Neeraj Chopra- Arshad Nadeem- Wasim Akram's 'Worth More Than A Gold': వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి మరోసారి మువ్వన్నెల జెండాను ప్రపంచ వేదికపై రెపరెపలాడించాడు గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా. నాలుగు దశాబ్దాల భారతీయుల కలను నిజం చేస్తూ ఈ జావెలిన్ త్రో స్టార్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచ చాంపియన్‌గా అవతరించి భారతావని ప్రశంసలు అందుకుంటున్నాడు.
కాగా హంగేరీలోని బుడాపెస్ట్‌లో ఆదివారం జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో.. నీరజ్ రెండో ప్రయత్నంలో అత్యధికంగా 88.17 మీటర్ల దూరం బల్లాన్ని విసిరి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే, ఇదే ఈవెంట్లో పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీం 87.82 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి రజతం దక్కించుకున్నాడు.
అర్షద్‌ను పిలిచి మరీ ఫొటో దిగిన నీరజ్
ఇదిలా ఉంటే దాయాది దేశాలకు చెందిన నీరజ్, అర్షద్ పరస్పరం అభినందనలు తెలుపుకొంటూ సన్నిహితంగా మెలిగిన తీరు క్రీడాభిమానులను ఆకర్షించింది. ముఖ్యంగా ఫొటో దిగేందుకు నీరజ్.. అర్షద్‌ను పిలవడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రం మాత్రం తన పోస్ట్‌తో విమర్శల పాలయ్యాడు.
అర్షద్ సిల్వర్ మెడల్ సాధించడాన్ని కొనియాడిన వసీం అక్రం.. ‘‘టేక్ ఏ బో అర్షద్ నదీం.. నీ రజత విజయం నేపథ్యంలో పాకిస్తాన్ మొత్తం సంబరాలు చేసుకుంటోంది. వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నువ్వు సాధించిన సిల్వర్ మెడల్ పసిడి పతకం కంటే ఎక్కువే!
ఎందుకిలా అంటున్నానంటే.. మిగతా అథ్లెట్లతో పోలిస్తే నీకు అరకొర సౌకర్యాలే ఉన్నాయి. అయినా నువ్వు ఇక్కడిదాకా చేరుకున్నావు. క్రికెట్ కాకుండా మరో క్రీడను కూడా దేశ ప్రజలు సెలబ్రేట్ చేసుకునే అవకాశమిచ్చావు’’ అని తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చాడు.
సెల్ఫ్ గోల్.. అభిమానుల నుంచి విమర్శలు
ఈ నేపథ్యంలో.. సొంత అభిమానుల నుంచే వసీం అక్రం విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ‘‘సరైన సౌకర్యాలు లేవని నువ్వే చెప్తున్నావు. క్రికెటర్‌గా బాగానే సంపాదించావు కదా! అర్షద్‌కు కావాల్సిన ఆర్థిక సాయం అందించవచ్చు కదా!’’ అని కామెంట్లు చేస్తున్నారు. ఇక నీరజ్ చోప్రా అభిమానులు.. ‘‘నీరజ్, అర్షద్ అన్నదమ్ముల్లా బాగానే కలిసిపోయారు. నువ్వు మాత్రం ఇలా బుద్ధి చూపించావు’’ అంటూ బౌలింగ్ లెజెండ్ వసీం అక్రంపై ఫైర్ అవుతున్నారు.
చదవండి: WC 2023: వరల్డ్‌కప్ జట్టులో అయ్యర్‌కు నో ఛాన్స్! అతడికి అవకాశం!
Take a bow Arshad Nadeem… the whole Pakistan is celebrating your silver medal … worth more than a gold … in World Athletics Championship. Why I said it’s worth more than a gold is that you don’t get the top level facilities other athletes get, but you still excelled. So… pic.twitter.com/sG6ZA9alNw
— Wasim Akram (@wasimakramlive) August 28, 2023
Comments
Please login to add a commentAdd a comment