సాక్షి, తాడేపల్లి: పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు.. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మలివిడత ఎన్నికల ప్రచార భేరి మోగించారు.
ఇక సిద్ధం సభలు గ్రాండ్ సక్సెస్ కావడం.. బస్సు యాత్ర చరిత్ర సృష్టించడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు, సానుభూతిపరులు రెట్టించిన ఉత్సాహంతో కదం తొక్కుతున్నారు. ఈ క్రమంలో అనంతపురం జిల్లా తాడిపత్రి, తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలోని వెంకటగిరిలోని త్రిభువని సర్కిల్, నెల్లూరు లోక్‌సభ స్థానం పరిధిలోని కందుకూరు కేఎంసీ సర్కిల్‌లో ఆదివారం జరిగిన సభల్లో సీఎం జగన్ ప్రసంగించారు. మరోవైపు, ఎక్స్ (ట్విటర్) వేదికగా చంద్రబాబు మోసాలను సీఎం జగన్ ఎండగట్టారు.
‘‘అయ్యా చంద్రబాబూ.. 2014-19 మధ్య నీ పాలనలో జన్మభూమి కమిటీలను పెట్టావు 2019లో మేము అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చాం మరి నువ్వు పెట్టిన జన్మభూమి కమిటీల మీద నమ్మకం, విశ్వాసం ఉంటే మళ్లీ అధికారంలోకి రాగానే జన్మభూమి కమిటీలను తెస్తానని చెప్పే ధైర్యం నీకుందా చంద్రబాబు...? వచ్చే ఎన్నికల్లో మన వైసీపి అభ్యర్థులను ఆశీర్వదించి, ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.
అయ్యా చంద్రబాబు.. 2014-19 మధ్య నీ పాలనలో జన్మభూమి కమిటీలను పెట్టావు. 2019లో మేము అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చాం. మరి నువ్వు పెట్టిన జన్మభూమి కమిటీల మీద నమ్మకం, విశ్వాసం ఉంటే మళ్లీ అధికారంలోకి రాగానే జన్మభూమి కమిటీలను తెస్తానని చెప్పే ధైర్యం నీకుందా… pic.twitter.com/lSAAuOO7zw
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 28, 2024
Comments
Please login to add a commentAdd a comment