ఒలింపిక్ గోల్డ్ మెడల్ కోసం 40 ఏళ్లగా ఎదురుచూస్తున్న పాకిస్తాన్ సుదీర్ఘ నిరీక్షణకు స్టార్ అథ్లెట్ అర్షద్ నదీమ్ తెరదించాడు. ప్యారిస్ ఒలింపిక్స్ జావెలిన్ త్రో ఈవెంట్‌లో బంగారు పతకాన్ని సొంతం చేసుకున్న అర్షద్ నదీమ్.. విశ్వవేదికపై తన జాతీయ జెండాను రెపాలపడించాడు.
గురువారం జరిగిన ఫైనల్లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాను వెనక్కి నెట్టి స్వర్ణ పతకాన్ని ఈ పాకిస్తానీ కైవసం చేసుకున్నాడు. ఏకంగా జావెలిన్‌ను 92.97 మీటర్ల దూరం విసిరిన నదీమ్.. పసిడి పతకంతో పాటు అరుదైన ఒలింపిక్ రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు.
ఇక అర్షద్ గోల్డ్‌మెడల్ సాధించడంతో పాకిస్తాన్ మొత్తం సంబరాల్లో మునిగితేలిపోయింది. ఈ క్రమంలోసిద్ధిఖీ గోల్డెన్ బాయ్ నదీమ్‌కు కరాచీ మేయర్ ముర్తాజా వహాబ్ భారీ నజరానా ప్రకటించారు. సింధ్ ప్రావిన్స్ తరపున రూ.5 కోట్లు(పాకిస్తానీ కరెన్సీ)ను నగదు బహుమతిగా ఇవ్వనున్నట్లు వహాబ్ సిద్ధిఖీ వెల్లడించారు. అదేవిధంగా ఒలింపిక్స్ చరిత్రలోనే పాకిస్తాన్ తరపున వ్యక్తిగత విభాగంలో గోల్డ్‌మెడల్ గెలుచుకున్న తొలి అథ్లెట్ కూడా అర్షద్ కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment