ఒక తల.. రెండు ముఖాలు! | Cat born With Two Faces In Oregon | Sakshi
Sakshi News home page

ఒక తల.. రెండు ముఖాలు!

Published Sun, May 24 2020 5:24 PM | Last Updated on Thu, Mar 21 2024 8:42 PM

సాక్షి, న్యూయార్క్‌ : అమెరికాలోని ఆరెగాన్‌లో ఓ వింత పిల్లి జన్మించింది. ఒక తల రెండు ముఖాలు ఉండటం దాని ప్రత్యేకత. ఒక్కో ముఖానికి యథావిథిగా రెండేసి కళ్లు, ఓ ముక్కు, నోరు ఉన్నాయి. దీని యజమానులు ఓ ముఖానికి బిస్కట్స్‌ అని, మరో ముఖానికి గ్రేవీ అని పేర్లు పెట్టారు. ఈ వింత పిల్లి పిల్లకు సంబంధించిన వీడియోను దాని వ్యక్తిగత ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. దీంతో వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, రెండు ముఖాల పిల్లులు జన్మించటం చాలా అరుదు. 

ఇలాంటి వింత పిల్లులను జానుస్‌ అని పిలుస్తారు. ఈ పేరు కూడా రోమన్‌ దేవుడు జానుస్‌ పేరు మీద వచ్చిందే. జానుస్‌ అనే‌ దేవుడు ఓ తలతో భూతాకాలాన్ని, మరో తలతో భవిష్యత్తును చూడగలడని ప్రతీతి. అయితే ఇలాంటి పిల్లులు ఆరోగ్యంగా బ్రతకం కష్టమైన పని. బిస్కట్స్‌, గ్రేవీల పరిస్థితి కూడా ప్రస్తుతం బాగోలేదు. వాటి ఆరోగ్యంపై స్పందిస్తున్న నెటిజన్లు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement