భారత స్టార్ జావెలియన్ త్రోయర్, హర్యానా అథ్లెట్ నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ అథ్లెటిక్స్ (డబ్ల్యూఏ) హెరిటేజ్ కలెక్షన్స్‌లో అతడి టీ షర్ట్ కొలువు తీరనుంది. వరుస ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన ఏకైక భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌గా నీరజ్ చోప్రా అరుదైన ఘనత సాధించిన విషయం తెలిసిందే. టోక్యోలో స్వర్ణంతో మెరిసిన నీరజ్.. పారిస్‌లో రజతం గెలిచాడు.
తన అద్భుత ఆటతీరుతో జాతి మొత్తాన్ని గర్వపడేలా చేసిన నీరజ్‌కు చెందిన టీషర్ట్ ఇప్పుడు మ్యూజియం ఆఫ్ వరల్డ్ అథ్లెటిక్స్ (ఎమ్‌ఓడబ్ల్యూఏ)లో ‘షో పీస్’ కానుంది. పారిస్ మెగా ఈవెంట్‌లో రజత ప్రదర్శన సమయంలో వేసుకున్న టీషర్ట్‌ను డబ్ల్యూఏ మ్యూజియంకు విరాళంగా ఇచ్చాడు.
కాగా పారిస్‌లో నీరజ్ చోప్రా ఈటెను 89.45 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంతో రజతం గెలుపొందాడు. మరోవైపు పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ (పాక్; 92.97 మీ.) చాంపియన్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే.. నీరజ్‌తో పాటు ఉక్రెయిన్‌కు చెందిన మహిళా అథ్లెట్లు యరోస్లావా మహుచిక్, థియా లాఫొడ్‌ల తీపిగుర్తులు కూడా ఆ హెరిటేజ్ కలెక్షన్‌లో ప్రముఖంగా కనిపించనున్నాయి.
కొన్నేళ్ల పాటు ఈ విజేతల అపురూపాలను ప్రదర్శించాక క్రీడాభిమానులు, ఔత్సాహికులు కోసం సందర్భాన్ని బట్టి వేలం వేస్తారు. ఆ వేలంలో వచ్చిన మొత్తాన్ని సామాజిక సేవల కొరకు వెచ్చించడం తరచూ జరిగేదే!
చదవండి: ‘అతడు కావాలనే ఓడిపోయాడు?’.. అంతర్జాతీయ చెస్ సమాఖ్య స్పందన ఇదే
Comments
Please login to add a commentAdd a comment