులైనా పరస్పరం సానుకూలంగా మాట్లాడటం, బాంధవ్యాన్ని పంచుకోవటం అసహజత్వానికి దూరంగా ఉన్నాయి.పంజాబీలు పాకిస్తాన్‌ను ఎలా చూస్తారనే దాని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అది దేశంలోని మిగతా ప్రాంతాలకు భిన్నంగా ఉంటుంది. నిజానికి, బెంగాలీలు బంగ్లాదేశ్‌ను ఎలా చూస్తారనే దానిని అందుకు చాలా దగ్గరి సమాంతరంగా నేను ఊహించుకుంటాను. రెండు రాష్ట్రాలు కూడా విభజన వల్ల తమ దేశాలతో వేరైపోయినప్పటికీ, కోల్పోయిన తమ రెండో సగంతో ఉన్న ఆత్మీయతలు, ఆనాటి అమ్మ ఒడి జ్ఞాపకాలు కొడిగట్టిపోలేదు. కాకపోతే అవి తరాల నుండి తరా లకు సంక్రమిస్తున్నట్లుగా ఉంది. బహుశా అందుకే నీరజ్ చోప్రా–అర్షద్ నదీమ్‌ల కథ దేశంలోని ఇతర ప్రాంతాలకు ప్రాధాన్యత గల వార్త అయితే, పంజాబీలకు అది – ఇందులో వింతేముందన్నంతగా – ఒక మామూలు సంగతి అయింది. నేను మరికాస్త ముందుకు వెళ్లబోయే ముందు, హరియాణా 1966 వరకు కూడా కొన్ని శతాబ్దాలపాటు అవిభక్త పంజాబ్‌లో ఒక ముఖ్యమైన భాగంగా ఉందన్న సంగతిని మీకు గుర్తు చేయనివ్వండి. లాహోర్, లూథియానా మాదిరిగానే అంబాలా, రోహ్తక్ పంజాబీ ప్రాంతాలు. కాబట్టి, నీరజ్–అర్షద్ ఒకరితో ఒకరు చక్కగా కలిసిపోవటంలో ఆశ్చర్యం లేదు. వారి క్రీడ మాత్రమే కాదు, వారి సంస్కృతి కూడా ఆ దగ్గరితనాన్ని నిర్ణయించింది. ఒకరితో ఒకరికి తమ గ్రెనడా, ఐరోపా, అమెరికా సహ–అథ్లెట్ల కంటే ఎక్కువగా ఉమ్మడితనం ఉంది. ఆలింగనం, నవ్వు, ఒకరి గురించి ఒకరు సానుకూలంగా మాట్లాడటం, ఒక బాంధవ్యాన్ని పంచుకోవటం ఇద్దరి మధ్య ఎంతో స్పష్టంగా, అసహజ త్వానికి దూరంగా ఉన్నాయి. ఇలా కాకపోతేనే ఆశ్చర్యం.వారి తల్లుల విషయంలో కూడా ఇది వాస్తవం. వారు తమ కొడు కుతో తలపడిన వారిని ప్రత్యర్థిగా చూడకపోవటానికి కారణం వారు తమ ‘పంజాబీయత’ను అనుభూతి చెందటమే. నిస్సందేహంగా ఇది, వారు మాట్లాడే విధానంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న సారూప్యాన్ని వివరిస్తోంది. ‘‘నేను నీరజ్ కోసం కూడా ప్రార్థిస్తున్నాను’’ అని అర్షద్ తల్లి రజియా పర్వీన్ చెప్పారు. అదే విధంగా నీరజ్ తల్లి సరోజ్ దేవి కూడా ‘‘అతను కూడా నా కుమారుడి లాంటి వాడే’’ అని చెప్పారు. ‘‘బంగారం గెలుచుకున్న అబ్బాయీ మా బిడ్డే, వెండి గెలుచుకున్న అబ్బాయీ మా బిడ్డే’’ అని ఆమె అన్నారు. నేనంటున్న పంజాబీ బాంధవ్యం అనే దాని గురించి మొదట నాకు 1980లో తెలిసింది. నేనప్పుడు లాహోర్‌లో ఉన్నాను. దేశ సరి హద్దుల ఆవలి ఆ తొలి పర్యటనలో నేను అటువైపు చేరుకునే వరకు కూడా పాకిస్థాన్‌ను నేను ఒక పరాయి దేశంగానే చూశాను. నిజంగా పరాయి దేశమే. కానీ అక్కడి ప్రజలైతే కచ్చితంగా పరాయి వారు కాదు. అలాగే వారికి నేను అపరిచితుడినీ కాదు, గ్రహాంతరవాసినీ కాదు. ఒక సాయంత్రం నేను పాత ‘వాప్డా’(వాటర్ అండ్ పవర్ డెవలప్మెంట్ అథారిటీ, పాకిస్తాన్) భవనంలోని సల్లూస్ రెస్టారెంట్లో కూర్చున్నాక, ఆ రెస్టారెంట్లో నేను తప్ప మరొకరు లేకపోవటం గమనించాను. ఒంటరిగానే డిన్నర్ చేసి, త్వరగా బయటికి వెళ్లి పోవటానికి సిద్ధం అయ్యాను. ఎంత పొరపాటు! నేను ఇండియా నుంచి వచ్చిన పంజాబీనని కనిపెట్టిన కొద్ది నిమిషాలకే రెస్టారెంట్ సిబ్బంది నా దగ్గరికి నడుచుకుంటూ వచ్చి మీతో మాట్లాడవచ్చా అని అడిగారు. నేను అంగీకరించగానే నాతో కలిసి కూర్చున్నారు. ఎంపిక చేసిన ఆహారాన్ని నా కోసం తెప్పించారు. లాహోర్‌లో నేను తప్పక చూడవలసిన ప్రదేశాలు ఏమిటో చెప్పారు. వెచ్చగా ఉన్న రోటీలను బలవంతంగా పక్కన పెట్టించి, తాజాగా చేయించిన పొగలు కక్కే రోటీలను నా ప్లేటులో ఒక దాని పైన ఒకటిగా వెడ్డింగ్ కేక్‌ను తలపించేలా ఇంత ఎత్తున సర్వ్ చేయిస్తూనే ఉన్నారు. అయితే నేను ఎప్పటికీ మరచిపోలేనివి మాత్రం వారు నన్ను అడిగిన ప్రశ్నలు. ‘‘మీరెప్పుడైనా జలంధర్‌లోని గల్లీ నంబర్ టెన్‌కి వెళ్లారా? అది మా తల్లితండ్రులు నివసించిన ప్రదేశం’’ అని ఒక ప్రశ్న. ‘‘మీరెప్పుడైనా అమితాబ్ బచ్చన్‌ని, రేఖను కలిశారా? నేను వారిని కలవటానికి ఎంతో ఆసక్తిగా ఉన్నాను’’ అని ఇంకో ప్రశ్న. ‘‘ఇందిరా గాంధీ గురించి చెప్పండి. ఆమె గురించి ప్రతిదీ తెలుసుకోవాలని ఉంది నాకు’’ అని అత్యంత ఆశ్చర్యకరమైన మరొక ప్రశ్న. తమ తల్లితండ్రులు జీవితాన్ని గడిపిన ప్రదేశం గురించి ఆ ప్రదేశం తమది కూడా అన్నంత ఉద్విగ్నంగా, ఉత్సాహంగా వారు ఉన్నారు. భారతదేశం అన్నది వారికి వేరే దేశం అయుండొచ్చు కానీ, వారి తల్లితండ్రులు జన్మించిన ప్రదేశం ఇప్పటికీ తమ ‘ఇల్లే’. అందు వల్ల నేను వారు కోల్పోయిన దేశం నుంచి వెళ్లిన వ్యక్తినే అయినప్పటికీ, వారు మర్చిపోలేని వ్యక్తిని. ‘సల్లూస్’ ద్వారా వారు కనుగొన్న ఒక బాంధవ్య అనుసంధానాన్ని నేను. ఇప్పుడు, 1980 అంటే... నలభై సంవత్సరాలకు పైమాటే. నాటి నుంచి ఎన్నో పరిణామాలు సంభవించాయి. దేశ విభజనకు ముందు తరం రాలిపోయింది. రాజకీయాల్లో మార్పులు వచ్చాయి. అవి మనల్ని ఆకర్షించటం లేదు. బాలీవుడ్ సినిమాలు మునుపటిలా లేవు. అయినప్పటికీ మనం ఒకేలా ఉన్నాం. ఒకే భాష మాట్లాడుతున్నాం. ఒకే ఆహారం తీసుకుంటున్నాం. ఆఖరికి ఒకేలా శాపగ్రస్థులమై ఉన్నాం. ఒకే ఒక చోట వేరుపడింది ఎక్కడంటే మతంలో, బ్రిటిష్ వాళ్లు గీసిన మ్యాపులో! దాన్ని దాటగలిగేందుకు పంజాబీయతకు తగినంత బలమే ఉంది. నీరజ్–అర్షద్‌లు ఒకరికొకరు దగ్గరయ్యేలా చేసింది ఇదే. విదేశాలలో భారతీయులు, పాకిస్తానీలు ఒకరికొకరు – వాళ్లు పంజాబీలు అయినా కాకున్నా – కలివిడిగా ఉండేందుకు కూడా కారణం ఇదే. వారు ఒకరి సమక్షంలో ఒకరు సౌకర్యవంతంగా ఉంటారు. తమ గురించి తాము వివరించాల్సిన అవసరం వారికి లేదు. తమను అర్థం చేసుకుంటారని వారికి తెలుసు. ఉమ్మడి సంస్కృతి విభజన రాజకీ యాల కంటే కూడా శక్తిమంతమైనది. ఇది మన రాజకీయ నాయకు లకు అర్థమైతే బాగుండు!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
‘నదీమ్ రికార్డును బ్రేక్ చేస్తాననుకున్నా’
న్యూఢిల్లీ: పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ రికార్డు బ్రేక్ చేయడం పెద్ద కష్టం కాదనుకున్నానని భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పేర్కొన్నాడు. జావెలిన్ పట్టుకుంటే వంద శాతం ప్రదర్శన ఇవ్వడంపైనే దృష్టి పెడతానని.. అది ఎంత దూరం వెళ్తుందనే దాన్ని పట్టించుకోనని నీరజ్ అన్నాడు. పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం నెగ్గిన నీరజ్.. 90 మీటర్ల మార్కు అందుకోవడం గురించి ఎక్కువ ఆలోచించడం లేదని.. అది ఎప్పుడు జరగాలని రాసిపెట్టి ఉందో అప్పుడే జరుగుతుందని పేర్కొన్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్ స్వర్ణం గెలిచి.. అథ్లెటిక్స్‌లో భారత్ తరఫున తొలి పసిడి గెలిచిన ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కిన నీరజ్.. తాజాగా ‘పారిస్’ క్రీడల్లో గాయంతోనే రజతం గెలిచి అదుర్స్ అనిపించుకున్నాడు. విశ్వ క్రీడల అనంతరం స్విట్జర్లాండ్‌లో శిక్షణ తీసుకుంటున్న నీరజ్‌చోప్రా.. శనివారం ఓ ప్రత్యేక కార్యక్రమంలో పలు అంశాలపై మాట్లాడాడు. ‘మెరుగైన ప్రదర్శన చేసే విధంగా సిద్ధం కావడమే నా చేతిలో ఉంది. 90 మీటర్ల మార్కు అందుకోవడం గురించి ఇప్పటికే ఎక్కువ చర్చ జరిగింది. ఇకపై దాని గురించి ఆలోచించొద్దని అనుకుంటున్నా. రాబోయే రెండు మూడు టోరీ్నల్లో వంద శాతం ప్రయత్నిస్తా.. ఫలితం ఎలా వస్తుందో చూస్తా. పారిస్ పోటీల్లో నదీమ్ విసిరిన దూరాన్ని అందుకోలేనని ఒక్క శాతం కూడా అనిపించలేదు’ అని 26 ఏళ్ల నీరజ్ అన్నాడు. గత ఏడాది ప్రపంచ చాంపియన్íÙప్ నుంచి గజ్జల్లో గాయంతో ఇబ్బంది పడుతున్న నీరజ్.. వచ్చే నెల బ్రస్సెల్స్ డైమండ్ లీగ్ అనంతరం చికిత్స చేయించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా పారిస్ క్రీడల్లో గాయంతోనే బరిలోకి దిగిన నీరజ్.. ఆ ప్రభావం కూడా తన ప్రదర్శనపై పడిందని అన్నాడు. ‘జావెలిన్‌ను మరింత దూరం విసరగలనని అనుకున్నా. పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫికేషన్, ఫైనల్లో నేను వేసిన రెండు త్రోలు నా కెరీర్లో రెండో, మూడో అత్యుత్తమ త్రోలు. అందులో ఒకటి సీజన్ బెస్ట్ కూడా. వంద శాతం కష్టపడితే మెరుగైన ఫలితాలు వస్తాయి. అయితే గాయం భయంతో పూర్తి ఎఫర్ట్ పెట్టనట్లు అనిపించింది. త్రో చేయడానికి ముందు జావెలిన్‌తో పరిగెడుతున్నప్పుడు గజ్జల్లో ఇబ్బందిగా ఉంది. దీంతో పాటు జావెలిన్ వదిలే కోణంపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరముంది. దేశంలో క్రీడల ప్రాముఖ్యత పెరగాలి. ప్రత్యేకంగా ఒక ఆట అని కాకుండా.. అన్నింటిలో ఎదిగితేనే స్పోర్ట్స్ పవర్ హౌస్‌గా మారగలం. క్రికెట్లో మెరుగైన స్థితిలో ఉన్నాం. వచ్చే ఒలింపిక్స్‌లో ఎక్కువ పతకాలు సాధించడంతో పాటు.. ఫిఫా ప్రపంచకప్‌నకు అర్హత సాధించే దిశగా అడుగులు వేయాలి’ అని నీరజ్ వివరించాడు. లుసానే డైమండ్ లీగ్‌లో నీరజ్ ఈ నెల 22 నుంచి లుసానే వేదికగా జరగనున్న డైమండ్ లీగ్‌లో బరిలోకి దిగనున్నట్లు నీరజ్ చోప్రా ప్రకటించాడు. సెప్టెంబర్‌లో జరగనున్న బ్రస్సెల్స్ డైమండ్ లీగ్‌తో సీజన్ ముగియనుండగా.. ఆ తర్వాతే గాయానికి చికిత్స తీసుకోవాలని నీరజ్ భావిస్తున్నాడు. ‘లుసానే లీగ్‌లో పోటీపడాలని నిర్ణయించుకున్నా. మరో నెల రోజుల్లో సీజన్ ముగుస్తుంది. ఆ తర్వాతే చికిత్సపై దృష్టి పెడతా. డైమండ్ లీగ్‌కు ముందు శిక్షణ కోసం స్విట్జర్లాండ్‌కు వచ్చా. వైద్యుల పర్యవేక్షణలో ట్రైనింగ్ సాగుతుంది. ఒకసారి పోటీలు ముగిసిన తర్వాత గాయం గురించి ఆలోచిస్తా’ అని నీరజ్ అన్నాడు. -
గిఫ్ట్‌గా గేదె బదులు.. పొలం ఇవ్వాల్సింది: అర్షద్ నదీమ్
గేదెను బహుమతిగా అందుకోవడం పట్ల పాకిస్తాన్ స్టార్ జావెలిన్ త్రోయర్, ప్యారిస్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అర్షద్ నదీమ్ స్పందించాడు. తనకు పిల్లనిచ్చిన మామ ‘ధనవంతుడని’.. గేదెకు బదులు పొలం ఇచ్చి ఉంటే బాగుండేదని సరదాగా వ్యాఖ్యానించాడు. ఒలింపిక్స్-2024 జావెలిన్ త్రో ఫైనల్లో ఈటెను ఏకంగా 92.97 మీటర్ల దూరం విసిరి ప్రపంచ రికార్డు సృష్టించాడు అర్షద్ నదీమ్.కోట్ల నజరానాపాకిస్తాన్ నలభై ఏళ్ల నిరీక్షణకు తెరదించి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అర్షద్ నదీమ్‌పై కాసుల వర్షం కురిసింది. పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించిన 15 కోట్ల(భారత్ కరెన్సీలో రూ. 4.5 కోట్లు) రూపాయల నజరానా ప్రకటించగా.. పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ సైతం నగదు ప్రోత్సాహకంతో పాటు 92.97 నేమ్ప్లేటుతో ఉన్న కారును అతడికి బహూకరించారు.పొలం ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది!ఈ నేపథ్యంలో అర్షద్ నదీమ్ మామయ్య అతడికి గేదెను బహుమతిగా ఇవ్వడం వార్తల్లో హైలైట్‌గా నిలిచింది. ఈ విషయం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘నిజంగా గేదెనే బహుమతిగా ఇచ్చారు. దానికి బదులు ఓ ఐదెకరాల పొలం ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. అయినా.. పర్లేదు.. బర్రె కూడా తక్కువేమీ కాదు కదా!’’ అంటూ జోక్ చేశాడు నదీమ్.భార్యను ఆటపట్టించిన నదీమ్ఆ సమయంలో అతడి పక్కనే ఉన్న భార్య ఆయేషా స్పందిస్తూ.. ‘‘మా నాన్న ఈయనకు గేదెను గిఫ్ట్‌గా ఇవ్వబోతున్నారని నాకసలు తెలియదు. వార్తల్లో చూసిన తర్వాతే ఈ విషయం తెలిసింది’’ అని పేర్కొంది. ఇందుకు బదులుగా.. ‘‘మీ నాన్న ధనికుడే కదా? మరి నాకు కేవలం గేదెను మాత్రమే ఎందుకు ఇచ్చాడు? 5-6 ఎకరాల పొలం ఇవ్వమని చెప్పాను. అయినప్పటికీ అటువైపు నుంచి ఎటువంటి స్పందనా లేదు’’ అంటూ నదీమ్ తన భార్యను ఆటపట్టించాడు.ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రేమతో ఇచ్చిన బహుమతిని అంతే ప్రేమగా స్వీకరించిన అర్షద్ నదీమ్‌లో హాస్య చతురత కూడా బాగానే ఉందని అతడి అభిమానులు కామెంట్ చేస్తున్నారు. కాగా బలానికి గేదె ప్రతీక అని.. తమ గ్రామ ఆచారం ప్రకారం.. గేదెను బహుమతిగా పొందడాన్ని గౌరవంగా భావిస్తామని అర్షద్ నదీమ్ మామ పేర్కొన్న విషయం తెలిసిందే.ఇక ప్యారిస్ ఒలింపిక్స్‌లో అర్షద్ బంగారు పతకం గెలవగా.. భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రజతంతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే, నీరజ్ ఖాతాలోనూ ఒలింపిక్ స్వర్ణం(టోక్యో) ఉండటం విశేషం.చదవండి: గ్రాండ్ వెల్కమ్.. కన్నీళ్లు పెట్టుకున్న వినేశ్ ఫోగట్( వీడియో)Arshad Nadeem's reaction on his father gifting him a buffalo after winning the Gold medal 😂😂😂He wanted 5-6 acre plot from his father-in-law and not a buffalo. Man, he's so simple 😭❤️ #Paris2024 pic.twitter.com/EzRv68GyAl— Farid Khan (@_FaridKhan) August 16, 2024 -
మరోసారి వార్తల్లో నీరజ్ చోప్రా, మనూ భాకర్.. కారణం ఇదే! (ఫొటోలు)
-
నీరజ్‌తో మనూ పెళ్లా?.. షూటర్ తండ్రి స్పందన
ప్యారిస్ ఒలింపిక్స్-2024 పతక విజేతలు నీరజ్ చోప్రా- మనూ భాకర్ గురించి జరుగుతున్న ప్రచారంపై మనూ తండ్రి రామ్ కిషన్ భాకర్ స్పందించారు. మనూకు ఇప్పట్లో పెళ్లి చేసే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. కాగా విశ్వ క్రీడల తాజా ఎడిషన్‌లో షూటర్ మనూ భాకర్ రెండు కాంస్య పతకాలు గెలిచిన విషయం తెలిసిందే.తొలుత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల వ్యక్తిగత విభాగంలో కాంస్యం సాధించిన 22 ఏళ్ల మనూ.. అదే క్రీడాంశంలో సరబ్జోత్ సింగ్‌తో కలిసి మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మరో కంచు పతకం సొంతం చేసుకుంది. తద్వారా ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు సాధించిన భారత తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలోనూ నాలుగో స్థానంలో నిలిచి.. మూడో పతకానికి అడుగుదూరంలో నిలిచిపోయింది.పెళ్లి చేసుకోబోతున్నారంటూ వదంతులుఈ నేపథ్యంలో మనూ భాకర్ పేరు ఒక్కసారిగా మారుమ్రోగిపోయింది. మరోవైపు.. జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. టోక్యోలో స్వర్ణం గెలిచిన 26 ఏళ్ల నీరజ్ ఈసారి మాత్రం రెండోస్థానానికే పరిమితం కావడం కాస్త నిరాశ కలిగించేదే అయినా.. ప్యారిస్‌లో భారత్‌కు ఏకైక రజతం అందించిన అథ్లెట్‌గా నిలిచాడు.ఇదిలా ఉంటే.. ఒలింపిక్స్-2024 ముగింపు వేడుకల అనంతరం నీరజ్ చోప్రా- మనూ భాకర్ మాట్లాడుకుంటున్న వీడియో బయటకు వచ్చింది. ఇందులో వీరిద్దరు కాస్త సిగ్గుపడుతున్నట్లుగా కనిపించగా.. మనూ తల్లి సుమేధా భాకర్ ఫొటోలు క్లిక్‌మనిపించారు. అంతేకాదు.. అనంతరం నీరజ్ దగ్గరకు వచ్చిన సుమేధా.. అతడి చేయిని తన చేతుల్లోకి తీసుకుని మాటివ్వు అన్నట్లుగా తలపై పెట్టుకున్నారు. ఆ తర్వాత మనూ తండ్రి రామ్ కిషన్ కూడా అక్కడికి వచ్చారు. నీరజ్ ఆయన పాదాలకు నమస్కరించగా.. ఆయన అతడి వెన్నుతట్టారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో... ఈ హర్యానా అథ్లెట్లు పెళ్లి చేసుకోబోతున్నారని.. ఇందుకు మనూ తల్లిదండ్రుల అనుమతి కూడా లభించిందంటూ వదంతులు పుట్టుకొచ్చాయి. వాళ్లది తల్లీకొడుకుల అనుబంధంఈ విషయంపై స్పందించిన మనూ తండ్రి రామ్ కిషన్ దైనిక్ భాస్కర్‌తో మాట్లాడుతూ.. ‘‘మనూ ఇంకా చిన్నపిల్ల. తనకు ఇంకా పెళ్లి చేసే ఈడు కూడా రాలేదు. ఇప్పట్లో అసలు ఆ విషయం గురించే మేము ఆలోచించడం లేదు.ఇక మనూ వాళ్ల అమ్మ నీరజ్‌ను తన కుమారుడిలాగే భావిస్తుంది. వాళ్లిద్దరి మధ్య తల్లీకొడుకుల అనుబంధం ఉంది’’ అని పేర్కొన్నారు. అదే విధంగా.. నీరజ్ చోప్రా అంకుల్ కూడా ఈ విషయం గురించి స్పందించారు. ‘‘నీరజ్ పతకం తీసుకురావడం దేశమంతా చూసింది కదా. అలాగే అతడి పెళ్లి కూడా అందరికి తెలిసే జరుగుతుంది’’ అని స్పష్టం చేశారు.చదవండి: Neeraj Chopra: రూ. 52 లక్షల వాచ్!.. కోట్ల ఆస్తి: కష్టపడి పైకొచ్చిన నీరజ్ చోప్రాNeeraj Chopra can be seen talking to the Manu Bhaker's mother and into the other video, Neeraj Chopra and Manu Bhaker are discussing closely..!I'm sorry but I don't know why I am getting interested in Manu Bhaker and Neeraj Chopra 😜 pic.twitter.com/uymONMo8sj— Priyanshu Kumar (@priyanshu__63) August 11, 2024 -
Neeraj Chopra: రూ. 52 లక్షల వాచ్!.. కోట్ల ఆస్తి.. కష్టే ఫలి!
వరుస ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత జావెలిన్ త్రో సూపర్‌స్టార్ నీరజ్ చోప్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కేవలం ఆటతోనే కాదు.. తన గుణగణాలతో అందరి మనసులు దోచుకున్నాడంటూ ఈ హర్యానా అథ్లెట్‌ను కొనియాడుతున్నారు అభిమానులు. నీరజ్ పెంపకం కూడా ఎంతో గొప్పగా ఉందంటూ అతడి తల్లిదండ్రులను కూడా ప్రశంసిస్తున్నారు.పాకిస్తాన్ పసిడి పతక విజేత అర్షద్ నదీమ్ కూడా తమ బిడ్డలాంటి వాడేనని నీరజ్ తల్లి సరోజ్ దేవి చేసిన వ్యాఖ్యలను ఇందుకు ఉదాహరణగా పేర్కొంటున్నారు. అదే విధంగా.. ప్యారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో పతకధారిగా భారత హాకీ స్టార్ శ్రీజేశ్కు ఫ్లాగ్‌బేరర్‌గా అవకాశం ఇస్తామన్నపుడు.. నీరజ్ సంతోషంగా ఒప్పుకొన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అయితే, మరికొంత మంది మాత్రం నీరజ్ చోప్రా విలాసవంతమైన జీవితం, అతడి దగ్గర ఉన్న ఖరీదైన వస్తువల గురించి చర్చిస్తున్నారు. మరి అతడి నెట్‌వర్త్ ఎంతో తెలుసా?!ఉమ్మడి కుటుంబంహర్యానాలోని పానిపట్‌లో గల ఖాంద్రా గ్రామంలో డిసెంబరు 24, 1997లో నీరజ్ చోప్రా ఓ రైతు కుటుంబంలో జన్మించాడు. అతడి తండ్రి సతీశ్ కుమార్, తల్లి సరోజ్ దేవి. పందొమ్మిది సభ్యులు ఉన్న ఉమ్మడి కుటుంబం వారిది. నీరజ్‌కు ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు. చెల్లెల్లు సంగీత- సరిత.ఇక పదకొండేళ్ల వయసులోనే 90 కిలోల బరువుతో బాధపడ్డ నీరజ్‌ను తండ్రి సమీప జిమ్‌లో చేర్పించాడు. ఊబకాయం వల్ల ఒత్తిడికి లోనైన నీరజ్‌లో స్ఫూర్తిదాయక మాటలతో ఆత్మవిశ్వాసం నింపేది అతడి తల్లి. ఒకవైపు వ్యవసాయం చేసుకుంటూనే కొడుకును జావెలిన్ త్రోయర్‌గా ఎదిగేలా ప్రోత్సహించారు ఆ తల్లిదండ్రులు.ఓవర్‌నైట్ స్టార్గాఈ క్రమంలో అనూహ్య రీతిలో.. అంచనాలు తలకిందులు చేస్తూ భారత ఆర్మీ సుబేదార్ నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచి యావత్ భారతావని దృష్టిని ఆకర్షించాడు. వ్యక్తిగత విభాగంలో పసిడి గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించిన నీరజ్ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయిన ఈ అథ్లెట్ కోసం వాణిజ్య ప్రచార సంస్థలు క్యూకట్టాయి.ఈ నేపథ్యంలో నీరజ్ పేరుప్రఖ్యాతులతో పాటు సంపద కూడా అమాంతం పెరిగింది. తమ గ్రామంలోనే అత్యంత విలాసవంతమైన ఇల్లు కలిగి ఉంది నీరజ్ కుటుంబం. ఖాంద్రాలోని ఈ మూడంతస్తుల భవనం విలువ కోట్లలో ఉంటుందని సమాచారం.లగ్జరీ కార్లుఇక నీరజ్ గ్యారేజీలో ఆనంద్ మహీంద్రా అందించిన ప్రత్యేకమైన వాహనంతో పాటు.. ఫోర్ట్ ముస్టాంగ్ జీటీ(సుమారు రూ. 93.52 లక్షలు), టయోటా ఫార్చునర్(సుమారు రూ. 33.43 లక్షలు), రేంజ్ రోవర్ స్పోర్ట్(రూ. 2 కోట్లు), హార్లే డేవిడ్సన్ బైకు(రూ. 11 లక్షలు), బజాజ్ పల్సర్(రూ. లక్ష) ఉన్నాయి.నెట్‌వర్త్ ఎంతంటే?కాగా టోక్యోలో స్వర్ణం గెలిచిన నీరజ్ చోప్రా.. ఈసారి వెండి పతకంతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. ఇక జావెలిన్ త్రో క్వాలిఫయర్స్ సందర్భంగా నీరజ్ ధరించిన వాచ్‌పై కూడా నెట్టింట చర్చ జరుగుతోంది. ఒమేగా బ్రాండ్‌కు చెందిన ఆక్వా టెరా అల్ట్రా వాచ్ విలువ సుమారుగా రూ.52 లక్షలు ఉంటుందని సమాచారం. అన్నట్లు జాతీయ మీడియా DNA రిపోర్టు ప్రకారం.. నీరజ్ చోప్రా ఆస్తుల నికర విలువ సుమారు 32 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. వివిధ బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా నీరజ్‌కు అధిక మొత్తంలో ఆదాయం చేకూరుతున్నట్లు సమాచారం. కష్టే ఫలిటోక్యోలో స్వర్ణం సాధించిన తర్వాత క్యాష్ ప్రైజ్ రూపంలో నీరజ్ చోప్రాకు మొత్తంగా రూ. 13 కోట్లు దక్కాయి. నైక్, ఒమేగా వంటి ప్రముఖ బ్రాండ్లకు అతడు ప్రచారకర్త. ఆటగాడిగా తనను నిరూపించుకునే క్రమంలో గాయాలతో సతమతమైనా.. ఎన్నో కఠినసవాళ్లు ఎదురైనా వాటిని దాటుకుని ఉన్నతశిఖరాలకు చేరిన నీరజ్ చోప్రా యువతకు ఆదర్శం అనడంలో సందేహం లేదు.చదవండి: ఒట్టేసి చెప్పు బాబూ: నీరజ్ చోప్రాతో మనూ భాకర్ తల్లి -
మాటివ్వు: నీరజ్ చోప్రాతో మనూ భాకర్ తల్లి
భారత అథ్లెట్లు మనూ భాకర్, నీరజ్ చోప్రాకు సంబంధించిన ఆసక్తికర వీడియో వెలుగులోకి వచ్చింది. వీరిద్దరు పరస్పరం మాట్లాడుకుంటూ ఉండగా.. మనూ తల్లి ఫొటోలు తీశారు. అంతేకాదు.. ఆ తర్వాత నీరజ్ చోప్రా చేయి తన తలమీద పెట్టుకుని ఒట్టు వేయించుకున్నారు కూడా!ప్యారిస్ ఒలింపిక్స్-2024లో షూటర్ మనూ భాకర్ భారత్ పతకాల ఖాతా తెరిచిన విషయం తెలిసిందే. తొలుత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కంచు పతకం గెలిచిన 22 ఏళ్ల ఈ హర్యానా అమ్మాయి.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సరబ్జోత్ సింగ్‌తో కలిసి మరో బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకుంది. తద్వారా భారత ఒలింపిక్స్ చరిత్రలో ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు గెలిచిన భారత ప్లేయర్(స్వాతంత్ర్యం తర్వాత)గా అరుదైన రికార్డు సాధించింది.అరుదైన ఘనత సాధించిపందొమిదేళ్ల వయసులో టోక్యో ఒలింపిక్స్‌లో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుని.. కఠిన సవాళ్లకు ఎదురీది ఈసారి రెండు మెడల్స్ గెలుచుకుంది మనూ. 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లోనూ నాలుగోస్థానంలో నిలిచి.. పతకానికి అడుగుదూరంలో నిలిచిపోయింది. మరోవైపు.. టోక్యో ఒలింపిక్స్ ‘గోల్డెన్ బాయ్’, భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా సైతం ప్యారిస్‌లో పతకం గెలిచాడు.అయితే, ఈసారి రెండోస్థానంతో సరిపెట్టుకుని.. పసిడి కాకుండా రజత పతకానికి పరిమితమయ్యాడు. ఈ ఎడిషన్‌లో భారత్ తరఫున ఏకైక సిల్వర్ మెడల్ గెలిచిన అథ్లెట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో మనూతో పాటు నీరజ్.. ఒలింపిక్స్-2024 ముగింపు వేడుకల్లో ఫ్లాగ్‌బేరర్‌గా వ్యవహరించాల్సింది. అయితే, ఆ ఛాన్స్ హాకీ లెజెండ్, కేరళ ప్లేయర్ శ్రీజేశ్కు దక్కింది. నీరజ్ చోప్రా మంచి మనసు వల్లే శ్రీజేశ్కు ఈ అవకాశం వచ్చింది.మాటివ్వు బాబూఇక ఆదివారం నాటి ముగింపు వేడుకల అనంతరం.. మనూ భాకర్- నీరజ్ చోప్రా సంభాషిస్తున్న వీడియో తాజాగా వైరల్ అవుతోంది. ఈ క్రమంలో నీరజ్‌తో కలిసి ఫొటోకు ఫోజులివ్వాల్సిందిగా మనూ తల్లి సుమేధా భాకర్ కూతురిని కోరారు. అనంతరం.. నీరజ్ దగ్గరికి వచ్చిన సుమేధా.. నీరజ్ చేయి తన తల మీద పెట్టుకుని మాట తీసుకున్నారు. ఈ నేపథ్యంలో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. పసిడి పతకం తేవాలి!వరుస ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన నీరజ్.. విజయ రహస్యం ఏమిటో తన కూతురికి కూడా చెప్పాలని కోరారని కొంతమంది అంటుండగా.. వచ్చేసారి కచ్చితంగా స్వర్ణం సాధించాలని 26 ఏళ్ల నీరజ్‌తో ఒట్టు వేయించుకున్నారని మరికొందరు అంటున్నారు. కాగా మనూ భాకర్, నీరజ్ చోప్రా.. ఈ ఇద్దరూ హర్యానాకు చెందిన వాళ్లే అన్న విషయం తెలిసిందే. నీరజ్ స్వస్థలం పానిపట్ కాగా.. మనూ భాకర్ కుటుంబానిది ఝజ్జార్ జిల్లాలోని గోరియా గ్రామం. ఇదిలా ఉంటే.. ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఆరు పతకాలు వచ్చాయి. షూటింగ్లో మూడు కాంస్యాలు, హాకీ పురుషుల జట్టుకు కాంస్యం, రెజ్లింగ్‌లో ఒక కాంస్యం, జావెలిన్ త్రోలో ఒక రజతం దక్కాయి. Manu Bhaker’s Mother with Neeraj Chopra. pic.twitter.com/SDWbaWeOG7— Avinash Aryan (@avinasharyan09) August 11, 2024Neeraj Chopra and Manu Bhaker are talking to each other as if they have a crush on each other. I am getting wild ideas on getting India a couple of future super athletes. pic.twitter.com/KXsTZDGq8y— Lord Immy Kant (Eastern Exile) (@KantInEast) August 11, 2024 -
పతకాల సంఖ్య ప్రామాణికం కాదు
పారిస్ ఒలింపిక్స్ ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నా. గతంతో పోలిస్తే జావెలిన్‌ను ఎక్కువ దూరం విసిరి రజతం గెలవడం ఆనందంగా ఉంది. అయితే విశ్వక్రీడా వేదికపై మన జాతీయ గీతం వినడాన్ని ఎక్కువ సంతోíÙస్తా. మరింత మెరుగవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. దాని కోసం కృషి చేస్తా. ఒలింపిక్స్‌లో వరుసగా రెండో పతకం గెలిచిన సమయంలో అభిమానుల నుంచి లభించిన మద్దతును ఎప్పటికీ మరవలేను. నాతో పాటు.. మన అథ్లెట్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ప్రేరణ నింపారు. ‘పారిస్’ క్రీడల్లో భారత ప్రదర్శనను అంచనా వేయడానికి కేవలం పతకాల సంఖ్య ప్రామాణికం కాదు. చాలా మంది త్రుటిలో పతకాలను కోల్పోయారు. ఆ స్థాయికి రావడానికి వారు పడ్డ శ్రమను తక్కువ చేయలేము. హాకీ జట్టులోని 16 మంది సభ్యులతో పాటు మొత్తం 21 మంది అథ్లెట్లు పారిస్ నుంచి పతకాలతో తిరిగి వస్తున్నారు. మొత్తంగా ఈ క్రీడల్లో మన అథ్లెట్లు ఆరు విభాగాల్లో నాలుగో స్థానాల్లో నిలిచారు. మరొక దాంట్లో అనర్హత వేటుకు గురయ్యారు. 1960 ఒలింపిక్స్‌లో దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్, 1984 క్రీడల్లో పీటీ ఉష ఇలాగే నాలుగో స్థానంలో నిలిచి... యువతకు మార్గదర్శకులు అయ్యారు. ఇప్పుడు తాజా ఒలింపిక్స్‌లో పతకం సాధించగల ఏడుగురు అథ్లెట్లు... వివిధ క్రీడాంశాల్లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్న మరో 15 మంది అథ్లెట్లు మన బృందంలో ఉన్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో ఏడు పతకాలు సాధించినప్పుడు... మరో ఇద్దరు మాత్రమే నాలుగో స్థానంలో నిలిచారు. అప్పటితో పోల్చితే ఇప్పుడా సంఖ్య భారీగా పెరిగింది. క్రీడా సంస్కృతి పెరుగుదలకు ఇది నిదర్శనం. దేశంలో క్రీడారంగంపై భారీగా పెట్టుబడులు పెట్టడం ప్రారంభమైంది. అథ్లెట్లకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు లభిస్తున్నాయి. రాబోయే కాలంలో ఈ నాలుగో స్థానాలను పతకాలుగా మలవగలమనే నమ్మకం ఉంది. అర్జున్ బబూతా, అంకిత, బొమ్మదేవర ధీరజ్, మహేశ్వరీ చౌహాన్, అనంత్‌జీత్ సింగ్, మనూ భాకర్, వినేశ్ ఫొగాట్ ఇలా వీళ్లంతా త్రుటిలో పతకాలు కోల్పోయారు. అథ్లెట్లు నిరంతరం మెరుగవడంపై దృష్టి పెట్టడం ముఖ్యం. పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న మన అథ్లెట్లందరూ టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్)లో భాగంగా ఉన్నారు. దీని వల్ల నిపుణుల పర్యవేక్షణలో విదేశీ శిక్షణకు అవకాశం ఉంటుంది. గత మూడేళ్లలో నేను 310 రోజుల పాటు వివిధ దేశాల్లో శిక్షణ పొందాను. దాన్ని సరైన రీతిలో వినియోగించుకుంటే.. మెరుగైన ఫలితాలు సాధించడం పెద్ద కష్టం కాదు. -నీరజ్ చోప్రా -
నీరజ్ చోప్రా తల్లిపై షోయబ్ అక్తర్ ప్రశంసల జల్లు..
భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా తల్లి సరోజ్ దేవి తన మంచి మనసును చాటుకున్న సంగతి తెలిసిందే. ప్యారిస్ ఒలింపిక్స్-2024లో తన కొడుకు బంగారు పతకాన్ని తృటిలో చేజార్చుకునప్పటకి ఆమె మాత్రం ఏ మాత్రం దిగులు చెందలేదు.పసిడి పతకం సొంతం చేసుకున్న పాకిస్తాన్ స్టార్ అథ్లెట్‌పై సరోజ్ దేవి ప్రశంసల వర్షం కురిపించారు. అర్షద్‌ను కూడా తన కొడుకులాంటివాడని.. వారిద్దరు పోటీపడుతుంటే చూడముచ్చటగా ఉంటుందని ప్రేమను చాటుకున్నారు. ఈ క్రమంలో నీరజ్ తల్లి చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం షోయబ్ అక్తర్ మనసును హత్తుకున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఆమె తల్లి ప్రేమని అక్తర్ కొనియాడాడు. " ఎవరో స్వర్ణం పతకం సాధిస్తే.. అతడు కూడా మా కుమారుడే అని ఆమె చెప్పారు. ఇలా చెప్పడం ఒక తల్లికి మాత్రమే సాధ్యం. నిజంగా ఇదొక అద్భుతమని" ఎక్స్‌లో అక్తర్ రాసుకొచ్చాడు. కాగా ప్యారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా రజత పతకం సాధించాడు. జావెలిన్ త్రో ఫైనల్లో ఈటెను 89.45 మీటర్లు విసిరి రెండో స్ధానంలో నిలిచిన నీరజ్.. వరుసగా రెండో ఒలిపింక్ పతకాన్ని ముద్దాడాడు. అయితే అర్షద్ నదీమ్ బంగారు పతకాన్ని సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఫైనల్లో ఏకంగా జావెలన్ రికార్డు స్ధాయిలో 92.97 మీటర్ల దూరం విసిరి గోల్డ్‌మెడల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. -
Paris Olympics 2024: పతకమేదైనా తల్లికి బంగారమే
పోటీ అనేది ఆట వరకే పరిమితం. ఆ తరువాత అంతా మనం మనం’ అని చెప్పడానికి చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా... స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా తల్లి సరోజ్ దేవి పాకిస్తాన్ జావెలిన్ త్రో ప్లేయర్ అర్షద్ నదీమ్ గురించి, అర్షద్ నదీమ్ తల్లి రజీయా పర్వీన్ నీరజ్ చోప్రా గురించి ప్రశంసాపూర్వకంగా మాట్లాడిన మాటలు క్రీడా స్ఫూర్తికి అద్దం పట్టాయి.స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌లో రజతం గెల్చుకున్నాడు. అయితే ఆయన గెలుచుకున్న రజతం చాలామందికి సంతోషాన్ని ఇవ్వలేదు. అద్భుత శక్తిసామర్థ్యాలు ఉన్న, ఎంతో ఘన చరిత్ర ఉన్న నీరజ్ చోప్రా స్వర్ణ పతకం సొంతం చేసుకోకపోవడం చాలామందిని నిరాశ పరిచింది.మరోవైపు పాకిస్తాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ స్వర్ణం గెలుచుకున్నాడు.‘అర్షద్ నదీమ్ కూడా నా కుమారుడిలాంటివాడే’ అని స్పందించింది నీరజ్ చోప్రా తల్లి సరోజ్ దేవి. ఆ అమ్మ మాటను ప్రపంచం మెచ్చింది.పాకిస్తాన్‌కు చెందిన క్రీడాకారుడిని సరోజ్ దేవి మెచ్చుకోవడం కొద్దిమందికి నచ్చకపోయినా, వారిని ఉద్దేశించి నీరజ్ చోప్రా వివరణ ఇచ్చినా...స్థూలంగా ఆమె మాటలు అర్షద్ నదీమ్ గెలుచుకున్న బంగారం పతకం కంటే విలువైనవి.‘మా వాడు బంగారం పతకంతో వస్తాడనుకుంటే రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది’ అని నిట్టూర్చలేదు సరోజ్ దేవి.‘రజతం అయినా బంగారం అయినా ఒక్కటే. ఇద్దరూ నా బిడ్డలే’ అన్నది.ఆమె మాటలు ప్రధాని నరేంద్ర మోదీకీ నచ్చాయి. ఆమె సహృదయతను ప్రశంసించారు.మరో వైపు చూస్తే... ‘నీరజ్ నా కుమారుడిలాంటివాడు. అతడి కోసం ప్రార్థిస్తాను. నీరజ్ ఎన్నో పతకాలు గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటోంది అర్షద్ నదీమ్ తల్లి రజియా పర్వీన్.‘నా బిడ్డ తప్ప ఇంకెవరైనా బంగారు పతకం గెలుచుకోగలరా!’ అని బీరాలు పోలేదు. ఒకవైపు కుమారుడి చారిత్రక విజయానికి సంతోషిస్తూనే మరోవైపు నీరజ్ చో్ప్రా ప్రతిభను వేనోళ్ల పొగిడింది. పాకిస్తాన్, పంజాబ్‌లోని ఖనేవాల్ జిల్లాకు చెందిన అర్షద్ నదీమ్ కుటుంబం నీరజ్ చో్ప్రాను తమ ఇంటికి ఆహ్వానించింది.పోటీలకు అతీతంగా అర్షద్, నీరజ్‌లు ఒకరినొకరు ప్రశంసించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి,.‘ఆటకు సంబంధించి ఎలా ఉన్నా మేము మంచి స్నేహితులం, అన్నదమ్ములం... అని అర్షద్ నాతో ఎన్నోసార్లు చె΄్పాడు’ అంటుంది రజియా పర్వీన్.‘నీరజ్ మా కుటుంబంలో ఒకరు. అతను పాకిస్తాన్‌కు వస్తే ఎయిర్ పోర్ట్ నుంచి మా ఇంటికి ఊరేగింపుగా తీసుకువస్తాం’ అంటున్నాడు పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అర్షద్ నదీమ్ సోదరుడు షాహీద్ అజీమ్.ఇద్దరు మిత్రులునీరజ్ చోప్రాకు కుటుంబసభ్యులతో కలిసి కూర్చొని హాయిగా కబుర్లు చెప్పుకోవడం అంటే ఇష్టం. పండగలు వస్తే చాలు మిఠాయిల పని పట్టాల్సిందే. ఆ తరువాత బరువు పని పట్టాల్సిందే.‘ఆటగాడికి కుటుంబ మద్దతు చాలా ముఖ్యం’ అంటాడు నీరజ్. ‘ఆటల్లో తొలి అడుగు వేసినప్పటి నుంచి ఇప్పటివరకు కుటుంబం నాకు మద్దతుగా ఉంది. నా వెనుక నా కుటుంబం ఉన్నది అనే భావన ఎంతో శక్తిని ఇస్తుంది’ అంటాడు నీరజ్. ‘నేను’ అనే అహం నీరజ్‌లో కనిపించదు. ఎదుటివారి ప్రతిభను ప్రశంసించకుండా ఉండలేడు. ముఖాముఖీగా, మీడియా ముఖంగా అర్షద్ నదీమ్‌ను ఎన్నోసార్లు ప్రశంసించాడు నీరజ్ చోప్రా. అందుకే అతడంటే నదీమ్‌కు చాలా ఇష్టం.ఇక నదీమ్ గురించి చె΄్పాలంటే అతడు ఇంట్రావర్ట్. తక్కువగా మాట్లాడుతాడు. సాధారణ కుటుంబంలో పుట్టిన నదీమ్‌కు ఆర్థిక భారం ఎన్నోసార్లు అతడి దారికి అడ్డుగా నిలబడేది. స్నేహితులు, సన్నిహితులు అతడి విదేశీ టోర్నమెంట్లకు సంబంధించి ప్రయాణ, ఇతర ఖర్చులకు డబ్బును సమకూర్చేవారు. టోక్యో ఒలింపిక్స్‌కు సంబంధించి నదీమ్‌కు పాక్ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లభించలేదు. ప్యారిస్ ఒలింపిక్స్‌కు ఇంకా కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. పాత జావెలిన్తోప్రాక్టిస్ చేయడం కష్టంగా ఉంది’ అంటూ సాగిన నదీమ్ సోషల్ మీడియా పోస్ట్ ఎంతోమంది దృష్టిని ఆకర్షించింది. నీరజ్ చో్ప్రా కూడా అర్షద్ నదీమ్‌కు మద్దతుగా మాట్లాడాడు. -
నీరజ్ చోప్రా ఫిట్నెస్ రహస్యం ఇదే..!
ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత ఖాతాలో తొలి రజత పతకం వచ్చి చేరింది. జావెలిన్ త్రో ఈవెంట్లో భారత బళ్లెం వీరుడు నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. గురువారం ఆర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో జావెలిన్‌ను 89.45 మీటర్లు విసిరిన నీరజ్.. రెండో స్ధానంలో నిలిచి రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఇలా ఒలింపిక్స్‌లో వరుసగా రెండోసారి పతకం గెలుచుకోవడం విశేషం. గతంలో టోక్యో ఒలింపిక్స్ 2020లో జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసుందామా..!నీరజ్ చూడటాని చక్కటి శరీరాకృతితో ఆకర్షణీయం ఉంటాడు. అతడు ఆడే జావెలిన్ త్రోలో ఎన్నో గాయలు అవుతుంటాయి. వాటన్నింటిని తట్టుకుని విశ్వవేదిక వద్దకు చేరుకోవడం వెనుక మాటలకందని కఠోర శ్రమ ఉంటుంది. అందుకోసం వారు ఆహర్నిశలు ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ నీరజ్ చోప్రా మంచి ఫిట్నెస్ ఔత్సాహికుడు, అభ్యాసకుడు అని ఆయన పిట్నెస్ ట్రైనర్ ఇషాన్ మార్వాహా చెబుతున్నారు. అతను ఫిట్నెస్ శిక్షణలో చాలా చురుకుగా ఉంటాడు. ఇతర అథ్లెట్ల కంటే భిన్నంగా ఆలోచిస్తాడు, అంకితభావంతో కృషి చేస్తాడనిన్నారు. ఆయన నీరజ్ ఫిట్నెస్కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు అవేంటంటే..అతడివ్యాయామ దినచర్య ఎగువ, దిగువ శరీర బలాన్ని మెరుగుపరచడంపై దష్టిసారిస్తూ ప్రారంభిస్తాడని అన్నారు. తన చేతులు, మోచేతులు ఆకృతిలో ఉంచేందుకు మెడిసిన్ బాల్స్, కేబుల్పుల్ వ్యాయామాలపై దృష్టిపెడతాడని అన్నారు. అలాగే బరువు నిర్వహించేందుకు బరువున్న బంతితో వర్కౌట్లు చేస్తాడని చెప్పారు. జావెలిన్ త్రోయర్లకు అత్యంత అవసరమైన వ్యాయామం అని తెలిపారుతన ఆటకు ఉపయోగపడే స్క్వాట్స్, స్నాచ్, వెయిటెడ్ లంగ్స్, టైమ్ సర్క్యూట్ల వంటి ఇతర వ్యాయామాలతో కండరాలను నిమగ్నం చేస్తాడు. వీటి తోపాటు డంబెల్ ఫ్రంట్ మరియు సైడ్ రైజ్‌లు, ఏటవాలు క్రంచెస్, స్విస్ బాల్ క్రంచెస్, లెగ్ రైజ్‌లు కూడా చేస్తాడు. ఇవి అతని కోర్ బాడీ స్ట్రెంగ్త్‌ను పెంచుతాయని వివరించారు. అయితే టోక్యో 2020 ఒలింపిక్స్ తర్వాత, నీరజ్ పెరిగిన బరువును తగ్గించుకోవడానికి టబాటా వ్యాయామంతో చేసినట్లు తెలిపారు. దీన్ని హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్(హెచ్ఐఐటీ) వ్యాయామం అంటారు. మొత్తం విభిన్నవ్యాయామాల వర్కౌట్ 20 సెకన్లలో చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఐస్ బాత్‌లు, కాంట్రాస్ట్ బాత్‌లతో విశ్రాంతి తీసుకుంటాడని అన్నారునీరజ్లా బాడీ ఉండాలంటే..నీరజ్లాంచి చక్కటి శరీరాకృతి కావాలనుకుని యువకులకు నీరజ్ ఫిట్‌నెస్‌ని ఫాలో అయితే మంచి ఫలితాలు పొందగలరని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ నీరజ్‌లా అనుభవజ్ఞుడైన ఫిటెనెస్ ప్రొఫెషనల్ సలహాలు సూచనలతోనే ఇవి చేయాలని సూచించారు. ముఖ్యంగా ఈ హెచ్ఐఐటీని 30, 40లలో ఉన్న పురుషుల ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. ఇవి హృదయ ఆర్యోగాన్ని పెంచడమే గాక జీవక్రియను మెరుగుపరుస్తాయి. పైగా కొవ్వులనే ఈజీగా కరిగించేస్తుంది.ఈ వ్యాయామం కండర ద్రవ్యరాశిని తగ్గించి, మధుమేహం, గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మూడు పదుల వయసులో ఉన్న పురుషులకు మంచి దేహ సౌష్టవాన్ని పొందేందుకు ఇవి ఉపయోగపడతాయి. అలాగే 40, 50లలో ఉన్నవారికి ఎగువ శరీర బలాన్ని పెంపొందించుకునేందుకు, గాయాల బారిన పడకుండా ఉండేందుకు ఉపయోగపడతాయి. ఇక్కడ ఆరోగ్యంతో కూడిన ఫిట్నెస్ కోసం క్రీడాకారుల ఫిట్నెస్ చిట్కాలు ఎంతగానో ఉపకరిస్తాయి. సమర్థవంతమైన ఫిట్నెస్ సాధించేందుకు ఉపయోగాపడతాయని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: స్పేస్‌లో ఎక్కువ కాలం ఉంటే ఆరోగ్య సమస్యలు వస్తాయా..? బెస్ట్ స్పేస్ ఫుడ్స్ ఇవే..!) -
నీరజ్ చోప్రా మంచి మనసు.. శ్రీజేశ్కు అరుదైన గౌరవం
భారత హాకీ జట్టు గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్కు అరుదైన గౌరవం దక్కింది. ప్యారిస్ ఒలింపిక్స్-2024 ముగింపు వేడుకల్లో భారత బృంద పతకధారిగా అతడు వ్యవహరించనున్నాడు. కాంస్య పతకాల విజేత, షూటర్ మనూ భాకర్‌తో కలిసి ఫ్లాగ్‌బేరర్ హోదాలో ముందుండి నడవనున్నాడు.భారత ఒలింపిక్ సంఘం ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. రెండు దశాబ్దాలుగా భారత హాకీకి వెన్నెముకగా ఉన్న శ్రీజేశ్ ఈ గౌరవానికి అర్హుడని పేర్కొంది. ఈ విషయం గురించి జావెలిన్ త్రోయర్, రజత పతక విజేత నీరజ్ చోప్రాతో చర్చించామని.. అందుకు అతడు సంతోషంగా ఒప్పుకొన్నాడని తెలిపింది. ఈ క్రమంలో శ్రీజేశ్ పేరును ఫ్లాగ్‌బేరర్‌గా ఎంపిక చేసినట్లు పేర్కొంది.పతకాల ఖాతా తెరిచిన మనూ భాకర్కాగా షూటర్ మనూ భాకర్ ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత పతకాల ఖాతా తెరిచిన విషయం తెలిసిందే. తొలుత మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్యం గెలిచిన ఈ హర్యానా షూటర్.. సరబ్జోత్ సింగ్‌తో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మరో కాంస్యం కైవసం చేసుకుంది. తద్వారా ఒలింపిక్స్ ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు గెలిచిన తొలి భారత ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది.ఈ క్రమంలో ఆమెను ఫ్లాగ్‌బేరర్‌గా ప్రకటించింది భారత ఒలింపిక్ సంఘం. మరోవైపు.. టోక్యోలో స్వర్ణం గెలిచిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ప్యారిస్‌లో రజతంతో సరిపెట్టుకున్నాడు. అయినప్పటికీ.. వరుస ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో రెండు పతకాలు గెలిచిన నాలుగో భారత ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. ఈ నేపథ్యంలో మనూతో పాటు ఫ్లాగ్‌బేరర్‌గా ఈ హర్యానా ఆటగాడు ఉంటాడని అంతా భావించారు.అయితే, వరుసగా భారత హాకీ జట్టు రెండోసారి కాంస్యం గెలవడంలో కీలక పాత్ర పోషించిన గోల్ కీపర్ శ్రీజేశ్ వైపు ఒలింపిక్ సంఘం మొగ్గుచూపింది. ప్యారిస్‌లో రిటైర్మెంట్ ప్రకటించిన ఈ కేరళ క్రీడాకారుడు.. భారత క్రీడా రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా సముచిత గౌరవం ఇవ్వాలని భావించింది.శ్రీజేశ్ పట్ల నీరజ్‌కు ఉన్న గౌరవానికి నిదర్శనంఈ విషయం గురించి భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష మాట్లాడుతూ.. ‘‘ముగింపు వేడుకల్లో శ్రీజేశ్‌ను ఫ్లాగ్‌బేరర్‌గా నియమించాలనుకుంటున్నామని నీరజ్ చోప్రాతో చెప్పాను. అందుకు బదులిస్తూ.. ‘మేడమ్.. ఒకవేళ పతకధారిగా ఎవరు సరైనవ్యక్తి అని మీరు గనుక నన్ను అడిగితే.. నేను కూడా కచ్చితగా శ్రీ భాయ్ పేరునే చెపుతా’ అన్నాడు.శ్రీజేశ్ పట్ల నీరజ్‌కు ఉన్న గౌరవానికి ఇది నిదర్శనం. క్రీడా స్ఫూర్తితో తను ఇందుకు అంగీకరించాడు’’ అని హర్షం వ్యక్తం చేశారు. కాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత్‌కు నాలుగు కాంస్యాలు(షూటింగ్లో మూడు, హాకీ 1), ఒక రజత పతకం(పురుషుల జావెలిన్ త్రో) దక్కింది. ఇక ఆగష్టు 11న ఒలింపిక్స్ ముగింపు వేడుకలు జరుగనున్నాయి. ఇక ఆరంభ వేడుకల్లో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, టేబుల్ టెన్నిస్ వెటరన్ ప్లేయర్ శరత్ కమల్ భారత బృంద పతకధారులుగా వ్యవహరించిన విషయం తెలిసిందే.చదవండి: అర్షద్ కూడా మా బిడ్డ లాంటివాడే: నీరజ్ చోప్రా తల్లిదండ్రులు -
నీరజ్ ‘గోల్డ్’ గెలిచాడు.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. విభిన్న అంశాలపై ‘ఎక్స్’లో (ట్విటర్) ద్వారా తన స్పందనను పంచుకుంటుంటారు. భిన్న అంశాలలో ప్రతిభావంతులను, క్రీడాకారులను ప్రశంసిస్తుంటారు. తాజాగా ప్యారిస్ ఒలింపిక్స్‌లో రజత పతక విజేత నీరజ్ చోప్రా పట్ల స్పందించారు.నీరజ్ రెండో బంగారు పతకానికి దూరమైనప్పటికీ, అతని అద్భుతమైన ప్రదర్శన, తిరుగులేని నిలకడను ఆనంద్ ప్రశంసించారు. అలాగే స్వర్ణం గెలిచిన పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ రికార్డ్-బ్రేకింగ్ విజయాన్నీ అభినందించారు. నీరజ్‌తో అతని క్రీడాస్ఫూర్తిని, స్నేహాన్ని మెచ్చుకున్నారు."నేను ఒప్పుకుంటున్నాను. నిన్న రాత్రి నీరజ్ చోప్రాకు రెండో ఒలింపిక్ బంగారు పతకం చేజారిన వేళ నిశ్చేష్టుడనయ్యాను. కానీ, ఈ ఉదయం ముందుగా రికార్డ్ బద్దలు కొట్టిన అర్షద్ నదీమ్‌ని, నీరజ్‌తో అతని క్రీడాస్ఫూర్తి, స్నేహాన్ని అభినందించాలనుకుంటున్నాను. ఇక అత్యంత నిలకడను ప్రదర్శించిన నీరజ్ కూడా గోల్డ్ గెలిచినట్టేనని నేను చెప్పాలనుకుంటున్నాను. నీరజ్ భారత్‌కు మొదటి రజత పతకాన్ని అందించారు. నీరజ్ మీరు నిజంగా గొప్ప అథ్లెట్, మంచి మనిషి. మా అందరినీ గర్వపడేలా చేశారు" అని ఆనంద్ మహీంద్రా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.I confess. I was devastated last night when @Neeraj_chopra1 didn’t win his second Olympic gold medal. But, this morning, I first want to congratulate Arshad Nadeem for his record-breaking throw. AND his sportsmanship & camaraderie with Neeraj. Then I want to tell Neeraj… pic.twitter.com/4KjPPrDh2e— anand mahindra (@anandmahindra) August 9, 2024 -
అర్షద్ కూడా మా బిడ్డ లాంటివాడే: నీరజ్ చోప్రా తల్లిదండ్రులు
ప్యారిస్ ఒలింపిక్స్-2024లోస్వర్ణ పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. రజతంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ ఈవెంట్లో.. నీరజ్ ఈ సీజన్లోనే అత్యుత్తమగా ఈటెను 89.45 మీటర్లు విసిరాడు. అయితే.. ఆది నుంచి నీరజ్‌కు గట్టిపోటీగా భావించిన పాకిస్తాన్ ప్లేయర్ అర్షద్ నదీమ్ అనూహ్య రీతిలో బల్లాన్ని ఏకంగా 92.97 మీటర్ల దూరం విసిరి సంచలనం సృష్టించాడు.ఒలింపిక్ రికార్డు తన అద్భుత ప్రదర్శనతో ఒలింపిక్ రికార్డు నెలకొల్పి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఫలితంగా రెండో స్థానానికే పరిమితమైన నీరజ్‌కు సిల్వర్ మెడల్ దక్కింది. అయితే, చాలా మంది వీరిద్దరి మధ్య పోటీని ఇండియా వర్సెస్ పాకిస్తాన్‌గా అభివర్ణించారు. కానీ.. ఇలాంటి పోలికలు సరికావని అంటున్నారు నీరజ్ చోప్రా తల్లిదండ్రులు. మా బిడ్డ లాంటివాడేఅర్షద్ను కూడా తమ బిడ్డలాగే భావిస్తామని.. వారిద్దరు పోటీపడుతుంటే చూడముచ్చటగా ఉంటుందని ప్రేమను చాటుకున్నారు. ‘‘ఫైనల్ చూస్తున్నపుడు మేమేమీ కంగారుపడలేదు. మా పిల్లలు అక్కడ పోటీపడినట్లుగా అనిపించింది. మనకు స్వర్ణం వచ్చిందా.. రజత పతకం వచ్చిందా అన్నది ముఖ్యం కాదు. అక్కడున్నవాళ్లంతా ఎంతో కష్టపడి వచ్చినవారే. అయితే, వారిలో వీళ్లిద్దరు అద్భుతంగా ఆడారు’’ అని నీరజ్ చోప్రా తల్లి సరోజ్ దేవి నీరజ్, అర్షద్ నదీమ్‌పై ప్రశంసలు కురిపించారు. తమ కుమారుడు గాయాల పాలయ్యాడని.. అతడు సాధించిన ఈ వెండి పతకం కూడా పసిడితో సమానమని పేర్కొన్నారు.ఎలాంటి శత్రుత్వం లేదుఇక నీరజ్ వాళ్ల ఆంటీ మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ దాయాదుల పోరు అనే చర్చకు తావులేదు. ఇది కేవలం ఆటగాళ్ల మధ్య పోటీ మాత్రమే. నదీమ్‌తో తనకు ఎలాంటి శత్రుత్వం లేదని నీరజ్ ఇప్పటికే స్పష్టం చేశాడు. నిజానికి అర్షద్ నదీమ్.. కాంపిటీషన్లకు వెళ్తున్నపుడు మేము అతడి కోసం కూడా ప్రార్థిస్తాం. మీడియా వేదికగా నదీమ్ తల్లిదండ్రులకు మేము ఈ విషయం చెప్పేందుకు సంతోషిస్తున్నాం. అతడు ఎల్లప్పుడూ బాగుండాలని మేము కోరుకుంటాం’’ అని పేర్కొన్నారు.ఆ రెండు కలిసి వచ్చాయిఅదే విధంగా.. నీరజ్ చోప్రా తండ్రి సతీశ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘అర్షద్ నదీమ్ కూడా అత్యుత్తమ ప్రతిభ కలిగిన ఆటగాడు. అతడు పడ్డ కష్టానికి ప్యారిస్ ఒలింపిక్స్‌లో ఫలితం దక్కింది. దీనిని మనం ఇండియా వర్సెస్ పాకిస్తాన్‌గా చూడకూడదు. ప్రపంచవ్యాప్తంగా అందరు ఆటగాళ్లు అక్కడ పోటీపడ్డారు. ఈరోజు నదీమ్‌ది. హార్డ్‌వర్క్‌తో పాటు అదృష్టం కూడా అతడికి కలిసి వచ్చింది.ఫలితాలు కూడా ఈ రెండింటి కలయికగానే ఉంటాయి’’ అని అన్నారు. ఎన్డీటీవీతో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఓ ఆటగాడి తల్లిదండ్రులుగా తాము ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుందని.. ఒక్కోసారి కొడుకు కళ్లారా చూసుకునే సమయం కూడా ఉండదని ఉద్వేగానికి లోనయ్యారు.చదవండి: #Arshad Nadeem: కూలీ కొడుకు.. ఒక్కపూట తిండిలేక పస్తులు.. ఒలింపిక్ వీరుడిగా -
వరుసగా రెండో ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన నీరజ్ చోప్రా
-
నీరజ్ చోప్రాకు వైఎస్ జగన్ అభినందనలు
-
సాహో బల్లెం వీరుడా.. రజతంతో మెరిసిన నీరజ్ (ఫొటోలు)
-
ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్.. అర్షద్ నదీమ్‌కు భారీ నజరానా ప్రకటించిన పాక్
ఒలింపిక్ గోల్డ్ మెడల్ కోసం 40 ఏళ్లగా ఎదురుచూస్తున్న పాకిస్తాన్ సుదీర్ఘ నిరీక్షణకు స్టార్ అథ్లెట్ అర్షద్ నదీమ్ తెరదించాడు. ప్యారిస్ ఒలింపిక్స్ జావెలిన్ త్రో ఈవెంట్లో బంగారు పతకాన్ని సొంతం చేసుకున్న అర్షద్ నదీమ్.. విశ్వవేదికపై తన జాతీయ జెండాను రెపాలపడించాడు. గురువారం జరిగిన ఫైనల్లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాను వెనక్కి నెట్టి స్వర్ణ పతకాన్ని ఈ పాకిస్తానీ కైవసం చేసుకున్నాడు. ఏకంగా జావెలిన్‌ను 92.97 మీటర్ల దూరం విసిరిన నదీమ్.. పసిడి పతకంతో పాటు అరుదైన ఒలింపిక్ రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు.ఇక అర్షద్ గోల్డ్‌మెడల్ సాధించడంతో పాకిస్తాన్ మొత్తం సంబరాల్లో మునిగితేలిపోయింది. ఈ క్రమంలోసిద్ధిఖీ గోల్డెన్ బాయ్ నదీమ్‌కు కరాచీ మేయర్ ముర్తాజా వహాబ్ భారీ నజరానా ప్రకటించారు. సింధ్ ప్రావిన్స్ తరపున రూ.5 కోట్లు(పాకిస్తానీ కరెన్సీ)ను నగదు బహుమతిగా ఇవ్వనున్నట్లు వహాబ్ సిద్ధిఖీ వెల్లడించారు. అదేవిధంగా ఒలింపిక్స్ చరిత్రలోనే పాకిస్తాన్ తరపున వ్యక్తిగత విభాగంలో గోల్డ్‌మెడల్ గెలుచుకున్న తొలి అథ్లెట్ కూడా అర్షద్ కావడం విశేషం. -
దేశం మొత్తం గర్విస్తోంది.. నీరజ్‌కు ప్రధాని మోదీ అభినందనలు
ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత ఖాతాలో తొలి రజత పతకం వచ్చి చేరింది. జావెలిన్ త్రో ఈవెంట్లో భారత బళ్లెం వీరుడు నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. గురువారం ఆర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో జావెలిన్‌ను 89.45 మీటర్లు విసిరిన నీరజ్.. రెండో స్ధానంలో నిలిచి రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య ఐదుకు చేరింది. ఈ నేపథ్యంలో నీరజ్ చోప్రాను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. "నీరజ్ చోప్రా ఒక అద్భుతమైన అథ్లెట్. మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు. అతడి కెరీర్లో మరో ఒలింపిక్ మెడల్ చేరడం పట్ల యావత్తు భారత్ హర్షం వ్యక్తం చేస్తోంది. రజత పతకం సాధించినందుకు నిరాజ్కు అభినందనలు. ఎంతో మంది యువ అథ్లెట్లకు నీరాజ్ ఆదర్శమని" ఎక్స్‌లో మోదీ ప్రశంసించారు. ఇక ఈ జావెలిన్ త్రో ఈవెంట్లో పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. నదీమ్ జావెలిన్‌ను 92.97 మీటర్ల దూరం విసిరి గోల్డ్ మెడల్ తన ఖాతాలో వేసుకున్నాడు. Neeraj Chopra is excellence personified! Time and again he’s shown his brilliance. India is elated that he comes back with yet another Olympic success. Congratulations to him on winning the Silver. He will continue to motivate countless upcoming athletes to pursue their dreams… pic.twitter.com/XIjfeDDSeb— Narendra Modi (@narendramodi) August 8, 2024 -
Paris Olympics 2024: రజత నీరాజనం
పారిస్: పసిడి ఆశలతో ‘పారిస్’లో అడుగు పెట్టిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. రెండో ప్రయత్నంలో 26 ఏళ్ల నీరజ్ జావెలిన్‌ను 89.45 మీటర్ల దూరం విసిరి ఈ సీజన్లో తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. చివరకు ఈ స్కోరుతోనే నీరజ్‌కు రజత పతకం ఖరారైంది.క్వాలిఫయింగ్‌లో 89.34 మీటర్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచిన నీరజ్ ఫైనల్లో కాస్త ఒత్తిడికి లోనయ్యాడు. అతడి తొలి ప్రయత్నం ఫౌల్ అయింది. రెండో ప్రయత్నంలో నీరజ్ ఆందోళన చెందకుండా సంయమనంతో జావెలిన్‌ను 89.45 మీటర్ల దూరం విసిరాడు. ఆ తర్వాత నీరజ్ మూడు, నాలుగు, ఐదు, ఆరో ప్రయత్నాలు కూడా ఫౌల్గానే నమోదయ్యాయి. దాంతో ఈ త్రోలలో నమోదైన స్కోరును పరిగణనలోకి తీసుకోలేదు. టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఎవరూ ఊహించని విధంగా జావెలిన్ త్రోలో పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ స్వర్ణ పతకాన్ని గెల్చుకొని అందర్నీ నివ్వెరపరిచాడు. 27 ఏళ్ల నదీమ్ తొలి ప్రయత్నంలో విఫలమయ్యాడు. అయితే రెండో ప్రయత్నంలో నదీమ్ జావెలిన్‌ను 92.97 మీటర్ల దూరం విసిరి కొత్త ఒలింపిక్ రికార్డు సృష్టించడంతోపాటు పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో ఆండ్రెస్ థోర్కిల్డ్సన్ (నార్వే; 90.57 మీటర్లు) నెలకొల్పిన రికార్డును నదీమ్ బద్దలు కొట్టాడు. ప్రపంచ మాజీ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా) 88.54 మీటర్లతో కాంస్య పతకాన్ని సాధించాడు. 1 వ్యక్తిగత క్రీడాంశంలో ఒలింపిక్స్ చరిత్రలో పాకిస్తాన్‌కు తొలి స్వర్ణ పతకం నదీమ్ ద్వారా లభించింది. గతంలో పాకిస్తాన్ హాకీ జట్టు 3 స్వర్ణాలు, 3 రజతాలు, 2 కాంస్యాలు గెలిచింది. 1960 రోమ్ ఒలింపిక్స్ రెజ్లర్ మొహమ్మద్ బషీర్ కాంస్యం... 1988 సియోల్ ఒలింపిక్స్‌లో బాక్సర్ హుస్సేన్ షా కాంస్యం సాధించారు. 4 ఒలింపిక్స్ క్రీడల్లో రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన నాలుగో భారత ప్లేయర్‌గా నీరజ్ గుర్తింపు పొందాడు. గతంలో రెజ్లర్ సుశీల్ (2008 బీజింగ్; కాంస్యం... 2012 లండన్; రజతం), షట్లర్ పీవీ సింధు (2016 రియో; రజతం... 2020 టోక్యో; కాంస్యం), షూటర్ మనూ భాకర్ (2024 పారిస్; 2 కాంస్యాలు) ఈ ఘనత సాధించారు. -
Paris Olympics: భారత క్రీడాకారుల నేటి షెడ్యూల్
ప్యారిస్ ఒలింపిక్స్‌లో 13వ రోజు భారత క్రీడాకారులు తమ ఆదృష్టాన్ని పరీక్షించేందుకు సిద్దమయ్యారు. గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ రౌండ్లో పోటీపడనున్నాడు. ఈ ఫైనల్ పోరు భారత కాలమానం ప్రకారం రాత్రి గం. 11:55 నుంచి ప్రారంభం కానుంది.13వ రోజు భారత షెడ్యూల్ ఇదే..పురుషుల కాంస్య పతక పోరు: భారత్ వర్సెస్ స్పెయిన్ (సాయంత్రం గం. 5:30 నుంచి)మహిళల 100 మీటర్ల హర్డిల్స్ రెపిచాజ్ రౌండ్: జ్యోతి యర్రాజీ (మధ్యాహ్నం గం. 2:05 నుంచి). పురుషుల జావెలిన్ త్రో ఫైనల్: నీరజ్ చోప్రా (రాత్రి గం. 11:55 నుంచి)పురుషుల 57 కేజీల ఫ్రీస్టయిల్: అమన్ సెహ్రావత్ (మధ్యాహ్నం గం. 2:30 నుంచి). మహిళల ఫ్రీస్టయిల్ 57 కేజీలు: అన్షు మలిక్ (మధ్యాహ్నం గం. 2:30 నుంచి) -
నీరజ్‌పైనే పసిడి ఆశలు
పారిస్: యావత్ భారతావని ఆశలు మోస్తూ... పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ రౌండ్లో అదరగొట్టిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా గురువారం ఫైనల్ బరిలో దిగనున్నాడు. వరుసగా రెండోసారి పసిడి పతకమే లక్ష్యంగా పారిస్‌లో అడుగు పెట్టిన నీరజ్‌చోప్రా.. అర్హత పోటీల్లో ఒకే ఒక్క త్రోతో అందరి దృష్టిని ఆకర్షించాడు. డిఫెండింగ్ చాంపియన్ హోదాకు న్యాయం చేస్తూ మంగళవారం క్వాలిఫయింగ్ ఈవెంట్ తొలి ప్రయత్నంలోనే జావెలిన్‌ను 89.34 మీటర్ల దూరం విసిరి దర్జాగా ఫైనల్ చేరాడు. పతకాల కోసం జరిగే ఫైనల్స్‌లో నీరజ్ అదే ప్రదర్శన కొనసాగించాలని చూస్తున్నాడు. అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా), జూలియన్ వెబర్ (జర్మనీ), అర్షద్ నదీమ్ (పాకిస్తాన్), జాకుబ్ వెద్లెచ్ (చెక్ రిపబ్లిక్) నుంచి నీరజ్‌కు గట్టిపోటీ ఎదురవనుంది. ఈరోజు జరిగే ఫైనల్లో మొత్తం 12 మంది పతకాల కోసం పోటీ పడనున్నారు. ముందుగా జావెలిన్ త్రోయర్లకు మూడు అవకాశాలు ఇస్తారు. మూడు అవకాశాల తర్వాత చివరి నాలుగు స్థానాల్లో ఉన్న వారు ని్రష్కమిస్తారు. ఇక మిగిలిన ఎనిమిది మందికి మరో మూడు అవకాశాలు ఇస్తారు. మొత్తం ఆరు త్రోల తర్వాత టాప్–3లో నిలిచిన వారికి స్వర్ణ, రజత, కాంస్య పతకాలు లభిస్తాయి. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చాక ఇప్పటి వరకు షట్లర్ పీవీ సింధు (2016 రియో; రజతం... 2020 టోక్యో; కాంస్యం), రెజ్లర్ సుశీల్ కుమార్ (2008 బీజింగ్ కాంస్యం; 2012 లండన్ రజతం), షూటర్ మనూ భాకర్ (2024 పారిస్; రెండు కాంస్యాలు) మాత్రమే విశ్వక్రీడల్లో రెండేసి పతకాలు సాధించారు. గురువారం నీరజ్ పోడియంపై నిలిస్తే ఈ జాబితాలో చేరనున్నాడు. ఇక అగ్రస్థానం దక్కించుకుంటే.. దేశం తరఫున వ్యక్తిగత విభాగంలో రెండు పసిడి పతకాలు గెలిచిన తొలి ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కనున్నాడు. నీరజ్ టైటిల్ నిలబెట్టుకుంటే.. ఒలింపిక్స్‌లో ఆ ఘనత సాధించిన ఐదో జావెలిన్ త్రోయర్ కానున్నాడు. విశ్వక్రీడల చరిత్రలో ఎరిక్ లామింగ్ (స్వీడన్; 1908, 1912), జానీ మైరా (ఫిన్లాండ్; 1920, 1924), జాన్ జెలెజ్నీ (చెక్ రిపబ్లిక్; 1992, 1996, 2000), ఆండ్రీస్ థోర్కిల్డ్సెన్ (నార్వే; 2004, 2008) స్వర్ణాన్ని నిలబెట్టుకున్నారు. -
వచ్చాడు... విసిరాడు... ఫైనల్ చేరాడు
అనూహ్యమేమీ కాదు...అలవాటు లేనిదేమీ కాదు... అడుగు పెడితే చాలు జావెలిన్‌తో అద్భుతంగా ఆడుకునే భారత స్టార్ నీరజ్ చోప్రా ఒలింపిక్ వేదికపై మళ్లీ తన బంగారు వేటను మొదలు పెట్టాడు. అసలు పోరుకు ముందు అర్హత సమరంలో తనదైన శైలిలో అదరగొట్టాడు. క్వాలిఫయింగ్ పోరులో ఒకే ఒక్క త్రో విసిరి అలా అలవోకగా ముందంజ వేశాడు... మరో మాటకు తావు లేకుండా అగ్ర స్థానంతో దర్జాగా ఫైనల్లోకి అడుగు పెట్టి ఒక లాంఛనం ముగించాడు... ఎక్కడా తడబాటు లేదు, కాస్త ఉత్కంఠ పెంచినట్లుగా కూడా కనిపించలేదు. రోజూ చేసే పని ఇదేగా అన్నట్లుగా క్షణాల వ్యవధిలో త్రో పూర్తి చేసి వెనక్కి తిరిగి చూడకుండా నడుచుకుంటూ వెళ్లిపోయాడు... ఇదే తరహా ప్రదర్శనను రేపు జరిగే ఫైనల్లోనూ చూపిస్తే మన బంగారు బాలుడి ఒడిలో వరుసగా రెండో ఒలింపిక్స్‌లో మరో పసిడి పతకం పరుగెత్తుకుంటూ వచ్చి వాలడం ఖాయం! పారిస్: కోట్లాది భారత అభిమానుల పసిడి ఆశలను మోస్తూ బరిలోకి దిగిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణంతో సత్తా చాటిన నీరజ్ ఈసారి కూడా అదే జోరును కొనసాగించే లక్ష్యంతో మైదానంలోకి అడుగు పెట్టాడు. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ ఈవెంట్ గ్రూప్ ‘బి’లో నీరజ్ తన జావెలిన్‌ను 89.34 మీటర్ల దూరం విసిరి క్వాలిఫై అయ్యాడు. ఫైనల్ చేరేందుకు అర్హత మార్కు 84 మీటర్లు కాగా... తన తొలి ప్రయత్నంలోనే అంతకంటే ఎక్కువ దూరం బల్లెం విసరడంతో నీరజ్‌కు మళ్లీ త్రో చేయాల్సిన అవసరమే రాలేదు. గ్రూప్ ‘ఎ’, గ్రూప్ ‘బి’ రెండూ కలిపి నీరజ్‌దే అత్యుత్తమ ప్రదర్శన. వ్యక్తిగతంగా కూడా ఈ దూరం నీరజ్ కెరీర్లో రెండో స్థానంలో నిలుస్తుంది.2022లో అతను జావెలిన్‌ను 89.94 మీటర్లు విసిరాడు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ కూడా అయిన నీరజ్‌తో హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమైన అండర్సన్ పీటర్స్ (గ్రెనడా), జూలియన్ వెబర్ (జర్మనీ) జావెలిన్‌ను 88.63 మీటర్లు , 87.76 మీటర్లు వరుసగా రెండు, మూడు స్థానాలతో ముందంజ వేశారు. పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ (86.59 మీటర్లు) కూడా ఫైనల్స్‌కు క్వాలిఫై అయ్యాడు. 84 మీటర్లు విసిరిన లేదా రెండు గ్రూప్‌లలో కలిపి 12 మంది అత్యుత్తమ స్కోరర్లు ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు. క్వాలిఫయింగ్‌లో 9 మంది 84 మీటర్ల మార్క్‌ను అందుకొని ముందంజ వేయగా, మరో ముగ్గురికి మాత్రం టాప్–12లో రావడంతో అవకాశం లభించింది. పోటీలో నిలిచిన మరో భారత జావెలిన్ త్రోయర్ కిషోర్ జెనా తీవ్రంగా నిరాశపరిచాడు. జావెలిన్‌ను 80.73 మీటర్లు మాత్రమే విసిరిన అతను గ్రూప్ ‘ఎ’లో తొమ్మిదో స్థానానికే పరిమితం కావడంతో ఫైనల్ అవకాశం చేజారింది. గత ఏడాది ఆసియా క్రీడల్లో జావెలిన్‌ను 87.54 మీటర్ల దూరం విసిరి పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన కిషోర్... అసలు సమయంలో కనీస ప్రదర్శన కూడా ఇవ్వలేకపోయాడు. మరోవైపు మహిళల 400 మీటర్ల పరుగులో భారత అథ్లెట్ కిరణ్ పహాల్ నిరాశపర్చింది. ఈ ఈవెంట్లో ఆమె సెమీఫైనల్ చేరడంలో విఫలమైంది. ఆరుగురు పాల్గొన్న రెపిచాజ్ హీట్–1లో మొదటి స్థానంలో నిలిస్తేనే సెమీస్ చేరే అవకాశం ఉండగా... 52.59 సెకన్లలో పరుగు పూర్తి చేసిన కిరణ్ ఆరో స్థానంతో ముగించింది.ఎప్పుడైనా తొలి ప్రయత్నమే మెరుగ్గా ఉండాలని భావిస్తా. ప్రతీసారి అది సాధ్యం కాకపోవచ్చు. అలా జరిగింది కూడా. నేను ఇప్పుడు పూర్తి ఫిట్‌గా ఉన్నా. ఎలాంటి ఇబ్బంది లేదు. ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. అయితే క్వాలిఫయింగ్కంటే ఫైనల్లో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. కాబట్టి సన్నద్ధత కూడా చాలా బాగుండాలి. నేను చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నా. ఫైనల్ సాయంత్రం జరుగుతుంది కాబట్టి వాతావరణం కాస్త చల్లగా ఉండవచ్చు. అయితే దానికి అనుగుణంగానే సిద్ధమవుతా. ఫైనల్ చేరిన వారంతా బలమైన ప్రత్యర్థులే కాబట్టి ఎవరితోనూ ప్రత్యేకంగా పోటీ ఉండదు. –నీరజ్ చోప్రా -
చెంప చెళ్లుమనిపించేలా!.. కన్నీళ్లు కావు అవి!
బహుశా.. ఏడాది గడిచిందేమో!.. జీవితంలోనే అతి పెద్ద సవాల్‌ను ఎదుర్కొందామె. ఢిల్లీ వీధుల్లో రోజుల తరబడి సహచర మహిళా రెజ్లర్లతో కలిసి పోలీసు దెబ్బలు తినే దుస్థితిలో పడింది. ఆపై అరెస్టయింది కూడా! అంతటితో ఆమె కష్టాలు ఆగిపోలేదు.. ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ వేధింపులు..అన్యాయాన్ని ఎదిరించే క్రమంలో జీవిత కాలపు శ్రమతో సాధించిన ఖేల్రత్నలాంటి అవార్డులు వెనక్కి ఇచ్చేసినా.. పెదవి విరుపులే.. అంతేనా.. ‘ఇంతకు తెగిస్తారా’ అనే విపరీతపు మాటలు.. సాధించిన పతకాలన్నింటినీ గంగానదిపాలు చేసేందుకు సిద్ధపడినా పోరాటంలోని తీవ్రతను గుర్తించలేని అజ్ఞానం..‘‘ఇక్కడితో నీ కెరీర్, ఖేల్ ఖతం.. రిటైర్మెంట్ ప్రకటించడమే శరణ్యం.. ఆట మీద కాకుండా ఇలాంటి విషయాలపై దృష్టి పెడితే నీకే తలపోట్లు’’.. అంటూ విద్వేషకారులు విషం చిమ్ముతున్నా.. ఆమె వెనుకడుగు వేయలేదు. సహచరులకు జరిగిన అన్యాయాన్ని గొంతెత్తి ప్రశ్నిస్తూ.. తప్పు చేసిన వారి ఉనికి ప్రశ్నార్థకం చేయాలనే పట్టుదలతో ముందుకు సాగింది. ‘‘కాస్తైనా కనికరం లేదా’’ అంటూ విద్వేష విషం చిమ్ముతున్న వాళ్లకు ధీటుగా బదులిస్తూనే.. అన్యాయం చేసిన వాళ్లు దర్జాగా గల్లా ఎగురవేసుకుని తిరుగుతూ ఉంటే.. చూడలేక కన్నీటి పర్యంతమైంది కూడా! అవును.. ఆమె మరెవరో కాదు.. ఆటలోనే కాదు జీవితంలోనూ ఎన్నో సవాళ్లు.. మరెన్నో మలుపులు ఎదుర్కొన్న పట్టువదలని ధీర వనిత, హర్యానా శివంగి వినేశ్ ఫొగట్. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్న ఒకప్పటి బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ను గద్దె దించేందుకు చేసిన అలుపెరగని పోరాటం ఆమె కెరీర్‌ను చిక్కుల్లో పడేసింది.భారత తొలి మహిళ రెజ్లర్‌గా చరిత్రఅయినా.. ‘పట్టు’ వీడలేదు ఈ స్టార్ రెజ్లర్. గాయాల రూపంలో దెబ్బ మీద దెబ్బపడినా ఆత్మవిశ్వాసం చెక్కు చెదరనీయక పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. వరుసగా మూడోసారి ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళ రెజ్లర్‌గా చరిత్ర సృష్టించింది ఈ హర్యానా అమ్మాయి. భారీ అంచనాలు లేకుండా బరిలోకి దిగడం ఆమెకు మేలే చేసింది. మహిళల 50 కేజీల విభాగంలో తలపడిన వినేశ్ ప్రయాణం.. ప్రిక్వార్టర్స్ వరకు సాధారణంగానే సాగింది. అయితే, అక్కడే ఆమె సత్తాకు అసలు సిసలు పరీక్ష ఎదురైంది. జపాన్ రెజ్లర్, వరల్డ్ నంబర్ వన్, టోక్యో స్వర్ణ పతక విజేత యీ సుసాకీ రూపంలో కఠినమైన సవాలు ముందు నిలిచింది. వరల్డ్ నంబర్ వన్‌కు షాకిచ్చి..అయితే, ఆద్యంతం ఉత్కంఠ రేపిన వీరిద్దరి పోరు ముగిసే సెకండ్ల వ్యవధిలో తిరిగి పుంజుకున్న వినేశ్ ఫొగట్ 3-2తో సుసాకీని ఓడించి.. సంచలన విజయం అందుకుంది. తద్వారా తన కెరీర్లో మరోసారి విశ్వ క్రీడల్లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. అక్కడ ఉక్రెయిన్‌కు చెందిన, ఎనిమిదో సీడ్ ఒక్సానా లివాచ్‌తో వరల్డ్ నంబర్ 65 వినేశ్ ఫొగట్ తలపడింది. వినేశ్ శుభారంభం అందుకున్నా.. లివాచ్ ఉడుం పట్టు వల్ల.. ఆఖరి వరకు బౌట్ ఉత్కంఠగా సాగింది. అయితే, ప్రపంచ నంబర్ వన్నే ఓడించిన వినేశ్ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో లివాచ్ పని పట్టి 7-5తో ఆమెను ఓడించింది. ఫలితంగా తన కెరీర్లో మొట్టమొదటిసారిగా ఒలింపిక్స్‌లో సెమీస్ పోరుకు అర్హత సాధించింది. ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళా రెజ్లర్‌గా చరిత్రకెక్కింది. Vinesh Phogat in control💪The 🇮🇳 WRESTLER is closing on a semi-final spot in #Paris2024!#Cheer4Bharat & watch the Olympics LIVE on #Sports18 & stream FREE on #JioCinema📲#OlympicsonJioCinema #OlympicsonSports18 #JioCinemaSports #Wrestling #Olympics pic.twitter.com/mNajPsKh2V— JioCinema (@JioCinema) August 6, 2024చెంప చెళ్లుమనేలాన్యాయం కోసం పోరాడిన తాను.. ప్యారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించే క్రమంలో... జూనియర్ చేతిలో ఓడితే.. ‘‘ఇక నీ ఆట కట్టు’’ అని హేళన చేసిన వారికి చెంప చెళ్లుమనేలా.. సమాధానమిచ్చింది. తీవ్ర భావోద్వేగానికి లోనై.. కన్నీళ్లు పెట్టుకుంది.ఈ క్రమంలో వినేశ్ ఫొగట్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. టోక్యో ఒలింపిక్స్ గోల్డెన్ బాయ్, ప్యారిస్‌లో ఫైనల్ చేరిన భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా కూడా వినేశ్ ఫొగట్‌ను కొనియాడాడు.అసాధారణం.. నమ్మలేకపోతున్నా‘‘అసాధారణ విజయం. వరల్డ్‌నంబర్ వన్ సుసాకీని వినేశ్ ఓడించడం నమ్మశక్యంకాని విషయం. ఇక్కడిదాకా చేరేందుకు ఆమె ఎంతగా శ్రమిందో ఈ విజయం ద్వారా తెలిసిపోతుంది. ఎన్నో కష్టాలు చవిచూసింది. తను పతకం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని నీరజ్ చోప్రా వినేశ్ ఆట తీరును ఆకాశానికెత్తాడు.చదవండి: Olympics 2024: ఫైనల్లో నీరజ్ చోప్రా8️⃣9️⃣.3️⃣4️⃣🚀ONE THROW IS ALL IT TAKES FOR THE CHAMP! #NeerajChopra qualifies for the Javelin final in style 😎watch the athlete in action, LIVE NOW on #Sports18 & stream FREE on #JioCinema📲#OlympicsonJioCinema #OlympicsonSports18 #JioCinemaSports #Javelin #Olympics pic.twitter.com/sNK0ry3Bnc— JioCinema (@JioCinema) August 6, 2024 -
Paris Olympics 2024 Today Schedule: నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్ ఇదే
ప్యారిస్ ఒలింపిక్స్‌లో 11వ రోజు షెడ్యూల్ ఇదే..టేబుల్ టెన్నిస్: పురుషుల టీమ్ ప్రిక్వార్టర్స్ (భారత్ వర్సెస్ చైనా)- మధ్యాహ్నం 1.30, మహిళల టీమ్ క్వార్టర్స్ (భారత్ వర్సెస్ అమెరికా జర్మనీ)- సాయంత్రం 6.30అథ్లెటిక్స్: పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ (కిశోర్ జెనా)- మధ్యాహ్నం 1.50, (నీరజ్ చోప్రా)- మధ్యాహ్నం 3.20, మహిళల 400మీ.పరుగు రెపిచేజ్ రౌండ్ (కిరణ్ పాహల్)- మధ్యాహ్నం 2.50రెజ్లింగ్: మహిళల 50 కేజీల ప్రిక్వార్టర్స్ (వినేశ్ వర్సెస్ సుసాకి)- మధ్యాహ్నం 3హాకీ: పురుషుల సెమీస్ (భారత్ వర్సెస్ జర్మనీ)- రాత్రి 10.30అథ్లెటిక్స్: మహిళల లాంగ్‌జంప్ క్వాలిఫికేషన్- మధ్యహ్నం 2.45పురుషుల 400మీ.పరుగు సెమీస్- రాత్రి 11.05పురుషుల లాంగ్‌జంప్ ఫైనల్- రాత్రి 11.45, పురుషుల 1500మీ.పరుగు ఫైనల్- రాత్రి 12.20, మహిళల 200మీ.పరుగు ఫైనల్- రాత్రి 1.10 -
Paris Olympics 2024: నీరజ్ వస్తున్నాడు
పారిస్: భారీ అంచనాలతో పారిస్ ఒలింపిక్స్‌లో అడుగు పెట్టిన ఒలింపిక్ డిఫెండింగ్ చాంపియన్, భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మంగళవారం క్వాలిఫయింగ్ బరిలోకి దిగనున్నాడు. 2020 టోక్యో ఓలింపిక్స్లో నీరజ్ పసిడి పతకం సాధించి దేశ అథ్లెటిక్స్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికాడు. ‘పారిస్’లోనూ టోక్యో ప్రదర్శనను పునరావృతం చేయాలని పట్టుదలతో ఉన్నాడు. టోక్యో విశ్వ క్రీడల తర్వాత అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శన కొనసాగించిన 26 ఏళ్ల నీరజ్ గత ఏడాది ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించి విశ్వవిజేతగా నిలిచాడు. ‘పారిస్’ నుంచి కూడా పతకంతో తిరిగి వస్తాడని యావత్ భారతావని ఆశలు పెట్టుకోగా... వాటిని అందుకోవడమే లక్ష్యంగా నేడు నీరజ్ మైదానంలో అడుగు పెట్టనున్నాడు. గాయాల బారిన పడకుండా ఉండేందుకు ఆచితూచి టోరీ్నల్లో పాల్గొన్న 26 ఏళ్ల నీరజ్.. ఈ ఏడాది బరిలోకి దిగిన మూడు టోరీ్నల్లోనూ ఆకట్టుకున్నాడు. ఈ విభాగంలో భారత్ నుంచి నీరజ్ చోప్రాతోపాటు.. కిశోర్ కుమార్ జేనా కూడా పోటీ పడుతున్నాడు. రెండు గ్రూప్‌ల్లో కలిపి మొత్తం 32 మంది త్రోయర్లు బరిలోకి దిగుతున్నారు. గ్రూప్ ‘బి’లో నీరజ్... కిశోర్ గ్రూప్ ‘ఎ’లో ఉన్నారు. ఫైనల్ చేరడానికి అర్హత ప్రమాణంగా 84 మీటర్లు నిర్ణయించారు. క్వాలిఫయింగ్ రౌండ్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 12 మంది ఫైనల్‌కు అర్హత సాధించనున్నారు. ఒకవేళ 12 మంది కంటే ఎక్కువ మంది 84 మీటర్లను దాటి జావెలిన్‌ను విసిరితే ఇందులో నుంచి టాప్–12 మందికి ఫైనల్ బెర్త్‌లు లభిస్తాయి. ఫైనల్ గురువారం జరుగుతుంది. పాకిస్తాన్ త్రోయర్ నదీమ్ అర్షద్, జాకబ్ వాద్లెచ్ (చెక్ రిపబ్లిక్), వెబర్ (జర్మనీ), ఒలీవర్ (ఫిన్లాండ్) నుంచి నీరజ్‌కు ప్రధాన పోటీ ఎదురయ్యే అవకాశాలున్నాయి. నీరజ్ టైటిల్ నిలబెట్టుకుంటే.. ఒలింపిక్స్‌లో ఆ ఘనత సాధించిన ఐదో జావెలిన్ త్రోయర్ కానున్నాడు. విశ్వక్రీడల చరిత్రలో ఎరిక్ లామింగ్ (స్వీడన్; 1908, 1912), జానీ మైరా (ఫిన్లాండ్; 1920, 1924), జాన్ జెలెన్జీ (చెక్ రిపబ్లిక్; 1992, 1996, 2000), ఆండ్రీస్ థోర్కిల్డ్సెన్ (నార్వే; 2004, 2008) స్వర్ణాన్ని నిలబెట్టుకున్నారు. -
ఇండియా ఛీర్స్ ఫర్ నీరజ్..
సాక్షి, సిటీబ్యూరో: భారతీయ జావలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా ఈ నెల 6న పారిస్ ఒలింపిక్స్‌లో తన సత్తా చూపనున్న నేపథ్యంలో ఆయన విజయాన్ని కాంక్షిస్తూ శామ్సంగ్ ఇండియా ‘ఛీర్స్ ఫర్ నీరజ్ ’ను ప్రారంభించింది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు తెలిపారు.తాజా ఒలింపిక్స్‌లో కోట్లాది మంది భారతీయుల ఆశాకిరణమైన నీరజ్ చోప్రాకు తాము ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్సైట్ ద్వారా శుభాకాంక్షలు తెలపొచ్చన్నారు. అంతేకాక 98704–94949 నెంబరుకు ’NEERAJ’ అని వాట్సాప్ మెసేజ్ పంపడం ద్వారా, అలాగే తమ సోషల్ soమీడియా చానెల్‌కు ట్యాగ్ చేయడం ద్వారా అందించవచ్చని వెల్లడించారు.ఇవి చదవండి: ఆకట్టుకున్న పర్ఫ్యూమ్ మేకింగ్.. -
నీరజ్ ‘గోల్డ్’ గెలిస్తే అందరికీ... ఓ సీఈవో అదిరిపోయే ఆఫర్!
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics 2024)లో బంగారు పతకం సాధిస్తే అందరికీ ఉచిత వీసాలు ఇస్తామని ఆన్లైన్ వీసా స్టార్టప్ సంస్థ అట్లీస్ సీఈవో మోహక్ నహ్తా హామీ ఇచ్చారు. ఆయన ప్రకటించిన ఆఫర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.తన లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో ఓ పోస్ట్‌ను పంచుకుంటూ.. "ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా స్వర్ణం గెలిస్తే నేను వ్యక్తిగతంగా అందరికీ ఉచిత వీసా పంపుతాను" అంటూ ప్రకటించారు. జూలై 30న నహ్తా పోస్ట్ పెట్టిన వెంటనే, ఈ ఆఫర్‌కు సంబంధించి యూజర్లు ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో తన ఆఫర్‌ను వివరిస్తూ మరో పోస్ట్‌ను మోహక్ నహ్తా షేర్ చేశారు."నీరజ్ చోప్రా బంగారు పతకం గెలిస్తే అందరికీ ఉచిత వీసా ఇస్తామని జూలై 30న వాగ్దానం చేశాను. చాలా మంది అడిగారు కాబట్టి, ఇవిగో వివరాలు.." అంటూ తాజా పోస్ట్‌లో పూర్తి వివరాలు అందించారు. పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా ఆగస్ట్ 8న పతకాల కోసం పోటీపడతాడు. ఆయన బంగారు పతకం సాధిస్తే, ఒక రోజంతా వినియోగదారులందరికీ ఒక ఉచిత వీసా అందిస్తామన్నారు. ఆ రోజు అన్ని దేశాలకు వీసా ఖర్చును కంపెనీ భరిస్తుందని ఆయన తెలిపారు.వినియోగదారులు తమ ఈమెయిల్ అడ్రస్‌ను కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే కంపెనీ ఉచిత వీసా క్రెడిట్‌తో యూజర్ తరపున ఖాతాను సృష్టిస్తుందన్నారు. సీఈవో మోహక్ నహ్తా పోస్ట్ లింక్డ్ఇన్ ప్లాట్‌ఫారమ్‌లో భాఈగా రీపోస్ట్‌లు, లైక్‌లు, కామెంట్లను పొందింది. యూఎస్‌లోని శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా ఉన్న అట్లీస్ కంపెనీకి భారత్‌లోని ఢిల్లీ, ముంబైలలో శాఖలు ఉన్నాయి. -
నీరజ్ చోప్రా పైనే భారత్ ఆశలు
పారిస్: విశ్వ క్రీడల్లో అందరూ ఆసక్తితో ఎదురుచూసే అథ్లెటిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలకు నేడు తెర లేవనుంది. ఒలింపిక్స్ మొదలై ఐదు రోజులు దాటినా.. అసలు సిసలు మజా ఇచ్చే అథ్లెటిక్స్ ఈవెంట్ నేటి నుంచి జరుగుతుంది. భారత అభిమానుల విషయానికొస్తే స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపైనే అందరి దృష్టి ఉంది. టోక్యో ఒలింపిక్స్‌లో పసిడి పతకంతో భారత అథ్లెటిక్స్ చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించిన నీరజ్ మరోసారి అదే స్థాయి ప్రదర్శన చేసేందుకు సిద్ధమవుతుండగా.. భారత్ నుంచి మొత్తం 29 మంది అథ్లెట్లు ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో సత్తా చాటేందుకు రెడీ అయ్యారు. ‘టోక్యో’ క్రీడల్లో పసిడి పతకం సాధించిన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో అదే నిలకడ కొనసాగిస్తూ వస్తున్న నీరజ్ వరుసగా రెండో స్వర్ణం నెగ్గాలని తహతహలాడుతున్నాడు. ఆగస్టు 6న పురుషుల జావెలిన్‌త్రో క్వాలిఫికేషన్ రౌండ్... రెండు రోజుల తర్వాత 8న ఫైనల్ జరగనుంది. నీరజ్ టైటిల్ నిలబెట్టుకుంటే.. ఒలింపిక్స్‌లో ఆ ఘనత సాధించిన ఐదో జావెలిన్ త్రోయర్ కానున్నాడు. విశ్వక్రీడల చరిత్రలో ఎరిక్ లామింగ్ (స్వీడన్; 1908, 1912), జానీ మైరా (ఫిన్లాండ్; 1920, 1924), జాన్ జెలెన్జీ (చెక్ రిపబ్లిక్; 1992, 1996, 2000), ఆండ్రీస్ థోర్కిల్డ్సెన్ (నార్వే; 2004, 2008) స్వర్ణాన్ని నిలబెట్టుకున్నారు. రేస్ వాక్‌తో మొదలు.. అథ్లెటిక్స్‌లో భాగంగా తొలి రోజు మహిళల, పురుషుల 20 కిలోమీటర్ల రేస్ వాక్ పోటీలు ప్రారంభం కానున్నాయి. భారత్ నుంచి పురుషుల విభాగంలో అ„Š దీప్ సింగ్, వికాస్ సింగ్, పరమ్‌జీత్ సింగ్ బిష్త్ పోటీలో ఉన్నారు. ఇక మహిళల విభాగం నుంచి ప్రియాంక గోస్వామి బరిలోకి దిగనుంది. పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో అవినాశ్ సాబ్లేపై భారీ అంచనాలు ఉండగా... 4–400 మీటర్ల పురుషుల ఈవెంట్లో మన జట్టు పతక ఆశలు రేపుతోంది. ఇటీవల పారిస్ డైమండ్ లీగ్‌లో అవినాశ్ జాతీయ రికార్డు బద్దలు కొట్టి 8 నిమిషాల 9.91 సెకన్లలో లక్ష్యాన్ని చేరి ఆరో స్థానంలో నిలిచాడు. హర్డిల్స్‌లో జ్యోతి...రిలేలో జ్యోతిక శ్రీ ఇక ఒలింపిక్స్ చరిత్రలో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో పాల్గొంటున్న తొలి భారత అథ్లెట్‌గా ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ గుర్తింపు పొందనుంది. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న జ్యోతి... ‘పారిస్’ క్రీడల్లోనూ అదే జోరు కనబర్చాలని చూస్తోంది. మహిళల 4్ఠ400 మీటర్ల రిలే జట్టులో కీలక సభ్యురాలైన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి దండి జ్యోతిక శ్రీపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక మహిళల 3000 మీటర్ల స్టీపుల్చేజ్తో పాటు 5000 మీటర్ల పరుగులో పాల్గొంటున్న పారుల్ చౌదరి, మహిళల జావెలిన్‌త్రోలో అన్ను రాణి, పురుషుల షాట్‌పుట్‌లో తజిందర్ పాల్‌సింగ్ తూర్, ట్రిపుల్ జంప్‌లో ప్రవీణ్ చిత్రావేల్, అబూబాకర్ నుంచి కూడా మెరుగైన ప్రదర్శన ఆశించవచ్చు. కొత్తగా రెపిచాజ్ రౌండ్.. రెజ్లింగ్, రోయింగ్ మాదిరిగానే ఈసారి నుంచి ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లోనూ రెపిచాజ్ విభాగాన్ని ప్రవేశ పెట్టనున్నారు. 200 మీటర్ల నుంచి 1500 మీటర్ల పరుగు వరకు వ్యక్తిగత విభాగాల్లో దీన్ని అమలు చేయనున్నారు. హర్డిల్స్‌కు కూడా ఇది వర్తించనుంది. గతంలో హీట్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన అథ్లెట్లతో పాటు వేగవంతమైన టైమింగ్ నమోదు చేసుకున్న అథ్లెట్లు సెమీఫైనల్‌కు చేరేవారు. తాజా రెపిచాజ్ రౌండ్‌తో హీట్స్‌లో ముందు నిలిచిన వారు మాత్రమే సెమీస్‌కు అర్హత సాధిస్తారు. మిగిలిన వాళ్లందరూ రెపిచాజ్ రౌండ్లో పాల్గొంటారు. అందులో సత్తా చాటితే సెమీఫైనల్‌కు చేరేందుకు రెండో అవకాశం దక్కనుంది. అసలేంటీ రెపిచాజ్ఫ్రెంచ్ భాషలో రెపిచాజ్.. అంటే రెండో అవకాశం అని అర్థం. నిజంగానే ఇది అథ్లెట్లకు సెకండ్ చాన్స్ వంటిదే. ‘పారిస్’ క్రీడల ద్వారా అథ్లెటిక్స్‌లో ఈ రౌండ్‌ను మొదటిసారి ప్రవేశ పెట్టనున్నారు. గతంలో మార్షల్ ఆర్ట్స్, రోయింగ్, రెజ్లింగ్ క్రీడల్లో మాత్రమే ఈ అవకాశం ఉండేది. ఇప్పుడు రన్నింగ్, హర్డిల్స్‌లో 200 మీటర్ల నుంచి 1500 మీటర్ల వరకు దీన్ని అమలు చేయనున్నారు. దీంతో తొలి హీట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చలేకపోయిన వారికి సెమీఫైనల్ చేరడానికి మరో అవకాశం దక్కనుంది.3000 మీటర్ల స్టీపుల్‌చేజ్, 5000 మీటర్ల పరుగులో రెపిచాజ్ రౌండ్‌ను అనుమతించడం లేదు. ఈ ఈవెంట్లలో పాల్గొన్న అథ్లెట్లు తేరుకునేందుకు మరింత సమయం అవసరమవనుండటంతో.. 1500 మీటర్ల వరకే దీన్ని పరిమితం చేశారు. ఇక పురుషుల, మహిళల 10,000 మీటర్లు, మారథాన్స్‌లో కేవలం ఫైనల్ మాత్రమే నిర్వహించనున్నారు. మహిళల 4 X400 మీటర్ల రిలే దండి జ్యోతిక శ్రీతొలి రౌండ్: ఆగస్టు 9 మధ్యాహ్నం గం 2:10 నుంచి ఫైనల్: ఆగస్టు 11 అర్ధరాత్రి గం. 12.44 నుంచి మహిళల 100 మీటర్ల హర్డిల్స్ జ్యోతి యర్రాజీతొలి రౌండ్: ఆగస్టు 7 మధ్యాహ్నం గం. 1:45 నుంచి రెపిచాజ్ రౌండ్: ఆగస్టు 8 మధ్యాహ్నం గం. 2:05 నుంచి సెమీఫైనల్: ఆగస్టు 9 మధ్యాహ్నం గం. 3:35 నుంచి ఫైనల్: రాత్రి గం. 11:05 నుంచిజావెలిన్ త్రో షెడ్యూల్ నీరజ్ చోప్రా,కిషోర్ జేనా క్వాలిఫయింగ్: ఆగస్టు 6 మధ్యాహ్నం గం. 1:50 నుంచి ఫైనల్: ఆగస్టు 8 రాత్రి గం. 11:55 నుంచి -
విశ్వ క్రీడలకు భారత్ నుంచి 117 మంది.. ఏ విభాగంలో ఎందరు?
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో పాల్గొననున్న భారత క్రీడాకారుల సంఖ్య ఖరారైంది. దేశం నుంచి 117 మంది అథ్లెట్లు విశ్వ క్రీడల్లో భాగం కానున్నారని భారత క్రీడా శాఖ అధికారికంగా వెల్లడించింది.క్రీడాకారులతో పాటు 140 మంది సహాయక సిబ్బంది కూడా ప్యారిస్‌కు వెళ్లనున్నట్లు తెలిపింది. కాగా ప్యారిస్ ఒలింపిక్స్ క్రీడాకారుల జాబితాలో షాట్ పుట్టర్ అభా కతువా పేరు లేకపోవడం గమనార్హం.అభా పేరు మాయంవరల్డ్ ర్యాంకింగ్ కోటాలో ఆమె ప్యారిస్ ఒలింపిక్స్ బెర్తు ఖరారైంది. అయితే, అనూహ్య రీతిలో వరల్డ్ అథ్లెటిక్స్ , ఒలింపిక్ పార్టిసిపెంట్స్ లిస్టు నుంచి అభా పేరు మాయమైంది. అయితే, ఇందుకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు.కాగా ప్యారిస్ క్రీడల్లో పాల్గొననున్న భారత అథ్లెటిక్స్ బృందంలో 29 మంది ఉండగా.. ఇందులో 11 మంది మహిళా, 18 మంది పురుష క్రీడాకారులు ఉన్నారు. షూటింగ్ టీమ్‌లో 21 మంది ఉండగా.. హాకీ జట్టులో 19 మంది పేర్లు ఉన్నాయి.ఇక టేబుల్ టెన్నిస్ విభాగంలో ఎనిమిది మంది, బ్యాడ్మింటన్‌లో ఏడుగురు, రెజ్లింగ్, ఆర్చరీ, బాక్సింగ్ విభాగాల్లో ఆరుగురు చొప్పున, నలుగురు గోల్ఫ్ క్రీడాకారులు, ముగ్గురు టెన్నిస్ ప్లేయర్లు, సెయిలింగ్, స్విమ్మింగ్ నుంచి ఇద్దరు చొప్పున..నాటి పసిడి ప్రత్యేకంఅదే విధంగా.. ఈక్వెస్ట్రియన్, జూడో, రోయింగ్ , వెయిట్‌లిఫ్టింగ్ విభాగం నుంచి ఒక్కొక్కరు భారత్ తరఫున విశ్వ క్రీడల్లో పాల్గొననున్నారు. కాగా టోక్యో ఒలింపిక్స్-2020లో భారత్ నుంచి 119 మంది క్రీడాకారులు ప్రాతినిథ్యం వహించారు. అత్యధికంగా ఏడు పతకాలతో తిరిగి వచ్చారు. ఇందులో జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా పసిడి పతకం అత్యంత గొప్ప జ్ఞాపకం.చదవండి: Paris Olympics:ఆంధ్రా టు పారిస్.. ఆడుదాం ఒలింపిక్స్ -
Paris Olympics 2024: భారత అథ్లెట్ల పూర్తి జాబితా ఇదే?
ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారులు, క్రీడాభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న పారిస్ ఒలింపిక్స్ 2024కు రంగం సిద్దమైంది. మరో 17 రోజుల్లో ఈ మహాసంగ్రామానికి తెరలేవనుంది. జూలై 26 నుంచి ఆగస్ట్ 11 వరకు పారిస్ వేదికగా ఈ విశ్వక్రీడలు జరగనున్నాయి. ఈసారి పారిస్ ఒలింపిక్స్‌లో మొత్తం 32 క్రీడల్లో 329 ఈవెంట్స్‌ల్లో తమ ఆదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక టోక్యో ఒలింపిక్స్‌తో పోలిస్తే ఈసారి భారత్ నుంచి ఒలింపిక్స్‌లో పాల్గోనే అథ్లెట్లు సంఖ్య తగ్గింది.గతంలో టోక్యో ఒలింపిక్స్‌కు 124 మంది అథ్లెట్లతో కూడిన అతిపెద్ద బృందాన్ని భారత్ పంపింది. ఈ సారి విశ్వక్రీడల్లో భారత్ నుంచి మొత్తం 113 మంది క్రీడాకారులు సత్తాచాటేందుకు సిద్దమయ్యారు. పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో పాల్గొనే భారత క్రీడాకారుల బృందానికి భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు పతాకధారిగా వ్యహరించనుంది.పారిస్ ఒలింపిక్స్ భారత అథ్లెట్ల పూర్తి జాబితాఆర్చరీధీరజ్ బొమ్మదేవర: (పురుషుల వ్యక్తిగత, టీమ్ ఈవెంట్)తరుణ్ దీప్ రాయ్: పురుషుల జట్టు (పురుషుల వ్యక్తిగత, టీమ్ ఈవెంట్)ప్రవీణ్ జాదవ్: పురుషుల జట్టు(పురుషుల వ్యక్తిగత, టీమ్ ఈవెంట్)భజన్ కౌర్: (మహిళల వ్యక్తిగత, ఉమెన్స్ టీమ్ ఈవెంట్)దీపికా కుమారి: (మహిళల వ్యక్తిగత, ఉమెన్స్ టీమ్ ఈవెంట్)అంకితా భకత్: (మహిళల వ్యక్తిగత, ఉమెన్స్ టీమ్ ఈవెంట్)అథ్లెటిక్స్అక్షదీప్ సింగ్: పురుషుల 20 కిలోమీటర్ల రేస్ వాక్వికాస్ సింగ్: పురుషుల 20 కిలోమీటర్ల రేస్ వాక్పరమ్ జీత్ సింగ్ బిష్త్: పురుషుల 20 కిలోమీటర్ల రేస్ వాక్ప్రియాంక గోస్వామి: మహిళల 20 కిలోమీటర్ల రేస్ వాక్అవినాష్ సాబుల్: పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ఛేజ్పారుల్ చౌదరీ: మహిళల 3000 మీటర్ల స్టీపుల్ ఛేజ్, మహిళల 5000 మీటర్ల స్టీపుల్ ఛేజ్జ్యోతి యర్రాజీ: మహిళల 100 మీటర్ల హర్డిల్స్కిరణ్ పహల్: మహిళల 400 మీటర్ల హర్డిల్స్తజిందర్ పాల్ సింగ్ తూర్: పురుషుల షాట్ పుట్అభా ఖాతువా: పురుషుల షాట్ పుట్నీరజ్ చోప్రా: పురుషుల జావెలిన్ త్రోకిశోర్ జెనా: పురుషుల జావెలిన్ త్రోఅన్నూ రాణి: మహిళల జావెలిన్ త్రోసర్వేష్ కుషారే: పురుషుల హైజంప్ప్రవీణ్ చిత్రవేల్: పురుషుల ట్రిపుల్ జంప్అబ్దుల్లా అబూబకర్: పురుషుల ట్రిపుల్ జంప్మహ్మద్ అనాస్ యాహియా, మహ్మద్ అజ్మల్, అమోజ్ జాకబ్, సంతోష్ తమిళరసన్, రాజేష్ రమేష్: పురుషుల 4×400 మీటర్ల రిలేమిజో చాకో కురియన్: 4×400 మీటర్ల రిలే, 4×400 మీటర్ల మిక్స్ డ్ రిలేవిద్యా రామరాజ్, జ్యోతిక శ్రీ దండి, ఎంఆర్ పూవమ్మ, సుభా వెంకటేశన్, ప్రాచి: మహిళల 4×400 మీటర్ల రిలేప్రాచి: 4×400 మీటర్ల మిక్స్డ్ రిలేప్రియాంక గోస్వామి, సూరజ్ పన్వర్: రేస్ వాక్ మిక్స్ డ్ మారథాన్మిజో చాకో కురియన్: 4×400 మీటర్ల రిలే, 4×400 మీటర్ల మిక్స్ డ్ రిలేవిద్యా రామరాజ్, జ్యోతిక శ్రీ దండి, ఎంఆర్ పూవమ్మ, సుభా వెంకటేశన్, ప్రాచి: మహిళల 4×400 మీటర్ల రిలేప్రాచి: 4×400 మీటర్ల మిక్స్డ్ రిలేప్రియాంక గోస్వామి, సూరజ్ పన్వర్: రేస్ వాక్ మిక్స్ డ్ మారథాన్బ్యాడ్మింటన్హెచ్.ఎస్.ప్రణయ్: పురుషుల సింగిల్స్లక్ష్యసేన్: పురుషుల సింగిల్స్పీవీ సింధు: మహిళల సింగిల్స్సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి: పురుషుల డబుల్స్అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టో: మహిళల డబుల్స్బాక్సింగ్నిఖత్ జరీన్: మహిళల 50 కేజీల విభాగంఅమిత్ ఫంగల్ : పురుషుల 51 కేజీల విభాగంనిషాంత్ దేవ్ : పురుషుల 71 కేజీల విభాగం,ప్రీతి పన్వర్ : మహిళల 54 కేజీల విభాగంజాస్మిన్ లంబోరియా: మహిళల 57 కేజీల విభాగంఈక్వెస్ట్రియన్అనూష్ అగర్వాలా: డ్రెస్సేజ్గోల్ఫ్శుభాంకర్ శర్మ: పురుషుల గోల్ఫ్గగన్జీత్ భుల్లర్: పురుషుల గోల్ఫ్అదితి అశోక్: మహిళల గోల్ఫ్దీక్షా డాగర్: మహిళల గోల్ఫ్పురుషుల హాకీ జట్టుపీఆర్ శ్రీజేష్, జర్మన్‌ప్రీత్ సింగ్, అమిత్ రోగిదాస్, హర్మన్‌ప్రీత్ సింగ్(కెప్టెన్), సుమిత్, సంజయ్, రాజ్‌కుమార్ పాల్, షంషేర్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, అభిషేక్, సుఖ్జీత్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, మన్దీప్ సింగ్, గుర్జంత్ సింగ్జూడోతులికా మాన్ : మహిళల 78 కిలోల విభాగంరోయింగ్బాల్రాజ్ పన్వార్ : ఎం1ఎక్స్సెయిలింగ్విష్ణు శరవణన్: పురుషుల వన్ పర్సన్ డింగీనేత్రా కుమనన్: మహిళల వన్ పర్సన్ డింగీషూటింగ్పృథ్వీరాజ్ తొండైమాన్: పురుషుల ట్రాప్రాజేశ్వరి కుమారి: మహిళల ట్రాప్శ్రేయాసి సింగ్: మహిళల ట్రాప్అనంత్ జీత్ సింగ్ నరుకా: పురుషుల స్కీట్రైజా ధిల్లాన్: మహిళల స్కీట్మహేశ్వరి చౌహాన్: మహిళల స్కీట్అనంత్ జీత్ సింగ్ నరుకా/మహేశ్వరి చౌహాన్: స్కీట్ మిక్స్ డ్ టీమ్సందీప్ సింగ్: పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్అర్జున్ బబుతా: పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ఎలవెనిల్ వలరివన్: మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్రమితా జిందాల్ : మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్స్వప్నిల్ కుసాలే: పురుషుల 50 మీటర్ల రైఫిల్ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్: పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్సిఫ్ట్ కౌర్ సామ్రా: మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్అంజుమ్ మౌద్గిల్: మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్సందీప్ సింగ్/ఎలవెనిల్ వలరివన్: 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్ డ్ టీమ్అర్జున్ బాబుటా/రమిత జిందాల్: 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్అర్జున్ చీమా: పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్సరబ్జోత్ సింగ్: పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్మను భాకర్: మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్రిథమ్ సంగం: మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్విజయవీర్ సిద్ధు: పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్అనీష్ భన్వాలా: పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్మను భాకర్: మహిళల 25 మీటర్ల పిస్టల్ఈషా సింగ్: మహిళల 25 మీటర్ల పిస్టల్సరబ్జోత్ సింగ్/మను భాకర్: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్అర్జున్ చీమా/రిథమ్ సంగం: 10మీ ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్స్విమ్మింగ్ధినిధి దేశింగు: మహిళల 200మీ ఫ్రీస్టైల్శ్రీహరి నటరాజ్: పురుషుల 100 మీటర్ల బ్యాక్స్ట్రోక్టేబుల్ టెన్నిస్శరత్ కమల్: పురుషుల సింగిల్స్ మరియు పురుషుల జట్టుహర్మీత్ దేశాయ్: పురుషుల సింగిల్స్ మరియు పురుషుల జట్టుమానవ్ ఠక్కర్: పురుషుల జట్టుమనిక బాత్రా: మహిళల సింగిల్స్ మరియు మహిళల జట్టుశ్రీజ ఆకుల: మహిళల సింగిల్స్ మరియు మహిళల జట్టుఅర్చన కామత్: మహిళల జట్టుటెన్నిస్సుమిత్ నాగల్: పురుషుల సింగిల్స్రోహన్ బోపన్న మరియు శ్రీరామ్ బాలాజీ: పురుషుల డబుల్స్వెయిట్ లిఫ్టింగ్మీరాబాయి చాను: మహిళల 49 కేజీలురెజ్లింగ్అమన్ సెహ్రావత్: పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీలువినేష్ ఫోగట్: మహిళల 50 కేజీలుఅన్షు మాలిక్: మహిళల 57 కేజీలునిషా దహియా: మహిళల 68 కేజీలురీతికా హుడా: మహిళల 76 కేజీలుయాంటిమ్ ఫంఘల్: మహిళల 53 కేజీలు -
నీరజ్ చోప్రాకు స్వర్ణ పతకం
టుర్కు (ఫిన్లాండ్): ఈ సీజన్లో తన జోరు కొనసాగిస్తూ భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మూడో పతకాన్ని సాధించాడు. మంగళవారం జరిగిన పావో నుర్మీ గేమ్స్‌లో ప్రస్తుత ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. నీరజ్ జావెలిన్‌ను 85.97 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానాన్ని సంపాదించాడు. టోనీ కెరనెన్ (ఫిన్లాండ్; 84.19 మీటర్లు) రజతం నెగ్గగా... ఒలివెర్ హెలాండర్ (ఫిన్లాండ్; 83.96 మీటర్లు) కాంస్య పతకాన్ని సాధించాడు. రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా; 82.58 మీటర్లు) నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది నీరజ్ దోహా డైమండ్ లీగ్ మీట్లో రెండో స్థానాన్ని పొందగా... భువనేశ్వర్‌లో జరిగిన ఫెడరేషన్ కప్ మీట్లో పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. -
బ్యాట్ వదిలి బల్లెం పట్టిన డీకే
టీమిండియా మాజీ వికెట్‌కీపర్, బ్యాటర్ దినేశ్ కార్తీక్ కొద్ది రోజుల కిందటే ఐపీఎల్‌కు వీడ్కోలు పలికి వార్తల్లో నిలిచాడు. సుదీర్ఘ ఐపీఎల్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన అనంతరం డీకే క్రికెట్ ప్రపంచం మొత్తం నుంచి ఘనంగా సెడాంఫ్ను అందుకున్నాడు.క్రికెట్‌కు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి కమిట్మెంట్స్ లేకపోవడంతో సేద తీరుతున్న డీకే.. భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాతో కలిసి జావెలిన్ త్రో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. Neeraj Chopra trained Dinesh Karthik to be his partner at 2024 Olympics.#Neerajchopra #Dineshkarthik pic.twitter.com/zOLswEDjW8— scOut Op (@ScOutoppp69) May 29, 2024డీకే జావెలిన్ త్రో ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో బాగా వైరలవుతంది. ఈ వీడియోలో డీకే రెండు ప్రయత్నాల అనంతరం బల్లెంను విజయవంతంగా నిర్దేశిత ప్రాంతం ఆవలికి విసరగలిగాడు. లాస్ట్ ఛాన్స్ అని నీరజ్‌ను అడిగి మరీ జావెలిన్‌ను అందుకున్న డీకే.. ప్రొఫెషన్ అథ్లెట్‌లా రన్ అప్ తీసుకుని జావెలిన్‌ను సంధించాడు. మండే ఎండలో డీకే చేస్తున్న ప్రయత్నానికి ముగ్దుడైన నీరజ్.. నువ్వు చేయగలవు దినేష్ భాయ్ అంటూ ప్రోత్సహించాడు. నీరజ్ ప్రోత్సాహంతో జావెలిన్‌ను విసిరిన డీకే అనుకున్న లక్ష్యాన్ని అధిగమించి సక్సెస్ సాధించాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు డీకేను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. నీ ప్రయత్నం అమోఘమని కొనియాడుతున్నారు. తెలీని క్రీడలోనూ సక్సెస్ సాధించావని కితాబునిస్తున్నారు. క్రికెట్లో మ్యాచ్ ఫినిషన్ ఇప్పుడు సక్సెస్ఫుల్ జావెలిన్ త్రోయర్ అంటూ కొనియాడుతున్నారు. మరికొందరేమో నీరజ్‌తో పాటు ఒలింపిక్స్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోమని సూచిస్తున్నారు. 38 ఏళ్ల డీకే 2004 నుంచి 2022 వరకు మూడు ఫార్మాట్లలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. డీకే ఐపీఎల్ స్టార్టింగ్ సీజన్ నుంచి తాజాగా ముగిసిన 2024 సీజన్ వరకు వివిధ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించాడు.నీరజ్ చోప్రా విషయానికొస్తే.. 26 ఏళ్ల ఈ జావెలిన్ త్రోయర్ 2020 టోక్యో ఓలింపిక్స్లో స్వర్ణ పతకం సాధించాడు. ఈ ఏడాది జులైలో జరిగే సమ్మర్ ఓలింపిక్స్లో నీరజ్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. -
Federation Cup 2024: నీరజ్ చోప్రాకు స్వర్ణం
భువనేశ్వర్: స్వదేశంలో మూడేళ్ల తర్వాత తొలిసారి బరిలోకి దిగిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్, ప్రపంచ చాంపియన్ నీరజ్ చోప్రా స్వర్ణ పతకంతో మెరిశాడు. గతవారం దోహాలో జరిగిన డైమండ్ లీగ్ మీట్లో రెండో స్థానంలో నిలిచిన నీరజ్...బుధవారం జరిగిన ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ మీట్లో పసిడి పతకం సాధించాడు. హరియాణాకు చెందిన 26 ఏళ్ల నీరజ్ నాలుగో ప్రయత్నంలో జావెలిన్‌ను 82.27 మీటర్ల దూరం విసిరి బంగారు పతకాన్ని ఖరారు చేసుకున్నాడు. కర్ణాటకకు చెందిన డీపీ మనూ 82.06 మీటర్లతో రజత పతకాన్ని దక్కించుకోగా... మహారాష్ట్రకు చెందిన ఉత్తమ్ పాటిల్ 78.39 మీటర్లతో కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. గత ఏడాది ఆసియా క్రీడల్లో రజత పతకం నెగ్గిన కిశోర్ కుమార్ జెనా నిరాశపరిచాడు. ఒడిశాకు చెందిన కిశోర్ జావెలిన్‌ను 75.25 మీటర్ల దూరం విసిరి ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. చివరిసారి భారత్‌లో 2021 మార్చి 17న భువనేశ్వర్‌లోనే జరిగిన ఫెడరేషన్ కప్‌లో నీరజ్ పోటీపడి స్వర్ణ పతకం సాధించాడు. మూడేళ్ల తర్వాత ఇదే వేదికపై పోటీపడ్డ నీరజ్ పసిడి ఫలితాన్ని పునరావృతం చేశాడు. -
నీరజ్‌కు రెండో స్థానం
దోహా: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా కొత్త సీజన్లో శుభారంభం చేశాడు. శుక్రవారం జరిగిన దోహా డైమండ్ లీగ్ మీట్లో ప్రస్తుత ఒలింపిక్, ప్రపంచ చాంపియన్ అయిన నీరజ్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. 10 మంది పోటీపడిన ఈ ఈవెంట్లో నీరజ్ చివరిదైన ఆరో ప్రయత్నంలో జావెలిన్‌ను 88.36 మీటర్ల దూరం విసిరి రెండో స్థానాన్ని పొందాడు. జాకుబ్ వాద్లెచ్ (చెక్ రిపబ్లిక్; 88.38 మీటర్లు) తొలి స్థానంలో నిలువగా... పీటర్సన్ (గ్రెనెడా; 86.62 మీటర్లు) మూడో స్థానాన్నికైవసం చేసుకున్నాడు. భారత్‌కే చెందిన కిశోర్ జేనా 76.31 మీటర్లతో తొమ్మిదో స్థానంలో నిలిచాడు. -
మూడేళ్ల తర్వాత స్వదేశంలో నీరజ్ చోప్రా బరిలోకి
ఒలింపిక్ చాంపియన్, ప్రపంచ చాంపియన్ అయిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మూడేళ్ల తర్వాత స్వదేశంలో పోటీపడనున్నాడు. ఈనెల 12 నుంచి 15వ తేదీ వరకు భువనేశ్వర్‌లో జరిగే ఫెడరేషన్ కప్ టోర్నీలో నీరజ్ బరిలోకి దిగుతాడు. ఈనెల 10న దోహాలో జరిగే డైమండ్ లీగ్ మీట్‌తో నీరజ్ కొత్త సీజన్‌ను మొదలు పెట్టనున్నాడు. డైమండ్ లీగ్ మీట్ ముగిశాక అతను నేరుగా దోహా నుంచి భారత్ చేరుకుంటాడు. చివరిసారి నీరజ్ భారత గడ్డపై 2021 మార్చి 17న జరిగిన ఫెడరేషన్ కప్‌లో పోటీపడి స్వర్ణ పతకం నెగ్గాడు. -
‘అథ్లెటిక్స్ను మరింత మార్కెటింగ్ చేయాలి’
భారత్‌లో ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లను మరింత ఆకర్షణీయంగా మార్చాల్సిన అవసరం ఉందని స్టార్ అథ్లెట్, ఒలింపిక్ స్వర్ణపతక విజేత నీరజ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఎక్కువ మంది అభిమానులకు చేరువయ్యేందుకు తగినంత మార్కెటింగ్ కూడా చేయాలని అతను అన్నాడు. ‘డైమండ్ లీగ్, కాంటినెంటల్ టూర్స్, వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ వంటి పెద్ద ఈవెంంట్లను భారత్‌లో ప్రసారం చేయాలి. ప్రస్తుతం హైలైట్స్ మాత్రమే మనకు అందుబాటులో ఉంటున్నాయి. రాత్రి 1–2 వరకు మేల్కొని అభిమానులు అథ్లెటిక్స్ చూసేందుకు సిద్ధమైనా, వారికి ఆ అవకాశం ఉండటం లేదు’ అని నీరజ్ అన్నాడు. కెన్యా, గ్రెనడాలాంటి దేశాలు కూడా ప్రపంచ స్థాయి అథ్లెటిక్స్ పోటీలను నిర్వహిస్తుండగా మనం ఎందుకు చేయలేమని నీరజ్ వ్యాఖ్యానించాడు. ‘నేను వరల్డ్ అథ్లెటిక్స్ అధికారులను ఎప్పుడు కలిసినా వారు భారత్‌లో ఇలాంటి ఈవెంట్ నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అదే జరిగితే ఎక్కువ మంది అథ్లెటిక్స్ను చూసి ఆకర్షితులవుతారనేది నా నమ్మకం’ అని నీరజ్ చెప్పాడు. -
‘వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్’ ఫైనల్లో నీరజ్ చోప్రా
మోంటెకార్లో: ఈ ఏడాది ప్రపంచ పురుషుల అత్యుత్తమ అథ్లెట్ పురస్కారం తుది జాబితాలో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు స్థానం లభించింది. నెల రోజుల క్రితం ప్రపంచ అథ్లెటిక్స్ ఈ అవార్డు కోసం 11 మందిని నామినేట్ చేసింది. అక్టోబర్ 28తో ఓటింగ్ ముగిసింది. సామాజిక మాధ్యమాల్లో నిర్వహించిన ఓటింగ్‌లో 20 లక్షల మంది పాల్గొన్నారు. ఓటింగ్ అనంతరం ఈ జాబితాను 11 నుంచి కుదించి టాప్–5 ఆటగాళ్లను ఎంపిక చేశారు. ఈ ఐదుగురిలో ఒకరికి డిసెంబర్ 11న ‘వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు లభిస్తుంది. ఈ ఏడాది నీరజ్ అద్భుత ప్రదర్శన చేశాడు. ప్రపంచ చాంపియన్ షిప్లో తొలిసారి స్వర్ణ పతకం సాధించడంతోపాటు ఆసియా క్రీడల్లో తన పసిడి పతకాన్ని నిలబెట్టుకున్నాడు. నీరజ్‌తోపాటు రియాన్ క్రుసెర్ (అమెరికా; షాట్‌పుట్), డుప్లాంటిస్ (స్వీడన్; పోల్‌వాల్ట్), కిప్టుమ్ (కెన్యా; మారథాన్), నోవా లైల్స్ (అమెరికా; 100, 200 మీటర్లు) ‘వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారం రేసులో ఉన్నారు. -
‘వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్’ నామినీల్లో నీరజ్ చోప్రా
మోంటెకార్లో (మొనాకో): ఈ ఏడాది ‘ప్రపంచ పురుషుల ఉత్తమ అథ్లెట్’ పురస్కారం రేసులో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా నిలిచాడు. 2023 సంవత్సరానికిగాను ‘వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు కోసం ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య 11 అథ్లెట్లను నామినీలుగా ప్రకటించింది. నీరజ్ చోప్రా ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌గా నిలువడంతోపాటు ఆసియా క్రీడల్లో తన టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. మూడు పద్ధతుల్లో ఓటింగ్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. ఈ–మెయిల్ ద్వారా వరల్డ్ అథ్లెటిక్స్ కౌన్సిల్, వరల్డ్ అథ్లెటిక్స్ ఫ్యామిలీ సభ్యులు... ఆన్లైన్ విధానంలో అభిమానులు ఓటింగ్‌లో పాల్గొనవచ్చు. అక్టోబర్ 28వ తేదీతో ఓటింగ్ ప్రక్రియ ముగుస్తుంది. నవంబర్ 13, 14 తేదీల్లో టాప్–5 ఫైనలిస్ట్‌లను... డిసెంబర్ 11న తుది విజేతలను ప్రకటిస్తారు. -
ఏదీ సులభంగా రాదు.. ఇలా చేస్తేనే - ఆనంద్ మహీంద్రా
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎన్నెన్నో ఆసక్తికరంగా సంఘటనలను షేర్ చేస్తూ.. నెటిజన్లకు కూడా అప్పుడప్పుడూ రిప్లై ఇస్తూ ఉంటాడన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో వీడియో షేర్ చేసాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో నీరజ్ చోప్రా (Neeraj Chopra) గేమ్ కోసం ఎలా ప్రిపేర్ అవుతున్నాడు, ఎంత కష్టపడుతున్నాడనేది చూడవచ్చు. జావెలిన్ త్రో అనగానే ఇప్పుడు అందరికి గుర్తొచ్చే పేరు నీరజ్. ఒలింపిక్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న మొదటి ఆసియా క్రీడాకారుడైన ఇతడు ఒకదాని తర్వాత ఒకటి గోల్డ్ మెడల్ సాధించి భారతదేశం ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెబుతున్నాడు. ఇదీ చదవండి: జుకర్‌బర్గ్ సంచలన నిర్ణయం.. ఫేస్బుక్, ఇన్‌స్టా యూజర్లకు షాక్! నీరజ్ చోప్రా పేరు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగిపోతోందంటే.. అది ఊరికే రాలేదు. ఎన్నో రోజులు చేసిన కృషి, పట్టుదలే అతన్ని ఈ స్థాయికి తీసుకువచ్చింది. కాబట్టి ఏదీ ఊరికే రాదు, దానికి తగ్గ ప్రయత్నం చేయాల్సిందే అంటూ మండే మోటివేషన్ అనే ట్యాగ్‌తో ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేసాడు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. దీనికి వేలసంఖ్యలో లైక్స్.. రాగా.. కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. He makes winning one Gold medal after the other look easy & effortless, doesn’t he? But think again. Check out the kind of ‘stretching’ he has to for those medals. Nothing EVER comes easily & effortlessly. So start stretching yourself..#MondayMotivation pic.twitter.com/aNypCQuVOn — anand mahindra (@anandmahindra) October 9, 2023 -
Asian Games 2023: నీరజ్ చోప్రాకు స్వర్ణం.. 80కి చేరిన భారత్ పతకాల సంఖ్య
ఏషియన్ గేమ్స్ 2023లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించాడు. ఇదే ఈవెంట్లో కిషోర్ జెనా రజత పతకం నెగ్గాడు. గత ఏషియన్ గేమ్స్‌లో ఇదే ఈవెంట్లో స్వర్ణం సాధించిన నీరజ్.. ఈసారి జావెలిన్‌ను 88.88 మీటర్లు విసిరి స్వర్ణాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ ఈవెంట్లో రజతం సాధించిన కిషోర్ 87.54 మీటర్లు జావెలిన్‌ను విసిరి, నీరజ్‌కు గట్టి పోటీ ఇచ్చాడు. ఈ ప్రదర్శనతో నీరజ్, కిషోర్ ఇద్దరు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. కాగా, జావెలిన్ త్రోలో రెండు పతకాలతో (గోల్డ్, సిల్వర్) భారత్ పతకాల సంఖ్య 80కి (17 గోల్డ్, 31 సిల్వర్, 32 బ్రాంజ్) చేరింది. పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. చైనా 312 పతకాలతో (168 గోల్డ్, 93 సిల్వర్, 51 బ్రాంజ్) అగ్రస్థానంలో దూసుకుపోతుంది. జపాన్ 144 మెడల్స్‌తో (36, 51, 57) రెండో స్థానంలో, రిపబ్లిక్ ఆఫ్ కొరియా 145 పతకాలతో (33, 44, 68) మూడో స్థానంలో ఉన్నాయి. -
ఆసియా సంరంభం నేడే ఆరంభం
ఔత్సాహిక క్రీడాకారులు... వర్థమాన తారలు... ఒలింపిక్ చాంపియన్స్... జగజ్జేతలు... అందరూ మళ్లీ ఒకే వేదికపై తళుక్కుమనే సమయం ఆసన్నమైంది. ఒలింపిక్స్ తర్వాత అంతటి ప్రాధాన్యమున్న ఆసియా క్రీడలకు నేడు తెర లేవనుంది. చైనాలోని హాంగ్జౌ నగరం ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమివ్వనుంది. వాస్తవానికి 19వ ఆసియా క్రీడలు గత ఏడాదిలోనే జరగాలి. అయితే చైనాలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టకపోవడంతో ఈ క్రీడలను ఈ ఏడాదికి వాయిదా వేశారు. అధికారికంగా ఈ క్రీడలు నేడు ఆరంభమవుతున్నా... ఇప్పటికే పలు టీమ్ ఈవెంట్స్ (టి20 క్రికెట్, వాలీబాల్, ఫుట్‌బాల్, రోయింగ్, టేబుల్ టెన్నిస్)మొదలయ్యాయి. హాంగ్జౌ: ఆసియా క్రీడా పండుగకు వేళయింది. 19వ ఆసియా క్రీడలకు నేడు చైనాలోని హాంగ్జౌ నగరంలో అధికారికంగా తెర లేవనుంది. మొత్తం 45 దేశాల నుంచి 12 వేలకుపైగా క్రీడాకారులు 40 క్రీడాంశాల్లో పతకాల వేటకు సిద్ధమయ్యారు. అక్టోబర్ 8న ఈ క్రీడా సంరంభం సమాప్తం కానుంది. 1982 న్యూఢిల్లీ ఆసియా క్రీడల్లో తొలిసారిగా పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన చైనా గత 2018 జకార్తా ఆసియా క్రీడల వరకు తమ టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంటూ వస్తోంది. ఈసారి కూడా పతకాల పట్టికలో చైనాకు నంబర్‌వన్ స్థానం దక్కడం లాంఛనమే. జపాన్, దక్షిణ కొరియా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ టాప్–5లో ఉండే అవకాశముంది. క్రితంసారి భారత్ 16 స్వర్ణాలు, 23 రజతాలు, 31 కాంస్యాలు కలిపి మొత్తం 70 పతకాలతో ఈ క్రీడల చరిత్రలోనే తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. పతకాల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచిన భారత బృందం ఈసారి పతకాల సంఖ్య 100 దాటడంతోపాటు టాప్–5లో చోటు సంపాదించాలనే పట్టుదలతో ఉంది. అథ్లెటిక్స్, షూటింగ్, రెజ్లింగ్, ఆర్చరీ, బాక్సింగ్, టెన్నిస్ క్రీడాంశాల్లో ఈసారి భారత క్రీడాకారుల నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాడు. 2021 టోక్యో ఒలింపిక్స్‌లో, ఇటీవల ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాలు గెలిచిన నీరజ్ వరుసగా రెండో ఆసియా క్రీడల్లో తన పసిడి పతకాన్ని నిలబెట్టుకునే లక్ష్యంతో చైనాలో అడుగు పెడుతున్నాడు. భారత్ నుంచి ఈసారి అత్యధికంగా 655 మంది క్రీడాకారులు బరిలోకి దిగుతున్నారు. నేడు జరిగే ప్రారంభ వేడుకల్లో భారత బృందానికి పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, మహిళా స్టార్ బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ పతాకధారులగా వ్యవహరించనున్నారు. భారత స్క్వాష్ స్టార్ ప్లేయర్లు సౌరవ్ గోషాల్, జోష్నా చినప్ప ఆరోసారి ... టేబుల్ టెన్నిస్ స్టార్ ఆచంట శరత్ కమల్ ఐదోసారి... వెటరన్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న నాలుగోసారి ఆసియా క్రీడల్లో పోటీపడనుండటం విశేషం. 7 ఇప్పటి వరకు జరిగిన అన్ని ఆసియా క్రీడల్లోనూ పోటీపడిన దేశాల సంఖ్య. భారత్, ఇండోనేసియా, జపాన్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, సింగపూర్, థాయ్‌లాండ్ ఈ జాబితాలో ఉన్నాయి. 671 ఇప్పటి వరకు జరిగిన 18 ఆసియా క్రీడల్లో పోటీపడి భారత్ గెలిచిన పతకాలు. ఇందులో 155 స్వర్ణాలు, 200 రజతాలు, 316 కాంస్య పతకాలు ఉన్నాయి. అత్యధికంగా అథ్లెటిక్స్‌లో భారత్‌కు 254 పతకాలు వచ్చాయి. బాక్సింగ్ (57), షూటింగ్ (57), రెజ్లింగ్ (49), టెన్నిస్ (32) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 3187 ఆసియా క్రీడల చరిత్రలో చైనా నెగ్గిన పతకాలు. ఇందులో 1473 స్వర్ణాలు, 994 రజతాలు, 720 కాంస్యాలు ఉన్నాయి. చైనా తర్వాత జపాన్ (3054), దక్షిణ కొరియా (2235) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈసారి ఆసియా క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 16 మంది, తెలంగాణ నుంచి 14 మంది క్రీడాకారులు భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్: ధీరజ్ బొమ్మదేవర, వెన్నం జ్యోతి సురేఖ (ఆర్చరీ), జ్యోతి యర్రాజీ (అథ్లెటిక్స్), కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధు, సాతి్వక్ సాయిరాజ్ (బ్యాడ్మింటన్), బాచిరాజు సత్యనారాయణ (బ్రిడ్జి), పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక (చెస్), నేలకుడితి అనూష (సాఫ్ట్ టెన్నిస్), సాకేత్ మైనేని (టెన్నిస్), ఆకుల సాయిసంహిత, దొంతర గ్రీష్మ (స్కేటింగ్), బారెడ్డి అనూష (క్రికెట్), శివ కుమార్ (సెపక్తక్రా). తెలంగాణ: వ్రితి అగర్వాల్ (స్విమ్మింగ్), అగసార నందిని (అథ్లెటిక్స్), పుల్లెల గాయత్రి, సిక్కి రెడ్డి (బ్యాడ్మింటన్), నిఖత్ జరీన్ (బాక్సింగ్), గురుగుబెల్లి గీతాంజలి (రోయింగ్), కైనన్ చెనాయ్, ఇషా సింగ్ (షూటింగ్), ఆకుల శ్రీజ (టేబుల్ టెన్నిస్), ఇరిగేశి అర్జున్ (చెస్), ప్రీతి కొంగర (సెయిలింగ్), బత్తుల సంజన (స్కేటింగ్), గుగులోత్ సౌమ్య (ఫుట్‌బాల్), తిలక్ వర్మ (క్రికెట్). -
నీరజ్ చోప్రాకు రెండో స్థానం
యుజీన్ (అమెరికా): ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ అథ్లెటిక్స్ మీట్ గ్రాండ్ ఫైనల్స్‌లో భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తన టైటిల్‌ను నిలబెట్టుకోలేకపోయాడు. ఆరుగురు పాల్గొన్న ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన నీరజ్ చోప్రా జావెలిన్‌ను 83.80 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. చెక్ రిపబ్లిక్కు చెందిన జాకుబ్ వాద్లెచ్ జావెలిన్‌ను 84.24 మీటర్ల దూరం విసిరి చాంపియన్‌గా అవతరించాడు. గత నెలలో ప్రపంచ చాంపియన్íÙప్లో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. తొలి ప్రయత్నంలో ఫౌల్ చేసిన నీరజ్ రెండో ప్రయత్నంలో జావెలిన్‌ను 83.80 మీటర్ల దూరం పంపించాడు. మూడో ప్రయత్నంలో 81.37 మీటర్లు దూరం విసిరిన నీరజ్ నాలుగో ప్రయత్నంలో ఫౌల్ చేశాడు. ఆ తర్వాత ఐదో ప్రయత్నంలో 80.74 మీటర్లు, చివరిదైన ఆరో ప్రయత్నంలో 80.90 మీటర్లు విసిరాడు. రెండో స్థానంలో నిలిచిన నీరజ్‌కు 12,000 డాలర్లు (రూ. 9 లక్షల 97 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. -
భారత్ నుంచి ఒక్కరే... ఒలింపిక్స్‌లో రఘు ప్రసాద్! ప్రతిష్టాత్మక ఈవెంట్లో నీరజ్..
Paris Olympics 2024: వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో హాకీ ఈవెంట్లో విధులు నిర్వహించే అంపైర్ల వివరాలను అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రకటించింది. పురుషుల, మహిళల మ్యాచ్‌లకు కలిపి మొత్తం 28 మంది అంపైర్లును ఎంపిక చేశారు. భారత్ నుంచి రఘు ప్రసాద్ ఒక్కడే అంపైరింగ్ బాధ్యతలు నిర్వహించేందుకు ఎంపికయ్యాడు. 2003 నుంచి అంపైర్‌గా వ్యవహరిస్తున్న రఘు 186 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అంపైర్‌గా పని చేశాడు. 2012 లండన్, 2021 టోక్యో ఒలింపిక్స్‌లోనూ రఘు ప్రసాద్ అంపైరింగ్ బాధ్యతలు నిర్వహించాడు. నీరజ్ చోప్రా ఒక్కడే ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ మీట్ ఫైనల్స్‌లో భారత్ నుంచి జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మాత్రమే పోటీపడుతున్నాడు. అవినాశ్ సాబ్లే (3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్), మురళీ శ్రీశంకర్ (లాంగ్‌జంప్) కూడా అర్హత సాధించినా ఆసియా క్రీడల నేపథ్యంలో ఈ ఇద్దరు దూరంగా ఉన్నారు. ఈనెల 16, 17వ తేదీల్లో అమెరికాలోని యుజీన్‌లో ఈ ఫైనల్స్ జరుగుతాయి. గత ఏడాది జ్యూరిక్‌లో జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో నీరజ్ జావెలిన్ త్రో ఈవెంట్ స్వర్ణ పతకం సాధించాడు. -
బంగారు బాలుడు.. మన నీరజ్ చోప్రా
అపరిమితమైన ప్రేమ.. అపరిమితమైన కేలరీలు.. ఆ బాలుడికి అన్నీ ఎక్కువే. నానమ్మ చేత్తో ప్రేమగా తినిపించే రోటీ, లడ్డూలు, మీగడ, జున్ను.. నెయ్యి, చక్కెర కలిపి చేసే చూర్మా. హరియాణ్వీ వంటకాలు తినీ తినీ.. టీనేజ్‌లోకి వచ్చేసరికి సహజంగానే బొద్దుగా తయారయ్యాడు. దాంతో అప్పటి వరకు చూపించిన ప్రేమ కాస్తా కుటుంబసభ్యుల్లో ఒకింత ఆందోళనగా మారింది. ఇలా అయితే ఎలా అంటూ అతని తండ్రి, ఆయన ముగ్గురు సోదరులు కలసి ఆ కుర్రాడిని వెంటనే జిమ్‌లో చేర్పించి బరువు తగ్గించే ప్రయత్నంలో పడ్డారు. అయితే తమ సమీపంలోని ఊర్లో ఉన్న ఆ జిమ్ నాలుగు రోజులకే మూతపడటంతో కుర్రాడు ఖుష్ అయ్యాడు. కానీ కుటుంబసభ్యులు మాత్రం వదిలిపెట్టలేదు. సొంత ఊరు ఖాండ్రా నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిమ్‌కు వెళ్లైనా ఆకారం మార్చాల్సిందే అని షరతు పెట్టారు. దాంతో ఆ అబ్బాయికి వెళ్లక తప్పలేదు. కానీ తాను కొత్తగా వెళుతున్న ఊరు తన జీవితాన్ని, రాతను మారుస్తుందని.. చిరస్థాయిగా నిలిచే ఘనతను సృష్టించేందుకు దారి చూపిస్తుందని అతను ఊహించలేదు. అయిష్టంగానే చారిత్రక పట్టణం పానిపట్‌కు వెళ్లిన ఆ కుర్రాడు నీరజ్ చోప్రా.. భారత క్రీడల్లో ఒక కొత్త చరిత్రను రాసిన ఆటగాడు. ‘విజయం సాధించాలనే కాంక్ష మీకు నిద్ర పట్టనివ్వకపోతే.. కష్టపడటం తప్ప మరే విషయం మీకు నచ్చకపోతే.. ఎంత శ్రమించినా అలసట అనిపించకపోతే.. విజయంతో కొత్త చరిత్ర సృష్టించబోతున్నట్లు అని అర్థం చేసుకోండి’.. ట్విటర్లో ఈ స్ఫూర్తిదాయక వ్యాఖ్యను పెట్టింది జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా. టోక్యో ఒలింపిక్స్‌కి రెండేళ్ల ముందు! అప్పటికి సాధించిన ఘనతలు అతనికేమాత్రం సంతృప్తినివ్వలేదని, అసలు లక్ష్యం వేరే ఉందని అతని మాటలను బట్టి అనిపించింది. నిజంగానే అతను తన ఉత్సాహాన్ని మాటలతో సరిపెట్టలేదు. అందుకు అనుగుణంగా కఠోర సాధన చేశాడు. అలసట లేకుండా శ్రమించాడు. చివరకు ఆ ప్రయాణం ఒలింపిక్స్ పతకం వరకు సాగింది. కానీ అంతటితో ఆగిపోకుండా రెండేళ్లు తిరిగేలోగా ప్రపంచ చాంపియన్ షిప్‌లోనూ స్వర్ణం సాధించి జావెలిన్ లో తనకు ఎదురే లేదని నిరూపించాడు. 13 ఏళ్ల వయసులో ఇంట్లోవాళ్ల ఒత్తిడితో జిమ్‌లోకి అడుగుపెట్టిన అతను తర్వాతి 13 ఏళ్లలో అసమాన ఘనతలన్నీ సాధించిన జగజ్జేతగా నిలవడం నీరజ్ స్థాయిని చూపిస్తోంది. బల్లెం విసిరితే.. నీరజ్ చేతిలో బల్లెంతో రన్‌వేపై అడుగులు వేయడం మొదలు పెట్టగానే ఒకటి మాత్రం ఖాయమవుతుంది. అదే అతను కచ్చితంగా పతకం గెలవడం! భారత క్రీడల్లో ఇంత నిలకడగా విజయాలు దక్కడం దాదాపుగా కనిపించదు. సీనియర్ స్థాయిలోకి వచ్చిన తర్వాత ఇటీవలి ప్రపంచ చాంపియన్ షిప్ వరకు తాను పోటీపడ్డ ప్రతిచోటా పతకంతోనే తిరిగొచ్చాడు. అతనికి మెడల్ అందించిన 88.17 మీటర్ల దూరం నీరజ్ టాప్–5లో కూడా లేదు. కానీ పరిస్థితిని సరిగ్గా అంచనా వేసి దానికి అనుగుణంగా తన ఆటను మార్చుకోగల ప్రత్యేక లక్షణం అతడిని విజేతగా నిలబెట్టింది. గణాంకాలు మాత్రమే ప్రతిసారి ఆటగాడి గొప్పతనాన్ని చెప్పలేవు. కానీ నీరజ్ విషయంలో అంకెలు ఒక పెద్ద కథే చెబుతాయి. టోర్నీ టోర్నీకి ప్రదర్శనను మెరుగుపరచుకుంటూ పోవడం, ఒక పెద్ద విజయంతో సంతృప్తి చెందకుండా మళ్లీ స్టార్టింగ్ పాయింట్ వద్దకు వచ్చి కొత్తగా అంతే ఉత్సాహంతో పోటీకి సిద్ధమవడం అతడిని గొప్పగా నిలబెట్టాయి. తన టాప్–10లో తొమ్మిది దూరాలను అతను ఒలింపిక్స్‌లో స్వర్ణం తర్వాతే నమోదు చేశాడు. కెరీర్లో 10 సార్లు అతను బల్లేన్ని 88 మీటర్లకు పైగా దూరం విసరడం విశేషం. ఎండా.. వాన.. సంబంధం లేదు.. అనారోగ్యం అనే మాటే లేదు. ఎప్పుడైనా సాధన చేయాల్సిందే. ఏ బరిలో అయినా బల్లేన్ని విసిరేందుకు సిద్ధమవాల్సిందే! పానిపట్ నుంచే మొదలు పెట్టి... నీరజ్ చోప్రా కుటుంబం ‘రోర్’ తెగకు చెందింది. మూడో పానిపట్ యుద్ధంలో ఓటమి తర్వాత అక్కడే స్థిరపడిన మరాఠాల వారసులుగా వీరి గురించి చెబుతారు. నలుగురు అన్నదమ్ముల్లో అతని తండ్రి ఒకడు. 16 మంది సభ్యుల ఈ ఉమ్మడి కుటుంబానికి కలిపి ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. రెండు బర్రెలు, మూడు ఆవులు అదనపు ఆస్తి! ఇలాంటి స్థితిలో తమ అబ్బాయిని అంతర్జాతీయ ఆటగాడి స్థాయికి చేర్చడం అంత సులువైన విషయం కాదు. ప్రాక్టీస్ జావెలిన్, మ్యాచ్ జావెలిన్ లు మొదలు డైట్, ఫిట్నెస్ వరకు అన్నీ ఖర్చుతో కూడుకున్నవే. అయితే సాహసికులు, సత్తా ఉన్నవారికే అదృష్టం కూడా వెంట ఉంటుందన్నట్లుగా నీరజ్‌కు తన కెరీర్లో పెద్దగా ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టలేదు. తమ స్థాయికి తగినట్లుగానే ఆరంభంలో కుటుంబ సభ్యులందరూ అండగా నిలిచారు. పానిపట్ నుంచి మొదలుపెట్టి ప్రపంచ చాంపియన్ గా మారడం వరకు అతని ఆట ముందు అన్ని అవరోధాలూ చిన్నబోయాయి. 2010లో పానిపట్ శివాజీ స్టేడియంలో కసరత్తులు చేస్తున్న సమయంలో ఒకసారి సరదాగా జావెలిన్ విసురుతూ మరో త్రోయర్ జైవీర్ కంట్లో పడ్డాడు. ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా తొలి ప్రయత్నంలోనే 40 మీటర్ల వరకు జావెలిన్ వెళ్లడం జైవీర్‌ను ఆకట్టుకుంది. అతనే ఆది గురువుగా నీరజ్‌కు ఆటలో ఓనమాలు నేర్పించాడు. ఏడాది తర్వాత మరింత మెరుగైన శిక్షణ కోసం పంచకులలో దేవీలాల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో అడుగుపెట్టిన నీరజ్‌ను కోచ్ నసీమ్ అహ్మద్ మరింతగా తీర్చిదిద్దాడు. సింథటిక్ రన్ వే సౌకర్యం ఉండటంతో అతని త్రోయింగ్‌లో పదును పెరిగింది. ఇక పోటీల్లో సత్తా చాటే సమయం ఆసన్నమవగా.. జిల్లాస్థాయి పోటీల్లో తొలిసారి విజేతగా నిలవడంతో ప్రారంభమైన గెలుపు ప్రస్థానం ఆపై శిఖరాలకు చేరింది. ఒకటిని మించి మరొకటి.. 15 ఏళ్ల వయసులో తొలిసారి జాతీయ జూనియర్ చాంపియన్ షిప్‌ను గెలుచుకోవడంతో నీరజ్ గురించి అందరికీ తెలిసింది. ఆ తర్వాత రెండేళ్లకు వరల్డ్ యూత్ చాంపియన్ షిప్లో రజతంతో ఈ కుర్రాడిలో సత్తా ఉందని అథ్లెటిక్స్ ప్రపంచం గుర్తించింది. తర్వాతి ఏడాదే జూనియర్ ప్రపంచ రికార్డు కూడా అతను బద్దలు కొట్టాడు. అయితే 2015లో కేరళలో జరిగిన జాతీయ క్రీడల్లో నీరజ్‌కు పతకం దక్కలేదు. అతను ఐదో స్థానంతోనే సరి పెట్టుకున్నాడు. కానీ అథ్లెటిక్స్ సమాఖ్య ఫలితాన్ని పట్టించుకోకుండా ప్రత్యేక ప్రతిభావంతుడిగా పటియాలాలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎస్)లో సాధన చేసే అవకాశం అతనికి కల్పించింది. ఇది తన కెరీర్లో సరైన మలుపుగా నీరజ్ చెప్పుకున్నాడు. అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు, ప్రముఖ కోచ్‌లతో శిక్షణ, ప్రత్యేక డైట్ కారణంగా అతను ఎన్ ఐఎస్‌లో టాప్ అథ్లెట్‌గా రూపుదిద్దుకున్నాడు. ఆ తర్వాత అద్భుతాలు సృష్టించడమే మిగిలింది. ‘శాఫ్’ క్రీడల్లో తొలి అంతర్జాతీయ స్వర్ణంతో మెరిసిన అతను ఆ తర్వాత ఎదురు లేకుండా దూసుకుపోయాడు. పోలండ్‌లో ప్రపంచ అండర్–20 చాంపియన్ షిప్లో ప్రపంచ రికార్డులతో పసిడి గెలవగా.. పేరుకే జూనియర్ అయినా ఆ ప్రదర్శన అతనికి సీనియర్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో చోటు కల్పించింది. ఇక ఆ తర్వాత నీరజ్ వెనుదిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. 2019లో గాయం, శస్త్రచికిత్స కారణంగా కాస్త వెనకడుగు వేసినా మళ్లీ దూసుకొచ్చి సత్తా చాటగలనని నీరజ్ తన విజయాలతో నిరూపించాడు. ఒలింపిక్ స్వర్ణం, ప్రపంచ చాంపియన్ షిప్ స్వర్ణం, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణాలు, ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ విజేత.. అథ్లెటిక్స్ ప్రపంచంలో అత్యుత్తమ విజయాలన్నీ నీరజ్ ఖాతాలో ఉన్నాయి. అయినా సరే ప్రతి టోర్నీకి అదే మొదటి మ్యాచ్‌లాగా అదే తపనతో అతను సిద్ధమవుతున్నాడు. ఇన్ని ఘనతల తర్వాత వేరేవారైనా కాస్త ఉదాసీనతకు చోటిస్తారేమో.. కానీ ఆర్మీలో సుబేదార్ అయిన 26 ఏళ్ల నీరజ్‌లో అదే కసి, అదే పట్టుదల! అర్జున, ఖేల్‌రత్న, పద్మశ్రీ పురస్కారాలు ఇప్పటికే అతని ఖాతాలో చేరాయి. పుణెలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్కు ‘నీరజ్ చోప్రా స్టేడియం’గా పేరు పెట్టి రక్షణశాఖ నీరజ్ పట్ల తన గౌరవాన్ని చాటుకుంది. ఒలింపిక్ స్వర్ణం, ప్రపంచ చాంపియన్ షిప్ స్వర్ణం, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణాలు, ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ విజేత.. అథ్లెటిక్స్ ప్రపంచంలో అత్యుత్తమ విజయాలన్నీ నీరజ్ ఖాతాలో ఉన్నాయి. అయినా సరే ప్రతి టోర్నీకి అదే మొదటి మ్యాచ్‌లాగా అదే తపనతో అతను సిద్ధమవుతున్నాడు. ఇన్ని ఘనతల తర్వాత వేరేవారైనా కాస్త ఉదాసీనతకు చోటిస్తారేమో.. కానీ ఆర్మీలో సుబేదార్ అయిన 26 ఏళ్ల నీరజ్‌లో అదే కసి, అదే పట్టుదల! అర్జున, ఖేల్‌రత్న, పద్మశ్రీ పురస్కారాలు ఇప్పటికే అతని ఖాతాలో చేరాయి. పుణెలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్కు ‘నీరజ్ చోప్రా స్టేడియం’గా పేరు పెట్టి రక్షణశాఖ నీరజ్ పట్ల తన గౌరవాన్ని చాటుకుంది. ఒలింపిక్ స్వర్ణం, ప్రపంచ చాంపియన్ షిప్ స్వర్ణం, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణాలు, ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ విజేత.. అథ్లెటిక్స్ ప్రపంచంలో అత్యుత్తమ విజయాలన్నీ నీరజ్ ఖాతాలో ఉన్నాయి. అయినా సరే ప్రతి టోర్నీకి అదే మొదటి మ్యాచ్‌లాగా అదే తపనతో అతను సిద్ధమవుతున్నాడు. ఇన్ని ఘనతల తర్వాత వేరేవారైనా కాస్త ఉదాసీనతకు చోటిస్తారేమో.. కానీ ఆర్మీలో సుబేదార్ అయిన 26 ఏళ్ల నీరజ్‌లో అదే కసి, అదే పట్టుదల! అర్జున, ఖేల్‌రత్న, పద్మశ్రీ పురస్కారాలు ఇప్పటికే అతని ఖాతాలో చేరాయి. పుణెలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్కు ‘నీరజ్ చోప్రా స్టేడియం’గా పేరు పెట్టి రక్షణశాఖ నీరజ్ పట్ల తన గౌరవాన్ని చాటుకుంది. •మెహమ్మద్ అబ్ధుల్ హాది -
డైమండ్ లీగ్ టోర్నీ.. నీరజ్‌కు రెండో స్ధానం
భారత స్టార్ జావెలిన్ త్రోయర్,వరల్డ్ ఛాంపియన్ నీరజ్ చోప్రా తన జోరును కొనసాగిస్తున్నాడు. జ్యురిచ్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్‌లో రెండో స్ధానంలో నీరజ్ చోప్రా చోప్రా నిలిచాడు. దీంతో వరుసగా మూడో డైమండ్ లీగ్ టైటిల్‌ను గెలుచుకోవాలన్న గోల్డన్ బాయ్ కల నేరవేరలేదు. నీరజ్ తన తొలి ప్రయత్నంలో జావెలిన్‌ను 80.70 మీటర్ల దూరం విసిరాడు. అనంతరం రెండు, మూడు ప్రయత్నాల్లో ఫౌల్ అయ్యాడు. అయితే నాలుగు ప్రయత్నంలో 85.22 మీటర్లు విసిరి రెండో స్థానంలోకి వచ్చాడు. కానీ చివరి ప్రయత్నంలో మరోసారి నిరాజ్ ఫౌల్ కావడంతో రెండో స్ధానానికే పరిమితం కావాల్సి వచ్చింది. చెక్ రిపబ్లిక్కు చెందిన జాకుబ్ వడ్లెజ్ 88.86 మీటర్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇక ఇదే లీగ్‌లో లాంగ్‌జంప్‌లో భారత లాంగ్‌జంపర్ శ్రీశంకర్ 7.99 మీటర్ల దూరం దూకి ఐదో స్థానంలో నిలిచాడు. కాగా అంతకుముందు నీరజ్ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో చోప్రా గోల్డ్‌మెడల్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: Asia Cup 2023: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన శ్రీలంక.. 5 వికెట్ల తేడాతో ఘన విజయం -
మరో విజయంపై నీరజ్ దృష్టి
జ్యూరిక్ (స్విట్జర్లాండ్): ఈ ఏడాది బరిలోకి దిగిన ప్రతి టోర్నీలోనూ అగ్రస్థానంలో నిలిచిన ఒలింపిక్, ప్రపంచ చాంపియన్, భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరో విజయంపై దృష్టి సారించాడు. ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్‌లో భాగంగా నేడు జ్యూరిక్‌లో జరిగే మీట్లో నీరజ్ పోటీపడనున్నాడు. ఈ సీజన్లో నీరజ్ రెండు డైమండ్ లీగ్ మీట్లలో (మే 5 దోహా; జూన్ 30 లుజానె) అగ్రస్థానంలో నిలిచాడు. అనంతరం ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించాడు. నేడు అర్ధరాత్రి 12 తర్వాత మొదలయ్యే జావెలిన్ త్రో ఈవెంట్లో నీరజ్‌తోపాటు జాకుబ్ వాద్లెచ్ (చెక్ రిపబ్లిక్), ప్రపంచ మాజీ చాంపియన్ పీటర్స్ అండర్సన్ (గ్రెనెడా), వెబెర్ (జర్మనీ) తదితర స్టార్స్ పోటీపడనున్నారు . ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం బిడ్..! 2027 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ఆతిథ్య హక్కుల కోసం భారత్ బిడ్ వేస్తుందని బుధవారం ఇక్కడి మీడియాతో నీరజ్ చోప్రా వ్యాఖ్యానించాడు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోద ముద్ర లభిస్తే భారత అథ్లెటిక్స్ సమాఖ్య చొరవ తీసుకుంటుంది. 2027 ప్రపంచ చాంపియన్‌షిప్ నిర్వహణ కోసం అక్టోబర్ 2లోపు బిడ్ దాఖలు చేయాలి. ఇప్పటికే 2027 ప్రపంచ చాంపియన్‌షిప్ ఆతిథ్యం కోసం బీజింగ్ తమ బిడ్ దాఖలు చేసింది. -
అప్పుడు ఇండియా- ఇంగ్లండ్ సిరీస్... ఆనాటి అనుభూతి మళ్లీ ఇప్పుడు: గావస్కర్
మరో పది, పదిహేనేళ్లలో దేశం క్రీడా భారత్‌గా ఎదుగుతుందని క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ అన్నాడు. చెస్‌లో ప్రజ్ఞానంద, బ్యాడ్మింటన్‌లో ప్రణయ్, అథ్లెటిక్స్‌లో నీరజ్ చోప్రా ప్రపంచ వేదికల్లో పతకాలతో మెరిశారు. ఈ విషయంపై స్పందించిన సునిల్ గావస్కర్.. ‘‘గతంలో కొన్ని క్రీడలే భారత్‌లో వెలుగొందేవి. అయితే, ఇప్పుడు పరిస్థితి మారింది. చెస్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్ తదితర క్రీడలకు కవరేజీ, ప్రేక్షకాదరణ బాగా పెరిగాయి’’ అని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా చారిత్రాత్మక విజయాన్ని గుర్తుచేసుకుంటూ.. ‘‘అప్పుడు ఇండియా- ఇంగ్లండ్ సిరీస్ నడుస్తోంది. నేను ఇంగ్లండ్ నుంచే నీరజ్ ఆటను చూశాను.. మేరే దేశ్ కీ ధర్తీ సోనా ఉగ్లే అని పాడుకునేంతలా అతడు నన్ను ఆకట్టుకున్నాడు. ఆదివారం నాటి జావెలిన్ త్రో ఫైనల్స్ సందర్భంగానూ అచ్చంగా అదే అనుభూతిని పొందాను. రెండేళ్ల క్రితం నీరజ్ ఒలింపిక్స్‌లో పసిడి పతకం గెలిచాడు. గతేడాది వరల్డ్ అథ్లెటిక్స్‌లో రజతంతో సరిపెట్టుకున్నాడు. అయితే, ఈసారి తన అద్భుతమైన త్రోతో స్వర్ణం సాధించాడు’’ అని గావస్కర్ హర్షం వ్యక్తం చేశాడు. ఇక బ్యాడ్మింటన్ ప్రపంచంలో ప్రణయ్ అద్భుతంగా రాణిస్తున్నాడని గావస్కర్ ప్రశంసించాడు. చాలా మంది అమెరికా, ఆస్ట్రేలియాలను క్రీడా దేశాలుగా భావిస్తారని.. రానున్న 10- 15 ఏళ్లలో భారత్ కూడా స్పోర్టింగ్ కంట్రీగా ఎదుగుతుందని జోస్యం చెప్పాడు. -
195 దేశాలు.. 2100 మంది అథ్లెట్లు! చరిత్రకెక్కిన నీరజ్, అర్షద్..
World Athletics Championships 2023 Medal Tally: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పతకాల పట్టికలో భారత్ 18 స్థానంలో నిలిచింది. ఒక్కో స్వర్ణ పతకం గెలిచిన బహ్రెయిన్, బుర్కినా ఫాసో, డొమినికన్ రిపబ్లిక్, వెనిజులా, సెర్బియా దేశాలతో కలిసి భారత్ సంయుక్తంగా 18వ ర్యాంక్ సాధించింది. ప్రపంచ చాంపియన్‌షిప్-2022లో జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా రజత పతకం కారణంగా భారత జట్టు మరో ఐదు దేశాలతో కలసి సంయుక్తంగా 33వ స్థానంలో నిలిచింది. ఈసారి మన బంగారు కొండ నీరజ్ చోప్రా రజతాన్ని స్వర్ణంగా మార్చి దేశానికి గర్వకారణమయ్యాడు. చరిత్రకెక్కిన నీరజ్, అర్షద్ నదీం హంగేరీలోని బుడాపెస్ట్‌లో ఆదివారం జరిగిన జరిగిన జావెలిన్ త్రో ఫైనల్స్‌లో అత్యధికంగా 88.17 మీటర్ల దూరం ఈటెను విసిరాడు. పోటీలో ప్రథమ స్థానంలో నిలిచి ప్రపంచ చాంపియన్‌గా అవతరించాడు. ఇక దాయాది పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీం 87.82 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి నీరజ్ తర్వాతి స్థానం దక్కించుకున్నాడు. రజత పతకం గెలిచి తొలిసారి పాక్‌కు మెడల్ అందించిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఈ విషయాలు తెలుసా! ఇప్పటి వరకు 19 సార్లు ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు జరిగాయి. ఈసారీ అమెరికా తమ ఆధిపత్యాన్ని చాటుకుంటూ పతకాల పట్టికలో 15వసారి అగ్రస్థానంలో నిలిచింది. అమెరికా 12 స్వర్ణాలు, 8 రజతాలు, 9 కాంస్యాలతో మొత్తం 29 పతకాలతో టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. ఈసారి ప్రపంచ చాంపియ న్షిప్లో పాల్గొన్న దేశాలు 195. మొత్తం 2100 మంది అథ్లెట్లు పోటీపడ్డారు. 120 దేశాల నుంచి నాలుగు లక్షల మంది ప్రేక్షకులు వచ్చి ఈ మెగా ఈవెంట్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు. తాజా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కనీసం ఒక్క పతకమైనా సాధించిన దేశాలు 46. జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ రజత పతకంతో ఈ పోటీల చరిత్రలో తొలిసారి పాకిస్తాన్ ఖాతాలో తొలి పతకం చేరింది. చదవండి: ఇష్టాయిష్టాలతో పనిలేదు.. ఆరోజు యువరాజ్ సింగ్ నన్ను ఓదార్చాడు: రోహిత్ -
మన బంగారు కొండ
భారత క్రీడాభిమానులకు ఇది హృదయం ఉప్పొంగే క్షణం. అథ్లెటిక్స్‌లోనూ మన ఆటగాళ్ళు విశ్వ విజేతలుగా నిలుస్తున్న అపురూప సందర్భం. నిన్నటి దాకా ఒలింపిక్ ఛాంపియన్ మాత్రమే అయిన ఓ క్రీడా దిగ్గజం ఇవాళ ప్రపంచ ఛాంపియన్ కూడా అయిన అపూర్వ ఘట్టం. బుడాపెస్ట్‌లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో పురుషుల జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం సాధించడం ద్వారా భారత అథ్లెట్ నీరజ్ చోప్రా ఆదివారం నాడు అక్షరాలా చరిత్ర సృష్టించారు. ప్రపంచ అథ్లెటిక్స్‌లో స్వర్ణపతకం సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించారు. దేశం గర్వపడేలా చేశారు. ఆదివారం నాడు రెండో ప్రయత్నంలో గరిష్ఠంగా 88.17 మీటర్ల దూరం ఈటెను విసిరి, నీరజ్ సాధించిన ఈ స్వర్ణపతకం ఇక భారత క్రీడాచరిత్రలో సువర్ణాక్షర లిఖితం. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ఊరిలోని నీరజ్ ఇంట్లో ఆయన తండ్రి, బంధుమిత్రులు ఒక్కచోట కూడిన ఉత్కంఠగా చూసిన ఈ విజయఘట్టం వారికే కాదు... యావద్భారతావనికి కూడా ఉద్విగ్నభరితమైనది. ఆర్మీలో సుబేదార్ అయిన పాతికేళ్ళ నీరజ్ చోప్రా మాటల్లోనే చెప్పాలంటే, ఒలింపిక్స్ కన్నా వరల్డ్ ఛాంపియన్షిప్స్ కఠినమైనది. ఒలింపిక్స్ ప్రత్యేక మైనది అయితే, వరల్డ్ ఛాంపియన్ అనేది అతి పెద్ద కిరీటం. పోటీ పరంగా చూసినా, అథ్లెట్లు అవిశ్రాంత సాధన చేసి వచ్చే వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఎప్పుడూ కాస్తంత ఎక్కువ కఠినమే. అలాంటి వేదికపై స్వర్ణసాధనతో నీరజ్ ‘భారతదేశంలో ఆల్‌టైమ్ అతి గొప్ప అథ్లెట్’గా అవతరించారు. మొహమాటంగా ఆ పిలుపును పక్కనపెడుతూ, ఆయన వినయంగా వ్యవహరిస్తున్నప్పటికీ అది వాస్తవమే. అటు ఒలింపిక్స్ స్వర్ణం, ఇటు తాజా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ స్వర్ణం – రెండూ సాధించిన ఏకైక భారత అథ్లెట్ ఈ సైనికుడే. మధ్యతరగతి నుంచి వచ్చిన నీరజ్ ఈ స్థాయికి చేరడానికి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నారు. మోచేతికి గాయం కావడంతో 2019లో శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. అలా అప్పట్లో దోహాలో ప్రపంచ ఛాంపియన్షిప్స్కు హాజరు కాలేకపోయారు. తర్వాత రెట్టించిన ఉత్సాహంతో వచ్చి, 2020 జనవరిలో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. ఆలస్యంగా ఆ మరుసటేడు జరిగిన ఆ ఒలింపిక్స్‌లో ఏకంగా స్వర్ణం సాధించారు. మన దిగ్గజ అథ్లెట్లైన మిల్ఖాసింగ్, పీటీ ఉషకు సైతం అందని ఆ స్వర్ణకీర్తిని అందుకున్నారు. అలా రెండేళ్ళ క్రితం 2021 ఆగస్ట్‌లో జరిగిన టోక్యో ఒలింపిక్స్– 2020లో స్వర్ణసాధన నాటి నుంచి అందరి దృష్టీ నీరజ్‌పై ఉంది. ఇప్పుడీ ప్రపంచ ఛాంపియన్ షిప్స్‌లోనూ బంగారు పతకం తెచ్చి, అథ్లెటిక్స్‌లో మన దేశానికి పతకాలు పండించే బంగారు కొండ అయ్యారు. సౌత్ ఏషియన్ గేమ్స్ (2016), ఏషియన్ ఛాంపియన్షిప్స్ (2017), కామన్వెల్త్ గేమ్స్ (2018), ఏషియన్ గేమ్స్ (2018), ఒలింపిక్స్ (2020), డైమండ్ లీగ్ (2022), ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్షిప్స్... ఇలా నీరజ్ సాధించిన స్వర్ణాలే అందుకు సాక్ష్యం. మొత్తం ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ చరిత్రలో భారత్‌కు ఇది మూడో పతకం. ఇంతకు మునుపు జరిగిన 18 ఛాంపియన్‌షిప్‌లలో మన దేశానికి వచ్చినవి రెండు పతకాలే. ఆ రెండింటిలో కూడా ఒకటి నిరుటి ఛాంపియన్‌షిప్స్‌లో నీరజ్ చోప్రా సాధించిన రజతమే. అంతకు ముందెప్పుడో 2003లో మహిళల లాంగ్‌జంప్‌లో అంజూ బాబీ జార్జ్ కాంస్యం గెలిచారు. అప్పుడలా విశ్వవేదికపై మొదలైన మన పతకాల లెక్క ఇప్పుడు మూడుకు చేరడం ఒక రకంగా ఆనందమే అయినా, మరోరకంగా ఇన్నేళ్ళకు గానీ ఆ స్థాయికి చేరకపోవడం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అంశం. ప్రపంచ స్థాయికి చేరేలా మన ఆటగాళ్ళను ప్రోత్సహించేందుకు మనం చేయవలసినంత చేస్తున్నామా అన్నది ఆలోచించాల్సిన విషయం. అయితే, ఒకప్పుడు అంతర్జాతీయ యవనికపై భారతీయ క్రీడ అంటే హాకీ. తర్వాత క్రికెట్, ఆ పైన చెస్, బ్యాడ్మింటన్, టెన్నిస్, రెజ్లింగ్ వగైరాల్లోనూ మన ప్రతిభకు తక్కువ లేదని నిరూపిత మవుతూ వచ్చింది. నిజానికి, జావెలిన్ త్రోలో సైతం ఒకప్పుడు విశ్వవేదికపై మనం ఎక్కడ ఉన్నామో కూడా ఎవరికీ తెలీదు. కానీ, ఇప్పుడు ఏకంగా ముందు వరుసలో నిలిచాం. అందులోనూ తాజా పోటీలో కిశోర్ జెనా, డీపీ మను అనే మరో ఇద్దరు భారతీయ జావెలిన్ త్రో వీరులు కూడా ఉండడం, వారిద్దరు 5వ, 6వ స్థానాల్లో నిలవడం... ఇవన్నీ మారుతున్న పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. భవిష్యత్తు పట్ల ఆశలు రేపుతున్నాయి. ఆ ఆశలు నెరవేరడానికి నీరజ్ అన్నట్టు మన దగ్గర కూడా కీలకమైన మోండో ట్రాక్స్ వగైరాలను అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్ఐ) సిద్ధం చేయడం అవసరం. చెక్ రిపబ్లిక్కు చెందిన దిగ్గజ అథ్లెట్ జెలెజ్నీ 98.48 మీటర్ల దూరం ఈటె విసిరి, ప్రపంచ రికార్డ్ నెలకొల్పారు. మూడుసార్లు ఒలింపిక్స్‌లో, మరో 3 సార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో పసిడి పతకాలు గెలిచారు. అతనే తనకు స్ఫూర్తి అని చెప్పే నీరజ్ ఆ స్థాయికి చేరడానికి చేయాల్సిన శ్రమ, సాగించాల్సిన ప్రయాణం ఇంకా చాలానే ఉంది. ఆ ప్రయాణానికి మన ప్రభుత్వాలు, క్రీడా సంస్థలు అందించాల్సిన సహకారమూ అపారమే. నీరజ్ ఒలింపిక్స్ సాధన తర్వాత హరియాణాలోని పానిపట్ సహా అనేక గ్రామాల్లో పిల్లల్లో, ఇళ్ళల్లో క్రీడల పట్ల ఆసక్తి కొన్ని పదుల రెట్లు పెరిగింది. గుంపులుగా వచ్చి, ఆటలాడుతున్న ఆ భావి భారత ఆశాకిరణాలకు మైదానాలు, ఆస్పత్రుల లాంటి కనీస వసతులు కల్పించడం ప్రభుత్వ కర్తవ్యం. ఆ దిశగా కృషి చేస్తే, మరింత మంది నీరజ్‌లు ఈ గడ్డపై నుంచి వస్తారనడంలో సందేహం లేదు. -
నా లక్ష్యానికి పరిమితి లేదు.. ఒలింపిక్స్ కంటే కూడా: నీరజ్‌చోప్రా
ఒలింపిక్స్ స్వర్ణం, ప్రపంచ చాంపియన్‌షిప్ స్వర్ణం, ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ చాంపియన్, ఆసియా క్రీడల స్వర్ణం, కామన్వెల్త్ క్రీడల స్వర్ణం, జూనియర్ ప్రపంచ చాంపియన్... భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా అసాధారణ కెరీర్లో అందుకున్న అద్భుత విజయాలెన్నో. వాస్తవంగా ఈ ప్రదర్శనలను పరిగణనలోకి తీసుకుంటే మేజర్ ఈవెంట్లలో అతను సాధించేందుకు ఇక ఏమీ మిగలనట్లే! కానీ నీరజ్ మాత్రం తాను ఇంకా సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉందని చెబుతున్నాడు. జావెలిన్‌ను మరింత బలంగా, మరింత దూరం విసరగలనని అతను చెబుతున్నాడు. బుడాపెస్ట్ (హంగేరి): ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కు తొలి స్వర్ణ పతకం అందించిన ప్లేయర్‌గా కొత్త చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధిస్తానని వ్యాఖ్యానించాడు. పసిడి పతకం గెలిచినందుకు నీరజ్ చోప్రాకు 70 వేల డాలర్ల (రూ. 57 లక్షల 84 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ ఈవెంట్లో నీరజ్ పసిడి పతకం గెలిచాక మీడియాతో పంచుకున్న భావాలు అతని మాటల్లోనే... ♦ త్రోయర్లకు ఎప్పటికీ ఫినిషింగ్ లైన్ అనేదే ఉండదు అంటారు. మా చేతుల్లో జావెలిన్ ఉన్నంత వరకు ఎంత దూరమైన విసరగలం. మా లక్ష్యానికి పరిమితి లేదు. నేను ఎన్ని పతకాలు గెలిచినా ఇంకా ఎక్కువ దూరం బల్లెంను విసరాలనే ప్రేరణ అలాగే ఉంటుంది. ఈ పతకాల వల్ల నేను ఇప్పటికే అన్నీ సాధించానని అనుకోను. మరింత కష్టపడి నా దేశానికి మరిన్ని పతకాలు తీసుకొస్తా. పోడియంపై నా పక్కనే ఎవరైనా భారతీయులు నిలబడగలిగితే అది ఇంకా బాగుంటుంది. ♦ 90 మీటర్ల దూరం కూడా సాధ్యమే. అయితే సాధారణంగా దృష్టంతా గెలుపుపైనే ఉంటుంది. గత కొంత కాలంగా 90 మీటర్ల దూరంపై చర్చ జరుగుతోంది. ఈ ఏడాది సాధించగలననే అనుకున్నా గాయాల వల్ల కొంత ఇబ్బంది పడ్డా. అయితే ఈ విషయంపై ఒత్తిడి పెంచుకోదల్చుకోలేదు. అయితే ఒక ఈవెంట్లో అన్నింటికంటే పతకం గెలవడం ముఖ్యం. ఒక్కసారి 90 మీటర్ల మార్క్ అందుకుంటే అదే నిలకడను కొనసాగించాలని నేను నమ్ముతా. ఒలింపిక్ క్రీడల తర్వాత వరల్డ్ చాంపియన్ ఎలాగైనా గెలవాలని భావించా. ఇప్పుడు ఆ కల నిజమైంది. ♦ భారత ఆల్‌టైమ్ గ్రేట్ అథ్లెట్ అని నా గురించి నేను ఏనాడూ చెప్పుకోలేదు. భవిష్యత్తులోనూ ఎప్పుడూ చెప్పను. వరల్డ్ చాంపియన్‌షిప్ స్వర్ణం లేదని ఇప్పటి వరకు కొందరు అన్నారు. ఇప్పుడు దానిని సాధించాను. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. దానిపైనే దృష్టి పెడతాను తప్ప ఇలాంటి చర్చలోకి రాను. నిజంగా గ్రేటెస్ట్ ఎలా ఉండాలని అడిగితే మాత్రం నేను ఆరాధించే చెక్ రిపబ్లిక్ త్రోయర్ జాన్ జెలెజ్నీలాగా ఉండాలని చెబుతా. ♦ నా దృష్టిలో ఒలింపిక్స్‌తో పోలిస్తే ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనే గట్టి పోటీ ఉంటుంది. టాప్ అథ్లెట్లంతా దీని కోసమే సన్నద్ధమై వస్తారు. భవిష్యత్తులో భారత అథ్లెట్లు మరిన్ని విజయాలు సాధిస్తారు. పాకిస్తాన్ ఆటగాడు అర్షద్ నదీమ్‌తో పోటీని ప్రత్యేకంగా చూడవద్దు. మా ఆటను భారత్, పాకిస్తాన్ మధ్య పోరుగా కొందరు చిత్రీకరిస్తున్నారు. నా ఫోన్లో కూడా అంతా భారత్, పాక్ గురించే మెసేజ్‌లు ఉన్నాయి. మన దేశంలో ఇలాంటి వాతావరణం సహజమే. కానీ దీనిని మా ఇద్దరి మధ్య పోటీగా చూడవద్దు. రెండు దేశాల పేర్లతో ఒత్తిడి పెంచవద్దు. ఈవెంట్లో ఇతర ప్రత్యర్థులందరినీ దృష్టిలో ఉంచుకొని సిద్ధం కావాల్సి ఉంటుంది. సరిగా చూస్తే యూరోపియన్లతో పోటీ పడి రెండు దేశాలు విజయాలు సాధించడం మంచి పరిణామం. రూ. 57 లక్షల 84 వేలు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచి నీరజ్ 70 వేల డాలర్ల (రూ. 57 లక్షల 84 వేలు) ప్రైజ్‌మనీ అందుకున్నాడు. -
ఈ సిల్వర్ మెడల్ పసిడి కంటే ఎక్కువ.. వసీం అక్రం పోస్ట్! సెల్ఫ్ గోల్..
Neeraj Chopra- Arshad Nadeem- Wasim Akram's 'Worth More Than A Gold': వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి మరోసారి మువ్వన్నెల జెండాను ప్రపంచ వేదికపై రెపరెపలాడించాడు గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా. నాలుగు దశాబ్దాల భారతీయుల కలను నిజం చేస్తూ ఈ జావెలిన్ త్రో స్టార్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచ చాంపియన్‌గా అవతరించి భారతావని ప్రశంసలు అందుకుంటున్నాడు. కాగా హంగేరీలోని బుడాపెస్ట్‌లో ఆదివారం జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో.. నీరజ్ రెండో ప్రయత్నంలో అత్యధికంగా 88.17 మీటర్ల దూరం బల్లాన్ని విసిరి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే, ఇదే ఈవెంట్లో పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీం 87.82 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి రజతం దక్కించుకున్నాడు. అర్షద్‌ను పిలిచి మరీ ఫొటో దిగిన నీరజ్ ఇదిలా ఉంటే దాయాది దేశాలకు చెందిన నీరజ్, అర్షద్ పరస్పరం అభినందనలు తెలుపుకొంటూ సన్నిహితంగా మెలిగిన తీరు క్రీడాభిమానులను ఆకర్షించింది. ముఖ్యంగా ఫొటో దిగేందుకు నీరజ్.. అర్షద్‌ను పిలవడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రం మాత్రం తన పోస్ట్‌తో విమర్శల పాలయ్యాడు. అర్షద్ సిల్వర్ మెడల్ సాధించడాన్ని కొనియాడిన వసీం అక్రం.. ‘‘టేక్ ఏ బో అర్షద్ నదీం.. నీ రజత విజయం నేపథ్యంలో పాకిస్తాన్ మొత్తం సంబరాలు చేసుకుంటోంది. వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నువ్వు సాధించిన సిల్వర్ మెడల్ పసిడి పతకం కంటే ఎక్కువే! ఎందుకిలా అంటున్నానంటే.. మిగతా అథ్లెట్లతో పోలిస్తే నీకు అరకొర సౌకర్యాలే ఉన్నాయి. అయినా నువ్వు ఇక్కడిదాకా చేరుకున్నావు. క్రికెట్ కాకుండా మరో క్రీడను కూడా దేశ ప్రజలు సెలబ్రేట్ చేసుకునే అవకాశమిచ్చావు’’ అని తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చాడు. సెల్ఫ్ గోల్.. అభిమానుల నుంచి విమర్శలు ఈ నేపథ్యంలో.. సొంత అభిమానుల నుంచే వసీం అక్రం విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ‘‘సరైన సౌకర్యాలు లేవని నువ్వే చెప్తున్నావు. క్రికెటర్‌గా బాగానే సంపాదించావు కదా! అర్షద్‌కు కావాల్సిన ఆర్థిక సాయం అందించవచ్చు కదా!’’ అని కామెంట్లు చేస్తున్నారు. ఇక నీరజ్ చోప్రా అభిమానులు.. ‘‘నీరజ్, అర్షద్ అన్నదమ్ముల్లా బాగానే కలిసిపోయారు. నువ్వు మాత్రం ఇలా బుద్ధి చూపించావు’’ అంటూ బౌలింగ్ లెజెండ్ వసీం అక్రంపై ఫైర్ అవుతున్నారు. చదవండి: WC 2023: వరల్డ్‌కప్ జట్టులో అయ్యర్‌కు నో ఛాన్స్! అతడికి అవకాశం! Take a bow Arshad Nadeem… the whole Pakistan is celebrating your silver medal … worth more than a gold … in World Athletics Championship. Why I said it’s worth more than a gold is that you don’t get the top level facilities other athletes get, but you still excelled. So… pic.twitter.com/sG6ZA9alNw — Wasim Akram (@wasimakramlive) August 28, 2023 -
ప్రపంచంలో భారత్, పాక్.. నం.1, 2.. ఇక ఒలింపిక్స్‌లో! నాకు తెలుసు..
World Athletics Championships 2023- Neeraj Chopra- Arshad Nadeem: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్-2023లో స్వర్ణం సాధించిన భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘నీ ఆటకు నీరాజనం’ అంటూ భారతీయులంతా ఈ హర్యానా కుర్రాడి విజయాన్ని మనసారా ఆస్వాదిస్తున్నారు. నీరజ్‌కు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతూ అతడి గెలుపును కొనియాడుతున్నారు. ఎవరికీ సాధ్యం కాని ఫీట్‌తో కాగా టోక్యో ఒలింపిక్స్‌లో పసిడి గెలిచి యావత్ భారతావనిని పులకింపజేసిన ఈ గోల్డెన్ బాయ్.. వరల్డ్ అథ్లెటిక్స్‌లోనూ గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. నాలుగు దశాబ్దాలుగా భారత అథ్లెట్లకు సాధ్యం కాని ఫీట్ నమోదు చేసి రికార్డులకెక్కాడు. నీరజ్ భాయ్.. సంతోషంగా ఉందన్న అర్షద్ ఈ నేపథ్యంలో పాకిస్తాన్ జావెలిన్ త్రో స్టార్ అర్షద్ నదీం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుడాపెస్ట్ వరల్డ్ అథ్లెటిక్స్‌లో నీరజ్ కంటే ఒక అడుగు వెనుకబడి రజతంతో సరిపెట్టుకున్న అతడు.. ‘‘నీరజ్ భాయ్.. నీ విజయం పట్ల నాకెంతో సంతోషంగా ఉంది! ప్రపంచంలో ఇండియా- పాకిస్తాన్ 1, 2 స్థానాల్లో నిలిచాయి. ప్రపంచంలో భారత్, పాక్.. నం.1,2 ఆ దేవుడి దయ వల్ల ఒలింపిక్స్‌లోనూ మనం 1- 2 స్థానాల్లో ఉండాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నాడు. ప్యారిస్ ఒలింపిక్స్‌లోనూ సత్తా చాటాలని నీరజ్ చోప్రాకు ఈ సందర్భంగా ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఇక విజయానంతరం నీరజ్ మాట్లాడుతూ.. ‘‘ఈవెంట్ ముగిసిన తర్వాత నేను అర్షద్‌ను కలిశాను. ప్రపంచ వేదికపై భారత్- పాక్ సత్తా చాటినందుకు ఇద్దరం సంతోషం పంచుకున్నాం. మాకు గట్టిపోటీనిచ్చిన యూరోపియన్ ఆటగాళ్లను దాటుకుని ముందుకు వెళ్లిన తీరును గుర్తు చేసుకున్నాం. క్రీడల్లో ఇరు దేశాల మధ్య ఉన్న పోటీతత్వం గురించి మాకు తెలుసు. అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో తెలుసు ఈసారి నేను గెలిచాను. దీంతో ఆసియా క్రీడల నేపథ్యంలో అభిమానుల అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో తెలుసు. మేము మళ్లీ చైనాలోని హాంగ్జూలో మళ్లీ కలుస్తాం’’ అని చెప్పుకొచ్చాడు. కాగా టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన చెక్ రిపబ్లిక్ ప్లేయర్ జాకూచ్ వాద్లెచ్(86.7 మీటర్లు)ను వెనక్కి నెట్టి వరల్డ్ అథ్లెటిక్స్‌లో అర్షద్ రన్నరప్‌గా నిలిచాడు. 87.82 మీటర్ల దూరం ఈటెను విసిరి రజత పతకం గెలిచాడు. చదవండి: నవీన్‌కు గట్టి షాక్.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్! అయ్యో పాపం.. ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. విధ్వంసకర ఆటగాడు దూరం! -
నిన్ను చూసి దేశం గర్విస్తుంది: అల్లు అర్జున్
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లొ 88.17 మీటర్లు ఈటెను విసిరి పురుషుల జావెలిన్ త్రో విజేతగా నిలిచాడు. స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు. మరోసారి తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు . ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో పాకిస్థాన్‌కు చెందిన త్రోయర్ అర్షద్ నదీమ్ (87.82 మీటర్లు) రజతం నెగ్గగా. ఈ పోటీలో నీరజ్ చోప్రాకు గట్టిపోటీ ఇచ్చాడని చెప్పవచ్చు. (ఇదీ చదవండి: ఈ ఆనంద సమయంలో మీరు లేరు.. తారకరత్నను గుర్తుచేసుకున్న ఆలేఖ్య) ఆ తర్వాత చెక్కు చెందిన వద్లెచ్ (86.67 మీటర్లు) కాంస్యం దక్కించుకున్నాడు. ఇప్పటికే చంద్రయాన్-3 సూపర్ విజయంతో ప్రపంచానికి తన సత్తా చాటిన భారత్ తాజాగ నీరజ్ చోప్రా ఈ విజయంతో మన జాతీయ జెండాను విశ్వవేదికపై మరోసారి ఎగురవేశాడు. ఈ ఆనంద సమయంలో టాలీవుడు నుంచి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. నీరజ్ చోప్రాకు శుభాకాంక్షలు అందించాడు. ఈ రేస్‌లో మొదటిసారి భారత్‌కు స్వర్ణం అందించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ విజయం దేశం గర్వించతగినదని బన్నీ అన్నారు. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) Fenkon toh aise fenko ki chaar log bole Kya fekta hai yaar. 88.17 mtr door Bhaala phenka and a World Athletics Championship Gold for our Champion #NeerajChopra . The mega run continues .pic.twitter.com/9TOFl4P6uM — Virender Sehwag (@virendersehwag) August 28, 2023 Neeraj Chopra is the GOAT 🇮🇳 First Indian to win a Gold Medal in the World Athletics Championships....!!!!!!pic.twitter.com/SyE0TtzDsX — Johns. (@CricCrazyJohns) August 27, 2023 -
గోల్డెన్ బోయ్ నీరజ్ ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2023లో జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా 88.17 మీటర్ల అద్భుతమైన త్రో మెన్స్ జావెలిన్ త్రోలో బంగార పతకాన్నిసాధించి భారత్‌కు తొలిస్వర్ణాన్ని అందించి మరోసారి చరిత్ర సృష్టించాడు. పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ రజత పతకంతో సరి పెట్టుకున్నాడు. ఈ సందర్బంగా నీరజ్‌కు దక్కిన ప్రైజ్ మనీ ఎంత అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ 2023లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న తొలి అథ్లెట్‌గా నిలిచిన నీరజ్ చోప్రాకు 70వేల డాలర్లు (సుమారు రూ. 58 లక్షలు) నగదు బహుమతిని అందుకున్నట్టు తెలుస్తోంది. అలాగే రెండోస్థానంలో ఉన్న అర్షద్ నదీమ్ 35000 డాలర్లు (సుమారు రూ. 29 లక్షలు) ప్రైజ్ మనీని గెలుచు కున్నాడు. బుడాపెస్ట్‌లో జరిగిన ఈవెంట్లో 88.17 మీటర్ల త్రోతో ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో టాప్‌లో నిలిచి, గోల్డెన్ బోయ్‌గా మరోసారి తన ప్రత్యకతను నిరూపించుకున్నాడు నీరజ్ చోప్రా. ఈ పోటీలో చెక్ రిపబ్లిక్కు చెందిన జాకుబ్ వడ్లెజ్ 86.67 మీటర్లు విసిరి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అలాగే మరో ఇద్దరు భారత అథ్లెట్లు కిషోర్ జెనా , డిపి మను వరుసగా 84.77 మీ 84.14 మీటర్ల త్రోతో ఐదు, ఆరో స్థానాల్లో నిలిచిన సంగతి తెలిసిందే. కాగా 40 ఏళ్ల ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూఏసీ) చరిత్రలో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తొలి భారతీయ అథ్లెట్ నీరజ్ చోప్రా. ఆదివారం బుడాపెస్ట్‌లో జరిగిన WAC 2023లో పురుషుల జావెలిన్ ఈవెంట్లో 25 ఏళ్ల స్టార్ నీరజ్ తన సొంత రికార్డును తానే చెరిపేసి రజత పతకాన్ని స్వర్ణంగా మార్చుకున్నాడు. This is Neeraj Chopra, Olympic Gold Medalist. After winning the #WorldAthleticsChamps in Budapest yesterday, A hungarian fan came to him with an Indian flag and asked him to sign it for her. Subedar Neeraj Chopra humbly denied and said “ Sorry Mam, it is a violation of my flag… pic.twitter.com/mc7afI6h4e — Roshan Rai (@RoshanKrRaii) August 28, 2023 1. Pakistanis tweeting 10x about lack of facilities should have tweeted atleast once way before. 2. Arshad Nadeem had world class training in Germany just like Neeraj. 3. Enjoy Neeraj Chopra inviting Arshad under 🇮🇳 as he didn't have 🇵🇰#NeerajChoprapic.twitter.com/wqRxCACMIC — Johns (@JohnyBravo183) August 27, 2023 -
నీరజ్ చోప్రా మూన్ షాట్ వీడియో వైరల్: ఆనంద్ మహీంద్ర మళ్లీ కారు గిఫ్ట్?
World Athletics Championships first goldNeeraj Chopra బుడాపెస్ట్ (హంగేరి) వేదికగా జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో గోల్డెన్ బోయ్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. వరల్డ్ అథ్లెటిక్స్‌లో ఇండియాకు తొలి స్వర్ణం అందించిన ఘనతను దక్కించుకునాడు. దీనిపై ప్రధానమంత్రి నరంద్రే మోదీ సహా పలువురు ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా నీరజ్ అద్భుత విజయంపై బిలియనీర్, ఎం అండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్ర స్పందించారు. ఇండియా.. చోప్రా.. గోల్డ్ అంటూ అతడిని అభినందించారు. అంతేకాదు మూన్‌షాట్ అంటూ ఆయన సహోద్యోగి రూపొందించిన ఒక ఆసక్తికర వీడియోను ట్వీట్ చేశారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. అలాగే నీరజ్ చోప్రా విజయం మండే మోటివేషన్ కాకపోతే మరేమిటి అంటూ సోమవారం మరో ట్వీట్ చేశారు. అయిదే ఈ మోటివేషన్ కేవలం స్వర్ణం సాధించడ వల్ల మాత్రమే కాదు..సహజమైన ప్రతిభ ఉంటే సరిపోదు సక్సెస్రాదు నీరజ్ గుర్తు చేశారు. ప్రిపరేషన్ పట్ల రాజీలేని నిబద్ధతకు ఫలితం ఈ గొప్ప విజయం అని చాటి చెప్పారంటూ నీరజ్‌ను అభినందించారు. How could my #MondayMotivation this morning be anything other than this man’s latest victory? But it’s not because he won Gold. It’s because he is a reminder that success is not an outcome of only natural talent; it is the result of an uncompromising commitment to preparation…… pic.twitter.com/VQMM98L7li — anand mahindra (@anandmahindra) August 28, 2023 కాగా పురుషుల జావెలిన్ త్రోలో స్వర్ణం పతకం సాధించిన నీరజ్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిస్తున్నారు. లెజెండ్ అథ్లెట్ అంటూ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. అంతేకాదు నీరజ్‌కు మరో కారు ఇస్తారా సార్ అంటూ ఒక యూజర్ ప్రశ్నించడం గమనార్హం. INDIAAAAA. CHOPRAAAA. GOLLLDDD. 💪🏽🇮🇳 His moonshot does it… (The clip in this video my colleague made is from the qualifier…) pic.twitter.com/3HSWUZ3PUI — anand mahindra (@anandmahindra) August 27, 2023 ఇదీ చదవండి: ఊరట! పసిడికి ఫెడ్ బ్రేకులు: ఎంత తగ్గిందంటే..! వావ్...అందరి చూపు ఆకాశానికే..మన చిరుతల వేగం చూడండి! -
వరల్డ్ ఛాంపియన్ 'నీరజ్ చోప్రా' అద్భుతమైన కార్లు, బైకులు - ఓ లుక్కేసుకోండి!
టోక్యో ఒలంపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి సరికొత్త చరిత్రను సృష్టించిన 'నీరజ్ చోప్రా' (Neeraj Chopra) తాజాగా వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో కూడా స్వర్ణ పతకం గెలిచి యావత్ భారతదేశం మొత్తం గర్వపడేలా మరో రికార్డ్ నెలకొల్పాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న మొదటి భారతీయుడిగా ప్రసిద్ధి చెందిన నీరజ్ ఎలాంటి కార్లు & బైకులు వినియోగిస్తారనేది ఈ కథనంలో తెలుసుకుందాం. ఫోర్డ్ మస్టాంగ్ జీటీ (Ford Mustang GT).. నీరజ్ చోప్రా గ్యారేజిలోని మొదటి కారు ఈ ఫోర్డ్ మస్టాంగ్ జీటీ. దీని ధర రూ. 75 లక్షల వరకు ఉంటుందని సమాచారం. చాలామంది సెలబ్రిటీలకు కూడా ఈ అమెరికన్ బ్రాండ్ కారంటే చాలా ఇష్టం. ఇది 5.0 లీటర్ ఇంజన్ కలిగి 396 హార్స్ పవర్, 515 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మస్టాంగ్ టాప్ స్పీడ్ గంటకు 180 మైల్స్/గం. రేంజ్ రోవర్ స్పోర్ట్స్ (Range Rover Sport).. రేంజ్ రోవర్ కంపెనీకి చెందిన 'స్పోర్ట్స్' కారు కూడా నీరజ్ చోప్రా వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. రూ. 2.20 కోట్లు ధర కలిగిన ఈ లగ్జరీ కారు అద్భుతమైన డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది 5.0 లీటర్ V8 ఇంజన్ కలిగి 567 హార్స్ పవర్ & 700 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ SUV టాప్ స్పీడ్ గంటకు 260 కిమీ. మహీంద్రా థార్ & XUV700.. దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన 'థార్' నీరజ్ గ్యారేజిలో ఉంది. సుమారు రూ. 17 లక్షలు విలువైన ఈ కారు అద్భుతమైన ఆఫ్ రోడింగ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. ఇది 2.2 లీటర్ డీజిల్ & 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి మంచి పనితీరుని అందిస్తుంది. ఇక మహీంద్రా ఎక్స్‌యూవీ700 విషయానికి వస్తే, ఇది నీరజ్ కోసం ప్రత్యేకంగా రూపోంచిన కారు. ఇందులో చాలా వరకు కస్టమైజ్ చేసిన డిజైన్స్ చూడవచ్చు. ఈ SUV మిగిలిన కార్ల కంటే భిన్నంగా ఉంటుంది. ఇది కూడా పెట్రోల్ & డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. టయోటా ఫార్చ్యూనర్ (Toyota Fortuner).. భారతదేశంలో ఎక్కువమంది వినియోగించే టయోటా కంపెనీకి చెందిన ఫార్చ్యూనర్ నీరజ్ చోప్రా గ్యారేజిలో ఉంది0 దీని ధర రూ. 51 లక్షలు అని తెలుస్తోంది. 7 సీటర్ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ మోడల్ 2.7-లీటర్ పెట్రోల్ అండ్ 2.8-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్లతో వస్తుంది. ఇదీ చదవండి: కోట్లు సంపాదించేలా చేసిన భారత పర్యటన - ఇండియాలో అమెరికన్ హవా! హార్లే డేవిడ్సన్ 1200 రోడ్‌స్టర్ (Harley-Davidson 1200 Roadster).. బైక్ విభాగంలో ఖరీదైనవిగా భావించే హార్లే డేవిడ్సన్ 1200 రోడ్‌స్టర్ నీరజ్ చోప్రా వద్ద ఉంది. దీనిని 2019లో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ బైక్ మంచి డిజైన్ కలిగి రైడింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. దీని ధర రూ. 10 లక్షల కంటే ఎక్కువ. ఇదీ చదవండి: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 'ఏఐ'పై ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కీలక ప్రకటన బజాజ్ పల్సర్ 200ఎఫ్ (Bajaj Pulsar 200F).. ఎక్కువమంది యువ రైడర్లకు ఇష్టమైన బజాజ్ పల్సర్ 200ఎఫ్ కూడా నీరజ్ గ్యారేజిలో ఉంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. కార్లు, బైకులు మాత్రమే కాకుండా ఒక ట్రాక్టర్ కూడా నీరజ్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Neeraj Chopra (@neeraj____chopra) -
13 ఏళ్ల వయస్సులోనే అవమానాలెన్నో.. అయినా వరల్డ్ ఛాంపియన్!
చంద్రయాన్-3 సూపర్ సక్సెస్‌ను మరవకముందే విశ్వవేదికపై మరోసారి భారత పతాకం రెపరెపలాడింది. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లొ 88.17 మీటర్ల త్రోతొ పురుషుల జావెలిన్ త్రో విజేతగా నిలిచాడు. తద్వారా వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న తొలి భారతీయుడిగా చరిత్ర పుటలకెక్కాడు. కేవలం 25 ఏళ్ల వయస్సులోనే ఎన్నో ఘనతలను నిరాజ్ అందుకున్నాడు. అంతకుముందు 2021 టోక్యో ఒలిపింక్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించి తన పేరును ప్రపంచానికి పరిచయం చేసుకున్నాడు ఈ బల్లెం వీరుడు. ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి ప్రపంచ క్రీడా వేదికపై సత్తా చాటుతున్న నీరజ్.. భారత అథ్లెటిక్స్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకుంటున్నాడు. ఎన్నో అవమానాలు.. నీరజ్ డిసెంబర్ 24, 1997న హర్యానాలోని పానిపట్ జిల్లాలోని ఖందార్ అనే చిన్న గ్రామంలో జన్మించాడు. నీరజ్‌ది ఒక రైతు కుటుంబం. నీరజ్‌కు ఇద్దరి సోదరిలు కూడా ఉన్నారు. అయితే నిరాజ్ తన చిన్నతనంలో దీర్ఘకాయత్వంతో బాధపడ్డాడు. 13 ఏళ్ల వయస్సులోనే నీరాజ్ 80 కేజీల బరువు కలిగి ఉన్నాడు. ఈ క్రమంలో అతడిని అందరూ హేళన చేసేవారు. ఆ గ్రామంలో పిల్లలు అయితే ఏకంగా సర్పంచ్, సర్పంచ్ అని పిలిచే వారు. కానీ నిరాజ్ వాటిన్నటిని పట్టించుకోలేదు. జీవితంలో ఏదైనా సాధించి అవమానాలు ఎదుర్కొన్న చోటే శబాష్ అనిపించుకోవాలని నీరజ్ అప్పుడే నిర్ణయించుకున్నాడు. అలా మొదలైంది.. అందరూ తన కొడుకును హేళన చేయడంతో తండ్రి సతీష్ కుమార్ చూసి తట్టుకోలేకపోయాడు. దీంతో నిరాజ్‌ను వ్యాయమం చేసేందుకు పంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో అతడిని రోజు సతీష్ కుమార్ పానిపట్‌లోని శివాజీ స్టేడియంకు తీసుకువెళ్లేవాడు. అయితే వరల్డ్ఛాంపియన్గా ఎదిగిన నీరాజ్ ప్రయాణానికి అక్కడే బీజం పడింది. శివాజీ మైదానంలో బళ్లెం వీరుడు బంగారు కథ మొదలైంది. శివాజీ స్టేడియంలో కొంత మంది అబ్బాయిలు జావెలిన్ త్రో ప్రాక్టీస్ చేయడం నీరజ్ చూశాడు. దీంతో తన కూడా జావెలిన్ పట్టాలని నిర్ణయించుకున్నాడు. నీరజ్‌కు జావిలిన్ త్రోపై రోజురోజుకి ఆసక్తి పెరుగుతుండడంతో అతడి తండ్రి పానిపట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంటర్లో చేర్పించాడు. అతడి కోచింగ్‌లో.. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంటర్లో జావెలిన్ త్రోయర్ ట్రైనర్ జైవీర్ చౌదరి... నీరజ్ ప్రతిభను గుర్తించాడు. మొదటి ప్రయత్నంలోనే నిరాజ్ ఎటువంటి ప్రాక్టీస్ లేకుండా 40 మీటర్లు విసిరడం చూసి జైవీర్ చౌదరి ఆశ్చర్యపోయాడు. జైవీర్ చౌదరి శిక్షణలో నీరజ్ మరింత రాటుదేలాడు. జైవీర్ చౌదరి దగ్గర ఏడాది శిక్షణ తర్వాత పంచకులలోని తౌ దేవి లాల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో చేరాడు. అక్కడ కూడా నీరజ్ తన టాలెంట్‌తో అందరిని అకట్టుకున్నాడు. ఈ క్రమంలో అక్టోబర్ 2012లో లక్నోలో జరిగిన జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఇదే నీరాజ్‌కు తొలి జాతీయ పతకం. అక్కడ నుంచి నీరాజ్ వెనుక్కి తిరిగి చూడలేదు. ఎన్నో ఘనతలు.. అనంతరం 2016లో ప్రపంచ అండర్–20 చాంపియన్‌షిప్‌లో కూడా నీరజ్ సత్తాచాటాడు. స్వర్ణ పతకం గెలిచి అందరి నీరాజనాలను అందుకున్నాడు. అదే విధంగా 2018 ఆసియా క్రీడల్లో, 2018 కామన్వెల్త్ గేమ్స్‌లోనూ పసిడి పతకాలు సొంతం చేసుకున్నాడు. 2021లో టోక్యో ఒలింపిక్స్‌లో అందరి అంచనాలను తారుమారు చేస్తూ స్వర్ణ పతకం సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్‌లో భారత్ తరఫున వ్యక్తిగత స్వర్ణం సాధించిన రెండో ఆటగాడిగా నీరజ్ నిలిచాడు. 2022 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం, 2022 ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో స్వర్ణంతో మెరిశాడు. అవార్డులు, పురస్కారాలు భారతదేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును 2021లో, 2018లో అర్జున అవార్డు, 2022లో పద్శ శ్రీ అవార్డును అందుకున్నాడు. ఆర్మీలో అందించిన సేవలకు గుర్తింపుగాచోప్రాకు 2022లో పరమ్ విశిష్ట్ సేవా పతకం, 2020లో విశిష్ట్ సేవా పతకాలు వచ్చాయి. చదవండి: World Athletics Championships: నీరజ్ స్వర్ణ చరిత్ర 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
World Athletics Championships: నీరజ్ స్వర్ణ చరిత్ర
నాలుగు దశాబ్దాల ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో ఏ భారతీయ అథ్లెట్‌కు సాధ్యంకాని ఘనతను జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సాధించాడు. ఈ మెగా ఈవెంట్ చివరిరోజు ఆదివారం నీరజ్ చోప్రా భారత అభిమానుల్లో పసిడి కాంతులు నింపాడు. అందరి అంచనాలను నిజం చేస్తూ నీరజ్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. తద్వారా ఈ ప్రతిష్టాత్మక చాంపియన్‌షిప్‌లో పసిడి పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్‌గా కొత్త చరిత్రను లిఖించాడు. బుడాపెస్ట్ (హంగేరి): భారతీయులు కూడా ఇక సగర్వంగా చెప్పవచ్చు... ప్రపంచ అథ్లెటిక్స్‌లో మాకు ఉన్నాడు ఒక ప్రపంచ చాంపియన్ అని... గత ఏడాది ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం నెగ్గిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈసారి పతకం రంగు మార్చాడు. ‘రజత’«దీరుడి నుంచి ‘పసిడి’వీరుడిగా మారాడు. ఆదివారం ముగిసిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా స్వర్ణ పతకం సాధించాడు. నీరజ్ రెండో ప్రయత్నంలో విసిరిన జావెలిన్ అత్యధికంగా 88.17 మీటర్ల దూరం వెళ్లింది. మొత్తం ఆరు ప్రయత్నాల్లో ఈ దూరాన్ని మరో అథ్లెట్ అధిగమించలేకపోయాడు. ఫలితంగా నీరజ్‌కు బంగారు పతకం ఖరారైంది. పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ 87.82 మీటర్లతో రజత పతకం దక్కించుకోగా... జాకుబ్ వాద్లెచ్ (చెక్ రిపబ్లిక్) 86.67 మీటర్లతో కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. భారత్‌కే చెందిన కిశోర్ కుమార్ జేనా 84.77 మీటర్లతో ఐదో స్థానంలో, మనూ 84.14 మీటర్లతో ఆరో స్థానంలో నిలిచారు. ఫౌల్‌తో మొదలు... క్వాలిఫయింగ్‌లో అగ్రస్థానంలో నిలిచిన నీరజ్ చోప్రా ఫైనల్‌ను నిరాశాజనకంగా ప్రారంభించాడు. నీరజ్ తొలి ప్రయత్నమే ఫౌల్ అయింది. దాంతో భారత అభిమానులు కాస్త ఆందోళన చెందారు. కానీ నీరజ్ వెంటనే తేరుకున్నాడు. రెండో ప్రయత్నంలో నీరజ్ జావెలిన్‌ను ఏకంగా 88.17 మీటర్ల దూరం విసిరాడు. ఈ ప్రదర్శనతో నీరజ్ చివరిదైన 12వ స్థానం నుంచి అగ్రస్థానానికి దూసుకొచ్చాడు. నిరీ్ణత ఆరు ప్రయత్నాల వరకు నీరజ్ అగ్రస్థానాన్ని కొనసాగించాడు. అన్నీ సాధించాడు... 2016లో ప్రపంచ అండర్–20 చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచి వెలుగులోకి వచి్చన నీరజ్ ఈ ఏడేళ్ల కాలంలో ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగాడు. 2017 ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో తొలిసారి పాల్గొని 15వ స్థానంలో నిలిచిన నీరజ్ ఆ తర్వాత రాటుదేలాడు. అదే ఏడాది భువనేశ్వర్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెలిచిన నీరజ్... 2018 ఆసియా క్రీడల్లో, 2018 కామన్వెల్త్ గేమ్స్‌లోనూ పసిడి పతకాలు సొంతం చేసుకున్నాడు. 2021లో టోక్యో ఒలింపిక్స్‌లో అందరి అంచనాలను తారుమారు చేస్తూ స్వర్ణ పతకం నెగ్గిన ఈ హరియాణా స్టార్ 2022 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం, 2022 ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో స్వర్ణంతో మరింత ఎత్తుకు ఎదిగాడు. అదే జోరును కొనసాగిస్తూ తాజా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకంతో యావత్ భారతాన్ని ఆనందడోలికల్లో ముంచాడు. తాజా స్వర్ణంతో నీరజ్ అథ్లెటిక్స్‌లోని అన్ని మేజర్ ఈవెంట్లలో పతకాలు నెగ్గిన జావెలిన్ త్రోయర్‌గా నిలిచాడు. భారత రిలే జట్టుకు ఐదో స్థానం ఆదివారమే జరిగిన పురుషుల 4్ఠ400 మీటర్ల రిలే ఫైనల్లో అనస్ యాహియా, అమోజ్ జేకబ్, అజ్మల్, రాజేశ్ రమేశ్‌లతో కూడిన భారత బృందం ఐదో స్థానాన్ని దక్కించుకుంది. భారత బృందం 2 నిమిషాల 59.92 సెకన్లలో గమ్యానికి చేరింది. మరోవైపు మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఫైనల్లో భారత అథ్లెట్ పారుల్ చౌధరీ 11వ స్థానంలో నిలిచింది. పారుల్ 9 నిమిషాల 15.31 సెకన్లలో గమ్యానికి చేరి కొత్త జాతీయ రికార్డు నెలకొలి్పంది. 3: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు లభించిన మొత్తం పతకాలు. 2003లో మహిళల లాంగ్‌జంప్‌లో అంజూ జార్జి కాంస్యం సాధించగా... 2022లో నీరజ్ రజతం, 2023లో నీరజ్ స్వర్ణం గెలిచాడు. 2: ఒలింపిక్స్‌తోపాటు ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ స్వర్ణ పతకాలు గెలిచిన రెండో భారతీయ క్రీడాకారుడు నీరజ్ చోప్రా. గతంలో షూటర్ అభినవ్ బింద్రా ఈ ఘనత సాధించాడు. అభినవ్ బింద్రా 2006 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో పసిడి పతకాలు గెలిచాడు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
చైనాకు భారత్ నుంచి భారీ బృందం.. 634 మంది! క్రికెట్ జట్లు ఇవే!
Asian Games 2023: ఆసియా క్రీడలు-2023 నేపథ్యంలో భారత్ 634 అథ్లెట్లతో భారీ బృందాన్ని పంపించనుంది. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ 38 క్రీడాంశాల్లో ఈ బృందానికి అధికారికంగా ఆమోద ముద్ర వేసింది. చైనాలో హాంగ్జూలో సెప్టెంబరు 23 నుంచి అక్టోబర్ 8 వరకు ఆసియా క్రీడల నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. కాగా.. 2018లో జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ నుంచి 572 మంది పాల్గొన్న విషయం విదితమే. ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్‌కు 34 మంది పురుషులు, 31 మంది మహిళలు మొత్తంగా 65 మంది అథ్లెట్లు.. పురుష, మహిళా జట్లకు సంబంధించి 44 మంది ఫుట్‌బాలర్లు.. హాకీ జట్టు నుంచి మొత్తంగా 36 మంది, క్రికెట్ జట్ల నుంచి 30 మంది ఆసియా క్రీడల్లో భాగం కానున్నారు. స్టార్లంతా ఇక షూటింగ్ విభాగంలో భారత్ నుంచి 30 మంది, సెయిలింగ్ కోసం 33 మంది చైనాకు వెళ్లనున్నారు. అయితే, వెయిట్‌లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌బాల్, రగ్బీ తదితర విభాగాలకు సంబంధించి లిస్ట్ వెల్లడి కావాల్సి ఉంది. ఆసియా క్రీడల్లో స్టార్లు నీరజ్ చోప్రా, హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్, పీవీ సింధు, మీరాబాయి చాను, సునీల్ ఛెత్రి, హర్మన్‌ప్రీత్ సింగ్, బజరంగ్ పూనియా తదితరులు భాగం కానున్నారు. క్రికెట్ జట్లు ఇవే! ఈసారి భారత్ నుంచి మహిళా, పురుష క్రికెట్ జట్లు కూడా ఆసియా క్రీడల్లో పాల్గొనుండటం విశేషం. చైనాకు క్రికెటర్లను పంపించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. వుమెన్ టీమ్‌లోని ప్రధాన క్రికెటర్లంతా ఈ మెగా టోర్నీలో భాగం కానుంగా.. మెన్స్ నుంచి ద్వితీయ శ్రేణి జట్టును హాంగ్జూకు పంపనున్నారు. అక్టోబరు 5 నుంచి వన్డే వరల్డ్‌కప్-2023 ఆరంభం కానున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆసియా క్రీడల్లో పాల్గొనే జట్టుకు ముంబై బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. టీ20 స్టార్లు తిలక్ వర్మ, యశస్వి జైశ్వాల్, రింకూ సింగ్ తదితరులతో కూడిన ఈ జట్టు ఆసియా బరిలో దిగనుంది. ఆసియా క్రీడలకు భారత పురుషుల జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైశ్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ మావి, శివం దూబే, ప్రభ్‌షిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్). స్టాండ్‌బై ప్లేయర్లు: యశ్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్. మహిళా క్రికెట్ జట్టు హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమన్‌జోత్ కౌర్, దేవికా వైద్య, అంజలి శ్రావణి, టిటాస్ సాధు, రాజేశ్వరి గైక్వాడ్, మిన్ను మణి, కనికా అహుజా, ఉమా చెత్రి (వికెట్ కీపర్), అనూష బారెడ్డి స్టాండ్‌బై ప్లేయర్లు: హర్లీన్ డియోల్, కష్వీ గౌతమ్, స్నేహ్ రాణా, సైకా ఇషాక్, పూజా వస్త్రాకర్ -
నీరజ్ మెరిసె... తొలిసారి ఒకే ఈవెంట్ ఫైనల్లో ముగ్గురు భారత అథ్లెట్లు
బుడాపెస్ట్ (హంగేరి): కొన్నేళ్లుగా అంతర్జాతీయ అథ్లెటిక్స్ వేదికపై భారత ముఖచిత్రంగా మారిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరోసారి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన నీరజ్ చోప్రా తొలి అడ్డంకిని విజయవంతంగా అధిగమించాడు. శుక్రవారం జరిగిన క్వాలిఫయింగ్‌లో నీరజ్ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. తన మొదటి ప్రయత్నంలోనే ఈటెను ఏకంగా 88.77 మీటర్ల దూరం విసిరిన నీరజ్ ఆదివారం జరిగే ఫైనల్‌కు అర్హత సాధించాడు. అంతేకాకుండా పారిస్ ఒలింపిక్స్ అర్హత ప్రమాణాన్ని (85.50 మీటర్లు) కూడా దాటేసి వచ్చే ఏడాది జరిగే విశ్వ క్రీడలకు బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన క్వాలిఫయింగ్‌లో 12 మంది బరిలో ఉన్న గ్రూప్ ‘ఎ’లో నీరజ్ పోటీపడ్డాడు. మైదానంలోని అభిమానులు ఉత్సాహపరుస్తుండగా నీరజ్ జావెలిన్‌ను 88.77 మీటర్ల దూరం విసిరి ఒక్క త్రోతో రెండు లక్ష్యాలను సాధించాడు. జావెలిన్‌ను 83 మీటర్ల దూరం విసిరిన వారు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తారు లేదా టాప్–12లో నిలిచిన వారికి ఫైనల్ చేరే అవకాశం లభిస్తుంది. నీరజ్ తప్ప గ్రూప్ ‘ఎ’ నుంచి మరెవరూ నేరుగా ఫైనల్ చేరలేకపోయారు. గ్రూప్ ‘ఎ’లోనే పోటీపడ్డ మరో భారత అథ్లెట్ డీపీ మనూ (81.31 మీటర్లు)... గ్రూప్ ‘బి’లో బరిలో నిలిచిన కిశోర్ కుమార్ జేనా (80.55 మీటర్లు) కూడా ఫైనల్‌కు చేరారు. ఓవరాల్‌గా మనూ ఆరో స్థానంలో, కిశోర్ తొమ్మిదో స్థానంలో నిలిచారు. ఫలితంగా ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో తొలిసారి ఒకే ఈవెంట్లో ముగ్గురు భారత అథ్లెట్లు ఫైనల్లో పోటీపడనున్నారు. నీరజ్‌తోపాటు అర్షద్ నదీమ్ (పాకిస్తాన్; 86.79 మీటర్లు), జాకుబ్ వాద్లెచ్ (చెక్ రిపబ్లిక్; 83.50 మీటర్లు) మాత్రమే క్వాలిఫయింగ్ మార్క్‌ను అధిగమించి నేరుగా ఫైనల్ చేరారు. డిఫెండింగ్ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా; 78.49 మీటర్లు) ఓవరాల్‌గా 16వ స్థానంలో నిలిచి ఫైనల్ చేరలేకపోయాడు. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా చాంపియన్‌షిప్, టోక్యో ఒలింపిక్స్, డైమండ్ లీగ్ మీట్‌లాంటి ప్రతిష్టాత్మక ఈవెంట్స్‌లో స్వర్ణ పతకాలు గెలిచిన 25 ఏళ్ల నీరజ్ ఖాతాలో ప్రపంచ చాంపియన్‌షిప్ స్వర్ణ పతకం మాత్రమే చేరాల్సి ఉంది. గత ఏడాది అమెరికాలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఈ హరియాణా జావెలిన్ త్రోయర్ రెండో స్థానంలో నిలిచి రజత పతకం గెల్చుకున్నాడు. అంతా అనుకున్నట్లు జరిగితే ఆదివారం జరిగే ఫైనల్లో నీరజ్‌ను ఈసారి విశ్వవిజేతగా చూడవచ్చు. -
వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ ఫైనల్లో నీరజ్.. ఒలింపిక్స్‌కు అర్హత
Neeraj In Javelin Throw Final: వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో ఒలింపియన్, జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా సత్తా చాటాడు. హంగేరిలోని బుడాపెస్ట్‌లో జరుగుతున్న మెగా ఈవెంట్లో ఈ సీజన్లో తన అత్యుత్తమ ప్రదర్శనతో ఫైనల్‌కు అర్హత సాధించాడు. మొదటి ప్రయత్నంలోనే జావెలిన్‌ను 88.77 మీటర్లు విసిరిన నీరజ్ చోప్రా.. ప్యారిస్ ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యాడు. Neeraj Chopra’s first throw of 88.77m propels him straight into the #WACBudapest23 final. 🤩#NeerajChopra #Budapest23 #CraftingVictories 🇮🇳 pic.twitter.com/znGTemijYC — Inspire Institute of Sport (@IIS_Vijayanagar) August 25, 2023 నీరజ్‌తో పాటు డీపీ మను కూడా! ఇక నీరజ్‌తో పాటు మరో భారత జావెలిన్ స్టార్ డీపీ మను కూడా వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ ఫైనల్ రేసులో నిలిచాడు. తొలుత 78.10 మీటర్ల దూరం జావెలిన్ విసిరిన అతడు.. 81.31 మీ.తో ఫినిష్ చేశాడు. తద్వారా గ్రూప్- ఏ నుంచి మూడో స్థానంలో నిలిచాడు. ఈ గ్రూప్‌లో నీరజ్ అగ్రస్థానం కైవసం చేసుకుని 2024లో ప్యారిస్‌లో జరుగబోయే ఒలింపిక్స్‌లో బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు. ఇక వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ ఫైనల్ ఆదివారం జరుగనుంది. అదే అత్యుత్తమం కాగా ఈ సీజన్లో దోహా డైమండ్ లీగ్‌లో భాగంగా నీరజ్ 88.07 మీటర్ల దూరం జావెలిన్ విసిరాడు. తాజాగా బుడాపెస్ట్ ఫీట్‌తో తన గత రికార్డును అధిగమించాడు. కాగా తన కెరీర్లో అత్యుత్తమంగా నీరజ్ చోప్రా.. 89.94 మీటర్లు జావెలిన్ విసిరాడు. స్టాక్‌హోంలో 2022లో జరిగిన డైమండ్ లీగ్‌లో గోల్డెన్ బాయ్ ఈ ఫీట్ సాధించాడు. కాగా టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా స్వర్ణ పతకం సాధించి త్రివర్ణ పతాకాన్ని విశ్వవేదికపై రెపరెపలాడించిన విషయం తెలిసిందే. ప్యారిస్‌లోనూ అదే తీరుగా పసిడి సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. చదవండి: ఈసారి ఆసియా కప్ భారత్‌దే.. కానీ వరల్డ్‌కప్ మాత్రం: టీమిండియా మాజీ సెలక్టర్ -
గోల్డెన్ బోయ్ నీరజ్ చోప్రా కొత్త కారు చూశారా? ధర ఎంతంటే?
Neeraj Chopra buys a new Range Rover Velar ఒలంపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా కొత్త రేంజ్ రోవర్ వెలార్‌ను కొనుగోలు చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలను and Rover Malwa Automotives సోషల్ మీడియాలో షేర్ చేసింది. రూ. 90 లక్షల విలువైన ఈ ఐకానిక్ వాహనాన్ని సొంతం చేసుకున్నాడు. చాలామంది క్రీడాకారుల్లాగానే ఒలంపిక్ సెన్సేషన్ నీరజ్ చోప్రాకు లగ్జరీ కార్లంటే మోజు ఎక్కువు. కొత్త రేంజ్ రోవర్ వెలార్‌తో పాటు, రేంజ్ రోవర్ స్పోర్ట్ , అనేక ఇతర టాప్-టైర్ వాహనాలు అతని గ్యారీజేలో ఉండడం విశేషం. రేంజ్ రోవర్ వెలార్ ఇండియా ప్రారంభ ధర రూ. 78.87 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) అయితే, నీరజ్ చోప్రా చెల్లించిన ఖచ్చితమైన ధర ఇంకా తెలియరాలేదు. (ఓలా ఎస్1 ఎయిర్ లాంచింగ్ బంపర్ ఆఫర్: మూడు రోజులే!) రేంజ్ రోవర్ వెలార్ పలు డ్రైవింగ్ వేరియంట్లలో లభిస్తోంది. లో వేరియంట్ 179 Bhpతో 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ లేదా 250 Bhp తో 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో లాంచ్కాగా, టాప్-ఎండ్ వేరియంట్లు 296 Bhpపవర్, 3.0-లీటర్ V6 టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంటాయి. (అదరగొట్టిన రిలయన్స్ జియో) ఇతర ఫీచర్ల విషయానికి వస్తే..మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, యూజర్ ఫ్రెండ్లీ టచ్‌స్క్రీన్ ఇంటర్ఫేస్తో టచ్ ప్రో డ్యుయో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, హిల్ డిసెంట్ కంట్రోల్, అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్, మెమొరీ ఫంక్షన్‌తో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ,యాక్టివ్ రియర్-లాకింగ్ ఇ-డిఫరెన్షియల్ వంటి ముఖ్యమైన హైలైట్లు ఉన్నాయి. కొత్త పివి ప్రో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ 10-అంగుళాల టచ్‌స్క్రీన్, ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి అధునాతన కనెక్టివిటీ ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి. నీరజ్ చోప్రాతోపాటు,ప్రముఖ నటి కృతి ఖర్బందా, స్టాండ్-అప్ కమెడియన్ జకీర్ ఖాన్ , నటి అవ్నీత్ కౌర్ లాంటి సెలబ్రిటీలు ఈ రేంజ్‌రోవర్ వెలార్‌ను కొనుగోలు చేశారు. అంతుకాదు ప్యాన్ ఇండియా హీరో ప్రభాస్ తన జిమ్ ట్రైనర్‌కు రేంజ్ రోవర్ వెలార్‌ను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. -
నీరజ్ చోప్రా మెరిసె.. వరుసగా రెండో డైమండ్ లీగ్‌లో అగ్రస్థానం
లుసాన్ (స్విట్జర్లాండ్): ఒలింపిక్ చాంపియన్, భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా మరోసారి మెరిశాడు. ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ సిరీస్‌లో భాగంగా తాను బరిలోకి దిగిన రెండో టోర్నీలోనూ అగ్రస్థానాన్ని సంపాదించాడు. లుసాన్‌లో జరిగిన సీజన్‌లోని ఆరో డైమండ్ లీగ్ మీట్లో 25 ఏళ్ల నీరజ్ టైటిల్ గెల్చుకున్నాడు. గాయం కారణంగా నెలరోజులపాటు విశ్రాంతి తీసుకున్న నీరజ్‌కు ఈ మీట్లో ఐదో ప్రయత్నం ప్రదర్శన మొదటి స్థానాన్ని ఖరారు చేసింది. ఐదో ప్రయత్నంలో నీరజ్ జావెలిన్‌ను 87.66 మీటర్ల దూరం విసిరాడు. ‘ఫౌల్ త్రో’తో మొదలుపెట్టిన భారత స్టార్ రెండో ప్రయత్నంలో జావెలిన్‌ను 83.52 మీటర్లు... మూడో ప్రయత్నంలో 85.04 మీటర్లు విసిరాడు. అనంతరం నాలుగో ప్రయత్నం ‘ఫౌల్’కాగా, ఆరో ప్రయత్నంలో జావెలిన్ 84.15 మీటర్ల దూరం వెళ్లింది. జూలియన్ వెబెర్ (జర్మనీ; 87.03 మీటర్లు) రెండో స్థానంలో, జాకుబ్ వాద్లెచ్ (చెక్ రిపబ్లిక్; 86.13 మీటర్లు) మూడో స్థానంలో నిలిచారు. డైమండ్ లీగ్ సిరీస్‌లో భాగంగా మొత్తం ఏడు మీట్లలో జావెలిన్ త్రో ఈవెంట్ ఉంది. ఏడు మీట్ల తర్వాత టాప్–8లో నిలిచిన వారు సెపె్టంబర్ 16, 17 తేదీల్లో అమెరికాలోని యుజీన్‌లో జరిగే గ్రాండ్ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు. లుసాన్ మీట్లో టైటిల్ నెగ్గిన నీరజ్ ప్రస్తుతం 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈనెల 21న మొనాకోలో జరిగే డైమండ్ లీగ్ మీట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్న నీరజ్ ఆగస్టులో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగుతాడు. లుసాన్ డైమండ్ లీగ్ మీట్లో లాంగ్‌జంప్ ఈవెంట్ లో పాల్గొన్న భారత అథ్లెట్ శ్రీశంకర్ 7.88 మీటర్ల దూరం దూకి ఐదో స్థానంలో నిలిచాడు. -
నీరజ్... నంబర్‌వన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ వేదికపై భారత అథ్లెటిక్స్ ముఖచిత్రంగా మారిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తన కెరీర్లో మరో గొప్ప ఘనతను సాధించాడు. సోమవారం విడుదల చేసిన వరల్డ్ అథ్లెటిక్స్ పురుషుల జావెలిన్ త్రో ర్యాంకింగ్స్‌లో నీరజ్ చోప్రా ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు. తద్వారా ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో వరల్డ్ నంబర్‌వన్‌గా అవతరించిన తొలి భారతీయ అథ్లెట్‌గా నీరజ్ గుర్తింపు పొందాడు. ప్రస్తుతం నీరజ్ 1455 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉండగా... ప్రపంచ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా; 1433 పాయింట్లు) రెండో స్థానంలో, జాకుబ్ వాద్లెచ్ (చెక్ రిపబ్లిక్; 1416 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నారు. గత ఐదేళ్లుగా నీరజ్ అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్నాడు. 2017 ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం... 2018 ఆసియా క్రీడల్లో స్వర్ణం... 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం... 2021 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం... 2022 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రజతం... 2022 డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో స్వర్ణం... ఇలా నీరజ్ అంతర్జాతీయ వేదికలపై పతకాల పంట పండిస్తున్నాడు. తాజా సీజన్లో భాగంగా ఈనెలలో దోహాలో జరిగిన డైమండ్ లీగ్ తొలి సిరీస్‌లో నీరజ్ అగ్రస్థానంలో నిలిచాడు. తదుపరి వచ్చే నెలలో ఫిన్లాండ్లో జరిగే పావో నుర్మీ గేమ్స్‌లో నీరజ్ బరిలోకి దిగనున్నాడు.