Tirupati Assembly Constituencies
-
కాంగ్రెస్ కుట్ర.. కుటుంబాన్ని చీల్చి.. రాజకీయాలా..: సీఎం జగన్
సాక్షి, తిరుపతి: తిరిగి తాము అధికారంలోకి రావడం ఖాయమని.. తన వల్ల మేలు జరిగిందని భావిస్తేనే ఓటు వేయమని ధైర్యంగా అడుగుతున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. తిరుపతిలో ఇండియా టుడే విద్యా సదస్సులో ఆయన మాట్లాడుతూ.. తప్పనిసరిగా మేం తిరిగి అధికారంలోకి వస్తాం.. విద్య, వైద్యం, పరిపాలనా రంగాల్లో పెను మార్పులు తీసుకు వచ్చాం. వివక్ష లేకుండా, అవినీతి లేకుండా పారదర్శకంగా అర్హత ఉన్న వారికి అన్నీ అందించాం’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘మేని ఫెస్టోలో 99.5 శాతం హామీలను నెరవేర్చాం. మా ప్రభుత్వానికున్న విశ్వసనీయతకు నిదర్శనం ఇది. కాంగ్రెస్ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్ ఆడుతుంది. విభజించి రాష్ట్రాన్ని పాలించాలనుకున్నారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు. అలాగే మా కుటుంబాన్ని కూడా విభజించారు’’ అని సీఎం ధ్వజమెత్తారు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్‌లో చెత్త రాజకీయం చేస్తోందని సీఎం జగన్ మండిపడ్డారు. గతంలోనూ మా బాబాయ్‌ను మంత్రిగా చేసి మాకు వ్యతిరేకంగా పోటీ చేయించారు. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోని కాంగ్రెస్.. మరోసారి మా సోదరిని ప్రయోగించింది. దేవుడు వీరికి గుణపాఠం చెబుతాడు’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘‘ప్రతిపక్షాలు ఏవీ కూడా పథకాలు గురించి మాట్లాడవు, వాటి అమలు గురించీ మాట్లాడలేవు. ఇదే బడ్జెట్ గతంలోనూ ఉంది..ఇప్పుడూ ఉంది. కాని అప్పుడు డీబీటీ ఎందుకు జరగలేదు. మార్పు ఏంటంటే.. కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారారు. చంద్రబాబు విషయంలో ప్రతీకారం అన్నది లేనే లేదు. సీఐడీని దుర్వినియోగం ఆరోపణలు అర్థరహితం. చంద్రబాబుపై ఆరోపణలు, వాటిపై ఆధారాలు పరిశీలించాకే కోర్టులు నిర్ణయం తీసుకున్నాయి. పేదరికాన్ని నిర్మూలించాలంటే అది నాణ్యమైన చదువు ద్వారానే సాధ్యమని నేను నమ్ముతాను. విద్య మాత్రమే కాదు, నాణ్యమైన విద్య అనే ప్రతి ఒక్కరి హక్కు కావాలి’’ అని సీఎం జగన్ అన్నారు. ‘‘పేదరికాన్ని నిర్మూలించాలంటే అది నాణ్యమైన చదువు ద్వారానే సాధ్యమని నేను నమ్ముతాను. విద్య మాత్రమే కాదు, నాణ్యమైన విద్య అనే ప్రతి ఒక్కరి హక్కుకావాలి. పేదలు ఒక చదువుకు పరిమితమైతే, సంపన్నుల పిల్లలు వేరే చదువులు చదువుతున్నారు. పేద పిల్లలు కేవలం తెలుగుమీడియంకు పరిమితమైతే, సంపన్నుల పిల్లలు ఇంగ్లిషు మీడియం చదువుతున్నారు. సంపన్నులకు అందే నాణ్యమైన చదువులు పేద పిల్లలకూ అందాలి. మా రాష్ట్రంలో పేదపిల్లలకు సంపన్నుల పిల్లలకు అందే చదువులు అందాలన్నదే మా లక్ష్యం’ అని సీఎం స్పష్టం చేశారు. ‘‘కొందరు పెద్దలు మమ్మల్ని విమర్శిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లను ఇంగ్లిషు మీడియం స్కూళ్లగా మారుస్తున్నామని.. కాని నేను ఒక్కటే అడుగుతున్నా.. మీ పిల్లలు, మీ మనవళ్లు ఏ మీడియంలో చదువుతున్నారు?. వాళ్లు తెలుగు మీడియంలో చదువుతున్నారా? ఇంగ్లిషు మీడియంలో చదువుతున్నారా?. పిల్లలకు నాణ్యమైన ఇంగ్లిషు విద్యను అదించడంలో సమగ్రమైన విధానాన్ని అనుసరిస్తున్నాం. బై లింగువల్ టెక్ట్స్ బుక్స్‌ను అందిస్తున్నాం. బైజూస్ కంటెంట్ పాఠాలను నేర్పిస్తున్నాం. స్కూళ్లలో నాడు – నేడు కింద మంచి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం. 6వ తరగతి పైబడి ఉన్న తరగతి గదులలో ఐఎఫ్‌పీ ప్యానెల్స్ పెడుతున్నాం. సుమారు 60వేల గదుల్లో ఐఎఫ్‌పీ ప్యానెల్స్ పెడుతున్నాం. ఇప్పటికే సుమారు 40వేల గదుల్లో ఏర్పాటు చేస్తున్నాం. ఫిబ్రవరి చివరి నాటికి మిగిలినవీ ఏర్పాటు చేస్తాం’’ అని సీఎం వివరించారు. ‘‘సబ్జెక్టు టీచర్ల కాన్సెప్టునూ 3వ తరగతి నుంచీ అమలు చేస్తున్నాం. టీచర్లలో బోధనా సామర్థ్యాన్ని పెంచుతున్నాం. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు అందిస్తున్నాం. ఇందులో ప్రీలోడెడ్ బైజూస్ కంటెంట్ అందిస్తున్నాం. దీనివల్ల ఇప్పటికే 8,9వ తరగతి చదువుతున్న విద్యార్థుల వద్ద ట్యాబులు ఉన్నాయి. అలాగే పిల్లలకు ఐబీ విద్యా విధానంలో బోధనకు శ్రీకారం చుడుతున్నాం. దీనికోసం ఎస్ఈఆర్టీతో కలిసి ఐబీ పనిచేస్తోంది. పిల్లలకు పాఠ్యప్రణాళికను ఎలా అందించాలన్నదానిపై ప్రత్యేక మార్గదర్శక ప్రణాళిక ఉంది. మొదటి సంవత్సరం టీచర్లకు సమర్థతను పెంచడంపై దృష్టిపెట్టాం’’ అని సీఎం పేర్కొన్నారు. 2025-26 నుంచి ఒకటో తరగతిలోకి ఐబీ వస్తుంది. అలా ప్రతీ ఏడాదీ తరగతి పెంచుకుంటూ ఐబీ పద్ధతిలో బోధనను పెంచుకుంటూ వెళ్తాం. పిల్లలకు జాయింట్ సర్టిఫికెట్ కూడా అందిస్తాం. విద్యా బోధనలో నాణ్య అన్నదే చాలా ప్రధానం. దీనిపై మేం ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాం. నాణ్యత ఉన్నప్పడే ప్రపంచస్థాయిలో పోటీని ఎదుర్కోగలరు. ఈ ప్రపంచం తదుపరి దశలోకి వెళ్తోంది. అందులోకూడా మన పేద పిల్లలు రాణించాలి. అలాంటి అవకాశాలు కేవలం సంపన్న పిల్లలకు మాత్రమే ఉన్నాయి. పేదరికంలో ఉన్న పిల్లలకు నాణ్యమైన చదువులు అందుకోవడానికి తగిన అవకాశాలు ఉండాలి. ఇదే మా ఉద్దేశం. ఐబీ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి కట్టుగా పనిచేస్తున్నాయి’’ అని సీఎం చెప్పారు. ఐబీలో ఉన్న ప్రతినిధులు సానుకూలతతో ఉన్నారు. నేను కూడా స్వయంగా వారితో మాట్లాడాను. మాతో కలిసి నడవడానికి వారు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఎస్ఈఆర్టీతో కలిసి పనిచేస్తారు. ఇది పెద్ద గేమ్ ఛేంజర్ కాబోతోంది. రానున్న రోజుల్లో దీనికి అనుగుణంగా టీచర్లకు సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతాం. స్కూళ్లలో మౌలిక సదుపాయాలను పూర్తిగా మెరుగుపరిచాం. ఇప్పటికే ౮౩౦౦ కోట్లు ఖర్చు చేశాం. సుమారు 14 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నాం. ఇప్పటికే మూడింట రెండు వంతుల స్కూళ్లలో పనులు పూర్తి చేశాం’’ సీఎం తెలిపారు. ‘‘జీఈఆర్ రేష్యోలో మేం చాలా దిగువన ఉండేవాళ్లం. దీన్ని మెరుగు పరచడానికి మంచి ఆలోచనలతో ముందుకు వెళ్లాం. స్కూళ్లను మెరుగ్గా తీర్చిదిద్దాం. మంచి మధ్యాహ్న భోజనాన్ని గోరుముద్ద కింద అందిస్తున్నాం. ప్రతిరోజూ ఒక మెనూ వారికి అమలు చేస్తున్నాం. పిల్లలను బడికి పంపే తల్లులకు అమ్మ ఒడి అందిస్తున్నాం. మేం చేపట్టిన కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయడానికి పగడ్బందీ వ్యవస్థలు ఉన్నాయి. మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో సమర్థవంతమైన యంత్రాంగాలు ఉన్నాయి. ముఖ్యమంత్రిగా నా దృష్టి ప్రత్యేకంగా ఉంటుంది. కేవలం మేం స్కూలు విద్యపైనే కాదు, ఉన్నత విద్యపైనా ప్రత్యేక దృష్టిపెట్టాం. ఉద్యోగాలు సాధించే కోర్సులను అందిస్తున్నాం. ఇంటర్నషిప్ అందిస్తున్నాం. ఆన్లైన్ వర్టికల్స్ అందిస్తున్నాం. పాఠ్యప్రణాళికలో వీటిని భాగస్వామ్యం చేశాం. పిల్లలు ఆన్లైన్లో మరిన్ని కోర్సులు నేర్చుకునేందుకు 1800 సబ్జెక్టుల్లో కోర్సులను అందించడానికి ఎడెక్స్‌తో ఒప్పందం చేసుకున్నాం. బీకాం నేర్చుకునేవారికి అసెట్ మేనేజ్ మెంట్ తదితర అంశాలను నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం. ఇవన్నీకూడా పాఠ్యప్రణాళికలో భాగం చేస్తున్నాం’’ అని సీఎం చెప్పారు. రాజకీయాలు వేరే: ‘‘పిల్లలు ఓటర్లు కాదు కాబట్టి.. వారిపైన పెద్దగా శ్రద్ధ పెట్టరు. అయితే విద్య అలాంటి అంశాలపై దృష్టిపెట్టకపోతే పేదరికాన్ని నిర్మూలించలేం. నేను ఏమీ హామీ ఇచ్చాను, నేనే ఏం చేశాను అన్నది చూడాలి. మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99.౫శాతం అమలు చేశాను. అమలు చేయడమే కాదు, వాటిని ప్రజల వద్దకు తీసుకెళ్లగలిగాను. ఇది మా ప్రభుత్వానికున్న విశ్వసనీయత. ప్రతి 2వేల జనాభాకు గ్రామ సచివాలయాన్ని, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చాం. వివక్ష లేకండా, అవినీతి లేకుండా అర్హత ఉన్నవారికి డీబీటీ ద్వారా పథకాలు అందించాం. డీబీటీ అన్నది ఒక విజయవంతమైన అంశం అయితే విద్య, వైద్యం, మహిళా సాధికారితల్లో గణనీయమైన మార్పులు తీసుకు వచ్చాం. అన్నిటికంటే మించి వివక్ష లేకుండా పారదర్శకతతో డీబీటీ అమలు చేశాం. కచ్చితం మేం తిరిగి అధికారంలోకి వస్తాం’’ అని సీఎం పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ఏవీ కూడా పథకాలు గురించి మాట్లాడవు, వాటి అమలు గురించీ మాట్లాడలేవు. ఇదే బడ్జెట్ గతంలోనూ ఉంది..ఇప్పుడూ ఉంది. కాని మార్పు ఏంటంటే.. కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారారు. కాని ఈప్రభుత్వం మాత్రమే చేయగలిగింది. చంద్రబాబు విషయంలో ప్రతీకారం అన్నది లేనే లేదు. చంద్రబాబుపై అవినీతి ఆరోపణల విషయం కోర్టుకు చేరింది. ఆ ఆరోపణలు, ఆధారాలను చూసి కోర్టు నిర్ణయం తీసుకుని రిమాండ్ విధించింది. అలాంటప్పుడు ప్రతీకారం ఎలా అవుతుంది. సీఐడీ కేసులు పెట్టినా, కోర్టులు ఆధారాలను చూస్తాయి కదా?. వాటిని చూసి కన్వెన్స్ అయితేనే కోర్టులు నిర్ణయాలు తీసుకుంటాయి. రాష్ట్రంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల ఉనికి పెద్దగా ఉండదు. పోటీ మా పార్టీకి, టీడీపీ- జనసేన మధ్యే ఉంటుంది’’ అని సీఎం చెప్పారు. ప్రతిపార్టీకూడా సర్వేలు చేస్తుంది. వాటి ఫలితాలు ఆధారంగా మార్పులు, చేర్పులు చేస్తుంది. ప్రభుత్వం పట్ల ప్రజలు చాలా సానుకూలంగా ఉన్నారు. కాని కొందరు స్థానిక నాయకులు విషయంలో కొంత అసంతృప్తితో ఉన్నారు. అంతేకాకుండా సామాజిక సమీకరణాల దృష్ట్యా కూడా కొన్ని మార్పులు చేశాం. చివరిదశలో మార్పులు చేసి అయోమయం సృష్టించే కన్నా, ముందుగానే నిర్ణయిస్తున్నాం. జాతీయ రాజకీయాలు విషయంలో మావిధానం స్పష్టం. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మేం రాజీపడం. ప్రజల ప్రయోజనాల విషయంలోనే కేంద్ర ప్రభుత్వంతో సహకారంతో ముందుకు వెళ్తున్నాం’’ అని సీఎం తెలిపారు. ఇదీ చదవండి: ఎవరికోసం ఈ ఆరాటం.. ఎవరితో పోరాటం ‘‘కాంగ్రెస్ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్ ఆడుతుంది. అది ఆపార్టీ సంప్రదాయంగా చూస్తున్నాం. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు. విభజించి రాష్ట్రాన్ని పాలించాలనుకున్నారు. అలాగే మా కుటుంబాన్ని కూడా విభజించారు. నేను కాంగ్రెస్‌నుంచి విడిపోయినప్పుడు గతంలో మా చిన్నాన్నకు మంత్రిపదవి ఇచ్చి మాపై పోటీకి పెట్టారు. వారు పాఠాలు నేర్వేలేదు. వారి పార్టీ సారథ్య బాధ్యతలు మా సోదరికి ఇచ్చారు. కాని అధికారం అనేది దేవుడు ఇచ్చేది. దేవుడ్ని నేను బలంగా నమ్మతాను. ఆయనే అన్నీ చూస్తాడు’’ అని సీఎం పేర్కొన్నారు. -
దళితులకిచ్చే గౌరవం ఇదేనా బాబూ?
తిరుపతి రూరల్: దళితులను అవమానించి ఆనందపడటం చంద్రబాబుకి అలవాటులా మారిపోయింది. ఎవరు మాత్రం ఎస్సీ కులంలో పుట్టాలని కోరుకుంటారంటూ గతంలో మీడియా ముందే అహంకారంతో మాట్లాడిన బాబు మరోసారి దళితుల పట్ల తనకున్న చిన్నచూపును ప్రదర్శించారు. సంక్రాంతి పండుగ రోజు తిరుపతి రూరల్ మండలం అవిలాలలోని టీడీపీ నేత వెంకటమణిప్రసాద్ ఇంట్లో నిర్వహించిన సమావేశంలో దళిత మాజీ మంత్రి పరసారత్నాన్ని అందరి ముందు నిల్చోబెట్టి ఘోరంగా అవమానించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి.. రెండు సార్లు ఎమ్మెల్యే, ఓసారి మంత్రిగా కూడా చేసిన ఆయనను కనీసం తమ పక్కన కూడా బాబు కూర్చోనివ్వలేదు. దాంతో ప్రెస్‌మీట్ జరిగినంతసేపు పరసారత్నం అవమానభారంతో చెమర్చిన కళ్లతో నిల్చోనే ఉండిపోయారు. దళితులను నిత్యం అవమానిస్తూ రాక్షసానందం పొందుతున్న తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని దళిత సంఘాలు పిలుపునిస్తున్నాయి. ఇదీ చదవండి: చంద్రబాబుపై ఆలపాటి తిరుగుబాటు -
వద్దు బాబూ..మీకో దండం!
సాక్షి, తిరుపతి: అపర చాణక్యుడిగా ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్న చంద్రబాబు 2024 సార్వత్రిక ఎన్నికల్లో బొక్కబోర్లాపడటం ఖాయంగా కనిపిస్తోంది. సొంత జిల్లాలో ఓటమి భయం ఆయన్ను వెంటాడుతోంది. చిత్తూరు జిల్లా మొత్తం వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని సర్వేలు తేటతెల్లం చేస్తుండటంతో టీడీపీ నుంచి అభ్యర్థులుగా బరిలో దిగేందుకూ నాయకులు వెనకాడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నా ఆ పార్టీ ఇంకా అభ్యర్థుల కోసం వెంపార్లుడుతోంది. తిరుపతి, చిత్తూరు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకలేదు. గత ఎన్నికల్లో తిరుపతి ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన పనబాక లక్ష్మి ప్రస్తుతం బరిలోకి దిగేందుకు ససేమిరా అంటున్నారు. చిత్తూరు పార్లమెంట్‌కు అంజనం వేసినా అభ్యర్థి కనిపించటం లేదు. ఇక అసెంబ్లీ స్థానాల విషయానికొస్తే అభ్యర్థులు పూర్తిగా ఆశలు వదులుకున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా కనీసం అభ్యర్థులు కూడా దొరక్కపోవటంతో ఇటు టీడీపీ, అటు జనసేన పార్టీలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. సర్వేలో బహిర్గతమైన ఓటమి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఒక సర్వే కూడా నిర్వహించుకున్నట్లు సమాచారం. ఆ సర్వేలో చంద్రబాబు ఓటమి అంచున ఉన్నారని స్పష్టమవడంతో మరో స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే చంద్రబాబు ఇటీవల మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించి మరోసారి అమలు చేయలేని హామీలు కురిపించారు. కుప్పంలో విమానాశ్రయం నిర్మించి అమెరికాకు కూరగాయలు అమ్మిస్తానని మోసపూరిత ప్రకటనలు చేశారు. చంద్రబాబు చేసిన ప్రకటనతో కుప్పం వాసులు ఇలాంటి వ్యక్తినా తాము ఇన్నేళ్ల నుంచి గెలిపిస్తూ వచ్చింది? అని నోరెళ్లబెట్టారు. ఇన్నేళ్లు చంద్రబాబుని గెలిపిస్తున్నా కనీసం స్థానికంగా సొంత ఇల్లు కూడా లేదనే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో శాంతిపురం మండలంలో హడావుడిగా ఇంటి నిర్మాణానికి పూనుకున్నారు. మాజీ మంత్రికి ఓటమి భయం పలమనేరు టీడీపీ నేత చంద్రబోస్ వైఎస్సార్సీపీలో చేరిపోవటంతో మాజీ మంత్రి అమర్నాథ్రెడ్డికి మరోసారి ఓటమి భయం పట్టుకుంది. గతంలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా గెలిచి, టీడీపీ అధికారంలోకి వచ్చిందని తిరిగి పచ్చకండువా కప్పుకున్నందుకు 2019తో అమర్‌కు స్థానికులు గుణపాఠం చెప్పారు. చంద్రబాబుతో పాటు అమర్నాథ్రెడ్డిని వెన్నుపోటు వెంటాడుతోంది. పూతలపట్టు అభ్యర్థి మురళీమోహన్‌పై స్థానిక నేతలు గుర్రుగా ఉన్నారు. మరో వ్యక్తికి టికెట్ ఇప్పించేందుకు స్థానిక టీడీపీ నేతలు అమరావతి చుట్టూ తిరుగుతున్నారు. పొత్తులో భాగంగా జిల్లా కేంద్రాలైన చిత్తూరు, తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్‌పై జనసేన ఆశలు పెట్టుకుంది. అయితే ఆ రెండు చోట్లా తన అభ్యర్థులనే బరిలోకి దింపాలని చంద్రబాబు ప్రణాళిక రచించారు. అందులో భాగంగా చంద్రబాబు తన పార్టీకి చెందిన టీటీడీ బోర్డు మాజీ చైర్మెన్ డీకే ఆదికేశవులు నాయుడు మనుమరాలు చైతన్యను రంగంలోకి తీసుకొచ్చారు. జనసేన తరుపున చిత్తూరు లేదా శ్రీకాళహస్తి టికెట్ ఇప్పించేందుకు బాబు స్కెచ్ వేశారని ప్రచారం జరుగుతోంది. అభ్యర్థుల కోసం అన్వేషణ గంగాధర నెల్లూరు స్థానానికి అసలు టీడీపీ నుంచి అభ్యర్థే లేరు. సరైన నాయకుడు దొరక్కపోవటంతో సీటు కోసం చాలా మంది పోటీపడుతున్నారంటూ ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయిస్తున్నారు. పుంగనూరులో మరొకసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయం ఖాయం అని తెలిసినా పరువు కాపాడుకునేందుకు చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారు. అక్కడ చల్లా రామచంద్రారెడ్డి సరైన అభ్యర్థి కాదనే నిర్ణయానికి వచ్చారు. సోషల్ మీడియా ప్రతినిధులకు ప్యాకేజీ ఇచ్చి ప్రచారం చేసుకుంటూ హడావుడి చేస్తున్న రామచంద్రయాదవ్ని జనసేన నుంచి అభ్యర్థిగా బరిలోకి దింపాలని చూస్తున్నారు. చంద్రగిరిలో ఈ సారి కూడా ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఢీకొట్టటం సాధ్యం కాదని, సొంత సర్వేల్లో కూడా టీడీపీకి ఓటమి ఖాయమని తేలిపోయింది. దీంతో ప్రస్తుతం అభ్యర్థిగా ప్రకటించుకుంటున్న పులివర్తి నానిని పక్కన పెట్టాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ పథకంలో భాగంగానే ఇద్దరు వ్యక్తుల పేర్లను చంద్రబాబు తెరపైకి తీసుకొచ్చారు. ఈ విషయంపైనా పులివర్తి నాని వర్గీయులు చంద్రబాబు తీరుపై భగ్గుమంటున్నారు. తిరుపతిలో పలాయనమే.. తిరుపతిలో జనసేన అభ్యర్థిని పోటీలోకి దించడం చంద్రబాబుకు ససేమిరా ఇష్టం లేదు. అందుకే మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు జనసేన కండువా కప్పించాలని నిర్ణయానికి వచ్చారు. జనసేన అభ్యర్థిగా తన పార్టీ నాయకురాలు సుగుణమ్మను బరిలోకి దించనున్నారు. ఈ పరిణామాలను గమనిస్తున్న జనసేన సైనికులు చంద్రబాబు కుట్రలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి జెండా మోస్తున్న తమకు కేటాయించకుండా పథకం ప్రకారం టీడీపీ వారినే జనసేన అభ్యర్థులుగా దింపటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు చెప్పిన దానికి పవన్ తలూపటంపైనా జనసైనికులు మండిపడుతున్నారు. పచ్చకండువా కప్పుకున్న నాయకులకు గింగిరాలే.. వెంకటగిరిలో వైఎస్సార్సీపీ గుర్తుతో గెలుపొంది ప్యాకేజీ కోసం పచ్చకండువా కప్పుకున్న ఆనం రాంనారాయణరెడ్డిపై స్థానికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆనంకి టికెట్ ఇస్తే ఓటమి తప్పదని చంద్రబాబు భయపడుతున్నారు. శ్రీకాళహస్తిలో బొజ్జల సు«దీర్‌రెడ్డిపై నమ్మకం లేకపోవటంతో ఎస్సీవీ నాయుడు లేదా మాజీ ట్రస్ట్‌బోర్డు చైర్మెన్ గురవయ్య నాయుడు కుమారుడు లేదా ఆయన కోడల్ని రంగంలోకి దింపాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సత్యవేడులో టీడీపీ ఓటమి ఖాయం కావటంతో డాక్టర్ హెలెన్, జేడీ రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే ఆదిత్య మధ్య పోటీ రాజేశారు. ఒకరికి తెలియకుండా ఒకరితో మాట్లాడుతూ వారి మధ్య విభేదాలు సృష్టించారు. సీటు కోసం పోటీపడుతున్నట్లు డిమాండ్ సృష్టించారు. సూళ్లూరుపేట నుంచి గతంలో పోటీ చేసిన అభ్యర్థులు ఈ సారి బరిలో దిగేందుకు సుముఖంగా లేరు. చెన్నైలో స్థిరపడిన ఓ వైద్యుడిని పోటీ చేయాలని అభ్యర్థించినట్లు తెలిసింది. ఆయన అంగీకరించడంతో ముందుగా రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఆయన ఆలోచనలో పడ్డారు. గూడూరులో మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ పేరు వినిపిస్తున్నా, ఆయన గతంలో వైఎస్సార్సీపీ గుర్తుతో గెలుపొంది ప్యాకేజీ కోసం పచ్చ కండువా కప్పుకున్నారు. సునీల్‌ని బరిలోకి దింపాలా? లేదా జనసేనలో చురుగ్గా ఉన్న తీగల చంద్రశేఖర్‌ని పోటీకి దింపాలా? అనే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. మొత్తంగా చూస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీకి ఓటమి ఛాయలు స్పష్టంగా కనిపిస్తుండటంతో చంద్రబాబు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
వెంకటగిరి.. జన కెరటం
సాక్షి, తిరుపతి: తిరుపతి జిల్లా వెంకటగిరిలో సామాజిక న్యాయం నినదించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు సీఎం జగన్ పాలనలో తాము సాధించిన అభివృద్ధిని ఎలుగెత్తి చాటారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాదిగా వ చ్చిన ప్రజలు శుక్రవారం వైఎస్సార్సీపీ నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్ర ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. వెంకటగిరిలో ప్రారంభమైన ర్యాలీ పోలేరమ్మ ఆశీర్వాదం అందుకుని డక్కిలి మీదుగా రాపూరుకు చేరుకుంది. యాత్ర వెళ్లిన ప్రతి వీధిలో స్థానిక ప్రజలు నీరాజనాలు పలికారు. దళితుల కోసం రూ. 86 వేల కోట్లు ఖర్చు : ఎంపీ గురుమూర్తి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఉన్నతికి సీఎం వైఎస్ జగన్ చేసినంత కృషి దేశంలో మరే ముఖ్యమంత్రీ ఇప్పటివరకు చేయలేదని ఎంపీ గురుమూర్తి చెప్పారు. ఒక్క దళితుల కోసమే సీఎం జగన్ రూ. 86 వేల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. దళితుల పిల్లల చదువుల కోసం ఈ నాలుగున్నరేళ్లలో రూ. 10 వేల కోట్లు, ఈ వర్గాల మహిళల కోసం మరో రూ. 10వేల కోట్లు ఇచ్చారన్నారు. మళ్లీ జగనన్న వస్తేనే సంక్షేమం కొనసాగి, మన జీవితాల్లో మరింతగా వెలుగులు నిండుతాయని చెప్పారు. సీఎం జగన్ అంటేనే ఓ విప్లవం: ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రంలో అన్ని వర్గాల పేదలను ఆదుకుంటున్న సీఎం వైఎస్ జగన్ అంటేనే ఓ విప్లవమని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ అన్నారు. చదువుతోనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని జగనన్న నమ్మి ప్రభుత్వ విద్యా రంగాన్ని అత్యున్నతంగా తీర్చి దిద్దుతున్నారని తెలిపారు. మన పిల్లలు ఈరోజు బెంచీల మీద కూర్చుని, దర్జాగా యూనిఫాం, షూస్ వేసుకుని, టైలు కట్టుకుని.. ఇంగ్లిష్ మీడియం చదువులు చదువుతున్నారన్నారు. ధనవంతుల పిల్లలకు, పేదల పిల్లలకు తేడా లేకుండా చేసిన జగనన్నకు మనం ఎంతగా రుణ పడిపోయామో అర్థం చేసుకోవాలని కోరారు. పేదలకు ఎలాంటి జబ్బులు చేసినా, ఎంత పెద్దవైనా రూ. 25 లక్షల మేర వైద్య సాయం అందిస్తున్నారని అన్నారు. సీఎం జగన్ కులం, మతం చూడరు.. కేవలం ప్రేమను చూపిస్తాడు: అలీ సీఎం జగన్ కులం, మతం చూడరని, కేవలం ప్రేమనే చూపిస్తారని ఎల్రక్టానిక్ మీడియా సలహాదారు అలీ అన్నారు. ఎప్పుడూ పేదలకు ఇంకా ఎంతో మంచి చేయాలని తపిస్తున్నారన్నారు. ఎన్నడూ చిరునవ్వు చెదరనివ్వని జగనన్న ప్రజల జీవితాల్లోనూ అదే సంతోషాన్ని చూడాలని సుపరిపాలన చేస్తున్నారని కొనియాడారు. మరోసారి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవడం మనకు చాలా అవసరమని చెప్పారు. జగన్ బటన్ నొక్కితే.. బాబు గొంతు నొక్కుతాడు: నాగార్జున యాదవ్ సీఎం జగన్.. బటన్ నొక్కి నేరుగా పేదలకు సంక్షేమ ఫలాలను అందిస్తున్నారని ఏపీఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ నాగార్జున యాదవ్ చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉన్నంత కాలం జనం గొంతు నొక్కే కార్యక్రమాలే చేశారని ధ్వజమెత్తారు. 14 ఏళ్లలో ఒక్కసారి కూడా బటన్ ఎందుకు నొక్కలేదని ప్రశి్నంచారు. ఎమ్మెల్సీలు పోతుల సునీత, మేరిగ మురళీధర్, సిపాయి సుబ్రమణ్యం తదితరులు మాట్లాడారు. -
కాళహస్తిలో సెల్ఫీ వీడియో.. టీడీపీ నేతపై ఆగ్రహం
తిరుపతి, సాక్షి: తెలుగుదేశం పార్టీ నేత బొజ్జల సుధీర్‌రెడ్డి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. శ్రీకాళహస్తి ఆలయంలో సెల్ఫీ వీడియో ద్వారా ఆలయ ట్రస్ట్ ఆగ్రహానికి గురయ్యారు. ఆలయ దర్శనానికి వెళ్ళే సమయంలో సెల్ ఫోన్ వాడకం నిషేధం అమలులో ఉన్నప్పటికీ.. ఆ నిబంధనల్ని బొజ్జల ఉల్లంఘించారు. ఆలయంలో సెల్ఫీ వీడియో చిత్రీకరించారు. ఆలయంలో పురాతమైన భాగం తొలగింపు.. ఆ తొలగింపుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బొజ్జల. పైగా గోడ కూలడాన్ని ప్రభుత్వానికి ముడిపెట్టి విమర్శలు గుప్పించారు. దీంతో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ఆంజురు తారక శ్రీనివాసులు తీవ్రంగా పరిగణించారు. ఈ క్రమంలో బొజ్జలపై చట్టపరమైన చర్యలు కు సిద్దం అవుతున్నారు. ఆలయ చైర్మన్ వివరణ ఇది.. ఆలయంలో కూల్చివేత అంటూ టీడీపీ నేత సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడంపై శ్రీకాళహస్తి ఆలయం పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు స్పందించారు. ఆలయంలో మృత్యుంజయ లింగం ఆనుకుని ఉన్న గదిని గతంలో ప్రసాదాలు తయారీ సరుకుల గోడౌన్ గా వినియోగించేవారు. 1956 లో దేవస్థానం ట్రస్టీ సహకారం తో దీన్ని నిర్మాణం చేశారు. శిథిలావస్థలో ఉన్న దీన్ని కూల్చి వేయాలని ప్రస్తుత పాలక మండలి 2022 ఆగస్టులో జరిగిన పాలకమండలి సమావేశం లో 7వ అంశంగా చేర్చారు. దానిలో భాగంగా పాడుబడిన ఈ గదిని తొలగింపు చర్యలు చేపట్టారు -
సీఎం జగన్ కోసం ఏం చేయడానికైనా సిద్ధం
తిరుపతి మంగళం (తిరుపతి జిల్లా): నిత్యం ప్రజాసంక్షేమమే పరమావధిగా, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోసం ఏం చేయడానికైనా సిద్ధమని రాష్ట్ర అటవీ, విద్యుత్, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. సీఎం జగన్‌తో తనకు విభేదాలున్నా యంటూ ఎల్లో మీడియా అభూతకల్పనలు సృష్టించడం దుర్మార్గమని మండిపడ్డారు. ఆయన ఆదివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డితో తనకు విభేదాలుంటే తాను ఇంకా పార్టీలోఉంటానా? అని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లాతో పాటు కుప్పంలో చంద్రబాబు ఉనికి కోల్పోయేలా చేస్తున్నానని తనకు, సీఎం జగన్‌కు మధ్య విభేదాలు సృష్టించాలన్న కుట్రలతో ఎల్లో మీడియా కట్టుకథలు రాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంతో తాను ఎప్పుడూ సన్నిహితంగానే ఉంటానని, సీఎం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటానని చెప్పారు. అంతేతప్ప సీఎంతో విభేదాలు పెట్టుకునే అవసరం, తత్వం తనది కాదని స్పష్టం చేశారు. కేవలం చంద్రబాబును ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలన్న దురాలోచనతో ఎల్లో మీడియా తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. సీఎం జగన్‌కు పెద్దిరెడ్డిని దూరం చేస్తే చిత్తూరు జిల్లాతో పాటు కుప్పంలో ఉనికి కోల్పోకుండా ఉండవచ్చన్న ఆలోచనతో ఎల్లో మీడియా కట్టుకథలు అల్లుతూ విషపురాతలు రాస్తోందన్నారు. టీడీపీ ఇప్పటికే పాడెపైకి చేరిందని, చివరిదశలో చంద్రబాబు దింపుడు కళ్లం ఆశతో పోరాడుతున్నాడని చెప్పారు. జగన్‌పై, తనపై, వైఎస్సార్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులపై ఎలాంటి కట్టుకథలు రాసినా ప్రజలు నమ్మేస్థితిలో లేరన్నారు. రాజకీయ భవిష్యత్తు ప్రసాదించి 14 ఏళ్లపాటు అధికారంలో ఉండేలా చేసిన కుప్పం ప్రజలకు ఏం చేశావు చంద్రబాబూ.. అని ప్రశి్నంచారు. నోటికి వచ్చిన అబద్ధాలు చెబుతున్న చంద్రబాబును ఈసారి కుప్పం ప్రజలు నమ్మి మోసపోయే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. దేశ రాజకీయ చరిత్రలోనే ఎవరికీ సాధ్యంకానన్ని సంక్షేమ పథకాలు అందించిన సీఎం జగన్మోహన్రెడ్డినే తిరిగి గెలిపించేందుకు రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు.