
తాడేపల్లి: ఉత్తారంధ్ర టీచర్స్ ఎమ్మెల్నీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రఘువర్మ ఓటమికి ప్రభుత్వ పనితీరే నిదర్శనమన్నారు , వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డి,. తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రెస్ మీట్ నిర్వహించిన సతీష్ రెడ్డి.. కూటమి సానుకూలే వర్గాలే ఆ పార్టీని ఓడించాయన్నారు. అవతల వాళ్ల మీది బురదజల్లడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్య అని, వాటిని అవతల వాళ్లు కడుక్కునే లోపేలే నీవు చేసే పనులు నువ్వు తెలివిగా చక్కబెట్టుకుంటావంటూ సతీస్ రెడ్డి మండిపడ్డారు.
చంద్రబాబుపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేస్తాం
‘చంద్రబాబు రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 21 ని వయిలెట్ చేశారు. ఆయనపై అనర్హతా వేటు వేయాలని గవర్నరుని కోరతాం. త్వరలోనే గవర్నరుని కలుస్తాం. గవర్నరు న్యాయం చేయకపోతే కోర్టుకు వెళతాం. చంద్రబాబు సీఎం పదవికి అనర్హుడు. సీఎం గా ఉన్న వ్యక్తి హేట్ స్పీచ్ చేయటం కరెక్టు కాదు. పోసాని మీద పెట్టిన సెక్షన్లే చంద్రబాబు మీద కూడా పెట్టవచ్చు. దాని ప్రకారం చంద్రబాబుపై అనర్హతా వేటు చేయవచ్చు. చంద్రబాబుపై అనర్హతా వేటు వేయాలని కోర్టులో పిటిషన్ వేస్తాం.
అప్పుడు వారి వల్లే గెలిచారు.. ఇప్పుడు వారి వల్లే ఓడిపోయారు..
2024లో ఉద్యోగుల మద్దతుతో కూటమి గెలిచింది. కానీ అదే ఉద్యోగుల చేతిలో 9 నెలలకే కూటమి ఘోరంగా ఓడిపోయింది. ఐఆర్, పిఆర్సీతో సహా ఏ సమస్యను కూడా ప్రభుత్వం పరిష్కరించలేదు. పిఆర్సీ కమీషన్ ని కూడా వేయలేదంటే ఉద్యోగులపై ప్రభుత్వానికి ఏం ప్రేమ ఉన్నట్టు?, ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రభుత్వానికి కనువిప్పు కావాలి. తెలంగాణ నుండి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని తీసుకురాలేకపోయారు.
ఈ సంవత్సరం ఒక్క అడ్మిషన్ ని కూడా ఏపీ నుంచి అంబేద్కర్ యూనివర్సిటీ తీసుకోలేదు. దీంతో 33 వేలమంది విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏ సమస్య అడిగినా తప్పించుకునేలా ప్రభుత్వం మాటలు చెప్తోంది. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూటమికి జనం వాతలు పెట్టే పరిస్థితి ఉంది. సీఎం చంద్రబాబు వైసీపి మీద చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు. రాగద్వేషం, పక్షపాతం లేకుండా పరిపాలన చేస్తానని చేసిన ప్రతిజ్ఞ ఏం అయింది. వైఎస్సార్ సీపీ వారికి పనులు చేయొద్దని ఎలా మాట్లాడతారు?, నీ 40 ఏళ్ల అనుభవం ఇదేనా?
పోసాని మీద పెట్టిన సెక్షన్లే చంద్రబాబు మీద కూడా పెట్టవచ్చు
పోసాని మీద పెట్టిన సెక్షన్లే చంద్రబాబు మీద కూడా పెట్టవచ్చు. చంద్రబాబు వేసిన విషబీజం ఆయన కార్యకర్తలకు నష్టం చేస్తుంది. రేపు అధికారం కోల్పోతే మీవారి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో ఏం గొప్ప జరిగినా అదేనని చెప్పుకోవటం చంద్రబాబు నైజం. విధ్వంసం అనే చంద్రబాబు స్కూళ్లను జగన్ బాగుచేయటం విధ్వంసంలాగా కనిపిస్తుందా?, వైద్యాన్ని ఇంటి దగ్గరే చేయించటం విధ్వంసమా?, చంద్రబాబు చేసే హేట్ స్పీచ్ వలన విధ్వంసం జరుగుతోంది. పోసాని కృష్ణమురళి మాటల వలన రాష్ట్రంలో గొడవలు జరిగాయని కేసులు పెట్టారు. మరి అవే మాటలు మాట్లాడిన చంద్రబాబు మీద ఎందుకు కేసులు పెట్టటం లేదు?
Comments
Please login to add a commentAdd a comment