World Athletics Championships
-
ఆసియా రికార్డు నమోదు చేసిన గుల్వీర్.. ప్రపంచ అథ్లెటిక్స్‌కు అర్హత
న్యూఢిల్లీ: భారత యువ అథ్లెట్ గుల్వీర్ సింగ్ 5000 మీటర్ల ఇండోర్ రేసులో ఆసియా రికార్డు నెలకొల్పుతూ... ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌నకు అర్హత సాధించాడు. అమెరికా బోస్టన్‌లో జరిగిన ఇండోర్ ఈవెంట్లో గుల్వీర్ 12 నిమిషాల 59.77 సెకన్లలో లక్ష్యాన్ని చేరి నాలుగో స్థానంలో నిలిచాడు. తద్వారా 5000 మీటర్ల ఇండోర్ రేసును 13 నిమిషాల లోపు పూర్తిచేసిన తొలి భారతీయుడిగా రికార్డుల్లోకెక్కాడు. ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన గుల్వీర్... ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ అర్హత మార్క్ (13 నిమిషాల 1 సెకన్)ను దాటాడు. ‘నా ప్రదర్శనతో ఆనందంగా ఉన్నా . ఓవరాల్‌గా టైమింగ్ మెరుగు పరుచుకోవడంపై దృష్టి పెడుతున్నా. ఈ క్రమంలో ఇండోర్‌లో ఆసియా రికార్డు టైమింగ్ నమోదు చేయడం గర్వంగా ఉంది. నేరుగా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించడంతో సంతృప్తిగా ఉన్నా’ అని గుల్వీర్ పేర్కొన్నాడు. 5000 మీటర్ల ఔట్‌డోర్ రేసులోనూ జాతీయ రికార్డు (13 నిమిషాల 11.82 సెకన్లు) గుల్వీర్ సింగ్ పేరిటే ఉంది. -
ఈ సిల్వర్ మెడల్ పసిడి కంటే ఎక్కువ.. వసీం అక్రం పోస్ట్! సెల్ఫ్ గోల్..
Neeraj Chopra- Arshad Nadeem- Wasim Akram's 'Worth More Than A Gold': వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి మరోసారి మువ్వన్నెల జెండాను ప్రపంచ వేదికపై రెపరెపలాడించాడు గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా. నాలుగు దశాబ్దాల భారతీయుల కలను నిజం చేస్తూ ఈ జావెలిన్ త్రో స్టార్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచ చాంపియన్‌గా అవతరించి భారతావని ప్రశంసలు అందుకుంటున్నాడు. కాగా హంగేరీలోని బుడాపెస్ట్‌లో ఆదివారం జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో.. నీరజ్ రెండో ప్రయత్నంలో అత్యధికంగా 88.17 మీటర్ల దూరం బల్లాన్ని విసిరి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే, ఇదే ఈవెంట్లో పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీం 87.82 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి రజతం దక్కించుకున్నాడు. అర్షద్‌ను పిలిచి మరీ ఫొటో దిగిన నీరజ్ ఇదిలా ఉంటే దాయాది దేశాలకు చెందిన నీరజ్, అర్షద్ పరస్పరం అభినందనలు తెలుపుకొంటూ సన్నిహితంగా మెలిగిన తీరు క్రీడాభిమానులను ఆకర్షించింది. ముఖ్యంగా ఫొటో దిగేందుకు నీరజ్.. అర్షద్‌ను పిలవడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రం మాత్రం తన పోస్ట్‌తో విమర్శల పాలయ్యాడు. అర్షద్ సిల్వర్ మెడల్ సాధించడాన్ని కొనియాడిన వసీం అక్రం.. ‘‘టేక్ ఏ బో అర్షద్ నదీం.. నీ రజత విజయం నేపథ్యంలో పాకిస్తాన్ మొత్తం సంబరాలు చేసుకుంటోంది. వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నువ్వు సాధించిన సిల్వర్ మెడల్ పసిడి పతకం కంటే ఎక్కువే! ఎందుకిలా అంటున్నానంటే.. మిగతా అథ్లెట్లతో పోలిస్తే నీకు అరకొర సౌకర్యాలే ఉన్నాయి. అయినా నువ్వు ఇక్కడిదాకా చేరుకున్నావు. క్రికెట్ కాకుండా మరో క్రీడను కూడా దేశ ప్రజలు సెలబ్రేట్ చేసుకునే అవకాశమిచ్చావు’’ అని తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చాడు. సెల్ఫ్ గోల్.. అభిమానుల నుంచి విమర్శలు ఈ నేపథ్యంలో.. సొంత అభిమానుల నుంచే వసీం అక్రం విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ‘‘సరైన సౌకర్యాలు లేవని నువ్వే చెప్తున్నావు. క్రికెటర్‌గా బాగానే సంపాదించావు కదా! అర్షద్‌కు కావాల్సిన ఆర్థిక సాయం అందించవచ్చు కదా!’’ అని కామెంట్లు చేస్తున్నారు. ఇక నీరజ్ చోప్రా అభిమానులు.. ‘‘నీరజ్, అర్షద్ అన్నదమ్ముల్లా బాగానే కలిసిపోయారు. నువ్వు మాత్రం ఇలా బుద్ధి చూపించావు’’ అంటూ బౌలింగ్ లెజెండ్ వసీం అక్రంపై ఫైర్ అవుతున్నారు. చదవండి: WC 2023: వరల్డ్‌కప్ జట్టులో అయ్యర్‌కు నో ఛాన్స్! అతడికి అవకాశం! Take a bow Arshad Nadeem… the whole Pakistan is celebrating your silver medal … worth more than a gold … in World Athletics Championship. Why I said it’s worth more than a gold is that you don’t get the top level facilities other athletes get, but you still excelled. So… pic.twitter.com/sG6ZA9alNw — Wasim Akram (@wasimakramlive) August 28, 2023 -
ప్రపంచంలో భారత్, పాక్.. నం.1, 2.. ఇక ఒలింపిక్స్‌లో! నాకు తెలుసు..
World Athletics Championships 2023- Neeraj Chopra- Arshad Nadeem: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్-2023లో స్వర్ణం సాధించిన భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘నీ ఆటకు నీరాజనం’ అంటూ భారతీయులంతా ఈ హర్యానా కుర్రాడి విజయాన్ని మనసారా ఆస్వాదిస్తున్నారు. నీరజ్‌కు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతూ అతడి గెలుపును కొనియాడుతున్నారు. ఎవరికీ సాధ్యం కాని ఫీట్‌తో కాగా టోక్యో ఒలింపిక్స్‌లో పసిడి గెలిచి యావత్ భారతావనిని పులకింపజేసిన ఈ గోల్డెన్ బాయ్.. వరల్డ్ అథ్లెటిక్స్‌లోనూ గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. నాలుగు దశాబ్దాలుగా భారత అథ్లెట్లకు సాధ్యం కాని ఫీట్ నమోదు చేసి రికార్డులకెక్కాడు. నీరజ్ భాయ్.. సంతోషంగా ఉందన్న అర్షద్ ఈ నేపథ్యంలో పాకిస్తాన్ జావెలిన్ త్రో స్టార్ అర్షద్ నదీం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుడాపెస్ట్ వరల్డ్ అథ్లెటిక్స్‌లో నీరజ్ కంటే ఒక అడుగు వెనుకబడి రజతంతో సరిపెట్టుకున్న అతడు.. ‘‘నీరజ్ భాయ్.. నీ విజయం పట్ల నాకెంతో సంతోషంగా ఉంది! ప్రపంచంలో ఇండియా- పాకిస్తాన్ 1, 2 స్థానాల్లో నిలిచాయి. ప్రపంచంలో భారత్, పాక్.. నం.1,2 ఆ దేవుడి దయ వల్ల ఒలింపిక్స్‌లోనూ మనం 1- 2 స్థానాల్లో ఉండాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నాడు. ప్యారిస్ ఒలింపిక్స్‌లోనూ సత్తా చాటాలని నీరజ్ చోప్రాకు ఈ సందర్భంగా ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఇక విజయానంతరం నీరజ్ మాట్లాడుతూ.. ‘‘ఈవెంట్ ముగిసిన తర్వాత నేను అర్షద్‌ను కలిశాను. ప్రపంచ వేదికపై భారత్- పాక్ సత్తా చాటినందుకు ఇద్దరం సంతోషం పంచుకున్నాం. మాకు గట్టిపోటీనిచ్చిన యూరోపియన్ ఆటగాళ్లను దాటుకుని ముందుకు వెళ్లిన తీరును గుర్తు చేసుకున్నాం. క్రీడల్లో ఇరు దేశాల మధ్య ఉన్న పోటీతత్వం గురించి మాకు తెలుసు. అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో తెలుసు ఈసారి నేను గెలిచాను. దీంతో ఆసియా క్రీడల నేపథ్యంలో అభిమానుల అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో తెలుసు. మేము మళ్లీ చైనాలోని హాంగ్జూలో మళ్లీ కలుస్తాం’’ అని చెప్పుకొచ్చాడు. కాగా టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన చెక్ రిపబ్లిక్ ప్లేయర్ జాకూచ్ వాద్లెచ్(86.7 మీటర్లు)ను వెనక్కి నెట్టి వరల్డ్ అథ్లెటిక్స్‌లో అర్షద్ రన్నరప్‌గా నిలిచాడు. 87.82 మీటర్ల దూరం ఈటెను విసిరి రజత పతకం గెలిచాడు. చదవండి: నవీన్‌కు గట్టి షాక్.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్! అయ్యో పాపం.. ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. విధ్వంసకర ఆటగాడు దూరం! -
గోల్డెన్ బోయ్ నీరజ్ ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2023లో జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా 88.17 మీటర్ల అద్భుతమైన త్రో మెన్స్ జావెలిన్ త్రోలో బంగార పతకాన్నిసాధించి భారత్‌కు తొలిస్వర్ణాన్ని అందించి మరోసారి చరిత్ర సృష్టించాడు. పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ రజత పతకంతో సరి పెట్టుకున్నాడు. ఈ సందర్బంగా నీరజ్‌కు దక్కిన ప్రైజ్ మనీ ఎంత అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ 2023లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న తొలి అథ్లెట్‌గా నిలిచిన నీరజ్ చోప్రాకు 70వేల డాలర్లు (సుమారు రూ. 58 లక్షలు) నగదు బహుమతిని అందుకున్నట్టు తెలుస్తోంది. అలాగే రెండోస్థానంలో ఉన్న అర్షద్ నదీమ్ 35000 డాలర్లు (సుమారు రూ. 29 లక్షలు) ప్రైజ్ మనీని గెలుచు కున్నాడు. బుడాపెస్ట్‌లో జరిగిన ఈవెంట్లో 88.17 మీటర్ల త్రోతో ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో టాప్‌లో నిలిచి, గోల్డెన్ బోయ్‌గా మరోసారి తన ప్రత్యకతను నిరూపించుకున్నాడు నీరజ్ చోప్రా. ఈ పోటీలో చెక్ రిపబ్లిక్కు చెందిన జాకుబ్ వడ్లెజ్ 86.67 మీటర్లు విసిరి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అలాగే మరో ఇద్దరు భారత అథ్లెట్లు కిషోర్ జెనా , డిపి మను వరుసగా 84.77 మీ 84.14 మీటర్ల త్రోతో ఐదు, ఆరో స్థానాల్లో నిలిచిన సంగతి తెలిసిందే. కాగా 40 ఏళ్ల ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూఏసీ) చరిత్రలో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తొలి భారతీయ అథ్లెట్ నీరజ్ చోప్రా. ఆదివారం బుడాపెస్ట్‌లో జరిగిన WAC 2023లో పురుషుల జావెలిన్ ఈవెంట్లో 25 ఏళ్ల స్టార్ నీరజ్ తన సొంత రికార్డును తానే చెరిపేసి రజత పతకాన్ని స్వర్ణంగా మార్చుకున్నాడు. This is Neeraj Chopra, Olympic Gold Medalist. After winning the #WorldAthleticsChamps in Budapest yesterday, A hungarian fan came to him with an Indian flag and asked him to sign it for her. Subedar Neeraj Chopra humbly denied and said “ Sorry Mam, it is a violation of my flag… pic.twitter.com/mc7afI6h4e — Roshan Rai (@RoshanKrRaii) August 28, 2023 1. Pakistanis tweeting 10x about lack of facilities should have tweeted atleast once way before. 2. Arshad Nadeem had world class training in Germany just like Neeraj. 3. Enjoy Neeraj Chopra inviting Arshad under 🇮🇳 as he didn't have 🇵🇰#NeerajChoprapic.twitter.com/wqRxCACMIC — Johns (@JohnyBravo183) August 27, 2023 -
వావ్...అందరి చూపు ఆకాశానికే..మన చిరుతల వేగం చూడండి!
ఆసియా రికార్డు బద్దలుకొట్టిన భారత పురుషుల అథ్లెటిక్స్ బృందంపై వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర స్పందించారు. సైన్స్, విజ్ఞాన విషయాలపైనే కాదు తరచుగా క్రీడా వార్తులు విశేషాలపై తరచుగా స్పందించే ఆయన తాజాగా ప్రపంచ అథ్లెటిక్స్ 4X400 మీటర్ల విభాగంలో భారత పురుషుల రిలే జట్టు ఫైనల్‌కు క్వాలిఫై కావడంపై తన సంతోషాన్ని ఎక్స్(ట్విటర్) ప్రకటించారు. కానీ అయితే ఈ ఆదివారం జరిగిన ఫైనల్లో మనవాళ్లు ఐదో స్థానాన్ని మాత్రమే సాధించగలిగారు. ఈ విభాగంలో అమెరికా స్వర్ణం, ఫ్రాన్స్ రజతం, గ్రేట్ బ్రిటన్ కాంస్య పతకాలను గెల్చుకున్నాయి. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్స్‌కు అర్హత సాధించిడం, ఆసియా రికార్డుపై స్పందించిన ఆనంద్ మహీంద్ర వావ్.. చూస్తోంటే.. అందరూ ఇప్పుడు మూన్ వైపే గురి పెట్టినట్టున్నారు. చిరుతల్లా దూసుకుపోతున్న మన అథ్లెటిక్స్‌ని చూడండి అంటూ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి ఒక వీడియోను కూడా షేర్ చేశారు. మరోవైపు ఆదివారం హంగేరీలోని బుడాపెస్ట్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఇండియా తొలి బంగారు పతకాన్ని దక్కించుకుంది. జావెలిన్ త్రోలో స్వర్ణ పతకాన్ని సాధించి గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా మరో ఘనతను సాధించిన సంగతి తెలిసిందే. కాగా వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో పురుషుల 4X400 మీటర్ల విభాగంలో ఇంటియన్ టీం మహ్మద్ అనాస్, అమోజ్ జాకబ్, మహ్మద్ అజ్మల్, రాజేశ్ రమేశ్ చిరుతల్లా విజృంభించి కేవలం 2 నిమిషాల 59.05 సెకన్లలోనే రేసు ముగించి ఫైనల్‌కు అర్హత సాధించి అందరిదృష్టినీ ఆకర్షించారు. అంతేకాదు వరల్డ్ అథ్లెటిక్స్‌లో ఈ విభాగంలో భారత్ ఫైనల్స్‌కు క్వాలిఫై అవడం ఇదే తొలిసారి కావడం విశేషం. What? When? Where? An Indian men’s 4x400 relay team qualifying for the finals in the World Athletics Championship? Looks like everyone is shooting for the moon now… Look at them run…Our Cheetahs…. pic.twitter.com/K0Il2UEXpR — anand mahindra (@anandmahindra) August 27, 2023 Who saw this coming 😳 India punches its ticket to the men's 4x400m final with a huge Asian record of 2:59.05 👀#WorldAthleticsChamps pic.twitter.com/fZ9lBqoZ4h — World Athletics (@WorldAthletics) August 26, 2023 -
13 ఏళ్ల వయస్సులోనే అవమానాలెన్నో.. అయినా వరల్డ్ ఛాంపియన్!
చంద్రయాన్-3 సూపర్ సక్సెస్‌ను మరవకముందే విశ్వవేదికపై మరోసారి భారత పతాకం రెపరెపలాడింది. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లొ 88.17 మీటర్ల త్రోతొ పురుషుల జావెలిన్ త్రో విజేతగా నిలిచాడు. తద్వారా వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న తొలి భారతీయుడిగా చరిత్ర పుటలకెక్కాడు. కేవలం 25 ఏళ్ల వయస్సులోనే ఎన్నో ఘనతలను నిరాజ్ అందుకున్నాడు. అంతకుముందు 2021 టోక్యో ఒలిపింక్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించి తన పేరును ప్రపంచానికి పరిచయం చేసుకున్నాడు ఈ బల్లెం వీరుడు. ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి ప్రపంచ క్రీడా వేదికపై సత్తా చాటుతున్న నీరజ్.. భారత అథ్లెటిక్స్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకుంటున్నాడు. ఎన్నో అవమానాలు.. నీరజ్ డిసెంబర్ 24, 1997న హర్యానాలోని పానిపట్ జిల్లాలోని ఖందార్ అనే చిన్న గ్రామంలో జన్మించాడు. నీరజ్‌ది ఒక రైతు కుటుంబం. నీరజ్‌కు ఇద్దరి సోదరిలు కూడా ఉన్నారు. అయితే నిరాజ్ తన చిన్నతనంలో దీర్ఘకాయత్వంతో బాధపడ్డాడు. 13 ఏళ్ల వయస్సులోనే నీరాజ్ 80 కేజీల బరువు కలిగి ఉన్నాడు. ఈ క్రమంలో అతడిని అందరూ హేళన చేసేవారు. ఆ గ్రామంలో పిల్లలు అయితే ఏకంగా సర్పంచ్, సర్పంచ్ అని పిలిచే వారు. కానీ నిరాజ్ వాటిన్నటిని పట్టించుకోలేదు. జీవితంలో ఏదైనా సాధించి అవమానాలు ఎదుర్కొన్న చోటే శబాష్ అనిపించుకోవాలని నీరజ్ అప్పుడే నిర్ణయించుకున్నాడు. అలా మొదలైంది.. అందరూ తన కొడుకును హేళన చేయడంతో తండ్రి సతీష్ కుమార్ చూసి తట్టుకోలేకపోయాడు. దీంతో నిరాజ్‌ను వ్యాయమం చేసేందుకు పంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో అతడిని రోజు సతీష్ కుమార్ పానిపట్‌లోని శివాజీ స్టేడియంకు తీసుకువెళ్లేవాడు. అయితే వరల్డ్ఛాంపియన్గా ఎదిగిన నీరాజ్ ప్రయాణానికి అక్కడే బీజం పడింది. శివాజీ మైదానంలో బళ్లెం వీరుడు బంగారు కథ మొదలైంది. శివాజీ స్టేడియంలో కొంత మంది అబ్బాయిలు జావెలిన్ త్రో ప్రాక్టీస్ చేయడం నీరజ్ చూశాడు. దీంతో తన కూడా జావెలిన్ పట్టాలని నిర్ణయించుకున్నాడు. నీరజ్‌కు జావిలిన్ త్రోపై రోజురోజుకి ఆసక్తి పెరుగుతుండడంతో అతడి తండ్రి పానిపట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంటర్లో చేర్పించాడు. అతడి కోచింగ్‌లో.. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంటర్లో జావెలిన్ త్రోయర్ ట్రైనర్ జైవీర్ చౌదరి... నీరజ్ ప్రతిభను గుర్తించాడు. మొదటి ప్రయత్నంలోనే నిరాజ్ ఎటువంటి ప్రాక్టీస్ లేకుండా 40 మీటర్లు విసిరడం చూసి జైవీర్ చౌదరి ఆశ్చర్యపోయాడు. జైవీర్ చౌదరి శిక్షణలో నీరజ్ మరింత రాటుదేలాడు. జైవీర్ చౌదరి దగ్గర ఏడాది శిక్షణ తర్వాత పంచకులలోని తౌ దేవి లాల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో చేరాడు. అక్కడ కూడా నీరజ్ తన టాలెంట్‌తో అందరిని అకట్టుకున్నాడు. ఈ క్రమంలో అక్టోబర్ 2012లో లక్నోలో జరిగిన జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఇదే నీరాజ్‌కు తొలి జాతీయ పతకం. అక్కడ నుంచి నీరాజ్ వెనుక్కి తిరిగి చూడలేదు. ఎన్నో ఘనతలు.. అనంతరం 2016లో ప్రపంచ అండర్–20 చాంపియన్‌షిప్‌లో కూడా నీరజ్ సత్తాచాటాడు. స్వర్ణ పతకం గెలిచి అందరి నీరాజనాలను అందుకున్నాడు. అదే విధంగా 2018 ఆసియా క్రీడల్లో, 2018 కామన్వెల్త్ గేమ్స్‌లోనూ పసిడి పతకాలు సొంతం చేసుకున్నాడు. 2021లో టోక్యో ఒలింపిక్స్‌లో అందరి అంచనాలను తారుమారు చేస్తూ స్వర్ణ పతకం సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్‌లో భారత్ తరఫున వ్యక్తిగత స్వర్ణం సాధించిన రెండో ఆటగాడిగా నీరజ్ నిలిచాడు. 2022 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం, 2022 ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో స్వర్ణంతో మెరిశాడు. అవార్డులు, పురస్కారాలు భారతదేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును 2021లో, 2018లో అర్జున అవార్డు, 2022లో పద్శ శ్రీ అవార్డును అందుకున్నాడు. ఆర్మీలో అందించిన సేవలకు గుర్తింపుగాచోప్రాకు 2022లో పరమ్ విశిష్ట్ సేవా పతకం, 2020లో విశిష్ట్ సేవా పతకాలు వచ్చాయి. చదవండి: World Athletics Championships: నీరజ్ స్వర్ణ చరిత్ర 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నోవా లైల్స్ ‘డబుల్’
బుడాపెస్ట్ (హంగేరీ): అమెరికా అథ్లెట్ నోవా లైల్స్ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ‘డబుల్’ సాధించాడు. ఈ మెగా ఈవెంట్లో ఇప్పటికే 100 మీటర్ల స్ప్రింట్‌లో విజేతగా నిలిచిన అతను ఇప్పుడు 200 మీటర్ల పరుగులో కూడా అగ్రస్థానాన్ని అందుకున్నాడు. అంచనాలకు తగినట్లుగానే సత్తా చాటిన లైల్స్ 19.52 సెకన్లలో పరుగు పూర్తి చేసి పసిడి పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ ఈవెంట్లో ఎరియోన్ నైటాన్ (అమెరికా – 19.75 సెకన్లు) రజతం సాధించగా, లెట్సిలో టె»ొగో (బోట్స్వానా – 19.81 సెకన్లు) కాంస్యం గెలుచుకున్నాడు. వరల్డ్ చాంపియన్‌షిప్ 200 మీటర్ల పరుగులో లైల్స్‌కు ఇది వరుసగా మూడో స్వర్ణం కావడం విశేషం. గత ఏడాది ఒరెగాన్‌లో జరిగిన పోటీల్లోనూ అతను బంగారు పతకం సాధించాడు. తద్వారా బోల్ట్ తర్వాత ఒకే ఈవెంట్లో వరుసగా కనీసం మూడు స్వర్ణాలు గెలిచిన రెండో అథ్లెట్‌గా లైల్స్ నిలిచాడు. 4గీ100 మీటర్ల రిలేలో అమెరికా జట్టు ఫైనల్ చేరింది. ఇందులో కూడా భాగంగా నిలిచి విజయం సాధిస్తే లైల్స్ ఖాతాలో మూడో స్వర్ణం చేరుతుంది. ప్రపంచ రికార్డుకు చేరువై... 100 మీటర్ల స్ప్రింట్‌లో రజతం సాధించిన షెరికా 200 మీటర్ల ఈవెంట్లో తన పరుగుకు మరింత పదును పెట్టింది. ఈ జమైకా అథ్లెట్ 200 మీటర్ల పరుగులో రెండో అత్యుత్తమ టైమింగ్‌ను నమోదు చేస్తూ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుందిు. 21.41 సెకన్లలో షెరికా పరుగులు పూర్తి చేసింది. గాబ్రియెల్ థామస్ (అమెరికా – 21.18 సెకన్లు), షకారి రిచర్డ్సన్ (అమెరికా – 21.92 సెకన్లు)లకు వరుసగా రజత, కాంస్యాలు దక్కాయి. ప్రపంచ రికార్డు ఇప్పటికీ అమెరికాకు చెందిన ఫ్లోరెన్స్ గ్రిఫిత్ జాయ్నర్ (21.34 సెకన్లు) పేరిటే ఉంది. 1988లో ఆమె ఈ టైమింగ్‌ను నమోదు చేసింది. గత ఏడాది కూడా ఈ ఈవెంట్లో షెరికా స్వర్ణం సాధించింది. ఆసియా రికార్డుతో ఫైనల్లోకి భారత 4్ఠ400 రిలే బృందం ప్రదర్శన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత 4్ఠ400 మీటర్ల రిలే బృందం అద్భుత ప్రదర్శనతో సత్తా చాటింది. ఆసియా రికార్డుతో ఫైనల్‌కు అర్హత సాధించింది. తొలి హీట్‌లో మన జట్టు రెండో స్థానంలో నిలిచింది. మొహమ్మద్ అనస్ యాహియా, అమోజ్ జాకబ్, మొహమ్మద్ అజ్మల్ వరియత్తోడి, రాజేశ్ రమేశ్ భాగంగా ఉన్న భారత్ ఈ రేసును 2 నిమిషాల 59.05 సెకన్లలో పూర్తి చేసింది. ఇది కొత్త ఆసియా రికార్డు కావడం విశేషం. ఈ హీట్స్‌లో అమెరికా జట్టు మొదటి స్థానంలో నిలవగా, గ్రేట్ బ్రిటన్ టీమ్‌కు మూడో స్థానం దక్కింది. నేడు ఫైనల్ రేస్ జరుగుతుంది. -
వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ ఫైనల్లో నీరజ్.. ఒలింపిక్స్‌కు అర్హత
Neeraj In Javelin Throw Final: వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో ఒలింపియన్, జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా సత్తా చాటాడు. హంగేరిలోని బుడాపెస్ట్‌లో జరుగుతున్న మెగా ఈవెంట్లో ఈ సీజన్లో తన అత్యుత్తమ ప్రదర్శనతో ఫైనల్‌కు అర్హత సాధించాడు. మొదటి ప్రయత్నంలోనే జావెలిన్‌ను 88.77 మీటర్లు విసిరిన నీరజ్ చోప్రా.. ప్యారిస్ ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యాడు. Neeraj Chopra’s first throw of 88.77m propels him straight into the #WACBudapest23 final. 🤩#NeerajChopra #Budapest23 #CraftingVictories 🇮🇳 pic.twitter.com/znGTemijYC — Inspire Institute of Sport (@IIS_Vijayanagar) August 25, 2023 నీరజ్‌తో పాటు డీపీ మను కూడా! ఇక నీరజ్‌తో పాటు మరో భారత జావెలిన్ స్టార్ డీపీ మను కూడా వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ ఫైనల్ రేసులో నిలిచాడు. తొలుత 78.10 మీటర్ల దూరం జావెలిన్ విసిరిన అతడు.. 81.31 మీ.తో ఫినిష్ చేశాడు. తద్వారా గ్రూప్- ఏ నుంచి మూడో స్థానంలో నిలిచాడు. ఈ గ్రూప్‌లో నీరజ్ అగ్రస్థానం కైవసం చేసుకుని 2024లో ప్యారిస్‌లో జరుగబోయే ఒలింపిక్స్‌లో బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు. ఇక వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ ఫైనల్ ఆదివారం జరుగనుంది. అదే అత్యుత్తమం కాగా ఈ సీజన్లో దోహా డైమండ్ లీగ్‌లో భాగంగా నీరజ్ 88.07 మీటర్ల దూరం జావెలిన్ విసిరాడు. తాజాగా బుడాపెస్ట్ ఫీట్‌తో తన గత రికార్డును అధిగమించాడు. కాగా తన కెరీర్లో అత్యుత్తమంగా నీరజ్ చోప్రా.. 89.94 మీటర్లు జావెలిన్ విసిరాడు. స్టాక్‌హోంలో 2022లో జరిగిన డైమండ్ లీగ్‌లో గోల్డెన్ బాయ్ ఈ ఫీట్ సాధించాడు. కాగా టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా స్వర్ణ పతకం సాధించి త్రివర్ణ పతాకాన్ని విశ్వవేదికపై రెపరెపలాడించిన విషయం తెలిసిందే. ప్యారిస్‌లోనూ అదే తీరుగా పసిడి సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. చదవండి: ఈసారి ఆసియా కప్ భారత్‌దే.. కానీ వరల్డ్‌కప్ మాత్రం: టీమిండియా మాజీ సెలక్టర్ -
‘పరుగుల అవ్వ’.. వయసు 95.. పోలాండ్‌లో పరుగుకు రెడీ
భగవాని దేవిని అందరూ ‘పరుగుల అవ్వ’ అంటారు. వయసు 95కు చేరినా ఆమె ఉత్సాహంగా పరుగు తీస్తోంది.. మెడల్స్ సాధిస్తోంది. 35 ఏళ్లు దాటిన వారి కోసం నిర్వహించే ‘వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఇండోర్ ఛాంపియన్షిప్స్’ కోసం ఇప్పుడు ఆమె పోలాండ్‌లో ఉంది. ‘గోల్డ్ మెడల్ తెస్తాను ఉండండి’ అంటోంది. వంద మీటర్ల దూరాన్ని మీరు ఎన్ని సెకన్లలో పరిగెడతారు? హుసేన్ బోల్ట్ 9.58 సెకన్లలో పరిగెత్తాడు. టీనేజ్ పిల్లలు చురుగ్గా ఉంటే పదిహేను సెకన్లలో పరిగెడతారు. ఇరవై ఏళ్లు దాటిన వారు ఇరవై సెకన్లు తీసుకోక తప్పదు. మరి 90 దాటిన వారు? ఫిన్లాండ్లో గత ఏడాది జరిగిన వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో భగవాని దేవి (94) వంద మీటర్లను కేవలం 24.74 సెకన్లలో పరిగెత్తింది. అది మన నేషనల్ రికార్డ్. ఆ రికార్డ్‌తో గోల్డ్ మెడల్ సాధించింది భగవాని దేవి. ఇప్పుడు ఆమెకు తొంభై ఐదు ఏళ్లు. మార్చి 25 నుంచి 31 వరకు పోలాండ్లోని టోరౌలో వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలకు విమానంలో బయలుదేరింది. పోయిన సంవత్సరం ఫిన్లాండ్కు పది గంటలు ప్రయాణించడం ఆమెకు కష్టమైంది. అందుకే ఈసారి స్పాన్సరర్లు ఆమెకు బిజినెస్ క్లాస్ బుక్ చేసి మరీ పంపించారు. ఆమె మెడల్ కొట్టకుండా వెనక్కు రాదని వాళ్ల గట్టి నమ్మకం. హర్యానా దాదీ భగవాని దేవిది హర్యానాలోని ఖేడ్కా అనే గ్రామం. పన్నెండు ఏళ్లకు పెళ్లయితే ముప్పై ఏళ్లు వచ్చేసరికల్లా వితంతువు అయ్యింది. పుట్టిన ముగ్గురు పిల్లల్లో ఇద్దరు చనిపోగా మిగిలిన ఒక్క కొడుకు కోసం మళ్లీ పెళ్లి చేసుకోకుండా సేద్యం చేసి కొడుకును పెంచింది భగవాని దేవి. చదువుకున్న కొడుకు ఢిల్లి మునిసిపల్ కార్పొరేషన్లో ఉద్యోగిగా మారడంతో ఢిల్లీ చేరుకుంది. ఆ తర్వాత నానమ్మ (దాదీ) అయ్యింది. ముగ్గురు మనవల్లో వికాస్ డాగర్ క్రీడల్లో గుర్తింపు సంపాదించాడు. అతడే తన దాదీలో ఆటగత్తె ఉందని గ్రహించాడు. ‘ఒకరోజు నేను షాట్ పుట్ ఇంటికి తెచ్చాను. నువ్వు విసురుతావా నానమ్మా అని అడిగితే మొహమాట పడింది. కాని మరుసటి రోజు ఉదయం ఆమె దానిని విసరిన తీరు చూసి నేను ఆశ్చర్యపోయాను’ అని తెలిపాడు వికాస్. ఆ తర్వాత అతడే తన దాదీకి కోచ్‌గా మారి ఆమెను అథ్లెట్‌ను చేశాడు. ‘చిన్నప్పుడు కబడ్డీ ఆడటం తప్ప నాకు వేరే ఏం గుర్తు లేదు’ అని నవ్వుతుంది భగవాని దేవి. బైపాస్ ఆపరేషన్ జరిగినా భగవాని దేవికి 2007లో బైపాస్ ఆపరేషన్ జరిగింది. అయినా సరే ఆమె పూర్తి ఆరోగ్యంగా, చురుగ్గా ఉంది. పరిగెడితే అలసిపోదు. వేరే ఏ ఇబ్బందులు లేవు. అందువల్ల త్వరలోనే ఆమె వయోజనులకు పెట్టే పోటీల్లో పతకాలు సాధించడం మొదలెట్టింది. కాని గత ఏడాది ఫిన్లాండ్లో గోల్డ్ మెడల్ సాధించడంతో ఆమెకు విశేష గుర్తింపు వచ్చింది. ‘నాకు ఏదైనా అవుతుందని భయపడవద్దు. దేశం కోసం పరుగెట్టి ప్రాణం విడిచినా నాకు సంతోషమే’ అని చెప్పి బయలుదేరిందామె పోయినసారి. ఈసారి కూడా ఆ స్ఫూర్తి చెక్కుచెదరలేదు. సెంచరీ వయసులోనూ పరిగెడతాను’ అంటుంది భగవాని దేవి. -
World Athletics Championships: ‘టాప్’ లేపిన అమెరికా
యుజీన్ (అమెరికా): తొలిసారి ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలకు ఆతిథ్యమిచ్చిన అమెరికా చిరస్మరణీయ ప్రదర్శనతో అదరగొట్టింది. భారత కాలమానం ప్రకారం సోమవారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో అమెరికా 13 స్వర్ణాలు, 9 రజతాలు, 11 కాంస్యాలతో కలిపి మొత్తం 33 పతకాలతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. ఒకే చాంపియన్‌షిప్‌లో అత్యధిక పతకాలు నెగ్గిన జట్టుగా అమెరికా రికార్డు నెలకొల్పింది. 1987లో తూర్పు జర్మనీ అత్యధికంగా 31 పతకాలు సాధించింది. పోటీల చివరిరోజు రెండు ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. పురుషుల పోల్‌వాల్ట్ ఈవెంట్లో అర్మాండ్ డుప్లాంటిస్ (స్వీడన్)... మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో టోబీ అముసాన్ (నైజీరియా) కొత్త ప్రపంచ రికార్డులు నెలకొల్పారు. ప్రపంచ రికార్డులు సృష్టించినందుకు డుప్లాంటిస్, టోబీ అముసాన్లకు లక్ష డాలర్ల చొప్పున (రూ. 79 లక్షల 80 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. ఆఖరి రోజు ఎనిమిది విభాగాల్లో ఫైనల్స్ జరిగాయి. మహిళల 4్ఠ400 మీటర్ల రిలేలో తలీతా డిగ్స్, అబీ స్టెనర్, బ్రిటన్ విల్సన్, సిడ్నీ మెక్లాఫ్లిన్లతో కూడిన అమెరికా జట్టు 3ని:17.79 సెకన్లలో గమ్యానికి చేరి స్వర్ణ పతకాన్ని సాధించింది. పురుషుల 4్ఠ400 మీటర్ల రిలేలోనూ అమెరికాకే స్వర్ణం లభించింది. పురుషుల పోల్‌వాల్ట్ ఫైనల్లో డుప్లాంటిస్ 6.21 మీటర్ల ఎత్తుకు ఎగిరి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 6.20 మీటర్లతో తన పేరిటే ఉన్న రికార్డును డుప్లాంటిస్ సవరించాడు. మహిళల 100 మీటర్ల హర్డిల్స్ సెమీఫైనల్లో టోబీ అముసాన్ 12.12 సెకన్లలో పూర్తి చేసి కొత్త ప్రపంచ రికార్డు లిఖించింది. ఫైనల్ రేసును టోబీ 12.06 సెకన్లలోనే ముగించి మరోసారి ప్రపంచ రికార్డు సాధించి, బంగారు పతకం గెలిచినా... రేసు జరిగిన సమయంలో గాలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆమె రికార్డును గుర్తించలేదు. స్వర్ణంతో ఫెలిక్స్ రిటైర్... అమెరికా మహిళా దిగ్గజ అథ్లెట్ అలీసన్ ఫెలిక్స్ తన కెరీర్‌ను స్వర్ణ పతకంతో ముగించింది. 36 ఏళ్ల అలీసన్ ఫెలిక్స్ 4్ఠ400 మీటర్ల ఫైనల్లో స్వర్ణం నెగ్గిన అమెరికా రిలే జట్టులో పోటీపడలేదు. అయితే ఆమె హీట్స్‌లో బరిలోకి దిగడంతో ఫెలిక్స్‌కు కూడా పసిడి పతకాన్ని ఇచ్చారు. అంతకుముందు ఆమె 4్ఠ400 మిక్స్డ్ రిలేలో కాంస్య పతకం సాధించింది. ఓవరాల్‌గా పది ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో పాల్గొన్న ఫెలిక్స్ మొత్తం 20 పతకాలు (14 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలు) సాధించింది. -
వచ్చేసారి మరింత మెరుగ్గా రాణిస్తా.. బంగారు పతకమే నా టార్గెట్: నీరజ్ చోప్రా
ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్-2022లో రజత పతకం గెలిచి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో పతకం గెలిచిన రెండో భారత అథ్లెట్‌గా చోప్రా నిలిచాడు. ఇక ఈ అరుదైన ఘనత సాధించిన నీరజ్ చోప్రాపై ప్రశంసల వర్షం కురిసింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ తదితర ప్రముఖులు నీరజ్ ప్రదర్శనను కొనియాడారు ఇక పతకం సాధించిన అనంతరం నీరజ్ చోప్రా మాట్లాడూతూ.. "కఠిన ప్రత్యర్థుల నడుమ క్లిష్ట వాతావరణ పరిస్థితుల మధ్య రజత పతకం గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. ఒలింపిక్స్‌తో పోలిస్తే ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనే పోటీ ఎక్కువగా ఉంటుంది. తొలి మూడుప్రయత్నాల్లో జావెలిన్‌ను అనుకున్నంత దూరం విసరకపోయినా నాలుగో ప్రయత్నంలో అనుకున్న లక్ష్యాన్ని అందుకున్నాను. నాలుగో త్రో అనంతరం తొడలో నొప్పి కలగడంతో తర్వాతి రెండు త్రోలు సవ్యంగా చేయలేకపోయా. ఏ క్రీడాకారుడైనా బరిలోకి దిగిన ప్రతి టోర్నీలో స్వర్ణ పతకం సాధించలేడు. ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో మినహా అన్ని ప్రముఖ టోర్నీలలో నేను బంగారు పతకాలు సాధించాను. నా ప్రదర్శనను మరింత మెరుగు పర్చుకొని వచ్చే ఏడాది హంగేరిలో జరిగే ప్రపంచ చాంపియన్ షిప్లో స్వర్ణ పతకం సాధించేందుకు కృషి చేస్తా" అని పేర్కొన్నాడు. చదవండి: Neeraj Chopra: నీరజ్ చోప్రా 'రజతం'.. డ్యాన్స్‌తో ఇరగదీసిన కుటుంబసభ్యులు -
World Athletics Championships 2022: నీ‘రజత’ధీర..!
అమెరికాలో ఆదివారం ఉదయం భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా అద్భుతం చేశాడు. పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ ఈటెను 88.13 మీటర్ల దూరం విసిరి రజత పతకాన్ని గెల్చుకున్నాడు. తద్వారా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కు రజత పతకం అందించిన తొలి అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు. 2003లో మహిళల లాంగ్‌జంప్‌లో అంజూ బాబీజార్జి కాంస్య పతకాన్ని సాధించింది. తాజా ప్రదర్శనతో నీరజ్ ఒలింపిక్స్, ఆసియా చాంపియన్‌షిప్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, దక్షిణాసియా క్రీడలు, డైమండ్ లీగ్ మీట్ తదితర మెగా ఈవెంట్స్‌లో పతకాలు సాధించిన భారత అథ్లెట్‌గా అరుదైన ఘనత సాధించాడు. కోట్లాది మంది భారతీయుల అంచనాలను నిజం చేస్తూ... మన అథ్లెట్స్లోనూ ప్రపంచస్థాయి వేదికపై పతకాలు గెలిచే సత్తా ఉందని నిరూపిస్తూ... గతంలో ఏ భారతీయ అథ్లెట్‌కు సాధ్యంకాని ప్రదర్శనను నమోదు చేస్తూ... అమెరికా గడ్డపై భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తూ... భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా అద్భుతం ఆవిష్కరించాడు. 46 ఏళ్ల ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కు తొలిసారి రజత పతకాన్ని అందించాడు. 2003లో మహిళల లాంగ్‌జంప్‌లో అంజూ జార్జి కాంస్య పతకాన్ని సాధించగా... నీరజ్ తాజాగా ఈ మెగా ఈవెంట్ చరిత్రలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన అథ్లెట్‌గా ఘనత వహించాడు. యుజీన్ (అమెరికా): సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. 19 ఏళ్ల తర్వాత ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ మళ్లీ పతకాల బోణీ కొట్టింది. స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా అందరి అంచనాలకు అనుగుణంగా రాణించి భారత్‌కు రజత పతకం అందించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ చోప్రా ఈటెను 88.13 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా) జావెలిన్‌ను 90.54 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకోగా... జాకుబ్ వాద్లెచ్ (చెక్ రిపబ్లిక్) జావెలిన్‌ను 88.09 మీటర్ల దూరం పంపించి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. జావెలిన్ త్రో ఫైనల్లో పోటీపడిన భారత్‌కే చెందిన మరో అథ్లెట్ రోహిత్ యాదవ్ (78.22 మీటర్లు) పదో స్థానంలో నిలిచాడు. తొలి ప్రయత్నంలో విఫలమైనా... జావెలిన్ త్రో ఫైనల్లో మొత్తం 12 మంది పోటీపడ్డారు. తొలి మూడు రౌండ్ల తర్వాత టాప్–8లో నిలిచిన వారు రెండో దశకు చేరగా... మిగతా నలుగురు నిష్క్రమించారు. క్వాలిఫయింగ్‌లో తొలి ప్రయత్నంలోనే అర్హత ప్రమాణాన్ని అందుకున్న 24 ఏళ్ల నీరజ్ చోప్రా ఫైనల్లో మాత్రం తొలి అవకాశంలో ఫౌల్ చేశాడు. అయితే ఆందోళన చెందకుండా నీరజ్ నెమ్మదిగా పుంజుకున్నాడు. రెండో ప్రయత్నంలో జావెలిన్‌ను 82.39 మీటర్లు... మూడో ప్రయత్నంలో 86.37 మీటర్లు విసిరిన నీరజ్ నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఇక నాలుగో ప్రయత్నంలో నీరజ్ తన శక్తినంతా కూడదీసుకొని జావెలిన్‌ను 88.13 మీటర్ల దూరం విసిరి నాలుగో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకాడు. నీరజ్ ఐదో, ఆరో ప్రయత్నాలు ఫౌల్ కాగా... 24 ఏళ్ల అండర్సన్ పీటర్స్ చివరిదైన ఆరో ప్రయత్నంలో ఈటెను 90.54 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. వాద్లెచ్, జూలియన్ వెబర్ (జర్మనీ), అర్షద్ నదీమ్ (పాకిస్తాన్) లసీ ఇటెలాటలో (ఫిన్లాండ్), ఆండ్రియన్ మర్డారె (మాల్డోవా) తదితరులు తర్వాతి ప్రయత్నాల్లో నీరజ్ దూరాన్ని అధిగమించకపోవడంతో భారత అథ్లెట్ ఖాతాలో రజతం చేరింది. నీరజ్ సాధించిన రజత పతకంతో ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ సంయుక్తంగా 29వ ర్యాంక్‌లో ఉంది. ఒక రజతం, ఐదుగురు ఫైనల్స్ చేరడంద్వారా ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్ ఈసారి తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. జెలెజ్నీ తర్వాత... డిఫెండింగ్ చాంపియన్ ఆండర్సన్ పీటర్స్ ఆరు ప్రయత్నాల్లో మూడుసార్లు జావెలిన్‌ను 90 మీటర్లకంటే ఎక్కువ దూరం విసిరి ఫైనల్లో తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. చెక్ రిపబ్లిక్ దిగ్గజం జాన్ జెలెజ్నీ (1993, 1995) తర్వాత వరుసగా రెండు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో స్వర్ణ పతకాలు నెగ్గిన జావెలిన్ త్రోయర్‌గా అండర్సన్ గుర్తింపు పొందాడు. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ అండర్సన్ చాంపియన్‌గా నిలిచాడు. ప్రశంసల వర్షం... ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కు తొలి రజత పతకాన్ని అందించిన నీరజ్ చోప్రాపై ప్రశంసల వర్షం కురిసింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ తదితర ప్రముఖులు నీరజ్ ప్రదర్శనను కొనియాడారు. ‘నీరజ్‌కు శుభాకాంక్షలు. భారత క్రీడల్లో ఇదెంతో ప్రత్యేక ఘట్టం. భవిష్యత్‌లో నీరజ్ మరిన్ని విజయాలు సాధించాలి’ అని ప్రధాని ట్విటర్లో అభినందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, బీజింగ్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతక విజేత, షూటర్ అభినవ్ బింద్రా, దిగ్గజ అథ్లెట్స్ పీటీ ఉష, అంజూ బార్జి కూడా నీరజ్‌ను అభినందించారు. విసిరితే పతకమే... 2016 జూలై 23న పోలాండ్‌లో జరిగిన ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించి వెలుగులోకి వచ్చిన నీరజ్ చోప్రా అటునుంచి వెనుదిరిగి చూడలేదు. హరియాణాకు చెందిన నీరజ్ ఆ తర్వాత బరిలోకి దిగిన ప్రతి మెగా ఈవెంట్లో పతకంతో తిరిగి వచ్చాడు. 2016లోనే జరిగిన దక్షిణాసియా క్రీడల్లో... 2017లో ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో... 2018 జకార్తా ఆసియా క్రీడల్లో... 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో... నీరజ్ జావెలిన్ త్రోలో భారత్‌కు పసిడి పతకాలు అందించాడు. 2017లో తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నా ఫైనల్‌కు అర్హత పొందలేకపోయిన నీరజ్ 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మోచేయి గాయంతో బరిలోకి దిగలేదు. గత ఏడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా స్వర్ణం గెలిచి విశ్వక్రీడల అథ్లెటిక్స్‌లో బంగారు పతకం నెగ్గిన తొలి భారతీయ అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్ తర్వాత రెండు నెలలపాటు విశ్రాంతి తీసుకొని గత అక్టోబర్‌లో మళ్లీ శిక్షణ ప్రారంభించాడు. గత నెలలో ఫిన్లాండ్లో జరిగిన కుర్టానో గేమ్స్‌లో స్వర్ణం... పావో నుర్మీ గేమ్స్‌లో రజతం... స్టాక్‌హోమ్‌లో జరిగిన డైమండ్ లీగ్‌లో రజతం సాధించిన నీరజ్ అదే జోరును ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కొనసాగించి భారత్‌కు తొలి రజత పతకాన్ని అందించాడు. ఈనెల 28 నుంచి బర్మింగ్హమ్లో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా నీరజ్ బరిలోకి దిగనున్నాడు. ఎల్డోజ్ పాల్‌కు తొమ్మిదో స్థానం ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆదివారమే జరిగిన పురుషుల ట్రిపుల్ జంప్ ఫైనల్లో భారత ప్లేయర్ ఎల్డోజ్ పాల్ నిరాశపరిచాడు. కేరళకు చెందిన పాల్ 16.79 మీటర్ల దూరం గెంతి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. పురుషుల 4్ఠ400 మీటర్ల రిలే హీట్స్‌ను మొహమ్మద్ అనస్ యాహియా, మొహమ్మద్ అజ్మల్, నాగనాథన్ పాండి, రాజేశ్ రమేశ్‌లతో కూడిన భారత బృందం 3ని:07.29 సెకన్లలో పూర్తి చేసి ఆరో స్థానంలో నిలిచి తదుపరి దశకు అర్హత పొందలేకపోయింది. నీరజ్ గ్రామంలో సంబరాలు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా ప్రదర్శనతో... హరియాణాలోని పానిపట్‌కు సమీపంలోని ఖాండ్రా గ్రామంలో నీరజ్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు సంబరాలు చేసుకున్నారు. ‘దేశం మొత్తం, హరియాణా రాష్ట్రం మొత్తం నీరజ్ ప్రదర్శనకు గర్వపడుతోంది. నిరంతరం శ్రమిస్తూ అతను దేశానికి పేరుప్రతిష్టలు తెస్తున్నాడు’ అని నీరజ్ తల్లి సరోజ్ వ్యాఖ్యానించారు. -
నీరజ్ చోప్రాకు సీఎం జగన్ అభినందనలు
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్-2022లో అద్వితీయ ప్రదర్శన కనబరిచి సిల్వర్ మెడల్ సాధించిన భారత జావెలిన్ స్టార్, ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలియజేశారు. ‘వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించిన సుబేదార్ నీరజ్ చోప్రాకు అభినందనలు. చాంపియన్ నీరజ్ చోప్రా మరోసారి భారతదేశ కీర్తిని ఇనుమడింప చేశాడు’అని సీఎం జగన్ ట్విట్టర్లో కొనియాడారు. కాగా, అమెరికాలోని యుజీన్‌లో వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఫైనల్లో నాలుగో ప్రయత్నంలో 88.13 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరిన నీరజ్ చోప్రా రజత పతకం సాధించాడు. Congratulations to champion @Neeraj_chopra1 on winning Silver in javelin throw at the #WorldAthleticsChampionships. Subedar Neeraj Chopra is truly the pride of the nation and the army 🇮🇳 — YS Jagan Mohan Reddy (@ysjagan) July 24, 2022 -
నీరజ్ చోప్రాపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించి సంచలనం సృష్టించిన భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపై ప్రధాని మోదీ ట్విటర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచపు అత్యుత్తమ అథ్లెట్లలో నీరజ్ ఒకడని కీర్తించారు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 19 ఏళ్ల భారత నిరీక్షణకు తెరదించుతూ నీరజ్ పతకం సాధించినందుకు అభినందనలు తెలుపుతూ.. భారత క్రీడల చరిత్రలో ఇదో ప్రత్యేకమైన రోజని అన్నారు. నీరజ్.. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీతో పాటు చాలామంది ప్రముఖులు, రాజకీయ నాయకులు నీరజ్‌కు అభినందనలు తెలిపారు. A great accomplishment by one of our most distinguished athletes! Congratulations to @Neeraj_chopra1 on winning a historic Silver medal at the #WorldChampionships. This is a special moment for Indian sports. Best wishes to Neeraj for his upcoming endeavours. https://t.co/odm49Nw6Bx — Narendra Modi (@narendramodi) July 24, 2022 కాగా, అమెరికాలోని యుజీన్‌లో వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఫైనల్లో నాలుగో ప్రయత్నంలో 88.13 మీటర్ల దూరం బళ్లాన్ని విసిరిన నీరజ్ చోప్రా రజత పతకం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తద్వారా ప్రస్తుత క్రీడల్లో భారత్ తరపున పతకం అందుకున్న తొలి వ్యక్తిగా, అంజూ బాబీ జార్జ్ (2003లో కాంస్యం) తర్వాత ఓవరాల్‌గా రెండో భారత అథ్లెట్‌గా రికార్డులకెక్కాడు. చదవండి: నీరజ్ చోప్రా మరో సంచలనం.. రెండో భారత అథ్లెట్‌గా రికార్డు -
Neeraj Chopra Latest Photos: శభాష్ నీరజ్ చోప్రా (ఫొటోలు)
-
నీరజ్ చోప్రా మరో సంచలనం.. రెండో భారత అథ్లెట్‌గా రికార్డు
ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా మరో మారు సంచలనం సృష్టించాడు. అమెరికాలోని యుజీన్ వేదికగా జరుగుతోన్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్-2022లో నీరజ్ చోప్రా రజత పతకం సాధించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో 88.13 మీటర్ల త్రోతో రెండో స్థానంలో నిలిచిన నీరజ్ చోప్రా.. సిల్వర్ మెడల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. నీరజ్ చోప్రా తన తొలి ప్రయత్నాన్ని ఫౌల్ త్రో తో ప్రారంభించాడు. రెండో ప్రయత్నంలో 82.39మీ విసిరి నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఇక మూడో ప్రయత్నంలో 86.37 మీటర్లు విసిరాడు. నాలుగో ప్రయత్నంలో 88.13 మీటర్లు త్రో చేశాడు. ఇక తన అఖరి ప్రయత్నంలో నీరజ్ ఫౌల్ త్రో చేశాడు. దీంతో నాలుగో ప్రయత్నంలో విసిన దూరాన్ని అత్యధికంగా లెక్కించారు. ఇక గ్రెనేడియన్ జావెలిన్ త్రోయర్ అండర్సన్ పీటర్స్ 90.54 దూరం విసిరి గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు. ఇక సిల్వర్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పతకం నెగ్గిన రెండో భారత అథ్లెట్‌గా నీరజ్ చోప్రా రికార్డులకెక్కాడు. అంతకు ముందు 2003లో పారిస్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత లాంగ్ జంపర్ అంజూ బాబి జార్జ్ కాంస్య పతకం సాధించింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: World Athletics Championship: పసిడి... ప్రపంచ రికార్డు -
World Athletics Championship: పసిడి... ప్రపంచ రికార్డు
యుజీన్ (అమెరికా): రేసు మొదలైన వెంటనే ట్రాక్‌పై వాయువేగంతో దూసుకెళ్తూ... ఒక్కో హర్డిల్‌ను అలవోకగా అధిగమిస్తూ... ఒక్కో ప్రత్యర్థిని వెనక్కి నెడుతూ... ఎవరూ ఊహించని సమయంలో లక్ష్యానికి చేరిన అమెరికా మహిళా అథ్లెట్ సిడ్నీ మెక్లాఫ్లిన్ తన పేరిట నాలుగోసారి ప్రపంచ రికార్డును లిఖించుకుంది. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా శనివారం జరిగిన మహిళల 400 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ ఈవెంట్లో 22 ఏళ్ల సిడ్నీ మెక్లాఫ్లిన్ 50.68 సెకన్లలో గమ్యానికి చేరి తొలిసారి స్వర్ణ పతకం సొంతం చేసుకోవడంతోపాటు ప్రపంచ రికార్డు సృష్టించింది. ప్రపంచ రికార్డు సాధించినందుకు సిడ్నీకి లక్ష డాలర్లు (రూ. 79 లక్షల 84 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఫెమ్కే బోల్ (నెదర్లాండ్స్; 52.27 సెకన్లు) రజతం, దాలియా మొహమ్మద్ (అమెరికా; 53.13 సెకన్లు) కాంస్యం సాధించారు. బంగారు పతకం గెలిచే క్రమంలో సిడ్నీ గత నెల 25న 51.41 సెకన్లతో తానే నెలకొల్పిన ప్రపంచ రికార్డును సవరించింది. గత 13 నెలల కాలంలో సిడ్నీ ప్రపంచ రికార్డును తిరగరాయడం ఇది మూడోసారి కావడం విశేషం. మహిళల జావెలిన్ త్రో ఫైనల్లో భారత క్రీడాకారిణి అన్ను రాణి జావెలిన్‌ను 61.12 మీటర్ల దూరం విసిరి ఏడో స్థానంలో నిలువగా... డిఫెండింగ్ చాంపియన్ కెల్సీ బార్బర్ (ఆస్ట్రేలియా; 66.91 మీటర్లు) స్వర్ణం సాధించింది. -
నిరాశపర్చిన అన్నూ రాణి.. ఆశలన్నీ గోల్డెన్ బాయ్‌పైనే..!
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్ బోణీ కొట్టేందుకు ఇంకా నిరీక్షించాల్సి ఉంది. ఏదో ఒక పతకం సాధిస్తుందని ఆశించిన మహిళా జావెలిన్ త్రోయర్ అన్నూ రాణి తాజాగా జరిగిన ఫైనల్స్‌లో ఆశించిన స్థాయి ప్రదర్శన కనబర్చలేక ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. ఐదు ప్రయత్నాల్లో భాగంగా అన్నూ ఒకేసారి 60 మీటర్లకు పైగా (61.12) బళ్లాన్ని (జావెలిన్) విసరగలిగింది. తొలి ప్రయత్నంలో 56.18 మీటర్ల దూరాన్ని విసిరిన అన్నూ.. ఆతర్వాత నాలుగు ప్రయత్నాల్లో 61.12, 58.14, 59.98, 58.70 మీటర్ల దూరం మాత్రమే బళ్లాన్ని విసిరి నిరాశపర్చింది. ఫలితంగా ఏడో స్థానంతో సరిపెట్టుకుని మెగా ఈవెంట్ నుంచి రిక్త హస్తాలతో నిష్క్రమించింది. ఫైనల్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కెల్సీ లీ బార్బర్ (ఆస్ట్రేలియా) మరోసారి సత్తా చాటి (66.91 మీ) స్వర్ణం కైవసం చేసుకోగా.. అమెరికాకు చెందిన కారా వింగర్ (64.05) రజతం, జపాన్ త్రోయర్ హరుకా కిటగుచి (63.27) కాంస్య పతకాలు సాధించారు. ఇదిలా ఉంటే, ప్రపంచ ఛాంపియన్షిప్స్ లో అన్నూ రాణి పోరాటం ముగియడంతో భారత్ ఆశలన్నీ టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ విజేత నీరజ్ చోప్రాపైనే ఉన్నాయి. క్వాలిఫికేషన్స్‌లో నీరజ్ తొలి ప్రయత్నంలోనే ఏకంగా 88.39 మీటర్ల దూరం విసిరి తుది పోరుకు అర్హత సాధించిన విషయం తెలిసిందే. నీరజ్‌తో పాటు మరో భారత క్రీడాకారుడు రోహిత్ యాదవ్ కూడా 11వ స్థానంతో ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఫైనల్స్ జరుగుతాయి. చదవండి: World Athletics Championship: పతకంపై ఆశలు! -
World Athletics Championship: పతకంపై ఆశలు!
యుజీన్ (అమెరికా): 46 ఏళ్ల ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కు ఇప్పటివరకు ఒక్క పతకమే వచ్చింది. 2003లో మహిళల లాంగ్‌జంప్‌లో అంజూ జార్జి కాంస్య పతకం సాధించింది. ఆ తర్వాత ఎనిమిదిసార్లు ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ జరిగినా భారత్ ఖాతాలో మాత్రం మరో పతకం చేరలేదు. అంతా సవ్యంగా సాగితే ఆదివారం ఉదయం భారత్ ఖాతాలో ఈ మెగా ఈవెంట్ నుంచి మరో పతకం చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత ఆశాకిరణం, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈ ఆశలను రేకెత్తిస్తున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించి యావత్ దేశాన్ని ఊపేసిన నీరజ్ చోప్రా ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ మెరుగైన ప్రదర్శనతో తొలి అడ్డంకి దాటాడు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం జరిగిన పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫయింగ్‌లో నీరజ్ తొలి ప్రయత్నంలోనే ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. ఫైనల్‌కు అర్హత సాధించాలంటే జావెలిన్‌ను 83.50 మీటర్ల దూరం విసరాలి లేదంటే ఓవరాల్‌గా టాప్–12లో నిలవాలి. అయితే నీరజ్ తొలి త్రోలోనే 83.50 మీటర్ల లక్ష్య దూరాన్ని అధిగమించాడు. 24 ఏళ్ల నీరజ్ ఈటెను 88.39 మీటర్ల దూరం విసిరి తన కెరీర్లో తొలిసారి ప్రపంచ చాంపియన్ షిప్ ఫైనల్‌కు అర్హత పొందాడు. ఓవరాల్‌గా అతని కెరీర్లో ఇది మూడో అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. 13 మంది పాల్గొన్న గ్రూప్ ‘ఎ’లో నీరజ్ అగ్రస్థానాన్ని... ఓవరాల్‌గా రెండో స్థానాన్ని అందుకున్నాడు. గ్రూప్ ‘బి’లో డిఫెండింగ్ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా) 89.91 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి టాప్ ర్యాంక్‌లో నిలిచాడు. గ్రూప్ ‘బి’లో ఉన్న భారత్‌కే చెందిన రోహిత్ యాదవ్ జావెలిన్‌ను 80.42 మీటర్ల దూరం విసిరి ఓవరాల్‌గా 11వ స్థానంతో ఫైనల్లోకి ప్రవేశించాడు. 12 మంది పోటీపడే జావెలిన్ త్రో ఫైనల్ భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 7 గంటలకు మొదలవుతుంది. ట్రిపుల్ జంపర్ పాల్ సంచలనం శుక్రవారం జరిగిన పురుషుల ట్రిపుల్ జంప్ క్వాలిఫయింగ్‌లో 25 ఏళ్ల ఎల్డోజ్ పాల్ 16.68 మీటర్ల దూరం గెంతి తన గ్రూప్ ‘ఎ’లో ఆరో స్థానంలో, ఓవరాల్‌గా 12వ స్థానంలో నిలిచి ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత ట్రిపుల్ జంపర్‌గా గుర్తింపు పొందాడు. భారత్‌కే చెందిన ప్రవీణ్ చిత్రావెల్ 17వ స్థానంలో, అబ్దుల్లా అబూబాకర్ 19వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందలేకపోయారు. ట్రిపుల్ జంప్ ఫైనల్ భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 6 గంటల 50 నిమిషాలకు మొదలవుతుంది. సోనీ టెన్–2 చానెల్లో, సోనీ లివ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం ఉంది. ఫైనల్లో నా 100 శాతం ప్రదర్శన ఇస్తా. ఏం జరుగుతుందో చూద్దాం. ప్రతి రోజు వేరుగా ఉంటుంది. ఏ రోజు ఎవరు ఎంత దూరం విసురుతారో చెప్పలేం. ఫైనల్‌కు చేరిన 12 మందిలో ఐదారుగురు ఈ సీజన్లో మంచి ఫామ్‌లో ఉన్నారు. – నీరజ్ చోప్రా -
ట్రిపుల్ జంప్ ఫైనల్లోకి ఎల్డోజ్ పౌల్.. తొలి భారత అథ్లెట్‌గా..!
అమెరికాలోని యుజీన్ వేదికగా జరగుతోన్న అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్-2022లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. ట్రిపుల్ జంప్ ఈవెంట్లో భారత ట్రిపుల్ జంపర్ ఎల్డోస్ పాల్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. శుక్రవారం జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్లో 16.68 మీటర్ల దూకి ఎల్డోస్ పాల్ ఫైనల్లో అడుగు పెట్టాడు. తద్వారా ప్రతిష్టాత్మక అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ట్రిపుల్ జంప్ విబాగంలో ఫైనల్‌కు చేరిన తొలి భారత అథ్లెట్‌గా ఎల్డోస్ పాల్ చరిత్ర సృష్టించాడు. ఇక ఇదే ఈవెంట్లో పాల్గొన్న భారత అథ్లెట్లు ప్రవీణ్ చిత్రవేల్, అబ్దుల్లా అబూబకర్ ఫైనల్‌కు చేరడంలో విఫలమయ్యారు. ఇక ఆదివారం జరగనున్న అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఎల్డోస్ పాల్ తలపడనున్నాడు. మరో వైపు శుక్రవారం ఉదయం జరిగిన జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ రౌండ్లో జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా,రోహిత్ యాదవ్ ఫైనల్‌కు చేరుకున్నారు. చదవండి:World Athletics Championships 2022:. ఫైనల్స్‌కు దూసుకెళ్లిన నీరజ్ చోప్రా -
వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్.. ఫైనల్స్‌కు దూసుకెళ్లిన నీరజ్ చోప్రా
ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా మరో సారి తన సత్తా చాటాడు. అమెరికాలోని యుజీన్ వేదికగా జరుగుతోన్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్-2022 ఫైనల్‌కు నీరజ్ చోప్రా చేరుకున్నాడు. శుక్రవారం ఉదయం జరిగిన గ్రూప్-ఏ జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ రౌండ్ తొలి ప్రయత్నంలోనే 88.39 మీటర్ల దూరం విసిరి నీరజ్ ఫైనల్లో అడుగుపెట్టాడు. ఇక అతడితో పాటు మరో భారత త్రోయర్ రోహిత్ యాదవ్ కూడా ఫైనల్స్‌కు చేరుకున్నాడు. అంతకుముందు అన్నూ రాణి మహిళల జావెలిన్ త్రో విభాగంలో ఫైనల్స్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇక ఫైనల్స్ భారత కాలమానం ప్రకారం ఆదివారం జరగనున్నాయి. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా పతకం సాధిస్తే.. రెండో భారత అథ్లెట్‌గా చరిత్ర సృష్టిస్తాడు. 2003లో పారిస్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత లాంగ్ జంపర్ అంజూ బాబి జార్జ్ కాంస్య పతకం నెగ్గింది. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఇప్పటి వరకు భారత్ కేవలం ఒకే ఒక పతకం మాత్రమే సాధించింది. చదవండి: IND vs WI: విరాట్ కోహ్లికి రెస్ట్ అవసరమా..? అసలే ఫామ్ కోల్పోయి..! As the commentator predicted, "he wants one & done" #NeerajChopra does it pretty quickly & with ease before admin's laptop could wake up 🤣 With 88.39m, Olympic Champion from 🇮🇳 #India enters his first #WorldAthleticsChamps final in some style 🫡 at #Oregon2022 pic.twitter.com/y4Ez0Mllw6 — Athletics Federation of India (@afiindia) July 22, 2022 -
World Athletics Championships 2022: నేడు బరిలో నీరజ్ చోప్రా
భారత క్రీడాభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పోరుకు రంగం సిద్ధమైంది. భారత స్టార్ అథ్లెట్, టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా నేడు బరిలోకి దిగబోతున్నాడు. జావెలిన్ త్రో క్వాలిఫయింగ్ ఈవెంట్లో అతనితో పాటు మరో భారత త్రోయర్ రోహిత్ యాదవ్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటాడు. ఆటోమెటిక్ క్వాలిఫయింగ్ మార్క్ 83.50 మీటర్లు (లేదా) కనీసం టాప్–12లో నిలిస్తే ఫైనల్‌కు అర్హత లభిస్తుంది. ఉ.గం. 5.35 నుంచి సోనీ చానల్స్, సోనీ లివ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
World Athletics Championships 2022: షెల్లీ... జగజ్జేత మళ్లీ
యుజీన్ (అమెరికా): మూడు పదుల వయసు దాటినా... ఒక మగబిడ్డకు తల్లి అయినా... విజయకాంక్ష ఉంటే అత్యున్నత వేదికపై అదరగొట్టడం సుసాధ్యమేనని జమైకా మేటి అథ్లెట్ షెల్లీ ఆన్ ఫ్రేజర్ ప్రైస్ నిరూపించింది. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 35 ఏళ్ల షెల్లీ ఆన్ ఫ్రేజర్ ఎవరికీ సాధ్యంకాని ఘనతను నమోదు చేసింది. మహిళల 100 మీటర్ల విభాగంలో షెల్లీ రికార్డుస్థాయిలో ఐదోసారి పసిడి పతకం సొంతం చేసుకుంది. తద్వారా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో ఒకే ఈవెంట్లో ఐదు స్వర్ణ పతకాలు గెలిచిన తొలి అథ్లెట్‌గా షెల్లీ కొత్త చరిత్ర లిఖించింది. సోమవారం జరిగిన మహిళల 100 మీటర్ల ఫైనల్లో షెల్లీ 10.67 సెకన్లలో అందరికంటే వేగంగా గమ్యానికి చేరి జగజ్జేతగా నిలిచింది. జమైకాకే చెందిన షెరికా జాక్సన్ (10.73 సెకన్లు) రజతం, ఎలైని థాంప్సన్ హెరా (10.81 సెకన్లు) కాంస్యం గెలుపొందారు. దాంతో ఈ మెగా ఈవెంట్ చరిత్రలో తొలిసారి మహిళల 100 మీటర్ల విభాగంలో ఒకే దేశానికి చెందిన ముగ్గురు అథ్లెట్స్ ఖాతాలో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు చేరాయి. గత ఏడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో 100 మీటర్ల విభాగంలోనూ జమైకా క్లీన్‌స్వీప్ చేసింది. ‘టోక్యో’లో షెరికా స్వర్ణం, షెల్లీ రజతం, ఎలైని థాంప్సన్ కాంస్యం సాధించారు. ►5: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 100 మీటర్ల విభాగంలో షెల్లీ నెగ్గిన స్వర్ణాలు. 2009 (బెర్లిన్), 2013 (మాస్కో), 2015 (బీజింగ్), 2019 (దోహా) ప్రపంచ చాంపియన్‌షిప్‌లలోనూ షెల్లీకి పసిడి పతకాలు లభించాయి. ►12: ప్రపంచ చాంపియన్‌షిప్‌లో వివిధ విభాగాల్లో షెల్లీ నెగ్గిన మొత్తం పతకాలు. అత్యధిక పతకాలు నెగ్గిన అథ్లెట్స్ జాబితాలో షెల్లీ మూడో స్థానంలో ఉంది. ఈ జాబితాలో అలీసన్ ఫెలిక్స్ (అమెరికా; 19 పతకాలు), మెర్లీన్ ఒట్టి (జమైకా; 14 పతకాలు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. -
100 మీటర్ల రేసులో అమెరికా అథ్లెట్స్ క్లీన్‌స్వీప్..
యుజీన్ (అమెరికా): ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పురుషుల 100 మీటర్ల విభాగంలో అమెరికా అథ్లెట్స్ క్లీన్‌స్వీప్ చేశారు. స్వర్ణ, రజత, కాంస్య పతకాలతో మెరిపించారు. ఫ్రెడ్ కెర్లీ 9.86 సెకన్లలో అందరికంటే వేగంగా గమ్యానికి చేరి పసిడి పతకం సాధించడంతోపాటు ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. అమెరికాకే చెందిన మార్విన్ బ్రేసీ, ట్రేవన్ బ్రోమెల్ ఇద్దరూ 9.88 సెకన్లలోనే గమ్యానికి చేరగా... ఫొటో ఫినిష్ ద్వారా బ్రేసీకి రజతం, బ్రోమెల్‌కు కాంస్యం ఖాయమయ్యాయి. దాంతో 1991 తర్వాత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పురుషుల 100 మీటర్ల విభాగంలో మళ్లీ క్లీన్‌స్వీప్ నమోదైంది. 1991లో కార్ల్ లూయిస్, లెరాయ్ బరెల్, డెనిస్ మిచెల్ అమెరికాకు స్వర్ణ, రజత, కాంస్య పతకాలు అందించారు. చదవండి: World Athletics Championships 2022: ఫైనల్లో ఏడో స్థానంతో సరిపెట్టిన శ్రీశంకర్ -
World Athletics Championships: ఫైనల్‌కు చేరిన శ్రీశంకర్.. తొలి భారతీయుడిగా రికార్డు!
అమెరికాలోని యుజీన్ వేదికగా జరుగుతోన్న వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారతీయ లాంగ్ జంప్ అథ్లెట్ మురళీ శ్రీశంకర్ చరిత్ర సృష్టించాడు. శనివారం జరిగిన క్వాలిఫికేషన్స్ రౌండ్లో 8 మీటర్ల జంప్ చేసిన శ్రీశంకర్ పురుషుల లాంగ్‌జంప్ విభాగంలో ఫైనల్‌కు అర్హత సాధించాడు. తద్వారా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ లాంగ్‌జంప్‌లో ఫైనల్‌కు చేరిన తొలి పురుష అథ్లెట్‌గా శ్రీశంకర్ రికార్డులకెక్కాడు. కాగా 2003 పారిస్ వేదికగా వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ మహిళల లాంగ్ జంప్ విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయరాలుగా అంజు బాబీ జార్జ్ నిలిచింది. ఇక ఇదే ఈవెంట్లో పోటీ పడ్డ మరో ఇద్దరు భారత అథ్లెట్లు జస్విన్ ఆల్డ్రిన్ (7.79 మీ), మొహమ్మద్ అనీస్ యాహియా (7.73 మీ) లు ఫైనల్‌కు ఆర్హత సాధించ లేకపోయారు. అదే విధంగా ఈ టోర్నీలో అవినాష్ సాబ్లే 3వేల మీటర్ల స్టీపుల్‌చేజ్ క్రీడలో 8:18.75 టైమింగ్‌తో మూడవ స్థానంలో నిలిచి.. ఫైనల్‌కు అర్హత సాధించాడు. భారత ఆర్మీ ఉద్యోగి అయినా అవినాష్ 8:8:75 నిమిషాల్లో పూర్తిచేసి నేరుగా ఫైనల్లో అడుగు పెట్టాడు. చదవండి: World Athletics Championships: 90 మీటర్లే టార్గెట్‌గా.. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా -
90 మీటర్లే టార్గెట్‌గా.. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా
ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు ఒరేగాన్‌లో అడుగుపెట్టాడు. ఈ నేపథ్యంలో అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ జరగనున్న హ్యూజిన్లోని హెవార్డ్ స్టేడియంలో నిలబడి ఫోటోకు ఫోజు ఇచ్చాడు. దీనిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్న నీరజ్.. ''హేవార్డ్ ఫీల్డ్ స్టేడియం.. పతకమే లక్ష్యంగా'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇటీవల డైమండ్ లీగ్‌లో చక్కటి ప్రదర్శన కనబర్చిన నీరజ్.. రెండుసార్లు తన వ్యక్తిగత రికార్డును మెరుగుపర్చుకున్నాడు. 90 మీటర్లకు దరిదాపుల్లో ఉన్న నీరజ్ ఇదే జోష్‌లో వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో దేశానికి తొలి పసిడి అందించాలని తహతహలాడుతున్నాడు. ఇక నీరజ్ చోప్రా సారథ్యంలో భారత అథ్లెట్ల బృందం ఇప్పటికే ప్రపంచ చాంపియన్‌షిప్ బరిలోకి దిగింది. ఇప్పటి వరకు ఈ పోటీల్లో భారత్ నుంచి అంజూబాబి జార్జ్ (కాంస్యం, లాంగ్‌జంప్) మాత్రమే పతకం నెగ్గింది. ఆ తర్వాత మరే అథ్లెట్ ఈ వేదికపై మెడల్ సాధించలేకపోగా.. ఆ లోటు భర్తీ చేసేందుకు నీరజ్ చోప్రా సిద్ధమవుతున్నాడు. మరోవైపు లాంగ్‌జంప్‌లో మురళీ శ్రీశంకర్, పురుషుల 3 వేల మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో అవినాష్ సాబ్లే ఫైనల్ చేరి పతకం ఆశలు రేకెత్తిస్తున్నారు. ఇక షాట్‌పుట్‌లో తజిందర్‌పాల్ సింగ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. View this post on Instagram A post shared by Neeraj Chopra (@neeraj___chopra) చదవండి: Allyson Felix: మాట నిలబెట్టుకున్న దిగ్గజ అథ్లెట్.. కెరీర్‌కు గుడ్‌బై -
ఆర్ఆర్ఆర్ సినీ ప్రియులకు.. అయితే, కెకెకె క్రీడాభిమానులకు.. కాస్కో... చూస్కో...
సాక్షి క్రీడా విభాగం: ఈ ఏడాది ఆర్.ఆర్.ఆర్. తెగ ఆకర్షిస్తోంది. ఇది పూర్తిగా సినీ ప్రియులకు సంబంధించిన వ్యవహారం. అలాగే ఈ ఏడాది కె.కె.కె (క్రికెట్... క్రీడలు... ఖేల్) కూడా కనీవినీ ఎరుగని రీతిలో అలరించేందుకు, అదరగొట్టేందుకు, బ్రహ్మాండాన్ని బద్దలు చేసేందుకు ముస్తాబైంది. ఈ కె.కె.కె ప్రత్యేకతలు తెలుసుకుందాం. క్రికెట్ విషయానికొస్తే ఐపీఎల్ మెగా వేలం నుంచి లీగ్ దాకా, అలాగే పురుషుల టి20 ప్రపంచకప్, కుర్రాళ్లు (అండర్–19), అమ్మాయిల ప్రపంచకప్ (వన్డే)లు, ఇతరత్రా టోర్నీలున్నాయి. క్రీడలు... అంటే ఈ ఏడాది జరగబోయే మెగా ఈవెంట్స్ అన్నీ లోకాన్నే మైదానంలో కూర్చోబెట్టేంత రద్దీతో ఉన్నాయి. కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు, ఫుట్‌బాల్ ప్రపంచకప్, వింటర్ ఒలింపిక్స్ ఇలా దేనికదే తీసిపోనంత ప్రతిష్టాత్మక ఈవెంట్లు. అన్నీ సై అంటే సై అనే క్రీడలే! ఖేల్... అంటే క్రికెట్, మెగా ఈవెంట్లు కాకుండా జరిగే టోర్నీలు. ప్రపంచ అథ్లెటిక్స్, ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడలు, ప్రపంచ ఆర్చరీకప్, ప్రపంచకప్ షూటింగ్ పోటీలతో పాటు రెగ్యులర్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలు, బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్, ఫార్ములావన్ రేసింగ్, రెజ్లింగ్, బాక్సింగ్ పంచ్‌లతో ఈ పన్నెండు నెలలు పండంటి వినోదమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ► అండర్–19 క్రికెట్ వరల్డ్‌కప్ వేదిక: వెస్టిండీస్ జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు ► మహిళల క్రికెట్ వన్డే వరల్డ్‌కప్ వేదిక: న్యూజిలాండ్ మార్చి 4 నుంచి ఏప్రిల్ 3 వరకు ► భారత పురుషుల క్రికెట్ జట్టు షెడ్యూల్ దక్షిణాఫ్రికాలో పర్యటన జనవరి 3 నుంచి 23 వరకు 2 టెస్టులు, 3 వన్డేలు ► ఐపీఎల్–2022 మెగా వేలం వేదిక: బెంగళూరు ఫిబ్రవరి 12, 13 ► భారత్‌లో వెస్టిండీస్ పర్యటన ఫిబ్రవరి 6 నుంచి 20 వరకు 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌లు ► భారత్‌లో శ్రీలంక పర్యటన ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు 2 టెస్టులు, 3 టి20 మ్యాచ్‌లు ► భారత్‌లో దక్షిణాఫ్రికా పర్యటన జూన్ 9 నుంచి 19 వరకు 5 టి20 మ్యాచ్‌లు ► ఇంగ్లండ్‌లో భారత్ పర్యటన జూలై 1 నుంచి 17 వరకు 1 టెస్టు, 3 టి20లు, 3 వన్డేలు ► న్యూజిలాండ్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు పర్యటన ఫిబ్రవరి 5 నుంచి 24 వరకు 1 టి20 మ్యాచ్, 5 వన్డేలు ► ఫార్ములావన్ ఈ ఏడాది ఫార్ములావన్ (ఎఫ్1)లో మొత్తం 23 రేసులు జరుగుతాయి. మార్చి 20న బహ్రెయిన్ గ్రాండ్‌ప్రితో ఎఫ్1 సీజన్ మొదలవుతుంది. అనంతరం సౌదీ అరేబియా (మార్చి 27), ఆస్ట్రేలియా (ఏప్రిల్ 10), ఇటలీ (ఏప్రిల్ 24), మయామి–యూఎస్ఏ (మే 8), స్పెయిన్ (మే 22), మొనాకో (మే 29), అజర్బైజాన్ (జూన్ 12), కెనడా (జూన్ 19), బ్రిటన్ (జూలై 3), ఆస్ట్రియా (జూలై 10), ఫ్రాన్స్ (జూలై 24), హంగేరి (జూలై 31), బెల్జియం (ఆగస్టు 28), నెదర్లాండ్స్ (సెప్టెంబర్ 4), ఇటలీ (సెప్టెంబర్ 11), రష్యా (సెప్టెంబర్ 25), సింగపూర్ (అక్టోబర్ 2), జపాన్ (అక్టోబర్ 9), ఆస్టిన్–యూఎస్ఏ (అక్టోబర్ 23), మెక్సికో (అక్టోబర్ 30), బ్రెజిల్ (నవంబర్ 13) గ్రాండ్‌ప్రి రేసులు ఉన్నాయి. చివరగా నవంబర్ 20న అబుదాబి గ్రాండ్‌ప్రి రేసుతో సీజన్ ముగుస్తుంది. ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్ వేదిక: ఇస్తాంబుల్ (టర్కీ) మే 6 నుంచి 21 వరకు ► వింటర్ ఒలింపిక్స్ వేదిక: బీజింగ్ (చైనా) ఫిబ్రవరి 4–20 పాల్గొనే దేశాలు: 84 ► కామన్వెల్త్ గేమ్స్ వేదిక: బర్మింగ్హమ్ (ఇంగ్లండ్) జూలై 28–ఆగస్టు 8 ► కామన్వెల్త్ గేమ్స్ వేదిక: బర్మింగ్హమ్ (ఇంగ్లండ్) జూలై 28–ఆగస్టు 8 ► ఆసియా క్రీడలు వేదిక: హాంగ్జౌ (చైనా) సెప్టెంబర్ 10–25 ► ఫుట్‌బాల్ ప్రపంచకప్ వేదిక: ఖతర్ నవంబర్ 21–డిసెంబర్ 18 పాల్గొనే జట్లు: 32 ► ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ వేదిక: ఒరెగాన్ (అమెరికా) జూలై 15–24 ► ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడలు వేదిక: చెంగ్డూ (చైనా) జూన్ 26–జూలై 7 ► ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ వేదిక: బెల్గ్రేడ్ (సెర్బియా); సెప్టెంబర్ 10–18 ► పురుషుల టి20 క్రికెట్ వరల్డ్‌కప్ వేదిక: ఆస్ట్రేలియా అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 షూటింగ్ ► ప్రపంచకప్ షాట్‌గన్ టోర్నీ వేదిక: రబాట్ (మొరాకో); ఫిబ్రవరి 7–18 ► ప్రపంచకప్ రైఫిల్, పిస్టల్ టోర్నీ వేదిక: కైరో (ఈజిప్ట్); ఫిబ్రవరి 26–మార్చి 8 ► ప్రపంచకప్ షాట్‌గన్ టోర్నీ వేదిక: నికోసియా (సైప్రస్); మార్చి 8–19 ► ప్రపంచకప్ షాట్‌గన్ టోర్నీ వేదిక: లిమా (పెరూ); మార్చి 27–ఏప్రిల్ 7 ► ప్రపంచకప్ రైఫిల్, పిస్టల్ టోర్నీ వేదిక: రియో డి జనీరో (బ్రెజిల్); ఏప్రిల్ 9–19 ► ప్రపంచకప్ షాట్‌గన్ టోర్నీ వేదిక: లొనాటో (ఇటలీ); ఏప్రిల్ 19–30 ► ప్రపంచకప్ రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ టోర్నీ వేదిక: బాకు (అజర్బైజాన్); మే 27–జూన్ 9 ► ప్రపంచకప్ రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ టోర్నీ వేదిక: చాంగ్వాన్ (కొరియా); జూలై 9–22 ► ప్రపంచ షాట్‌గన్ చాంపియన్‌షిప్ వేదిక: క్రొయేషియా; సెప్టెంబర్ 27– అక్టోబర్ 10 ► ప్రపంచ రైఫిల్, పిస్టల్ చాంపియన్‌షిప్ వేదిక: కైరో (ఈజిప్ట్); అక్టోబర్ 12–25 ఆర్చరీ ► ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీ వేదిక: అంటాల్యా; ఏప్రిల్ 18–24 ► ప్రపంచకప్ స్టేజ్–2 టోర్నీ వేదిక: గ్వాంగ్జు; మే 16–22 ► ప్రపంచకప్ స్టేజ్–3 టోర్నీ వేదిక: పారిస్ (ఫ్రాన్స్); జూన్ 20–26 ► ప్రపంచకప్ స్టేజ్–4 టోర్నీ వేదిక: మెడెలిన్ (కొలంబియా); జూలై 18–24 బ్యాడ్మింటన్ ► ఇండియా ఓపెన్ సూపర్–500 టోర్నీ వేదిక: న్యూఢిల్లీ జనవరి 11–16 ► సయ్యద్ మోదీ ఓపెన్ సూపర్–300 టోర్నీ వేదిక: లక్నో జనవరి 18 –23 ► ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సూపర్–1000 టోర్నీ వేదిక: బర్మింగ్హమ్; మార్చి 16 –20 ► థామస్ కప్, ఉబెర్ కప్ ఫైనల్స్ టోర్నీ వేదిక: బ్యాంకాక్; మే 8 –15 ► ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 టోర్నీ వేదిక: జకార్తా;జూన్ 14 –19 ► ప్రపంచ చాంపియన్‌షిప్ వేదిక: టోక్యో; ఆగస్టు 21 –28 ► వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ వేదిక: గ్వాంగ్జౌ;డిసెంబర్ 14 –18 ► టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆస్ట్రేలియన్ ఓపెన్ వేదిక: మెల్బోర్న్ జనవరి 17–30 ► ఫ్రెంచ్ ఓపెన్ వేదిక: పారిస్ మే 22– జూన్ 5 ► వింబుల్డన్ ఓపెన్ వేదిక: లండన్; జూన్ 27–జూలై 10 ► యూఎస్ ఓపెన్ వేదిక: న్యూయార్క్; ఆగస్టు 29–సెప్టెంబర్ 11 -
స్టార్ అథ్లెట్ అలెక్స్ క్వినెజ్ కాల్చివేత...
క్విటో: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో ఈక్వెడార్‌కు తొలి పతకాన్ని అందించిన అథ్లెట్ అలెక్స్ క్వినెజ్ను దుండగులు కాల్చిచంపారు. గ్వాయకిల్ నగరంలో అతను కాలి్చవేతకు గురైనట్లు పోలీసులు తెలిపారు. 32 ఏళ్ల అలెక్స్ 2019లో దోహాలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 200 మీటర్ల స్ప్రింట్‌లో కాంస్య పతకం సాధించాడు. టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించినప్పటికీ ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ‘ఎప్పుడు ఎక్కడ ఉన్నాడు’ అనే నిబంధన అతిక్రమించడంతో సస్పెన్షన్‌కు గురయ్యాడు. అథ్లెట్ మృతిపట్ల ఈక్వెడార్ అధ్యక్షుడు గులెర్మో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చదవండి: T20 World Cup 2021 Ind Vs Pak: ‘అసలేం చేశారయ్యా.. ఆ సెలక్షన్ ఏంటి?’ -
భారత జట్టులో శ్రీనివాస్, నందినికి చోటు
న్యూఢిల్లీ: ఈనెల 17 నుంచి 22 వరకు కెన్యాలోని నైరోబీలో జరిగే ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత పురుషుల, మహిళల జట్లను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్, తెలంగాణకు చెందిన అగసార నందినిలకు భారత జట్టులో చోటు లభించింది. శ్రీనివాస్ 200 మీటర్ల విభాగంలో... నందిని 100 మీటర్ల హర్డిల్స్‌లో ప్రాతినిధ్యం వహిస్తారు. దిగ్గజ అథ్లెట్ పీటీ ఉష ఆధ్వర్యంలోని సెలెక్షన్ కమిటీ మొత్తం 28 మందితో కూడిన భారత జట్టును ఎంపిక చేసింది. -
అదే కథ... అదే వ్యథ!
మరో ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ముగిసింది. ఆశల పల్లకి మోస్తూ బరిలోకి దిగిన భారత బృందం రిక్తహస్తాలతో వెనుదిరిగి వచ్చింది. చిన్నాచితక దేశాలూ పతకాలు కొల్లగొడుతున్న వేళ భారత్ మాత్రం నిరాశపరుస్తోంది. కారణాలు ఏమైనా... మనోళ్లు ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్‌షిప్, గ్రాండ్‌ప్రి సిరీస్‌లలోనే మెరిపిస్తారని... అందరి దృష్టి కేంద్రీకృతమయ్యే విశ్వ వేదికలపై మాత్రం తడబడతారని మరోసారి తేటతెల్లం అయ్యింది. సాక్షి క్రీడా విభాగం పదహారేళ్ల క్రితం అంజూ బాబీ జార్జి మహిళల లాంగ్‌జంప్‌లో కాంస్య పతకం సాధించిన తర్వాత పలువురు భారత క్రీడాకారులు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఫైనల్స్ వరకు వెళ్లినా పోడియంపై మాత్రం స్థానం సంపాదించలేకపోతున్నారు. ఈ మెగా ఈవెంట్‌కు ముందు పాల్గొనే సన్నాహక టోర్నమెంట్లలో పతకాలు సాధించి ఆశలు రేకెత్తించి... తీరా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మాత్రం చేతులెత్తుస్తున్నారు. ఒత్తిడికి తలవంచుతారో... పోటీతత్వానికి తట్టుకోలేకపోతారోగానీ కొందరు అగ్రశ్రేణి అథ్లెట్స్ సీజన్లో తమ అత్యుత్తమ ప్రదర్శనను పునరావృతం చేయలేకపోతారు. మూడు ఈవెంట్స్‌లో ఫైనల్స్ చేరడం... రెండు ఒలింపిక్ బెర్త్‌లు దక్కించుకోవడం మినహా ఈసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత ప్రదర్శన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విశేషాలు లేవు. మహిళల జావెలిన్ త్రోలో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ క్రీడాకారిణిగా అన్ను రాణి గుర్తింపు పొందడం... 4్ఠ400 మీటర్ల మిక్స్డ్ రిలేలో భారత బృందం ఫైనల్‌కు చేరడంతోపాటు ఒలింపిక్ బెర్త్ సాధించడం... పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ చేజ్లో అవినాశ్ సాబ్లే మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు తన పేరిటే ఉన్న జాతీయ రికార్డులను సవరించడం, టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం మనకు కాస్త ఊరటనిచ్చాయి. ఆసియా చాంపియన్‌షిప్‌లలో మెరిపించే భారత క్రీడాకారులు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో టాప్–5లో కూడా ఉండటం లేదు. పురుషుల షాట్‌పుట్ విభాగంలో ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్ అయిన తజీందర్ పాల్ క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరిగాడు. మహిళల 100 మీటర్ల విభాగంలో ద్యుతీ చంద్ హీట్స్‌లోనే ఇంటిదారి పట్టింది. 4్ఠ400 మీటర్ల పురుషుల, మహిళల విభాగం రిలేల్లోనూ భారత బృందాలు నిరాశ పరిచాయి. అమెరికా అదుర్స్... మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకున్న అమెరికా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. 14 స్వర్ణాలు, 11 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి మొత్తం 29 పతకాలను గెల్చుకుంది. ఇక ఈ మెగా ఈవెంట్లో నమోదైన మూడు ప్రపంచ రికార్డులు అమెరికా అథ్లెట్స్ సాధించడం విశేషం. మహిళల 400 మీటర్ల హర్డిల్స్ విభాగంలో దలీలా మొహమ్మద్ 52.16 సెకన్లలో గమ్యానికి చేరి 52.20 సెకన్లతో తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. టైరెల్ రిచర్డ్, జెస్సికా బియర్డ్, జాస్మిన్ బ్లాకర్, ఒబి ఇగ్బోక్విలతో కూడిన అమెరికా మిక్స్డ్ రిలే బృందం 4్ఠ400 హీట్స్‌లో 3ని:12.42 సెకన్లతో ప్రపంచ రికార్డును సృష్టించగా... ఫైనల్లో పోటీపడిన అలీసన్ ఫెలిక్స్, విల్బెర్ట్, కొట్నీ ఒకోలో, మైకేల్ చెర్రీలతో కూడిన అమెరికా మిక్స్డ్ రిలే బృందం 3ని:09.34 సెకన్లతో హీట్స్‌లో తమ సహచర బృందం నెలకొల్పిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఆఫ్రికా ఆకట్టుకుంది.... అమెరికాకు ఎదురులేకున్నా... ఆఫ్రికా దేశాల అథ్లెట్స్ కూడా ఈసారీ తమ సత్తాను చాటుకున్నారు. పతకాల పట్టికలో టాప్–10లో మూడు ఆఫ్రికా దేశాలు ఉండటం విశేషం. కెన్యా 5 స్వర్ణాలు, 2 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి 11 పతకాలతో రెండో స్థానం సాధించడం గమనార్హం. ఇథియోపియా 2 స్వర్ణాలు, 2 రజతాలు, ఒక కాంస్యంతో ఐదో స్థానాన్ని దక్కించుకుంది. ఉగాండా రెండు స్వర్ణాలతో పదో స్థానంలో నిలిచింది. అమ్మలు అదరగొట్టారు... తల్లి హోదా వచ్చాక ఆటకు దూరంగా ఉండాల్సిన అవసరం లేదని... పట్టుదలతో కృషి చేస్తే అద్భుతాలు చేయవచ్చని ఈ మెగా ఈవెంట్లో స్టార్ అథ్లెట్స్ నియా అలీ, షెల్లీ యాన్ ఫ్రేజర్, అలీసన్ ఫెలిక్స్ (అమెరికా) నిరూపించారు. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో ఇద్దరు పిల్లల తల్లి అయిన నియా అలీ (అమెరికా)... 100 మీటర్ల విభాగంలో జమైకా స్టార్ షెల్లీ యాన్ ఫ్రేజర్... 4్ఠ400 మీటర్ల మిక్స్డ్ రిలేలో అలీసన్ ఫెలిక్స్ స్వర్ణాలు సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. మిక్స్డ్ రిలేలో స్వర్ణం సాధించిన క్రమంలో అలీసన్ ఫెలిక్స్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అత్యధికంగా 11 స్వర్ణాలతో ఉసేన్ బోల్ట్ (జమైకా) పేరిట ఉన్న రికార్డును 12వ పసిడి పతకంతో సవరించింది. నియా అలీ షెల్లీ ఫెలిక్స్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత ప్రదర్శన మహిళల విభాగం 100 మీటర్లు: ద్యుతీ చంద్ (11.48 సెకన్లతో తన హీట్స్‌లో ఏడో స్థానం. ఓవరాల్‌గా 47 మందిలో 37వ స్థానం). 200 మీటర్లు: అర్చన (23.65 సెకన్లతో తన హీట్స్‌లో ఎనిమిదో స్థానం. ఓవరాల్‌గా 43 మందిలో 40వ స్థానం) 400 మీటర్లు: అంజలి దేవి (52.33 సెకన్లతో తన హీట్స్‌లో ఆరో స్థానం. ఓవరాల్‌గా 47 మందిలో 37వ స్థానం). 1500 మీటర్లు: చిత్రా ఉన్నికృష్ణన్ (4ని:11.10 సెకన్లతో తన హీట్స్‌లో ఎనిమిదో స్థానం. ఓవరాల్‌గా 35 మందిలో 30వ స్థానం). జావెలిన్ త్రో: అన్ను రాణి (క్వాలిఫయింగ్‌లో 62.43 మీటర్లతో గ్రూప్ ‘ఎ’లో మూడో స్థానం. ఓవరాల్‌గా ఐదో స్థానం. 12 మంది పాల్గొన్న ఫైనల్లో 61.12 మీటర్లతో ఎనిమిదో స్థానం). 4x400 మీటర్ల రిలే: (జిస్నా మాథ్యూ, పూవమ్మ రాజు, విస్మయ, శుభాలతో కూడిన బృందం 3ని:29.42 సెకన్లతో హీట్స్‌లో ఆరో స్థానం) పురుషుల విభాగం 400 మీటర్ల హర్డిల్స్: జబీర్ మదారి (49.62 సెకన్లతో తన హీట్స్‌లో మూడో స్థానంలో నిలిచి సెమీఫైనల్ చేరాడు. అనంతరం మూడో సెమీఫైనల్లో 49.71 సెకన్లతో ఐదో స్థానంలో నిలిచి ఫైనల్ చేరలేకపోయాడు); ధరుణ్ అయ్యసామి (50.55 సెకన్లతో తన హీట్స్‌లో ఆరో స్థానం). 1500 మీటర్లు: జిన్సన్ జాన్సన్ (3ని:39.86 సెకన్లతో తన హీట్స్‌లో పదో స్థానం. ఓవరాల్‌గా 43 మందిలో 34వ స్థానం) 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్: అవినాశ్ సాబ్లే (హీట్స్‌లో 8ని:25.23 సెకన్లతో ఏడో స్థానంలో నిలిచి ఫైనల్ చేరిక. 15 మంది పాల్గొన్న ఫైనల్లో 8ని:21.37 సెకన్లతో 13వ స్థానం) 4x400 మీటర్ల రిలే: (జాకబ్, అనస్, జీవన్, నోవా నిర్మల్‌లతో కూడిన భారత బృందం తమ హీట్స్‌లో 3ని:03.09 సెకన్లతో ఏడో స్థానం) 20 కిలోమీటర్ల నడక: ఇర్ఫాన్ (గంటా 35ని.12 సెకన్లతో 27వ స్థానం); దేవేందర్ సింగ్ (గంటా 41ని.48 సెకన్లతో 36వ స్థానం). మారథాన్: గోపీ (2గం:15ని.57 సెకన్లతో 21వ స్థానం) లాంగ్‌జంప్: శ్రీశంకర్ (14 మంది పోటీపడిన క్వాలిఫయింగ్ గ్రూప్ ‘బి’లో 7.62 మీటర్లతో 12వ స్థానం). జావెలిన్ త్రో: శివపాల్ సింగ్ (16 మంది పోటీపడిన క్వాలిఫయింగ్ గ్రూప్ ‘ఎ’లో 78.97 మీటర్లతో పదో స్థానం. ఓవరాల్‌గా 30 మందిలో 24వ స్థానం) షాట్‌పుట్: తజీందర్ సింగ్ (18 మంది పోటీపడిన క్వాలిఫయింగ్ గ్రూప్ ‘బి’లో 20.43 మీటర్లతో ఎనిమిదో స్థానం) 4x400 మిక్స్డ్ రిలే: (అనస్, నోవా, జిస్నా, విస్మయలతో కూడిన భారత బృందం హీట్స్‌లో 3ని:16.14 సెకన్లతో మూడో స్థానం. ఎనిమిది జట్లు పాల్గొన్న ఫైనల్లో 3ని:15.77 సెకన్లతో ఏడో స్థానం) కనీసం ఒక పతకమైనా సాధించిన దేశాల సంఖ్య:43 ఈ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కనీసం ఒక స్వర్ణమైనా సాధించిన దేశాల సంఖ్య:20 పురుషుల 4x400 మీటర్ల హీట్స్‌లో భారత అథ్లెట్స్ -
బోల్ట్ ‘వరల్డ్’ రికార్డును బ్రేక్ చేశారు..
దోహా: సుమారు తొమ్మిది సంవత్సరాలపాటు అతని ముందు గాలికూడా జొరబడలేని వేగంతో అత్యధిక ప్రపంచ చాంపియన్ పతకాలూ గెలుచుకున్న జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ రికార్డు బ్రేక్ అయ్యింది. అమెరికాకు చెందిన మహిళా స్ప్రింటర్ అలిసన్ ఫెలిక్స్.. బోల్ట్ వరల్డ్ రికార్డును బద్ధలు కొట్టారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఫెలిక్స్ 4/400 మీటర్ల మిక్స్డ్ రిలేలో స్వర్ణం పతకం సాధించడంతో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఓవరాల్‌గా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకూ ఫిలెక్స్ 12 స్వర్ణ పతకాలను సాధించి కొత్త రికార్డుకు నాంది పలికారు. అంతకుముందు ఈ రికార్డు ఉసేన్ బోల్ట్ పేరిట ఉంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బోల్ట్ 11 పసిడి పతకాలు సాధించగా దాన్ని ఫెలిక్స్ సవరించారు. 4/400 మిక్స్డ్ రిలేలో ఫెలిక్స్ రెండో లెగ్ నుంచి పోరును ఆరంభించారు. అయితే ఈ టైటిల్‌ను గెలిచే క్రమంలో అమెరికా మిక్స్డ్ రిలే జట్టు 3 నిమిషాల 9.34 సెకండ్లలో పరుగును పూర్తి చేసి విజేతగా నిలిచింది. ఇది సరికొత్త వరల్డ్ రికార్డుగా నమోదైంది. ఇలా 4/400 మిక్స్డ్ రిలేలో అమెరికా జట్టు వరల్డ్ రికార్డును బ్రేక్ చేయడం రెండోసారి. ఇక్కడ జమైకా, బెహ్రయిన్ జట్లను వెనక్కునెట్టి టైటిల్‌ను అందుకున్నారు. ఇక ఫెలిక్స్ ఓవరాల్ ప్రపంచ చాంపియన్‌షిప్ ప్రదర్శనలో మహిళల 200 మీటర్ల రేసులో మూడు స్వర్ణాలు గెలుచుకోగా, 400 మీటర్ల రేసులో ఒక పసిడిని అందుకున్నారు. 4/100 మీటర్ల మహిళల రిలేలో మూడు స్వర్ణ పతకాలను ఫెలిక్స్ సాధించారు. ఇక 4/400 మీటర్ల మహిళల రిలేలో నాలుగు బంగారు పతకాలను అందుకున్నారు. తాజాగా 4/400 మిక్స్డ్ రిలేలో ఫెలిక్స్‌కు ఇది స్వర్ణం. అయితే ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఫెలిక్స్‌కు మొదటి స్వర్ణం కావడం విశేషం. -
గోల్డ్ గెలిచినా.. జాతీయ గౌరవం లేదు!
దోహా: సాధారణంగా ప్రధాన ఈవెంట్లలో పతకాలు సాధించిన అథ్లెట్లకు ఆ దేశ జాతీయ గీతంతో గౌరవాన్ని ఇస్తారు. అదే సమయంలో సదరు అథ్లెట్ జాతీయ జెండాను తన ఒంటిపై వేసుకోవడం చూస్తూ ఉంటాం. కాకపోతే ఐఏఏఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న రష్యాకు చెందిన పోల్ వాల్టర్ అంజెలికా సిదోరోవా పసిడి పతకం సాధించినా ఆమెకు జాతీయ గౌరవం దక్కలేదు. అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆదివారం జరిగిన పోటీలో సిదోరోవా 4.95 మీటర్లు ఎత్తు ఎగిరి స్వర్ణాన్ని సాధించారు. అయినప్పటికీ ఆమెకు దక్కాల్సిన గౌరవానికి దూరంగా ఉండిపోయింది. కనీసం పతకం సాధించిన తర్వాత జాతీయ జెండాతో ఆనందాన్ని పంచుకోవడానికి కూడా నోచుకోలేదు. ఇక్కడ రజత, కాంస్య పతకాలు సాధించిన వారు మాత్రం తమ జాతీయ జెండాలతో మైదానమంతా కలియ తిరిగితే సిదోరోవా మాత్రం కేవలం చప్పట్లతోనే సంతోషాన్ని పంచుకున్నారు. ఇందుకు కారణంగా రష్యన్ అథ్లెట్లపై గత నాలుగేళ్లుగా డోపింగ్ ఆరోపణలు చుట్టముట్టడమే. అప్పట్నుంచి రష్యన్ అథ్లెట్లపై నిషేధాన్ని వాడా పెంచుకుంటూ పోతుంది. అయితే ప్రస్తుత అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రష్యన్ అథ్లెట్లు బరిలోకి దిగడానికి అనుమతి ఇచ్చినా వారి జాతీయ జెండాలను దూరం పెట్టాలని నిబంధనతో పాటు పతకాలు సాధించిన క్రమంలో ఆ దేశం జాతీయ గీతాన్ని సైతం ఆలపించరాదనే నియమాన్ని పెట్టింది. ఈ క్రమంలోనే సిదోరోవా పసిడితో మెరిసినా ఆమెకు తటస్థ అథ్లెట్‌గానే మిగిలిపోయింది. ఈ పోల్ వాల్ట్ పోరులో అమెరికాకు చెందిన శాండి మోరిస్ రజతం సాధించగా, గ్రీస్ దేశానికి చెందిన ఏకాతెరిణి స్టిఫనిది కాంస్యం సాధించారు. దీనిపై సిదోరోవా మాట్లాడుతూ.. ‘స్వర్ణం అనేది స్వర్ణమే. నేను పసిడిని సాధించినందుకు సంతోషంగా ఉన్నా. నాకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు. అయినా స్వర్ణం సాధించడం చాలా ఆనందాన్ని కల్గిస్తుంది’ అని అన్నారు. -
ఒలింపిక్ విజేతకు షాక్
ఎలైన్ థామ్సన్ ఘోర వైఫల్యం మహిళల 100 మీటర్ల విజేత టోరీ బోవీ లండన్: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ స్ప్రింట్స్‌లో మరో సంచలనం... ఈసారి మహిళల విభాగంలో! 100 మీటర్ల పరుగులో రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత ఎలైన్ థామ్సన్‌కు పరాభవం ఎదురైంది. కనీసం ఆమె పతకం కూడా గెలవలేకపోయింది. 10.98 సెకన్లతో ఐదో స్థానంతో సరి పెట్టుకుంది. ఈ పోటీల్లో అమెరికాకు చెందిన టోరీ బోవీ 10.85 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచింది. మారీ జోసీ లౌ (ఐవరీకోస్ట్–10.86సె) రజతం గెలుచుకోగా, షిఫర్స్ (నెదర్లాండ్స్–10.96సె) కాంస్యం నెగ్గింది. 2015 బీజింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 4్ఠ100 రిలేలో స్వర్ణం, 200 మీ. పరుగులో రజతం సాధించిన థామ్సన్... గత ఏడాది రియోలో 100మీ., 200 మీ. రెండింటిలోనూ స్వర్ణాలు సొంతం చేసుకుంది. తాజా ఫలితంతో రియోలో పరాజయానికి బోవీ ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. ఈ ఒలింపిక్స్‌లో ఆమె 100 మీ. లో రజతం, 200 మీ.లో కాంస్యం గెలుచుకుంది. -
'వరల్డ్ అథ్లెటిక్స్' ఫైనల్స్‌లోకి లలితా బాబర్
చైనా రాజధాని బీజింగ్‌లో జరుగుతున్న 15వ వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో భారత అథ్లెట్లు ఉత్తమ ప్రతిభను కనబరుస్తున్నారు. సోమవారం ఉదయం జరిగిన 3 వేల మీటర్ల స్టీఫెల్చేజ్ ఈవెంట్లో స్టార్ అథ్లెట్ లలితా బాబర్ జాతీయ రికార్డును బద్దలుకొట్టి ఫైనల్స్‌లోకి ప్రవేశించారు. ఈ పోటీలో నాలుగో స్థానంలో నిలిచిన లిలత.. 9:27:86 నిమిషాల్లో లూప్స్‌ను పూర్తిచేశారు. ఈరోజు సాయంత్రం 6:45 (భారత కాలమానం ప్రకారం) గంటలకు ఫైనల్స్ పోటీలు ప్రారంభమవుతాయి. ఆదివారం జరిగిన షాట్‌పుట్ త్రో ఫైనల్స్‌లో మన అథ్లెట్ ఇందర్జీత్ సింగ్ నిరాశపర్చినప్పటికీ, పాల్గొన్న మొదటి వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ లోనే ఫైనల్స్‌కు చేరుకున్న మొట్టమొదటి భారత షాట్ పుటర్ గా ఆయన చరిత్ర సృష్టించారు. 20 కిలోమీటర్ల రేస్ వాక్ ఈవెంట్ లో భారత అథ్లెట్ బల్జీందర్ సింగ్ 12 వస్థానంలో నిలవడం కూడా విశేషమే. -
చరిత్ర సృష్టించిన ఇందర్జీత్
బీజింగ్: భారత అథ్లెట్ ఇందర్జీత్ సింగ్ చరిత్ర సృష్టించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్స్ చేరిన తొలి భారత షాట్ పుటర్గా ఇందర్జీత్ రికార్డు నెలకొల్పాడు. ఇందర్జీత్ మూడో ప్రయత్నంలో 20.47 మీటర్లు విసిరి ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించాడు. ఫైనల్ రౌండ్లో 12 మంది అథ్లెట్లు బరిలో ఉంటారు. బీజింగ్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో 20 కిలో మీటర్ల రేస్ వాక్‌లో భారత అథ్లెట్ బల్జీందర్ సింగ్ 12వ స్థానంలో నిలిచాడు. బల్జీందర్ సింగ్ (1:21:44) టైమింగ్ నమోదు చేశాడు. -
ఫరా, కిప్లాగత్ రికార్డు
మాస్కో (రష్యా): ఊహించిన ఫలితాలతోనే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ప్రారంభమైంది. పురుషుల 10 వేల మీటర్ల రేసులో లండన్ ఒలింపిక్స్ చాంపియన్ మహ్మద్ ఫరా (బ్రిటన్) స్వర్ణ పతకం సాధించగా... మహిళల మారథాన్ రేసులో డిఫెండింగ్ చాంపియన్ ఎద్నా కిప్లాగత్ టైటిల్ నిలబెట్టుకుంది. 10 వేల మీటర్ల రేసును ఫరా 27 నిమిషాల 21.71 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో అథ్లెటిక్స్ చరిత్రలో కెనెనిసా బెకెలె (ఇథియోపియా) తర్వాత ఒలింపిక్స్‌లోనూ, ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ 5 వేల, 10 వేల మీటర్ల రేసుల్లో స్వర్ణాలు నెగ్గిన తొలి అథ్లెట్‌గా ఫరా రికార్డు నెలకొల్పాడు. ఫరా గత ఏడాది లండన్ ఒలింపిక్స్‌లో 5 వేల, 10 వేల మీటర్ల రేసుల్లో విజేతగా నిలిచాడు. 2011 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 5 వేల మీటర్లలో స్వర్ణం నెగ్గి, 10 వేల మీటర్లలో రజతం సాధించాడు. మరోవైపు మహిళల మారథాన్ రేసులో కిప్లాగత్ 2 గంటల 25 నిమిషాల 44 సెకన్లలో గమ్యానికి చేరుకొని పసిడి పతకాన్ని దక్కించుకుంది. ఈ విజయంతో కిప్లాగత్ ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో వరుసగా రెండు స్వర్ణాలు నెగ్గిన మారథాన్ రన్నర్‌గా చరిత్ర సృష్టించింది. 2011 డేగూలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ కిప్లాగత్ స్వర్ణం సాధించింది. సుధా సింగ్‌కు నిరాశ భారత్ విషయానికొస్తే... తొలి రోజు నిరాశే మిగిలింది. 2010 గ్వాంగ్జూ ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత సుధా సింగ్ మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో ఫైనల్‌కు అర్హత పొందడంలో విఫలమైంది. 14 మంది పాల్గొన్న తొలి హీట్‌లో సుధా 9 నిమిషాల 51.05 సెకన్లలో గమ్యానికి చేరుకొని 12వ స్థానంలో నిలిచింది. 100 మీటర్ల సెమీస్‌లో బోల్ట్ పురుషుల 100 మీటర్ల విభాగంలో ఒలింపిక్ చాంపియన్ ఉసేన్ బోల్ట్ (జమైకా) సెమీఫైనల్‌కు అర్హత సాధించాడు. శనివారం జరిగిన ఏడు హీట్స్లలో చివరిదాంట్లో పోటీపడిన బోల్ట్ 10.07 సెకన్లలో లక్ష్యానికి చేరుకొని విజేతగా నిలిచాడు. ఏడు హీట్స్ నుంచి మొత్తం 24 మంది సెమీఫైనల్‌కు అర్హత పొందారు. ఆదివారం సాయంత్రం సెమీఫైనల్స్, రాత్రి ఫైనల్ జరుగుతాయి. -
ఫరా, కిప్లాగత్ రికార్డు
మాస్కో (రష్యా): ఊహించిన ఫలితాలతోనే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ప్రారంభమైంది. పురుషుల 10 వేల మీటర్ల రేసులో లండన్ ఒలింపిక్స్ చాంపియన్ మహ్మద్ ఫరా (బ్రిటన్) స్వర్ణ పతకం సాధించగా... మహిళల మారథాన్ రేసులో డిఫెండింగ్ చాంపియన్ ఎద్నా కిప్లాగత్ టైటిల్ నిలబెట్టుకుంది. 10 వేల మీటర్ల రేసును ఫరా 27 నిమిషాల 21.71 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో అథ్లెటిక్స్ చరిత్రలో కెనెనిసా బెకెలె (ఇథియోపియా) తర్వాత ఒలింపిక్స్‌లోనూ, ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ 5 వేల, 10 వేల మీటర్ల రేసుల్లో స్వర్ణాలు నెగ్గిన తొలి అథ్లెట్‌గా ఫరా రికార్డు నెలకొల్పాడు. ఫరా గత ఏడాది లండన్ ఒలింపిక్స్‌లో 5 వేల, 10 వేల మీటర్ల రేసుల్లో విజేతగా నిలిచాడు. 2011 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 5 వేల మీటర్లలో స్వర్ణం నెగ్గి, 10 వేల మీటర్లలో రజతం సాధించాడు. మరోవైపు మహిళల మారథాన్ రేసులో కిప్లాగత్ 2 గంటల 25 నిమిషాల 44 సెకన్లలో గమ్యానికి చేరుకొని పసిడి పతకాన్ని దక్కించుకుంది. ఈ విజయంతో కిప్లాగత్ ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో వరుసగా రెండు స్వర్ణాలు నెగ్గిన మారథాన్ రన్నర్‌గా చరిత్ర సృష్టించింది. 2011 డేగూలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ కిప్లాగత్ స్వర్ణం సాధించింది. సుధా సింగ్‌కు నిరాశ భారత్ విషయానికొస్తే... తొలి రోజు నిరాశే మిగిలింది. 2010 గ్వాంగ్జూ ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత సుధా సింగ్ మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో ఫైనల్‌కు అర్హత పొందడంలో విఫలమైంది. 14 మంది పాల్గొన్న తొలి హీట్‌లో సుధా 9 నిమిషాల 51.05 సెకన్లలో గమ్యానికి చేరుకొని 12వ స్థానంలో నిలిచింది. 100 మీటర్ల సెమీస్‌లో బోల్ట్ పురుషుల 100 మీటర్ల విభాగంలో ఒలింపిక్ చాంపియన్ ఉసేన్ బోల్ట్ (జమైకా) సెమీఫైనల్‌కు అర్హత సాధించాడు. శనివారం జరిగిన ఏడు హీట్స్లలో చివరిదాంట్లో పోటీపడిన బోల్ట్ 10.07 సెకన్లలో లక్ష్యానికి చేరుకొని విజేతగా నిలిచాడు. ఏడు హీట్స్ నుంచి మొత్తం 24 మంది సెమీఫైనల్‌కు అర్హత పొందారు. ఆదివారం సాయంత్రం సెమీఫైనల్స్, రాత్రి ఫైనల్ జరుగుతాయి.