తిరుపతి, సాక్షి: తెలుగుదేశం పార్టీ నేత బొజ్జల సుధీర్‌రెడ్డి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. శ్రీకాళహస్తి ఆలయంలో సెల్ఫీ వీడియో ద్వారా ఆలయ ట్రస్ట్ ఆగ్రహానికి గురయ్యారు. ఆలయ దర్శనానికి వెళ్ళే సమయంలో సెల్ ఫోన్ వాడకం నిషేధం అమలులో ఉన్నప్పటికీ.. ఆ నిబంధనల్ని బొజ్జల ఉల్లంఘించారు. ఆలయంలో సెల్ఫీ వీడియో చిత్రీకరించారు.
ఆలయంలో పురాతమైన భాగం తొలగింపు.. ఆ తొలగింపుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బొజ్జల. పైగా గోడ కూలడాన్ని ప్రభుత్వానికి ముడిపెట్టి విమర్శలు గుప్పించారు. దీంతో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ఆంజురు తారక శ్రీనివాసులు తీవ్రంగా పరిగణించారు. ఈ క్రమంలో బొజ్జలపై చట్టపరమైన చర్యలు కు సిద్దం అవుతున్నారు.
ఆలయ చైర్మన్ వివరణ ఇది..
ఆలయంలో కూల్చివేత అంటూ టీడీపీ నేత సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడంపై శ్రీకాళహస్తి ఆలయం పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు స్పందించారు. ఆలయంలో మృత్యుంజయ లింగం ఆనుకుని ఉన్న గదిని గతంలో ప్రసాదాలు తయారీ సరుకుల గోడౌన్ గా వినియోగించేవారు. 1956 లో దేవస్థానం ట్రస్టీ సహకారం తో దీన్ని నిర్మాణం చేశారు. శిథిలావస్థలో ఉన్న దీన్ని కూల్చి వేయాలని ప్రస్తుత పాలక మండలి 2022 ఆగస్టులో జరిగిన పాలకమండలి సమావేశం లో 7వ అంశంగా చేర్చారు. దానిలో భాగంగా పాడుబడిన ఈ గదిని తొలగింపు చర్యలు చేపట్టారు
Comments
Please login to add a commentAdd a comment