![Peddireddy Ramachandra Reddy Serious On TDP And Congress - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/4/Peddireddy.jpg.webp?itok=SPEeOEGF)
సాక్షి, చిత్తూరు: కుటుంబాల్లో చిచ్చుపెట్టడం టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు బాగా తెలుసని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. అలాగే, టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ సీఎం కాలేరని అన్నారు. కాంగ్రెస్‌లో ఎవరు ఉన్నా ప్రత్యర్థిగానే చూస్తామని వ్యాఖ్యలు చేశారు.
కాగా, మంత్రి పెద్దిరెడ్డి గురువారం చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం అవుతానని చంద్రబాబు ఇంకా పగటి కలలు కంటున్నాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను మరోసారి సీఎంను చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాజకీయాల్లో మార్పులు చేర్పులు సహజం. సీఎం జగన్ మా నాయకుడు. ఆయన కోసం మేము ఎప్పటికీ పనిచేస్తూనే ఉంటాం. కాంగ్రెస్, టీడీపీ వంటి పార్టీలు ఎన్ని వచ్చినా మేము ముఖ్యమంత్రి జగన్‌తోనే నడుస్తాం.
కుటుంబాలను చీల్చి రాజకీయం చేసే నైజం కాంగ్రెస్, టీడీపీ పార్టీలదే. కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నా.. ఎవరు చేరినా.. మా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నట్టే. మేము వారిని ప్రత్యర్థులుగానే చూస్తాం. జడ్పీటీసీగా ఓడిన వ్యక్తిని మేము ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం. ఇలాంటివి మాట్లాడే ముందు ఆలోచన చేయాలి. ఎవరో రెచ్చగొడితే అలా మాట్లాడటం సబబు కాదు. ఇప్పటికైనా పునరాలోచన చేయాలని కోరుకుంటున్నా అని కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment