చటుక్కున ఒక్కట్టిచ్చి లాక్కెళ్లింది..!  వైరల్‌ వీడియో  | The kitten was lost from the mother cat, video goes viral | Sakshi
Sakshi News home page

చటుక్కున ఒక్కట్టిచ్చి లాక్కెళ్లింది..!  వైరల్‌ వీడియో 

Published Fri, Sep 29 2023 3:39 PM | Last Updated on Fri, Sep 29 2023 4:55 PM

A mother is mother always watchmother cat video going viral - Sakshi

అమ్మ ఎవరికైనా అమ్మే. అది మనిషికైనా కౄర జంతువుకైనా. బిడ్డ క్షణం కనిపించకపోతే అల్లాడిపోతోంది. ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న కన్నబిడ్డ  కంటికి కనిపించేదాకా తల్లిడిల్లిపోతుంది.   అమ్మకు తీరా బిడ్డ కనిపించగానే ఏమై పోయావురా..ఇంకొంచెం ఉంటే గుండె ఆగిపోయేది అంటూ ఒక్కటిస్తుంది  ఉబికివస్తున్న కన్నీళ్లద్దుకుంటూ.  మనలో  ఇలాంటి సంఘటన దాదాపు అందరికి అనుభవమే. అచ్చం ఇలాగే  చేసింది ఒక తల్లి పిల్లి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అవుతోంది.
 
 ఈ వీడియోలో ఒకపిల్లి తన పిల్లికూనను వెతుక్కుంటూ ఉంటుంది. ఇంతలో బుజ్జిది కనిపించగానే చటుక్కున ఒక్కటిచ్చి... నోటితో కరుచుకుపోయింది.  ఇది నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీన్ని ప్రముఖ సింగర్‌ చిన్మయి శ్రీపాదతోపాటు  వేల కొంతమంది రీట్వీట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement