పిల్లి దొరికినప్పటి సీసీటీవీ దృశ్యాలు
మాస్కో : అదృష్టం తనకు పడిశం పట్టినట్లు పడుతుందని ఆ పిల్లి కల్లో కూడా ఊహించి ఉండదు. అదృష్టం అదుండే చెత్త కుప్పను తట్టి రాజ భోగాల్ని అందించింది. చెత్త కుప్పలో కుక్క! చావు చావాల్సిన అది మంత్రి ఆఫీసుకు చేరింది. సోషల్ మీడియా సెలెబ్రిటీ అయింది. వివరాలు.. గత సోమవారం రష్యాలోని ఉలియానోవ్స్క్లలో మున్సిపాలిటీ సిబ్బంది ఒకరు చెత్తను క్రష్(ముక్కలు ముక్కలుగా) చేసే యంత్రం దగ్గర ఉన్నాడు. ఓ తెల్లటి ప్లాస్టిక్ కవర్ కదలటం అతడు గమనించాడు. దాన్ని తెరిచి చూడగా అందులో ఓ పిల్లి కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు టీవీలో, సోషల్ మీడియా బాగా వైరలయ్యాయి. (నవ్వు తెప్పిస్తున్న ప్రాంక్ వైరల్ వీడియో)
దీంతో అక్కడి పర్యావరణ మంత్రిత్వ శాఖ దాన్ని దత్తత తీసుకుంది. అనధికారికంగా దానికి పర్యావరణ శాఖ ఉప మంత్రి హోదాను కల్పించింది. మంత్రి గుల్‌నారా కఖ్మతులిన అది మంత్రి ఆఫీసులోని కుర్చీలో నిద్రపోతున్న, తిరగాడుతున్న ఫొటోలను షేర్ చేశారు. దానికి పేరు పెట్టడానికి ఓ కంటెస్ట్‌ను కూడా పెట్టారు. మంత్రి మాట్లాడుతూ.. ‘‘ పిల్లులు పెంచుకునే యజమానులే వాటి బాధ్యత వహించాలి. మీరు వాటిని సరిగా చూసుకోలేకపోతే.. మంచిగా పెంచుకునే వారికి అప్పజెప్పండి’’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment