
తిరుపతి, సాక్షి: సాధారణంగా.. చంద్రబాబు ఎన్నికలొస్తున్నాయంటే అడ్డగోలు హామీలు ప్రకటిస్తారు. వాటిని అమలు చేయడం అనేది ఆయన రాజకీయంలోనే లేదు. ఈ మాట మేం అంటోంది కాదు.. యావత్ ఏపీ కోడై కూస్తోంది ఇప్పుడు. ఈ క్రమంలో నిరసనలూ వ్యక్తం అవుతున్నాయి. తాజాగా.. మహిళలకు ఉచిత బస్సు విషయంలో కూటమి ప్రభుత్వం(Kutami Prabhutavam) చేస్తున్న మోసాన్ని ఎండగట్టేందుకు వినూత్న ప్రయత్నం జరిగింది.
బుధవారం ఉదయం కొందరు ప్రయాణికులు.. తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి పీలేరు పల్లె వెలుగు బస్సు ఎక్కారు. కండక్టర్ వచ్చి టికెట్ అడగ్గానే.. వాళ్లంతా తమ చేతుల్లోని ఫోన్లను చూపించారు. ‘‘అధికారంలోకి రాగానే మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం.. నాదీ హామీ’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) మాట్లాడిన మాటలు అందులో ఉన్నాయి. ఆ వీడియోను ప్రదర్శించిన మహిళలు.. తాను అందుకే ఎక్కామని చెప్పారు. దీంతో ఆ కండక్టర్ నిర్ఘాంతపోయారు.

అయితే.. ఏపీలో ఎక్కడా ఉచిత ప్రయాణం లేదని చెబుతూ ఆ మహిళల గుంపును దిగిపోవాలని సూచించాడు. అయితే.. ‘‘టికెట్ అడిగితే నా పేరు చెప్పండి’’ స్వయంగా చంద్రబాబు ఆ వీడియోలో చెప్పిన మాటలు మరోసారి వినిపించారు. ఈ క్రమంలో కండక్టర్ వాళ్లతో వాగ్వాదానికి దిగారు. తాము సీఎం చంద్రబాబు చెబితేనే ఫ్రీ ప్రయాణానికి వచ్చామని పదే పదే చెప్పడంతో ఆ కండక్టర్ చివరకు పోలీసులను ఆశ్రయించారు.
దీంతో.. బస్సును నేరుగా తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ పీఎస్‌కు తరలించగా.. అదుపులోకి తీసుకున్న ఆ ప్రయాణికుల్లో మేయర్ డాక్టర్ శిరీష(Mayor Sirisha) కూడా ఉండడం చూసి పోలీసులు కంగుతిన్నారు. తిరుపతిలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇంఛార్జి అభినయ్ రెడ్డి నేతృత్వంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వ మోసంపై బుధవారం ఇలా నిరసన కార్యక్రమం జరగడం మరో విశేషం.
Comments
Please login to add a commentAdd a comment