
పెద్దవారు చిన్న పిల్లలను సంతోషపెట్టడానికి రకరకాల బహుమతులు ఇస్తుంటారు. కొందరు చాక్లెట్‌లు, ఆట బొమ్మలను బహుమతులుగా ఇస్తే.. మరికొందరు నచ్చిన ప్రదేశాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌లు వంటి వాటిని గిఫ్ట్‌లుగా ఇస్తుంటారు. చిన్న పిల్లలకు బహుమతులిచ్చి వారి కళ్లలో ఆనందాన్ని చూసి తల్లిదండ్రులు మురిసిపోతుంటారు. కొందరు తల్లిదండ్రులు మాత్రం.. తమ పిల్లలను సర్‌ప్రైజ్ చేయడానికి వినూత్నంగా ఆలోచిస్తుంటారు.
ఈ కోవకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో తల్లిదండ్రులు తమ పిల్లాడిని సర్‌ప్రైజ్ చేయాలనుకున్నారు. అతనికి కుక్కపిల్లలు (పప్పీ) అంటే ఇష్టం. అయితే, ఒకరోజు బాలుడి తల్లిదండ్రులు అతని కళ్లకు మాస్క్‌ను కట్టారు. ఆ తర్వాత.. టవల్‌తో చుట్టిన కుక్కపిల్లని.. బాలుడి చేతుల్లో ఉంచారు. మెల్లగా.. కళ్లకు కట్టిన మాస్క్ తీసేశారు.
అప్పుడు బాలుడు తన చేతిలో ఉన్న కుక్క పిల్లని చూసి ఆనందంతో మురిసిపోయాడు. వావ్.. అంటూ దాన్ని తన ప్రేమతో తన బుగ్గలకు హత్తుకున్నాడు. ప్రేమతో నిమిరాడు. ఆ తర్వాత.. సంతోషంతో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తల్లిని పట్టుకుని గట్టిగా ఏడ్చేశాడు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో వివరాలు తెలియవు. ఈ వీడియోను పర్రెరాస్ అనే యూజర్ ట్విటర్‌లో పోస్ట్ చేశాడు.
ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘వావ్..ఎంత ప్రేమతో హత్తుకున్నాడు..’, ‘కుక్కపిల్ల క్యూట్‌గా ఉంది’,‘ పప్పీని బాగా చూసుకోవాలి.. మీ ఇద్దరి ఫ్రెండ్ షిప్ బాగుండాలంటూ’ కామెంట్‌లు పెడుతున్నారు.
They surprised little man with a puppy, and I'm done for the day 🥺😢😭
— Jess💫 (@Jess_asli) November 1, 2021
🔊🔊
credit: Parreiras10 pic.twitter.com/YBHsTnLl92