
అనంతపురం: ఏపీలో టీడీపీ కూటమికి చట్టం చుట్టామా అని అన్నారు. మాజీ మంత్రి శైలజానాథ్. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధం అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు సంక్షేమం, అభివృద్ధి అందకూడదు అంటే ఎలా? అని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు.
వైఎస్సార్‌సీపీ నాయకులు శైలజానాథ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్థాయిని దిగజార్చుకున్నారు. ఆయన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధం. చేసిన ప్రమాణానికి విరుద్ధంగా చంద్రబాబు వ్యవహార శైలి ఉంది. అంతఃకరణ శుద్ధితో పనిచేయాలని భారత రాజ్యాంగం చెబుతోంది. సీఎం, మంత్రులు రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాలి. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు సంక్షేమం, అభివృద్ధి అందకూడదు అంటే ఎలా?.
రాష్ట్రంలో కులాలు, మతాలకు అతీతంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ సంక్షేమ ఫలాలు అందించారు. వైఎస్ జగన్‌ను చూసి చంద్రబాబు పాలన నేర్చుకోవాలి. వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్య పదజాలంతో టీడీపీ కూటమి నేతలు పోస్టింగ్స్ పెడుతున్నారు. టీడీపీ కూటమికి చట్టం చుట్టమా?. వారు ఎన్ని తప్పులు చేసినా ఎక్కడా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు ఎందుకు?’ అని ప్రశ్నించారు.

రెడ్‌బుక్ పేరుతో లోకేష్ అరాచకలు..
మరోవైపు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు దుర్మార్గం. వైఎస్సార్‌సీపీ నేతలపై చంద్రబాబు వ్యాఖ్యలు అప్రజాస్వామికం. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ప్రజలందరికీ బాధ్యుడిగా ఉండాలి. చంద్రబాబు తన వ్యాఖ్యలను వెంటనే ఉప సంహరించుకోవాలి. లేకపోతే ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు అనర్హుడు అని భావిస్తాం. రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో నారా లోకేష్ అరాచకాలు చేస్తున్నారు. బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగితే సీఎం హోదాలో ఉన్న వైఎస్సార్ రాజకీయాలు చూడలేదు. కులాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్ జగన్‌దే’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment