Chittoor Assembly Constituencies
-
గాలి భానుప్రకాష్ అతి.. ఓట్ల లెక్కింపునకు ముందే..!
నగరి: నగరి నియోజకవర్గం పుత్తూరులో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓట్ల లెక్కింపు జరగముందే తానే ఎమ్మెల్యే అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటుచేయించారు. కొందరు దీన్ని చూసి అంత తొందరేల భానూ.. అంటూ నవ్వుకున్నారు. ఇందంతా ఒక పథకం ప్రకా రం రెచ్చగొట్టడమేనని భావిస్తున్నారు. నేర చరిత కలిగిన వారిని జనంలోకి రప్పించడం.. గతంలో గంజాయి సరఫరా జరిగిందని ప్రచారం జరిగిన ప్రాంతంలో బ్యాడ్మింటన్ కోర్టు ప్రారంభించడం ఏంటని చర్చించుకుంటున్నారు. అది బ్యాడ్మింటన్ కోర్టు కాదు.. విధ్వంస కుట్రలకు కేంద్రంగా చేసుకున్నారని అనుమానిస్తున్నారు. ఇదంతా ఎన్నికల కమిషన్‌కు కనబడలేదా అని జనం ప్రశి్నస్తున్నారు.ఆలూ లేదు, చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది టీడీపీ నేతల పరిస్థితి. ఓట్ల లెక్కింపు జరగలేదు. గెలుస్తారో లేదో కూడా తెలియదు. నగరిలో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ ఎమ్మెల్యే అంటూ పుత్తూరు పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటుచేయడం హాస్యాస్పదంగా మారింది. ఇదేం విడ్డూరం అంటూ జనం నవ్వుకుంటున్నారు.బ్యాడ్మింటన్ కోర్టు ప్రారంభోత్సవంలో గాలి భానుప్రకాష్పుత్తూరు మున్సిపాలిటీ చింతలగుంటలో గతంలో బీఎస్ జిమ్ నిర్వహించేవారు. ఏడాది క్రితం ఈ జిమ్ నిర్వాహకుడు టీడీపీ నేత హరి విశాఖపట్నం అరకు వద్ద గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కాడు. ఆ తర్వాత ఆ జిమ్ నిరుపయోగంగా మారింది. ఈ జిమ్ నుంచే గంజాయి సరఫరా జరిగేదంటూ అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. అనంతరం ప్రచారాల్లోను, పలు కార్యక్రమాల్లోను టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్తో పాటు గంజాయి స్మగ్లర్, అతని అనుచరులు పాల్గొనడం అప్పట్లో వివాదాస్పదమైంది. వివాదాలకు చిరునామాగా ఉన్న వీరంతా తాజాగా మరో వివాదానికి తెరతీశారు. నిరుపయోగంగా ఉన్న జిమ్‌ను బ్యాడ్మింటన్ కోర్టుగా మార్చి ఎన్ని కల కోడ్ ఉండగానే టీడీపీ అభ్యరి్థతో ప్రారం¿ోత్సవం చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో భానుప్రకాష్ ఎమ్మెల్యే, నగరి అంటూ ముద్రించి ప్రదర్శనగా ఉంచారు.కోడ్ వర్తించదా? ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్న టీడీపీ నాయకులకు ఎన్నికల నిబంధనలు వర్తించవా అంటూ నగరి నియోజకవర్గ ప్రజలు ప్రశి్నస్తున్నారు. బహిరంగంగా ఒక అభ్యర్థి ఎమ్మెల్యే అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి ప్రారం¿ోవాలు చేస్తుంటే వారిపై చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.రెచ్చగొట్టి విధ్వంసాలకు పాల్పడేందుకేనా?ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే పుత్తూరు టీడీపీ నాయకుల దుశ్చర్యను చూసి వైఎస్సార్సీపీ నాయకులు, స్థానిక ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. రాజకీయ పారీ్టలను రెచ్చగొట్టి.. గొడవలు సృష్టించి విధ్వంసాలకు పాల్పడేందుకే పథకం వేశారని స్థానికులు భయపడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో అల్లర్లు సృష్టించేందుకే నేరచరిత కలిగిన వారిని టీడీపీ నాయకులు జనంలోకి తీసుకొస్తున్నట్టు సమాచారం. -
నీలాగా వెన్నుపోటు పొడిచానా?.. చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్
సాక్షి, పుంగనూరు: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే చంద్రబాబు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. కనీసం కుప్పంలో కూడా చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదు అంటూ ఎద్దేవా చేశారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక చౌకబారు విమర్శలకు దిగారంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. కాగా, మంత్రి పెద్దిరెడ్డి ఆదివారం పుంగనూరులో మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు మితిమీరి నాపై విమర్శలు చేస్తున్నాడు. నీ లాగా నేను మామకు వెన్నుపోటు పొడిచానా?. చంద్రబాబు నువ్వు మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. కనీసం కుప్పంలో కూడా గెలవలేవు. కుప్పంకు మేము నీళ్లు ఇస్తున్నాం. కానీ, నువ్వు 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశావ్?. ఓటమి భయంతో రాజకీయంగా ఎదుర్కోలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. సంక్షేమ పథకాలు అమలు చేస్తే శ్రీలంక అవుతుందని చంద్రబాబు విమర్శించారు. ఈరోజు బాబు షూరిటీ.. భవిషత్తు గ్యారంటీ అంటున్నారు. గతంలో ఎన్టీఆర్‌ను గద్దె దింపగానే మద్యపాన నిషేదం ఎత్తివేశారు, రెండు రూపాయల కిలో బియ్యం తీసేశారు. 2014లో ఇచ్చిన హామీలు చంద్రబాబు నెరవేర్చారా?. ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి అధికారంలోకి రాగానే రెండు లక్షల కాంట్రాక్ట్ ఉద్యోగాలను తొలగించారు. ఇన్నిసార్లు మోసం చేసిన చంద్రబాబు మాటలు ఎవరూ నమ్మరు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీలు కూడా చూడకుండా పథకాలు అందిస్తున్నారు. గతంలో జన్మభూమి కమిటీలు పెట్టీ టీడీపీకి కావాల్సిన వారికి మాత్రమే పథకాలు ఇచ్చారు. పేదరికాన్ని కొలబద్దగా తీసుకుని ప్రజలకు అండగా నిలిచింది సీఎం జగన్ మాత్రమే. అధికారంలోకి వచ్చిన మొదటి రోజే పథకాల అమలుపై సీఎం జగన్ దృష్టి సారించారు. చంద్రబాబు నాపై విమర్శలు చేస్తున్నారు. నేను ఎలాంటి వాడినో ప్రజలకు తెలుసు. చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలు, చిత్తూరు జిల్లా ప్రజలు బుద్ధి చెబుతారు. చంద్రబాబు మోసకారి మాటలు నమ్మవద్దు.. అధికారంలోకి రాలేము అని దూషణలు మొదలు పెట్టారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశాడో చెప్పుకోలేని దుస్థితిలో చంద్రబాబు ఉన్నాడు. నువ్వు వెన్నుపోటు పొడిచి జిల్లా మొత్తానికి చెడ్డపేరు తెచ్చావు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
కాంగ్రెస్ ముసుగులో షర్మిలను తీసుకొచ్చిన బాబు
సాక్షి, తిరుపతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలనలో తుడిచి కొట్టుకు పోతామన్న భయాందోళనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కాంగ్రెస్ ముసుగులో షర్మిలమ్మను తీసుకొచ్చి అడ్డగోలు ఆరోపణలు చేయిస్తున్నారని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. అందుకే చంద్రబాబు అండ్‌కో, ఎల్లోమీడియా స్క్రిప్ట్ ప్రకారమే ఆమె విమర్శలు చేస్తున్నారని, వాటిని ప్రజలు పట్టించుకోవడం లేదని స్పష్టం చేశారు. తిరుపతిలోని పీఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో శనివారం మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త, తిరుపతి ఎంపీ గురుమూర్తి అధ్యక్షతన ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా ‘సిద్ధం’ పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. అంతకుముందు మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ‘చంద్రబాబుకే గ్యారెంటీ లేదు.. ఆయన హామీలకు ఉంటుందా? బాబు హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు’ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు ఓటమి తప్పదని, అందుకే కుప్పంతోపాటు మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తారని వెల్లడించారు. రాష్ట్రంలో కమ్యూనిస్టుల జాడే లేకుండా పోయిందన్నారు. సామాన్యులే సీఎం వైఎస్ జగన్‌కు ఎన్నికల స్టార్ క్యాంపెయినర్లని ధీమా వ్యక్తం చేశారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి, 2014లో అధికారంలోకి రాగానే 2 లక్షల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించిన ఘనత చంద్రబాబుదన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చారని, డ్వాక్రా మహిళల కోసం ఆసరా పథకాన్ని తీసుకొచ్చారని వివరించారు. గతంలో జన్మభూమి కమిటీలు సిఫారసు చేస్తేనే సంక్షేమ పథకాలు అందేవని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని, గడప గడపకు వెళ్లి వలంటీర్లు అర్హులందరికీ అందిస్తున్నారని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ఫిబ్రవరి 3న అనంతపురంలో ‘సిద్ధం’ కార్యక్రమంలో పాల్గొంటారని, ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశం ఈ నెల 29న తిరుపతిలో నిర్వహించనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. -
పొత్తులో కొత్త ‘డ్రామా’.. పవన్ మరో నాటకం
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: జనసేన –టీడీపీ పొత్తులో ఉన్నప్పుడు కుప్పం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీనే పోటీ చేస్తుందని చంద్రబాబు ప్రకటన చేయడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో.. రాజోలు, రాజానగరం స్థానాల్లో జనసేనే పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించడం అంతకన్నా హాస్యాస్పదమని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. 2019 ఎన్నికల్లో పవన్ స్వయంగా పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయినప్పటికీ, ఒక్క రాజోలులోనే జనసేన గెలిచింది. అలాంటి రాజోలు స్థానంలో జనసేన పోటీ చేయడం ఏమైనా విచిత్రమా? రాజానగరం నియోజకవర్గాన్ని టీడీపీ ఇప్పటికే జనసేనకు వదిలేసింది. పవన్ పోటీ చేస్తున్నట్లు చెప్పింది కూడా ఈ రెండు నియోజకవర్గాలే. ఇక్కడే డ్రామా మొత్తం బయటపడిపోయిందని పరిశీలకులు చెబుతున్నారు. మండపేట, అరకు నియోజకవర్గాలకు చంద్రబాబు ఏకపక్షంగా టీడీపీ అభ్యర్థులను ప్రకటించడానికి కౌంటర్‌గా, గుణపాఠం చెబుతున్నట్లుగా పవన్ ఈ ప్రకటన చేయలేదన్నది సుస్పష్టమని అంటున్నారు. కేవలం పార్టీ నేతలు, అభిమానుల ముందు బిల్డప్ ఇవ్వడానికే పవన్ రెండు నియోజకవర్గాలపై ఈ హాస్యాస్పద ప్రకటన చేశారని, దీని వెనుకా చంద్రబాబే ఉన్నారని రాజకీయ పరిశీలకులు, జనసేన నేతలు కూడా చెబుతున్నారు. టీడీపీ – జనసేనల మధ్య పొత్తు ఖరారై నాలుగు నెలలు దాటింగి. ఇప్పుటికీ రెండు పార్టీల మధ్య సీట్ల గొడవ సాగుతూనే ఉంది. సీట్ల కేటాయింపుపై బాబు–పవన్ ఉమ్మడిగా ప్రకటన చేయాలని ఇప్పటికి రెండుసార్లు నిర్ణయించి, విఫలమయ్యారు. ఇంకో పక్క మా సీటు మీరెలా అడుగుతారంటూ నియోజకవర్గాల్లో టీడీపీ –జనసేన నాయకులు గొడవలు పడుతున్నారు. రెండు పార్టీల మధ్య సీట్ల పంచాయితీ తేలకపోయినప్పటకీ మండపేట, అరకు నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేస్తున్నట్టు ఆ రెండు చోట్లా సభలు పెట్టి మరీ చెప్పారు. అభ్యర్థులను కూడా ఆ సభల్లోనే ప్రకటించారు. బాబు తీరుపై జనసేన నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ముఖ్యంగా మండపేట నేతలు పవన్‌ను కలిసి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జనసేన శ్రేణుల్లో అసంతృప్తిని చల్లార్చడానికి చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్ శుక్రవారం నాటి ప్రకటన చేశారని చర్చ సాగుతోంది. సీట్ల కేటాయింపులో జరుగుతున్న ఆలస్యం, టీడీపీ ఏకపక్ష వైఖరి కారణంగా క్షేత్రస్థాయిలో రెండు పార్టీల మధ్య పెద్దస్థాయిలో నెలకొన్న విభేదాలను తగ్గించి, అన్ని చోట్లా ఎలాంటి ఇబ్బంది లేకుండా జనసేన ఓట్లు టీడీపీకి బదలాయించడం కోసమే బాబు, పవన్ వ్యూహాత్మకంగా ఈ నాటకాన్ని మొదలుపెట్టి ఉండవచ్చని పరిశీలకులు అంటున్నారు. దీనికి ‘టిట్ ఫర్ టాట్’గా కలరింగ్ ఇవ్వడం ఆ ఇద్దరికే చెల్లిందంటున్నారు. పొత్తులకు ఎన్నెన్ని ఎత్తులో.. నమ్మించి నట్టేట ముంచడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబును పవన్ విశ్వసిస్తున్నారని జనసేన నేతలూ నమ్మడంలేదు. పొత్తుల కోసం మొదటి నుంచి వెంపర్లాడుతూ మరోవైపు అలాంటిదేమీ లేదన్నట్లు బాబు, పవన్ చెబుతూ వచ్చారు. ఈ డ్రామాను ఇరు పారీ్టల వారితో పాటు రాష్ట్ర ప్రజలూ ఏ దశలోనూ విశ్వసించలేదు. ఈ దశలోనే స్కిల్ స్కాంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుతో ములాఖత్ మాటున పవన్ పొత్తు ప్రకటనా నాటకమన్న విషయం అప్పట్లోనే తేటతెల్లమైంది. బాబు అరెస్టుతో టీడీపీ పనైపోయిందని, పొత్తు ఉంటే జనసేనకు టీడీపీ అత్యధిక సంఖ్యలో సీట్లను కేటాయించే అవకాశం ఉందని నమ్మి ఆ పార్టీ నాయకులు కూడా కలిసిపోయేందుకు రెడీ అయ్యారు. జనసేన 68 సీట్లను టీడీపీ ముందు ప్రతిపాదించి, కనీసం 45 స్థానాల్లో పోటీ చేయాలని ఆశపడుతోంది. అందులో సగం సీట్లు కూడా జనసేనకు ఇచ్చేందుకు టీడీపీ సుముఖంగా లేదని చర్చ సాగుతోంది. క్రమంగా టీడీపీ ముసుగు తొలగి, మోసపూరిత వైఖరి బయట పడుతుండటంతో జనసేన నాయకుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. వారంతా చంద్రబాబు, టీడీపీ మోసపూరిత వైఖరి గురించి మాట్లాడుతుంటే.. జనసేన అధినేత పవన్ మాత్రం సర్దుకుపోవాలన్న మాటలే వినిపిస్తున్నారు. పొత్తులో ఎలాంటి పరిస్థితులు ఉన్నా జనసేన సర్దుకపోవాల్సిందేనని, భరించాల్సిందేనని సొంత పార్టీ నేతలకు పదేపదే చెబుతున్నారు. శుక్రవారంనాటి సమావేశంలోనూ.. ముందుగా రెండు నియోజకవర్గాలపై ఓ బిల్డప్ ప్రకటన చేసి, చివరికి వచ్చేసరికి సర్దుకుపోవాల్సిందేనన్న టీడీపీ సందేశాన్నే ఇచ్చారు. సీట్ల కేటాయింపు తేలక మునుపే చంద్రబాబు మండపేట, అరకు అభ్యర్ధులను ప్రకటించడంపై సొంత పార్టీ నేతలకు క్షమాపణలు చెబుతూనే.. వాళ్ల పార్టీలో ఉన్న పరిస్థితిని మనమే అర్ధం చేసుకోవాలంటూ చంద్రబాబుకు వంతపాడారు. సీఎం పదవి లేదన్నలోకేశ్కూ జీ హుజూరే! టీడీపీ –జనసేన పొత్తు ఉన్నప్పటికీ, సీఎం పదవిలో పవన్ కళ్యాణ్‌కు వాటా లేదంటూ గతంలో లోకేశ్ చేసిన వ్యాఖ్యలకు సైతం తాజాగా జనసేన అధినేత జీహుజూర్ అనేశారు. నెల కిత్రం లోకేశ్ ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘చాలా స్పష్టంగా చంద్రబాబునాయుడే ముఖ్యమంత్రి. దేర్ ఈజ్ నో సెకండ్ థాట్ (రెండో మాటే లేదు)’ అని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో జనసేన పారీ్టలో పెద్ద దుమారమే రేగింది. ఇన్నాళ్లూ దానిపై ఒక్కసారి కూడా మాట్లాడని పవన్.. శుక్రవారం పార్టీ నేతల సమావేశంలో స్పందించారు. పెద్ద మనస్సుతో ఆ వ్యాఖ్యలను తానే పట్టించుకోకుండా వదిలేశానని వివరించారు. 2024లో జగన్ ప్రభుత్వం రాకుండా ఉండేందుకు, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి వాటన్నింటికీ నన్ను చాలా సార్లు రెస్పాండ్ కానీయకుండా చేస్తోందంటూ వంకలు చెప్పారు. ఎమ్మెల్యే సీట్లను పక్కనపెట్టి.. వార్డు పదవుల వాటా చర్చ రెండు నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు ఎన్ని సీట్లు ఎక్కడెక్కడ టీడీపీ కేటాయిస్తుంది, సీఎం పదవిలో వాటా ఉంటుందా అని జనసేన నేతలు ఉత్కంఠతో ఉంటే.. పవన్ మాత్రం వీటి ఊసెత్తకుండా ఎప్పుడో రెండు మూడేళ్ల తర్వాత జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకిన్ని సీట్లు వస్తాయంటూ పార్టీ నేతలను పక్కదారి పట్టించేలా మాట్లాడుతున్నారు. అసెంబ్లీ సీట్లెన్ని వస్తాయో చెప్పకుండా.. ఈ ఎన్నికల తర్వాత కామన్ పొలిటికల్ ప్రోగ్రాం పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీలు మొదలు కార్పోరేషన్ వరకు జనసేన ఖచి్చతంగా మూడో వంతు సీట్లను తీసుకుంటుందంటూ పార్టీ నేతలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ఎమ్మెల్యే సీట్ల దగ్గర తాను ఆగిపోవడం లేదంటూ నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, చంద్రబాబు ఏమిటో తెలిసిన జనసేన నేతలు పవన్ మాటలను నమ్మడంలేదు. ఇదంతా అసెంబ్లీ సీట్ల కేటాయింపుల వ్యవహారం నుంచి జనసేన నేతలు, అభిమానులను పక్కదారి పట్టించే ప్రయత్నమేనని, చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్ ఇలా మాట్లాడుతున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేíÙస్తున్నారు. చివరివరకు ఇలా సాగదీసి, ఎన్నికల ముంగిట్లో ఓ నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలను జనసేనకు విదిలిస్తారన్నది సుస్పష్టమని చెబుతున్నారు. కేవలం జనసేన ఓట్లు టీడీపీకి పడటానికే చంద్రబాబు ఇలా జనసేన నేతలు, అభిమానులకు పవన్‌తో చెప్పిస్తున్నారని విశ్లేíÙస్తున్నారు. -
కాంగ్రెస్ కుట్ర.. కుటుంబాన్ని చీల్చి.. రాజకీయాలా..: సీఎం జగన్
సాక్షి, తిరుపతి: తిరిగి తాము అధికారంలోకి రావడం ఖాయమని.. తన వల్ల మేలు జరిగిందని భావిస్తేనే ఓటు వేయమని ధైర్యంగా అడుగుతున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. తిరుపతిలో ఇండియా టుడే విద్యా సదస్సులో ఆయన మాట్లాడుతూ.. తప్పనిసరిగా మేం తిరిగి అధికారంలోకి వస్తాం.. విద్య, వైద్యం, పరిపాలనా రంగాల్లో పెను మార్పులు తీసుకు వచ్చాం. వివక్ష లేకుండా, అవినీతి లేకుండా పారదర్శకంగా అర్హత ఉన్న వారికి అన్నీ అందించాం’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘మేని ఫెస్టోలో 99.5 శాతం హామీలను నెరవేర్చాం. మా ప్రభుత్వానికున్న విశ్వసనీయతకు నిదర్శనం ఇది. కాంగ్రెస్ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్ ఆడుతుంది. విభజించి రాష్ట్రాన్ని పాలించాలనుకున్నారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు. అలాగే మా కుటుంబాన్ని కూడా విభజించారు’’ అని సీఎం ధ్వజమెత్తారు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్‌లో చెత్త రాజకీయం చేస్తోందని సీఎం జగన్ మండిపడ్డారు. గతంలోనూ మా బాబాయ్‌ను మంత్రిగా చేసి మాకు వ్యతిరేకంగా పోటీ చేయించారు. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోని కాంగ్రెస్.. మరోసారి మా సోదరిని ప్రయోగించింది. దేవుడు వీరికి గుణపాఠం చెబుతాడు’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘‘ప్రతిపక్షాలు ఏవీ కూడా పథకాలు గురించి మాట్లాడవు, వాటి అమలు గురించీ మాట్లాడలేవు. ఇదే బడ్జెట్ గతంలోనూ ఉంది..ఇప్పుడూ ఉంది. కాని అప్పుడు డీబీటీ ఎందుకు జరగలేదు. మార్పు ఏంటంటే.. కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారారు. చంద్రబాబు విషయంలో ప్రతీకారం అన్నది లేనే లేదు. సీఐడీని దుర్వినియోగం ఆరోపణలు అర్థరహితం. చంద్రబాబుపై ఆరోపణలు, వాటిపై ఆధారాలు పరిశీలించాకే కోర్టులు నిర్ణయం తీసుకున్నాయి. పేదరికాన్ని నిర్మూలించాలంటే అది నాణ్యమైన చదువు ద్వారానే సాధ్యమని నేను నమ్ముతాను. విద్య మాత్రమే కాదు, నాణ్యమైన విద్య అనే ప్రతి ఒక్కరి హక్కు కావాలి’’ అని సీఎం జగన్ అన్నారు. ‘‘పేదరికాన్ని నిర్మూలించాలంటే అది నాణ్యమైన చదువు ద్వారానే సాధ్యమని నేను నమ్ముతాను. విద్య మాత్రమే కాదు, నాణ్యమైన విద్య అనే ప్రతి ఒక్కరి హక్కుకావాలి. పేదలు ఒక చదువుకు పరిమితమైతే, సంపన్నుల పిల్లలు వేరే చదువులు చదువుతున్నారు. పేద పిల్లలు కేవలం తెలుగుమీడియంకు పరిమితమైతే, సంపన్నుల పిల్లలు ఇంగ్లిషు మీడియం చదువుతున్నారు. సంపన్నులకు అందే నాణ్యమైన చదువులు పేద పిల్లలకూ అందాలి. మా రాష్ట్రంలో పేదపిల్లలకు సంపన్నుల పిల్లలకు అందే చదువులు అందాలన్నదే మా లక్ష్యం’ అని సీఎం స్పష్టం చేశారు. ‘‘కొందరు పెద్దలు మమ్మల్ని విమర్శిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లను ఇంగ్లిషు మీడియం స్కూళ్లగా మారుస్తున్నామని.. కాని నేను ఒక్కటే అడుగుతున్నా.. మీ పిల్లలు, మీ మనవళ్లు ఏ మీడియంలో చదువుతున్నారు?. వాళ్లు తెలుగు మీడియంలో చదువుతున్నారా? ఇంగ్లిషు మీడియంలో చదువుతున్నారా?. పిల్లలకు నాణ్యమైన ఇంగ్లిషు విద్యను అదించడంలో సమగ్రమైన విధానాన్ని అనుసరిస్తున్నాం. బై లింగువల్ టెక్ట్స్ బుక్స్‌ను అందిస్తున్నాం. బైజూస్ కంటెంట్ పాఠాలను నేర్పిస్తున్నాం. స్కూళ్లలో నాడు – నేడు కింద మంచి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం. 6వ తరగతి పైబడి ఉన్న తరగతి గదులలో ఐఎఫ్‌పీ ప్యానెల్స్ పెడుతున్నాం. సుమారు 60వేల గదుల్లో ఐఎఫ్‌పీ ప్యానెల్స్ పెడుతున్నాం. ఇప్పటికే సుమారు 40వేల గదుల్లో ఏర్పాటు చేస్తున్నాం. ఫిబ్రవరి చివరి నాటికి మిగిలినవీ ఏర్పాటు చేస్తాం’’ అని సీఎం వివరించారు. ‘‘సబ్జెక్టు టీచర్ల కాన్సెప్టునూ 3వ తరగతి నుంచీ అమలు చేస్తున్నాం. టీచర్లలో బోధనా సామర్థ్యాన్ని పెంచుతున్నాం. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు అందిస్తున్నాం. ఇందులో ప్రీలోడెడ్ బైజూస్ కంటెంట్ అందిస్తున్నాం. దీనివల్ల ఇప్పటికే 8,9వ తరగతి చదువుతున్న విద్యార్థుల వద్ద ట్యాబులు ఉన్నాయి. అలాగే పిల్లలకు ఐబీ విద్యా విధానంలో బోధనకు శ్రీకారం చుడుతున్నాం. దీనికోసం ఎస్ఈఆర్టీతో కలిసి ఐబీ పనిచేస్తోంది. పిల్లలకు పాఠ్యప్రణాళికను ఎలా అందించాలన్నదానిపై ప్రత్యేక మార్గదర్శక ప్రణాళిక ఉంది. మొదటి సంవత్సరం టీచర్లకు సమర్థతను పెంచడంపై దృష్టిపెట్టాం’’ అని సీఎం పేర్కొన్నారు. 2025-26 నుంచి ఒకటో తరగతిలోకి ఐబీ వస్తుంది. అలా ప్రతీ ఏడాదీ తరగతి పెంచుకుంటూ ఐబీ పద్ధతిలో బోధనను పెంచుకుంటూ వెళ్తాం. పిల్లలకు జాయింట్ సర్టిఫికెట్ కూడా అందిస్తాం. విద్యా బోధనలో నాణ్య అన్నదే చాలా ప్రధానం. దీనిపై మేం ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాం. నాణ్యత ఉన్నప్పడే ప్రపంచస్థాయిలో పోటీని ఎదుర్కోగలరు. ఈ ప్రపంచం తదుపరి దశలోకి వెళ్తోంది. అందులోకూడా మన పేద పిల్లలు రాణించాలి. అలాంటి అవకాశాలు కేవలం సంపన్న పిల్లలకు మాత్రమే ఉన్నాయి. పేదరికంలో ఉన్న పిల్లలకు నాణ్యమైన చదువులు అందుకోవడానికి తగిన అవకాశాలు ఉండాలి. ఇదే మా ఉద్దేశం. ఐబీ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి కట్టుగా పనిచేస్తున్నాయి’’ అని సీఎం చెప్పారు. ఐబీలో ఉన్న ప్రతినిధులు సానుకూలతతో ఉన్నారు. నేను కూడా స్వయంగా వారితో మాట్లాడాను. మాతో కలిసి నడవడానికి వారు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఎస్ఈఆర్టీతో కలిసి పనిచేస్తారు. ఇది పెద్ద గేమ్ ఛేంజర్ కాబోతోంది. రానున్న రోజుల్లో దీనికి అనుగుణంగా టీచర్లకు సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతాం. స్కూళ్లలో మౌలిక సదుపాయాలను పూర్తిగా మెరుగుపరిచాం. ఇప్పటికే ౮౩౦౦ కోట్లు ఖర్చు చేశాం. సుమారు 14 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నాం. ఇప్పటికే మూడింట రెండు వంతుల స్కూళ్లలో పనులు పూర్తి చేశాం’’ సీఎం తెలిపారు. ‘‘జీఈఆర్ రేష్యోలో మేం చాలా దిగువన ఉండేవాళ్లం. దీన్ని మెరుగు పరచడానికి మంచి ఆలోచనలతో ముందుకు వెళ్లాం. స్కూళ్లను మెరుగ్గా తీర్చిదిద్దాం. మంచి మధ్యాహ్న భోజనాన్ని గోరుముద్ద కింద అందిస్తున్నాం. ప్రతిరోజూ ఒక మెనూ వారికి అమలు చేస్తున్నాం. పిల్లలను బడికి పంపే తల్లులకు అమ్మ ఒడి అందిస్తున్నాం. మేం చేపట్టిన కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయడానికి పగడ్బందీ వ్యవస్థలు ఉన్నాయి. మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో సమర్థవంతమైన యంత్రాంగాలు ఉన్నాయి. ముఖ్యమంత్రిగా నా దృష్టి ప్రత్యేకంగా ఉంటుంది. కేవలం మేం స్కూలు విద్యపైనే కాదు, ఉన్నత విద్యపైనా ప్రత్యేక దృష్టిపెట్టాం. ఉద్యోగాలు సాధించే కోర్సులను అందిస్తున్నాం. ఇంటర్నషిప్ అందిస్తున్నాం. ఆన్లైన్ వర్టికల్స్ అందిస్తున్నాం. పాఠ్యప్రణాళికలో వీటిని భాగస్వామ్యం చేశాం. పిల్లలు ఆన్లైన్లో మరిన్ని కోర్సులు నేర్చుకునేందుకు 1800 సబ్జెక్టుల్లో కోర్సులను అందించడానికి ఎడెక్స్‌తో ఒప్పందం చేసుకున్నాం. బీకాం నేర్చుకునేవారికి అసెట్ మేనేజ్ మెంట్ తదితర అంశాలను నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం. ఇవన్నీకూడా పాఠ్యప్రణాళికలో భాగం చేస్తున్నాం’’ అని సీఎం చెప్పారు. రాజకీయాలు వేరే: ‘‘పిల్లలు ఓటర్లు కాదు కాబట్టి.. వారిపైన పెద్దగా శ్రద్ధ పెట్టరు. అయితే విద్య అలాంటి అంశాలపై దృష్టిపెట్టకపోతే పేదరికాన్ని నిర్మూలించలేం. నేను ఏమీ హామీ ఇచ్చాను, నేనే ఏం చేశాను అన్నది చూడాలి. మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99.౫శాతం అమలు చేశాను. అమలు చేయడమే కాదు, వాటిని ప్రజల వద్దకు తీసుకెళ్లగలిగాను. ఇది మా ప్రభుత్వానికున్న విశ్వసనీయత. ప్రతి 2వేల జనాభాకు గ్రామ సచివాలయాన్ని, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చాం. వివక్ష లేకండా, అవినీతి లేకుండా అర్హత ఉన్నవారికి డీబీటీ ద్వారా పథకాలు అందించాం. డీబీటీ అన్నది ఒక విజయవంతమైన అంశం అయితే విద్య, వైద్యం, మహిళా సాధికారితల్లో గణనీయమైన మార్పులు తీసుకు వచ్చాం. అన్నిటికంటే మించి వివక్ష లేకుండా పారదర్శకతతో డీబీటీ అమలు చేశాం. కచ్చితం మేం తిరిగి అధికారంలోకి వస్తాం’’ అని సీఎం పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ఏవీ కూడా పథకాలు గురించి మాట్లాడవు, వాటి అమలు గురించీ మాట్లాడలేవు. ఇదే బడ్జెట్ గతంలోనూ ఉంది..ఇప్పుడూ ఉంది. కాని మార్పు ఏంటంటే.. కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారారు. కాని ఈప్రభుత్వం మాత్రమే చేయగలిగింది. చంద్రబాబు విషయంలో ప్రతీకారం అన్నది లేనే లేదు. చంద్రబాబుపై అవినీతి ఆరోపణల విషయం కోర్టుకు చేరింది. ఆ ఆరోపణలు, ఆధారాలను చూసి కోర్టు నిర్ణయం తీసుకుని రిమాండ్ విధించింది. అలాంటప్పుడు ప్రతీకారం ఎలా అవుతుంది. సీఐడీ కేసులు పెట్టినా, కోర్టులు ఆధారాలను చూస్తాయి కదా?. వాటిని చూసి కన్వెన్స్ అయితేనే కోర్టులు నిర్ణయాలు తీసుకుంటాయి. రాష్ట్రంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల ఉనికి పెద్దగా ఉండదు. పోటీ మా పార్టీకి, టీడీపీ- జనసేన మధ్యే ఉంటుంది’’ అని సీఎం చెప్పారు. ప్రతిపార్టీకూడా సర్వేలు చేస్తుంది. వాటి ఫలితాలు ఆధారంగా మార్పులు, చేర్పులు చేస్తుంది. ప్రభుత్వం పట్ల ప్రజలు చాలా సానుకూలంగా ఉన్నారు. కాని కొందరు స్థానిక నాయకులు విషయంలో కొంత అసంతృప్తితో ఉన్నారు. అంతేకాకుండా సామాజిక సమీకరణాల దృష్ట్యా కూడా కొన్ని మార్పులు చేశాం. చివరిదశలో మార్పులు చేసి అయోమయం సృష్టించే కన్నా, ముందుగానే నిర్ణయిస్తున్నాం. జాతీయ రాజకీయాలు విషయంలో మావిధానం స్పష్టం. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మేం రాజీపడం. ప్రజల ప్రయోజనాల విషయంలోనే కేంద్ర ప్రభుత్వంతో సహకారంతో ముందుకు వెళ్తున్నాం’’ అని సీఎం తెలిపారు. ఇదీ చదవండి: ఎవరికోసం ఈ ఆరాటం.. ఎవరితో పోరాటం ‘‘కాంగ్రెస్ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్ ఆడుతుంది. అది ఆపార్టీ సంప్రదాయంగా చూస్తున్నాం. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు. విభజించి రాష్ట్రాన్ని పాలించాలనుకున్నారు. అలాగే మా కుటుంబాన్ని కూడా విభజించారు. నేను కాంగ్రెస్‌నుంచి విడిపోయినప్పుడు గతంలో మా చిన్నాన్నకు మంత్రిపదవి ఇచ్చి మాపై పోటీకి పెట్టారు. వారు పాఠాలు నేర్వేలేదు. వారి పార్టీ సారథ్య బాధ్యతలు మా సోదరికి ఇచ్చారు. కాని అధికారం అనేది దేవుడు ఇచ్చేది. దేవుడ్ని నేను బలంగా నమ్మతాను. ఆయనే అన్నీ చూస్తాడు’’ అని సీఎం పేర్కొన్నారు. -
ఏపీకి షర్మిల రాకపై మంత్రి రోజా సెటైర్లు
సాక్షి, తిరుపతి: ఏపీకి షర్మిల రాక.. మరొక నాన్‌లోకల్ పొలిటీషియన్ వచ్చినట్టేనని.. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌కు ఓటు అడిగే హక్కులేదని మంత్రి రోజా అన్నారు. వైఎస్సార్ చనిపోయిన తర్వాత ఆయన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారని, కాంగ్రెస్ పార్టీ జగన్‌ను 16 నెలలు జైల్లో పెట్టించిందని ఆమె ధ్వజమెత్తారు. స్విమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వడమాల పేటలో క్యాన్సర్ స్క్రీనింగ్ పింక్ బస్ క్యాంప్‌ను మంత్రి రోజా మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, నగరి నియోజకవర్గంలో 14వ సారి పింక్ బస్ క్యాంప్ నిర్వహించి మహిళల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇంటికి దీపం ఇల్లాలు.. ప్రతి ఇంట్లో మహిళ పింక్ బస్‌లో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేసుకోవాలని సూచించారు. సీఎం జగన్ సంక్షేమ పాలనలో విద్య, వైద్యం, మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. -
కుప్పంలో చంద్రబాబుకు గుణపాఠం తప్పదా?
ఏడుసార్లు అందలం ఎక్కించిన కుప్పం ప్రజలు ఈసారి ఓడించి హైదరాబాద్‌కే పరిమితం చేస్తారని చంద్రబాబు భయపడుతున్నారా? ఓటమి భయంతోనే కుప్పంతో పాటు మరో నియోజకవర్గం కూడా చంద్రబాబు వెతుక్కుంటున్నారా? 35 ఏళ్ళపాటు ఏకధాటిగా ఎన్నుకున్నా పట్టించుకోనందుకు కుప్పం ప్రజలు చంద్రబాబుకు గట్టి గుణపాఠం చెప్పబోతున్నారా? కుప్పంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుందన్న భయంతోనే బలమైన సీటు కోసం వేట ప్రారంభించారా? అసలు కుప్పంలో ఏం జరుగుతోంది? 1983 ఎన్నికల్లో తన సొంత నియోజక వర్గం చంద్రగిరిలో ఘోర పరాజయం పొందిన చంద్రబాబు నాయుడు.. 1989 ఎన్నికల నాటికి కుప్పం ట్రాన్స్ ఫర్ అయ్యారు. ఇపుడు ఎమ్మెల్యేలను కూడా బదిలీ చేస్తారా అంటూ కామెడీ చేస్తోన్న చంద్రబాబు మూడున్నర దశాబ్ధాల క్రితమే చంద్రగిరి నుంచి కుప్పం నియోజక వర్గానికి బదలీ అయిన నాయకుడిగా చరిత్ర సృష్టించారు. రాష్ట్రంలోనే అత్యంత వెనకబడిన నియోజక వర్గంగా కుప్పాన్ని మూడున్నర దశాబ్ధాల పాటు చంద్రబాబు తన స్వప్రయోజనాలకే వాడుకున్నారు. 35ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న చంద్రబాబు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. అయినా కుప్పం నియోజక వర్గాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదు. అందుకే కుప్పం ప్రజలు ఉపాధిలేక ఉస్సూరు మంటూ ఉండేవారు. జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పం లో సంక్షేమ పథకాల అమలుతో దాని ముఖచిత్రం మారింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేతుల్లోనే అధికారం ఉన్నప్పుడు ఆయన కుప్పానికి ఏమీ చేయలేదు. కుప్పాన్ని మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేయలేదు. రెవిన్యూ డివిజన్‌గా చేసుకోలేకపోయారు. హంద్రీ నీవా నీళ్లు కుప్పం వరకు తేలేకపోయారు. 2019లో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే కుప్పం నియోజక వర్గం తలరాత మారిందని చెప్పాలి. ముందుగా మున్సిపాలిటీని చేశారు. ఆ వెంటనే రెవిన్యూ డివిజన్ గా ప్రకటించారు. కుప్పం కాలువలకు హంద్రీ నీవా ద్వారా నీటిని అందించే బృహత్ పథకం కూడా సాకారం చేశారు జగన్మోహన్రెడ్డి. ఫలితంగా నియోజక వర్గంలోని 44 కాలువలు జలకళతో మెరవనున్నాయి. ఇక నవరత్న పథకాలతో పాటు వివిధ సంక్షేమ పథకాలను అర్హులైన అందరికీ అందిస్తున్నారు జగన్మోహన్రెడ్డి. ఈ మార్పు కారణంగానే కుప్పం ప్రజలు వైఎస్సార్‌సీపీవైపు మొగ్గు చూపారు. పంచాయతీ, మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీని పక్కన పెట్టి వైఎస్సార్సీపీ అభ్యర్ధులను గెలిపించారు కుప్పం ప్రజలు. ఈ వరుస ఓటముల కారణంగానే చంద్రబాబు వెన్నులో చలి మొదలైంది. అంత వరకు కుప్పానికి చుట్టపు చూపుగా కూడా రాని చంద్రబాబు ఏడాదిలో మూడు సార్లు కుప్పం వచ్చి రెండు మూడు రోజులు గడిపి వెళ్తున్నారు. ఇంత వరకు కుప్పంలో ఇల్లుకూడా కట్టుకోని చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికల్లో పరాజయాల తర్వాతనే నియోజక వర్గంలో ఇంటి నిర్మాణం మొదలు పెట్టారు. కేవలం ఎన్నికల్లో ఓట్లకోసమే చంద్రబాబు ఇలా డ్రామాలు చేస్తున్నారని నియోజక వర్గ ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో కుప్పం అసెంబ్లీ నియోజక వర్గంలోనూ వైఎస్సార్సీపీజెండా ఎగరేస్తామని పాలక పక్షం ధీమా వ్యక్తం చేస్తోంది. కుప్పాన్ని దృష్టిలో ఉంచుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వై నాట్ 175 అన్ని నినాదాన్ని బలంగా వినిపిస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రులు కుప్పం నియోజక వర్గంలో ఎన్ని అక్రమాలు జరిగినా దొంగ ఓట్ల వ్యవహారాలు ఉన్నా పట్టించుకోలేదు. కానీ జగన్మోహన్రెడ్డి అన్నీ పకడ్బందీగా చూస్తూ ఉండడంతో చంద్రబాబుకు కస్టాలు తప్పేలా లేవంటున్నారు మేథావులు. కుప్పం ప్రజలపై కానీ.. కుప్పంలోని టిడిపి నాయకులపై కానీ చంద్రబాబుకు నమ్మకం లేనట్లుంది. అందుకే నియోజక వర్గ ఇన్ ఛార్జ్ గా ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తిని నియమించుకున్నారు. దీనిపైనా టిడిపి శ్రేణుల్లోనూ ప్రజల్లోనూ వ్యతిరేకత పెల్లుబుకుతోంది. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో ఓడినా ఓడిపోవచ్చని గ్రహించిన చంద్రబాబు ఎన్టీయార్ కృష్ణా జిల్లాలో ఏదైనా బలమైన నియోజక వర్గం నుంచి కూడా పోటీచేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి చంద్రబాబులో భయం అయితే తీవ్ర స్థాయిలో ఉందన్నది భయంకర వాస్తవం. -
అసలు చిత్తూరు టీడీపీలో ఏం జరుగుతోంది!
యూజ్ అండ్ త్రో పాలసీకి పేటెంట్‌దారుడు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. జిల్లా ఏదైనా.. నియోజకవర్గం ఏదైనా డబ్బు సంచులు తెచ్చేవారికే టిక్కెట్ ఇస్తారనేది అందరికీ తెలిసిన సత్యమే. ఇదే వ్యవహారం చిత్తూరు నియోజకవర్గంలో కాక రేపుతోంది. కష్టకాలంలో పార్టీకోసం పనిచేసినవారిని కాదని.. డబ్బులిస్తారని ఎవరో ఒకరికి టిక్కెట్ ఇస్తే సహించేది లేదని అక్కడి నేతలు తేల్చి చెబుతున్నారు. కొత్తవారికి ఇస్తే మరోసారి ఓటమి ఖాయమని అధినేతకు తెగేసి చెప్పేస్తున్నారు. అసలు చిత్తూరు టీడీపీలో ఏం జరుగుతోందో చూద్దాం. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం టిడిపిలో అయోమయం కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారో తెలియక పార్టీ క్యాడర్ ఆందోళనకు గురవుతోంది. స్థానిక నేతలకు బదులుగా వేరే నియోజకవర్గానికి చెందిన నేతను అభ్యర్థిగా ప్రకటించాలని పార్టీ నాయకత్వం యోచిస్తుండడం టిడిపి శ్రేణులను గందరగోళానికి గురిచేస్తోంది. గత నాలుగున్నర సంవత్సరాలుగా చిత్తూరులో టిడిపి వ్యవహారాలను కాజూరు బాలాజీ చూస్తున్నారు. తనకే టికెట్ వస్తుందన్న ధీమాతో ఆయన పని చేసుకుంటూ పోతున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయనే టాక్ నడుస్తోంది. బాలాజీ స్థానంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి గురజాల జగన్మోహన్ అభ్యర్థిత్వాన్ని మొదట టిడిపి అధిష్టాన వర్గం పరిశీలించిందట. అయితే ఇప్పుడు కొత్తగా టీఎన్ రాజన్ అనే వ్యక్తి తెరపైకి వచ్చాడు. గురజాల జగన్మోహన్ బెంగళూరులో ఉంటూ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటున్నాడు. కొద్ది నెలలుగా చిత్తూరులో పర్యటిస్తూ అసెంబ్లీ టిక్కెట్ తనకే వస్తుందని అనుచర గణం వద్ద చెప్పుకుంటున్నారట. అలాగే తిరుచానూరుకు చెందిన మాజీ సర్పంచ్ టిఎన్ రాజన్ రెండు మూడు వారాలుగా చిత్తూరుకు వచ్చి తనకే టికెట్ వస్తుందని తన సామాజిక వర్గం వద్ద గట్టిగా చెబుతున్నాడట. చిత్తూరు అభ్యర్థిగా రోజుకో పేరు ప్రచారంలోకి వస్తుండటంతో టీడీపీ కేడర్‌లో అయోమయం ఏర్పడింది. అయితే పార్టీ నాయకత్వం మాత్రం ఇప్పటివరకు చిత్తూరు విషయంలో క్లారిటీ ఇవ్వడంలేదు..ప్రచారానికి ఫుల్స్టాప్ పెట్టడంలేదట. దీంతో ఎవరికి వారే తమకే టికెట్ వస్తుందని చెప్పుకుంటున్నట్లు పార్టీలోనే చర్చ జరుగుతోంది. టీడీపీ అగ్ర నాయకత్వమే అభ్యర్థి విషయంలో గందరగోళానికి తావిస్తోందని, ఎలాగూ ఓడిపోయే సీటే గనుక పార్టీ పెద్దగా సీరియస్‌గా తీసుకోవడంలేదేమో అని కూడా కార్యకర్తలు సందేహిస్తున్నారు. టికెట్ విషయంలో ఎవరో ఒకరు తేల్చుకున్న తర్వాత చూద్దాంలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చదవండి: టీడీపీతో పొత్తు కోసం ఆ నలుగురు నేతలు పాట్లు..! -
వైఎస్సార్ సీపీ నాలుగో జాబితా.. సంపూర్ణ సామాజిక న్యాయం
సాక్షి, అమరావతి: సంపూర్ణ సామాజిక న్యాయం, ప్రజాదరణే గీటు రాయిగా 8 శాసనసభ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానానికి పార్టీ సమన్వయకర్తలను నియమిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగో జాబితాను ఖరారు చేశారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సమస్యలను ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ పరిష్కరిస్తూ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను సమర్థంగా ముందుకు తీసుకెళ్లి ప్రజల మన్ననలు అందుకొన్న నేతలకు పెద్దపీట వేశారు. సామాజిక న్యాయంలో మరో రెండడుగులు ముందుకేశారు. గురువారం రాత్రి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ వివరాలను ప్రకటించారు. గత నెల 11న 11 శాసనసభ స్థానాలకు, ఈ నెల 2వతేదీన 24 శాసనసభ, 3 లోక్‌సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తలను నియమిస్తూ జాబితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అలాగే ఈ నెల 11న విడుదల చేసిన మూడో జాబితాలో 15 శాసనసభ, 6 లోక్‌సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తలను నియమించారు. మొత్తం నాలుగు జాబితాలతో కలిపి 58 శాసనసభ, 10 లోక్‌సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తలను ప్రకటించారు. 58 మంది సమన్వయకర్తల్లో ఎస్సీలు 21 మంది, ఎస్టీలు ముగ్గురు, బీసీలు 17 మంది, మైనార్టీలు నలుగురు, అగ్రవర్ణాలకు చెందిన వారు 13 మంది ఉన్నారు. పది లోక్‌సభ స్థానాల సమన్వయకర్తల్లో బీసీలు ఆరుగురు, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ఓసీ ఒకరు చొప్పున ఉన్నారు. సామాజిక సమీకరణాలు, స్థానిక అంశాలు.. వైనాట్ 175 లక్ష్యంతో దూసుకెళుతున్న వైఎస్సార్సీపీ వ్యూహాత్మకంగా మరో ముందడుగు వేసింది. సామాజిక సమీకరణలు, స్థానిక రాజకీయ అంశాల మేలు కలయికగా తాజాగా నాలుగో జాబితాను ప్రకటించింది. ప్రజలకు మరింత మేలు చేయడం, పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా సమన్వయకర్తలను నియమించింది. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా వరుసగా గెలుస్తూ 2019 నుంచి ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్‌శాఖ మంత్రిగా ఉన్న సీనియర్ నేత కె.నారాయణ స్వామిని చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది. 2019లో చిత్తూరు ఎంపీగా గెలిచిన ఎన్.రెడ్డెప్పను జీడీ నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఖరారు చేసింది. ఇక అనంతపురం జిల్లా శింగనమల అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఎం.వీరాంజనేయులు, నంద్యాల జిల్లా నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా డాక్టర్ సుధీర్ దారా, శ్రీసత్యసాయి జిల్లా మడకశిర సమన్వయకర్తగా ఈర లక్కప్పలకు తొలిసారి అవకాశం కల్పించింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నల్లగట్ల స్వామిదాస్‌ను నియమించారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న హోంమంత్రి తానేటి వనితను గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. ప్రస్తుతం గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న తలారి వెంకట్రావును కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఖరారు చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా హనుమంతునిపాడు జెడ్పీటీసీ సభ్యుడు దద్దాల నారాయణ యాదవ్‌ను నియమించారు. చేసిన మంచే శ్రీరామరక్షగా.. ప్రజలకు నాలుగున్నరేళ్లుగా చేసిన మంచి పనులే మనకు తోడుంటాయనే ధైర్యంతో ముఖ్యమంత్రి జగన్ అడుగులు ముందుకు వేస్తూ పార్టీ శ్రేణులను ఎన్నికల సమరానికి సన్నద్ధం చేస్తున్నారు. ప్రజలకు దగ్గరగా ఉండేవారికే టికెట్ ఇస్తున్నారు. ఆ విషయం అనేకసార్లు ఆయన ఎంపీలు, ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. తన తండ్రి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి గత 56 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలతో సుపరిపాలన అందిస్తున్నారు. డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) ద్వారా నేరుగా రూ.2.45 లక్షల కోట్లు, నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1.67 లక్షల కోట్లు వెరసి మొత్తం రూ.4.12 లక్షల కోట్ల మేర ప్రజలకు ప్రయోజనం చేకూర్చారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశించినట్లుగా దళితులు, బలహీనవర్గాలు, పేద వర్గాలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదిగేలా తోడ్పాటు అందిస్తున్నారు. శాసనమండలి చైర్మన్‌గా మోషేన్ రాజును, బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారామ్‌ను స్పీకర్‌గా నియమించి సామాజిక సమీకరణకు పెద్ద పీట వేశారు. 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను మంత్రుల్ని చేశారు. సంక్షేమ పథకాలను ఎలాంటి లంచాలు, సిఫారసులకు తావులేకుండా ప్రజలకు అందిస్తున్నారు. మహిళా సాధికారతను సాకారం చేశారు. వైఎస్సార్ మహిళల్ని లక్షాధికారుల్ని చేస్తే సీఎం జగన్ వారిని కోటీశ్వరులుగా చేస్తున్నారు. పేదల పిల్లలకు ఉన్నత వర్గాలతో సమానంగా ఇంగ్లిష్ మీడియం చదువులు అందిస్తున్నారు. 56 కార్పొరేషన్లు ఏర్పాటు ద్వారా బడుగు బలహీన వర్గాలు, దళితుల ఆత్మ గౌరవాన్ని పెంపొందించారు. ఈ క్రమంలో 175 స్థానాల్లోనూ గెలుపే లక్ష్యంగా సమన్వయకర్తలను నియమిస్తున్నారు. నాలుగో జాబితా ఇదీ చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం (ఎస్సీ రిజర్వుడ్): కె.నారాయణస్వామి (ఉప ముఖ్యమంత్రి) 8 శాసనసభ నియోజక వర్గాలకు సమన్వయకర్తలు వీరే.. 1. జీడీ నెల్లూరు (ఎస్సీ రిజర్వ్డ్ ): ఎన్ . రెడ్డెప్ప 2.శింగనమల (ఎస్సీ రిజర్వ్డ్ ): ఎం. వీరాంజనేయులు 3. నందికొట్కూరు (ఎస్సీ రిజర్వ్డ్ ): డాక్టర్ సుధీర్ దారా 4. తిరువూరు (ఎస్సీ రిజర్వ్డ్ ): నల్లగట్ల స్వామిదాస్ 5. మడకశిర (ఎస్సీ రిజర్వ్డ్ ): ఈర లక్కప్ప 6. కొవ్వూరు (ఎస్సీ రిజర్వ్డ్ ): తలారి వెంకట్రావు 7. గోపాలపురం (ఎస్సీ రిజర్వ్డ్ ): తానేటి వనిత 8. కనిగిరి: దద్దాల నారాయణ యాదవ్ -
టీడీపీలో కొత్త ట్విస్ట్.. కుప్పంలో చంద్రబాబుకు ఎదురుగాలి!
టీడీపీ అధినేత చంద్రబాబుకు కుప్పంలో ఎదురుగాలి వీస్తోంది. కుప్పం ప్రజలు.. చంద్రబాబుకు షాక్ ఇచ్చేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. టీడీపీ నేతల మధ్య పొలిటికల్ కోల్డ్‌వారే ఇందుకు కారణమని సమాచారం. ఇక, తాజాగా కుప్పంపై చంద్రబాబు ఫోకస్ పెట్టినా ఉపయోగం లేదని అటు సర్వేలు కూడా చెబుతున్నాయి. తాజా సర్వేతో కుప్పం టీడీపీ నేతల్లో అసంతృప్తి నెలకొంది. ఇక, ఇటీవల చంద్రబాబు పర్యటనలో అలవికాని హామీలిచ్చి మోసం చేసే ప్రయత్నం చేశారు. మరోవైపు, 35 ఏళ్లుగా చంద్రబాబు కుప్పంకు సాగునీరు, తాగునీరు కూడా ఇవ్వలేకపోయారు. ఇప్పటికీ చంద్రబాబుకు కుప్పంలో సొంత ఇల్లు కూడా లేకపోవడం గమనార్హం. ఇటీవల హడావిడిగా శాంతిపురం మండలం శివపురంలో చంద్రబాబు ఇళ్లు నిర్మాణం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. కుప్పం టీడీపీలో గ్రూప్ రాజకీయాలతో చంద్రబాబుకు తలనొప్పులు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ను కుప్పం ఇంఛార్జిగా తెలుగు తమ్ముళ్లు అంగీకరించడం లేదు. మరోవైపు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం కుప్పంను చాలా అభివృద్ధి చేశారు. కుప్పం మున్సిపాలిటీ, కుప్పం ఆర్డీవో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కుప్పంకు ఈ నెలలోనే హంద్రీనీవా కాలువ ద్వారా సాగు, తాగు నీరు జాలాలు తెచ్చే ఏర్పాట్లు చేశారు. ఇక, టీడీపీకి చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులు కరువయ్యారు. చిత్తూరు, జీడి నెల్లూరు, పూతల పట్టు, మదనపల్లి, సత్యవేడు, నగరి అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ సరైన అభ్యర్థులు లేని పరిస్థితి నెలకొంది. దీంతో, సర్వేల్లో కూడా టీడీపీ తప్పదని నివేదికలు చెబుతున్నాయి. -
కాంగ్రెస్‌లో ఎవరున్నా మాకు ప్రత్యర్థులే: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, చిత్తూరు: కుటుంబాల్లో చిచ్చుపెట్టడం టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు బాగా తెలుసని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. అలాగే, టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ సీఎం కాలేరని అన్నారు. కాంగ్రెస్‌లో ఎవరు ఉన్నా ప్రత్యర్థిగానే చూస్తామని వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి పెద్దిరెడ్డి గురువారం చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం అవుతానని చంద్రబాబు ఇంకా పగటి కలలు కంటున్నాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను మరోసారి సీఎంను చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాజకీయాల్లో మార్పులు చేర్పులు సహజం. సీఎం జగన్ మా నాయకుడు. ఆయన కోసం మేము ఎప్పటికీ పనిచేస్తూనే ఉంటాం. కాంగ్రెస్, టీడీపీ వంటి పార్టీలు ఎన్ని వచ్చినా మేము ముఖ్యమంత్రి జగన్‌తోనే నడుస్తాం. కుటుంబాలను చీల్చి రాజకీయం చేసే నైజం కాంగ్రెస్, టీడీపీ పార్టీలదే. కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నా.. ఎవరు చేరినా.. మా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నట్టే. మేము వారిని ప్రత్యర్థులుగానే చూస్తాం. జడ్పీటీసీగా ఓడిన వ్యక్తిని మేము ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం. ఇలాంటివి మాట్లాడే ముందు ఆలోచన చేయాలి. ఎవరో రెచ్చగొడితే అలా మాట్లాడటం సబబు కాదు. ఇప్పటికైనా పునరాలోచన చేయాలని కోరుకుంటున్నా అని కామెంట్స్ చేశారు. -
కాళహస్తిలో సెల్ఫీ వీడియో.. టీడీపీ నేతపై ఆగ్రహం
తిరుపతి, సాక్షి: తెలుగుదేశం పార్టీ నేత బొజ్జల సుధీర్‌రెడ్డి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. శ్రీకాళహస్తి ఆలయంలో సెల్ఫీ వీడియో ద్వారా ఆలయ ట్రస్ట్ ఆగ్రహానికి గురయ్యారు. ఆలయ దర్శనానికి వెళ్ళే సమయంలో సెల్ ఫోన్ వాడకం నిషేధం అమలులో ఉన్నప్పటికీ.. ఆ నిబంధనల్ని బొజ్జల ఉల్లంఘించారు. ఆలయంలో సెల్ఫీ వీడియో చిత్రీకరించారు. ఆలయంలో పురాతమైన భాగం తొలగింపు.. ఆ తొలగింపుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బొజ్జల. పైగా గోడ కూలడాన్ని ప్రభుత్వానికి ముడిపెట్టి విమర్శలు గుప్పించారు. దీంతో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ఆంజురు తారక శ్రీనివాసులు తీవ్రంగా పరిగణించారు. ఈ క్రమంలో బొజ్జలపై చట్టపరమైన చర్యలు కు సిద్దం అవుతున్నారు. ఆలయ చైర్మన్ వివరణ ఇది.. ఆలయంలో కూల్చివేత అంటూ టీడీపీ నేత సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడంపై శ్రీకాళహస్తి ఆలయం పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు స్పందించారు. ఆలయంలో మృత్యుంజయ లింగం ఆనుకుని ఉన్న గదిని గతంలో ప్రసాదాలు తయారీ సరుకుల గోడౌన్ గా వినియోగించేవారు. 1956 లో దేవస్థానం ట్రస్టీ సహకారం తో దీన్ని నిర్మాణం చేశారు. శిథిలావస్థలో ఉన్న దీన్ని కూల్చి వేయాలని ప్రస్తుత పాలక మండలి 2022 ఆగస్టులో జరిగిన పాలకమండలి సమావేశం లో 7వ అంశంగా చేర్చారు. దానిలో భాగంగా పాడుబడిన ఈ గదిని తొలగింపు చర్యలు చేపట్టారు