AP Assembly Sessions
-
24 నుంచి అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర శాసనసభ బడ్జెట్(Legislative Assembly budget) సమావేశాలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఆరోజు ఉదయం 10 గంటలకు శాసన సభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేరుతో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 28న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆరోజు వీలుకాని పక్షంలో వచ్చే నెల 3వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని పేర్కొన్నాయి.మూడు వారాల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అలాగే ఈ నెల 22, 23 తేదీల్లో అసెంబ్లీ కమిటీ హాలులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. వీటి ప్రారంభానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సోమవారం ఢిల్లీ వెళ్లారు. శిక్షణా తరగతులకు వచ్చేందుకు ఓం బిర్లా అంగీకరించినట్లు వారు తెలిపారు. ముగింపు కార్యక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ఆహ్వానించినట్లు చెప్పారు. -
పీఏసీ ఎన్నికల్ని బాయ్‌కాట్ చేసిన వైఎస్సార్సీపీ
అమరావతి, సాక్షి: రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ)కి ఎన్నికలు నిర్వహించాల్సి రావడం దురదృష్టకరమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు పార్టీ తరఫున శుక్రవారం ఆయన ప్రకటించారు.‘‘ఇప్పటివరకు ప్రతిపక్షానికి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, కూటమి ప్రభుత్వం ఆ ఆనవాయితీకి విరుద్ధంగా చేస్తోంది. అందుకే ఈ ఎన్నికలను బాయ్‌కాట్ చేస్తున్నాం. గతంలో సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా పీఏసీ ప్రతిపక్షానికే ఇచ్చారు. ప్రతిపక్ష హోదా లేని పార్టీలకు కూడా అనేకసార్లు పదవి అప్పగించారు. పార్లమెంట్లో సైతం ఇలాంటి పరిణామం అనేకసార్లు చోటు చేసుకుంది... పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతుంది. అందుకే ప్రతిపక్షానికి ఇస్తారు. ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాల్లో అన్నింటా ప్రతిపక్షానికే పీఏసీ ఇస్తారు. ఒక్క తాలిబన్లు పాలిస్తున్న ఆఫ్ఘనిస్తాన్‌లో తప్ప. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం దగ్గరి నుంచి కోల్ గేట్ స్కామ్, కామన్ వెల్త్ గేమ్స్ కుంభకోణం.. అన్నీ పీఏసీనే వెలికితీసింది. 1994లో కాంగ్రెస్ పార్టీ కి ప్రతిపక్ష హోదా లేకపోయినా కాంగ్రెస్ కి పీఏసీ చైర్మన్ ఇచ్చారు... మాకు గతంలో 151 మంది ఎమ్మెల్యేలు బలం ఉన్నా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కి పీఏసీ చైర్మన్ ఇచ్చాం. కానీ, ఇప్పుడు పీఏసీకి ఎన్నికలు నిర్వహించడం దురదృష్టకరం. ఈ ప్రభుత్వం ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పీఏసీ చైర్మన్ ను ఇవ్వడం లేదు. అందుకే.. ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం’’ అని పెద్దిరెడ్డి ప్రకటించారు. -
ఫ్లాష్‌బ్యాక్ గుర్తుందా చంద్రబాబూ?
అమరావతి, సాక్షి: అసెంబ్లీ ఎన్నికల వాతావరణంతో ఒక్కసారిగా వేడెక్కింది. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే తొలిసారిగా ప్రజా పద్దుల సంఘం(PAC) ఛైర్మన్ పదవికి ఎన్నిక జరగబోతోంది. వైఎస్సార్సీపీకి తగిన సంఖ్యా బలం లేదనే సాకు చూపిస్తూ.. అసెంబ్లీ సంప్రదాయానికి విరుద్ధంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణం.పీఏసీ చైర్మన్ పదవిని ఏకగ్రీవంగా.. ప్రతిపక్షానికి ఇవ్వడం ఆనవాయితీగా(1966 నుండి) వస్తోంది. అధికార కూటమి తర్వాత ఉంది.. విపక్ష స్థానంలో వైఎస్సార్సీపీనే కాబట్టి న్యాయంగా ఆ పదవి ఆ పార్టీకే దక్కాలి. అయితే.. ఆ సంప్రదాయానికి గండికొట్టి.. తామే దక్కించుకోవాలని కూటమి ప్రయత్నిస్తోంది. పైగా ఏకగ్రీవం చేయకుండా.. కావాలనే కూటమి పార్టీ వాళ్లతో కావాలనే నామినేషన్లు వేయించారు చంద్రబాబు. అయితే..సంప్రదాయంగా తమకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ తరఫున పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అయితే.. నామినేషన్ సమయంలోనూ చివరిక్షణం దాకా అసెంబ్లీ సెక్రటరీ ఛాంబర్ వద్ద పెద్దడ్రామానే నడిచింది. ఇక.. మొత్తం 9 మంది సభ్యులకు 10 నామినేషన్లు(టీడీపీ 7, జనసేన 1, బీజేపీ 1, వైఎస్సార్సీపీ 1) వచ్చాయి. దీంతో పీఏసీకి ఎన్నిక అనివార్యమైంది. ఇవాళ సభ జరిగే టైంలోనే.. బ్యాలెట్ ద్వారా పోలింగ్ నిర్వహిస్తారు.వైఎస్సార్సీపీ హయాంలో గుర్తుందా?2019లో టీడీపీకి 23మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నా వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. కేబినెట్ హోదా కలిగిన పీఏసీ చైర్మన్ పదవి టీడీపీకి కేటాయించింది. ఉన్న 23 మందిలో ఐదుగురు పక్కకు వెళ్లిన తరుణంలోనూ ప్రజాస్వామిక సంప్రదాయాలను కొనసాగించారు వైఎస్ జగన్. ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కి అప్పట్లో ఈ పదవి అప్పగించారు... అప్పట్లో వైఎస్సార్సీపీకి ఉన్న 151 మంది ఎమ్మెల్యేల బలంతో టీడీపీకి పీఏసీ ఇవ్వకూడదని అనుకుంటే ఎన్నిక జరిపే అవకాశం ఉన్నా అలా మాత్రం చేయలేదు. ప్రజాస్వామిక సూత్రాలకు, సంప్రదాయాలకు గౌరవం ఇచ్చి పీఏసీ చైర్మన్ పదవిని అప్పట్లో టీడీపీకి కేటాయించారు. కానీ,అందుకు విరుద్ధంగా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీకి పీఏసీ పదవి దక్కకుండా చేసేందుకు ఎమ్మెల్యేల తరఫున ఉన్న 9 మంది పీఏసీ సభ్యత్వాలకు (టీడీపీ తరఫున 7, జనసేన 1, బీజేపీ 1) కూటమి తరఫున నామినేషన్లు వేయించడం గమనార్హం. పీఏసీతో పాటు అంచనాల కమిటీ, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీలకు ఇవాళ ఎన్నిక జరగనుంది. ఒక్కో కమిటీలో 9 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలకు చోటు ఉంటుంది. -
పెద్దిరెడ్డి నామినేషన్ టైంలో హైడ్రామా.. బొత్స ఆగ్రహం
సాక్షి, అమరావతి: పీఏసీ చైర్మన్ పదవికి మాజీ మంత్రి, పుంగనూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అయితే నామినేషన్ స్వీకరణకు ముందు అసెంబ్లీలో పెద్ద హైడ్రామానే నడిచింది. పెద్దిరెడ్డిని, ఆయనతో ఉన్న వైఎస్సార్సీపీ నేతలను అధికారులు 2 గంటలపాటు ఎదురుచూసేలా చేశారు. ఈ పరిణామంపై బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఏసీ చైర్మన్ నామినేషన్ దాఖలు కోసం గడువు మధ్యాహ్నం 1 గంటతోనే ముగియాల్సి ఉంది. దీంతో నామినేషన్ పత్రాలతో వైఎస్సార్సీపీ నేతలు 11గం.కే అసెంబ్లీ కార్యదర్శి ఛాంబర్ వద్దకు చేరారు. అయితే అధికారులు లేకపోవడంతో ఎదురు చూడసాగారు. సుమారు 2 గంటలపాటు అధికారుల రాక కోసం వాళ్లంతా పడిగాపులు కాశారు. నామినేషన్ ముగింపు గడువు దగ్గర పడుతుండడంతో.. విషయం తెలిసి బొత్స అక్కడికి వచ్చారు. ‘‘సమయం పెట్టి కూడా నామినేషన్ తీసుకోరా? ఇంత సేపు ఎమ్మెల్యేలను ఎదురు చూసేలా చేస్తారా?’’ అంటూ అంటూ అసెంబ్లీ కార్యదర్శి ప్రసన్న కుమార్‌పై మండిపడ్డారు. అదే సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు.. అటువైపు రావడం బొత్స గమనించారు. అచ్చెన్నను ఆపి అధికారుల తీరు గురించి ప్రస్తావించారు. దీనిపై స్పందించిన మంత్రి అచ్చెన్న.. అధికారులతో తాను మాట్లాడతానని చెప్పి వెళ్లిపోయారు.కాసేపటికే అధికారులు వచ్చి.. పెద్దిరెడ్డి నామినేషన్ స్వీకరించారు. ఈ నామినేషన్‌ను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్ బలపరిచారు. -
రుషికొండపై కట్టినవి ప్రభుత్వ భవనాలే
సాక్షి, అమరావతి: విశాఖలో రుషికొండపై నిర్మించిన భవనాలన్నీ ప్రభుత్వ భవనాలని, అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే వాటిని నిర్మించినట్లు మంత్రే స్వయంగా చెప్పారని, వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలన్నది ప్రభుత్వ ఇష్టమని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు. ఈ భవనాలను రాష్ట్రపతి, ప్రధాని వంటి అతిథులు రాష్ట్రానికి వచ్చినప్పుడు గెస్ట్హౌస్లుగానో లేక వేరే విధంగా వినియోగించుకుంటారా... అన్నది ప్రభుత్వ ఇష్టమన్నారు. మంగళవారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో రుషికొండ భవనాలపై చర్చ జరిగింది.ఈ చర్చలో బొత్స మాట్లాడుతూ హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి నివాసం కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రగతి భవన్‌ను నిర్మించారని, ఆ తర్వాత సీఎంలు ఆ భవనాలను వినియోగించుకుంటున్నారని, అదేవిధంగా రుషికొండ భవనాలను కూడా వినియోగించుకోవచ్చని చెప్పారు. ఒక పక్క అన్ని అనుమతులు ఉన్నాయని చెబుతూనే, ప్రజల ఆమోదం లేకుండా నిర్మించారని మంత్రి దుర్గేష్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. అసలు ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా ఉపన్యాసం చేస్తుండటంతో మధ్యలో కల్పించుకొని వివరణ ఇస్తున్నానని తెలిపారు.మరో మంత్రి అచ్చెన్నాయుడు కల్పించుకుని అసెంబ్లీ, సచివాలయం నిర్మాణం కోసం చదరపు అడుగుకు వారు రూ.6,500 ఖర్చు చేస్తే, రుషికొండలో ఏకంగా రూ.25,000 ఖర్చు చేశారంటూ తప్పుదోవ పట్టిస్తున్నారని బొత్స అన్నారు. 2015లో శాసనసభ నిర్మాణానికి ఫర్నిచర్‌తో కలిపి చదరపు అడుగుకు రూ.14,000 ఖర్చు చేశారన్నారు. ఉప ముఖ్యమంత్రి కూడా ఈ భనాలను చూసి తాజ్‌మహల్ కంటే చాలా బాగున్నాయని పొగిడిన సందర్భాన్ని గుర్తు చేశారు.వాస్తవాలు ఇలా ఉంటే మంత్రులే çసంయమనం పాటించకుండా ప్రభుత్వ ఆస్తులను వ్యక్తిగత ఆస్తులుగా చిత్రీకరిస్తూ రండి చూసుకుందాం.. దమ్ముంటే రండి... అంటూ మాట్లాడటం కరెక్ట్ కాదని, ఈ పదాలను తక్షణం రికార్డుల నుంచి తొలగించాలంటూ బొత్స డిమాండ్ చేశారు. అంతకముందు మంత్రులు కందుల దుర్గేష్, అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అప్పటి మున్సిపల్ మంత్రి అయిన మిమ్మల్ని కూడా చూడనీయకుండా దాచిపెట్టి కట్టినందుకు క్షమాపణ చెప్పకుండా ఎదురుదాడి చేస్తారా.. అంటూ బొత్స సత్యనారాయణను ఉద్దేశించి రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సభలో వైఎస్సార్సీపీ సభ్యులు, మంత్రుల మధ్య వాగ్వాదం జరిగింది.అన్నదాత సుఖీభవ నిధులు రైతులకు ఎప్పుడిస్తారు?రబీ అయిపోయి ఖరీప్ వచ్చినా ఇప్పటివరకు రైతులకు అన్నదాత సుఖీభవ కింద కూటమి ప్రభుత్వం ఇస్తామన్న రూ.20వేల నగదు సాయంలో ఒక్కపైసా విడుదల కాలేదని, ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని మండలిలో వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు రాజశేఖర్, రామసుబ్బారెడ్డి ఈ అంశంపై మాట్లాడుతూ 52 లక్షల మంది రైతులకు రూ.10,500 కోట్లు అవసరమైతే బడ్జెట్లో కేటాయించిన రూ.4,500 కోట్లు ఎలా సరిపోతాయని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇందులో కూడా రూ.3,500 కోట్లు పీఎం కిసాన్ కింద ఇచ్చే కేంద్ర నిధులని, కేవలం రూ1,000 కోట్లే రాష్ట్ర నిధులను కేటాయించారన్నారు.కౌలు రైతులను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఇది మరింత పెరుగుతుందన్నారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం విధివిధానాలు తయారు చేస్తున్నామన్నారు. కేంద్రం ఇచ్చే రూ.6,000కు రూ.14,000 కలిపి మొత్తం రూ.20,000 త్వరలోనే అందిస్తామన్నారు. గత ప్రభుత్వం ఈ–క్రాప్ ఆధారంగా ఉచిత పంటల బీమా అందించి ఏ సీజన్లో నష్టపోయిన రైతులకు ఆ సీజన్లోనే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిందని, ఇప్పుడు జూలై, ఆగస్టు నెలల వర్షాల వల్ల జరిగిన పంట నష్టం ఇంతవరకు ఇవ్వలేదని వైఎస్సార్సీపీ సభ్యుడు తోట త్రిమూర్తులు విమర్శించారు.ఫైళ్ల దగ్ధం కేసు విచారణ జరుగుతుండగా పేర్లు ఎలా చెబుతారు?: బొత్సమదనపల్లి ఫైళ్ల దగ్ధంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ తప్పు జరిగితే విచారణ చేసి దోషులపై కఠిన చర్య తీసుకోవచ్చని, కానీ విచారణ జరుగుతుండగానే కొంతమంది పేర్లను నిబంధనలకు విరుద్ధంగా ఏ విధంగా ప్రస్తావిస్తారని నిలదీశారు. ఆ పేర్లను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. గతంలో చినజీయర్ స్వామి, ఈషా ఫౌండేషన్లకు చంద్రబాబు ఇచ్చిన విధంగానే వేద పాఠశాల నిర్మాణం కోసం ధార్మిక సంస్థలకు భూ కేటాయింపులు చేశారని చెప్పారు. ఇందులో ఏమైనా తప్పులు జరిగి ఉంటే చట్టప్రకారం చర్య తీసుకోవడానికి తాము వ్యతిరేకం కాదన్నారు. -
ఏపీ అసెంబ్లీలో మంత్రుల తీరుపై TDP MLA కూన రవి విమర్శలు
-
ప్రశ్నించిన వైఎస్సార్సీపీ.. సమాధానం చెప్పలేక ఊగిపోయిన మంత్రి సత్యకుమార్
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు వర్సెస్ మంత్రులు అన్నట్టుగా చర్చ నడుస్తోంది. వైఎస్సార్సీపీ నేతలు అడుగుతున్న ప్రశ్నలకు కూటమి నేతల వద్ద సమాధానం లేకపోవడంతో సభను తప్పుదోవ పట్టించే విధంగా మంత్రులు ఆవేశంతో ఊగిపోతున్నారు. తాజాగా మంత్రి సత్య కుమార్ సమాధానం చెప్పకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేశారు.అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలపై జవాబు ఇవ్వాల్సిన బాధ్యత మంత్రులపై ఉంటుంది. కానీ, ఏపీ శాసన మండలిలో మాత్రం మంత్రులు దీనికి విరుద్దంగా ప్రవరిస్తున్నారు. సమావేశాల సందర్బంగా నేడు మండలిలో మెడికల్ కాలేజీల నిర్మాణాలపై చర్చ జరిగింది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రభుత్వమే పూర్తి చేస్తారా? లేదా?. సీట్ల భర్తీ కోసం ఏ ఫార్ములాని అనుసరిస్తున్నారు. గుజరాత్ ఫార్ములాని అమలు చేస్తున్నారా?. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉన్న సీట్లను నీట్ కౌన్సెలింగ్ ద్వారా చేయాలన్నారు.ఎమ్మెల్సీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన మంత్రి సత్య కుమార్ ఆవేశంతో ఊగిపోయారు. సమాధానం చెప్పకుండా.. డైవర్ట్ చేసే విధంగా కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..‘సభ్యులు అడిగిన ప్రశ్నకి మంత్రి సమాధానం చెప్పాలి. మెడికల్ కాలేజీలకు నాబార్డు నుండి లోన్ తెచ్చాం. 50శాతం కేంద్రం గ్రాంట్ ఇచ్చిందని చెప్పడం సమంజసం కాదు. పులివెందుల మెడికల్ కాలేజీ నిర్మాణం జరిగితే విమర్శించడం ఏంటి?. అందరిని రెచ్చగొట్టేలా మంత్రి మాట్లాడటం కరెక్ట్ కాదు. మంత్రి సత్య కుమార్ సభని తప్పుదోవ పట్టించారు. మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసినందుకు నిరసన తెలుపుతున్నాం. మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు నిరసనగా వాకౌట్ చేస్తున్నాం’ అని తెలిపారు. -
కూటమి సర్కార్‌కు ఊపిరి సలపనివ్వని వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: ఏపీ శాసనమండలిలో బడ్జెట్‌పై వాడీవేడి చర్చ జరిగింది. పలు అంశాలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించగా.. మంత్రులు దాటవేత ధోరణి ప్రదర్శించారు. కనీసం జవాబు ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. తాము ఎందుకు సమాధానం చెప్పాలనే విధంగా ప్రవర్తించడం గమనార్హం.ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేడు నాలుగో రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, సాయి కల్పలత పలు అంశాలపై ప్రశ్నలు అడిగారు. దీపం పథకంపై ఎమ్మెల్సీలు ప్రశ్నించగా.. లబ్ధిదారుల సంఖ్య చెప్పకుండా సమాధానం దాటవేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. దీంతో, మంత్రిపై ఎమ్మెల్సీలు మండిపడ్డారు. దీపం పథకం అంటే ఈ ఏడాది 2 సిలిండర్లకు ఎగనామం పెట్టడమా?. దీపం పథకం లబ్ధిదారులు ఎంత మందో ప్రభుత్వం ఎందుకు చెప్పడం లేదు?. తొమ్మిది నెలలకు ఒకే సిలిండర్ ఇస్తారా?. కోటి 54 లక్షల మందికి ఎందుకు దీపం పథకం అమలు చేయడం లేదు. లబ్ధిదారుల సంఖ్య చెప్పాల్సిందేనని పట్టుబట్టారు.ఇదే సమయంలో మండలిలో డ్వాక్రా మహిళల సున్నా వడ్డీ రుణాలపై కూడా ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, సాయి కల్పలత ప్రశ్నలు వేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీలు మాట్లాడుతూ.. సున్నా వడ్డీ పథకాన్ని డ్వాక్రా మహిళలకు అమలు చేస్తున్నారా లేదా?. గతంలో చంద్రబాబు 2016లో సున్నా వడ్డీని నిలిపేశారు. గత ప్రభుత్వం అమలు చేసిన సున్నా వడ్డీని అమలు చేయాలి. డ్వాక్రా మహిళలకు 10 లక్షల సున్నా వడ్డీ రుణాలు ఇస్తామన్నారు. ప్రభుత్వం ఈ పథకాన్ని ఎప్పుడు నుండి ప్రారంభిస్తుంది? అని అడిగారు. దీనికి కూడా కూటమి మంత్రులు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.ఇక, అంతకుముందు రాష్ట్రంలో బెల్టు షాపుల విషయమై మండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మాధవరావు, రమేష్ యాదవ్, దువ్వాడ శ్రీనివాస్ ప్రశ్నించారు. ఎమ్మెల్సీలు మాట్లాడుతూ..‘రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్టు షాపులు నడుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పర్మిట్ రూమ్‌లు పెడుతున్నారు. మద్యం అమ్మకాలపై నియంత్రణ లేకుండా ఎక్కడంటే అక్కడ షాపులు పెడుతున్నారు. చర్యలు ఎందుకు లేవు? అని ప్రశ్నలు సంధించారు. దీనికి కూడా కూటమి నేతలు స్పందించలేదు. -
22 వరకు అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: ఈ నెల 22వ తేదీ వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. సోమవారం ప్రారంభమైన ఈ సమావేశాలను బడ్జెట్ ప్రసంగం తర్వాత వాయిదా వేశారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరిగిన అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో సీఎం చంద్రబాబు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జనసేన తరఫున మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్‌రాజు, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ పాల్గొని పది రోజులపాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.ఒకపూటే సమావేశాలు నిర్వహించాలని, బిల్లులు, పలు అంశాలపై చర్చలు ఉన్నప్పుడు సాయంత్రం వరకూ సభ నిర్వహిద్దామని స్పీకర్ చెప్పారు. మొత్తం 8 బిల్లులు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. మంగళవారం చీఫ్ విప్, విప్‌లను ఖరారు చేస్తామని సీఎం చెప్పారు. బీఏసీలోనూ జగన్ జపమే బీఏసీ సమావేశంలోనూ మాజీ సీఎం వైఎస్ జగన్ గురించే ఎక్కువ సేపు చర్చ జరిగినట్లు తెలిసింది. ఆయన అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారనే దానిపై సీఎం, స్పీకర్ పలు విమర్శలు చేసినట్లు సమాచారం -
వైఫల్యాలు, మోసాలపై నిలదీస్తామని పాలక పక్షానికి భయం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాలు, సూపర్ సిక్స్ మోసాలపై శాసనసభలో పాలకపక్షాన్ని నిలదీస్తామనే భయంతోనే 40 శాతం ఓట్లు సాధించిన వెఎస్సార్‌సీపీని ప్రతిపక్షంగా గుర్తించడం లేదని పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. కూటమి సర్కారు వైఫల్యాలను సభ వెలుపల ప్రభుత్వ సాక్ష్యాధారాలతో ఎండగట్టాలని పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. శాసన మండలిలో ప్రజాగళాన్ని గట్టిగా వినిపించి వైఫల్యాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఎమ్మెల్సీలకు సూచించారు. ప్రశ్నించే స్వరమే వినిపించకూడదనే ఆలోచనతో ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేసులు పెడతారని ఎవరూ భయపడవద్దని, తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఉదయం శాసన సభ్యులతో, మధ్యాహ్నం శాసన మండలి సభ్యులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..⇒ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోరుతూ కోర్టులో పిటిషన్ వేశాం. కానీ స్పీకర్ కోర్టు ఆదేశాలకు సమాధానం ఇవ్వలేదు. కోర్టు నుంచి వచ్చిన సమన్లు కూడా స్పీకర్ తీసుకోలేదు. అసెంబ్లీలో ఉన్న ఏకైక ప్రతిపక్షం మనమే. మనం మినహా మరో ప్రతిపక్షం లేదు. అయినా కూడా వారు మనల్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తించడం లేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. అలా గుర్తిస్తే... ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడ్డానికి అవకాశాలు ఇవ్వాల్సి వస్తుందనే భయంతోనే వారు ముందుకు రావడం లేదు. ⇒ సభా నాయకుడికి మాట్లాడటానికి ఎంత సమయం ఇస్తారో.. ఆ తర్వాత అంతే హక్కుగా ప్రతిపక్ష నాయకుడికి కూడా సమయం ఇవ్వాల్సి వస్తుందేమోనని, ఇవ్వక తప్పని పరిస్థితులు వస్తాయనే విషయాన్ని జీర్ణించుకోలేక ప్రతిపక్ష నాయకుడిగా అంగీకరించడం లేదు. 40 శాతం ఓట్ షేర్ సాధించిన పార్టీని ప్రతిపక్షపార్టీగా గుర్తించడానికి ఇష్టపడని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ⇒ హైకోర్టులో మనం వేసిన పిటిషన్‌పై కౌంటర్ వేయడానికి కూడా స్పీకర్ సుముఖంగా లేరు. అందుకే మన ఎమ్మెల్యేలు తమ గళాన్ని మీడియా వేదికగా ప్రజలకు వినిపించాలి.⇒ ప్రతి రోజూ మన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు మీడియా ద్వారా మాట్లాడతారు. ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తారు. ⇒ అసెంబ్లీలో ఏ మాదిరిగా ప్రశ్నలు వేస్తామో, అదే రీతిలో ఇక్కడ నుంచి అధికార పక్షాన్ని ప్రశ్నిస్తాం. పూర్తి వివరాలు, ఆధారాలు, సాక్ష్యాలతో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఈ వివరాలన్నింటినీ శాసన మండలి సభ్యులు ప్రతి ఒక్కరికీ పంపిస్తాం. వాటి ఆధారంగా ప్రభుత్వాన్ని నిలదీయాలి.. ప్రశ్నించాలి. ⇒ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీనిపై ప్రశ్నిస్తే బుల్డోజ్ చేస్తూ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ⇒ అప్పుల విషయంలో ఎన్నికలకు ముందు వాళ్లు చేసిన ప్రచారం పచ్చి అబద్ధమని వాళ్లే తాజాగా బడ్జెట్ పత్రాల ద్వారా చాటి చెప్పారు. అప్పుల సంఖ్యల్లోనూ అన్నీ అబద్ధాలే. వాళ్లే అసెంబ్లీకి బడ్జెట్ పత్రాలు విడుదల చేశారు. అందులోని వాస్తవాలతో ఇప్పటివరకూ వారు చెప్పినవి అబద్ధాలేనని తేలిపోయింది. పాలక పక్షానికి చెందినవారు అడ్డంగా దొరికిపోయారు. దీనిపై రాష్ట్ర ప్రజలకు సమగ్ర వివరాలను ప్రెస్ మీట్ ద్వారా నేనే వివరిస్తా. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని, చేసేవన్నీ మోసాలేనని ఇప్పటికే తేలిపోయింది. ఈ ఆరు నెలల కాలంలో చంద్రబాబు నైజాన్ని ప్రజలు మరోసారి గుర్తించారు. ⇒ అందరికీ ఒకటే చెబుతున్నా... ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. కష్టాలు అనేవి శాశ్వతం కాదు. వ్యక్తిత్వాన్ని, విలువలను నిలబెట్టుకుంటూ ముందుకు సాగుదాం. కచ్చితంగా మనం తిరిగి అధికారంలోకి వస్తాం. జమిలి ఎన్నికలు లాంటి వార్తలు కూడా వింటున్నాం. ⇒ వైఎస్సార్సీపీ సైనికులుగా మండలిలో ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాలి. గట్టిగా పోరాటం చేయండి. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపాలి. ప్రశ్నిస్తే కేసులు పెడతారన్న ఆందోళన అనవసరం. నేను మీకు అండగా ఉంటా. ⇒ నా వయసు చిన్నదే. మరో 30 ఏళ్లు రాజకీయాలను చూస్తా. మనం అందరం కలసి రాజకీయాలలో సుదీర్ఘకాలం ప్రయాణం చేస్తాం. ఎప్పుడూ లేని విధంగా మనం సోషల్ ఇంజనీరింగ్ చేశాం. ఎక్కడాలేని మార్పులు తీసుకువచ్చాం. కాలక్రమేణా మనం చేసిన పనుల ప్రాధాన్యతను ప్రజలు తప్పకుండా గుర్తిస్తారు. -
బడ్జెట్లో మహిళలకు షాకిచ్చిన బాబు ప్రభుత్వం
అమరావతి, సాక్షి: మహిళకు బడ్జెట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇవాళ ఆసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో మహాశక్తి పథకం కానరాకుండాపోయింది. 19 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ. 1500 ఆర్థిక సహాయం అందిస్తామని ఎన్నికల్లో బాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వం వచ్చిన వెంటనే అమలు చేస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే తాజాగా బాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మహిళలకు ఏడాదికి రూ. 18,000 ఆర్థిక సాయం ఉసేత్తకపోవటం గమనార్హం.తల్లికి వందనం పథకానికి షాక్బడ్జెట్లో తల్లికి వందనం పథకానికి కేవలం రూ.2,491 కోట్లు కేటాయించారు. సూపర్ సిక్స్ హామీల్లో.. స్కూల్‌కి వెళ్లిన ప్రతి పిల్లాడికి రూ.15,000 ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రు. 10 వేల కోట్లకు పైగా అవసరం ఉన్నా.. కేవలం రూ.2,491 కోట్లు మాత్రమే కేటాయించి మమ అనిపించారు. ఇక.. ఇంటర్ విద్యార్థుల తల్లులకు తల్లికి వందనం లేనట్టే. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఇంటర్ విద్యార్థుల తల్లులకు అమ్మ ఒడి అమలు జరిగింది. ప్రతి ఏటా రూ. 6,400 కోట్లుకి పైగా అమ్మ ఒడి నిధులు గత వైఎస్ జగన్ ప్రభుత్వం జమ చేసింది. అమ్మ ఒడి ఈ ఏడాది ఎప్పుడు ప్రారంభిస్తారో కూడా చంద్రబాబు ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవటం గమనార్హం.చదవండి: వ్యవసాయ బడ్జెట్: రైతుల్ని దారుణంగా మోసం చేసిన చంద్రబాబు!చదవండి: ఏపీలో ఆగని తప్పుడు కేసులు, వేధింపులు.. అక్రమ అరెస్టులు -
ఏపీ బడ్జెట్ సమావేశాలు..
-
AP: రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: ఆర్థిక సంవత్సరం మరో నాలుగు నెలల్లో ముగస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు చంద్రబాబు ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. సాధారణంగా ఎన్నికల సంవత్సరం ఏ ప్రభుత్వం ఉన్నా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఆ తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం జూన్‌లోనే అధికారంలోకి వచ్చినప్పటికీ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా మరో నాలుగు నెలలకు అంటే.. నవంబర్ వరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆర్డినెన్స్ జారీ చేసింది.సూపర్ సిక్స్ వంటి పథకాల అమలు నుంచి తప్పించుకోవడానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ జారీ చేశారనే విమర్శలు కూడా వచ్చాయి. డిసెంబర్ నుంచి మార్చి వరకు ఖర్చులకు అసెంబ్లీ ఆమోదం పొందాల్సి ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో సోమవారం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీలోని సీఎం చాంబర్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశమై బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది. అనంతరం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2024–25 ఆర్థిక ఏడాదికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. -
అసెంబ్లీ సమావేశాలపై వైఎస్ జగన్ రియాక్షన్
-
ఏపీ అసెంబ్లీ సమావేశాల తేదీ ఖరారు
-
AP: 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 11నుంచి జరగనున్నాయి. 11న ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశమవుతాయని శాసన వ్యవహారాల కార్యదర్శి సోమవారం రెండు నోటిఫికేషన్లు జారీ చేశారు. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు దాటినా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. 2024–25 సంవత్సరానికి సంబంధించి గత ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెట్టింది.జూన్‌లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉన్నా.. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను పొడిగిస్తూ ఆర్డినెన్స్ ఇచ్చింది. దాని గడువు నవంబర్‌తో ముగుస్తుండటంతో అనివార్యంగా ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి. ఇందుకోసం ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనుంది. ఈ ఆర్థిక ఏడాదిలో మిగతా నాలుగు నెలలే మిగిలి ఉండటంతో ఆ కాలానికే పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. 10 రోజులపాటు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. -
రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: రెండో రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలను మరో గంట అదనంగా స్పీకర్ కొనసాగించారు. కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై రెండో రోజు చర్చ జరుగుతోంది. ధన్యవాద తీర్మానంపై సీఎం చంద్రబాబు సమాధానం ఇవ్వనున్నారు. ప్రశ్నోత్తరాల్లో 10 ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారు. -
ఆకాంక్షలు ఆవిరి! చేతులెత్తేసిన చంద్రబాబు సర్కార్
సాక్షి, అమరావతి: ‘‘రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆకాంక్షలతో ఎన్డీఏ కూటమికి బలమైన తీర్పునిచ్చారు. కానీ ఇప్పటికిప్పుడు వారి ఆకాంక్షలు (హామీలు) నెరవేర్చే పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదు. ఉద్యోగులు, పింఛన్‌దారులకు బకాయిల చెల్లింపులతో పాటు రాష్ట్రంపై రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఉదారంగా సాయం అందించాలి. లేకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వనరుల సమీకరణ, అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడం చాలా కష్టం, సంక్లిష్టం. సంక్షోభాన్ని అధిగమించే మార్గాలను అన్వేషించాల్సి ఉంది. మేధావులు, విద్యావేత్తలతో విస్తృతమైన చర్చలు జరపాలి. అందుకే అర్ధవంతమైన చర్చల తర్వాతే పూర్తి స్థాయి బడ్జెట్‌కు వెళ్లాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న ఆందోళనకరమైన ఆరి్ధక పరిస్థితిని అర్ధం చేసుకొని రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలి’’ అని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఓటాన్ అక్కౌంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సోమవారం అసెంబ్లీ హాలులో ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. నాడు 13.5 శాతం సమ్మిళిత వృద్ధి సాధించాం సవాళ్లను అధిగమించి సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్ దిశగా 2014–19లో గట్టి పునాది వేశాం. పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులలో రాష్ట్రం నెం.1గా అవతరించింది. కాకినాడ సెజ్ పోర్ట్, భావనపాడు, రామాయపట్నం ఓడరేవుల అభివృద్ధికి శ్రీకారం చుట్టాం. వృద్ధాప్య పింఛన్ల పెంపుదల, రైతు రుణమాఫీ లాంటి సంక్షేమ కార్యక్రమాలు అమలుతో 2014–19 మధ్య 13.5 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు సాధించాం. 2019 జూన్‌లో బాధ్యతలు స్వీకరించిన ప్రభుత్వం ప్రజావేదికను కూల్చడంతో బ్రాండ్ ఏపీకి భారీ నష్టం జరిగింది. 2014–19తో పోలిస్తే 2019–24 మధ్య మూలధన వ్యయం 60 శాతం తగ్గిపోయింది. మూడు రాజధానుల ఆలోచనతో ప్రజలను గందరగోళానికి గురిచేసింది. అమరావతి రాజధాని ప్రాంతం పూర్తిగా నాశనమైంది. రూ.2 లక్షల కోట్ల సంపద నష్టానికి దారి తీసింది. ఇంధన రంగం రూ.1,29,503 కోట్ల భారీ నష్టానికి గురైంది. సహజ వనరులు దురి్వనియోగమయ్యాయి. రీ–సర్వే, ఏపీ భూ హక్కు చట్టం ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. ఇసుకను కొల్లగొట్టడంతో రూ.19,000 కోట్ల నష్టం వాటిల్లింది. ఖనిజ రాబడిలో రూ.9,750 కోట్ల నష్టం వాటిల్లింది. ఎర్రచందనం విక్రయాల వల్ల 2014–2019 మధ్య రూ.1,623 కోట్ల ఆదాయం వస్తే 2019–2024 మ«ద్య కేవలం రూ.441 కోట్లకు ఆదాయం పడిపోయింది. చిన్నారులపై నేరాలు, అత్యాచారాలు పెరిగాయి గత ఐదేళ్లలో మహిళలు, చిన్నారులపై నేరాలు.. ఎస్సీలు, ఎస్టీలు, ఇతర బలహీన వర్గాలపై అఘాయిత్యాలు పెరిగాయి. ఎక్సైజ్ ఆదాయ మార్గాలను గత ప్రభుత్వం అపహాస్యం పాలు చేసింది. ఎక్సైజ్‌పై వ్యాట్‌ను తగ్గించి ప్రత్యేక మార్జిన్‌గా రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్‌కు మళ్లించారు. జీతాలు, పింఛన్ల భారీ బకాయిలతో పాటు సుమారు రూ.10 లక్షల కోట్ల రుణ భారం తిరిగి చెల్లించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై పడింది. ఇప్పటికిప్పుడు హామీలన్నీ అమలు చేయలేంప్రజలు ప్రభుత్వ మార్పును బలంగా కోరుకోవడం వల్లే 93 శాతం స్ట్రయిక్ రేట్‌తో ఎన్డీఏకు చారిత్రక తీర్పునిచ్చారు. గాడి తప్పిన పాలనను తిరిగి గాడిలో పెట్టడం సవాలుతో కూడుకున్న పని. ఎన్నికల హామీలను నెరవేర్చడం ప్రారంభించాం. “సూపర్ సిక్స్ఙ్ వాగ్దానాల అమలుకు కట్టుబడి ఉన్నాం. ఇప్పటికే 16,347 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి మెగా డీఎస్సీని ప్రకటించడం, ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయడం, సామాజిక భద్రత పింఛన్లను రూ.4 వేలకు పెంచడం, నైపుణ్య గణన, ఉచితంగా ఇసుక సరఫరా లాంటివి చేపట్టాం. అన్న క్యాంటీన్లను కూడా ప్రారంభిస్తున్నాం. మిగిలిన హామీల అమలుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పటికిప్పుడు వారి ఆకాంక్షలను నెరవేర్చడం సాధ్యం కాదని తెలియజేస్తున్నా. వనరుల సమీకరణ చాలా కష్టంగా ఉంది. నిధుల లేమి కారణంగా అభివృద్ధి ప్రణాళిక చాలా సంక్లిష్టంగా ఉంది. ఇప్పటికే ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర ఆరి్ధక పరిస్థితిని వివరించాం. రాష్ట్రానికి ఉదారంగా సాయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశాం. ప్రస్తుతమున్న ఆందోళనకరమైన ఆరి్ధక పరిస్థితిని అర్ధం చేసుకుని రాష్ట్ర పునరి్నర్మాణంలో ప్రభుత్వానికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. -
హామీలను పక్కదారి పట్టించే ప్రయత్నమిది: వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: కూటమి పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని వైఎస్సార్సీపీ గళం విప్పింది. సోమవారం నల్లకండువాలతో అసెంబ్లీకి వచ్చిన సభ్యులు.. గవర్నర్ ప్రసంగ సమయంలోనూ ‘హత్యా రాజకీయాలు నశించాలి.. సేవ్ డెమోక్రసీ’నినాదాలు చేశారు. అయినా గవర్నర్ ప్రసంగం కొనసాగడంతో.. నిరసనగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వంలో అదుపుతప్పిన శాంతిభద్రతలపై మీడియాతో మాట్లాడారు. ‘‘ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. శాంతిభద్రతలు కాపాడటంలో కూటమి ప్రభుత్వం విఫలం అయింది. రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన నడుస్తోంది. ఇచ్చిన హామీలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలోని మహిళలు బయటకు రావాలంటే బయటపడుతున్నారు. రాష్ట్రంలో రోజుకో అత్యాచారం, హత్య. ఏపీలో రాష్ట్రపతిపాలన విధించాలి’’ అని అన్నారు.ఏపీలో మహిళలకు రక్షణ లేదు: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి‘‘ ఏపీలో మహిళలకు రక్షణ లేదు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణలో ఘటన జరిగితే ఏపీలో దిశా చట్టాన్ని రూపొంచించాం. కూటమి ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, 36 మందిని హత్య చేశారు. హామీలు అమలు చేయలేక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు... ప్రజలగొంతుకగా వైఎస్సార్సీపీ ఉంటుంది. ఢిల్లీలో బుధవారం ధర్నా చేస్తాం. దేశ వ్యాప్తంగా ఏపీలో ఏం జరుహుతుందో చెబుతాం. హోంమంత్రి అనిత ఫ్రస్టేషన్లో ఉన్నారు. హోంమంత్రి నియోజకవర్గంలోనే ఒక అమ్మాయి దారుణ హత్య జరిగింది. ముచ్చుమర్రిలో ఒక బాలిక హత్యకు గురైతే ప్రభుత్వం స్పందించలేదు. ఆ కుటుంబాన్ని కనీసం పరామర్శించలేదు’’ అని ఆమె మండిపడ్డారు.ప్రజల మధ్యనే మా నిరసనఅప్పులు చేయటానికే ఈ ప్రభుత్వం పని చేస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ అన్నారు. ‘‘శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతున్నా పట్టించుకోవడం లేదు. హత్యలు, అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అందుకే గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం. అయినా పట్టింపులేనందునే బాయ్ కట్ చేశాం. హోంమంత్రి మీడియా సమావేశాలు పెట్టి కామెడీ చేస్తున్నారు. ప్రధాని, రాష్ట్ర పతికి కూడా ఫిర్యాదు చేశాం. ఒక వర్గం మీడియా దారుణంగా వ్యవహరిస్తోంది. అందుకే ప్రజల మధ్యనే మా నిరసన తెలుపుతున్నాం’’ అని అన్నారు. -
అసెంబ్లీలో నేడు వైఎస్సార్సీపీ నిరసనలు
అమరావతి, సాక్షి: ఏపీలో కొనసాగుతున్న అరాచకాలపై, హింసాత్మక ఘటనలపై నిరసనలు తెలిపేందుకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలను అందుకు వేదికగా ఎంచుకుంది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి రానున్నారు. గవర్నర్ ప్రసంగించే సమయంలో.. హత్యా రాజకీయాలపై వైఎస్సార్సీపీ నిరసన తెలిపే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు పెరిగిపోయాయి. దీంతో శాంతి భద్రతల అంశంపై వైఎస్సార్సీపీ అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టనుంది. వినుకొండ వైస్సార్సీపీ యువకార్యకర్త రషీద్ హత్యా ఘటనతో పాటు వైఎస్సార్సీపీ నేతలపై జరిగిన హత్యాయత్నాలను ప్రధానంగా ఈ సందర్భంగా అసెంబ్లీలో ప్రస్తావించాలని భావిస్తోంది. మరోవైపు కూటమి ప్రభుత్వ సూపర్ సిక్స్ హామీల అమలు జాప్యాన్ని కూడా నిలదీసే అవకాశం లేకపోలేదు. ఇంకోవైపు..సాధారణంగా.. ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంటాయి ప్రభుత్వాలు. ఇందుకు భిన్నంగా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం మూడు-నాలుగు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వైపే మొగ్గుచూపిస్తుండడం గమనార్హం. అంతేకాదు.. జగన్ పాలనను బద్నాం చేసే కుట్రలో భాగంగా సంక్షేమాన్ని స్కామ్‌లుగా తప్పుడు లెక్కలు చూపిస్తూ సచివాలయంలో శ్వేత పత్రాలు విడుదల చేశారు సీఎం చంద్రబాబు. ఇప్పుడు అసెంబ్లీ వేదికగా ఆ వ్యవహారం కొనసాగించాలనుకోవడం.. హామీల జాప్యానికే అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ అంశంపైనా వైఎస్సార్సీపీ నిలదీసే అవకాశం ఉంది. ఇక.. ఇదీ చదవండి: ‘రెడ్‌బుక్’తో అరాచకం.. అదే రాజ్యాంగం అనే రీతిలో పాలనరషీద్ కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంలో.. ఏపీలో చంద్రబాబు ఆటవిక పాలనపై ఢిల్లీలో 24వ తేదీన ధర్నా చేస్తామని జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోపక్క అసెంబ్లీలోనూ తమ నిరసన కొనసాగుతుందని ఆ సమయంలోనే ప్రకటించారాయన. అలాగే.. పార్లమెంట్ సమావేశాల్లోనూ ఏపీ పరిస్థితిని వివరించాలని ఎంపీలకు వైఎస్సార్సీపీ పార్టీ పార్లమెంటరీ సమావేశాల్లోనూ దిశానిర్దేశం చేశారు కూడా.ఏపీలో సామాన్యులపై జరుగుతున్న అకృత్యాలతో పాటు వైఎస్సార్సీపీ కార్యకర్తలే లక్ష్యంగా జరుగుతున్న దాడులపై ఆదివారం గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసి వైఎస్ జగన్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని, ఎంపీల నుంచి సామాన్యుల దాకా ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని, ముఖ్యంగా వైఎస్సార్సీపీని అణచివేసే కుట్ర జరుగుతోందని గవర్నర్‌కు నివేదించారు. ఇప్పటిదాకా జరిగిన ఘటనలను వివరాలను ఆధారాలతో సహా గవర్నర్‌కు సమర్పించిన జగన్.. వాటన్నింటిపైనా దర్యాప్తు చేయించాలని కోరారు. కళ్లెదుటే ఘోరాలు జరుగుతున్నా పోలీస్ యంత్రాంగం వాటిని నిలువరించే సాహసం చేయలేకపోతోందని జగన్ ఆ సమయంలో ఆవేదన వ్యక్తం చేశారు. -
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభల సభ్యులనుద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ అధ్యక్షతన శాసన సభా వ్యవహారాల సలహా కమిటీ(బీఏసీ) సమావేశమై సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనేదానిపై అజెండాను ఖరారు చేయనుంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై అధికార పార్టీ నేతలు చేస్తున్న హత్యా రాజకీయాలు, దాడులు, దౌర్జన్యాలపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు నిలదీయనున్నారు. వినుకొండలో వైఎస్సార్సీపీ నేత రషీద్‌ను నడిరోడ్డుపై అత్యంత కిరాతకంగా నరికి చంపిన విషయాన్ని అసెంబ్లీలో ప్రధానంగా ప్రస్తావించాలని, ప్రభుత్వమే హత్యా రాజకీయాలను ప్రోత్సహించడంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. ఎన్నికల ముందు వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ బడ్జెట్ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో అధికార పక్షం హామీలకు కేటాయింపుల చేయకుండా తప్పించుకునే ఎత్తుగడలో భాగంగా పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టకుండా నాలుగు నెలలకు ఓటాన్ అకౌంట్‌కు సభలో ఆమోదం పొందడం ద్వారా కాలయాపన చేయాలని నిర్ణయించింది. కాలయాపన చేసే ఎత్తుగడఎన్నికల ముందు కేంద్రం ఓటాన్ అకౌంట్ ప్రవేశ పెట్టి.. ఇప్పుడు ఈ నెల 23వ తేదీన పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతోంది. ఎన్నికల ఫలితాల అనంతరం అధికారం చేపట్టే ప్రభుత్వాలు పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెడతాయి. అయితే అందుకు భిన్నంగా చంద్రబాబు ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తో సూపర్ సిక్స్ పథకాలకు కేటాయింపుల్లేకుండా కాలయాపన చేసే ఎత్తుగడకు పాల్పడుతోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వంపై ఆరోపణలకు, నిందలకు అసెంబ్లీని వేదికగా చేసుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు శ్వేతపత్రాల విడుదల ఎత్తుగడకు దిగారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై అసెంబ్లీలో చర్చకు అవకాశం లేకుండా ఆర్థిక, ఎక్సైజ్, శాంతిభద్రతల పేరుతో శ్వేతపత్రాలు విడుదల చేసి అసెంబ్లీని ఆరోపణలకు వేదికగా ఉపయోగించుకోనున్నారు. మరో పక్క ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుకు అసెంబ్లీలో బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టే యోచనలో ఉంది. టీడీపీ ఎమ్మెల్యేలందరూ పసుపు రంగు దుస్తులు, సైకిల్ గుర్తు కండువాలతో అసెంబ్లీకి రావాలని పార్టీ సూచించింది. ఐదు రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 24 లేదా 25వ తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. -
కొత్త ఎమ్మెల్యేలకు స్పీకర్ గుడ్ న్యూస్
-
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం.. అసెంబ్లీ ఛాంబర్లో జగన్‌తో భేటీ (ఫొటోలు)
-
అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం (ఫొటోలు)
-
ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
-
ముగిసిన ఎమ్మెల్యేల ప్రమాణం.. ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా
అమరావతి, సాక్షి: ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. ఇవాళ అసెంబ్లీలో 172 మంది సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. మిగిలిన ముగ్గురి ప్రమాణ స్వీకారంతో పాటు రేపు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాల కోసం ప్రొటెం స్పీకర్‌గా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యతో నిన్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించిన సంగతి తెలిసిందే. ఇవాళ ఆయన అసెంబ్లీ సమావేశాల్లో సభ్యుల చేత ప్రమాణం చేయించారు. తొలుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత మంత్రులు ఇంగ్లీష్ అక్షర క్రమంలో ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. మంత్రుల ప్రమాణ కార్యక్రమం ముగిశాక.. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. గ్యాలరీ కోసం క్లిక్ చేయండి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం.. అసెంబ్లీ ఛాంబర్లో జగన్‌తో భేటీ (ఫొటోలు)ఆ తర్వాత ఎమ్మెల్యేలందరూ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమం ముగిశాక.. స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడి నామినేషన్ కార్యక్రమం జరిగింది. కూటమి నేతలు నామినేషన్‌కు మద్దతు ఇవ్వగా.. మెజారిటీ ఉండడంతో అయ్యన్నపాత్రుడి స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతకు ముందు.. ఈ ఉదయం అసెంబ్లీ దగ్గర ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి. రెండున్నరేళ్ల తర్వాత అసెంబ్లీలోకి అడుగు పెట్టిన సీఎం చంద్రబాబు.. భావోద్వేగానిని లోనయ్యారు. అసెంబ్లీ మెట్లకు మొక్కి లోపలకు వచ్చారాయన. ఇక పవన్ కల్యాణ్ అసెంబ్లీలో అడుగుపెట్టడం చూసేందుకు ఆయన సోదరుడు, జనసేన రాష్ట్రకార్యదర్శి నాగబాబు వచ్చారు. గ్యాలరీ కోసం క్లిక్ చేయండి: అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారంతొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన 81 మంది ఎమ్మెల్యేలుఉమ్మడి కృష్ణా జిల్లానుంచి ఆరుగురు కొత్త సభ్యులుఎమ్మెల్యేలలో.. ఇద్దరు మాజీ ఐఏఎస్లుశ్రీనివాస్ పేరుతో 11 మంది సభ్యులు -
21 నుంచి అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: ఈ నెల 21వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. తొలుత 19వ తేదీ అనుకున్నా, ఆ తర్వాత 24 నుంచి నిర్వహించాలని యోచించింది. ఎక్కువ మంది మంత్రులు ఇంకా బాధ్యతలు తీసుకోకపోవడం, పలు ఇతర కారణాలతో 21 నుంచి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. 2 రోజులపాటు సమావేశాలు నిర్వహిస్తారని సమాచారం. మొదటిరోజు ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణం, రెండవ రోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారని చెబుతున్నారు. -
పొత్తు.. టీడీపీ సీనియర్లు చిత్తు
సాక్షి, అమరావతి : ప్రజల్లో ఆదరణ కోల్పోయినా, పొత్తుల ద్వారా గట్టెక్కుదామనుకుంటున్న తెలుగుదేశం పార్టీకి అవి కూడా శరాఘాతాల్లా మారాయి. పొత్తులో భారీగా సీట్లు కోల్పోయే పరిస్థితి నెలకొనడంతో చాలా మంది సీనియర్ల మెడపై కత్తులు వేలాడుతున్నాయి. దీంతో వారి రాజకీయ భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 67 పేర్లతో జాబితాను చంద్రబాబుకు ఇచ్చారు. వాటిలో కనీసం 50కి పైగా సీట్లు తమకు కేటాయించాలని కోరుతున్నారు. తాజాగా బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతుండడంతో ఆ పార్టీకి ఆరు ఎంపీ, 25 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వక తప్పదని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ పొత్తులు ఖరారైతే బీజేపీ, జనసేనకు 75 ఎమ్మెల్యే, 10 ఎంపీ స్థానాలు వదులుకోక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతో అనేక మంది సీనియర్ల సీట్లు గల్లంతవుతున్నాయి. పొత్తులతో పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని సీనియర్ నేతలు లబోదిబోమంటున్నారు. అన్ని సీట్లు వదులుకుంటే పార్టీ అధికారంలోకి రావడం అటుంచి అసలు విలువే లేకుండా పోతుందని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అది నిజమే అయినా పొత్తులు లేకపోతే దిగజారిపోయిన పార్టీ మనుగడే కష్టమైపోతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్, బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారు. తద్వారా పార్టీని రేసులోనైనా నిలపవచ్చని భావిస్తున్నారు. అయితే దీనివల్ల అనేక మంది సీనియర్ నాయకుల రాజకీయ జీవితాలకు ముగింపు తప్పదని పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఉత్తరాంధ్ర కకావికలం ఈ పొత్తులు ఖరారైతే ఉత్తరాంధ్రలో టీడీపీ సీనియర్ నేతలు కళా వెంకట్రావు, అశోక్ గజపతిరాజు, చింతకాయల అయ్యన్న పాత్రుడు, గౌతు శిరీష, బండారు సత్యనారాయణమూర్తి, గండి బాబ్జి, గంటా శ్రీనివాసరావు, పీలా గోవింద్, పల్లా శ్రీనివాసరావు తదితర నేతల పేర్లు గల్లంతవనున్నాయి. ఎచ్చెర్లపై ఎన్నో అశలు పెట్టుకున్న కళా వెంకట్రావు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. విశాఖలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి సీటు ఎగిరిపోనుంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అశోక్‌గజపతిరాజు వంటి సీనియర్ తన కుమార్తెకు సీటు ఇప్పించుకోలేక సతమతమవుతున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలకు తప్పని పొత్తు పోట్లు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కీలకమైన సీనియర్లకు పొత్తు పోట్లు తప్పేలా లేవు. విజయవాడలో మాజీ ఎమ్మెల్యేలు జలీల్‌ఖాన్, బొండా ఉమామహేశ్వరరావులను పక్కన పెట్టే పరిస్థితి ఏర్పడనుంది. అవనిగడ్డలో మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్, పెడనలో కాగిత కృష్ణప్రసాద్, మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, తెనాలిలో ఆలపాటి రాజా, నక్కా ఆనంద్‌బాబు వంటి నేతలకు షాక్ తగలనుంది. ఆలపాటి రాజా ఇప్పటికే తన సీటు పోతే ఒప్పుకునేది లేదని అనుచరులను ముందుపెట్టి హడావుడి చేస్తున్నారు. పరిటాల శ్రీరామ్, భూమా అఖిలప్రియకు టాటా నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో పలువురు కీలక నాయకులు పొత్తుతో రాజకీయంగా కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సత్యసాయి జిల్లా ధర్మవరంలో పరిటాల శ్రీరామ్, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ, అనంతపురంలో ప్రభాకర్ చౌదరి, నగరిలో గాలి భానుప్రకాష్, తిరుపతిలో సుగుణమ్మ, శ్రీకాళహస్తిలో బొజ్జల సుదీర్‌రెడ్డి, రాజంపేటలో బత్యాల చెంగల్రాయుడు, జమ్మలమడుగులో భూపే‹Ùరెడ్డి వంటి నేతలు పోటీ నుంచి తప్పుకోక తప్పదంటున్నారు. పొత్తులో బీజేపీ విశాఖ, విజయవాడ, నర్సాపురం, రాజమండ్రి, తిరుపతి, రాజంపేట పార్లమెంట్ సీట్లు ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విశాఖ నుంచి గత ఎన్నికల్లో లోకేశ్ తోడల్లుడు భరత్ పోటీ చేసి ఓడిపోయారు. ఆయన అక్కడి నుంచి మళ్లీ పోటీ చేయాలని భావిస్తున్న తరుణంలో ఆ సీటు బీజేపీకి పోతే ఆయన భవితవ్యం ప్రశ్నార్థకం కానుంది. విజయవాడ సీటును సిట్టింగ్ ఎంపీ కేశినేని నానిని కాదని ఆయన సోదరుడు కేశినేని చిన్నికి ఇస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. పొత్తులో అక్కడి నుంచి బీజేపీ తరఫున సుజనా చౌదరి పోటీ చేయాలని చూస్తున్నారు. దీంతో కేశినేని చిన్నికి సీటు పోయినట్లేనని భావిస్తున్నారు. జనసేన కోరుతున్న నియోజకవర్గాలు ♦ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా: ఎచ్చెర్ల, శ్రీకాకుళం, పలాస ♦ ఉమ్మడి విజయనగరం జిల్లా: విజయనగరం, నెల్లిమర్ల. ♦ ఉమ్మడి విశాఖ పట్నం జిల్లా: పెందుర్తి, యలమంచిలి, చోడవరం, విశాఖపట్నం దక్షిణం, విశాఖపట్నం ఉత్తరం, భీమిలి, అనకాపల్లి, గాజువాక. ♦ ఉమ్మడి తూర్పు గోదావరి: పిఠాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, ముమ్మడివరం, రాజమండ్రి రూరల్, రాజానగరం, కొత్తపేట, అమలాపురం, రామచంద్రాపురం, రాజోలు, పి.గన్నవరం. ♦ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా: నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు, ఉంగుటూరు, ఏలూరు, గోపాలపురం, కొవ్వూరు, పోలవరం, ఆచంట. ♦ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా: విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, అవనిగడ్డ, పెడన, నూజివీడు, మచిలీపట్నం, కైకలూరు, పెనమలూరు, తెనాలి, గుంటూరు వెస్ట్, పెదకూరపాడు, తాడికొండ, పొన్నూరు, వేమూరు, గుంటూరు తూర్పు. ♦ ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలు : దర్శి, గిద్దలూరు, నెల్లూరు సిటీ, కోవూరు, కావలి, తిరుపతి, మదనపల్లి, చిత్తూరు, నగరి, ఆళ్లగడ్డ, నంద్యాల, గుంతకల్లు, బద్వేలు, రైల్వే కోడూరు, రాజంపేట, పుట్టపర్తి, ధర్మవరం. గోదావరి జిల్లాల్లో సీనియర్ల సీట్లు గల్లంతే గోదావరి జిల్లాల్లోనూ చాలా మంది ముఖ్య నాయకుల మెడపై కత్తి వేలాడుతోంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గొల్లపల్లి సూర్యారావు, తోట సీతారామలక్ష్మి, కేఎస్ జవహర్, ఎస్వీఎస్ వర్మ వంటి వారు పోటీ చేసే అవకాశాన్ని కోల్పోనున్నారు. బుచ్చయ్యచౌదరి సిట్టింగ్ ఎమ్మెల్యేను కాబట్టి తన సీటు ఉంటుందని చెప్పుకుంటున్నా దానికి గ్యారంటీ లేదు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు సీటు ఇప్పటికే ఎగిరి పోయింది. రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి భీమవరం సీటును నిరాకరిస్తుండడంతో ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం సీటు జనసేనకు పోతుండడంతో మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ ఇప్పటికే తిరుగుబాటు స్వరం వినిపిస్తున్నారు. వీరు కాకుండా నర్సాపురంలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, కాకినాడ వనమాడి వెంకటేశ్వరరావు, కాకినాడ రూరల్ పిల్లి అనంతక్ష్మి, ఐతాబత్తుల ఆనందరావు, బూరుగుపల్లి శేషారావు, గన్ని వీరాంజనేయులు వంటి నేతలకు టికెట్లు గల్లంతవనున్నాయి. -
హామీలు నెరవేర్చని బాబును వామపక్షాలు ఎందుకు ప్రశ్నించలేదు
-
బడ్జెట్ ఆమోదం తెలిపిన ఏపీ అసెంబ్లీ
-
ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై సభలో చర్చ
-
Live: నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2024
-
AP Assembly: ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా
Updates.. ► ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా ►9 బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం అసెంబ్లీలో మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారు. మేం మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీ హామీని నెరవేర్చాం. హామీలు నెరవేర్చని చంద్రబాబును వామపక్షాలు ఎందుకు ప్రశ్నించలేదు. నిరుద్యోగ భృతిపై చేతులెత్తేసిన చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు?. మేం చేసిన అప్పులతో సంక్షేమ పథకాలు అందించాం. గత ప్రభుత్వం చేసిన అప్పులు ఎక్కడికి పోయాయి. గత ప్రభుత్వం చేసిన అప్పులతో ప్రజలకు ఏ మంచిపనైనా జరిగిందా?. అప్పులపై టీడీపీ గోబెల్స్ ప్రచారం చేస్తోంది. గత ప్రభుత్వం చేసిన అప్పులతో పోలిస్తే మేం చేసింది తక్కువే. మాది సంక్షేమ ప్రభుత్వం: ఎమ్మెల్సీ రవీంద్రబాబు ప్రతీ సంక్షేమ పథకం ప్రజల మేలు కోసమే అమలు చేశాం మా ప్రభుత్వానికి పబ్లిసిటీ ముఖ్యం కాదు.. ప్రజలకి మేలు జరగడం ముఖ్యం రాష్ట్రానికి కోవిడ్ సమయంలో రావాల్సిన ఆదాయం రాలేదు రెండేళ్ల కోవిడ్ సమయంలో రెండు లక్షల కోట్ల రూపాయిల ఆదాయం తగ్గిపోయింది గడిచిన నాలుగన్నరేళ్ల పాలనలో 4.60 లక్షల కోట్లు ప్రజలకి నేరుగా అందించాం అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజల ఖాతాలలోకి నిధులు జమ చేశాం మా ప్రభుత్వం వైద్యం, విద్య, వ్యవసాయ రంగాలకి అధిక ప్రాధాన్యతనిచ్చింది ప్రతీజిల్లాకి ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నాం మన రాష్ట్రంలో మెడికల్ కళాశాలలు లేకే ఉక్రెయిన్ లాంటి సుదూర దేశాలకి వెళ్లాల్సిన పరిస్ధితి ఏర్పడింది ఆర్ధిక ఇబ్బందులు ఉన్న్పటికీ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎక్కడా ఆగలేదు ►శాసనమండలి చైర్మన్ మోసేన్ రాజు ముందు వ్యక్తిగతంగా హాజరైన వంశీకృష్ణ యాదవ్. న్యాయవాదులతో కలిసి చైర్మన్ ముందు హాజరు మూడు బిల్లులకి శాసనమండలి ఆమోదం ఆర్జేయూకేటీ విశ్వ విద్యాలయ సవరణ బిల్లు, ఏపీ అసైన్ భూముల సవరణ బిల్లు, ప్రభుత్వ సేవలలో నియామకాల క్రమబద్దీకరణ, సిబ్బంది తీరు, వేతనవ్యవస్ధ హేతుబద్దీకరణ సవరణ బిల్లులకి శాసన మండలి ఆమోదం శాసన మండలి పదినిమిషాలు వాయిదా పెద్దల సభలోనూ మారని టీడీపీ సభ్యుల తీరు చైర్మన్ పోడియం వద్ద ప్లకార్డులతో నిరసన, నినాదాలు చైర్మన్ వారించినా వినిపించుకోని టీడీపీ ఎమ్మెల్సీలు సభకు అంతరాయం కలిగించవద్దని చైర్మన్ విజ్ణప్తి పట్టించుకోకుండా టీడీపీ ఎమ్మెల్సీల నినాదాలు దీంతో, శాసన మండలి వాయిదా అంతకముందు జాబ్ క్యాలెండర్, దిశ, మద్యపాన నిషేదంపై ఎమ్మెల్సీల వాయిదా తీర్మానం టీడీపీ సభ్యుల వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన శాసన మండలి చైర్మన్ ►సభలో టీడీపీ సభ్యుల నినాదాలు, సభా కార్యక్రమాలకు అడ్డుకునే యత్నం ►కాసేపు శాసనసభ వాయిదా ►అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరిన సీఎం జగన్ ►ప్రైవేటు యూనివర్సిటీ సవరణ బిల్లుకి ఆమోదం తెలిపిన అసెంబ్లీ ►ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నాలుగో రోజు ప్రారంభం ►అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ఓవరాక్షన్ ►ఈరోజు కూడా స్పీకర్ ఛాంబర్ వద్దకు దూసుకెళ్లిన టీడీపీ సభ్యులు ►స్పీకర్ తమ్మినేని వద్దకు వెళ్లి నినాదాలు చేసిన టీడీపీ నేతలు ►టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సీరియస్ ►టీడీపీ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్ తమ్మినేని. ►నేడు ఏపీ అసెంబ్లీలో చివరి రోజు(నాలుగో రోజు) బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. ఓట్ ఆన్ అకౌంట బడ్జెట్‌ను అసెంబ్లీ ఆమోదించనుంది. ►ఎన్నికల నేపథ్యంలో 2024–25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నుంచి ఏప్రిల్ – జూలై వరకు నాలుగు నెలలు పాటు వ్యయానికి రూ.88,215 కోట్ల పద్దును అసెంబ్లీ ఆమోదానికి ప్రతిపాదించారు. దీనికి అసెంబ్లీ ఆమోదం తెలుపునుంది. ►అలాగే, నేడు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే వారికి వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామ నారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై విచారణ జరుగనుంది. ►పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలపై విచారణ. వ్యక్తిగతంగా విచారించనున్న శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు. ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, వంశీ కృష్ణ యాదవ్‌లకు నోటీసులు ఇచ్చారు. -
స్పీకర్ ఛాంబర్ లోకి దూసుకెళ్లిన టీడీపీ సభ్యులు
-
కౌన్సిల్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అమర్నాథ్
-
మేనిఫెస్టోను సీఎం జగన్ పవిత్ర గ్రంధంలా భావించారు
-
Live: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2024
-
AP Budget: ఏపీ బడ్జెట్ ప్రసంగం ఇదే..
Updates.. ఏపీ 2024–25 ఆర్థిక సంవత్సరం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.. ►ఏపీ శాసనసభ రేపటికి వాయిదా. ►శాసన మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి గుడివాడ అమర్నాథ్ ►శాసన మండలి రేపటికి వాయిదా. ►అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. రూ.2లక్షల 86వేల 389కోట్లతో వార్షిక బడ్జెట్. రెవెన్యూ వ్యయం రూ.2లక్షల 30వేల 110 కోట్లు. మూలధన వ్యయం రూ.30వేల 530 కోట్లు. ద్రవ్యలోటు రూ.55వేల 817కోట్లు. రెవెన్యూ లోటు రూ.24వేల 758 కోట్లు. జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 1.56శాతం జీఎస్డీపీలో ద్రవ్యలోటు 3.51శాతం. మహత్మాగాంధీ సందేశంతో బడ్జెట్ ప్రసంగం ప్రారంభమైంది. ఐదేళ్లుగా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం నాకు దక్కింది. మేనిఫెస్టోను సీఎం జగన్ ప్రవిత గ్రంధంగా భావించారు. ఇప్పటి వరకు ఎవరూ చేయని పనులను మా ప్రభుత్వం చేసింది. ఏడు అంశాల ఆధారంగా బడ్జెట్ రూపకల్పన సుపరిపాలన, సామర్థ్య ఆంధ్ర, మన మహిళా మహారాణుల ఆంధ్ర, సంపన్నుల ఆంధ్ర, సంక్షేమ ఆంధ్ర, భూభద్ర ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర సుపరిపాలన.. గడప గడపకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు 1.35లక్షల సచివాలయ ఉద్యోగాలు. 2.6లక్షల మంది వలంటీర్ల నియామకం రెవెన్యూ డివిజన్లను 55 నుంచి 78కి పెంపు ప్రతీ జిల్లాలో దిశ పీఎస్‌లను ఏర్పాటు చేశాం. భద్రత, మౌళిక సదుపాయాలను పెంచాం. 13 నుంచి 26 జిల్లాలకు జిల్లాల పెంపు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం 1000 పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఐబీ విధానం, వినూత్న పద్దతుల ద్వారా విద్యాబోధన సులభతరం. రూ.3367కోట్లతో జగనన్న విద్యాకానుక 47లక్ష మంది విద్యార్థులకు విద్యాకానుక 99.81 శాతం పాఠశాలల్లో కనీస మౌళిక సదుపాయాలు అందించాం. జగన్నన గోరుముద్ద కోసం రూ.1910కోట్లు ఖర్చు గత ప్రభుత్వం చేసిన ఖర్చు కంటే నాలుగు రెట్టు ఇది ఎక్కువ సంపూర్ణ పోషణం పథకం ద్వారా గర్బిణులకు మేలు. ఉచితంగా విద్యార్థులకు 9.52,925 ట్యాబ్స్ 34లక్షల మంది విద్యార్థులకు ఉపయోగం. రూ.11901 కోట్లతో జగనన్న విద్యాదీవెన రూ.4267కోట్లతో జగనన్న వసతీ దీవెన ఇప్పటి వరకు 52లక్షల మందికి లబ్ధి డ్రాప్ అవుట్ శాతం 20.37 నుంచి 6.62 శాతాని తగ్గింపు. విదేశీ విద్యాదీవెన కింద 1858 మందికి లబ్ధి. ప్రపంచంలోని 50 ఉన్నత విద్యాలయాల్లో విద్యార్థులకు సాయం బోధనా ఆసుపత్రులకు 16,852 కోట్లు ఖర్చు. నిర్విరామగా 1142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు. ఫ్యామిలీ డాక్టర్ పేరుతో వినూత్న కార్యక్రమం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిమితి రూ.25లక్షలకు పెంపు. ఆరోగ్యశ్రీ వ్యాధులను 3257కు పెంచాం. 2019-23 మధ్య ఆరోగ్యశ్రీ ద్వారా 35.91లక్షల మందికి లబ్ధి. కిడ్నీ రోగులకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం. పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు. జగనన్న ఆరోగ్య సురక్ష కింద 10,754 శిబిరాలు కోటీ 67లక్షల కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య సేవలు 53,126 మంది ఆరోగ్య సంరక్షణ సిబ్భంది నియామకం,. ఏపీలో 192 స్కిల్ హబ్‌లు, 27 స్కిల్ కాలేజీలు నైపుణ్య శిక్షణ ద్వారా 95 శాతం మందికి ఉద్యోగాలు. విద్యార్థుల శిక్షణ కోసం వర్చువల్ ల్యాబ్‌లు 201 పాఠశాలల్లో వర్చువల్ ల్యాబ్స్ అమ్మఒడి ద్వారా 43.61లక్షల మహిళలను మహరాణులను చేశాం. అమ్మఒడి కింద రూ.26,067కోట్లు ఖర్చు చేశాం. వైఎస్సార్ చేయూత కింద రూ.14,129 కోట్లు ఖర్చు. వ్యవసాయం రంగం.. జగనన్న పాలవెల్లువ కింద రూ.2697కోట్లు. 29 దిశా పోలీసు స్టేష్లను ఏర్పాటు. వైఎస్సార్ రైతుభరోసా-పీఎం కిసాన్ కింద 53.53 లక్షలు రైతులకు సాయం. వైఎస్సార్ రైతుభరోసా-పీఎం కిసాన్ రూ.33,300 కోట్లు. కౌలు రైతులు, అటవీ భూముల సాగుదారులకు రూ.13500 సాయం. వైఎస్సార్ చేయూత కింద రూ.14,129 కోట్లు. ఉచిత పంటల బీమా కింద రూ.3411 కోట్లు. సున్నా వడ్డీ పంట రుణాల కింద 1835 కోట్లు. రైతులకే నేరుగా సేవలు అందిస్తున్న రైతు భరోసా కేంద్రాలు రాష్ట్రవ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలు. వ్యవసాయానికి 9 గంటల పాటు నిరంతర విద్యుత్. వ్యవసాయ రంగం విద్యుత్ కోసం రూ.37374 కోట్ల సబ్సిడీ. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు. ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.1277 కోట్లు అందించాం. వైఎస్సార్ వ్యవసాయ పరీక్షా కేంద్రాల ఏర్పాటు యంత్ర సేవల పథకం కింద రైతులకు యంత్రాలు. ఉద్యానవన రంగంలో వివిధ పథకాల ద్వారా రూ.4363 కోట్లు అందించాం. 2356 మంది ఉద్యానవన సహాయకులు నియామకం. 10,216 వ్యవసాయ గోదాముల నిర్మాణాలు. ఆక్వా రంగం.. వైఎస్సార్ మత్య్సకార భరోసా 2లక్షల 43వేల కుటుంబాలకు మేలు. చేపల వేట నిషేధ కాలంలో ఆర్థిక సాయం 4వేల నుంచి 10వేలకు పెంపు. అంతర్జాతీయ ప్రమాణాలతో పది ఫిషింగ్ హార్బర్లు. ఆక్వాకల్చర్ కింద 12వేల హెక్టార్ల విస్తీర్ణం. 16లక్షల 5వేల మందికి జీవనోపాధి. తలసరి ఆదాయంలో ఏపీకి తొమ్మిదో స్థానం ఐదేళ్లలో 30.65లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ. ఐదేళ్లలో 2.53లక్షల కోట్ల నగదు బదిలీ. తలసరి ఆదాయంలో ఏపీకి తొమ్మిదో స్థానం. వైఎస్సార్ పెన్షన్‌ను మూడు వేలకు పెంచాం. 66.35లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం. పెన్షన్లకు ఐదేళ్లలో 84731 కోట్లు ఖర్చు చేశాం. 9260 వాహనాల ద్వారా ఇంటికే రేషన్ పంపిస్తున్నాం. వైఎస్సార్ బీమా కింద రూ.650 కోట్లు ఖర్చు. కల్యాణమస్తు, షాదీ తోఫా కింద రూ.350 కోట్లు పంపిణీ. ఈబీసీ నేస్తం కింద రూ.1257 కోట్లు పంపిణీ కాపునేస్తం కింద రూ.39,247 కోట్లు పంపిణీ. నేతన్ననేస్తం కింద రూ.983 కోట్లు. జగనన్న తోడు కింద రూ.3374 కోట్లు జగనన్న చేదోడు కింద రూ.1268 కోట్లు. వాహనమిత్ర కింద రూ.1305 కోట్లు. అగ్రిగోల్డ్ బాధితులకు రూ.883.5కోట్లు. బీసీలకు 56 కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. బీసీ సంక్షేమం కోసం రూ.71,170 కోట్లు ఖర్చు. పోర్టులు, పరిశ్రమలు... ఏపీ పారిశ్రామిక విధానం 2019-27ను తీసుకొచ్చాం. ఏపీలో ఓడరేవుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడలో పోర్టుల నిర్మాణం. పోర్టుల నిర్మాణం ద్వారా 75వేల మందికి ఉపాధి. రూ.3800 కోట్లతో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం. ఫైబర్ గ్రిడ్‌తో ప్రతీ గ్రామం అనుసంధానం. 55వేల కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ ఏర్పాటు. గిరిజన ప్రాంతాల్లో ఆసుపత్రుల నిర్మాణం. అవుకు రెండో టన్నెల్ పూర్తి. 1079కోట్లతో మూడో టన్నెల్. 77చెరువులతో అనుసంధాన ప్రాజెక్ట్‌ను ప్రారంభించాం వర్షాలపై ఆధారపడిన రైతులకు ఎంతో మేలు. ప్రాధన్య ప్రాజెక్ట్‌ల పూర్తికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. రూ.10137 కోట్లతో తొమ్మిది త్రాగునీటి పథకాలు మంజూరు. సుజలధార ప్రాజెక్ట్ ద్వారా ఉద్దానం ప్రాంత ప్రజలకు ఎంతో మేలు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం. రాష్ట్ర స్థాల ఉత్పత్తి రేటులో 14వ స్థానం నుంచి 4వ స్థానానికి పురోగమించాం. జాతీయ ఆహార భద్రతలో ఏపీ మూడో స్థానంలో ఉంది. ఒక జిల్లా-ఒక ఉత్పత్తి కింద ఉప్పాడ జమ్దానీ చీరకు బంగారు బహుమతి. చేనేత ఉత్పత్తులకు ఏపీకి మరో నాలుగు అవార్డులు. అత్యంత ప్రసిద్ధ పర్యాటక జాబితాలో ఏపీకి మూడో స్థానం. 311కుపైగా భారీ, మెగా పరిశ్రమల ఏర్పాటు. మెగా పరిశ్రమల ద్వారా 1.30లక్షల మందికి ఉపాధి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ద్వారా రూ.5995 కోట్ల పెట్టుబడి. పెట్టుబడులు.. సులభతర వాణిజ్యంలో ఏపీ అగ్రస్థానం. వ్యవసాయ రంగ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 12 నుంచి ఆరో స్థానానికి. రైతులందరికీ ఉచిత పంటల బీమా పథకం వర్తింపజేసిన ప్రభుత్వం మనదే. ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు పెట్టుబడిదారుల నుంచి మంచి స్పందన రూ.15,711 కోట్ల పెట్టుబడులతో 55,140 మందికి ఉపాధి. 23 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. 14 ఎలక్ట్రానిక్ కంపెనీల స్థాపన ద్వారా 34,750 మందికి ఉపాధి. 1426 ఎకరాల్లో జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లు. 12042 ప్లాట్లతో ఎంఐజీ లేఅవుట్ల అభివృద్ధి. ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో 117 ఒప్పందాలు. ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో రూ.19,345 కోట్ల మేర ఒప్పందాలు. వీటి ద్వారా 51,083 మందికి ఉపాధి అవకాశాలు. తిరుపతిలో 100 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టాం. పురోగతిలో 13 న్యాయ భవన నిర్మాణాలు. 10893 గ్రామ పంచాయతీ భవనాలు. 8299 భారత్ నిర్మాణ్ సేవా కేంద్రాలు. 3734 భారీ పాల శీతలీకరణ కేంద్రాలు నిర్మించబడ్డాయి. ఆడుదాం ఆంధ్ర.. ఐదు అంచెల్లో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం. విజేతలకు 12కోట్ల 21లక్షల విలువైన బహుమతులు. 41 క్రీడా వికాస కేంద్రాలు పూర్తి, పురోగతిలో 65 క్రీడా వికాస కేంద్రాలు జగనన్న పచ్చతోరణం కింద ఐదుకోట్ల 11లక్షల మొక్కలు నాటాం. నగరతోరణం కింద పట్టణ, శివార్లలో పచ్చదనం. జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకాలను ప్రారంభించాం. కొత్తగా 11,118 గ్రామ సర్వేయర్ల నియామకం. 17లక్షల 53వేల మంది రైతులకు శాశ్వత హక్కు పత్రాలు. నాలుగు లక్షల 80వేల మ్యుటేషన్లలకు పరిష్కారం. ఉద్యోగాలు.. ఐదేళ్లలో నాలుగు లక్షల 93వేల ఉద్యోగాలు కల్పించాం. ఇందులో 213662 శాశ్వత నియామకాలు. 10వేల మంది ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీకరణ. ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాం. డీఎస్సీ ద్వారా 6100 ఉపాధ్యాయ ఖాళీల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. 11వ వేతన సవరణ సంఘ సిఫార్సులు అమలుచేశాం. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62కు పెంచాం. పోలీసు వ్యవస్థలో నియామక ప్రక్రియ కొనసాగుతోంది. 2019-23 మధ్య ప్రజా పంపిణీ కోసం రూ.29628 కోట్లు ఖర్చు. గత ఐదేళ్లలో రూ.4.23లక్షల కోట్లు ప్రజలకు బదిలీ. డీబీటీ ద్వారా రూ.2.53లక్షల కోట్లు ప్రజలకు నేరుగా అందించాం. నాన్ డీబీజీ ద్వారా రూ.1.68 కోట్లు అందించాం. కేబినెట్ భేటీలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు.. ►2024–25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆమోదించిన మంత్రిమండలి. ►నంద్యాల జిల్లా డోన్‌లో కొత్తగా హార్టికల్చరల్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటుకు ఆమోదం. ►డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్శిటీ పరిధిలో పనిచేయనున్న హార్టికల్చరల్ పాలిటెక్నికల్ కళాశాల. ►నంద్యాల జిల్లా డోన్‌లో వ్యవసాయరంగంలో రెండేళ్ల డిప్లొమా కోర్సుతో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు ఆమోదం. ►ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్శిటీ పరిధిలో పనిచేయనున్న అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల. ►ఆంధ్రప్రదేశ్ ప్రేవేట్ యూనివర్శిటీస్ (ఎస్టాబ్లిస్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్ 2016కు సవరణలు చేయడం ద్వారా బ్రౌన్‌ఫీల్డ్ కేటగిరిలో మూడు ప్రేవేట్ యూనివర్శిటీలకు అనుమతి. ►అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమాచార్య యూనివర్శిటీ, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి గ్లోబల్ యూనివర్శిటీ, కాకినాడ జిల్లా సూరంపాలెంలో ఆదిత్య యూనివర్శిటీల ఏర్పాటుకు ఆమోదం. ►ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 05–02–2024 నాడు ఉభయసభలనుద్దేశించి ప్రసంగించిన గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి. ►ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్. ► టీడీపీ సభ్యులను ఒక్కరోజు సస్పెండ్ చేసిన స్పీకర్ తమ్మినేని. ►మూడోరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం ►ప్రజాసమస్యలపై టీడీపీ నేతలకు చిత్తశుద్ధి లేదు: బుగ్గన సభను అడ్డుకోవడానికి టీడీపీ సభ్యులు వచ్చారు. సీనియర్ నేతలు ఉన్నప్పటికీ ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు ►అసెంబ్లీలో మళ్లీ గందరగోళం ►తీరుమార్చుకోని టీడీపీ సభ్యులు ►ఈరోజు కూడా స్పీకర్ తమ్మినేని వెల్‌లోకి దూసుకెళ్లిన టీడీపీ సభ్యులు ►సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్న టీడీపీ సభ్యులు. ►సభా మర్యాదలు పాటించని టీడీపీ సభ్యులు. ►రెడ్‌లైన్ దాటి స్పీకర్ వెల్‌లోకి వెళ్లిన టీడీపీ సభ్యులు. ►ఈరోజు కూడా పేపర్లు చింపి స్పీకర్‌పై వేసిన టీడీపీ సభ్యులు. ►సభా నిబంధనలకు విరుద్దంగా టీడీపీ సభ్యుల తీరు. ►స్పీకర్ పట్ల అవమానకరంగా ప్రవర్తించిన టీడీపీ సభ్యులు ►స్పీకర్‌ను అవమానపరిచేలా టీడీపీ సభ్యుల నినాదాలు. ►ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం ►బడ్జెట్లో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ►తొలిమూడు నెలలకు ఓటాన్ అకౌంట్ పద్దుకు సభ ఆమోదానికి ప్రతిపాదన ►ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన ఏపీ మంత్రివర్గం. ►ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం ►సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభం ►సెక్రటేరియట్‌కు బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ ►కాసేపట్లో కేబినెట్ సమావేశానికి హాజరు బడుగు బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్: బుగ్గన రాజేంద్రనాథ్ చరిత్రలో ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథలా భావించి అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒకే ఒక్క పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆర్థిక పరిస్థితి బాగుంటే, కోవిడ్ లేకపోయి ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు మరెన్నో చేసేవాళ్లం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చేయాల్సిన దాని కన్నా అట్టడుగువర్గాలకు ఎక్కువ మేలు చేశాం ప్రభుత్వం లేకపోతే బతకడం కష్టంగా ఉన్న, నిస్సహాయ పేద వర్గాలే మా ప్రాధాన్యత గత ఐదేళ్ల బడ్జెట్లో విద్య, వైద్యం, మహిళా సాధికారత, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేశాం. ►మంత్రి బుగ్గన కార్యాలయంలో బడ్జెట్ ప్రతులకు పూజలు ►సెక్రటేరియట్‌కు చేరుకున్న మంత్రి బుగ్గన, ఆర్థిక శాఖ అధికారులు. ►సెక్రటేరియట్‌కు బయల్దేరిన మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, ఆర్థికశాఖ అధికారులు ►మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నివాసానికి చేరుకున్న ఫైనాన్స్ సెక్రటరీ రావత్, ఆర్ధికశాఖ అధికారులు ►మరికొద్దిసేపట్లో సెక్రటేరియట్‌కు బయల్దేరనున్న మంత్రి బుగ్గన, అధికారులు ►అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పత్రాలకు దుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు ►ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్ రావత్, ఆర్ధిక శాఖ అధికారులు ►ఏపీ 2024–25 ఆర్థిక సంవత్సరం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీకి సమర్పించనుంది. ►రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ బుధవారం ఉదయం 11.02 నిమిషాలకు 2024–25 ఆర్థిక సంవత్సరం పూర్తి స్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ►ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆర్థిక ఏడాది తొలి 3 నెలల వ్యయానికి (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) ఓటాన్ అకౌంట్ పద్దు ఆమోదానికి సభలో ప్రతిపాదించనున్నారు. ►అదే సమయానికి శాసన మండలిలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాధ్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను చదువుతారు. ►అంతకు ముందు ఉదయం 8 గంటలకు సచివాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలుపనుంది -
మళ్లీ మన ప్రభుత్వమే: సీఎం జగన్
రాష్ట్ర విభజన నుంచి ఇప్పటికి కూడా మనల్ని రెవెన్యూ లోటు వెంటాడుతోంది. మనం కలసికట్టుగా 60 ఏళ్లపాటు ఉమ్మడిగా హైదరాబాద్‌ను నిర్మించుకున్నాం. అది ఎకనామిక్ పవర్ పాయింట్. ప్రతి రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ ఉండాలి. లేకుంటే రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు ఎప్పటికీ పెరగవు. ‘ట్యాక్స్ బాయోన్సీ’ అన్నది చాలా చాలా ముఖ్యం. పెద్ద పెద్ద నగరాల్లోనే ట్యాక్స్ రెవెన్యూ ఎక్కువగా ఉంటుంది. అందుకే నేను విశాఖపట్నం గురించి గట్టిగా చెబుతా. మేనిఫెస్టో హామీల్లో 99 శాతం వాగ్దానాలను ఈ ఐదేళ్లలో అమలు చేశాం. ప్రతి ఇంటికి మేనిఫెస్టోను తీసుకెళ్లి ప్రజల ఆశీస్సులు కోరుతున్నాం. వైఎస్సార్సీపీ చేయగలిగిందే చెబుతుంది. చెప్పింది ఏదైనా సరే కచ్చితంగా చేసి తీరుతుంది. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో అఖండ మెజారిటీతో ప్రజల మన్ననలు పొంది మళ్లీ 3 నెలలకు ఇదే చట్టసభలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజనతో ఏర్పడిన రెవెన్యూ లోటు, చంద్రబాబు సర్కారు నిర్వాకంతో పెరిగిన ఆర్థిక సంక్షోభం, కోవిడ్ మహమ్మారి లాంటి సవాళ్లను దీటుగా ఎదుర్కొని గత నాలుగున్నరేళ్లుగా ప్రజలకు మంచి చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం ప్రసంగించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రెవెన్యూ లోటు, తగ్గిన ఆదాయం, పెరిగిన ఖర్చులు, కేంద్ర నిధుల తగ్గుదలను గణాంకాలతో సహా వివరించారు. టీడీపీ హయాంలో రాబడి, అప్పులు, ఖర్చులను వైఎస్సార్సీపీ వచ్చాక ఎలా ఉందో వెల్లడిస్తూ సుదీర్ఘంగా మాట్లాడారు. అంతటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొని కూడా గత సర్కారు చేయని విధంగా ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను అందించామని గుర్తుచేశారు. డీబీటీ, నాన్ డీబీటీ పథకాలతో ప్రజలకు మొత్తం రూ.4.31 లక్షల కోట్లను అందించామన్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొడుతూ వాస్తవాలను వివరిస్తూ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. ► గత ప్రభుత్వ విధానాలతో కీలకమైన విద్య, వ్యవసాయం, మహిళా సాధికారత కుదేలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం 2018 మార్చిన విడుదల చేసిన నివేదికను గమనిస్తే విద్యారంగంలో జీఈఆర్ రేషియో జాతీయ స్థాయిలో 96.91 శాతం ఉంటే మన రాష్ట్రంలో 83.29 శాతమే ఉంది. ఆ డేటా చూస్తే అమ్మ ఒడి పథకం ఎంత అవసరమో అందరికీ అర్థమవుతుంది. గత సర్కారు హయాంలో ప్రైమరీ స్కూళ్లలో విద్యార్థుల ఎన్‌రోల్‌లో రాష్ట్రం చివరిన మూడో స్థానంలో ఉంది. దాన్ని మనం ఏ స్థాయికి తీసుకొచ్చామో గణాంకాలు చూస్తే అర్థమవుతుంది. ► చంద్రబాబు రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. రూ.87 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తామని దగా చేశారు. ఐదేళ్లలో రూ.15 వేల కోట్లు కూడా ఇవ్వలేకపోయారు. రైతుల జీవితాలు అగమ్యగోచరంగా తయారయ్యాయి. మనం వచ్చాక రైతు భరోసా పథకం అందించి తోడుగా నిలిచాం. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని అక్కచెల్లెమ్మలను చంద్రబాబు మోసం చేశారు. సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేస్తానని దగా చేశారు. మనం అధికారంలోకి వచ్చాక పొదుపు సంఘాలకు జీవం పోశాం. ► ‘ట్యాక్స్ బాయోన్సీ’ అన్నది అత్యంత ప్రధానం. పెద్ద పెద్ద సిటీల్లో ట్యాక్స్ రెవెన్యూ ఎక్కువగా ఉంటుంది. అందుకే నేను విశాఖపట్నం గురించి గట్టిగా చెబుతా. జాతీయ స్థాయిలో జీడీపీ గమనిస్తే వ్యవసాయ రంగం నుంచి 18 శాతం ఉంటే తెలంగాణలో 17 శాతం ఉంది. మన రాష్ట్రంలో 34 శాతం వ్యవసాయ రంగం నుంచి ఉంది. మనది రైతులతో కూడిన ఎకానమీ. దీని వల్ల ఎబిలిటీ టూ జనరేట్ ట్యాక్స్ రెవెన్యూ తగ్గుతుంది. హైదరాబాద్ లాంటి నగరం లేకపోవడం, విభజన వల్ల రాష్ట్రం ఏటా రూ.13 వేల కోట్లను ఆదాయపరంగా నష్టపోతున్నాం. ఈ పదేళ్లలో రూ.1.35 లక్షల కోట్లు నష్టపోయాం. రాష్ట్రాన్ని విడగొట్టే సమయంలో చట్టంలోనైనా ప్రత్యేక హోదా ఇస్తామని పొందుపరచి ఉంటే మనం కోర్టుకు వెళ్లి తెచ్చుకునేవాళ్లం. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టారు. చట్టంలో చేర్చకపోవడంతో ప్రత్యేక హోదా ఎండమావిగా మారిపోయింది. కేంద్రంలో అధికార పారీ్టకి పూర్తి మెజారిటీ లేకపోతే, మన మద్దతు అడిగిన వారిని మనం గట్టిగా డిమాండ్ చేయగలిగేవాళ్లం. ► ఇన్ని ఇబ్బందులు, సవాళ్ల మధ్య మన ఆర్థిక వ్యవస్థను 56 నెలలుగా సమర్థంగా నడుపుతూ ముందడుగులు వేస్తున్నాం. ఎక్కడా అవినీతి అన్నదే లేకుండా వ్యవస్థను ప్రక్షాళన చేశాం. మన ప్రభుత్వం రాకముందు నిధులు అవినీతి లేకుండా ప్రజలకు చేరేవి కాదు. ఈరోజు బటన్ నొక్కడం ద్వారా నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు పంపిస్తున్నాం. ఎక్కడ లంచాలు, వివక్ష లేదు. ఏకంగా రూ.2.55 లక్షల కోట్లు డీబీటీ ద్వారా అందించాం. నాన్ డీబీటీ స్కీమ్స్ ద్వారా మరో రూ.1.07 లక్షల కోట్లు ఇచ్చాం. (ఇళ్ల స్థలాల మార్కెట్ విలువ కూడా తీసుకుంటే దాదాపు రూ.1.76 లక్షల కోట్లు ఉంటుంది) ► మన ప్రభుత్వానికి శత్రువులు ఎక్కువగా ఉన్నారు. ఎల్లో మీడియా ఒకే అబద్ధాన్ని చెప్పిందే చెబుతూ గోల చేస్తోంది. మన ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఎక్కువ, మూలధన వ్యయం తక్కువ అని ఆరోపణలు చేస్తున్నారు. జగన్ బటన్ నొక్కుతున్నాడని ఆరోపిస్తున్నారు. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చంద్రబాబు హయాంలో సగటున రూ.15,227 కోట్లు కాగా మన ప్రభుత్వ పాలనలో రూ.17,757 కోట్లుగా ఉంది. నాడు– నేడు ద్వారా స్కూళ్లు, ఆసుపత్రులను తీర్చిదిద్దుతున్నాం. అదనంగా మూడు పోర్టులు నిర్మిస్తున్నాం. ► ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వులు చూడాలనే ఈ ప్రభుత్వం అడుగులు ముందుకు వేసిందని గర్వంగా చెబుతున్నా. ఇచ్చిన హామీలను ఏకంగా 99 శాతం అమలు చేసి మేనిఫెస్టోను ప్రతి ఇంటికి తీసుకెళ్లి ప్రజల ఆశీస్సులు అందుకుంటున్న ప్రభుత్వం మనది మాత్రమే. ఇంటింటి ఆర్థిక వ్యవస్థను మనం మార్చగలిగాం. ► చంద్రబాబు వయసు 75 ఏళ్లు. ఆయన రాజకీయాల్లోకి వచ్చి 40 ఏళ్లు. మొదటిసారి సీఎం అయి దాదాపు 30 ఏళ్లు అవుతోంది. మూడు సార్లు సీఎం అయ్యారు. ఇన్నేళ్ల తరువాత కూడా ఫలానిది చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి... అని అడిగే దమ్ము చంద్రబాబుకు లేదు. మరోసారి అవకాశం ఇస్తే ఇది చేస్తా అది చేస్తా అంటున్నారు. చంద్రబాబు ప్రతి సామాజిక వర్గాన్ని మోసం చేశారు. ఏ గ్రామంలోనైనా చంద్రబాబు ఫలానిది చేశారని చెప్పేందుకు ఒక్క బిల్డింగ్ కనిపించదు. స్కూళ్లన్నీ నిర్వీర్యం చేశారు. మరోసారి కొత్త ఎరలతో ఆ పెద్ద మనిషి బయలుదేరారు. నమ్మినవాడు మునుగుతాడు.. నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడన్నది ఆయన సిద్ధాంతం. హైదరాబాద్‌లో కూర్చొని అరడజను వాగ్ధానాలతో కిచిడి చేసి మేనిఫెస్టో రూపంలో తెచ్చారు. మేనిఫెస్టోలో వందల హామీలు ఇస్తారు. ఎన్నికల తరువాత చెత్తబుట్టలో వేస్తారు. ఒక్క అబద్ధమాడితే 2014లోనే సీఎం అయ్యేవాడిని 2014 ఎన్నికల్లో మనకు 45 శాతం ఓట్లు వస్తే మనకంటే దాదాపుగా ఒక్క శాతం ఓట్లు అధికంగా పొంది చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. మనకు చంద్రబాబుకు తేడా ఒక్క శాతం మాత్రమే. నాడు మనం కూడా రూ.87 వేల కోట్లు రైతుల రుణాలను మాఫీ చేస్తామంటూ హామీ ఇద్దామని చాలా మంది నాకు చెప్పారు. చేయలేనిది చెప్పకూడదు.. మాట ఇస్తే తప్పకూడదని ఆ రోజు నేను చెప్పా. ఆ రోజు నేను అధర్మం చేయని కారణంగా ఒక్క శాతం ఓటు తేడాతో ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చున్నా. ఒక్క అబద్ధం చెప్పి ఉంటే ఆ రోజే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునేవాడిని. కానీ ఈ రోజు కూడా నాకు రిగ్రేట్ లేదు. వెనక్కి వెళ్లి మళ్లీ అబద్ధం చెప్పను. నా నోట్లో నుంచి అబద్ధాలు రావు. నేను ఆ రోజు చేసిన పని వల్ల అధికారంలోకి రాకపోవచ్చు. కానీ విశ్వసనీయత అన్న పదానికి అర్థం జగనే అని ప్రజలు నమ్మారని గర్వంగా చెబుతున్నాను. కరోనా విపత్తు వల్ల రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయిన ఆదాయం వివరాలు రాష్ట్ర ఆదాయం తగ్గినా... ► జఠిల పరిస్థితుల్లో మనం అధికారంలోకి వచ్చాం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఐదేళ్లలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. దేశంలో ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ లేవు. కోవిడ్‌తో రాష్ట్ర ఆదాయం తగ్గింది. అనుకోకుండా ఖర్చులు పెరిగాయి. సాధారణంగా ఏటా రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. కానీ గత ఐదేళ్లలో అనూహ్య పరిస్థితులు చూశాం. కేంద్రం వసూలు చేసిన పన్నుల్లో రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటా బాగా తగ్గింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులూ తగ్గాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రయాణం చేస్తూ రాష్ట్రాన్ని నడిపించాల్సి వచ్చింది. రాష్ట్ర విభజనతో వచ్చిన ఇబ్బందులు ఇప్పటికీ ఉన్నాయి. రెవెన్యూ లోటును అధిగమిస్తూ గొప్ప పాలన అందించాం. ► 2015– 2019లో రాష్ట్రంలో స్టేట్ ట్యాక్స్ రెవెన్యూ 13.29 శాతం పెరిగింది. ఆ ప్రకారం గ్రోత్ రేట్ ఉంటే మనకు 2019–24 మధ్య రూ.2,24,603 కోట్లు రావాలి. కానీ రాష్ట్రానికి కేవలం రూ.1,15,552 కోట్లు మాత్రమే వచ్చాయి. కేంద్రం కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 12.76 శాతం ఉండటంతో అనుకున్న మేర మనకు నిధులు ఇవ్వలేకపోయింది. ఈ రకంగా కూడా రాష్ట్రం నష్టపోవాల్సి వచ్చింది. ఆదాయం కోల్పోవడం, ఖర్చుల భారం పెరగడంతో ఆర్థిక వ్యవస్థలో కుదుపు వచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన గణాంకాలు గమనిస్తే 2013– 14లో జీడీపీ రేషియో 50 శాతం ఉంది. వారు అనుసరించిన విధానాల వల్ల 2018 నాటికి డెట్ జీడీపీ రేషియోను 48 శాతానికి తగ్గించారు. కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఇది 61 శాతానికి పెరిగింది. ఇవాళ 57 శాతం ఉంది. ► 2015–2019 మధ్య కేంద్ర పన్నుల ఆదాయంలో రాష్ట్రాలకు 42 శాతం వాటా ఇవ్వాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేస్తే 35 శాతం ఇచ్చింది. చంద్రబాబు సర్కారుకు ఆ మాత్రమైనా లబ్ధి కలిగింది. కేంద్రం రాను రాను సెస్‌లు, సర్‌చార్జ్‌ల పేరుతో వాటాను తగ్గించింది. మన ప్రభుత్వ హయాంలో 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం కేంద్ర పన్నుల్లో 31 శాతం వాటా మాత్రమే ఇచ్చారు. ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సి పన్నుల వాటా గమనిస్తే జీఎస్డీపీ 2018– 19లో రూ.32 వేల కోట్లు ఉండగా 2019–20లో రూ.28 వేల కోట్లుకు తగ్గింది. 2022– 2023లో రూ.24 వేల కోట్లకు పడిపోయింది. ఇప్పుడిప్పుడే కాస్త కుదుటపడుతోంది. రాష్ట్రానికి సంబంధించిన అన్ని రకాల అప్పుల వివరాలు అప్పులపై పదే పదే అబద్ధాలు ► అబద్ధాల బ్యాచ్ చేసే మరో ఆరోపణ.. రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తోందట! నోటికి హద్దుపద్దు లేకుండా ఇష్టానుసారంగా అబద్ధాలు చెబుతున్నారు. విభజన నాటికి రూ.1.53 లక్షల కోట్లు అప్పు ఉంటే చంద్రబాబు దిగిపోయే నాటికి మొత్తంగా రూ.4,12,288 కోట్లు అప్పులున్నాయి. రూ. 4,12,288 కోట్లు అప్పు నుంచి మనం ప్రయాణం మొదలు పెడితే ఇప్పుడు రూ.7.03 లక్షల కోట్లకు చేరింది. చంద్రబాబు హయాంలో అప్పుల పెరుగుదల రేటు 21.78 శాతం ఉంటే మన హయాంలో కేవలం 12.13 శాతమే ఉంది. చంద్రబాబు సమయంలో బటన్లు లేవు, స్కీమ్‌లు లేవు. అప్పుడు ఉన్నది దోచుకో..పంచుకో..తినుకో మాత్రమే. ► పరిమితి మించి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తోందని కౌరవ సైన్యం ఆరోపణలు చేస్తోంది. చంద్రబాబు హయాంలో 2014–19 మధ్య పరిమితికి మించి రూ.28,457 కోట్లు అప్పులు చేశారు. మన హయాంలో ఆర్థిక సంఘం సిఫార్సుల కంటే రూ.366 కోట్లు తక్కువగా అప్పులు చేశాం. ఇది వాస్తవం కాదా? ► టీడీపీ హయాంలో రాష్ట్ర అప్పులు 7.5 శాతం ఉన్నాయి. అదే సమయంలో కేంద్రం అప్పులు 3.6 శాతమే ఉన్నాయి. మన హయాంలో కేంద్రం అప్పులు 6.5 శాతం ఉంటే మనం అప్పు చేసింది 5.6 శాతం మాత్రమే. అప్పుల పరంగా గానీ, ప్రభుత్వ పరంగా గానీ ఎలా చూసినా సరే గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి చాలా తేడా ఉందని గర్వంగా చెబుతున్నా. ► మన ప్రభుత్వం రూ.2.90 లక్షల కోట్లు అప్పు చేస్తే.. ఒకడు రూ.13 లక్షల కోట్లు అంటారు. మరొకడు రూ.10 లక్షల కోట్లు అంటారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏ ఒక్క కుటుంబానికీ మంచి చేయలేదు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఎవరి బ్యాంకు ఖాతాలో ఎంత వేశారు? మన ప్రభుత్వం వచ్చాక ఎంత వేశాం? ఇంటింటికీ వెళ్లి చూడమని చెబుతున్నా. అదే రాష్ట్రం, అదే బడ్జెట్.. మారిందల్లా ఒక్క ముఖ్యమంత్రి మాత్రమే. అప్పుల గ్రోత్ రేట్ అప్పటికంటే ఇప్పుడు చాలా తక్కువగా ఉంది. చంద్రబాబు మనకన్నా ఎక్కువ అప్పులు చేసి కూడా ప్రజల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు ఎందుకు వేయలేకపోయారో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఆ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో కూడా ఆలోచించాలి. మా హయాంలో ప్రతి రూపాయికీ లెక్క ఉంది. ఆధార్ నంబర్లతో సహా బ్యాంకు ఖాతాల వివరాలు ఇస్తాం. ఎవరికి ఎంత ఇచ్చామో మేం చెప్పగలం. మరి టీడీపీ హయాంలో నిధులను ఎలా ఖర్చు చేశారో చెప్పగలరా? ఆ నిధుల్లో చంద్రబాబు తిన్నది ఎంత? దత్తపుత్రుడికి ఇచ్చింది ఎంత? ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5లతో కూడిన ఎల్లో మీడియాకు ఇచ్చింది ఎంత? చంద్రబాబు పాలనాకాలంలో పెరిగిన రెవెన్యూ లోటు వివరాలు (పింక్ కలర్లో) బాబు పాలనంతా రెవెన్యూ లోటే ► మనం వెచ్చిస్తున్న రూ.70 వేల కోట్లకే రాష్ట్రం శ్రీలంక అవుతుందని అంటున్నారే.. మరి రూ.1.24 లక్షల కోట్లు ఎలా సాధ్యమని ప్రశ్నిస్తే చంద్రబాబు సంపద సృష్టిస్తారంటూ ఎల్లో మీడియా డప్పు కొడుతోంది. చంద్రబాబు ట్రాక్ రికార్డు గమనిస్తే ఆయన సీఎం కాకమునుపు రెవెన్యూ మిగులు ఉండేది. చంద్రబాబు సీఎం అయ్యాక ఏ సంవత్సరం చూసినా రెవెన్యూ లోటే కనిపిస్తుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రెవెన్యూ మిగులు ఉంది. చంద్రబాబు ప్రజలకు ఏ స్కీమ్ కూడా అమలు చేయలేదు. మరి ఎక్కడ సంపద సృష్టించారో ప్రజలు ఆలోచించాలి. చంద్రబాబు విజనరీ అయితే.. ఆయన పాలనలో రాష్ట్రం మెరుగుపడి ఉంటే జీడీపీలో మన జీఎస్డీపీ వాటా ఎంత అని గమనించాలి. 2014–19లో రాష్ట్రం దేశానికి పన్నుల కింద 4.47 శాతం వాటా ఆదాయం ఇస్తే.. మన హయాంలో ఈ ఐదేళ్లలో 4.82 శాతం వాటా ఆదాయాన్ని కేంద్రానికి ఇచ్చాం. దీనిని బట్టి ఎవరు సంపద సృష్టించారో స్పష్టంగా కనిపిస్తోంది. అది కూడా రెండేళ్లు కోవిడ్ ఉన్నా, ఆదాయం తగ్గినా, ఖర్చులు పెరిగినా, ఇన్ని పథకాలు అమలు చేస్తూనే ఈ స్థాయిలో జీఎస్డీపీ కేంద్రానికి ఇచ్చాం. ► మనసు లేని నాయకుడు, మోసం చేసే నాయకుడు కేవలం వాగ్ధానాలు మాత్రమే చేస్తాడు. మనసున్న ప్రభుత్వం, అమలు చేసే నిజాలు చెబుతుంది. ఇదీ ఆయనకు, మనకు ఉన్న తేడా. చంద్రబాబుకు వాగ్ధానాలు అమలు చేసే ఉద్దేశం లేదు. అమలు చేసిన చరిత్ర అంత కన్నా లేదు. చంద్రబాబు మేనిఫెస్టోని ఏ ఒక్కరైనా నమ్మడం అంటే బంగారు కడియం ఇస్తానన్న పులిని నమ్మినట్లే! ► చంద్రబాబు రకరకాల మోసాలు చేశారు కాబట్టే ఆ పార్టీని 23 స్థానాలతో ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. మాట మీద నిలబడ్డాం కాబట్టే 151 స్థానాలు ఇవ్వడమే కాకుండా ప్రతి ఎన్నికలోనూ ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుని వైఎస్సార్ సీపీని గెలిపించారు. విశ్వసనీయత అన్నది ఎప్పటికైనా గెలుస్తుంది. ఫలానా వ్యక్తి నమ్మకస్తుడనే గుర్తింపు సంపాదించుకోవాలంటే సంవత్సరాలు పడుతుంది. దేవుడి దయ వల్ల ఆ పేరు వైఎస్సార్ సీపీ సంపాదించుకోగలిగిందని గర్వంగా చెబుతున్నా. ఈ రోజు కూడా చెబుతున్నా.. వైఎస్సార్ సీపీ చేయగలిగిందే చెబుతుంది. చెప్పింది ఏదైనా కూడా కచ్చితంగా మాట మీద నిలబడుతుందని వంద శాతం చెబుతున్నాను. టీడీపీ ఇప్పుడు ఇస్తున్న కొన్ని ఎన్నికల హామీలు అమలు చేయాలంటే అయ్యే ఖర్చు వివరాల అంచనా అధికారం కోసం అడ్డగోలు హామీలు జగన్ ప్రజలకు సంక్షేమ పథకాలు ఎక్కువగా ఇచ్చేస్తున్నాడు! సంక్షేమ పథకాలతో అభివృద్ధి ఆగిపోతుంది. రాష్ట్రం మరో శ్రీలంకలా తయారవుతుంది అని చంద్రబాబు ఇన్నాళ్లూ మాట్లాడారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి అవే రాతలు రాశాయి. ఎన్నికలు వచ్చేసరికి జగన్ ఇంతేనా ఇచ్చేది? నేను ఇంకా ఎక్కువ ఇస్తానని చంద్రబాబు నమ్మబలుకుతున్నారు. వీళ్లకు నిజంగా చిత్తశుద్ధి, నిబద్ధత ఉందా? అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ప్రజలను మోసం చేసేందుకు, దోచుకుని పంచుకునేందుకే వీళ్లకు అధికారం కావాలి. చంద్రబాబు మేనిఫెస్టో ఏది చూసినా ఇవే మోసాలు కనిపిస్తాయి. 1995 నుంచి ఇప్పటివరకు చంద్రబాబు మేనిఫెస్టోల్లో 650 వాగ్దానాలు చేశారు. వాటిలో 10 శాతం కూడా అమలు చేయలేదు. చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే ఒక్క పథకమైనా ఉందా? ప్రజలను మరోసారి మోసగించేందుకే చంద్రబాబు ఆరు వాగ్దానాల పేరుతో వస్తున్నారు. ఇలాంటి వ్యక్తిని నమ్మడం కరెక్టేనా? అని ప్రజలు ఒకసారి ఆలోచించాలి. చంద్రబాబును నమ్మితే... బంగారు కడియం ఇస్తానని చెప్పి అమాంతంగా తినేసే పులిని నమ్మినట్టే. ► ఇవాళ 66.34 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. దీనికి ఏడాదికి రూ.36 వేల కోట్లు అవుతుంది. ఉచిత విద్యుత్‌కు రూ.11 వేల కోట్లు ఖర్చు అవుతుంది. సబ్సిడీ కింద బియ్యం రూ.4,600 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, 104, 108కు రూ.4,400 కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.2,800 కోట్లు, సంపూర్ణ పోషణ, గోరుముద్ద లాంటి 8 పథకాలకు ఏటా రూ.53 వేల కోట్లు ఖర్చు అవుతుంది. వీటిని ఎవరూ రద్దు చేయలేరు. ► వాటికి చంద్రబాబు చెప్పిన 6 హామీలు అదనంగా చేరిస్తే.. మహాశక్తి పథకానికి రూ.36 వేల కోట్లు, తల్లికి వందనం పథకానికి రూ.12,400 కోట్లు, యువగళం పథకానికి రూ.7,200 కోట్లు, దీపం పథకానికి రూ.4,634 కోట్లు, అన్నదాత పథకానికి రూ,10,706 కోట్లు కలిపి రూ.73 వేల కోట్లు అవుతుంది. కచ్చితంగా అమలు చేయాల్సిన 8 పథకాలకు అయ్యే రూ.53 వేల కోట్లకు రూ.73 వేల కోట్లు కూడా కలిపితే రూ.1.26 లక్షల కోట్లు ఏటా ఖర్చు చేయాల్సి వస్తుంది. దుర్భుద్ధితో ప్రజలను దగా చేయడం చంద్రబాబుకు ధర్మమేనా? -
చెయ్యలేనిది చెప్పకూడదు...మాట ఇస్తే తప్పకూడదు: సీఎం జగన్
-
చంద్రబాబు పేరు చెప్తే ఇప్పటికీ గుర్తుకొచ్చేది వెన్నుపోటే
-
ఎల్లో మీడియా ఒకే అబద్ధాన్ని పదేపదే చెప్తోంది
-
2024 జూన్ లో మళ్లీ మన ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ పెడుతుంది
-
కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తగ్గిపోయాయి
-
ఏపీ ప్రభుత్వ విద్యార్థులు అమెరికా వెళ్లడం గొప్ప విషయం..!
-
గంటా రాజీనామాకు స్పీకర్ ఆమోదం
-
‘చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు’
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందని వైఎస్సార్సీపీ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. సీఎం జగన్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మంగళవారం అసెంబ్లీలో మాట్లాడారు. ‘సీఎం జగన్ రూ.2లక్షల 53 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశారు. ఎన్నికల్లో ఎలా లబ్ధి పొందాలో ప్రతిపక్షం ఆలోచిస్తోంది. నాయకుడికి ఉండాల్సిన లక్షణం చంద్రబాబుకు లేదు. మీకు మంచి జరిగితేనే నాకు అండగా నిలబడండి అని సీఎం జగన్ చెప్పారు.నాయకత్వం అంటే సీఎం జగన్‌ది.మేనిఫెస్టోలోని ప్రతి హామీని సీఎం జగన్ నెరవేర్చారు. సీఎం జగన్ పాలనలో పేదరికం తగ్గింది. కరోనా కష్టకాలంలో కూడా పేదవాడికి తోడుగా సీఎం జగన్ నిలబడ్డారు. అర్హుడైన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదలకు మంచి చేసింది కనుకనే ఈరోజు ధైర్యంగా చెప్పుకుంటున్నాం’ అని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ‘పేదవాడు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే చంద్రబాబుకు కడుపుమంట. రాజకీయమే అజెండాగా చంద్రబాబు ప్రవర్తిస్తుంటారు. మాటలతో మభ్యపెట్టే చంద్రబాబుని ప్రజలు నమ్మరు. చంద్రబాబుకు ఎందుకంత ద్వేషం? చంద్రబాబు చెప్పుకునేందుకు ఓ మంచి పథకం ఉందా?. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు’ అని శ్రీకాంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. -
అసెంబ్లీలో టీడీపీ అరాచకాలు..!
-
టీడీపీ పాలనలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదు?: సుధాకర్ బాబు
-
రెడ్ లైన్ దాటి స్పీకర్ ఛాంబర్ లోకి వెళ్లిన టీడీపీ సభ్యులు
-
మాజీ ఎమ్మెల్యేల మృతికి అసెంబ్లీలో సంతాపం..!
-
మమ్మల్ని రెచ్చగొడుతున్నారు.. జాగ్రత్త టీడీపీ నేతలకు అంబటి వార్నింగ్
-
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ
-
అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ఓవరాక్షన్
-
అసెంబ్లీ వద్ద టీడీపీ హైడ్రామా
సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాలను టీడీపీ ఎమ్మెల్యేలు తమ పబ్లిసిటీకి ఉపయోగించుకునే క్రమంలో హైడ్రామా సృష్టించారు. సోమవారం సమావేశాలు ప్రారంభానికి ముందు అసెంబ్లీ ఆవరణలో టీడీపీ సభ్యులు నిరసన పేరుతో హడావుడి మొదలెట్టారు. అసెంబ్లీ పరిసరాల్లో నిరసనలు, ప్రదర్శనలకు అనుమతి లేదని తెలిసి కూడా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రదర్శనగా వచ్చారు. ఒక్కసారిగా అసెంబ్లీ గేట్లు తోసుకుంటూ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టి వారిని ఆపేందుకు ప్రయత్నించారు. టీడీపీ సభ్యులు బారికేడ్లను నెట్టివేసి అసెంబ్లీ లోపలికి వెళ్లారు. పోలీసులను తిడుతూ కావాలనే రాద్ధాంతం సృష్టించి అక్కడే అనుకూల మీడియాతో మాట్లాడారు. అవసరం లేకున్నా ఫొటోలు, వీడియోల కోసం పోలీసులతో వాగ్వాదానికి దిగి, నెట్టుకుంటూ గందరగోళం సృష్టించారు. రాజ్యాంగ వ్యవస్థకు అవమానం ఇకపోతే ఉభయ సభల సంయుక్త సమావేశం వేదికగా రాజ్యాంగ వ్యవస్థను టీడీపీ అవమానించింది. సభా సంప్రదాయాలను అపహాస్యం చేసింది. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రసంగానికి ఉపక్రమించారు. తొలుత కొద్ది నిముషాల పాటు గవర్నర్ ప్రసంగం సాఫీగా సాగింది. అనంతరం ప్రతిపక్ష సభ్యులు గవర్నర్ ప్రసంగానికి సమాంతరంగా పదే పదే రన్నింగ్ కామెంట్రీతో ఆటంకం కలిగించారు. టీడీపీ సభ్యుల్లో ముఖ్యంగా బుచ్చయ్యచౌదరి, నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు తదితరులు తమ స్థానాల్లో కూర్చునే ప్రసంగ అంశాలపై కామెంట్లు చేస్తూ సభలో గందరగోళం సృష్టించారు. ఈ క్రమంలో సభలో ప్రతిపక్ష సభ్యుల తీరును అధికార పక్షం సభ్యులు తీవ్రంగా తప్పుబట్టారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పేదలందరికీ ఇళ్లు, మహిళా సాధికారత రంగాల్లో ప్రభుత్వం చేపట్టి సంస్కరణలు, ఆయా వర్గాలకు జరిగిన మేలుపై గణాంకాలతో సహా గవర్నర్ తన ప్రసంగంలో వివరిస్తుండగా టీడీపీ సభ్యులు అంతరాయం కలిగించే యత్నం ఎక్కువగా చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన సామాజిక భద్రత–సున్నితత్వం నుంచి సుస్థిరత దిశగా పరివర్తన.. అనే అంశంపై గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ వెంట తెచ్చుకున్న ప్లకార్డులు ప్రదర్శిస్తూ సభలో నినాదాలు చేశారు. తమ స్థానాల్లో నిలబడి.. గవర్నర్ ప్రసంగంలో వాస్తవాలు లేవంటూ ఆరోపించారు. అసత్యాల ప్రసంగాన్ని వినలేమంటూ వాకౌట్ చేశారు. ఈ క్రమంలో ఓ వైపు ప్రసంగం కొనసాగుతుండగానే అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. టీడీపీ సభ్యులను పూర్తిగా ఇళ్లకు పరిమితం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎద్దేవా చేశారు. ఆ తర్వాత టీడీపీ సభ్యులు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం అంతా అంకెల గారడీ, అభూత కల్పనలు, అసత్యాలు, అర్థసత్యాలమయమని.. ఈ సందర్భంగా టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, బుచ్చయ్యచౌదరి తదితరులు విమర్శించారు. ఎన్నికల ముందు గవర్నర్ ద్వారా ప్రజల్ని మోసగించడానికి సీఎం జగన్ మరోసారి ప్రయత్నించారని విమర్శించారు. 36 పేజీల గవర్నర్ ప్రసంగంలో వాస్తవ పరిస్థితులు ప్రజల ముందు ఉంచలేదన్నారు. 98 శాతం హామీలు నెరవేర్చాను, 175 స్థానాల్లో గెలిపించండి.. అనే అర్హత ముఖ్యమంత్రికి లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని సీఎం నెరవేర్చ లేదని చెప్పారు. గవర్నర్ కూడా నీళ్లు నములుతూ, చెప్పలేక చెప్పలేక దగ్గుతూ అబద్ధాలు చెప్పారన్నారు. -
సంక్షేమం, అభివృద్ధి మేళవింపు.. 'ప్రగతికి ప్రణామం'
సాక్షి, అమరావతి: సంక్షేమాన్ని–అభివృద్ధిని మేళవించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన, రాష్ట్ర ప్రగతికి మానవ వనరులనే చుక్కానిగా చేసుకుని కార్యాచరణను వేగవంతం చేసిందన్నారు. నవరత్నాల పథకాలు సత్ఫలితాలనిస్తున్నాయన్నారు. నీతిఆయోగ్ తాజా నివేదిక ప్రకారం ఏపీలో పేదరిక గణన నిష్పత్తి 2015–16లో 11.77% ఉండగా 2022–23 నాటికి 4.19 శాతానికి తగ్గడమే అందుకు నిదర్శనమన్నారు. గత నాలుగేళ్లలో డీబీటీ, నాన్ డీబీటీ పథకాల ద్వారా ఇప్పటివరకు రూ.4.23 లక్షల కోట్ల మేర ప్రజలకు లబ్ధి చేకూర్చినట్లు చెప్పారు. విద్య, వైద్య రంగాల్లో ప్రభుత్వం వినూత్న విధానాలకు అంకురార్పణ చేసిందన్నారు. వ్యవసాయాన్ని లాభసాటి చేసేందుకు సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేయడంతోపాటు సహజ వనరులను సద్వినియోగం చేసుకుంటూ పారిశ్రామికాభివృద్ధి ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ 206 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ నిబద్ధతను గవర్నర్ అభినందించారు. ఇది రాష్ట్ర చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా తొలి రోజు సోమవారం శాసనసభ, శాసన మండలి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగించారు. అసెంబ్లీ ప్రాంగణం వద్ద గవర్నర్‌కు ముఖ్యమంత్రి జగన్ సాదర స్వాగతం పలికారు. తన ప్రసంగంలో గవర్నర్ ఏమన్నారంటే.. విద్యా సంస్కరణలు.. రాష్ట్ర విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా విద్యా రంగంలో వినూత్న కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది. విద్యా రంగ సంస్కరణల కోసం ఇప్పటివరకు రూ.73,417 కోట్లు ఖర్చు చేసింది. ‘జగనన్న అమ్మ ఒడి’ ద్వారా రూ.26,067 కోట్లు వెచ్చించింది. ఏటా 43.61 లక్షల మంది తల్లులు, 83 లక్షల మంది పిల్లలు పథకంతో లబ్ధి పొందుతున్నారు. 56,703 ప్రభుత్వ విద్యా సంస్థలను మూడు దశల్లో ఆధునీకరించేంందుకు ‘మన బడి – నాడు నేడు’ చేపట్టింది. ఇప్పటివరకు రూ.7,163 కోట్లు వెచ్చించింది. 44,800 పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో 46,661 మంది ఆయాలను నియమించింది. విద్యార్థుల్లో పోషకాహార సమస్యను నివారించేందుకు 16 రకాల ఆహార పదార్థాలతో రుచికరంగా ‘జగనన్న గోరుముద్ద’ చేపట్టింది. 43.27 లక్షల మంది విద్యార్థుల కోసం ఏటా రూ.1,910 కోట్లు చొప్పున రూ.4,417 కోట్లు ఖర్చు చేసింది. గత ప్రభుత్వంతో పోలిస్తే ఇది నాలుగు రెట్లు అధికం. ‘జగనన్న విద్యా కానుక’ ద్వారా ఏటా 47 లక్షలమంది విద్యార్థులకు ప్రయోజనం కలిగిస్తోంది. నాలుగేళ్లలో ఈ పథకం కోసం రూ.3,367 కోట్లు ఖర్చు చేసింది. బైజూస్ కంటెంట్‌తో 8వ తరగతి విద్యార్థులకు 9,52,925 ట్యాబ్‌లను పంపిణీ చేసింది. ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు 62 వేల ఇంటరాక్టివ్ స్క్రీన్లు, ప్రాథమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో టోఫెల్ ప్రవేశపెట్టింది. ఇంటర్నేషనల్ బాకలారియేట్ (ఐబీ) సిలబస్‌ను 2026 నుంచి ప్రవేశపెడుతోంది. జగనన్న విద్యా దీవెన కింద పూర్తి పీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తూ 26.98 లక్షల మంది విద్యార్థులకు రూ.11,901 కోట్లను చెల్లించింది. జగనన్న వసతి దీవెన పథకం ద్వారా ఏటా రూ.20 వేలు విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేస్తోంది. ఇప్పటివరకు 25,17,245 మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగిస్తూ ప్రభుత్వం రూ.4,276 కోట్లను పంపిణీ చేసింది.పేద విద్యార్థుల కలను నిజం చేస్తూ జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని అమలు చేస్తోంది. అత్యున్నత 50 విదేశీ విద్యా సంస్థల్లో 21 ఫ్యాకల్టీలలో విద్య అభ్యసించే అవకాశాన్ని కల్పిస్తూ రూ.1.25 కోట్ల వరకు ఫీజులు చెల్లిస్తోంది. పథకం కింద ఇప్పటివరకు రూ.107.08 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించింది. వర్సిటీల్లో 3,295 అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ చర్యలతో డ్రాపౌట్లు గణనీయంగా తగ్గిపోయాయి. వైద్య విప్లవం వైద్య రంగంలో మౌలిక సదుపాయాలు, వైద్య విద్య విధానాన్ని ప్రభుత్వం సంస్కరించింది. 11 వైద్య కళాశాలలను బలోపేతం చేయడంతోపాటు 17 కొత్త వైద్య కళాశాలలు, గిరిజన ప్రాంతాల్లో 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాన్ని చేపట్టింది. కడపలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, క్యాన్సర్ ఆసుపత్రి, మానసిక ఆరోగ్య సంస్థ, పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్లను ఇటీవలే ప్రారంభించాం. వైద్య, ఆరోగ్య రంగంలో 53,126 మంది వైద్య సిబ్బందిని నియమించాం. ప్రివెంటివ్ కేర్‌లో కొత్త అధ్యాయానికి తెరతీస్తూ ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం. 3.03 కోట్ల ఓపీ సేవలను అందించాం. 104, 108 అంబులెన్స్ సేవల కోసం రూ.1,208 కోట్లు వెచ్చించి 1,704 వాహనాలను అందుబాటులోకి తెచ్చాం. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని ఇటీవలే రూ.25 లక్షలకు పెంచాం. 2,315 నెట్వర్క్ ఆసుపత్రుల్లో బైలేటరల్ కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స లాంటి ఖరీదైన ప్రొసీజర్లు, క్యాన్సర్ చికిత్సతో సహా 3,257 ప్రొసీజర్లకు ఎలాంటి పరిమితి లేకుండా వైద్య సేవలు అందిస్తున్నాం. 2019 నుంచి ఇప్పటివరకు 36 లక్షల మంది రోగులు లబ్ధి పొందారు. అందుకోసం ప్రభుత్వం రూ.12,150 కోట్లు వెచ్చించింది. చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకునే సమయంలో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా నెలకు రూ.5 వేలు గరిష్ట పరిమితితో రోజుకు రూ.225 చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నాం. సాగు.. బాగు సొంత భూములు సాగు చేసుకునే రైతులతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులు, ఆర్ఓఎఫ్ఆర్, ఎండోన్మెంట్ భూములు సాగు చేసుకునే రైతులకు కూడా వైఎస్సార్ రైతు భరోసా కింద ఏడాదికి రూ.13,500 సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ఇప్పటివరకు రూ.53.53 లక్షల మంది రైతులకు రూ.33,300 కోట్లు పంపిణీ చేసింది. వన్‌స్టాప్ సెంటర్లుగా 10,778 ఆర్బీకేలను నెలకొల్పింది. దేశంలో ఉచిత పంటల బీమా అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 54.75 లక్షల మంది రైతుల క్లైమ్లను పరిష్కరించి రూ.7,802.05 కోట్లను పంపిణీ చేసింది. వైఎస్సార్ సున్నావడ్డీ కింద 73.88 లక్షల మంది రైతులకు రూ.1,835 కోట్ల వడ్డీ రాయితీని అందించింది. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన 22.85 లక్షల మంది వ్యవసాయ, ఉద్యాన రైతలకు రూ.1,977 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని జమ చేసింది. దళారుల ప్రమేయం లేకుండా ఆర్బీకేల వద్దే ధాన్యాన్ని సేకరిస్తూ గోనె సంచుల వినియోగ చార్జీలు, రవాణా ఖర్చులను కూడా రైతులకు చెల్లిస్తోంది. రూ.63,827 కోట్ల విలువైన 3.34 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఎంఎస్పీ పరిధిలోకి రాని పంటలకు కూడా గిట్టుబాటు ధర అందించేందుకు ఇప్పటివరకు రూ.7,751 కోట్లు వెచ్చించింది. మిచాంగ్ తుపాను సమయంలో బాధిత రైతులను ఆదుకునేందుకు, మౌలిక సదుపాయాలను పునరుద్ధరించేందుకు రూ.347.55 కోట్లను వెచ్చించింది. ఉద్యాన పంటల సాగును ప్రోత్సహిస్తూ నాలుగేళ్లలో 5,83,240 ఎకరాలను ఉద్యాన పంటల సాగులోకి తెచ్చింది. అరటి, పసుపు, ఉల్లి, మిర్చి లాంటి పంటలకు కేంద్ర ప్రభుత్వం కంటే అధికంగా కనీస మద్దతు ధర అందిస్తోంది. సూక్ష్మ సేద్యం కింద 12.74 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుస్తూ 35.85 లక్షల ఎకరాల విస్తీర్ణానికి వర్తింపజేసింది. 2.12 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలోకి ఆక్వా కల్చర్‌ను తెచ్చి ఆంధ్రప్రదేశ్‌ను ఆక్వా హబ్‌గా తీర్చిదిద్దింది. వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద 2,43,394 మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరుస్తూ రూ.540 కోట్లు పంపిణీ చేసింది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు మరణిస్తే ఆ కుటుంబానికి ఇచ్చే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. 20,034 ఫిషింగ్ బోట్లకు డీజిల్ సబ్సిడీ కింద రూ.128.27 కోట్లు ఖర్చు చేసింది. సబ్సిడీని లీటరుకు రూ.6.03 నుంచి రూ.9కి పెంచింది. ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ కింద రూ.3,186.36 కోట్లను వెచ్చించి 61,682 మందికి ప్రయోజనం కలిగించింది. రూ.50.30 కోట్లతో 35 ఆక్వా ల్యాబ్‌లను నెలకొల్పింది. మహిళా సాధికారికతకు పెద్దపీట రాష్ట్రంలోని 55,607 అంగన్వాడీల ద్వారా వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ కార్యక్రమాలను అమలు చేస్తూ 64 లక్షల మంది గర్భిణులు, బాలింతలతోపాటు 28.62 లక్షల మంది పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తోంది. ఇప్పటివరకు రూ.6,688 కోట్లు వెచ్చించడంతో సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. పౌష్టికాహార లోపాన్ని ముందుగానే గుర్తించి నివారించేందుకు రూ.21.82 కోట్లు వెచ్చించి గ్రోత్ మానిటరింగ్ పరికరాలను కొనుగోలు చేసింది. రూ.71 కోట్లు వెచ్చించి 500 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను సమకూర్చడంతో 3,27,289 మంది ప్రయోజనం పొందారు. మహిళల ఆర్థిక స్వయం సమృద్ధి కోసం వైఎస్సార్ ఆసరా పథకాన్ని అమలు చేస్తోంది. 2019 ఏప్రిల్ 11 నాటికి స్వయం సహాయక సంఘాలు బకాయి పడిన రూ.25,571 కోట్లను నాలుగు వాయిదాల్లో తిరిగి చెల్లించింది. దాంతో 7,98,395 స్వయం సహాయక సంఘాల్లోని 78.84 లక్షల మంది మహిళలు లబ్ధి పొందారు. వైఎస్సార్ సున్నా వడ్డీ కింద ఇప్పటివరకు 9,76,119 స్వయం సహాయక సంఘాలకు నాలుగు విడతల్లో రూ.4,969.05 పంపిణీ చేసింది. వైఎస్సార్ చేయూత ద్వారా ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు ఆర్థిక సాయం అందచేస్తోంది. పథకం ద్వారా 26.39 లక్షల మంది మహిళలకు రూ.14,129 కోట్లు పంపిణీ చేసింది. నాలుగో విడత ఈ నెలలోనే పంపిణీ చేయనున్నారు. వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 3,57,844 మంది మహిళలకు రూ.2,029 కోట్లు నేరుగా ఖాతాల్లో జమ చేసింది. వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద 4,39,068 మంది మహిళలకు రూ.1,257.04 కోట్లు అందించింది. మహిళల భద్రతకు భరోసా కల్పిస్తూ దిశ యాప్ ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు 1.46 కోట్ల మంది యాప్ డౌన్లోడ్ చేసుకోగా 3,040 కేసులను నమోదు చేశారు. ‘సామాజిక’ నవశకం పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్రంలో 17,005 లే అవుట్లలో 31.19 లక్షల ఇళ్ల స్థలాలను మహిళలకు పంపిణీ చేశారు. 22 లక్షల గృహ నిర్మాణాలను చేపట్టగా ఇప్పటికే 9 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందించారు. వైఎస్సార్ పింఛన్ కానుక కింద 66.34 లక్షల మందికి ప్రతి నెలా టంచన్‌గా పింఛన్లు అందిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి పింఛన్ మొత్తాన్ని రూ.3 వేలకు పెంచడంతో నెలవారీ పింఛన్ బడ్జెట్ రూ.1,961 కోట్లకు పెరిగింది. వార్షిక బడ్జెట్ దాదాపు రూ.23,476 కోట్లకు చేరుకుంది. ఇప్పటివరకు రూ.86,692 కోట్లను పంపిణీ చేసింది. వైఎస్సార్ వాహనమిత్ర కింద ఏడాదికి రూ.10 వేలు చొప్పున 2,78,961 మందికి రూ.1,305 కోట్లను పంపిణీ చేసింది. వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా చేనేత కార్మికులకు ఏడాదికి రూ.24 వేలు చొప్పున 81,783 మంది లబ్ధిదారులకు రూ.983 కోట్లు అందచేసింది. వైఎస్సార్ లా నేస్తం కింద కింద జూనియర్ న్యాయవాదులకు ఆర్నెళ్లకు రూ.30 వేలు చొప్పున మూడేళ్ల కాలానికి స్టైఫండ్ అందిస్తోంది. ఇప్పటివరకు 2,564 మందికి రూ.11.83 కోట్లు అందించింది. జగనన్న చేదోడు ద్వారా రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు ఏడాదికి రూ.10 వేలు చొప్పున 3.40 లక్షల మందికి రూ.1,268 కోట్లు పంపిణీ చేసింది. 19.52 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు రూ.521.73 కోట్లు వెచ్చించింది. జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు ఏడాదికి రూ.10వేల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తోంది. ఇప్పటివరకు 15.87 లక్షల మందికి రూ.88.33 కోట్ల వడ్డీ మొత్తాన్ని రీయింబర్స్ చేసింది. వైఎస్సార్ బీమా పథకం కింద రూ.1,582 కోట్లు అందచేసింది. వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కింద ఇప్పటివరకు 46,329మందికి రూ.350.89 కోట్లు అందించింది. ఉపాథి హామీ అమలులో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలోఉంది. సగటున 25 కోట్ల పనిదినాలు సృష్టించడంలో దేశంలో టాప్ 3 స్థానాల్లో నిలిచింది. 123 పట్టణ స్థానిక సంస్థల్లో 2 వేల ఎంఎల్డీ తాగునీటిని సరఫరా చేస్తోంది. మచిలీపట్నం, మార్కాపురం, ప్రొద్దుటూరు, కమలాపురం, నరసాపురం, అమలాపురంలో ఈ ఏడాది రూ.327.38 కోట్లతో కొత్త ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టింది. జగనన్న టౌన్ షిప్‌ల కింద 12,042 ప్లాట్లతో 30 ప్రాజెక్టులను చేపట్టింది. రహదారులు.. కొత్త బస్సులు రాష్ట్రంలో ఇప్పటివరకు 53,481 కి.మీ. మేర రహదారుల పనులను చేపట్టింది. 2023–24లో 268 కి.మీ. మేర 58 బీటీ రోడ్లు వేసింది. ప్రధానమంత్రి గ్రామ్‌సడక్ యోజన కింద రూ.261 కోట్లు ఖర్చు చేసింది. గుంతలులేని రహదారులే లక్ష్యంగా రూ.490.80 కోట్లతో 1,221 కి.మీ. మేర పనులు మంజూరు చేసింది. రూ.1,121.85 కోట్ల తో 4,635 కి.మీ. మేర 1,877 బీటీ రోడ్లను పునరుద్ధరించే చర్యలు చేపట్టింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత పాత బస్సుల స్థానంలో 880 కొత్త బస్సులను ప్రవేశపెట్టింది. సాగునీటికి ప్రాధాన్యం జీవనాడి పోలవరాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. ఆర్ అండ్ ఆర్ పనులకు వేగవంతం చేసింది. సంగం ప్రాజెక్ట్, బ్యారేజీలను పూర్తి చేసి పెన్నార్ డెల్టా వ్యవస్థ, కావలి కాలువ, కనుపూరు కాలువ ఆయకట్టును స్థిరీకరిస్తున్నారు. బ్రహ్మం సాగర్ లీకేజీ సమస్యను ప్లాస్టిక్ డయాఫ్రమ్ వాల్ టెక్నాలజీ ద్వారా ప్రభుత్వం పరిష్కరించింది. చిత్రావతి భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ పనులను రూ.280 కోట్లతో పూర్తి చేసి 10 టీఎంసీల పూర్తి సామర్థ్యంతో నింపింది. గండికోట నిర్వాసితుల పునరావాసం కోసం రూ.925 కోట్లు ఖర్చు చేసి 27 టీఎంసీల పూర్తి సామర్థ్యంతో నింపింది. అవుకు రెండో టన్నెల్ పూర్తి చేయడం ద్వారా ఎస్ఆర్బీసీ సామర్థ్యాన్ని 20 వేల క్యూసెక్కులకు పెంచింది. 3వ టన్నెల్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రూ.253 కోట్లతో పనులను పూర్తి చేయడం ద్వారా హెచ్ఎన్ఎస్ఎస్ పంప్ ప్రాజెక్ట్ నుంచి 10వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 77 చిన్నతరహా సాగునీటి చెరువులను నీటితో నింపింది. వెలిగొండ మొదటి టన్నెల్ పనులను ప్రభుత్వం పూర్తి చేసింది. రెండో టన్నెల్ కూడా కొద్ది రోజుల క్రితమే పూర్తయ్యిందని త్వరలోనే ప్రజలకు అంకితం చేస్తామని చెప్పేందుకు సంతోషిస్తున్నా. 2024 సెప్టెంబర్ నాటికి ఖరీఫ్ వర్షాలతో నల్లమల సాగర్ నీటిని నిల్వ చేసేందుకు వీలవుతుంది. కుప్పం నియోజకవర్గానికి నీటిని అందించేందుకు కుప్పం బ్రాంచి కెనాల్‌ను ప్రభుత్వం పూర్తి చేసింది. ఆర్ అండ్ ఆర్ సమస్యను పరిష్కరించడం ద్వారా పులిచింతలలో పూర్తి సామర్థ్యం మేరకు 45 టీఎంసీల నీటి నిల్వ చేసింది. జల్ జీవన్ మిషన్ కింద రూ.15,61.30 కోట్లతో 60.55 లక్షల కుటుంబాలకు ఎఫ్టీసీలతో తాగునీటిని అందించింది. శ్రీకాకుళం, వైఎస్సార్, కర్నూలు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో రూ.10, 137 కోట్లతో 9 తాగునీటి ప్రాజెక్ట్‌లను మంజూరు చేసింది. దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్లో 800 మెగావాట్లు, నార్ల తాతారావు థర్మల్ పవర్ ప్లాంట్‌లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించడంతో విద్యుదుత్పత్తి గణనీయంగా పెరిగింది. పారిశ్రామిక పురోభివృద్ధి విశాఖ జీఐఎస్ సదస్సులో కుదుర్చుకున్న 386 ఒప్పందాల ద్వారా 6,07,388 మందికి ఉపాధి కల్పించే రూ.13.11 లక్షల కోట్ల పారిశ్రామిక పెట్టుబడులను రాష్ట్రం సాధించింది. గత 56 నెలల్లో 1.30 లక్షలమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ 311కుపైగా భారీ, మెగా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. సులభతర వాణిజ్యంలో వరుసగా మూడేళ్లుగా రాష్ట్రం అగ్రస్థానంలో కొనసాగుతోంది. కొప్పర్తిలో 3,155 ఎకరాల్లో వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రీయల్ హబ్‌ను అభివృద్ధి చేసింది. హబ్ ద్వారా 75 వేల మందికి ఉపాధి కల్పించేలా రూ.25 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలున్నాయి. విశాఖపట్నం– చెన్నై, చెన్నై–బెంగళూరు, హైదరాబాద్–బెంగళూరు పారిశ్రామిక కారిడార్లలో మౌలిక వసతులను పెంపొందిస్తోంది. వీసీఐసీ కారిడార్‌లో రూ.లక్ష కోట్లు అదనపు పెట్టుబడులను ఆకర్షిస్తోంది. రూ.3,800 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధి ద్వారా లక్ష మందికిపైగా మత్స్యకారులకు జీవనోపాధి కల్పించనుంది. రూ.16 వేల కోట్లతో రామాయపట్నం, మూలపేట, కాకినాడ గేట్‌వే, మచిలీపట్నం పోర్టులను అభివృద్ధి చేయడం ద్వారా కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యాన్ని 110 మిలియన్ టన్నులకు పెంచి 75 వేలమందికి ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టింది. వరల్డ్ లాజిస్టిక్స్ – సప్లయ్ చైన్ కాంగ్రెస్.. ఏపీ మారిటైమ్ బోర్డ్‌ను ‘మారిటైమ్ బోర్డ్ ఆఫ్ ద ఇయర్’గా గుర్తించింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మరో 30 నెలల్లో అందుబాటులోకి రానుంది. గన్నవరం, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి, కర్నూలు, కడపలో విమానాశ్రయాలను విస్తరిస్తోంది. విశాఖప మధురవాడలో రూ.14,634 కోట్లతో 200 ఎండబ్లూ డేటా సెంటర్, కాపులుప్పాడలో రూ.7,210 కోట్లతో 100 ఎండబ్లూ డేటా సెంటర్ల ఏర్పాటు పనులు మొదలయ్యాయి. 7,290 మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో రూ.3,685 కోట్ల పెట్టుబడితో 17 పర్యాటక ప్రాజెక్టుల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. కోవిడ్ ప్రతికూల పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పురోగతి సాధిస్తోంది. 2023–24లో ముందస్తు అంచనా ప్రకారం రాష్ట్ర వృద్ధి రేటు 10.2 శాతంగా ఉండవచ్చని నివేదికలు సూచించాయి. రాష్ట్ర తలసరి ఆదాయం 2022–23లో రూ.2,19,518 ఉండగా 2023–24లో రూ.2,42,479కు పెరిగి 1043 శాతం వృద్ధి రేటు సాధించింది. గడప వద్దకే సుపరిపాలన పరిపాలన వికేంద్రీకరణకు ప్రాధాన్యమిస్తూ 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేశాం. 15,004 గ్రామ, వార్డు సచివాలయాలను నెలకొల్పి 1.35 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశాం. 2.6 లక్షల మంది వలంటీర్ల నియామకం ద్వారా గడప వద్దకే పరిపాలను తెచ్చాం. 540 రకాల సేవలకు సంబంధించి 9.84 కోట్ల అర్జీలను సకాలంలో పరిష్కరించాం. ప్రతి సచివాలయం పరిధిలో రూ.20 లక్షలకు తగ్గకుండా పనులు మంజూరు చేశాం. భూవివాదాల పరిష్కారం భూవివాదాల పరిష్కారానికి వందేళ్ల తరువాత వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష కార్యక్రమం ద్వారా రెండు దశల్లో 4 వేల గ్రామాల్లో 42.6 లక్షల ఎకరాల రీసర్వేను పూర్తి చేశాం. 17.53 లక్షల మంది రైతులకు శాశ్వత పట్టాలు, 4.8 లక్షల మార్పిడి సమస్యలకు పరిష్కారం, 10.21 లక్షల కొత్త సబ్ డివిజన్లకు అవకాశం కల్పించాం. 20,24,709 మంది భూమిలేని పేదలకు 35,44,866 ఎకరాలను పంపిణీ చేశాం. -
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. అప్డేట్స్
Updates.. అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా ముగిసిన బీఏసీ సమావేశం ఈనెల 8వరకూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఇంధన రంగంలో సబ్సిడీలు, రాయితీలను ప్రభుత్వం కల్పిస్తోంది రాష్ట్రంలో 19.41 లక్షల వ్యవసయ పంపుసెట్లకు పగట పూట కరెంట్ 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాం రాష్ట్రంలో దిశయాప్ ద్వారా 3040 కేసులు పేదలందరికీ ఇళ్ల పథకం కింద 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాం ఇప్పటికే 9 లక్షల ఇళ్లను లబ్దిదారులకు అందించాం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి అధిక ప్రాధాన్యత పీడీఎఫ్ కుటుంబాలకు సానుభూతితో పునరావాసం కల్పించాం పోలవరం ప్రాజెక్టులో ఇప్పటివరకూ 74.01 శాతం పూర్తి ఎల్ఏ అండ్ ఆర్ ఆర్ పనిలో 22.42 శాతం పూర్తి జగనన్న చేదోడు ద్వారా దుకాణాలు, నాయిబ్రాహ్మణులు, దర్జీలకు ప్రభుత్వం రూ. 10 వేలు అందిస్తోంది జగనన్న తోడు ద్వారా వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులకు రూ. 10 వేల వడ్డీలేని రుణం అందిస్తున్నాం వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా ద్వారా రూ. 350.89 కోట్లు అందిస్తున్నాం నాన్ డీబీటీ కింద 4.23 లక్షల కోట్ల సంక్షేమ ఫలాలు అందించాం 2023-24లో 268 కి.మీ పొడవునా 58 బీటీ రోడ్లు వేశాం రూ. 71 కోట్ల వ్యయంతో 500 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల కొనుగోలు దీని ద్వారా 3, 27, 289 మంది తల్లులకు లబ్ది వైఎస్సార్ పెన్షన్ కానుక కింద 66.34 లక్షల మందికి పెన్షన్ అందిస్తున్నాం 2024 జనవరి 1వ తేదీ నుంచి రూ. 3వేలు పెన్షన్ అందిస్తున్నాం నెలవారీ పెన్షన్ బడ్జెట్ రూ. 1961 కోట్లకు పెరిగింది ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ మొబైల్ డిస్పెన్సింగ్ ఓనర్లకు రూ. 10 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నాం వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కోసం రూ. 4,969.05 కోట్లు వైఎస్సార్ చేయూత ద్వారా రూ. 14, 129 కోట్లు పంపిణీ వైఎస్సార్ కాపునేస్త కింద రూ. 2, 029 కోట్లు జమ వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా ఏడాదికి రూ. 15 వేలు అందిస్తున్నాం ఐదేళ్లలో రూ. 75 వేలు అందిస్తున్నాం 3, 57, 844 మంది అర్హుల ఖాతాల్లో రూ. 2,029 కోట్లు జమ వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద రూ. 1,257.04 కోట్లు జమ మహిళా సాధికారత, శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక కృషి రాష్ట్రంలో 55,607 మెయిన్, మినీ అంగన్ వాడీ కేంద్రాలు వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా 6.4 లక్షల మంది గర్భిణీలు, 28. 62లక్షల మంది పిల్లలకు లబ్ధి పౌష్టికాహార పథకాలకు రూ. 6,688 కోట్లు అంగన్వాడీ కేంద్రాలకు రూ. 21.82 కోట్ల విలువైన గ్రోత్ మానిటరింగ్ పరికరాలు అందించాం వైఎస్సార్ ఆసరా ద్వారా మహిళా గ్రూపులకు ఆర్థిక సాయం 78.84 లక్షల మంది మహిలలకు నాలుగేళ్లలో రూ. 25, 571 కోట్లు ఆక్వా రైతుల విద్యుత్ చార్జీల రాయితీ కోసం రూ. 3,186. 36 కోట్లు అందించాం రూ. 50.30 కోట్లతో 35 ఆక్వాల్యాబ్‌లు ఏర్పాటు 2.12 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఆక్వా కల్చర్ రొయ్యల ఉత్పత్తిలో 75 శాతం వాటాలో ఆక్వా హబ్ ఆఫ్ఇం డియాగా ఏపీ మత్స్య కార కుటుంబాలకు రూ. 540 కోట్లు అందించాం మత్స్యకార భరోసా కింద 2.43 లక్షల లబ్ధిదారుల రూ. 540 కోట్ల జమ చేపల వేట నిషేధ కాలంలో పరిహారం రూ. 10 వేలకు పెంచాం చేపల వేటకు వెళ్లి మరణిస్తే నష్టపరిహారం రూ. 5లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచాం ఫిషింగ్ బోట్లకు డీజిల్ సబ్సిడీ కోసం రూ. 128.27 కోట్లు ఇచ్చాం రైతులు రాష్ట్రానికి వెన్నుమక 62 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు 10, 778 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ఇప్పటివరకూ 53. 53 లక్షల రైతులకు రైతు భరోసా ఇచ్చాం రైతు భరోసా కింద రూ. 33, 300 కోట్లు పంపిణీ చేస్తున్నాం రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నాం 22.85 లక్షల రైతులకు రూ. 1, 977 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం మిచాంగ్ తుపానులో నష్టపోయిన రైతులకు రూ. 347.55 కోట్ల సాయం నాడు-నేడు ద్వారా ఆసుపత్రుల్లో మెరుగు 53 ఏరియా ఆసుపత్రుల్లో, 9 జిల్లా ఆసుపత్రుల్లో వసతుల అభివృద్ధి 1142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 177 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా 10, 132 విలేజ్ హెల్త్ క్లినిక్‌లు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 12 మంది పారా మెడికల్ సిబ్బందిని నియమించాం ఇప్పటివరకూ రూ. 1.32 కోట్లు రోగులకు అందించాం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యం దిశగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా బోధన 8,9 తరగతుల విద్యార్థులకు 9, 52, 925 ట్యాబ్‌లు పంపిణీ చేశాం వచ్చే ఏడాది జూన్ నుంచి 1వ తరగతి నుంచి ఐబీ విధానం ప్రతి ఏటా ఒక తరగతికి ఐబీ విధానం పెంచుకుంటూ వెళ్తాం విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం విదేశీ విద్యాదీవెన పథకం అమలు అత్యున్నత విద్యాసంస్థల్లో గుర్తించిన 21 ఫ్యాక్టరీలలో ఏ విభాగంలోనేనా విదేశీ విద్యను అభ్యసించవచ్చు ఇందుకోసం రూ. 1.25 కోట్లు వరకు మొత్తం ఫీజులు రీయింబర్స్ చేస్తున్నాం ప్రభుత్వ కృషితో స్కూళ్లలో డ్రాప్ఔట్లు గణనీయంగా తగ్గాయి ఉన్నత విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం 26.98 లక్షల మంది విద్యార్థులకు రూ. 11.901 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ 1 నుంచి 10 తరగతి వరకు జగనన్న గోరుముద్ద అమలు చేస్తున్నాం పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నాం ఇప్పటివరకూ గోరుముద్దకు రూ. 4,417 కోట్లు ఖర్చు చేశాం జగనన్న గోరుముద్ద కోసం ఏటా రూ. 1, 910 కోట్లు ఖర్చు చేస్తున్నాం జగనన్న విద్యాకానుక కోసం ఇప్పటివరకూ రూ. 3, 367 కోట్లు ఖర్చు చేశాం విద్యాసంస్కరణల్లో డిజిటల్ లెర్నింగ్ కీలకమైనది మా ప్రభుత్వం ఇప్పటివరకూ నాలుగు బడ్జెట్లు ప్రవేశపెట్టింది సామాజిక న్యాయం, సమానత్వం కోసం ప్రభుత్వం పని చేస్తోంది విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాం అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు అభినందనీయం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది జగన్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాల మెరుగుకు కృషి చేస్తున్నాం నవరత్నాల ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కృషి నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది దేశంలోనే ఎక్కడా లేని విధంగా విద్యా సంస్కరణలు పేద పిల్లలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నాం మనబడి నాడు-నేడు ద్వారా స్కూళ్ల రూపరేఖలు మార్చాం విద్యారంగంపై రూ. 73, 417 కోట్లు ఖర్చు చేశాం ►ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం ►అసెంబ్లీకి చేరుకున్న సీఎం జగన్ మేనిఫెస్టోను మాయం చేసిన ఘనుడు చంద్రబాబు: మంత్రి అంబటి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్.. హామీల అమలుపై చంద్రబాబు అసత్యప్రచారం చేస్తున్నారు దేశంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్న ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ మేనిఫెస్టోను మాయం చేసిన ఘనుడు చంద్రబాబు మేనిఫెస్టోని ఇంటింటికీ తీసుకెళ్లి అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌ది రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలను గెలవబోతున్నాము సీట్ల ముష్టి కోసం చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్ళాడు పవన్‌ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని సముద్రం ఈదినట్టే జనసేన కార్యకర్తలు ఇప్పటికైనా నిద్రమేలుకోవాలి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎంగా చరిత్రలో జగన్ నిలిచిపోతారు దుష్టచతుష్టయం పన్నే పద్మవ్యూహాలని ఛేదించి రాగల అర్జునుడు సీఎం వైఎస్ జగన్ లోకేష్ బయట ఉంటే పార్టీ అవుట్ అని దాచేసారు టికెట్ లేదని చెబితే బఫున్లు పార్టీలు మారుతారు బాలశౌరీ అన్యాయాలు అక్రమాలు చేసిన బఫూన్ బాలశౌరీ ఎరికైనా నమ్మకద్రోహం చేసే వ్యక్తి ►అసెంబ్లీకి బయలుదేరిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ►గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం ►అసెంబ్లీ సమావేశాల అజెండాను ఖరారు చేయనున్న బీఏసీ ►ఈనెల 7న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ►మూడు నెలల కోసం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి బుగ్గన ►కాసేపట్లో ప్రారంభం కానున్న రాష్ట్ర శాసనసభ, శాసన మండలి సమావేశాలు ►ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రసంగం ►అనంతరం సమావేశాలు ప్రారంభం ►అనంతరం శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ(బీఏసీ) సమావేశమై ఈ సమావేశాలు ఎప్పటి వరకు నిర్వహించాలనేది నిర్ణయించనుంది. ►అదేవిధంగా త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 7వ తేదీన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2024–25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ, ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలలకు (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు అసెంబ్లీ ఆమోదం పొందనున్నారు. ►ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ద్వారా ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉద్యోగుల జీతభత్యాలు, సామాజిక పింఛన్లు, కొనసాగుతున్న వివిధ పథకాలు, కార్యక్రమాలకు అవసరమైన నిధుల వ్యయానికి అసెంబ్లీ ఆమోదం తీసుకోనున్నారు. అంతకుముందు ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆమోదించడానికి ఏడో తేదీ ఉదయం 8గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. -
AP: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి (సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు 10 గంటలకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం అసెంబ్లీ, కౌన్సిల్ బీసీఏ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 7న ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. 7తేదీన ఉదయం 8 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. 8వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. -
AP: 5 నుంచి అసెంబ్లీ సమావేశాలు, ఫిబ్రవరి 6న ఓటాన్ అకౌంట్ బడ్జెట్
సాక్షి, అమరావతి: ఈనెల ఐదో తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 6వ తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 10 గంటలకు ఉభయ సభల సభ్యులనుద్ధేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 7 లేదా, 8వ వరకు సమావేశాలు నిర్వహించనున్నారు. -
ఉద్యోగుల జీవన ప్రమాణాలను పెంచేందుకు భారీగా జీతాలు పెంచాం - మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
-
ఉద్యోగులకు మేలు చేసే జీపీఎస్
-
అమరావతి భూములను నొక్కేసిన టక్కరిదొంగ చంద్రబాబు: మంత్రి సురేష్
-
అసెంబ్లీ నిరవధిక వాయిదా..!
-
అమరావతిలోని అసైన్డ్ భూముల రికార్డులను మాయం చేశారు: మంత్రి సురేష్
-
రాజధానిపై చంద్రబాబు రోజుకో డ్రామా నడిపారు: పేర్నినాని
-
రికార్డులు మాయం.. టీడీపీ అవినీతి చిట్టా..
-
అమరావతి భూములను నొక్కేసిన టక్కరిదొంగ చంద్రబాబు: మంత్రి సురేష్
-
ఈ ఆరుగురు పండితులు.. A2 నారాయణ, A14 లోకేష్ బండారం బయటపెట్టిన పేర్నినాని
-
నారాయణ వంకర తెలివి.. భారీ షాక్‌కు గురైన CRDA
-
నన్నొక్కడినే కాదు.. మా బ్యాచ్‌ని కూడా జైల్లో వేయండి..
-
తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు అమ్మి అవకతవకలకు పాల్పడ్డారు
-
లింగమనేని రమేశ్ పొలం మధ్యలో నుంచి ఇన్నర్ రింగ్‌రోడ్ వచ్చేలా ప్లాన్ మార్చారు
-
పెన్షన్లపై క్లారిటీ ఇచ్చిన మంత్రి బుగ్గన
-
బిల్లులు పాస్..
-
బాబు, నారయణ, లోకేష్ పారాయణం..!
-
లింగమనేని పొలం మధ్యలో నుంచి ఇన్నర్ రింగ్ రోడ్: పేర్ని నాని ఫైర్
సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు కొనసాగుతున్నాయి. సమావేశాల్లో భాగంగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్‌పై సభలో చర్చ జరిగింది. ఈ క్రమంలో టీడీపీ నేత లింగమనేని రమేష్ పొలం మధ్యలో నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు వచ్చేలా ప్లాన్ మార్చారని తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. హెరిటేజ్, నారాయణ కాలేజ్ కోసం ప్లాన్ మార్పు.. కాగా, అసెంబ్లీలో పేర్ని నాని మాట్లాడుతూ.. రాజధానిపై చంద్రబాబు రోజుకో డ్రామా నడిపారు. చంద్రబాబు ప్రభుత్వంలోని అవినీతి కథల్లో ఇది కూడా ఒకటి. దోపిడీకి దొంగలు రెక్కీ చేసినట్టుగా రింగ్ రోడ్డు స్కామ్ జరిగింది. ఇది కేబినెట్ నిర్ణయమంటూ చంద్రబాబు కబుర్లు చెప్పారు. మాస్టర్ ప్లాన్ పేరుతో స్కామ్ నడిపించారు. లింగమనేని రమేష్ పొలం మధ్యలో నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు వచ్చేలా ప్లాన్ మార్చారు. హెరిటేజ్ సంస్థ, నారాయణ కాలేజీల కోసం ప్లాన్ మార్చారు. ఏ-14గా ఉన్న లోకేష్ ఐఆర్ఆర్తో నాకేం సంబంధం అంటున్నారు. 2008 నుంచి 2017 వరకు హెరిటేజ్ సంస్థకు లోకేష్ డైరెక్టర్‌గా ఉన్నారు. లోకేష్ హెరిటేజ్ సంస్థకు డైరెక్టర్‌గా ఉన్నప్పుడే అమరావతిలో భూములు కొనాలని నిర్ణయించారు. నారా భువనేశ్వరి సూక్తులు.. చంద్రబాబు, నారాయణ దళితుల పేదల నుంచి అసైన్డ్ భూములను లాక్కున్నారు. చట్టం ప్రకారం అసైన్డ్ భూములు లాక్కోవడం సాధ్యం కాదని చెప్పినా వినలేదు. న్యాయపరమైన చిక్కులు వస్తాయని చెప్పినా జీవో-41 విడుదల చేశారు. దొంగలు రెక్కీ చేసినట్టుగా ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ చేశారు. కేసులు ఎక్కువగా ఉన్నవారికి నామినేటెడ్ పదవులు ఇస్తామన్న లోకేష్ ఇప్పుడు ఎక్కడ?. ఇక్కడ యువతను రెచ్చగొట్టి ఇప్పుడు ఢిల్లీలో తిరుగుతున్నారు. రూ.371 కోట్లకు ఇంత రాద్ధాంతం దేనికని నారా భువనేశ్వరి సూక్తులు చెబుతున్నారు. రూ. 371కోట్లు టిప్పే అనుకుంటే అమరావతిలో 10 ఎకరాలు ఎందుకు కొన్నారు?. ఎకరం భూమి తక్కువకు కొనుగోలు.. ఇన్నర్ రింగ్ రోడ్డును అటు తిప్పి.. ఇటు తిప్పి పాల కంపెనీకి 5 ఎకరాలు ఇచ్చారు. దేశభక్తితోనే నా ఇల్లును చంద్రబాబుకు ఇచ్చినట్టు లింగమనేని హైకోర్టులో చెప్పారు. సీఎం పదవి పోయిన వెంటనే రూ.27లక్షలు లింగమనేనికి అద్దె ఇచ్చారు. రూ.27లక్షల లావాదేవీలపై నారా, లింగమనేని కుటుంబాలు చెప్పవు. రాజధాని ఏర్పాటుపై కమిటీ ఇచ్చిన రిపోర్టును చంద్రబాబు తుంగలో తొక్కారు. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో రాజధాని ఏర్పాటుకు జీవో ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్‌కు ఒప్పుకోని వారిని ఏ-2, ఏ-14 బెదిరించారు. ప్రభుత్వ భూమిని గవర్నమెంట్ లాక్కుంటుదని భయపెట్టారు. ఎకరం భూమిని రెండు నుంచి ఐదు లక్షలకే రాయించుకున్నారు. ఇలాంటి వాళ్లకు శిక్ష పడాల్సిందే అని అన్నారు. ఇది కూడా చదవండి: ఇన్నర్ రింగ్‌రోడ్డు స్కామ్: నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ -
ఎన్పీఎస్ ప్రయోజనాలపై అసెంబ్లీలో మంత్రి బుగ్గన
-
ఎన్పీఎస్ నిర్ణయం.. హడావుడిగా తీసుకోలేదు: మంత్రి బుగ్గన
-
హామీ ఇచ్చిన మేరకు ప్రతీ విభాగానికీ మేలు చేకూర్చాం: మంత్రి బుగ్గన
-
పెన్షన్లపై అసెంబ్లీలో మంత్రి బుగ్గన కీలక వ్యాఖ్యలు