Affection
-
అవ్వాతాతల అప్యాయతపై సీఎం జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: అవ్వాతాతల అప్యాయతపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘అవ్వాతాతలకి భరోసా కల్పిస్తూ వారికి అండగా నిలిచిన ప్రభుత్వం మనది. అవ్వాతాతల సంక్షేమం కోసం వారికి ఇచ్చే పెన్షన్‌ను రూ.3000కు పెంచి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. మనం చేసిన మంచి దారి పొడువునా వారు చూపిస్తున్న అభిమానంలో కనిపిస్తుంది’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. కర్నూలు జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది. జననేత సీఎం జగన్‌పై ప్రజలు హద్దులు లేని అభిమానం చూపుతున్నారు. వివిధ వర్గాల తరఫున సీఎం జగన్‌కు కానుకలు అందిస్తున్నారు. చిరునవ్వులతో స్వీకరించి వారితో సీఎం ఫొటోలు దిగారు. అవ్వాతాతలకి భరోసా కల్పిస్తూ వారికి అండగా నిలిచిన ప్రభుత్వం మనది. అవ్వాతాతల సంక్షేమం కోసం వారికి ఇచ్చే పెన్షన్‌ను రూ.3000కు పెంచి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. మనం చేసిన మంచి దారిపొడువునా వారు చూపిస్తున్న అభిమానంలో కనిపిస్తుంది.#MemanthaSiddham#VoteForFan pic.twitter.com/C0VOCM7NvQ — YS Jagan Mohan Reddy (@ysjagan) March 29, 2024 -
భారత్ అల్లునిగా.. జీ20 పర్యటన చాలా ప్రత్యేకం: రిషి సునాక్
ఢిల్లీ: జీ-20కి వేదికగా నిలిచిన భారత్‌కు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ చేరుకున్నారు. రిషి సునాక్ తన భార్య అక్షితా మూర్తితో కలిసి ఢిల్లీలోని విమానాశ్రయంలో దిగారు. కేంద్ర మంత్రి అశ్వినీ చౌబే ఆయనకు స్వాగతం పలికారు. విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శనను రిషి సునాక్ ప్రశంసించారు. భారత్‌లో జరుగుతున్న జీ20 సమావేశాలకు బ్రిటన్‌లో బయలుదేరే ముందు రిషి సునాక్ మీడియాతో మాట్లాడారు. భారత్ తనకు చాలా ప్రత్యేకమని అన్నారు. తనను భారతదేశ అల్లునిగా వ్యవహరించడాన్ని కూడా ఆయన గుర్తుచేశారు. తనపై ప్రేమతో భారతీయులు అలా పిలుస్తారని అన్నారు. ప్రధాని మోదీతో ప్రత్యేకంగా చర్చలు జరుపనున్నట్లు చెప్పారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నట్లు స్పష్టం చేశారు. జీ-20 సమావేశానికి ప్రపంచ అగ్రదేశాదినేతలు హాజరవుతున్నారు. శనివారం, ఆదివారం రెండు రోజులపాటు కీలక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశానికి జపాన్ ప్రధాని పుమియో కిషిదా, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ ఢిల్లీకి చేరుకున్నారు. ఇదీ చదవండి: భారత్‌ను ఇలా చూడడం గర్వంగా ఉంది: రిషి సునాక్ -
తెలుగు వారు ఎంతో ప్రేమను చూపించారు: రెబ్బా మోనికాజాన్
‘‘సామజవర గమన’ సినిమా సక్సెస్ టూర్‌కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు వెళ్లాం. నాకు తెలుగు భాష రాకపోయినా అక్కడి ప్రజలు నా పట్ల ఎంతో ప్రేమ,ఆప్యాయతను చూపించారు.అలాంటి ఆదరణ ఎక్కడా దొరకదు. అందుకే నేను తెలుగు ప్రజలకు దగ్గరగా ఉండాలనుకుంటున్నాను’’ అని రెబ్బా మోనికాజాన్ అన్నారు. శ్రీవిష్ణు, రెబ్బా మోనికాజాన్ జంటగా రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘సామజవరగమన’. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించిన ఈ మూవీ జూన్ 29న విడుదలైంది. ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌కి పరిచయమైన రెబ్బా మోనికాజాన్ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ–‘‘నేను మలయాళీ అయినా బెంగళూరులో పెరిగాను. చదువు పూర్తయ్యాక కొన్ని యాడ్స్ చేశాను. మలయాళంలో కొన్ని సినిమాలు చేశాను. దక్షిణాదిలో నేను ఇతర చిత్రాల్లో నటించినా ‘సామజవరగమన’ నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.అందుకే నేను చాలా లక్కీ అనుకుంటున్నాను. తెలుగులో కొన్ని కథలు వింటున్నాను. నా తర్వాతి సినిమాకి తెలుగు నేర్చుకొని డబ్బింగ్ చెబుతాను’’ అన్నారు. -
నేనున్నానని.. నీకేం కాదని..
‘‘పచ్చని చిలకలు తోడుంటే.. పాడే కోయిల వింటుంటే.. భూలోకమే ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింకా చెల్లు! ఓ పాటలోని పల్లవి ఈ వృద్ధ దంపతులను చూస్తుంటే సరిగ్గా సరిపోతుందని అనిపిస్తుంది.’’ సాక్షి, మేడ్చల్(హైదరాబాద్): ఆంధ్రప్రదేశ్ కు చెందిన కోసం నాగమ్మ, రంగారావు దంపతులు. మేడ్చల్ మున్సిపాలిటీ గిర్మాపూర్‌కు వచ్చి కూలీ పనిచేస్తు జీవనం సాగిస్తున్నారు. భార్య నాగమ్మ కూలి పని చేసే సమయంలో ఇనుప రాడ్ పైన పడటంతో చేతికి గాయమయ్యింది. మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. గిర్మాపూర్‌కు రోజు వెళ్లి రావాలంటే రూ.40 ఖర్చు అవుతుండటంతో వారు మేడ్చల్ బస్టాండ్‌లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. భార్య చేతికి నొప్పి ఎక్కువ కావడంతో ఆ బాధను తట్టుకోలేని రంగారావు ఆమె చేతికి కట్టు కడుతూ సపర్యాలు చేశారు. బుధవారం ఉదయం ఈ దృశ్యాన్ని సాక్షి మేడ్చల్ ప్రతినిధి క్లిక్‌మనిపించారు. చదవండి: 18 ఏళ్లు నిండాయా? ఓటరుగా నమోదు చేయించుకోండి -
Viral Video: సర్ప్రైజ్ గిఫ్ట్.. బాలుడు గుక్కపెట్టి ఏడ్చాడు..
పెద్దవారు చిన్న పిల్లలను సంతోషపెట్టడానికి రకరకాల బహుమతులు ఇస్తుంటారు. కొందరు చాక్లెట్లు, ఆట బొమ్మలను బహుమతులుగా ఇస్తే.. మరికొందరు నచ్చిన ప్రదేశాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్లు వంటి వాటిని గిఫ్ట్‌లుగా ఇస్తుంటారు. చిన్న పిల్లలకు బహుమతులిచ్చి వారి కళ్లలో ఆనందాన్ని చూసి తల్లిదండ్రులు మురిసిపోతుంటారు. కొందరు తల్లిదండ్రులు మాత్రం.. తమ పిల్లలను సర్ప్రైజ్ చేయడానికి వినూత్నంగా ఆలోచిస్తుంటారు. ఈ కోవకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో తల్లిదండ్రులు తమ పిల్లాడిని సర్ప్రైజ్ చేయాలనుకున్నారు. అతనికి కుక్కపిల్లలు (పప్పీ) అంటే ఇష్టం. అయితే, ఒకరోజు బాలుడి తల్లిదండ్రులు అతని కళ్లకు మాస్క్‌ను కట్టారు. ఆ తర్వాత.. టవల్‌తో చుట్టిన కుక్కపిల్లని.. బాలుడి చేతుల్లో ఉంచారు. మెల్లగా.. కళ్లకు కట్టిన మాస్క్ తీసేశారు. అప్పుడు బాలుడు తన చేతిలో ఉన్న కుక్క పిల్లని చూసి ఆనందంతో మురిసిపోయాడు. వావ్.. అంటూ దాన్ని తన ప్రేమతో తన బుగ్గలకు హత్తుకున్నాడు. ప్రేమతో నిమిరాడు. ఆ తర్వాత.. సంతోషంతో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తల్లిని పట్టుకుని గట్టిగా ఏడ్చేశాడు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో వివరాలు తెలియవు. ఈ వీడియోను పర్రెరాస్ అనే యూజర్ ట్విటర్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘వావ్..ఎంత ప్రేమతో హత్తుకున్నాడు..’, ‘కుక్కపిల్ల క్యూట్‌గా ఉంది’,‘ పప్పీని బాగా చూసుకోవాలి.. మీ ఇద్దరి ఫ్రెండ్ షిప్ బాగుండాలంటూ’ కామెంట్లు పెడుతున్నారు. They surprised little man with a puppy, and I'm done for the day 🥺😢😭 🔊🔊 credit: Parreiras10 pic.twitter.com/YBHsTnLl92 — Jess💫 (@Jess_asli) November 1, 2021 -
Viral: బిడ్డ చదువుకు తండ్రి గొడుగు
సాక్షి, యశవంతపుర(కర్ణాటక): దక్షిణ కన్నడ జిల్లా సుళ్య తాలూకా బాలక్క గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని ఆరుబయట వర్షంలో మొబైల్ఫోన్లో ఆన్లైన్ క్లాస్‌తో తంటాలు పడుతుండగా, ఆమె తడవకుండా తండ్రి గొడుగుతో నిలబడిన దృశ్యం వైరల్ అయ్యింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వేగం లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. సుళ్య తాలూకాలో బాలక్క గ్రామంలో మాత్రమే నెట్ అందుబాటులో ఉండడం వల్ల పరిసర పల్లెల విద్యార్థులు ఇక్కడికే వచ్చి ఆన్లైన్ తరగతులు వింటున్నారు. అలాగే ఓ బాలిక సిగ్నల్ బాగా వచ్చేచోట కూర్చుని క్లాస్ వింటుండగా వర్షం రావడంతో ఆమె తండ్రి గొడుగు పట్టి కన్నప్రేమను చాటుకున్నాడు. చదవండి: Fathers Day: నాన్న ఎవ్రీడే వారియర్.. -
Viral Video: శునకం చూపిస్తున్న ప్రేమకు నెటిజన్లు ఫిదా
అంకారా: శునకాన్ని విశ్వాసానికి మారుపేరుగా భావిస్తారు. పరిస్థితులను బట్టి మనుషులు మారిపోతుంటారేమో.. కానీ కుక్కలు మాత్రం అలాకాదు! అందుకే చాలా మంది శునకాలను తమ కుటుంబంలో ఒక సభ్యునిగా, ఎంతో ఆప్యాయంగా చూసుకుంటారు. వాటికి స్నానం చేయించటం దగ్గర నుంచి మంచి ఆహారం పెట్టడం, వాకింగ్‌కు తీసుకెళ్లడం వంటివి చేస్తుంటారు. కుక్కలు కూడా తమ యజమానుల పట్ల ఎనలేని విశ్వాసాన్ని చూపిస్తూ వారితో ప్రేమగా ఆడుకుంటాయి. ఒక్కోసారి తమ యజమాని కనిపించకపోతే తల్లడిల్లిపోతాయి. ఆహారం కూడా తినకుండా ఎదురుచూస్తాయి. ఇక యజమాని రాగానే, వారి చుట్టూ తిరుగుతూ.. తోక ఆడిస్తూ.. నాకుతూ.. తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటాయి. ఎవరైనా యజమానితో దురుసుగా మాట్లాడినా, కొట్టడానికి వెళ్లినా వారిపై దూకి దాడి చేస్తాయి. కాగా, ఇప్పటికే శునకాలు, తమ యజమానుల పట్ల ప్రదర్శించే ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా టర్కీలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. వివరాలు.. ఇస్తాంబుల్‌లోని బుయుకడా ఐలాండ్‌లోని ఒక మహిళ అనారోగ్యానికి గురై, కొన్ని రోజుల పాటు మంచానికే పరిమితమయ్యింది. ఆ మహిళ ఒక శునకాన్ని పెంచుకునేది. అయితే, ప్రతిరోజు తనతో ఆడుకునే యజమాని లేవకుండా ఒకే దగ్గర ఉండటాన్ని చూసి కుక్క తల్లడిల్లిపోయింది. ప్రతిరోజు తన యజమాని దగ్గరకు వెళ్లడం నోటితో నాకుతూ.. కదిలించటానికి ప్రయత్నించేది. కొన్ని రోజులకి ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో బంధువులు అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆ కుక్క కూడా అంబులెన్సు వెనుక పరిగెడుతూ ఆసుపత్రికి చేరుకుంది. ఆ తర్వాత, యజమానిని ఆసుపత్రి గదిలోకి తరలించారు. అయితే, శునకం మాత్రం.. తన యజమాని కోసం ఆసుపత్రి బయట కూర్చుని ఎదురుచూస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘ మనుషుల కంటే శునకాలే నయం’, ‘ఆ మహిళ నిజంగా అదృష్టవంతురాలు’, ‘ఆ కుక్క చూపిస్తున్న ప్రేమకు కన్నీళ్లు వస్తున్నాయి..’, ‘ఆ మహిళ తొందరగా కొలుకోవాలి’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. చదవండి: మెట్రోలో సీటు కోసం.. ఎంత పని చేశాడు! వైరల్ వీడియో -
పనులన్నీ మానేసి.. గ్రామస్తులంతా కదిలొచ్చి
గడివేముల: గురువు దేవుడితో సమానం. విద్యార్థిని సమాజంలో గొప్పమనిషిగా తీర్చిదిద్దడంలో ఉపా«ధ్యాయుడి పాత్ర కీలకం. అలాంటి ఉపాధ్యాయులు విద్యార్థుల్లోనే కాదు.. గ్రామస్తుల హృదయాల్లోనూ చెరగని ముద్ర వేసుకుంటారు. కర్నూలు జిల్లా గడివేముల మండలం బిలకలగూడూరు పంచాయతీ మజరా గ్రామమైన అళ్లగడ్డ ప్రాథమిక పాఠశాల ఏకోపాధ్యాయుడిగా 11 ఏళ్లపాటు సేవలందించిన రవి కూడా ఆ కోవలోకే వస్తారు. ఈయన ఆ పాఠశాలకు వెళ్లిన కొత్తలో పలువురు గ్రామస్తులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపించేవారు. కానీ వారి దృక్పథాన్ని రవి మార్చేశారు. పాఠశాలకు దగ్గరలోనే ఇల్లు అద్దెకు తీసుకుని, తన ఇద్దరు పిల్లలనూ అదే పాఠశాలలో చేర్పించారు. ఆయన బోధనా విధానం, వ్యవహారశైలి నచ్చడంతో గ్రామస్తులు కూడా తమ పిల్లలను సర్కారు బడికి పంపిస్తున్నారు. కాగా..గ్రామంలో 11 ఏళ్ల పాటు విద్యనందించిన రవి ప్రస్తుతం బదిలీ అయ్యారు. దీంతో బుధవారం పనులన్నీ మానేసి.. గ్రామస్తులంతా కదిలొచ్చి ఆయనకు ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఉపాధ్యాయుడు రవిని విద్యార్థుల తల్లిదండ్రులు భుజాలపైకెత్తుకుని ఊరేగించి ఆత్మీయాభిమానం చాటుకున్నారు. చదవండి: సంక్షేమ క్యాలెండర్: పథకాల అమలు ఇలా.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై బహిష్కరణ.. -
అమితాబ్ చెప్పిన చెట్టు కథ
బాధ ఇంటి మనిషిని కోల్పోయినప్పుడు మాత్రమే ఉండదు. ఇంటి చెట్టును పోగొట్టుకున్నప్పుడు కూడా ఉంటుంది. అమితాబ్ ఇప్పుడు అలాంటి బాధలో ఉన్నాడు. 43లో ఏళ్లుగా ఆయన ఇంట నీడనిస్తూ వచ్చిన ఒక గుల్మొహర్ చెట్టు మొన్నటి భారీ వర్షాలకు కూకటివేళ్లతో సహా కూలిపోయింది. అమితాబ్ ఆ చెట్టు ఫొటోలను తన బ్లాగ్‌లో పెట్టి దానితో తన అనుబంధాన్ని పంచుకున్నారు. ‘అది పోయేటప్పుడు కూడా నిశ్శబ్దంగా పోయింది. ఎవరికీ హాని కలిగించకుండా మెల్లగా వాలిపోయింది’ అని రాశాడాయన. అమితాబ్ బంగ్లా పేరు ‘ప్రతీక్ష’ అని చాలామందికి తెలుసు. 1976లో అమితాబ్ ఆ బంగ్లా కొన్నప్పుడు బంగ్లా మధ్యస్థలంలో అడుగు ఎత్తున ఉన్న ఆ మొక్కను నాటారట. అప్పటి నుంచి ఇంట్లో అది కూడా ఒక సదస్యుడయ్యింది. ‘పిల్లలు దాంతో పాటు పెరిగారు. దాని కిందనే ఆడుకున్నారు. హోలీ వచ్చినా, దివాలి వచ్చినా ఆ చెట్టుకే మేము సోకు చేసేవారం. అభిషేక్ బచ్చన్ పెళ్లి ఆ చెట్టు కిందనే జరిగింది. మా అమ్మా నాన్నలు మరణించినప్పుడు ఆ చెట్టు కింద జరిగిన ప్రార్థనల్లో అది కూడా పాల్గొనింది. ఇవాళ అది లేదు’ అని ఆయన భావోద్వేగంతో రాసుకొచ్చారు. బంగ్లా కొన్నాక తండ్రి హరివంశరాయ్ బచ్చన్ వచ్చి చూసి సంతోషించాడట. దానికి పేరు కూడా ఆయన కవిత్వం నుంచే తీసుకున్నారు. ‘అందరికీ ఇక్కడ స్వాగతం ఉంటుంది. ఎవరి గురించీ ప్రతీక్ష ఉండదు’ అని తండ్రి రాసిన కవిత నుంచి అమితాబ్ ప్రతీక్ష అనే మాట తీసుకుని తన బంగ్లాకు పెట్టుకున్నారు. అమితాబ్‌కు తన బాధ చెప్పుకుంటూ ఉంటే మధ్యతరగతి వారికి కొన్ని జ్ఞాపకాలు తాకవచ్చు. అద్దె ఇళ్లల్లో ఇష్టపడి పెంచుకున్న చెట్లను ఆ ఇళ్లు ఖాళీ చేసి వెళుతున్నప్పుడు వదల్లేక బాధ పడేవారు ఎందరో. ఏ బంధానికైనా ఏదో ఒకరోజు ఏదో ఒక రూపంలో ఎడబాటు తప్పదు కదా. -
బెజోస్, సాంచెజ్ సన్నిహిత ఫొటోలు
న్యూఢిల్లీ : ఒకరికొకరు ఆప్యాయ ఆలింగంలో తన్మయులవుతున్న ఈ జంట ఫొటో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. వారిలో అమెజాన్ ఈ కామర్స్ సంస్థ సీఈవో జెఫ్ బెజోస్ ఒకరు కాగా, మరొకరు ఆయన గర్ల్ ఫ్రెండ్ లారెన్ సాంచెజ్. 55 ఏళ్ల జెఫ్ బెజోస్, మీడియా దిగ్గజం బెర్రీ డిల్లర్ భార్య లారెన్ సాంచెజ్ (49) గత కొన్ని రోజులుగా సన్నిహితంగా తిరుగుతున్నారు. ఏడు కోట్ల డాలర్లు ఖరీదు చేసే తన భర్త ‘యాట్ ( విలాసవంతమైన మర పడవ)’లో లారెన్ సాంచెజ్, జెఫ్ బెజోస్ గురువారం సాయంత్రం ఇలా కెమెరాకు దొరికిపోయారు. అతిథుల కోసం నిరీక్షిస్తున్న వారు దొరికిన ఏకాంత క్షణాలను ఇలా వినియోగించుకున్నారు. లేత నీలి రంగు టీషర్టు ధరించిన లారెన్ భర్త బెర్రీ డిల్లర్ వచ్చి ఆ తర్వాత వారితో కలిశారు. జెఫ్, లారెన్ మధ్య ఉన్న బంధం ఎలాంటిదో తెలియదుగానీ వారి మధ్య సన్నిహిత సంబంధాలు కచ్చితంగా ఉండి ఉంటాయని ఫొటోను చూసిన నెటిజన్లు అనుమానిస్తున్నారు. అలెక్సా (మాటలను గుర్తుపట్టి అందుకు అనువుగా స్పందించి ఇంటర్నెట్ నుంచి మనకు కావాల్సిన సమాచారాన్ని, పాటలను అందించే పరికరం)లను తయారు చేస్తున్న అమెజాన్ యూనిట్లో పిల్లలో వెట్టి చేయిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో జెఫ్ ఫొటో జనాలను ఇలా ఆకర్షిస్తోంది. -
అమ్ము, పూర్విక.. ఓ మంచి నాన్న
తమ ఇంట ఉన్న ఆవు..దూడకు జన్మనివ్వడంతో ఓ చిట్టితల్లి దాని సంరక్షణ చూసుకుంటూ అనుబంధం పెంచుకుంది. అయితే పాల ఆదాయం తగ్గిపోతోందని ఆ చిట్టితల్లి తండ్రి ఆ దూడను ఓ కసాయికి అమ్మేశాడు. ఎంతగా ఏడ్చి మొత్తుకున్నా తండ్రి నిర్దయగా వ్యవహరించడంతో ఆ చిట్టితల్లి పొగిలి..పొగిలి ఏడ్చింది. అయినా తండ్రి కరకగపోవడంతో అన్నపానీయాలు ముట్టకుండా గాంధీగిరితో నిరసన వ్యక్తం చేసింది. దీంతో ఊరంతా కదిలి ఆ ఇంటి ముందు వాలింది. తలో మాట అనడంతో ఇక లాభం లేదని ఆ చిట్టితల్లి తండ్రి కసాయి వద్దకు పరుగులు తీశాడు. దూడతో చిట్టితల్లి ముందు ప్రత్యక్షమయ్యాడు. అంతే..ఆ చిట్టితల్లి కళ్లల్లో వెలుగులు! గ్రామస్తుల మోముల్లో నవ్వులు!! సాక్షి, పలమనేరు : మండలంలోని పెంగరగుంటకు చెందిన నారాయణప్ప పాడి ఆవులతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద కుమార్తె గ్రామ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి, చిన్నకుమార్తె పూర్విక 3వ తరగతి చదువుతున్నారు. ఇంట ఉన్న రెండు ఆవుల్లో ఒక ఆవు 5 నెలల క్రితం ఓ లేగదూడకు జన్మనిచ్చింది. రెండు పూటలా కలిపి ఈ ఆవు 14 లీటర్ల పాలిచ్చేది. ఈ పాలను నారాయణప్ప ఒక ప్రైవేటు డెయిరీకి పోసేవాడు. ఇక దూడ పుట్టినప్పటి నుంచి పూర్వికకు దానితోటే లోకం. స్కూలుకు వెళ్లి వస్తే సాయంత్రం నుంచి దానితోనే ముచ్చట్లు. గడ్డి పెట్టడం, నీళ్లు పట్టడం..ఆడుకోవడం చేసేది. ఇలా దానితో అనుబంధం బాగా పెంచుకుంది. దీనికితోడు మూడో తరగతి తెలుగు వాచకంలోని ‘పెంపుడు జంతువులు’ పాఠం ప్రభావం కూడా ఆ చిట్టితల్లిపై పడింది. పెంపుడు జంతువులు కూడా కుటుంబ సభ్యులతో సమానమని, పెంపుడు జంతువుల్లో ఆవు–దూడ గురించి కూడా టీచర్ చెప్పి ఉండడంతో దూడ కూడా తమ కుటుంబంలో ఒకదానిగా పూర్విక భావించింది. దానికో ముద్దు పేరు కూడా పెట్టుకుంది ‘అమ్ము’ అని! ఇక పాడి ఆవు రెండు పూటలా కలిపి 14 లీటర్ల పాలు ఇచ్చేది. ఉదయం, సాయంత్రం రెండేసి లీటర్ల చొప్పున దూడ తాగేస్తుండడంతో పాల ఆదాయం పడిపోతోందని నారాయణప్ప భావించాడు. దీనిని అమ్మేస్తే నెలకు మూడు వేల రూపాయల వరకు పాల ఆదాయం నష్టపోయే పరిస్థితి ఉండదని తలచాడు. అనుకున్నదే తడవుగా 5 నెలల వయసున్న దూడను పలమనేరులోని ఓ కసాయి అమ్మేయడంతో అతనొచ్చి దూడను పట్టుకుపోతుంటే పూర్విక అడ్డుకుంది. అమ్మును అమ్మడానికి వీల్లేదంటూ గొడవ చేసింది. అవేవీ పట్టించుకోకుండా ఆ చిట్టితల్లి తండ్రి ఉదయం 9 గంటల సమయంలో కసాయికి అప్పగించడంతో దానిని పట్టుకుపోయాడు. దీంతో కడుపు మండిన ఆ చిన్నారి ఉదయం నుంచి అన్నం తినకుండా ఏడవడం మొదలు పెట్టింది. ఎవరూ సముదాయించినా ఏడుపు మానలేదు. దీంతో ఊరి జనం కూడా ఇంటి ముందు గుమిగూడారు. ఓవైపు కన్నకూతురి ఏడుపు, మరోవైపు దూడ కనిపించక ఆవు దీనంగా అరుస్తుండడంతో ఆ చిన్నారి తల్లి లక్ష్మి మనసు కరిగింది. బిడ్డ కోసం దూడను తీసుకురమ్మంటూ భర్తను ప్రాధేయపడింది. ఇక గ్రామస్తులు కూడా హితోక్తులు పలకడంతో నారాయణప్ప ఇక లాభం లేదని పలమనేరుకు వెళ్లాడు. సాయంత్రం 4.30 గంటలకు లగేజి ఆటోలో తెచ్చిన దూడతో ఇంటి ముందు ప్రత్యక్షమయ్యాడు. అంతే! ‘అమ్మూ...అని గట్టిగా అరుస్తూ పూర్విక దాని దగ్గరకు పరుగులు తీసింది. గ్రామస్తులు కూడా ‘అబ్బా! ఈ చిన్నపిల్లకు దూడ అంటే ఎంతిష్టమో..ఎంత ప్రేమో. భలే గట్టిది..మొత్తానికి సోమవారం టౌనులో పండక్కి దూడ కోతకు కాకుండా కాపాడింది’’ అని మెచ్చుకుంటూ గ్రామస్తులు వెనుదిరిగారు. ‘అమ్ము’ను భారమనుకుంటే ఎవరికైనా ఇచ్చేద్దామంటూ స్థానిక అంజనాద్రి ఆలయం వద్దనున్న గోసంరక్షణా కేంద్రానికి తండ్రిని తీసుకెళ్లి పూర్విక తనే అప్పగించింది. నేను అప్పుడప్పుడూ వస్తాననంటూ దూడకు టాటా చెబుతూ సంతోషంగా ఇంటికి చేరింది. -
వైఎస్ జగన్‌పై అభిమానంతో..
సాక్షి, కామారెడ్డి: దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అన్నా.. ఆయన తనయుడు యువనేత జగన్మోహన్రెడ్డి అన్నా.. అతడికి వల్లమాలిన అభిమానం. వైఎస్సార్ సీఎంగా అందించిన సంక్షేమ పథకాలు ఆయనను వీరాభిమానిని చేశాయి. వైఎస్సార్ మరణంతో ఆయన ఎంతో కలత చెందాడు. అయితే వైఎస్సార్ ఆశయాల ను నెరవేర్చేందుకు ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుకు రావడంతో ఆయన కోసం నిరంతరం తపిస్తున్నాడు. జగనన్న సీఎం కావాలని కోరుతూ తిరుపతి వెంకన్నకు మొక్కుకున్నాడు. సీఎం అయ్యేదాక చెప్పులు తొడగనంటూ శపథం చేశాడు. ఆయనే కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రానికి చెందిన ఆముదాల భానుచందర్. స్థానికంగా డెకరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన గడచిన 16 రోజులుగా చెప్పులు లేకుండా తన పనులు చేసుకుంటున్నాడు. మండుటెండలో కూడా ఆయన కాళ్లకు చెప్పులు తొడగడం లేదు. వివరాల్లోకి వెళ్తే భానుచందర్ ఐదో తరగతి చదివే సమయంలో దివంగత వైఎస్సార్ మహా పాదయాత్రను చూసి అప్పటి నుంచి ఆయనకు అభిమానిగా మారాడు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వైఎస్సార్ అంటే ఆయన కు విపరీతమైన అభిమానం పెరిగింది. వైఎస్సార్ మరణంతో కలత చెందిన భానుచందర్, ఆయన ఆశయ సాధన కోసం జగన్మోహన్రెడ్డి జనం లో తిరుగుతుండడంతో జగన్‌లో వైఎస్సార్‌ను చూసుకుంటున్నాడు. ఏపీలో ఎన్నికలు రావడంతో జగన్ సీఎం కావాలంటూ తిరుపతి వెంకన్నకు మొక్కుకున్నాడు. అప్పటిదాకా చెప్పులు ధరించనని శపథం చేశాడు. ఆరోజు నుంచి జగన్ సీఎం కావాలంటూ పూజలు చేస్తున్నాడు. జగన్ సీఎం కాగానే తిరుపతికి కాలినడకన వెళ్లి వెంకన్న దర్శనం చేసుకుంటానని మొక్కుకున్నాడు. -
నీకు కొత్త డాడీని తెస్తాను.. ఓకేనా?
కొత్త సంబంధాలు ఉన్న అనుబంధాల్ని వెక్కిరిస్తాయి. ఒక కొత్త మనిషి ఒక కుటుంబంలోకి వచ్చినప్పుడు ఎన్నో తుపానులు చెలరేగుతాయి. అవి పైకి కనిపించకపోవచ్చు.. ఎప్పుడో అగ్నిపర్వతంలా బద్ధలౌతాయి. ఇలా ఓ కొత్త సంబంధం.. ఉన్న అనుబంధాన్ని వెక్కిరించిన వాస్తవగాథ ఇది. ఇంట్లో డ్రాయింగ్ రూమ్‌లో ఒక సోఫా సీట్‌కూ మరో సోఫా సీట్‌కూ మధ్య ఉన్న దూరం ఎంత? ఆప్యాయత, అవగాహన ఉంటే ఆరు అడుగులు. లేకుంటే? ఆరువందల కిలోమీటర్లు. ‘మా అమ్మాయి పారిపోయింది డాక్టర్’అయితే నా దగ్గరికి ఎందుకొచ్చారు? పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కదా కంప్లయింట్ చేయాలి’‘మా అమ్మాయి పిచ్చి వల్ల పారిపోయి ఉంటుందనుకుంటున్నాం డాక్టర్’‘మీరు విషయం చెప్పండి. పిచ్చి ఎవరికో తర్వాత తేలుద్దాం’ ‘నాకొక కూతురు డాక్టర్. అది పుట్టినప్పటి నుంచి నాకు సుఖం లేదు. ఇంకో బాబునో పాపనో కని ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో కానీ ఇద్దరం సాఫ్ట్వేర్ రంగంలో ఉండటం వల్ల వద్దనుకున్నాం. ఒక్కత్తే పాప. ఒక్కతే కనుక గారాలు. గారాలు చేసినంత మాత్రాన పిల్లలు పెడసరంగా ప్రవర్తిస్తారని అనుకోను. కాని మా పాప చాలా మొండిది. హ్యాండిల్ చేయడం కష్టంగా ఉండేది’ ఆగింది. ‘చెప్తూ వెళ్లండి’‘క్లాస్‌లో చాలా అల్లరి చేసేదట. స్కూల్ డైరీ తెరవాలంటే నా గుండె గడగడలాడేది. టీచర్ అన్ని కంప్లయింట్లు రాసేది. క్లాసు సరిగా వినదని.. ఫ్రెండ్స్‌తో కబుర్లు ఎక్కువ చెప్తుందని.. ఆర్డర్స్ ఒబే చేయదని.. పన్నెండేళ్లు వచ్చేసరికి ఇంట్లో స్కూలుకు వెళ్తున్నానని చెప్పి వెళ్లి కాఫీ షాప్‌లో కూచోవడం, షాపింగ్ మాల్స్‌లో తిరగడం. ఇంట్లో చిన్న చిన్న దొంగతనాలు చేసేది. ఇది పిచ్చే కదా డాక్టర్?’‘బిహేవియర్ డిజార్డర్’ ‘ఏదో ఒకటి. కాని ఈ బిహేవియర్‌తో నేను విసిగిపోయినా మావారు అస్సలు కోప్పడేవారు కాదు. ప్రపంచంలోని శాంతం మొత్తాన్ని ఒక సముద్రం చేస్తే ఆ సముద్రాన్ని పుక్కిట పట్టిన మహాముని ఆయన. కూతురంటే చాలా ఓర్పు. పదే పదే నచ్చజెప్పి తనను కరెక్ట్ చేయడానికి ఎఫెర్ట్ పెట్టేవాడు. విన్నట్టే కనిపించేది కానీ మళ్లీ సేమ్ బిహేవియర్ చూపించేది. ఈ ఇష్యూ ఇలా ఉండగా ఇంకో బిగ్ లాస్ మాకు వచ్చి పడింది. రెండేళ్ల క్రితం నా హజ్బెండ్ యాక్సిడెంట్లో చనిపోయాడు’...డాక్టర్ ఆమెనూ, ఆమె పక్కన ఉన్న వ్యక్తినీ చూశాడు.‘ఈయన నా రెండో భర్త’‘చెప్పండి’‘నా హజ్బెండ్ చనిపోయాక నాకు చాలా కష్టంగా అనిపించింది. భర్త లేని ఇల్లు. మాట వినని కూతురు. కాని తనలో సడన్ ఛేంజ్. చాలా మారిపోయింది. కొంచెం కంట్రోల్ అయ్యింది. ఫోన్ ఎడిక్షన్లాంటిది వదిలేసింది. స్కూలుకు బుద్ధిగా వెళ్లడం మొదలెట్టింది. మార్కులు కూడా తెచ్చుకుంటోంది. బహుశా తండ్రి లాస్‌ను ఫీలవుతూ ఆయన పట్ల రెస్పెక్ట్ చూపించాలని అలా మారిపోయిందేమో. లేదా నన్ను సఫర్ చేయడం ఎందుకు అనుకుందేమో. కారణం ఏదైనా ఇష్యూ సెటిల్ అయ్యిందని అనిపించింది. అయితే’... అని పక్కనున్న భర్త వైపు చూసింది. ‘అయితే?’‘నా వయసు ఎంతని? నలభై కూడా లేవు. నాక్కూడా ఒక మనిషి తోడు ఉండాలి కదా. ఈయన మా ఆఫీసులోనే కొలీగ్. సమ్ రీజన్స్ వల్ల ఎందుకో పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు. నా భర్త చనిపోయాక తనే నా పట్ల ఇంట్రెస్ట్ చూపించారు. పెళ్లి చేసుకుందాం అన్నారు. నో అనడానికి నాకేం రీజన్స్ కనిపించలేదు. మా అమ్మాయిని అడిగాను ఒకరోజు– నీకు కొత్త డాడీని తెస్తాను.. ఓకేనా అని. తను ఓకే అంది. ఇద్దరం పెళ్లి చేసుకున్నాం’ ఆగింది.ఒక నిమిషం ఊపిరి తీసుకొని మళ్లీ చెప్పింది.‘పెళ్లి చేసుకున్నానే కాని ఆ పని ఎందుకు చేశానా అని బాధ పడని క్షణం లేదు. పెళ్లయిన కొత్తలో సహజంగానే మా అమ్మాయి మీద అటెన్షన్ తగ్గింది. ఈయనతో స్పెండ్ చేసే టైమ్ పెరిగింది. దానికి తను హర్ట్ అయింది. రెండోదేమంటే తను వాళ్ల నాన్నను చూసింది. అలాంటి నాన్నే వస్తాడనుకుంది. వచ్చేశాడనుకుని తిరిగి పూర్వపు బిహేవియర్లోకి వెళ్లిపోయింది. బాగా అల్లరి చేసి ఈయన నుంచి అలాంటి బుజ్జగింపును ఎదురు చూసింది. అయితే ఆ నాన్నకు ఈ నాన్నకు పోలిక లేదని గ్రహించింది. ఈయన చెడ్డవాడు కాదు కానీ పిల్లల పెంపకం పట్ల కొన్ని కచ్చితమైన అభిప్రాయాలున్నాయి. వాటి అనుసారం కటువుగా వ్యవహరించడం మొదలుపెట్టారు. అరవడం, తిట్టడం, ఒకటి రెండుసార్లు చేయి చేసుకున్నారు. దాంతో తను హర్ట్ అయ్యింది. అక్కడి నుంచి ఇంకా ప్రవర్తన మారింది. అటు అమ్మాయికి చెప్పలేక ఇటు ఇతణ్ని సర్దలేక నరకం అనుభవిస్తున్నాను. ఆ నరకాన్ని ఇంకాస్త పెంచడానికి రెండు వారాల క్రితం నా కూతురు...’... ఏడుపు బిగపట్టింది.ఒక్క క్షణం తర్వాత– ‘నా కూతురు పారిపోయింది. ముంబైలో ట్రేస్ చేశామని చెప్పి పోలీసులు అక్కడకు వెళ్లారు. ఇవాళో రేపో తీసుకు వస్తారు. వచ్చాక మేము ఏం చేయాలి?’డాక్టర్ అంతవరకూ నోట్ చేస్తున్నది ఆపాడు. ప్యాడ్ మీద నుంచి పెన్సిల్ తీసి చూపుడు వేలు, బొటనవేలు మధ్యన ఆడించడం మొదలుపెట్టారు. ఒక్క క్షణం ఆగి అతనితో మాట్లాడాడు–‘మీరు ఈమెను మాత్రమే ఇష్టపడ్డారా? ఈమె కూతురితో పాటు ఇష్టపడ్డారా?’‘కూతురు ఉన్నట్టు నాకు తెలుసు. ఆ అమ్మాయిని బాగా చూసుకుంటానని చెప్పి పెళ్లి చేసుకున్నాను’‘మరి ఆ అమ్మాయి పట్ల ఇష్టం చూపించారా? ఆ అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడేలా చేశారా? ఇష్టం కంటే ముందు అధికారం చూపించినట్టున్నారు. ఇవాళ రేపు పిల్లలు తాము అంగీకరించిన వ్యక్తుల అధికారాన్నే భరించడం లేదు. మీరు అంగీకారం పొందకుండానే అధికారం చూపించారు. ఆ అమ్మాయి ఎందుకుంటుంది? మీరు ఒక రిలేషన్లోకి వస్తున్నప్పుడు దాని చుట్టూ ఉన్న అనేక విషయాల గురించి ఆలోచించాలి. కౌన్సెలింగ్ తీసుకోవాలి. మీరలా చేయలేదు. అన్నీ తెలుసనుకున్నారు’...ఆమెవైపు తిరిగాడు.‘మీరు మీకు ఇష్టమైన పెళ్లి చేసుకున్నారు కానీ మీ కుటుంబానికి ఇష్టమైన పెళ్లి చేసుకోలేదు. ఒక అనుబంధం విచ్ఛిత్తి అయ్యాక మరో అనుబంధంలోకి వెళ్లొచ్చు. వెళ్లాల్సిందే. కాని మీకొక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి అతణ్ణి పరిచయం చేసి కొంతకాలం వారిద్దరినీ గమనించాలని మీరు అనుకోలేదు. అంత ఓపిక పట్టలేకపోయారు. అరె... పాలలో చక్కెర కలవడానికే స్పూన్‌తో తిప్పాల్సి వచ్చినప్పుడు రెండు వేరు వేరు నేపథ్యాల నుంచి వచ్చిన మనుషులను కలపడానికి మీరు ఎంత ఎఫర్ట్ పెట్టాలి? వీరిద్దరి రిలేషన్ ఇలాగే ఉంటే విక్టిమ్ మీ అమ్మాయి అవదు. మీరు అవుతారు. సొంత బిడ్డను ఏమనలేక కొత్త రిలేషన్‌ను స్ట్రయిన్ చేయలేక మొత్తం బాధంతా మీరు పడతారు. ముందు మీ ముగ్గురు ఒక కుటుంబంగా మారండి. నేను చేయాల్సిన సహాయం చేస్తాను. అమ్మాయి రావడంతోటే ఆమెను ప్రేమించే తల్లిదండ్రులుగా వ్యవహరించి ముగ్గురూ నా దగ్గరకు రండి. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం’ వాళ్లిద్దరూ కొంచెం కుదుట పడ్డ మనసులతో లేచారు. ఆ కుటుంబం కూడా కుదుట పడగలదన్న నమ్మకం డాక్టర్‌కు ఉంది. – ఫ్యామిలీ డెస్క్ ఇన్పుట్స్: డాక్టర్ కల్యాణ చక్రవర్తి సైకియాట్రిస్ట్ -
జగనాభిమానం
► వినూత్న రీతిలో అభిమానం తెలుపుతున్న ఆటోడ్రైవర్ గజపతినగరం: మెంటాడ మండలం కంటుభుక్తవలస గ్రామానికి చెందిన చౌదరి జగన్ వినూత్న రీతిలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి కుటుంబ సభ్యులపై అభిమానం వ్యక్తపరుస్తున్నాడు. తలకు వైఎస్సార్, జగన్మోహన్రెడ్డి పేర్లు చెక్కించి సంబరపడుతున్నాడు. తమ తల్లిదండ్రులు నిత్యం వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి, ఆయన కుంటుంబాన్ని తలచుకుంటారని చెప్పాడు. వైఎస్సార్ ఫొటోకు ప్రతిరోజు పూజ చేస్తామన్నారు. ఆయన కుమారుడు జగన్మోహన్రెడ్డి అంటే చెప్పలేని అభిమానమని తెలిపాడు. అందుకే ప్రతి మూడు నెలలకోసారి విజయవాడ వెళ్లి వైఎస్సార్, జగన్మోహన్రెడ్డి పేర్లు తలపై చెక్కించుకుంటానని అన్నారు. భార్య సరస్వతి, నా తల్లిదండ్రులు నారాయణ, సింహాచలం, పిల్లలు దివ్య, స్వరూపలు జగన్ పేరుతో ఉన్న కటింగ్ కోసం ఎదురు చూస్తుంటారని తెలిపారు. గ్రామంలో నాతో పాటు జగన్మోహన్ రెడ్డి అంటే పల్లి శంకర్, పల్లిచిన్న, గణేష్ తదితర వీరాభిమానులు ఉన్నారన్నారు. -
‘క్రాస్’ అయిన అభిమానం
అభిమానిస్తే గుళ్లు కట్టడం, ద్వేషిస్తే సమాధి చేయడం వంటి రెండు వైపరీత్యాలు, విపరీతపైత్యాలు మన దగ్గర తప్ప ఇంకెక్కడా కనిపించవేమో! నటులకు గుళ్లు కట్టడం, నేతలకు అభిషేకాలు చేయించడం, పాదుకలతో ప్రచారం చేయడం వంటివి ఈ దేశంలో సర్వసాధారణం. తమిళనాడులో మరీ ఎక్కువ. మొన్నటికి మొన్న జయలలితకు ఆమె పార్టీ(ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం) సభ్యుడు గుడి కడితే.. ఇంకో విశ్వాసపాత్రుడు ఏకంగా శిలువెక్కేశాడు. షైహాన్ హుస్సైనీ అనే వ్యక్తి అమ్మ 67 పుట్టినరోజునాడు ఆమెకు కానుకగా ఈ దుస్సాహసానికి ఒడిగట్టాడు. పిచ్చి పీక్‌కి వెళ్లిపోవడం అంటే ఇదేనేమో! -
ప్రేమలు పూసిన తోట!
ఛాయాచిత్రం ‘కవిత్వాన్ని తూచడానికి నా దగ్గర రాళ్లు లేవు’ అన్నారు చలం. ప్రేమను కొలవడానికి మాత్రం ఏమున్నాయి? ‘ఏమీ లేవు’ అనుకుంటాంగానీ...ఒక మంచి కవిత చదివినప్పుడో, ఒక ఛాయాచిత్రాన్ని చూసినప్పుడో ప్రేమ, అనుబంధాలు, ఆప్యాయతలను తూచడానికి...అవి కాస్తో కూస్తో ప్రతిభను చాటుకున్నాయి అని మాత్రం అనిపిస్తుంది. ఇంగ్లండ్‌కు చెందిన ఒక వెబ్సైట్ ‘ఎ హార్మనీ లవ్ క్యాప్చర్డ్ కాంటెస్ట్’కు ఎన్నికైన పది ఫొటోలు గుండెలో పదిల పరుచుకునేలా ఉన్నాయి. నలుగురు సభ్యుల న్యాయనిర్ణేతల బృందం విజేతలను నిర్ణయించింది. ఈ బృందంలో ప్రసిద్ధ ఫొటోగ్రాఫర్లతో పాటు అనుబంధాల లోతు తెలిసిన మానసిక నిపుణులు కూడా ఉన్నారు. లీ జెఫ్రీ తీసిన ‘వుయ్ హ్యావ్ వాక్డ్ ఏ లాంగ్ వే టుగెదర్’ ఛాయాచిత్రం ‘విన్నింగ్ ఫొటోగ్రాఫ్’గా నిలిచింది. నాలుగో స్థానంలో నిలిచిన సమంతా మిల్లర్ ‘లవ్ టైమ్’లో గొప్ప తమాషా ఉంది. అందుబాటులో ఉండే వస్తువులతో కూడా అపురూపమైన భావాలను చాటవచ్చునని చెప్పిన ఫొటో ఇది. ‘‘ఒక్కమాటలో చెప్పాలంటే ఫొటోగ్రఫీ అనేది నా ప్రపంచం. బహుమతి గెలుచు కోవడం గొప్ప గుర్తింపు అనుకుంటున్నాను’’ అని సంతోషపడుతున్న సమంత... సింపుల్ ఐడియాతో బహుమతి గెలుచుకున్నారు. ఈ ఫొటో షూట్ కోసం తన బాయ్‌ఫ్రెండ్ షూ దొంగిలించి, దానికి తన షూ జత చేసి క్లిక్ అనిపించారట! చెల్లి ప్రేమను ముద్దొచ్చేలా ఫొటో తీశారు జోలంట. ఒలఫ్, ఆస్కార్ అనే సోదరులు తమ చెల్లిని ముద్దాడుతున్న దృశ్యం ఎంత ముద్దొచ్చేలా ఉందో కదా! -
ఇతడికి మిల్లీ‘వైరస్’ సోకింది..!
పాపులర్ అయిన పాప్ సింగర్స్‌కు హార్డ్‌కోర్ ఫ్యాన్స్ చాలా మందే ఉంటారు. అలాంటివారిలో కొందరికి పిచ్చి తారస్థాయికి చేరి ఉంటుంది. 40 యేళ్ల కార్ల్ మెకాయిడ్కు అమెరికాకు చెందిన మిల్లీసైరస్ అంటే అభిమానం. అది ఎంతంటే... ఒళ్లంతా ఆమె టాటూలు చెక్కించుకొనేంతగా! తాము అభిమానించే వ్యక్తుల పేర్లు, చిత్రాలను ఒంటిపై చెక్కించుకోవడం పాశ్చాత్యులకు మామూలే. కార్ల్ మాత్రం అంతటితో సంతృప్తి పడలేదు! మిల్లీ సైరస్ పేరును, ఆమె బొమ్మను, ఆమె కంపోజ్ చేసిన పాటల పేర్లను శరీరమంతా టాటూలుగా వేయించు కొన్నాడు. ఛాతి మీద సైరస్ పేరు, రెండు భుజాలకూ సైరస్ బొమ్మలు, చేతులు, కాళ్లు, పొట్ట, చేతి వేళ్లు, వీపు మీద, మెడ వెనుకభాగం... మొత్తం ఇతడి శరీరం మీద సైరస్కు సంబంధించి 22 టాటూ లున్నాయి. దీన్ని బట్టి ఇతడికి మిల్లీ సైరస్ వైరస్‌లా సోకిందని అనుకోవాలేమో! -
పోరాట స్ఫూర్తి
సాగరతీరంలో పాంచజన్యం ప్రతిధ్వనించింది. నాడు కురుక్షేత్ర సంగ్రామంలో పార్థసారథి పూరించిన ఆ శంఖనాదం దిగంతాలను తాకితే .. నేడు సమైక్యాంధ్ర సాధనే లక్ష్యంగా సాగిపోతున్న వైఎస్ తనయ, జగన్ సోదరి షర్మిల ‘సమైక్య శంఖారావం’ సమరనాదమై విచ్ఛిన్నకర శక్తుల గుండెల్లో గుబులు రేపింది. తమనిర్విరామ పోరుకు ఆలంబనగా, తమ ఆకాంక్షలకు అద్దంపట్టేలా అవిశ్రాంతంగా బస్సు యాత్ర జరుపుతున్న సోదరికి ఆదివారం విశాఖ జిల్లా, నగరవాసులు నీరాజనాలు పట్టారు. ఈ యాత్ర జన ఉద్యమావేశాన్ని ఉప్పెనలా మార్చింది..రేపటి వేకువ కోసం కలిసి పయనిద్దామని చేయి కలుపుతూ సాగింది. సాక్షి, విశాఖపట్నం : విశాఖ నగరం ఉప్పొంగింది. దివంగత నేత వైఎస్ తనయను చూసేందుకు కదలివచ్చింది. సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా ఆదివారం నగరంలోకి ప్రవేశించిన షర్మిలకు ఎదురెళ్లి బ్రహ్మరథం పట్టింది. షర్మిల కూడా అదే ఆప్యాయతతో అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ప్రధానంగా ఆమె యాత్ర సమైక్యవాదుల్లో నూతనోత్తేజాన్ని నింపింది. ప్రజల బాగు కోసం రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు ఎంతటి పోరుకైనా సిద్ధమని ఆమె చేసిన ప్రకటన అందరిలో పోరాట స్ఫూర్తిని రగిల్చింది. నక్కపల్లి బస నుంచి సరిగ్గా ఆదివారం ఉదయం 9.40 గంటలకు షర్మిల బయల్దేరారు. అక్కడి నుంచి జాతీయ రహదారిపై ఎస్.రాయవరం, ఎలమంచిలి, కశింకోట, అనకాపల్లి, గాజువాక మీదుగా విశాఖ మహానగరపాలక సంస్థ పరిధిలోని నాలుగు నియోజకవర్గాలు దాటుకుని జగదాంబ సెంటర్‌కు మధ్యాహ్నం 12.14 గంటలకు చేరుకున్నారు. అప్పటికే ప్రజలు పెద్ద ఎత్తున షర్మిలను చూసేందుకు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సమైక్య ఉద్యమం చేపట్టిన వివిధ ఉపాధ్యాయ, ఉద్యోగ, విద్యార్థి, కార్మిక సంఘాలు జననేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సోదరి ప్రసంగాన్ని వినడానికి రావడంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. 12.15 గంటలకు షర్మిల జగదాంబ సెంటర్లోని వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం ఆమె ప్రసంగాన్ని ప్రారంభించారు. ఏం పాపం చేశారని అన్నదమ్ములను విడదీశారు తెలుగు ప్రజల ఓట్ల భిక్షతో అధికారాన్ని అనుభవిస్తున్న కాంగ్రెస్ అన్నదమ్ముల్లా బతుకుతున్న ప్రజలను నిలువునా విడదీసి పాపం మూటగట్టుకుందని షర్మిల దుయ్యబట్టడంతో జనం నుంచి అనూహ్య స్పందన లభించింది. మహానేత వైఎస్ బతికున్నప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోయిన రాష్ట్రం, ఇప్పుడు సమర్థనాయకత్వ లేమి, విభజన ప్రకటనతో కుక్కలు చించిన విస్తరిలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరినడిగి రాష్ట్రాన్ని ముక్కలు చేశారని? అసలు ఆ అధికారం ఎవరిచ్చారంటూ మండిపడ్డారు. అసలు సీమాంధ్ర ప్రజలంతా హైదరాబాద్‌ను ఎందుకు వదిలిపోవాలని ప్రశ్నించడంతో సభికులంతా హర్షధ్వానాలు పలికారు. అసలు చంద్రబాబు లేఖ ఇవ్వడం వల్లే ఇప్పుడు రాష్ట్రానికి విభజన ముప్పు తలెత్తిందని, అలాంటి వ్యక్తి ‘హత్యచేసి తిరిగి ఆ శవం మీద పడి ఏడ్చిన తరహాలో’ మళ్లీ ప్రజల వద్దకు వస్తున్నారంటూ బాబు తీరును ఎండగట్టారు. అనంతరం 12.50 గంటలకు బయల్దేరి ఆనందపురం మండలానికి చేరుకున్నారు. అడుగడుగునా నీరాజనం జిల్లాలో షర్మిల రెండు రోజుల బస్సు యాత్ర పాయకరావుపేట, నక్కపల్లితో పాటు మరో ఎనిమిది మండలాలు మీదుగా సాగింది. జీవీఎంసీ పరిధిలోనూ ఈ యాత్ర దిగ్విజయమైంది. ఈ సందర్భంగా షర్మిలకు జనం అడుగడుగునా నీరాజనం పలికారు. శనివారం పాయకరావుపేటలో సభ అనంతరం ఆమె నక్కపల్లిలో రాత్రి బస చేశారు. దీంతో ఆదివారం ఉదయమే ఆమెను చూసేందుకు ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. బస్సు యాత్ర అనకాపల్లి బైపాస్ సెంటర్‌కు వచ్చే సరికి పెద్ద ఎత్తున జనం ఆమెను కలిసేందుకు ప్రయత్నించారు. కొందరు చెరకు రైతులు బెల్లం దిమ్మలను అభిమానంతో ఇచ్చారు. గాజువాక సెంటర్లో షర్మిలను చూసేందుకు వచ్చినవారితో రహదారులు నిండిపోయాయి. సమైక్యవాదులు నిరసన శిబిరాల నుంచి బయటకు వచ్చి షర్మిలకు స్వాగతం పలికారు. -
గీత స్మరణం
పల్లవి : సన్నజాజి తీవలోయ్... సంపంగి పూవులోయ్... చిలిపి సింగారులోయ్... పాపలు సిరులొలికే చిన్నారులోయ్... ॥ చరణం : 1 కన్నుల విందులోయ్ వెన్నెల చిందులోయ్ పచ్చని బ్రతుకులో పన్నీటి జల్లులోయ్ బాలల సందడే పరువూ వేడుకా ఇలు వాసికి మరో పేరు ఈ చిన్నారులే ॥ చరణం : 2 లోగిలి బలిమే బాలల నవ్వులూ ఇల్లాలి కలిమే పిల్లల కిలకిలా ఊరికి పండుగే ఇంటను ఊయలా సిరిసంపద మరో పేరు ఈ చిన్నారులే ॥ చరణం : 3 దాగుడుమూతలాడితే సూరీడు మెచ్చేను చెమ్మచెక్కలాడితే చందమామ మెచ్చేను చెమ్మ చెక్క చారెడేసి మొగ్గ ఇల్లుదీసి పందిరేసి పకపకలాడితే పిల్లలున్న లోగిలిని దేవుడే మెచ్చేను ॥ చిత్రం : అనురాగం (1963) రచన : మల్లాది రామకృష్ణశాస్త్రి సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు గానం : భానుమతి సాక్షి ఫ్యామిలీకి సంబంధించి మీ సలహాలను, సూచనలను పంపండి. ఫోన్: టోల్ ఫ్రీ నంబర్: 1800 425 9899 (ఉ.7.00-రా.8.00వరకు), పోస్ట్: సాక్షి ఫ్యామిలీ, 6-3-249/1, సాక్షి టవర్స్, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్-500034, మెయిల్: sakshi.features@gmail.com