
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్ జగన్ అడిగే ప్రధాన ప్రతిపక్ష హోదా ఆయన కోసం కాదని.. అసెంబ్లీలో ప్రజల తరఫున పోరాటం చేయడానికి తగిన సమయం కోసం అడుగుతున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌ను నమ్మడం వల్లే ప్రజలు వారికి పట్టం కట్టారని.. చంద్రబాబు అబద్ధాలు నమ్మడం లేదని పవన్‌తో పచ్చి అబద్ధాలు మాట్లాడించారంటూ దుయ్యబట్టారు.
‘‘ప్రధాన ప్రతిపక్ష హోదా లేదంటున్న పవన్ కళ్యాణ్.. ప్రధాన ప్రతిపక్ష హోదా ఆయన పోషిస్తాడా..?. ప్రజల తరఫున పోరాటం చేస్తావా..?. నిన్ను శాశ్వతంగా భూస్థాపితం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. షర్మిల నువ్వు చంద్రబాబుకు చెంచాగిరి చేస్తున్నావా..?. నీ వ్యక్తిగత సమస్యలు ఉంటే ఇంట్లో చూసుకో. పవన్, షర్మిలను వినియోగించుకుని చంద్రబాబు గేమ్ ఆడుతున్నాడు. సమర్థమైన చర్చలు ప్రధాన ప్రతిపక్షం లేకుండా ఎలా జరుగుతాయి..?’’ అంటూ సతీష్‌కుమార్‌రెడ్డి నిలదీశారు.
‘‘మీరు ప్రధాన ప్రతిపక్ష హోదా లేదంటే ప్రజలు సమర్థించరు. సభ్యత్వం పోతోందంటున్నారు. సోనియాపై పోరాటం చేసిన చరిత్ర జగన్‌ది. రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తే 5.46 లక్షల ఓట్లతో ఆనాడు ఎంపీగా గెలిచిన వైఎస్ జగన్ ముందు మీరు ఫ్లూట్ ఊదుతున్నారా..?. మీరు కోర్టుకు ఇంతవరకూ ఎందుకు అఫిడవిట్ వేయడం లేదు..?. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే జరిగే నష్టం ప్రజలకే. అధికారపక్షంతో పాటు ప్రతిపక్షం ముఖ్యమే.
జగన్ చరిష్మా, సామర్థ్యం ఏంటో ఒకసారి తెలుసుకోండి. ఆయన అడుగు బయటపెడితే జనం ప్రభంజనంగా వస్తున్నారు. అనవసరమైన మాటలు మాట్లాడవద్దు.. జన ప్రభంజనంలో కొట్టుకుపోతారు. నువ్వు హామీగా నిలబడ్డ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించు. పవన్ కళ్యాణ్.. ఇప్పటీకైన మేలుకో.. లేదంటే చంద్రబాబు నిన్ను ముంచేస్తాడు. షర్మిల.. మీరు కాంగ్రెస్‌కు వ్యతిరేకమైన పార్టీలతో పోరాడుతున్నారా? లేక వ్యక్తిగత ఎజెండా అమలు చేస్తున్నావా..?’’ అంటూ సతీష్‌రెడ్డి దుయ్యబట్టారు.

Comments
Please login to add a commentAdd a comment