పీఏసీ ఎన్నికల్ని బాయ్‌కాట్‌ చేసిన వైఎస్సార్‌సీపీ | YSRCP Boycott PAC Chairman Elections | Sakshi
Sakshi News home page

పీఏసీ ఎన్నికల్ని బాయ్‌కాట్‌ చేసిన వైఎస్సార్‌సీపీ

Published Fri, Nov 22 2024 11:09 AM | Last Updated on Fri, Nov 22 2024 11:52 AM

YSRCP Boycott PAC Chairman Elections

అమరావతి, సాక్షి: రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ)కి ఎన్నికలు నిర్వహించాల్సి రావడం దురదృష్టకరమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు పార్టీ తరఫున శుక్రవారం ఆయన ప్రకటించారు.

‘‘ఇప్పటివరకు ప్రతిపక్షానికి పీఏసీ చైర్మన్‌ పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, కూటమి ప్రభుత్వం ఆ ఆనవాయితీకి విరుద్ధంగా చేస్తోంది. అందుకే ఈ ఎన్నికలను బాయ్‌కాట్‌ చేస్తున్నాం. గతంలో సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా పీఏసీ ప్రతిపక్షానికే ఇచ్చారు. ప్రతిపక్ష హోదా లేని పార్టీలకు కూడా అనేకసార్లు పదవి అప్పగించారు. పార్లమెంట్లో సైతం ఇలాంటి పరిణామం అనేకసార్లు చోటు చేసుకుంది.

.. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతుంది. అందుకే ప్రతిపక్షానికి ఇస్తారు. ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాల్లో అన్నింటా ప్రతిపక్షానికే పీఏసీ  ఇస్తారు. ఒక్క తాలిబన్లు పాలిస్తున్న ఆఫ్ఘనిస్తాన్‌లో తప్ప. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం దగ్గరి నుంచి కోల్ గేట్ స్కామ్, కామన్ వెల్త్ గేమ్స్ కుంభకోణం.. అన్నీ పీఏసీనే వెలికితీసింది. 1994లో కాంగ్రెస్ పార్టీ కి ప్రతిపక్ష హోదా లేకపోయినా కాంగ్రెస్ కి పీఏసీ చైర్మన్ ఇచ్చారు.

.. మాకు గతంలో 151 మంది ఎమ్మెల్యేలు బలం ఉన్నా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కి పీఏసీ చైర్మన్‌ ఇచ్చాం. కానీ, ఇప్పుడు పీఏసీకి ఎన్నికలు నిర్వహించడం దురదృష్టకరం. ఈ ప్రభుత్వం ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పీఏసీ చైర్మన్ ను ఇవ్వడం లేదు. అందుకే.. ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం’’ అని పెద్దిరెడ్డి ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement