
సాక్షి, తిరుపతి: సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేని వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు వైఎస్సార్‌సీపీ నాయకులు భూమక కరుణాకర్ రెడ్డి. అలాగే, సంపద సృష్టించలేకపోతున్నా అంటూ చంద్రబాబు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక, పోసాని ఆరోగ్యంపై విషపు రాతలు రాస్తున్న ఎల్లో మీడియా సిగ్గు పడాలని చురకలు అంటించారు.
చిత్తూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో అబద్దపు హామీలు ఇచ్చి కూటమి నేతలు ప్రజలను మోసం చేశారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవలో కోతలు పెట్టారు. బడ్జెట్‌లో నిరుద్యోగ భృతి ఊసే లేదు. హామీలను గాలికి వదిలేశారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అయినప్పటికీ ప్రజలకు చేసిందేమీ లేదు. సంక్షేమం పట్టించుకోవడం లేదు.. అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు. మీరు ప్రజల్లోకి వెళ్తే పేదలు కష్టాలు తెలుస్తాయి.
ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయని వ్యక్తి చంద్రబాబు. 2లక్షల కోట్లు పేదలకు పంచిన వ్యక్తి వైఎస్ జగన్. పేదలకు మంచి చేశారు కాబట్టే వైఎస్ జగన్‌కు 40 శాతం ఓట్లు వచ్చాయి. మంచి చేశాం కాబట్టే వైఎస్సార్‌సీపీ పట్ల ప్రజల్లో సానుభూతి వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో వైఎస్సార్‌సీపీ బలంగా ఉంది అంటూ పచ్చమీడియాలో వార్తలు రాస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వం పట్ల టీడీపీ సానుభూతిపరుల్లోనే వ్యతిరేకత ఉంది. కూటమికి ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. వైఎస్సార్‌సీపీ పాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.

కుట్రలతో పోసాని కృష్ణమురళిపై అక్రమ కేసులు పెట్టారు. ప్రతీకార కక్షతో చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. పోసాని ఆరోగ్య పరిస్థితిపై నాటకాలు అంటూ విష ప్రచారం చేస్తున్న పచ్చ పత్రికలు సిగ్గుపడాలి. ఆయన ఆసుపత్రిలో ఉన్నా బెయిల్ వచ్చే పరిస్థితి లేదు. ఆయనపై ఎల్లో మీడియా ఎందుకు విషపు రాతలు రాస్తోంది. పోసానికి వచ్చిన పరిస్థితి మీకు ఎదురైతే ఇలానే ఆలోచిస్తారా? అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment