గీత స్మరణం
పల్లవి :
సన్నజాజి తీవలోయ్...
సంపంగి పూవులోయ్...
చిలిపి సింగారులోయ్...
పాపలు సిరులొలికే చిన్నారులోయ్...
॥
చరణం : 1
కన్నుల విందులోయ్
వెన్నెల చిందులోయ్
పచ్చని బ్రతుకులో పన్నీటి జల్లులోయ్
బాలల సందడే పరువూ వేడుకా
ఇలు వాసికి మరో పేరు ఈ చిన్నారులే
॥
చరణం : 2
లోగిలి బలిమే బాలల నవ్వులూ
ఇల్లాలి కలిమే పిల్లల కిలకిలా
ఊరికి పండుగే ఇంటను ఊయలా
సిరిసంపద మరో పేరు ఈ చిన్నారులే
॥
చరణం : 3
దాగుడుమూతలాడితే సూరీడు మెచ్చేను
చెమ్మచెక్కలాడితే చందమామ మెచ్చేను
చెమ్మ చెక్క చారెడేసి మొగ్గ
ఇల్లుదీసి పందిరేసి పకపకలాడితే
పిల్లలున్న లోగిలిని దేవుడే మెచ్చేను
॥
చిత్రం : అనురాగం (1963)
రచన : మల్లాది రామకృష్ణశాస్త్రి
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
గానం : భానుమతి
సాక్షి ఫ్యామిలీకి సంబంధించి మీ సలహాలను, సూచనలను పంపండి. ఫోన్: టోల్ ఫ్రీ నంబర్: 1800 425 9899 (ఉ.7.00-రా.8.00వరకు), పోస్ట్: సాక్షి ఫ్యామిలీ, 6-3-249/1, సాక్షి టవర్స్, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్-500034, మెయిల్: sakshi.features@gmail.com