ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు ఒరేగాన్‌లో అడుగుపెట్టాడు. ఈ నేపథ్యంలో అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ జరగనున్న హ్యూజిన్‌లోని హెవార్డ్ స్టేడియంలో నిలబడి ఫోటోకు ఫోజు ఇచ్చాడు. దీనిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్న నీరజ్.. ''హేవార్డ్ ఫీల్డ్ స్టేడియం.. పతకమే లక్ష్యంగా'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇటీవల డైమండ్ లీగ్‌లో చక్కటి ప్రదర్శన కనబర్చిన నీరజ్.. రెండుసార్లు తన వ్యక్తిగత రికార్డును మెరుగుపర్చుకున్నాడు. 90 మీటర్లకు దరిదాపుల్లో ఉన్న నీరజ్ ఇదే జోష్‌లో వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో దేశానికి తొలి పసిడి అందించాలని తహతహలాడుతున్నాడు.
ఇక నీరజ్ చోప్రా సారథ్యంలో భారత అథ్లెట్ల బృందం ఇప్పటికే ప్రపంచ చాంపియన్‌షిప్ బరిలోకి దిగింది. ఇప్పటి వరకు ఈ పోటీల్లో భారత్ నుంచి అంజూబాబి జార్జ్ (కాంస్యం, లాంగ్‌జంప్) మాత్రమే పతకం నెగ్గింది. ఆ తర్వాత మరే అథ్లెట్ ఈ వేదికపై మెడల్ సాధించలేకపోగా.. ఆ లోటు భర్తీ చేసేందుకు నీరజ్ చోప్రా సిద్ధమవుతున్నాడు. మరోవైపు లాంగ్‌జంప్‌లో మురళీ శ్రీశంకర్, పురుషుల 3 వేల మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో అవినాష్ సాబ్లే ఫైనల్ చేరి పతకం ఆశలు రేకెత్తిస్తున్నారు. ఇక షాట్‌పుట్‌లో తజిందర్‌పాల్ సింగ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.
చదవండి: Allyson Felix: మాట నిలబెట్టుకున్న దిగ్గజ అథ్లెట్.. కెరీర్‌కు గుడ్‌బై
Comments
Please login to add a commentAdd a comment