సాక్షి, తాడేపల్లి: అవ్వాతాతల అప్యాయతపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘అవ్వాతాతలకి భరోసా కల్పిస్తూ వారికి అండగా నిలిచిన ప్రభుత్వం మనది. అవ్వాతాతల సంక్షేమం కోసం వారికి ఇచ్చే పెన్షన్‌ను రూ.3000కు పెంచి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. మనం చేసిన మంచి దారి పొడువునా వారు చూపిస్తున్న అభిమానంలో కనిపిస్తుంది’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.
కర్నూలు జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది. జననేత సీఎం జగన్‌పై ప్రజలు హద్దులు లేని అభిమానం చూపుతున్నారు. వివిధ వర్గాల తరఫున సీఎం జగన్‌కు కానుకలు అందిస్తున్నారు. చిరునవ్వులతో స్వీకరించి వారితో సీఎం ఫొటోలు దిగారు.
అవ్వాతాతలకి భరోసా కల్పిస్తూ వారికి అండగా నిలిచిన ప్రభుత్వం మనది. అవ్వాతాతల సంక్షేమం కోసం వారికి ఇచ్చే పెన్షన్‌ను రూ.3000కు పెంచి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. మనం చేసిన మంచి దారిపొడువునా వారు చూపిస్తున్న అభిమానంలో కనిపిస్తుంది.#MemanthaSiddham#VoteForFan pic.twitter.com/C0VOCM7NvQ
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 29, 2024
Comments
Please login to add a commentAdd a comment