దళితులకిచ్చే గౌరవం ఇదేనా బాబూ? | Chandrababu Insulted Former Tdp Minister In Tirupati Rural | Sakshi
Sakshi News home page

దళితులకిచ్చే గౌరవం ఇదేనా బాబూ?

Published Wed, Jan 17 2024 8:00 AM | Last Updated on Fri, Feb 2 2024 7:36 PM

Chandrababu Insulted Former Tdp Minister In Tirupati Rural - Sakshi

విలేకరుల సమావేశంలో చంద్రబాబు తన పక్కన కూర్చొనే అవకాశం ఇవ్వక పోవడంతో వెనుక నిల్చొని ఉన్న మాజీ మంత్రి, దళిత నేత పరసా రత్నం 

తిరుపతి రూరల్‌: దళితులను అవమానించి ఆనందపడటం చంద్రబాబుకి  అలవాటులా మారిపోయింది. ఎవరు మాత్రం ఎస్సీ కులంలో పుట్టాలని కోరుకుంటారంటూ గతంలో మీడియా ముందే అహంకారంతో మాట్లాడిన బాబు మరోసారి దళితుల పట్ల తనకున్న చిన్నచూపును ప్రదర్శించారు.

సంక్రాంతి పండుగ రోజు  తిరుపతి రూరల్‌ మండలం అవిలాలలోని టీడీపీ నేత వెంకటమణిప్రసాద్‌ ఇంట్లో నిర్వహించిన సమావేశంలో దళిత మాజీ మంత్రి పరసారత్నాన్ని అందరి ముందు నిల్చోబెట్టి ఘోరంగా అవమానించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి.. రెండు సార్లు ఎమ్మెల్యే, ఓసారి మంత్రిగా కూడా చేసిన ఆయనను కనీసం తమ పక్కన కూడా బాబు కూర్చోనివ్వలేదు.

దాంతో ప్రెస్‌మీట్‌ జరిగినంతసేపు పరసారత్నం అవమానభారంతో చెమర్చిన కళ్లతో నిల్చోనే ఉండిపోయారు. దళితులను నిత్యం అవమానిస్తూ రాక్షసానందం పొందుతున్న తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని దళిత సంఘాలు పిలుపునిస్తున్నాయి.

ఇదీ చదవండి: చంద్రబాబుపై ఆలపాటి తిరుగుబాటు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement