peddireddy ramachandra reddy
-
హోదా ఇవ్వాల్సిందే
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా.. చట్టసభలో ప్రజల గళాన్ని వినిపించనివ్వకుండా చేయాలనే కుట్రతో కూటమి సర్కారు వ్యవహరిస్తోందని విపక్ష పార్టీ నేతలు మండిపడ్డారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించి సభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం వైఎస్సార్సీపీ నేతలు బొత్స, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టి.చంద్రశేఖర్, వరుదు కళ్యాణి బయట మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష హోదా ఇస్తే తమ పాలనా వైఫల్యాలను చట్టసభ సాక్షిగా నిలదీస్తారనే భయంతోనే కూటమి సర్కారు ఇలాంటి దుర్మార్గ పోకడలను అనుసరిస్తోందని ధ్వజమెత్తారు.ప్రజా గొంతుక వినిపించడానికి వీల్లేకుండా టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్ర పన్నిందని అంతకుముందు వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు శాసనసభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఉన్న ఏౖకైక విపక్షం వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా కల్పించకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి పాతరేసిన చంద్రబాబు ప్రభుత్వ వైఖరికి నిరసనగా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం కొనసాగుతున్న సమయంలో సభ నుంచి వైఎస్సార్సీపీ వాకౌట్ చేసింది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jaganmohan Reddy) నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉభయ సభల సంయుక్త సమావేశానికి హాజరయ్యారు. ఆయన వెంట శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు.సభలో ఉన్నవి రెండే పక్షాలు: బొత్స సత్యనారాయణ, శాసన మండలిలో ప్రతిపక్షనేతరాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. ప్రజల వాణిని వినిపించేది, వారి కష్టాలపై ఎలుగెత్తేది ప్రతిపక్షమే. అలాంటి ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన హోదా, గౌరవం ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. సభలో ఉన్నవి రెండే పక్షాలు. ఒకటి అధికారంలో ఉన్న కూటమి పార్టీలు... మరొకటి ప్రతిపక్షంగా నిలిచిన వైఎస్సార్సీపీ. సభలో మేం ఒక్కరమే విపక్షంలో ఉన్నాం కాబట్టే మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించాలని కోరాం.మిర్చి రైతులు పడుతున్న ఇబ్బందులు, వారి కష్టాల గురించి సభలో ప్రస్తావించాం. వైఎస్ జగన్ గుంటూరు మిర్చియార్డు వద్దకు వెళ్లిన తరువాతే ఈ ప్రభుత్వం మేలుకుని రైతుల గురించి ఆలోచించడం మొదలు పెట్టింది. అయినా నేటికీ మిర్చి కొనుగోళ్లు చేయడం లేదు. కేంద్రం స్పందించాలని, కేంద్రమే కొనుగోలు చేయాలని అంటున్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా మిర్చి ఎందుకు కొనుగోలు చేయడం లేదు? ఇటువంటి అంశాలపై మాట్లాడాలంటే మాకు ప్రతిపక్ష హోదా కావాలి. అప్పుడే మాకు తగినంత సమయం లభిస్తుంది. మిర్చి రైతులను కలిసిన మా నాయకుడిపై కేసులు పెట్టారు.మ్యూజికల్ నైట్ కోసం హంగూ ఆర్భాటంగా వెళ్లిన వారిపై మాత్రం ఎటువంటి కేసులు లేవు. ఇటువంటి నిరంకుశ విధానాలను ప్రశ్నించాలంటే ప్రతిపక్షంగా మాకు సరైన సమయం ఇవ్వాలి. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చారు. నేటికీ వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారు. కొత్తగా ప్రవేశపెట్టే బడ్జెట్లోనూ కేటాయింపులు లేకుండా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం. సర్కారు వైఖరిని ఎండగడుతూ ప్రజల సమస్యలను మీడియా ముఖంగా ప్రశ్నిస్తాం. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేస్తాం.ప్రభుత్వ వైఫల్యాలను చొక్కా పట్టుకుని నిలదీస్తాం. రాష్ట్రంలో అన్ని వర్గాల వారు ఇబ్బందుల్లో ఉన్నారు. మిర్చి రైతులకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. మార్కెట్ జోక్యంతో ఆదుకోకుండా కేంద్రం ఎప్పుడో కొనుగోలు చేస్తుందని మిర్చి రైతులను గాలికి వదిలేయడం సరికాదు. అప్పటి వరకు రైతులు తట్టుకునే పరిస్థితిలో లేరు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితిని కల్పించవద్దు. ప్రభుత్వం వెంటనే దీనిపై ఆలోచన చేయాలనేది మా డిమాండ్. అసెంబ్లీకి వెళ్లాలా వద్దా అనే దానిపై ప్రభుత్వ ప్రతిస్పందన చూసి నిర్ణయం తీసుకుంటాం.సభలో నిలదీస్తామనే భయంతోనే: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రిటీడీపీ కూటమి ప్రభుత్వం ప్రతి సందర్భంలోనూ వైఎస్సార్ సీపీని లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున విష ప్రచారం చేస్తోంది. గత ప్రభుత్వంలో విధ్వంసం జరిగిందంటూ బురద చల్లటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఎనిమిది నెలలు గడుస్తున్నా ప్రజలకు ఏం చేస్తారో మాత్రం చెప్పడం లేదు. ప్రజల గళాన్ని వినిపిస్తుందనే భయంతోనే వైఎస్సార్సీపీని ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. మా నాయకుడు వైఎస్ జగన్ సభలో మాట్లాడేందుకు ప్రతిపక్ష నేతగా అవకాశం కల్పించాలి. ఇప్పటికే దీనిపై న్యాయ పోరాటం కూడా చేస్తున్నాం.వైఎస్సార్సీపీని ప్రతిపక్షంగా గుర్తించాలని గవర్నర్‌ని కోరాం. ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడంతో నిరసన వ్యక్తం చేసి సభ నుంచి వాకౌట్ చేశాం. దేశంలో ఎక్కడైనా సరే ప్రతిపక్షానికే పీఏసీ చైర్మన్ పదవి ఇస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనూ ఆ పదవిని ప్రతిపక్షానికే ఇచ్చాం. గతంలో ఒకే ఒక్క శాసనసభ్యుడు ఉన్న కాంగ్రెస్ పార్టీకి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారు. ప్రపంచంలో ఒక్క ఆఫ్ఘనిస్తాన్‌లో మాత్రమే తాలిబన్ల పాలనలో కేవలం అధికార పక్షం మాత్రమే పని చేస్తుంది. ప్రతిపక్షం లేకుండా టీడీపీ మన రాష్ట్రంలో తాలిబన్ పాలన సాగిస్తోంది. దేశంలో మరెక్కడా లేదు: వరుదు కళ్యాణి ఎమ్మెల్సీరాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోంది. సభలో మూడు పార్టీలు అధికార పక్షంగానే ఉన్నాయి. వైఎస్సార్సీపీ ఒక్కటే ప్రతిపక్షం. కాబట్టి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు? ఒక్క ఏపీ మినహా దేశంలో ఎక్కడా ఇలా లేదు. గతంలో ఢిల్లీలో బీజేపీ తరఫున కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు ఎన్నిక కాగా, ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కల్పించారు. కూటమి పాలనలో జరుగుతున్న అక్రమాలను ఎక్కడ సభలో నిలదీస్తారోననే భయంతోనే వైఎస్సార్ సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు.కూటమి పాలన చూశాక ఇటువంటి పార్టీలకు ఎందుకు ఓటు వేశామని ప్రజలు బాధపడుతున్నారు. ప్రతిపక్ష హోదాపై కోర్టులో పిటిషన్ వేస్తే స్పీకర్ కనీసం కౌంటర్ కూడా దాఖలు చేయకపోవడం దారుణం. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ఏపీకి ప్రత్యేక హోదాపై ఎందుకు ప్రశ్నించడం లేదు? పోలవరం ఎత్తు తగ్గిస్తున్నా ఎందుకు నిలదీయలేకపోతున్నారు? వైఎస్సార్ సీపీకి అప్పు రత్న అవార్డు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు తొమ్మిది నెలల్లోనే ఏకంగా రూ.1.19 లక్షల కోట్లు అప్పులు తెచ్చిన సీఎం చంద్రబాబుకు అంతకంటే గొప్ప బిరుదు ఏం ఇవ్వాలో పవన్ కళ్యాణ్ చెప్పాలి.11 మందిని ఎదుర్కొనే సత్తా లేదా?పదకొండు మందిని ప్రతిపక్షంగా ఎదుర్కొనే సత్తా కూటమి ప్రభుత్వానికి లేదా? ప్రజలు వైఎస్సార్ సీపీకి 41 శాతం ఓట్ షేర్ ఇచ్చారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభలో మా గళం వినిపించేందుకు తగిన సమయం లభిస్తుంది. కూటమి ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసింది. తమ వైఫల్యాలను సభలో ఎండగడతారనే భయంతో ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీని గుర్తించేందుకు నిరాకరిస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యం, రైతుల పక్షాన మాట్లాడాల్సిన అవసరం లేదా? అధికార మదంతో ప్రతిపక్షం గొంతును నొక్కేస్తున్నారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత గవర్నర్‌కు లేదా? ప్రజాస్వామిక విలువలను కాపాడి ప్రజల పక్షాల పాలన సాగేలా ఆయన చొరవ తీసుకోవాలి. కూటమి సర్కారు నిరంకుశ పాలనకు పరాకాష్ట నాలుగు మీడియా సంస్థలను నిషేధించడం. దేశ చరిత్రలో నోటీస్ ఇవ్వకుండా నాలుగు చానెళ్లను బహిష్కరించిన ఘటనలు ఎప్పుడూ లేవు. – ఎమ్మెల్యే టి.చంద్రశేఖర్విపక్షం వాకౌట్చట్ట సభలో ప్రజల గొంతుక వినిపించాలంటే వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా కల్పించాల్సిందేనని పార్టీ ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో పట్టుబట్టారు. శాసనసభ సభలోకి గవర్నర్ ప్రవేశించి ప్రసంగిస్తుండగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ స్థానాల్లో నిలబడి ఆందోళన చేశారు. వారి ఆందోళనను పట్టించుకోకుండా గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో సేవ్ డెమోక్రసీ.. ఉయ్ వాంట్ జస్టిస్.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పీకర్ పోడియం వద్దకు చేరుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి.. వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా కల్పించండి... అంటూ నినాదాలు చేశారు. బాబు ష్యూరిటీ.. మోసం, బాదుడు గ్యారంటీ!మద్దతు ధర లభించక తీవ్రంగా నష్టపోయిన మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు సభలో ప్లకార్డులు ప్రదర్శించారు. బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ.. బాబు ష్యూరిటీ.. ధరల బాదుడు గ్యారంటీ.. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. నిరసనలను పట్టించుకోకుండా గవర్నర్ ప్రసంగాన్ని కొనసాగిస్తుండటంతో సభ నుంచి వైఎస్సార్ సీపీ వాకౌట్ చేసింది. వైఎస్ జగన్ వెంట నినాదాలు చేస్తూ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ నుంచి నిష్క్రమించారు. -
తాలిబన్లకు టీడీపీకి తేడా లేదు
-
ఏదైనా చట్ట ప్రకారమే చేయాలి
సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట గ్రామ పరిధిలోని అటవీ భూములను ఆక్రమించుకున్నారని ఆరోపించడంతోపాటు వాటిపై వివరణ ఇవ్వాలంటూ అధికారులు జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు, రాజంపేట ఎంపీ విథున్‌రెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, పి.ఇందిరమ్మ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. నోటీసులను రద్దు చేసి, తమ భూముల విషయంలో జోక్యం చేసుకోకుండా అధికారులను ఆదేశించాలని వారు తమ వ్యాజ్యాల్లో కోర్టును కోరారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు, ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలన్నా కూడా చట్ట నిబంధనలకు అనుగుణంగానే చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అధికారులకు స్పష్టం చేసింది. తదుపరి విచారణను మార్చి 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.మంగళంపేట గ్రామంలోని సర్వే నంబర్ 296/2లోని 18.94 ఎకరాల భూమిపై పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, సర్వే నంబర్ 295/1లోని 15 ఎకరాలపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, 295/1సీ లోని 21 ఎకరాలపై మిథున్‌రెడ్డి, సర్వే నంబర్లు 295/1బీలో 10.8 ఎకరాలు, 295/1డీలో 89 సెంట్లు, 296/1లో 9.11 ఎకరాల భూముల విషయంలో ఇందిరమ్మ పిటిషన్లు దాఖలు చేశారు. వీరి తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, పిటిషనర్లు అటవీ భూములను ఆక్రమించలేదని తెలిపారు. ఆ భూములను 20 ఏళ్ల కిందటే వాటి యజమానుల నుంచి కొనుగోలు చేశారని వివరించారు. అప్పట్లోనే అక్కడ నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. ఇప్పుడు వాటిని అటవీ భూములుగా పేర్కొంటూ నోటీసులు జారీ చేశారని చెప్పారు. తమ మనుషుల సమక్షంలో సర్వే చేసినట్లు పేర్కొంటూ అధికారులు వాట్సాప్ ద్వారా నోటీసులు పంపారన్నారు. నిరాధార ఆరోపణలతో ఓ పత్రిక ప్రచురించిన కథనాన్ని ఆధారంగా చేసుకుని అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆయన వివరించారు. వాదనలు విన్న న్యాయస్థానం... పిటీషనర్ల విషయంలో కఠిన చర్యలేవైనా తీసుకోవాల్సి వస్తే, చట్ట ప్రకారమే నడుచుకోవాలని అధికారులను ఆదేశించింది. -
‘ప్రజాదరణ కల్గిన నేత కాబట్టే టార్గెట్ చేసి విషం చిమ్ముతున్నారు’
తిరుపతి వైఎస్సార్సీపీలో కీలక నాయకుడిగా ఉన్న పుంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra Reddy)పై ఈనాడు పత్రిక పనిగట్టుకుని విషం చిమ్ముతోందని ధ్వజమెత్తారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పడి ఏడ్వటం ఈనాడుకు అలవాటుగా మారిపోయిందని మండిపడ్డారు.డి.పట్టాభూములు,ప్రీహోల్డ్ భూముల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ తప్పుడు కథనాలు రాయడం ఈనాడు పత్రిక పనిగా పెట్టుకుందన్నారు. ఏడు నెలల క్రితం మదనపల్లి సబ్‌కలెక్టర్ కార్యాలయంలో తగలబెట్టారు అంటూ ప్రచురించిన ఈనాడు.. ఇప్పుడు తప్పుడు కథనాలు ప్రచురిస్తూ విషం చిమ్ముతున్నారన్నారు. పచ్చి అబద్ధాలతో కూడిన వార్తలు రాస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)కు బాకా ఊదడం కోసమే పార్టీ పత్రికగా ఈనాడు మిగిలిపోయిందని భూమన విమర్శించారు.‘ఈ కేసు విషయంలో డీజీపీని మదనపల్లెకు పంపించి మరీ విచారణ జరిపించారు. నివేదిక ఇచ్చారు. ఈనాడు మళ్లీ బురద చల్లడానికే ఈ వార్తలు ప్రచురిస్తున్నారు. ఫైల్స్ దహనం కేసులో ఏ సంబంధం లేకపోయినా పనికట్టుకుని ఇరికించాలని చూస్తోంది. ప్రజాధరణ కల్గిన నాయకుడు కనుక ఆయన్ని బద్నాం చేయాలని చూస్తోంది. వైఎస్సార్సీపీ(YSRCP)ని బలహీన పర్చాలని కుట్రలు చేస్తున్నారు.ఆయన ఏ తప్పు చేయలేదని ప్రజలు అందరికీ తెలుసు. ఎన్ని విచారణలు చేసినా, చేయించినా ఏ తప్పు చేయలేదన్నదే తేలుతుంది’ అని భూమన స్పష్టం చేశారు. -
‘కూటమి సర్కార్‌ను తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధం’
సాక్షి, కర్నూలు: పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రీజినల్ కో-ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలపై పోరాటం చేయాలన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ జగన్మోహన్రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్న 46 శాతం ఓటింగ్ వచ్చిందని.. పార్టీ భయపడాల్సిన పరిస్థితి లేదన్నారు.‘‘అన్ని వర్గాలతో కలిసి ఐక్యంగా ముందుకెళ్లాలి. త్వరలోనే వైఎస్ జగన్ ప్రజల్లోకి వస్తారు. మీ సమస్యలను పార్టీ దృష్టికి తీసుకురావాలి. కూటమి ప్రభుత్వంపై ప్రజలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వం కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు అందించింది. రెండు సంవత్సరాల పాటు తూచ తప్పకుండా ఆర్థిక ఇబ్బందులు ఉన్న చెప్పిన మాట ప్రకారం అమలు చేశారు. కరోనా కాలంలో చంద్రబాబు, నారా లోకేష్ హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. ఏ ఎన్నికలు వచ్చినా కూటమి ప్రభుత్వాన్ని తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’’ అని పెద్దిరెడ్డి చెప్పారు. ఇదీ చదవండి: బడ్జెట్లో ఏపీకి నిల్! -
అబద్ధం చెప్పి అధికారంలోకి రావడం చాలా దుర్మార్గం: Peddireddy
-
50 కోట్లు పరువు నష్టం దావా.. ఈనాడు,ఆంధ్రజ్యోతిపై పెద్దిరెడ్డి ఫైర్
-
‘ఇవి చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్’
తిరుపతి: టీడీపీ కూటమి ప్రభుత్వం అండతో ఎల్లో మీడియా తనపై తప్పుడు కథనాలు రాస్తోందని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy)మరోసారి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే తనపై తప్పుడు కథనాలు రాస్తున్నారని ధ్వజమెత్తారు. ఈనాడు, ఈటీవీపై పరువు నష్టం ాదావా వేస్తానని పెద్దిరెడ్డి తెలిపారు. ఆ భూములను గతంలో చంద్రబాబు ప్రభుత్వం విచారణ జరిపి అటవీ భూములు కాదని తేల్చిన సంగతిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి గుర్తుచేశారు. 2001లోనే ఆ భూమిని కొనుగోలు చేశామని, అప్పట్నుంచి ఆ భూమిలో సాగు చేస్తున్నమన్నారు పెద్దిరెడ్డి. ఎల్లో మీడియాను అడ్డం ెపెట్టుకుని వ్యక్తిత్వం హననానికి పాల్పడుతున్నారని, ఇందులో భాగంగానే తప్పుడు కథనాలు రాయిస్తున్నారని పెద్దిరెడ్డి మండిపడ్డారు. కాగా, పులిచెర్ల మండలంలో అటవీ భూములను తాము కబ్జా చేసినట్లు ఈనాడు ప్రచురించిన కథనం పూర్తి అవాస్తవమని, దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని రామచంద్రారెడ్డి ఇప్పటికే ివివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై బుధవారం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఒక్క ఎకరం అయినా కబ్జా చేసినట్లు నిరూపించగలరా? అని సవాల్ చేశారు. పూర్తి చట్టబద్ధంగా తాము 2001లో కొనుగోలు చేసిన భూములపై పచ్చి అబద్ధాలతో కథనాన్ని ప్రచురించడం వెనుక సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నాయని ధ్వజమెత్తారు. బుధవారం తిరుపతిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.1981లోనే అవి ప్రైవేట్ భూములని నిర్ధారించారు..నిత్యం చంద్రబాబుకు బాకా ఊదుతూ పచ్చనేతల సేవలో తరించిపోయే ఈనాడు, ఈటీవీ ద్వారా మాపై పలుసార్లు పచ్చి అబద్ధాలతో కూడిన కథనాలను ప్రచురించారు. వీటిపై ఇప్పటికే చిత్తూరు న్యాయస్థానంలో ఎల్లో మీడియాపై రూ.50 లక్షలకు పరువు నష్టం దావా వేశాం.పులిచర్ల ప్రాంతంలోని 75 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేశామని, అటవీ అధికారులకు తెలియకుండా తారు రోడ్డు నిర్మించామంటూ, భూమిని పెంచామంటూ పచ్చి అబద్ధాలు, అభూత కల్పనలతో కథనాలను వెలువరించారు. ఆ భూములు ప్రైవేట్ వ్యక్తులకు చెందిన పట్టా భూములని 1981 నవంబర్ 11న డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ అధికారి అసదుద్దీన్ అహ్మద్ ఆర్డర్ జారీచేశారు.ఈ ఉత్తర్వులు పొందిన వ్యక్తుల నుంచి 2001లో వాటిని చట్టబద్ధంగా కొనుగోలు చేసి మామిడితోట, పశువుల పెంపకం చేపట్టాం. కేంద్ర అటవీశాఖ నుంచి 27.6.2022న క్లియరెన్స్ పొందిన తరువాతే అక్కడ రోడ్డు నిర్మాణానికి పీసీసీఎఫ్ అనుమతులు ఇచ్చమన్నారు. -
తనపై ఎల్లో మీడియా ప్రచురించిన కథనాలపై పెద్దిరెడ్డి ఆగ్రహం
-
పట్టా భూములను అటవీ భూములంటారా?: పెద్దిరెడ్డి
తిరుపతి అర్బన్: ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని టీడీపీ కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై వేధింపులకు దిగుతోందని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. పులిచెర్ల మండలంలో అటవీ భూములను తాము కబ్జా చేసినట్లు ఈనాడు ప్రచురించిన కథనం పూర్తి అవాస్తవమని, దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఒక్క ఎకరం అయినా కబ్జా చేసినట్లు నిరూపించగలరా? అని సవాల్ చేశారు. పూర్తి చట్టబద్ధంగా తాము 2001లో కొనుగోలు చేసిన భూములపై పచ్చి అబద్ధాలతో కథనాన్ని ప్రచురించడం వెనుక సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నాయని ధ్వజమెత్తారు. బుధవారం తిరుపతిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.1981లోనే అవి ప్రైవేట్ భూములని నిర్ధారించారు..నిత్యం చంద్రబాబుకు బాకా ఊదుతూ పచ్చనేతల సేవలో తరించిపోయే ఈనాడు, ఈటీవీ ద్వారా మాపై పలుసార్లు పచ్చి అబద్ధాలతో కూడిన కథనాలను ప్రచురించారు. వీటిపై ఇప్పటికే చిత్తూరు న్యాయస్థానంలో ఎల్లో మీడియాపై రూ.50 లక్షలకు పరువు నష్టం దావా వేశాం. తాజాగా పులిచర్ల ప్రాంతంలోని 75 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేశామని, అటవీ అధికారులకు తెలియకుండా తారు రోడ్డు నిర్మించామంటూ, భూమిని పెంచామంటూ పచ్చి అబద్ధాలు, అభూత కల్పనలతో కథనాలను వెలువరించారు. ఆ భూములు ప్రైవేట్ వ్యక్తులకు చెందిన పట్టా భూములని 1981 నవంబర్ 11న డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ అధికారి అసదుద్దీన్ అహ్మద్ ఆర్డర్ జారీచేశారు. ఈ ఉత్తర్వులు పొందిన వ్యక్తుల నుంచి 2001లో వాటిని చట్టబద్ధంగా కొనుగోలు చేసి మామిడితోట, పశువుల పెంపకం చేపట్టాం. కేంద్ర అటవీశాఖ నుంచి 27.6.2022న క్లియరెన్స్ పొందిన తరువాతే అక్కడ రోడ్డు నిర్మాణానికి పీసీసీఎఫ్ అనుమతులు ఇచ్చారు. రెండుసార్లు విచారణ.. అవి ప్రైవేట్ భూములేఈ భూములపై ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీడీపీకి చెందిన వెంకటరమణారెడ్డి ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించారు. దీనిపై అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు జాయింట్ సర్వే చేసి అది అటవీభూమి కాదని.. పూర్తిగా ప్రైవేట్ భూమేనని నిర్ధారించారు. అదే వెంకటరమణారెడ్డి 2014లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇదే అంశంపై ఫిర్యాదు చేశాడు. తిరిగి మరోసారి దీనిపై విచారణ జరిపిన అధికారులు అది ప్రైవేటు భూమి అని మరోసారి నిర్ధారించారు. దీనిపై వెంకటరమణారెడ్డి హైకోర్ట్‌లో కేసు వేయగా డిస్మిస్ చేశారు. ఫారెస్ట్ గెజిట్ 1968లోనే అది పక్కా ప్రైవేటు భూమి అని చూపించారు.ఆరోపణలకే పవన్ పరిమితం..ఇసుకలో రూ.40 వేల కోట్ల దందా చేశామని, ఎర్ర చందనం స్మగ్లింగ్ చేశామని, నేపాల్‌లో పట్టుబడిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు మాపై నిరాధార ఆరోపణలు చేశారు. మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా? మేం ఎక్కడైనా ఒక్క రూపాయి అవినీతికి పాల్పడినట్లు తేలిందా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మదనపల్లి రెవెన్యూ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం ఘటనను మాపై నెట్టేందుకు యత్నించింది.భూమి పెరిగిందా..? బుర్ర తరిగిందా?ఈనాడు ఆరోపణ: భూమి కూడా పిల్లల్ని కంటుందని మీకు తెలుసా? పెద్దిరెడ్డి కుటుంబానికి మాత్రమే అడవి మధ్యలో పట్టా భూములు ఎలా వచ్చాయి?వాస్తవం: భూమి పెరుగుతూ వచ్చిందనేది శుద్ధ అబద్ధం. సెటిల్మెంట్ నివేదికే దీనికి నిదర్శనం. అవి ప్రైవేట్ వ్యక్తులకు చెందిన పట్టా భూములని 1981లోనే డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ విభాగం తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు పొందిన వ్యక్తుల నుంచి 2001లో వాటిని చట్టబద్ధంగా కొనుగోలు చేసిన పెద్దిరెడ్డి కుటుంబం అక్కడ పశు పోషణతోపాటు మామిడి తోటలను సాగు చేస్తోంది. రిజర్వు ఫారెస్టు ఎలాంటి ఆక్రమణలకు గురి కాలేదని 1968 గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం కూడా స్పష్టమవుతోంది. అక్కడ 75.74 ఎకరాల భూములున్నాయని, 30 అడుగుల దారి కూడా ఉందని పేర్కొంది. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హ యాంలో రెండుసార్లు ఉమ్మడిగా సర్వే నిర్వహించిన రెవెన్యూ, అటవీశాఖల అధికారులు కూడా అవి ప్రై వేట్ భూములేనని నిర్ధారించారు. దీనిపై దాఖలైన వ్యాజ్యాన్ని సైతం న్యాయస్థానం కొట్టి వేసింది.ఈనాడు ఆరోపణ: ఎఫ్ఎంబీ, ఫెయిర్ అడంగల్ ప్రకారం 23.69 ఎకరాలుంటే 75.75 ఎకరాలున్నట్లు ఆన్లైన్లో ఎలా నమోదు చేశారు? అదనంగా 52.06 ఎకరాల భూమి ఎక్కడి నుంచి వచ్చింది?» డాక్యుమెంట్ నంబర్ 2346/2000: విస్తీర్ణం 15 ఎకరాలు» డాక్యుమెంట్ నంబర్ 1/2001: విస్తీర్ణం 10 ఎకరాలు » డాక్యుమెంట్ నంబర్ 2345/2000: విస్తీర్ణం 11 ఎకరాలు » డాక్యుమెంట్ నంబర్ 139/2001: విస్తీర్ణం 18.94 ఎకరాలు » డాక్యుమెంట్ నంబర్ 2347/2000: విస్తీర్ణం 10.80 ఎకరాలు » డాక్యుమెంట్ నంబర్ 2/2001: విస్తీర్ణం 10 ఎకరాలు » మొత్తం విస్తీర్ణం : 75.74 ఎకరాలుఈ రిజిస్ట్రేషన్లు కూడా టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ పూర్తయ్యాయి.ఈనాడు ఆరోపణ: విలాస భవనాలను కట్టుకున్నారు.. ప్రభుత్వ సొమ్ముతో రోడ్డు నిర్మించుకున్నారు.వాస్తవం: ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున వ్యవసాయ భూములు ఉండటం.. ఎడ్లబండి మాత్రమే వెళ్లేందుకు దారి ఉన్నందున తమకు తారు రోడ్డు కావాలని కోరుతూ రైతులు అటవీశాఖకు దరఖాస్తు చేసుకున్నారు. కేంద్ర అటవీశాఖ ఆమోదంతో రోడ్డు నిర్మాణానికి పీసీసీఎఫ్ అనుమతులు ఇచ్చారు. అయినా పెదిరెడ్డిది కూడా పొలమే కదా? ఆయన కూడా వ్యవసాయం చేయి స్తున్నారు కదా? అది కూడా అన్ని అనుమతులు తీసుకుని ఏర్పాటు చేసుకున్నారు. అసలు రామోజీ కుటుంబానికి మించిన విలాస సౌథాలు ఎవరికి మాత్రం ఉంటాయి? దాదాపు వెయ్యి దేశవాళీ ఆవులను సంరక్షిస్తున్న పెద్దిరెడ్డి కుటుంబం వాటి కోసం షెడ్లు నిర్మించింది. స్వతహాగా రైతు కావడం, వ్యవసాయంపై మక్కువతో వయసు మళ్లిన వాటిని కూడా పోషిస్తున్నారు. » టీడీపీ కూటమి సర్కారుకు బాకాగా పనిచేస్తున్న ఈనాడు దినపత్రిక ప్రభుత్వ పెద్దలను సంతృప్తి పరిచేందుకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంపై విషం చిమ్ముతూ పతాక శీర్షికలతో పేజీలకు పేజీలు తప్పుడు కథనాలను ప్రచురించింది. మార్కెట్ విలువ ఎకరా రూ.3 లక్షలు మాత్రమే ఉన్న పట్టా భూములను అటవీ ప్రాంతంగా చిత్రీకరించేందుకు రూ.కోట్ల విలువైన స్థలాన్ని వృథా చేసేందుకు కూడా ఈనాడు వెనుకాడలేదు. -
ఈనాడు, ఈటీవీపై పరువు నష్టం దావా వేస్తా: పెద్దిరెడ్డి
సాక్షి, తిరుపతి: ఏపీలో ఎల్లో మీడియా తప్పుడు కథనాలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలు, కుత్రంతాలు ప్రజలకు బాగా తెలుసు అని విమర్శించారు. 2001లో భూములు కొనుగోలు చేస్తే ఇప్పుడు ఎల్లో మీడియా ఫేక్ వార్తలు రాస్తోందని మండిపడ్డారు. ఈ క్రమంలో తప్పుడు వార్తలు రాసిన ఈనాడు(Eenadu), ఈటీవీపై పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాజాగా తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. మాకు సంబంధించిన భూములపై ఎల్లో మీడియా(Yellow Media) తప్పుడు కథనాలు రాస్తోంది. 2001లోనే మేము భూములు కొనుగోలు చేశాం. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే రెవెన్యూ అధికారులు భూమి సర్వే చేశారు. 25ఏళ్లుగా మేము భూమిని సాగు చేస్తున్నాం. ఇప్పుడు అది అటవీ భూమి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం విచారణ జరిపి అటవీ భూములు లేవని తేల్చింది. అంతకంటే ముందు కిరణ్ కుమార్ ప్రభుత్వం కూడా విచారణ చేపట్టింది. అప్పుడు కూడా అటవీ భూములు కాదని తేల్చారు. 2001 నుంచి భూములను సాగు చేస్తున్నాం. ఈనాడు, ఈటీవీ తప్పుడు కథనాలపై పరువు నష్టం దావా వేస్తాను.గతంలో కూడా అదే పత్రిక మదనపల్లి ఘటనలో తప్పుడు వార్తలు రాశారు. అప్పుడు వారిపై రూ.50కోట్లకి పరువు నష్టం దావా వేశాం. ఈరోజు అటవీ భూములు ఆక్రమించామని మళ్ళీ వార్త రాశారు. కేవలం 23 ఎకరాల భూమి 75 ఎకరాలు ఎలా అయ్యింది అని వార్తలు రాశారు. 19.11.1981లో డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్ మాకు అమ్మిని వారికి ఆర్డర్ ఇచ్చారు. అధునాతన గెస్ట్ హౌస్ కట్టాలని వార్తలు రాశారు. 2001 లోనే అక్కడ పని చేసే వారి కోసం మేము గెస్ట్ హౌస్ కట్టాం. కోర్టులో పిటిషన్ వేసినా కూడా కోర్టు ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. 1968లో ఇచ్చిన ఫారెస్ట్ గెజిట్‌లో కూడా ఆ 76 ఎకరాలు వారికి సంబంధం లేదు అని తేల్చారు. దారి కూడా ఇవ్వాలని రైట్ ఆఫ్ వే కూడా కల్పించారు.27.06.2022 లో బ్లాక్ టాప్ రోడ్డు వేసేందుకు కేంద్రం నుండి అనుమతులు కూడా వచ్చాయి. చంద్రబాబు తానా అంటే పవన్ కళ్యాణ్ తందాన అంటున్నారు. గతంలో ఇసుక ద్వారా 40 వేల కోట్లు మింగేసాను అని, ఆ తర్వాత నేపాల్‌లో నాకు సంబంధించిన ఎర్ర చందనం దొరికింది అని ఆరోపించారు. మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యి ఉండి ఇన్ని రోజులు అయినా ఎందుకు చర్యలు తీసుకోలేదు.బాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. చంద్రబాబు(Chandrababu) కుట్రలు, కుతంత్రాలు అందరికీ తెలుసు.ఎన్నికల సందర్బంగా చెప్పిన ప్రకారం.. చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చాలి. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. చంద్రబాబుకు త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారు. ఏపీలో వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం. ఎవరు పార్టీలో ఉన్నా, లేకున్నా వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుంది. వైఎస్ జగన్ నాయకత్వంలో మళ్ళీ అధికారం ఖాయం. క్యాలెండర్ ఇచ్చి పథకాలు అమలు చేసిన ఘనత వైఎస్ జగన్‌ది. కరోనాతో ప్రపంచమంతా అల్లకోల్లోలం అయినా కూడా ఎక్కడా పథకాలు ఆపలేదు అంటూ వ్యాఖ్యలు చేశారు. -
వాలంటీర్లకు పదివేలు ఇస్తానని చంద్రబాబు మోసం చేశారు: పెద్దిరెడ్డి
-
అబద్ధాలతో మోసగించే నైజం చంద్రబాబుది
పుంగనూరు: ఎన్నికల సమయంలో ప్రతి చోటా పదేపదే అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగించే నైజం చంద్రబాబుదేనని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెతారు. విద్యుత్ చార్జీలు పెంచబోనని ఎన్నికల్లో అనేక సభలో హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి రాగానే ప్రజలపై రూ.15,485,36 కోట్లకు పైగా కరెంటు చార్జీల భారం వేశారని తెలిపారు. ప్రజలను వంచించిన చంద్రబాబుకు గుణపాఠం నేర్పాలని పిలుపునిచ్చారు. విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్పతో కలసి వేలాదిమందితో శుక్రవారం పట్టణంలో జోరు వానలోనూ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. విద్యుత్ చార్జీలను తక్షణమే తగ్గించాలని, రైతులందరికీ వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గత చంద్రబాబు పాలనలో మూడు డిస్కంలు రూ.86 వేల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయాయన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత డిస్కంలకు ఆర్థిక సహాయం చేకూర్చి, మళ్లీ లాభాల బాట పట్టించారని తెలిపారు. అలాగే సోలార్ విద్యుత్‌ను చవగ్గా రూ.2.49కే అందించేందుకు సెకితో ఒప్పందం చేసుకున్నారని చెప్పారు. -
వైఎస్ జగన్ కలిసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
-
పీఏసీ ఎన్నికల విషయంలో YSRCP కీలక నిర్ణయం
-
ఎన్నికలను బహిష్కరిస్తున్నాం.. తాలిబన్లు మాత్రమే ప్రతిపక్షానికి PAC ఇవ్వలేదు
-
పీఏసీ ఎన్నికల్ని బాయ్‌కాట్ చేసిన వైఎస్సార్సీపీ
అమరావతి, సాక్షి: రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ)కి ఎన్నికలు నిర్వహించాల్సి రావడం దురదృష్టకరమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు పార్టీ తరఫున శుక్రవారం ఆయన ప్రకటించారు.‘‘ఇప్పటివరకు ప్రతిపక్షానికి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, కూటమి ప్రభుత్వం ఆ ఆనవాయితీకి విరుద్ధంగా చేస్తోంది. అందుకే ఈ ఎన్నికలను బాయ్‌కాట్ చేస్తున్నాం. గతంలో సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా పీఏసీ ప్రతిపక్షానికే ఇచ్చారు. ప్రతిపక్ష హోదా లేని పార్టీలకు కూడా అనేకసార్లు పదవి అప్పగించారు. పార్లమెంట్లో సైతం ఇలాంటి పరిణామం అనేకసార్లు చోటు చేసుకుంది... పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతుంది. అందుకే ప్రతిపక్షానికి ఇస్తారు. ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాల్లో అన్నింటా ప్రతిపక్షానికే పీఏసీ ఇస్తారు. ఒక్క తాలిబన్లు పాలిస్తున్న ఆఫ్ఘనిస్తాన్‌లో తప్ప. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం దగ్గరి నుంచి కోల్ గేట్ స్కామ్, కామన్ వెల్త్ గేమ్స్ కుంభకోణం.. అన్నీ పీఏసీనే వెలికితీసింది. 1994లో కాంగ్రెస్ పార్టీ కి ప్రతిపక్ష హోదా లేకపోయినా కాంగ్రెస్ కి పీఏసీ చైర్మన్ ఇచ్చారు... మాకు గతంలో 151 మంది ఎమ్మెల్యేలు బలం ఉన్నా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కి పీఏసీ చైర్మన్ ఇచ్చాం. కానీ, ఇప్పుడు పీఏసీకి ఎన్నికలు నిర్వహించడం దురదృష్టకరం. ఈ ప్రభుత్వం ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పీఏసీ చైర్మన్ ను ఇవ్వడం లేదు. అందుకే.. ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం’’ అని పెద్దిరెడ్డి ప్రకటించారు. -
YSRCP: పెద్దిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలకు అదనపు బాధ్యతలు
తాడేపల్లి : ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్ జిల్లాలకు వైఎస్సార్సీపీ రీజినల్ కో-ఆర్డినేటర్‌గా ఉన్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అదనంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా కో-ఆర్డినేట్‌గా బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.అదే సమయంలో ఉమ్మడి గుంటూరు జిల్లాకు వైఎస్సార్సీపీ రీజినల్ కో-ఆర్డినేటర్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డికి సైతం అదనపు బాధ్యతలు అప్పగించారు. వైవీ సుబ్బారెడ్డికి అదనంగా ఉమ్మడి కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ కో-ఆర్డినేటర్‌గా బాధ్యతలను అప్పగించారు. -
పెద్దిరెడ్డి నామినేషన్ టైంలో హైడ్రామా.. బొత్స ఆగ్రహం
సాక్షి, అమరావతి: పీఏసీ చైర్మన్ పదవికి మాజీ మంత్రి, పుంగనూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అయితే నామినేషన్ స్వీకరణకు ముందు అసెంబ్లీలో పెద్ద హైడ్రామానే నడిచింది. పెద్దిరెడ్డిని, ఆయనతో ఉన్న వైఎస్సార్సీపీ నేతలను అధికారులు 2 గంటలపాటు ఎదురుచూసేలా చేశారు. ఈ పరిణామంపై బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఏసీ చైర్మన్ నామినేషన్ దాఖలు కోసం గడువు మధ్యాహ్నం 1 గంటతోనే ముగియాల్సి ఉంది. దీంతో నామినేషన్ పత్రాలతో వైఎస్సార్సీపీ నేతలు 11గం.కే అసెంబ్లీ కార్యదర్శి ఛాంబర్ వద్దకు చేరారు. అయితే అధికారులు లేకపోవడంతో ఎదురు చూడసాగారు. సుమారు 2 గంటలపాటు అధికారుల రాక కోసం వాళ్లంతా పడిగాపులు కాశారు. నామినేషన్ ముగింపు గడువు దగ్గర పడుతుండడంతో.. విషయం తెలిసి బొత్స అక్కడికి వచ్చారు. ‘‘సమయం పెట్టి కూడా నామినేషన్ తీసుకోరా? ఇంత సేపు ఎమ్మెల్యేలను ఎదురు చూసేలా చేస్తారా?’’ అంటూ అంటూ అసెంబ్లీ కార్యదర్శి ప్రసన్న కుమార్‌పై మండిపడ్డారు. అదే సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు.. అటువైపు రావడం బొత్స గమనించారు. అచ్చెన్నను ఆపి అధికారుల తీరు గురించి ప్రస్తావించారు. దీనిపై స్పందించిన మంత్రి అచ్చెన్న.. అధికారులతో తాను మాట్లాడతానని చెప్పి వెళ్లిపోయారు.కాసేపటికే అధికారులు వచ్చి.. పెద్దిరెడ్డి నామినేషన్ స్వీకరించారు. ఈ నామినేషన్‌ను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్ బలపరిచారు. -
విద్యుత్ చార్జీలు పెంచి జగనే కారణమంటారా?: పెద్దిరెడ్డి
కడప వైఎస్ఆర్ సర్కిల్: చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై రూ.6 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని మోపి, అందుకు వైఎస్ జగనే కారణమని చెప్పడం కూటమి దిగజారుడుతనానికి నిదర్శనమని వైఎస్సార్సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఆయన శనివారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పచ్చ పత్రికలు విద్యుత్ చార్జీల పెంపు సమాచారాన్ని ప్రజలకు తెలియజేయకుండా, తిరిగి వైఎస్ జగన్‌పైనే ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. వరదలు సహా అనేక ఇతర అంశాల్లో చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా విఫలమై, అన్నింటికీ వైఎస్ జగనే కారణమన్నట్లుగా చెబుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్‌్టనే షర్మిల చదువుతున్నారని అన్నారు. కేసులు పరిష్కారం అయ్యే వరకు షేర్ల బదిలీ జరగదని, అయినా ఆమె ఉద్దేశపూర్వకంగానే జగన్‌ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వ్యవసాయం దండగ అని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు పంటల బీమా, ఇతర సౌకర్యాలు తొలగించి రాష్ట్ర రైతాంగాన్ని నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు. రైతులు రుగ్మతతో అత్మహత్య చేసుకుంటున్నారని వ్యాఖ్యానించిన చంద్రబాబు.. అన్నదాతకు ఏ మేలూ చేయరని స్పష్టంచేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సబ్సిడీపై అందించామని, ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూ్యరెన్స్ వంటి పథకాలతో ఆదుకున్నామని చెప్పారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పార్టీని మరింతగా బలోపేతం చేసి, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తేవడమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. నియోజకవర్గ ఇన్చార్జిల సూచనలను తీసుకుని జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సమర్థులైన వారికే పదవులు లభిస్తాయని తెలిపారు. -
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు విస్మరించారు
-
అంజుమ్ కేసులో.. పోలీసుల వైఫల్యం
పుంగనూరు : చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏడేళ్ల బాలిక అశి్వయ అంజుమ్‌ను కిడ్నాప్ చేసి, దారుణంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో నీటముంచి హత్యచేసిన కేసును ఛేదించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్ప, మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, పలువురు పార్టీ నేతలతో కలిసి శనివారం అశి్వయ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. కాగితాలు కాలిపోతే తమపై ఆరోపణలు చేస్తూ హెలికాప్టర్లో డీజీపీ, సీఐడీ చీఫ్‌లను ఉన్నపళంగా పంపిన సీఎంచంద్రబాబు.. మైనార్టీ బాలిక కిడ్నాప్, హత్య కేసులో ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు.న్యాయం జరిగే వరకు తమ పార్టీ తరఫున ఉద్యమిస్తామన్నారు. హత్య కేసులో సీసీటీవీ పుటేజ్ కానీ, ఆధారాలు కానీ లేవని.. పోస్టుమార్టంలో ఏం వచ్చిందన్న విషయాలు కూడా వెల్లడించడంలో పోలీసులు విఫలమయ్యారని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఈ విషయంలో ఏం చేస్తున్నారని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. ఇక బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈనెల 9న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుంగనూరుకు రానున్నట్లు పెద్దిరెడ్డి వెల్లడించారు. పోలీసులు స్పందించడంలేదు : మిథున్‌రెడ్డి గత కొద్దిరోజుల్లో ఇద్దరు మైనర్ బాలికలు హత్యకు గురైన సంఘటనలో నిందితులను ఎందుకు అరెస్టుచేయలేదని, దీని వెనుక ఉన్న లోగుట్టు వెల్లడించాలని ఎంపీ మిధున్‌రెడ్డి డిమాండ్ చేశారు. చిన్నారి అశ్వియ అంజుమ్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. మైనార్టీ బాలిక కిడ్నాప్, హత్య కేసులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. వారం రోజులుగా బాధిత కుటుంబానికి ఎలాంటి న్యాయం చేయలేదన్నారు. పట్టణ ప్రజలు నిద్రహారాలు మాని ఆందోళనలు చేస్తున్నా పోలీసులు ఎందుకు స్పందించడంలేదని విమర్శించారు. ఈనెల 9న బాధిత కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు ఉన్నపళంగా పుంగనూరు పర్యటనకు రావడం విస్మయానికి గురిచేస్తోందని.. వారం రోజులుగా స్పందనలేని ముఖ్యమంత్రికి, మంత్రులకు జగనన్న వస్తున్నారనే వార్త స్పందన కలిగించిందని మిథున్‌రెడ్డి ఎద్దేవా చేశారు. -
చంద్రబాబు పాలనలో సూపర్ సిక్స్ లేదు, సూపర్ సెవెన్ లేదు
-
పుంగనూరుకు పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి
-
ఈ చిన్నారి ఘటన మీకు కనిపించలేదా?
పుంగనూరు((చిత్తూరు జిల్లా): కిడ్నాప్‌కు గురై ఆపై హత్య గావించబడ్డ పుంగనూరుకు చెందిన అశ్వియా కుటుంబాన్ని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిలు పరామర్శించారు. శనివారం పుంగనూరుకు వెళ్లిన పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డిలు.. అశ్వియా కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. కుమార్తె అశ్వియా హత్యకు గురి కావడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తండ్రి హజ్మతుల్లాను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డిలు ఓదార్చి ధైర్యం చెప్పారు.అనంతరం పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ‘పుంగనూరులో ఇలాంటి దారుణ ఘటన ఎప్పుడూ జరగలేదు. ఇంటి ముందు ఆడుకుంటున్న రెండవ తరగతి చదువుతున్న చిన్నారి కిడ్నాప్ , హత్య జరిగితే ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనిపై దోషులను శిక్షించకపోతే అందుకు తగిన విధంగా స్పందిస్తాం. ఈ ఘటనలో పోలీసుల అసమర్థత కనిపిస్తోంది. మదనపల్లి సబ్ కలెక్టర్ ఘటనలో డీజీపీ, సీఐడీ అధికారులను ప్రత్యేక ఫ్లైట్, హెలికాప్టర్ ఇచ్చి పంపించి దర్యాప్తు చేశారు. మరి ఈ చిన్నారి ఘటన పోలీస్ ఉన్నతాధికారులకు కనిపించడం లేదా?, ఈ నెల9వ తేదీన వైఎస్ జగన్మోహన్రెడ్డి పుంగనూరుకు వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ ఆందోళన చేపట్టనుంది. బాధిత కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుంది’ అని పేర్కొన్నారు. ‘కానరాని లోకాలకు చిట్టితల్లి’9న పుంగనూరుకు వైఎస్ జగన్ -
‘ప్రజల దృష్టి మరల్చేందుకు కుట్రకు తెరలేపారు’
తిరుపతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వంద రోజుల పాలనపై ప్రజల దృష్టిని మరల్చేందుకే తిరుమల లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చారని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. చంద్రబాబు పాలనలో సూపర్ సిక్స్ లేదు.. సూపర్ సెవెన్ లేదు అంటూ ఎద్దేవా చేశారు పెద్దిరెడ్డి. ‘ లడ్డూ ప్రసాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. పుంగనూరులో చిన్నారి అశ్వియా అంజుమ్ కిడ్నాప్‌కు గురై హత్య గావించబడితే పోలీసులు కనీసం పట్టించుకోలేదు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైల్స్ కాలిపోతే డిజిపి స్పెషల్ ఫ్లైట్, ప్రత్యేక హెలికాప్టర్ లో వచ్చారు. డిజిపి పనితీరు మార్చుకోవాలి. మదనపల్లి సబ్ కలెక్టర్ ఘటనలో నాపై బురద చల్లెందుకు ఎన్నో కుట్రలు చేశారు, ఎలాంటి ఆధారాలు లభించక లేదు’ అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన అశ్వియా అనే బాలిక కిడ్నాప్ గురై ఆ తర్వాత దారుణంగా హత్య చేయబడింది. అశ్వియా కుటుంబ సభ్యులను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిలు పరామర్శించనున్నారు. అయితే పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డిలు హత్యకు గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు పుంగనూరుకు వెళుతున్నారన్న సమాచారంతో అక్కడ పెద్ద ఎత్తును పోలీసులను మోహరించింది చంద్రబాబు సర్కారు. -
YSRCP: పెద్దిరెడ్డికి కీలక బాధ్యతలు
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీలో ఈ మధ్య కీలక బాధ్యతల అప్పగింత జరుగుతోంది. తాజాగా.. సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్‌గా నియమించారు అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి.ఈ బాధ్యతలతో పాటు అదనంగా నాలుగు నియోజకవర్గాలను భర్తీ చేస్తూ తిరుపతి జిల్లా వైస్సార్సీపీ అధ్యక్ష బాధ్యతలను కూడా పెద్దిరెడ్డికి అప్పగించారు. మరోవైపు.. పార్టీ తరఫున రాష్ట్ర అధికార ప్రతినిధులుగా భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకరరావు, ఆర్కే రోజా, ఆరె శ్యామలను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. -
ఎల్లో మీడియాపై పరువు నష్టం దావా..
-
ఈనాడు, ఈ టీవీ, మహా న్యూస్ కు 100 కోట్ల పరువు నష్టం దావా
-
పరువు నష్టం దావా నోటీసులు పంపిన పెద్దిరెడ్డి
తిరుపతి, సాక్షి: మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో తనపై జరిగిన విష ప్రచారంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆ ప్రచారం చేసిన పత్రికలు, మీడియా సంస్థలకు పరువు నష్టం నోటీసులు పంపించారు. ఈనాడు, ఈటీవీ, మహా న్యూస్ కు పరువు నష్టం కింద 100 కోట్ల రూపాయలు చెల్లించాలని నోటీసులు పంపించినట్లు సమాచారం, ఇందులో ఈనాడు, ఈటీవీ 50 కోట్ల రూపాయలు, మహా న్యూస్ కు 50 కోట్ల రూపాయలు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తనపై నిరాధరంగా వార్తలు వేసి, వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వారికి న్యాయ పరంగా బుద్ధి చెప్తానని ఇదివరకే ఆయన ప్రకటించారు. ఇప్పుడు నోటీసులు పంపగా.. అతి త్వరలో ఆయన కేసు వేస్తారని ఆయన తరఫు న్యాయవాదులు అంటున్నారు. -
శబరిమలై యాత్రలో పెద్దిరెడ్డి
-
బాబు పాలన పై పెద్దిరెడ్డి సెటైర్లు
-
ఎల్లో మీడియా ఆ తప్పులను దాచేస్తోంది: పెద్దిరెడ్డి
సాక్షి, తిరుపతి: రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ తెలుసు. చంద్రబాబు తప్పులను ఎల్లో మీడియా దాచేస్తోంది. తమపై పని కట్టుకుని కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.‘‘అసత్యాలు ప్రచారం చేసేవారిపై చర్యలకు సిద్ధమయ్యాం. ఇప్పటికే నోటీసులు అందించాం. త్వరలో పరువు నష్టం దావా వేస్తాం. నాకు కోర్టు నుంచి ఎలాంటి నోటీసులు అందలేదు.. అందితే కచ్చితంగా న్యాయపరంగా సమాధానం ఇస్తా’’ అని పెద్దిరెడ్డి చెప్పారు.‘‘రెండు నెలల్లో ఆరోగ్యశ్రీకి 2500 కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయి పడింది. ఆరోగ్యశ్రీని కూడా చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రులను పీపీపీ పద్ధతిలోకి తీసుకొస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో పేదలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఫీజు చెల్లించి వైద్యం తీసుకునే పరిస్థితి వస్తుందేమో’’ అంటూ పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆధారాలుంటే చూపండి.. నిరూపించండి
సాక్షి, హైదరాబాద్: మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో అగ్ని ప్రమాదం ఘటనలో తన ప్రమేయం ఉన్నట్లు ఏ ఆధారాలు ఉన్నా చూపాలని, వాటిని నిరూపించాలంటూ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ చేశారు. ఆ ఘటనతో తనకే మాత్రం సంబంధం లేదని, సీబీఐ సహా ఎవరితో దర్యాప్తు జరిపినా ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ఇదంతా చంద్రబాబు కుట్రే అని చెప్పారు. ఆయన బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రాజకీయాల్లోకి వచి్చన నాటి నుంచి తమకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని గుర్తు చేశారు.ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆయన్ని ఎదుర్కొంటున్నందునే తనను టార్గెట్ చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. తానెలాంటి తప్పు చేయకపోయినా, కుట్రలతో దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని, వ్యక్తిత్వ హననం చేస్తున్నారని మండిపడ్డారు. వారి అనుకూల పత్రికల్లో తనపై దు్రష్పచారం చేసి, వాటిని నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సీఎం నుంచి మంత్రుల వరకు ఇష్టం వచి్చనట్లు మాట్లాడుతున్నారని, ఏ ఆధారాల్లేకపోయినా బురద చల్లుతున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచి్చన హామీలను అమలు చేయలేక, వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని అన్నారు. ఏమన్నా అంటే ఖజానా ఖాళీ అంటున్నారని, సూపర్ సిక్స్ గురించి కూడా బాబు మాట్లాడటంలేదంటూ దెప్పిపొడిచారు. నాపేరు చెప్పించే కుట్ర మదనపల్లెలో తగలబడ్డాయని చెబుతున్న రికార్డులు ఎమ్మార్వో, కలెక్టర్ ఆఫీస్‌తో పాటు సచివాలయంలో కూడా ఉంటాయని చెప్పారు. ఆ రికార్డులన్నింటి డేటా రిట్రీవ్ చేశామని చెబుతున్నారని, ఇక ఆ ఘటనలో కుట్ర కోణం ఏముందని అన్నారు. వైఎస్సార్సీపీ నాయకులను వేధిస్తూ, వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా, వారితో తన పేరు చెప్పించే కుట్ర చేస్తున్నారని చెప్పారు. ఈ ఎన్నికల తర్వాతా చాలా మందిని హత్య చేశారని, చాలా మంది ఆడపిల్లలపై అత్యాచారాలు జరిగాయని, ఆ కేసులన్నింటిలో కూడా ప్రభుత్వం ఇంత వేగంగా ఎందుకు స్పందించడంలేదని ప్రశి్నంచారు. మదనపల్లెలో అగ్ని ప్రమాదం జరగ్గానే ఏదో పెద్ద విపత్తు సంభవించినట్లు ఏకంగా డీజీపీని హెలికాప్టర్లో పంపారని గుర్తు చేశారు. -
ఆధారాలుంటే నిరూపించండి.. చంద్రబాబుకు పెద్దిరెడ్డి సవాల్
సాక్షి, చిత్తూరు జిల్లా: వైఎస్సార్సీపీ నాయకులే టార్గెట్‌గా దాడులు చేస్తున్నారని.. కావాలనే తమ పార్టీ నేతలపై అవాస్తవాలు రాయిస్తున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మదనపల్లె కేసుకు, తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏ దర్యాప్తు సంస్థతోనైనా విచారణ చేయించుకోవచ్చని తేల్చి చెప్పారు.‘‘చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి నాకు వ్యతిరేకంగా పనిచేశారు. మదనపల్లెలో రికార్డులు తగలపడితే మాపై నిందలు వేస్తున్నారు. కార్యకర్తలతో మాపై తప్పుడు ఫిర్యాదులు చేయిస్తున్నారు. ఆధారాలు ఉంటే నిరూపించండి. తప్పుడు ఆరోపణలు చేసి అధికారులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. మా కుటుంబం పై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారు. మా ఆస్తులను ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచాం. కేసులు వేసి వేధించే ప్రయత్నం చేస్తున్నారు’’ పెద్దిరెడ్డి మండిపడ్డారు.టీడీపీ కుట్రలు రాష్ట్ర ప్రజలకు తెలుసు. రికార్డులు కాలిపోయాయని డీజీపీ హెలికాప్టర్ వేసుకొని వచ్చారు.. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు లేదు. రాజకీయ రంగు పులిమి.. అత్యుత్సాంతో కుట్రలు చేస్తున్నారు. కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్నికల హామీలు నెరవేర్చాలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. సూపర్ సిక్స్ అంటే చంద్రబాబు భయపడుతున్నారు. ఖజానాలో డబ్బులు లేవని సాకులు వెతుక్కుంటున్నారు. రాజకీయంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా క్యారక్టర్ దెబ్బ తీసేవిధంగా చేస్తున్నారు. తాము అధికారంలోకి ఉన్నప్పుడు వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు‘‘ అని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. -
టార్గెట్ పెద్దిరెడ్డి!
సాక్షి, అమరావతి: ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో సీఎం చంద్రబాబుకు రాజకీయంగా సవాల్‌గా మారిన చిరకాల రాజకీయ ప్రత్యరి్థ, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని లక్ష్యంగా చేసుకుని అధికార యంత్రాంగాన్ని ఉసిగొల్పుతున్నట్లు జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని మానసికంగా వేధించి క్షోభకు గురి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వ పెద్దలు పథకం వేసినట్లు వెల్లడవుతోంది. ఈ క్రమంలో మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం కేసు దర్యాప్తును పక్కదారి పట్టిస్తూ రాజకీయ కక్ష సాధింపులకు తెర తీశారు. ఘటన జరిగిన వెంటనే డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్లను హుటాహుటిన హెలికాఫ్టర్‌లో పంపడం ద్వారా తన ఉద్దేశాన్ని చంద్రబాబు చెప్పకనే చెప్పారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం కాదని డీజీపీ అదే రోజు మదనపల్లెలో ఏకపక్షంగా ప్రకటించేశారు. అయితే ఎలా సంభవించిందన్నది వారం రోజులైనా చెప్పలేకపోవడం సందేహాస్పదంగా మారింది. సాధారణ పొరపాటుతోనో, నిర్లక్ష్యం కారణంగానో అగ్ని ప్రమాదం సంభవించినట్లు దర్యాప్తులో దాదాపుగా తేలినా ఆ విషయాన్ని వెల్లడిస్తే పెద్దిరెడ్డి కుటుంబంపై అక్రమ కేసు బనాయించడం సాధ్యం కాదని ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. బాబు చేతిలో కీలుబొమ్మ సిసోడియా...! అగ్ని ప్రమాదం కేసును పెద్దిరెడ్డి కుటుంబానికి అంటగట్టడం సాధ్యం కాదని పోలీసులు తేల్చడంతో తీవ్ర అసహనానికి లోనైన సీఎం చంద్రబాబు రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియాను రంగంలోకి దించారు. 22ఏ జాబితాలోని నిషేధిత భూముల వివరాలు, రెవెన్యూ శాఖ ఇతర ఫైళ్లు దగ్ధమైనట్లు నిర్ధారించి తదనుగుణంగా కుట్రకు పదును పెట్టాలన్నది ప్రభుత్వ పెద్దల పన్నాగం. మరోవైపు కుట్ర కోణంలో రెండో అంకానికి తెర తీశారు. పెద్దిరెడ్డి కుటుంబం బాధితులంటూ టీడీపీ నేతలు ఎంపిక చేసిన వారితో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేయిస్తున్నారు. వీటిల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నది ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. కుటుంబ ఆస్తి వివాదాలు, కోర్టుల విచారణలో ఉన్న అంశాలపైనే ఫిర్యాదులు చేస్తున్నారు. సోదాలు.. వేధింపులు పెద్దిరెడ్డి కుటుంబంపై అక్రమ కేసు నమోదు చేసేందుకు కనీస ఆధారాలు కూడా లభించకపోవడంతో చంద్రబాబు పోలీసులపై చిందులు తొక్కుతున్నట్లు సమాచారం. దీంతో పోలీసులు వైఎస్సార్సీసీ ప్రజాప్రతినిధులు, నేతలు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులను సోదాల పేరుతో తీవ్రంగా వేధిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి నివాసంలో కూడా సోదాలకు సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు మాధవరెడ్డిని పోలీసులు కొద్ది రోజుల క్రితమే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఫైళ్లన్నీ భద్రం.. 22ఏ జాబితాలోని ఫైళ్లు, ఇతర భూముల ఫైళ్లను గల్లంతు చేసేందుకే అగ్ని ప్రమాదం సృష్టించారని నమ్మించేందుకు ప్రభుత్వ పెద్దలు వేసిన పథకం ఇప్పటికే బెడిసికొట్టింది. మదనపల్లె సబ్ కలెక్టరేట్ పరిధిలో 11 మండలాలున్నాయి. 22ఏ జాబితా, ఇతర భూముల ఫైళ్లు ఆయా మండలాల నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయానికి పంపుతారు. కలెక్టరేట్‌కు కూడా కాపీ పెడతారు. ఈ ప్రక్రియ దాదాపు ఆన్లైన్లోనే సాగింది. హార్డ్ కాపీలు పంపినా సంబంధిత ఫైళ్ల కాపీలన్నీ కూడా ఆయా తహశీల్దార్ కార్యాలయాల్లో భద్రంగా ఉన్నాయి. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లన్నీ భధ్రంగా ఉన్నాయని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియానే సోమవారం మీడియాతో మాట్లాడుతూ ప్రాథమికంగా నిర్థారించారు. సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో మొత్తం 2,440 ఫైళ్లు ఉన్నాయి. అగ్ని ప్రమాదం సంభవించగానే 740 ఫైళ్లు దగ్దం కాకుండా నివారించారు. మిగిలిన 1,700 ఫైళ్లలో ఇప్పటికే 90 శాతం ఫైళ్లను రిట్రీవ్(పునరుద్ధరించారు) చేశారు. మిగిలిన 10శాతం ఫైళ్ల వివరాలను పరిశీలిస్తున్నారు. వాటిని కూడా రిట్రీవ్ చేస్తారు. కలెక్టరేట్‌తోపాటు సబ్ కలెక్టరేట్ పరిధిలోని తహశీల్దార్ కార్యాలయాల్లోనూ అన్ని ఫైళ్లు భద్రంగా ఉన్నాయి. ఫైళ్లు అన్నీ భద్రంగా ఉంటే ఇక అందులో కుట్ర కోణం ఎక్కడ ఉంది ? -
ఎల్లో మీడియా తప్పుడు వార్తలపై చెంప చెళ్లుమనిపించిన రైతు..
-
చంద్రబాబుకు పెద్ది రెడ్డి కౌంటర్
-
పెద్దిరెడ్డికి భద్రత కల్పించండి
సాక్షి, అమరావతి: ప్రాణహాని నేపథ్యంలో పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 2+2 భద్రత కలి్పంచాలని హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి ఉత్తర్వులు జారీచేశారు. మంత్రిగా ఉన్నప్పుడు తనకు 5+5 భద్రత ఉండేదని, ఇప్పుడు 2+2 భద్రత సిబ్బందిని కూడా పంపడం లేదని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ పెద్దిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.ఈ వ్యాజ్యంపై జస్టిస్ చక్రవర్తి సోమవారం మరోసారి విచారించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి న్యాయవాది గుడిసేవ నరసింహారావు వాదనలు వినిపిస్తూ.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా గతంలో ఉన్న భద్రతను 1+1కు కుదిరించారని తెలిపారు. పిటిషనర్‌కు ఉన్న ప్రాణహానిని పరిగణనలోకి తీసుకోలేదన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు ఉన్న 5+5 భద్రతను కొనసాగించేలా ఆదేశాలివ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. పెద్దిరెడ్డికి ఎలాంటి ప్రాణహాని లేదని చెప్పారు.ఎస్పీ నివేదికలో సైతం ఇదే విషయాన్ని చెప్పారని తెలిపారు. ఎమ్మెల్యేగా ఆయన 1+1 భద్రతకు మాత్రమే అర్హుడని, అందువల్ల అదే భద్రతను ఇస్తున్నామని చెప్పారు. భద్రత కోసం పెద్దిరెడ్డి పెట్టుకున్న దరఖాస్తు భద్రత రివ్యూ కమిటీ (ఎస్ఆర్సీ) ముందు పెండింగ్‌లో ఉందన్నారు. ఎస్ఆర్సీ నిర్ణయం లేకుండా అదనపు భద్రతకు ఆదేశాలు ఇవ్వరాదని చెప్పారు. అలా చేస్తే మరింతమంది ఇదేరీతిలో అదనపు భద్రత కోసం పిటిషన్లు దాఖలు చేస్తారని తెలిపారు.ప్రాణహాని నేపథ్యంలో ప్రత్యేక కేసుగా పరిగణిస్తున్నాంఈ సమయంలో జస్టిస్ చక్రవర్తి స్పందిస్తూ.. ప్రాణహాని నేపథ్యంలో దీన్ని ప్రత్యేక కేసుగా పరిగణిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా రాజ్యాంగబద్ధమైన పోస్టులో పెద్దిరెడ్డి కొనసాగుతున్నారని గుర్తుచేశారు. అందువల్ల మూడువారాల పాటు ఆయనకు 2+2 భద్రత కలి్పంచాలని ఆదేశించారు. ఈ సమయంలో దమ్మాలపాటి స్పందిస్తూ.. ఎస్ఆర్సీ నివేదిక వచ్చేవరకు ఈ భద్రతను కలి్పస్తామని చెప్పారు. అలా అయితే మూడువారాలు లేదా ఎస్ఆర్సీ నివేదిక వచ్చే వరకు 2+2 భద్రత కల్పించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. రెండువారాలకు వాయిదా వేశారు. అనంతరం 4+4 భద్రతను కొనసాగించాలంటూ ఎంపీ మిథున్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యం కూడా విచారణకు వచ్చింది. ఏజీ దమ్మాలపాటి స్పందిస్తూ.. ఎంపీగా ఆయన 2+2కి అర్హుడని, ఆయనకు ఆదే కొనసాగిస్తున్నామని చెప్పారు. ఈ వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి విచారణను రెండువారాలకు వాయిదా వేశారు. -
పెద్దిరెడ్డికి 2+2 భద్రత కల్పించండి: హైకోర్టు ఆదేశం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గతంలో మాదిరిగా యథాతధంగా 2+2 భద్రతను కల్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పెద్దిరెడ్డి ఎమ్మెల్యేగా రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్నారని ధర్మాసనం ప్రభుత్వానికి సూచించింది.కాగా, గతంలో తనకు కల్పించిన భద్రతను యథాతధంగా కొనసాగించాలంటూ పెద్దిరెడ్డి.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు పెద్దిరెడ్డి పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రాణహాని నేపథ్యంలో పెద్దిరెడ్డికి 2+2 భద్రతను కల్పించాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.ఇక, విచారణ సమయంలో.. ప్రాణహాని నేపథ్యంలో దీన్ని ప్రత్యేక కేసుగా పరిగణిస్తున్నట్టు కోర్టు స్పష్టం చేసింది. పెద్దిరెడ్డి ఎమ్మెల్యేగా రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్నారని గుర్తు చేస్తూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు వారాల పాటు లేదా ఎస్ఆర్సీ నివేదిక వచ్చేంత వరకు పెద్దిరెడ్డికి 2+2 భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం, తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.ఇదిలా ఉండగా.. ఎంఆర్‌పల్లిలో తమ భూముల్లో నిర్మించుకున్న నిర్మాణాల విషయంలో జోక్యం చేసుకోకుండా అధికారులను నియంత్రించాలని కోరుతూ పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ నేడు హైకోర్టులో విచారణకు వచ్చింది. ఇక, విచారణ సందర్భంగా పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు ఉన్న రోడ్డు, గేటు, ఇతర నిర్మాణాల విషయంలో ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని అధికారులను కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే తదుపరి విచారణ ఈనెల 10వ తేదీకి వాయిదా వేసింది. -
వైఎస్ ఆర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన పెద్దిరెడ్డి
-
పెద్దిరెడ్డిపై దుష్ప్రచారం.. పవన్‌కు నాగార్జున యాదవ్ కౌంటర్
తాడేపల్లి: నేపాల్‌లో దొరికిన ఎర్ర చందనం వెనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హస్తం ఉన్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆరోణలపై స్ట్రాంగ్ కౌంటరిచ్చారు వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్.‘నేపాల్‌లో దొరికిన ఎర్ర చందనం వెనుక పెద్దిరెడ్డి హస్తం ఉన్నట్లు దుష్ర్పచారం చేస్తున్నారు. పెద్దిరెడ్డి కుటుంబంపై పవన్ ఆరోపణలు సరికాదు. చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిల హయాంలోనే ఎర్రచందనం అక్రమ రవాణా జరిగింది. పదేళ్ల క్రితమే ఎర్రచందనం దొరికింది. నేపాల్, మలేషియాతో పాటు ఇతర దేశాల్లో దాదాపు 8 వేల టన్నుల ఎర్ర చందనం దొరికింది. వాటిని ఏపీకి తెప్పించేందుకు జగన్ సర్కారు ఎన్నోసార్లు కేంద్రానికి లేఖలు రాసింది.కావాలంటే పవన్ ఆ శాఖలోనే ఉన్న లెటర్లను చదువుకోవాలి. పవన్‌కి కేంద్రంలో పలుకుబడి ఉందని చెప్పుకుంటున్నారు కదా?. మరి ఆయా దేశాల్లో ఉన్న ఎర్రచందనాన్ని ఏపీకి తెప్పించాలి. దాన్ని వేలం వేస్తే వచ్చే డబ్బు రాష్ట్రానికి ఉపయోగపడుతుంది’ అని ధీటుగా బదులిచ్చారు నాగార్జున యాదవ్,. -
ఎంపీ మిథున్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డిలపై ఆంక్షలు
సాక్షి, తిరుపతి టాస్క్‌ఫోర్స్: రాజంపేట పార్లమెంట్ పరిధిలోని పుంగనూరు ఎమ్మెల్యేగా గెలిచిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిని ఆ నియోజకవర్గంలో పర్యటించకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. శాంతి భద్రతల పేరుతో వారి పర్యటనలకు అడ్డు చెబుతున్నారు. కార్యకర్తల సమావేశంలో పాల్గొనడంతో పాటు కూటమి నేతల దాడుల్లో నష్టపోయిన వారిని పరామర్శించి, భరోసా కల్పించాలని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి నిర్ణయించారు.ఆదివారం పార్లమెంట్ సమావేశాలు ఉండవు కాబట్టి ఢిల్లీ నుంచి తిరుపతి చేరుకున్నారు. ఇక్కడి నుంచి పుంగనూరుకు వెళ్లే సమయంలో పోలీసులు ఆదివారం ఆయన నివాసానికి చేరుకుని అక్కడికి వెళ్లడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. ఎంపీకి నోటీసులు ఇచ్చేందుకు గోడలు దూకి హడావుడి చేశారు. తిరుపతిలోని వకుళామాత ఆలయానికి కూడా వెళ్లడానికి వీలు లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు.పర్యటిస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని సాకు చెప్పారు. అంతటితో ఆగని పోలీసులు.. ఎమ్మెల్యే పెద్దిరెడ్డిని కలిసేందుకు వచ్చిన నియోజకవర్గ ప్రజలను సైతం లోనికి రానివ్వకుండా అడ్డుకున్నారు. వంద మీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేసి, పెద్దిరెడ్డి నివాసంలోకి ఎవరూ వెళ్లేందుకు లేకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రజలను కలిసేందుకు కూడా ఒప్పుకోలేదు. ఇదే సమయంలో పుంగనూరు నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో పలువురు వైఎస్సార్సీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. తమ ఆదేశాలను పాటించకపోతే కేసులు పెడతామని బెదిరించారు. నా నియోజకవర్గానికి నేను వెళ్లకూడదా?ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై కూటమి నేతలు భౌతిక దాడులకు పాల్పడుతున్నారని, గతంలో ఎన్నడూ లేని సంస్కృతికి తెరలేపారని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి మండిపడ్డారు. తిరుపతిలోని తన నివాసంలో ఆదివారం ఉదయం ఆయన విలేకరుల సమావేశంలో కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందన్నారు. నియోజకవర్గంలో ఎలక్ట్రికల్ బస్సు కంపెనీ రాకుండా, పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.ఇన్ని గొడవల నేపథ్యంలో ఎలక్ట్రిక్ బస్సుల ఫ్యాక్టరీ యాజమాన్యం సందిగ్ధంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో పుంగనూరుకు ఏ పరిశ్రమలు రాకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తన నియోజక వర్గంలో పర్యటించకుండా, ప్రజల్ని కలవకుండా అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పేదల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. జేసీబీలు తీసుకొచ్చి వైఎస్సార్సీపీ నాయకుల మామిడి తోటలు, ఆస్తులు, కుటుంబ సభ్యుల వాహనాలను ధ్వంసం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.నియోజకవర్గంలో పేదల ఆవులు కూడా ఎత్తుకెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఎన్నికల సమయంలో రాజకీయంగా పోరాడితే అందరం స్వాగతిస్తాం. కానీ పేదల ఇళ్లపై దాడులు చేయడం దారుణం. మా వారిని పరామర్శించడానికి వెళుతుంటే పోలీసులు అడ్డుకోవడం ఏమిటి? నా నియోజకవర్గంలో నేను పర్యటించకూడదా? ఈ విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్తా. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. వైఎస్సార్సీపీకి 40 శాతం మంది ఓటేశారని, వారందరినీ రాష్ట్రం నుంచి తరిమేస్తారా?’ అని నిప్పులు చెరిగారు. అరెస్టుకైనా, ప్రాణ త్యాగానికైనా సిద్ధం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉంటామని ఎంపీ మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ మారాలని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తాను బీజేపీలోకి వెళ్తున్నానని బుద్ధి లేని వారు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చల్లా బాబును అనేక సంవత్సరాల నుంచి చూస్తున్నప్పటికీ, ఇలాంటివి ఎప్పుడూ లేవని, బాబు ట్రాప్‌లో పడొద్దని హితవు పలికారు. గతంలో పోలీసులపై దాడి చేసిన చల్లా బాబు జైలుకు వెళ్లారన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రజల కోసం తాను అరెస్టుకైనా, ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. మంత్రి పదవిని కాపాడుకోవడానికే రాంప్రసాద్ తమపై విమర్శలు చేస్తున్నారని చెప్పారు.పుంగనూరులో ఉద్రిక్తత పుంగనూరు: ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే, ఎంపీలు తమ సొంత నియోజకవర్గాలలో తిరగరాదని హెచ్చరికలు చేస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు రోడ్లపై ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్న ఘటనలు ప్రజలను విస్మయానికి గురిచేస్తున్నాయి. ఆదివారం రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి పుంగనూరులో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న కూటమి నేతలు పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్లో ధర్నా చేపట్టి, నల్లజెండాలతో నిరసనకు దిగారు.ఎమ్మెల్యే, ఎంపీలు రాకూడదంటూ దూషణల పర్వం కొనసాగించారు. సుమారు రెండు గంటల సేపు హైడ్రామా సాగింది. ఈ నెల15న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి పుంగనూరు పర్యటన సమయంలో కూడా కూటమి నేతలు ఇలాగే అడ్డుకున్నారు. కూటమి నేతల తీరుతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పోలీసులు ఎంపీ మిథున్‌రెడ్డిని తిరుపతిలో హౌస్ అరెస్ట్ చేశామని తెలపడంతో కూటమి శ్రేణులు శాంతించారు. -
ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రమాణస్వీకారం
-
ఒక్క ఒక్కడు
జిల్లా రాజకీయాలను శాసిస్తూ పెద్దాయనగా పేరొందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పటివరకు ఆయన మొత్తం ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ కంచుకోటగా పేరొందిన పుంగనూరు నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు విజేతగా నిలిచారు. అంతకుముందు రెండు సార్లు పీలేరు నుంచి గెలుపొందారు. తండ్రీ తనయులైన వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గాల్లో పలు శాఖలకు ప్రాతినిధ్యం వహించారు. ఈ సారి టీడీపీ సునామీలోనూ తట్టుకుని జిల్లాలో విజయం సాధించిన ఏకైక ఎమ్మెల్యేగా పేరుపొందారు.చిత్తూరు కలెక్టరేట్ : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ నెల 4వ తేదీన ఉత్కంఠగా సాగింది. మొదటి రౌండ్ నుంచి 19వ రౌండ్ వరకు గెలుపు ఎవరికీ తేలని పరిస్థితి నెలకొంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మెజారిటీ పెరుగుతూ వచ్చేసరికి చివరి రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపు గంటకు పైగా ఆపేశారు. ఓటమి ఖాయం అనుకున్న కూటమి అభ్యర్థి ఆర్ఓకు ఆధారం లేని ఫిర్యాదులు చేశారు. ఎలాగైనా రీ కౌంటింగ్ చేయించాలని పట్టుబట్టారు. అయితే సరైన ఆధారాలు లేకపోవడంతో రీ కౌంటింగ్ చేయడం కుదరదని అధికారులు తేలి్చచెప్పేశారు. దీంతో పుంగనూరు నియోజకవర్గం ఓట్ల లెక్కింపు ముగించి విజేతను ప్రకటించారు. సంజీవరెడ్డి పరిచయమే 1977లో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలను గమనించిన రామచంద్రారెడ్డి ఒక సారి నీలం సంజీవరెడ్డిని కలుసుకున్నారు. ఆయన ప్రోత్సాహంతో 1978లో జనతా పార్టీ పీలేరు అభ్యరి్థగా పోటీ చేసి ఓటమిని చవిచూశారు. ఆ తరువాత కాంగ్రెస్ పారీ్టలో చేరిన పెద్దిరెడ్డి 1989లో మొదటి సారిగా పీలేరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 24,636 ఓట్ల మెజారిటీతో చల్లా రామచంద్రారెడ్డిపై విజయం సాధించారు. 1994లో పీలేరు అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందారు. మళ్లీ 1999, 2004 ఎన్నికల్లో పీలేరు ఎమ్మెల్యేగా వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు. ఆ తరువాత 2009, 2014, 2019లో పుంగనూరు ఎమ్మెల్యేగా వరుస విజయాలతో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. తాజా ఎన్నికల్లో 6095 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పెద్దాయనకు మంచిపేరే.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బలమైన నాయకుడిగా ఎదిగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక, ప్రజలతో మమేకం అవుతూ రాష్ట్రంలోనూ, ముఖ్యంగా రాయలసీమలో తిరుగులేని నాయకుడిగా పేరుతెచ్చుకున్నారు. ఎస్వీ యూనివర్సిటీ రాజకీయాల్లో చంద్రబాబుకు సమఉజ్జీగా నిలిచారు. నాటి నుంచి నేటి వరకు చంద్రబాబుతో తలపడుతూనే వస్తున్నారు. పల్లెలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే పెద్దాయన తలుపు తడితే చాలు కష్టం తీరిపోతుందని నమ్మేంతగా ప్రజాదరణను చూరగొన్నారు. అందుకే కూటమి నేతలంతా గెలుపొందినా పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బలం ముందు చంద్రబాబు ఎత్తులు, పైఎత్తులు చిత్తయ్యాయి.పుంగనూరు నుంచి నాలుగోసారి రాజకీయాల్లో డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక స్థానం ఉంది. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకున్న పెద్దాయన వరుసగా నాలుగో సారి పుంగనూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పుంగనూరు రికార్డును బద్దలు కొట్టారు. రైతు కుటుంబం నుంచి రాజకీయ చదరంగంలో ఆయన రారాజుగా ఎదిగారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న పుంగనూరుకు 2004లో నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున, 2014, 2019, 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున బరిలో దిగి ఎమ్మెల్యేగా వరుసగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. 2009 ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి కేబినెట్లో మంత్రిగా, 2019లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు.పెద్దిరెడ్డికి 1,00,793 ఓట్లు ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 8 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నియోజకవర్గం మొత్తం 2,09,674 ఓట్లు పోల్ అవ్వగా ఈవీఎంలో 2,06,911 ఓట్లు, పోస్టల్ బ్యాలెట్లో 2,763 ఓట్లు ఎన్నికల్లో పోలయ్యాయి. ఇందులోనే నోటాకు 2,904 మంది ఓట్లు వేశారు. ఆఖరి రౌండ్ ముగిసే సరికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 1,00,793 ఓట్లు, ప్రత్యరి్థకి 94,698 ఓట్లు నమోదయ్యాయి. దీంతో 6,095 మెజారిటీ రావడంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లు ఆర్ఓ ప్రకటించారు. ఆ నియోజకవర్గంలో పోటీ చేసిన ప్రత్యర్థి పార్టీకి చెందిన చల్లా రామచంద్రారెడ్డికి 94,698, భారత చైతన్య యువజన పారీ్టకి చెందిన బోడె రామచంద్ర యాదవ్‌కు 4559, కాంగ్రెస్‌కు చెందిన మురళిమోహన్ యాదవ్‌కు 3571, బహుజన్ సమాజ్ పారీ్టకి చెందిన సురే‹Ùకు 687, సోషల్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అన్వర్ బాషా కు 1906, ఇండెపెండెంట్లుగా పోటీ చేసిన నాగేశ్వరరావుకు 242, రామయ్యకు 314 ఓట్లు నమోదయ్యాయి. -
కూటమి హవాను తట్టుకుని...
పుంగనూరు/పాడేరు/పార్వతీపురం టౌన్: చిత్తూరు జిల్లా పుంగనూరు ఎమ్మెల్యేగా వైఎస్సార్సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలుపొందారు. పెద్దిరెడ్డికి 99,774 ఓట్లు రాగా.. 6,619 ఓట్ల మెజార్టీ లభించింది. టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డికి 93,155 ఓట్లు లభించాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో వైఎస్సార్సీపీ అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజు 19,338 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆయనకు 68,170 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరికి 48,832 ఓట్లు వచ్చాయి.అరకు అసెంబ్లీ వైఎస్సార్సీపీ అభ్యర్థి రేగం మత్స్యలింగం బీజేపీ అభ్యర్థి పాంగి రాజారావుపై 31,877 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మత్స్యలింగంకు 65,658 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి పాంగి రాజారావుకు 33,781 ఓట్లు వచ్చాయి. వైఎస్సార్ జిల్లా బద్వేలులో వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ సుధ బీజేపీ అభ్యర్థి బొజ్జా రోశన్నపై 18,567 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రాజంపేట నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆకేపాటి అమరనాథరెడ్డి టీడీపీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యంపై 7,016 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.నాలుగోసారి బాలనాగిరెడ్డి విజయబావుటా కర్నూలు జిల్లా మంత్రాలయంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి యల్లారెడ్డి గారి బాలనాగిరెడ్డి నాలుగోసారి విజయబావుటా ఎగురవేశారు. బాలనాగిరెడ్డి 87,662 ఓట్లు, టీడీపీ అభ్యర్థి ఎన్.రాఘవేంద్రరెడ్డి 74,857 ఓట్లు దక్కించుకున్నారు. బాలనాగిరెడ్డికి 12,805 ఓట్ల మెజార్టీ లభించింది. ఆలూరు నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి బూసినె విరుపాక్షి విజయం సాధించారు.టీడీపీ అభ్యర్థి వీరభద్రగౌడ్‌పై 2,831 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే, రీకౌంటింగ్ చేయాలని టీడీపీ ఏజెంట్లు పట్టుబట్టారు. ప్రతీ రౌండ్లోనూ ఏజెంట్లు సంతకాలు చేశాకే.. ఆ తర్వాతి రౌండు లెక్కించారు. దీంతో ఎన్నికల అధికారి సృజన రీకౌంటింగ్‌ను తిరస్కరించారు. తంబళ్లపల్లెలో వైఎస్సార్సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి టీడీపీ నుంచి అభ్యర్థి జయచంద్రారెడ్డిపై 10,103 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. -
జూన్ 4 తరువాత చూసుకుందాం: పెద్దిరెడ్డి
-
చంద్రబాబుకు ఘోర ఓటమి తప్పదు: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, చిత్తూరు జిల్లా: రాష్ట్రంలో సైలెంట్ వేవ్ ఉందని.. 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు గెలుస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కుప్పంలో వైఎస్సార్సీపీ గెలవబోతుందన్నారు. కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచామని.. వరుస ఓటముల తర్వాత తనపై చంద్రబాబు కక్ష పెట్టుకున్నారన్న పెద్దిరెడ్డి.. తానను టార్గెట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.అవినీతి సామ్రాట్ చంద్రబాబు. నారావారిపల్లెలో రెండు ఎకరాల భూమి బాబుకు ఉంది. ఇప్పుడు లక్షల కోట్లు సంపాదించారు. ఈ డబ్బు ఎలా వచ్చింది?. ఇది అవినీతి కాదా? అని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. సీఎం జగన్, నాపై తరచూ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబులాగా మేము అవినీతి పరులం కాదు. పుంగనూరు, అంగళ్లు ఘటనలకు సూత్రధారి చంద్రబాబు. ఆయన ప్రభుత్వంలోని టీడీపీనేతలు రెచ్చిపోయి దాడులు చేశారు. పోలీసులను తీవ్రంగా కొట్టారు.’’ అని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు.‘‘టీడీపీ నేతలు గూండాల్లా వ్యవహరించారు. దాడులు చేయించింది చంద్రబాబు నిందలు మాపై పంపారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ఘోర ఓటమి తప్పదు’’ అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. -
కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి
-
30 వేల కోట్ల ఆరోపణలపై పెద్దిరెడ్డి క్లారిటీ..!
-
జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు
-
ఆ మారణహోమం చల్లా వ్యూహం
ప్రజల ధన..మాన..ప్రాణాలంటే పచ్చమూకలకు లెక్కలేదు. శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పనిచేసే పోలీసులంటే గౌరవం లేదు. ప్రశాంత పుంగనూరును వల్లకాడుగా మార్చేయాలి. ప్రభుత్వంపై బురదజల్లాలి. ఇదే లక్ష్యంతో గత ఏడాది ఆగస్టు 2వ తేదీన అప్పటి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి.. ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి కుట్రకు తెగబడ్డారు. చంద్రబాబు పర్యటనలో అల్లర్లు సృష్టించేందుకు పథకం రచించారు. పోలీసుల ఉసురు తీయడమే లక్ష్యంగా దాడులకు ప్లాన్ వేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై నింద మోపేందుకు దారుణ మారణహోమానికి తెరతీశారు. అప్పటి ఘటనపై విచారణ చేపట్టిన పోలీసు అధికారులే లోగుట్టు తెలుసుకుని దిగ్భ్రాంతి చెందారు.పుంగనూరు: జిల్లాలోని పుంగనూరులో గత ఏడాది ఆగస్టు 4వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలో మారణహోమం సృష్టించేందుకు ఆ పార్టీ నేతలు ప్రణాళికలు రూపొందించారు. కనీసం ఇద్దరు పోలీసులనైనా చంపాలని దుర్మార్గపు ఆలోచన చేశారు. బాబు పర్యటనకు రెండు రోజుల ముందే ఈ ప్లాన్ రూపొందించారు. పోలీసులపై దాడులకు తెగబడి అల్లర్లు సృష్టించిన ఘటనలో అప్పటి టీడీపీ పుంగనూరు ఇన్చార్జి చల్లా బాబు అలియాస్ చల్లా రామచంద్రారెడ్డి గత ఏడాది ఆగస్టు 2వ తేదీన రొంపిచెర్లలో పార్టీ ప్రధాన వ్యక్తులతో రూపొందించిన పథకాన్ని ఆయన వ్యక్తిగత కార్యదర్శి గోవర్దన్‌రెడ్డి పూసగుచ్చినట్లు పోలీసులకు చెప్పాడు. ఇది విన్న పోలీసులు కేవలం ఉనికిని కాపాడుకునేందుకు ఇలాంటి క్షుద్ర రాజకీయాలకు పాల్పడతారా అని షాక్‌కు గురయ్యారు.ప్లాన్– బీ.. ప్టాన్– ఏ అమలుకాని పక్షంలో ప్లాన్–బీకి సైతం పచ్చ పార్టీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. పోలీసులు చనిపోకపోయినా, ఫైర్ ఓపెన్ చేయకపోయినా ఆందోళన చేస్తున్న టీడీపీ శ్రేణులు మొత్తం ఒక్కసారిగా పుంగనూరు పట్టణంలోకి చొరబడాలి. ఎక్కడికక్కడ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫెక్సీలు చింపడం, పెట్రోలు పోసి నిప్పంటించడం చేయాలి. దీనిపై వెంటనే వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రతిస్పందిస్తాయి. ఈ క్రమంలో చెలరేగే అల్లర్లలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఒకరిద్దరిని మట్టుబెడితే.. వాళ్ల చేసే దాడుల్లో టీడీపీ కార్యకర్తలు సైతం చనిపోతారు. ఇది జరిగినా కూడా నెపం ప్రభుత్వంపై నెట్టేసి, శవ రాజకీయంతో సర్కారును పడగొట్టవచ్చని రెండో ప్లాన్‌ను సిద్ధం చేసుకున్నారు. రాష్ట్రం మొత్తం ఈ ఘటనలతో హోరెత్తిపోతుందని, అదే కారణంగా శాంతి భద్రతల వైఫల్యాన్ని ఎండగట్టాలని అనుకున్నారు. అయితే ఈ రెండు ప్లాన్ల గురించి టీడీపీలోని ప్రధాన వ్యక్తులకు తప్ప, పార్టీ కార్యకర్తల్లో ఒక్కరికి కూడా తెలియడానికి వీల్లేదంటూ కట్టడి చేశారు. ఎక్కడా కూడా ఈ ప్లాన్ల గురించి ఎవరూ మాట్లాడకుండా అత్యంత గోప్యత పాటించారు. ఈ అల్లర్లకు పుంగనూరు నుంచి కాకుండా మదనపల్లె, ములకలచెరువు, సదుం, సోమల మండలాల నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలను రంగంలోకి దించాలని ఆదేశించారు. ప్లాన్– ఏ.. పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జనాదరణ పెరిగిపోతుండడంతో చల్లా బాబు రగిలిపోయారు. ఇదే పుంగనూరులో పెద్దిరెడ్డిని జీరో చేయాలని, అదే సమయంలో రాష్ట్రం మొత్తం పుంగనూరువైపు చూసేలా మారణహోమం సృష్టించాలని సంకల్పించుకున్నారు. చంద్రబాబు నాయుడు పర్యటన ర్యూట్ మ్యాప్‌లో పుంగనూరును చేర్చేందుకు పార్టీ శ్రేణులు పట్టుపట్టాలని నిర్ణయించారు. పోలీసులు దీనికి కచ్చితంగా అంగీకరించరని, ఇదే అదనుగా దాడులకు పాల్పడాలని నేతలు, కార్యకర్తలకు చల్లా బాబు దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగా అప్పటికే కృష్ణదేవరాయ కూడలి వద్ద సిద్ధం చేసుకున్న రాళ్లు, మద్యం బాటిళ్లు, బీరు సీసాలు, బాంబులను పోలీసులను లక్ష్యంగా చేసుకుని విసరాలి. మొత్తం 30 నిముషాల పాటు ఈ రాళ్ల దాడి చేయడానికి వస్తువులను ఉంచారు. తొలి మూడు నిముషాల్లో చెప్పులు, వాటర్ బాటిళ్లు విసిరితే పోలీసులు తేలిగ్గా తీసుకుంటారు. అనంతరం పోలీసుల ఊహకు అందకుండా రాళ్లు, బాంబులు, మద్యం బాటిళ్లతో పది నిముషాలు దాడులు చేయాలని, ఇందులో ఒకరిద్దరు పోలీసులు చనిపోయినా పర్లేదని ఆదేశించారు. ఇదే కనుక జరిగితే వెంటనే పోలీసులు కాల్పులు ఓపెన్ చేస్తారు. ఈ కాల్పుల్లో ఎటులేదన్నా 30 మంది వరకు టీడీపీ కార్యకర్తలు మరణిస్తారు. దీంతో దేశం మొత్తం పుంగనూరు వైపు చూస్తుందని, దీంతో ప్రభుత్వాన్ని కూల్చేసి, సానుభూతి పేరిట చంద్రబాబు నాయుడును సీఎం కుర్చీ ఎక్కించవచ్చనే భారీ పన్నాగం పన్నారు.ఇలాంటి వ్యక్తికి టికెట్టా? స్వార్థ రాజకీయాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాటే చల్లా రామచంద్రారెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంపై పుంగనూరు వాసులు మండిపడుతున్నారు. ఇలాంటి ఆలోచనా విధానమున్న వ్యక్తిని రాజకీయాల్లో ప్రోత్సహించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ ప్లాన్ ఇలా.. టీడీపీ నేతలు రూపొందించిన మారణహోమం ఉచ్చులో పోలీసులు చిక్కుకునే ఘటన దాదాపు అమలైపోతుందని ఆ పార్టీ నేతలు భావించారు. దీనికి తోడు అల్లర్ల సమయంలో అక్కడ బందోబస్తులో ఉన్న ఓ పోలీసు అధికారి వెంటనే అప్పటి ఎస్పీ రిషాంత్‌రెడ్డికి ఫోన్ చేశారు. పోలీసులు రక్తమోడుతుండడం చూసిన ఆ అధికారి చలించిపోయి. గద్గద స్వరంలో ఎస్పీతో మాట్లాడుతూ.. ‘సర్, పరిస్థితి చేయి దాటిపోతోంది. డీఎస్పీల తలలు పగిలిపోతున్నాయి. సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు ఇక్కడ ఆర్తనాదాలు చేస్తున్నారు. మనం ఫైర్ ఓపెన్ చేయాలి. వెంటనే మీరు కలెక్టర్‌తో మాట్లాడి ఫైరింగ్‌కు ఆర్డర్ ఇవ్వండి ప్లీజ్. లేకుంటే మనవాళ్లు చనిపోతారు..’ అంటూ బతిమిలాడారు. అక్కడ ఏం జరుగుతోందని ఎస్పీ ఆరా తీశారు. సంయమనంతో ఆలోచించి పోలీసులు 300 మీటర్లు వెనక్కు వచ్చేయాలని ఆదేశించారు. దీంతో టీడీపీ శ్రేణులు రాళ్లు, మద్యం బాటిళ్లు నిల్వ ఉన్న ప్రాంతం నుంచి దూరమవుతారని చెప్పారు. ఇదే జరిగితే పోలీసులకు దగ్గరగా వచ్చిన టీడీపీ శ్రేణులను చెదరగొట్టడానికి స్వల్ప లాఠీచార్జ్, బాష్ప వాయు ప్రయోగించాలని సూచించారు. తాను కూడా వెంటనే పుంగనూరు వచ్చేస్తానని, అప్పటి వరకు ఒక్క బుల్లెట్ కూడా తుపాకీ నుంచి బయటకు రావడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఎస్పీ ఆదేశాలను అమలు చేసిన పోలీసులు, అనుకున్నట్టుగానే రక్తం కారుతున్నా, అల్లరి మూకల్ని దగ్గరకు రప్పించి లాఠీలతో చెదరగొట్టారు. దీంతో టీడీపీ నేతల కుతంత్రాలు, కుట్రలు పటా పంచలైపోయాయి. ‘చల్లా’ చరిత్ర నేరమయమే! టీడీపీ పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి అలియాస్ చల్లా బాబు చరిత్రంతా నేరమయమే. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఇతనిపై దాడులు, హత్యయత్నాలు చీటింగ్ తదితర నేరాలపై పోలీసులు 19 కేసులు నమోదు చేశారు. ఇందులో గత ఏడాది ఆగస్టు 4న పుంగనూరులో జరిగిన అల్లర్ల కేసులో ప్రధాన నిందితుడుగా 7 కేసులు నమోదయ్యాయి. అలాగే సోమల, కల్లూరు, రొంపిచెర్ల, చౌడేపల్లె, ములకలచెరువు, ముదివేడు పోలీస్స్టేషన్లతో పాటు తెలంగాణలోని కూకటిపల్లె పోలీస్‌స్టేషన్‌లో కేసులు ఉన్నట్లు చల్లారామచంద్రారెడ్డి స్వయంగా తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు.– చల్లా రామచంద్రారెడ్డి, టీడీడీ ఎమ్మెల్యే అభ్యరి్థ, పుంగనూరు -
రాయలసీమలో 52 స్థానాల్లో YSRCP గెలుపు తథ్యం: మంత్రి పెద్దిరెడ్డి
-
కిరణ్ కుమార్ ను తలెత్తుకోలేకుండా చేసారు
-
పుంగనూరులో చంద్రబాబుకు కోలుకోలేని దెబ్బ
-
బాబు 6 గ్యారంటీల పై పెద్దిరెడ్డి సెటైర్లు
-
చంద్రబాబుకు పెద్దిరెడ్డి దిమ్మ తిరిగే ప్రశ్న
-
‘చంద్రబాబూ.. రాళ్లు వేయించుకుంటే ఓట్లు పడవు’
తిరుపతి, సాక్షి: సీఎం జగన్‌పై దాడి కేసులో చంద్రబాబు, లోకేష్ నీచంగా మాట్లాడుతున్నారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. జనాల్లో సీఎం జగన్‌పై సింపథీ ఎక్కడ పెరిగిపోతుందో అనే ఆందోళన టీడీపీలో మొదలైందని.. కానీ, సింపథీతో జనాలు ఓట్లేయరని విషయం అనుభవపూర్వకంగా చంద్రబాబుకు తెలుసంటూ చురకలంటించారాయన. తిరుపతిలో సోమవారం ఉదయం మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు తన మీద రాళ్లు వేయించుకుని సింపథీతో గెలుద్దామని అనుకుంటున్నారు. కానీ, సింపథీతో ఓట్లు రావనే విషయం ఆయనకు తెలుసు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో రాళ్ళ దాడి అంటూ చంద్రబాబు డ్రామా చేశారు. చంద్రబాబు పై గతంలో అలిపిరి బాంబు దాడి జరిగి ముందస్తు ఎన్నికలకు వెళ్తే ప్రజలు చిత్తుగా ఓడించారు. ఆ గతాన్ని బాబు గుర్తు తెచ్చుకోవాలి. ఇదీ చదవండి: మాటు వేసి.. మట్టుబెట్టే కుట్ర ..రాళ్ల దాడిలో సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే వెల్లంపల్లి కంటికి గాయం అయ్యింది. కానీ, చంద్రబాబుకు ఇవేం కనిపించడం లేదా?. అయినా కూడా నాపై రాళ్ళ దాడి జరిగింది అంటూ చంద్రబాబు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అసలు చంద్రబాబు వయసుకు తగినట్లు మాట్లాడటం లేదు. రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాలి. కానీ, చంద్రబాబు హత్య రాజకీయాలు చేస్తున్నారు. సీఎం జగన్‌ను రాళ్లతో కొట్టండి అంటూ చంద్రబాబే పిలుపు ఇచ్చారు. చంద్రబాబు దగ్గర మంచి పేరు కోసం టీడీపీ వాళ్లే సీఎం జగన్‌పైకి రాళ్లు విసిరాయి. చంద్రబాబు చేస్తున్న ఈ నీచ రాజకీయాల్ని ఏపీ ప్రజలంతా గమనిస్తున్నారు. .. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సంక్షేమం అందిస్తూ అండగా ఉంటే.. ప్రజలు నేతలపై నమ్మకం ఉంచుతారు. అందుకే సీఎం జగన్ మోహన్ రెడ్డి పై జరిగిన దాడి ఘటనను ఇప్పుడు ప్రజలంతా ఖండిస్తున్నారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిపై దాడి జరిగితే కనీసం పరామర్శకు రావాల్సింది పోయి చంద్రబాబు ఇప్పుడు నీచ రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్దంగా ఉన్నారు’’ అని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. -
ఇది టీడీపీ దాడే.. లోకేష్ వ్యాఖ్యలే సాక్ష్యం: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, తిరుపతి: రాష్ట్రంలో ప్రజాదరణను చూసి ఓర్వలేక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడి చేశారని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నారా లోకేష్ వ్యాఖ్యలను గమినిస్తే దాడి వెనుక టీడీపీ కుట్ర ఉందని తెలుస్తోంది అంటూ విమర్శలు చేశారు. కాగా, మంత్రి పెద్దిరెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. సిద్ధం సభలు, బస్సు యాత్రలో వస్తున్న ప్రజాదరణ చూసి ప్రతిపక్షాలకు మింగుడు పడటం లేదు. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్, పురంధేశ్వరి అందరూ నైరాశ్యంలో ఉన్నారు. సీఎం జగన్‌కు ఉన్న ఆదరణను చూసి ఓర్వలేకపోతున్నారు. ట్విట్టర్లో నారా లోకేష్ 2019 కోడి కత్తి, 2024లో రాయితో దాడి అని పోస్టు పెట్టారు. ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే దాడి వెనుక టీడీపీ కుట్ర ఉందని స్పష్టమవుతోంది. ఎవరైనా రాయితో దూరం నుంచి ప్లాన్ చేసి కొట్టించుకుంటారా?. అదే రాయిని లోకేష్‌కు ఇస్తాం. అదే ప్రాంతంలో బస్సు ఎక్కి ఎవరితో అయినా కొట్టించాలి. అప్పుడు కరెక్ట్‌గా ప్లాన్ చేసి రాయితో కొట్టించుకోవడం సాధ్యమవుతుందో లేదో తెలుస్తుంది. ఇలాంటి నీచ వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. గతంలో పాదయాత్రకు గుంటూరు దాటితే ఆదరణ కరువవుతోంది అన్నారు. కృష్ణా జిల్లా ఇంచార్జీగా ఆ ప్రాంతంలో పాదయాత్ర విజయవంతం చేశాం. మళ్ళీ నేడు బస్సు యాత్రకు అదే స్థాయిలో స్పందన రావడంతో ఈ కుట్రకు తెర లేపారు’ అని విమర్శలు చేశారు. -
చంద్రబాబుకు పెద్దిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
-
మీ బెదిరింపులకు భయపడం..పెద్దిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
-
ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తారంట..!
-
కిరణ్‌కుమార్‌ను చిత్తుగా ఓడిస్తాం: మంత్రి పెద్దిరెడ్డి
-
నల్లారి కిరణ్‌పై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్
సాక్షి, అనంతపురం: చంద్రబాబుకి రాయలసీమలో ఓటు అడిగే హక్కు లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. రాయలసీమలో ఒక్క ప్రాజెక్టు అయినా చంద్రబాబు కట్టడా? అంటూ ప్రశ్నించిన పెద్దిరెడ్డి.. సీఎం జగన్ రాయలసీమలో ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారని తెలిపారు. ‘‘చంద్రబాబుని కుప్పంలో కూడా ఒడిస్తాం. కుప్పానికి కూడా నీళ్లు ఇచ్చింది సీఎం జగన్. సొంత జిల్లాకి కూడా మేలు చేయని వ్యక్తి చంద్రబాబు. అమిత్ షా కాళ్లు పట్టుకుని బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడు. రోజుల తరబడి ఢిల్లీలో పడిగాపులు కాసి పొత్తు పెట్టుకున్నాడు. ఇప్పుడు బీజేపీనే పొత్తు అడిగిందని అబద్దాలు చెప్తున్నాడు’’ అంటూ పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. ‘‘కిరణ్‌కుమార్ రెడ్డికి నా గురించి మాట్లాడే అర్హత లేదు. ఆఫీస్ పెట్టి లంచాలు వసూలు చేసిన చరిత్ర కిరణ్ కుమార్‌రెడ్డిది. ఎన్నికలు అవ్వగానే కిరణ్ కుమార్‌రెడ్డి సూట్ కేసు సర్దుకుని హైదరాబాద్ వెళ్లిపోతాడు. సీఎం పదవి కోసం రాష్ట్రాన్ని విడగొట్టిన ద్రోహి కిరణ్ కుమార్ రెడ్డి. సీఎం జగన్‌ని అణగదొక్కడానికి సోనియాగాంధీతో కుమ్మక్కయ్యాడు. ఇప్పుడు మేము ఓడించి బుద్ధి చెప్తాము’’ అని పెద్దిరెడ్డి అన్నారు. ‘‘సీఎం జగన్ బస్సు యాత్రకు అనూహ్యమైన స్పందన వస్తోంది. నా రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడని జనం బస్సు యాత్రలో కనిపిస్తున్నారు. 175 సీట్లు గెలుస్తామన్న నమ్మకం బస్సు యాత్రతో కలిగింది’’ అని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. -
ఈ బస్సు యాత్రతో సీఎం జగన్ చరిత్ర సృష్టిస్తారు
-
వాలంటీర్ల పై బొజ్జల సుధీర్ కామెంట్స్ కు పెద్దిరెడ్డి కౌంటర్
-
చంద్రబాబు మేనిఫెస్టోపై పెద్ది రెడ్డి షాకింగ్ కామెంట్స్
-
సీఎం జగన్ బస్సు యాత్ర షెడ్యూల్..
-
రాష్ట్రంలో మళ్లీ విజయం వైఎస్ఆర్ సీపీదే: మంత్రి పెద్దిరెడ్డి
-
తిరుపతి జిల్లా సత్యవేడులో మంత్రి పెద్దిరెడ్డి పర్యటన
-
సీఎం జగన్ బస్సు యాత్ర ఏర్పాట్లపై మంత్రి పెద్ది రెడ్డి
-
మేమంతా సిద్ధం
-
చంద్రబాబు పొత్తులు, పెద్దిరెడ్డి పంచులు
-
సీఎం జగన్ బస్సు యాత్రపై మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ
-
భారీ మెజారిటీతో మళ్లీ గెలుదాం
-
బాబు రాజకీయ వికలాంగుడు
వాకాడు (తిరుపతి జిల్లా) : అబద్ధాల చంద్రబాబు చేతిలో ఎన్నోసార్లు మోసపోయిన ప్రజలు.. అమలుకు సాధ్యం కాని సూపర్ సిక్స్ హామీలిస్తున్న ఆయనను నమ్మే పరిస్థితి లేదని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం వాకాడులో వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశంలో మంత్రి ప్రసంగించారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నూటికి నూరు శాతం అమలు చేసి మళ్లీ ధైర్యంగా ఎన్నికలకు వస్తున్నారన్నారు. చంద్రబాబు రాజకీయ వికలాంగుడని, ఊతకర్రలుగా బీజేపీ, జనసేన పార్టీలను పట్టుకుని ఎన్నికలకు సిద్ధమవుతున్నాడని తెలిపారు. రాజకీయాల్లో నిబద్ధత లేకుండా సొంత మామకే వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు. 2014 ఎన్నికల్లో రైతు రుణమాఫీ, బంగారు రుణాల తొలగింపు, ఇంటికో ఉద్యోగం, ఇస్తామని నిరుద్యోగులను, రైతులను, మహిళలను మోసం చేశారన్నారు. తిరుపతి జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కలసి కట్టుగా పనిచేసి మరోసారి జగన్మోహన్రెడ్డిని సీఎంగా చేసుకుందామన్నారు. ఎంపీ గురుమూర్తి, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరుగ మురళీధర్, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, గూడూరు, వెంకటగిరి, సూళ్ళూరుపేట, నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. -
చంద్రబాబు మ్యానిఫెస్టోపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్
-
బీజేపీతో బాబుది అనైతిక ఒప్పందమే
పెనుమూరు (కార్వేటినగరం)/కుప్పం: స్వార్థరాజకీయాల కోసం చంద్రబాబు అనైతిక ఒప్పందాలు చేసుకుని ప్రజలను మభ్యపెడుతున్నారని రాష్ట్ర భూగర్భ, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. చంద్రబాబు రాజకీయ వికలాంగుడని, పొత్తులు లేకుండా పోటీకిరాడని చెప్పారు. ఆయన ఆదివారం చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం కుప్పంలోను, అంతకుముందు మండల కేంద్రం పెనుమూరులోను విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు అధికారదాహంతో నరేంద్ర మోదీతో సహా ఎవరి కాళ్లు పట్టుకోవడానికైనా వెనుకాడడని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అన్ని పార్టీలు ఏకమైనా వైఎస్సార్సీపీకి నష్టం లేదని చెప్పారు. మీ పొత్తులు, జిమ్మికులను రాష్ట్ర ప్రజల ముందే ఊహించారన్నారు. పవన్‌కళ్యాణ్ సీఎం కావాలని అతని అభిమానులు, కాపులందరూ కోరుకుంటే పవన్‌కళ్యాణ్ మాత్రం చంద్రబాబు సీఎం కావాలని కోరుకుంటూ బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ ఒక్కడే ఒకవైపు ఉంటే టీడీపీ, జనసేన, బీజేపీతోపాటు అంతర్గతంగా కాంగ్రెస్ కూడా కుమ్మకై జగన్‌ను ఓడించడానికి సిద్ధపడ్డారని తెలిపారు. పొత్తులో భాగంగా పవన్‌కళ్యాణ్ కనీసం 15 శాతం సీట్లు కూడా తీసుకోలేకపోయారని చెప్పారు. గతంలో బాబును తిట్టిన నోటితోనే నేడు చంద్రబాబు నామస్మరణ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పీసీసీ అ«ధ్యక్షురాలు షర్మిల కూడా చంద్రబాబు చదివిన స్క్రిప్టునే చదివి రాష్ట్రానికి సువర్ణపాలన అందిస్తున్న జగనన్నపై దుమ్మెతి పోయడం మంచిది కాదన్నారు. ఇంత మంచిచేసిన ప్రభుత్వాన్ని కొనసాగించాలంటే వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకీ ఓట్లు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం సీఎం జగన్మోహన్రెడ్డి వందలసార్లు బటన్ నొక్కితే 2024 ఎన్నికల్లో లబి్ధదారులు రెండు బటన్లు నొక్కి తమ రుణాన్ని తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలకు ఓట్లు వేస్తే లంచాలు, కులవివక్ష, భూకబ్జాలు, పెత్తందారులను ప్రోత్సాహించినట్లేనని, టీడీపీ అధికారంలోకి వస్తే పేదవాడు పేదవాడిగా మిగిలిపోవాల్సిందేనని చెప్పారు. కుప్పంలో చంద్రబాబును ఓడించే బాధ్యత తమ భుజస్కంధాలపై ఉందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే సుభిక్షంగా ఉండే రాష్ట్రంలో కరువు తాండవిస్తుందని ఆయన పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తరువాత వాటిని అమలు చేయలేదని వివరించారు. తమ బలం, బలగం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే అని ఆయన చెప్పారు. మంత్రి వెంట ఎంపీ రెడ్డెప్ప, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్యే వెంకటేగౌడ, ఎమ్మెల్సీ భరత్, రెస్కో చైర్మన్ సెంథిల్, కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుదీర్ ఉన్నారు. -
14 సంవత్సరాలు సీఎంగా ఉండి చంద్రబాబు పీకిందేమి లేదు.
-
సునీతాపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్
-
షర్మిల, కాంగ్రెస్ వల్ల డి మా పార్టీకి ఉడేది ఏమి లేదు
-
బీజేపీతో టిడిపి పొత్తు పెట్టుకుంటే రాయలసీమలో వైఎస్సార్ సీపీదే విజయం : మంత్రి పెద్దిరెడ్డి
-
షర్మిల, కాంగ్రెస్ వల్ల మా పార్టీకి ఉడేది ఏమి లేదు
-
రఘువీరారెడ్డి పొలిటికల్ బ్రోకర్..పెద్దిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
-
రఘువీరారెడ్డి పొలిటికల్ బ్రోకర్: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, అనంతపురం: రఘువీరారెడ్డి పొలిటికల్ బ్రోకర్ అంటూ మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనపై ఎలాంటి హత్య కేసులు లేవని.. రఘువీరారెడ్డి ఆరోపణలు అర్థరహితమన్నారు. తనపై హత్య కేసులున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ మంత్రి పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. సీఎం వైఎస్ జగన్ రాప్తాడు సిద్ధం సభ చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి అన్నారు. రాయలసీమ జిల్లాలకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాప్తాడు సభలో పాల్గొంటాయి. మధ్యాహ్నం 1 గంటకు రాప్తాడు ‘సిద్ధం’ సభ ఉంటుందని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ఇదీ చదవండి: టీడీపీ ఎన్ని కుట్రలు పన్నినా పట్టాలిచ్చి తీరతాం: బాలినేని -
రాప్తాడు సిద్ధం సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి: మంత్రి పెద్దిరెడ్డి
-
మేము చేసిన అభివృద్ధి గురించే తెలంగాణ అసెంబ్లీలో చర్చించారు
-
అవసరం లేకపోతే రాళ్లు వేస్తాడు..అవసరం అయితే కాళ్ళు పట్టుకుంటాడు
-
చంద్రబాబు జనంలో విశ్వసనీయత కోల్పోయాడు: మంత్రి పెద్దిరెడ్డి
-
చంద్రబాబు జనంలో విశ్వసనీయత కోల్పోయాడు: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, చిత్తూరు: చంద్రబాబు పచ్చి అబద్దాల కోరు.. 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చని ద్రోహి అంటూ దుయ్యబట్టారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇప్పుడు కొత్త కొత్త హామీలతో ప్రజలను మోసం చేయడానికి వస్తున్నాడంటూ మండిపడ్డారు. చంద్రబాబు ఇంటికో ఉద్యోగం అన్నాడని.. ఏమైందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానన్నాడు చేశాడా?. ఇప్పుడు మరోసారి హామీలతో వస్తున్నాడు. అమిత్ షా తిరుమల వచ్చినప్పుడు అలిపిరి వద్ద కాన్వాయ్‌పై రాళ్లు వేయించింది చంద్రబాబు కాదా?. చంద్రబాబు ఎంతటికైనా దిగజారుతాడు. సీఎం జగన్‌పై నిత్యం అసత్య ఆరోపణలు చేస్తున్నాడు. టీడీపీ పరిస్థితి దయనీయంగా ఉంది. ఇందుకే చంద్రబాబు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడు’’ అని మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు జనంలో విశ్వసనీయత కోల్పోయాడు. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని మోసపూరిత రాజకీయాలు చేస్తున్నాడు. అధికారం కోసం బాబు ఎన్ని కుట్రలైనా చేస్తాడంటూ మంత్రి పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. ఇదీ చదవండి: రామోజీ మానసిక ఉన్మాదం ఏ స్థాయిలో ఉందంటే.. -
అధ్యక్షురాలివి అయితే...షర్మిల వ్యాఖ్యలకు పెద్దిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
-
కాంగ్రెస్ దహన సంస్కారాల కోసమే షర్మిల చేరింది
-
అప్పటిదాకా షర్మిల మాకు ప్రతిపక్షమే!: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: చంద్రబాబు కుట్రలో భాగంగానే షర్మిల కాంగ్రెస్‌లో చేరారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర విభజనకు కారణం చంద్రబాబేనంటూ దుయ్యబట్టారు. ఏపీలో కాంగ్రెస్ చచ్చిపోయిందని.. కాంగ్రెస్ శవాన్ని షర్మిల, రఘువీరారెడ్డి, కేవీపీ, గిడుగు రుద్రరాజు మోస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో ఉన్న వారంతా వైఎస్సార్సీపీలోకి వచ్చేశారు. చంద్రబాబు రాజకీయ కుట్రలో భాగంగా షర్మిల సీఎం జగన్‌పై విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు ఉచ్చులో ఉన్నంత వరకు షర్మిలను ప్రతిపక్షంగానే భావిస్తామని పెద్దిరెడ్డి అన్నారు. ‘‘చంద్రబాబు పచ్చి మోసకారి. రుణమాఫీ పేరుతో రైతులు డ్వాక్రా మహిళలను మోసం చేశారు. చంద్రబాబు హయాంలో డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేశారు. వైఎస్సార్ ఆసరా, చేయూత ద్వారా మహిళలను ఆదుకున్న ఘనత సీఎం జగన్‌దే. ఓటు హక్కు లేని వారికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ఎందుకు అని వెంకయ్య నాయుడు, చంద్రబాబు అంటున్నారు. మీ పిల్లలను ఏ మీడియంలో చదివించారో చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. కుల, మత పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక సీఎం జగన్. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. టీడీపీ నేతలకు ఓట్లు అడిగే నైతిక అర్హత లేదని మంత్రి పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. ఇదీ చదవండి: జాగ్రత్త.. చంద్రముఖి మళ్లీ నిద్రలేస్తుంది: సీఎం జగన్ -
పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచి అయినా పోటీకి సిద్ధం: మంత్రి రోజా
సాక్షి, తిరుపతి: ఫిబ్రవరి 3న అనంతపురం జిల్లాలో రాయలసీమ ప్రాంతం ఎన్నికల శంఖారావం సభ సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తెలిపారు. రాయలసీమలో 50 స్థానాలు గెలుపే లక్ష్యమని పేర్కొన్నారు. మంత్రి పెద్దిరెడ్డి అధ్యక్షతన సోమవారం రాయలసీమ వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ భేటీకి మంత్రి రోజాతోపాటు ఏడు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధి ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు. రాబోయే వారంరోజుల్లో జరిగే క్యాడర్ మీటింగ్‌కు జన సమీకరణకు ఎలా సన్నద్ధం కావాలి అనే దానిపై చర్చించారు. నాన్‌లోకల్ పొలిటీషియన్లను ప్రజలే హైదరాబాద్ ప్యాక్ చేస్తారని అన్నారు. చంద్రబాబు మతితప్పి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు వ్యాఖ్యలు ఫ్రస్ట్రేషన్‌కు పరాకాష్ట అని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. షర్మిల వేసుకున్న డ్రెస్ కాంగ్రెస్.. స్రిప్ట్ చంద్రబాబుదని మండిపడ్డారు. తెలంగాణలో పార్టీ పెట్టి.. కాంగ్రెస్‌లో కలిపిన షర్మిలకు క్రెడిబులిటీ లేదని విమర్శించారు. పచ్చమీడియా వైఎస్సార్సీపీలో గొడవలు పెట్టడమే పనిగాపెట్టుకుందన్నారు. పార్టీ ఆదేశిస్తే ఎక్కడిన ఉంచి అయినా పోటీ చేస్తానని చెప్పారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగ చంద్రబాబు.. తమ పార్టీ గురించి మాట్లాడటం సిగ్గు చేటని అన్నారు. చదవండి: నారాయణ విద్యా సంస్థలపై ఎన్నికల కమిషన్‌కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు -
అబ్బా కొడుకులకు మంత్రి పెద్దిరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
-
నీలాగా వెన్నుపోటు పొడిచానా?.. చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్
సాక్షి, పుంగనూరు: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే చంద్రబాబు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. కనీసం కుప్పంలో కూడా చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదు అంటూ ఎద్దేవా చేశారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక చౌకబారు విమర్శలకు దిగారంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. కాగా, మంత్రి పెద్దిరెడ్డి ఆదివారం పుంగనూరులో మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు మితిమీరి నాపై విమర్శలు చేస్తున్నాడు. నీ లాగా నేను మామకు వెన్నుపోటు పొడిచానా?. చంద్రబాబు నువ్వు మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. కనీసం కుప్పంలో కూడా గెలవలేవు. కుప్పంకు మేము నీళ్లు ఇస్తున్నాం. కానీ, నువ్వు 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశావ్?. ఓటమి భయంతో రాజకీయంగా ఎదుర్కోలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. సంక్షేమ పథకాలు అమలు చేస్తే శ్రీలంక అవుతుందని చంద్రబాబు విమర్శించారు. ఈరోజు బాబు షూరిటీ.. భవిషత్తు గ్యారంటీ అంటున్నారు. గతంలో ఎన్టీఆర్‌ను గద్దె దింపగానే మద్యపాన నిషేదం ఎత్తివేశారు, రెండు రూపాయల కిలో బియ్యం తీసేశారు. 2014లో ఇచ్చిన హామీలు చంద్రబాబు నెరవేర్చారా?. ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి అధికారంలోకి రాగానే రెండు లక్షల కాంట్రాక్ట్ ఉద్యోగాలను తొలగించారు. ఇన్నిసార్లు మోసం చేసిన చంద్రబాబు మాటలు ఎవరూ నమ్మరు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీలు కూడా చూడకుండా పథకాలు అందిస్తున్నారు. గతంలో జన్మభూమి కమిటీలు పెట్టీ టీడీపీకి కావాల్సిన వారికి మాత్రమే పథకాలు ఇచ్చారు. పేదరికాన్ని కొలబద్దగా తీసుకుని ప్రజలకు అండగా నిలిచింది సీఎం జగన్ మాత్రమే. అధికారంలోకి వచ్చిన మొదటి రోజే పథకాల అమలుపై సీఎం జగన్ దృష్టి సారించారు. చంద్రబాబు నాపై విమర్శలు చేస్తున్నారు. నేను ఎలాంటి వాడినో ప్రజలకు తెలుసు. చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలు, చిత్తూరు జిల్లా ప్రజలు బుద్ధి చెబుతారు. చంద్రబాబు మోసకారి మాటలు నమ్మవద్దు.. అధికారంలోకి రాలేము అని దూషణలు మొదలు పెట్టారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశాడో చెప్పుకోలేని దుస్థితిలో చంద్రబాబు ఉన్నాడు. నువ్వు వెన్నుపోటు పొడిచి జిల్లా మొత్తానికి చెడ్డపేరు తెచ్చావు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
కాంగ్రెస్ ముసుగులో షర్మిలను తీసుకొచ్చిన బాబు
సాక్షి, తిరుపతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలనలో తుడిచి కొట్టుకు పోతామన్న భయాందోళనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కాంగ్రెస్ ముసుగులో షర్మిలమ్మను తీసుకొచ్చి అడ్డగోలు ఆరోపణలు చేయిస్తున్నారని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. అందుకే చంద్రబాబు అండ్‌కో, ఎల్లోమీడియా స్క్రిప్ట్ ప్రకారమే ఆమె విమర్శలు చేస్తున్నారని, వాటిని ప్రజలు పట్టించుకోవడం లేదని స్పష్టం చేశారు. తిరుపతిలోని పీఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో శనివారం మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త, తిరుపతి ఎంపీ గురుమూర్తి అధ్యక్షతన ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా ‘సిద్ధం’ పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. అంతకుముందు మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ‘చంద్రబాబుకే గ్యారెంటీ లేదు.. ఆయన హామీలకు ఉంటుందా? బాబు హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు’ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు ఓటమి తప్పదని, అందుకే కుప్పంతోపాటు మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తారని వెల్లడించారు. రాష్ట్రంలో కమ్యూనిస్టుల జాడే లేకుండా పోయిందన్నారు. సామాన్యులే సీఎం వైఎస్ జగన్‌కు ఎన్నికల స్టార్ క్యాంపెయినర్లని ధీమా వ్యక్తం చేశారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి, 2014లో అధికారంలోకి రాగానే 2 లక్షల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించిన ఘనత చంద్రబాబుదన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చారని, డ్వాక్రా మహిళల కోసం ఆసరా పథకాన్ని తీసుకొచ్చారని వివరించారు. గతంలో జన్మభూమి కమిటీలు సిఫారసు చేస్తేనే సంక్షేమ పథకాలు అందేవని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని, గడప గడపకు వెళ్లి వలంటీర్లు అర్హులందరికీ అందిస్తున్నారని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ఫిబ్రవరి 3న అనంతపురంలో ‘సిద్ధం’ కార్యక్రమంలో పాల్గొంటారని, ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశం ఈ నెల 29న తిరుపతిలో నిర్వహించనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. -
‘రామోజీ.. మరి నీకు అర్హత ఉందా?’
సాక్షి, విజయవాడ: తన వయసుకు తగినట్టు రామోజీరావు నడుచుకుంటే మంచిదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హితవు పలికారు. రామోజీరావుకు ఏం అర్హత ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, అంబేద్కర్ గురించి కథనాలు రాశారు. సీఎం జగన్‌కు అర్హత లేదని రామోజీ చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లిండచమే అవుతుందన్నారు. కాగా, మంత్రి పెద్దిరెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రామోజీరావు అగ్రవర్ణాల అహంకారి. సీఎం జగన్‌కు అంబేద్కర్ పేరు ఎత్తే అర్హత లేదని చెప్పడానికి రామోజీకి ఏం అర్హత ఉంది. ఆయన వయసుకు తగ్గట్టుగా రామోజీ నడుచుకుంటే మంచింది. నేను 2009లో ఫారెస్ట్ మంత్రిగా పనిచేశాను. ఎర్రచందనం అక్రమ తరలింపు కట్టడికి నేనే మొదటగా చర్యలు తీసుకున్నాను. ఎవరి హయాంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ ఎక్కువగా జరిగిందో అందరికీ తెలుసు. చంద్రబాబు హయాంలోనే ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది. చంద్రబాబు తన పక్కన తెచ్చిపెట్టుకున్న కిషోర్ కుమార్ రెడ్డి ఎవరు?. 2009లో మహేశ్వర్ నాయుడు, రెడ్డి నారాయణలపై టాడా కేసులు పెట్టాం. ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసి వారి పేర్లతో రామోజీరావు వార్తలు రాస్తున్నాడు. ఎన్నికల కోసమే రామోజీ తాపత్రయం. సీఎం జగన్‌ను మీరు ఎంత తిడితే ఆయనకు అంత ఆశీర్వాదం. గతంలో కంటే ఎక్కువ సీట్లను వైఎస్సార్సీపీ సాధిస్తుంది. చంద్రబాబుకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్ధులున్నారా? సమాధానం చెప్పాలి. మేం తీసేసినోళ్లను, పనికిరానోళ్లను చంద్రబాబు తన దగ్గర చేర్చుకుంటున్నాడు. ముఖ్యమంత్రి జగన్ వద్ద క్వాలిటీ లీడర్ షిప్ ఉంది. చంద్రబాబు ఏ రకంగానూ మాకు ధీటుగా లేడు అంటూ కామెంట్స్ చేశారు. -
కుప్పంలో వైఎస్ఆర్సీపీ గెలవడం ఖాయం: పెద్దిరెడ్డి
-
చంద్రబాబు ఎన్నికల హామీలు నెరవేర్చలేదు
-
హిందూపురంలో బాలకృష్ణను ఓడిస్తాం: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: హిందూపురంలో బాలకృష్ణ రెండుసార్లు గెలిచినా అభివృద్ధి చేయలేకపోయారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. హిందూపురం నియోజకవర్గం మానెంపల్లి గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం జగన్ పాలనలో జనం సంతోషంగా ఉన్నారని, చంద్రబాబు ఎన్నికల హామీలు నెరవేర్చలేదన్నారు. ‘‘99 శాతం లబ్ధిదారులకు పథకాలు అందజేశాం. సీఎం జగన్ వెనుకబడిన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కురుబ సామాజిక వర్గానికి చెందిన దీపిక హిందూపురం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారు. హిందూపురం పార్లమెంటు నుంచి బోయ-వాల్మికి సామాజిక వర్గానికి చెందిన శాంత బరిలో ఉంటారు. వెనుకబడిన వర్గాలకు చెందిన ఇద్దరు మహిళలకు ఒకే చోట గతంలో ఏ పార్టీ అవకాశం ఇవ్వలేదు. కుప్పంలో చంద్రబాబు, హిందూపురంలో బాలకృష్ణను కచ్చితంగా ఓడిస్తామని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ‘‘టిక్కెట్ల కేటాయింపులో ఉన్న కొంత అసంతృప్తి ని త్వరలోనే అధిగమిస్తాం. టీడీపీ- జనసేన తరపున ఎవరు పోటీ చేస్తారో ఇప్పటిదాకా స్పష్టత లేదు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయింది. ఓట్లు చీల్చేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రలు అధిగమిస్తాం. ఎన్నికల్లో సచివాలయ సిబ్బంది ని ఉపయోగించటం లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు అవగాహన లేక ఈసీకి ఫిర్యాదు చేశారు. నిజమైన రాయలసీమ ద్రోహి చంద్రబాబే’’ అని మంత్రి పెద్దిరెడ్డి దుయ్యబట్టారు. ఇదీ చదవండి: బ్రో.. ఇది దొంగ ఓటు! -
కాంగ్రెస్‌లో ఎవరున్నా మాకు ప్రత్యర్థులే: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, చిత్తూరు: కుటుంబాల్లో చిచ్చుపెట్టడం టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు బాగా తెలుసని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. అలాగే, టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ సీఎం కాలేరని అన్నారు. కాంగ్రెస్‌లో ఎవరు ఉన్నా ప్రత్యర్థిగానే చూస్తామని వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి పెద్దిరెడ్డి గురువారం చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం అవుతానని చంద్రబాబు ఇంకా పగటి కలలు కంటున్నాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను మరోసారి సీఎంను చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాజకీయాల్లో మార్పులు చేర్పులు సహజం. సీఎం జగన్ మా నాయకుడు. ఆయన కోసం మేము ఎప్పటికీ పనిచేస్తూనే ఉంటాం. కాంగ్రెస్, టీడీపీ వంటి పార్టీలు ఎన్ని వచ్చినా మేము ముఖ్యమంత్రి జగన్‌తోనే నడుస్తాం. కుటుంబాలను చీల్చి రాజకీయం చేసే నైజం కాంగ్రెస్, టీడీపీ పార్టీలదే. కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నా.. ఎవరు చేరినా.. మా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నట్టే. మేము వారిని ప్రత్యర్థులుగానే చూస్తాం. జడ్పీటీసీగా ఓడిన వ్యక్తిని మేము ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం. ఇలాంటివి మాట్లాడే ముందు ఆలోచన చేయాలి. ఎవరో రెచ్చగొడితే అలా మాట్లాడటం సబబు కాదు. ఇప్పటికైనా పునరాలోచన చేయాలని కోరుకుంటున్నా అని కామెంట్స్ చేశారు. -
సీఎం జగన్ కోసం ఏం చేయడానికైనా సిద్ధం
తిరుపతి మంగళం (తిరుపతి జిల్లా): నిత్యం ప్రజాసంక్షేమమే పరమావధిగా, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోసం ఏం చేయడానికైనా సిద్ధమని రాష్ట్ర అటవీ, విద్యుత్, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. సీఎం జగన్‌తో తనకు విభేదాలున్నా యంటూ ఎల్లో మీడియా అభూతకల్పనలు సృష్టించడం దుర్మార్గమని మండిపడ్డారు. ఆయన ఆదివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డితో తనకు విభేదాలుంటే తాను ఇంకా పార్టీలోఉంటానా? అని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లాతో పాటు కుప్పంలో చంద్రబాబు ఉనికి కోల్పోయేలా చేస్తున్నానని తనకు, సీఎం జగన్‌కు మధ్య విభేదాలు సృష్టించాలన్న కుట్రలతో ఎల్లో మీడియా కట్టుకథలు రాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంతో తాను ఎప్పుడూ సన్నిహితంగానే ఉంటానని, సీఎం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటానని చెప్పారు. అంతేతప్ప సీఎంతో విభేదాలు పెట్టుకునే అవసరం, తత్వం తనది కాదని స్పష్టం చేశారు. కేవలం చంద్రబాబును ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలన్న దురాలోచనతో ఎల్లో మీడియా తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. సీఎం జగన్‌కు పెద్దిరెడ్డిని దూరం చేస్తే చిత్తూరు జిల్లాతో పాటు కుప్పంలో ఉనికి కోల్పోకుండా ఉండవచ్చన్న ఆలోచనతో ఎల్లో మీడియా కట్టుకథలు అల్లుతూ విషపురాతలు రాస్తోందన్నారు. టీడీపీ ఇప్పటికే పాడెపైకి చేరిందని, చివరిదశలో చంద్రబాబు దింపుడు కళ్లం ఆశతో పోరాడుతున్నాడని చెప్పారు. జగన్‌పై, తనపై, వైఎస్సార్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులపై ఎలాంటి కట్టుకథలు రాసినా ప్రజలు నమ్మేస్థితిలో లేరన్నారు. రాజకీయ భవిష్యత్తు ప్రసాదించి 14 ఏళ్లపాటు అధికారంలో ఉండేలా చేసిన కుప్పం ప్రజలకు ఏం చేశావు చంద్రబాబూ.. అని ప్రశి్నంచారు. నోటికి వచ్చిన అబద్ధాలు చెబుతున్న చంద్రబాబును ఈసారి కుప్పం ప్రజలు నమ్మి మోసపోయే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. దేశ రాజకీయ చరిత్రలోనే ఎవరికీ సాధ్యంకానన్ని సంక్షేమ పథకాలు అందించిన సీఎం జగన్మోహన్రెడ్డినే తిరిగి గెలిపించేందుకు రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. -
చంద్రబాబు, ఎల్లో మీడియాపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్
-
రైతులకు వెంటనే కనెక్షన్
-
విద్యుత్ రంగ చరిత్రలో ఇదే తొలిసారి
-
తాడిపత్రిలో జనహోరు
అనంతపురం ఎడ్యుకేషన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందించిన చేయూతతో సాధికారత సాధించిన బడుగు, బలహీన వర్గాలు సోమవారం అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ‘సామాజిక సాధికార బస్సు యాత్ర’ చేశాయి. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో తాడిపత్రి జనపత్రిగా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రధాన రోడ్డు వేలాది ప్రజలతో కిక్కిరిసింది. ముందుగా పట్టణంలోని కూరగాయల కొత్త మార్కెట్ ఎదురుగా ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిరావుపూలే విగ్రహాన్ని జిల్లా ఇన్చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి కారుమూరు నాగేశ్వరరావు ఆవిష్కరించారు. అనంతరం భగత్‌సింగ్ నగర్ నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర సీబీ రోడ్డు మీదుగా వైఎస్సార్ సర్కిల్ వరకు సాగింది. మధ్యలో సిద్దిబాషా దర్గాలో ప్రార్థనలు చేశారు. దారిపొడవునా బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అనంతరం తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో వేలాదిమంది పాల్గొన్నారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకుంటున్న చర్యలను ప్రజాప్రతినిధులు, నేతలు వివరించినప్పుడు ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ‘మళ్లీ రావాలి జగన్ – కావాలి జగన్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు మాకే ఉంది : మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నాలుగున్నరేళ్లలో సామాజిక న్యాయం చేసి నిరూపించిన సీఎం వైఎస్ జగన్ అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెప్పారు. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు వైఎస్సార్సీపీ నేతలకే ఉందన్నారు. సామాజిక న్యాయం జరగాలని, పేదవాడు పేదవాడిగానే ఉండిపోకూడదని, పేదల కుటుంబాల్లోనూ డాక్టర్లు, ఇంజినీర్లు కావాలని సీఎం వైఎస్ జగన్ పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చారని తెలిపారు. సీఎం జగన్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ దూసుకుపోతోందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పల్లకీ మోసిన జగన్‌ను మళ్లీ గెలిపిద్దాం: మంత్రి ఉషశ్రీచరణ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పల్లకీ మోశారని, మరోసారి ఆయన్నే ముఖ్యమంత్రిని చేసుకోవాలని మంత్రి ఉషశ్రీ చరణ్ పిలుపునిచ్చారు. బడుగు, బలహీన వర్గాలను గుర్తించి రాజకీయ ప్రాధాన్యత ఇచ్చిన గొప్ప వ్యక్తి వైఎస్ జగన్ అని చెప్పారు. 139 బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు, బీసీల్లో పుట్టాం అని గర్వంగా చెప్పుకునేలా చేశారని తెలిపారు. సీఎం జగన్ అగ్రకులంలో పుట్టినా బీసీ కుల గణనకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. సీఎం జగన్‌ను గుండెల్లో పెట్టుకుంటాం: ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం పని చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను గుండెల్లో పెట్టుకుంటామని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ చెప్పారు. ఈ వర్గాలను సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా నిలబెట్టేందుకు సీఎం జగన్ అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. సామాజిక న్యాయం చేసిన సీఎం జగన్ : ఎంపీ తలారి రంగయ్య రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్ని రంగాల్లో అత్యధిక ప్రాధాన్యం కల్పించి, సామాజిక న్యాయం చేసిన సీఎం జగన్ అని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య చెప్పారు. రాయలసీమలో మొత్తం 8 ఎంపీ స్థానాలు ఉంటే 5 స్థానాలు బీసీ, ఎస్సీలకు ఇచ్చారన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున బీసీ, ఎస్సీలకు ఏ పార్టీ టికెట్లు ఇవ్వలేదన్నారు. రాష్ట్రానికి జగన్ అవసరం చాలా ఉంది: ఎంపీ నందిగం సురేష్ పేదలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఈ రాష్ట్రానికి ఉందని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. సీఎం జగన్ అతి సామాన్యమైన వ్యక్తులను పైసా ఖర్చు లేకుండా ఎంపీలుగా చేశారని, వారిలో తాను ఒకడినని అన్నారు. -
నంద్యాలలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన
-
ఆలయాల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు
-
మంత్రి పెద్దిరెడ్డి గురించి అనిల్ కుమార్ యాదవ్ ఏమన్నారంటే
-
సీమ థర్మల్ విద్యుత్ కేంద్రానికి ‘ఎంవీఆర్’ పేరు
సాక్షి, అమరావతి/ఎర్రగుంట్ల( వైఎస్సార్ జిల్లా): రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్(ఆర్టీపీపీ) పేరును డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటుగా పేరు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులిచ్చింది. కార్మిక నేతగా, ఎమ్మెల్యేగా, రచయితగా రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కృషి చేసిన దివంగత నేత డాక్టర్ ఎంవీ రమణారెడ్డి(ఎంవీఆర్) సేవలకు గుర్తింపుగా, రాయలసీమ ప్రాంత నేతల విజ్ఞప్తి మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. వారి ఆమోదంతో వైఎస్సార్ జిల్లా కలమళ్లలోని 1650 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల ఆర్టీపీపీ పేరును డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటుగా మార్చుతూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పేరు మార్పు తక్షణమే అమల్లోకొస్తుందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మూడు థర్మల్ ప్లాంట్లకు ముగ్గురు ప్రముఖుల పేర్లు రాష్ట్రంలో మూడు థర్మల్ పవర్ ప్లాంట్లుండగా, వేర్వేరు రంగాలకు చెందిన వారి పేర్లు వాటికి సార్థక నామధేయాలుగా మారాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ప్లాంట్‌కు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రమని పేరు పెట్టారు. ఇబ్రహీంపట్నంలోని పవర్ ప్లాంటుకు విద్యుత్ రంగ పితామహుడుగా పేరు పొందిన డాక్టర్ నార్ల తాతారావు పేరు పెట్టారు. తాజాగా ఆర్టీపీపీని కార్మిక నేత ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటుగా ప్రభుత్వం మార్చింది. ఎంవీఆర్ కృషితో సీమలో థర్మల్ ప్లాంట్ వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతంలో విద్యుత్ సమస్య పరిష్కారం కోసం థర్మల్ విద్యుత్ కర్మాగారం ఏర్పాటు చేయాలని మొట్టమొదట డిమాండ్ చేసిన నేత డాక్టర్ ఎంవీ రమణారెడ్డి. 1985లో ‘రాయలసీమ కన్నీటి గాథ’ అనే పుస్తకం ద్వారా ఆయన రాయలసీమ సమస్యలను, గణాంకాలు, సహేతుకమైన ఆధారాలతో రాష్ట్ర ప్రజల దృష్టికి తెచ్చారు. కరువుతో అల్లాడుతున్న సీమకు అన్ని విధాలా అన్యాయం జరుగుతోందని గళమెత్తారు. ఎంవీఆర్ చేసిన డిమాండ్.. ఆర్టీపీపీ స్థాపనకు బాట వేసిందని, ఆ నేతకు నివాళిగా ఆర్టీపీపీ పేరును డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టుగా మార్చాలని రాయలసీమ నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాయలసీమ విమోచన సమితి పేరుతో రమణారెడ్డి, రాయలసీమ సంయుక్త కార్యాచరణ సమితి పేరుతో వైఎస్సార్, మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి, టీటీడీ చైర్మన్ కరుణాకరెడ్డి తదితర నేతలంతా అప్పట్లో ఉద్యమం చేపట్టారని సాహితీవేత్త భూమన్ తెలిపారు. ఆర్టీపీపీ పేరును డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటుగా మార్చడం దివంగత నేతకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అరుదైన గౌరవంగా భావిస్తున్నామని భూమన కరుణాకర్‌రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్యలు ప్రశంసించారు. ఆర్టీపీపీకి డాక్టర్ ఎంవీఆర్ పేరు పెట్టినందుకు ఆయన కుటుంబ సభ్యులతో పాటు పలువురు నేతలు ముఖ్యమంత్రికి, ఇంధన శాఖ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఆర్టీపీపీకి ఎంవీఆర్ పేరు చేర్చడాన్ని రాయలసీమ వాసులు స్వాగతిస్తున్నారు. -
గణనాథుని బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా ధ్వజారోహణం
యాదమరి (చిత్తూరు జిల్లా): కాణిపాక శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో మంగళవారం ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు నవరాత్రి బ్రహ్మోత్సవాలు, 12 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలకు అర్చకులు శేఖర్ గురుకుల్, వేదపండితులు సుబ్బారావు పూజలు చేశారు. ఉదయం ఆలయ ప్రాంగణంలోని అన్వేటి మండపంలో స్వర్ణ ధ్వజస్తంభం వద్ద మూషికపటాన్ని ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించడం కోసం ధ్వజస్తంభానికి క్షీర, చందన, ఇతర ద్రవాలతో అభిషేకం చేశారు. ఈ ఉత్సవాలకు ఉభయదారులుగా కాణిపాకం, అగరంపల్లె, కారకాంపల్లె, వడ్రాంపల్లె, తిరువణంపల్లె గ్రామాలకు చెందిన శీర్కరుణీక వంశస్తులు వ్యవహరించారు. సిద్ధి, బుద్ధి, వినాయక స్వామి ఉత్సవమూర్తులను ఆలయ అన్వేటి మండపంలో పుష్పాలతో అలంకరించి పూజలు నిర్వహించి పుర వీధులలో ఊరేగించారు. రాత్రి ఆలయాధికారులు ఉభయదారులు మేళతాళాలతో ఊరేగింపుగా స్వామివారిని తీసుకువచ్చి పుష్పాలతో అలంకరించిన హంస వాహనంపై ఆశీనులు చేయగా... స్వామివారు దానిపై విహరించారు. పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పెద్దిరెడ్డి వినాయకుడికి సోమవారం ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టు వ్రస్తాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాల్లో చవితిరోజు రాష్ట్ర ప్రభుత్వం స్వామివారికి పట్టు వ్రస్తాలు సమర్పించడం ఆనవాయితి. ఈ ఏడాది మంత్రి పెద్దిరెడ్డితో పాటు ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, ఎమ్మెల్యే వెంకటేగౌడ్ ఊరేగింపుగా పట్టువ్రస్తాలను తీసుకువెళ్లారు. వీరికి ఆలయ చైర్మన్, ఈవో స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించారు. ఆశీర్వాద మండపంలో వేదపండితులచే ఆశీర్వాదాలు చేయించి, ప్రసాదం, చిత్రపటం అందించారు. మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. -
‘జగనన్న భూహక్కు –భూరక్ష’కు సర్వే రాళ్లు సిద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 305 గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ యూనిట్లకే జగనన్న భూహక్కు–భూరక్ష పథకం కోసం వినియోగించే సర్వే రాళ్ల ఆర్డర్లిస్తున్నామని రాష్ట్ర గనులు, ఇంధన, పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. మూడో దశలో అక్టోబర్ 15 నాటికి 25.42 లక్షల సర్వే రాళ్లు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో గ్రానైట్ ఫ్యాక్టరీ నిర్వాహకులతో సర్వే రాళ్ల సరఫరాపై శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గ్రానైట్ ఫ్యాక్టరీలకు అండగా నిలిచేందుకు సీఎం జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారని, సంక్షోభంలో కూరుకుపోయిన గ్రానైట్ ఫ్యాక్టరీలకు చేయూతనిస్తూ స్లాబ్ సిస్టమ్ తెచ్చారని, విద్యుత్ రాయితీలు కల్పించారని తెలిపారు. సర్వే రాళ్ల తయారీ ఆర్డర్లను గ్రానైట్ ఫ్యాక్టరీలకే ఇవ్వడం వల్ల ఆయా కర్మాగారాల్లో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, వీటిపై ఆధారపడ్డ వారికి ఉపాధి లభిస్తోందన్నారు. ఇప్పటి వరకు 44.03 లక్షల సర్వే రాళ్లు సరఫరా చేశామని, ఇందుకు రూ.1,153.2 కోట్లను సరఫరాదారులకు, రాళ్ల రవాణా కోసం రూ.63.8 కోట్లు చెల్లించామన్నారు. రీసర్వే కోసం గతంలో గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ యూనిట్ల నిర్వాహకులతో జరిగిన సమావేశంలో రోజుకు లక్ష సర్వే రాళ్లు కావాలని కోరామన్నారు. యూనిట్లకు రా మెటీరియల్‌ను కూడా గనుల శాఖ అధికారులు సమకూర్చారని, మొదట రూ.270 ఉన్న రేటును రూ.300కి పెంచామన్నారు. ఇంత చేస్తున్నా ఫ్యాక్టరీలకు బదులు బయటి నుంచి ట్రేడర్లు సర్వే రాళ్లు సరఫరా చేస్తున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనివల్ల ఫ్యాక్టరీలకు నష్టం జరుగుతోందని, దీనిని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని స్పష్టం చేశారు. -
సచివాలయంలో సర్వే స్టోన్స్ పై మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష
-
టీడీపీ-జనసేన పొత్తు ఊహించిందే: మంత్రి పెద్దిరెడ్డి
-
నిప్పు.. నిప్పుగా చెప్పుకున్న బాబు పాపం పండింది
-
పవన్ కళ్యాణ్ పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..!
-
స్కిల్ స్కాం ఆరంభం మాత్రమే: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, తిరుపతి: చంద్రబాబు అవినీతి చేయలేదని టీడీపీ నేతలే చెప్పలేకపోతున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. సాంకేతిక కారణాలతో మాత్రమే అరెస్టు అక్రమమంటున్నారని విపక్షాలపై మండిపడ్డారు. అవినీతి కేసులో చంద్రబాబు ఇన్నాళ్లు స్టేలతో కాలం గడిపారని. చట్టం తన పని తాను చేసుకుపోతోందన్నారు మంత్రి పెద్దిరెడ్డి. చంద్రబాబు అరెస్టుపై ప్రజల్లో ఎలాంటి నిరసన రాలేదని పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు. టీడీపీ బంద్‌ను ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదని చెప్పారు. చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్ కూడా నడుస్తోందని అన్నారు. స్కిల్‌స్కాం కేవలం ఆరంభం మాత్రమేనని చెప్పారు. చంద్రబాబుపై ఇంకా చాలా కేసులు ఉన్నాయని అన్నారు. పక్కా ఆధారాలతో సీఐడీ దర్యాప్తు చేస్తోందని స్పష్టం చేశారు. చంద్రబాబు దుర్మార్గపు వ్యవస్థ కూలిపోతోందని రామచంద్రా రెడ్డి అన్నారు. పతనం అంటే ఏంటో చంద్రబాబుకు తెలుస్తోందని చెప్పారు. లోకేష్‌తో పాటు టీడీపీ నేతలు బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పశ్చాత్తాపం లేకుండా వ్యవహరించడం దారుణం అని అన్నారు. ఇదీ చదవండి: పీవీ రమేశ్ స్టేట్‌మెంట్‌తోనే కేసు నడవలేదు.. స్కిల్ కేసును ప్రభావితం చేసేలా ఆయన వ్యాఖ్యలున్నాయ్: ఏపీ సీఐడీ -
చంద్రబాబు అవినీతి చిట్టా చాలా పెద్దది
-
చంద్రబాబు అరెస్ట్ పై పెద్దిరెడ్డి కామెంట్స్..!
-
ఈ స్కామ్ అంతా చంద్రబాబు కుట్ర
-
‘చంద్రబాబు అరెస్ట్ కక్ష సాధింపు చర్యగా కనిపించడం దౌర్భాగ్యం’
సాక్షి, తిరుపతి: రాజకీయ అనుభవం ఉంటే, స్కాములు చేస్తే అరెస్టు చేయరా అని విద్యుత్, మైనింగ్ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో.. రూ. 371 కోట్లు నొక్కేసిన అవినీతిపరుడు బాబు అని విమర్శించారు. కొన్ని మీడియా సంస్థలు చంద్రబాబు అరెస్ట్ తప్పు అంటూ వాదిస్తున్నాయని మండిపడ్డారు. మొత్తం రూ. 3, 356 కోట్ల ప్రాజెక్ట్ లో 90 శాతం సీమెన్స్ కంపెనీ, 10 శాతం, అంటే రూ. 371 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయాల్సిన ప్రాజెక్టులో.. ప్రభుత్వ డబ్బును మాత్రం ఖర్చు చేయించి, రూ. 371 కోట్లు చంద్రబాబు అండ్ కో మింగేశారని తెలిపారు. ఏ కారణం లేకుండా ఒక ప్రైవేటు కంపెనీ, ప్రభుత్వం తరపున రూ. 3000 కోట్లు ఎందుకు ఖర్చు చేస్తుందని మంత్రి పెద్దిరెడ్డి ప్రశ్నించారు. ఈ చిన్న లాజిక్ కూడా తెలియకుండా, చంద్రబాబు స్కామ్ చేశాడని అన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు, ఈడీలు విచారణలు జరిపి, అరెస్టులు చేశాయని తెలిపారు. -సీమెన్స్, డిజైన్ టెక్, స్కిల్లర్ కంపెనీల ప్రతినిధులను ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. వారంతా ఈ కుట్రలో పాత్రధారులు.. సీమెన్స్ కంపెనీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని చెప్పారు. కేవలం ప్రభుత్వం 10 శాతం కింద ఇచ్చిన 371 కోట్ల రూపాయలను మింగేశారని, షెల్ కంపెనీల ద్వారా, హవాలా మార్గంలో డబ్బులు బదలాయించారని మండిపడ్డారు. చదవండి: చంద్రాబాబు పాపం పండింది: మంత్రి అమర్నాథ్ చంద్రబాబుకే ఆ డబ్బులన్నీ.. ‘హవాలా మార్గంలో ఆ డబ్బులన్నీ చంద్రబాబుకు, ఆ పార్టీ వారికి చేరాయి. ఇది చంద్రబాబు నాయుడు స్వయంగా చేసిన స్కాం కాబట్టే.. అయన ఈ విషయం పై ఏమి మాట్లాడలేదు. అయన పార్టీ వారిని పెట్టుకుని అడ్డగోలుగా వాదిస్తుంటే.. చంద్రబాబు సీఐడీని నిలదీశారని ఎల్లో మీడియా ప్రచారం చేసుకుంటుంది. ఐటీ నోటీసులు ఇస్తే... ఆ సర్కిల్ నోటీసు ఇవ్వకూడదని అడ్డోగొలు వాదనలు చేశారు. ప్రభుత్వ ధనాన్ని దొచేయలనే కుట్రతో ఈ మొత్తం వ్యవహారం జరిగింది. అన్ని ఆధారాలతోనే చంద్రబాబు నాయుడిని సీఐడీ అరెస్ట్ చేసింది చంద్రబాబు బంధువు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి, దత్త పుత్రుడు పవన్ కల్యాణ్, సీపీఐ నారాయణ, రామకృష్ణ వీళ్ళందరి కళ్ళకు స్కాము.. కక్ష సాధింపు చర్యగా కనిపించడం దౌర్భాగ్యం. పురంధేశ్వరి ఈ 371 కోట్లు చంద్రబాబు తిన్నారా లేదా అని చెప్పాలి. అప్పుడున్న సీపీఐ నారాయణ, ఇప్పుడు ఉన్న నారాయణ వేరు. అప్పటి నారాయణ కమ్యునిస్ట్ భావజాలం కలిగిన వారు. ఇప్పుడు చంద్రబాబు భావజాలంతో పని చేస్తున్నారు. ఓటుకు కోట్లు కేసులోనూ ఇదే అడ్డగోలు వాదన ఓటుకు నోటు కేసులో కూడా ఇదేవిధంగా అడ్డగోలుగా వాదించిన వ్యక్తి చంద్రబాబు. ఆనాడు కూడా ఎల్లో మీడియా ఇదేవిధంగా చంద్రబాబుకు మద్దతు తెలిపింది. ఎన్టీఆర్ ఘటన సమయంలో, ఇప్పుడు కూడా కొన్ని మీడియా సంస్థలు అదే పని చేస్తున్నాయి. రాజకీయ లబ్ది కోసం ఆయనను కుట్ర పూరితంగా అరెస్ట్ చేశారని మాట్లాడుతున్నారు సీఐడీ ఈ కేసును పూర్తి స్థాయిలో వెలికితీసి తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన్ను ఆరెస్ట్ చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్, ఏపి ఫైబర్ నెట్ స్కాముల్లో కూడా అవకతవకలు జరిగాయి. అవికూడా విచారిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. పుంగనూరు అల్లర్ల సమయంలో ఒక్క వైఎస్సార్సపీ కార్యకర్త కూడా లేరు. రూట్ మ్యాప్ మార్చి పుంగనూరులోకి ప్రవేశించాలని నాడు చంద్రబాబు చూస్తే.. పోలీసులు అడ్డుకున్నారు. ఆరోజు టీడీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఘటన జరిగింది’ అని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. -
ఇసుకాసురుడు ‘నారా’సురుడే..!
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీరియస్ అయ్యారు. ఇసుక మీద మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదని విమర్శలు చేశారు. వంశధార, నాగావళి, పెన్నా నదుల్లో ఇసుకను టీడీపీ నేతలు పెద్ద ఎత్తున దోపిడీ చేశారు. ప్రతీ నెల ఇసుక మీద నారా లోకేష్ ముడుపులు తీసుకునేవాడు అని అన్నారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర విద్యుత్, అటవీ, మైనింగ్ శాఖల మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీపీటీ(పవర్ పాయింట్ ప్రజెంటేషన్) ద్వారా, ఇసుక పాలసీపై పూర్తి గణాంకాలతో సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఉచిత ఇసుక పేరుతో జరిగిన దోపిడీ- సీఎం జగన్ ప్రభుత్వంలో అత్యంత పారదర్శకంగా అమలవుతున్న ఇసుక పాలసీ, తద్వారా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాన్ని వివరించారు. ఇసుకపై బాబు, లోకేశ్‌ల ఓవరాక్షన్ ఇసుక తవ్వకాలు, అక్రమాలంటూ చంద్రబాబు ఆయన కొడుకు లోకేశ్ ఇటీవల ఆరోపణలు చేస్తున్నారు. అనుమతులున్న ఓపెన్ రీచ్‌ల దగ్గరకు కూడా వెళ్లి సెల్ఫీలంటూ వాళ్లు ఓవర్ యాక్షన్ చేయడం అందరూ చూస్తున్నారు. ఇసుక దోపిడీపై మాకు గడువిచ్చామని.. 48 గంటల్లో సమాధానం చెప్పకపోతే.. తదుపరి చర్యలుంటాయని రంకెలేస్తున్నారు. అనుమతులున్న ఇసుక రీచ్‌ల దగ్గరకు పోయి టీడీపీ నేతలు ధర్నాలు చేయడాన్ని చూశాం. అందుకే, ఈ సందర్భంలో ఇసుక పాలసీకి సంబంధించి ఎవరి హయాంలో ఏం జరిగిందనేది నేను పీపీటీ ద్వారా వివరిస్తున్నాను. బాబు హయాంలో 19 జీవోలతో దోపిడీ ఇసుక గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. బాబు ఐదేళ్ల పాలనలో ఇసుక తవ్వకాలు ఇష్టానుసారంగా జరిగాయి. ఇసుక పాలసీకి సంబంధించి ఆయన హయంలో దాదాపు 19 సార్లు జీవోలు ఇచ్చారు. ఎప్పటికప్పుడు వారికి అనుకూలంగా జీవోలను మార్చుకుని మైనింగ్ దోపిడీ ఎలా చేశారనేది.. అప్పట్లో ప్రభుత్వ ఖజానాకు చేరిన ఆదాయమేంటి..? ఇప్పుడున్న ఆదాయమేంటనేది మేమూ పీపీటీ ద్వారా వివరిస్తున్నాం. పేరుకే ఉచితం.. బ్లాక్ మార్కెట్ తో రాష్ట్ర ఖజానాకు సున్నం చంద్రబాబు ఇసుక పాలసీపై మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యమేస్తుంది. ఆయన నోటి వెంట ఇసుక దోపిడీ గురించి మాటలు వినిపిస్తుంటే.. దొంగే.. దొంగా దొంగా.. అని కేకలేసినట్లుగా ఉంది. 2014 నుంచి 2019 వరకు కృష్ణానది కరకట్ట మీదనున్న చంద్రబాబు ఇంటి వెనుకే కృష్ణా నదీ గర్భంలో ఇసుక తవ్వకాలు పెద్దఎత్తున జరగలేదా..? అని ప్రశ్నిస్తున్నాను. మొదట్లో డ్వాక్రా మహిళల ద్వారా ఇసుక సప్లై అన్నాడు. ఆ తర్వాత ఉచిత ఇసుక విధానం అన్నాడు. పేరేమో ఉచితమన్నాడు గానీ.. ఇసుక బ్లాక్‌మార్కెట్ ను అమాంతం పెంచి ప్రభుత్వ ఖజనాకు సున్నంపెట్టిన వ్యక్తి ఈ చంద్రబాబు అని చెప్పుకోవాలి. నాడు పేద, మధ్యతరగతి కుటుంబాలు ఇల్లు కట్టుకోవాలంటే.. సామాన్యులకు ఇసుక దొరక్క, టీడీపీ నేతలు చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఉండేవి. టీడీపీ హయాంలో నెలవారీ మామూళ్ళు చంద్రబాబు హయాంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాల్ని జరిపారు. నెలవారీగా తమకు ఆదాయవనరుల్లో ఇసుకను ఒక భాగంగా చేసుకున్నారు కనుకే.. పశ్చిమగోదావరి జిల్లాల్లో అప్పట్లో తహశీల్దార్ వనజాక్షి గారు ఇసుక అక్రమ తవ్వకాల్ని అడ్డుకుంటే ఆమెపై దాడిచేశారు. ప్రభుత్వ అధికారిణి అని కూడా చూడకుంటా ఆమెను టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈడ్చిపడేశాడు. అప్పట్లో వారిద్దర్నీ రాష్ట్ర సచివాలయానికి పిలిపించుకుని రాజీ చేసింది ఈ చంద్రబాబు కదా..? మహిళా అధికారిణిపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా.. బాధితురాల్నే బెదిరించి రాజీచేసిన నీచుడు చంద్రబాబు అని గుర్తుచేస్తున్నాను. లోకేశ్‌కు ప్రతీనెలా రూ.500 కోట్లు కప్పం చంద్రబాబు హయాంలో, ఇసుక అక్రమ తవ్వకాలపై, ఎవరైనా ఫిర్యాదు చేయాలన్నా అది ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియకుండా చేశాడు. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు వారి అనుచరుల్ని పెట్టి కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి, గోదావరి నదుల్లో ఇష్టానుసారంగా ఇసుకను తవ్వేశారు. ఇదంతా చంద్రబాబు కొడుకు లోకేశ్ కనుసన్నల్లోనే జరిగిందని.. ఆయనకు ఇసుక దోపిడీకి సంబంధించి ప్రతీనెలా రూ.500 కోట్లు కప్పం కట్టి మరీ ఇసుకమాఫియా ముఠా వ్యాపారం చేసిందని అప్పట్లో మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం అందరికీ తెలుసు. బాబు హయాంలో ఎన్జీటీ రూ.100 కోట్ల జరిమానా శ్రీకాకుళం దగ్గర్నుంచి తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి నేషనల్ గ్రీన్‌ట్రిబ్యునల్ (ఎన్జీటీ) విచారణ కూడా జరిపింది. అప్పట్లో ఇసుక తవ్వకాలపై ఆధారాలు రుజువైనందునే చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్జీటీ తీర్పు సైతం వచ్చింది. దాదాపు రూ.100 కోట్ల జరిమానాను విధిస్తూ తీర్పిచ్చింది. ఈ కేసులో చంద్రబాబు ఇంటి వద్ద కరకట్ట పక్కన జరిగిన ఇసుక తవ్వకాలకు సంబంధించిన ఆధారాల్ని కూడా అప్పట్లో ఎన్జీటీ పరిగణలోకి తీసుకుంది. మరి, ఎన్జీటీ విధించిన రూ.100 కోట్ల జరిమానాపై చంద్రబాబు ఏం సమాధానం చెబుతాడు..? పారదర్శక ఇసుక పాలసీని సీఎం జగన్ తెచ్చారు ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో ఇసుకను బుక్ చేసుకుని కొనుగోలు చేసుకునే మెరుగైన పారదర్శక ఇసుక పాలసీని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక అమలు చేశాం. ప్రస్తుతం కూడా అమలు చేస్తున్నాం. సీఎం జగన్ ఇసుక తవ్వకాలకు సంబంధించి గత ప్రభుత్వం చేసిన తప్పులన్నింటినీ సరిదిద్ది నూతన పాలసీని తేవడం జరిగింది. ఇసుకపై 04.09.2019న మెరుగైన నూతన పాలసీని తెచ్చారు. ఆ తర్వాత ఈ పాలసీపై 17.07.2020న మంత్రుల సబ్‌కమిటీ నియమించి ప్రజాభిప్రాయసేకరణ చేసి ప్రభుత్వానికి నివేదికనిచ్చారు. దీంతో మరింత మెరుగైన ఇసుక విధానంపై 12.11.2020న జీవో.నెం. 78ను జారీ చేశాం. పాలసీ అమలును పరిశీలిస్తూనే.. నిబంధనల్లో మార్పులు చేస్తూ మరలా 16.04.2021న జీవో నెం. 25ను తెచ్చాం. ప్రస్తుతం ఇదే జీవో ద్వారా ఇసుక పాలసీని కొనసాగిస్తున్నాం. కేంద్రప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలోనే టెండర్లు ఇసుక తవ్వకాలకు సంబంధించి గతంలో టీడీపీ మాదిరిగా మేము దొంగచాటుగానో.. ఎవరికీ తెలియకుండానో టెండర్లు ప్రక్రియను పూర్తిచేయలేదు. కేంద్రప్రభుత్వానికి సంబంధించిన మెటల్ అండ్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎంటీసీ) ద్వారా టెండర్లును ఆహ్వానించడం, నిర్వహణ, పర్యవేక్షణ జరుగుతుంది. ఎవరైనా ఈ టెండర్లలో పాల్గొనేలా అవకాశమిచ్చాం. అత్యంత పారదర్శకంగా టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి.. అత్యధిక బిడ్ కోట్ చేసిన జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ కంపెనీకి టెండర్‌ను ఖరారు చేయడం జరిగింది. చంద్రబాబు,రామోజీ టెండర్లలో పాల్గొనలేదేం..? ఇసుక తవ్వకాలకు సంబంధించి ఇప్పుడు ఆరోపణలు గుప్పిస్తున్న చంద్రబాబు, రామోజీరావులు అప్పట్లో ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో ఎందుకు పాల్గొనలేదు..? రామోజీ కూడా పెద్ద వ్యాపార వేత్తనే కదా.. మరి ఆ టెండర్లో పాల్గొంటే.. ఎంత పారదర్శకంగా ఇసుక టెండర్ ప్రక్రియ జరుగుతుందో స్వయంగా తెలుసుకునే వారు కదా..? ఇలాంటి పారదర్శక పాలసీని చంద్రబాబు గతంలో ఏనాడైనా తెచ్చాడా..? అని నిలదీస్తున్నాను. దీనిపై దమ్ముంటే చంద్రబాబు, రామోజీ సమాధానం చెప్పాలి. టన్ను రూ. 475కే.. ఇంత పారదర్శకంగా ఇసుక పాలసీని తెస్తే చంద్రబాబు, పచ్చమీడియా కలిసి రోజుకో పిచ్చి ప్రేలాపన చేస్తుంది. రకరకాలుగా ఆరోపణలతో కథనాలు రాస్తున్నాయి. ఇసుక నూతన పాలసీ ప్రకారం ఒక కంపెనీ టెండర్ దక్కించుకుంది. ఎక్కడ తవ్వకాలు జరిపినా అదే కంపెనీ బాధ్యత తీసుకుంటుంది. అలాంటప్పుడు ఆ కంపెనీ అక్కడ తవ్వుతుంది..? ఇక్కడ తవ్వుతుంది..? అన్న వాదనలకు ఆస్కారం ఎక్కడుందని అడుగుతున్నాం. ఈ కంపెనీ ప్రస్తుతం టన్నుకు రూ.375 ప్రభుత్వానికి చెల్లిస్తూ ఉన్నారు. దీనిపై వారు రూ.100 కలుపుకుని టన్ను ఇసుకను రూ.475కు అమ్ముకుంటున్నారు. వారు కలుపుకుంటున్న రూ.100లోనే అడ్మినిస్ట్రేషన్ ఖర్చులు, ఇతర నిర్వహణ వ్యయం మొత్తాన్ని భరించుకోవాల్సి ఉంటుంది. మరి, టీడీపీ నేతలు, చంద్రబాబుతో సహా ఎల్లోమీడియా ఇసుకకు సంబంధించి ఏదో జరిగిపోతుందని ఎందుకు ఆరోపణలు చేస్తుంది..? అని అడుగుతున్నాను. ఇసుక సొమ్మంతా బాబు, లోకేష్ జేబుల్లోకే... ఇసుక నూతన పాలసీ ప్రకారం ప్రభుత్వానికి ఏటా రూ.765 కోట్లు ఆదాయం వస్తుంది. అంటే, ఐదేళ్లకు రూ.3825 కోట్లు జమ అవుతున్నాయి. మరి, చంద్రబాబు హయాంలో ఇన్ని వేల కోట్లు ఏమయ్యాయి..? ఎక్కడ జమ అయ్యాయి..? లోకేశ్ జేబులోనా... చంద్రబాబు జేబులోనా..? అని నిలదీస్తున్నాను. ఇంత ఆదాయం ప్రభుత్వం కోల్పోయినప్పుడు ప్రశ్నిస్తానన్న నేతలు గానీ.. మీడియా గానీ ఎందుకు కళ్లుమూసుకుంది. అప్పట్లో టెండర్లు ఎందుకు పిలవలేదు..? ఇలాంటి మెరుగైన పారదర్శక విధానాన్ని చంద్రబాబు ఎందుకు తేలేదు..? దీనిపై వారు సమాధానం చెప్పాలి. ఇసుక తవ్వకాల అక్రమాలపై ఉక్కుపాదం ఇసుక తవ్వకాలకు సంబంధించి అక్రమాలు ఎక్కడైనా జరిగితే... ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇందుకు కఠిన చట్టాల్ని సైతం అమలు చేస్తున్నాం. ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే ఎవరైనా ఎక్కువ అమ్మితే చట్టప్రకారం చర్యలు తీసుకునేలా వ్యవస్థను నడిపిస్తున్నాము. అటువంటివారికి రూ.2 లక్షల జరిమానాతో పాటు రెండేళ్ల జైలు శిక్ష విధించేలా కఠిన చట్టాన్ని తెచ్చాం. అక్రమాలపై ఎవరైనా ఫిర్యాదులు చేయాలన్నా టోల్‌ఫ్రీ నెంబర్ 14500ను అందుబాటులో ఉంచి ప్రచారం కూడా చేయిస్తున్నాం. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) ద్వారా ఇప్పటికే 18వేల కేసులు నమోదు చేశాం. 6.36 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను సీజ్ చేయడం జరిగింది. చాలామందికి శిక్షలు కూడా పడటం జరిగింది. మరి, చంద్రబాబు హయాంలో ఇలాంటి కఠిన చట్టాలు అమలు చేయడం, జరిమానాలు, శిక్షలు విధించడం చేశారా..? నాడు ఆయన హయాంలో పట్టాభూముల్లో కూడా ఇసుకను యథేచ్ఛగా తవ్వుకుని అమ్ముకున్న దాఖలాలున్నాయి. ఇసుక కొరత లేకుండా చూస్తున్నాం... ఇసుక కొరత, అక్రమ తవ్వకాలు అంటూ.. చంద్రబాబు చేస్తున్న తప్పుడు ఆరోపణల్ని మేం ఖండిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి గారు రాష్ట్రంలో నిర్మాణ రంగానికి అండగా ఉన్నారు. వర్షాకాలంలో కూడా ఎక్కడా ఇసుక కొరత రాకుండా అన్నిరకాల జాగ్రత్త చర్యలు చేపట్టి.. ఎండాకాలంలోనే స్టాక్‌యార్డుల్లో ఇసుక నిల్వలు ఉంచేలా ఆదేశాలిచ్చారు. కనుకే, ఇప్పటి వరకు మాకు ఇసుక దొరకడం లేదని ఎవరూ చిన్నపాటి కంప్లైంట్ కూడా చేయలేదు. ఇసుక కొరత రాష్ట్రంలో లేనేలేదు. ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలింపుపై చెక్‌పోస్టుల ద్వారా ప్రత్యేక నిఘాను కట్టుదిట్టం చేశాం. చంద్రబాబుకు బంపర్ఆఫర్ ఇసుకపై చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నాడు. సంబంధంలేని అంశాలతో శిరోముండనం అంటూ ముడేస్తాడు. అన్నమయ్య ప్రాజెక్టుకూ ఇసుకకు ఏం సంబంధం ఉంది. ఆయన మతిచలించి మాట్లాడుతున్నాడు..? ఒక్కపక్కన లోకేశ్ ఏమో ఇసుక దోపిడీ రూ.4వేల కోట్లంటాడు. చంద్రబాబునేమో రూ.40వేల కోట్ల ఇసుక అక్రమాలంటాడు. కనుక, ఈ ఆరోపణలన్నీ పక్కనబెడితే.. ప్రభుత్వానికి రూ.4వేల కోట్లు ఇస్తే ఇసుక కాంట్రాక్ట్‌ను మొత్తం చంద్రబాబుకే అప్పగిస్తాం. ఆయనకు ఇది మా బంపర్ ఆఫర్. బాబూ.. వాస్తవాలివిగో.. ఈ నాలుగున్నరేళ్లలో ఇప్పటివరకు రాష్ట్రంలో 6.70 కోట్ల టన్నులు ఇసుకను తవ్వితే మొత్తం రూ.2300 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. బాబు అడుగుతున్న జీఎస్టీ లెక్కలతో ప్రభుత్వానికేం సంబంధం ఉంటుంది. ఆ కాంట్రాక్టు సంస్థ కేంద్రానికి చెల్లిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 136 స్టాక్ పాయింట్లు ఉంటే.. వాటిల్లో ఇప్పుడు సుమారు 64 లక్షల టన్నుల ఇసుక నిల్వలున్నాయి. ప్రస్తుతం 110 ఓపెన్రీచ్ల్లో సుమారు 77 లక్షల టన్నుల తవ్వకాలకు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లున్నాయి. కానీ, వరదలు, వర్షాల కారణంగా కొన్నిచోట్ల తవ్వకాలు నిలిచిపోయాయి. 42 డీసెల్టింగ్ పాయింట్లలో జరుగుతున్న ఇసుకకు సంబంధించి 90 లక్షల టన్నులకు అనుమతులున్నాయి. మైనింగ్ ఆదాయంలో పురోగతి మైనింగ్ రెవెన్యూ విషయానికొస్తే జగన్మోహన్రెడ్డి గారి ప్రభుత్వం చేపట్టిన నూతన సంస్కరణలు మెరుగైన ఫలితాల్ని తెచ్చిపెట్టాయి. చంద్రబాబు పాలనలో కంటే ఇప్పుడు మైనింగ్ రెవెన్యూలో చాలా పురోగతిని సాధించామని చెబుతున్నాం. 2018–19లో అంటే చంద్రబాబు హయాంలో రూ.1950 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి వస్తే.. 2022–23 నాటికి అంటే, ఇప్పుడు జగన్ గారి హయాంలో రూ.4756 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అదేవిధంగా ఏపీఎండీసీ విషయానికొస్తే చంద్రబాబు ఉన్నప్పుడు (2018–19) రూ.833 కోట్లు వస్తే.. మా హయాంలో (ప్రస్తుతం) రూ.1806 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి చేరింది. -ఇలా మేము ప్రభుత్వానికి ఆదాయం వచ్చే సంస్కరణలతో ముందుకు పోతున్నాం. మరోవైపు చంద్రబాబు మాత్రం అసత్యాల్ని అల్లుతూ ప్రభుత్వంపై బురదజల్లే ఆరోపణలు చేస్తున్నారు. ఆయనకు అధికారం లేదనే తీవ్రమైన ఫ్రస్టేషన్‌తో ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియకుండా ఉన్నాడు. -ఇసుక తవ్వకాలపై గతంలో పవన్‌కళ్యాణ్, లోకేశ్‌లు కూడా మాట్లాడినప్పటికీ.. వారిద్దరికీ ఈ విషయంపై అంతగా అవగాహన ఉండదు కనుక పెద్దగా పట్టించుకునేదిలేదు. చంద్రబాబు ఊహాజనితమైన లెక్కలతో ఆరోపణలు చేసి తన స్థాయిని మరింత దిగజార్చుకోవద్దని.. ఇలాగే మాట్లాడితే.. ప్రజల చేతుల్లో పరాభవం కావడం ఖాయమని హెచ్చరిస్తున్నాను. మీడియా ప్రశ్నలకు సమాధానంగా.. జేపీ కాంట్రాక్టు కాలపరిమితి ఏడాది పెంపు జేపీ పవర్ వెంచర్స్ కంపెనీ కాంట్రాక్టు కాలపరిమితిని మరో ఏడాదికి పొడిగించాం. ఆ ఉత్తర్వులతోనే ప్రస్తుతం జేపీ సంస్థ తవ్వకాలు జరుపుతుంది. సబ్ కాంట్రాక్టు అగ్రిమెంట్లతో ప్రభుత్వానికి ఏమీ సంబంధంలేదు. ప్రభుత్వంతో కాంట్రాక్టు కుదుర్చుకున్న కంపెనీ, వారికి అనుబంధంగా ఇతర సంస్థలకిచ్చిన సబ్‌కాంట్రాక్టుల వ్యవహారాలు కూడా మా దృష్టికి రాలేదు. ఇది కూడా చదవండి: వైఎస్సార్ సీపీలో చేరిన జనసేన అభ్యర్థి -
చంద్రబాబు హయాంలోనే అరాచక పాలన: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, చిత్తూరు: చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడే అరాచక పాలన సాగిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యర్థి పార్టీల నాయకులను చంపించిన చరిత్ర చంద్రబాబుదే. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే రాజకీయ హత్యలు జరిగాయి. చంద్రబాబు ష్యూరిటీ ఇస్తానంటే జనం నవ్వుకుంటున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. ప్రజలకు మంచి చేయడంలో సీఎం జగన్ కాలి గోటికి చంద్రబాబు సరిపొడు. ఏనాడైనా చంద్రబాబు ఇచ్చిన మాట అమలు చేశాడా. చంద్రబాబుని నమ్మితే మునిగిపోతారని ప్రజలకు తెలుసు’’ అని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు మేనిఫెస్టోకి గ్యారంటీ లేదు: ఎంపీ మిథున్‌రెడ్డి దేశంలో ఏ సర్వే చూసిన ఏపీలో వై ఎస్సార్ కాంగ్రెస్‌దే విజయం అని చెబుతున్నాయని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. చంద్రబాబు మాత్రం సీ ఓటర్ ప్రకటించని సర్వేని ప్రచారం చేసుకుంటున్నారు. బోగస్ సర్వే అంకెలతో చంద్రబాబు తృప్తి పడుతున్నారు. సీ ఓటర్ సర్వే నివేదికను ఎక్కడైనా ప్రకటించిందా..? చంద్రబాబు చూపించాలి. చంద్రబాబు ష్యూరిటీని ని జనం నమ్మే పరిస్థితి లేదు. చంద్రబాబు మేనిఫెస్టోకి గ్యారంటీ లేదు’’ అంటూ మిథున్‌రెడ్డి వ్యాఖ్యానించారు. చదవండి: సినిమా రేంజ్లో సీన్లు పండించిన పవన్.. ప్లాన్ బెడిసికొట్టింది! -
నీ జీవితమంతా అబద్ధాలే
సాక్షి, తిరుపతి : రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక, ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇసుక దోపిడీ అంటూ చంద్రబాబునాయుడు అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర గనులు, ఇంధన, అటవీ, పర్యావరణ, శాస్త్ర–సాంకేతిక శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబు జీవితమంతా అబద్ధాలేనని ధ్వజమెత్తారు. నాడు నీ ఇంటి వెనుకే యథేచ్ఛగా ఇసుక దోపిడీ సాగుతుంటే నిద్రపోయావా? అంటూ నిలదీశారు. తిరుపతిలోని క్యాంప్ కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజా సమస్యలపై మాట్లాడే పరిస్థితి లేనందున ఇసుక దోపిడీ అంటూ చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేరుతో అర్థంలేని ఆరోపణలకు దిగాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని దూషించడం, సీఎంపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం, అబద్ధాలను నిజాలుగా భ్రమింపచేసే దిగజారుడు పనులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం నిర్వహించిన ఇసుక టెండర్లలో చంద్రబాబు ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. టెండర్లు దక్కించుకున్న సంస్థ టన్నుకు రూ.375 ప్రభుత్వానికి చెల్లించాలని, మరో రూ.వంద వారి అడ్మినిస్ట్రేటివ్ ఖర్చు కింద తీసుకుంటుందని వివరించారు. మొత్తంగా టన్ను ఇసుక రూ.475 చొప్పున విక్రయించాలన్నారు. ఇందుకు భిన్నంగా ఎక్కడైనా జరిగితే ప్రజలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని నియోజకవర్గాల వారీగా, డిపోల వారీగా రవాణా చార్జీలతో కలిపి ప్రభుత్వం నిర్ణయించిన రేట్లను ప్రతివారం పత్రికల్లో ప్రకటిస్తున్నామని స్పష్టం చేశారు. ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్, రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు, గనుల శాఖ రీజనల్ స్క్వాడ్స్, ఎస్ఈబీ తనిఖీల ద్వారా అక్రమాలకు తావులేకుండా చేశామని చెప్పారు. మంత్రి ఇంకా ఏం చెప్పారంటే.. పారదర్శక విధానం.. ఎన్జీటీ సంతృప్తి ♦ వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే కేబినెట్ సబ్ కమిటీని నియమించి, పారదర్శకంగా కొత్త ఇసుక విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ప్రజలకు సులభంగా తక్కువ ధరకు అందించేలా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ ద్వారా ఇసుక తవ్వకాల టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. పర్యావరణానికి ఎటువంటి విఘాతం కలగకుండా పూర్తి అనుమతులతో ఇసుక తవ్వకాలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక పాలసీ ద్వారా తీసుకున్న చర్యలను పరిశీలించిన ఎన్జీటి సైతం సంతృప్తి వ్యక్తం చేసింది. ♦ గత సర్కారు హయాంలో వర్షాకాలంలో నాలుగు నెలల పాటు ఇసుక లభించక రాష్ట్రంలో భవన నిర్మాణ పనులు నిలిచిపోయేవి. కార్మికులు ఉపాధి లేక ఇబ్బందులు పడేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక వర్షాకాలంలోనూ ఇసుక పుష్కలంగా లభ్యమయ్యేలా దాదాపు 50 లక్షల టన్నులకుపైగా ఇసుకను డిపోల్లో నిల్వ చేసేలా చర్యలు తీసుకుంది. దీంతో ఎక్కడా నిర్మాణ పనులకు ఆటంకం ఏర్పడటం లేదు. ప్రభుత్వ ఆదాయం పెరిగితే దోపిడీ జరిగినట్లా? ♦ 2018–19లో టీడీపీ ప్రభుత్వం దిగిపోయేప్పుడు మైనింగ్ రెవెన్యూ రూ.1,950 కోట్లు. ఆ రోజు మైనర్ మినరల్స్‌లో రూ.1,263 కోట్ల ఆదాయం కాగా, మేజర్ మినరల్స్‌లో రూ.687 కోట్లు. 2022–23లో రూ.4,756 కోట్ల మైనింగ్ రెవెన్యూ వస్తే, అందులో మైనర్ మినరల్స్‌లో రూ.3,882 కోట్లు, మేజర్ మినరల్స్‌లో రూ.874 కోట్లు వచ్చింది. మా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించకపోయి ఉంటే ఆ రూ.1,950 కోట్ల వద్దే ఉండేవాళ్లం. ♦ ఏపీఎండీసీకి 2018–19లో రూ.833 కోట్ల ఆదాయం వస్తే, 2022–23 లో రూ.1,800 కోట్లు, 2023–24లో రూ.4 వేల కోట్ల వరకు వస్తుందని అంచనా. దాదాపు రెండు, మూడు రెట్లు రెవెన్యూ పెరిగితే, మైనింగ్‌లో దోపిడీ అంటున్న చంద్రబాబు వ్యాఖ్యలు అర్థరహితం. మీకు మళ్లీ భంగపాటు తప్పదు ♦ ఆరోపణలు చేసి, ప్రజలను తప్పుదోవ పట్టించి, రాజకీయంగా దివాలాకోరుగా మారి అధికారంలోకి రావాలని చంద్రబాబు చూస్తున్నారు. ఎవరు ఎక్కువ రౌడీయిజం చేస్తే, ఎవరిపై ఎక్కువ కేసులు ఉంటే వారికి నామినేటెడ్ పదవులు ఇస్తానని అంటున్నారు. యుద్ధానికి రండి... జైలుకు పోయినా పరవాలేదని అధికారంలోకి రావాలని చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అంటున్నారు. చంద్రబాబు, లోకే‹Ô , పవన్ ఈ ముగ్గురు కలిసి ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం చేస్తున్నారు. వీరికి మరోసారి భంగపాటు ఖాయం. ♦ రాబోయే ఎన్నికల్లో మరింత ఎక్కువ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వస్తాం. సీఎం వైఎస్ జగన్ చరిష్మా ఉన్న నేత. నాడు చంద్రబాబు చేర్పించిన 60 లక్షల దొంగ ఓట్లు తొలగిస్తుంటే ఎల్లో గ్యాంగ్ గగ్గోలు పెడుతోంది. ఒక్క కుప్పంలోనే 36 వేల దొంగ ఓట్లు ఉన్నాయి. దొంగ ఓట్ల విషయమై ఈ నెల 28వ తేదీన మా ఎంపీలు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని, కేంద్ర హోంమంత్రిని కలవనున్నారు. ♦ విలేకరుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు. చింతమనేని వికృత చేష్టలు ♦ ఇసుక మాఫియాను అడ్డుకున్న మహిళా తహసీల్దార్ వనజాక్షిపై టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ దారుణంగా దాడికి పాల్పడ్డ ఘటనను ఎవరూ మరచిపోలేరు. అక్రమ తవ్వకాలను అడ్డుకున్నదని ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చేశారు. టీడీపీ హయాంలో ఆగడాలకు ఈ ఘటనే మచ్చుతునక. నాడు ఇష్టారాజ్యంగా కృష్ణా నదిలో ఇసుక తవ్వకాలు చేయడంతో ఒక బోటు బోల్తాకొట్టి పలువురు మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. ♦ ఇసుకపై జీఎస్టీ వసూలు చేయలేదని చంద్రబాబు మాట్లాడుతున్నారు. జీఎస్టీ వసూళ్లు కేంద్ర ప్రభుత్వ విభాగాలు చూసుకుంటాయి. దాంతో రాష్ట్రానికి ఏం సంబంధం? నాడు ఉచిత ఇసుక పేరుతో దోచుకున్న డబ్బులతో నువ్వు, మీ కుమారుడు జేబులు నింపుకోలేదా? చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌కు ఇసుకను తరలించలేదా? ఉచితంగా ఎవరికైనా ఇచ్చావా? ♦ టీడీపీ హయాంలో తొలుత మహిళా సంఘాలకు ఇసుక తవ్వకాలను అప్పగించినా పచ్చమూకల బెదిరింపులతో నిస్సహాయ పరిస్థితి సృష్టించి వారి చేతి నుంచి తప్పించేశారు. ఆ తర్వాత ఉచిత ఇసుక విధానం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మాఫియా నెట్వర్క్ ఆవిర్భవించింది. వినియోగదారులు బ్లాక్ మార్కెట్ నుంచి అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన ఆగత్యం కల్పించారు. ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా ఆదాయం రాకుండా చేసి అక్రమ తవ్వకాలతో పచ్చ మూకలు జేబులు నింపుకున్నాయి. ప్రజలకు ఇసుక అందకుండా బ్లాక్ మార్కెట్ సృష్టించి దోపిడీకి పాల్పడ్డారు. నాడు చంద్రబాబు ఉచిత ఇసుకను ఎవరికీ ఇవ్వలేదు. ♦ చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఇంటి వెనుకే అక్రమంగా ఇసుక తవ్వకాలు రేయింబవళ్లు యథేచ్ఛగా జరిగేవి. వందల సంఖ్యలో లారీలు ఆయన ఇంటి ముందు నుంచే హైదరాబాద్‌కు తరలిపోయేవి. అప్పుడు వసారాలో తాపీగా కూర్చొని కళ్లప్పగించి చూసిన చంద్రబాబు.. ఇప్పుడు దోపిడీ జరుగుతోందంటూ నిందలు వేయడం దుర్మార్గం. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇసుక దోపిడీ నిజమేనని తేలడంతో జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఏకంగా రూ.100 కోట్ల జరిమానా విధించడం ఎవరూ మరచిపోలేదు. నాడు రూ.43 వేల కోట్లు మీరు దోచేసినట్లే! ♦ రూ.40 వేల కోట్ల ఇసుక అక్రమాలు జరిగాయని ఏ లెక్కల ప్రకారం మాట్లాడుతున్నావు? టెండర్ల ద్వారా రాష్ట్రంలో ఇసుక తవ్వకాల కాంట్రాక్టును దక్కించుకున్న జేపీ వెంచర్స్ సంస్థ ఏటా ప్రభుత్వానికి రూ.765 కోట్లు చెల్లిస్తోంది. ఈ నాలుగేళ్లలో సుమారు రూ.3 వేల కోట్ల ఆదాయం లభించింది. ♦ చంద్రబాబు చెబుతున్న లెక్కల ప్రకారం రూ.40 వేల కోట్లు, మా ప్రభుత్వ హయాంలో వచ్చిన రూ.3 వేల కోట్లు కూడా కలిపితే మొత్తం 43 వేల కోట్లు.. మీ ఐదేళ్ల పాలనలో కూడా వచ్చి ఉండాలి కదా? మరి ఆ డబ్బు అంతా మీరు దోపిడీ చేశారని అంగీకరిస్తావా చంద్రబాబూ? నాటి తప్పులన్నీ నేడు జరిగినట్లు ప్రజలను భ్రమింపజేయాలన్నదే మీ ఉద్దేశం అని అర్థమవుతోంది. -
‘చంద్రబాబూ.. ఆ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి?’
సాక్షి, తిరుపతి: ప్రభుత్వంపై చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 14 ఏళ్లలో చంద్రబాబు ఒక్క సంక్షేమ పథకమైనా అమలు చేశారా?. చంద్రబాబు తనదని చెప్పుకోవడానికి ఒక్క స్కీమూ లేదు. ఒక్క ప్రాజెక్టునైనా చంద్రబాబు పూర్తి చేశారా?’’ అంటూ ప్రశ్నించారు. ‘‘సంక్షేమమంటే వైఎస్సార్, వైఎస్ జగన్ గుర్తుకు వస్తారు. ఇసుక అక్రమాలకు పాల్పడితే కఠిన శిక్షలు అమలు చేస్తున్నాం. ఇసుక టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాం. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇసుకకు కొరత లేదు. కేబినెట్ సబ్ కమిటీ ద్వారా ఇసుక పాలసీ తీసుకువచ్చాం. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎంఎస్టీసీ ద్వారా టెండర్లు పిలిచాం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉచిత ఇసుక పేరుతో డబ్బులు వసూలు చేశారా లేదా..? ఎవరి జేబుల్లోకి వెళ్లాయి’’ అంటూ మంత్రి పెద్దిరెడ్డి నిలదీశారు. చదవండి: చంద్రబాబు ప్లాన్ అట్టర్‌ప్లాప్.. ఆంధ్రజ్యోతి ఎంత పనిచేసింది! -
దొంగ ఓట్ల పాపం చంద్రబాబుదే
మడకశిర/హిందూపురం: రాష్ట్రంలో దొంగ ఓట్ల పాపం చంద్రబాబు దేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఆయన శుక్రవారం శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో స్థానిక మాజీ ఎమ్మెల్యే దివంగత వైసీ తిమ్మారెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ 2018లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల దొంగ ఓట్లు నమోదయ్యాయని తెలిపారు. వారి హయాంలో నమోదు చేసిన దొంగ ఓట్లను కాపాడుకోవడానికే చంద్రబాబు ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. వీటిపై తాము కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఎంపీల బృందంతోపాటు రాష్ట్ర మంత్రుల బృందం కూడా ఢిల్లీకి వెళ్లి దొంగ ఓట్లపై ఈసీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. మడకశిర ప్రాంతంలో వన్యప్రాణుల మృతిపై విచారణ చేయిస్తామని తెలిపారు. వన్యప్రాణుల మృతికి కారకులపై చర్యలు తీసుకుంటామన్నారు. కుప్పం, హిందూపురమూ మనవే: పెద్దిరెడ్డి ‘కలసికట్టుగా పనిచేస్తే సాధించలేనిది ఏదీ లేదు. వచ్చే ఎన్నికల్లో కుప్పం మనదే. హిందూపురమూ మనదే...’ అని పెద్దిరెడ్డి అన్నారు. హిందూపురంలోని బైపాస్ రోడ్డులో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం, హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. టీఎన్ దీపిక, ఏపీ ఆగ్రోస్ చైర్మన్ నవీన్‌నిశ్చల్ మాట్లాడారు. ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు శంకరనారాయణ, సిద్దారెడ్డి, తిప్పేస్వామి, ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, కురుబ కార్పొరేషన్ చైర్మన్ కోటి సూర్యప్రకాష్ బాబు, వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ రామచంద్ర, మునిసిపల్ చైర్పర్సన్ ఇంద్రజ, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ఘనీ పాల్గొన్నారు. -
చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి నాన్ స్టాప్ పంచులు
-
పచ్చ గూండాలు పేట్రేగిన వేళ..
సాక్షి, చిత్తూరు, పుంగనూరు (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా పుంగనూరులో ఇటీవల తెలుగుదేశం పార్టీ సృష్టించిన విధ్వంసంలో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. పక్కా ప్రణాళిక, భారీ వ్యూహంతోనే ఈ దాడులు జరిగినట్లు స్పష్టమవుతోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువైన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపడం, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రాజకీయంగా అణగదొక్కటమే లక్ష్యంగా టీడీపీ ఈ దాడులకు వ్యూహ రచన చేసింది పక్కా ప్రణాళికతో జిల్లా నలుమూలల నుంచి టీడీపీకి చెందిన గూండాలను ఎంపిక చేసి మరీ పుంగనూరుకు తెచ్చినట్లు వెల్లడైంది. వారిపై జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో అనేక కేసులు ఉన్నాయి. వీరిని ముందుగానే మారణాయుధాలతో సహా పుంగనూరులో మోహరించారు. చంద్రబాబు పర్యటనను కూడా వ్యూహాత్మకంగా పుంగనూరుకు వచ్చేలా మార్పు చేశారు. ముందస్తు షెడ్యూల్లో లేకపోయినా, పోలీసుల అనుమతి లేకుండానే దాడుల కోసమే ఆయన పుంగనూరు వచ్చారు. చంద్రబాబు వస్తూనే టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టడం, వెనువెంటనే విధ్వంసం సృష్టించడం.. అంతా వ్యూహం ప్రకారం చేశారు. కర్రలు, రాళ్లు, మద్యం సీసాలు, ఇతర మారణాయుధాలతో వందల సంఖ్యలో పోలీసులపై విరుచుకుపడ్డారు. ఈ దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు. ఓ కానిస్టేబుల్ ఓ కంటి చూపు కోల్పోయాడు. అయితే, పోలీసులు చాలా సహనంతో వ్యవహరించడంతో టీడీపీ వ్యూహం బెడిసికొట్టింది. పుంగనూరు విధ్వంసంలో ఇప్పటి వరకు ఏడు నేరాలకు సంబంధించి మొత్తం 277 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో పాల్గొన్న వారిని పోలీసులు ఆధారాలతో సహా గుర్తించారు. వారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మంగళవారం వరకు 90 మందిని అరెస్ట్ చేశారు.వారికి కోర్టు రిమాండ్ విధించడంతో కడప సెంట్రల్ జైలుకు తరలించారు. పోలీసులపై దాడి కేసులో ప్రధాన నిందితుడు చల్లా బాబుతోపాటు కుట్ర, వ్యూహ రచన, దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న పలువురిని పోలీసులు గుర్తించారు. వారి గత చరిత్రను కూడా నిశితంగా పరిశీలించారు. దాడుల్లో భాగస్వాములైన వారిలో ఎక్కువ మంది పాత నేరాల చరిత్ర చూసి పోలీసులే షాక్ అయ్యారు. వారిలో కొందరి నేర చరిత్ర ఇదీ.. 1. నేరాల్లో ఘనుడు చల్లా బాబు పుంగనూరులో దాడి కేసులో ప్రధాన సూత్రదారి, పాత్రదారి ఆ నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి చల్లా బాబు అలియాస్ చల్లా రామచంద్రారెడ్డి అని పోలీసులు తేల్చారు. దాడులకు కుట్ర పన్నడం, వ్యూహాన్ని అమలుపరచడంలో ఇతనిదే ప్రధాన పాత్రగా పోలీసులు నిర్ధారించారు. చల్లా బాబు గత చరిత్ర అంతా నేర పూరితమేనని పోలీసు విచారణలో తేలింది. పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయి. ఇతను ఆలయ భూములు, ప్రభుత్వ భూముల ఆక్రమణకు పాల్పడినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. చల్లా బాబుపై ఉన్న పాత కేసుల్లో మచ్చుకు కొన్ని.. 1.1985లో రొంపిచెర్ల పోలింగ్ స్టేషన్‌పై బాంబు దాడి కేసు 2. రొంపిచెర్ల క్రైం నం.368, 2021లో ఐపీసీ సెక్షన్లు, 143, 188, 341,269, 270, 290 రెడ్‌విత్ 149 ఐపీసీ, సెక్షన్ 3 ఈడీయాక్ట్ 3. క్రైం నం.18–2021 ఐపీసీ సెక్షన్లు 353, 506 రెడ్‌విత్ 34 కింద కేసు 4. క్రైం నం.8–2022 ఐపీసీ సెక్షన్లు 188, 341 కింద చౌడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు 5. క్రైం నం.89–2023 ఐపీసీ సెక్షన్లు 143, 341, 506 రెడ్‌విత్ 149 కింద సోమల పీఎస్‌లో కేసు 6. క్రైం నం.72–2022 ఐపీసీ సెక్షన్లు› 341, 143, 290 రెడ్‌విత్ 149 కింద కేసు 7. క్రైం నం.26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రెడ్‌విత్ 149 కింద కల్లూరు పోలీసు స్టేషన్లో కేసు 2. టీఎం బాబు (40) ఊరు: తొట్లిగానిపల్లి, గుడిపల్లి, కుప్పం నియోజకవర్గం పార్టీలో హోదా: టీడీపీ మండల అధ్యక్షుడు పాత కేసులివీ.. 1. క్రైం నం.30–2009లో గుడిపల్లి పీఎస్‌లో పరిధిలో జరిగిన కేసు 2. క్రైం నం.171 ఇ, 506, 8–బి–1, ఏపీపీయాక్ట్ 3. క్రైం నం.165–2010 ఐపీసీ 392 సెక్షన్ల కింద కుప్పం పోలీస్ స్టేషన్లో కేసు 3. క్రైం నం.38–2022 ఐపీసీ సెక్షన్ 448, 427, 323, 324, రెడ్‌విత్ 34 కింద గుడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు 3. భాష్యం విశ్వనాథనాయుడు (45) మండలం: శాంతిపురం, కుప్పం నియోజకవర్గం పార్టీ హోదా: టీడీపీ మండల అధ్యక్షుడు పాత కేసులు: 3 కేసుల్లో నిందితుడు 1. క్రైం నం.191–2021, ఐపీసీ సెక్షన్లు 143, 341, 506, 188, 59 డీఎంఏ, ఈడీఏ కింద రాళ్ళబుదుగూరు పోలీస్ స్టేషన్లో కేసు 2. క్రైం నం.73–2022, ఐపీసీ సెక్షన్లు 177 ,182, 155 సెక్షన్ల కింద రెండో కేసు 3. రామకుప్పం పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైం నం.130–2022 , ఐపీసీ సెక్షన్లు 143, 147, 148, 307, 324తో పాటు రెడ్‌విత్ 149 కింద కేసు 4. జి.దేవేంద్ర (31) ఊరు: గోపన్నగారిపల్లి, పులిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం పార్టీలో హోదా: తెలుగు యువత మండల అధ్యక్షుడు పాత కేసులు: కల్లూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో క్రైం నం.26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రెడ్‌విత్ 149 కింద కేసు నమోదైంది. 5. లెక్కల ధనుంజయనాయుడు ఊరు: కొక్కువారిపల్లి, పులిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం పార్టీలో హోదా: టీడీపీ రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ ఆర్గనైజింగ్ సెక్రటరీ పాత కేసులు: రెండుకేసుల్లో నిందితుడు 1. క్రైం. నం. 26–2022 నంబరుతో కల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఐపీసీ సెక్షన్ 341, 506, 353, 143, 147, 148, రెడ్‌విత్ 149 కింద కేసు నమోదు 2. క్రైం.నం. 368– 2021. రొంపిచెర్ల పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్లు 143, 188, 341, 269, 270, 290 రెడ్‌విత్ 149 ఐపీసీ, సెక్షన్ 3 ఈడీ యాక్ట్ కింద కేసులు 6. ముల్లంగి వెంకటరమణ (52) ఊరు: ముల్లంగివారిపల్లి, పులిచెర్ల మండలం పార్టీలో హోదా: టీడీపీ ఎస్సీ సెల్ స్టేట్ ప్రిన్సిపల్ సెక్రటరీ పాత కేసులు: మూడు కేసుల్లో నిందితుడు 1.క్రైం. నం. 26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148, రెడ్‌విత్ 149 ఐపీసీ కింద కల్లూరు పోలీస్ స్టేషన్లో కేసు 2. ఇదే స్టేషన్ పరిధిలో క్రైం.నం. 35–2017 ఐపీసీ సెక్షన్లు 447, 427, 324తోపాటు 34 ఐపీసీ కింద కేసు నమోదు 3. ఇక్కడే క్రైం. నం. 140–2021, ఐపీసీ సెక్షన్లు 353, 341 రెడ్ విత్ 34 కింద మరో కేసు 7. నూకల నాగార్జున నాయుడు (33) ఊరు: బొడిపటివారిపల్లి, పులిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం పార్టీలో హోదా: టీడీపీ మండల యువనేత, రాష్ట్ర ఐటీ విభాగం సభ్యుడు పాత కేసులు: ఆరు కేసుల్లో నిందితుడు. రొంపిచెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు, కల్లూరులో 1 , సోమల పరిధిలో మరొక కేసు 1. క్రైం.నం. 368–2021 ఐపీసీ 134, 188, 341, 269, 270, 290 రెడ్ విత్ 149 ఐపీసీతో పాటు సెక్షన్ 3 కింద ఈడీయాక్ట్ నమోదు 2. క్రైం.నం. 2–2023 ఐపీసీ సెక్షన్లు 143, 147, 148, 506 రెడ్ విత్, 149 3. క్రైం.నం. 374–2021 ఐపీసీ సెక్షన్లు 153, 153ఏ, 120బీ, 506, 507 4. క్రైం.నం. 5–2022 ఐపీసీ సెక్షన్లు 153, 427, 290 రెడ్ విత్ 34 ఐపీసీ 5. క్రైం.నం. 26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రెడ్ విత్ 149 ఐపీసీ 6. క్రైం.నం. 149–2022 ఐపీసీ సెక్షన్లు 143, 148, 354డీ, 324, 506, 509 రెడ్‌విత్ 149 8. ఇ. క్రిష్ణమూర్తినాయుడు (55) ఊరు: రాయవారిపల్లి గ్రామం, రొంపిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం పార్టీలో హోదా: టీడీపీ మండల అధ్యక్షుడు పాత కేసులు: ఇతనిపై కల్లూరు పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి 1 క్రైం.నం. 26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 506, 353, 143, 147, 148 రెడ్‌విత్ 149 2. క్రైం.నం. 12–2021, ఐపీసీ సెక్షన్లు 353, 506, రెడ్ విత్ 34 ఐపీసీ 9. నాగిశెట్టి నాగరాజ (38) ఊరు: బొమ్మయ్యగారిపల్లి గ్రామం, రొంపిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం హోదా: మండలం తెలుగు యువత అధ్యక్షుడు పాత కేసులు: ఇతనిపై ఐదు కేసులు ఉన్నాయి. కల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 3, రొంపిచెర్లలో మరో రెండు కేసులు 1. క్రైం.నం. 140–2021, ఐపీసీ సెక్షన్లు 353, 341 రెడ్‌విత్ 34 2. క్రైం.నం. 368–2021 ఐపీసీ సెక్షన్లు 143, 188, 341, 269, 270, 290 రెడ్‌విత్ 149తో పాటు సెక్షన్ 3 ఈడీ యాక్ట్ 3. క్రైం.నం. 26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రెడ్ విత్ 149 ఐపీసీ. 4. క్రైం.నం. 2–2023 ఐపీసీ సెక్షన్లు 143, 147, 148, 506 రెడ్‌విత్ 149 ఐపీసీ. 5. క్రైం.నం. 350–2021 ఐపీసీ సెక్షన్లు 151 సీఆర్పీసీ 10. కె.సహదేవుడు (50) ఊరు: బొమ్మయ్యగారిపల్లి గ్రామం, రొంపిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం పార్టీలో హోదా: రొంపిచెర్ల మండలం బొమ్మయ్యగారి పల్లి ఎంపీటీసీ పాత కేసులు: రొంపిచెర్ల, మరికొన్ని స్టేషన్లలో 8 కేసుల్లో నిందితుడు 1. క్రైం.నం. 89–2014 ఐపీసీ సెక్షన్లు 447, 506 రెడ్‌విత్ 34 2. క్రైం.నం. 331–2020 సీఆర్పీసీ 151 3. క్రైం.నం. 365–2020 సీఆర్పీసీ 151 4. క్రైం.నం. 14–2021 ఐపీసీ సెక్షన్లు 188 , 353, 506, రెడ్ విత్ 34 5. క్రైం.నం. 356–2021 ఐపీసీ సెక్షన్ 151 6. క్రైం.నం. 368–2021 ఐపీసీ 143, 188, 341, 269, 270, 290 రెడ్‌విత్ 149 7. క్రైం.నం. 9–2022 ఐపీసీ సెక్షన్లు 447, 427, 506, 143 రెడ్‌విత్ 149 8. క్రైం.నం. 10–2022 ఐపీసీ సెక్షన్లు 341, 323, 506, 153 11. ఉయ్యాల రమణ (44) ఊరు: బొమ్మయ్యగారిపల్లి, రొంపిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం హోదా: రొంపిచెర్ల మండలం టీడీపీ అధ్యక్షుడు పాత కేసులు: కల్లూరు , రొంపిచెర్ల, సోమల పోలీస్స్టేషన్ల పరిధిలో 8 కేసుల్లో నిందితుడు 1. క్రైం.నం. 140–2021 ఐపీసీ సెక్షన్ 353, 341 రెడ్ విత్ 34 2. క్రైం.నం. 368 – 2021 ఐపీసీ సెక్షన్లు 143, 188, 341, 269,270, 290 రెడ్‌విత్ 149 ఐపీసీతోపాటు 3 ఈడీ యాక్ట్ 3. క్రైం.నం. 2–2023 ఐపీసీ సెక్షన్లు 143, 147, 148, 506 రెడ్‌విత్ 149 4. క్రైం.నం.15–2021 ఐపీసీ సెక్షన్లు 188, 506 రెడ్‌విత్ 34 ఐపీసీ 5. క్రైం.నం.40 – 2014 ఐపీసీ సెక్షన్లు 307, 326, 324 రెడ్‌విత్ 34 6. క్రైం.నం. 26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రెడ్‌విత్ 149 7. క్రైం.నం.140–2021 ఐపీసీ సెక్షన్లు 353, 341 రెడ్‌విత్ 34 8. క్రైం.నం. 89–2023 ఐపీసీ సెక్షన్లు 143, 341, 506 రెడ్‌విత్ 149 ఏ ఒక్కర్నీ వదలం పుంగనూరు దుశ్చర్యలో పోలీసుల రక్తం కళ్ల చూసిన ప్రతి ఒక్కరినీ వదలం. చట్ట ప్రకారం ముందుకెళ్తాం. బందోబస్తు డ్యూటీ కోసం వచ్చిన పోలీసులను మట్టుపెట్టాలని చూడటం, రాళ్లు, మద్యం బాటిళ్లు విసరడంపై మా వద్ద అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. వీడియో ఫుటేజీల ఆధారంగా ఇప్పటికే పలువురిని అరెస్టు చేశాం. ప్రధాన నిందితుల కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఆరోజు పోలీసులు అడ్డుపడకపోతే పుంగనూరు టౌన్లోకి పోయి విధ్వంసం సృష్టించేవాళ్లు. నిందితులపై చట్టరీత్యా చర్యలు తప్పవు.– వై.రిషాంత్‌రెడ్డి, ఎస్పీ, చిత్తూరు -
విద్యుత్ ఉద్యోగులతో ఫలించిన చర్చలు
సాక్షి, అమరావతి: విద్యుత్ ఉద్యోగులతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో ఉద్యోగుల ఆందోళనకు తెరపడింది. గురువారం తలపెట్టిన సమ్మె ప్రతిపాదనను కూడా వారు ఉపసంహరించుకున్నారు. పే రివిజన్లో భాగంగా డిమాండ్ల సాధన కోసం గత నెల 27 నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన ఉద్యోగులు ఈనెల 10 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని వెల్లడించారు. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (ఏపీఎస్‌పీఈజేఏసీ) నోటీసు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీఎస్‌పీఈజేఏసీ ప్రతినిధులతో ప్రభుత్వం బుధవారం సచివాలయంలో చర్చలు జరిపింది. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ సమక్షంలో ఈ చర్చలు జరిగాయి. ఇది ఉద్యోగుల అనుకూల ప్రభుత్వమని, అందరికీ మేలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విద్యుత్ ఉద్యోగులకు తెలిపారు. విద్యుత్ సంస్థలను కాపాడుకునేందుకు యాజమాన్యం, ఉద్యోగులు ఎంతో కొంత త్యాగం చేయాల్సిన అవసరం ఉందని మంత్రులు, అధికారులు సూచించారు. అనామలీస్ ఉంటే సరిచేసి పేస్కేలును నిర్ధారించడానికి ఏపీజెన్కో ఎండీ నేతృత్వంలో డిస్కంల సీఎండీలతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసేలా అంగీకారం కుదిరింది. సింగిల్ మాస్టర్ స్కేల్ పీపీతో కలిపి రూ.2.60 లక్షలు, 8 శాతం ఫిట్మెంట్, ఒక డీఏ విడుదల, 12 వాయిదాల్లో బకాయిలు, వైద్య పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు, మాస్టర్ స్కేల్ రూ.2.60 లక్షలు దాటిన వారికి తప్పనిసరిగా పర్సనల్ పే, అవుట్సోర్సింగ్ సిబ్బందికి 2018 స్కేల్ ప్రకారం జీతాలతో పాటు అదనంగా 2 శాతం పెంపునకు యాజమాన్యాలు, ఉద్యోగ సంఘాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. యాజమాన్యం ప్రతిపాదనలను ఆమోదిస్తున్నట్లు జేఏసీ ప్రతినిధులు ప్రకటించారు. ఈ మేరకు పీఆర్సీ ప్రతిపాదనలను ఆమోదిస్తూ ఏపీ ట్రాన్స్‌కో, ఏపీజెన్కో, ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు, జేఏసీ ప్రతినిధుల మధ్య శుక్రవారం ఒప్పందం జరుగుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఈ చర్చల్లో సీఎస్ జవహర్‌రెడ్డి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్, ఏపీజెన్కో ఎండీ చక్రధర్‌బాబు, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పద్మాజనార్దన్ రెడ్డి, ట్రాన్స్‌కో జేఎండీ మల్లారెడ్డి, జేఏసీ నేతలు చంద్రశేఖర్, ప్రతాప్‌రెడ్డి, సాయికష్ణ, శేషారెడ్డి, శ్రీనివాస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు వెళ్లే ఆస్కారం లేదు: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యుత్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష ముగిసింది. ఈ సమీక్షలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం, మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లపై సీఎం జగన్‌తో చర్చించాం. విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు వెళ్లే ఆస్కారం లేదు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు మంత్రుల సబ్ కమిటీ సమావేశం జరుగుతుంది. ఉద్యోగుల సమ్మె నోటీసులోని డిమాండ్ల పరిష్కారంపై చర్చిస్తాం. డిమాండ్ల పరిష్కారంపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఉద్యోగ సంఘాలతోనూ చర్చలు జరుపుతాం’ అని తెలిపారు. ఇది కూడా చదవండి: ఏదో జరిగిపోతున్నట్టు రామోజీ తప్పుడు రాతలు రాస్తున్నారు: మంత్రి అంబటి -
పుంగనూరు ఘటనకు చంద్రబాబే కారణం: మంత్రి పెద్దిరెడ్డి
-
చంద్రబాబుకు సొంత ప్రాంతంపై మమకారం లేదు: మంత్రి పెద్దిరెడ్డి
-
గణనీయంగా పెరిగిన పులుల సంఖ్య
తిరుపతి మంగళం/ మార్కాపురం: ఏపీలో పెద్దపులుల సంరక్షణ, సంఖ్య పెరగడంలో అటవీశాఖ గణనీయమైన వృద్ధి సాధిస్తోందని రాష్ట్ర అటవీ, విద్యుత్తు, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో గ్లోబల్ టైగర్స్ డే శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఏపీలోని నల్లమల అడవుల్లో గత సంవత్సరం జరిగిన గణనలో 74 పెద్దపులులు ఉన్నట్లు గుర్తించారని తెలిపారు. ఈ సంవత్సరం వాటి సంఖ్య 80కి చేరినట్టు తేలిందన్నారు.నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాజెక్టు కింద పులుల సంరక్షణ పనులను అటవీశాఖ సమర్థంగా నిర్వహిస్తోందని అభినందించారు. పులుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోందని, అంతరించిపోతున్నాయన్నది ద్రుష్పచారమేనని చెప్పారు. రాబోయే రోజుల్లో నల్లమల నుంచి శేషాచలం అడవుల వరకు ప్రత్యేకంగా కారిడార్ అభివృద్ధి చేసి, టైగర్ రిజర్వు పరిధిని విస్తరించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. తద్వారా అటవీ రక్షణ, పులుల సంరక్షణ సులభతరం అవుతుందన్నారు. అనంతరం పులుల సంరక్షణపై నిర్వహించిన పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. జూ ప్రవేశంలో ప్రత్యేకంగా వన్యప్రాణుల సంరక్షణపై స్టాళ్లను ఏర్పాటు చేశారు. పులుల సంరక్షణపై ఫొటో గ్యాలరీ నిర్వహించారు. కార్యక్రమంలో తిరుపతి రూరల్ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, ఏపీ పీసీసీఎఫ్ మధుసూదన్ రెడ్డి, అడిషనల్ పీసీసీఎఫ్ శాంతిప్రియపాండే, సీసీఎఫ్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. నల్లమలలో 80 పెద్ద పులులు నల్లమల అటవీ ప్రాంతంలో మొత్తం 80 పెద్ద పులులు ఉన్నట్లు ప్రకాశం జిల్లా మార్కాపురం అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అప్పావ్ తెలిపారు. శనివారం అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా అధికారికంగా పులుల సంఖ్యను విడుదల చేశారు. ఎన్ఎస్టీఆర్– తిరుపతి కారిడార్ (నాగార్జున సాగర్ – శ్రీశైలం పులుల అభయారణ్యం) వరకూ ఇవి ఉన్నట్లు తెలిపారు. -
దొంగ ఓట్ల చరిత్ర చంద్రబాబుది: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, చిత్తూరు: దొంగ ఓట్లతోనే కుప్పంలో చంద్రబాబు గెలుస్తూ వస్తున్నాడని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కుప్పంలో ఇప్పటికీ దొంగ ఓట్లు ఉన్నాయని, దొంగ ఓట్లను తొలగించి ఎన్నికల కమిషన్ ప్రక్షాళన చేస్తుందని ఆయన పేర్కొన్నారు. దొంగ ఓట్ల చరిత్ర చంద్రబాబుదని.. 2019కి ముందు రాష్ట్రంలో 60 లక్షల దొంగ ఓట్లను నమోదు చేయించారు.. ఇప్పుడు చంద్రబాబు తీరు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మంత్రి దుయ్యబట్టారు. ద్వేషంతో రాయలసీమకు చంద్రబాబు అన్యాయం: శ్రీకాంత్‌రెడ్డి వైఎస్సార్ జిల్లా: వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు అని, ఆయన పాలనలో ఒక్క ప్రాజెక్టయినా రూపకల్పన చేశారా? అంటూ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు నీళ్లు అందించిన గొప్ప నేత వైఎస్సార్. ద్వేషంతో రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేశారు. పోతిరెడ్డిపాడును వ్యతిరేకిస్తూ ధర్నా చేయించిన వ్యక్తి చంద్రబాబు. రాయలసీమకు అభివృద్ధి చూపిన నాయకులు వైఎస్సార్, జగన్’’ అని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. చదవండి: విజయవాడలో టీడీపీ నేత ఘరానా మోసం.. రూ.6 కోట్లతో పరార్! -
కుప్పం వాసులకు చంద్రబాబు శూన్యం: మంత్రి పెదిరెడ్డి
-
మిగతా రాష్ట్రాలకు సీఎం జగన్ దిక్సూచి
కుప్పం రూరల్ (చిత్తూరు జిల్లా): సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి దేశంలోని ఇతర సీఎంలు ఆలోచనలో పడ్డారని రాష్ట్ర అటవీ, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం వార్డుబాట కార్యక్రమంలో భాగంగా రెండో రోజు కుప్పం పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం పథకాలు తెచ్చి ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచి పోయారని, ఆయన తనయుడు, సీఎం వైఎస్ జగన్ మరో అడుగు ముందుకేసి అనేక సంక్షేమ పథకాలు తెచ్చి ప్రజల గుండెల్లో నిలిచిపోయారని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు రెండు కళ్లుగా పాలన చేస్తున్న సీఎంను చూసి దేశంలోని ఇతర ముఖ్యమంత్రులు ఇన్ని సంక్షేమ పథకాలు ఎలా చేస్తున్నారా.. అంటూ ఆలోచనలో పడ్డారన్నారు. 95 శాతం హంద్రీ–నీవా పనులను వైఎస్సార్ పూర్తి చేస్తే, ఆయన తరువాత వచ్చిన కాంగ్రెస్ సీఎంలు, బాబు 5 శాతం పనులు పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. గత సెప్టెంబర్‌లో కుప్పానికి వచ్చిన సీఎం జగన్ హంద్రీ–నీవా పనులు పూర్తిచేయాలని ఆదేశించారని, పనులు వేగంగా జరుగుతున్నాయని, త్వరలో హంద్రీ–నీవా నీళ్లు కుప్పానికి తెచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. కరోనా కాలంలో తండ్రీకొడుకులు హైదరాబాద్‌లో దాక్కుంటే సీఎం జగన్ ప్రతి నిత్యం సమీక్షలు నిర్వహించి ప్రాణనష్టాన్ని నివారించారన్నారు. వలంటీర్లు కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి సేవ చేస్తే వారిని తప్పుపట్టడం దారుణమన్నారు. 2019 ఎన్నికల ముందు మహిళా, రైతు రుణాలు రూ.14,200 కోట్లు ఇవ్వకుండా వెళ్లిపోయారని, ఆ రుణాలు కాస్త వడ్డీతో కలిపి ప్రస్తుతం రూ.27 వేల కోట్లు అయ్యాయని, ఆ మొత్తాన్ని సీఎం జగన్ విడతల వారీగా చెల్లిస్తూ వస్తున్నారని తెలిపారు. -
అందరికీ ఆమోదయోగ్యంగా ‘పీఆర్సీ’పై నిర్ణయం
సాక్షి, అమరావతి: విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీపై అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. వీరు విద్యుత్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సచివాలయంలో బుధవారం భేటీ అయ్యారు. సంఘాల ప్రతినిధులు పే రివిజన్‌పై ఉద్యోగుల డిమాండ్లను మంత్రులకు వివరించారు. ప్రస్తుత విధానాన్ని కొనసాగిస్తూ సింగిల్ మాస్టర్ స్కేల్ అమలు చేయాలని కోరారు. జెన్కో ఉద్యోగులకు అలవెన్స్‌లు, ఇతర అలవెన్స్‌లను యథాతథంగా కొనసాగించాలని, వెయిటేజీతో పాటు ఫిట్మెంట్లను అలానే ఉంచాలని, అలాకాని పక్షంలో అధిక ఫిట్మెంట్ ఇవ్వాలని కోరారు. ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ మాట్లాడుతూ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగానే పరిశీలిస్తోందన్నారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ సంఘాల డిమాండ్లను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళతామని, వారం రోజుల్లో మరోసారి ఉద్యోగసంఘాల ప్రతినిధులతో భేటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటికే వన్ మెన్ కమిషన్ నివేదికపై ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తోన్న నేపథ్యంలో దానిని పూర్తిస్థాయిలో పరిగణనలోకి తీసుకోవడం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఏపీ జెన్కో ఎండీ, ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర్ బాబు, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వితేజ్, ట్రాన్స్ కో విజిలెన్స్ జేఎండీ మల్లారెడ్డి పాల్గొన్నారు. -
పవన్ ఆరోపణలపై స్పందించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
-
పవన్ స్క్రిప్ట్ అంతా చంద్రబాబుదే: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, అమరావతి: పవన్ కల్యాణ్ స్క్రిప్ట్ అంతా చంద్రబాబుదేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆలోచన, అవగాహన లేకుండా పవన్ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ‘‘చంద్రబాబును సీఎం చేయాలని పవన్ ప్రయత్నం చేస్తున్నారు. కుప్పంలో చంద్రబాబు సభలో జనాలే లేరు. నేర చరిత్ర చంద్రబాబుకే ఉంది.. టీడీపీలో గూండాలు ఉన్నారు. పంచభూతాల సాక్షిగా అవినీతి లేకుండా పాలన సాగిస్తున్నాం’’ అని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. చదవండి: ఏది నిజం?: అసలే డ్రామోజీ.. చేతిలో ‘ఛీ’నాడు -
విద్యుత్ అవసరాలకు తగ్గట్టుగా 68 కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణం
అమరావతి: విద్యుత్ పంపిణ సంస్థలు పంపిణీ నష్టాలను సాధ్యమైనంతగా తగ్గించుకోవాలని రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం ఇపిడిసిఎల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని, అదే క్రమంలో విద్యుత్ బకాయిల విషయంలోనూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పరిశ్రమలకు సంబంధించిన పెండింగ్ బకాయిలును వసూలు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. అలాగే న్యాయస్థానాల్లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఇపిడిసిఎల్ పరిధిలో 33 కెవి సబ్ స్టేషన్ల నిర్మాణం పనులు మందకొడిగా జరుగుతుండటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు సర్కిళ్ళ పరిధిలో సాంకేతికంగా ఎక్కడైతే లో ఓల్టేజీ సమస్య ఉందో పరిశీలించి, అక్కడ మాత్రమే కొత్త సబ్ స్టేషన్లను నిర్మించాలని సూచించారు. 33 కెవి సబ్ స్టేషన్లు మంజూరు చేసినా పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని, కాంట్రాక్ట్ ను రద్దు చేయాలని ఆదేశించారు. కోస్తా ప్రాంతంలో పీక్ లోడ్ పరిస్థితిని చక్కదిద్దేందుకు పరిశ్రమల నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించాలని కోరారు. జగనన్న హౌసింగ్ కాలనీల్లో విద్యుద్దీకరణ పనులను వేగవంతం చేయాలి. ఎస్పీడిసిఎల్ పరిధిలో వినియోగదారులకు అందిస్తున్న సేవల కోసం ప్రత్యేకంగా వెబ్ పోర్టల్ ను ఏర్పాటు చేశారని, అదే మాదిరిగా ఇపిడిసిఎల్ లోనూ ఆన్లైన్ లో సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజల నుంచి దరఖాస్తులు వచ్చేలా అవగాహన పెంచాలని, సచివాలయ స్థాయిలో ఎనర్జీ అసిస్టెంట్ ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. విద్యుత్ భద్రతపై సిబ్బందికి శిక్షణ కల్పించాలి. ప్రమాదాల నివారణకు పోల్ టు పోల్ సర్వే చేయాలి. లూజ్ లైన్లను మార్చడంతో పాటు పాడైపోయిన కండక్టర్ లను ఎప్పటికప్పుడు మార్చాలని సూచించారు. ఈదరు గాలుల వల్ల విద్యుత్ స్థంబాలు పడిపోయి, విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సందర్భాల్లో కొన్నిచోట్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని, దీనిపై అధికారులు యుద్ద ప్రాతిపదికన వాటిని సరిచేయాలని ఆదేశించారు. గోదావరిజిల్లాల్లో విద్యుత్ డిమాండ్ అధికంగా ఉందని, కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణంతో లో ఓల్టేజీ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని సూచించారు. అలాగే విశాఖ సర్కిల్ పరిధిలో కొత్తగా జగనన్న కాలనీల్లో లక్ష ఇళ్ళు నిర్మాణం పూర్తి చేసుకుంటున్నాయని, వాటికి అవసరమైన విద్యుత్ ను అందించేందుకు కొత్తగా 68 సబ్ స్టేషన్లను మంజూరు చేశామని, త్వరలోనే వాటికి టెండర్లు పిలుస్తామని తెలిపారు. ప్రస్తుతం రోజుకు 250 ఎంయుల విద్యుత్ డిమాండ్ ఉందని, దానికి అనుగుణంగా విద్యుత్ సరఫరా చేస్తూ, కోతలు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యంను మెరుగుపరుచుకుంటే, సబ్ స్టేషన్లు ఏర్పాటు, విద్యుత్ లైన్ల నిర్మాణంను కూడా ప్రణాళికాయుతంగా చేపడుతున్నామని తెలిపారు. ఈ సమావేశానికి ఇంధన శాఖ స్పెషల్ సిఎస్ విజయానంద్, జెన్కో ఎండి కెవిఎన్ చక్రథర్ బాబు, ఇపిడిసిఎల్ సిఎండి పృథ్వితేజ్ తదితరులు హాజరయ్యారు. -
'అమ్మ డెయిరీ'ని ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
అనంతపురం:ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పరిపాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అనంతపురం ఆలమూరులో అమ్మ డెయిరీని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. రూ.20 కోట్లతో అమ్మ డైరీని ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని ఆయన అభినందించారు. సీఎం జగన్ పాదయాత్రలో పేర్కొన్న విధంగానే డెయిరీలకు ప్రోత్సాహకాలిచ్చారని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. సీఎం జగన్ 99 శాతం హామీలను అమలు చేశారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ వరాలు ప్రకటించారని అన్నారు. పది వేలకు పైగా ఉద్యోగులను రెగ్యులర్ చేయడం చారిత్రాత్మకమని కొనియాడారు. సీఎం జగన్ కృషి ఫలితమే.. మహిళల స్వయం ఉపాధి కోసమే అమ్మ డైరీ ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చెప్పారు. పదివేల మంది మహిళలకు పాల వ్యాపారం ద్వారా లాభాలు పంచుతామని పేర్కొన్నారు. ఏపీకి అమూల్ సంస్థ రావటం వల్లే మిగిలిన కంపెనీలు పాడి రైతులకు గిట్టుబాటు ధరలు అందిస్తున్నాయని చెప్పారు. ఇదంతా సీఎం జగన్ కృషి ఫలితమే అని వివరించారు. లక్ష లీటర్లతో ప్రారంభించిన అమ్మడైరీని పది లక్షల లీటర్ల స్థాయికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు. ఏపీ ఈఏపీసెట్ ఫలితాల విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే.. -
టీడీపీ నేతలను బీజేపీలోకి పంపి చంద్రబాబు విషం చిమ్ముతున్నారు..
-
‘మిషన్ లైఫ్ అమలులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ది అగ్రస్థానం’
విజయవాడ: ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రిస్తాం, పర్యావరణాన్ని కాపాడుకుంటామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞపూనాలని పర్యావరణ దినోత్సవం-2023 సందర్భంగా రాష్ట్ర ఇంధన, పర్యావరణ, శాస్త్ర-సాంకేతిక, అటవీ, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని ది వెన్యూ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను మంత్రి సందర్శించారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తరువాత ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ లకు ప్రత్యామ్నాయంగా క్లాత్ తో రూపొందించిన బ్యాగ్ ను అందించే ఎనీ టైం బ్యాగ్ (ఎటిబి) వెండింగ్ మిషన్‌ను మంత్రి ఆవిష్కరించారు. ప్లాస్టిక్ వినియోగంను నివారించడం, కాలుష్యాన్ని నియంత్రించాలంటూ పర్యావరణ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం పర్యావరణహిత కార్యక్రమాలను అమలు చేస్తున్న పరిశ్రమలు, ఆస్పత్రులు, స్థానిక సంస్థలను ప్రోత్సహిస్తూ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, 1975 నుంచి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జూన్ 5వ తేదీన పర్యావరణ దినోత్సవంను జరుపుకుంటున్నామని గుర్తచేశారు. అందరిలోనూ పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు, పర్యావరణంకు ముప్పు లేని జీవన విధానంను అలవర్చుకునేందుకు ఐక్యరాజ్యసమతి ఈ దినోత్సవంను ప్రకటించిందని వివరించారు. ఈ ఏడాది ప్లాస్టిక్ వినియోగం వల్ల ఏర్పడుతున్న కాలుష్యం, దానికి పరిష్కారాలు అనే అంశంపై ప్రపంచం అంతా పర్యావరణ దినోత్సవంను జరుపుకుంటోందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ గతంలో విశాఖపట్నంలో పర్యటించిన సందర్భంగాగ ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయాన్నిమంత్రి గుర్తుచేస్తూ తిరుమలలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌ను పూర్తి స్థాయిలో నిషేధించడం జరిగిందన్నారు. ఇదే మాదిరిగా పలు దేవాలయాలు, మున్సిపల్ కార్పోరేషన్లలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ను నిషేదించామని చెప్పుకొచ్చారు. కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన మిషన్ లైఫ్ ప్రోగ్రాంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ది, అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతోనే ఈ ఘనతను సాధించగలిగామన్నారు. అంతేగాక ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్రప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఆంధ్రప్రదేశ్ లో నీటి ఆదా, విద్యుత్ పొదుపు, సరైన ఆహార విధానంను అలవరుచుకోవడం, వ్యర్థాలను తగ్గించుకోవడం, స్వచ్ఛతా కార్యకలాపాల్లో పాల్గొనడం, ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించుకోవడం అనే ఏడు అంశాలపై ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నామన్నారు. అంతేకాదు మిషన్ లైఫ్ ప్రోగ్రాంలో భాగంగా మన రాష్ట్రంలోని సముద్రతీరాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే కార్యక్రమాన్ని 15 రోజుల పాటు ప్రజాభాగస్వామ్యంతో చేపట్టామని పేర్కొన్నారు. అలాగే అన్ని పట్టణాలు, నగరాల్లో కాలువలు, చెరువుల్లో క్లీనింగ్ కార్యక్రమాలు, పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే బైక్ ర్యాలీలు, ప్రధాన ట్రాఫిక్ కూడళ్ళ వద్ద పర్యావరణ అంశాలపై ప్రదర్శన బోర్డులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యుత్ పొదుపు చర్యలు, నీటి పరిరక్షణ విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. కాలుష్యరహిత విద్యుత్ ఉత్పత్తికి సీఎం జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తికి గానూ గత మార్చి 3,4 తేదీల్లో విశాఖలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సుకు ప్రముఖ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి, వారితో సౌరవిద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు అవగాహన కుదుర్చుకున్నామన్నారు. ఈ సదస్సులో మొత్తం రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, రూ. 9 లక్షల కోట్లు సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి రంగంలో వచ్చాయని వివరించారు. విద్యుత్ ఉత్పత్తిలో సంప్రదాయేతర వనరులకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో ఘన వ్యర్థాల నిర్యూలన కోసం 'ఏపీ ఎన్విరాన్ మెంట్ మేనేజ్ మెంట్ కార్పోరేషన్' ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఘన వ్యర్థాలను సురక్షితంగా నిర్మూలన చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలో తాను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దిశాఖ మంత్రిగా రాష్ట్రంలో జగనన్న పచ్చతోరణం కింద కోటి మొక్కలను నాటించడం జరిగిందన్నారు. వాటిని పర్యవేక్షించేందుకు కూడా నరేగా నుంచి నిధులను వినియోగించామని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద మొక్కలను తీసుకువచ్చి 16 వేల కిలోమీటర్ల పరిధిలో అవెన్యూ ప్లాంటేషన్ కింద 65 లక్షల మొక్కలను నాటడం జరిగిందన్నారు.. ప్రస్తుతం అటవీశాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలోని 120 అర్బన్ ప్రాంతాల్లో నగర వనాలను ఏర్పాటు చేయడంతో పాటు ఎకో పార్క్ లను అభివృద్ది చేయడానికి కృషి చేస్తున్నానని తెలిపారు. మన రాష్ట్రంలో 37,392 చదరపు కిలోమీటర్ల మేర అడవులు విస్తరించి ఉన్నాయి అంటే 23 శాతంగా ఉన్న అడవులను 33 శాతంకు పెంచాలనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ పని చేస్తున్నారన్నారు. కమ్యూనిటీ ఫారెస్ట్ వంటి కార్యక్రమాలు, రైతులకు బీడు భూముల్లో ఉద్యానవనాల పెంపకంను ప్రోత్సహించేలా చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో చాలా పరిశ్రమలు ఉన్నాయని, రెడ్, ఆరెంజ్ కేటగిరి పరిశ్రమల నుంచి సిఎస్ఆర్ నిధుల ద్వారా పచ్చదనంను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పచ్చదనంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యపడుతుందని భావిస్తున్నామన్నారు. పర్యావరణం సురక్షితంగా ఉంటేనే మానవాళితో పాటు అన్ని జంతు, జీవజాలాల మనుగడ సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.పర్యావరణంను కాపాడుకోవడం, కాలుష్యాన్ని నియంత్రించుకోవడం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా గుర్తించాలని కోరుకుంటున్నానన్నారు. పర్యావరణహితం కోసం కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలను ప్రతిఏటా పర్యావరణ పరిరక్షణ దినోత్సవం నాడు సన్మానిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. పర్యావరణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచానికి ఒకే భూమి ఉందని, దీనిని ప్రతి ఒక్కరూ విధిగా కాపాడుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయం గుర్తుచేశారు. ఏపి పిసిబి ద్వారా గాలి, నీటి కాలుష్యంను తగ్గించుకునేందుకు పలు చర్యలు తీసుకున్నామన్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ ను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. ప్రతి జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ను జాగ్రత్తగా నిర్వీర్యం చేసేందుకు ప్రత్యేకమైన కార్యాచరణను నిర్ధేశించామన్నారు. పర్యావరణంను కాపాడేందుకు బొగ్గుతో జరిగే విద్యుత్ ఉత్పత్తికి ప్రత్యామ్నాయంగా సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. ఆలాగే పెట్రో ఇంధనంతో నడిచే వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలను కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు. అంతర్జాతీయంగా యుఎన్ నిర్వహించిన మిషన్ లైఫ్ లో ప్రధానమంత్రి పాల్గొని కాలుష్య కారకమైన ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించేందుకు తమ వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికే సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ను నిషేధించడం జరిగిందని, ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నియంత్రించడం, సరైన విధానంలో ప్లాస్టిక్ ను సేకరించి, వాటిని రీసైకిల్ చేసేందుకు తగు చర్యలు చేపట్టామని నీరబ్ కుమార్ ప్రసాద్ అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ బి.శ్రీధర్ మాట్లాడుతూ, ప్లాస్టిక్ వినియోగం మన దైనందిన జీవనంలో భాగమైందని పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ వినియోగం 80 కోట్ల మెట్రిక్ టన్నులు ఉంటే, దీనిలో 9 శాతం మాత్రమే రీసైక్లింగ్ అవుతోందని గణాంకాలతో సహా వివరించారు. మిగిలిన ప్లాస్టిక్ నదులు, సముద్రాలు, భూమిలో కలిసి విపరీతంగా కాలుష్యం పెరుగుతోందన్నారు. ప్లాస్టిక్ ను నిర్వీర్యం చేసేందుకు దానిని తగులబెట్టడం ద్వారా పర్యావరణానికి విఘాతం కలిగించే విష వాయువులు గాలిలో కలుస్తున్నాయని, ఇది మానవాళికే ప్రమాదకరమన్నారు. ప్లాస్టిక్ వినియోగంపై వచ్చిన కొత్త నిబంధనలను అమలు చేయబోతున్నామని తెలిపారు. గాలి, నీటి,భూ కాలుష్యంను తగ్గించడం ద్వారా భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందిచగలుగుతామని శ్రీధర్ అన్నారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ మల్లాది విష్ణు మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం వల్ల ఏర్పడుతున్న హాని నుంచి బయటపడాలంటే, నిపుణులు చేస్తున్న సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. విజయవాడ నగర పాలకసంస్థ ప్లాస్టిక్ ను నిషేదించిందని, సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ పై పూర్తి స్థాయిలో కట్టడి చేస్తున్నామన్నారు. పర్యావరణంను పరిరక్షించేందుకు నగరంలోని కాలువలను శుద్ధి చేస్తున్నామన్నారు. దాదాపు 5000 టన్నుల చెత్తను వెలికితీసిన విషయాన్ని మల్లాది విష్ణు గుర్తు చేశారు.అర్భన్ ఫారెస్ట్రీ కింద విజయవాడ నగరంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా ఎపి పిసిబి ఆధ్వర్యంలో కాలుష్య నియంత్రణను వివరిస్తూ వేదికపై భాగవతుల వెంకట రామశర్మ శిష్య బృందం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్లాస్టిక్ సంచులు వాడొద్దు.. నార సంచులు, గుడ్డ సంచులు వినియోగించాలని ప్లాస్టిక్ భూతంపై పాడిన పాట, వివిధ రకాల కాలుష్యాలను వివరిస్తూ, భూమిని కాపాడుకుందాం అని పాడిన పాట, పర్యావరణం కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అంటూ రాజమహేంద్రవరానికి చెందిన విభూది దళం బ్రదర్స్ ప్రదర్శించిన బుర్రకథ ఆద్యంతం ఆలోచింపజేశాయి. ఈ సందర్భంగా పర్యావరణ హిత కార్యక్రమాలు నిర్వహిస్తున్న పారిశ్రామిక సంస్థలు, ఆస్పత్రుల ప్రతినిధులకు, స్థానిక సంస్థలకు కలిపి మొత్తం 13 అవార్డులను మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేశారు. డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్, లావురుస్ లేబరేటరీస్, జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్ మెంట్ లిమిటెడ్, కియా మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, భారతీ సిమెంట్స్ కార్పోరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులకు మంత్రి అవార్డులను అందజేశారు. ఆసుపత్రుల విభాగంలో విశాఖపట్నం అపోలో హాస్పిటల్స్, విజయవాడ సెంట్రల్ రైల్వే హాస్పిటల్, విజయవాడ ఆయూష్ హాస్పిటల్, సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైయ్యర్ మెడికల్ సైన్సెస్, తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రతినిధులకు అవార్డులను అందజేశారు. అలాగే అర్బన్ లోకల్ బాడీస్ కేటగిరిలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్, విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్, తిరుపతి మున్సిపల్ కార్పోరేషన్ అధికారులకు అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే శ్రీ. మల్లాది విష్ణు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ. నీరబ్ కుమార్ ప్రసాద్, పిసిబి మెంబర్ సెక్రటరీ బి.శ్రీధర్, తిరుపతి మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ డాక్టర్ శిరీషా యాదవ్, జెఎన్టియు డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్.జె. మురళీకృష్ణ, ప్రొఫెసర్ రామకృష్ణ, ఏపీ పీసీబీ మెంబర్ శివకృష్ణారెడ్డి, ఎన్విరాన్ మెంట్ చీఫ్ ఇంజనీర్ ఎన్.వి.భాస్కర్ రావు, పలువురు పారిశ్రామికవేత్తలు, తదితరులు పాల్గొన్నారు. -
అమిత్ షాతో చంద్రబాబు భేటీ.. మంత్రి పెద్దిరెడ్డి కౌంటర్ ఇదే..
సాక్షి, విజయవాడ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీపై మంత్రి పెద్దిరెడ్డి స్పందించారు. ఈ క్రమంలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగానే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన వైఎస్ఆర్సీపీకి లేదని స్పష్టం చేశారు. కాగా, మంత్రి పెద్దిరెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. చంద్రబాబు రాజకీయంగా అంగవైక్యంతో బాధపడుతున్నారు. చంద్రబాబు వేరే రాజకీయా పార్టీలపై ఆధారపడుతున్నారు. మేం బలంగా ఉన్నాం.. వేరే పార్టీల గురించి మాకు అనవసరం. జనసేన, పవన్ కల్యాణ్ గురించి నేను ఏమీ మాట్లాడదలచుకోలేదు అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: ‘మార్గదర్శి’ నిధుల దారి మళ్లింపు కేసుపై సుప్రీంలో విచారణ -
అవసరమైనంత విద్యుత్ అందిస్తాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డిమాండ్ తగ్గట్టుగా ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు ప్రజలకు కరెంటు అందిస్తున్నాయని, ఇకమీదట కూడా ఎంత అవసరమైనా విద్యుత్‌ను సరఫరా చేస్తామని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితిపై అధికారులతో శుక్రవారం ఆయన వర్చువల్‌గా సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా, రికార్డు స్థాయిలో 12,653 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌తో 251 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ వినియోగం జరుగుతున్నా.. విద్యుత్ కోతలు విధించడం లేదని తెలిపారు. భవిష్యత్తులో పెరగనున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చడం కోసం విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. భారీగా పెరుగుతున్న డిమాండ్ ఇంధన డిమాండ్ ఏటా పెరుగుతూ వస్తున్నదని, గతేడాది గరిష్ట డిమాండ్‌తో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 27.51 శాతం పెరిగిందని మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు. ఉదాహరణకు, 2020 మార్చి నెలలో ఇంధన డిమాండ్ 5,853.39 మిలియన్ యూనిట్లు కాగా, ఈ ఏడాది మార్చిలో నెలవారీ ఇంధన డిమాండ్ దాదాపు 16 శాతం పెరుగుదలతో 6,781.54 మిలియన్ యూనిట్లకు చేరుకుందని చెప్పారు. అదేవిధంగా, 2020 మే నెలలో సగటు రోజు డిమాండ్ 180.69 మిలియన్ యూనిట్లుకాగా, ఈ ఏడాది మే 17 వరకు సగటు రోజు డిమాండ్ 16.33 శాతం పెరుగుదలతో 210.20 మిలియన్ యూనిట్లు ఉందని ఆయన వివరించారు. ఒక్క వైజాగ్ నగరంలోనే 2018–19లో 6,696 మిలియన్ యూనిట్లు ఉన్న విద్యుత్ డిమాండ్ 2021–22లో 8,164 మిలియన్ యూనిట్లకు, అంటే 22 శాతం పెరిగిందన్నారు. ఈ విధంగా ఇంధన వినియోగం పెరగడం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి సంకేతమని మంత్రి అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగానికి 9 గంటలు పగటిపూట విద్యుత్ సరఫరా ఉచిత విద్యుత్ పథకాన్ని బలోపేతం చేయడంలో భాగంగా, ఈ ఏడాది మార్చి నాటికి రాష్ట్రంలో దాదాపు 1.20 లక్షల వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. విద్యుత్ శాఖ ఎల్లప్పుడూ సన్నద్ధం పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ ఉత్పత్తి కోసం థర్మల్ పవర్ ప్లాంట్లకు బొగ్గు సరఫరాను మెరుగుపరచడానికి ప్రయతి్నస్తున్నామని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. ఈ మేరకు కేంద్ర బొగ్గు, రైల్వే మంత్రిత్వ శాఖలతో రాష్ట్ర విద్యుత్ శాఖ అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని వివరించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా డిస్కంలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయని, సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉన్నాయని ఆయన వివరించారు. థర్మల్ పవర్ ప్రొడక్షన్ ప్రాజెక్టులు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్‌లు, పవర్ నెట్వర్క్ మొదలైన వాటి నుంచి విద్యుత్ ఉత్పత్తిని మరింత పెంచేందుకు ఏపీ విద్యుత్తు సంస్థలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. మే 18న నమోదైన 251మిలియన్ యూనిట్ల డిమాండ్‌లో దాదాపు 103.294 మిలియన్ యూనిట్ల డిమాండ్‌ను ఏపీజెన్కో ప్లాంట్లు తీర్చాయని సంస్థ ఎండీ కేవీఎన్ చక్రధర్ బాబు తెలిపారు. ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఐ.పృథీ్వతేజ్, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మజనార్దనరెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావు తదితరులు పాల్గొన్నారు. -
వేసవిలోను నిరంతర విద్యుత్
సాక్షి, అమరావతి: వేసవిలో విద్యుత్ డిమాండ్ అధికమవుతున్నా ప్రణాళికాయుతంగా విద్యుత్ ఉత్పాదనను సాగిస్తూ, ప్రజలకు కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఆయన సోమవారం సచివాలయంలో ఇంధనశాఖ, ఆంధ్రప్రదేశ్ మధ్యప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లోను ఇదే తరహాలో విద్యుత్ సరఫరా కొనసాగుతుందని తెలిపారు. 33 కేవీ సబ్స్టేషన్ల పరిధిలో జవాబుదారీతనాన్ని పెంచేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులతో సబ్‌స్టేషన్ స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కమిటీలు తమ పరిధిలో విద్యుత్ డిమాండ్, లో ఓల్టేజీ, విద్యుత్ సరఫరా తదితర అన్ని అంశాలను పరిశీలిస్తాయని, మెరుగైన విద్యుత్ సరఫరాకు సహకరిస్తాయని తెలిపారు. దరఖాస్తు చేసిన ప్రతి రైతుకు అర్హతే ప్రామాణికంగా ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని, తొమ్మిది గంటలపాటు పగటిపూట ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. ఉచిత విద్యుత్ దరఖాస్తులకు గడువు ఉండకూడదన్నారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులను జూన్ 15వ తేదీలోగా పరిష్కరించి కనెక్షన్లు మంజూరు చేయాలని చెప్పారు. మార్చి నెలాఖరు నాటికి వ్యవసాయానికి దాదాపు 1.20 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఇచ్చినట్లు డిస్కం అధికారులు తెలిపారు. జగనన్న హౌసింగ్ కాలనీలకు విద్యుదీకరణను గడువులోగా పూర్తిచేయాలని మంత్రి కోరారు. పంపిణీ నష్టాలను పూర్తిస్థాయిలో నియంత్రణలోకి తీసుకురావాలని, పారిశ్రామికసంస్థల బకాయిలను వసూలు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. ఇప్పటికే పనులు అప్పగించిన సబ్స్టేషన్ల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. లో ఓల్టేజీ ప్రాంతాలను గుర్తించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఏపీ జెన్కో ఎండీ కె.వి.ఎన్.చక్రధర్‌బాబు, సీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మజనార్దనరెడ్డి పాల్గొన్నారు. -
పట్టణ ప్రాంతాల్లోనూ వేగంగా భూ సర్వే
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో భూముల సర్వే జోరుగా జరుగుతున్న నేపథ్యంలో పట్టణాల్లో కూడా వేగవంతం చేయాలని జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్షపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా 123 పట్టణ స్థానిక సంస్థల్లో 15 లక్షల ఎకరాలను సర్వే చేయాల్సి ఉందని సబ్ కమిటీ పేర్కొంది పట్టణ ప్రాంతాల్లో 5.5 లక్షల ఎకరాలు వ్యవసాయ భూమి కాగా మిగిలిన 9.44 లక్షల ఎకరాలు పట్టణ ప్రాంతంగా ఉన్నట్లు గుర్తించారు. వీటికి సంబంధించి 38.19 లక్షల ఆస్తుల సర్వేను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించింది. జగనన్న శాశ్వత భూహక్కు – భూరక్ష పథకం అమలుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై సమీక్షించింది. మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లంతో పాటు పలువురు అధికారులు ఇందులో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తొలిదశలో 2 వేల గ్రామాల్లో మే 20వ తేదీలోగా సర్వే పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సబ్ కమిటీ స్పష్టం చేసింది. డ్రోన్ సర్వే, మ్యాపింగ్, గ్రౌండ్ ట్రూతింగ్, రికార్డుల వివాదాల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఇప్పటివరకు సిద్ధమైన 1,94,571 భూహక్కు పత్రాలను ఈ కేవైసీ ద్వారా వివాదాలకు తావు లేకుండా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూ యజమానుల నుంచి అందే ఫిర్యాదులను పరిష్కరించేందుకు కలెక్టర్లు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. 10,409 గ్రామాల్లో డ్రోన్ ఫ్లై ప్రక్రియ పూర్తి ఈ నెలాఖరు నాటికి 10,409 గ్రామాల్లో డ్రోన్ ఫ్లై ప్రక్రియ పూర్తి కానుంది. 7,158 గ్రామాల్లో డ్రోన్ ఫొటోలు తీసుకుని 3,758 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. 2,611 గ్రామాల్లో సర్వే పూర్తయిందని, 2,391 గ్రామాల్లో రెవెన్యూ రికార్డుల పరిశీలన ముగిసిందని చెప్పారు. సర్వే ప్రక్రియలో జాప్యం లేకుండా ముందుగానే రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తున్నామని, 4 లక్షలకు పైగా రికార్డులకు మ్యుటేషన్ అవసరమని గుర్తించినట్లు వెల్లడించారు. జూన్ నాటికి రాష్ట్రంలో డ్రోన్ ఫ్లై ప్రక్రియ పూర్తి చేయాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు చెప్పారు. 25.8 లక్షల సర్వే రాళ్లు సర్వే పూర్తయిన గ్రామాల కోసం 25.8 లక్షల సర్వే రాళ్లు సిద్ధంగా ఉన్నట్లు మైనింగ్ అధికారులు తెలిపారు. 18.9 లక్షల సర్వే రాళ్లను ఇప్పటికే సరఫరా చేయగా మరో 12.3 లక్షల రాళ్లు ఆయా గ్రామాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. రోజుకు 50 వేల సర్వే రాళ్లను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. సర్వే ముగిసిన గ్రామాల్లో రాళ్లను పాతే ప్రక్రియ మే 20వ తేదీలోగా పూర్తవుతుందని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో 30.11 లక్షల ఆస్తులను వెరిఫై చేశామని, అందులో 36.32 లక్షల నిర్మాణాలు ఉన్నట్లు పురపాలక శాఖ అధికారులు పేర్కొన్నారు. సర్వే కోసం మాస్టర్ ట్రైనర్ల ద్వారా అన్ని జిల్లాల్లో సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు. సమావేశంలో సీసీఎల్ఏ జి.సాయిప్రసాద్, అటవీ దళాల అధిపతి వై.మధుసూదన్‌రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సూర్యకుమారి, సర్వే అండ్ సెటిల్మెంట్ కమిషనర్ సిద్దార్థజైన్, ఎంఏయూడీ కమిషనర్ కోటేశ్వరరావు, డీఎంజీ వి.జి.వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘24 గంటలపాటు ఎలాంటి కోతల్లేకుండా విద్యుత్ ఇస్తున్నాం’
సాక్షి, విజయవాడ: విద్యుత్ కోతలు ఉండకూదనే తరచు సీఎం జగన్ సమీక్షలు నిర్వహిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత ఇంతవరకూ విద్యుత్ కోతలు అనే సమస్యే రాలేదన్నారు. ఈరోజు(గురువారం) విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రూ. 15 కోట్లతో నిర్మించిన మూడు విద్యుత్ సబ్ స్టేషన్లను మంత్రి పెద్దిరెడ్డి ప్రారంభించారు. దీనిలో భాగంగా మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి.. ‘ 2016లో శంకుస్థాపనలు చేసి వదిలేసిన సబ్స్టేషన్లను మేం పూర్తి చేశాం. విద్యుత్ కోతలు ఉండకూడదనే తరచూ సీఎం జగన్ సమీక్షలు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత ఇంతవరకూ విద్యుత్ కోతల్లేవు. 24 గంటలపాటు ఎలాంటి కోతల్లేకుండా విద్యుత్ ఇస్తున్నాం. రైతులు, పరిశ్రమలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన వాగ్ధానాన్ని సీఎం నెరవేర్చారు. రైతులకు పగటిపూటే విద్యుత్ ఇస్తున్నాం. ఒక విద్యుత్ కనెక్షన్ కూడా పెండింగ్‌లో లేదు. మేం వచ్చాక లక్షా 25వేల పెండింగ్ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశాం. రైతులు దరఖాస్తు చేసిన వెంటనే విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశాం. చంద్రబాబు ఏం మాట్లాడతాడో అతనికే అర్థం కాదు’ అని పేర్కొన్నారు. ఎన్జీటీ మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు -
ఎన్జీటి మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బయో మెడికల్ వేస్టేజీని అత్యంత కట్టుదిట్టమైన పద్దతుల్లో వేస్టేజీ ట్రీట్ మెంట్ ప్లాంట్ ల ద్వారా నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పర్యావరణ, అటవీ, ఇంధన, శాస్త్ర-సాంకేతిక, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. సచివాలయంలోని మూడో బ్లాక్ లో గురువారం కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,68,255 బెడ్స్ తో 13,728 వైద్య సంస్థలు పనిచేస్తున్నాయని అన్నారు. 2021 వార్షిక నివేదిక ప్రకారం ఏటా 7197 టన్నుల బయో వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు. ఈ వ్యర్థాలను సురక్షిత విధానంలో నాశనం చేసేందుకు బయో మెడికల్ వేస్ట్ ట్రీట్ మెంట్ ప్లాంట్ లకు తరలిస్తున్నారని అన్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 12 బయో మెడికల్ వేస్టేజీ ప్లాంట్ లు పనిచేస్తున్నాయని తెలిపారు. వైద్య సంస్థల నుంచి వచ్చే బయో మెడికల్ వేస్టేజీని 48 గంటల్లో ట్రీట్ మెంట్ ప్లాంట్ లకు తరలించాల్సి ఉంటుందని తెలిపారు. బయో వేస్టేజీపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జారీ చేసిన మార్గదర్శకాలను అధికారులు అమలు చేయాలని కోరారు. వైద్య సంస్థల సంఖ్య పెరగడం, అదనంగా బెడ్స్ ఏర్పాటు అవుతుండటం వల్ల రాష్ట్రంలో కొత్త బయో మెడికల్ వేస్టేజీ ప్లాంట్ లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇందుకోసం దరఖాస్తు చేసుకున్న వారికి అన్ని అర్హతలు ఉంటే కొత్త ప్లాంట్ ల ఏర్పాటుకు అనుమతులు జారీ చేయాలని ఆదేశించారు. ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, హానికరమైన వ్యర్థాలను సురక్షిత విధానాల్లో నాశనం చేసే విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ సమీర్ శర్మ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (పర్యావరణం) నీరబ్ కుమార్ ప్రసాద్, మెంబర్ సెక్రటరీ బి.శ్రీధర్, సీనియర్ ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ (బయోమెడికల్) కె.ఎ.ఎస్. కృష్ణ తదితరులు పాల్గొన్నారు.