Oregon
-
Alaska Airlines Boeing 737-9 Max: గాల్లో గజగజ
అది అమెరికాలో ఓరెగాన్‌లోని పోర్ట్లాండ్ విమానాశ్రయం. శుక్రవారం సాయంత్రం 4.52 గంటలు. అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన అత్యాధునిక బోయింగ్ 737 మాక్స్ 9 విమానం 174 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో కాలిఫోర్నియాలోని ఒంటారియో బయల్దేరింది. టేకాఫ్ తీసుకుని, చూస్తుండగానే వేగం పుంజుకుని దాదాపు 5 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లింది. బయల్దేరిన ఆరు నిమిషాలకే విమానం రెక్క వెనక ప్రయాణికుల వరుసను ఆనుకుని ఉన్న కిటికీతో పాటు కొంత భాగం ఉన్నట్టుండి ఊడి గాల్లో కలిసిపోయింది. ఒక ఫ్రిజ్‌ను మించిన పరిమాణంలో పెద్ద రంధ్రం పడింది. దాంతో విపరీతమైన వేగంతో పెను గాలులు లోనికి దూసుకొచ్చాయి. వాటి దెబ్బకు విమానం పిచ్చి పట్టినట్టు అటూ ఇటూ ఊగిపోవడం మొదలుపెట్టింది. లోపల వాయు పీడనం పూర్తిగా తగ్గిపోవడంతో ప్రయాణికులంతా ప్రాణ భయంతో వణికిపోయారు. రంధ్రంలోంచి దూసుకొస్తున్న పెను గాలుల వేగానికి ఆ వరుసలోని సీట్లోనే కూర్చున్న ఒక చిన్నారి చిగురుటాకులా వణికిపోయాడు. గాలి విసురుకు అతని షర్టు ఒంటి నుంచి విడివడి అమాంతంగా బయటికి దూసుకెళ్లింది. దాంతో పాటే బాబు కూడా గాల్లోకి లేవడంతో తల్లి పెను కేకలు వేసింది. బలమంతా ఉపయోగించి అతన్ని గట్టిగా కౌగిలించుకుని ఆపింది! ఇంకో ప్రయాణికుని చేతిలోని సెల్ ఫోన్ గాలి విసురుకు శరవేగంగా విమానంలోంచి బయటికి దూసుకెళ్లింది. దాంతో విమానమంతటా హాహాకారాలు చెలరేగాయి. ప్రాణభయంతో ప్రయాణికులు ఆర్తనాదాలు చేశారు. సీట్ బెల్టులు పెట్టుకుని సీట్లను గట్టిగా కరుచుకున్నారు. అందరి ప్రాణాలూ అక్షరాలా గాల్లో వేలాడాయి. 10 నిమిషాలకు పైగా నరకం చూసిన అనంతరం విమానాన్ని పైలట్ కల్లోలం మధ్యే అతి కష్టంగా వెనక్కు మళ్లించింది. నిబ్బరంగా కిందికి దించి సాయంత్రం 5.27కు తిరిగి పోర్ట్లాండ్ విమానాశ్రయంలోనే సురక్షితంగా లాండ్ చేసింది. దాంతో బతుకు జీవుడా అంటూ అంతా ఊపిరి పీల్చుకున్నారు. అచ్చం హాలీవుడ్ సినిమాను తలపించిన ఈ ప్రమాదం బారి నుంచి కొద్దిపాటి గాయాలు మినహా అంతా సురక్షితంగా బయట పడ్డారు. నరకం అంచులకు వెళ్లొచ్చాం... ప్రమాదం జరిగిన తీరును వివరిస్తూ ప్రయాణికుల్లో పలువురు భయోద్వేగాలకు లోనయ్యారు. ‘‘విమానం వెనక వైపు నుంచి పెద్ద శబ్దం విని్పంచింది. ఏమిటా తిరిగి చూసేలోపే పెను గాలులు విమానమంతటినీ ఈ డ్చి కొట్టడం మొదలైంది’’ అని ఎవాన్ స్మిత్ చెప్పాడు. ‘‘నేను పక్క వరుసలో కూర్చుని ఉన్నాను. చూస్తుండగానే నా కళ్లముందే అటువైపున్న కిటికీతో పాటు దాని చుట్టుపక్కల భాగమంతా ఎవరో బయటి నుంచి లాగేసినట్టుగా ఊడి కొట్టుకుపోయింది. ఆ కిటికీ సీట్లో ఎవరూ లేరు కాబట్టి సరిపోయింది’’ అంటూ జెస్సికా అనే ప్రయాణికురాలు చెప్పు కొచి్చంది. అక్షరాలా నరకం అంచుల దాకా వెళ్లి అదృష్టం కొద్దీ సురక్షితంగా బయట పడ్డామంటూ వణికిపోయింది. ‘‘ఎమర్జెన్సీలో చిక్కుకున్నాం. గాలి పీడనం పూర్తిగా తగ్గిపోయింది. మేం తక్షణం ల్యాండవ్వాలి’’ అని గ్రౌండ్ కంట్రోల్‌ను పైలట్ రిక్వెస్ట్ చేస్తున్న ఆడియో క్లిప్ వైరల్‌గా మారింది. ఆ విమానాల నిలిపివేత... ప్రయాణికులకు ఎదురైన భయానక అనుభవాన్ని తలచుకుంటేనే గుండె తరుక్కుపోతోందని అలస్కా ఎయిర్‌లైన్స్ సీఈఓ బెన్ మినికుచి తీవ్ర విచారం వెలిబుచ్చారు. ప్రమాదం నేపథ్యంలో పూర్తిస్థాయి తనిఖీలు, భద్రతా పరీక్షలు జరిగేదాకా తమ వద్ద ఉన్న మొత్తం 65 బోయింగ్ 737 మాక్స్ 9 రకం విమానాలనూ పక్కన పెడుతున్నట్టు ప్రకటించారు. తనిఖీలకు పూర్తిగా సహకరిస్తామని బోయింగ్ సంస్థ ప్రకటించింది. ఈ ఉదంతంపై నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ విచారణ జరుపుతోంది. – పోర్ట్‌ల్యాండ్ (అమెరికా) తొలిసారి కాదు.. బోయింగ్ 737 మాక్స్ రకం విమానాలు ప్రమాదాల బారిన పడటం ఇది తొలిసారేమీ కాదు. 2018, 2019ల్లో ఈ రకానికి చెందిన రెండు విమానాలు కూలిపోయి వాటిలో ఉన్నవారంతా దుర్మరణం పాలయ్యారు. దాంతో ప్రపంచమంతటా ఈ విమానాల వాడకాన్ని ఏడాదిన్నర పాటు నిలిపేశారు. కానీ వాటితో పోలిస్తే తాజా ప్రమాదం చాలా భిన్నమైనదని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1,300కు పైగా బోయింగ్ 737 మాక్స్ రకం విమానాలు వాడకంలో ఉన్నాయి. వీటిలో మాక్స్ 9 అత్యాధునిక విమానాలు. భారత్‌లోనూ ఆకాశ ఎయిర్, స్పైస్‌జెట్, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలు 40కి పైగా బోయింగ్ 737 మాక్స్ 8 రకం విమానాలను దేశీయ రూట్లలో నడుపుతున్నాయి. అమెరికా విమాన ప్రమాదం నేపథ్యంలో వాటన్నింట్లనూ తక్షణం క్షుణ్నంగా భద్రతా తనిఖీలు నిర్వహించాలని డీజీసీఏ ఆదేశించింది. -
"విమానాన్నే ఇల్లుగా మార్చేశాడు"..అందుకోసం ఏకంగా..
ఇంతకుమునుపు విన్నాం ఓ సాధారణ కూలీ ఏకంగా విమానంలాంటి ఇల్లుని నిర్మించాడని. అందుకోసం ఎన్నో వ్యయప్రయాసలు ఓర్చాడు. కానీ ఇక్కడొక వ్యక్తికి అసలు విమానాన్నే ఇల్లుగా మార్చుకుంటే అని ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనను కార్యరూపం ఇచ్చి మరీ తన సృజనాత్మకతకు జోడించి విలాసవంతమైన ఇల్లుగా మార్చాడు. చూస్తే అక్కడ విమానం ఆగిందేమో అనుకునేలా ఆ ఇల్లు ఉంటుంది. లోపలకి చూస్తే ఇల్లులా ఉంటుంది. అద్భతం కదా! అసలు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది, ఆ విమానం ఎక్కడది? తదితర సందేహాలు వచ్చేస్తున్నాయా!..ఆ కథ కమామీషు ఏంటో చూద్దాం!. అసలేం జరిగిందంటే..అమెరికాకు చెందిన 64 ఏళ్ల రిటైర్డ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ బ్రూస్ క్యాంపెబెల్కి చిన్నప్పటి నుంచి పాత వస్తువులను కొత్తవాటిగా మార్చడం అతని ప్రత్యేకత. సరుకులు రవాణా చేసే విమానమే ఇల్లుగా మార్చాలనే ఓ డ్రీమ్ ఉంది. హెయిర్ స్టయిలిస్ట్ జాన్ ఉస్సేరీ.. బోయింగ్ 727 విమానాన్ని కొనుగోలు చేసి ఇల్లుగా మార్చకుందని, ఆమె ఇల్లు అగ్రిప్రమాదంలో కాలిపోవడంతో ఇలా వినూత్నంగా ఆలోచించి రూపొందించదని విన్నాడు. అదే క్యాపెంబెల్కు విమానాన్ని ఇల్లుగా మార్చే ఆలోచనకు పురికొల్పింది. అందుకోసం క్యాపెంబెల్ ఒరెగాన్లోని హిల్స్‌బోరో అడవుల్లో 10 ఎకరాల భూమిని 23 వేల డాలర్లు(రూ. 19 లక్షలు)కు కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఒలింపిక్ ఎయిర్వేస్ నుంచి బోయింగ్ 727 విమానాన్ని లక్ష డాలర్లకు(రూ. 85 లక్షలకు) కొనుగోలు చేశాడు. అయితే ఆ విమానాన్ని ఒరెగాన్లోని అడవులకు తీసుకువచ్చే రవాణా ఖర్చులు మాత్రం తడిసిమోపడయ్యాయి. అయిన వెనుకడుగు వేయలేదు క్యాంప్‌బెల్. చేయాలనుకుంది చేసే తీరాలని గట్టి సంకల్పంతో ఉన్నాడు క్యాంప్‌బెల్. ఇక ఆ విమానాన్ని ఎన్నో ప్రయాసలు పడి ఆ అడవులకు చేర్చాక దాన్ని ఇల్లులా మర్చే పనికి ఉపక్రమించాడు. ఎలాగో విమానంలో సీట్లు టాయిలెట్లు ఉంటాయి కాబట్టి ఇక వాషింగ్ మిషన్, షింక్ వంటివి, కిచెన్‌కి కావల్సిన ఇంటీరియర్ డిజైన్ చేసుకుంటే చాలని ఓ నిర్ణయానికి వచ్చాడు. ఆ విధంగానే దాన్ని అత్యంత విలాసవంతమైన ఇల్లులా మార్చేశాడు. క్యాంపెబెల్ వంట చేసేందుకు మైక్రోవేవ్, టోస్టర్‌ని ఉపయోగిస్తాడు. అద్భుతమైన భారీ "ఎయిర్‌ప్లేన్ హోం" చూపురులను కట్టేపడేసేంత ఆకర్షణగా ఉంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఇకెందుకు ఆలస్యం మీరు కూడా క్యాంపెబెల్లా ప్లేన్హోం లాంటి లగ్జరీ ఇల్లును కట్టుకునేందుకు ట్రై చేయండి మరీ. (చదవండి: అక్కడ వరదలా.. వీధుల గుండా "వైన్ ప్రవాహం"..షాక్‌లో ప్రజలు) -
మంచు తుపానులో కాలిఫోర్నియా విలవిల
లాస్ఏంజెలిస్/డాలస్: అమెరికాలోని కాలిఫోర్నియాను వారం రోజులుగా భారీ మంచు తుపాను వణికిస్తోంది. కాలిఫోర్నియా, ఓరెగాన్లలో ఈ శతాబ్దంలోనే అత్యధికంగా ఏడడుగుల మేర మంచుకురిసింది. కొన్ని రిసార్టు ప్రాంతాల్లో 10 అడుగుల మేర మంచు పేరుకుపోయిందన్నారు. అనూహ్య మంచు తుపానుతో కాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినో కొండ ప్రాంతాల్లో ప్రజలు అత్యవసరాలు, ఆహారం, మందులు, పాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లన్నీ మంచుమయం కావడంతో బయటకు వచ్చే వీలులేకపోయింది. కొండప్రాంతాల నివాసితులు రోడ్లపైకి రావొద్దని హెచ్చరించారు. ఇళ్లు, వాహనాలు మంచు గుట్టల మధ్య కూరుకుపోయాయి. రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. రెండిళ్లలో పేలుళ్లు సంభవించినట్లు, మంచు భారంతో ఇళ్లపైకప్పులు కూలినట్లు, కొన్ని ఇళ్లలో గ్యాస్ లీకేజీ జరిగినట్లు సమాచారం ఉందని సిబ్బంది తెలిపారు. అత్యవసర వైద్య సాయం అవసరమైన వారిని రెడ్‌క్రాస్ షెల్టర్‌కు తరలించారు. కరెంటు తీగలు తెగి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నెవాడా సరిహద్దుల్లో ఉన్న సాక్రమెంటో, లేక్ టహో ప్రాంతాల్లో మంచుతుపాను శనివారం మరింత తీవ్ర మవుతుందని నిపుణులు హెచ్చరించారు. కాలిఫోర్నియాలోని 13 కౌంటీల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. అయితే, మంచు తుపాను కారణంగా కాలిఫోర్నియా ప్రాంతంలో దుర్భిక్ష పరిస్థితులు తొలిగినట్లేనని అధికారులు చెప్పారు. పెనుగాలుల విధ్వంసం టోర్నడో తుపాను దెబ్బకు టెక్సాస్, లూసియానాల్లో అంధకారం అలుముకుంది. టెక్సాస్‌లోని డాలస్, ఫోర్ట్ వర్త్ చుట్టుపక్కల ప్రాంతాల్లో గంటకు 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ప్రజలు ఇళ్లు వదిలి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. డాలస్‌లో భారీగా చెట్లు నేలకూలాయి. వాహనాలు పల్టీలు కొట్టాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయని పోలీసులు తెలిపారు. డాలస్–ఫోర్ట్‌వర్త్, డాలస్ లవ్ ఫీల్డ్ విమానాశ్రయాల్లో 400 విమానాలు రద్దయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో టెక్సాస్‌లోని సుమారు 3.40 లక్షల వినియోగదారులు గురువారం రాత్రి చీకట్లోనే గడిపారు. వాతావరణ విభాగం హెచ్చరికలతో డాలస్, ఫోర్ట్‌వర్త్ తదితర ప్రాంతాల్లో విద్యాసంస్థలను మూసివేశారు. -
ప్రపంచ రికార్డు బద్దలు కొట్టావ్.. అంత ఆశ్చర్యమెందుకు?
అమెరికాలోని ఒరేగాన్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 400 మీటర్ల హార్డిల్స్‌లో ప్రపంచ రికార్డు బద్దలైంది. 400 మీటర్ల హార్డిల్స్‌లో అమెరికాకు చెందిన డబుల్ ఒలింపిక్ చాంపియన్.. ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ సిడ్నీ మెక్లాఫ్లిన్ కొత్త రికార్డు నమోదు చేసింది. శనివారం ఉదయం జరిగిన 400 మీటర్ల హార్డిల్స్ ఫైనల్లో మెక్లాఫ్లిన్ 50.68 సెకన్లలో గమ్యాన్ని చేరి స్వర్ణం తన ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలో మెక్లాఫ్లిన్ తన రికార్డు తానే బద్దలు కొట్టింది. ఇంతకముందు 400 మీటర్ల హార్డిల్స్‌లో లాఫ్లిన్ బెస్ట్ టైమింగ్ 51.41 సెకన్లు. జూన్‌లో యూఎస్ఏ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఔట్‌డోర్ చాంపియన్‌షిప్స్‌లో ఇదే వేదికపై పరిగెత్తి స్వర్ణం అందుకుంది. ఈ సందర్భంగా వరల్డ్ అథ్లెటిక్స్ అధికారిక ట్విటర్.. సిడ్నీ మెక్లాఫ్లిన్ ఫోటోను షేర్ చేస్తూ వరల్డ్ చాంపియన్.. వరల్డ్ రికార్డు.. మా సిడ్నీ మెక్లాఫ్లిన్..'' అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక డచ్ రన్నర్ ఫెమ్కే బోల్ 52.27 సెకన్లలో గమ్యాన్ని చేరి రతజం అందుకోగా.. అమెరికాకే చెందిన మరో అథ్లెట్ దలీలా ముహమ్మద్ 53.13 సెకన్లతో కాంస్యం చేజెక్కించుకుంది. స్వర్ణ పతకం సాధించిన అనంతరం ఆమె చెప్పిన మాట.. ''సాధించడానికి ఇంకా పరిగెడుతూనే ఉంటాను.'' ఇక్కడ మరో విచిత్రమేంటంటే ఫైనల్స్ పూర్తయిన తర్వాత.. మెక్లాఫ్లిన్ విజేత అని తెలిసిన తర్వాత కూడా ఇది నిజమేనా అన్న తరహాలో ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్ హైలైట్‌గా నిలిచింది. WORLD CHAMPION ‼️ WORLD RECORD ‼️ SYDNEY MCLAUGHLIN 🤯 OLYMPIC CHAMPION @GoSydGo 🇺🇸 DESTROYS HER OWN WORLD RECORD IN 5⃣0⃣.6⃣8⃣ TO CLAIM WORLD 400M HURDLES GOLD 🥇#WorldAthleticsChamps pic.twitter.com/Ilay0XwVz1 — World Athletics (@WorldAthletics) July 23, 2022 50.68. Watch it. Watch it again. Goosebumps all over. Sydney McLaughlin 🌟#WorldAthleticsChamps pic.twitter.com/GtQgTWLBuQ — Vinayakk (@vinayakkm) July 23, 2022 -
WAC 2022: జావెలిన్ త్రో ఫైనల్లో భారత అథ్లెట్
అమెరికాలోని ఒరేగాన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా అథ్లెట్ అన్నూ రాణి శుభారంభం చేసింది. గురువారం ఉదయం జరిగిన జావెలిన్ త్రో క్వాలిఫయింగ్ పోటీల్లో అన్నూ రాణి రెండో ప్రయత్నంలో ఈటెను 59.06 మీటర్ల దూరం విసిరి గ్రూఫ్ బిలో 5వ స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా ఎనిమిదో స్థానంలో నిలిచిన అన్నూ రాణి ఫైనల్లో అడుగుపెట్టింది. వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో వరుసగా రెండోసారి జావెలిన్ త్రో ఫైనల్లో అడుగుపెట్టిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా నిలిచింది. 2019లో దోహా వేదికగా జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్లో అన్నూ రాణి ఎనిమిదో స్థానానికే పరిమితమైంది. మరి ఈసారైనా పతకం సాధిస్తుందేమో చూడాలి. అంతకముందు ఈటెను తొలి ప్రయత్నంలో 55.32 మీటర్లు విసిరినప్పటికి.. రెండో ప్రయత్నంలో మాత్రం 59.60 మీటర్ల దూరం విసిరి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇక 29 ఏళ్ల అన్నూ రాణి కెరీర్ బెస్ట్ 63.82 మీటర్లుగా ఉంది. జంషెడ్పూర్ వేదికగా ఈ ఏడాది మేలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో అన్నూ రాణి ఈ ప్రదర్శనను నమోదు చేసింది. ఇక జపాన్‌కు చెందిన హరుకాకిటాగుచి ఈటెను 64.32 మీటర్ల దూరం విసిరి సీజన్ బెస్ట్‌తో తొలి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో చైనాకు చెందిన షియింగ్ లిహూ(63.86 మీటర్లు), లిథువేనియాకు చెందిన లివేట జాసియునైట్(63.80 మీటర్లు) మూడో స్థానంలో నిలిచింది. మొత్తంగా గ్రూఫ్ ఏ, గ్రూఫ్ బి నుంచి కలిపి 12 మంది ఫైనల్లో పోటీ పడనున్నారు. మహిళల జావెలిన్ త్రో ఫైనల్ జూలై 22న ఉదయం 5 గంటలకు జరగనుంది. చదవండి: World Athletics Championship: 'నా కొడుకు ప్రపంచ చాంపియన్.. గర్వంగా ఉంది' -
'నా కొడుకు ప్రపంచ చాంపియన్.. గర్వంగా ఉంది'
పురుషుల 1500 మీటర్ల పరుగు...ప్రసారకర్తల కామెంటరీ బృందంలో ఒకడైన జెఫ్ వైట్మన్ రేసు ప్రారంభం కాగానే తన వ్యాఖ్యానం వినిపిస్తున్నాడు. 500 మీ...1000 మీ...1400 మీ. ముగిశాయి...అప్పటి వరకు అతను మంచి జోష్‌తో ఉత్కంఠ పెరిగేలా పరుగు గురించి మాట్లాడుతున్నాడు. రేసు పూర్తయింది... కానీ అతని మాట వినిపించలేదు. ఒక్కసారిగా అతని గొంతు ఆగిపోయింది. ప్రేక్షకులకు క్షణం పాటు ఏం జరిగిందో అర్థం కాలేదు. కొంత విరామంతో అతను మళ్లీ అనేశాడు...‘అతను నా కొడుకు, వాడు ఇప్పుడు ప్రపంచ చాంపియన్’ అంటూ వైట్మన్ ఉద్వేగంగా ముగించాడు. అంతే మైదానంలో ఒక్కసారిగా హర్షధ్వానాలు... సమీపంలో ఉన్నవారంతా చుట్టు చేరి అభినందనలతో ముంచెత్తారు. ఈ రేసును 3 నిమిషాల 29.23 సెకన్లలో పూర్తి చేసి బ్రిటన్ అథ్లెట్ జేక్ వైట్మన్ స్వర్ణం సొంతం చేసుకోవడం ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల ఐదో రోజు హైలైట్‌గా నిలిచింది. ఈ ఈవెంట్లో జాకన్ ఇన్బ్రిట్సన్ (నార్వే– 3 నిమిషాల 29.47 సెకన్లు), మొహమ్మద్ కతిర్ (స్పెయిన్–3 ని. 29.90 సె.) వరుసగా రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. Jake Wightman has become the World 1500m champion. Geoff calling his son becoming a World Champion is priceless. Helene, part of our team, filmed Dad. I sat with Mum Susan..then could not wait to give my mate a hug. Beyond proud. ❤️@JakeSWightman @WightmanGeoff @SusanWightman6 pic.twitter.com/8I8IT6ntwb — Katharine Merry (@KatharineMerry) July 20, 2022 Yaroslava Mahuchikh: బాంబుల మోత తప్పించుకొని పతకం గెలిచి.. -
WAC 2022: నిరాశ పరిచిన సబ్లే.. 11వ స్థానంతో ముగించి...
World Athletics Championship 2022: పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ ఛేజ్‌లో భారత అథ్లెట్ అవినాశ్ ముకుంద్ సబ్లే తీవ్రంగా నిరాశపర్చాడు. అమెరికాలోని ఒరెగాన్‌లో జరిగిన ఫైనల్‌ను 8 నిమిషాల 31.75 సెకన్లలో పూర్తి చేసిన సబ్లే 11వ స్థానంలో నిలిచాడు. ఇదే సీజన్లో తన అత్యుత్తమ ప్రదర్శనతో జాతీయ రికార్డు (8 నిమిషాల 12.48 సెకన్లు)ను నెలకొల్పిన అతను దాంతో పోలిస్తే చాలా పేలవ ప్రదర్శన నమోదు చేశాడు. ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించిన సబ్లే...అసలు పోరులో ప్రభావం చూపలేకపోయాడు. 2019లో దోహాలో జరిగిన గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అతను 13వ స్థానం సాధించాడు. ఈ విభాగంలో ఒలింపిక్ చాంపియన్, మొరాకోకు చెందిన సూఫియాన్ బకాలి (8 నిమిషాల 25.13 సె.), లమేచా గిర్మా (ఇథియోపియా – 8 నిమిషాల 26.01 సె.), కాన్సెస్‌లన్ కిప్రు టో (కెన్యా – 8 నిమిషాల 27.92 సెకన్లు) వరుసగా స్వర్ణ, రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. The pride of Morocco! Olympic champion Soufiane El Bakkali 🇲🇦 runs 8:25.13 to claim world gold and confirms his 3000m steeplechase dominance 💪#WorldAthleticsChamps pic.twitter.com/Ym2CVrdv1B — World Athletics (@WorldAthletics) July 19, 2022 -
90 మీటర్లే టార్గెట్‌గా.. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా
ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు ఒరేగాన్‌లో అడుగుపెట్టాడు. ఈ నేపథ్యంలో అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ జరగనున్న హ్యూజిన్లోని హెవార్డ్ స్టేడియంలో నిలబడి ఫోటోకు ఫోజు ఇచ్చాడు. దీనిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్న నీరజ్.. ''హేవార్డ్ ఫీల్డ్ స్టేడియం.. పతకమే లక్ష్యంగా'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇటీవల డైమండ్ లీగ్‌లో చక్కటి ప్రదర్శన కనబర్చిన నీరజ్.. రెండుసార్లు తన వ్యక్తిగత రికార్డును మెరుగుపర్చుకున్నాడు. 90 మీటర్లకు దరిదాపుల్లో ఉన్న నీరజ్ ఇదే జోష్‌లో వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో దేశానికి తొలి పసిడి అందించాలని తహతహలాడుతున్నాడు. ఇక నీరజ్ చోప్రా సారథ్యంలో భారత అథ్లెట్ల బృందం ఇప్పటికే ప్రపంచ చాంపియన్‌షిప్ బరిలోకి దిగింది. ఇప్పటి వరకు ఈ పోటీల్లో భారత్ నుంచి అంజూబాబి జార్జ్ (కాంస్యం, లాంగ్‌జంప్) మాత్రమే పతకం నెగ్గింది. ఆ తర్వాత మరే అథ్లెట్ ఈ వేదికపై మెడల్ సాధించలేకపోగా.. ఆ లోటు భర్తీ చేసేందుకు నీరజ్ చోప్రా సిద్ధమవుతున్నాడు. మరోవైపు లాంగ్‌జంప్‌లో మురళీ శ్రీశంకర్, పురుషుల 3 వేల మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో అవినాష్ సాబ్లే ఫైనల్ చేరి పతకం ఆశలు రేకెత్తిస్తున్నారు. ఇక షాట్‌పుట్‌లో తజిందర్‌పాల్ సింగ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. View this post on Instagram A post shared by Neeraj Chopra (@neeraj___chopra) చదవండి: Allyson Felix: మాట నిలబెట్టుకున్న దిగ్గజ అథ్లెట్.. కెరీర్‌కు గుడ్‌బై -
అమెరికా, కెనడాలలో ఎండ ప్రచండం
సలేమ్(అమెరికా): అమెరికాలోని వాషింగ్టన్, ఒరెగాన్‌తోపాటు కెనడాలో ఎండలు మండిపోతున్నాయి. పలు నగరాల్లో ఆల్‌టైమ్ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఎండల ధాటికి రాబోయే రోజుల్లో వందలాది మరణించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒరెగాన్ రాష్ట్రంలో ఎండల కారణంగా 60 మందికి జనం మృతిచెందినట్లు అధికారులు బుధవారం రాత్రి ప్రకటించారు. రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన ముల్ట్నోమాలో శుక్రవారం నుంచి ఇప్పటిదాకా 45 మంది మరణించారు. కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలో శుక్రవారం నుంచి బుధవారం మధ్య కనీసం 486 మంది ఆకస్మికంగా ప్రాణాలు విడిచారని అధికార వర్గాలు తెలిపాయి. వాంకోవర్, బ్రిటీష్ కొలంబియాలో చాలా ఇళ్లల్లో ఏసీ సదుపాయం లేదని, వృద్ధులు ఎండ వేడిని తట్టుకోలేక చనిపోతున్నారని వెల్లడించాయి. అమెరికాలోని వాషింగ్టన్లో ప్రతికూల వాతావరణం కారణంగా 20కి పైగా మరణాలు చోటుచేసుకున్నాయి. సియాటెల్, పోర్ట్ల్యాండ్తోపాటు పలు నగరాల్లో రికార్డు స్థాయిలో 115 డిగ్రీల ఫారెన్‌హీట్(46 డిగ్రీల సెల్సియస్) ఉష్ణోగ్రత నమోదయ్యింది. వాషింగ్టన్, ఒరెగాన్, ఇడాహో, మోంటానా రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎండల ధాటికి 44 నుంచి 97 ఏళ్లలోపు వారే ఎక్కువగా చనిపోతున్నారని ఒరెగాన్ రాష్ట్రం ముల్ట్నోమా కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ తెలిపారు. -
'నా పెంపుడు పిల్లి ఒక దొంగ.. జాగ్రత్తగా ఉండండి'
ఒరేగాన్: సాధారణంగా ఇంట్లోకి ఎవరిని రానీయకుండా పెంపుడు కుక్కలను కాపలా పెట్టి 'కుక్క ఉంది జాగ్రత్త' అని బోర్డు తగిలించడం గమనిస్తుంటాం. కానీ అమెరికాకు చెందిన ఒక మహిళకు తన పెంపుడు పిల్లి చర్యలు పెద్ద తలనొప్పిగా మారాయి. ఇంట్లోని వస్తువులు ఆమెకు తెలియకుండానే తీసుకెళ్లడం మొదలు పెట్టింది. అలా చేతికి వేసుకునే గ్లౌజులు, మాస్క్‌లు పిల్లి నోట కరచుకొని పక్కింట్లో పడేయడం గమనించింది. దీంతో ఎలాగైనా పిల్లిని కట్టడి చేయాలని సదరు యజమాని ఒక కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. తన ఇంటి వరండా భాగంలో ''నా పెంపుడు పిల్లి ఒక దొంగ.. దానితో జాగ్రత్తగా ఉండండి.'' అని బోర్డు తగిలించింది.ఒకవేళ పిల్లి వస్తువులను దొంగతనంగా తీసుకెళ్లినా.. పక్కింటివాళ్లు ఇంటి బయట ఉన్న బోర్డును గమనించి వస్తువులు ఆమెకు తిరిగి ఇవ్వడం ప్రారంభించారు.కాగా పెంపుడు పిల్లిపై మహిళ ప్లాన్ వర్క్‌వుట్ కావడంతో మిగతావాళ్లు కూడా అదే పనిలో పడ్డారు. దీనికి సంబంధించిన ఫోటో ట్విటర్లో షేర్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. చదవండి: వైరల్ వీడియో: మెట్రో ఎక్కిన కోతి.. మరి టికెట్ ఏది? 10 అంతస్తుల భవనం.. 28 గంటల్లో నిర్మాణం Sign of the day. pic.twitter.com/fgr0vC4Z0O — Dick King-Smith HQ (@DickKingSmith) June 10, 2021 -
చిన్నారితో సహా కారు దొంగతనం: చివర్లో ట్విస్ట్!
వాషింగ్టన్: కారు కనిపించగానే ఎత్తుకెళ్లిన ఓ దొంగ అందులో ఓ పసిప్రాణం ఉందని తెలియగానే వెంటనే యూటర్న్ తీసుకుని ఆ చిన్నారిని తల్లికి అప్పగించాడు. కానీ కారును మాత్రం విడిచిపెట్టలేదు. అంటే ఆ దొంగ మంచోడా? చెడ్డోడా? అసలా దొంగ ఏం చేశాడో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి.. అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రం పోర్ట్‌ల్యాండ్‌లో శనివారం నాడు ఓ మహిళ నాలుగేళ్ల కొడుకును తీసుకుని కారులో షాపుకు వెళ్లింది. కారును రన్నింగ్‌లో ఉంచి, అందులో చంటిపిల్లాడిని ఒంటరిగా వదిలేసి దుకాణంలోకి వెళ్లి పాలు, మాంసం కొనుగోలు చేసింది. (చదవండి: నేను వచ్చిన బిడ్డో సర్కారు దవాఖానకు!) ఇంతలో అక్కడే ఉన్న ఓ దొంగ కారెక్కి ఎంచక్కా ఎత్తుకెళ్లిపోయాడు. అయితే కొంత దూరం వెళ్లాక కారులో పసిపిల్లాడు ఉన్నాడని గుర్తించి యూటర్న్ తీసుకుని తిరిగి అదే షాపుకు దగ్గరకు వెళ్లాడు. బుడ్డోడిని అలా వదిలేసి పోతావా? అని సదరు మహిళకు ఆవేశంతో క్లాస్ పీకాడు. అంతే కాదు, నిర్లక్క్ష్యంగా వ్యవహరించినందుకు పోలీసులకు పట్టిస్తానంటూ బెదిరించి చిన్నోడిని ఆమె చేతుల్లో పెట్టాడు. ఇతడు మంచి దొంగే అనుకునేలోపే తిరిగి అదే కారులో ఉడాయించాడు. అయితే చంటోడిని తల్లికి అప్పజెప్పినందుకు పోలీసులు అతడిని నిజాయితీ గల దొంగగా అభివర్ణిస్తున్నారు. ఈ ఘటన జరిగిన కొద్ది గంటలకే తిరిగా ఆ కారును గుర్తించి మహిళకు అప్పజెప్పగా ప్రస్తుతం దొంగ జాడ కోసం గాలింపు చేపట్టారు. (చదవండి: వైరల్: గుడి దగ్గరకు రాగానే ఫోన్ చేయండి!) -
ఒకే దెబ్బకు రెండు పిట్టలంటే ఇదేనేమో..
ఒరెగాన్ : పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఒక వ్యక్తి లాండ్ క్రూజర్ కారులో న్యూబెర్గ్ రహదారిపై వేగంగా వెళుతున్నాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత అదే రోడ్డుపై ఎదురుగా ఒక యువతి ఎస్యూవీ కారులో వేగంగా వస్తోంది. చూస్తుండగానే రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొట్టుకొని ఆగిపోయాయి. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇద్దరిని పట్టుకొని అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఎస్యూవీ కారు నడిపిన యువతి కూడా ఒక దొంగేనని తెలియడం పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వింత ఘటన అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలోని న్యూబెర్గ్ సిటీలో గత ఆదివారం (జూలై 5న) చోటు చేసుకుంది.(లైవ్ వీడియోలో స్నానం చేస్తూ అడ్డంగా.. ) తాజాగా ఈ ఘటనను న్యూబెర్గ్ పోలీస్ డిపార్ట్మెంట్ బుధవారం తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసింది. ఇదిగో మీరు ఇంతకు ముందు ఎప్పుడు చూడని వార్త మీకొకటి చూపిస్తున్నాం... చదవండి అంటూ పేర్కొంది. అసలు విషయానికి వస్తే.. న్యూబెర్గ్ సిటీ పోలీస్ డిపార్ట్మెంట్కు జూలై 5న లాండ్ క్రూయిజ్ కారు దొంగతనానికి గురైందని ఒక వ్యక్తి వచ్చి ఫిర్యాదు చేశాడు. అయితే 27 ఏళ్ల రాండీ లీ కూపర్ దకారు దొంగతనానికి పాల్పడినట్లు సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని పట్టుకోవాలని బయలుదేరారు. తనను పట్టుకోవడానికి వస్తున్నారని తెలుసుకున్న రాండీ కారును వేగంగా పోనిచ్చాడు. ఇంతలో మరో ఎండ్ నుంచి క్రిస్టిన్ నికోల్ బేగ్ అనే 25 ఏళ్ల యువతి ఎస్యూవీ కారులో వేగంగా వస్తోంది. చూస్తుండగానే రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొట్టాయి. పోలీసులు అక్కడికి వెళ్లి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కాగా 25 నికోల్ బేగ్ మత్తులో ఉండడంతో కారును వేగంగా నడిపినట్లు తెలిసింది. అయితే ఆమె నడిపిన ఎస్యూవీ కారు కూడా చోరికి గురైనట్లు తెలిసింది. బేగ్‌ను ఈ విషయమై విచారించగా తాను కూడా ఒక దొంగనని, మత్తు పదార్థాలకు బానిసయి చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపింది. పోలీసులు ఒకరిని పట్టుకోవడానికి వస్తే అదనంగా మరో దొంగ దొరకడం వారిని ఆశ్చర్యపరిచింది. వెంటనే వారిద్దరిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్‌గా మారింది. 'ఒకే దెబ్బకు రెండు పిట్టలంటే ఇదేనేమో'.. 'నిజంగా ఇలాంటి వార్తను మాత్రం ఎప్పుడు చదవలేదు' అంటూ కామెంట్లు పెడుతున్నారు. (లవ్ యూ మామా: ఫ్లాయిడ్ చివరి క్షణాలు) -
వైరల్ : ఒక తల.. రెండు ముఖాలు
సాక్షి, న్యూయార్క్ : అమెరికాలోని ఆరెగాన్లో ఓ వింత పిల్లి జన్మించింది. ఒక తల రెండు ముఖాలు ఉండటం దాని ప్రత్యేకత. ఒక్కో ముఖానికి యథావిథిగా రెండేసి కళ్లు, ఓ ముక్కు, నోరు ఉన్నాయి. దీని యజమానులు ఓ ముఖానికి బిస్కట్స్ అని, మరో ముఖానికి గ్రేవీ అని పేర్లు పెట్టారు. ఈ వింత పిల్లి పిల్లకు సంబంధించిన వీడియోను దాని వ్యక్తిగత ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, రెండు ముఖాల పిల్లులు జన్మించటం చాలా అరుదు. ( ఆవు అంత్యక్రియలు: గుంపులుగా జనం ) ఇలాంటి వింత పిల్లులను జానుస్ అని పిలుస్తారు. ఈ పేరు కూడా రోమన్ దేవుడు జానుస్ పేరు మీద వచ్చిందే. జానుస్ అనే దేవుడు ఓ తలతో భూతాకాలాన్ని, మరో తలతో భవిష్యత్తును చూడగలడని ప్రతీతి. అయితే ఇలాంటి పిల్లులు ఆరోగ్యంగా బ్రతకం కష్టమైన పని. బిస్కట్స్, గ్రేవీల పరిస్థితి కూడా ప్రస్తుతం బాగోలేదు. వాటి ఆరోగ్యంపై స్పందిస్తున్న నెటిజన్లు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. -
ఒక తల.. రెండు ముఖాలు!
-
ఇది మీకు కాస్తయినా నవ్వు తెప్పిస్తుంది: డాక్టర్లు
కరోనా రక్కసి వ్యతిరేక పోరాటాన్ని ముందుండి నడిపిస్తోంది వైద్యులే. తమ ప్రాణం పోయినా సరే కానీ పది మందిని కాపాడటమే ధ్యేయంగా పని చేస్తున్నారు. లాక్డౌన్ వేళ అందరూ ఇంటిని అంటిపెట్టుకుని ఉంటే వాళ్లు మాత్రం ఆసుపత్రిలోనే గడియారం ముల్లుతో పోటీ పడుతు మరీ విశేషంగా శ్రమిస్తున్నారు. తాజాగా అమెరికాకు చెందిన కొంతమంది డాక్టర్లు ఆసుపత్రిలో తమకు దొరికిన కాసింత విరామ సమయంలో డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సూపర్ హీరోలకు థాంక్స్ చెప్తూ నటుడు హగ్ జాక్మాన్ ఈ వీడియోను షేర్ చేశాడు. (కరోనా: ఆరు వారాల శిశువు మృతి) ఓరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీకి చెందిన నలుగురు వైద్యులు ఓ పాపులర్ సాంగ్‌కు కాళ్లు కదుపుతున్నారు. ఇందులో ఒక డాక్టర్ ఈ వీడియోను తిరిగి షేర్ చేస్తూ ఇది మీ ముఖాలపై చిరునవ్వు తెప్పిస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నాడు. ఇంతకు ముందు కూడా వీళ్లు ఆసుపత్రిలో డ్యాన్స్ చేస్తున్న వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. తద్వారా కరోనాపై జనాలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. కాగా, అమెరికాలో ఇప్పటివరకు 2 లక్షల 36 వేలకు పైగా కేసులు నమోదు కాగా, దాదాపు 6 వేల మంది మృత్యువాత పడ్డారు. నిన్న ఒక్కరోజే 900పైగా మంది మరణించటం కలవరపరిచే అంశం. (కరోనా: చేతులు కడుక్కున్న చింపాంజీ) -
కరోనా చికిత్స: ఆ మందులు డేంజర్
ఆరెగాన్ : కరోనా వైరస్ చికిత్స కోసం ఉపయోగించే హైడ్రాక్సిక్లోరోక్వైన్, యాంటీ బయోటిక్ అజిత్రో మైసిన్లు రోగి హృదయ స్పందనలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని యూఎస్‌కు చెందిన శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కరోనా చికిత్సలో ఉపయోగించే ఈ మలేరియా యాంటీ బయోటిక్ డ్రగ్ కాంబినేషన్ కార్డియాక్ అరెస్ట్‌కు దారి తీస్తుందని ఆరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్శిటీ అండ్ ఇండియానా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాంబినేషన్ డ్రగ్ల కారణంగా అనారోగ్యంతో ఉన్న వారి పరిస్థితి మరింత క్షీణించే అవకాశం ఉందంటున్నారు. కొన్ని వందల రకాల మందులు కార్డియాక్ అరెస్ట్‌కు దారి తీస్తాయని వెల్లడించారు. ( కరోనా: వాటి మాయలో పడకండి! ) ఆరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్శిటీ ఫ్రొఫెసర్ ఎరిక్ స్టెకర్ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వైద్యులు మహమ్మారి చికిత్స కోసం హైడ్రాక్సిక్లోరోక్వైన్, యాంటీ బయోటిక్ అజిత్రో మైసిన్లు విరివిరిగా ఉపయోగిస్తున్నారు. కరోనా బాధితుడిపై అవి ఎంత వరకు సానుకూల ప్రభావం చూపుతాయన్న దానిపై మా దగ్గర చాలా తక్కువ సమాచారం ఉంది. ఈ కాంబినేషన్‌ను వాడుతున్న వారు దాని ద్వారా ఎదురయ్యే దుష్ప్రభావాలపై తప్పకుండా జాగ్రత్త వహించాలి. ఈ కాంబినేషన్‌తో చికిత్స చేస్తున్నవారు బాధితుల హృదయ స్పందనలను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉండాలి. ఏది ఏమైనా కరోనాకు మందు లేకపోవటాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకోవాల’ని అన్నారు. -
‘ఇటువంటి క్రైం సీన్ చూడటం ఇదే తొలిసారి’
ఓరెగాన్ : కుటుంబం మొత్తాన్ని అంతమొందించి మరో చిన్నారిని కూడా హత్య చేయబోయిన మానవ మృగాన్ని పోలీసులు కాల్చి చంపారు. అమెరికాలోని ఓరెగాన్‌లో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మార్క్ లియో గ్రెగరీ గాగో(42) తన తల్లిదండ్రులు, గర్ల్‌ఫ్రెండ్ షైనా స్వీజర్(31), కూతురు(9 నెలలు)తో కలిసి క్లాకమస్ కంట్రీలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంటికి వచ్చిన లియో కుటుంబ సభ్యులను అత్యంత పాశవికంగా హత్య చేశాడు. అనంతరం తమ ఇంటి పక్కనే ఉంటున్న మరో ఎనిమిదేళ్ల చిన్నారి(గర్ల్‌ఫ్రెండ్ మొదటి భర్త కూతురు)ని కూడా చంపేందుకు ఆమె వెంటపడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన పొరుగింటి వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కాల్పులు జరుపగా అతడు మృతి చెందాడు. వారిని ఎలా చంపాడో తెలియదు ఈ ఘటన గురించి క్లాకమస్ కంట్రీ షెరిఫ్ ఆఫీస్ అధికారి జెన్సెన్ మాట్లాడుతూ.. ‘ బాధితులను చంపడానికి లియో ఏ ఆయుధాన్ని ఉపయోగించాడో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అతడి గదిలో వివిధ రకాల ఆయుధాలు, కత్తులు, రాడ్లు లభించాయి. గది మొత్తం రక్తంతో నిండిపోయి ఉంది. 20 ఏళ్ల సర్వీసులో ఇటువంటి క్రైం సీన్ చూడటం ఇదే తొలిసారి. ఈ హత్యకు గల కారణాలు అన్వేషిస్తున్నాం’ అని పేర్కొన్నాడు. -
చావు, బతుక్కి మధ్య అర క్షణం; షాకింగ్ వీడియో
సెలేమ్(యూఎస్) : ఆఫ్‌డ్యూటీలో ఉన్న ఓ పోలీసాయన దోస్తులతో కలిసి సరదాగా చేపలవేటకు వెళ్లి.. అట్నుంచే మృత్యువు అంచులదాకా వెళ్లొచ్చాడు! కొలంబియా నదిలో చిన్న చేపల పడవను భారీ స్పీడ్ బోటు ఢీకొట్టిన ఘటన తాలూకు వీడియో నెటిజన్లను గగుర్పాటుకు గురిచేస్తోంది. క్షణాల్లో కకావికలం : బ్రియాన్ మెస్ అనే పెద్దమనిషి ఆరెగాన్ రాష్ట్రంలో పోలీసుగా పనిచేస్తున్నాడు. ఓ సెలవునాడు తన స్నేహితులైన రోనీ డుర్హామ్, క్రిస్టోఫర్ మెక్మహూన్లను వెంటేసుకుని కొలంబియా నదిలో చేపలవేటకు వెళ్లాడు. కాలం సరదాగా గడుస్తుండగా.. దూరం నుంచి తెల్లటి మృత్యుశకటం దూసుకొస్తున్నట్లు కనిపించింది. దాదాపు 30 అడుగుల పొడవున్న ఆ తెల్లటి స్పీడ్‌బోటు.. కొద్దిసేపట్లోనే చేపల పడవను బలంగా ఢీకొట్టి వెళ్లిపోయింది. పడవలోని ఆ ముగ్గురూ నీళ్లలోకి దూకడం క్షణం ఆలస్యమై ఉంటే ప్రాణాలు కోల్పోయేవారే! డ్రైవర్ వింత వాదన.. బాధితుల భారీ దావా : 2017, ఆగస్టులో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి స్పీడ్ బోటు యజమానిపై మార్లిన్ లార్సెన్‌పై కేసు నమోదయింది. అయితే జరిగినదాంట్లో తన తప్పేమీ లేదని, డ్రైవింగ్ సీట్లో కూర్చున్నప్పుడు.. ఎదురుగా ఉన్న బోటు కనిపించలేదని లార్సెన్ వాదించాడు. తద్వారా పరిహారం చెల్లించకుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే, బాధితులు మాత్రం ముమ్మాటికీ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని అంటున్నారు. ప్రమాద సమయంలో స్పీడ్ బోటు డ్రైవర్ లార్సెన్.. మొబైల్ ఫోన్ మాట్లాడుతూ కనిపించాడని కోర్టుకు చెప్పారు. ఓ మోస్తారు గాయాలతో బయటపడిన బాధితులు ముగ్గురూ.. భారీ పరిహారాన్ని డిమాండ్ చేస్తూ స్పీడ్ బోటు డ్రైవర్‌పై మరో దావా వేశారు. -
చావుకు, బతుకుకు మధ్య అరక్షణం
-
15 ఏళ్లుగా విమానంలో ఒంటరిగా..
-
15 ఏళ్లుగా విమానంలో ఒంటరిగా..
పోర్ట్లాండ్: విమానయానం విపరీతంగా వృద్ధిచెందుతోన్న ప్రస్తుత దశలో ఏటా కనీసం 500 పాత విమానాలను తుక్కు(స్క్రాప్)గా మార్చేస్తున్నారు. అమెరికాకు చెందిన ఇంజనీరింగ్ నిపుణుడు బ్రూస్ క్యాంప్‌బెల్‌కు ఇది ఏమాత్రం మింగుడుపడని అంశం. అందుకే ఎక్కడ పాడుబడ్డ విమానాల్ని అమ్మేస్తున్నారని తెలిస్తే అక్కడికెళ్లి కొనేస్తాడు! అన్నీ కొనడం కుదరదుకాబట్టి ఇష్టమైనవాటిని కనుక్కుంటాడు. అలా తన 20వ ఏట కొనుగోలుచేసిన భారీ బోయింగ్ 727 విమానాన్ని తన ఆవాసంగా మార్చుకున్నాడు క్యాంప్‌బెల్! ఆరెగాన్(యూఎస్)లోని పోర్ట్‌లాండ్‌కు చెందిన బ్రూస్.. తన వ్యవసాయ క్షేత్రంలో ఈ విమానం ఇంటిని రూపొందించాడు. పచ్చటి ప్రకృతి నడుమ, చిక్కటి చెట్ల మధ్య కొలువైన ఈ ఫైట్ హౌస్‌లోనే గడిచిన 15 ఏళ్లుగా బ్రూస్ నివాసం ఉంటున్నాడు. ప్రస్తుతం అతని వయసు 66 ఏళ్లు. సంవత్సరంలో ఆరు నెలలు ఫ్లైట్ హౌస్‌లో ఉండే బ్రూస్.. మిగిలిన కాలమంతా పాత విమానాల కోసం విదేశాల్లో సంచరిస్తూఉంటాడు. ఆలూ, చూలు లేరు కాబట్టి అతనలా ప్రశాంతంగా, తనకు నచ్చినట్లు జీవిస్తున్నాడు.. -
సెక్స్ మార్చుకున్నా.. 'ఆమె'లా ఉండలేను!
పురుషుడిగా పుట్టి, మహిళగా లింగ మార్పిడి చేయించుకున్న వ్యక్తిని ఏమని పిలుస్తారు?.. అయితే మహిళ అనో లేక ట్రాన్స్ జెండర్ అనో పిలుస్తారు. కానీ నన్నలా పిలవొద్దంటూ ఏకంగా కోర్టు మెట్లెక్కింది జామి షుపె. అమెరికాలోని ఆరెగాన్ రాష్ట్రానికి చెందిన ఈమె.. తనను స్త్రీగాకానీ, పురుషుడిగాకానీ సంబోధించవద్దని ఆమేరకు ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. పూర్తిగా కొత్త తరహాదైన ఈ కేసు చిక్కుముడి విప్పడానికి న్యాయమూర్తి చట్టాలన్నింటినీ తిరగేయాల్సి వచ్చింది. చివరకు శుక్రవారం తుది తీర్పును చదివి వినిపిస్తూ.. 'ఎలాంటి అభ్యంతరం లేనందున సదరు జామిని నాన్ బైనరీగా పరిగణించాలి' అని జడ్జిగారు ఆదేశించారు. ఒకప్పుడు మగాడిగా ఆర్మీలో పనిచేసిన జామికి కోర్టు తీర్పు ఊరటనిచ్చింది. అమెరికన్ ఆర్మీలో ఫస్ట్ క్లాస్ సార్జెంట్ గా పనిచేసి, 2010లో రిటైర్మెంట్ తీసుకున్న షుపె.. 2013లో సెక్స్ మార్పిడి చేయుంచుకుని మహిళగా మారిపోయాడు. అయితే తనలో ఆడామగా లక్షణాలు ఉన్నందున తనను ఏదోఒక లింగానికి పరిమితం చేయరాదంటూ కోర్టుకు ఆర్జీ పెట్టుకున్నాడు. ఆరెగాన్ కోర్టులు సెక్స్ మార్పిడి చేయించుకున్నవాళ్లకు చట్టబద్ధమైన గుర్తింపు కల్పించడం సమజమే అయినా, జామి అభ్యర్థన మాత్రం కొత్త తరహాది. దీంతో కాస్త సమయం తీసుకున్న న్యాయమూర్తులు ఆమెను ఆడామగా కాని నాన్ బైనరీగా గుర్తించాలని, ప్రభుత్వ గుర్తింపు కార్డులు, పాస్ పోర్టులోనూ ఆమేరకు మార్పులు చేసుకోవచ్చని తీర్పు చెప్పింది. భలే ఉందికదా ఈ జంబలకడిపంబ కథనం!