Arshad Nadeem
-
నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం
భారత స్టార్ జావెలియన్ త్రోయర్, హర్యానా అథ్లెట్ నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ అథ్లెటిక్స్ (డబ్ల్యూఏ) హెరిటేజ్ కలెక్షన్స్‌లో అతడి టీ షర్ట్ కొలువు తీరనుంది. వరుస ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన ఏకైక భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌గా నీరజ్ చోప్రా అరుదైన ఘనత సాధించిన విషయం తెలిసిందే. టోక్యోలో స్వర్ణంతో మెరిసిన నీరజ్.. పారిస్‌లో రజతం గెలిచాడు.తన అద్భుత ఆటతీరుతో జాతి మొత్తాన్ని గర్వపడేలా చేసిన నీరజ్‌కు చెందిన టీషర్ట్ ఇప్పుడు మ్యూజియం ఆఫ్ వరల్డ్ అథ్లెటిక్స్ (ఎమ్ఓడబ్ల్యూఏ)లో ‘షో పీస్’ కానుంది. పారిస్ మెగా ఈవెంట్లో రజత ప్రదర్శన సమయంలో వేసుకున్న టీషర్ట్‌ను డబ్ల్యూఏ మ్యూజియంకు విరాళంగా ఇచ్చాడు.కాగా పారిస్‌లో నీరజ్ చోప్రా ఈటెను 89.45 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంతో రజతం గెలుపొందాడు. మరోవైపు పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ (పాక్; 92.97 మీ.) చాంపియన్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే.. నీరజ్‌తో పాటు ఉక్రెయిన్‌కు చెందిన మహిళా అథ్లెట్లు యరోస్లావా మహుచిక్, థియా లాఫొడ్ల తీపిగుర్తులు కూడా ఆ హెరిటేజ్ కలెక్షన్లో ప్రముఖంగా కనిపించనున్నాయి. కొన్నేళ్ల పాటు ఈ విజేతల అపురూపాలను ప్రదర్శించాక క్రీడాభిమానులు, ఔత్సాహికులు కోసం సందర్భాన్ని బట్టి వేలం వేస్తారు. ఆ వేలంలో వచ్చిన మొత్తాన్ని సామాజిక సేవల కొరకు వెచ్చించడం తరచూ జరిగేదే! చదవండి: ‘అతడు కావాలనే ఓడిపోయాడు?’.. అంతర్జాతీయ చెస్ సమాఖ్య స్పందన ఇదే -
విభజన రేఖను చెరిపిన విజేతలు
దేశ విభజనానంతరం ఎన్నో పరిణామాలు సంభవించాయి. గత నలభై ఏళ్లలో – విభజనకు ముందు తరం రాలిపోయింది. రాజకీయాల్లో అనేక మార్పులు వచ్చాయి. బాలీవుడ్ సినిమాలు మునుపటిలా లేవు. అయినప్పటికీ భారత్, పాక్ మనుషులు ఒకేలా ఉన్నారు. ఒకే ఆహారం తీసుకుంటున్నారు. ఒకే ఒక చోట వేరుపడింది ఎక్కడంటే మతంలో! బ్రిటిష్ వాళ్లు గీసిన మ్యాపులో! దాన్ని దాటగలిగేందుకు ‘పంజాబీయత’కు తగినంత బలమే ఉంది. ఆ బలమే... నీరజ్–అర్షద్ ఒకరితో ఒకరు చక్కగా కలిసిపోవటానికి కారణం అయింది. వారి క్రీడ మాత్రమే కాదు, వారి సంస్కృతి కూడా ఆ దగ్గరితనాన్ని నిర్ణయించింది. బరిలో ప్రత్యర్థులైనా పరస్పరం సానుకూలంగా మాట్లాడటం, బాంధవ్యాన్ని పంచుకోవటం అసహజత్వానికి దూరంగా ఉన్నాయి.పంజాబీలు పాకిస్తాన్‌ను ఎలా చూస్తారనే దాని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అది దేశంలోని మిగతా ప్రాంతాలకు భిన్నంగా ఉంటుంది. నిజానికి, బెంగాలీలు బంగ్లాదేశ్‌ను ఎలా చూస్తారనే దానిని అందుకు చాలా దగ్గరి సమాంతరంగా నేను ఊహించుకుంటాను. రెండు రాష్ట్రాలు కూడా విభజన వల్ల తమ దేశాలతో వేరైపోయినప్పటికీ, కోల్పోయిన తమ రెండో సగంతో ఉన్న ఆత్మీయతలు, ఆనాటి అమ్మ ఒడి జ్ఞాపకాలు కొడిగట్టిపోలేదు. కాకపోతే అవి తరాల నుండి తరా లకు సంక్రమిస్తున్నట్లుగా ఉంది. బహుశా అందుకే నీరజ్ చోప్రా–అర్షద్ నదీమ్‌ల కథ దేశంలోని ఇతర ప్రాంతాలకు ప్రాధాన్యత గల వార్త అయితే, పంజాబీలకు అది – ఇందులో వింతేముందన్నంతగా – ఒక మామూలు సంగతి అయింది. నేను మరికాస్త ముందుకు వెళ్లబోయే ముందు, హరియాణా 1966 వరకు కూడా కొన్ని శతాబ్దాలపాటు అవిభక్త పంజాబ్‌లో ఒక ముఖ్యమైన భాగంగా ఉందన్న సంగతిని మీకు గుర్తు చేయనివ్వండి. లాహోర్, లూథియానా మాదిరిగానే అంబాలా, రోహ్తక్ పంజాబీ ప్రాంతాలు. కాబట్టి, నీరజ్–అర్షద్ ఒకరితో ఒకరు చక్కగా కలిసిపోవటంలో ఆశ్చర్యం లేదు. వారి క్రీడ మాత్రమే కాదు, వారి సంస్కృతి కూడా ఆ దగ్గరితనాన్ని నిర్ణయించింది. ఒకరితో ఒకరికి తమ గ్రెనడా, ఐరోపా, అమెరికా సహ–అథ్లెట్ల కంటే ఎక్కువగా ఉమ్మడితనం ఉంది. ఆలింగనం, నవ్వు, ఒకరి గురించి ఒకరు సానుకూలంగా మాట్లాడటం, ఒక బాంధవ్యాన్ని పంచుకోవటం ఇద్దరి మధ్య ఎంతో స్పష్టంగా, అసహజ త్వానికి దూరంగా ఉన్నాయి. ఇలా కాకపోతేనే ఆశ్చర్యం.వారి తల్లుల విషయంలో కూడా ఇది వాస్తవం. వారు తమ కొడు కుతో తలపడిన వారిని ప్రత్యర్థిగా చూడకపోవటానికి కారణం వారు తమ ‘పంజాబీయత’ను అనుభూతి చెందటమే. నిస్సందేహంగా ఇది, వారు మాట్లాడే విధానంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న సారూప్యాన్ని వివరిస్తోంది. ‘‘నేను నీరజ్ కోసం కూడా ప్రార్థిస్తున్నాను’’ అని అర్షద్ తల్లి రజియా పర్వీన్ చెప్పారు. అదే విధంగా నీరజ్ తల్లి సరోజ్ దేవి కూడా ‘‘అతను కూడా నా కుమారుడి లాంటి వాడే’’ అని చెప్పారు. ‘‘బంగారం గెలుచుకున్న అబ్బాయీ మా బిడ్డే, వెండి గెలుచుకున్న అబ్బాయీ మా బిడ్డే’’ అని ఆమె అన్నారు. నేనంటున్న పంజాబీ బాంధవ్యం అనే దాని గురించి మొదట నాకు 1980లో తెలిసింది. నేనప్పుడు లాహోర్‌లో ఉన్నాను. దేశ సరి హద్దుల ఆవలి ఆ తొలి పర్యటనలో నేను అటువైపు చేరుకునే వరకు కూడా పాకిస్థాన్‌ను నేను ఒక పరాయి దేశంగానే చూశాను. నిజంగా పరాయి దేశమే. కానీ అక్కడి ప్రజలైతే కచ్చితంగా పరాయి వారు కాదు. అలాగే వారికి నేను అపరిచితుడినీ కాదు, గ్రహాంతరవాసినీ కాదు. ఒక సాయంత్రం నేను పాత ‘వాప్డా’(వాటర్ అండ్ పవర్ డెవలప్మెంట్ అథారిటీ, పాకిస్తాన్) భవనంలోని సల్లూస్ రెస్టారెంట్లో కూర్చున్నాక, ఆ రెస్టారెంట్లో నేను తప్ప మరొకరు లేకపోవటం గమనించాను. ఒంటరిగానే డిన్నర్ చేసి, త్వరగా బయటికి వెళ్లి పోవటానికి సిద్ధం అయ్యాను. ఎంత పొరపాటు! నేను ఇండియా నుంచి వచ్చిన పంజాబీనని కనిపెట్టిన కొద్ది నిమిషాలకే రెస్టారెంట్ సిబ్బంది నా దగ్గరికి నడుచుకుంటూ వచ్చి మీతో మాట్లాడవచ్చా అని అడిగారు. నేను అంగీకరించగానే నాతో కలిసి కూర్చున్నారు. ఎంపిక చేసిన ఆహారాన్ని నా కోసం తెప్పించారు. లాహోర్‌లో నేను తప్పక చూడవలసిన ప్రదేశాలు ఏమిటో చెప్పారు. వెచ్చగా ఉన్న రోటీలను బలవంతంగా పక్కన పెట్టించి, తాజాగా చేయించిన పొగలు కక్కే రోటీలను నా ప్లేటులో ఒక దాని పైన ఒకటిగా వెడ్డింగ్ కేక్‌ను తలపించేలా ఇంత ఎత్తున సర్వ్ చేయిస్తూనే ఉన్నారు. అయితే నేను ఎప్పటికీ మరచిపోలేనివి మాత్రం వారు నన్ను అడిగిన ప్రశ్నలు. ‘‘మీరెప్పుడైనా జలంధర్‌లోని గల్లీ నంబర్ టెన్‌కి వెళ్లారా? అది మా తల్లితండ్రులు నివసించిన ప్రదేశం’’ అని ఒక ప్రశ్న. ‘‘మీరెప్పుడైనా అమితాబ్ బచ్చన్‌ని, రేఖను కలిశారా? నేను వారిని కలవటానికి ఎంతో ఆసక్తిగా ఉన్నాను’’ అని ఇంకో ప్రశ్న. ‘‘ఇందిరా గాంధీ గురించి చెప్పండి. ఆమె గురించి ప్రతిదీ తెలుసుకోవాలని ఉంది నాకు’’ అని అత్యంత ఆశ్చర్యకరమైన మరొక ప్రశ్న. తమ తల్లితండ్రులు జీవితాన్ని గడిపిన ప్రదేశం గురించి ఆ ప్రదేశం తమది కూడా అన్నంత ఉద్విగ్నంగా, ఉత్సాహంగా వారు ఉన్నారు. భారతదేశం అన్నది వారికి వేరే దేశం అయుండొచ్చు కానీ, వారి తల్లితండ్రులు జన్మించిన ప్రదేశం ఇప్పటికీ తమ ‘ఇల్లే’. అందు వల్ల నేను వారు కోల్పోయిన దేశం నుంచి వెళ్లిన వ్యక్తినే అయినప్పటికీ, వారు మర్చిపోలేని వ్యక్తిని. ‘సల్లూస్’ ద్వారా వారు కనుగొన్న ఒక బాంధవ్య అనుసంధానాన్ని నేను. ఇప్పుడు, 1980 అంటే... నలభై సంవత్సరాలకు పైమాటే. నాటి నుంచి ఎన్నో పరిణామాలు సంభవించాయి. దేశ విభజనకు ముందు తరం రాలిపోయింది. రాజకీయాల్లో మార్పులు వచ్చాయి. అవి మనల్ని ఆకర్షించటం లేదు. బాలీవుడ్ సినిమాలు మునుపటిలా లేవు. అయినప్పటికీ మనం ఒకేలా ఉన్నాం. ఒకే భాష మాట్లాడుతున్నాం. ఒకే ఆహారం తీసుకుంటున్నాం. ఆఖరికి ఒకేలా శాపగ్రస్థులమై ఉన్నాం. ఒకే ఒక చోట వేరుపడింది ఎక్కడంటే మతంలో, బ్రిటిష్ వాళ్లు గీసిన మ్యాపులో! దాన్ని దాటగలిగేందుకు పంజాబీయతకు తగినంత బలమే ఉంది. నీరజ్–అర్షద్‌లు ఒకరికొకరు దగ్గరయ్యేలా చేసింది ఇదే. విదేశాలలో భారతీయులు, పాకిస్తానీలు ఒకరికొకరు – వాళ్లు పంజాబీలు అయినా కాకున్నా – కలివిడిగా ఉండేందుకు కూడా కారణం ఇదే. వారు ఒకరి సమక్షంలో ఒకరు సౌకర్యవంతంగా ఉంటారు. తమ గురించి తాము వివరించాల్సిన అవసరం వారికి లేదు. తమను అర్థం చేసుకుంటారని వారికి తెలుసు. ఉమ్మడి సంస్కృతి విభజన రాజకీ యాల కంటే కూడా శక్తిమంతమైనది. ఇది మన రాజకీయ నాయకు లకు అర్థమైతే బాగుండు!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
‘నదీమ్ రికార్డును బ్రేక్ చేస్తాననుకున్నా’
న్యూఢిల్లీ: పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ రికార్డు బ్రేక్ చేయడం పెద్ద కష్టం కాదనుకున్నానని భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పేర్కొన్నాడు. జావెలిన్ పట్టుకుంటే వంద శాతం ప్రదర్శన ఇవ్వడంపైనే దృష్టి పెడతానని.. అది ఎంత దూరం వెళ్తుందనే దాన్ని పట్టించుకోనని నీరజ్ అన్నాడు. పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం నెగ్గిన నీరజ్.. 90 మీటర్ల మార్కు అందుకోవడం గురించి ఎక్కువ ఆలోచించడం లేదని.. అది ఎప్పుడు జరగాలని రాసిపెట్టి ఉందో అప్పుడే జరుగుతుందని పేర్కొన్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్ స్వర్ణం గెలిచి.. అథ్లెటిక్స్‌లో భారత్ తరఫున తొలి పసిడి గెలిచిన ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కిన నీరజ్.. తాజాగా ‘పారిస్’ క్రీడల్లో గాయంతోనే రజతం గెలిచి అదుర్స్ అనిపించుకున్నాడు. విశ్వ క్రీడల అనంతరం స్విట్జర్లాండ్‌లో శిక్షణ తీసుకుంటున్న నీరజ్‌చోప్రా.. శనివారం ఓ ప్రత్యేక కార్యక్రమంలో పలు అంశాలపై మాట్లాడాడు. ‘మెరుగైన ప్రదర్శన చేసే విధంగా సిద్ధం కావడమే నా చేతిలో ఉంది. 90 మీటర్ల మార్కు అందుకోవడం గురించి ఇప్పటికే ఎక్కువ చర్చ జరిగింది. ఇకపై దాని గురించి ఆలోచించొద్దని అనుకుంటున్నా. రాబోయే రెండు మూడు టోరీ్నల్లో వంద శాతం ప్రయత్నిస్తా.. ఫలితం ఎలా వస్తుందో చూస్తా. పారిస్ పోటీల్లో నదీమ్ విసిరిన దూరాన్ని అందుకోలేనని ఒక్క శాతం కూడా అనిపించలేదు’ అని 26 ఏళ్ల నీరజ్ అన్నాడు. గత ఏడాది ప్రపంచ చాంపియన్íÙప్ నుంచి గజ్జల్లో గాయంతో ఇబ్బంది పడుతున్న నీరజ్.. వచ్చే నెల బ్రస్సెల్స్ డైమండ్ లీగ్ అనంతరం చికిత్స చేయించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా పారిస్ క్రీడల్లో గాయంతోనే బరిలోకి దిగిన నీరజ్.. ఆ ప్రభావం కూడా తన ప్రదర్శనపై పడిందని అన్నాడు. ‘జావెలిన్‌ను మరింత దూరం విసరగలనని అనుకున్నా. పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫికేషన్, ఫైనల్లో నేను వేసిన రెండు త్రోలు నా కెరీర్లో రెండో, మూడో అత్యుత్తమ త్రోలు. అందులో ఒకటి సీజన్ బెస్ట్ కూడా. వంద శాతం కష్టపడితే మెరుగైన ఫలితాలు వస్తాయి. అయితే గాయం భయంతో పూర్తి ఎఫర్ట్ పెట్టనట్లు అనిపించింది. త్రో చేయడానికి ముందు జావెలిన్‌తో పరిగెడుతున్నప్పుడు గజ్జల్లో ఇబ్బందిగా ఉంది. దీంతో పాటు జావెలిన్ వదిలే కోణంపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరముంది. దేశంలో క్రీడల ప్రాముఖ్యత పెరగాలి. ప్రత్యేకంగా ఒక ఆట అని కాకుండా.. అన్నింటిలో ఎదిగితేనే స్పోర్ట్స్ పవర్ హౌస్‌గా మారగలం. క్రికెట్లో మెరుగైన స్థితిలో ఉన్నాం. వచ్చే ఒలింపిక్స్‌లో ఎక్కువ పతకాలు సాధించడంతో పాటు.. ఫిఫా ప్రపంచకప్‌నకు అర్హత సాధించే దిశగా అడుగులు వేయాలి’ అని నీరజ్ వివరించాడు. లుసానే డైమండ్ లీగ్‌లో నీరజ్ ఈ నెల 22 నుంచి లుసానే వేదికగా జరగనున్న డైమండ్ లీగ్‌లో బరిలోకి దిగనున్నట్లు నీరజ్ చోప్రా ప్రకటించాడు. సెప్టెంబర్‌లో జరగనున్న బ్రస్సెల్స్ డైమండ్ లీగ్‌తో సీజన్ ముగియనుండగా.. ఆ తర్వాతే గాయానికి చికిత్స తీసుకోవాలని నీరజ్ భావిస్తున్నాడు. ‘లుసానే లీగ్‌లో పోటీపడాలని నిర్ణయించుకున్నా. మరో నెల రోజుల్లో సీజన్ ముగుస్తుంది. ఆ తర్వాతే చికిత్సపై దృష్టి పెడతా. డైమండ్ లీగ్‌కు ముందు శిక్షణ కోసం స్విట్జర్లాండ్‌కు వచ్చా. వైద్యుల పర్యవేక్షణలో ట్రైనింగ్ సాగుతుంది. ఒకసారి పోటీలు ముగిసిన తర్వాత గాయం గురించి ఆలోచిస్తా’ అని నీరజ్ అన్నాడు. -
గిఫ్ట్‌గా గేదె బదులు.. పొలం ఇవ్వాల్సింది: అర్షద్ నదీమ్
గేదెను బహుమతిగా అందుకోవడం పట్ల పాకిస్తాన్ స్టార్ జావెలిన్ త్రోయర్, ప్యారిస్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అర్షద్ నదీమ్ స్పందించాడు. తనకు పిల్లనిచ్చిన మామ ‘ధనవంతుడని’.. గేదెకు బదులు పొలం ఇచ్చి ఉంటే బాగుండేదని సరదాగా వ్యాఖ్యానించాడు. ఒలింపిక్స్-2024 జావెలిన్ త్రో ఫైనల్లో ఈటెను ఏకంగా 92.97 మీటర్ల దూరం విసిరి ప్రపంచ రికార్డు సృష్టించాడు అర్షద్ నదీమ్.కోట్ల నజరానాపాకిస్తాన్ నలభై ఏళ్ల నిరీక్షణకు తెరదించి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అర్షద్ నదీమ్‌పై కాసుల వర్షం కురిసింది. పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించిన 15 కోట్ల(భారత్ కరెన్సీలో రూ. 4.5 కోట్లు) రూపాయల నజరానా ప్రకటించగా.. పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ సైతం నగదు ప్రోత్సాహకంతో పాటు 92.97 నేమ్ప్లేటుతో ఉన్న కారును అతడికి బహూకరించారు.పొలం ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది!ఈ నేపథ్యంలో అర్షద్ నదీమ్ మామయ్య అతడికి గేదెను బహుమతిగా ఇవ్వడం వార్తల్లో హైలైట్‌గా నిలిచింది. ఈ విషయం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘నిజంగా గేదెనే బహుమతిగా ఇచ్చారు. దానికి బదులు ఓ ఐదెకరాల పొలం ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. అయినా.. పర్లేదు.. బర్రె కూడా తక్కువేమీ కాదు కదా!’’ అంటూ జోక్ చేశాడు నదీమ్.భార్యను ఆటపట్టించిన నదీమ్ఆ సమయంలో అతడి పక్కనే ఉన్న భార్య ఆయేషా స్పందిస్తూ.. ‘‘మా నాన్న ఈయనకు గేదెను గిఫ్ట్‌గా ఇవ్వబోతున్నారని నాకసలు తెలియదు. వార్తల్లో చూసిన తర్వాతే ఈ విషయం తెలిసింది’’ అని పేర్కొంది. ఇందుకు బదులుగా.. ‘‘మీ నాన్న ధనికుడే కదా? మరి నాకు కేవలం గేదెను మాత్రమే ఎందుకు ఇచ్చాడు? 5-6 ఎకరాల పొలం ఇవ్వమని చెప్పాను. అయినప్పటికీ అటువైపు నుంచి ఎటువంటి స్పందనా లేదు’’ అంటూ నదీమ్ తన భార్యను ఆటపట్టించాడు.ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రేమతో ఇచ్చిన బహుమతిని అంతే ప్రేమగా స్వీకరించిన అర్షద్ నదీమ్‌లో హాస్య చతురత కూడా బాగానే ఉందని అతడి అభిమానులు కామెంట్ చేస్తున్నారు. కాగా బలానికి గేదె ప్రతీక అని.. తమ గ్రామ ఆచారం ప్రకారం.. గేదెను బహుమతిగా పొందడాన్ని గౌరవంగా భావిస్తామని అర్షద్ నదీమ్ మామ పేర్కొన్న విషయం తెలిసిందే.ఇక ప్యారిస్ ఒలింపిక్స్‌లో అర్షద్ బంగారు పతకం గెలవగా.. భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రజతంతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే, నీరజ్ ఖాతాలోనూ ఒలింపిక్ స్వర్ణం(టోక్యో) ఉండటం విశేషం.చదవండి: గ్రాండ్ వెల్కమ్.. కన్నీళ్లు పెట్టుకున్న వినేశ్ ఫోగట్( వీడియో)Arshad Nadeem's reaction on his father gifting him a buffalo after winning the Gold medal 😂😂😂He wanted 5-6 acre plot from his father-in-law and not a buffalo. Man, he's so simple 😭❤️ #Paris2024 pic.twitter.com/EzRv68GyAl— Farid Khan (@_FaridKhan) August 16, 2024 -
పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూమ్‌కు గోల్డెన్ బాయ్ నదీమ్..!?
ప్యారిస్ ఒలింపిక్స్ ముగిసి ఐదు రోజులు అవుతున్నప్పటకి స్వర్ణ పతక విజేత, పాకిస్తాన్ స్టార్ అథ్లెట్ అర్షద్ నదీమ్‌పై ఇంకా ప్రశంసల వర్షం కురుస్తునే ఉంది. 40 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌కు తొలి ఒలింపిక్ గోల్డ్‌మెడల్ అందించి ఓవర్‌నైట్ హీరోగా నదీమ్ మరిపోయాడు. అతడిని ఆ దేశ ప్రధాని షాబాజ్ షరీఫ్ సైతం ఘనంగా సత్కరించారు. అంతేకాకుండా నదీమ్‌కు రెండో అత్యున్నత పురస్కారం.. హిలాల్ ఇంతియాజ్ అవార్డును ప్రదానం కూడా చేయనున్నారు.డ్రెస్సింగ్‌కు రూమ్ ఆహ్వానించిన గిల్లెస్పీ...ఈ క్రమంలో పాక్ టెస్టు జట్టు హెడ్ కోచ్ జాసన్ గిల్లెస్పీ గోల్డన్ బాయ్ నదీమ్‌ను తమ డ్రెస్సింగ్ రూమ్‌కు ఆహ్వానించాడు. ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన తొలి పాకిస్తానీ అథ్లెట్ కలవడం ద్వారా తమ క్రికెటర్లు స్ఫూర్తిని పొందుతారని గిల్లెస్పీ అభిప్రాయపడ్డాడు. కాగా పాక్ క్రికెట్ జట్టు తమ స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. ఆగస్టు 21 నుంచి రావల్పిండి వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. మొదటి టెస్టు సందర్భంగా పాక్ డ్రెస్సింగ్ రూమ్‌ను సందర్శించే అవకాశముంది."అర్షద్ నదీమ్‌ని మా డ్రెస్సింగ్ రూమ్‌కు ఆహ్వానించాం. ఒలింపిక్స్ సమయంలో మా క్రికెటర్ల అందరూ నదీమ్‌ని ఉత్సాహపరచడం నేను చూశాను. అతడు తన బంగారు పతకంతో మా డ్రెస్సింగ్ రూమ్‌ను సందర్శిస్తే ఆటగాళ్లలో మరింత పట్టుదల పెరుగుతుంది. మా క్రికెటర్లు అతడిని కచ్చితంగా ఆదర్శంగా తీసుకుంటారు" అని పీసీబీ పోడ్కాస్ట్లో గిల్లెస్పీ పేర్కొన్నాడు -
అర్షద్ నదీమ్‌పై కానుకల వర్షం.. ఘన సత్కారం
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో స్వర్ణ పతకం గెలిచిన పాకిస్తాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్‌ను ఆ దేశ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఘనంగా సత్కరించారు. అతడి కోసం ఇస్లామాబాద్‌లో మంగళవారం విందు ఏర్పాటు చేసిన ఆయన.. నదీమ్ కుటుంబానికి సాదర స్వాగతం పలికారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. కఠిన సవాళ్లతో సావాసం చేయాల్సి వచ్చినా దృఢ సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నదీమ్ నిరూపించాడని కొనియాడారు.రెండో అత్యున్నత పురస్కారంఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన రూ. 15 కోట్ల(భారత్ కరెన్సీలో రూ. 4.5 కోట్లు) చెక్కును ప్రధాని షరీఫ్ నదీమ్‌కు అందించారు. అదే విధంగా.. పాకిస్తాన్‌లోని రెండో అత్యున్నత పురస్కారం.. హిలాల్ ఇంతియాజ్ అవార్డును నదీమ్‌కు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ పసిడి పతక వీరుడి పేరిట ఇస్లామాబాద్‌లోని జిన్నా స్టేడియంలో అర్షద్ నదీమ్ హై పర్ఫామెన్స్ అకాడమీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.దీనితో పాటు క్రీడలను ప్రోత్సహించే క్రమంలో పాక్ కరెన్సీలో ఒక బిలియన్ రూపాయల నిధిని కేటాయిస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రధాని షరీఫ్ పేర్కొన్నారు. కాగా నదీమ్ కుటుంబంతో పాటు అతడి కోచ్ సల్మాన్ ఇక్బాల్ భట్‌ను కూడా ప్రధాని ప్రశంసించారు. అతడి కూడా పాక్ కరెన్సీలో కోటి రూపాయలు నజరానా ఇస్తున్నట్లు తెలిపారు.నదీమ్‌కు కారు 92.97 పంజాబ్ (పాక్) ముఖ్యమంత్రి మరియం నవాజ్ (మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె) నదీమ్ స్వగ్రామానికి వెళ్లి మరీ ప్రోత్సాహకాన్ని చెక్ రూపంలో అందజేశారు. వారి కుటుంబసభ్యులతో ముచ్చటించిన ఆమె ఒలింపిక్ చాంపియన్‌ను తయారు చేసిన కోచ్ సల్మాన్ ఇక్బాల్ భట్‌కూ రూ. 50 లక్షల (రూ.15 లక్షలు) చెక్ ఇచ్చారు.ఈ నెల 8న పారిస్‌లో జరిగిన ఫైనల్ ఈవెంట్లో నదీమ్.. భారత హాట్ ఫేవరెట్ నీరజ్ చోప్రా (89.45 మీటర్లు; రజతం)ను వెనక్కినెట్టి 92.97 మీటర్లతో కొత్త ఒలింపిక్ రికార్డును నెలకొల్పాడు. ఈ ఒలింపిక్ రికార్డు స్కోరుతో కూడిన నేమ్ ప్లేట్ ఉన్న కారును కూడా నదీమ్‌కు ఈ సందర్భంగా బహూకరించారు. -
నీరజ్ చోప్రా తల్లిపై షోయబ్ అక్తర్ ప్రశంసల జల్లు..
భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా తల్లి సరోజ్ దేవి తన మంచి మనసును చాటుకున్న సంగతి తెలిసిందే. ప్యారిస్ ఒలింపిక్స్-2024లో తన కొడుకు బంగారు పతకాన్ని తృటిలో చేజార్చుకునప్పటకి ఆమె మాత్రం ఏ మాత్రం దిగులు చెందలేదు.పసిడి పతకం సొంతం చేసుకున్న పాకిస్తాన్ స్టార్ అథ్లెట్‌పై సరోజ్ దేవి ప్రశంసల వర్షం కురిపించారు. అర్షద్‌ను కూడా తన కొడుకులాంటివాడని.. వారిద్దరు పోటీపడుతుంటే చూడముచ్చటగా ఉంటుందని ప్రేమను చాటుకున్నారు. ఈ క్రమంలో నీరజ్ తల్లి చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం షోయబ్ అక్తర్ మనసును హత్తుకున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఆమె తల్లి ప్రేమని అక్తర్ కొనియాడాడు. " ఎవరో స్వర్ణం పతకం సాధిస్తే.. అతడు కూడా మా కుమారుడే అని ఆమె చెప్పారు. ఇలా చెప్పడం ఒక తల్లికి మాత్రమే సాధ్యం. నిజంగా ఇదొక అద్భుతమని" ఎక్స్‌లో అక్తర్ రాసుకొచ్చాడు. కాగా ప్యారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా రజత పతకం సాధించాడు. జావెలిన్ త్రో ఫైనల్లో ఈటెను 89.45 మీటర్లు విసిరి రెండో స్ధానంలో నిలిచిన నీరజ్.. వరుసగా రెండో ఒలిపింక్ పతకాన్ని ముద్దాడాడు. అయితే అర్షద్ నదీమ్ బంగారు పతకాన్ని సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఫైనల్లో ఏకంగా జావెలన్ రికార్డు స్ధాయిలో 92.97 మీటర్ల దూరం విసిరి గోల్డ్‌మెడల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. -
Paris Olympics 2024: పతకమేదైనా తల్లికి బంగారమే
పోటీ అనేది ఆట వరకే పరిమితం. ఆ తరువాత అంతా మనం మనం’ అని చెప్పడానికి చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా... స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా తల్లి సరోజ్ దేవి పాకిస్తాన్ జావెలిన్ త్రో ప్లేయర్ అర్షద్ నదీమ్ గురించి, అర్షద్ నదీమ్ తల్లి రజీయా పర్వీన్ నీరజ్ చోప్రా గురించి ప్రశంసాపూర్వకంగా మాట్లాడిన మాటలు క్రీడా స్ఫూర్తికి అద్దం పట్టాయి.స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌లో రజతం గెల్చుకున్నాడు. అయితే ఆయన గెలుచుకున్న రజతం చాలామందికి సంతోషాన్ని ఇవ్వలేదు. అద్భుత శక్తిసామర్థ్యాలు ఉన్న, ఎంతో ఘన చరిత్ర ఉన్న నీరజ్ చోప్రా స్వర్ణ పతకం సొంతం చేసుకోకపోవడం చాలామందిని నిరాశ పరిచింది.మరోవైపు పాకిస్తాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ స్వర్ణం గెలుచుకున్నాడు.‘అర్షద్ నదీమ్ కూడా నా కుమారుడిలాంటివాడే’ అని స్పందించింది నీరజ్ చోప్రా తల్లి సరోజ్ దేవి. ఆ అమ్మ మాటను ప్రపంచం మెచ్చింది.పాకిస్తాన్‌కు చెందిన క్రీడాకారుడిని సరోజ్ దేవి మెచ్చుకోవడం కొద్దిమందికి నచ్చకపోయినా, వారిని ఉద్దేశించి నీరజ్ చోప్రా వివరణ ఇచ్చినా...స్థూలంగా ఆమె మాటలు అర్షద్ నదీమ్ గెలుచుకున్న బంగారం పతకం కంటే విలువైనవి.‘మా వాడు బంగారం పతకంతో వస్తాడనుకుంటే రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది’ అని నిట్టూర్చలేదు సరోజ్ దేవి.‘రజతం అయినా బంగారం అయినా ఒక్కటే. ఇద్దరూ నా బిడ్డలే’ అన్నది.ఆమె మాటలు ప్రధాని నరేంద్ర మోదీకీ నచ్చాయి. ఆమె సహృదయతను ప్రశంసించారు.మరో వైపు చూస్తే... ‘నీరజ్ నా కుమారుడిలాంటివాడు. అతడి కోసం ప్రార్థిస్తాను. నీరజ్ ఎన్నో పతకాలు గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటోంది అర్షద్ నదీమ్ తల్లి రజియా పర్వీన్.‘నా బిడ్డ తప్ప ఇంకెవరైనా బంగారు పతకం గెలుచుకోగలరా!’ అని బీరాలు పోలేదు. ఒకవైపు కుమారుడి చారిత్రక విజయానికి సంతోషిస్తూనే మరోవైపు నీరజ్ చో్ప్రా ప్రతిభను వేనోళ్ల పొగిడింది. పాకిస్తాన్, పంజాబ్‌లోని ఖనేవాల్ జిల్లాకు చెందిన అర్షద్ నదీమ్ కుటుంబం నీరజ్ చో్ప్రాను తమ ఇంటికి ఆహ్వానించింది.పోటీలకు అతీతంగా అర్షద్, నీరజ్‌లు ఒకరినొకరు ప్రశంసించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి,.‘ఆటకు సంబంధించి ఎలా ఉన్నా మేము మంచి స్నేహితులం, అన్నదమ్ములం... అని అర్షద్ నాతో ఎన్నోసార్లు చె΄్పాడు’ అంటుంది రజియా పర్వీన్.‘నీరజ్ మా కుటుంబంలో ఒకరు. అతను పాకిస్తాన్‌కు వస్తే ఎయిర్ పోర్ట్ నుంచి మా ఇంటికి ఊరేగింపుగా తీసుకువస్తాం’ అంటున్నాడు పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అర్షద్ నదీమ్ సోదరుడు షాహీద్ అజీమ్.ఇద్దరు మిత్రులునీరజ్ చోప్రాకు కుటుంబసభ్యులతో కలిసి కూర్చొని హాయిగా కబుర్లు చెప్పుకోవడం అంటే ఇష్టం. పండగలు వస్తే చాలు మిఠాయిల పని పట్టాల్సిందే. ఆ తరువాత బరువు పని పట్టాల్సిందే.‘ఆటగాడికి కుటుంబ మద్దతు చాలా ముఖ్యం’ అంటాడు నీరజ్. ‘ఆటల్లో తొలి అడుగు వేసినప్పటి నుంచి ఇప్పటివరకు కుటుంబం నాకు మద్దతుగా ఉంది. నా వెనుక నా కుటుంబం ఉన్నది అనే భావన ఎంతో శక్తిని ఇస్తుంది’ అంటాడు నీరజ్. ‘నేను’ అనే అహం నీరజ్‌లో కనిపించదు. ఎదుటివారి ప్రతిభను ప్రశంసించకుండా ఉండలేడు. ముఖాముఖీగా, మీడియా ముఖంగా అర్షద్ నదీమ్‌ను ఎన్నోసార్లు ప్రశంసించాడు నీరజ్ చోప్రా. అందుకే అతడంటే నదీమ్‌కు చాలా ఇష్టం.ఇక నదీమ్ గురించి చె΄్పాలంటే అతడు ఇంట్రావర్ట్. తక్కువగా మాట్లాడుతాడు. సాధారణ కుటుంబంలో పుట్టిన నదీమ్‌కు ఆర్థిక భారం ఎన్నోసార్లు అతడి దారికి అడ్డుగా నిలబడేది. స్నేహితులు, సన్నిహితులు అతడి విదేశీ టోర్నమెంట్లకు సంబంధించి ప్రయాణ, ఇతర ఖర్చులకు డబ్బును సమకూర్చేవారు. టోక్యో ఒలింపిక్స్‌కు సంబంధించి నదీమ్‌కు పాక్ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లభించలేదు. ప్యారిస్ ఒలింపిక్స్‌కు ఇంకా కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. పాత జావెలిన్తోప్రాక్టిస్ చేయడం కష్టంగా ఉంది’ అంటూ సాగిన నదీమ్ సోషల్ మీడియా పోస్ట్ ఎంతోమంది దృష్టిని ఆకర్షించింది. నీరజ్ చో్ప్రా కూడా అర్షద్ నదీమ్‌కు మద్దతుగా మాట్లాడాడు. -
అర్షద్ నదీమ్‌పై కాసుల వర్షం.. 10 కోట్ల భారీ నజరానా
ప్యారిస్ ఒలింపిక్స్‌లో పసిడి పతకం సాధించిన పాకిస్తాన్ అథ్లెట్, బల్లెం వీరుడు అర్షద్ నదీమ్‌పై కాసుల వర్షం కురుస్తోంది. పంజాబ్ ప్రావిన్స్ రాష్ట్రం ముఖ్యమంత్రి మరియం నవాజ్ (మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె) ఒలింపిక్ చాంపియన్‌కు పాకిస్తాన్ కరెన్సీలో రూ. 10 కోట్లు (భారత కరెన్సీలో రూ. 3 కోట్లు) నజరానా ప్రకటించారు. ఇప్పటికే కరాచీ మేయర్ ముర్తాజా వహాబ్ సైతం రూ. 5 కోట్లు (భారత కరెన్సీలో రూ. 1.50 కోట్లు) నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కాగా గురువారం(ఆగస్టు 8) ఆర్ధరాత్రి జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో ఈటెను 92.97 మీటర్ల దూరం విసిరిన అర్షద్.. తొలి ఒలింపిక్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.తద్వారా ఒలింపిక్స్ చరిత్రలో పాక్ తరపున వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం సాధించిన తొలి అథ్లెట్‌గా నదీమ్ నిలిచాడు. కాగా ఈ పోటీల్లో రెండో స్ధానంలో నిలిచిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నిరజ్ చోప్రా రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. -
అర్షద్ కూడా మా బిడ్డ లాంటివాడే: నీరజ్ చోప్రా తల్లిదండ్రులు
ప్యారిస్ ఒలింపిక్స్-2024లోస్వర్ణ పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. రజతంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ ఈవెంట్లో.. నీరజ్ ఈ సీజన్లోనే అత్యుత్తమగా ఈటెను 89.45 మీటర్లు విసిరాడు. అయితే.. ఆది నుంచి నీరజ్‌కు గట్టిపోటీగా భావించిన పాకిస్తాన్ ప్లేయర్ అర్షద్ నదీమ్ అనూహ్య రీతిలో బల్లాన్ని ఏకంగా 92.97 మీటర్ల దూరం విసిరి సంచలనం సృష్టించాడు.ఒలింపిక్ రికార్డు తన అద్భుత ప్రదర్శనతో ఒలింపిక్ రికార్డు నెలకొల్పి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఫలితంగా రెండో స్థానానికే పరిమితమైన నీరజ్‌కు సిల్వర్ మెడల్ దక్కింది. అయితే, చాలా మంది వీరిద్దరి మధ్య పోటీని ఇండియా వర్సెస్ పాకిస్తాన్‌గా అభివర్ణించారు. కానీ.. ఇలాంటి పోలికలు సరికావని అంటున్నారు నీరజ్ చోప్రా తల్లిదండ్రులు. మా బిడ్డ లాంటివాడేఅర్షద్ను కూడా తమ బిడ్డలాగే భావిస్తామని.. వారిద్దరు పోటీపడుతుంటే చూడముచ్చటగా ఉంటుందని ప్రేమను చాటుకున్నారు. ‘‘ఫైనల్ చూస్తున్నపుడు మేమేమీ కంగారుపడలేదు. మా పిల్లలు అక్కడ పోటీపడినట్లుగా అనిపించింది. మనకు స్వర్ణం వచ్చిందా.. రజత పతకం వచ్చిందా అన్నది ముఖ్యం కాదు. అక్కడున్నవాళ్లంతా ఎంతో కష్టపడి వచ్చినవారే. అయితే, వారిలో వీళ్లిద్దరు అద్భుతంగా ఆడారు’’ అని నీరజ్ చోప్రా తల్లి సరోజ్ దేవి నీరజ్, అర్షద్ నదీమ్‌పై ప్రశంసలు కురిపించారు. తమ కుమారుడు గాయాల పాలయ్యాడని.. అతడు సాధించిన ఈ వెండి పతకం కూడా పసిడితో సమానమని పేర్కొన్నారు.ఎలాంటి శత్రుత్వం లేదుఇక నీరజ్ వాళ్ల ఆంటీ మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ దాయాదుల పోరు అనే చర్చకు తావులేదు. ఇది కేవలం ఆటగాళ్ల మధ్య పోటీ మాత్రమే. నదీమ్‌తో తనకు ఎలాంటి శత్రుత్వం లేదని నీరజ్ ఇప్పటికే స్పష్టం చేశాడు. నిజానికి అర్షద్ నదీమ్.. కాంపిటీషన్లకు వెళ్తున్నపుడు మేము అతడి కోసం కూడా ప్రార్థిస్తాం. మీడియా వేదికగా నదీమ్ తల్లిదండ్రులకు మేము ఈ విషయం చెప్పేందుకు సంతోషిస్తున్నాం. అతడు ఎల్లప్పుడూ బాగుండాలని మేము కోరుకుంటాం’’ అని పేర్కొన్నారు.ఆ రెండు కలిసి వచ్చాయిఅదే విధంగా.. నీరజ్ చోప్రా తండ్రి సతీశ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘అర్షద్ నదీమ్ కూడా అత్యుత్తమ ప్రతిభ కలిగిన ఆటగాడు. అతడు పడ్డ కష్టానికి ప్యారిస్ ఒలింపిక్స్‌లో ఫలితం దక్కింది. దీనిని మనం ఇండియా వర్సెస్ పాకిస్తాన్‌గా చూడకూడదు. ప్రపంచవ్యాప్తంగా అందరు ఆటగాళ్లు అక్కడ పోటీపడ్డారు. ఈరోజు నదీమ్‌ది. హార్డ్‌వర్క్‌తో పాటు అదృష్టం కూడా అతడికి కలిసి వచ్చింది.ఫలితాలు కూడా ఈ రెండింటి కలయికగానే ఉంటాయి’’ అని అన్నారు. ఎన్డీటీవీతో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఓ ఆటగాడి తల్లిదండ్రులుగా తాము ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుందని.. ఒక్కోసారి కొడుకు కళ్లారా చూసుకునే సమయం కూడా ఉండదని ఉద్వేగానికి లోనయ్యారు.చదవండి: #Arshad Nadeem: కూలీ కొడుకు.. ఒక్కపూట తిండిలేక పస్తులు.. ఒలింపిక్ వీరుడిగా -
కూలీ కొడుకు.. ఒక్కపూట తిండిలేక పస్తులు.. ఒలింపిక్ వీరుడిగా
ఆ దేశ జనాభా సుమారు 25 కోట్లు. కానీ విశ్వక్రీడలైన ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు కేవలం ఏడుగురు అథ్లెట్లు మాత్రమే ఆ దేశం నుంచి ప్యారిస్ గడ్డపై అడుగుపెట్టారు. ఆ కొద్దిమందికి కూడా ఆర్థిక సహాయం అందించలేని దుస్థితి ఆ దేశానిది. అయితే వారిలో ఓ అథ్లెట్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. ఒలింపిక్స్‌లో 40 ఏళ్లగా అందని ద్రాక్షగా ఊరిస్తున్న పసిడి పతకాన్ని గెలిచి తమ దేశ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు. తన విజయంతో కష్టాలతో కొట్టిమిట్టాడుతున్న దేశ ప్రజల్లో ఆనందాన్ని నింపాడు. అతడే పాకిస్తాన్ బల్లెం వీరుడు అర్షద్ నదీమ్. ప్యారిస్ ఒలింపిక్స్-2024లో జావెలిన్ త్రో ఈవెంట్లో పసిడి పతకాన్ని నదీమ్ సొంతం చేసుకున్నాడు. గురువారం జరిగిన ఫైనల్లో ఏకంగా జావెలిన్‌ను 92.97 మీటర్ల దూరం ఈటెను విసిరి గోల్డ్‌మెడల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ విశ్వవేదికపై సత్తాచాటిన నదీమ్ తన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. నదీమ్ జర్నీ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం.1ఎవరీ అర్షద్ నదీమ్?27 ఏళ్ల నదీమ్ జనవరి 2, 1997న పంజాబ్ ప్రావిన్స్‌లో ఖనేవాల్ అనే గ్రామంలో జన్మించాడు. నదీమ్‌కు ఏడుగురు తోబుట్టువులు ఉన్నారు. అందులో అతడు మూడోవాడు. నదీమ్ తండ్రి భవన నిర్మాణ కార్మికుడు. అతడొక్కడే ఆ కుటుంబానికి జీవనాధారం. దీంతో ఒకకానొక సమయంలో తిండికి కూడా నదీమ్ ఇబ్బంది పడిన దుస్థితి.కానీ నదీమ్ లక్ష్యానికి తన పేదరికం అడ్డు రాలేదు. తన చిన్నతనం నుంచే క్రీడాకారుడు కావాలని కలలు కన్నాడు. స్కూల్ డేస్‌లోనే క్రికెట్, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్,అథ్లెటిక్స్ వంటి క్రీడలలో సత్తాచాటేవాడు. ముఖ్యంగా నదీమ్‌కు క్రికెట్ అంటే మక్కువ ఎక్కువ. క్రికెట్‌పై అతడి అభిరుచి జిల్లా స్ధాయిలో ఆడేలా చేసింది.నదీమ్ క్రికెట్‌తో పాటు అథ్లెటిక్స్ పోటీల్లో కూడా చురుగ్గా పాల్గొనేవాడు. ఈ క్రమంలో ఓ అథ్లెటిక్స్ ఈవెంట్లో జావెద్ ప్రదర్శనకు కోచ్ రషీద్ అహ్మద్ సాకీ ఫిదా అయిపోయాడు. దీంతో అతడిని అథ్లెట్‌గా తీర్చిదిద్దాలని అహ్మద్ సాకీ నిర్ణయించుకున్నాడు. జావెలిన్ త్రోపై దృష్టి పెట్టడానికి ముందు నదీమ్ షాట్ పుట్, డిస్కస్ త్రోను ప్రాక్టీస్ చేసేవాడు.ఆ తర్వాత పూర్తిస్ధాయిలో జావెలిన్ త్రోయర్‌గా నదీమ్ మారాడు. వరుసగా పంజాబ్ యూత్ ఫెస్టివల్స్‌లో బంగారు పతకాలు, ఇంటర్-బోర్డ్ మీట్లతో సహా జాతీయ స్ధాయిలో సత్తాచాటాడు. అతడు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సర్వీస్ అథ్లెటిక్స్ జట్ల నుండి ఆఫర్లు వచ్చాయి. అయినప్పటికీ ఆర్ధికంగా అర్షద్ నదీమ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. సరిగ్గా ఇదే సమయంలో 2016లో అతడికి వరల్డ్ అథ్లెటిక్స్ నుండి స్కాలర్షిప్ వచ్చింది.దీంతో మారిషస్‌లోని ఐఏఏఎఫ్ (IAAF) హై పెర్ఫార్మెన్స్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందేందుకు అవకాశం నదీమ్‌కు లభించింది. ఇదే అతడి కెరీర్‌కు టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత 2018 ఆసియా క్రీడల్లో కాంస్యం పతకం గెలిచి తన పేరును ప్రపంచానికి పరిచయం చేసుకున్నాడు. అనంతరం అతడికి కొన్ని ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ తన ప్రయాణాన్ని మాత్రం నదీమ్ కొనసాగించాడు.2022 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం, 2023 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ఏకంగా ఒలింపిక్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించి తన కలను సాకారం చేసుకున్నాడు. ఒలింపిక్స్ చరిత్రలో పాక్ తరపున వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం సాధించిన తొలి అథ్లెట్‌గా నదీమ్ నిలిచాడు.అదేవిధంగా జావెలిన్‌ను 92.97 మీటర్ల విసిరిన నదీమ్.. ఒలింపిక్స్‌లో ఈటెను అత్యధిక దూరం విసిరిన అథ్లెట్‌గా నిలిచాడు. అయితే నదీమ్ ఒలింపిక్స్ బంగారు పతక విజేతగా నిలవడంలో అతడి గ్రామ ప్రజల సాయం మరవలేనది. చాలా సందర్భాల్లో అతడికి ఖనేవాల్ ప్రజలు ఆర్ధికంగా సహాయం చేసి పోటీల్లో పాల్గొనేలా తోడ్పడ్డారు. -
ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్.. అర్షద్ నదీమ్‌కు భారీ నజరానా ప్రకటించిన పాక్
ఒలింపిక్ గోల్డ్ మెడల్ కోసం 40 ఏళ్లగా ఎదురుచూస్తున్న పాకిస్తాన్ సుదీర్ఘ నిరీక్షణకు స్టార్ అథ్లెట్ అర్షద్ నదీమ్ తెరదించాడు. ప్యారిస్ ఒలింపిక్స్ జావెలిన్ త్రో ఈవెంట్లో బంగారు పతకాన్ని సొంతం చేసుకున్న అర్షద్ నదీమ్.. విశ్వవేదికపై తన జాతీయ జెండాను రెపాలపడించాడు. గురువారం జరిగిన ఫైనల్లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాను వెనక్కి నెట్టి స్వర్ణ పతకాన్ని ఈ పాకిస్తానీ కైవసం చేసుకున్నాడు. ఏకంగా జావెలిన్‌ను 92.97 మీటర్ల దూరం విసిరిన నదీమ్.. పసిడి పతకంతో పాటు అరుదైన ఒలింపిక్ రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు.ఇక అర్షద్ గోల్డ్‌మెడల్ సాధించడంతో పాకిస్తాన్ మొత్తం సంబరాల్లో మునిగితేలిపోయింది. ఈ క్రమంలోసిద్ధిఖీ గోల్డెన్ బాయ్ నదీమ్‌కు కరాచీ మేయర్ ముర్తాజా వహాబ్ భారీ నజరానా ప్రకటించారు. సింధ్ ప్రావిన్స్ తరపున రూ.5 కోట్లు(పాకిస్తానీ కరెన్సీ)ను నగదు బహుమతిగా ఇవ్వనున్నట్లు వహాబ్ సిద్ధిఖీ వెల్లడించారు. అదేవిధంగా ఒలింపిక్స్ చరిత్రలోనే పాకిస్తాన్ తరపున వ్యక్తిగత విభాగంలో గోల్డ్‌మెడల్ గెలుచుకున్న తొలి అథ్లెట్ కూడా అర్షద్ కావడం విశేషం. -
చరిత్ర సృష్టించిన అర్షద్ నదీమ్.. ఒలింపిక్స్ హిస్టరీలోనే
ప్యారిస్ ఒలింపిక్స్‌లో పాకిస్తాన్ స్టార్ అథ్లెట్ అర్షద్ నదీమ్ పసడి పతకంతో మెరిశాడు. జావెలిన్ త్రో ఈవెంట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన అర్షద్ నదీమ్ స్వర్ణపతకం కైవసం చేసుకుని అందరిని ఆశ్చర్యపరిచాడు. గురువారం ఆర్ధ రాత్రి దాటాక జరిగిన ఫైనల్లో తన జావెలిన్‌ను 92.97 మీటర్లు విసిరిన జావెద్ ..తొలి ఒలింపిక్స్ గోల్డ్‌మెడల్‌ను ముద్దాడాడు. ఫైనల్లో 27 ఏళ్ల జావెద్ భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాను వెనక్కినెట్టి అగ్రస్ధానాన్ని కైవసం చేసుకున్నాడు. నీరజ్ చోప్రా జావెలిన్‌ను 89.45 మీటర్లు విసిరి రజత పతకం సొంతం చేసుకున్నాడు. అదే విధంగా ప్రపంచ మాజీ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా) 88.54 మీటర్లతో కాంస్య పతకాన్ని సాధించాడు.చరిత్ర సృష్టించిన అర్షద్ నదీమ్..ఇక ఈ విశ్వక్రీడల్లో అర్షద్ నదీప్ గోల్డ్‌మెడల్‌తో పాటు మరో అరుదైన రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఒలింపిక్స్‌లో జావెలిన్‌ను అత్యధిక దూరం విసిరిన భల్లెం వీరుడుగా అర్షద్ రికార్డులకెక్కాడు. గతంలో ఈ రికార్డు నార్వేకు చెందిన ఆండ్రియాస్ పేరిట ఉండేది. బీజింగ్ 2008 ఒలింపిక్స్‌లో ఆండ్రియాస్ 90.57 మీటర్లు విసిరి ఈ ఫీట్ సాధించాడు. అయితే ప్యారిస్ ఒలింపిక్స్‌లో 92.97 మీటర్లు విసిరిన జావెద్ ఆండ్రియాస్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. అదేవిధంగా ఒలింపిక్స్ చరిత్రలోనే పాకిస్తాన్ తరపున వ్యక్తిగత విభాగంలో గోల్డ్‌మెడల్ గెలుచుకున్న తొలి అథ్లెట్‌గా అర్షద్ నిలిచాడు. ARSHAD NADEEM REWRITES OLYMPIC HISTORY WITH 9️⃣2️⃣.9️⃣7️⃣ Catch him in the Javelin final LIVE NOW on #Sports18 and stream for FREE on #JioCinema https://t.co/4IZVAsktjp#OlympicsOnJioCinema #OlympicsOnSports18 #Olympics #JavelinThrow #Athletics pic.twitter.com/5gP5iRHgph— JioCinema (@JioCinema) August 8, 2024 -
195 దేశాలు.. 2100 మంది అథ్లెట్లు! చరిత్రకెక్కిన నీరజ్, అర్షద్..
World Athletics Championships 2023 Medal Tally: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పతకాల పట్టికలో భారత్ 18 స్థానంలో నిలిచింది. ఒక్కో స్వర్ణ పతకం గెలిచిన బహ్రెయిన్, బుర్కినా ఫాసో, డొమినికన్ రిపబ్లిక్, వెనిజులా, సెర్బియా దేశాలతో కలిసి భారత్ సంయుక్తంగా 18వ ర్యాంక్ సాధించింది. ప్రపంచ చాంపియన్‌షిప్-2022లో జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా రజత పతకం కారణంగా భారత జట్టు మరో ఐదు దేశాలతో కలసి సంయుక్తంగా 33వ స్థానంలో నిలిచింది. ఈసారి మన బంగారు కొండ నీరజ్ చోప్రా రజతాన్ని స్వర్ణంగా మార్చి దేశానికి గర్వకారణమయ్యాడు. చరిత్రకెక్కిన నీరజ్, అర్షద్ నదీం హంగేరీలోని బుడాపెస్ట్‌లో ఆదివారం జరిగిన జరిగిన జావెలిన్ త్రో ఫైనల్స్‌లో అత్యధికంగా 88.17 మీటర్ల దూరం ఈటెను విసిరాడు. పోటీలో ప్రథమ స్థానంలో నిలిచి ప్రపంచ చాంపియన్‌గా అవతరించాడు. ఇక దాయాది పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీం 87.82 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి నీరజ్ తర్వాతి స్థానం దక్కించుకున్నాడు. రజత పతకం గెలిచి తొలిసారి పాక్‌కు మెడల్ అందించిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఈ విషయాలు తెలుసా! ఇప్పటి వరకు 19 సార్లు ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు జరిగాయి. ఈసారీ అమెరికా తమ ఆధిపత్యాన్ని చాటుకుంటూ పతకాల పట్టికలో 15వసారి అగ్రస్థానంలో నిలిచింది. అమెరికా 12 స్వర్ణాలు, 8 రజతాలు, 9 కాంస్యాలతో మొత్తం 29 పతకాలతో టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. ఈసారి ప్రపంచ చాంపియ న్షిప్లో పాల్గొన్న దేశాలు 195. మొత్తం 2100 మంది అథ్లెట్లు పోటీపడ్డారు. 120 దేశాల నుంచి నాలుగు లక్షల మంది ప్రేక్షకులు వచ్చి ఈ మెగా ఈవెంట్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు. తాజా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కనీసం ఒక్క పతకమైనా సాధించిన దేశాలు 46. జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ రజత పతకంతో ఈ పోటీల చరిత్రలో తొలిసారి పాకిస్తాన్ ఖాతాలో తొలి పతకం చేరింది. చదవండి: ఇష్టాయిష్టాలతో పనిలేదు.. ఆరోజు యువరాజ్ సింగ్ నన్ను ఓదార్చాడు: రోహిత్ -
ఈ సిల్వర్ మెడల్ పసిడి కంటే ఎక్కువ.. వసీం అక్రం పోస్ట్! సెల్ఫ్ గోల్..
Neeraj Chopra- Arshad Nadeem- Wasim Akram's 'Worth More Than A Gold': వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి మరోసారి మువ్వన్నెల జెండాను ప్రపంచ వేదికపై రెపరెపలాడించాడు గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా. నాలుగు దశాబ్దాల భారతీయుల కలను నిజం చేస్తూ ఈ జావెలిన్ త్రో స్టార్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచ చాంపియన్‌గా అవతరించి భారతావని ప్రశంసలు అందుకుంటున్నాడు. కాగా హంగేరీలోని బుడాపెస్ట్‌లో ఆదివారం జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో.. నీరజ్ రెండో ప్రయత్నంలో అత్యధికంగా 88.17 మీటర్ల దూరం బల్లాన్ని విసిరి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే, ఇదే ఈవెంట్లో పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీం 87.82 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి రజతం దక్కించుకున్నాడు. అర్షద్‌ను పిలిచి మరీ ఫొటో దిగిన నీరజ్ ఇదిలా ఉంటే దాయాది దేశాలకు చెందిన నీరజ్, అర్షద్ పరస్పరం అభినందనలు తెలుపుకొంటూ సన్నిహితంగా మెలిగిన తీరు క్రీడాభిమానులను ఆకర్షించింది. ముఖ్యంగా ఫొటో దిగేందుకు నీరజ్.. అర్షద్‌ను పిలవడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రం మాత్రం తన పోస్ట్‌తో విమర్శల పాలయ్యాడు. అర్షద్ సిల్వర్ మెడల్ సాధించడాన్ని కొనియాడిన వసీం అక్రం.. ‘‘టేక్ ఏ బో అర్షద్ నదీం.. నీ రజత విజయం నేపథ్యంలో పాకిస్తాన్ మొత్తం సంబరాలు చేసుకుంటోంది. వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నువ్వు సాధించిన సిల్వర్ మెడల్ పసిడి పతకం కంటే ఎక్కువే! ఎందుకిలా అంటున్నానంటే.. మిగతా అథ్లెట్లతో పోలిస్తే నీకు అరకొర సౌకర్యాలే ఉన్నాయి. అయినా నువ్వు ఇక్కడిదాకా చేరుకున్నావు. క్రికెట్ కాకుండా మరో క్రీడను కూడా దేశ ప్రజలు సెలబ్రేట్ చేసుకునే అవకాశమిచ్చావు’’ అని తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చాడు. సెల్ఫ్ గోల్.. అభిమానుల నుంచి విమర్శలు ఈ నేపథ్యంలో.. సొంత అభిమానుల నుంచే వసీం అక్రం విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ‘‘సరైన సౌకర్యాలు లేవని నువ్వే చెప్తున్నావు. క్రికెటర్‌గా బాగానే సంపాదించావు కదా! అర్షద్‌కు కావాల్సిన ఆర్థిక సాయం అందించవచ్చు కదా!’’ అని కామెంట్లు చేస్తున్నారు. ఇక నీరజ్ చోప్రా అభిమానులు.. ‘‘నీరజ్, అర్షద్ అన్నదమ్ముల్లా బాగానే కలిసిపోయారు. నువ్వు మాత్రం ఇలా బుద్ధి చూపించావు’’ అంటూ బౌలింగ్ లెజెండ్ వసీం అక్రంపై ఫైర్ అవుతున్నారు. చదవండి: WC 2023: వరల్డ్‌కప్ జట్టులో అయ్యర్‌కు నో ఛాన్స్! అతడికి అవకాశం! Take a bow Arshad Nadeem… the whole Pakistan is celebrating your silver medal … worth more than a gold … in World Athletics Championship. Why I said it’s worth more than a gold is that you don’t get the top level facilities other athletes get, but you still excelled. So… pic.twitter.com/sG6ZA9alNw — Wasim Akram (@wasimakramlive) August 28, 2023 -
ప్రపంచంలో భారత్, పాక్.. నం.1, 2.. ఇక ఒలింపిక్స్‌లో! నాకు తెలుసు..
World Athletics Championships 2023- Neeraj Chopra- Arshad Nadeem: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్-2023లో స్వర్ణం సాధించిన భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘నీ ఆటకు నీరాజనం’ అంటూ భారతీయులంతా ఈ హర్యానా కుర్రాడి విజయాన్ని మనసారా ఆస్వాదిస్తున్నారు. నీరజ్‌కు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతూ అతడి గెలుపును కొనియాడుతున్నారు. ఎవరికీ సాధ్యం కాని ఫీట్‌తో కాగా టోక్యో ఒలింపిక్స్‌లో పసిడి గెలిచి యావత్ భారతావనిని పులకింపజేసిన ఈ గోల్డెన్ బాయ్.. వరల్డ్ అథ్లెటిక్స్‌లోనూ గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. నాలుగు దశాబ్దాలుగా భారత అథ్లెట్లకు సాధ్యం కాని ఫీట్ నమోదు చేసి రికార్డులకెక్కాడు. నీరజ్ భాయ్.. సంతోషంగా ఉందన్న అర్షద్ ఈ నేపథ్యంలో పాకిస్తాన్ జావెలిన్ త్రో స్టార్ అర్షద్ నదీం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుడాపెస్ట్ వరల్డ్ అథ్లెటిక్స్‌లో నీరజ్ కంటే ఒక అడుగు వెనుకబడి రజతంతో సరిపెట్టుకున్న అతడు.. ‘‘నీరజ్ భాయ్.. నీ విజయం పట్ల నాకెంతో సంతోషంగా ఉంది! ప్రపంచంలో ఇండియా- పాకిస్తాన్ 1, 2 స్థానాల్లో నిలిచాయి. ప్రపంచంలో భారత్, పాక్.. నం.1,2 ఆ దేవుడి దయ వల్ల ఒలింపిక్స్‌లోనూ మనం 1- 2 స్థానాల్లో ఉండాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నాడు. ప్యారిస్ ఒలింపిక్స్‌లోనూ సత్తా చాటాలని నీరజ్ చోప్రాకు ఈ సందర్భంగా ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఇక విజయానంతరం నీరజ్ మాట్లాడుతూ.. ‘‘ఈవెంట్ ముగిసిన తర్వాత నేను అర్షద్‌ను కలిశాను. ప్రపంచ వేదికపై భారత్- పాక్ సత్తా చాటినందుకు ఇద్దరం సంతోషం పంచుకున్నాం. మాకు గట్టిపోటీనిచ్చిన యూరోపియన్ ఆటగాళ్లను దాటుకుని ముందుకు వెళ్లిన తీరును గుర్తు చేసుకున్నాం. క్రీడల్లో ఇరు దేశాల మధ్య ఉన్న పోటీతత్వం గురించి మాకు తెలుసు. అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో తెలుసు ఈసారి నేను గెలిచాను. దీంతో ఆసియా క్రీడల నేపథ్యంలో అభిమానుల అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో తెలుసు. మేము మళ్లీ చైనాలోని హాంగ్జూలో మళ్లీ కలుస్తాం’’ అని చెప్పుకొచ్చాడు. కాగా టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన చెక్ రిపబ్లిక్ ప్లేయర్ జాకూచ్ వాద్లెచ్(86.7 మీటర్లు)ను వెనక్కి నెట్టి వరల్డ్ అథ్లెటిక్స్‌లో అర్షద్ రన్నరప్‌గా నిలిచాడు. 87.82 మీటర్ల దూరం ఈటెను విసిరి రజత పతకం గెలిచాడు. చదవండి: నవీన్‌కు గట్టి షాక్.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్! అయ్యో పాపం.. ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. విధ్వంసకర ఆటగాడు దూరం!