టీడీపీ అధినేత చంద్రబాబుకు కుప్పంలో ఎదురుగాలి వీస్తోంది. కుప్పం ప్రజలు.. చంద్రబాబుకు షాక్ ఇచ్చేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. టీడీపీ నేతల మధ్య పొలిటికల్ కోల్డ్‌వారే ఇందుకు కారణమని సమాచారం. ఇక, తాజాగా కుప్పంపై చంద్రబాబు ఫోకస్ పెట్టినా ఉపయోగం లేదని అటు సర్వేలు కూడా చెబుతున్నాయి.
తాజా సర్వేతో కుప్పం టీడీపీ నేతల్లో అసంతృప్తి నెలకొంది. ఇక, ఇటీవల చంద్రబాబు పర్యటనలో అలవికాని హామీలిచ్చి మోసం చేసే ప్రయత్నం చేశారు. మరోవైపు, 35 ఏళ్లుగా చంద్రబాబు కుప్పంకు సాగునీరు, తాగునీరు కూడా ఇవ్వలేకపోయారు. ఇప్పటికీ చంద్రబాబుకు కుప్పంలో సొంత ఇల్లు కూడా లేకపోవడం గమనార్హం. ఇటీవల హడావిడిగా శాంతిపురం మండలం శివపురంలో చంద్రబాబు ఇళ్లు నిర్మాణం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. కుప్పం టీడీపీలో గ్రూప్ రాజకీయాలతో చంద్రబాబుకు తలనొప్పులు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ను కుప్పం ఇంఛార్జిగా తెలుగు తమ్ముళ్లు అంగీకరించడం లేదు. మరోవైపు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం కుప్పంను చాలా అభివృద్ధి చేశారు. కుప్పం మున్సిపాలిటీ, కుప్పం ఆర్డీవో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.
కుప్పంకు ఈ నెలలోనే హంద్రీనీవా కాలువ ద్వారా సాగు, తాగు నీరు జాలాలు తెచ్చే ఏర్పాట్లు చేశారు. ఇక, టీడీపీకి చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులు కరువయ్యారు. చిత్తూరు, జీడి నెల్లూరు, పూతల పట్టు, మదనపల్లి, సత్యవేడు, నగరి అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ సరైన అభ్యర్థులు లేని పరిస్థితి నెలకొంది. దీంతో, సర్వేల్లో కూడా టీడీపీ తప్పదని నివేదికలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment