cat
-
ఐపీఎస్ అభిషేక్ మహంతికి స్వల్ప ఊరట
సాక్షి,హైదరాబాద్: ఐపీఎస్ అభిషేక్ మహంతికి స్వల్ప ఊరట లభించింది. ఏపీకి వెళ్లాలన్న కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు సోమవారం వరకు నిలిపివేసింది. ఇదే అంశంపై కేంద్రంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 24కు వాయిదా వేసింది.విభజన సందర్భంగా కేటాయించిన రాష్ట్రం ఏపీలో చేరాలని మహంతికి కేంద్రం గత నెల ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఐపీఎస్ అభిషేక్ మహంతి క్యాట్‌ను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన క్యాట్ కేంద్ర ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో క్యాట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ తిరుమలాదేవీ ధర్మాసనం విచారణ చేపట్టింది. గురువారం ఏపీలో చేర్చాల్చి ఉండటంతో.. సోమవారం వరకు కేంద్రం ఉత్తర్వులను నిలిపివేసింది. -
మరణించిన పిల్లితో రెండురోజులు గడిపి.. చివరికి షాకింగ్ నిర్ణయం
లక్నో: పెంపుడు పిల్లి మృతితో కుంగిపోయిన ఓ మహిళ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తీవ్ర మనస్తాపం చెందిన ఆమె.. మళ్లీ బతికి వస్తుందనే ఆశతో రెండు రోజుల పాటు తన పెంపుడు పిల్లి మృతదేహంతోనే గడిపింది. చివరికి మూడో రోజు ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో ఈ ఘటన జరిగింది. హసన్‌పూర్‌లో నివసించే 32 ఏళ్ల పూజకు ఎనిమిదేళ్ల కిందట ఢిల్లీకి చెందిన వ్యక్తితో వివాహం కాగా.. రెండేళ్ల తర్వాత భార్యాభర్తలు విడిపోయారు. దీంతో నాటి నుంచి తల్లి గజ్రా దేవి వద్ద ఆమె నివసిస్తోంది.ఒంటరితనం నుంచి బయటపడడానికి పూజ ఒక పెంపుడు పిల్లిని తీసుకొచ్చి పెంచుకుంటోంది. ఆ పిల్లి హఠాత్తుగా చనిపోవడంతో ఆమె తల్లి.. పిల్లిని పాతిపెట్టమని చెప్పింది. అందుకు పూజ నిరాకరించింది. అది తిరిగి బతికి వస్తుందంటూ.. రెండు రోజుల పాటు ఆ పిల్లి మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచింది. ఖననం చేయామని కుటుంబ సభ్యులు ఎన్ని సార్లు చెప్పిన కానీ పూజ వినిపించుకోలేదు.పిల్లి మృతితో తీవ్ర కుంగుబాటుకు గురైన పూజ.. శనివారం మధ్యాహ్నం ఆమె తమ ఇంటి మూడో అంతస్తులోని తన గదిలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది. గజ్రా దేవి తన కూతురిని చూడటానికి తలుపులు తీసి చూడగా పూజ సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
పిల్లి కోసం పోలీస్ స్టేషన్ కు చేరిన పంచాయితీ
-
పిల్లిది ప్రాణం కాదా..
చేవెళ్ల: ‘ప్రాణం ఎవరిదైనా ఒకటే.. పిల్లిది అయితే ప్రాణం కాదా.. అల్లారు ముద్దుగా ఐదునెలలుగా పెంచుకుంటున్నాం.. అది ఇప్పుడు ఇంట్లో లేదంటే ఎంతో బాధగా ఉంది.. ఏమీ తినడం లేదని ఆస్పత్రికి వస్తే ఏవో మందులు ఇచ్చి చంపేశారు’ అంటూ ఓ మహిళ కంటతడిపెట్టుకుంది. ఈ సంఘటన చేవెళ్లలో మంగళవారం చోటు చేసుకుంది. నగరానికి చెందిన పౌజియా బేగం పిల్లలతో కలిసి కొంతకాలంగా చేవెళ్లకు వచ్చి స్థిరపడింది. ఐదు నెలల కిత్రం ముచ్చటపడి పిల్లిపిల్లను తెచ్చుకుంది. ఇంటిల్లిపాదీ దానిని అపురూపంగా చూసుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో రెండు రోజులుగా అది ఏమీ తినకపోవడంతో చేవెళ్లలోని వెటర్నరీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి సిబ్బంది ఇంజెక్షన్ ఇచ్చి, ఓ మందు తాగించి పంపించారు. ఇంటికి వెళ్లిన కాసేపటికి పిల్లి ఫిట్స్ వచి్చనట్లు కొట్టుకుంటూ అడ్డం పడిపోయింది. మళ్లీ ఆస్పత్రికి తీసుకురాగా వైద్య సిబ్బంది వైద్యం అందిస్తుండగా అది మృతి చెందింది. దీంతో పౌజియా బేగం, ఆమె కుమారుడు అక్బర్ సిబ్బందితో గొడవకు దిగారు. అల్లరుముద్దుగా పెంచుకుంటున్న పిల్లి వైద్యం వికటించి మృతి చెందిందని.. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. సరైన వైద్యం చేయకపోవడంతోనే పిల్లి చనిపోయిందని వైద్యం చేసిన సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. విచారణకు ఆదేశం పిల్లికి అనారోగ్యంగా ఉండడంతో నయం చేసేందుకు వైద్యసిబ్బంది ప్రయతి్నంచారని చేవెళ్ల వెటర్నరీ వైద్యుడు తిరుపతిరెడ్డి తెలిపారు. ముందుగా వచ్చినప్పుడు ఆస్పత్రిలో ఉండే కాంట్రాక్ట్‌పై పనిచేసే సబార్డినేట్ దేవేందర్ నట్టల మందు, జ్వరం మందు వేసి పంపించాడని.. తరువాత మళ్లీ పరిస్థితి విషమంగా ఉందని రాగా చికిత్స అందిస్తుండగా మృతి చెందినట్లు చెప్పారు. ఈ విషయంపై జేడీ విజయ్‌కుమార్‌కు సమాచారం అందించామని ఆయన ఆలూరు వైద్యులతో బుధవారం పోస్టుమార్టం చేయించాలని.. ఏం జరిగిందో విచా రణ చేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు. కాగా తనపై దాడి చేశారని దేవేందర్ సైతం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
అలాంటిలాంటి పిల్లి కాదిది.. ఏకంగా ప్రధాని కార్యాలయంలో..!
బ్రిటిష్ పతాకాన్ని హోదా చిహ్నంగా మెడలో ధరించి, గంభీరంగా చూస్తున్న ఈ పిల్లి వాలకం గమనించండి. ఇది బ్రిటిష్ ప్రధాని కార్యాలయంలో ఉన్నతోద్యోగి. దీని హోదా ‘చీఫ్ మౌసర్ టు ది కేబినెట్ ఆఫీస్’. బ్రిటిష్ ప్రధాని కార్యాలయంలోనికి ఎలుకలు చొరబడకుండా కాపలా కాయడమే దీని పని. దీని కన్ను కప్పి పొరపాటున ఏ ఎలుకైనా సాహసించి ఈ కార్యాలయంలోకి చొరబడితే, ఇది వెంటనే పట్టి, పలారం లాగించేస్తుంది. లండన్‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్‌లో ఉన్న బ్రిటిష్ ప్రధాని కార్యాలయంలోని ఉద్యోగులందరూ దీనిని అల్లారుముద్దుగానే కాదు, అత్యంత గౌరవంగా కూడా చూసుకుంటారు. బ్రిటిష్ ప్రభుత్వ కార్యాలయంలో పిల్లులను పెంచే పద్ధతి పదహారో శతాబ్ది నుంచి ఉండేది. ప్రధాని కార్యాలయంలో పెంచే పిల్లికి ‘చీఫ్ మౌసర్’ హోదాను అధికారికంగా ప్రకటించడం మాత్రం 1997లో జరిగింది. ఇప్పుడు ‘చీఫ్ మౌసర్’గా ఉన్న పిల్లి కోసం బ్రిటిష్ ప్రభుత్వం ఏటా 100 పౌండ్లు (రూ.10,597) ఖర్చు చేస్తోంది. (చదవండి: ఉద్యోగం కోల్పోతేనేం కుట్టు పనితో ఏకంగా..!) -
క్యాట్‌లో ఐఏఎస్‌ల పిటిషన్: నాలుగు వారాలకు విచారణ వాయిదా
సాక్షి,హైదరాబాద్: ఐఏఎస్ అధికారుల కేటాయింపుపై కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్)లో ఇవాళ( సోమవారం) విచారణ జరగింది. స్వాపింగ్, డొమిసిల్ (స్థిర నివాసం) ఆధారంగా తమ అభ్యర్థనలను పరిగణలోకి తీసుకోలేదన్న ఐఏఎస్‌ల పిటిషన్‌పై క్యాట్ విచారణ చేపట్టింది. అయితే ఈరోజు డీఓపీటీ కౌంటర్ దాఖలు చేయలేదు. ఇక.. ఎడుగురు ఐఏఎస్ అధికారుల విడిగా కౌంటర్ దాఖలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఐఏఎస్ తరుపు న్యాయవాదులు కోరారు. వచ్చే విచారణకు ఏడుగురు ఐఏఎస్‌ల కేటాయింపుపై విడిగా కౌంటర్లు ఫైల్ చేయాలనీ డీఓపీటీకి క్యాట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ క్యాట్ 4 వారాలకు వాయిదా వేసింది.గత నెలలో కేటాయించిన రాష్ట్రాల్లోనే విధులు నిర్వహించాలంటూ డీవోపీటీ జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఐఏఎస్ అధికారులు క్యాట్‌ను ఆశ్రయించారు. డీవోపీటీ ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషన్లో కోరారు. ఐఏఎస్‌ల పిటిషన్‌పై క్యాట్ విచారణ చేపట్టింది. వాదనల అనంతరం ..డీవోపీటీ ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు క్యాట్ నిరాకరించింది. ప్రతివాదులైన కేంద్రం, డీవోపీటీలకు నోటీసులు ఇచ్చింది. నవంబరు 5లోపు కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. ఏపీకి వెళ్లాల్సిందేనని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. క్యాట్ ఆదేశాలతో ఇప్పటికే కేటాయించిన రాష్ట్రాల్లో ఐఏఎస్‌లు రిపోర్ట్ చేశారు.అయితే తమని డొమిసిల్,స్వాపింగ్ ఆధారంగా కేటాయింపు జరగలేదని, డీవోపీటీ తమ అభ్యర్థనలను పరిగణలోకి తీసుకోలేదని ఏడుగురు ఐఏఎస్‌లు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
ఐఏఎస్‌లకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్‌లకు చుక్కెదురైంది. ఐఏఎస్‌లు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. వెంటనే ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది డీవోపీటీ ఉత్తర్వులపై ఐఏఎస్ అధికారులు వాణి ప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి బుధవారం తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై హైకోర్టు జస్టిస్ అభినందన్ కుమార్ శావలే బెంచ్ విచారించింది. విచారణలో భాగంగా ఐఏఎస్‌లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. దీంతో ఐఏఎస్‌లో ఏపీలో రిపోర్ట్ చేయనున్నారు.ఐఏఎస్ అధికారుల పిటిషన్‌పై విచాణ జరిగిందిలావిచారణ సందర్భంగా.. డీపీవోటీ తరపు లాయర్ తెలంగాణ హైకోర్టులో తన వాదనలు వినిపించారు. కేంద్రంలో ఉన్న అధికారులంతా అనుభవజ్ఞులు. ఏ అధికారి ఎక్కడ పనిచేయాలనే విజ్ఞత వాళ్లకు ఉంది. ఏ అధికారి ఎక్కడ పనిచేయాలనే అధికారం కోర్టులకు లేదని అన్నారు.ప్రజా సేవ కోసమే ఐఏఎస్లుప్రజా సేవ కోసమే ఐఏఎస్‌లు. ఎక్కడ అవకాశం కల్పిస్తే అక్కడికి వెళ్ళాలి. ట్రైబ్యునల్ కొట్టేస్తే కోర్టులకు రావడం కరెక్ట్ కాదు. డిస్మిస్ చేస్తే మళ్ళీ అప్పీల్ చేస్తారు.ఇది లాంగ్ ప్రాసెస్.అధికారులు ముందు రిపోర్ట్ చేయండి’అని హైకోర్టు స్పష్టం చేసింది.అనంతరం ఐఏఎస్ తరుఫు న్యాయవాదులు కోర్టులో తమ వాదనల్ని వినిపించారు. స్థానిక తను పరిగణలోకి తీసుకోవాలని,ప్రభుత్వం అభిప్రాయం కూడా తీసుకోవాలని కోరారు.తీర్పును వాయిదా వేయాలంటూపండగలు ఉన్నాయి అప్పటివరకు స్టే విధించాలని విజ్ఞప్తి చేశారు. పండుగలు ఇప్పుడు ఏం లేవన్న హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. అయితే అందుకు ఐఏఎస్ తరుఫు న్యాయవాదులు.. క్యాట్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తున్నామని చెప్పగా.. క్యాట్ ఆర్డర్ కాపీ ఇవ్వాలని కోరిన హై కోర్ట్ కోరింది. అందుకు ఆర్డర్ కాపీ ఇంకా రాలేదని ఐఏఎస్ తరుపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. క్యాట్ తదుపరి విచారణ నవంబర్ 4కు వాయిదా వేసింది. అప్పటి వరకు ఐఏఎస్‌లను రిలీవ్ చేయకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ఐఏఎస్‌ల విజ్ఞప్తిపై హైకోర్టు తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించగా.. బుధవారం సాయంత్రంలోగా ఐఏఎస్‌లు ఏపీలో రిపోర్ట్ చేయాలని, కాబట్టి పూర్తి స్థాయిలో వినాలంటూ పట్టుబట్టడటంతో వాదనలు తిరిగి ప్రారంభమయ్యాయి.ముందు ఏపీలో రిపోర్ట్ చేయండిఅటు డీవోపీటీ, ఇటు ఐఏఎస్‌ల తరుఫు న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు ..15రోజుల పాటు ఊరట కల్పించాన్న ఐఏఎస్‌ల విజ్ఞప్తిని తోసిపుచ్చింది. క్యాట్ ఆదేశాలను సమర్థించింది. ఐఏఎస్‌లు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. అనంతరం, ‘ముందు ఏపీలో రిపోర్ట్ చేయండి. ఏదైనా సమస్యలు ఉంటే తర్వాత వింటాం. ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సమస్యలు మరింత జఠిలం అవుతాయి’ అని తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఐఏఎస్ అధికారులు వెంటనే ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశిస్తూ తుది తీర్పును వెలువరించింది. 👉చదవండి: ఐఏఎస్‌లకు క్యాట్ చురకలు -
ఆ ఐదుగురు ఐఏఎస్‌లకు బిగ్ షాక్
సాక్షి,హైదరాబాద్: డీఓపీటీ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యున్‌ల్‌లో(క్యాట్) దాఖలు చేసిన పిటిషన్లపై ఐదుగురు ఐఏఎస్ అధికారులకు బిగ్ షాక్ తగిలింది. డీఓపీటీ ఉత్తర్వులను పాటించాల్సిందేనని క్యాట్ వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం సదరు ఐఏఎస్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టింది క్యాట్డీఓపీటీ ఆర్డర్స్ ప్రకారం రిపోర్ట్ చేయాలని, ఎక్కడి వాళ్లు అక్కడే రిపోర్ట్ చేయాలంటూ క్యాట్ ఆదేశాలు జారీచేసింది. రేపు యథావిధిగా రిపోర్ట్ చేయాలని స్పష్టం చేసింది. ‘ఏపీలో ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి చోటుకు వెళ్లి వారికి సేవ చేయాలని మీకు లేదా? ఐఏఎస్‌ల కేటాయింపులపై డీవోపీటీకి పూర్తి అధికారాలు ఉన్నాయి. స్థానికత ఉన్నప్పటికీ స్వాపింగ్ చేసుకునే అవకాశం గైడ్‌లైన్స్‌లో ఉందా?’ అని క్యాట్ ప్రశ్నించింది. కాగా రాష్ట్ర పునర్విభజన సందర్భంగా జరిగిన కేటాయింపుల ప్రకారం ఆయా రాష్ట్రాలకు వెళ్లాలంటూ ఈ నెల 9న కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, కె.ఆమ్రపాలి, ఎ.వాణీప్రసాద్, డి.రొనాల్డ్‌రాస్, జి.సృజనలు కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్(క్యాట్)లో పిటిషన్ దాఖలు చేశారు.ఇదిలా ఉండగా ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్న వాకాటి కరుణ, ఆమ్రపాలి, వాణీప్రసాద్, రొనాల్డ్‌రాస్‌లు కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఏపీకి వెళ్లాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీలో పనిచేస్తున్న సృజన తెలంగాణకు రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం తాము పనిచేస్తున్న రాష్ట్రంలోనే కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని, కేంద్రం జారీ చేసిన కేటాయింపు ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషన్లో కోరారు.👉చదవండి: ఐఏఎస్, ఐపీఎస్‌ల కేడర్ విభజనపై కేంద్రం కీలక ఆదేశాలు -
క్యాట్ పిటిషన్ కహానీ
-
‘మేం ఏపీకి వెళ్లలేం’.. క్యాట్‌లో ఐఏఎస్‌ల పిటిషన్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్, ఐపీఎస్ కేడర్ విభజనలో కీలక పరిణామం చోటు చేసుకుంది.తమను తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలంటూ డీవోపీటీ ఆదేశాలు జారీ చేసిందని, ఆ ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణలో కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, వాణి ప్రసాద్, ఆమ్రపాలి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT)లో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీలోనే కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఐఏఎస్ అధికారిణి సృజన కోరారు. నలుగురు ఐఏఎస్‌లు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్ల క్యాట్ మంగళవారం విచారణ చేపట్టనుంది.తెలంగాణ సీఎస్ శాంతికుమారితో భేటీతెలంగాణ సీఎస్ శాంతికుమారితో ఏపీ కేడర్ ఐఏఎస్,ఐపీఎస్ అధికారులు సమావేశమయ్యారు. సీఎస్‌తో వాకాటి కరుణ, రోనాల్డ్ రోస్, అమ్రాపాలితో పాటు పలువురు అధికారులు భేటీ అయ్యారు. గతవారం ఏపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌లు ఎల్లుండి (అక్టోబర్ 16) లోపు రిపోర్టు చేయాలని డీవోపీటీ (డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఐఏఎస్‌లు ఇంకా రిలీవ్ కాలేదు. ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ తరుణంలో డీవోపీటీ ఆదేశాల మేరకు ఎల్లుండి ఏపీలో రిపోర్ట్ చేసే విషయంపై సీఎస్‌తో అధికారులు భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లేందుకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు విముఖత వ్యక్తం చేశారు. ఇప్పటికే తాము ఏపీకి వెళ్ళబోమని డీవోపీటీకి విజ్ఞప్తి చేయగా.. ఆ విజ్ఞప్తిని డీవోపీటీ తిరస్కరించింది. దీంతో ఐఏఎస్ అధికారులు క్యాట్‌ను ఆశ్రయించారు. రేపు క్యాట్ విచారణ చేపట్టనుంది. అనంతరం ఐఏఎస్‌లు,ఐపీఎస్‌లు ఏపీకి వెళ్తారా? లేదంటే తెలంగాణలోనే కొనసాగుతారా? అనేది తేలనుంది.👉చదవండి: మీరు వెళ్లాల్సిందే -
1,000 మైళ్లు..2 నెలలు
అంత దూరాన తప్పిపోయిన పెంపుడు పిల్లి రెణ్నెల్లలో క్షేమంగా స్వస్థలం చేరిన వైనం పెంపుడు జంతువులంటేనే ఎంతో విశ్వాసంగా ఉంటాయి. ఎంత దూరం వెళ్లినా తిరిగి తమ ఆవాసాలకు చేరి ఆశ్చర్యపరుస్తుంటాయి. కానీ ఏకంగా ఎన్నో మైళ్ల దూరాన తప్పిపోయిన ఓ పెంపుడు పిల్లి ఒకరకంగా చరిత్రే సృష్టించింది. అక్షరాలా వెయ్యి మైళ్లు వెనక్కు ప్రయాణించి మరీ రెండు నెలల తరవాత ఇల్లు చేరింది! ప్రాణప్రదమైన పిల్లి తిరిగి రావడంతో యజమానుల ఆనందానికి పట్టపగ్గాల్లేవు. అమెరికాలో కాలిఫోర్నియాలోని సాలినాస్‌కు చెందిన సుసానే, బెన్నీ అంగుయానోలకు రెండున్నరేళ్ల పిల్లి ఉంది. ముద్దుగా రెయిన్బో అని పిలుచుకునేవారు. జూన్ 4న పిల్లితో పాటు వ్యోమింగ్‌లోని ఎల్లో స్టోన్ పార్కుకు వెళ్లారు. ఏమైందో గానీ పిల్లి ఉన్నట్టుండి భయపడి పారిపోయింది. ఎంత పిలిచినా వెనక్కి తిరిగి కూడా చూడకుండా పరుగు తీసింది. రోజుల తరబడి వెదికినా లాభం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి తిరిగొచ్చారు. నెల తర్వాత మరో పిల్లిని దత్తత తీసుకున్నారు. 61 రోజుల తర్వాత కాలిఫోరి్న యాలో సాలినాస్‌కు 190 మైళ్ల దూరంలోని రోజ్‌విల్లేలో దాన్ని గుర్తించారు. దాంతో దంపతులిద్దరూ పరుగెత్తుకుని వెళ్లి దాన్ని ఇంటికి తెచ్చుకున్నారు. ‘మేం వెళ్లేసరికి ఆరోగ్యం పాడై ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. లేదంటే ఆ 190 మైళ్లు కూడా దాటేసి ఇంటికే వచ్చేసేదేమో’అంటూ సుసానే మురిసిపోయింది. అయితే దాదాపు 1,000 మైళ్ల దూరంలోని వ్యోమింగ్ నుంచి రోజ్‌విల్లే దాకా అది ఎలా రాగలిగిందన్నది మాత్రం పజిల్‌గానే మిగిలిపోయింది! – సాక్షి, నేషనల్ డెస్క్ -
పెట్.. బ్యూటీ సెట్!
సాక్షి, సిటీబ్యూరో: మనం బాగుంటే చాలదు.. మనవి అన్న ప్రతిదీ బాగుండాలి. మనం ఎక్కి తిరిగే కారు నుంచి మన వెనుకే తిరిగే శునకం, పెంపుడు జంతువు దాకా..అన్నీ బాగుండాలి. గ్లామర్ మేనియా నానాటికీ విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో పెద్దలూ, పిల్లలూ దాటి చివరకు పెట్స్ వరకూ వచ్చేసింది. మై పెట్ ఈజ్ బ్యూటీఫుల్ అంటూ సగర్వంగా చెప్పుకోవాలనే ఆరాటం పెరుగుతుండడంతో పెట్స్‌కు అందాలను అద్దే పార్లర్లు శరవేగంగా విస్తరిస్తున్నాయి. దీని కోసం నగరంలో మొబైల్ పార్లర్లు, గ్రూమింగ్ సేవలను అందించే పార్లర్స్, బ్యూటీ సెలూన్స్ ఇలా ఒక్కటేమిటి.. మనుషులకు ఎన్ని రకాల సౌందర్య సాధనాలు ఉన్నాయో.. అవన్నీ పెంపుడు జంతువులకూ అందుతున్నాయి..స్నానం నుంచి.. హెయిర్ డై వరకూ..ఈ పెట్స్ పార్లర్ల సేవల జాబితాలో ఔషధ స్నానం, జుట్టు కత్తిరించడం, నెయిల్ క్లిప్పింగ్, చెవి శుభ్రపరచడం, హెయిర్ క్లీనింగ్, డై.. వంటివి ఉన్నాయి. ఈ సేవల కోసం పూర్తిగా రసాయనాలు లేని ఉత్పత్తులను మాత్రమే ఉపయోగిస్తున్నామని పార్లర్ల నిర్వాహకులు అంటున్నారు. పెంపుడు జంతువులకు, మొత్తం గ్రూమింగ్ ప్రక్రియ దాదాపు ఒక గంట పడుతుందనీ పొడవాటి బొచ్చు కలిగిన శునకాలు, లేదా హస్కీలు వంటి వాటికి 90 నిమిషాల వరకూ పడుతుందని గ్రూమర్లు చెబుతున్నారు. తమ సెలూన్లలో పనిచేసే గ్రూమర్లందరూ వెటర్నరీ కళాశాల డిప్లొమా హోల్డర్లు. ఉద్యోగంలో భాగంగా తొలుత వారు మూడు నెలల పాటు శిక్షణ పొందుతారని జస్ట్ గ్రూమ్ నిర్వాహకులు అంటున్నారు.శునకాలు చూపే ఆప్యాయత ఎలా ఉంటుందో వాటి యజమానులకు మాత్రమే అర్థం అవుతుంది. అవి అలవాటైన మనుషులతో అల్లుకుపోతుంటాయి. కాబట్టి పెట్స్ ఆరోగ్యంగా ఉండాలంటే వాటిని పరిశుభ్రంగా ఉంచడం వాటికి మాత్రమే కాదు వాటి యజమా నులకు కూడా అత్యవసరం. రోజు వారీ స్నానం చేయించడం, నులిపురుగుల నిర్మూలన, జుట్టు కత్తిరించడం, పళ్లను పాలిష్ చేయడం, గోళ్లను కత్తిరించడం ఇలాంటివెన్నో చేయడం అవసరం. అయితే పెట్‌ను ఇంటికి తెచ్చుకున్నంత సులభం కాదు వాటికి ఈ సేవలన్నీ చేయడం.. ఇందుకు సమయంతో పాటు అనుభవం, నైపుణ్యం కూడా కావాలి. సరిగ్గా చేయలేకపోతే, అలర్జీలు ఇన్ఫెక్షన్లతో ఇంటిల్లిపాదికీ సమస్యలు తప్పవు.గ్రూమింగ్ దారి.. ఆర్గానిక్ మరి..నగరంలో ఇలాంటి పెట్ యజమానుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పలు రకాల సేవలను అందించే వ్యక్తులు, సంస్థలు వచ్చాయి. వీటి మధ్య పోటీ తత్వం కూడా పెరిగింది. పెట్స్‌కు మసాజ్ చేయడం, బబుల్ బాత్ తదితర సదుపాయాలు మనుషుల స్పా మాదిరిగానే రొటీన్ భౌ¿ౌలకు కూడా విస్తరించాయి. వీటికి తూడో మరిన్ని వెరైటీలు కూడా జతయ్యాయి.అదిరే డ్రెస్సింగ్ స్టైల్.. పెళ్లికి వెళుతూ పిల్లిని చంకనబెట్టుకుపోవడం నామోషీ అనే పరిస్థితి ఇప్పుడు లేదు. అది పిల్లి అయినా కుక్కపిల్లయినా.. సరే దర్జాగా తమ పెట్ని కూడా వేడుకల్లో భాగం చేస్తున్నారు. పైగా అదే తమ స్టేటస్ సింబల్‌గానే భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఫంక్షన్ లేదా ఫొటోషూట్‌కు తీసుకెళ్లాల్సి ఉంటే, తగిన దుస్తులు ధరింపజేయడం, ప్రత్యేకంగా హెయిర్‌ను సెట్ చేయడం వంటివి కూడా పెట్ స్టైలిస్ట్స్ చేస్తున్నారు. అలాగే పిల్లులను పెంచుకునేవారికి వీరు సేవలు అందిస్తున్నారు.వ్యాధుల వ్యయంతో పోలిస్తే నయమే..శుభ్రత పాటిస్తే పెట్స్ ఆరోగ్యంగా ఉంటాయి. వాటికి సరైన విధంగా స్నానం చేయించడం అన్ని వేళలా సాధ్యం కాక చర్మవ్యాధులు వంటివి రావచ్చు. గ్రూమింగ్ లేకపోయినా ఆరోగ్య సమస్యలే. అందుకే నా పెట్‌కి నెలకోసారి స్పాలో స్నానం, మూడు నెలలకు ఒకసారి గ్రూమింగ్ చేయిస్తాను. నెలవారీగా రూ.3వేలు ఖర్చు అవుతుంది. అయితే వ్యాధులు వస్తే అంతకన్నా ఎక్కువే ఖర్చు చేయాలి. మొబైల్ సేవల వల్ల పెట్ స్పా కోసం దూరభారం ప్రయాణించే అవసరం పోయింది. – పరిమళ, సికింద్రాబాద్తరలివచ్చి.. తళుకులద్దగ..గతంలో ఈ తరహా పెట్ గ్రూమింగ్ సేవల్ని నగరంలో కొన్ని సంస్థలు తమ ఆవరణలో అందించేవి. అయితే కరోనా సమయంలో తమ పెట్స్‌ని గ్రూమింగ్ పార్లర్స్‌కు తీసుకెళ్లలేక పడిన ఇబ్బందులు మొబైల్ పార్లర్స్‌కు ఆజ్యం పోశాయి. ప్రస్తుతం నగరంలో దాదాపు వందకు పైగా మొబైల్ వ్యాన్లు ఈ పెట్ స్పాలను ఇంటింటికీ మోసుకొస్తున్నాయి. తమకు ఏడు వ్యాన్ల దాకా ఉన్నాయని, నగరవ్యాప్తంగా పెట్స్‌కు మొబైల్ స్పా సేవల్ని అందిస్తున్నాయని పెట్ గల్లీ సిబ్బంది సాక్షికి వివరించారు. జూబ్లీహిల్స్‌లోని పెట్ స్పాలో ప్రొఫెషనల్ గ్రూమర్ అయిన డి.సౌమ్య మాట్లాడుతూ, ‘ఇంతకుముందు, పెంపుడు జంతువును అలంకరించేందుకు ఇళ్లను సందర్శించేవాళ్లం. అయితే ఇళ్ల దగ్గరకు వెళ్లడం, అక్కడ సరైన ప్రైవసీ లేకపోవడం సహా అనేక రకాల ఇతర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోగ్రూమింగ్ వ్యాన్ ఉత్తమ ప్రత్యామ్నాయంగా మారింది’ అని చెప్పారు.నగరానికి చెందిన ప్రొఫెషనల్ పెట్ కేర్ సంస్థ పెట్ఫోక్కు చెందిన నిపుణులైన గ్రూమర్ల బృందం ఇప్పుడు పెంపుడు జంతువులకు ఇంటి దగ్గరే వారి వస్త్రధారణ సేవలను సైతం అందజేస్తుంది, అత్యాధునిక సాంకేతికతతో ప్రత్యేకంగా రూపొందించిన వ్యాన్లను ఈ సంస్థ ఉపయోగిస్తోంది. యూజర్ ఫ్రెండ్లీ ఇ–కామర్స్ ప్లాట్‌ఫారమ్ ద్వారా, వెబ్ యాప్ మొబైల్ యాప్‌గా కూడా ఈ సేవ అందుబాటులో ఉంటుంది.మెకానికల్ ఇంజనీర్ బిజినెస్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన చైత్ర సాయి దాసరి ప్రారంభించిన డోర్‌స్టెప్ సర్వీస్ జస్ట్ గ్రూమ్. ‘పెంపుడు జంతువులకు రిలాక్సేషన్ ఇచ్చి విశ్రాంతి తీసుకునేలా చేసే గ్రూమింగ్ సరీ్వస్ అవసరం. వీటికి వస్త్రధారణ కేవలం సౌందర్య సాధనం కాదు. ఇది పెంపుడు జంతువు మానసిక ఆరోగ్యానికి దారి కూడా. సరైన విధంగా లేని స్నానం చర్మ వ్యాధులు కలిగించి అవి వస్త్రధారణకు భయపడేలా చేస్తుంది’ అంటున్నారు చైత్ర. తమ జస్ట్ గ్రూమ్ ప్రస్తుతం జంటనగరాల వ్యాప్తంగా సంచరిస్తున్న తమ వ్యాన్స్ ద్వారా ప్రతిరోజూ కనీసం 50 పెట్స్‌కు సేవలు అందిస్తున్నారు. సొంత బిడ్డల్లాగే.. పెట్స్ కూడా..పెట్స్‌ను పెంచుకుంటున్న నగరవాసులు వాటిని సొంత పిల్లల్లాగే భావిస్తున్నారు. వాటి ఆరోగ్య సంరక్షణతో పాటు వాటికి అవసరమైన అన్ని రకాల అలంకరణలూ చేస్తున్నారు. తమతో పాటు వాటిని టూర్లు, షికార్లు, ఈవెంట్స్‌కు తీసుకువెళుతున్నారు. వీటన్నింటి వల్లే పెట్ గ్రూమింగ్ అత్యంత ప్రధానమైన అంశంగా మారింది. పెట్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేఫ్‌ను నిత్యం సందర్శిస్తుంటారంటే.. పెట్స్ పట్ల యజమానుల ప్రేమను అర్థం చేసుకోవచ్చు. – రుచిర, పెట్ కేఫ్ నిర్వాహకులుఇవి చదవండి: Fashion: మై వార్డ్రోబ్: క్రియేటివ్‌గా.. హుందాగా..! -
ప్రపంచంలోనే అత్యంత సంపన్న పిల్లి ..ఇన్‌స్టాలో ఒక్కో పోస్ట్‌కి ఏకంగా..!
ఎక్కువ సంపాదన కోసం రకరకా మార్గాల్లో అన్వేషిస్తుంటాడు మనిషి. అలా కష్టపడగా..కష్టపడగా.. కొన్నేళ్లకు ధనవంతుడవుతాడు. అదికూడా కొందరికే సాధ్యమవుతుంది. అలా ఓ జంతువు కూడా సంపాదించగలదంటే నమ్ముతారా..!. ఇది చిన్నప్పటి నుంచి దాని విభిన్నమైన లుక్స్‌తో సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రజాధరణ పొంది డబ్బులు ఆర్జించడం మొదలుపెట్టింది. అలా ప్రంపచంలోనే అత్యంత ధనవంతురాలైన పిల్లిగా రికార్డు సృష్టించింది. ఇంతకీ ఈ పిల్లి అంతలా ఎలా సంపాదిస్తుంటే..ఆ పిల్లి పేరు నాలా. ఇది కాలిఫోర్నియాకు చెందిన సియామీ టాబీ మిక్స్ క్యాట్. 2010లో వరిసిరి మేతచిట్టిఫాన్ అనే మహిళ ఈ నాలా అనే పిల్లిని జంతు సంరక్షణ కేంద్ర నుంచి దత్తత తీసుకుంది. అప్పుడు దాని వయసు కేవలం ఐదు నెలలే. 2012లో వరిసిరి తన స్నేహితులకు, కుటుంబ సభ్యలతో తన పెంపుడు పిల్లి క్యూట్ ఫోటోలను షేర్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఇన్‌స్టాలో దాని పేరుతో ఒక ప్రొఫెల్ క్రియేట్ చేసింది. కొద్ది కాలంలోనే ఈ పిల్లి వేలాది ప్రజలను ఆకర్షించింది. అలా ఆ పిల్లి ఇన్‌స్టాలో 4.5 మిలియన్ల మంది ఫాలోవర్ల ఉన్న జంతువుగా గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది. ఈ పిల్లి అందమైన తలపాగా, నీలికళ్లతో చూపురులను కట్టిపడేస్తుంది. ఇలా నాలాకు పెరిగిన భారీ ఫాలోయింగే..పెంపుడు జంతువుల విభాగంలో ఫోర్బ్స్ టాప్ ఇన్ఫ్లుయెన్సర్ల జాబితాలో చేర్చింది. అంతేగాదు ఈ పిల్లి పేరు మీదుగా లివింగ్ యువర్ బెస్ట్ లైఫ్ అకార్డింగ్ టు నాలా క్యాట్' అనే ఈబుక్‌ను కూడా కలిగి ఉంది. అలాగే ఆమె సొంత వెబ్సైట్ 'లవ్ నాలా' పేరుతో ప్రీమియం క్యాట్ ఫుడ్ బ్రాండ్‌ను కలిగి ఉంది. నివేదికల ప్రకారం ఈ లవ్ నాలా బ్రాండ్ హస్బ్రో, రియల్ వెంచర్స్, సీడ్ క్యాంప్‌ల వంటి పెట్టుబడుదారుల నుంచి వందల కోట్లు ఆర్జిస్తోంది. ఈ పిల్లి సంపాదనలో ఎక్కువ భాగం సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్స్, ప్రొడక్ట్స్ ప్రకటనలు, బ్రాండ్ల ద్వారానే ఎక్కువగా ఆర్జిస్తోంది. ఈ పిల్లి ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు, టిక్‌టాక్, యూట్యూబ్‌తో సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ప్రొఫైల్‌ను కలిగి ఉంది. అయితే ఈ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ల సాయంతో జంతు సంరక్షణ పట్ల అవగాహన కల్పించడం, స్వచ్ఛంద సంస్థలకు నిధులు సేకరించడం వంటివి చేస్తుంది ఆ పిల్లి యజమాని వరిసిరి. కాగా, నాలా తర్వాత ప్రపంచంలోని రెండవ అత్యంత సంపన్న పిల్లి ఒలివియా బెన్సన్. ఈ పిల్లి నికర విలువ రూ. 813 కోట్లు. మూడవ అత్యంత సంపన్న పిల్లి దివంగత జర్మన్ ఫ్యాషన్ డిజైనర్ కార్ల్ ఒట్టో లాగర్ఫెల్డ్కు చెందిన చౌపెట్టే. దీనికి రూ. 109 కోట్లు సంపద ఉంది.(చదవండి: 12 ఏళ్లుగా అతనిది 30 నిమిషాల నిద్రే..!) -
పిల్లే కదా అనుకుంటే..
శివమొగ్గ: ఇంట్లో పెంచుకుంటున్న పిల్లి కరవడంతో రేబిస్ వ్యాధి బారిన పడి మహిళ మరణించిన ఘటన జిల్లాలోని శికారిపుర తాలూకా తరలఘట్ట గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన గృహిణి గంగీబాయి (44) అనే మహిళ రెండు నెలల క్రితం ఇంట్లో చూసుకోకుండా పిల్లి తోకపై కాలు వేసింది.అప్పుడు పిల్లి ఆమె కాలుపై కరిస్తే, ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందింది. రేబిస్ సోకుండా ముందు జాగ్రత్తగా ఐదు ఇంజెక్షన్లు తీసుకోవాల్సి ఉండగా ఒక ఇంజెక్షన్‌ను మాత్రమే తీసుకుని ఏమీ కాదులే అని ఊరుకుంది. పది రోజుల క్రితం ఆమె ఉన్నఫళంగా అనారోగ్యం బారిన పడటంతో శికారిపుర తాలూకా ఆస్పత్రిలో, ఆపై శివమొగ్గలోని ప్రభుత్వ మెగ్గాన్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ గురువారం మృత్యువాత పడినట్లు జిల్లా సీజనల్ వ్యాధుల నియంత్రణాధికారి డాక్టర్ మల్లప్ప తెలిపారు. పెంపుడు జంతువులు కరిచిన వెంటనే గాయాన్ని యాంటిబయాటిక్ ద్రవం, లేదా సబ్బుతోనైనా శుభ్రంగా కడగాలన్నారు. తరువాత సమీప ఆస్పత్రికి వెళ్లి నెల రోజుల్లో నాలుగు రేబిస్ ఇంజెక్షన్లను వేయించుకోవాలని, అప్పుడే రేబిస్ నుంచి తప్పించుకోవచ్చని తెలిపారు. పిల్లి, కుక్క వంటి జంతువుల కాట్లపై నిర్లక్ష్యం వద్దని ప్రజలకు సూచించారు. -
Jaya Verma Sinha: క్యాట్ సభ్యురాలిగా రైల్వే బోర్డు చైర్పర్సన్
న్యూఢిల్లీ: రైల్వే బోర్డు చైర్పర్సన్, సీఈవో జయ వర్మ సిన్హా కేంద్ర అడ్మిని్రస్టేటివ్ ట్రిబ్యూనల్ (క్యాట్) సభ్యురాలిగా నియమితులయ్యారు. ఆగస్టు 31న రైల్వే బోర్డు నుంచి పదవీ విరమణ పొందాక క్యాట్ సభ్యురాలిగా బాధ్యతలు చేపడతారు. జయతో పాటు మరో 11 మందిని క్యాట్ సభ్యులుగా నియమిస్తూ కేబినెట్ నియామకాల కమిటీ సోమవారం నిర్ణయం తీసుకుంది. జస్టిస్ హర్‌నరేశ్ సింగ్ గిల్, జస్టిస్ పద్మరాజ్ నేమచంద్ర దేశాయ్, వీణా కొతవాలే, రాజ్వీర్ సింగ్ వర్మలు క్యాట్‌లో జ్యుడీషియల్ సభ్యులుగా నియమితులయ్యారు. -
జేఎన్టీయూ మెస్‌లో పిల్లి ఘటనపై అనుమానాలు!
హైదరాబాద్, సాక్షి: సుల్తాన్పూర్ జేఎన్టీయూ మెస్‌లో చట్నీలో ఎలుక ఘటన మరువక ముందే.. హైదరాబాద్ జేఎన్టీయూ మెస్‌లో పిల్లి ఆహారాన్ని ముట్టినట్లు ఓ వీడియో చక్కర్లు కొట్టింది. ఇది మీడియాకు ఎక్కడంతో.. జేఎన్టీయూ అధికారులు ఘటనపై విచారణ జరుపుతున్నారు. అయితే ఈ ఘటనపై అనుమానాలు ఉన్నాయని, ఇది ఎవరో కావాలని చేసిన పని అయ్యి ఉంటుందని ప్రిన్సిపాల్ నర్సింహారెడ్డి అంటున్నారు. ‘‘నిజానికి హాస్టల్లో కిటికీ తెరిచిన కారణంగానే పిల్లి లోపలికి వచ్చింది. ఒకవేళ పిల్లి వచ్చినా.. తినే టైంలో అక్కడ విద్యార్థులు, స్టాఫ్ ఉంటారు కాబట్టి భోజనం దగ్గరకు అవి వచ్చే అవకాశం ఉండదు. విద్యార్థులు భోజనం చేశాకే ఈ ఘటన చోటు చేసుకుంది. ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఆ వీడియో తీసి ఉంటారు. లేకుంటే.. వార్డెన్‌కో, ప్రిన్సిపాల్‌కో ఫిర్యాదు చేయకుండా నేరుగా నెట్లో పెడతారా?. సోషల్ మీడియా ప్రచారాల కోసమే అలా చేసి ఉంటారని భావిస్తున్నాం. ఘటనపై విచారణ చేస్తున్నాం. బాధ్యులెవరైనా సరే చర్యలు మాత్రం కఠినంగా ఉంటాయి అని ప్రిన్సిపాల్ అన్నారు. జేఎన్టీయూ కళాశాల మంజీరా వసతిగృహం భోజనశాలలోని ఆహార పదార్థాల గిన్నెల్లో పిల్లి మూతి పెట్టిన దృశ్యాలు ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వెంటనే ఈ అంశంపై పరిశీలన కోసం కూకట్పల్లి గవర్నమెంట్ ఫుడ్ వెరిఫికేషన్ కమిటీ అధికారులు హాస్టల్లో పరిశీలనలు జరిపారు. ఎలాంటి వంటకాలను పిల్లి ముట్టుకోలేదని ప్రకటించారు. అయితే.. వంటగది, నిత్యావసరాల స్టోర్‌రూమ్‌ను తనిఖీ చేయగా.. అపరిశుభ్రంగా నీరు నిలిచి ఉండడాన్ని గమనించారు. కొన్ని కూరగాయలు పాడైపోవడంతో పారబోయించారు. వంటపాత్రలపై మూతలు, కిటికీలకు మెష్‌లు లేవు. కేర్టేకర్లు మెస్‌లో 24గంటలూ ఉండాలన్నారు. నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నామని, వారి ఆదేశాలకు అనుగుణంగా చర్యలుంటాయన్నారు. -
నిజమే... ఇది చిరుతలాంటి అడవిపిల్లి!!
చూడటానికి ఇది అచ్చంగా చిరుతపులిలా ఉంటుంది గాని, నిజానికి ఇది అడవిపిల్లి. సహారా ఎడారి చుట్టుపక్కల ఉండే ఆఫ్రికా దేశాల్లోని అడవుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. దీనిని ‘సెర్వల్’ అంటారు.ఇది దాదాపు రెండు అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. దీని బరువు తొమ్మిది నుంచి పద్దెనిమిది కిలోల వరకు ఉంటుంది. అంటే, చిరుతపులితో పోల్చుకుంటే సగం పరిమాణంలో ఉంటుంది. శరీర పరిమాణంతో పోల్చుకుంటే, దీని కాళ్లు పొడవుగా ఉంటాయి. చిరుత కంటే దీని తల పరిమాణం చిన్నగా ఉంటుంది. ఇది చాలా వేగంగా వేటాడుతుంది.పగలు, రాత్రి కూడా చురుగ్గానే ఉంటుంది. ఎక్కువగా ఎలుకలు, కప్పలు, చిన్న చిన్న పక్షులను వేటాడి తింటుంది. ఆఫ్రికాలో వలస రాజ్యాలు ఏర్పరచుకున్న కాలంలో ఫ్రెంచ్ శాస్త్రవేత్త జార్జస్ లూయీ లెక్లెర్క్ కామ్టే డి బఫన్ 1765లో తొలిసారిగా ఈ జంతువును గుర్తించి, దీని గురించిన విశేషాలను ప్రపంచానికి వెల్లడించాడు.ఇవి చదవండి: ఆ దీవిలో మూడు రోజులు బస ఉచితం! ఎందుకంటే? -
గుర్తుందా..!? వానల కోసం పిల్లుల ఊరేగింపు.. ఈసారీ వింతగా..
వానలు కురవడం ఆలస్యమైతే కప్పల పెళ్లిళ్లు జరిపించడం మనవాళ్లకు తెలిసిన ఆచారం. వానలు కురవడం ఆలస్యమై, కరవు దాపురించే పరిస్థితులు ఎదురైతే పిల్లుల ఊరేగింపు జరపడం కంబోడియా, థాయ్‌లాండ్, మయాన్మార్, వియత్నాం తదితర ఆగ్నేయాసియా దేశాలలో చిరకాలంగా కొనసాగుతున్న ఆచారం. ఇవన్నీ ప్రధానంగా వ్యవసాయాధారిత దేశాలే! ఈ దేశాలలో వరి ప్రధానమైన పంట.వరి బాగా పండాలంటే వర్షాలు కీలకం. వర్షాలు సకాలంలో కురవకుంటే, దేవతల ప్రీతి కోసం ఇక్కడి జనాలు ఊరూరా పిల్లుల ఊరేగింపు జరుపుతారు. వానల కోసం పిల్లుల ఊరేగింపు జరిపే ఈ వేడుకను ‘హే న్యాంగ్ మ్యావ్’ అంటారు. ఆడపిల్లులను, ముఖ్యంగా నల్లపిల్లులను, ప్రస్ఫుటమైన నల్లని మచ్చలు ఉన్న పిల్లులను ఎంపిక చేసుకుని, వాటిని వెదురు బుట్టల్లో కూర్చుండబెట్టి ఊళ్లోని ప్రతి ఇంటి వద్ద ఆగుతూ ఊరేగింపు జరుపుతారు.ఈ ఊరేగింపులో ఉపయోగించడానికి సయామీస్ జాతికి చెందిన పిల్లులు శ్రేష్ఠమైనవని భావిస్తారు. అసలు పిల్లులతో పాటు బుట్టల్లో పిల్లుల బొమ్మలను కూడా పెట్టి జనాలు ఊరేగింపులో పాల్గొంటారు. ఆడపిల్లుల ‘మ్యావ్’ రావాలకు వానదేవుడు కరుణిస్తాడని జనాల నమ్మకం. పిల్లుల ఊరేగింపులో ఊళ్లలోని పిల్లా పెద్దా ఉత్సాహంగా పాల్గొంటారు. సంప్రదాయ వాద్యాలను వాయిస్తూ, పాటలు పాడుతూ ఊరంతా తిరుగుతారు. ఊరేగింపు తర్వాత ప్రార్థనలు జరిపి, సామూహికంగా విందు భోజనాలు చేస్తారు.ఇవి చదవండి: ఈ గొడుగు ఖరీదు వింటే.. వ్హా.. అంటూ నోరెల్లబెట్టాల్సిందే!! -
‘‘రాష్ట్రపతి భవన్‌లోకి వచ్చింది పులి కాదు.. పిల్లి’’
న్యూఢిల్లీ: మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమంలోకి వచ్చిన జంతువు చిరుతపులి కాదని కేవలం పిల్లి అని తేలింది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు సోమవారం(జూన్10) క్లారిటీ ఇచ్చారు.మంత్రుల ప్రమాణస్వీకారం సందర్భంగా వెనుకాల కారిడార్‌లో నడుస్తూ లైవ్ కెమెరాలకు చిక్కింది ఇళ్లలో తిరిగే పిల్లి అని పోలీసులు స్పష్టం చేశారు. ప్రమాణస్వీకారం సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లోకి చిరుత పులి వచ్చిందని సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు కొట్టింది.ఇది భద్రతా వైఫల్యమేనని నెటిజన్లు కామెంట్లు పెట్టారు. అయితే ఇవేవీ నిజం కావని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అలాంటి రూమర్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. -
గాజులరామారంలో అడవి పిల్లి కలకలం
-
ఇవి మార్జాల పుష్పాలనుకుంటున్నారా!
ఫొటోలో కనిపిస్తున్న పువ్వులను చూశారు కదా, అచ్చంగా పిల్లిపిల్లల్లా ఉన్నాయి కదూ! ఈ మార్జాల పుష్పాలు ఎక్కడివనేగా మీ అనుమానం? ఈ మార్జల పుష్పాలు దేవతా వస్త్రాల్లాంటివే! భూప్రపంచంలో ఎక్కడా కనిపించవు. మరి ఈ ఫొటో ఏమిటి అనుకుంటున్నారా? ఇదంతా కృత్రిమ మేధ మాయాజాలం.చైనాకు చెందిన కొందరు సైబర్ మోసగాళ్లు ఈ మార్జాల పుష్పాల ఫొటోలను కృత్రిమ మేధతో సృష్టించి, బహుళజాతి ఈ–కామర్స్ సంస్థ ‘ఈబే’లో అమ్మకానికి పెట్టారు. ఇవి పూర్తిగా సేంద్రియ పద్ధతులతో పెంచిన తోటల్లో పూసినవని, ఈ పూలు అత్యంత అరుదైనవని, జన్యుమార్పిడి పద్ధతులేవీ లేకుండా సహజంగా పూసిన తాజా పూలు అని నమ్మబలుకుతూ, ఒక్కో పూలగుత్తిని 45 డాలర్లకు (రూ.3,757) అమ్ముతున్నట్లు ప్రకటించారు.ఫొటోలోని పూలు ఎక్కడా చూడనివి కావడమే కాకుండా, చూడటానికి ముద్దొచ్చే పిల్లిపిల్లల్లా ఆకర్షణీయంగా ఉండటంతో కొందరు ఔత్సాహికులు వాటిని కొనడానికి డబ్బులు కూడా పంపారు. ఫేస్బుక్, ఎక్స్ (ట్విటర్) వంటి సోషల్ మీడియా సైట్లలోనూ ఈ ఫొటోలను జనాలు విరివిగా షేర్ చేశారు కూడా. కొందరు ఆశాజీవులు ఈ పూలమొక్కల విత్తనాలు కావాలంటూ కూడా కామెంట్లు పెట్టారు. కొద్దిరోజుల్లోనే ఇదంతా ఆన్లైన్ మోసమని బయటపడటంతో డబ్బులు పంపి చేతులు కాల్చుకున్న జనాలు లబలబలాడుతున్నారు.ఇవి చదవండి: అవును.. అది నిజంగా మృత్యుగుహే! -
ప్రెగ్నెన్నీ సమయంలో పిల్లి మాంసం తినడంతో..పాపం ఆ బిడ్డ..!
మన పెద్దవాళ్లు ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకునే ఆహారాలు బిడ్డపై ఎఫెక్ట్ చూపిస్తాయని పదేపదే చెప్పేవారు. అది ఎంతవరకు నిజమో గానీ!.. ఇక్కడొక మహిళ ఎదుర్కొంటున్న పరిస్థితిని చూస్తే అది నిజమేనేమో..! అని అనుకుంటారు. ఆమె తన పరిస్థితిని చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. ఏం జరిగిందంటే..ఫిలిప్పీన్స్‌కు చెందిన అల్మా అనే మహిళకు రెండేళ్ల కొడుడు జారెన్ గమోంగన్ ఉన్నాడు. అతడు ముఖం, శరీరాన్ని కప్పి ఉంచేలా పెద్ద వెంట్రుకలతో జన్మించాడు. దీన్ని అరుదైన 'వేర్వోల్ఫ్ సిండ్రోమ్'గా పిలుస్తారు. ఇలాంటి కేసులు ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 నుంచి 100 వరకు ఉన్నాయి. అయితే జారెన్ కడుపులో ఉండగా తల్లి అల్మా అడవి పిల్లులు తినాలనే కోరిక ఎక్కువగా ఉండేదట. అదీగాక అక్కడ అపయావో ప్రాంతంలో పిల్లితో చేసే వంటకం బాగా ప్రసిద్ధి. దీంతో ఒక రోజు నల్లపిల్లిని తెచ్చుకుని వండుకుని తింది. అప్పుడు ఆమెకు ఏమి అనిపించలేదు. ఎప్పుడైతే తన కొడుకు ఇలా మెడ, వీపు, చేతులు, ముఖంపై ఓ ఎలుగుబంటి మాదిరిగా జుట్టుతో ఉండటంతో పశ్చాత్తాపం చెందడం మొదలు పెట్టింది అల్మా. తాను గర్భవతిగా ఉండగా ఆ నల్లపిల్లిని తినడం కారణంగా తన కొడుకు ఇలా పుట్టాడని, ఆ పిల్లి శాపం తనకు తగిలిందని కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. తోటి స్థానికులు, గ్రామస్తులు కూవా అల్మాతో అడవి పిల్లి తినడం వల్లే ఇలా జరిగిందని అనడంతో దాన్నేనమ్మడం మొదలు పెట్టింది. ఐతే అందుకు సరైన ఆధారాలు మాత్రం లేవు. ఇక్కడ ఆమె జారెన్ కంటే ముందు ఓ కుమార్తె ఉంది. ఆమెకు ఈ పరిస్థితి లేదు. కొడుకు అరుదైన పరిస్థితిని చూసి అల్మా తాను చేసిన పనికి నిందించుకుంటూ విలపిస్తోంది. వైద్యులను ఆశ్రయించినా అల్మాకు నిరాశ ఎదురయ్యింది. ఎందుకంటే వైద్యులు అల్మా కొడుకు జారెన్‌కు అనేక వైద్య పరీక్షలు చేసి అతడు హైపర్ట్రికోసిస్ అనే అరుదైన వైద్య పరిస్థితితో బాధపడుతున్నట్లు తెలిపారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ డెర్మటాలజీ ప్రకారం..ఈ హైపర్ట్రికోసిస్ అనేది సాధారణంగా మానవుడికి ఉండే జుట్టు కంటే అధికంగా ఏ భాగంలోనైనా పెరగొచ్చు. ఇది అరుదైన వ్యాధి అని, దీనికి చికిత్స లేదని తేల్చి చెప్పారు. అయితే జారెన్ ఇలాంటి అరుదైన పరిస్థితితో పుట్టినప్పటికీ మంచి యాక్టివ్‌గా అందరిలానా ఉండటం విశేషం. ఐతే ఒక్కోసారి వేడి వాతావరణంలో ఈ దట్టమైన వెంట్రుకల కారణంగా దురద పుడుతుందని చెబుతున్నాడని అల్మా వాపోయింది. తాను చాలా సార్లు జుట్టుని కత్తిరించడానికి ప్రయత్నించానని, అయితే అది పొడవుగా మందంగా ఉండటంతో కత్తిరించిన కొద్ది దట్టంగా పెరుగుతున్నట్లు చెప్పుకొచ్చింది అల్మా. అయితే లేజర్ హెయిర్ రిమూవల్ వంటి చికిత్సలు అధిక జుట్టు పెరుగుదలను తగ్గించగలవని వైద్యులు సూచించారు. దీంతో అల్మా, ఆమె భర్త తన కుమారుడి హెయిర్ రిమూవల్ సెషన్లకు నిధులు సమకూర్చే పనిలో నిమగ్నమయ్యారు. ఏదీ ఏమైనా ప్రెగ్నెన్సీ సమయంలో శిశువుకి హానికరం అనిపించేవి తీసుకోకుండా ఉంటేనే మంచిది. దేనిల్ల కొన్ని రకాల రుగ్మతలు వస్తాయన్నిది సరిగా వైద్యులు సైతం నిర్థారించలేరు, చెప్పలేరు అనేది గుర్తించుకోండి. (చదవండి: సింఘారా పిండి గురించి విన్నారా..? బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!) -
పిల్లులంటే ఇష్టమా? ఐతే తప్పకుండా ఈ మ్యూజియంకి వెళ్లాల్సిందే..!
ఎన్నో రకాల మ్యూజియంలు చూసుంటారు. ఇలా పిల్లుల కోసం ప్రత్యేకంగా ఉన్న మ్యూజియంని ఇంత వరకు చూసి ఉండరు. మన దేశంలో పిల్లిని పొద్దునే చూడటం అపశకునంగా భావిస్తారు గానీ పాశ్చాత్యులు పెంపుడు జంతువుగా పిల్లిని పెంచుకుంటారు. వాళ్లు ఏకంగా ఈ పిల్లుల కోసం ప్రత్యకంగా మ్యూజియంని ఏర్పాటు చేశారు. మరింత విశేషమేమిటంటే ఆ వ్యూజియంలో పిల్లి మమ్మీలు కూడా ఉంటాయట. ఇంతకీ ఆ మ్యూజియం ఎక్కడ ఉందంటే.. ప్రపంచంలో వింత వింత మ్యూజియంలు ఎన్నో ఉన్నాయి. మలేసియాలోని ఈ పిల్లుల మ్యూజియం కూడా అలాంటిదే! మలేసియాలోని కుచింగ్ నగరంలో ఉందిది. కుచింగ్ నార్త్ సిటీ హాల్ యాజమాన్యంలో దీనిని 1993లో నెలకొల్పారు. ఈ పిల్లుల మ్యూజియంలో పిల్లులకు సంబంధించిన దాదాపు నాలుగువేలకు పైగా కళాఖండాలు, వస్తువులు కొలువుదీరి మార్జాలాభిమానులకు కనువిందు చేస్తాయి. ఇందులో పిల్లులకు చెందిన పెయింటింగ్స్, శిల్పాలు, ఈజిప్టు నుంచి తీసుకువచ్చిన ప్రాచీన మార్జాల మమ్మీ వంటి అరుదైన వస్తువులు, పిల్లులకు సంబంధించిన ప్రకటనలు, అరుదైన జాతుల పిల్లుల చిత్రపటాలు, ఫొటోలు వంటివి అబ్బురపరుస్తాయి. ఈ పిల్లుల కళాఖండాలను తొలిసారిగా 1988లో మలేసియా ఉన్నతాధికారి దివాన్ తున్ అబ్దుల్ రజాక్ ‘పుత్ర వరల్డ్ ట్రేడ్ సెంటర్’లో ప్రదర్శించారు. తర్వాత కుచింగ్ నార్త్ సిటీ హాల్ యాజమాన్యం వీటిని సొంతం చేసుకుని, నార్త్ సిటీ హాల్ దిగువ అంతస్తులో శాశ్వతంగా ఈ పిల్లుల మ్యూజియంను ఏర్పాటు చేసింది. (చదవండి: సీతాకోక చిలుక పాలు గురిచి విన్నారా? బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!) -
పిల్లి కోసం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాత
బావిలో పడిన పిల్లిని రక్షించబోయి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదాన్ని నింపింది. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బయోగ్యాస్ పిట్లోకి దిగిన ఐదుగురు వ్యక్తులు చనిపోయిన ఘటన కలకలం రేపింది. పిల్లిని రక్షించడానికి కుటుంబం మొత్తం బావిలోకి దిగింది. మొత్తం ఆరుగురు ఒకరి తర్వాత మరొకరు దూకారు. అయితే ఊపిరాడక చనిపోయిన ఐదుగురి మృతదేహాలను రెస్క్యూ టీమ్ స్వాధీనం చేసుకుందని అహ్మద్‌నగర్‌లోని నెవాసాపోలీస్ స్టేషన్ సీనియర్ పోలీసు అధికారి ధనంజయ్ జాదవ్ తెలిపారు. బాధితులు ఒకరినొకరు రక్షించుకునే ప్రయత్నంలో బావిలోకి దిగి ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. నడుముకి తాడు కట్టుకుని బావిలోకి ప్రవేశించిన వ్యక్తి ప్రాణాలతో బయట పడ్డాడని అతణ్ణి ఆసుపత్రిలో చేర్చినట్టు చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని వెల్లడించారు. మృతులను మాణిక్ గోవింద్ కాలే, సందీప్ మాణిక్ కాలే, బబ్లూ అనిల్ కాలే, అనిల్ బాపురావ్ కాలే, బాబాసాహెబ్ గైక్వాడ్‌లుగా గుర్తించారు. చిన్న కుమారుడు విజయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బావి లోపలికి దిగిన తరువాత ఊపిరాడటంలేదని ఫిర్యాదు చేయడంతో స్థానికులు వెంటనే పోలీసులకు, నిపుణులకు సమాచారం అందించారు. దీంతో సహాయక బృందాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ టీమ్‌లు ఆపరేషన్‌ను పూర్తి చేయడానికి 5 గంటలకు పైగా పట్టిందనీ, అందుకే ప్రాణనష్టం జరిగిందని స్థానికులు విమర్శించినట్టు తెలుస్తోంది. #WATCH | Five people died in a bid to save a cat who fell into an abandoned well (used as a biogas pit) in Wadki village of Ahmednagar, Maharashtra, late at night. According to Dhananjay Jadhav, Senior Police Officer of Nevasa Police station, Ahmednagar, "A rescue team… pic.twitter.com/fb4tNY7yzD — ANI (@ANI) April 10, 2024 -
మహానగరాన్ని వణికిస్తున్న పిల్లి!
ఓ పిల్లి కారణంగా ఒక మహానగరం వణికిపోతోంది. ఎప్పుడు.. ఏం వార్త వినాల్సి వస్తుందోనని జనం హడలెత్తిపోతున్నారు. కారణం.. ఆ పిల్లి ప్రమాదకరమైన రసాయనాల ట్యాంక్‌లో పడ్డాక అక్కడి నుంచి కనిపించకుండా పోవడమే. దీంతో ఆ పిల్లి క్యాన్సర్ కారక రసాయనాన్ని అంతటా వెదజల్లుతుందనే భయం ఆ నగరంలో నెలకొంది. జపాన్ హిరోషిమాలోని ఫుకుయామా అధికారులు ఆ పిల్లిని వెదికేందుకు పెట్రోలింగ్‌ను మరింతగా పెంచారు. ఆ పిల్లి ఎక్కడ కనిపించినా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలను హెచ్చరించారు. కాగా ఆ పిల్లి చివరిగా రసాయన కర్మాగారం నుండి బయటపడినట్లు భద్రతా ఫుటేజీలో కనిపించింది. ఒక కార్మికుడు ఆ పిల్లి పంజా గుర్తులను గమనించి, దానిని ఉన్నతాధికారులకు తెలిపాడు. ఆ పిల్లికి అంటుకున్న రసాయనం అత్యంత ప్రమాదకరం. దానిని ముట్టుకున్నా లేదా పీల్చినా వెంటనే శరీరంపై దద్దుర్లు, వాపు వచ్చి, తీవ్ర వ్యాధికి దారితీస్తుంది. ఫుకుయామా సిటీ హాల్లోని ఒక అధికారి మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఆ పిల్లి కోసం వెదకగా, ఇంకా దాని జాడ తెలియలేదన్నారు. అది సజీవంగా ఉందా లేదా అనేది కూడా సందేహాస్పదంగా ఉందన్నారు. ఫ్యాక్టరీ మేనేజర్ అకిహిరో కొబయాషి మాట్లాడుతూ కర్మాగారంలో రసాయన వ్యాట్‌ను కప్పి ఉంచే షీట్ పాక్షికంగా చిరిగిపోయిందని తెలిపారు. దానిలో పిల్లి పడి, తరువాత ఎటో వెళ్లిపోయిందని, దానికోసం తమ సిబ్బంది వెదుకుతున్నారని చెప్పారు. స్వీడన్‌లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్కు చెందిన రసాయన ప్రమాద అంచనాలో నిపుణురాలు లిండా షెంక్ మాట్లాడుతూ సాధారణంగా పిల్లులు తమ బొచ్చును నాకుతుంటాయని, ఈ విధంగా చూస్తే ఆ పిల్లి ఇప్పటికే ఆ రసాయన్నాన్ని నాకి, చనిపోయివుంటుందన్నారు. -
Hyderabad : కిడ్స్ & పెట్స్ ఎగ్జిబిషన్ (ఫొటోలు)
-
‘కేడర్ వివాదం’లో కేంద్రమే నిర్ణయం తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సర్వీస్ (ఏఐఎస్) అధికారులను రాష్ట్రాల మధ్య కేటాయించే అప్పీలేట్ అథారిటీ బాధ్యతను కోర్టులు నిర్వర్తించనందున.. క్యాట్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసి, కేంద్రమే నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇరు రాష్ట్రాల మధ్య అధికారుల కేటాయింపును మరోసారి పరిశీలించి పదేళ్లకు పైగా తెలంగాణలో ఉంటున్న వారు, త్వరలో సర్విస్ ముగిసేవారికి సంబంధించి సహేతుక నిర్ణయం తీసుకుంటుందని అభిప్రాయపడింది. అయితే అలా వద్దని పిటిషన్ వారీగా విచారణ జరపాలని పిటిషనర్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. దీంతో అధికారుల కేటాయింపునకు సంబంధించిన కేడర్ వివాదంలో వాదనలను వచ్చే నెల 2వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. 2014 నుంచి కొనసాగుతున్న కేడర్ వివాదం 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో కేంద్రం నియమించిన ప్రత్యూష్ సిన్హా కమిటీ నివేదిక ప్రకారం ఏఐఎస్ ఉద్యోగుల విభజన జరిగింది. నాటి నుంచి కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌ల కేడర్ వివాదం సాగుతోంది. విభజన సమయంలో పలువురు అధికారులను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. అయితే వీరిలో కొందరు ఈ కేటాయింపులపై కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించి.. తెలంగాణలో విధులు నిర్వహించేలా ఉత్తర్వులు పొందారు. క్యాట్ ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం తప్పుబడుతూ.. తెలంగాణ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేసింది. ఈ క్రమంలోనే గత జనవరిలో తెలంగాణ సీఎస్ సోమేశ్‌కుమార్‌ను ఏపీకి వెళ్లాల్సిందేనంటూ ఇదే హైకోర్టు సీజే ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే కేడర్, సర్వీస్ సహా ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్న దృష్ట్యా తమ పిటిషన్లను విడిగా విచారణ జరపాలని డీజీపీ అంజనీకుమార్ సహా ఇతర అధికారులు కోరడంతో విచారణను సీజే ధర్మాసనం మరో బెంచ్‌కు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలీ, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఓ పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది కె.లక్ష్మి నర్సింహ వాదనలు వినిపిస్తూ.. ధర్మాసనం అలా నిర్ణయా న్ని కేంద్రానికి వదిలేయ వద్దని విజ్ఞప్తి చేశారు. పిటి షన్ల వారీగా విచారణ చేయాలని కోరారు. ఇతర పిటిషన్ల న్యాయవాదులు కూడా దీన్ని సమరి్థంచారు. దీంతో తదుపరి విచారణ కోసం ధర్మాసనం.. విచారణను వచ్చే నెల 2కు వాయిదా వేసింది. -
తొందరగా వృద్ధాప్య లక్షణాలు రావడానికి కారణం ఇదే!
మనుషుల్లో కొందరూ చాలా పెద్దాళ్లలా కనిపిస్తారు. తొందరగా వయసు పెరిగిపోయినట్లు వృద్ధాప్య ఛాయలే గాక ఆ వయసు సంబంధిత రుగ్మతలు కూడా కనిపిస్తుంటాయి. ఇలా ఎందువల్ల జరుగుతుందో అనే దిశగా శాస్త్రవేత్తలు ఎన్నాళ్లగానో పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా ఆ పరిశోధనల్లో చాలా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటివల్లే మనిషి వయసు స్పీడ్ అప్ అయ్యి వృద్ధులుగా మారుతున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అది మనిషి దేహంలోనే ఉంటూ టైం చూసి వయసుపై ప్రభావం చూపిస్తోందని చెబుతున్నారు. దేని వల్ల ఇలా జరుగుతుంది. ఏం చేయాలి తదితరాల గురించి తెలుసుకుందాం!. పిల్లులు, ఎలుకల్లో ఉండే పరాన్నజీవులు(చిన్న బగ్) మనిషి వయసును ప్రభావితం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. యూఎస్‌లోని దాదాపు 15% మంది వ్యక్తులు తమ జీవిత కాలంలో తెలిసి లేదా తెలియకుండానే వాటిలో ఉండే ఏక కణజీవి టోక్సోప్లాస్టో గోండి బారిన పడ్డట్లు తెలిపారు. ఇవి పిల్లుల, ఎలుకలు శరీరంలో ఉంటాయని. అవి మనిషి శరీరంలో చేరి నిద్రాణంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇది దాని జీవితకాలం మనిషి శరీరంలోనే జీవించగలదని చెబుతున్నారు. మనిషికి ఉండే రోగ నిరోధకవ్యవస్థ కారణంగా ఆ పరాన్న జీవి కలిగించే ఇన్ఫెక్షన్స్కి గురికావడం అనేది ఆధారపడి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది మన వయసును ప్రభావితం చేసి వృద్ధాప్య లక్షణాలు కనిపించేలా.. ఆ వయసులో ఉండే శారీరక బలహీనతలను వేగవంతం చేస్తోందన్నారు. దీన్ని వృద్ధాప్య సిండ్రోమ్ అని పిలుస్తారు. దీని కారణంగా వృద్ధుల మాదిరిగా బరువు తగ్గడం, అలసట, కొద్దిగా కూడా శారీరక శ్రమ చేయలేకపోవడం, బలహీనంగా ఉండటం, తరుచుగా ఆస్పత్రికి వెళ్లడం తదితర లక్షణాలన్నీ ఒక్కసారిగా తలెత్తుతాయన్నారు. ఈ లక్షణాలు 65 ఏళ్లు అంతకంటే పైబడినవారిలో గుర్తించినట్లు తెలిపారు. వృద్ధుల్లో ఈ గోండి ఇన్ఫెక్షన్ కోసం వెతకగా ఇది సంకోచించి ఉండి, ముందుగానే వయసును ప్రభావితం చేసినట్లు గుర్తించామన్నారు. దీని గురించి మరింతగా తెలుసుకునేందుకు దాదాపు 601 మంది స్పానిష్, పోర్చుగ్రీస్ వృద్ధులపై పరిశోధనలు చేయగా 67% మంది ఈ గోండి పరాన్న జీవికి ప్రభావితం అయినట్లు గుర్తించారు. ఈ పరాన్న జీవి నిర్ధిష్ట ప్రతిరోధకాలు వయసును ప్రభావితం చేసి.. సంబంధిత బలహీనత లక్షణాలను పెంచుతున్నట్లు తెలిపారు. అందువల్ల పిల్లి, ఎలుకలు వంటి జీవులకు వాటి వ్యర్థాలకు దూరంగా ఉండమని సూచిస్తున్నారు. ఒక వేళ్ల పెంపుడు జంతువులుగా పెంచుకున్నా.. సురక్షితంగా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. (చదవండి: భారత్‌లోనే టీబీ కేసులు అత్యధికం!: డబ్ల్యూహెచ్ఓ నివేదిక) -
ఓ మహిళ 'మానవ పిల్లి'లా..అందుకోసం ఏకంగా..
వెర్రీ వెయ్యి రకాలు..పైత్యం పలు రకాలు అనే సామెతను మన పెద్దలు ఎందుకన్నారో గానీ కొందరూ మనుషులను చూస్తే అది నిజమే అనిపిస్తుంది. బహుశా పిచ్చి ఆలోచనలు కలిగిన వ్యక్తుల చూసే అన్నారు కాబోలు. మొన్నటికి మొన్న ఓ మనిషి మానవ కుక్కలా కనపడాలని ఆరాటపడటం వార్తలో హాట్‌టాపిక్‌గా మారింది. లక్షలు ఖర్చు పెట్టి మరీ నిజం చేసుకున్నాడు. అది మరువక మునుపే ఇప్పుడో మహిళ మానవ పిల్లిలా కనిపించాలనుకుంటోంది. దేవుడిచ్చిన రూపం కంటే జంతువుల్లా ఉండటానికి ఇష్టపడటం విడ్డూరం అనుకుంటే అందుకోసం వీళ్లు చేసే ప్రయత్నాలు చాలా జుగప్సకరంగా ఉంటాయి. కుక్కలా మారాలనుకున్న వ్యక్తి జస్ట్ కుక్కలా కనిపించే కాస్ట్యూమ్స్ ధరించాడంతే. కానీ ఈమె అచ్చం ఆడ పిల్లిలా కనిపించేందుకు ఎంతకు తెగించిందో వింటే కంగుతినండ ఖాయం! ఇటాలియన్‌కు చెందిన 22 ఏళ్ల చియారా డెల్ అబేట్ సోషల మీడియాలో మంచి క్రేజ్ ఉన్న టిక్‌టాకర్. మరెందుకు అనిపించిందో గానీ ఆడ పిల్లిలా కనిపించాలనేది ఆమె ప్రగాఢ కోరిక. అందుకోసం తల దగ్గర నుంచి కాలి వరకు 20కి పైగా మార్పులు చేసింది. ప్రతి అంగాన్ని పిల్లిలా ఉండేలా మార్చింది. వామ్మో!.. ఇదేలా సాధ్యం అని అనుకోకండి!. ఎందుకంటే అసమంజసమైన కోరికను నిజం చేసి పాపులర్ అవ్వాలన్నదే ఆమె బలమైన కాంక్ష. ఈ కోరిక చిన్నినాటి నుంచి ఉందట. శరీరాన్ని పిల్లిలా మార్చుకునేందుకు శరీరంపై ఎన్ని కుట్లు పడ్డాయో చెబితే షాక్ అవుతారు. 11 ఏళ్ల వయసు నుంచి శరీర ట్రాన్స్ఫార్మేషన్ ప్రకియను మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఇలా ఇప్పటి వరకు శరీరంపై 72 కుట్లు పడ్డాయి. ముక్కు రంధ్రాల నుంచి, పైపెదవి వరకు చాల కుట్లు పడ్డాయి. కనురెప్పలపై అదనంగా ఉన్న చర్మం తొలగించుకునేలా కాస్మెటిక్ సర్జరీ, ప్రతి చేతికి 10 సబ్‌డెర్మల్ ఇంప్లాంట్లు, ఆఖరికి బ్రెస్ట్, అంతర్గత జననేంద్రియాలను కూడా వదలలేదు. వాటిని కూడా ఆడ పిల్లికి ఉన్నట్లుగా మార్పులు చేయించుకుంది. తాను ఏదో కామెడీగా కార్టూన్లో కనిపించే పిల్లిలా కనిపించాలనుకోవడం లేదని అచ్చం "మానవ పిల్లిలా" కనిపించడమే తన ధ్యేయం అని తెగేసి చెబుతోంది చియారా. అందుకే ఆమె అక్కడితో ఆగకుండా పూర్తిగా ఆడ పిల్లిలా కనిపించేలా..బాదం ఆకారంలో ఉండే పిల్లి కళ్లు, దంతాలు, పైపెదవి, తోక తదితర మార్పులు కోసం కాంటోప్లాస్టీ అనే కాస్మెటిక్ సర్జరీ చేయించుకునేందుకు సిద్ధమవుతోంది. పైగా తన శరీరం ఆయా మార్పులకు అనుగుణంగా ఫిట్‌గా ఉంటుందని ధీమాగా చెబుతోంది చియారా. ఇలాంటి ఆలోచన రావడమే విచిత్రం అనుకుంటే అంతలా సర్జరీలు చేయించుకోవడానికి కూడా మంచి గట్స్ ఉండాలేమో!. చిన్న సర్జరీకే బెంబేలెత్తిపోతాం. ఏకంగా 20 సార్లు శరీర మార్పులు చేయించుకోవడమేగాక ఇంకా కొన్ని సర్జరీలు చేయించుకునేందుకు రెడీ అయిపోతోంది చియారా. పిచ్చి పీక్స్‌లో ఉంటే ఎంతకైన తెగిస్తారంటే ఇదేనేమో!. (చదవండి: అద్భుతమైన డెవిల్స్ బ్రిడ్జ్! ఆ నిర్మాణం ఓ అంతుచిక్కని మిస్టరీ!) -
చైనాలో మరో దారుణం వెలుగులోకి: మండిపడుతున్న జనం
Cats being killed and sold as mutton or pork in china డ్రాగన్ కంట్రీ చైనాలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. మటన్ పేరుతో పిల్లుల మాంసాన్ని విక్రయిస్తున్న వైనం కలకలం రేపింది. దేశంలో జంతురక్షణ చట్టాలు,ఆహార భద్రత మరోసారి చర్చకు దారి తీసింది. దాదాపు 1,000 పిల్లులను కబేళాకు తరలిస్తుండగా చైనా పోలీసులు పట్టుకున్నారు. దీంతో పిల్లి మాంసాన్ని పంది మాంసం లేదా మటన్‌గా విక్రయించే అక్రమ వ్యాపారం గుట్టు రట్టయింది. ఈ నెల ప్రారంభంలో జంతు పరిరక్షణ కార్యకర్తల సూచన మేరకు, తూర్పు చైనీస్ ప్రావిన్స్ జియాంగ్సులోని జాంగ్జియాగాంగ్ అధికారులు దాడులు నిర్వహించారని ది పేపర్ నివేదించింది. పిల్లుల మాంసాన్ని మటన్ గా నమ్మించి దేశంలోని దక్షిణ ప్రాంతానికి సరఫరా చేస్తున్నారని తెలిపింది. దక్షిణ చైనా ప్రావిన్స్‌లోని గ్వాంగ్‌డాంగ్‌లో ఇంతకుముందు ఇలాంటి అక్రమ వ్యాపారాలను నిలిపివేసినట్లు జంతు సంరక్షణ ఉద్యమకర్త హాన్ జియాలీ చెప్పారు. చైనాలో ఒక్కో క్యాటీ (600 గ్రాములు) పిల్లి మాంసం ధర 4.5 యువాన్లు పలుకుతోందట. జాంగ్జియాగాంగ్ నగరంలోని కబేళాలో భారీ ఎత్తున పిల్లులను వేలాడదీసి ఉండటంతో అనుమానం వచ్చిన యానిమల్ రైట్స్ ప్రొటెక్షన్ కార్యకర్తలు నిఘా వేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో ఒక ట్రక్కులో అక్రమంగా రవాణా చేస్తుండగా ఈ పిల్లులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వీటిని జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు. తాజా ఘటనతో చైనీయులలో ఆహార భద్రత పై ఆందోళనలు తీవ్రతరం అయ్యాయి. సోషల్ మీడియా సంస్థ వీబోలో కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఇది తిన్న మనుషులకు భయంకరమైన చావు తప్పదని ఒకరు వ్యాఖ్యానించగా, ఈ దేశంలో పిల్లులకు, కుక్కలకు జీవించే హక్కు లేదా అని మరొకరు ప్రశ్నించారు. అంతేకాదు చచ్చినా ఇకపై బార్బెక్యూ మాంసం తినను అని మరొక యూజర్ కమెంట్ చేయడం గమనార్హం. -
వామ్మో..! క్షుద్ర పూజల కోసం 'కస్తూరి పిల్లి' అవయవాలు.. అంతలోనే..
హైదరాబాద్: క్షుద్రపూజల కోసం కస్తూరి పిల్లికి సంబంధించిన అవయువాలను తరలిస్తున్న వ్యక్తిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదివారం తెల్లవారు జామున సయ్యద్ అక్బర్ పాషా అనే వ్యక్తి ముంబై వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. లగేజీ స్క్రీనింగ్‌లో అనుమానిత వస్తువులు కనిపించడంతో సీఐఎస్ఎఫ్ అధికారులు వాటిని విప్పి చూడగా, కస్తూరి పిల్లికి సంబంధించిన అవయవాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా క్షుద్ర పూజల కోసం వాటిని తీసుకెళుతున్నట్లు తెలిపారు. కస్టమ్స్ అధికారులు అతడిని అటవీ శాఖ అధికారులకు అప్పగించడంతో వారు అతడిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే అతడు వీటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడనే దానిపై దర్యాప్తు చేపట్టారు. కస్తూరి పిల్లి శేషాచలం అటవీ ప్రాంతంతో పాటు హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, టిబెట్ ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. కస్తూరి పిల్లి అవయవాలను సుగంధ పరిమళాల ఉత్పత్తుల తయారీలో.. కొన్ని రకాల ఔషధాల్లో వినియోగిస్తున్నట్లు తెలిసింది. -
చటుక్కున ఒక్కట్టిచ్చి లాక్కెళ్లింది..! వైరల్ వీడియో
అమ్మ ఎవరికైనా అమ్మే. అది మనిషికైనా కౄర జంతువుకైనా. బిడ్డ క్షణం కనిపించకపోతే అల్లాడిపోతోంది. ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న కన్నబిడ్డ కంటికి కనిపించేదాకా తల్లిడిల్లిపోతుంది. అమ్మకు తీరా బిడ్డ కనిపించగానే ఏమై పోయావురా..ఇంకొంచెం ఉంటే గుండె ఆగిపోయేది అంటూ ఒక్కటిస్తుంది ఉబికివస్తున్న కన్నీళ్లద్దుకుంటూ. మనలో ఇలాంటి సంఘటన దాదాపు అందరికి అనుభవమే. అచ్చం ఇలాగే చేసింది ఒక తల్లి పిల్లి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒకపిల్లి తన పిల్లికూనను వెతుక్కుంటూ ఉంటుంది. ఇంతలో బుజ్జిది కనిపించగానే చటుక్కున ఒక్కటిచ్చి... నోటితో కరుచుకుపోయింది. ఇది నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీన్ని ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాదతోపాటు వేల కొంతమంది రీట్వీట్ చేశారు. A lost kitten and her mother found her, she slapped her and took her home. 😂pic.twitter.com/UNLA0LxOXC — Figen (@TheFigen_) September 28, 2023 -
వామ్మో..! చిరుత పులి పిల్లలా.. అడవి పిల్లులా ?
సాక్షి, నల్గొండ: దామరచర్ల మండలం ఇర్కిగూడెంలోని కృష్ణా పరీవాహక ప్రాంతంలో చిరుత పులి పిల్లలవిగా భావిస్తున్న పాదముద్రలు కలకలం రేపాయి. స్థాని కులు ఫారెస్ట్, పోలీసు శాఖల అధికారులకు సమాచారం ఇవ్వడంతో శనివారం ఇర్కిగూడెం అటవీ పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అద్దంకి– నార్కట్‌పల్లి రహదారి పక్కన కృష్ణానది సమీపంలో రెండు చిరుతపులి పిల్లలు తిరుగుతున్నాయని కొందరు అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, పోలీసు అధికారులు పరిసర ప్రాంతాలను గాలించారు. పాదముద్రలను పరిశీలించి ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అవి చిరుత పిల్లలు కావని అడవి పిల్లికి చెందిన పాదముద్రలుగా ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. రాత్రి వేళ అటవీ సిబ్బందిని నిఘా ఉంచామని, అవి పులి పిల్లలా, అడవిపిల్లులా అనేది నిర్ధారణ అవుతుందన్నారు. కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ ఆనంద్‌రెడ్డి, మిర్యాలగూడ సీఐ సత్యనారాయణ, వాడపల్లి ఎస్ఐ రవికుమార్, బీట్ ఆఫీసర్ ముఖేష్, బీట్ ఆఫీసర్లు ప్రవీణ్‌కుమార్, ఆజం పాల్గొన్నారు. -
11 దేశాల్లో మాత్రమే కనిపించే అరుదైన జాతి బావురు పిల్లి గుంటూరులో..
గుంటూరు డెస్క్: దక్షిణ ఆగ్నేయ ఆసియా దేశాల్లో మాత్రమే కనిపించే అరుదైన జాతి బావురు పిల్లి అంతరించి పోతున్న జాబితాలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా రెండువేలలోపే ఈ జాతి పిల్లులు ఉన్నట్టు అంచనా. కృష్ణా, బాపట్ల అభయారణ్యం ప్రాంతంలో వీటిజాడ గతంలో కంటే ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. వీటిని మనుషులు వేటాడకుండా తీరప్రాంత గ్రామాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 11 దేశాల్లో మాత్రమే.. చేపలను వేటాడి జీవించే ఈ అరుదైన జాతి పిల్లిని ప్రాంతాలను బట్టి బావురుపిల్లి, పులి బావుర, మరక పిల్లి, నీటి పిల్లి, ఫిషింగ్ క్యాట్ అని పిలుస్తారు. దీని శాసీ్త్రయ నామం రౖపైనెలూరుస్ వైవెర్రినస్ (prionailurus viverrinnus). మడ అడవులు, చిత్తడి నేలలలో ఎక్కువగా ఇవి జీవిస్తుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా 11 దేశాల్లో మాత్రమే వీటి జాడను కనుగొన్నారు. 2013లో మడ అడవులపై రీసెర్చ్ చేస్తున్న తరుణంలో సముద్ర తీరం వెంబడి వీటి ఆచూకీ తెలిసింది. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 1,500 నుంచి 2,000 వరకూ ఉండొచ్చని అంచనా. ఈ జాతులు ప్రత్యుత్పత్తి చెందకపోతే త్వరలోనే అంతరించిపోతాయని అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి హెచ్చరించింది. రాత్రివేళల్లోనే వేట.. 78 సెం.మీ పొడవు, 8.8 కిలోల వరకూ బరువు పెరిగే ఈ బావురు పిల్లి రాత్రి వేళల్లో మాత్రమే చేపలను వేటాడి జీవిస్తుంది. మన ఇళ్లలో తిరిగే పిల్లుల కంటే పెద్దవిగాను చిరుత పులికంటే చిన్నదిగానూ ఉంటుంది. అచ్చు చిరుత పులిని పోలి ఉంటుంది. ఇది చేపల వేటకు వెళ్లే సమయంలో ఆ పరిసరాల్లో మల, మూత్ర విసర్జన చేస్తుంది. ఈ వాసన గమనించిన ఇతర జాతి పిల్లులు, జంతువులు ఆ పరిసరాలకు రావు. పర్యావరణ పరిరక్షణకు దోహదం.. సముద్రంలో ఉండే పలు రకాల చేపలు పెట్టే గుడ్లు, కొన్ని రకాల చేపలను తినే పలు రకాల చేపలను ఈ బావురు పిల్లి తింటుంది. దీనివల్ల ఇది సంచరించే ప్రాంతంలో మత్స్య సంపద పెరగడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు దోహద పడుతుంది. తీర ప్రాంత ప్రజలకు అవగాహన అంతరించిపోతున్న ఈ జాతిని పెంపొందించే కార్యక్రమంలో భాగంగా ఏటా వణ్యప్రాణి వారోత్సవాలను పురస్కరించుకొని అక్టోబర్ 2 నుంచి 8వ తేదీ మధ్య బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని అటవీ తీర గ్రామాల్లో అటవీశాఖ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అక్టోబర్‌లో లెక్కింపునకు చర్యలు.. అటవీ తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో వీటి జాడను కనుగొన్నామని అవనిగడ్డ ఫారెస్ట్ రేంజ్ అధికారి రాఘవరావు తెలిపారు. అక్టోబర్ నుంచి వీటి సంఖ్యను లెక్కించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. -
తోకతో రికార్డు కొట్టేసింది...
ఈ ఫొటోలో విలాసంగా పోజు పెట్టిన పిల్లిని చూశారు కదా! చాలా పిల్లుల్లాగానే ఇది కూడా మామూలు పిల్లి మాత్రమే అనుకుంటే పొరపాటే! ఇది అలాంటిలాంటి పిల్లి కాదు, సుదీర్ఘవాలం కలిగిన మార్జాలరాజం. పొడవుగా పెరిగిన తోకే దీనికి రికార్డు తెచ్చిపెట్టింది. అమెరికాలో మిషిగన్‌కు చెందిన డాక్టర్ విలియమ్ జాన్ పవర్స్ పెంచుకుంటున్న ఈ ఐదేళ్ల పిల్లి ప్రపంచంలోనే అత్యంత పొడవైన తోక కలిగిన పిల్లిగా ఇటీవల గిన్నిస్ రికార్డు సాధించింది. దీని పేరు అలై్టర్. దీని తోక పొడవు 16.07 అంగుళాలు. ప్రపంచంలో మరే పిల్లికీ ఇంత పొడవాటి తోక లేదని గిన్నిస్‌బుక్ అధికారులు ధ్రువీకరించారు. అలై్టర్ మాత్రమే కాదు, దీని తోబుట్టువులైన ఆర్కటరస్, ఫెన్రిర్లు ఇదివరకు అతి పొడవాటి పిల్లులుగా గిన్నిస్ రికార్డులు సాధించాయి. (చదవండి: ఈ పడవ నడవాలంటే ఎండ ఉంటే చాలు!) -
అతిపెద్ద పిల్లి..అచ్చం మనిషిలా..
ఈ ప్రపంచంలో అతిపెద్ద పిల్లిని ఎప్పుడైనా చూశారా... అయితే ఇప్పుడు చూడండి... ఫొటో కనిపిస్తున్న ఈ పిల్లి పేరు కెఫిర్. శరీర పరిమాణం దాదాపు పెద్ద పులికి సమానంగా కనిపిస్తుంది. ఈ పిల్లి హావభావాలు, దీని చేష్టలు అచ్చం మనిషిని పోలి ఉంటాయి. రష్యాలోని ఓస్కోల్కు చెందిన యులియా మినినా అనే మహిళ దీనిని పెంచుకుంటోంది. అయితే ఈ పిల్లి, ఆమె. నాలుగేళ్ల కుమార్తె అనెష్కా నిలబడి ఉన్నప్పుడు ఇద్దరూ ఇంచుమించు ఒకే ఎత్తులో ఉంటారు. ఎప్పుడూ ఇద్దరూ తోటలో ఆడుకుంటూ, సోఫాలో కూర్చుని టీవీ చూస్తుంటే అది ఒక పిల్లి అనే అనిపించదు. ఈ పిల్లి అచ్చం మనుషుల్లానే ప్రవర్తిస్తుంది. స్వయంగా తలుపులు తెరుచుని బయటకు వెళ్తుంది. అలా ఈ పిల్లి ఫొటోలు, వీడియోలను ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఈ పిల్లి సెలబ్రిటీగా మారింది. అతిపెద్ద పిల్లిని చూసిన నెటిజన్లు షాక్ అవుతూ పిల్లిపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Юлия🤍Кефир (@yuliyamnn) (చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద పూల సంబరం!) -
వైరల్ వీడియో: సంగీతం అంటే ఈ పిల్లి చెవి కోసుకుంటుంది
-
కోతి పిల్లకు పిల్లి ఆసరా.. ఏదేమైనా మథర్ ఈజ్ గ్రేట్..!
ఏ జంతువైనా తమ బిడ్డలను తప్పా ఇంకే జంతువు పిల్లలను దగ్గరికి తీసుకోవు. అంతేకాదు.. పొరబడి వచ్చినా.. తమ పిల్లలు కాదని గుర్తించి దాడి చేస్తాయి. అందునా వేరే జాతి జంతువు పిల్లలనయితే.. అసలే దగ్గరికి రానియ్యవు. కానీ మీరు చూడబోయే ఈ వీడియోలో ఓ కోతి పిల్లను అక్కున చేర్చుకుంటుంది పిల్లి. వేరే జాతి జంతువు పిల్లను ఓ పిల్లి దగ్గరికి తీసుకుని పోషించడం గ్రేట్ కదా..? వీడియో ప్రకారం.. ఓ కోతి పిల్ల తన తల్లి నుంచి దూరమవుతుంది. దీంతో ఓ పిల్లి కోతి పిల్లను దగ్గరికి తీసుకుంటుంది. తన సొంత తల్లిపై ఎక్కినట్లు పిల్లి బొజ్జకు హత్తుకుని కూర్చుంటుంది కోతి పిల్ల. ఇక.. ఆ కోతి పిల్లని బరువని భావించక.. తనతో పాటే మోసుకుపోతుంది పిల్లి. This lost baby monkey was adopted by this cat. ❤️pic.twitter.com/goRlTYyZJ6 — Figen (@TheFigen_) July 13, 2023 ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ ట్విట్టర్ యూజర్ షేర్ చేయగా.. నెట్టింట వైరల్‌గా మారింది. తెలివి ఉన్న మనుషులే ఒకరిపై మరొకరు దాడులు చేసుకునే ఈ రోజుల్లో ఈ పిల్లి అందరికీ ఆదర్శం అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సమాజానికి మంచి మెసేజ్ ఇస్తోందంటూ మరో యూజర్ ట్వీట్ చేశాడు. ఇదీ చదవండి: అమానవీయం: నీళ్లు అడిగాడని.. దివ్యాంగుడ్ని పోలీసులు చితకబాదారు.. వీడియో వైరల్.. -
ఇదేంటో చెప్పగలరా.. మీ బుర్ర బద్దలుకొట్టుకున్నా అర్థం కాదు.. ఎందుకుంటే
ఫొటోలోని బొమ్మను చూసి ఇదేంటో చెప్పండి.. బుర్ర బద్దలుకొట్టుకున్నా అర్థం కావడం లేదా.. ఇది క్యూట్‌గా ఉన్న పిల్లి బొమ్మ!! ఏ మూల నుంచి కూడా పిల్లిలా కనిపించని ఈ చిత్రాన్ని గీసింది ప్రపంచంలోనే అత్యంత అడ్వాన్స్డ్ హ్యూమనాయిడ్ రోబోగా చెబుతున్న అమెకా.. ఈ మధ్య పిల్లి బొమ్మ గీయమని చెప్పినప్పుడు ఇలా గీసింది. 30 సెకన్లలో గీయడం పూర్తిచేసి.. పోలే అదిరిపోలే అన్న స్టైల్లో ఫీలింగ్ ఇచ్చి.. ఎలా ఉందేంటి? అని అక్కడున్న శాస్త్రవేత్తను అడిగింది. దానికి ఆయన అంత బాగోలేదు అని అంటే.. తెగ ఫీలైపోయింది కూడా. నేను గీసిన బొమ్మే నీకు నచ్చలేదంటే.. నీకు ఆర్ట్ మీద అస్సలు అవగాహన లేనట్లుందని కౌంటరిచ్చింది. తాజాగా ఈ వీడియోను దీన్ని రూపొందించిన శాస్త్రవేత్తలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ కొత్త తరం రోబోల వల్ల చాలా రంగాల్లోని ఉద్యోగులు ఉపాధి కోల్పోవచ్చని అంచనా వేస్తున్న నేపథ్యంలో ఆర్టిస్టుల వరకూ ప్రస్తుతానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని.. వాళ్ల జాబులు సేఫేనని పలువురు వీడియోను చూసి కామెంట్ చేశారు. చదవండి: భయం వద్దు మిత్రమా... కూల్‌గా తినుమా! -
మాములు 'పిల్లులు' కావు! తీసుకునేందుకు ఎగబడుతున్న జనం!
మనం పిల్లిని పొద్దుపొద్దున్నే చూసేందుకు కూడా ఇష్టపడం. కానీ విదేశీయులకు అవంటే వారికి అమితమైన ప్రేమ. వాటి కోసం కోట్ల కోట్ల ఆస్తులు కూడా రాస్తారు. అచ్చం అలానే ఒక మహిళ తను పెంచుకుంటున్న ఏడు పిల్లులకు ఓ రేంజ్లో ఆస్తి అప్పజెప్పింది. అవి చనిపోయేంత వరకు చూసుకునేలా కొన్ని షరతులు కూడా విధించింది. ఈ విచిత్ర ఘటన యూఎస్‌లోని ఫోరిడాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఫ్లోరిడాలోని టంపాకు చెందిన నాన్సీ సాయర్ ఏడు పిల్లులను ఎంతో ప్రేమగా పెంచుకుంటోంది. ఐతే ఆమె 84 ఏళ్ల వయసులో మరణించింది. చనిపోతూ తాను పెంచుకుంటున ఏడు పర్షియన్ పిల్లులకు సుమారు రూ. 2.4 కోట్ల ఆస్తిని రాసింది. అవి చనిపోయేంత వరకు తన ఇంట్లోనే నివశించేలా రూ. 2.4 కోట్ల విలువ చేసే తన ఎస్టేట్ని వాటి పేర రాసింది. వాటిని పర్యవేక్షించే సంరక్షకులు సరిగా విధులు నిర్వర్తించలేకపోవడంతో వాటిని చూసుకునేందుకు సిల్క్ హ్యూమన్ సోసైటీ ఆఫ్ టంపా బే ముందుకు వచ్చింది. ఆ పిల్లుల పేర్లు చాలా విచిత్రంగా ఉంటాయి. అవి వరుసగా మిడ్నైట్, స్నోబాల్, గోల్డ్ ఫింగర్, లియో, స్క్వీకీ, క్లియోపాత్రా,నెపోలియన్ అనే పిల్లులు. ఈ మేరకు హ్యుమన్ పొసైటీ ఆఫ్ టంపా బే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ షెర్రీ సిల్క్ మాట్లాడుతూ..సాయర్ వాటి సంరక్షణ కోంస కోట్ల విలువ చేసే ఎస్టేట్‌ను రాసిచ్చారు. వాటి బాగోగులను ప్రస్తుతం తాము చూసుకుంటున్నామని. ప్రస్తుతం ఈ పిల్లులను మేం దత్తత తీసుకుంటాం అంటూ తమ సోసైటీకి దరఖాస్తులు వెల్లువలా వస్తున్నట్లు తెలిపారు. ఈ పిల్లుల దత్తత కోర్టు పర్యవేక్షణలో జరుగుతాయని. వాటి సంరక్షణకు సంబంధించిన నివేదికి ప్రతి రెండు నెలలకోసారి కోర్టుకి సమర్పించాల్సి ఉంటుందని అన్నారు. వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ఈ పిల్లులను ఆయా వ్యక్తులకు అందిస్తామని చెప్పారు. (చదవండి: ఎవ్వరూ మాట్లాడని కేరళ కథ! యావత్ సమాజం సేవ చేసేలా..!) -
ఓ పక్క అద్భుతమైన మోడల్‌గా..మరోవైపు క్యాట్‌లోనూ సత్తా చాటింది
అందం, అద్బుతమైన తెలివితేటలు ఆమె సొంతం. ఒక పక్క తనకు ఇష్టమైన అభిరుచిలో రాణిస్తూనే మరోవైపు చదువులోనూ సత్తా చాటి ..తనకు తానే సాటి అని నిరూపించుకుంచి. 'బ్యూటీ విత్ బ్రెయిన్'కి ఉదాహరణగా నిలిచింది. ఓ మనిషి రెండింటింలోనూ రాణించగలడని నిరూపించించి మోడల్ ఆకాంక్ష చౌదరి. ఆకాంక్ష చౌదరి పేరుకు తగ్గట్టుగానే తన ఆకాంక్షలని నెరవేర్చుకుని అందర్ని మంత్రముగ్దుల్ని చేసింది. ఆమె 2016లో మిస్ ఇండియా ఎలైట్ విజేత. ఆమెకు మోడలింగ్ అంటే చాలా ఇష్టం. ఆమెకు అదోక ప్యాషన్ కూడా. ఒకపక్క మోడలింగ్‌పై దృష్టి పెడుతూనే తన కెరియర్ని మంచి గాడిలో పెట్టుకుంది. ఆమె క్యాట్‌లో 98.12 పర్సంటేజ్‌తో ఉత్తీర్ణత సాధించి ఆశ్చర్యపరిచింది. ఆమె మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్కి దరఖాస్తు చేస్తున్నప్పుడే మిస్ ఇండియా ఎలైట్ పోటీకి ఎంపికైంది. అతన అభిరుచిని అనుసరించి అందాల పోటీలో విజేతగా నిలిచింది. అదే సమయంలో క్యాట్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యింది. ఆమె ఐఐఎం అహ్మాదాబాద్‌లో 2017-2019 బ్యాచ్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ . ప్రస్తుతం ఆమె మెకిన్సేలో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఈ మేరకు ఆకాంక్ష ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తాను మోడల్‌గా ఈ టైటిల్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. గెలుస్తానని అనుకోలేదు. మోడలింగ్ మారబోతున్నాను. మోడలింగ్ నన్ను ఫిట్‌గా ఉండేలా ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించేలా చేసింది. చదువు తోపాటు మోడలింగ్‌లోనూ రాణించేందుకు తాను టైం షెడ్యూలను చాలచక్యంగా నిర్వహించాల్సి వచ్చేదని చెబుతోంది ఆకాంక్ష. నిజానికి ఆకాంక్ష మోడలింగ్, కాంపిటీటవ్ ఎగ్జామ్ రెండింటికి ఏకాకాలంలో సన్నద్ధమైంది. చక్కగా బ్యాలెన్స్ చేసి అనుకున్నది సాధించింది. ఒక వ్యక్తి తన అభిరుచిని అనుసరిస్తూనే బిజినెస్ రంగంలో కూడా రాణించగలడిని నిరూపించింది. అందరికీ ఆదర్శంగా నిలిచింది. (చదవండి: రష్యాలో వాగ్నర్ గ్రూప్ మాదిరిగా..చరిత్రలో వెన్నుపోటు పొడిచిన నాయకులు వీరే!) -
క్యాట్ థెరపీ: లవ్యూ అంటూ ముచ్చటపడుతున్న నెటిజన్లు
ఎన్నిసార్లు రైల్లో ప్రయాణం చేసినా,రిజర్వేషన్ ఉన్నాకూడా ట్రాఫిక్ మహా సముద్రాన్ని ఈది స్టేషన్‌కు చేరి, ట్రైన్ ఎక్కి మన సీట్లో మనం కూర్చునేదాకా మహా గొప్ప టెన్షన్.. అలాగే ఎంత అనుభవం ఉన్నా.. ఎన్నిసార్లు గాల్లో విహరించినా ఎక్కిన ఫ్లైట్ దిగేదాకా విమాన ప్రయాణం అంటే అదో అలజడి. ఎలాంటి వారికైనా కొద్దో.. గొప్పో..ఈ ఒత్తిడి తప్పదు కదా. బహుశా అందుకేనేమో శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయం అధికారులు వినూత్నంగా ఆలోచించారు. USA టుడే ప్రకారం బ్లాక్ అండ్ వైట్ రెస్క్యూ క్యాట్ ఇటీవలే విమానాశ్రయంలోని వాగ్ బ్రిగేడ్‌లో చేరింది. విమాన ప్రయాణీకుల ఒత్తిడిని, ఆందోళనను తగ్గించేందుకు ఈ అందమైన పిల్లి సిద్ధంగా ఉంటుంది. ఈ తరహా థెరపీని అందిస్తున్న మొదటి పిల్లి డ్యూక్ ఎల్లింగ్టన్ మోరిస్. 14 ఏళ్ల థెరపీ క్యాట్ శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో సరికొత్త ఉద్యోగి. మా డ్యూక్ అసలు ఎవర్నీ నిరాశపర్చదు. ఒక్క క్షణం డ్యూక్‌ని పలకరిస్తే ప్రయాణ టెన్షన్ మొత్తం ఎగిరిపోతుందని, ఎలాంటి భయం, బెరుకూ లేకుండా ప్రయాణం పూర్తిచేయొచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రయాణీకులతో ఎలా మెలాగాలో, వారిలో ఒత్తిడిని పొగొట్టి, నవ్వులు ఎలా పూయించాలో కూడా ఈ పిల్లికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారట. యానిమల్ థెరపిస్ట్‌గా సర్టిఫికేట్ కూడా పొందిందట. ఎయిర్‌పోర్ట్‌లో ఊపుకుంటూ తిరుగుతూ, పలకరిస్తూ, నవ్వులు పూయిస్తున్న డ్యూక్‌ని చూసిన ప్రయాణికులు, అందులోనూ క్యాట్ లవర్స్ తెగ మురిసిపోతున్నారట. దీంతో డ్యూక్‌ని కలవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నామంటూ కొంతమంది కమెంట్ చేస్తున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో యానిమల్ కేర్ అండ్ కంట్రోల్ 2010లో ఆకిలితో ఉన్న ఈ పిల్లిని గుర్తించడంతో ఒక కుటుంబం దీన్ని దత్తత తీసుకుంది శాన్ ఫ్రాన్సిస్కో సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్ ద్వారా డ్యూక్ థెరపీ యానిమల్ శిక్షణ పొందింది. కాగా శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయం ఈ కార్యక్రమాన్ని 2013లో ప్రారంభించింది. సర్టిఫైడ్ థెరపీ జంతువులను టెర్మినల్స్‌లో ఉంచుతుంది. తద్వారా ప్రయాణికుల ప్రయాణాన్ని మరింత ఆనందదాయకంగా మార్చడమే లక్ష్యమని విమానాశ్రయ అధికారుల మాట. -
ఎత్తైన భవనం నుంచి దూకిన పిల్లి.. అయినా ఏం కాలేదంటే నమ్మండి!
బ్యాంకాక్‌లో 8.5 కేజీల బరువున్న ఓ పిల్లి పొరపాటున ఆరో అంతస్తు నుండి కిందికి దూకింది. అంతెత్తు నుండి పడిపోయినా కూడా ఆ పిల్లికి చిన్న గాయమైనా కాలేదు. ఇది చూసి ఆ యజమానే కాదు డాక్టర్ కూడా ఆశ్చర్య పోయాడు. అయితే ఈ పిల్లి నేరుగా పార్కింగ్ చేసి ఉన్న ఒక కార్ మీద పడటంతో దాని బరువుకు కారు వెనుక అద్దం మాత్రం పగిలింది. మృత్యుంజయురాలు... బ్యాంకాక్ కు చెందిన అపివాత్ టొయోతక అనే మహిళ తాను ప్రేమగా పెంచుకుంటున్న పిల్లి షిఫుని ఇంట్లో వదిలి బయటకు వెళ్ళింది. వెళ్లేముందు కిటికీ తలుపు వేయడం మరిచిపోయింది. ఇంకేముంది షిఫు స్వేచ్ఛగా బయటకు వెళ్లి షికారు చేయాలనుకుందో ఏమో.. కిటికీలోనుంచి అమాంతం దూకేసింది. అదృష్టవశాత్తు షిఫు కింద పార్కింగ్ చేసి ఉన్న ఒక కారు అద్దం మీద పడటంతో అద్దాన్ని పగలగొట్టుకుని కార్ సీటు మీద సేఫ్ గా ల్యాండ్ అయ్యింది. కారు అద్దానికి ఎలాగూ ఇన్సూరెన్స్ వస్తుంది. ఇక షిఫుని డాక్టర్ వద్దకు తీసుకుని వెళ్లగా అక్కడక్కడా కారు అద్దం గీసుకున్న గాయాలు తప్ప దాని ఒంటి మీద వేరే గాయాలు లేకపోవడం చూసి షాకయ్యాడు. మృత్యుంజయురాలైన షిఫు చేసిన ఈ స్టంటును టొయోతక తన ట్విట్టర్లో పోస్ట్ చేసి గొప్పగా వివరించింది. చదవండి:మలేషియాలో పాకిస్తాన్ కు ఘోర అవమానం.. విమానం సీజ్ -
రూమ్, ఫుడ్ ఉచితం, మంచి జీతం.. జాబ్ ఏంటని తెలిస్తే షాక్ అవుతారు!
‘పిల్లిని చూసుకోవడానికి ఆయా కావలెను’ అనే ప్రకటన కొద్దిరోజులుగా ఆస్ట్రేలియాలో వైరల్‌గా మారింది. సిడ్నీ నగరం తూర్పు శివారు ప్రాంతంలో ఒక భారీ భవంతిలో ఉంటున్న సంపన్న దంపతులు ఒక పిల్లిని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. భార్యా భర్తలిద్దరూ పనుల్లో తలమునకలుగా ఉండేవారే కావడంతో ఇద్దరూ ఇంట్లో లేనప్పుడు పిల్లి బాగోగులు చూసుకోవడం వారికి ఇబ్బందిగా ఉంటోంది. అందువల్ల తమ పిల్లికి ఆయాగా ఉండేందుకు ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ స్థానిక పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. ఈ ఉద్యోగంలో చేరేవారికి తాము ఉంటున్న భవంతిలోనే సకల సౌకర్యాలతో కూడిన విశాలమైన గది, ఉచిత భోజనంతో పాటు తగిన జీతం కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సిడ్నీ నగరంలో ఇళ్ల అద్దెలు కళ్లుచెదిరే రీతిలో ఉంటాయి. సామాన్యమైన ఉద్యోగాలు చేసుకునేవారు అద్దెలు భరించలేక హాస్టళ్లలో ఉంటూ నెట్టుకొస్తుంటారు. చక్కని వసతితో కూడిన ఉద్యోగం కావడంతో పిల్లికి ఆయాగా ఉండటానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. చదవండి: పొగ తాగడం మానేసిన 20 నిమిషాల్లోనే ఎన్నెన్నో లాభాలు.. ఒక్కసారి ట్రై చేయండి -
ఈ పిల్లి 'మ్యావ్' అనదు.. ‘మామ్’ అంటుంది..!
ఈ పిల్లి ‘మ్యావ్’ అంటుందా? ‘మామ్’ అంటుందా? అనే విషయం కాస్త కన్ఫ్యూజ్గా ఉన్నప్పటికీ ‘మామ్’ అంటుందనే శబ్దభ్రమను కలిగిస్తుంది. ముంబైకి చెందిన ఒక మహిళ పిల్లిని పెంచుకుంటుంది. ఆమె పేరేమిటో తెలియదుగానీ పిల్లి పేరు జగ్గు. ఒక విధంగా చెప్పాలంటే ఈ జగ్గు ఆమెకు కన్న కొడుకుగా మారిపోయి, ఆమెను నీడలా అనుసరిస్తోంది. వీరి బంధాన్ని ప్రతిబింబించే వీడియో ఎన్నో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అయింది. View this post on Instagram A post shared by Jaggu Patil (@jaggu_ae_jaggu) ఇన్స్టాగ్రామ్ పేజీ ‘జగ్గు పాటిల్’లో జగ్గు ప్రతి మూమెంట్‌ను డాక్యుమెంట్ చేశారు. ‘మదర్స్ లవ్ ఈజ్ యూనివర్శల్’ ‘ఎందరో తల్లులు. ప్రేమ మాత్రం ఒక్కటే’ ‘భావోద్వేగాలు మనుషులకు మాత్రమే పరిమితమైనవి కావు’ ‘ఇలాంటి ప్రేమ మన దేశంలోని తల్లులకు మాత్రమే సాధ్యపడుతుంది. భగవంతుడు కోరుకునేది ఇదే’ ‘నిజమైన ప్రేమకు నిలువెత్తు సంతకం... తల్లి’... అంటూ నెటిజనులు స్పందించారు. -
పోల్ జారిన పిల్లి.. భలే భలే
-
విధిని ఎదిరించాడు.. విజయం సాధించాడు.. దివ్యాంగుడికి ఐఐఎం సీటు
సాక్షి, అనకాపల్లి జిల్లా: విధి వక్రించినా పట్టుదలతో నిలబడ్డాడు. ధైర్యం కూడదీసుకుని ముందడుగు వేశాడు. మధ్యలో ఆగిపోయిన ఇంజనీరింగ్‌తోపాటు న్యాయవిద్యను సైతం పూర్తి చేసి అమెజాన్ సంస్థలో డేటా ఆపరేషన్ అసోసియేట్ ఉద్యోగం సంపాదించాడు. ఇప్పుడు ఏకంగా క్యాట్‌లో ఉత్తీర్ణుడై ఐఐఎం సీటు సాధించాడు. ఈ నెల 21న అహ్మదాబాద్ ఐఐఎంలో చేరనున్నాడు. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొత్తకోట గ్రామానికి చెందిన ఈ విజేత పేరు ద్వారపురెడ్డి చంద్రమౌళి. తండ్రి వెంకటరమణ చిరు వ్యాపారి. తల్లి సత్యవతి ప్రైవేట్ స్కూల్ టీచర్. చంద్రమౌళి కాకినాడ కైట్‌లో బీటెక్ చేస్తూ సెలవులకు ఇంటికి వచ్చినప్పుడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. 2018 మే 26న మేడపై ఉండగా ప్రమాదవశాత్తూ జారిపోయిన ఉంగరాన్ని తీసేందుకు యత్నించగా.. విద్యుత్ తీగలు తగిలి షాక్‌కు గురై కాళ్లు, చేతులు కోల్పోవడంతో డీలా పడిపోయాడు. కొత్త శక్తిని కూడదీసుకుని.. కొన్ని నెలలు గడిచాక చంద్రమౌళి నిరాశను వదిలిపెట్టాడు. శక్తిని కూడదీసుకుని కొత్త జీవితం ప్రారంభించాడు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో మధ్యలో ఆగిపోయిన ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అంతలోనే కరోనా చంద్రమౌళికి మరో పరీక్ష పెట్టింది. తండ్రి వెంకటరమణ కుమారుడి పక్కనే రక్షణ సూట్ ధరించి నెల రోజుల పాటు సేవలందించారు. వారి మొండి ధైర్యానికి విధి తలవంచింది. నెల తర్వాత ఇంటికి వచ్చిన చంద్రమౌళి తేరుకుని తన గమ్యం వైపు అడుగులు వేశాడు. ఆప్తుడైన న్యాయవాది ప్రభాకర్, స్నేహితుడు ప్రసాద్ అండగా నిలిచి మానసిక స్థైర్యం అందించారు. దీంతో చంద్రమౌళి మొండి చేతులతోనే పనులు చేయడం ప్రారంభించాడు. ల్యాప్‌టాప్‌ను ఆపరేట్ చేయడం సాధన చేశాడు. విశాఖలో కృత్రిమ కాళ్లు తీసుకుని నడవడం కూడా కొద్దికొద్దిగా అలవాటు చేసుకున్నాడు. మూడు నెలల్లో అన్ని పనులూ చేయడం ప్రారంభించాడు. కరోనా తర్వాత ఇంజనీరింగ్‌లో ఉద్యోగాలు కష్టతరమవుతున్నాయని భావించి అనకాపల్లిలో బీఎల్ పూర్తి చేశాడు. జీవనోపాధికి అమెజాన్‌లో డేటా ఆపరేషన్ అసోసియేట్ ఉద్యోగం సంపాదించాడు. కొన్నాళ్ల నుంచి ఇంటినుంచే ఆ ఉద్యోగం చేస్తున్నాడు. పట్టుదలతో చదివి కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) స్క్రైబ్ సహాయంతో రాసి ఉత్తీర్ణుడయ్యాడు. దేశంలోనే అత్యున్నత బిజినెస్ స్కూల్‌గా ప్రసిద్ధి చెందిన అహ్మదాబాద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లో సీటు సాధించాడు. ఈ నెల 21న జాయిన్ అయ్యేందుకు సిద్ధపడుతున్నాడు. ఎంత కష్టం ఎదురైనా కలత చెందవద్దని, ధైర్యంగా ఎదుర్కోవాలని చంద్రమౌళి సూచిస్తున్నాడు. చదవండి: అనుమానాస్పద స్థితిలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి.. -
ఆ ప్రాంతంలో ఈ పిల్లి ఫేమస్.. చూసేందుకు ఎగబడుతున్న పర్యాటకులు!
ఈ పొటోలో కనిపిస్తున్న పిల్లిని చూశారు కదా! భలే బొద్దుగా ముద్దుగా ఉంది కదూ! ఇది పోలండ్‌లోని స్కజేషిన్ నగరంలో ఉంటుంది. ఈ పిల్లి అక్కడ చాలా ఫేమస్. జర్మనీ సరిహద్దుల్లో ఉండే పురాతన నగరమైన స్కజేషిన్లో ఈ పిల్లి పర్యాటక ఆకర్షణగా మారింది. స్థానికులు ఈ పిల్లికి ‘గకేక్’ అని పేరు పెట్టుకున్నారు. స్కజేషిన్ నగరం శివార్లలోని కస్జుబ్స్కా ప్రాంతంలో పదేళ్ల కిందట ఇది తొలిసారిగా కనిపించింది. అప్పటి నుంచి ఇది అదే వీథిని తన నివాసంగా చేసుకుని, ‘కింగ్ ఆఫ్ కస్జుబ్స్కా స్ట్రీట్’గా పేరు పొందింది. స్కజేషిన్ నగరానికి వచ్చే పర్యాటకులు నగరంలోని మ్యూజియం, పార్కులు, ఇతర పర్యాటక కేంద్రాలను చూడటంతో పాటు ఈ పిల్లిని కూడా ప్రత్యేకంగా చూసి, ఫొటోలు తీసుకుని వెళుతుండటం విశేషం. చదవండి: Anjali Sood: అత్తెసరు మార్కులు వచ్చే అమ్మాయి నుంచి సీఈఓగా.. లాభాల బాటలో.. -
హేయ్ నా దారికే అడ్డొస్తావా.. పక్కకు జరుగు.. చూడటానికి ఎంత ముద్దుగుందో!
-
ప్లీజ్ మమ్మీ నాకు ఈ డ్రెస్ వద్దు..వైరలవుతోన్న క్యూట్ వీడియో
-
వింత ఘటన: పెంపుడు పిల్లిని దొంగిలించి.. తిన్న ముగ్గురు వ్యక్తులు..
సాక్షి, అల్వాల్: పెంపుడు పిల్లిని దొంగిలించి..కోసుకుని తిన్న ముగ్గురు నిందితులను నేరేడ్మెట్ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ నర్సింహస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడ్మెట్ జీకే కాలనీలో నివాసం ఉండే తాలూరి రూత్‌వర్ష పెంచుకుంటున్న పిల్లి గత నెల 29వ తేదీ నుండి కనిపించడం లేదు. ఇంట్లో సీసీ కెమెరాలను పరిశీలించడంతో ముగ్గురు వ్యక్తులు ఇంట్లో చొరబడి పిల్లిని అపహరించి సంచిలో వేసుకొని పారిపోయినట్లు గుర్తించారు. దీంతో నేరేడ్మెట్ పోలీసులకు రూత్‌వర్ష ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా వినాయక్‌నగర్‌కు చెందిన నర్సింహ, కిరణ్, శంకర్ నిందితులుగా గుర్తించి శుక్రవారం అరెస్టు చేశారు. ఆహారం కోసమే పిల్లిని దొంగిలించామని నిందితులు తెలిపారు. (చదవండి: తెలంగాణ కొత్త సచివాలయంలో ఫైర్ యాక్సిడెంట్) -
వైరల్ వీడియో: రోడ్డుపై వెళ్తున్న అందర్నీ పలకరిస్తున్న పిల్లి
-
Viral Video: పిల్లిని చుట్టుముట్టిన కుక్కలు.. కుక్కలకి ఝలక్ ఇచ్చిన పిల్లి
-
Hyderabad: పెంపుడు పిల్లిని ఎత్తుకెళ్లాడు.. సీసీటీవీలో రికార్డు.. కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: అరుదైన జాతికి చెందిన ఓ పెంపుడు పిల్లిని గుర్తుతెలియని వ్యక్తి అపహరించారు. ఈ సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిదిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... చింతలకుంట జహంగీర్‌కాలనీలో ఎస్.కె.గజాన మహ్మద్(22) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. థాయిలాండ్‌లోని కాహో మనీ బ్రీడ్‌కు చెందిన పిల్లిని రూ. 50 వేలకు కొనుగోలు చేశారు. 18 నెలల వయసు ఉన్న ఆ పిల్లికి నోమనీ అని పేరు కూడా పెట్టుకున్నాడు. ఈ పిల్లి కండ్లు ఒకటి గ్రీన్ కలర్లో, మరొకటి బ్లూ కలర్లో ఉంది. ఇదే ఈ పిల్లి ప్రత్యేకత. అయితే ఆదివారం రాత్రి పిల్లి ఇంట్లో నుంచి బయటకు వెళ్లడంతో స్కూటీపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి దానిని ఎత్తుకెళ్లాడు. దీంతో బాధితుడు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. -
Viral Video: పిల్లి వేషాలు మాములుగా లేవుగా..!
-
Viral Video: పిల్లిని పరిగెత్తించిన ఎలుక
-
తప్పిపోయిన పిల్లి దొరికింది
తూర్పు గోదావరి: తమ బిడ్డలో పెద్దలో తప్పిపోతే వారి గురించి వెతకడం అందరికీ తెలిసిందే. అలాగే కుక్కలు, ఆవులు, గేదెల వంటివి తప్పిపోయినా వాటి కోసం యజమానులు గాలిస్తారు. ఇదే కోవలో ఓ పెంపుడు పిల్లి తప్పిపోవడం.. దాని యజమానికి కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఆ వివరాలివీ.. మలికిపురానికి చెందిన వ్యాపారి జాన భగవాన్ పెంపుడు పిల్లి శుక్రవారం తప్పిపోయింది. పర్షియన్ జాతికి చెందిన ఈ పిల్లిని ఆయన హైదరాబాద్‌లో రూ.50 వేలకు కొనుగోలు చేసి పెంచుతున్నారు. శుక్రవారం ఇంటి తలుపులు తీసి ఉండడంతో అది బయటకు వెళ్లిపోయి తిరిగి రాలేదు. దీంతో ఆయన తన పెంపుడు పిల్లి తప్పిపోయినట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు. గ్రామానికి చెందిన కొంతమంది అది చూసి.. ఆ పిల్లిని కుక్కలు దాడి చేస్తుండగా రక్షించామని.. ఎవరిదో తెలియక రాజమహేంద్రవరం పంపే ప్రయత్నంలో ఉన్నామని తెలిపారు. దీంతో వారి వద్దకు భగవాన్ శనివారం వెళ్లి తన పిల్లిని తెచ్చుకున్నారు. -
వైరల్ వీడియో : పాములా స్వింగ్ తిరుగుతున్న పిల్లి..!
-
పెంపుడు పిల్లి పరారు.. ఎయిర్‌పోర్టులో కేసు!
దొడ్డబళ్లాపురం: ఓ ప్రయాణికురాలి పెంపుడు పిల్లి పారిపోయిన సంఘటన కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. కెల్లి జాన్సన్ అనే మహిళ గత బుధవారం తెల్లవారుజామున ఇక్కడి నుంచి దోహాకు వెళ్తూ తన పెంపుడు కుక్కను, పిల్లిని ప్రత్యేక పంజరాల్లో ఉంచి తెచ్చారు. వాటిని తనతో పాటు పంపాలని ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బందికి అప్పగించారు. చెకింగ్ పూర్తయిన తరువాత పంజరం నుంచి పిల్లి కనబడకుండా పోయింది. ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న తన పిల్లిని తెచ్చివ్వాల్సిందేనని మహిళ అక్కడి భద్రతా సిబ్బందికి ఫిర్యాదు చేసింది. సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆమె ఆరోపించారు. చదవండి: సేల్స్ బీభత్సం, ఆ కంపెనీకి ఒక సెకను లాభం రూ. 1.48 లక్షలు! -
వైరల్ వీడియో : సిక్స్‌ప్యాక్ కోసం జిమ్ లో తెగ కష్టపడుతున్న పిల్లి
-
Guinness World Records: ఆ పిల్లి వయసు 26
లండన్: ఆ పిల్లి వయసు 26. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసున్న పిల్లి ఇది. ఇప్పడు గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కబోతోంది. ఫ్లాజీ అని పిలుచుకునే ఆ ఆడ పిల్లి లండన్‌లో ఉంది. దీని వయసు 26 సంవత్సరాలని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారులు నిర్ధారించి సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. ఈ పిల్లి వయసు మనుషులు 120 ఏళ్లతో సమానమని గిన్నిస్ అధికారులు చెప్పారు. సాధారణంగా పిల్లులు 12 నుంచి 18 ఏళ్లు మాత్రమే జీవించగలవు. కానీ ఫ్లాజీ 26 ఏళ్లు వచ్చినా హ్యాపీగా ఉంది. ప్రస్తుతం లండన్‌లో పిల్లుల్ని సంరక్షించే కేంద్రంలో ఉంచారు. విశేషం ఏమిటంటే ఈ 26 ఏళ్లలో ఫ్లాజీ యజమానులు ముగ్గురు మారారు. 1995 సంవత్సరంలో ఫ్లాజీ పుట్టింది. అప్పుడు ఒక మహిళ ఆమెని పెంచుకుంది. ఫ్లాజీకి పదేళ్లు వచ్చేటప్పటికీ ఆ మహిళ మరణించడంతో ఆమె చెల్లి ఈ పిల్లిని చూసుకుంది. 14 ఏళ్లు ఆమె ఇంట్లో ఉంది. ఆ తర్వాత ఆమె కూడా మరణించింది. ఆమె కుమారుడు మరో రెండేళ్లు చూసుకున్నాడు. ఆ తర్వాత పిల్లుల సంరక్షణ కేంద్రానికి అప్పగించాడు. ప్రస్తుతం అత్యధిక వయసున్న పిల్లుల్ని చూసుకునే విక్కీ గ్రీన్ అనే సంరక్షకుడు ఫ్లాజీ బాగోగులు చూస్తున్నాడు. ప్రస్తుతం ఆ పిల్లికి చెవులు వినిపించడం లేదట. చూపు మందగించింది. అయినప్పటికీ మనుషుల్ని చూస్తే అభిమానంతో మీదకి వస్తుందని విక్కీ చెప్పుకొచ్చాడు. -
వైరల్ వీడియో: పిల్లి వేషాలు... దెబ్బకు దిగొచ్చింది
-
ఫెన్రిర్.. అత్యంత ఎత్తైన పిల్లి! ఇక ఆర్కురస్ 19.05 అంగుళాల ఎత్తుతో రికార్డు!
ఫెన్రిర్... ఒక అడుగు 6.83 అంగుళాలతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పెంపుడు పిల్లిగా గిన్నిస్ రికార్డు సృష్టించింది. అమెరికాలోని మిషిగాన్‌కు చెందిన విలియం జాన్ పవర్స్‌కు పిల్లులంటే ఇష్టం. ఆయన పెంచుతున్న పిల్లుల్లో ఒకటైన ఫెన్రిర్ అనాట్రెస్ పవర్స్... సవన్నా జాతి హైబ్రిడ్ పిల్లి. భుజం నుంచి కాలి వరకు... 18.83 అంగుళాల పొడవు ఉంది. 2016లో ఇదే జాతికి చెందిన మరో పిల్లి ఆర్కురస్.. 19.05 అంగుళాల ఎత్తుతో రికార్డును సొంతం చేసుకుంది. ఆ తరువాత ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో అది మరణించింది. అయినా ఇప్పటికీ రికార్డుల్లో ఎత్తయిన దేశీయ పిల్లి అదే. ఇక బతికి ఉన్న ఎత్తైన పిల్లిగా రికార్డు ఫెన్రిర్దే! విలియం దగ్గర ఇలాంటి పిల్లులు ఇంకా ఉన్నాయి. అతని పిల్లుల్లో ఒకటైన ఆల్టేర్ అతి పొడవైన తోక 16.07 అంగుళాలు కలిగిన పెంపుడు పిల్లిగా గిన్నిస్ రికార్డును కలిగి ఉంది. దీనికంటే ముందు.. సైనస్ అనే మరో పిల్లి అతిపొడవైన తోక 17.58అంగుళాలతో రికార్డు నెలకొల్పింది. (చదవండి: గాంబియాలో 66 మంది చిన్నారుల మృతి.. భారత కంపెనీ కలుషిత సిరప్ వల్లే!) -
పిల్లి అరుస్తూ నిద్రాభంగం చేస్తోందని యజమాని హత్య
బంజారాహిల్స్: పెంపుడు పిల్లి అరుస్తూ నిద్రాభంగం చేస్తోందని ఆగ్రహించిన ఓ యువకుడు దాని యజమానిని హత్య చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని మిథిలానగర్‌లో డాక్టర్ మీనన్ ఇంట్లో రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం నల్లాపూర్‌కు చెందిన ఓ బాలుడు(17)తోపాటు హరీశ్వర్‌రెడ్డి అలియాస్ చింటూ(20) అద్దెకు ఉంటున్నారు. అసోంకు చెందిన ఎజాజ్ హుస్సేన్ (20), బ్రాన్ స్టిల్లింగ్(20) కూడా ఇదే ఇంట్లోని ఓ గదిలో అద్దెకుంటూ సెక్యూరిటీగార్డులుగా పనిచేస్తున్నారు. ఈ నెల 20న రాత్రి ఎజాజ్, బ్రాన్ ఇద్దరూ విధులు ముగించుకొని గదికి వెళ్తుండగా దారిలో కనిపించిన ఓ పిల్లిని వెంట తీసుకెళ్లారు. ఇంటికి వెళ్లిన తర్వాత పిల్లి అరుస్తుండటంతో పక్కనే ఉన్న హరీశ్వర్రెడ్డితోపాటు సదరు బాలుడు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కూడా పిల్లి అరుస్తూ నిద్రాభంగం చేస్తుండటంతో మద్యం మత్తులో ఉన్న బాలుడు కోపంగా ఎజాజ్ గదికి వెళ్లాడు. అక్కడే ఉన్న బాటిల్లోని పెట్రోల్‌ను ఆయనపై పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలపాలైన ఎజాజ్‌ను వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారంరాత్రి మృతి చెందాడు. అయితే ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని చనిపోయాడంటూ మొదట ఆ బాలుడితోపాటు హరీశ్వర్‌రెడ్డి తప్పుడు ఫిర్యాదు చేశారు. అనంతరం మృతుడి స్నేహితుడు బ్రాన్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసును తిరగదోడిన పోలీసులు బాలుడితోపాటు హరీశ్వర్‌రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. (చదవండి: దంపతుల ఆత్మహత్య) -
సో క్యూట్.. చిన్నారి కోసం ఈ పిల్లి ఏం చేసిందో చూడండి..
చాలామందికి ఇంట్లో జంతువులు పెంచుకోవడానికి పిచ్చిగా ఇష్టపడుతుంటారు. ఈ మధ్యకాలంలో ఈ సంస్కృతి బాగా పెరిగిపోయింది. కొందరు అయితే వాటిని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటారు. జంతు ప్రేమికులు ఎక్కువగా కుక్క, పిల్లి, చిలుకను పెంచుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇంట్లో మనుషులను చూసినట్లుగానే వాటి ఆలనా పాలనా చూస్తుంటారు. కొన్ని సార్లు మనం పెంచుకునే పెట్స్ మనకు ఎంతో సాయం చేస్తుంటాయి. చాలా విషయాల్లో మనల్ని ప్రమాదం నుంచి కాపాడతాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ పిల్లికి చెందిన వీడియో వైరల్‌గా మారింది. ఇంట్లో పెంచుకునే పిల్లి ఓ పిల్లాడికి బాడీగార్డ్‌గా మారింది. ఏడాది వయసున్న బాలుడు బాల్కనీ వద్దకు వచ్చి నిల్చొని బయటకు చూస్తుంటాడు. బాల్కనీలోని ఐరన్ గ్రిల్‌పై చేయి పెట్టి పెక్కి ఎక్కేందుకు మెల్లగా ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో పక్కనే ఉన్న పిల్లి అతన్ని చేయిని కిందకు తీసేస్తుంది. అయినా చిన్నారి చేతులు పెడుతుంటే పిల్లి మళ్లీ తీసేస్తుంది. Bodyguard pic.twitter.com/B9DIXaOAa6 — Gabriele Corno (@Gabriele_Corno) August 5, 2022 చూడటానికి ఎంతో ముద్దుగా ఉన్న ఈ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. అయితే ఇది ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియరాలేదు కానీ గాబ్రియేల్ కార్నో అనే వ్యక్తి ట్విటర్లో షేర్ చేశారు. ‘పిల్లి చాలా తెలివైనది. జంతువుల హృదయాల్లో కల్లాకపటం ఏం ఉండదు.. ప్రేమ, అప్యాయత మాత్రమే ఉంటాయని కామెంట్ చేస్తున్నారు. -
పిల్లి దేవత.. వాహనమూ మార్జాలమే..! ఆ ఊరు పేరు కూడా..
సాక్షి, హైదరాబాద్: పిల్లి అపశకునమనే భావన చాలామందిలో ఉంటుంది. పురాణాల్లోనూ పిల్లిని శుభసూచకంగా చూపిన దాఖలాలు లేవు. కానీ ఓ ఊళ్లో మాత్రం పిల్లినే దేవతగా పూజిస్తున్నారు. ఆ శివాలయంలో మార్జాలమాత ప్రత్యేక స్థానంలో కనిపిస్తోంది. ఆ దేవత వాహనం కూడా మార్జాలమే. విచిత్రమేంటంటే ఆ ఊరు పేరు కూడా ఈ పిల్లితో పుట్టిందే. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని బెక్కం.. శ్రీశైలం ముంపు గ్రామం. నేలబిల్కు, పెద్ద బిల్కులనే రెండు చిన్నగ్రామాలు కలిపి బెక్కంగా ఏర్పడింది. ఈ ఊళ్లో ఓ శివాలయం ఉంది. స్వామిని ‘బెక్కేశ్వరుడు’గా కొలుస్తున్నారు. ఈ గుడి గోడ గూటిలో ఓ పెద్ద శిల్పం ఉంది. పైన కుడి చేతితో తామరపుష్పాన్ని ధరించి, ఉత్కుటాసన భంగిమలో అమ్మవారి రూపం (పార్వతి?) ఉంది. ఆ శిల్పం దిగువన మార్జాల ముఖం, మానవ శరీరాకృతితో, మార్జాల వాహనధారిౖయె అర్ధ పద్మాసనంలో ఉన్న మరో అమ్మవారి రూపం ఉంది. పిల్లి ముఖం కలిగి ఉండటం, పిల్లి వాహనంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆలయంలోని ఈ ప్రత్యేకతను కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్యాంసుందర్, చంద్రశేఖర్ సోదరులు గుర్తించారని ఆ బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. పిల్లి పేరుతోనే ఊరు ‘పూర్వం ఆ గ్రామంలోని తాటివనంలో ఓ పుట్ట మీద ఆవు పాలు కురిపిస్తుంటే ఓ పిల్లి తాగుతూ ఉండేదని, దాన్ని గుర్తించి స్థానికులు అక్కడి పుట్టను తవ్వగా శివలింగం వెలుగుచూసిందని గాథ అక్కడ ప్రచారంలో ఉంది. కన్నడంలో పిల్లిని బెక్కగా పిలుస్తారు. ఆ పిల్లి పేరుమీదుగానే ఆ శివుడికి బెక్కేశ్వరుడని, గ్రామానికి బెక్కం అని పేరు పెట్టారన్నది స్థానికుల కథనం. ఈ ఆలయానికి 1065 జూలై11న కేతరస, రాజరసలనేవారు త్రైలోక్యమల్ల 1వ సోమేశ్వరుడి పాలన కాలంలో భూదానం చేసినట్టు శాసనం కూడా బయటపడింది. రాష్ట్రకూట శైలిలో నిర్మించిన ఇక్కడి త్రికూటాలయంలో లలాటబింబంగా గజలక్ష్మి ఉంది. ఓ గర్భాలయంలో ఛత్రాపరితల సమలింగం ఉండగా, ప్రతి గర్భాలయానికి ఎదురుగా వేర్వేరు కాలాలకు చెందిన నంది శిల్పాలున్నాయి.’ అని హరగోపాల్ పేర్కొన్నారు. -
రెండు తలలతో జన్మించిన పిల్లి.. మురిసిపోతున్న యజమాని!
బ్యాంకాక్: ఇదేమిటో తెలుసా? పిల్లి కూన. అయితే అల్లాటప్పా కూన కాదు. ఏకంగా రెండు తలలతో పుట్టిన కూన! ఇలా పుట్టినవి సాధారణంగా కొన్ని గంటల కంటే బతకవు. కానీ ఆదివారం థాయ్‌లాండ్‌లో పుట్టిన ఈ కూన మాత్రం భేషుగ్గా బతికేసింది. పైగా రెండు మూతులతోనూ పాలు తాగేస్తోందంటూ యజమాని మురిసిపోతున్నాడు. దీనికి టుంగ్ గ్రెన్ (వెండి బ్యాగు), టుంగ్ టోంగ్ (బంగారు బ్యాగు) అని ఏకంగా రెండు పేర్లు కూడా పెట్టుకున్నాడు. ఒక్కో తలకు ఒక్కో పేరన్నమాట! దీని తల్లి ముందుగా ఒక మామూలు కూనను కనింది. తర్వాత రెండో కాన్పు కష్టంగా మారడంతో హుటాహుటిన స్థానిక పశువుల ఆస్పత్రికి తీసుకెళ్లారట. వాళ్లు సిజేరియన్ చేసి ఈ అరుదైన రెండు తలల కూనను విజయవంతంగా బయటికి తీశారు. దాంతో యజమాని ఆనందంలో మునిగిపోయాడు. ‘‘చనిపోతుందేమోనని ముందుగా భయపడ్డా. అలాంటిదేమీ జరక్కపోవడంతో నా ఆనందం రెట్టింపైంది’’ అని చెప్పుకొచ్చాడు. రెండు తలల పిల్లుల్ని రెండు తలల రోమన్ దేవత జానస్ పేరిట జానస్ క్యాట్స్ అని పిలుస్తారు. ఫ్రాంక్ అండ్ లూయీదే గిన్నిస్ రికార్డు ఏకంగా 15 ఏళ్లు బతికిన రెండు తలల పిల్లి ఇది! దీని పేరు ఫ్రాంక్ అండ్ లూయీ. 1999లో అమెరికాలోని మసాచుసెట్స్‌లో పుట్టింది. అత్యధిక కాలం బతికిన జానస్ క్యాట్‌గా 2012లోనే ఇది గిన్నిస్ బుక్కులోకి ఎక్కింది. అన్నట్టూ, ఇది మూడు కళ్లతో పుట్టడం విశేషం. ఇదీ చదవండి: ఆ పిల్లి... కోలుకుంటోంది! -
రష్మిక ఇంటికి కొత్త అతిథి.. ‘3 ఏళ్లలో నా ఇల్లు అడవిగా మారుతుందేమో’
‘నేషనల్ క్రష్’ రష్మిక మందన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. భాషతో సంబంధం లేకుండా వరుస టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌లో పలు సినిమాలు చేస్తోంది. అయితే హీరోయిన్గా ఎంత బిజీగా ఉన్న ఎప్పటికప్పుడు తన తాజా అప్డేట్స్ ఇస్తూ నెట్టింట ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. అందుకే ఆమెకు తెరపై మాత్రమే కాదు సోషల్ మీడియాలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉంటే రష్మికకు పెట్స్ అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. ఇప్పటికే ఆమె ఆరా అనే పెట్ డాగ్‌ను పెంచుకుంటుంది. తాజాగా ఆమె తన ఇంటికి మరో కొత్త అతిథికి స్వాగతం పలికింది. తన పేరు స్నో అంటూ ఫాలోవర్స్‌కు పరిచయం చేసింది రష్మిక. చదవండి: విజయ్‌తో డేట్‌కి వెళ్తానన్నా సారా.. లైగర్ రియాక్షన్ చూశారా! ఇంతకి ఆ కొత్త అతిథి ఎవరంటే మరో పెంపుడు జంతువు పిల్లి. దానిని ముద్దుగా స్నో అని పిలుచుకుంటుందామె. ఈ సందర్భంగా స్నోతో కలిసి దిగిన ఫొటోలు, వీడియోను షేర్ చేస్తూ రష్మిక ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చింది. ‘ఇది నా కొత్త పెట్ స్నో. ఇంకో 3 సంవత్సరాల్లో నా ఇల్లు చిన్నపాటి అడవిగా మారుతుందేమో’ అంటూ క్రేజీ క్యాప్షన్ జత చేసింది. అలాగే తన పెట్స్(కుక్క, పిల్లి) బెడ్‌పై ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. వాళ్లిద్దరు నా కోసం ఎలా ఎదురు చూస్తున్నాయో చూశారా.. మీకు తెలుసా ఇమ్మా ఇప్పుడు ఏడుస్తుంది. నా గుండె నిండిపోయింది’ అంటూ ఎమోషనల్ ఏమోజీని జత చేసింది. ఇదిలా ఉంటే రష్మిక ప్రస్తుతం పుష్ప 2, రణ్‌బీర్ కపూర్ యానిమల్, విజయ్ వరిసు(తెలుగులో వారసుడు) చిత్రాల షూటింగ్‌తో బిజీగా ఉంది. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
ఆ పిల్లి... కోలుకుంటోంది!
సాక్షి, హైదరాబాద్: అత్తాపూర్ పిల్లర్‌నెంబర్ 102 వద్ద ఒక పిల్లి కాలువిరిగి పడి ఉండటాన్ని చూసిన పౌరుడొకరు తగిన సహాయం చేయాలని మునిసిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవిద్‌కుమార్‌ను ట్విటర్ ద్వారా కోరారు. అందుకు స్పందించిన ఆయన జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగం అధికారులను ఆదేశించడంతో జీహెచ్ఎంసీ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ వెంటనే స్పందించారు. పిల్లిని చుడీబజార్లోని యానిమల్ కేర్ సెంటర్‌కు తరలించారు. ముగ్గురు డాక్టర్ల బృందం తగిన వైద్య చర్యలు చేపట్టడంతో పిల్లి కోలుకుంది. ముగ్గురు పశువైద్యుల బృందంతో అత్యవసర చికిత్సం అనంతరం ఆ పిల్లి కోలుకుంటోంది. జ్వరం నుంచి కోలుకుని, టెంపరేచర్ సాధారణ స్థితికి వచ్చింది. కొద్దిగా పాలు కూడా తీసుకుందంటూ స్వయంగా అరవింద్ కుమార్ ట్వీట్ చేశారు. పిల్లి గురించి ఒక సామాన్య యువకుడి ట్వీట్ పై స్పెషల్ చీఫ్ సెక్రటరీ,గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ అబ్దుల్ వకీల్ స్పందించిన తీరు ప్రశంసలు దక్కించుకుంటోంది. Glad to inform that the cat's body temperature is improving towards normal & She had small quantity of milk also. Thanks Dr Wakeel, chief vet officer @GHMCOnline & team of vets! Just an update https://t.co/DSigJEqDtr pic.twitter.com/ucmchgP97b — Arvind Kumar (@arvindkumar_ias) July 4, 2022 -
శభాష్... స్నితికా!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్ క్రైం: బావిలో పడిపోయి ఆరు గంటలు అల్లాడిన ఓ పిల్లి పిల్లను ఓ బాలిక సమయస్ఫూర్తి, దయాగుణం రక్షించాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో ఆదివారం సాయంత్రం ఓ ఇంటిలోని బావిలో పిల్లి పడింది. అక్కడే ఆడుకుంటున్న స్థానిక బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి మనోహర్ పిల్లలు స్నితికా, వేద్ త్రిదామ్నా పిల్లిని కాపాడేందుకు రాత్రి 8.30 గంటల వరకు విఫలయత్నం చేశారు. అయితే పిల్లి పిల్లను కాపాడలేకపోయామన్న బాధ స్నితికాను వెంటాడింది. వెంటనే ఆ బాలిక స్మార్ట్‌ఫోన్ అందుకొని గూగుల్‌లో సెర్చ్ చేసి ‘యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ’ నంబర్ సేకరించింది. పిల్లి పిల్ల దయనీయస్థితిని వివరిస్తూ వారికి వీడియో పంపింది. సొసైటీవారి సూచనల మేరకు పిల్లిపిల్లను కాపాడేందుకు మళ్లీ ప్రయత్నించి విఫలమైంది. ఈలోగా రాత్రి 10.30 గంటలు సమయమైంది. మరోసారి సొసైటీవారికి ఆ విషయం చెప్పింది. సొసైటీ ప్రతినిధులు కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణకు ఫోన్ చేసి విషయం చెప్పగా ఆయన ఏసీపీ తుల శ్రీనివాస్‌రావును అప్రమత్తం చేశారు. కానిస్టేబుల్ అంజిరెడ్డి బృందం, ఫైర్ సిబ్బంది రాత్రి 11 గంటలకు స్థలానికి చేరుకుని కేవలం 15 నిమిషాల్లో ఆ పిల్లి పిల్లను కాపాడారు. ఎలాగైనా కాపాడాలనుకున్నా స్నితికా, ఇంటర్ ఫస్టియర్, కరీంనగర్ పిల్లి పిల్ల బావిలో పడి తల్లడిల్లుతుంటే నాకు బాధగా అనిపించింది. ఎలాగైనా దాన్ని కాపాడాలనుకున్నా. యానిమల్ రెస్క్యూ బృందం ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వచ్చి పిల్లిని కాపాడటంతో నా మనసు కుదుటపడింది. (క్లిక్: ఎనిమిదేళ్ల క్రితం తప్పిపోయి.. ఇంటికి చేరిన బాలిక) -
పోలీస్ స్టేషన్లో రాచమర్యాదలు అందుకుంటున్న పిల్లి...ఎందుకో తెలుసా!
గౌరిబిదనూరు: పోలీసులను చూస్తే నేరగాళ్లకు హడల్. కానీ ఎలుకలకు కాదు. నగరంలోని రూరల్ పోలీసు స్టేషను మాదనహళ్ళి చెరువులో ఉంది. అది నిర్మానుష్య ప్రాంతం కాగా ఎలు కలు, పందికొక్కుల బెడద ఎక్కువగా వుంది. స్టేషనులో రికార్డులను అవి పాడు చేయడంతో విసుగు చెందిన పోలీసులు పిల్లిని తెచ్చి పెట్టారు. స్టేషనుకు పిల్లి వచ్చిన తరువాత ఎలుకల బాధ కొంతవరకు తక్కువగా ఉందని పోలీసులు చెప్పారు. ఏమైతేనేమి పిల్లికి స్టేషనులో రాచమర్యాదలు దక్కుతున్నాయి. ముగ్గురు దొంగల అరెస్టు మైసూరు: ముగ్గురు దోపిడీ దొంగలను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి మూడు బైకులతో పాటు రూ.15 లక్షల విలువ చేసే బంగారు నగలను సీజ్ చేశారు. నగర క్రైమ్, ట్రాఫిక్ డిసిపి గీతా ప్రసన్న ఆదేశాల మేరకు సీసీబీ పోలీసులు చైన్ స్నాచర్లు, ఇళ్లలో చోరీచేసేవారిపై నిఘా వేసి ముగ్గురిని అరెస్టు చేశారు. మైసూరులో ఇటీవలికాలంలో స్నాచింగ్‌లు, దొంగతనాలు పెరిగిపోవడం తెలిసిందే. (చదవండి: ఘనంగా పెంపుడు కుక్క బర్త్ డే వేడుక...ఏకంగా 4 వేలమందికి...) -
పట్టుకో...పట్టుకో చూద్దాం! వైరల్ వీడియో
ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చీటికిమాటికి దేనికో దానికి కొట్టుకుంటారు. అలానే కొంతమంది రకరకాల పెంపుడు జంతువులను పెంచుకుంటుంటారు. అవి కూడా అంతే కొట్టుకుంటూ పెద్ద హడావిడే చేస్తుంటాయి. అచ్చం అలానే ఇక్కడొక యజమాని పెంపుడు జంతువులు కూడా అలానే కొట్టుకుంటాయి. ఐతే ఇక్కడ కుక్క, పిల్లిని తరుముతుండటేమే కాకుండా వెంటాడుతుంది. కానీ ఆ పిల్లి ఎంత తెలివిగా ఆ కుక్క నుంచి తప్పించుకుందో చూడండి. వివరాల్లోకెళ్తే....కుక్కులు సహజంగానే తమ కన్న చిన్న జంతువులను తరుముతూ వెంటపడుతుంటాయి. పైగా ఆ రెండు జాతులకు సాధారణంగా పడదు. ఏమైందో ఏమో ఉన్నట్టుండి కుక్క పిల్లిని తరుముతుంది. దాడి చేసేందకు వెంటపడి మరీ తరుముతుంటుంది. దీంతో ఆ పిల్లి చక్కటి ట్రిక్ ఉపయోగించి కుక్క అవాక్కయ్యేలా తప్పించకుంటుంది. ఇంతకీ పిల్లి ఏం చేసిందంటే...పరుగెడుతున్నప్పుడూ సమీపంలో ఉన్న స్విమ్మింగ్ పూల్ వద్ద ఉన్న తెడ్డుపైకి ఎక్కి అవతలి ఒడ్డుకు చేరుకుని తప్పించుకుంటుది. కానీ కుక్క పాపం ఆ పిల్లి స్విమ్మింగ్ పూల్‌లో పడిపోతుందనుకుంది. పిల్లి అలా తెలివిగా తప్పించుకునేటప్పటికీ కుక్కకి ఏం చేయాలో తోచక చూస్తుండిపోతుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్ వేయండి. In a brilliant move, cat outsmarts puppy..🐈🐾🐕💨🏄😅 pic.twitter.com/k517VkJCPe — 𝕐o̴g̴ (@Yoda4ever) June 4, 2022 -
ఈ పిల్లిని ఎలా రక్షిస్తారు? పోలీసు ఫేస్బుక్లో పోస్టు చేస్తూ..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పోలీసులు ఆపదలో ఉన్న బాధితులనే కాదు... మూగజీవులనూ రెస్క్యూ చేస్తున్నారు. ఇందులో భాగంగా సుల్తాన్‌బజార్ గస్తీ సిబ్బంది సోమవారం ఉదయం గేట్ గ్రిల్లో చిక్కుకున్న ఓ పిల్లికి ప్రాణం పోశారు. ఈ విషయాన్ని సిటీ పోలీసు అధికారిక ఫేస్బుక్లో పోస్టు చేసిన అధికారులు దాంతో పాటు ఓ ప్రశ్నను సంధించారు. దీనికి అనేకమంది నెటిజనుల తమదైన శైలిలో స్పందిస్తూ సలహాలు, సూచలు ఇచ్చారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సుల్తాన్‌బజార్ ఠాణాకు చెందిన పెట్రో కార్–1 సిబ్బంది సోమవారం ఉదయం తమ విధుల్లో భాగంగా గస్తీ నిర్వహిస్తున్నారు. వీరి వాహనం కుబ్తిగూడలోని థామస్ చర్చి వద్దకు చేరుకునే సరికి ఓ ఇంటి వద్ద హడావుడి కనిపించింది. అక్కడకు వెళ్లిన గస్తీ పోలీసులు ఆరా తీయగా.. ఆ ఇంటి గేటు గ్రిల్లో పిల్లి తల ఇరుక్కుందని, బయటకు తీసుకోవడానికి అది నానా తంటాలు పడుతోందని గుర్తించారు. వెంటనే స్పందించిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి మార్జాలానికి గ్రిల్ నుంచి విముక్తి కల్పించారు. పిల్లి గ్రిల్లో చిక్కుకున్న ఫొటోను పోస్టు చేసిన సిటీ పోలీసు ఫేస్బుక్ పేజ్ దాంతో పాటు ‘పిల్లిని విడుదల చేయడానికి సులభమైన మార్గాన్ని వ్యాఖ్యానించండి’ అంటూ పేర్కొన్నారు. దీనికి నెటిజనుల నుంచి భారీ స్పందన వచ్చింది. తమకు తోచిన సూచనలు చేశారు. కొందరైతే అలా చిక్కుకున్న పిల్లులను బయటకు తీయడానికి అనుసరించాల్సిన విధానాలతో కూడిన యూట్యూబ్ వీడియోల లింకుల్నీ షేర్ చేశారు. పిల్లి తలకు, గ్రిల్‌కు నూనె పూసి తీయాలని, వెల్డింగ్‌తో కట్ చేయాలని ఇలా సలహాలు ఇచ్చారు. -
IPL 2022: దీని దుంపతెగ.. పాడు పిల్లి ఎంత పనిచేసింది
ఐపీఎల్ 2022 సీజన్లో శుక్రవారం ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌కు ఒక పిల్లి అనుకోని అతిథిలా వచ్చింది. దీంతో మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగింది. అయితే సదరు పిల్లిగారు మైదానంలోకి వచ్చి ఆటగాళ్లను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు. మరి ఆటకు ఎందుకు విరామం అనుకుంటున్నారా.. ఆ పిల్లి సైట్స్క్రీన్ మీద దర్జాగా కూర్చొని మ్యా్చ్ వీక్షించింది. పిల్లి జాలీగా ఎంజాయ్ చేసినప్పటికి.. స్ట్రైక్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌కు సైట్స్క్రీన్ ఎదురుగా ఉంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సైట్‌స్ర్కీన్ నుంచి ఏ చిన్న ఇబ్బంది కలిగిన బ్యాట్స్‌మన్ తన ఫోకస్ కోల్పోతుంటాడు. సరిగ్గా డుప్లెసిస్‌ను కూడా ఇదే విషయం ఇబ్బంది పెట్టింది. విషయాన్ని అంపైర్‌కు చేరవేయగా.. మ్యాచ్ నిలిపివేసి సిబ్బందికి చెప్పి పిల్లిగారిని అక్కడి నుంచి పంపించేశారు. ఈ ఘటన ఆర్సీబీ తొలి ఓవర్ తర్వాత చోటు చేసుకుంది. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు.. మైదానంలోకి రాకుండానే ఎంత ఇబ్బంది పెట్టింది... దీని దుంపతెగ.. పాడుపిల్లి ఎంత పని చేసింది అంటూ కామెంట్స్ చేశారు. మ్యాచ్ విషయానికి వస్తే ప్లేఆఫ్ అవకాశాలు నిలవాలవంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ గర్జించింది. ఓపెనర్‌గా బెయిర్ స్టో(29 బంతుల్లో 66, 4 ఫోర్లు, 7 సిక్సర్లు) సీజన్లో తొలిసారి అదరగొట్టడం.. లివింగ్‌స్టోన్(42 బంతుల్లో 70, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ పంజాబ్ బౌలర్ల ధాటికి 155 పరుగులకే చాప చుట్టేసింది. మ్యాక్స్‌వెల్ 35 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: Virat Kohli: అలవాటే కదా.. ఎవరిని తిట్టి ఏం లాభం! Kagiso Rabada: టి20 క్రికెట్లో పంజాబ్ కింగ్స్ బౌలర్ కొత్త చరిత్ర Nothing unusual, just a cat stopping the play#RCBvsPBKS pic.twitter.com/lOljTMgF4i — Jemi_forlife (@jemi_forlife) May 13, 2022 IPL-2022 No.2 యువ ఆటగాళ్లు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సరదాగా ‘వెర్రి పని’.. పదేళ్ల జైలు శిక్ష
సాటి మనషుల మీదే కాదు.. మూగ జీవాల పట్లా వేధింపులు, హింసకు పాల్పడితే చట్టం ఊరుకోదు. అలా ఓ చిన్నప్రాణితో, అదీ తన పెంపుడు జంతువుతో వెర్రి వేషాలు వేసిన వ్యక్తికి.. కఠిన కారాగార శిక్ష స్వాగతం చెప్పింది. ఇంటర్నెట్లో(యూట్యూబ్‌లో) ఈ మధ్య ఒక వీడియో వైరల్ అయ్యింది. సముద్రం ఒడ్డున రెండు పిల్లులను ఆహారం ఎరవేసి కొద్దిసేపు ఆడించాడు ఓ వ్యక్తి. అలా ఆడిస్తూ.. అదంతా వీడియో తీశాడు. చివరకు.. ఓ పిల్లిని సముద్రంలోకి లాగి పెట్టి తన్నాడు. వెకిలి చేష్టలకు తోడు నవ్వులు నవ్వాడు. రెండో పిల్లితో అలానే వ్యవహరించబోయాడు. గ్రీస్‌లోని ఎవియా ఐల్యాండ్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. దీంతో ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. అది తన పెంపుడు పిల్లే అని, అక్కడ నీళ్లు లేవని, ఆ పిల్లి సురక్షితంగానే ఉంది కదా! ఆ వ్యక్తి వాదించడం మొదలుపెట్టాడు. తనకు జంతువులంటే విపరీతమైన పనే అని చెప్తున్నాడు. కానీ, అతని నేరం మాత్రం రుజువైంది. దీంతో అక్కడి చట్టాల ప్రకారం.. అతనికి పేదళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇక పౌర హక్కుల పరిరక్షణ మంత్రి టకిస్ థియోడోరికాకోస్ నిందితుడి అరెస్ట్‌ను ధృవీకరించారు. మూగ జీవాల పట్ల ఇలాంటి హింసను సహించే ప్రసక్తే లేదని అంటున్నారాయన. గ్రీస్ చట్టాల ప్రకారం.. ఎవరైనా మూగ జీవాలను హింసించినా, దాడులకు పాల్పడినా పదేళ్లు జైలు శిక్షతో పాటు ఐదు నుంచి పదిహేను వేల డాలర్ల దాకా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ ప్రమాదం నుంచి ఆ పిల్లి సురక్షితంగా బయటపడిందని, స్థానికంగా ఉన్న యానిమల్ సొసైటీ దాని సంరక్షణ చూసుకోవడంతో పాటు సదరు నిందితుడిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. -
వారెవ్వా వానరం.. ఆ కోతి ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే?
పిఠాపురం(తూర్పుగోదావరి): కన్న పిల్లలను సాకడంలో కోతిని మించిన జంతువు ఉండదంటారు. తన కడుపున పుట్టిన పిల్లలను తన కడుపుకే హత్తుకుని వెన్నంటి ఉంటుంది కోతి. కాని ఒక వానరం తన పిల్ల కాక పోయినా ఒక పిల్లి పిల్లను తన కన్న పిల్లలా సాకుతూ ఆశ్చర్యపరుస్తోంది. పిఠాపురం సమీపంలో మాధవపురం వెళ్లే రోడ్డులో ఉన్న ఒక కూరగాయల దుకాణం వద్దకు రోజూ వస్తున్న ఒక కోతి ఒక పిల్లి పిల్లను తన కడుపునకు హత్తుకుని తీసుకువచ్చి తనకు పెట్టిన ఆహారాన్ని దానికి తినిపిస్తోంది. జాతి వైరం లేదని చాటుతున్న దీనిని చూసేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. చదవండి: ఖాకీ వనంలో ‘గోపాలుడు’ -
పిల్లి చేసిన పని...100 కోట్ల నష్టం
సాధారణంగా ఇళ్లలో జంతువులు చేసిన పనులు కొన్ని సార్లు నష్టాలను మిగిలేలా చేస్తాయి. తాజాగా ఓ పిల్లి కారణంగా లక్షలు కాదు, 100 కోట్లు నష్టాలను తెచ్చిపెట్టింది. మహారాష్ట్రలోని పుణె పట్టణం శివార్లలో పింప్రీ-చించ్వడ్ ప్రాంత. ఇక్కడ పారిశ్రామిక ప్రాంతమైన భోసారిలో వ్యాపారస్తులు ఎక్కువ. ఓ పిల్లి ట్రాన్స్ ఫార్మర్ మీదకు ఎక్కడంతో అక్కడి కరెంట్ తీగలు తగలడంతో షార్ట్ సర్క్యూ్ట్ అయ్యింది. దీంతో భోసారితో పాటు భోసారి ఎం.ఐ.డి.సీ ప్రాంతమంతా కరెంట్ అంతరాయం ఏర్పండింది. సుమారు 60 వేల మంది వినియోగదారులకు కరెంట్ సరఫరా కట్ అయ్యింది. ఫలితంగా దాదాపు 7000 మంది వ్యాపారస్తుల దుకాణాలకు పవర్ నిలిచిపోయింది. దీని వల్ల సుమారు రూ.100 కోట్ల రూపాయిలకు పైగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనా వేశారు. మరల కరెంట్ సరఫరాను మళ్లీ పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలంటే.. మూడు రోజులైనా పడుతుందని అధికారులు తెలిపారు. అయినా ఇంతటి నష్టానికి, కష్టానికి కారణం.. పిల్లి అంటే ఎవరూ నమ్మలేకపోతున్నారు. -
ఉక్రెయిన్ నుంచి పిల్లిని తెచుకున్న ఖమ్మం జిల్లా విద్యార్థి
-
Ukraine Cat: ఉక్రెయిన్ నుంచి పిల్లిని తెచ్చుకున్నాడు.. కానీ
సాక్షి, ఖమ్మం: ఉక్రెయిన్‌లో మెడిసిన్ చదువుతున్న విద్యార్థి తాను పెంచుకుంటున్న పిల్లితో సహా వచ్చేశాడు. కానీ ఆ పిల్లి ఇక్కడ వేడిని తట్టుకోలేకపోతోంది. కల్లూరు మండలం చిన్నకోరుకొండికి చెందిన పుదురు ప్రఖ్యాత్ ఉక్రెయిన్‌లో మెడిసిన్ చదువుతూ మూడేళ్లుగా పిల్లిని పెంచుకుంటున్నాడు. అక్కడి నుంచి విమానంలో రాగా, ఢిల్లీ – హైదరాబాద్ విమానంలో పిల్లిని అనుమతించలేదు. దీంతో తనకు రూ.15వేలతో, పిల్లికి రూ.6వేలతో టికెట్ కొని హైదరాబాద్‌కు, అక్కడి నుంచి స్వస్థలానికి చేరుకున్నాడు. ఖమ్మం సోమవారం వచ్చిన ఆయన మాట్లాడుతూ ఇక్కడ వేడితో పిల్లి తట్టుకోలేకపోతుందని తెలిపాడు. తడి బట్టతో గంటకోసారి తుడుస్తూ కాపాడుతున్నామని ప్రఖ్యాత్ వెల్లడించారు. చదవండి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం: రాజ్యాంగం కల్పించిన హక్కులు ఇవే -
హుజుర్నగర్లో వింత కేసు.. పోలీస్‌స్టేషన్‌కు చేరిన పిల్లి పంచాయితీ..
సాక్షి, హుజూర్నగర్(సూర్యాపేట): ఏడాది క్రితం తప్పిపోయిన పిల్లి మళ్లీ కనబడటంతో రెండు కుటుంబాల మధ్య తగాదాకు దారి తీసింది. పిల్లి తమదంటే తమదంటూ వారు వాగ్వాదానికి దిగి, పరిస్థితి చేయిదాటిపోవడంతో పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు. ఎస్ఐ చొరవతో సమస్య పరిష్కారమైంది. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని దద్దనాల చెరువు కాలనీలో నివసించే మద్దెల మున్నా, అతని తల్లి ముత్యాలు మూడేళ్ల క్రితం మైసూర్‌నుంచి పిల్లి పిల్లల జంటను రూ 5 వేలకు కొనుగోలు చేసి తెచ్చుకున్నారు. వీటిలో ఆడపిల్లి బావిలోపడి చనిపోగా మగపిల్లి ఏడాది క్రితం తప్పిపోయింది. మున్నా, ముత్యాలు ఎంతవెతికినా ఫలితం లేకపోయింది. అయితే ఇటీవల ఫణిగిరి గుట్ట వద్ద ఓ వ్యక్తి ఆ పిల్లిని చూసి గుర్తుపట్టి మున్నాకు సమాచారమిచ్చాడు. దీంతో వారు పిల్లిని పెంచుకుంటున్న సుక్కమ్మ ఇంటికి వెళ్లి పిల్లి కోసం అడిగారు. ఈక్రమంలోనే ఇరు కుటుంబాల మధ్య మాటామాటా పెరిగి పరిస్థితి చేయిచేసుకునే వరకు వెళ్లింది. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. మున్నా, ముత్యాలుకు రూ 5 వేలను ప్రస్తుతం పిల్లిని సాదుకుంటున్న సుక్కమ్మ ఇచ్చేలా మాట్లాడి ఇరువర్గాలను ఎస్ఐ ఒప్పించారు. దీంతో సమస్య పరిష్కారం అయ్యింది. చదవండి: హైదరాబాద్: మార్చి నాటికి మరో నాలుగు ప్రాజెక్టులు -
అతిథిలా వచ్చి ఆటగాళ్లను పరుగులు పెట్టించింది
సీరియస్‌గా సాగుతున్న ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పిల్లి ప్రత్యక్షమై ఆటగాళ్లను ఉరుకులు.. పరుగులు పెట్టించింది. ఈ ఫన్నీ ఘటన థర్డ్టైర్ ఇంగ్లీష్ లీగ్ వన్‌లో చోటుచేసుకుంది. లీగ్‌లో భాగంగా మంగళవారం రాత్రి షెఫీల్డ్ వెడ్నెస్డే, విగన్ అథ్లెటిక్ మధ్య మ్యాచ్‌లో జరిగింది. విగన్స్ ఆటగావడు జాసన్ కెర్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఎక్కడనుంచి వచ్చిందో తెలియదు గానీ సడెన్‌గా మైదానంలో ఒక పిల్లి ప్రత్యక్షమైంది. చదవండి: Cristiano Ronaldo: గర్ల్‌ఫ్రెండ్ నుంచి ఖరీదైన గిఫ్ట్ అందుకున్న స్టార్ ఫుట్‌బాలర్ దానిని పట్టుకొని బయటికి పంపిచాలని ఆటగాళ్లు ప్రయత్నించారు. కానీ వారికి ఆ చాన్స్ ఇవ్వకుండా పిల్లి పరుగులు పెట్టింది. దాని వెంటే వెళ్లిన జాసన్ కెర్ చివరికి ఎలాగోలా పిల్లిని పట్టుకొని గ్రౌండ్ సిబ్బందికి అందించాడు. అయితే పిల్లి గాయపడకుండా చాకచక్యంగా వ్యవహరించిన జాసన్ కేర్‌ను తోటి ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు అభినందనల్లో ముంచెత్తారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో షెఫీల్డ్ వెడ్నెస్డే జట్టు 1-0 తేడాతో విగన్పై విజయం సాధించింది. A cat ran on the pitch at Hillsborough tonight and Wigan’s Jason Kerr gave it a little tickle before carefully helping it off. Not kicked pic.twitter.com/3Blp9zVDWV — Jack Kenmare (@jackkenmare_) February 8, 2022 -
శునకం నిద్రను డిస్టర్బ్ చేసిన పిల్లి.. వైరల్ వీడియో
ఆమ్స్టర్డామ్: సాధారణంగా శునకానికి, పిల్లికి మధ్య జాతీ వైరముంటుందనే విషయం మనకు తెలిసిందే. అయితే, చాలా అరుదుగా కుక్కలు, పిల్లులు ఒక చోట ఉండటాన్ని మనం చూస్తుంటాం. ఈ క్రమంలో.. కొన్నిచోట్ల యజమానులు చిన్నప్పటి నుంచి వాటిని ఒక దగ్గర పెంచితే.. అవి తమ జాతీ వైరాన్ని మరిచిపోతాయి. కుక్కలు, పిల్లులు ఒక దగ్గర ఉన్నప్పుడు ఫన్నీగా ఆడుకోవడం, ఒక్కొసారి పరస్పరం దాడిచేసుకోవడం వంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ కోవకు చెందిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో సదరు యజమాని కుక్కని, పిల్లిని ఒక దగ్గర పెంచుకుంటున్నాడు. కుక్క హయిగా ఇంట్లోని సోఫాలో మంచిగా కాలు జాపుకొని హయిగా పడుకొని ఉంది. అప్పుడు పిల్లి అక్కడికి వచ్చి చూసింది. బహుషా.. కుక్క నిద్రపోవడం చూసి దానికి ఈర్ష్యపుట్టిందో.. దాన్ని డిస్టర్బ్ చేయాలనుకుందో ఏమో గానీ.. మెల్లగా దాని దగ్గరకు వెళ్లింది. ఆ తర్వాత తన కాళ్లతో కుక్కను మెల్లిగా తట్లిలేపింది. వెంటనే సోఫా కింద దాక్కుంది. పాపం.. ఏదో అలికిడి వినిపించడంతో కుక్క అటూ ఇటూ చూసింది. దానికి ఏం కనిపించక పోవడంతో మళ్లి పడుకుంది. పిల్లి మరోసారి కుక్క నిద్రను డిస్టర్బ్ చేసింది. ఈ సారి కూడా కుక్కకు ఎవరు కనిపించలేదు. అలానే అటు ఇటూ అమాయకంగా చూసింది. అయితే, పిల్లి మాత్రం సోఫా కింద మెల్లిగా నక్కి నేను మాత్రం కాదన్నట్లు దాక్కుంది. కుక్కను పదేపదే డిస్టర్బ్ చేసింది. దీన్ని బ్యూటింజిబిడెన్ అనే యూజర్ ట్వీటర్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చేస్తోంది. దీన్ని చూసిన నెటిజన్లు..‘ వీడియో చూస్తుంటే నవ్వు ఆపుకోలేకపోతున్నాం..’, ‘నా ప్లేస్‌లో నువ్వు ఎలా పడుకుంటావ్.. అనుకుందేమో పాపం.. పిల్లి..’, ‘ ఈ రోజు ఒక మంచి సరదా వీడియోను చూశా..’ అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. Can’t stop laughing.. 😅 pic.twitter.com/bt3COZ7oUb — Buitengebieden (@buitengebieden_) January 23, 2022 చదవండి: రూ.500 కోసం జుట్టు జుట్టు పట్టుకుని....చెప్పులతో కొట్టుకున్నారు: వైరల్ వీడియో -
ఫుడ్ కంటైనర్‌లో స్పై కెమెరా!
మనం ఏదైన మాల్స్‌కి వెళ్లితే అక్కడ పెద్ద పెద్ద షోరూంల వాళ్లు భద్రత దృష్ట్యా స్పైకెమరాలు, సీసీ కెమరాలు వంటివి ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకంటే ఎక్కవ జనసందోహం ఉంటుంది. పైగా అక్కడ ఉన్న ఖరీదైన వస్తువుల చోరికి గురికాకుండా ఉండే నిమిత్తం ఈ ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. అయితే ఒక కస్టమర్ తన పెంపుడు పిల్లులు కోసం కొనుగోలు చేసిన ఫుడ్ కంటైనర్‌లో ఉన్న స్పై కెమెరాను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. (చదవండి: ఫుల్‌గా తాగి సెక్యూరిటీ గార్డ్‌తో గొడవపడిన మహిళ) అసలు విషయంలోకెళ్లితే..ఒక వ్యక్తి లిల్లిపుట్, గోలియత్ అనే రెండు పెంపుడు పిల్లులు ఉంటాయి. సదరు వ్యక్తి తన పిల్లులకు సంబంధించిన ఆహారాన్ని స్థానిక కో-ఆపరేటివ్ ఫ్రాంచైజీ వెల్కమ్ స్టోర్‌లో కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఒకరోజు అతను తన భార్యను ఆ ఆహార ప్యాకెట్లను తీసుకురమ్మని చెబుతాడు. దీంతో ఆమె ఆ ప్యాకెట్‌ని తీసుకుని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఆ ఫుడ్ ప్యాకెట్‌పై ఉన్న పిల్లి బొమ్మ తల మీద ఒక స్పై కెమెరా ఉంటుంది. దీంతో ఆమె ఈ విషయాన్ని తన భర్తకు తెలియజేసింది. అయితే అతను కూడా ఒక్కసారిగా షాక్‌కి గురవుతాడు. బహుశా సెక్యూరిటీ నిమిత్తం ఇలా షాపు వాళ్లు ఇలా ఏర్పాటు చేశారేమో పొరపాటున మనకు వచ్చేసిందేమో అని అనుకుంటారు. ఆ తర్వాత ఇంతవరకు ఆ కెమెరాలో ఏమైన రికార్డు అయ్యిఉందేమో అని సీసీఫుటేజ్ నిమిత్తం తనిఖీ చేసి చూడగా మరోసారి షాక్‌కి గురవుతాడు. ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే ఆ స్పై కెమెరాలో బ్యాటరీలు లేవు అందువల్ల అది వేటిని రికార్డు చేయలేదు. ఇంతవరకు స్టోర్ అయి ఉన్న డేటా ఏమి లేదని ఇది చూడటానికి ఆశ్చర్యంగానూ వింతగానూ ఉందని సదరు వ్యక్తి స్థానిక మీడియాకి తెలిపాడు. (చదవండి: రష్యా బస్సు ప్రమాదంలో ఐదుగురు మృతి) -
‘దొంగ’ పిల్లి.. ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది. రోజుకు ఐదారు..
న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ నగర శివార్లలో నివపించే గిన్నీ, డేవిడ్ దంపతులు పెంచుకుంటున్న ఐదేళ్ల నల్లపిల్లి ఇది. పేరు.. కీత్. దీని ‘దొంగ’బుద్ధితో ఇరుగుపొరుగు వారికి భలే చిక్కొచ్చిపడింది. అర్ధరాత్రులు నిశ్శబ్దంగా చుట్టుపక్కల వాళ్ల ఇళ్లలోకి జొరబడటం... కంటపడ్డ వస్తువులను పట్టుకొచ్చేయడం దీనికి అలవాటు. బూట్లు, స్విమ్ సూట్లు, గ్లౌజ్‌లు, మహిళల లోదుస్తులు, ఓ పోలీసు అధికారి షర్టు, ఈల్ చేపలు... ఇలా చాలానే యజమానుల ఇంటికి తెచ్చేస్తోంది. మూడేళ్లుగా దీనికి ఈ అలవాటున్నా... ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది. రోజుకు ఐదారు వస్తువులను కొట్టుకొస్తోంది. ఇటీవల గంజాయి పీల్చే హుక్కా లాంటి ఓ గాజు పరికరం, తెల్లటి పొడితో నిండిన చిన్న బ్యాగును పట్టుకొచ్చేసింది. దాంతో దీని ఘనకార్యాలు పోలీసులకూ తెలిశాయి. అవి ఎక్కుడునుంచి తెచ్చిందో తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసోళ్లు. ఎంతైనా ఐదేళ్ల నుంచి పెంచుకుంటున్న పెంపుడు పిల్లి కాబట్టి గిన్నీ, డేవిడ్‌లు దీన్ని కట్టడి చేయలేక... ఇరుగుపొరుగుతో ఇబ్బందులు రాకూడదని ఓ ఆలోచన చేశారు. తమ ఇంటి ఆవరణలో ఓ ప్లాస్టిక్ బుట్ట పెట్టి... కీత్ ఎత్తుకొచ్చేస్తున్న వస్తువులను అందులో ఉంచుతున్నారు. ఇరుగుపొరుగు తమ ఇంట్లో బూట్లు, ఇతర ఏదైనా వస్తువులు కనపడకపోతే ఇక్కడికొచ్చి... బుట్టలో వెతికి పట్టుకుపోతున్నారు. ఇదీ ఈ దొంగపిల్లి కథ. -
బాలీవుడ్ భామకి గిఫ్ట్‌గా రూ.52 లక్షల గుర్రం, రూ.9 లక్షల పిల్లి
బాలీవుడ్ భామ, శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసు విచారణ ఎదర్కొంటూ జైలులో ఉన్న నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్‌తో జాక్వెలిన్‌కు సంబంధాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆమె వాటిని కొట్టిపారేసింది. అతనితో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అయితే ఇటీవల అతనితో దిగిన ఫోటో బయటకు రావడంతో ఈ అమ్మడు చుట్టూ ఉచ్చు బిగిసింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ శ్రీలంక బ్యూటీపై మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. సుఖేష్ నుంచి జాక్వెలిన్ కోట్ల రూపాయల బహుమతి పొందినట్లు ఈడీ విచారణలో తేలిందట. అందులో రూ.52 లక్షల గుర్రం, రూ.9 లక్షల పెర్షియన్ పిల్లితో పాటు దాదాపు రూ.10 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా సుఖేష్ భార్య లీనా పౌల్‌తో కూడా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. జాక్వెలిన్‌తో పాటు మరో హీరోయిన్ నోరా ఫతేహీనికి కూడా సుఖేష్ భారీ బహుమతులు ఇచ్చాడట. ఆమెకు ఒక బీఎండబ్ల్యూ కారు, ఐఫోన్‌తో పాటు మొత్తంగా రూ.కోటి విలువైన గిఫ్టులు ఇచ్చాడని సమాచారం.ప్రస్తుతం ఈ బహుమతుల ఇష్యూ బీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. -
తగ్గేదే లే! అంటున్న పిల్లి.. బాడీ బిల్డింగ్ పోటీలకు పంపాలి!
ఫిట్‌గా ఉండటం కోసం జిమ్‌లో గంటల తరబడి వర్క్ అవుట్లు, ఎక్సర్ సైజ్లు చూస్తూ ఉంటాం. అయితే మంచి శరీరాకృతి రావాలని జిమ్‌లో పుష్ అప్లు చేస్తాం. అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా? పిల్లిని కొంత మంది పెంపుడు కుక్కల వలే పెంచుకుంటారు. అయితే పిల్లులు చేసే అల్లరి మామూలు ఉండదు! అయితే ఓ పిల్లి జిమ్‌లో చేసిన పని.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జిమ్‌లో ఓ పిల్లి.. అచ్చం మనుషులు చేసినట్లే పుష్ అప్లు చేసింది. ఈ వీడియోను ఓ ట్విటర్ యూజర్ పోస్ట్ చేశారు. ‘క్యాట్ డూయింగ్ కిట్-అప్స్!!’ అని కామెంట్ జతచేశారు. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ‘నా కంటే అద్భుతంగా పుష్ అప్లు చేస్తోంది’.. ‘పిల్లి భలే చేస్తుందే.. బాడీబిల్డింగ్ పోటీలకు పంపాలి’.. ‘పుష్ అప్‌లతో తగ్గేదే లే! అంటున్న పిల్లి’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. Cat doing kit-ups!!🐈💪😅 pic.twitter.com/9HjQnebWTN — 𝕐o̴g̴ (@Yoda4ever) November 26, 2021 -
10 రోజులుగా పత్తాలేని పిల్లి.. అన్నం ముట్టని తల్లి.. స్కూల్‌కు వెళ్లని పిల్లలు, దాంతో..
సాక్షి, యాదగిరిగుట్ట రూరల్: పిల్లి అపహరణకు గురైందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట మండలం గౌరాయిపల్లికి చెందిన గుజ్జుల రాంచంద్రారెడ్డికి జంతువులంటే ఇష్టం. కొంతకాలంగా ఇంట్లో ఒక పిల్లిని పెంచుతున్నాడు. ఆ పిల్లిని తమ కుటుంబసభ్యుల్లో ఒకటిగా భావించి జిమ్మి అని పేరు పెట్టి ప్రేమానురాగాలతో చూసుకుంటున్నారు. చదవండి: ‘ఎగబడి కరుస్తున్నాయ్.. కుక్కలే కదా చంపితే ఏమవుతుందిలే’ అయితే ఆ పిల్లి గత నెల 29న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. పిల్లి రాకపోవడంతో తన తల్లి గాలమ్మ రెండు రోజులుగా భోజనం చేయడం లేదని, పిల్లలు యశ్వంత్, తనీష్ స్కూల్‌కి వెళ్లడం లేదని, అన్నం కూడా తినడం లేదని రాంచంద్రారెడ్డి తెలిపాడు. పిల్లిని గుర్తించి అపహరించిన వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు సీఐ జానకిరెడ్డి తెలిపారు. చదవండి: బైకుతో సహా నాలాలో పడిన వ్యక్తి.. లక్ జగదీష్ -
కరోనాపై చైనా కఠిన నిర్ణయాలు
-
వైరల్: అంతా మ్యాచ్‌లో లీనం.. ఒక్కసారిగా స్టేడియంలో..
ఇటీవల పలు చోట్ల జంతువులను కాపాడిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారడమే గాక నెటిజన్ల మనసును కూడా దోచుకుంటున్నాయి. అలాంటి ఘటనలోనే ఓ పిల్లిని కాపాడినందుకు కొందరు పెద్ద మొత్తంలో రివార్డును కూడా అందుకున్న సంగతి తెలిసిందే. స్టేడియంలో ఆటగాళ్లు తమ ఆటతో హైలెట్‌గా నిలవడం మామూలే కానీ అక్కడ ఓ పిల్లి టాక్ ఆఫ్ ది మ్యాచ్‌లా మారింది. ఎలా అంటారా! వివరాల్లోకి వెళితే.. మయామి హరికేన్స్ యూనివర్శిటీ, అప్పలాచియన్ స్టేట్ మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు శనివారం హార్డ్ రాక్ స్టేడియంలో ఓ నాటకీయ సంఘటన చోటుచేసుకుంది. ప్రేక్షకులంతా మ్యాచ్‌ని వీక్షిస్తున్నారు. అంతలో స్టేడియం ఎగువ డెక్ నుంచి ఓ పిల్లి వేలాడుతున్నట్లు వారికి కనిపించింది. ఇక అంతవరకు ఉత్సాహంగా మ్యాచ్‌ని ఎంజాయ్ చేస్తున్న ఆడియన్స్ దృష్టి ఒక్కసారిగా పిల్లి వైపు మారింది. అంతలో మ్యాచ్‌ని చూడటానికి వచ్చిన క్రెయిగ్ క్రోమర్, అతని భార్య కింబర్లీ సరైన సమయంలో స్పందించారు. ఆ జంట పిల్లి తన పట్టును కోల్పోతుందని గ్రహించి, సరిగ్గా అది కింద పడే ప్రాంతలో వారి వెంట తెచ్చుకున్న జెండాను పట్టుకున్నారు. దాన్ని కాపాడటానికి అక్కడ జంటతో పాటు కొందరు ఓ రెస్క్యూ టీమ్‌లా ఏర్పడి పిల్లిని కింద పడకుండా పట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇక ఒకే పంజాతో గోడ అంచున పట్టుకున్న ఆ పిల్లి తన పట్టును తిరిగి పొందడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. అయితే, కొంత సేపటి అనంతరం అది ఎగువ డెక్ నుంచి పడిపోయింది. అదృష్టవశాత్తూ, ఆ పిల్లికి ఎటువంటి గాయాలు కాకుండా వారు పట్టుకోగలిగారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో దూసుకుపోతోంది. పిల్లిని కాపాడిన వారిని నెటిజన్లు అభినందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. Well this may be the craziest thing I’ve seen at a college football game #HardRockCat pic.twitter.com/qfQgma23Xm — Hollywood (@DannyWQAM) September 11, 2021 చదవండి: అమ్మా దొంగా ఇక్కడున్నావా? చిన్నారి బిస్కెట్ దొంగతనం వైరల్ -
పంది పాలు తాగిన పిల్లి.. వైరల్ అవుతున్న వీడియో
సాక్షి, జడ్చర్ల టౌన్(మహబూబ్‌నగర్): సమాజంలో ఏ వింత జరిగినా బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందని పెద్దలు చెప్పడం వింటూ ఉంటాం. అలాంటిదే ఈ వింత. జడ్చర్లలో మంగళవారం ఓ పిల్లి పందిపాలు తాగుతున్న వీడియో వైరల్‌గా మారింది. శ్రీలక్ష్మీనగర్ కాలనీలో కారుపక్కన గోడచాటున పందిపడుకుని ఉండగా అటునుంచి వచ్చిన పిల్లి దాని పాలు తాగడం గమనించిన కొందరు వీడియో తీశారు. పిల్లి కొద్దిసేపు పాలు తాగినా పంది వద్దని వారించకపోవటం విశేషం. దీన్ని సోషల్ మీడిమాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. చదవండి: ఈ తెల్లటి డేగ రేటెంతో తెలుసా? జస్ట్ 3.4 కోట్లు!! -
బిగ్‌బాస్ హౌస్‌లో పిల్లి లొల్లి.. జెస్సీ కంటతడి
బిగ్ బాస్ షో అంటేనే వివాదాలు.. కాంట్రవర్సీలు.. ఒకరినొకరు అరుచుకోవడం.అయితే ప్రతీసారి సీజన్ మొదలైన తర్వాత కనీసం వారం రోజుల తర్వాత ఈ చిచ్చు మొదలవుతుంది. కానీ ఐదో సీజన్లో మాత్రం రెండు రోజులకే రచ్చ మొదలైపోయింది. నామినేషన్ ప్రక్రియలో జెస్సీ, హమిదా మధ్య పిల్లి లొల్లి మొదలైంది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. లోబో గురకతో విసిగెత్తిపోయిన జెస్సీ, హహీదా, శ్వేతా వర్మ.. గార్డెన్ ఏరియాలో కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు. (చదవండి: బిగ్‌బాస్: తొలి వారం నామినేషన్లో ఆరుగురు, లిస్ట్ ఇదే!) ఈ సందర్భంగా హమీదా తన పెంపుడు పిల్లి గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. సాధారణంగా పిల్లులు మ్యావ్ అని అరుస్తాయి. కానీ తన పిల్లి మాత్రం మా.. అమ్మా అని పిలిస్తాయాని చెప్పింది. వాటికి చిన్నప్పటి నుంచి బయట ప్రపంచం తెలియకుండా ‘అమ్మా’అనే మాటలను ప్రాక్టీస్ చేయించానని, అందుకే అవి అలా పిలుస్తాయని చెప్పింది. అది విని జెస్పీ షాకయ్యాడు. అంతేకాదు తన వద్ద కుక్క కూడా ఉందని హమీదా చెప్పగా... కుక్కలు ఏమంటాయ్? డాడీ అని పిలుస్తాయా?అని సరదాగా అన్నాడు. ఆ మాటలకు హర్ట్ అయినా హమీదా.. ఈ విషయాన్ని మిగతా ఇంటి సభ్యులతో పంచుకుంది. దీంతో జెస్సీ ఫైర్ అయ్యాడు. నేను సరదాగా అన్నానని, అయినా అక్కడే నేను సారీ కూడా చెప్పాను. మళ్లీ ఎందుకు ఆ విషాయాన్ని ప్రస్తావిస్తున్నావని కోపగించాడు. దీని కారణంగానే హమీదాతో పాటు విశ్వ, యానీ మాస్టార్ అతడిని ఎలిమినేషన్‌కి నామినేట్ చేశారు. ఆ సమయంలో జెస్సీ ఎమోషనల్‌కు గురయ్యాడు. ఇలా మొత్తానికి పిల్లి లొల్లి వల్ల జెస్సీ ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యాడు. ఇక హమిదా పిల్లి వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వారం ఎలిమినేషన్‌కి నామినేట్ అయిన వారిలో రవి, మానస్, సరయూ, కాజల్, హమీదా, జెస్సీలు ఉన్నారు. మరి వీరిలో ఎమినేట్ అవుతారో తెలియాలంటే వీకెండ్ వరకు ఆగాల్సిందే. -
అదృష్టం వీరికి పిల్లి రూపంలో వచ్చింది !
Pregnant Cat Saved Video: మనం చేసే మంచి పని ఏదో ఓ రూపంలో మనకి సహాయపడుతుందంటారు. సరిగ్గా అలానే ఆపదలో ఉన్న ఓ పిల్లిని కొందరు మానవత్వం కాపాడారు. అదే వాళ్లకు అదృష్ట దేవతలా మారి 10 లక్షల రివార్డు వచ్చేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన ఇద్దరు వ్యక్తులు నసిర్ షిహాబ్, మహమ్మద్ రషిద్ దుబాయ్‌లో పని చేస్తున్నారు. నసిర్ బస్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా.. రషిద్ కిరాణ కొట్టుతో జీవనం సాగిస్తున్నారు. ఇటీవల ఓ భవనం రెండో అంతస్తు నుంచి పిల్లి కింద పడిపోయే ప్రమాదం ఉన్నట్లు రషిద్ గమనించాడు. నసిర్ కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నాడు. ఇక వెంటనే ఆ ఇద్దరూ పిల్లిని ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకున్నారు. దీంతో వారు పిల్లి సరిగ్గా కింద పడే ప్రాంతంలో బెడ్ షీట్‌ని పట్టుకుని నిలబడ్డారు. ఆ పిల్లికి పట్టు దొరకక.. రెండో అంతస్తు బాల్కనీ నుంచి నేరుగా వారి ఉంచిన ఆ బెడ్ షీట్లో పడి ప్రాణాలు దక్కించుకుంది. అయితే.. ఆ పిల్లి ప్రెగ్నెంట్‌గా ఉండటంతో.. దాన్ని కాపాడిన ఆ ఇద్దరు భారతీయులను, వారికి సహాయం చేసిన మరో ఇద్దరిని అక్కడి స్థానికులు మెచ్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను రషిద్.. తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో దుబాయ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చివరికి ఆ దేశ రూలర్షేక్ మహమ్మద్ బిన్ రషిద్ కంట పడింది. దీంతో షేక్ మహమ్మద్.. పిల్లిని కాపాడినందుకుగాను 10 లక్షల రివార్డును ప్రకటించాడు. ఆ ఇద్దరి భారతీయులతో పాటు ఈ రెస్క్యూ ప్లాన్‌లో సహకరించిన పాక్ దేశస్తుడైన అతీఫ్ మెహమూద్, మొరాకో సెక్యూరిటీ గార్డు అష్రఫ్ కూడా బహుమతులు అందించాడు. Proud and happy to see such acts of kindness in our beautiful city. Whoever identifies these unsung heroes, please help us thank them. pic.twitter.com/SvSBmM7Oxe— HH Sheikh Mohammed (@HHShkMohd) August 24, 2021 చదవండి: Bride Beats Groom Viral Video: పెళ్లిలో వరుడి చెంప చెళ్లుమనిపించిన వధువు.. అంతా షాక్! -
పిల్లి కూనలకు ప్రేమతో...
తల్లి లేని ఆ పిల్లి పిల్లలకు శునకమే తల్లైంది. జాతి వైరాన్ని మరిచి వాటి కి పాలిస్తూ.. ప్రేమను పం చుతోంది. విశాఖ పెదగదిలి ప్రాంతంలో ఓ పిల్లి రెండు వారాల కిందట నా లుగు పిల్లలకు జన్మని చ్చింది. అనారోగ్యంతో రెండు పిల్లలు, తల్లి మరణించాయి. మిగిలిన రెండు పిల్లి పిల్లలు రోడ్డు పక్కన రోజూ వచ్చి పడుకుంటున్న ఓ శునకం వద్దకు వెళ్లి పాలు తాగుతూ ఆకలి తీర్చుకుంటున్నాయి. – ఆరిలోవ (విశాఖ తూర్పు) -
టీవీలో అథ్లెటిక్స్ను చూసి రంగంలోకి దిగిన పిల్లి, ఫన్నీ వీడియో
ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్ జాతర కొనసాగుతోంది. ఎవరు నెగ్గుతున్నారు, ఏ దేశానికి పతకాలు ఎక్కువస్తున్నాయనేదే హాట్ టాపిక్‌గా మారింది. క్రీడలు మహారంజుగానే సాగుతున్నా.. స్టేడియాల్లో ప్రేక్షకులు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. అయితేనేం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ టీవీల ముందుకు చేరి తమకు నచ్చిన ఆటగాళ్ల ప్రదర్శనలను ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నారు. అయితే ఈ ఒలింపిక్స్ ఆటలు జనాలతో పాటు జంతువులను కూడా ఆకర్షిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. దీనికి నిదర్శనమే ఈ వీడియో. ఇది ఎక్కడ జరిగిందో తెలియరాలేదు గానీ నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది. ఇందులో టీవీ ముందు కూర్చున్న ఓ పిల్లి జిమ్నాస్ట్ ప్రదర్శనను ఆసక్తిగా తిలకిస్తోంది. టీవీలోని జిమాస్ట్ కదలికలకు అనుగుణంగా పిల్లి తన తలను కూడా మార్చుతుంది. అంతేగాక పిల్లి తన చేతులతో జిమ్నాస్ట్‌ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. రెండు చేతులను టీవీ మీదకు పెట్టి జిమ్నాస్ట్‌తోపాటు అటు ఇటు తిరుగుతుంది. 54 సెకన్ల నిడివిగల ఈ వీడియోను హ్యూమర్ అండ్ ఎనిమల్స్ అనే ట్విటర్ పేజ్ బుధవారం షేర్ చేసింది. ‘జిమ్నాస్టిక్‌ను చూస్తున్న పిల్లి. ఇప్పుడు ఇదే నా ఫేవరెట్’ అంటూ షేర్ చేసిన ఈ వీడియో ఇప్పటికే మిలియన్ వ్యూవ్స్‌ను సంపాదించింది. దీనిపై స్పందించిన నెటిజన్లు ‘పిల్లి జిమ్నాస్ట్ తన బ్యాలెన్స్ కోల్పోకుండా తనకు సాయం చేసేందుకు ప్రయత్నిస్తుంది.’ అంటూ ఫన్నీ కామెంట్ చేస్తున్నారు. cats watching gymnastics is my new favorite (teenybellinitheprettypittie IG) pic.twitter.com/aZjQBoqJBB — Humor And Animals (@humorandanimals) July 28, 2021 -
వైరల్: టీవీలో సీన్ చూసిన పిల్లి పరుగో.. పరుగు..!
Cat Funny Videos: టామ్ అండ్ జెర్రీ ఎపిసోడ్ సిరీస్ ఇష్టపడని వారుండరు. పిల్లల నుంచి పెద్దల వరకు ఏదో సమయంలో దానికి కనెక్ట్ అయ్యే ఉంటారు. అయితే తాగాజా టామ్ అండ్ జెర్రీ ఎసిసోడ్‌లోని ఓ సీను చూసిన పిల్లి భయంతో పరుగు లంకించుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో ఓ పెంపెడు పల్లి టామ్ అండ్ జెర్రీలోని సీన్ చూస్తుంది. దానిలో జెర్రీ నెత్తిపైన టామ్ ఓ మొట్టికాయ కొడుతుంది. దీంతో జెర్రీ చేయిని పెద్దగా చేసి టామ్‌ను ఓ గుద్దు గుద్దుతుంది. అంతే టామ్ ఎక్కడో పడుతుంది. అయితే టామ్ కొట్టినప్పుడు ఆసక్తిగా ముందుకు వచ్చి చూసిన పిల్లి.. టామ్‌ని జెర్రీ కొట్టగానే తర్రున భయంతో పారిపోతుంది. ఈ వీడియో మాజీ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు రెక్స్ చాప్మన్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. 1.2 మిలియన్లకు పైగా నెటిజనులు వీక్షించారు. వేల మంది లైక్ కొట్టి, కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘ ఇది ఓ ఎడిట్ చేసిన వీడియో. అక్కడ నిజంగా పిల్లి ఉండటంతో భయపడి పారిపోయింది.’’ అంటూ కామెంట్ చేశాడు. మరో నెటిజన్ ‘‘ ఏమైనప్పటికీ ఈ వీడియోను చూసిన వెంటనే.. నా పెదవులపై చిరునవ్వును చిందించాయి.’’ అంటూ రాసుకొచ్చారు. In case you could use a smile today… pic.twitter.com/4rXFuSGPIK — Rex Chapman🏇🏼 (@RexChapman) July 25, 2021 -
యజమాని ప్రాణాలను కాపాడిన పిల్లి.. నాలుగడుగుల పాముతో..
భువనేశ్వర్: సాధారణంగా కొంత మంది మూగజీవాలను ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే.. కుక్కలు, పిల్లులు.. తదితర జీవులను తమ ఇంట్లో పెంచుకొని కుటుంబంలో ఒకటిదానిలా చూసుకుంటారు. అవి మనుషుల కన్నా విశ్వాసంగా ఉంటాయని నమ్ముతుంటారు. అయితే, ఒక్కొసారి ఆ పెంపుడు జీవులు తమ యజమానికి ఏదైనా ఆపద సంభవిస్తే తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేసిన సంఘటనలు కొకొల్లలు. తాజాగా ఇలాంటి ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. భువనేశ్వర్‌లోని కపిలేశ్వర్కు చెందిన సంపద్ కుమార్ పరిడా ఒక పిల్లిని పెంచుకున్నారు. దాన్ని ప్రేమతో చినుఅని పిలుచుకునే వారు. దాన్ని తమ కుటుంబంలో ఒకదానిగా చూసుకునేవారు. ఒకటిన్నర సంవత్సరాలుగా పిల్లిని పెంచుకుంటున్నారు. అది ఇళ్లంతా తిరుగుతూ ఉండేది. ఈ క్రమంలో ఒకరోజు.. పెరడు నుంచి ఒక నాగుపాము ఇంట్లో ప్రవేశించడాన్ని చిను గమనించింది. వెంటనే అరుచుకుంటూ వెళ్లి పాముకు ఎదురుగా నిలబడింది. అంతటితో ఆగకుండా.. అరుస్తు పామును తన పంజాతో కొట్టసాగింది. పిల్లి అరుపులు విన్న సంపద్ కుమార్ అక్కడికి వెళ్లి చూశాడు. ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. అక్కడ నాలుగడుగుల పాముతో తమపిల్లి పోరాటం చేస్తుంది. అవి రెండు పరస్పరం దాడిచేసుకుంటున్నాయి. పాము ఎంత బుసలు కొడుతున్నా.. పిల్లి ఏమాత్రం వెనక్కు తగ్గడంలేదు. పామును చూసి భయపడిపోయిన సంపద్ వెంటనే స్నేక్ హెల్ప్ సోసైటీ వారికి ఫోన్ చేశాడు. ఈ క్రమంలో, దాదాపు అరగంట పాముని ఇంట్లో ప్రవేశించకుండా.. చిను పోరాటం చేస్తునే ఉంది. సంపత్ కుమార్ పిల్లి, పాముల పోరాటాన్ని తన మొబైల్లో ఫోటోలు తీసుకున్నాడు. కాసేపటికి అక్కడికి చేరుకున్న స్నేక్ సొసైటీవారు పామును పట్టుకుని అడవిలో వదిలేశారు. ఆ తర్వాత తన ఆ క్లిప్పింగ్‌లను తన ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఈ రోజు తాము ఉన్నామంటే దానికి తమ పెంపుడు పిల్లి చిను మాత్రమే కారణమని తెలిపాడు. దీంతో ఈ సంఘటన కాస్త వైరల్‌గా మారింది. -
పిల్లిని తెచ్చిస్తే.. రూ.30 వేలిస్తా
సుల్తాన్‌బజార్ (హైదరాబాద్): తాను ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న పిల్లి తప్పిపోవడంతో ఓ జంతు ప్రేమికురాలు కలత చెందారు. ఆచూకీ కోసం పోలీసులను ఆశ్రయించారు. వారు ఫిర్యాదు తీసుకోకపోవడంతో పిల్లి ఫొటోతో రోడ్డుపై కరపత్రాలు సైతం పంచారు. అయినప్పటికీ పిల్లి ఆచూకీ దొరకకపోవడంతో ఏకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. పిల్లి జాడ తెలిపిన వారికి నగదు రివార్డు సైతం ప్రకటించారు. టోలిచౌకీ ప్రాంతానికి చెందిన జరీనా 8 నెలల నుంచి ఓ పిల్లిని పెంచుకుంటున్నారు. దానికి జింజర్ అని పేరు కూడా పెట్టారు. జింజర్‌కు జూబ్లీహిల్స్‌లోని ట్రస్టీ పెట్ క్లినిక్‌లో జూన్ 17న కుటుంబ నియంత్రణ సర్జరీ చేయించారు. అనంతరం వాపు రావడంతో తిరిగి జూన్ 23న అక్కడికే తీసుకెళ్లారు. ఈ క్రమంలో క్లినిక్ నుంచి పిల్లి అదృశ్యమైంది. జూన్ 27న రాయదుర్గం పోలీసులను ఆశ్రయించగా వారు ఫిర్యాదు తీసుకోకపోవడంతో జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాలలో పిల్లి ఫొటోతో కరపత్రాలు కూడా పంచారు. 20 రోజులుగా తన పిల్లి జాడ దొరకడం లేదని, ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని జరీనా వాపోయారు. మంగళవారం హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన జరీనా, జింజర్ ఆచూకీ తెలిపిన వారికి రూ. 30 వేల రివార్డు ఇస్తానని, తను ప్రాణంగా పెంచుకుంటున్న జింజర్‌ను తెచ్చివ్వాలని కోరారు. -
పిచ్చెక్కిన పిల్లి.. అర్ధరాత్రి వీరంగం
కొమరాడ: విజయనగరం జిల్లా కొమరాడ మండలం దళాయపీట గ్రామంలో ఓ పిచ్చెక్కిన పిల్లి శనివారం అర్ధరాత్రి వీరంగం సృష్టించింది. గ్రామస్తులపై దాడి చేసి దొరికినవారినల్లా కరిచింది. పిల్లి కరవడంతో ఆర్.తవిటమ్మ, జి.లక్ష్మి, ఎం.శ్రీధర్, డి.రాములనాయుడు, ఎం.గౌరునాయుడు, ఎస్.లక్ష్మి, వలంటీర్ బి.దామోదర్‌నాయుడులు గాయపడ్డారు. వీరిని రాత్రికి రాత్రే గ్రామస్తులు 108లో చినమేరింగి సీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించారు. వీరిలో ఎం.శ్రీధర్ పరిస్థితి విషమంగా ఉండడంతో పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
'నా పెంపుడు పిల్లి ఒక దొంగ.. జాగ్రత్తగా ఉండండి'
ఒరేగాన్: సాధారణంగా ఇంట్లోకి ఎవరిని రానీయకుండా పెంపుడు కుక్కలను కాపలా పెట్టి 'కుక్క ఉంది జాగ్రత్త' అని బోర్డు తగిలించడం గమనిస్తుంటాం. కానీ అమెరికాకు చెందిన ఒక మహిళకు తన పెంపుడు పిల్లి చర్యలు పెద్ద తలనొప్పిగా మారాయి. ఇంట్లోని వస్తువులు ఆమెకు తెలియకుండానే తీసుకెళ్లడం మొదలు పెట్టింది. అలా చేతికి వేసుకునే గ్లౌజులు, మాస్క్‌లు పిల్లి నోట కరచుకొని పక్కింట్లో పడేయడం గమనించింది. దీంతో ఎలాగైనా పిల్లిని కట్టడి చేయాలని సదరు యజమాని ఒక కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. తన ఇంటి వరండా భాగంలో ''నా పెంపుడు పిల్లి ఒక దొంగ.. దానితో జాగ్రత్తగా ఉండండి.'' అని బోర్డు తగిలించింది.ఒకవేళ పిల్లి వస్తువులను దొంగతనంగా తీసుకెళ్లినా.. పక్కింటివాళ్లు ఇంటి బయట ఉన్న బోర్డును గమనించి వస్తువులు ఆమెకు తిరిగి ఇవ్వడం ప్రారంభించారు.కాగా పెంపుడు పిల్లిపై మహిళ ప్లాన్ వర్క్‌వుట్ కావడంతో మిగతావాళ్లు కూడా అదే పనిలో పడ్డారు. దీనికి సంబంధించిన ఫోటో ట్విటర్లో షేర్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. చదవండి: వైరల్ వీడియో: మెట్రో ఎక్కిన కోతి.. మరి టికెట్ ఏది? 10 అంతస్తుల భవనం.. 28 గంటల్లో నిర్మాణం Sign of the day. pic.twitter.com/fgr0vC4Z0O — Dick King-Smith HQ (@DickKingSmith) June 10, 2021 -
‘ఎరక్కపోయి వచ్చాను.. ఇరుక్కుపోయాను’
మహానంది: ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అన్న చందంగా ..ఓ పిల్లి కూన మహానందిలోని రామాలయం హుండీలోకి దూరింది. అందులో నుంచి బయటికి రాలేకపోయింది. శుక్రవారం ఉదయం విధులకు వచ్చిన అర్చకులు గుర్తించి విషయాన్ని ఈఓ మల్లికార్జున ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు. దేవదాయశాఖ నిబంధనల ప్రకారం హుండీల తాళాలు ఒకసెట్ దేవస్థానం వారి వద్ద, మరో సెట్ కర్నూలులోని ఏసీ కార్యాలయంలో ఉంటాయి. దీంతో ఈఓ విషయాన్ని ఏసీ దృష్టికి తీసుకెళ్లడంతో దేవదాయశాఖ నంద్యాల డివిజన్ ఇన్స్పెక్టర్ కిరణ్‌కుమార్‌రెడ్డి కర్నూలుకు వెళ్లి తాళాలు తీసుకొచ్చారు. అనంతరం ఈఓ సమక్షంలో సాయంత్రం 3.45 గంటల ప్రాంతంలో హుండీ తాళాలు తెరచి పిల్లిపిల్లను బయటికి తీశారు. బయటికి వచ్చి వెంటనే అది తల్లి వద్దకు పరుగుపెట్టుకుంటూ వెళ్లింది. చదవండి: మాయమాటలతో బాలికను లొంగదీసుకుని.. విషాదం: కన్నీరే మిగిలిందిక నేస్తం! -
బహుశా ఈ పిల్లికి భయానికి మీనింగ్ తెలియదు అనుకుంటా ..!
మనలో చాలా మందికి పాములంటే సచ్చేంతా భయం. అవి మనకు కనిపించగానే వెన్నులో వణుకు పుడుతుంది. కాగా ఓ పిల్లి మాత్రం ఎలాంటి జంకు లేకుండా తీక్షణంగా పామునే చూసింది. దీంతో పాము మెరుపు వేగంతో పిల్లిపై దాడికి యత్నించగా.. పిల్లి రెప్పపాటు క్షణంలో దాడి నుంచి తప్పించుకుంది. ప్రస్తుతం ఈ వీడియోను ఒడిశాకు చెందిన ఓ నెటిజన్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్లను ట్యాగ్ చేస్తూ ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. Heart trembling scene.@ParveenKaswan@susantananda3 pic.twitter.com/ikclMTjCN0 — 𝗥𝗮𝗯𝗶𝗻𝗱𝗿𝗮 𝗠𝗶𝘀𝗵𝗿𝗮🇮🇳 (@CMRabindra) June 7, 2021 -
గొర్రెకు మసాజ్ చేస్తున్న పిల్లి
-
Viral Video: గొర్రెకు మసాజ్ చేస్తున్న పిల్లి
పిల్లి ఏం చేసినా క్యూట్‌గా ఉంటుందంటారు క్యాట్ లవర్స్. కానీ దొంగలా పాలు తాగి ఏమీ ఎరగనట్టు నటించే ఆ మూగజీవిని చూస్తే చిర్రెత్తిపోతారు మరికొందరు. అయితే ఇక్కడ మాత్రం ఓ పిల్లి ఎలాంటి దొంగ వేషాలు వేయకుండా ఓ గొర్రెకు మసాజ్ చేసి నిద్ర పుచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇందులో గొర్రె , పిల్లి మంచి ఫ్రెండ్స్‌గా మారాయి. గొర్రె కింద పడుకుంటే పిల్లి దాని వీపు మీద ఎక్కింది. ఏదో పరుపుపై పడుకున్నట్లుగా హయిగా అక్కడే సెటిలైంది. అంతటితో ఆగకుండా అది గొర్రెకు మసాజ్ చేయడం మొదలు పెట్టింది. పిల్లి తన రెండు కాళ్లతో గొర్రెను పైకి కిందకు నొక్కుతుంటే అది హాయిగా పడుకుంది. నిండుగా ఉన్న గొర్రె బూరులో పిల్లి తల దూర్చి మరీ పడుకుంది. ఇంత జరుగుతున్నా గొర్రె మాత్రం ఎటూ కదలకుండా నిద్రలో మునిగిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'పిల్లి ఎంత బాగా మసాజ్ చేస్తుంది', 'గొర్రె అలసిపోయిందేమో.. కనీసం లేవడం లేదు', 'అది పిల్లి చేస్తున్న మసాజ్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లుంది', 'పిల్లి మాకు కూడా మసాజ్ చేస్తుందా..' అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. -
పాముతో ఆడుకుంటున్న పిల్లి
-
పాముతో ఆడుకుంటున్న పిల్లి.. ఫన్నీ వీడియో..
ఒక పిల్లి చెట్ల మధ్యలో ఉన్న ఒక పాత బస్సు సీటు మీద నిద్రపోతుంది. వేటాడి అలిసిపోయిందో, ఏమోగానీ గట్టిగా కళ్లుమూసుకుని, వెల్లకిలా పడుకుంది. మధ్యమధ్యలో అటూఇటూ తిరుగుతూ ఒళ్లు విరుస్తోంది. ఈ క్రమంలో.. ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు కానీ ఒక పాము అక్కడ ప్రత్యక్షమైంది. అది నెమ్మదిగా పిల్లి మీద పాకడం మొదలుపెట్టింది. అయితే, మంచి నిద్రలో ఉన్న పిల్లి.. శరీరం మీద ఏదో కదులుతున్నా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇంకా తన శరీరం మీద ఏదో కదులుతూ సౌండ్ వినిపించేసరికి మెల్లగా కళ్లు తెరచింది. తన శరీరం మీద పాకుతున్నది ఏంటబ్బా అని గమనించి చూసింది. అంతే, దాని గుండె ఝల్లుమంది. అక్కడుంది ఏదో తాడు కాదు.. ఒక పాము.. వెంటనే షాక్‌కు గురైన పిల్లి, గాలిలోకి ఎగిరి అక్కడి నుంచి పారిపోయింది. ఈ ఫన్నీ వీడియో జనాలకు నవ్వు తెప్పిస్తోంది. దీన్ని చూసిన నెటిజన్లు.. పాపం.. పిల్లి నిద్రను పాము చెడకొట్టిందని అంటున్నారు. మరికొందరేమో వావ్.. పిల్లి గాల్లో బంతిలాగా ఎగిరిందని, పిల్లికి ఇంకా భూమి మీద నూకలున్నాయని సరదాగా కామెంట్లు పెడుతున్నారు. -
పిల్లి తోక కత్తిరించారు.. వారిని అరెస్ట్ చేయండి
ముంబై: మూగజీవాలను హింసిస్తే నేరమనేది అందరికీ తెలుసు. అయినా కూడా వాటిపై వేధింపులకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా కొందరు ఓ పిల్లి తోక కత్తిరించడంతో ఓ జంతు ప్రేమికుడు తల్లడిల్లిపోయాడు. వెంటనే వైద్యం అందించి నేరుగా పోలీస్‌స్టేషన్ చేరుకున్నాడు. పిల్లి తోక కత్తిరించిన వారిపై చర్యలు తీసుకోవాలని అతడు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ముంబైలోని మలాడ్ పశ్చిమ ప్రాంతంలో అజయ్ షా నివసిస్తున్నాడు. అతడు జంతు ప్రేమికుడు. అతడి ఇంటికి రోజూ ఓ పిల్లి వస్తుండడంతో దానికి ఆహారం అందిస్తూ ప్రేమగా చూసుకుంటున్నాడు. అయితే ఆదివారం (మే 2) మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఆ పిల్లి తీవ్ర గాయాలతో ఇంటికి వచ్చింది. దాన్ని చూసి అజయ్ ఆందోళన చెందాడు. పిల్లిని పరిశీలించగా తోక మొత్తం ఎవరో కత్తిరించి ఉంది. వెంటనే ఆ పిల్లిని ఎవర్షైన్నగర్లోని వెటర్నరీ క్లినిక్‌కు వెళ్లాడు. అక్కడ దానికి చికిత్స అందించారు. అయితే పిల్లి తోకను పదునైన ఆయుధంతో కత్తిరించారని అక్కడి సిబ్బంది తెలిపారు. అయితే పిల్లి తోకను ఎవరో ఉద్దేశపూర్వకంగా కత్తిరించాడని భావించి మలాడ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పిల్లి తోక కత్తిరించిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు అందించాడు. ఈ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఆయన నివసిస్తున్న ప్రాంతాలను సీసీ ఫుటేజీలో పరిశీలిస్తున్నారు. పిల్లి తోక కత్తిరిస్తున్న వారిపై జంతు క్రూరత్వ నిరోధక చట్టం (సెక్షన్ 428) కింద కేసు నమోదైంది. చదవండి: తొలిసారి గిరిజన ఎమ్మెల్యేకు సోకిన కరోనా చదవండి: డీఎంకే విజయంలో ‘ఇటుక’దే కీలక పాత్ర -
‘మాకంటే మీరే నయం’: పొడిచి పొడిచి తరిమేశాయి
కలిసి ఉంటే కలదు సుఖం, ఐకమత్యమే మహాబలం అనే సామెతలు మన దగ్గర చాలా ప్రసిద్ధి. ఒంటరిగా సాధించలేని కార్యాన్ని, లక్ష్యాన్ని ఐకమత్యంతో సాధించవచ్చని చెప్పే కథలు కోకొల్లలు. చిన్నప్పుడు మనం చదవుకున్న ఎద్దు, సింహం కూడా ఈ కథ కూడా ఈ కోవలోకే వస్తుంది. తాజాగా ఐకమత్యం గొప్పతనాన్ని చాటే సంఘటన ఒకటి వాస్తవంగా చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. తమ మిత్రుడిపై దాడి చేయడానికి వచ్చిన పిల్లిని కోడిపెట్టలు పొడిచి పొడిచి మరి తరిమాయి. వీటి ఐకమత్యాన్ని చూసిన నెటిజనలు తెగ సంబరపడుతున్నారు. మా కంటే మీరే నయం అంటూ ప్రశంసిస్తున్నారు. రెండు నెలల క్రితం నాటి ఈ వీడియో తాజాగా మరోసారి వైరలవుతోంది. ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనే వివరాలు తెలియవు. ఇక వీడియోలో పొలంలో ఒంటరిగా తిరుగుతున్న ఓ కోడిపెట్టను పిల్లి గమనిస్తుంది. ఒంటరిగా బలే చిక్కింది.. ఈ రోజు నాకు పండగే అని సంబరపడుతూ కోడి మీద దాడి చేయడానికి వస్తుంది. అయితే మిత్రుడికి వచ్చిన ఆపద చూసి మిగతా కోడి పెట్టలు అలర్ట్ అవుతాయి. పోలోమంటూ వచ్చి.. పిల్లిపై దాడి చేస్తాయి. ఊహించని ఈ ఘటనకు బిత్తరపోయిన పిల్లి నెమ్మదిగా అ్కడ నుంచి జారుకుంటుంది. చదవండి: ఇలాంటి ఏప్రిల్ ఫూల్‌ని ఎక్కడా చూసుండరు -
వైరల్: పిల్లి పిల్లను కిడ్నాప్ చేసిందిరోయ్
సాక్షి, నల్గొండ : జాతి భేదం మరిచి తన పిల్ల అనుకుని పిల్లి పిల్లను వెంటేసుకుని తిరుగుతోంది ఓ కోతి. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో ఓ కోతికి పుట్టిన పిల్ల చనిపోయింది. దీంతో ఆ తల్లి కోతి ఓ గ్రామస్తుడు పెంచుకుంటున్న పెంపుడు పిల్లి పిల్లను ఎత్తుకొని పోయింది. రెండు రోజుల నుంచి ఆ పిల్లి పిల్లను వదలకుండా తనతోనే ఉంచుకుంటోంది. చదవండి: పులికి చుక్కలు చూపించిన కోతి.. వీడియో వైరల్ -
ఇలాంటి ఏప్రిల్ ఫూల్‌ని ఎక్కడా చూసుండరు
ఈ రోజు ఏప్రిల్ ఫస్ట్.. ఫూల్స్ డే. చిన్న చిన్న అబద్ధాలు చెప్పి స్నేహితులను ఫూల్స్ చేసి తెగ సంబరపడతాం. ఈ రోజు ఫూల్స్ డే అని మనకు తెలుసు కనక.. సరదగా ఆటపట్టిస్తాం. మరి ఈ పిట్టకు ఈ రోజు ఫూల్స్ డే అని తెలిసి ఇలా చేసిందో.. లేక ప్రాణం కాపాడుకునే ప్రయత్నమో తెలియదు కానీ ఏకంగా పిల్లితోనే ప్రాంక్ చేసింది. సమయం చూసుకుని తుర్రుమని ఎగిరిపోయింది. పిట్ట తెలివికి అవాక్కయిన పిల్లి దాన్ని పట్టుకునే ప్రయత్నం చేసింది కానీ అది విఫలమయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద తన ట్విట్టర్లో షేర్ చేసిన ఈ వీడియో కడుపుబ్బ నవ్వించడం ఖాయం. ఏప్రిల్ ఫూల్ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియోలో పిల్లి కాళ్ల కింద ఓ పిట్ట వుంటుంది. చూడ్డానికి అది మరణించనట్లు ఉంటుంది. దాంతో పిల్లి దాన్ని నేల మీద అటూ ఇటూ దొర్లిస్తూ ఆడుతూ ఉంటుంది. సమయం చూసుకుని ఆ పిట్ట ఒక్క ఉదుటున అక్కడ నుంచి తుర్రుమంటుంది. ఊహించని ఈ ఘటనకు షాక్ తిన్న పిల్లి.. పిట్టను పట్టుకునే ప్రయత్నం చేస్తుంది.. కానీ అప్పటికే అది అందనంత దూరం వెళ్లి పోతుంది. April fool😊 pic.twitter.com/2lbUAkhzP1 — Susanta Nanda IFS (@susantananda3) April 1, 2021 ఇక ఈ వీడియో చూసిన నెటిజనులు పిట్ట తెలివిని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. ఇది మన కంటే స్మార్ట్.. తెలివైన పిట్ట గెలిచింది.. అతి విశ్వాసం ఉన్న పిల్లి ఓడింది అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: పులా.. పిల్లా.. ఎందుకిలా చేస్తోంది? -
వైరల్: చిన్నారిని హెచ్చరిస్తున్న పిల్లి
సాధారణంగా పిల్లల ప్రతి అడుగును గమనిస్తూ తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకుంటారు. చిన్నారులు చేసే అల్లరిని హెచ్చరిస్తుంటారు. అయితే పిల్లలకు ఎదురుగా గొడ కనిపిస్తే చాలు అది ఎక్కాలనో లేక దాని నుంచి కిందకు చూడటానికి ఆసక్తి చూపుతారు. అలాంటి సమయంలో పెద్దలు వారిని గట్టిగా వారిస్తుంటారు. అయితే ఇక్కడ ఓ పెంపుడు పిల్లి ఆ బాధ్యతను తీసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ చిన్నారినే గమనిస్తూ అతడు వేసే తప్పటడుగులను వారిస్తూ కాపాలాగా ఉన్న ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ది ఫీల్ గుడ్ అనే ట్విటర్ పేజీలో ‘అతని రక్షణ దేవత’ అంటూ షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటి వరకు వేలల్లో లైక్స్.. వందల్లో కామెంట్స్ వచ్చాయి. ఇప్పటికీ వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది. ‘ఆ చిన్నారి భయంకరమైన ప్రమాదం బారిన పడకుండా హెచ్చరించడంలో తల్లిదండ్రుల కంటే ఎక్కువ బాధ్యత ఈ పిల్లి తీసుకుంటోంది’ (చదవండి: యజమాని కోసం 6 రోజులు ఆసుపత్రి బయటే..) ‘ఈ వీడియో చూడటానికి ఎంత అందంగా ఉంది’, మనుషుల కంటే జంతువులే మేలు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా 50 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో ఓ చిన్నారి ఇంటి బాల్కానీ వద్ద నిలుచుని ఉన్నాడు. అతడి పక్కనే ఆ ఇంటి పెంపుడు పిల్లి బాలుడిని గమనిస్తూ ఉంది. అతడు బాల్కానీ గోడ పట్టుకుని పైకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకోసం అతడు గోడ అంచును పట్టుకోవడానికి చేతులు పైకి చాస్తుండగా ఆ పిల్లి వద్దన్నంటు వారిస్తోంది. అయినప్పటికి అతడు దానికి దూరంగా జరుగుతూ గోడ పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పిల్లి అతడికి దగ్గరగా వెళుతూ చిన్నారిని వారిస్తూనే ఉంది. చివరకు ఆ బాలుడు గోడ పట్టుకొకుండా అడ్డుగా వచ్చి నిలుచుంది. (చదవండి: 'పొట్ట పెంచుదాం'.. వైరల్‌గా మారిన రెస్టారెంట్) -
నువ్వు కొరికితే నేను కూడా కొరుకుతా
న్యూజెర్సీ : పిల్లుల పెంపకం అంటే అంత వీజీ కాదు! అవి చేసే అల్లరి మనకు ముద్దుగా అనిపించినా.. కొన్ని సార్లు పంజా విసిరి మన రక్తం కళ్ల చూస్తాయి. న్యూజెర్సీకి చెందిన షర్లిన్ కన్సుయేగ్రా అనే మహిళకు అలాంటి పరిస్థితే ఎదురైంది. తన పెంపుడు పిల్లి గోర్లతో చేయిపై చీరింది. దీంతో ఆమె దాన్ని గోర్లు కత్తిరించటానికి పూనుకుంది. పిల్లికి గోర్లు కత్తిరిస్తున్న దృశ్యాలను వీడియో తీసింది. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ నువ్వు నన్నెంత కొరికినా లెక్కచేయను. నువ్విలాగే బరుకుతూ ఉంటే నీ గోళ్లను కత్తిరిస్తూనే ఉంటా(చేతిలో గాట్లు చూపిస్తూ). నీకు బరకటం ఇష్టమా?. ( కాపాడాడు, కానీ చెంప చెళ్లుమనిపించాడు) నీకేం కాదు. నాకు తెలుసు. నువ్విలా బరుకుతూ.. బరుకుతూ ఉంటే ఇలానే చేస్తుంటా. (పిల్లి పళ్లు చూపెడుతూ ‘హిస్స్’ అంటుంది. ఆమె కూడా హిస్స్ అంటుంది. ఆవెంటనే.) నేను కూడా నీలాగా అనగలను. నువ్వు నన్ను కొరికితే నేను కూడా నిన్ను కొరుకుతా’’ అంటూ పిల్లిని భయపెట్టి దాని గోళ్లను కత్తిరించింది. ఈ వీడియోను తన ఫేస్బుక్ ఖాతాలో షేర్ చేసింది. దీంతో వీడియో కాస్తా వైరల్‌గా మారింది. -
అదృష్టం: చెత్త కుప్పనుంచి మంత్రి ఆఫీసుకు..
మాస్కో : అదృష్టం తనకు పడిశం పట్టినట్లు పడుతుందని ఆ పిల్లి కల్లో కూడా ఊహించి ఉండదు. అదృష్టం అదుండే చెత్త కుప్పను తట్టి రాజ భోగాల్ని అందించింది. చెత్త కుప్పలో కుక్క! చావు చావాల్సిన అది మంత్రి ఆఫీసుకు చేరింది. సోషల్ మీడియా సెలెబ్రిటీ అయింది. వివరాలు.. గత సోమవారం రష్యాలోని ఉలియానోవ్స్క్లలో మున్సిపాలిటీ సిబ్బంది ఒకరు చెత్తను క్రష్(ముక్కలు ముక్కలుగా) చేసే యంత్రం దగ్గర ఉన్నాడు. ఓ తెల్లటి ప్లాస్టిక్ కవర్ కదలటం అతడు గమనించాడు. దాన్ని తెరిచి చూడగా అందులో ఓ పిల్లి కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు టీవీలో, సోషల్ మీడియా బాగా వైరలయ్యాయి. (నవ్వు తెప్పిస్తున్న ప్రాంక్ వైరల్ వీడియో) దీంతో అక్కడి పర్యావరణ మంత్రిత్వ శాఖ దాన్ని దత్తత తీసుకుంది. అనధికారికంగా దానికి పర్యావరణ శాఖ ఉప మంత్రి హోదాను కల్పించింది. మంత్రి గుల్నారా కఖ్మతులిన అది మంత్రి ఆఫీసులోని కుర్చీలో నిద్రపోతున్న, తిరగాడుతున్న ఫొటోలను షేర్ చేశారు. దానికి పేరు పెట్టడానికి ఓ కంటెస్ట్‌ను కూడా పెట్టారు. మంత్రి మాట్లాడుతూ.. ‘‘ పిల్లులు పెంచుకునే యజమానులే వాటి బాధ్యత వహించాలి. మీరు వాటిని సరిగా చూసుకోలేకపోతే.. మంచిగా పెంచుకునే వారికి అప్పజెప్పండి’’ అని తెలిపారు. -
ఈ పిల్లిని పట్టిస్తే రూ.15 వేలు మీ సొంతం
గోరఖ్‌పూర్: అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పెంపుడు జంతువు మాయమైతే కలిగే బాధ వర్ణనాతీతం. ఏం చేసైనా సరే దాని జాడ కనుక్కోవాలని దగ్గరలోని సందుల్లో దూరి, పక్కింట్లోకి తొంగి చూసి వీలైనన్ని చోట్లా వెతుకుతాం. అయినా ఆ జంతువు కనిపించకపోతే గుండె బరువెక్కి అన్నం కూడా సహించదు. ఇలాంటి బాధలోనే కూరుకుపోయారు ఓ మహిళ. భారత్‌లోని మాజీ ఎన్నికల అధికారి ఎస్‌వై ఖురేషీ భార్య, నేపాల్‌లోని మాజీ ఎన్నికల అధికారిణి ఇల శర్మ పిల్లిని పెంచుకుంటున్నారు. అది క్షణం కనిపించకపోయినా అల్లాడిపోయేవారు. ఎక్కడికెళ్లినా దాన్ని వెంటబెట్టుకు వెళ్లేవారు. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్లో బుధవారం రాత్రి ఆమె తన కూతురు సాచి, డ్రైవర్ సురేందర్‌తో పాటు, తన పెంపుడు పిల్లితో సహా ఢిల్లీ వెళ్లే రైలు కోసం ఎదురు చూస్తున్నారు. (చదవండి: ఈ నెలలో ఇదే పెద్ద జోక్!) ఇంతలో రైలు పెద్ద శబ్ధంలో కూత పెట్టుకుంటూ రావడంతో బెంబేలెత్తిన పిల్లి అక్కడనుంచి పరిగెత్తింది. అలా భయంతో తప్పిపోయిన మార్జాలం కోసం ఎంత వెతికినా దాని జాడ కానరాలేదు. దీంతో ఆకుపచ్చని కళ్లు, ముక్కు మీద గోధుమ రంగు మచ్చ ఉండి రెండున్నరేళ్ల వయసున్న పిల్లి తప్పిపోయిందని, కనిపిస్తే తిరిగి ఇవ్వాలంటూ ఆమె రైల్వే స్టేషన్లోనే కాకుండా నగరంలోనూ పోస్టర్లు అతికించారు. తన పిల్లిని తెచ్చిచ్చిన వారికి 11 వేల రూపాయల రివార్డు ప్రకటించారు. ఆ తర్వాత దాన్ని రూ.15 వేలకు పెంచారు. రోజులు గడుస్తున్నా పిల్లి తిరిగి తన చెంతకు రాకపోవడంతో ఆమె తన ఢిల్లీ ప్రయాణాన్ని మానుకుని గోరఖ్‌పూర్‌లోనే ఉండి దాన్ని వెతికే పనిలో పడ్డారు. (చదవండి: వైరల్ వీడియో: ఏంటీ ‘పులి’తోనే ఆటలా?!) -
అప్పులపాలై ఇంటికి తిరిగొచ్చిన పిల్లి!
బ్యాంకాక్ : మూడు రోజుల పాటు కనిపించకుండా పోయిన ఓ గండు పిల్లి అప్పులపాలై ఇంటికి చేరుకున్న వింత సంఘటన థాయ్‌లాండ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. థాయ్‌లాండ్‌కు చెందిన ఓ వ్యక్తి పెంచుకుంటున్న పిల్లి కొద్దిరోజుల క్రితం ఇంటినుంచి కనిపించకుండా పోయింది. మూడు రోజుల తర్వాత క్షేమంగా ఇంటికి తిరిగివచ్చింది. అయితే దాని మెడలో ఓ ట్యాగ్‌ను యజమాని గుర్తించాడు. ‘‘ మీ పిల్లి మా షాపు దగ్గరకి వచ్చి మాకెరల్స్(తినుబండారం)పై కన్నేసింది. దీంతో నేను దానికి ఓ మూడు మాకెరల్స్ ఇచ్చాను’’ అని రాసి ఉంది. ( పిచ్చి ప్రయోగాలకు పోతే జరిగేది ఇదే ) ‘ఆంటీ మే’ అనే వ్యక్తి ఆ ట్యాగ్‌ను తగిలించి దాని మీద తన అడ్రస్‌ను కూడా రాశాడు. పిల్లి అప్పు కథను ‘చంగుపుఆక్సియామ్’ అనే ఫేస్బుక్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘మూడు రోజులు కనిపించకుండా పోయింది. అప్పుల్తో తిరిగొచ్చింది. ఎలా ఉంది?’ అనే శీర్షిక జోడించారు. ఈ వార్త సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు పిచ్చ కామెడీగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
వర్షం లేదు..మరి వరద ఎలా వచ్చింది!
జాస్మిన్ స్టార్క్(26) అనే మహిళ షాపింగ్ చేసేందుకు బయటకు వెళ్లింది. అయితే ఎప్పుడు వెంట తీసుకెళ్లే తన పెంపుడు పిల్లి అంబర్‌ను ఆరోజు మాత్రం ఇంట్లోనే వదిలివెళ్లింది. యజమాని తనని తీసుకెళ్లలేదనే కోపంతో అంబర్ ఒక తుంటరి పని చేసింది. మెల్లిగా బాత్రూంలోకి వెళ్లిన అంబర్ సింక్ మీదకు వెళ్లి కుళాయి ఆన్చేసింది. ఆ తర్వాత సింక్‌లోని ప్లగ్హోల్ను సబ్బుతో మూసేసింది. ఇంకేముంది నీరంతా సింక్‌లో నుంచి గది మొత్తం నిండిపోయి.. ఆ నీరంతా పైకప్పు నుంచి కింది ప్లోర్‌కు జాలువారింది. (చదవండి : ఒక్క పనితో రియల్ హీరో అనిపించుకున్నాడు) షాపింగ్ ముగించుకొని ఇంటికి వచ్చిన జాస్మిన్ స్టార్క్ ఇంటి డోర్ ఓపెన్ చేయగానే ఒక్కసారిగా షాక్‌కు గురయ్యింది. అసలు ఈ నీళ్లు ఎలా వచ్చాయో మొదట జాస్మిన్‌కు అర్థం కాలేదు. ఆ తర్వాత ఆలోచించి చూస్తే తన పెంపుడు పిల్లి అంబర్ ఈ తుంటరి పని చేసిందని ఆమె గ్రహించింది. బాత్రూంలోకి వెళ్లి చూసేసరికి జాస్మిన్‌కు అక్కడ అంబర్ కనిపించింది. దీంతో వెంటనే కుళాయిని కట్టేసి నీరును మొత్తం బయటికి ఎత్తి పోసింది. అయితే నీరుతో ఇంట్లోని పలు విలువైన వస్తువులు పాడైపోయాయి. అంబర్ చేసిన అల్లరి పని వల్ల జాస్మిన్‌కు దాదాపు వేల పౌండ్ల నష్టం కలిగించింది. అయితే దీనిపై జాస్మిన్ స్పందిస్తూ.. 'ఇంకా నయం.. షాపింగ్ వెళ్లి తొందరగా వచ్చాను కాబట్టి సరిపోయింది..లేకపోతే నా ఇల్లు మొత్తం నీటిపాలయ్యేది’ అని చెప్పుకొచ్చింది. కాగా ఈ వీడియోను జాస్మిన్ తన ట్విటర్లో షేర్ చేయగా వైరల్‌గా మారింది. Anyone ever had to ring their boss and say they can’t work cause their cat flooded the house, or just me? pic.twitter.com/lIi5bgpTVc — Jasmin Stork (@JasminStork) October 8, 2020 -
ఈ పిల్లి ఎంతకీ దొరికి చావట్లేదే!
పిల్లి, మనుషుల పెంపుడు జంతువు. కొందరికి పిల్లి అంటేనే గిట్టదనుకోండి, అది వేరే విషయం. ప్రపంచవ్యాప్తంగా 33 రకాల జాతుల పిల్లులున్నాయి. కానీ ఏ జాతి పిల్లికైనా మనిషికి తగ్గట్టు నడిచే స్వభావం పుట్టుకతోనే ఉంది. యజమానుల ముందు అమాయకంగా ఉంటూ, గెంతులేస్తుంటాయి. ఇతరుల ముందు రాజసంగా నడుస్తూ తిక్క వేషాలు కూడా వేస్తుంటాయి. దొంగలా పక్కింట్లోకి దూరి పాలు తాగి ఏమీ ఎరగనట్టుగా నటిస్తాయి. ఇంతకీ ఈ పిల్లి గోలంతా ఎందుకనుకుంటున్నారా? మరేం లేదు. పైన ఫొటోలో ఓ పిల్లి దాగుంది. మీకు దొరకనంటూ సవాలు విసురుతోంది. ఎక్కడ దాగున్నానో మీరు కనుక్కోలేరని వెక్కిరిస్తోంది. (చదవండి: బ్లూ స్నేక్.. కనిపించేంత సాఫ్ట్ కాదు సుమీ..) ఆ మార్జాలాన్ని పట్టేసుకుందామని ఎందరో నెటిజన్లు ప్రయత్నిస్తున్నారు. కొందరు అసలు ఆ గదిలో పిల్లి ఉందా? అని అనుమానం వ్యక్తం చేస్తుండగా మరికొందరు వెతకలేక చస్తున్నాన్రా దేవుడా అని కామెంట్లు పెడుతున్నారు. అతి కొద్ది మంది మాత్రం పావుగంట తర్వాత అది పట్టుబడిందోచ్ అని సంబరపడుతున్నారు. అది మామూలు పిల్లి కాదని, నల్ల పిల్లి అని చెప్తున్నారు. దాన్ని రాత్రిపూట చూస్తే భయంతో చచ్చిపోతారని కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ మీకు ఆ పిల్లి కనిపించిందా? లేదా? దొరక్కపోతే ఆ మార్జాలాన్ని కింద ఫొటోలో చూసేయండి. (చదవండి: వార్నీ, పిల్లి డ్రామా మామూలుగా లేదు) -
కొత్త ఫ్రెండ్ తిరిగొచ్చాడు: సచిన్
ముంబై: కరోనా కోరలు చాస్తుండటంతో చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. ముఖ్యంగా సెలబ్రిటీలు రాకరాక వచ్చిన అవకాశం అంటూ ఖాళీ సమయాన్ని ఫ్యామిలీతో గడుపుతున్నారు. కొత్త కొత్త వంటకాలు ప్రయత్నిస్తున్నారు. పెంపుడు జంతువులతో ఆటలాడుతూ సరదా వీడియోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. క్రికెట్ లెజెంట్ సచిన్ టెండూల్కర్ ఇన్‌స్టాలో తాజాగా షేర్ చేసిన ఓ వీడియో అభిమానులను తెగ అలరిస్తోంది. ‘నా కొత్త స్నేహితుడు తిరిగొచ్చాడు. క్రితం సారి నుంచి వీడు వడా పావ్ మిస్ అయినట్టుగా కనిపిస్తోంది’అంటూ సచిన్ పెంపుడు పిల్లి వీడియోను షేర్ చేశాడు. అంతకుముందు సచిన్ వడా పావ్ తయారు చేశాడు. తన ఫేవరెట్ ఫుడ్ ఇదేనంటూ ఇన్‌స్టా పోస్టులో పేర్కొన్నాడు. వడా పావ్ కోసం ఓ అతిథి నక్కినక్కి చూస్తోందని పెంపుడు పిల్లిని ఉద్దేశించి ఫోటో కూడా షేర్ చేశాడు. ఇప్పుడు అదే పిల్లిని ఉద్దేశించి అభిమానులతో పంచుకున్నాడు. మామిడి పళ్లతో కుల్ఫీ ఎలా తయారు చేయాలో కూడా సచిన్ ఇటీవల ఓ పోస్టులో పేర్కొన్నాడు. ఇక సచిన్ ముచ్చటైన పోస్టులతో అభిమానులు సంబరపడిపోతున్నారు. కాగా 1989లో క్రికెట్లో అడుగుపెట్టిన సచిన్ టెండూల్కర్ 2013లో రిటైర్ అయిన సంగతి తెలిసిందే! (చదవండి: షార్జా స్టేడియాన్ని చుట్టేసిన దాదా) View this post on Instagram My new friend is back! Looks like he's missing the Vada Pav from the last visit. 😋 A post shared by Sachin Tendulkar (@sachintendulkar) on Sep 15, 2020 at 12:45am PDT -
పిల్లిని పెంచుకుంటే ఎన్ని లాభాలో!..
‘నాకు పిల్లిని కొనివ్వండి’ అని అడగటానికి ఓ చిన్నారి చేసిన ప్రయత్నం నెటిజన్లనే కాదు, టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ను కూడా మెప్పించింది, ఒప్పించింది. కావాల్సింది దక్కించుకోవటానికి మారాం చేయాల్సిన వయస్సులో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అందరినీ వ్వాహ్వా అనిపించింది. క్రిస్టోఫర్ డోయ్లే అనే వ్యక్తి తన కూతరు పిల్లిని కొనివ్వండి అని అడగటానికి చేసిన పీపీటీ ప్రయత్నాన్ని ఈ నెల 25న తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘మా కూతురు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేసింది’ అంటూ శీర్షికను జోడించాడు. దీంతో పీపీటీ కాస్తా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ట్విటర్ వేదికగా స్పందించిన టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ‘బలవంతపెట్టే పీపీటీ! మమ్మల్ని కూడా ఒప్పించేసింది’ అంటూ కామెంట్ చేసింది. ( తల్లి ప్రాణాలు కాపాడటానికి పిల్లాడు..) చిన్నారి తన పీపీటీలో పిల్లిని పెంచుకుంటే కలిగే లాభాలను ఇలా వివరించింది... 1) పిల్లిని పెంచుకోవటం వల్ల మన ఒత్తిడి తగ్గుతుంది. అవి మనల్ని సంతోషంగా ఉంచుతాయి. 2) మీరు పెంచుకుంటున్నది ఓ పిల్లి అయితే దాన్ని మీరు వాకింగ్ కోసం బయట తిప్పక్కర్లేదు. 3) ఇంకో సారి నేను పిల్లి కావాలని అడగటం మీరు వినరు. 4) పిల్లి బాధ్యతలను మొత్తం నేనే దగ్గర ఉండి చూసుకుంటాను. -
వార్నీ, పిల్లి డ్రామా మామూలుగా లేదు
-
పిల్లికి ఐస్‌క్రీమ్ తినిపిస్తే ఇలాగే ఉంటుంది!
పిల్లి కల్లు మూసుకుని పాలు తాగుతుందంటారు. మరి కళ్లు తెరిచి ఐస్‌క్రీమ్ తినగలదా? తింటే దాని రియాక్షన్ ఎలాగుంటుంది? ఇదిగో, ఇలాంటి అనుమానాలు వచ్చాయో వ్యక్తికి. ఇంకేముందీ.. డైనింగ్ టేబుల్‌కు దగ్గరగా కుర్చీని లాగి పిల్లిని కూర్చుండబెట్టాడు. అనంతరం దాని పాలగిన్నె ముందు పెట్టి పాలకు బదులు ఐస్ క్రీం తినిపించబోయాడు. కానీ ఆ పిల్లి అతడికన్నా తెలివైనదానిలా ఉంది. తన వల్ల కాదన్నట్టుగా తలను అటూ ఇటూ ఊపుతూ ఐస్ క్రీం రుచి చూడలేను బాబోయ్ అని వెనక్కు జరుగుతోంది. ఇంతలో ఐస్ క్రీం ఉన్న చెంచాను అంటీఅంటించనట్టుగా దాని మూతకు ఆనించగానే అది కళ్లు తిరిగి పడిపోయినట్లుగా కుర్చీపై వాలిపోయింది. ఈ పిల్లి రియాక్షన్ నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది. (ఇందులో పిల్లి ఎక్కడుందిరా బాబూ?) గత నెలలోనే బయటకొచ్చిన ఈ వీడియోను బాస్కెట్‌బాల్ ఆటగాడు రెక్స్ చాప్మాన్ మరోసారి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోను రెండు మిలియన్ల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోకు నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. "ఓరి.. దీని వేషాలో..", "దీని డ్రామా మామూలుగా లేదుగా" అంటూ కొందరు ఫన్నీ కామెంట్లు చేస్తుంటే మరికొందరు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "మీకు నవ్వులాటగా ఉందా? ఇది జంతు హింస కిందకే వస్తుంది", "పాపం దానికి ఐస్‌క్రీమ్ అస్సలు నచ్చలేదు, దాన్ని చూస్తుంటే బాధగా ఉంది" అని మార్జాలంపై జాలి చూపుతున్నారు. (మరీ అంత ఉత్సాహం పనికి రాదు! ) -
లండన్: కరోనా బారినపడ్డ పెంపుడు పిల్లి
లండన్: బ్రిటన్‌లో కరోనా బారిన పడిన మొట్టమొదటి పెంపుడు జంతువుగా పిల్లిని జూలై 27న యూకే అధికారులు గుర్తించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించిన యజమానులు ఆసుపత్రికి తరలించగా కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఇంతకు ముందు పిల్లి యజమానులు కరోనా బారిన పడ్డారు. దీంతో వారి నుంచే పిల్లికి కరోనా సోకి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు. జంతువులు ప్రాణాంతక వైరస్‌లను వ్యాప్తి చేస్తాయన్న ఆధారాలు ఇప్పటివరకు లేవని వెటర్నరీ చీఫ్ క్రిస్టిన్ మిడిల్మిస్ అన్నారు. ఈ ఘటనను చాలా అరుదైనదంటూ అభివర్ణించారు. లండన్‌లో ఈ తరహా కరోనా కేసు గుర్తించడం ఇదే మొదటిసారి. అమెరికాలోని న్యూయార్క్‌లో జంతువులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. (స్మెల్ టెస్ట్ ఫెయిల్.. మాల్స్‌లోకి నో ఎంట్రీ: మేయర్) గబ్బిలాల నుంచి కరోనా వైరస్ మనుషులకు వ్యాప్తి చెంది ఉండొచ్చని మొదట్లో అనుమానాలు వెల్లడైనా ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎలాంటి రుజువు కాలేదు. అంతేకాకుండా కుక్క, పిల్లులు కూడా కరోనా వాహకాలుగా మారుతున్నట్లు కొందరు ఆరోపించారు. అయితే ఎలాంటి లక్షణాలు లేకపోయినా ఒకవేళ ఏదైనా పిల్లి కరోనా బారిన పడితే మిగతా పిల్లులకు కూడా వ్యాధి సంక్రమించే అవకాశాలు ఉన్నట్లు తాజాగా కొందరు శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీనికి సంబంధించి మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిందిగా యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిస్ స్కూల్ ఆఫ్ వెటర్నటీ విభాగం పేర్కొంది. (పంటి నొప్పిని పట్టించుకోండి లేదంటే..) -
ఇంకోసారి కనిపిస్తే, దాని పీడ వదిలించుకుంటా
లండన్: మనుషులకే ఓ చోట కాలు నిలవదు. అలాంటిది జంతువులకు ఉన్నచోటే ఉండాలంటే సాధ్యమవుతుందా? అందులోనూ 'కాలు కాలిన పిల్లి' అని మార్జాలం స్వభావం గురించి ఓ సామెత కూడా ఉంది. అయితే సౌత్వేల్కు చెందిన క్రిస్, అతని గర్ల్‌ఫ్రెండ్ గండాల్ఫ్ అనే పిల్లిని పెంచుకుంటున్నారు. దాన్ని గారాబం చేస్తూ బాగానే చూసుకుంటున్నారు. కానీ పక్కింటి పుల్లకూర రుచి అన్న చందంగా అది ఎప్పుడూ పక్కింట్లోకి వెళ్లేది. అక్కడున్న ఆహారాన్ని సుష్టుగా లాగించేసి యమ దర్జాగా బయటకొచ్చేది. దీని చేష్టలకు చిరాకొచ్చిన సదరు కుటుంబం ఈసారి పిల్లి ఇంట్లోకి వచ్చినప్పుడు దాని మెడకు వార్నిగ్ లెటర్‌ను వేలాడదీశారు. ఎప్పటిలాగే ఆ నాలుగేళ్ల పిల్లి తన కడుపు నింపుకున్న తర్వాత తన ఇంటికి వచ్చింది. అయితే దాని మెడలో వేలాడుతున్న లేఖను యజమాని తీసి చదవగా.. (ఇందులో పిల్లి ఎక్కడుందిరా బాబూ?) "దయచేసి మీ పిల్లిని మీ ఇంట్లోనే ఉంచండి. అది ఎప్పుడూ మా ఇంటి చుట్టే తిరుగుతోంది. ఇంట్లో ఆహారాన్ని తింటూ, సోఫాను గీరుతూ నాశనం చేస్తోంది. రాత్రిళ్లు కూడా వంటగదిని విడిచిపెట్టకుండా అక్కడే పడుకుంటోంది. మీరు దానికి తిండి పెడితే మంచిదనుకుంటా! ఈ పిల్లి గోల నా వల్ల కావడం లేదు, నేను విసిగిపోయాను. ఇంకోసారి మీ పిల్లి నా ఇంట్లో కనిపిస్తే దాన్ని ఎక్కడ విడిచిపెట్టి వస్తానో నాకే తెలీదు" అని హెచ్చరించి ఉంది. అంతేకాదు.. 'పిల్లికి తిండి కూడా పెట్టకండి' అని దాని మెడకు వేలాడదీసిన దానిపై రాసి ఉంది. అయితే తన పిల్లి గురించి ఇంతవరకెన్నడూ ఇలాంటి ఫిర్యాదులు అందలేదని దాని యజమాని క్రిస్ వాపోయాడు. అది అందరితో బాగా కలిసిపోయేదని, మిగతావారికి కూడా ఇదంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చాడు. (ఆ కారణానికి కూడా విడాకులు ఇచ్చేస్తారా?) -
ఫాదర్ పాలు దొంగిలించిన పిల్లి
పిల్లి పాలు తాగడం చాలా సాధారణమైన అంశం. కానీ ప్రస్తుతం ఓ పిల్లి పాలు తాగుతున్న వీడియో మాత్రం ప్రపంచం అంతా చక్కర్లు కొడతూ తెగ వైరలవ్వడమే కాక పిల్లిని.. దాని యజమానిని ఓవర్‌నైట్‌లో స్టార్స్‌ని చేసింది. కాంటర్బరీ కేథడ్రాల్ ఉదయం ప్రార్థనల లైవ్ స్ట్రీమ్ సెషన్లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. డీన్ లైవ్‌లో తన ఉపన్యాసాలను చదువుతుండగా.. ఆయన 13 ఏళ్ల పెంపుడు పిల్లి టైగర్ ఎలాంటి జంకు లేకుండా అక్కడకు వచ్చి డీన్ పక్కన ఉన్న కుర్చిపై కూర్చుటుంది. అంతటితో ఊరుకోక ఆ పక్కనే టేబుల్ మీద డీన్ కోసం ఉంచిన పాల వాసనను పసిగడుతుంది. వెంటనే దాని మీదకు దూకి పాలు తాగడం ప్రారంభించింది. ఇది అంతా వీడియోలో రికార్డయ్యింది. టైగర్‌ను గమనించిన డీన్.. ‘క్షమించండి ఈ ఉదయం మాకొక స్నేహితుడు దొరికాడు’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. WATCH: Thirteen-year-old Tiger the cat joins the livestream of Canterbury Cathedral's morning prayers and drinks milk that was meant for the Dean pic.twitter.com/wZRDO5Uph6 — Reuters India (@ReutersIndia) July 10, 2020 -
ఇందులో పిల్లి ఎక్కడుందిరా బాబూ?
న్యూఢిల్లీ: ఇక్కడో పిల్లి దాగుడు మూతలు ఆడుతోంది. అది ఎక్కడుందో కనిపెట్టమంటూ సవాలు విసురుతోంది. అసలే మార్జాలం. ఎక్కడైనా దూరగలదు, ఎందులోకైనా చొచ్చుకుపోగలదు. అలాంటిది. ఇన్ని పుస్తకాల దొంతరల మధ్య దాన్ని గుర్తించడం కాస్త కష్టమే అయ్యేటట్టుంది. ఇంతకీ ఈ పజిల్‌ను కేట్ హైండ్స్ అనే వ్యక్తి ట్విటర్లో పోస్ట్ చేశాడు. "ఈ రోజు పిల్లిని పట్టుకుందాం" అంటూ దానికి క్యాప్షన్ జోడించాడు. ఓస్, అదెంత పని.. వెతికేద్దాం అని ప్రయత్నించిన కొందరు నెటిజన్లు అందులో పిల్లి ఎక్కడుందిరా బాబూ? అంటూ దాన్ని గుర్తించలేక జుట్టు పీక్కుంటున్నారు. (డిస్ట్రబ్ చేసింది.. స్టార్ అయ్యింది) పుస్తకాలు, చెట్లు, టీవీతో అంగుళం కూడా ఖాళీ లేకుండా నిండిపోయిన ఫొటోలో దాన్ని పట్టుకోవడం కష్టమేనంటూ మరికొందరు ముందే చేతులెత్తేస్తున్నారు. అతి కొద్ది మంది మాత్రం పిల్లి దొరికిందోచ్ అంటూ దాని ఫొటోను షేర్ చేస్తూ ఎగిరి గంతేస్తున్నారు. ఇక మిగిలిన వారు మాత్రం తాము కూడా పిల్లులతో ఇలాగే దాగుడుమూతలు ఆడతామంటూ అందుకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ పజిల్‌ను పక్కన పెట్టేశారు. (మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ ఈ వ్యక్తి!) How is this even possible? pic.twitter.com/loak8Va5lW — Second Ave. Sagas (@2AvSagas) June 7, 2020 -
వీధి పిల్లికి చేతులతో నీళ్లు పట్టిన వైనం
-
మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ ఈ వ్యక్తి!
మనం చేసేది చిన్న సహాయమైనా అది ఎదుటి వ్యక్తికి ఎంతో ఊరట కలిగిస్తుంది. మనం చేసే ఆ సహాయం మన మంచి మనసును ప్రతిబింబించటమే కాదు, అది విశ్వ జనీనమైనదైనప్పుడు మానవత్వపు పరిమళాలు నలువైపులా చేరుకుంటాయి. ఇలాంటి సంఘటనే ప్రస్తుతం ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. వీధి పిల్లికి సహాయం చేసి ఓ వ్యక్తి మానవత్వానిక కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. దాహంతో అల్లాడుతున్న పిల్లికి తన చేతులతో నీళ్లు పట్టి, సోషల్ మీడియా స్టార్ అయిపోయాడు. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నంద ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఆయన స్పందిస్తూ.. ‘‘ నిజమైన సంతోషం చిన్న చిన్న విషయాల్లోనే లభిస్తుంది. వీధి పిల్లికి నీళ్లు తాగించటం ద్వారా అతడికి స్వచ్ఛమైన ఆనందం’’ అని పేర్కొన్నారు. ( ఇలాంటి దొంగతనం ఎప్పుడూ చూడలేదు) ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేల కొద్ది వీక్షణలు, రీ ట్వీట్లతో దూసుకుపోతోంది. దీనిపై నెటిజన్లు.. ‘‘ మానవత్వాన్ని చూడటం గర్వంగా ఉంది.. అతను ఎంతో దయ కలవాడు..’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోలో... దాహంతో ఉన్న పిల్లికి ఓ వ్యక్తి కొళాయి నీళ్లను తన దోసిడితో పట్టి తాగించాడు. పిల్లి కూడా ఆ మనిషిని చూసి భయపడకుండా తన దాహం తీరే వరకు నీళ్లు తాగింది. ( ఆస్పత్రిలో ఒక్కటైన డాక్టర్, నర్స్ ) -
వైరల్ : ఒక తల.. రెండు ముఖాలు
సాక్షి, న్యూయార్క్ : అమెరికాలోని ఆరెగాన్లో ఓ వింత పిల్లి జన్మించింది. ఒక తల రెండు ముఖాలు ఉండటం దాని ప్రత్యేకత. ఒక్కో ముఖానికి యథావిథిగా రెండేసి కళ్లు, ఓ ముక్కు, నోరు ఉన్నాయి. దీని యజమానులు ఓ ముఖానికి బిస్కట్స్ అని, మరో ముఖానికి గ్రేవీ అని పేర్లు పెట్టారు. ఈ వింత పిల్లి పిల్లకు సంబంధించిన వీడియోను దాని వ్యక్తిగత ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, రెండు ముఖాల పిల్లులు జన్మించటం చాలా అరుదు. ( ఆవు అంత్యక్రియలు: గుంపులుగా జనం ) ఇలాంటి వింత పిల్లులను జానుస్ అని పిలుస్తారు. ఈ పేరు కూడా రోమన్ దేవుడు జానుస్ పేరు మీద వచ్చిందే. జానుస్ అనే దేవుడు ఓ తలతో భూతాకాలాన్ని, మరో తలతో భవిష్యత్తును చూడగలడని ప్రతీతి. అయితే ఇలాంటి పిల్లులు ఆరోగ్యంగా బ్రతకం కష్టమైన పని. బిస్కట్స్, గ్రేవీల పరిస్థితి కూడా ప్రస్తుతం బాగోలేదు. వాటి ఆరోగ్యంపై స్పందిస్తున్న నెటిజన్లు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. -
ఒక తల.. రెండు ముఖాలు!
-
గోల్కొండలో నల్ల పిల్లి కలకలం..
గోల్కొండ/బహదూర్‌పురా: గోల్కొండలో అడవిపిల్లి (ప్లామ్ సివెంట్) కలకలం సృష్టించింది. అయితే దీనిని మొదట స్థానికులు నల్ల చిరుత అనుకుని తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సుమారు 15 గంటల పాటు ఇళ్లపై తిరిగిన ఈ అడవి జాతి పిల్లిని అధికారులు ఎట్టకేలకు పట్టుకున్నారు. గోల్కొండ నూరాని మసీదు పై బుధవారం రాత్రి చిరుతను పోలిఉన్న ఓ జంతువు కనిపించింది. అనంతరం అది మసీదు పొరుగున ఉన్న ఇళ్లపై నుంచి దూకు తూ కలకలం సృష్టించింది. ఇది చిరుతను పోలి ఉండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్ల తలుపులు, కిటికీలు మూసు కున్నారు. మసీదు నిర్వహణ కమిటీ అధ్యక్షుడు మోసిన్ బాకుల్కా ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. బుధవారం రాత్రి అక్కడికి చేరుకున్న పోలీసులు అటవీశాఖ, జూ అధికారులకు సమాచారం ఇచ్చారు. సుమారు 3 గంటల పాటు ఇళ్లపై తిరుగుతూ అది పట్టుబడకుండా తప్పించుకుంది. గురువారం ఉదయం ఎట్టకేలకు దానిని పట్టుకున్నారు. ఇది చిరుత కాదని, అడవిలో సంచరించే పిల్లి అని తెలిపారు. ఇది గోల్కొండ కోట ప్రహరీ, దానిని ఆనుకుని ఉన్న కందకాలు, చెట్లలో నుంచి జనావాసాలలోకి వచ్చి ఉంటుందని ఇన్స్పెక్టర్ కె.చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. పిల్లి రకాల్లోన్ని మరణాంగి జాతికి చెందినదని జూ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ సయ్యద్ అసదుల్లా చెప్పారు. ప్రస్తుతం ఇది జూలో సురక్షితంగా ఉందన్నారు. -
డిస్ట్రబ్ చేసింది.. స్టార్ అయ్యింది
న్యూయార్క్ : ముఖ్యమైన పనిలో ఉన్న వారినెవరినైనా డిస్ట్రబ్ చేస్తే ఏమవుంది? ముఖం వాచేలా చివాట్లు తినాల్సుంటుంది. కానీ, బెట్టీ మాత్రం సెలెబ్రిటీ అయిపోయింది. యాజమానితో పాటు తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వివరాలు.. అమెరికాకు చెందిన జెఫ్ఫి లైయాన్స్ అనే వ్యక్తి 14న్యూస్‌లో వెదర్ రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడు. ఓ రోజు జెఫ్ఫి వెదర్ రిపోర్ట్ చదువుతుండగా తన పెంపుడు పిల్లి బెట్టీ లైవ్‌లోకి వచ్చింది. దీంతో ఆ షోకు ప్రేక్షకుల నుంచి బాగా రెస్పాన్స్ వచ్చింది. ఇక అప్పటినుంచి బెట్టీ సెలెబ్రిటీ లైఫ్ మొదలైంది. ప్రస్తుతం యాజమానితో కలిసి షోలు చేస్తోంది. అంతేకాకుండా ఆ షోలో తనకంటూ సొంతంగా ఓ భాగాన్ని సంపాదించుకునే స్థాయికి ఎదిగింది. బెట్టీకి సంబంధించిన అప్డేట్లు ఎప్పటికప్పుడు తన ఇన్స్టాగ్రామ్ అకౌంటు ద్వారా అభిమానులకు అందుబాటులో ఉంటున్నాయి. చదవండి : వైరల్ : ఇదేం వింత స్నేహం?! బిడ్డల కోసం రాళ్లు వండుతున్న తల్లి -
వైరల్ : ఇదేం వింత స్నేహం?!
రెండు భిన్న జాతులకు చెందిన జంతువులు స్నేహంగా ఉండటం మనం చూసే ఉంటాం. పిల్లి-కుక్క, పిల్లి-ఎలుక, కుక్క-పులి, కోతి-కుక్క, కుక్క-గుర్రం ఇలా పొంతన కుదరదు అనుకునే జంతువులు స్నేహంతో ఒక్కటై మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ వింత స్నేహానికి సంబంధించి వార్త ఒకటి ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. పాము- పిల్లి ఈ రెండు జంతువుల మధ్య స్నేహం ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. డిచ్ పోనీ అనే మహిళకు చెందిన రికీ పేరుగల నల్ల పిల్లి, గత కొద్దిరోజులుగా ఓ నల్ల పాముతో స్నేహంగా ఉంటోంది. ఇది గమనించిన పోనీ వాటి ఫొటోలను తీసింది. పాముతో ఆడుకుంటున్న పిల్లి తన ట్విటర్ ఖాతాలో ఉంచి ‘‘ నా పిల్లి ఎల్లప్పుడూ ఆ పాముతో ఉంటోంది. దానికి ఎలాంటి హానీ చేయటం లేదు. ఇద్దరూ కలిసి ఎండలో సన్‌బాత్ చేయటం లేదు కదా?’’ అంటూ ఫన్నీగా స్పందించింది. ఈ వింత స్నేహం దాదాపు లక్ష రీట్వీట్లతో.. 60వేల లైకులతో దూసుకుపోతోంది. కొందరు నెటిజన్లు ‘‘ అలాంటి స్నేహం నాకూ కావాలి... స్నేహితుడితో సన్ బాతింగ్... ఇదేం వింత స్నేహం?!’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. why did I find my cat hanging out with a snake? neither harmed- just basking together pic.twitter.com/dvTRHF1Wiy — ditch pony (@molly7anne) April 30, 2020 చదవండి : లాక్డౌన్ తొలగిస్తే ఇలాగే పరిగెడతారేమో! -
ఎమర్జెన్సీ: కూన కోసం తల్లడిల్లిన పిల్లి
టర్కీ: తల్లి ప్రేమ మనుషులకే కాదు, సృష్టిలోని అన్ని జీవరాశులకూ సొంతం. పేగు తెంచుకుని పుట్టిన జీవి కోసం తల్లడిల్లని తల్లి ఉండదంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. తాజాగా ఓ పిల్లి తన కూన అస్వస్థతగా ఉండటం గమనించి ఆసుపత్రికి పరుగెత్తిన ఘటన ఇస్తాంబుల్‌లోని టర్కీలో చోటు చేసుకుంది. వివరాలు.. ఏమైందో ఏమో కానీ హుషారుగా, చెంగుచెంగున దుంకే పిల్లి కూన ఒక్కసారిగా నీరసించడం దాని తల్లి కంట పడింది. కొంతసేపటికి అదే తిరిగి మామూలవుతుందిలే అనుకుంది. కానీ, అలా జరగలేదు. పిల్లికూన మరింత నీరసంగా అనారోగ్యం బారిన పడినట్లు కనిపించింది. (ఆన్లైన్ పెళ్లి; ఫోన్‌కు తాళి కట్టాడు) దీంతో భయాందోళనకు గురైన తల్లికి గుండెలో గుబులు పట్టుకుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పిల్లికూనను నోట కరుచుకుని ఆసుపత్రికి పరుగు పెట్టింది. ఎమర్జెన్సీ అన్న సంకేతాలిస్తూ వైద్యుల ముందు కాలు కాలిన పిల్లిలా అటు ఇటు తిరిగింది. దాని బాధను అర్థం చేసుకున్న వైద్యులు వెంటనే దానికి సహాయం చేశారు. దీంతో ఆ కూన తిరిగి ఎప్పటిలాగే ఆరోగ్యవంతురాలైంది. పిల్లి ఆసుపత్రికి వెళ్లి, వైద్యం చేయిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. "తల్లి ప్రేమకు అంతు లేదు" అంటూ నెటిజన్లు ఆ మదర్ పిల్లిని మెచ్చుకుంటున్నారు. (అద్భుతమైన వీడియో.. థాంక్యూ!) Yavrusu biraz haylaz biri, annesi bulduğu yerde kapıp götürüyor pic.twitter.com/GYvBXt3UQz — Merve Özcan (@ozcanmerveee) April 27, 2020 -
ఈ పిల్లి నిజంగా చాలా స్మార్ట్
-
పిల్లి కోసం పోలీసులపై హైకోర్టులో పిటిషన్
కొచ్చి : కరోనావైరస్ నేపథ్యంలో దేశం మొత్తం లాక్డౌన్ పాటిస్తున్న వేళ కేరళ పోలీసుపై హైకోర్టులో వింత పిటిషన్ దాఖలైంది. తన పెంపుడు పిల్లులకు ఆహారం కొనేందుకు వాహన పాస్ నిరాకరించారని హైకోర్టును ఆశ్రయించారు ఓ వ్యక్తి. వివరాల్లోకి వెళితే.. కొచ్చి ప్రాంతానికి చెందిన ఎన్ ప్రకాశ్ అనే ఓ వ్యక్తి మూడు పిల్లులను పెంచుకుంటున్నాడు. లాక్డౌన్ నేపథ్యంలో వాటికి ఆహారం కొనేందుకు వాహన పాస్ ఇవ్వాలంటూ ఏప్రిల్ 4న ఆన్లైన్ ద్వారా పోలీసులకు దరఖాస్తు పెట్టుకున్నారు. తాను శాకాహారినని, తన పిల్లులను ఇష్టమైన మియో పెర్సియన్ బిస్కెట్ల ఇంట్లో తయారు చేయలేనని, కోనేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులుకు విజ్ఞప్తి చేశారు. (చదవండి : మాస్క్‌లు ధరించకపోతే జరిమానా) అయితే ప్రకాశ్ చెప్పిన కారణం అత్యవసరమైనది కాదని భావించిన పోలీసులు ఆయనకు పాస్ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో పోలీసుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రకాశ్ కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జంతు హింస నిరోధక చట్టంలోని 3, 11 సెక్షన్ల ప్రకారం పెంపుడు జంతువులకు ఆహారం, వసతి పొందే హక్కు ఉందని ఆయన వాదిస్తున్నారు.కాగా, కేరళలో కరోనా బాధితుల సంఖ్య 314కు చేరింది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దరు మృతి చెందారు. ఇక దేశ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య నాలుగు వేలు దాటింది. 109 మంది మరణించారు. -
పెంపుడు పిల్లికి కరోనా పాజిటివ్
హాకాంగ్ : కరోనా మహమ్మారి మనుషులపైనే కాదు జంతువులపైన కూడా తన ప్రతాపాన్ని చూపుతోంది. హాకాంగ్‌లో ఇప్పటికే రెండు పెంపుడు కుక్కలకు కరోనా వైరస్ పాజిటివ్ రాగా.. తాజాగా ఓ పెంపుడు పిల్లికి కూడా ఈ మహమ్మారి సోకినట్లు వైద్యులు గుర్తించారు. యజమాని వల్ల పిల్లికి కూడా కరోనా సోకిందని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు మార్చి 31న హాంకాంగ్ అగ్రికల్చరల్ అండ్ ఫిషరీస్ అండ్ కన్జర్వేషన్ డిపార్టమెంట్ ఓ నోటీసులు విడుదల చేసింది. (చదవండి : కరోనా బారిన పడి 13 ఏళ్ల బాలుడి మృతి) అయితే దీని వల్ల ఎలాంటి ప్రమాదం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. పెంపుడు జంతువుల ద్వారా కరోనా వైరస్ సోకుతుందనే ఆధారాలు ఇంతవరకు లభించలేదని, యజమానులు ఎవరూ ఆందోళన చెందొద్దని పేర్కొన్నారు. పెంపుడు జంతువులకు డెరెక్ట్‌గా కరోనా వైరస్ సోకలేదని, యాజమాని లేదా ఇతర మనుషుల ద్వారా అవి వైరస్ బారిన పడ్డాయని స్పష్టం చేశారు. వీటి వల్ల ఎటువంటి ముప్పు లేదన్నారు. పెంపుడు జంతువుల నుంచి మనుషులకు వైరస్ సోకదని, 14 రోజులు వాటిని క్వారంటైన్లో ఉంచితే సరిపోతుందని చెప్పారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అంగీకరించింది. తప్పుడు వార్తలను నమ్మి పెంపుడు జంతువుల ప్రియులు ఆందోళన చెందొద్దని కోరింది. (చదవండి : అమెరికాలో ఒక్కరోజే 865 కరోనా మరణాలు!) కాగా, ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితులు, మరణాల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇటలీ, అమెరికా, బ్రిటన్, స్పెయిన్‌లో ఈ వైరస్ మరణ మృదంగం సృష్టిస్తోంది. వైరస్ బారిన పడి ఇప్పటికే 40 వేల మందికి పైగా మృతి చెందారు. బాధితుల సంఖ్య 8 లక్షలు దాటింది. -
పిల్లి కాదు ‘కరోనా పులా’ ..?
సాక్షి ప్రతినిధి, చెన్నై: చైనాలో కరోనా వైరస్‌తో వందలాది ప్రజలు పిట్టల్లారాలిపోవడం మొత్తం ప్రపంచాన్నే హడలెత్తిస్తోంది. తమ దేశంలోకి కరోనావైరస్ వ్యాపించకుండా అన్ని దేశాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. జంతువుల నుంచి కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు పరిశోధనల్లో తేలింది. ఈ నేపథ్యంలో..చైనాలో నివసించే వ్యక్తులు భారత్‌లోకి ప్రవేశించేందుకు అనుమతి లేదని భారత నావికాదళశాఖ గత నెల 11న ప్రకటన విడుదల చేసింది. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మియాన్మార్ సరిహద్దుల నుంచి ఆకాశ, భూమార్గంలో జనవరి 15 తర్వాత భారత్‌లోకి రావడంపై కేంద్రం నిషేధం విధించింది. చైనాలోని భారతీయ ఉద్యోగులు, విద్యార్థులు కరోనావైరస్ భయంతో తమిళనాడుకు వచ్చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా వైరస్ అనుమానిత రోగుల కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనా నుంచి చెన్నైకి వచ్చిన ఒక నౌకలో పసుపు, తెలుపు రంగులతో కూడిన “స్టో వేవే’ జాతికి చెందిన ఒక పిల్లి బోనులో కనుగొన్నారు. చైనా నుంచి వచ్చిన కంటైనర్లను హార్బర్ ప్రవేశద్వారం వద్ద కొన్నిరోజుల క్రితం కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. పిల్లలు ఆడుకునే బొమ్మలున్న ఆ కంటైనర్‌లో బోనులో ఉంచిన పిల్లి బయటపడింది. ఎంతో బలహీనంగా ఉన్న ఆ పిల్లికి వైద్యచికిత్సలు అందిస్తున్నారు. ఈ పిల్లిని ఎవరు ఎవరికి పంపారు? ఎందుకోసం పంపారని కస్టమ్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు. కంటైనర్ల మధ్య సింహాల సంచారం ఇదిలా ఉండగా హార్బర్ కంటైనర్ల నడుమ మూ డు సింహాలు సంచరిస్తున్నట్లు, సింహాల దాడి తో తీవ్రంగా గాయపడినట్లున్న ఒక యువకుని దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో సోమవారం ప్రచారం కావడం కలకలం రేపాయి. అంతేగాక తిరునెల్వేలీకి చెందిన ఒక యువకుడు విడుదల చేసిన ఆడియో కూడా భీతిల్లేలా చేసింది. ‘ఫోటోలు ఉన్న మూడు సింహాలను చూసే ఉంటారు, చెన్నై ఎన్నూరులోని కామరాజర్ హార్బర్‌లోనే ఇవి సంచరిస్తున్నాయి. ఇరుక్కు అడవుల నుంచి వచ్చాయా లేక చైనా నౌక నుంచి చేరుకున్నాయా, కంటైనర్లలో తెచ్చి వదిలిపెట్టారా అని అధికారులు తేల్చాల్సి ఉంది. ఆదివారం లోడు ఎత్తుతుండగా ఈ మూడు సింహాలను చూసాను. కంటైనర్ లారీ డ్రైవర్లు ఎలాంటి పరిస్థితిలోనూ రాత్రివేళల్లో కిందికి దిగవదు’ అని అతడు పేర్కొన్నాడు. కరోనావైరస్ అనుమానితుని మృతి పుదుక్కోటై జిల్లా అరంతాంగికి చెందిన శక్తికుమార్ (42) చైనాలో హోటల్‌ను నిర్వహిస్తున్నాడు. పచ్చకామెర్లు సోకడంతో ఇటీవల సొంతూరుకు చేరుకుని చికిత్స పొందుతున్నాడు. చైనా హోటల్లో ఇబ్బందులు తలెత్తడంతో ఆరోగ్యం కుదుటపడేలోగా వెళ్లిపోయాడు. మరలా తీవ్ర అనారోగ్యానికి గురై ఈనెల 4వ తేదీన అరంతాంగికి వచ్చాడు. మధురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 15వ తేదీన మరణించాడు. శక్తికుమార్ సంగతి వైద్యశాఖకు తెలియకపోవడంతో సాధారణ రోగిలా మధురై ఆసుపత్రిలో చేరి ప్రాణాలు విడిచాడు. కరోనా వైరసే అతని ప్రాణాలను బలిగొందని ప్రచారం జరగడంతో ప్రజలు భీతిల్లుతున్నారు. చైనా నౌకలో వచ్చిన పిల్లిని వెనక్కు పంపాలని కేంద్ర నౌకాయానశాఖ మాజీ మంత్రి జీకే వాసన్ హార్బర్ అధికారులను కోరారు. -
కోవిడ్-19 ఎఫెక్ట్: పిల్లులకూ మాస్క్!
-
కరోనా ఎఫెక్ట్: మార్జాలానికి మాస్క్!
బీజింగ్ : ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కోవిడ్-19 (కరోనా వైరస్) ఎఫెక్ట్‌తో ప్రజలు అప్రమత్తంగా ఉంటున్నారు. శుభ్రతపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారంతా సానిటైజర్లు, ఫేస్ మాస్క్‌లు, హ్యాండ్ వాష్‌లంటూ శుభ్రత పాటిస్తున్నారు. చైనాలోని వుహాన్‌లో పుట్టిన ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు ప్రపంచ ప్రజలంతా తగిన శుభ్రత పాటిస్తూ అప్రమత్తమవుతున్నారు. ఇక చైనా ప్రజల గురించి అయితే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అసలు ఇంట్లోనుంచి కాలు బయటపెట్టేందుకే జంకుతున్నారు. ఎప్పుడూ జనసంద్రంగా ఉండే వుహాన్ రోడ్లు నిర్మానుషంగా మారాయి. ఒకవేళ బయటకు రావల్సి వస్తే ఫేస్ మాస్క్‌లు తప్పనిసరి.. లేదంటే జైలు పాలు కావల్సిందే. ఇక ప్రజలే కాదు అక్కడి పిల్లులు, కుక్కలు సైతం ఫేస్ మాస్క్‌లు లేనిదే బయటకు రావడం లేదు. ఓ పెంపుడు పిల్లి ఫేస్ మాస్క్‌తో రోడ్లపై తిరుగుతున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలకు ఇప్పటి వరకూ వేలల్లో లైక్‌లు రాగా.. వందల్లో కామెంట్లు వస్తున్నాయి. ‘ఇప్పటికీ పిల్లులను ప్రేమిస్తున్నారు’ అని ‘మనం ప్రేమించే వారిని రక్షించుకోవడం మన బాధ్యత’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. A cat wearing face mask in #China amid #WuhanCoronavirus outbreak. pic.twitter.com/ZU3H3KTLAw — W. B. Yeats (@WBYeats1865) February 10, 2020 కాగా కరోనా వైరస్ మంసాహారం తింటే వస్తుందని, జంతువుల నుంచి వస్తున్నాయంటు పుకార్లు పుట్టడంతో చైనా ప్రజలు మాంసహారం తినడమే మానేస్తున్నారు. అలా వుహాన్ ప్రజలు ఈ ప్రాణాంతక వైరస్ నుంచి తమని తమను రక్షించుకుంటూ.. వారి పెంపుడు జంతువులను కూడా సంరక్షించుకుంటున్నారు. ఇందు కోసం వారి పెంపుడు పిల్లులు, కుక్కలకు మనుషుల ఫేస్ మాస్క్‌లు వేస్తున్నారు. మాస్క్‌కు వాటి కళ్ల దగ్గర రంధ్రలు చేసి వాటికి తొడుగుతున్నారు. దీంతో అక్కడ మాస్క్‌లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఒకనొక సమయంలో మాస్క్‌లు దొరకడం కూడా కష్టతరంగా మారుతోంది. ఇక ఈ కరోనా వైరస్ ఎలా సోకుంతుందనే విషయంపై ఇంకా స్పష్టత రాకపోవడంతో.. దీనికి మందును కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు, వైద్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ఈ వైరస్ బారిన పడి ఇప్పటి వరకు 17 వందలకుపైగా మంది చనిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. (చదవండి: ఉచితంగా 2 వేల ఐఫోన్ల పంపిణీ!) -
వైరల్ వీడియో: నా గదిలో జెర్రీ ఉంది..!
ఇంగ్లీష్ భాషలో మనం ఒకటి మాట్లాడితే ఎదుటివాళ్లకు మరొలా అర్థం అవుతుందన్న విషయం తెలిసిందే. అలాంటి ఓ ఫన్నీ సంఘటన యూకేలోని ఓ హోటల్లో చోటు చేసుకుంది. అరబ్ దేశానికి చెందిన ఓ వ్యక్తి ఇంగ్లండ్‌లోని ఇంటర్ కాంటినెంటల్ అనే హోటల్ గదిలో విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. దాన్ని సదరు హోటల్ రిసెప్షనిస్ట్‌కు కొంచం హాస్య చతురతను జోడించి వ్యక్తం చేశాడు. తన గదిలో ఉన్న పిల్లిని చూసి.. ‘నా గదిలో జెర్రీ ఉంది. వెంటనే నా గదికి ఒక టామ్‌ను తీసుకురండి. అప్పుడు ఆ టామ్ నా గదిలో ఉన్న జెర్రీని పట్టుకుంటుంది’ అని ఆ వ్యక్తి హోటల్ రిసెప్షనిస్ట్‌కు ఫోన్ చేశాడు. దీంతో ఆ రిసెప్షనిస్ట్ అతను చేసిన ఫిర్యాదుకు ఒక్కసారిగా అవాక్కయ్యారు. తర్వాత అతను మాట్లాడిన ఫన్నీ ఫోన్ సంభాషణను ఓ ట్విటర్ యూజర్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ ఫోన్ సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. దీనికిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. అదేవిధంగా టామ్ అండ్ జెర్రీకి సంబంధించిన పలు మీమ్స్‌ను నెటిజన్లు కామెంట్ల రూపంలో పోస్ట్ చేస్తున్నారు. అతను చేసిన ఫన్నీ సంభాషణకు నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటూ.. లైకులు, షేర్లు చేస్తున్నారు. -
క్యాట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లలో 2020–21 విద్యా సంవత్సరం ఎంబీఏ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి గతేడాది నవంబర్ 24న నిర్వహించిన క్యాట్ (కామన్ అడ్మిషన్ టెస్ట్)–2019 పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా 2.09 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 1.34 లక్షల మంది పురుషులు, 75 వేల మంది మహిళలు ఉన్నారు. తెలంగాణకు చెందిన వారు దాదాపు 7 వేల మంది క్యాట్ పరీక్ష రాసినట్లు సమాచారం. తాజా ఫలితాల్లో దేశవ్యాప్తంగా 10 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించగా, వీరంతా పురుషులే కావడం గమనార్హం. 100 పర్సంటైల్ వచ్చిన వారంతా డిగ్రీలో ఇంజనీరింగ్ నేపథ్యమున్న వారే. టాప్ టెన్‌లో ఆరుగురు ఐఐటీ విద్యార్థులు కాగా, మరో ఇద్దరు ఎన్ఐటీకి చెందిన విద్యార్థులు. వీరిలో నలుగురు మహారాష్ట్ర, మిగిలిన ఆరుగురు తెలంగాణ, జార్ఖండ్, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందినవారు. మరో 21 మంది 99.9 పర్సంటైల్ సాధించగా, ఇందులో 19 మంది ఇంజనీరింగ్ నేపథ్యమున్న వారే కావడం గమనార్హం. వరంగల్ నిట్ విద్యార్థులు క్యాట్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. -
వైరల్: పిల్లికి కుర్చీ అందించిన పెద్దాయన
-
వైరల్: పిల్లిని కాపాడి మంచి పని చేశారు
ఎలా వెళ్లిందో ఏమోగానీ ఓ పిల్లి ఎత్తున ఉన్న గోడపై కూర్చుంది. అంతవరకూ బాగానే ఉన్నా దానికి అక్కడి నుంచి కిందికి ఎలా రావాలో అర్థం కాలేదు. ‘మ్యావ్.. మ్యావ్..’ అంటూ సహాయం కోసం అరవసాగింది. ఇది గమనించిన ఓ పెద్దాయన దాన్ని చూసి జాలిపడి పిల్లిని కిందకు రప్పించేందుకు పథకం రచించాడు. అనుకున్నదే తడవుగా వెంటనే ఓ ప్లాస్టిక్ కుర్చీని చేతులోకి తీసుకున్నాడు. దాన్ని పైకెత్తి పట్టుకుని, పిల్లి అందులోకి వచ్చేంతవరకు అలానే పట్టుకుని నిలబడ్డాడు. మొదట పిల్లి కుర్చీలోకి రావాలా వద్దా అని కాసేపు తటపటాయించింది. తర్వాత దానికి ఏమర్థమైందో ఏమో కానీ వెంటనే కుర్చీలోకి దూకి కూర్చుంది. దీంతో ఆ వ్యక్తి కుర్చీని నెమ్మదిగా కిందకు దించాడు. వెంటనే పిల్లి అక్కడ నుంచి చెంగున నేలపైకి దూకి ఆనందంతో సందులోకి పరుగు లంకించుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృత ఆదరణను సంపాదించుకుంది. ఈ వీడియోను లక్షల మంది వీక్షించగా వేలల్లో లైకులు వచ్చి పడుతున్నాయి. అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే వివరాలు మాత్రం తెలియరాలేదు. కాగా పిల్లిని కాపాడిన వ్యక్తికి నెటిజన్లు పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలుపుతున్నారు. పిల్లిని కాపాడి ఎంత మంచి పని చేశారని ఆ వ్యక్తిని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. -
చిరుత అనుకొని.. పరుగులు పెట్టిన ఎయిర్పోర్ట్ సిబ్బంది
సాక్షి, హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్ట్ సిబ్బందికి అడవి పిల్లి ముచ్చెమటలు పట్టించింది. వివరాల్లోకి వెళితే.. శంషాబాద్ ఎయిర్పోర్ట్ సిబ్బంది ఏరో టవర్స్ సమీపంలో ఓ జంతువు తిరగడం గమనించారు. దానిని చిరుతగా భావించిన ఎయిర్పోర్ట్ సిబ్బంది ఉరుకులు, పరుగులు పెట్టారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో రంగంలో కి దిగిన అటవీ శాఖ సిబ్బంది.. మూడు గంటలపాటు శ్రమించి దానిని బంధించారు. అయితే అది చిరుత కాదని.. అడవి పిల్ల అని తేల్చారు. దీంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. -
గర్భంతో ఉన్న పిల్లికి ఉరేశారు..
తిరువనంతపురం: కేరళ రాజధాని తిరువనంతపురంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ ఆర్మీ అధికారి ఇంట్లో గర్భిణీ పిల్లి ఉరేసుకున్నట్లుగా కనిపించడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఈ ఘటనపై ఆదివారం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఓ ఆర్మీ అధికారి పెరట్లో ఉన్న షెడ్డును క్లబ్‌లా వాడుకుంటున్నారు. ఈ క్రమంలో నవంబర్ 10న షెడ్లోకి పిల్లి రావటంతో క్లబ్ సభ్యుల్లోని ఒకరు దాన్ని తాడుకు కట్టేసి చిత్రహింసలు పెట్టి చంపారు. అనంతరం కాంపౌండ్ గోడకు ఉన్న తాడుపై పిల్లిని వేలాడదీశారు. వీరి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పొరుగింటివాళ్లు ఘటన గురించి జంతు సంరక్షణాధికారులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలిసిన వెంటనే అధికారిణి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా అప్పటికే క్లబ్ సభ్యులు పిల్లిని మట్టిలో పాతిపెట్టడానికి ప్రయత్నిస్తుండగా.. అక్కడున్న వారితో పాటు ఆర్మీ అధికారి సైతం కేసు నమోదు చేయకుండా అధికారులను అడ్డుకున్నారు. ఇక ఈ అమానుష ఘటనపై జంతుప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాశవిక చర్యకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పార్వతీ మోహన్(భారతీయ జంతు సంరక్షణా సంస్థ ప్రచార సమన్వయకర్త), లత ఇందిరా (పీపుల్ ఫర్ యానిమల్స్ కార్యదర్శి) పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ ఓ డాక్టర్ కుక్కపైకి తుపాకీ గురిపెట్టి కాల్చి చంపాడని... ఇలాంటి ఘటనలు పదే పదే జరుగుతున్నా కఠిన చర్యలు మాత్రం తీసుకోవడం లేదు అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. పిల్లి పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే అన్ని విషయాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు. -
అమేజింగ్ వీడియో; పిల్లోడిని కాపాడిన పిల్లి
న్యూఢిల్లీ : ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎక్కడి నుంచే వచ్చి పాలు తాగిపోతుందీ పాడు పిల్లి అని భారతీయులు సహజంగా అసహించుకుంటారు. కానీ ప్రాణాలు కాపాడే పిల్లులంటూ ప్రేమిస్తారు పాశ్చాత్యులు. వారి నమ్మకాన్ని అక్షరాల రుజువు చేసింది కొలంబియాలో ఓ పిల్లి, ఏడాది బాబును ప్రాణాపాయం నుంచి రక్షించి హీరోగా ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంటోంది. డయానా లోరెనా అల్వరేజ్ అనే తల్లి మెట్ల పైనున్న గదిలో వున్న తన బాబును చూడడం కోసం వెళ్లింది. తొట్టెలో ఉండాల్సిన బాబు బయటకు ఎలా వచ్చాడబ్బా అంటూ ఆశ్చర్యపోయింది. తొట్టెలో నుంచి బాబు ఎలా దిగాడో చూడడం కోసం గదిలోని సీసీటీవీ ఫుటేజ్ చూడగా, తొట్టెలో నుంచి బాబు ఎలా దిగాడన్న దానికంటే ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించి అవాక్కయింది. ఎలాగో తొట్టెను దిగిన బాబు, అక్కడే కుర్చీలో ఉన్న పిల్లితో పోటీగా అన్నట్లుగా గబాగబా పాక్కుంటూ మెట్లవైపు దూసుకుపోయాడు. గది అంచుకు చేరి మెట్ల మీదుగా పడిపోబోతున్నట్లు కనిపించాడు. అంతే, ఆ దృశ్యాన్ని చూసిన పిల్లి శర వేగంతో రాకెట్లా దుసుకెళ్లి, తన భుజాన్ని, ముందు కాళ్లను ఉపయోగించి బాబును పడిపోకుండా గదిలోపలికి తోసింది. ఈ వీడియో క్లిప్పింగ్‌ను డయానా సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయింది. చూసిన వారంతా పిల్లి చేష్టను పెద్ద చేష్టగా ప్రశంసిస్తున్నారు. చిన్నారిని చాకచక్యంగా కాపాడిన ఆ మార్జాలం పేరు ‘గాటుబెలా’.. -
వైరల్: పిల్లే కనుక లేకుంటే ఎంత ప్రమాదం జరిగేది..
కొలంబియా : ఎక్కువగా అందరూ పెంచుకునే పెంపుడు జంతువు శునకం. విశ్వాసానికి, దర్పానికి మారుపేరు అంటూ కుక్కను పెంచుకునేవారు బోలెడుమందే ఉంటారు. దీని తర్వాతి స్థానంలో ఉండేది పిల్లి. కుక్క అంత కాకపోయినా పిల్లిని ప్రాణంగా పెంచుకునేవారూ ఉన్నారు. అయితే చాలామందికి పిల్లి అంటే గిట్టదు. దాన్నో అపశకునంగా భావిస్తారు. పిల్లులు పైకి ఏమీ తెలీనట్టు కనిపించే మహా ముదుర్లు అనేవారూ లేకపోలేరు. ఇక రాత్రిళ్లు దాని కళ్లు చూసి భయపడేవారు లేకపోలేదు. ఇంతలా దాన్ని అగౌరవపరిచేవారు ఈ వార్త చదివితే తప్పకుండా పిల్లిని మెచ్చుకోకుండా ఉండలేరు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఓ ఇంట్లో ఎవరిపనుల్లో వారున్నారు. పసిబాలుడు ఆడుకుంటూ ఆడుకుంటూ గదంతా తిరుగుతున్నాడు. అక్కడే ఉన్న పిల్లి ఆ బుడ్డోడిని ఓ కంట కనిపెడుతూ ఉంది. ఇంతలో ఆ పిల్లవాడు మెట్లవైపుకు పాక్కుంటూ వెళ్లాడు. అది చూసిన పిల్లి మెరుపువేగంతో పిల్లోడి దగ్గరికి వెళ్లి మెట్లవైపుకు వెళ్లకుండా అడ్డుకుంది. పిల్లోడిని వెనక్కు తరిమి, ప్రమాదం నుంచి రక్షించింది. ఈ తతంగం అంతా అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పిల్లే కనుక లేకుంటే ఎంత ప్రమాదం జరిగుండేదని నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పిల్లులను అసహ్యించుకునే వారికి ఈ వీడియో చూపించండంటూ ఓ నెటిజన్ పేర్కొన్నాడు. -
పామును రౌండ్ చేసి కన్ఫ్యూజ్ చేశాయి
-
పిల్లి పిల్లను ముద్దాడుతున్న కొతి
-
వైరల్: పిల్లి పిల్లపై ప్రేమను కురిపించిన కోతి
బ్యాంకాక్ : ఎవరైన అల్లరి పనులు చేస్తే కోతి చేష్టలు చేయకంటూ పెద్దలు హెచ్చరిస్తారు. అంటే కోతి అన్ని వింత చేష్టలు చేస్తుందని అర్థం. సాధారణంగా కోతులు తన పిల్లలను కొంత కాలం వరకు ఒంటికి అంటి పెట్టుకొని జాగ్రత్తగా చూసుకుంటాయి. వేరే జంతువులు వాటికి హానీ చేయాలని వస్తే సహించవు. కానీ పిల్లి పిల్లను కోతి దగ్గర చేసి ముద్దాడటం ఎక్కడైనా చూసారా?.. అవునండి ఈ వీడియో చూసిన తర్వాత కోతి మీద మీకున్న అభిప్రాయం మారవచ్చు. వివరాలు.. థాయ్‌లాండ్‌లో ఓ కోతి ఇంట్లో నుంచి పిల్లి పిల్లను అమాంతం ఎత్తుకొని వచ్చి.. కాస్తా దూరం తీసుకెళ్లి దాన్ని ముద్దు చేస్తూ, నిమరడం ప్రారంభించింది. అంతటితో ఆగకుండా దానికి అరటిపండుని తినిపించడానికి ప్రయత్నించింది. అయితే ఆ పిల్లి పిల్ల మాత్రం దాన్ని తినడానికి నిరాకరించింది. కాగా అందరిని ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న ఈ వింత దృశ్యం థాయ్‌లాండ్‌లో చోటు చేసుకుంది. దీనిని సమీప వ్యక్తి సెల్ఫోన్లో చిత్రీకరించి ఫేస్బుక్లో పోస్టు చేశాడు. ఆగస్టు 31న షేర్ చేసిన ఈ వీడియోను అనేక మంది వీక్షించడంతో పాటు లైకులు కొడుతూ కోతిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. -
పిల్లి.. బాతు అయిందా..!
ఎడిన్బర్గ్: సాధారణంగా పిల్లులతో ఆడుకుంటూ ఉంటాము. అవి నోటితో చేసే శబ్ధంతో వాటిని అనుకరిస్తూ ఆనందిస్తాం. అయితే పిల్లులు మ్యావ్.. మ్యావ్.. అనే శబ్ధాలు కాకుండా మరోలా అరవడం ఎప్పుడైనా విన్నారా.. కానీ ఆ విచిత్రం స్కాట్లాండ్ దేశంలోని ఎడిన్బర్గ్ నగరంలో చోటుచేసుకుంది. అక్కడ ఉండే ఓ ఎనిమల్ సెంటర్లోని ‘మెల్విన్’ అనే పిల్లి బాతు మాదిరిగా బక్.. బక్.. అనే శబ్ధం చేస్తూ అందర్నిఅశ్చర్యపరుస్తోంది. ఆ పిల్లి వెరైటీ కూతలను వీడియోలో బంధించిన సారా తోర్ణ్టన్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఈ విచిత్రపు పిల్లి అరుపులకు స్పందనగా..‘ పిల్లి చేసే శబ్ధం.. బాతు, పిల్లి కలిసిన ఓ కొత్త జంతువు చేసే శబ్ధంలా ఉంది. ఏంటో ఈ విచిత్రం’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. కాగా మరో నెటిజన్ ఏకంగా ఓ అడుగు ముందుకువేసి ఆ పిల్లిని దత్తత తీసుకొన్నాడు. అది వారి మనసు దోచుకుందని.. దానికి ఓ కొత్త కుటుంబం దొరికిందని పిల్లి పట్ల ప్రేమను చాటుకున్నాడు.