Super Six
-
బాబు అబద్ధాలతో రాజకీయ దుమారం
-
సందడి లేని సంక్రాంతి
చేతిలో డబ్బుల్లేక పేద, మధ్యతరగతి ప్రజల దిగాలుపండగంటే కొత్త దుస్తులు, పిండి వంటలు, కొత్త వస్తువుల కొనుగోళ్లు, ఇంటికొచ్చిన బంధువులకు కానుకలు, చుట్టుపక్కలోళ్లకు పెట్టుబతలు.. గ్రామస్తులంతా తలో చేయి వేసి నిర్వహించే సామూహిక సంబరాలు.. ఇలా కోలాహలం కళ్లకు కట్టేది. ఈ ఏడాది ఏ ఊళ్లో అయినా ఇలాంటి సందడి కనిపిస్తుందేమోనని దివిటీ పట్టుకుని వెతికినా కనిపించని దుస్థితి. అన్ని వర్గాల ప్రజల్లో అదో నిర్లిప్తత, నైరాశ్యం. ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు ఎలా జరుగుతున్నాయనే దానిపై ‘సాక్షి’ బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం క్షేత్ర స్థాయిలో పర్యటించాయి. ‘ఆనందంగా పండుగ చేసుకోవాలని ఉంది. అయితే అందుకు చేతిలో నాలుగు డబ్బులుంటేనే కదయ్యా..’ అని అంటున్నారు ఊరూరా జనం. పండగ అంటే గత ఐదేళ్లలోనే అని గుర్తు చేసుకున్నారు. ‘ఊళ్లో పరిస్థితి బాగోలేదు.. ఇంట్లోనూ అందుకు భిన్నంగా లేదు’ అని పెద్దలు వాపోయారు. ‘స్కూళ్లలో నాడు–నేడు పనులన్నీ ఆగిపోయాయి.. సచివాలయాల్లో పనులు కావడం లేదు.. ఆర్బీకేలు నిర్వీర్యమయ్యాయి.. ఇంటికొచ్చి పని చేసి పెట్టే వలంటీర్లు కనిపించడం లేదు.. నెలకు రెండుసార్లొచ్చే ఫ్యామిలీ డాక్టర్ ఏమయ్యారో తెలీదు.. అమ్మ ఒడి లేదు.. రైతు భరోసా లేదు.. మత్స్యకార భరోసా లేదు.. పిల్లలకు ఫీజులు కట్టలేకపోతున్నాం.. ఇళ్లకు పంపించేస్తున్నారు.. పరిస్థితి ఇట్లా ఉంటే ఏంది పండుగ చేసుకునేది?’ అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ‘సాక్షి’ పరిశీలనలో ఊరారా ఇదే దుస్థితి కనిపించింది. అందరి నోటా ఇదే మాట వినిపించింది. మొత్తానికి రాష్ట్రంలో ఈ ఏడాది సంక్రాంతి పండుగ కళ తప్పింది.సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: ‘అవసరానికి అందివచ్చే డబ్బులు.. కష్టకాలంలో ఆదుకునే పథకాలు.. వెరసి ప్రతి రోజూ పండుగ రోజే’ అన్నట్లుగా గత ప్రభుత్వ పాలనలో ప్రతి పేద ఇంటిలో సంతోషం కనిపించింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వ తీరుతో ‘అవసరానికి చేతిలో చిల్లిగవ్వలేదు.. కష్టకాలంలో పట్టించుకునే నాథుడే కరువు.. పెద్ద పండుగ వస్తున్నా కన్పించని సందడి’ అన్నట్లు ప్రతి ఇల్లూ మారిపోయింది. రాష్ట్ర ప్రజలు పెద్ద పండుగగా భావించే సంక్రాంతి సందడి ఈ ఏడాది ఊళ్లల్లో కనిపించడం లేదు. గడిచిన ఏడు నెలల్లో సంక్షేమాభివృద్ధి ఆగిపోవడమే ఇందుకు కారణం. దేశంలోనే సంక్షేమానికి కొత్త నిర్వచనం చెప్పిన ‘నవరత్నాలు’ ఇప్పుడు పేద, మధ్య తరగతి ప్రజల గడపకు చేరడం లేదు. దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రతి లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాకే నేరుగా నగదు జమ (డీబీటీ పద్దతి) చేస్తూ గత సర్కారు అమలు చేసిన పథకాలను కూటమి ప్రభుత్వం ఆపేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కనీసం కూటమి పార్టీల ఎన్నికల హామీలైన సూపర్ సిక్స్ సైతం అమలు చేయక పోవడంతో ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఆ ఐదేళ్లు మహోజ్వల వైభవంగత ప్రభుత్వంలో ప్రతి ఏడాది సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి, చెప్పిన నెలలో చెప్పిన సమయానికి ఆయా వర్గాలకు ఆర్థిక లబ్ధిని వారి ఖాతాలకు (డీబీటీ పద్దతి) నేరుగా జమ చేసేవారు. రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజలకు విద్య, వైద్యం అందించడంతోపాటు వారి రోజువారీ అవసరాలకు చేతిలో డబ్బులు ఉండేలా చేశారు. తద్వారా జీవన ప్రమాణాలు పెరిగేలా చేశారు. విద్యార్థులు, లాయర్లు, ఆటో డ్రైవర్లు, రజకులు, నాయీ బ్రహ్మణులు, టైలర్లతోపాటు పొదుపు మహిళలు, రైతులకు అనేక పథకాల ద్వారా లబ్ధి చేకూర్చారు. కోవిడ్ వంటి సంక్షోభంలోనూ ఆర్థిక లబ్ధిని కలిగించే సంక్షేమ పథకాలను ఆపకుండా కొనసాగించడంతో దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీలో ప్రజలు ఆర్థిక ఇక్కట్లను అధిగమించి కొనుగోలు శక్తి కొనసాగేలా చేశారు. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి వంటి పర్వదినాల్లో కొత్త దుస్తులు, ఇంట్లోకి కావాల్సిన సామగ్రి, పిండి వంటలకు అవసరమైన సరుకులు కొనుగోలు చేసుకునేలా చేశారు. ప్రధానంగా విద్య, వైద్యం పరంగా దిగుల్లేకుండా చేశారు. సచివాలయ–వలంటీర్ వ్యవస్థతో ఉన్న ఊళ్లోనే పనులన్నీ జరిగేలా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఇలాంటి మార్పుల దిశగా గత 70 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో ఎన్నడూ అడుగులు పడలేదు. అలాంటి మార్పులను.. తద్వారా గ్రామ స్వరాజ్యాన్ని గత ప్రభుత్వం రాష్ట్రంలో సాకారం చేసింది. తద్వారా ఉన్నత వర్గాలతోపాటు పేద, మధ్యతరగతి ప్రజలు కూడా పండుగలను ఆనందంగా జరుపుకొనేలా ఆర్థిక ఊతం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పింఛన్లలో కోత పెట్టేందుకు కుయుక్తులు పన్నుతుండటంతో పాటు మరో పథకాన్ని ప్రజలకు అందివ్వలేదు. ఏడు నెలలైనా ఒక్క పథకాన్ని కూడా అందించకపోవడంతో ప్రజలు మండిపడుతున్నారు. గతంలో తమకు ఏదో ఒక పథకం ద్వారా డబ్బులు చేతికి వచ్చేవని, ఆ డబ్బులతో కావాల్సినవి కొనుక్కుని ఇంటిల్లిపాది పెద్ద పండుగను గొప్పగా జరుపుకొనేవాళ్లమని గతం గుర్తు చేసుకుంటూ చెబుతున్నారు. కూటమి సర్కారు రాకతో తమ పరిస్థితి తారుమారైందని వాపోతున్నారు. గత సర్కారే కొనసాగి ఉంటే గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు పలు పథకాల ద్వారా దాదాపు 2.63 కోట్ల మందికి రూ.20,102 కోట్లçకుపైగా లబ్ధి చేకూరేదని చెబుతున్నారు. ఇప్పుడు ఆ పథకాలు అందక పోవడంతో పండుగ పూట పస్తులు తప్పడం లేదని పేదలు ఆవేదన చెందుతున్నారు.అసంపూర్తి గదిలో పాఠాలుఇది అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం ఉంతకల్లులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ఇందులో దాదాపు 220 మంది చదువుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో రెండో విడత నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా తొమ్మిది తరగతి గదుల నిర్మాణానికి రూ.1,93,88,511 మంజూరయ్యాయి. భవన నిర్మాణాలు కూడా ప్రారంభించారు. గత ప్రభుత్వంలోనే రూ.75,42,872 ఖర్చు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మిగిలిన పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గదులకు కిటికీలు, డోర్లు, టైల్స్ అమర్చాల్సి ఉంది. బయటి వైపు ప్లాస్టింగ్ చేయాలి. గదుల కొరత కారణంగా అసంపూర్తిగా ఉన్న నూతన భవనాల్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కిటికీలు ఏర్పాటు చేయకపోవడంతో విద్యార్ధులకు ఎండ తగలకుండా ఉండేందుకు యూరియా సంచులు అడ్డు పెట్టారు. బంధువులను పిలవలేకపోతున్నాంగత ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి ద్వారా వచ్చే డబ్బులతో పిల్లల ఫీజు కట్టే వాళ్లం. ఈసారి ‘తల్లికి వందనం’ సాయం అందలేదు. పంటలో వచ్చిన డబ్బులన్నీ స్కూల్ ఫీజులకే చాలడం లేదు. పండుగ వచ్చినా మా ఇంట్లో ఎలాంటి సంబరాలూ చేసుకోలేని స్థితి. మా చుట్టుపక్కల ఏ గ్రామంలో చూసినా సంక్రాంతి సందడి కనిపించడం లేదు. చాలా మందితో ఫోన్లో మాట్లాడితే ఇదే సమాధానం చెబుతున్నారు. బంధువులను కూడా ఇళ్లకు పిలవలేని పరిస్థితి నెలకొంది.– రైతు గోవిందప్ప, సంతేబిదనూరు, హిందూపురంఇప్పుడు ఆ సందడి లేదువిజయనగరం పట్టణం మూడు రాష్ట్రాలకు వాణిజ్య కేంద్రం. గత ఐదు సంవత్సరాల పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి కంటే ఉమ్మడి విజయనగరం ప్రజల నుంచి మార్కెట్లో కొనుగోలుదారులు పెరిగారు. ఈ ఏడాది సంక్రాంతి పండగ వ్యాపారం తగ్గింది. ముఖ్యంగా బడుగు మధ్యతరగతి ప్రజల నుంచి కొనుగోళ్లు తగ్గాయి. గతంలో సంక్రాంతి వచ్చిందంటే నెల రోజుల ముందు నుంచి వ్యాపారాలు ఉండేవి. అటు హోల్‌సేల్ ఇటు రిటైల్ వ్యాపారాలతో పట్టణం కళకళలాడేది. ఇప్పుడా సందడి కనిపించడం లేదు.– కాపుగంటి ప్రకాష్, అధ్యక్షుడు, విజయనగరం చాంబర్ ఆఫ్ కామర్స్కొనుగోలు శక్తి తగ్గిందిగత ఐదేళ్ల కాలంతో పోలిస్తే ఇప్పుడు ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిందనే చెప్పవచ్చు. గతంలో కరోనా వచ్చినప్పటికీ సంక్రాంతంటే మార్కెట్ కళకళలాడేది. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. నిరుపేదలకు సంక్షేమ పథకాలు ఆర్థికంగా కాస్త నిలదొక్కుకోవడానికి అండగా నిలుస్తాయి. ఇప్పుడు ఏ పథకాలు లేకపోవడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కొనుగోళ్లు లేక ఈ సంక్రాంతి కళ తప్పింది. – షేక్ చాంద్‌బాషా, మండీ మర్చంట్, పాత మార్కెట్, కడప సంక్రాంతి పండగలానే లేదుఈ ఏడాది సంక్రాంతి కళ మా గ్రామంలో కనిపించడం లేదు. వ్యాపారాలు పడిపోయాయి. గ్రామస్తుల దగ్గర డబ్బులు లేవు. రొటేషన్ లేక కొనుగోలు శక్తి తగ్గిపోయింది. గ్రామంలో మా కిరాణా షాపు గత ఏడాది వరకు రోజుకు రూ.15 వేలు అమ్మకం జరిగేది. ప్రస్తుతం రూ.5 వేలు కూడా అమ్మకం జరగడం లేదు.– లావుడియా శ్రీనివాసరావు, సర్పంచ్, కనిమెర్ల, ఎన్టీఆర్ జిల్లాసంక్రాంతి కానుకైనా ఇస్తారని ఆశపడ్డాంపశువులు, వ్యవసాయ పనులకు సంబంధించిన తాళ్లు నేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. గత ఆర్నెల్లుగా ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం కనీసం సంక్రాంతి కానుకైనా ఇస్తుందని ఆశగా ఎదురు చూశాం. అది కూడా లేకుండా చేశారు. పెరిగిన పప్పులు, నూనెల ధరలు చూస్తుంటే పండుగకు పిండి వంటలు మానుకోవడమే ఉత్తమంగా కన్పిస్తోంది. ఈ ఏడాది మాలాంటోళ్లందరూ ఇలానే అంటున్నారు. – ఎస్.భవాని, కొత్తవలస, విజయనగరం జిల్లాపంట మునిగినా పైసా ఇవ్వలేదు.. ఇంక పండగెక్కడ?వైఎస్సార్ హయాంలో కాలనీ ఇల్లు వచ్చింది. అందులోనే ఉంటున్నాం. జగన్ వచ్చిన తర్వాత మా అబ్బాయికి అమ్మ ఒడి పడేది. పదో తరగతి పూర్తయింది. మాకు 30 సెంట్లు భూమి ఉంది. గత ఏడాది వరకు జగన్ ప్రభుత్వం రైతు భరోసా కింద పెట్టుబడిసాయం ఇచ్చేది. రైతులం పంటలు పండించుకునేవాళ్లం. ఈసారి ఒక్క రూపాయి కూడా రాలేదు. అప్పోసప్పో చేసి పంట వేశాం. మొన్న అక్టోబర్‌లో వర్షాలకు పొలం మునిగిపోయింది. పంట నష్టం ఇస్తామని చెప్పారు. అధికారుల చుట్టూ ఇప్పటికీ తిరుగుతున్నాను. ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఇంక మా బతుకులకు పండగొకటి. అన్నిటికీ ఈ ప్రభుత్వం చేతులెత్తేస్తోంది. – పల్లా రాము, రైతు, టి.నగరపాలెం, భీమిలి నియోజకవర్గంగత ప్రభుత్వంలోనే ఎంతో మేలుప్రస్తుతం ఏ కుటుంబమూ సంతోషంగా పండగ చేసుకునే పరిస్థితి కన్పించడం లేదు. ఓ వైపు ఆర్థిక సమస్య, మరోవైపు ధరలు చూస్తే ఆకాశాన్నంటుతున్నాయి. ఇలా ఉంటే పిండి వంటలు ఎలా వండుకుంటాం? సంతోషంగా పండగ ఎలా జరుపుకుంటాం? గత ప్రభుత్వ హయాంలోనే ఎంతో మేలు. ప్రతి ఏటా ఏదో ఒక పథకం కింద మా బ్యాంకు ఖాతాకు నగదు జమ అయ్యేది. ఖర్చులకు, అవసరాలకు ఎంతో ఉపయోగంగా ఉండేది. ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేక పేద, మధ్య తరగతి ప్రజలం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. – సీహెచ్ భారతి, గృహిణి, నెల్లూరుచేతిలో లెక్కేదీ?వైఎస్సార్ జిల్లా అనిమెల గ్రామంలో సుమారు 2,500 జనాభా ఉంది. ఈ గ్రామంలో గత ఐదేళ్లు సంక్రాంతి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ ఏడాది కళ తప్పింది. పండుగ ఆనందం ఏ ఒక్క ఇంట్లోనూ కనిపించలేదు. ఈ ఏడాది పెట్టిన పెట్టుబడులకు తగ్గట్లు దిగుబడులు లేకపోగా, వచ్చిన అరకొర దిగుబడికి ఆశించిన ధరలు లేక రైతులు ఆవేదనతో ఉన్నారు. మరో వైపు ప్రభుత్వం నుంచి ఏ సహాయం లేదు. గత ప్రభుత్వంలో ఈ ఒక్క గ్రామానికే వివిధ సంక్షేమ పథకాల ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు రూ.1.8 కోట్లు లభించింది. ఈ లెక్కన ప్రజల చేతుల్లో డబ్బు ఏ రీతిన రొటేషన్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదని గ్రామస్తులు అన్నారు. ఏం ఉందని జరుపుకోవాలి?బాపట్ల జిల్లా రాజుబంగారుపాలెంలో 3,200 కుటుంబాలుంటున్నాయి. ఈ ఊళ్లో దాదాపు అందరూ సామాన్యులే. ‘ఏమ్మా.. పండుగ ఎలా చేసుకుంటున్నారు..’అన్న ప్రశ్నకు రైతులు, కూలీలు, చిరువ్యాపారులు, ఆటోవాలాలు, కూరగాయలమ్ముకునే మహిళలు.. ఇలా అందరూ కూడబలుక్కున్నట్లు ఒకే సమాధానం చెప్పారు. అమ్మ ఒడి రాలేదు, రైతు భరోసా ఇవ్వలేదు. విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు. చేయూత రాలేదు. ధాన్యం పండిస్తే మద్దతు ధర ఇవ్వలేదు.. అంటూ సమస్యలు ఏకరువు పెట్టారు. ఊరిని నమ్ముకొని చికెన్ కొట్టు పెట్టుకుంటే జనం దగ్గర డబ్బులు లేక కొట్టు మూయాల్సి వచ్చిందని వెంకటేశ్వరమ్మ అనే మహిళ వాపోయింది. పిల్లోళ్లకు బట్టలు కొందామంటే డబ్బులు లేక ఉప్పుకయ్యల్లో పనికెళుతున్నానని జొన్నలపావని కన్నీటి పర్యంతమైంది. జగనన్న లాగా నెలనెలా డబ్బులు ఇచ్చివుంటే అందరం సంతోషంగా పండుగ చేసుకునేవారమని సరస్వతి పేర్కొంది. పింఛన్లు తీసేశారని కొందరు, రైతు భరోసా ఇవ్వలేదని ఇంకొందరు వాపోయారు. ఇలాంటి కష్టాల్లో పండుగ ఎలా జరుపుకోగలమని ఊరు ఊరంతా ఎదురు ప్రశ్నిస్తోంది. సాయం అందితే కదా..కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వెంకట కృష్ణరాయపురం (వీకే రాయపురం) గ్రామంలో ఎవరిని కదిపినా చేతిలో డబ్బులు లేకుండా పండుగ ఏం చేసుకుంటామని ప్రశ్నించారు. సుమారు 2,600 కుటుంబాలున్న ఈ గ్రామంలో ఏ వీధిలో ఎవరిని పలకరించినా జగన్ ప్రభుత్వంలో అమ్మ ఒడి, రైతులకు పెట్టుబడి సాయం, అర్హులందరికీ పథకాలు రావడంతో గత ఏడాది సంక్రాంతిని ఊరు ఊరంతా హుషారుగా పండగ చేసుకున్నామని చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చాక వరుస తుపానులతో పంటలు నష్టపోయినా సాయం అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఉన్న ఏకైక మినీ రైస్‌మిల్లు గత సంక్రాంతికి ముందు కస్టమర్లతో కిక్కిరిసిపోయేదని, ఈ సంక్రాంతికి రోజుకు ఐదుగురు రావడమే గగనమైపోయిందని యజమాని రేలంగి వెంకటలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మద్యం, బెల్ట్ షాపులు విచ్చలవిడిగా గ్రామంలోకి వచ్చేయడంతో రోజంతా కష్టపడ్డ రెక్కల కష్టంలో సగం సొమ్ము మద్యానికే వెచ్చించడం కుటుంబాల్లో చిచ్చు రేపుతోందని మహిళలు అంటున్నారు. నాడు వలంటీరు వ్యవస్థతో ఎంతో మేలు జరిగిందని, ఇప్పుడు ఏ పని కావాలన్నా ఇబ్బంది పడాల్సి వస్తోందని ఇంటి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. -
‘బీమా’కు నైవేద్యం.. ఆరోగ్యం హరీ!
సాక్షి, అమరావతి: కొత్త సంవత్సరంలో సీఎం చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. సూపర్–6, సూపర్ సెవన్ హామీల ఎగవేతల పరంపరలో భాగంగా ఈసారి ప్రజారోగ్యానికి ఎసరు పెట్టింది. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షలు ఆరోగ్య బీమా కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు తుంగలో తొక్కారు. కేవలం రూ.2.5 లక్షలతో బీమా పథకాన్ని అది కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోని కుటుంబాలకే వర్తింపజేస్తామని చావు కబురు చల్లగా చెప్పారు! ఆరోగ్యశ్రీ చికిత్స పరిమితిని రూ.ఐదు లక్షల నుంచి ఇప్పటికే ఏకంగా రూ.25 లక్షలకు పెంచి ట్రస్టు పరిధిలో అమలు చేసి 95 శాతం కుటుంబాలకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా కల్పించిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని కాపీ కొట్టి ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన చంద్రబాబు ఆరోగ్యశ్రీ ట్రస్టు స్థానంలో ప్రైవేట్ బీమా కంపెనీని తెరపైకి తెచ్చి ప్రజారోగ్యాన్ని దళారీల చేతికి అప్పగించారు. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు ఆరోగ్య బీమాను వర్తింపజేస్తే ఆస్పత్రుల మనుగడ కష్టతరం అవుతుందని వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెబుతుండటం గమనార్హం. పదో వంతుతో సరి.. రూ.25 లక్షల వరకూ ఆరోగ్య బీమా కల్పిస్తామని ప్రజలను నమ్మించి గద్దెకెక్కిన చంద్రబాబు ప్రభుత్వం అందులో పది శాతానికి తగ్గించి రూ.2.5 లక్షలకు బీమాను పరిమితం చేసింది. అది కూడా రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ పథకం లబ్ధిదారులకే వర్తించేలా మెలిక పెడుతోంది. దీన్ని ‘యూనివర్సల్ ఇన్సూరెన్స్’ అంటూ గొప్పలు చెబుతోంది. వాస్తవానికి రూ.25 లక్షల వరకూ పరిమితితో ఆరోగ్యశ్రీ పథకాన్ని దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసింది. ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల ప్రమేయం లేకుండా ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా 95 శాతం కుటుంబాలకు నగదు రహిత వైద్య సేవలు కల్పిస్తూ ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఎగవేతలు, కోతలే లక్ష్యంగా పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు ప్రజల ఆరోగ్య భరోసాకు తూట్లు పొడుస్తున్నారు. దేశంలో ఇప్పటికే బీమా విధానాన్ని అమలు చేసిన పలు రాష్ట్రాలు పెదవి విరిచాయి. మహారాష్ట్ర, కేరళ బీమా విధానాన్ని విడనాడి తిరిగి ఆరోగ్యశ్రీ తరహా ట్రస్ట్ విధానం బాట పట్టాయి. దీన్ని పెడచెవిన పెట్టిన కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని బలి పెడుతోంది. అంతా అస్తవ్యస్థం.. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకుండా పథకం నిర్వహణను పూర్తిగా గాలికి వదిలేసింది. ఎన్టీఆర్ వైద్య సేవ అని పథకం పేరు మార్చడం మినహా కనీసం శాశ్వత సీఈవోను సైతం నియమించలేదు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు ఏకంగా రూ.3 వేల కోట్ల మేర బకాయిలు పెట్టింది. దీంతో ఏడాది తిరగకుండానే ఆస్పత్రులు ఏకంగా నాలుగు సార్లు కూటమి ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చాయి. అయినప్పటికీ సర్కారులో చలనం లేకపోవడంతో గత రెండు రోజులుగా ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సేవలను ఆస్పత్రులు నిలిపివేశాయి. చికిత్స కోసం వచ్చిన రోగులను వెనక్కి తిప్పి పంపుతున్నాయి. ఇక ఆరోగ్య ఆసరా కింద ఇప్పటికే రూ.నాలుగు కోట్లకు పైగా ప్రభుత్వం రోగులకు బకాయి పడింది. ప్రభుత్వం కొత్తగా తెస్తున్న బీమా విధానంలో ఆసరా సాయం ఉండకపోవచ్చని తెలుస్తోంది. పేరుకే పెద్దాస్పత్రులు.. ఏ మందులూ ఉండవు దురదృష్టవశాత్తు అనారోగ్యం బారిన పడితే డబ్బులు ఖర్చు పెట్టే స్తోమత లేక పెద్దాస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులపై ప్రభుత్వం మందుల భారాన్ని మోపుతోంది. పెద్దాస్పత్రుల్లో 150 నుంచి 200 రకాల మందుల కొరత వేధిస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఆస్పత్రుల్లో సిరంజ్‌లు, ఐవీ సెట్లు, బ్యాండేజీలు, కాటన్, యూరిన్ ట్యూబ్స్, డిస్పోజబుల్ బెడ్‌షీట్స్, బెటాడిన్ సొల్యూషన్ కొరత నెలకొంది. విశాఖ కేజీహెచ్‌లో 200 రకాలకుపైగా మందులు అందుబాటులో లేవు. దీంతో చేసేది లేక మందులు, సర్జికల్ ఐటమ్స్ బయట కొనుగోలు చేయాలని వైద్యులు రోగులకు చీటీలు రాసిస్తున్నారు. ఇక వైద్య పరికరాలు పాడైతే పట్టించుకునే వారే లేరు. ఆదుకున్న ఆరోగ్య ఆసరా.. ఒకవైపు ప్రజలకు సంపూర్ణ వైద్య భరోసా కల్పించిన వైఎస్ జగన్ మరోవైపు చికిత్స అనంతరం రోగులు కోలుకునే వరకూ ఆ కుటుంబం జీవన భృతి కోసం ఇబ్బంది పడకుండా వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా ఆదుకున్నారు. వైద్యులు సూచించిన మేరకు నెలకు రూ.5 వేల వరకూ ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయిన రోజే రోగుల ఖాతాల్లో జమ చేశారు. రోజువారీ కూలీలు, చిరు వ్యాపారుల కుటుంబాల్లో సంపాదించే వ్యక్తి ఆస్పత్రి పాలైతే పోషణ కష్టతరంగా మారుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వం అందించిన ఆరోగ్య ఆసరా సాయం కష్ట కాలంలో వారు ఆర్ధిక ఇబ్బందుల పాలు కాకుండా ఆదుకుంది. ఇలా వైఎస్ జగన్ హయాంలో ప్రజల ఆరోగ్యానికి పూర్తి భరోసా లభించింది. టీడీపీ, వైఎస్సార్ సీపీ హయాంలో పథకం అమలైన తీరు, లబ్ధిదారుల సంఖ్య ఇందుకు నిదర్శనం. 2014–19 మధ్య టీడీపీ హయాంలో అరకొర ప్రొసీజర్లతో ఆరోగ్యశ్రీకి రూ.5,177.38 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా 2019–24 వరకు వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.13 వేల కోట్లకుపైగా వెచ్చించి 45 లక్షల మందికిపైగా ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు అందించింది. మరో 24.59 లక్షల మంది రోగులకు డిశ్చార్జీ అనంతరం జీవన భృతికి ఇబ్బంది లేకుండా వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద రూ.1,465 కోట్లు చెల్లించారు. నాడు కోటిన్నర కుటుంబాలకు భరోసాదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తొలిసారిగా రూ.25 లక్షల వరకూ వైద్య పరిమితితో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేసింది. చేతి నుంచి రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా, పేదలు వైద్యం కోసం అప్పుల పాలు కాకుండా చర్యలు తీసుకున్నారు. గతంలో కేవలం తెల్ల రేషన్ కార్డు కుటుంబాలకే పరిమితం అయిన ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తరించి రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు ఆరోగ్య భరోసా కల్పించారు. రాష్ట్రంలో దాదాపు కోటిన్నర కుటుంబాలకు ఆరోగ్యశ్రీ ఆపద్భాందవిలా అండగా నిలిచింది. వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటితే చికిత్స వ్యయాన్ని ప్రభుత్వమే భరించేలా పథకాన్ని విప్లవాత్మక రీతిలో అమలు చేశారు. ఏకంగా 3,257 ప్రొసీజర్లలో ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో కూడా ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారు. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలతో పాటు బైలాట్రల్ కాక్లియర్ ఇంప్లాంటేషన్, గుండె మార్పిడి లాంటి అత్యంత ఖరీదైన శస్త్ర చికిత్సలు సైతం గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఉచితంగా లభించాయి. 54 వేలకు పైగా పోస్టుల భర్తీ..ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా వైద్యశాఖలో విప్లవాత్మక సంస్కరణలను అమలు చేసింది. ముఖ్యంగా ప్రభుత్వాస్పత్రుల్లో ప్రధాన సమస్య మానవ వనరుల కొరతను నివారించేందుకు మునుపెన్నడూ లేని విధంగా 2019–24 మధ్య ఏకంగా 54 వేలకుపైగా వైద్య పోస్టులను భర్తీ చేసింది. ఫలితంగా జాతీయ స్థాయితో పోలిస్తే రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యుల అందుబాటు అత్యంత మెరుగ్గా ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పార్లమెంట్లో వెల్లడించింది. ప్రివెంటివ్ కేర్‌లో అత్యంత కీలకమైన గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీ) దేశవ్యాప్తంగా 2023 మార్చి నాటికి 41,931 మంది మెడికల్ ఆఫీసర్లకు (ఎంవో) గాను 32,901 మంది అందుబాటులో ఉన్నారని, 22.30 శాతం ఎంవోల కొరత ఉందని స్పష్టం చేసింది. అదే ఏపీలో 2,313 మందికి గాను 2,293 మంది అందుబాటులో ఉండగా కేవలం 20 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపింది. ఈ లెక్కన రాష్ట్రంలో 0.86 శాతం కొరత మాత్రమే ఉన్నట్లు స్పష్టమైంది. గత ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణే లక్ష్యంగా దేశంలో ఎక్కడా లేని రీతిలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేసింది. ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు, ఒక్కో పీహెచ్సీలో ఇద్దరు వైద్యులు ఉండేలా చర్యలు తీసుకుంది. పీహెచ్సీ వైద్యులు తమ పరిధిలోని గ్రామాలను నెలలో రెండు సార్లు ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో భాగంగా సందర్శించి.. రోజంతా గ్రామంలో ఉండి వైద్య సేవలు అందించేవారు. పట్టణ పీహెచ్‌సీల్లో దేశవ్యాప్తంగా 19.08 శాతం వైద్యుల కొరత ఉండగా, ఏపీలో అది 3.32 శాతమేనని పార్లమెంట్ వేదికగా వెల్లడైంది. ఇవన్నీ ప్రజారోగ్యం పట్ల గత సర్కారు తీసుకున్న శ్రద్ధకు నిదర్శనం.జీరో వేకెన్సీ పాలసీ..2019–24 మధ్య వైద్య శాఖలో ఎప్పటి ఖాళీలను అప్పుడే భర్తీ చేసేలా జీరో వేకెన్సీ పాలసీని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసింది. ఉద్యోగ విరమణ, వీఆర్ఎస్, ఇతర కారణాలతో ఖాళీ అయిన పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేశారు. కేవలం వైద్య శాఖలో నియామకాల కోసమే ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డును సైతం ఏర్పాటు చేశారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని సెకండరీ హెల్త్, బోధనాస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యులను అందుబాటులో ఉంచడం కోసం పలు దఫాలు వాక్ –ఇన్ –ఇంటర్వ్యూలు నిర్వహించారు. నాడు జాతీయ స్థాయిలో గైనిక్ వైద్యులకు 50 శాతం కొరత ఉంటే ఏపీలో 1.4 శాతం, అదే స్పెషలిస్ట్ పోస్టులు దేశవ్యాప్తంగా 61 శాతం కొరత ఉండగా రాష్ట్రంలో 6.2 శాతం మేర మాత్రమే ఉంది. ప్రభుత్వాస్పత్రుల్లో మానవ వనరుల కొరతను అధిమించడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను కేంద్ర ప్రభుత్వం చాలా సందర్భాల్లో అభినందించింది. ఏపీ విధానాలపై ప్రత్యేకంగా ప్రజెంటేషన్లు ఇస్తూ మిగిలిన రాష్ట్రాలు ఆ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జీరో వేకెన్సీ విధానానికి తూట్లు పొడిచింది. ఆస్పత్రుల్లో ఏర్పడిన ఖాళీలు భర్తీ కాకపోవడంతో వైద్య సేవల కల్పనపై తీవ్ర ప్రభావం పడుతోంది.రెండో రోజు నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు సాక్షి, అమరావతి: నెట్వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించని కారణంగా రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) సేవలు రెండో రోజు మంగళవారం నిలిచిపోయాయి. రూ.3 వేల కోట్ల బిల్లులను ప్రభుత్వం నెట్వర్క్ ఆస్పత్రులకు చెల్లించలేదు. దీంతో సోమవారం నుంచి ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు సేవలు అందించడం లేదు. ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ లబ్ధిదారులు చికిత్సల కోసం ఆస్పత్రులకు వెళ్తున్నా నగదు రహిత వైద్య సేవలు అందించడం లేదని తేల్చి చెబుతున్నారు. దీంతో చేసేది లేక జేబులో డబ్బులు పెట్టి ప్రజలు, ఉద్యోగులు చికిత్సలు చేయించుకుంటున్నారు. మరోవైపు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) ప్రతినిధులతో మంగళవారం రాష్ట్ర వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు చర్చలు నిర్వహించారు. నిలిపి వేసిన సేవలను పునఃప్రారంభించాలని కోరారు. పెండింగ్ బకాయిలు చెల్లిస్తే గానీ సేవలు అందించలేమని ఆశా ప్రతినిధులు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. రెండు గంటల పాటు సాగిన చర్చల్లో త్వరలోనే రూ.500 కోట్లు బిల్లులు విడుదల చేస్తామని ఆస్పత్రులకు హామీ ఇచ్చినట్టు వైద్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా ప్రభుత్వం నుంచి వచ్చిన హామీపై అసోసియేషన్ సభ్యులతో చర్చించి, బుధవారం తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఆశా ప్రెసిడెంట్ డాక్టర్ విజయ్‌కుమార్ తెలిపారు. -
మంత్రి లోకేశ్‌ను నిలదీసిన మహిళలు
-
సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు?
సాక్షి, భీమవరం/ఉండి/కాళ్ల: పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో సోమవారం పర్యటించిన ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్‌ను మహిళా లోకం నిలదీసింది. సూపర్ సిక్స్ హామీలన్నీ ఎప్పటినుంచి అమలు చేస్తారో చెప్పాలని మహిళల నుంచి ప్రశ్నల వర్షం కురవడంతో లోకేశ్ కంగుతిన్నారు. ఎన్నికల్లో చెప్పినట్టుగా 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలనెలా రూ.1,500, ఎంతమంది పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు ఎప్పటినుంచి ఇస్తారో చెప్పాలని మహిళలు కోరారు. మహిళలకు ఉచిత బస్సు సదుపాయం ఎప్పటి నుంచి అమలు చేస్తారు సార్’ అని స్థానిక మహిళలు లోకేశ్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఉండిలోని జెడ్పీ హైస్కూల్ ఆవరణలో పలు ప్రారంబోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి లోకేశ్‌కు వినతులు ఇచ్చేందుకు వచ్చిన స్థానిక మహిళలను పోలీసులు అడ్డుకుని బయటే ఉంచేశారు. వారు గేటు బయటి నుంచి లోకేశ్‌ను పిలవగా.. ఆయన వారి వద్దకు వెళ్లి మాట్లాడారు. నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదు? సూపర్ సిక్స్ ఎందుకు అమలు చేయడం లేదంటూ ఒకరి తర్వాత ఒకరు ప్రశి్నస్తూ లోకేశ్‌కు చుక్కలు చూపించారు. లోకేశ్ బదులిస్తూ.. ‘పింఛన్ పెంచాం. గోతులు పూడుస్తున్నాం. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది.. త్వరలో చేస్తాం’ అన్నారు. కానీ.. ఎప్పటి నుంచి ఆయా పథకాలను అమలు చేస్తామనే విషయాన్ని స్పష్టం చేయకుండా సమాధానం దాటవేశారు. వినతులు తీసుకోకుండానే.. దివ్యాంగురాలైన తన కుమార్తెకు పింఛన్ ఇప్పించాలని ఒక మహిళ వినతిపత్రం అందజేయగా.. మిగిలిన మహిళల నుంచి వినతులు తీసుకోకుండానే లోకేశ్ అక్కడి నుంచి ముందుకు వెళ్లిపోయారు. వినతిపత్రాలు ఇచ్చేవారు డిప్యూటీ స్పీకర్ కార్యాలయానికి వచ్చి అందజేయాలని కూటమి నాయకులు సూచించడంతో మంత్రి లోకేశ్‌కు వినతులు ఇచ్చేందుకు అప్పటివరకు పడిగాపులు కాసిన జనం ఉసూరుమంటూ వెనుదిరిగారు. మీడియాపై ఆంక్షలు ఉండిలోని జెడ్పీ హైస్కూల్లో దాతల సాయంతో ఆధునికీకరించిన అభివృద్ధి పనుల ప్రారంబోత్సవం, కాళ్ల మండలం పెదఅమిరంలో రతన్ టాటా విగ్రహావిష్కరణ, భీమవరంలో ఎస్ఆర్కేఆర్ కళాశాలలో విద్యార్థులతో సమావేశం, పితృవియోగంతో ఉన్న కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మను పరామర్శించేందుకు సోమవారం రాష్ట్ర మంత్రి లోకేశ్ జిల్లాలో పర్యటించారు. ఆయన పర్యటన ఆద్యంతం మీడియాపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఫొటోలు, వీడియోలు తీయకుండా అడ్డుకున్నారు.లేని షటిల్, టెన్నిస్ కోర్టులు ప్రారంభించిన మంత్రి నిర్మాణాలు ఏమీ చేయకుండానే నేలపై సున్నం వేసి, నెట్లు కట్టి షటిల్ కోర్టులంటూ మంత్రి లోకేశ్‌తో ప్రారంభింపజేయడం, ఆయన ప్రారంభించడం అందరినీ ఆశ్చర్యపరించింది. మంత్రి పర్యటన సందర్భంగా పాఠశాలలోని ప్లే గ్రౌండ్ అభివృద్ధి పేరిట కాలువలోంచి తీసిన మట్టితెచ్చి వేశారని స్థానికులు తెలిపారు. హైస్కూల్లో ప్రారంభోత్సవాల అనంతరం లోకేశ్, డిప్యూటీ స్పీకర్ కె.రఘురామకృష్ణరాజు, టీడీపీ ముఖ్య నేతలు కొంతసేపు ప్రధానోపాధ్యాయుని గదిలోనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా కిటికీ తలుపులు కూడా మూసివేశారు. ఎంఈవో జ్యోతిని కూడా పోలీసులు, లోకేశ్ సెక్యూరిటీ లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో వారంతా బయటే ఉండిపోయారు. -
Chandrababu: సూపర్ సిక్స్ కు ఎగనామం
-
ఆంధ్రప్రదేశ్‌లో సూపర్ సిక్స్ పథకాల్లో అన్నీ కోతలు, ఎగనామాలే... కూటమి సర్కారు తీరుపై మండిపడుతున్న ప్రజలు
-
విభాత సంధ్యల ప్రభాత గీతం!
‘తారీఖులు, దస్తావేజులు... ఇవి కావోయ్ చరిత్రకర్థం’ అన్నారు శ్రీశ్రీ. కావచ్చు. కానీ, వాటికి ఉండే ప్రాధాన్యత వాటికున్నది. కొన్ని ముఖ్యమైన తేదీల శతాబ్దులూ, అర్ధ శతాబ్దుల సందర్భాలూ చాలా ప్రత్యేకమైనవి. అవి ఇప్పటి పరిస్థితులనూ, పరిణామాలనూ అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తాయి. నేర్చుకోవాలనుకుంటే పాఠాలు కూడా చెబుతాయి. ఇప్పుడు బలంగా ఊడలు దిగి కనిపిస్తున్న భావజాలాలపై అవగాహన కుదరాలంటే నాడు వాటికి నారుపోసి నీరు పెట్టిన తొలి కాపుల లక్ష్యాలేమిటో, స్వప్నాలేమిటో తెలుసుకోవాలి. ఈ సందర్భాలు అందుకు పనికొస్తాయి.కొన్నిసార్లు ఇటువంటి చారిత్రక సందర్భాలు ఒకదాని వెంట ఒకటి వరుసకట్టి వచ్చిపడతాయి. ఈ డిసెంబర్ ఆఖరి వారం కూడా అటువంటి ఓ అరుదైన క్రమాన్ని ఆవిష్కరించింది. జాతిపిత మహాత్మాగాంధీ ఒకే ఒక్కసారి 1924 డిసెంబర్ 24వ తేదీన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. మేధావుల సమ్మేళనంలా ఉండే కాంగ్రెస్ పార్టీని ఆయన జనసామాన్యుల పార్టీగా, ఉద్యమ పార్టీగా పరుగులు పెట్టించారు. ఆ సందర్భాన్ని గుర్తుపెట్టుకొని అదే బెళగావి (కర్ణా టక)లో నేటి శిథిల కాంగ్రెస్ పార్టీ కూడా దాని వర్కింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నది. మీడియా ద్వారా వెల్లడైన సమాచారాన్ని గమనిస్తే ఇది మొక్కుబడి సమావేశంగానే అనిపించింది. దూరమైన ప్రజాశ్రేణుల దరిజేరే ఉపా యాన్ని గాంధీ స్ఫూర్తి నుంచి గ్రహించినట్టు కనిపించలేదు.స్వాతంత్య్రం సిద్ధించిన తొలి దశాబ్దాల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న భారత కమ్యూనిస్టు పార్టీ కూడా డిసెంబర్ 26న వందో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అప్పటికే వివిధ రాష్ట్రాల్లో వేర్వేరుగా ఏర్పడిన కమ్యూనిస్టులను ఐక్యం చేసి ఆ రోజున కాన్పూర్‌లో జాతీయ పార్టీగా ప్రకటించారు. అయితే ఈ తేదీపై ఒక డజన్‌కు పైగా ఉన్న కమ్యూనిస్టు పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేదు. 1920లోనే నాటి సోవియట్ యూనియన్‌లోని తాష్కెంట్ (నేటి ఉజ్బెకిస్తాన్)లో ఎమ్.ఎన్.రాయ్ తదితరులు పార్టీని ప్రకటించారు గనుక ఆ తేదీనే ఆవిర్భావ దినంగా భావించాలని కొందరి అభిప్రాయం. ముఖ్యంగా బిగ్ బ్రదర్ సీపీఎం తాష్కెంట్ తేదీకే కట్టుబడి ఉన్నది. పుట్టిన తేదీ వంటి ఒక సాధారణ సాంకేతిక అంశంపైనే రాజీ పడటానికి సిద్ధంగా లేని కమ్యూనిస్టులు క్లిష్టమైన సైద్ధాంతిక విషయాల్లో ఐక్యత సాధించగలరని ఆశించే వారి సహనాన్ని అభినందించ వలసినదే!ఈ డిసెంబర్ 25నే ఆరెస్సెస్ కూడా తన వందో ఏడాదిలోకి అడుగుపెట్టింది. హిందూ రాష్ట్ర స్థాపన, హిందూ జాతీయ తావాదం లక్ష్యాలుగా కేశవ బలిరామ్ హెడ్గేవార్ ఈ సంస్థను స్థాపించారు. సంస్థను స్థాపించిన తొలి రోజుల నుంచి సాంస్కృతిక రంగంపైనే ప్రధానంగా గురిపెట్టి ఈ సంస్థ పనిచేయడం ప్రారంభించింది. స్వాతంత్య్ర పోరాటం ఉధృతంగా జరుగు తున్న రోజుల్లో పుట్టినప్పటికీ రాజకీయ రంగంలో అది పరిమిత పాత్రనే పోషించింది. కానీ, ఈరోజున భారత రాజకీయాలను తన గుప్పెట్లో పెట్టుకొని ప్రభావితం చేయగలిగే స్థాయికి ఎదిగింది. ఆ సంస్థ స్థాపించిన పలు అనుబంధ సంఘాలు శాఖోపశాఖలుగా విస్తరించి వివిధ రంగాల్లో పనిచేస్తున్నాయి. దాని రాజకీయ వేదికైన భారతీయ జనతా పార్టీ దాదాపు పదికోట్ల మంది సభ్యులతో దేశంలో అతి బలీయమైన రాజకీయ శక్తిగా ఆవిర్భవించింది. అధికార పార్టీగా ఆ పార్టీ అనుస రిస్తున్న, అనుసరించబోయే విధానాలను ఆరెస్సెస్ వ్యవస్థాప కుల సిద్ధాంతాలు, ఆశయాలు ప్రభావితం చేయడం పెద్దగా ఆశ్చర్యపోయే విషయమైతే కాదు.ఈ సంవత్సరమే అటల్ బిహారీ వాజ్‌పేయి శతజయంతి పూర్తి కావడం యాదృచ్ఛికమైనప్పటికీ ఆసక్తికరం కూడా! ఆరెస్సెస్ కంటే సరిగ్గా ఒక సంవత్సరం ముందు డిసెంబర్ 25వ తేదీనే అటల్ జీ జన్మించారు. ఆరెస్సెస్ తొలి రాజకీయ వేదిక జనసంఘ్‌లో కూడా ఆయన ప్రముఖ నాయకుడుగా ఉన్నారు. కొంతకాలం అధ్యక్షునిగా పనిచేశారు. జనసంఘ్ పార్టీ భార తీయ జనతా పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత పాతికేళ్ల పాటు దాని ముఖపత్ర చిత్రంగా వాజ్‌పేయి ఉన్నారు. మతతత్వ పార్టీగా ముద్రపడి ఉన్న బీజేపీని మధ్యేవాదులకు కూడా ఆమోదయోగ్యం చేయడంలో వాజ్‌పేయి బొమ్మ పనికొచ్చింది. ఆయనకున్న ఉదారవాద టైటిల్ సాయంతో తొలిసారి ఢిల్లీ సర్కార్‌ను ఆరెస్సెస్ అనుబంధ సంస్థ ఏర్పాటు చేయగలిగింది. ఆ కాలానికి వాజ్‌పేయి ఉపయోగపడ్డారు. ఈ కాలానికి కాదు! ఇప్పుడు మోదీయే అవసరమని సంఘ్ అభిప్రాయపడింది. కాలానుగుణంగా కవర్ పేజీ చిత్రాలను ఎంపిక చేయడంలోనే ఆరెస్సెస్ విజయ రహస్యం ఇమిడి ఉన్నది. అంతే తప్ప వాజ్‌పేయి వేరు, మోదీ వేరూ కాదు! ఈ రెండు రూపాల్లోని సారం ఒక్కటే!!డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ మనుస్మృతిని దహనం చేసిన చారిత్రక ఘటనకు కూడా వందేళ్లు కావస్తున్నది. 1927లో సరిగ్గా డిసెంబర్ 25వ తేదీనే అంబేడ్కర్ ఈ పని చేశారు. వర్ణ వ్యవస్థ లేదా నేటి కులవ్యవస్థను మనుస్మృతి బలంగా సమర్థించింది. కుల వ్యవస్థ ముసుగులో జరిగిన దారుణమైన సామాజిక అణచితవేతకు గురైన బలహీన వర్గాల్లోని చైతన్యవంతులైన ప్రజల మనోభావాలకు అంబేడ్కర్ చర్య సాంత్వన కలిగించింది. అప్పటికంటే ఇప్పుడు అంబేడ్కరిజానికి మద్దతు మరింత పెరుగుతున్నది.స్వేచ్ఛ, సమానత్వం, లౌకికత్వం అనేవి ఆధునికమైన ప్రజాస్వామిక భావనలుగా ప్రపంచవ్యాప్తంగా పరిగణన పొందాయి. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షునిగా డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగ రచనలో ఈ భావనలకే పెద్దపీట వేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం ఉన్న నాటి రాజ్యాంగ సభ ఈ ముసాయిదాకు ఆమోదముద్ర వేసింది. ఈ దేశంలోని కమ్యూ నిస్టులకు కూడా సిద్ధాంతపరంగా ఈ ఆధునిక భావనలతో పేచీ లేదు. మరి దేశంలోనే పెద్ద పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ మాటేమిటి?భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను పరిశీలిస్తే కాలాను గుణమైన ఎత్తుగడలను అమలుచేస్తూ ఆరెస్సెస్ మూల సిద్ధాంతాలను హిడెన్ ఎజెండాగా పెట్టుకొని అవసరాన్ని బట్టి ఒక్కొక్కదాన్ని వెలికి తీస్తున్న పద్ధతి కనిపిస్తున్నది. భారత రాజ్యాంగం పట్ల ఆరెస్సెస్ వ్యతిరేకత రహస్యమేమీ కాదు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తొలిరోజే దాని అధికార పత్రిక వ్యతిరేక వ్యాసం రాసిన సంగతి అందరికీ తెలిసినదే. సంఘ్ సిద్ధాంతకర్త గురు గోల్వాల్కర్ రాజ్యాంగాన్ని ‘పలు దేశాల నుంచి అరువు తెచ్చుకున్న అతుకుల బొంత’గా వ్యాఖ్యానించడం కూడా రహస్యం కాదు. రాజ్యాంగ సభలో చర్చలు జరుగుతున్న రోజుల్లోనే పలువురు సంఘ్ ప్రముఖులు, హిందూ మహాసభ నాయకులు మనుస్మృతిని మన దేశ రాజ్యాంగంగా మలుచుకోవాలని కోరిన విషయాన్ని గుర్తు చేసుకోవడం అవసరం. రాజ్యాంగంలో మార్పులు చేయాలనే ఆలోచన బీజేపీకి ఉన్నట్టు పలు వార్తలు వచ్చాయి. పీఠికలో ఉన్న ‘లౌకిక’, ‘సామ్యవాద’ పదాలను తొలగించాలని ఆ పార్టీ యోచిస్తున్నట్టు ప్రచారం జరిగింది. తన హిడెన్ ఎజెండాలోని అంశాలనుముందుగా ప్రచారంలోకి వచ్చేలా చూడటం, పెద్దగా వ్యతిరేకత కనిపించకపోతే ఆచరణలో పెట్టడం బీజేపీకి కొత్త వ్యూహమేమీ కాదు. ఆధునిక భావనలైన స్వేచ్ఛ, సమానత్వం, లౌకికత్వాలకు మనుస్మృతికి సాపత్యం కుదురుతుందంటే నమ్మడం కుదరదు. బీజేపీ ఎటువైపున నిలబడుతుందో చూడాలి. బీజేపీ తన గమ్యాన్ని చేరే యాత్రలో అడ్వాణీ రథయాత్ర ఒక మజిలీ, వాజ్‌పేయి అధికారం ఒక మజిలీ, నరేంద్ర మోదీ మరో రెండు మూడు మజిలీలు దాటి ఉంటారు. రేపటి జమిలి ఎన్నికలు మరో మజిలీ అని పలువురి భావన. ఈ యాత్ర నిర్నిరోధంగా ఇలాగే సాగుతుందా? దీన్ని నిలువరించే శక్తులున్నాయా? అనేదే నేటి ప్రధాన రాజకీయ చర్చ.సిద్ధాంత పరంగా చూస్తే బీజేపీ హిందూయాత్ర(?)ను ఎదిరించే బలం అంబేడ్కరిజానికి ఉన్నదని కొందరి అభి ప్రాయం. కానీ దానికి ఒక సంస్థాగత రూపం లేదు. అందుకే ‘లాల్–నీల్’æఅనే కొత్త నినాదం ముందుకొచ్చింది. అంబే డ్కరిస్టులు, కమ్యూనిస్టులు కలిసి పనిచేయాలని దీని భావం. కానీ, చిన్నచిన్న పట్టింపులతోనే చీలికలు పీలికలైన లాల్వాలాల్లో ఇంకా ఆ సామర్థ్యం మిగిలి ఉందని నమ్మేవారి సంఖ్య స్వల్పం. ఇక వ్యూహ రాహిత్యం, నాయకత్వ వైఫల్యంతో కాంగ్రెస్ పార్టీ కునారిల్లిపోయిన స్థితి. ‘ఇండియా’ కూటమి పక్షాల దన్నుతో 99 లోక్‌సభ సీట్ల దాకా నెట్టుకొచ్చిన ఆ పార్టీని ఇప్పుడు కూటమి పక్షాలే గెటౌట్ అనే పరిస్థితి ఏర్పడింది. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి. మొత్తానికి వందేళ్ల నాటి భావాలూ, సంస్థలూ ఇంకా మన రాజకీయ యవనికపై కదలాడుతుండటం ఒక విశేషం. ఈ ప్రయాణంలో బలమైన శక్తులు బలహీనంగా మారడం, బలహీన శక్తులు బలంగా మారడం మరో విశేషం.చారిత్రక ఘటనలు పునరావృతం అవుతున్నట్టు కనిపించడం కూడా మరో ఆసక్తికర పరిణామం. వెన్నుపోటు ఉదంతంతో తొలిసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ఆ తర్వాత వాజ్‌పేయి అండతో ‘కార్గిల్ గాలి’లో మరోసారి అధికారంలోకి వచ్చారు. ఇది జరిగి పాతిక సంవత్సరాలు. అప్పుడు అధికారంలోకి వచ్చిన ఏడాది కూడా గడవకముందే తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఆయన కొనితెచ్చుకున్నారు. అడ్డగోలుగా బాదిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా మొదలైన ఆందోళనలు ఆయన పదవీకాలమంతా జరుగుతూనే ఉన్నాయి. చివరికి తిరుపతిలో మందుపాతర ప్రమాదం నుంచి బయటపడ్డ సానుభూతి కూడా ఆయన్ను గట్టెక్కించలేకపోయింది.ఇప్పుడూ అదే పరిస్థితి. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ను అటకెక్కించడంతోనే తాము మోసపోయామన్న అభిప్రాయం జనంలో వచ్చేసింది. దానికితోడు పరిపాలనా వైఫల్యాలు, కక్షసాధింపు రాజకీయాలు, ప్రజావైద్యం పడకేయడం, నాణ్యమైన ప్రభుత్వ విద్యకు పాతరేయడం, వాడవాడనా పారుతున్న మద్యం కంపు, అంతకుమించి కంపు కొడుతున్న రాజకీయ నాయకుల అవినీతి బాగోతాలు, వెరసి ఆరు మాసాల్లోనే తీవ్రమైన ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా శుక్రవారం నాడు వైసీపీ పిలుపు మేరకు జరిగిన ప్రదర్శనల్లో పది లక్షలమందికి పైగా పాల్గొనడం ప్రజాగ్రహానికి ఒక శాంపిల్ మాత్రమే! పులివెందుల నియో జకవర్గంలో వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్రెడ్డి జరిపిన పర్యటన జనసముద్రాన్ని చీల్చుకొని వెళ్తున్నట్టుగా కనిపించింది. అభిమాన సందోహం నడుమ పాతిక కిలోమీటర్ల ప్రయాణానికి ఏడు గంటల సమయం! పులివెందుల నుంచి బెంగళూరు వరకు ఆయన చేసిన రోడ్డు ప్రయాణం కూడా అంతే! దారి పొడవునా ఊళ్లు కాదు, జన జాతరలే దర్శనమిచ్చాయి. ఈ పరిస్థితి చూస్తుంటే కూడా గతమే గుర్తుకొస్తున్నది. మందుపాతర సాను భూతితో మళ్లీ గెలుస్తామని భావించిన బాబు నాలుగు మాసాలు ముందుగానే ఎన్నికలకు పోవాలని నిర్ణయించుకున్నారు. ఆయనతోపాటు కేంద్రంలోని ఎన్టీయే సర్కార్‌ను కూడా తీసుకెళ్లి వాజ్‌పేయి పుట్టి ముంచారు. ఇప్పుడు కూడా ముందుగానే జమిలి వార్తలు వస్తున్నాయి. ఈ జమిలిలో మోదీ పుట్టిని కూడా ముంచుతాడేమో!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
రూ.లక్ష కోట్ల అప్పు!
సాక్షి, అమరావతి: సంపద సృష్టించి సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తానంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు తిలోదకాలిచ్చిన సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని రుణ భారంతో ముంచెత్తుతున్నారు. బడ్జెట్లోనూ, బడ్జెటేతర అప్పుల్లోనూ దూసుకుపోతున్నారు. ఆర్నెల్లలోనే రూ.లక్ష కోట్లకుపైగా అప్పుల దిశగా రాష్ట్రం పరుగులు తీస్తోంది. మరోవైపు గత ఏడాదితో పోల్చితే అమ్మకాల పన్ను ఆదాయంతో పాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రావాల్సిన నిధుల్లో భారీగా తగ్గుదల కనిపిస్తోంది. రెవెన్యూ లోటు భారీగా పెరిగిపోయింది. ఈ ఆర్థిక ఏడాదిలో నవంబర్ వరకు రాబడులు, వ్యయాలకు సంబంధించి కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) వెల్లడించిన గణాంకాలే ఇందుకు నిదర్శనం. రాజధానికి రూ.52 వేల కోట్లు! టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బడ్జెట్, బడ్జెటేతర అప్పులు ఏకంగా రూ.74,590 కోట్లకు చేరాయి. బడ్జెట్ అప్పులే నవంబర్ వరకు రూ.65,590 కోట్లకు చేరినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరోపక్క ప్రభుత్వ గ్యారెంటీతో బడ్జెటేతర అప్పులు మరో రూ.9,000 కోట్లకు ఎగబాకాయి. ఇక రాజధాని పేరుతో ప్రపంచ బ్యాంకు, హడ్కో, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ నుంచి ఏకంగా రూ.31 వేల కోట్లు అప్పు చేసేందుకు కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో ఈ మేరకు సీఆర్డీఏకు అనుమతిస్తూ మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేసింది.అంటే సీఎం చంద్రబాబు ఆర్నెల్ల పాలనలో ఇప్పటికే చేసిన అప్పులు, చేయనున్న అప్పులు కలిపి మొత్తం రూ.1.05 లక్షల కోట్లకు చేరుకోనున్నాయి. అంతేకాకుండా ప్రాథమిక అంచనా మేరకు రాజధానికి రూ.52 వేల కోట్ల మేర నిధులు అవసరమని, ఇప్పటికే రూ.31 వేల కోట్లు సమీకరించినందున మిగతా నిధులు రూ.21 వేల కోట్లు కూడా సమీకరించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఆర్డీఏకి ప్రభుత్వం నిర్దేశించింది. సంపద సృష్టి అంటే అప్పులు చేయడమే అనే రీతిలో చంద్రబాబు పాలన కొనసాగుతోందనేందుకు ఇంతకన్నా నిదర్శనం మరొకటి ఉండదని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. పథకాలు లేవు.. పన్నుల మోతలే సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చకపోగా అధికారంలోకి రాగానే విద్యుత్ చార్జీల పేరుతో ప్రజలపై పెనుభారం మోపారు. ఏ ఒక్క పథకం అమలు కాకపోవడంతో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. అమ్మకం పన్ను ఆదాయం భారీగా తగ్గిపోవడమే దీనికి నిదర్శనం. కాగ్ గణాంకాల మేరకు గతేడాది నవంబర్‌తో పోల్చితే ఈ ఏడాది నవంబర్ నాటికి అమ్మకం పన్ను ఆదాయం రూ.1,043 కోట్లు తగ్గిపోయింది. స్టాంపులు, రిజి్రస్టేషన్ల ఆదాయం రూ.868 కోట్లు క్షీణించింది. మరోపక్క కేంద్రం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులు రూ.12,510 కోట్లు తగ్గిపోయాయి. విద్య, వైద్యం, సంక్షేమ రంగాలకు సంబంధించి సామాజిక వ్యయం కూడా గత నవంబర్‌తో పోల్చితే తగ్గిపోయిందని కాగ్ గణాంకాలు వెల్లడించాయి. మరోవైపు రెవెన్యూ లోటు రూ.9,742 కోట్లు అదనంగా పెరిగింది. -
Big Question: ఇది ముంచేసే ప్రభుత్వం.. ఆరు నెలల్లో లక్ష కోట్ల అప్పులు.. విజనరీ బాబు
-
చంద్రబాబుది 420 విజన్: వైఎస్ జగన్
ఇవాళ ఆరు నెలలు గడవక ముందే చంద్రబాబు చెప్పిన మాటలు మోసాలై కంటికి కనిపిస్తున్నాయి. ఆ రోజు నేను ఎన్నికలప్పుడు చెప్పాను. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే అని. చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టడమే అని. ఇవాళ 6 నెలలు తిరక్క ముందే అది కనిపిస్తోంది. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒకటే మాట వినిపిస్తోంది. జగన్ పలావు పెట్టాడు. చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు. పలావు, బిర్యానీ రెండూ పోయాయి. ఏమీ లేకుండా బాబు రోడ్డు మీద నిలబెట్టాడు అన్న చర్చ నడుస్తోంది. – వైఎస్ జగన్మోహన్రెడ్డిచంద్రబాబు విజన్ 2047 అంటున్నాడు. ఏడు నెలల క్రితం చంద్రబాబు, ఎల్లో మీడియా కలిసి మేనిఫెస్టో పేరుతో ప్రచారం చేసి ఊదరగొట్టారు. రూ.15 వేలు నుంచి రూ.48 వేల వరకు హామీలిచ్చుకుంటూ వెళ్లారు. ఇక్కడ ఏడు నెలల క్రితం మేనిఫెస్టో అని చెప్పిన హామీలకే దిక్కులేదు... కానీ, విజన్ 2047 అంటున్నాడు. రంగు రంగుల కథల పుస్తకమైన వారి విజన్ డాక్యుమెంట్ చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. – వైఎస్ జగన్మోహన్రెడ్డిఒకవైపు మనం ఇస్తున్న పథకాలు పూర్తిగా నిలిపివేశాడు. మరోవైపు ఆయన ఇస్తానన్న సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికెగిరిపోయాయి. ఇంకోవైపు బాదుడే బాదుడు మొదలైంది. ముట్టుకుంటే కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి. ఆరు నెలలు తిరక్క మునుపే రూ.15 వేల కోట్లు కరెంటు బిల్లులు షాకుల రూపంలో వేయగలిగిన దుర్మార్గుడు చంద్రబాబు మాత్రమే. హామీలపై చంద్రబాబును ఎవరైనా ప్రశ్నిస్తే... ఆ ప్రశ్నించే స్వరాన్ని అణగదొక్కుతూ రెడ్ బుక్ రాజ్యాంగం గ్రామ స్థాయి నుంచి అమలవుతోంది. స్కామ్‌ల మీద స్కామ్‌లు.. లిక్కర్, శాండ్ మాఫియాతో పాటు ప్రతి నియోజకవర్గంలోనూ పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. ఫ్యాక్టరీ నడుపుకోవాలన్నా, మైనింగ్ చేయాలన్నా ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లి డబ్బులివ్వాల్సిందే. ప్రతి విషయంలో నాకింత.. నీకింత.. అని ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకు పంచుకుంటున్న పరిస్థితులు కళ్లెదుట కనిపిస్తున్నాయి.ప్రజాస్వామ్య బద్దంగా జరగాల్సిన సాగు నీటి సంఘాల ఎన్నికలను అపహాస్యం చేశారు. ఎన్నికలను ఏకపక్షం చేశారు. గ్రామ స్థాయిలో ఇవ్వాల్సిన నో డ్యూస్ సర్టిఫికెట్లు, ప్రతిపక్షానికి, సాధారణ రైతులకు ఇవ్వకుండా వాళ్ల పార్టీ వారికే ఇచ్చుకుని పోలీసుల సాయంతో ఏకపక్షంగా బుల్డోజ్ చేసి ఎన్నికలు జరిపించుకున్నారు. అలాంటప్పుడు ఎన్నికలు జరపడం ఎందుకు? బుల్డోజ్ చేసి ఎన్నికలు జరిపి... రైతులు సంతోషంగా ఉన్నారని ఎలా చెబుతారు? రైతులు సంతోషంగా ఉన్నారని మీకు అనిపిస్తే రాజీనామా చేసి బయటకు రండి. అప్పుడు పెట్టుబడి సాయం, ఉచిత బీమా ఎక్కడ అని అడుగుతున్న రైతులు మీకు కనిపిస్తారు. – వైఎస్ జగన్సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్‌సహా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఎగ్గొట్టేందుకే సీఎం చంద్రబాబు రంగు రంగుల కథలు చెబుతూ.. దానికి విజన్ 2047 అని పేరు పెడుతున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. అందుకే దాన్ని 420 విజన్ అంటారని మండిపడ్డారు. ‘మనిషిని అభివృద్ధి బాటలోకి తీసుకుని పోవాలంటే.. ఆ అభివృద్ధి బాట ఏమిటని చెప్పేదే విజన్ డాక్యుమెంట్. ఇవాళ చిన్న పిల్లాడు 20 ఏళ్ల తర్వాత ఎలా ఉంటాడు? అప్పుడు అతడి భవిష్యత్ ఏంటి? ఆ భవిష్యత్ కోసం ఇవాళ సరైన అడుగులు వేస్తున్నామా? లేదా? అన్నదే విజన్. అందులో భాగంగా ఐదేళ్ల పాలనలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చాలా వాటిని చేసి చూపింది’ అని గుర్తు చేశారు. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని, పులినోట్లో తలపెట్టడమే అని.. నేను ఎన్నికల ప్రచారంలో చెప్పాను. ఇవాళ ఆరు నెలలు తిరక్క ముందే అదే కనిపిస్తోంది’ అని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన ఉమ్మడి అనంతపురం జిల్లాలో పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, నాయకులతో సమావేశమయ్యారు. చంద్రబాబు ప్రభుత్వం దగా చేయడంతో ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు అండగా గొంతు విప్పాలని, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలని మార్గ నిర్దేశం చేశారు. ‘పగలు తర్వాత రాత్రి వస్తుంది. మళ్లీ మన టైం వస్తుంది. దేనికైనా మనం సిద్ధమే. ఎవ్వరూ, ఎక్కడా భయపడొద్దు. దేన్నైనా ఢీకొందాం. మీ అందరికీ జగన్మోహన్రెడ్డితోపాటు పార్టీ అండగా ఉంటుంది’ అంటూ నేతలకు భరోసా ఇచ్చారు. పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు మార్గనిర్దేశం చేశారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే...జనవరి నుంచి జిల్లాల పర్యటనజనవరి చివరి వారం నుంచి నేను పార్లమెంటు జిల్లాల్లో పర్యటిస్తాను. వారంలో ప్రతి బుధ, గురువారం రాత్రి అక్కడే బస చేసి కార్యకర్తలతో మమేకమవుతాను. ‘కార్యకర్తలతో జగనన్న.. పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం’ పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. ఈ కార్యక్రమం మొదలయ్యే లోగా మండల స్థాయి నుంచి మొదలై నియోజకవర్గ, జిల్లా స్థాయి వరకు పార్టీ అనుబంధ విభాగాల కమిటీల నియామకాలన్నీ పూర్తి చేయాలి. పార్టీ నిర్మాణం చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఇదంతా ఆర్గనైజ్డ్గా తీసుకు రావాలి. నా కార్యక్రమం మొదలైన తర్వాత మీరు, నేను కలిసి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు తీసుకుని పోదాం. విలేజ్ కమిటీలు, బూత్ కమిటీల నియామకం పూర్తి చేస్తాం.సోషల్ మీడియాలో మరింత చురుగ్గా ఉందాంఇవాళ మనం చంద్రబాబుతో యుద్ధం చేయడం లేదు.. చంద్రబాబు వేసుకున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి ముసుగుతో యుద్ధం చేస్తున్నాం. ఇలాంటి వాళ్లను ఎదుర్కోవాలంటే మనం సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉండాలి. జనరేషన్ మారింది. ప్రతి కార్యకర్తకు ఫేస్బుక్, యూట్యూబ్, ట్విటర్ వంటి అన్ని సోషల్ మీడియా అకౌంట్లు ఉండాలి. గ్రామ స్థాయిలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ప్రశ్నించాలి. ఎవరికైనా పెన్షన్ రాకపోయినా, బిల్లుల బాదుడు పైనా ప్రశ్నిస్తూ ప్రతి గ్రామం నుంచి విప్లవ ధోరణిలో ప్రశ్నించాలి. గ్రామ స్థాయి నుంచే ప్రశ్నించే స్వరం ఉండాలి. అప్పుడే చైతన్యం వస్తుంది. ఈసారి మన టార్గెట్.. చంద్రబాబుకు సింగిల్ డిజిట్ దాటకూడదు. అది కచ్చితంగా జరుగుతుంది.మనకూ కచ్చితంగా గుడ్ టైమ్ వస్తుందిప్రతిపక్షంలో కష్టాలు, కేసులు సహజం. జైల్లో కూడా పెడతారు. నేను మీ అందరికీ చెబుతున్నాను. కష్టాలు ఎల్లకాలం ఉండవు. కష్టం తర్వాత సుఖం ఉంటుంది. ఏ కష్టం ఎవరికి వచ్చినా నా వైపు చూడండి. ప్రతిపక్షం ఉండదు.. అడిగే వాడు ఉండడని నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు. అప్పుడు రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్, టీడీపీ కలిసి నామీద కేసులు పెట్టాయి. ఏమైంది? ప్రజల అభిమానంతో ముఖ్యమంత్రి అయ్యాను. పగలు తర్వాత రాత్రి వస్తుంది. మళ్లీ మన టైం వస్తుంది. జమిలి వస్తుందంటున్నారు. దేనికైనా మనం సిద్ధంగా ఉందాం. మనకూ తప్పనిసరిగా గుడ్ టైమ్ వస్తుంది.ఆరు నెలల్లో 3.14 లక్షల పెన్షన్లు కట్మార్చి, ఏప్రిల్ నెలల్లో.. మన ప్రభుత్వ హయాంలో 66,34,742 పెన్షన్లు ఉండేవి. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఆరు నెలలైంది. డిసెంబర్లో పంపిణీ చేసిన పెన్షన్ల సంఖ్య 63,20,222. అంటే 3.14 లక్షల పెన్షన్లు కట్ చేశారు. కొత్తగా పెన్షన్ ఒక్కరికి ఇవ్వకపోగా.. ఉన్న పెన్షన్లు కట్ చేస్తున్నారు. రెండు, మూడు నెలల్లో ఇంకా, 3 లక్షల నుంచి 4 లక్షల మంది పెన్షన్లు కట్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం పోరుబాటకు సిద్ధం కావాలి. ఈ పోరుబాటలో ప్రతి గ్రామంలో వైఎస్సార్సీపీ జెండాను రెపరెపలాడించేలా ఎగుర వేయడానికి పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని అభ్యర్థిస్తున్నాను. ఆరు నెలలకే ఇంత వ్యతిరేకత ఎప్పుడూ లేదు⇒ ఆరు నెలలకే చంద్రబాబునాయుడు ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తోంది. ఇంతటి వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వం మీదా లేదు. ఎన్నికల్లో మనం ప్రచారం చేసినప్పుడు, మన పార్టీ తరఫున మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు నేను చెప్పిన మాటలు అందరికీ తెలుసు. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీలు, మోసాల గురించి నా దగ్గరకు వచ్చిన పార్టీ నాయకులు చాలా మంది చెప్పారు. మనం కుటుంబానికి అంతటికీ మంచి చేశాం. కానీ చంద్రబాబు మోసాలు, అబద్ధాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ప్రతి ఇంటికి మనం మంచి చేస్తే.. ఆయన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికీ మంచి చేస్తానని హామీ ఇచ్చాడు.⇒ మనం కూడా అలాంటి హామీలు ఇద్దామని మన పార్టీ నేతలు నాతో అన్నారు. అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం ధర్మం కాదనేది నా అభిమతం. ఆ రోజు మనం మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ఇవి మనం చేస్తున్న పథకాలు.. ఐదేళ్ల మన పాలనలో ఎప్పుడూ జరగని మార్పులు చేశాం. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయకుండా భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా భావించి అమలు చేశాం. చివరకు కోవిడ్ లాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఆదాయాలు తగ్గినా, మనం సాకులు వెతుక్కోలేదు. కారణాలు చెప్పలేదు. ఎన్నికల వేళ ఇచ్చిన మాట ప్రకారం బడ్జెట్‌తో పాటు సంక్షేమ క్యాలెండర్ విడుదల చేశాం. ఏ నెలలో ఏ పథకం ఇస్తామో చెప్పి... బటన్ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నగదు జమ చేశాం. ఇలాంటి కార్యక్రమం దేశ చరిత్రలోనే ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసి చూపింది. అంత గొప్పగా ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నాం.⇒ మనమంతా ఎమ్మెల్యేల తరఫున ప్రచారానికి వెళ్లినప్పుడు మనల్ని ఆప్యాయతతో ప్రజలు ఆదరించారు. మన మీద వ్యతిరేకత లేదు. కానీ పది శాతం మంది చంద్రబాబు మాటలను నమ్మారు. దానికి కారణం కూడా మనమే... అంత గొప్ప పాలన మనం అందించగలిగాం కాబట్టే.. చంద్రబాబు మభ్యపెట్టగలిగాడు. ప్రజలను ఆశ పెట్టగలిగాడు. జగన్ చేసి చూపించాడు కాబట్టి.. చంద్రబాబు కూడా చేసి చూపిస్తాడేమో అని ప్రజలు ఆశపడ్డారు.⇒ చంద్రబాబు, ఆయన పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో ఏ ఇంటికి వెళ్లినా ఎవ్వరినీ వదిలిపెట్టలేదు. ఒక మనిషి ఈ స్థాయిలో మోసం చేయగలుగుతాడా.. అన్నంతగా మోసం చేశారు. చిన్నపిల్లలతో నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అని.. వారి తల్లులకు నీకు రూ.18 వేలు అని, ఆ అమ్మల తల్లులు, అత్తలు కనిపిస్తే నీకు రూ.48 వేలు అని, 20 ఏళ్లు దాటిన యువకుడు కనిపిస్తే నీకు రూ.36 వేలు అని, కండువా వేసుకుని ఇంట్లోంచి రైతు బయటకు వస్తే నీకు రూ.20 వేలు అని.. ఇంట్లో ఎవరినీ వదిలిపెట్టకుండా ఆశ పెట్టారు.ప్రశ్నించే స్వరాన్ని అణగదొక్కుతూ రెడ్ బుక్ పాలన⇒ ఒకవైపు మనం ఇస్తున్న పథకాలు పూర్తిగా నిలిపివేశాడు. మరోవైపు ఆయన ఇస్తానన్న సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికెగిరిపోయాయి. రూ.15 వేల కోట్ల మేర కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి. ప్రశ్నించే స్వరాన్ని అణగదొక్కుతూ రెడ్ బుక్ రాజ్యాంగం గ్రామస్థాయి నుంచి అమలవుతోంది. మరోవైపు లిక్కర్, శాండ్ మాఫియాతో పాటు ప్రతి నియోజకవర్గంలోనూ పేకాట క్లబ్బులు, స్కామ్‌లు. ప్రతి పనికీ డబ్బులివ్వాల్సిందే. నాకింత.. నీకింత అని ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకు పంచుకుంటున్న పరిస్థితులు.⇒ ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యమబాట పట్టడానికి మనం ఇవాళ కలిసి అడుగులు వేస్తున్నాం. ఏ నాయకుడైనా ప్రజల తరఫున స్పందించ గలగాలి. వారి సమస్యలపై పోరాటం చేయాలి. దీనిపై పార్టీ నాయకత్వాన్ని చైతన్యం చేస్తున్నాం. అప్పుడే ప్రజల్లో అధికార పార్టీ మీద పెరుగుతున్న వ్యతిరేకత మనకు సానుకూలంగా మారుతుంది.⇒ ఆరు నెలలకే మనం పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబు పాలన అలా నడుస్తోంది. ప్రజలు, రైతులు ఇబ్బంది పడుతున్న విషయం మన కళ్లెదుటే కనిపిస్తోంది. రైతులకు గతంలో పెట్టుబడి సహాయంగా రైతు భరోసా కింద ఇచ్చిన రూ.13,500 గాలికెగిరిపోయింది. రూ.20 వేలు ఇస్తానన్న పెట్టుబడి సాయం మోసమని తేలిపోయిన పరిస్థితుల్లో రైతు సాగు చేస్తున్నాడు. రైతులకు ఉచిత పంటల బీమా దక్కే పరిస్థితి పోయింది. ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయాయి. ఈ–క్రాపింగ్ ఎక్కడా కనిపించడం లేదు. గతంలో మనం ఆర్బీకేల ద్వారా దళారీ వ్యవస్థ లేకుండా ప్రతి రైతుకు కనీస మద్దతు ధర వచ్చేటట్టుగా ధాన్యం కొనుగోలు చేసి.. వెంటనే పైకం చెల్లించేలా అక్కడే ‘ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్’ (ఎఫ్టీఓ) కూడా ఇచ్చి, మనం తోడుగా నిలిచాం. ఇవాళ అదే రైతులకు కనీస మద్దతు ధర రాకపోగా, అంత కంటే రూ.300 నుంచి రూ.400 వరకు తక్కువకు అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చింది. అందుకే వారికి మద్దతుగా ఆందోళన కార్యక్రమం చేశాం.షాక్ కొడుతున్న కరెంటు బిల్లులపై 27న ఆందోళనపట్టుకుంటే షాక్ కొట్టేలా ఉన్న విద్యుత్ బిల్లుల మీద ఈ నెల 27న ఆందోళనకు పిలుపునిచ్చాం. ఇప్పటి వరకు అంటే... 6 నెలల వరకు రూ.6 వేల కోట్ల బాడుదు మాత్రమే. రేపటి నెలలో మరో రూ.9 వేల కోట్ల బాదుడు ఉండబోతుంది. ఇలాంటి పరిస్థితులలో మహిళలు నిరసన తెలుపుతూ బిల్లులు కాల్చుతున్న పరిస్థితి. ఈ దఫా కరెంటు బిల్లుల పెరుగుదలకు నిరసనగా ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమాన్ని నియోజకవర్గ స్థాయిలో చేయబోతున్నాం.ఫీజులు రాని పిల్లలకు అండగా నిలుద్దాంమన ప్రభుత్వ హయాంలో ప్రతి 3 నెలలకొకసారి, త్రైమాసికం అయిన వెంటనే పిల్లల తల్లులకు డబ్బులిచ్చి వారి చదువులకు తోడుగా ఉండేవాళ్లం. ఈ రోజు పిల్లలు విద్యా దీవెన, వసతి దీవెన రాక ఇబ్బంది పడుతున్నారు. మనం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ ఏప్రిల్‌లో వెరిఫై చేసి మే నెలలో ఇచ్చే వాళ్లం. ఈ ప్రభుత్వం వచ్చాక నాలుగు త్రైమాసికాలు గడిచిపోయాయి. ఏప్రిల్‌లో వసతి దీవెన కింద డబ్బులిచ్చే వాళ్లం. ఇప్పుడు అది కూడా ఎగిరిపోయింది. మొత్తంగా ఫీజులకు సంబంధించి నాలుగు దఫాలు విద్యా దీవెన రూ.2,800 కోట్లు, వసతి దీవెన రూ.1,100 కోట్లు మొత్తం రూ.3,900 కోట్లు పిల్లలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడం వల్ల.. పిల్లలు డబ్బులు కట్టలేక చదువులు మానేస్తున్నారు. పనులకు వెళ్తున్నారు. ఈ పిల్లలకు అండగా, వారికి తోడుగా ఉండే కార్యక్రమం జిల్లా యూనిట్‌గా జనవరి 3వ తేదీన చేయబోతున్నాం.అసలైన విజన్ అంటే ఇదీచంద్రబాబు విజన్ 2047 డాక్యుమెంట్‌తో మరో డ్రామాకు తెర తీశారు. అసలైన విజన్ అంటే ఏమిటో మనం చూపించాం. గతంలో ఎప్పుడూ లేని విధంగా గవర్నమెంట్ బడులతో ప్రైవేటు బడులు పోటీ పడే పరిస్థితి కేవలం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే వచ్చింది. నాడు–నేడు మనబడి కార్యక్రమంతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారాయి. తొలిసారిగా ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్‌లోనూ ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్‌పీ)తో డిజిటల్ బోధన ప్రారంభించాం. ప్రభుత్వ బడులన్నీ ఇంగ్లిష్ మీడియం చేయడంతో పాటు, సీబీఎస్ఈతో ఆపకుండా.. ఏకంగా ఐబీ వరకు ప్రయాణానికి కూడా మన ప్రభుత్వంలోనే అడుగులు పడ్డాయి. రోజుకొక మెనూతో గోరుముద్ద మన ప్రభుత్వంలోనే అమలు చేశాం. తొలిసారిగా మనం చేసిన ఈ మార్పులతో పదో తరగతికి వచ్చే సరికి పిల్లలు ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడే పరిస్థితి తెచ్చాం. అదీ మన విజన్.ఉన్నత విద్యలో ఊహకందని మార్పుఉన్నత విద్యలో మన డిగ్రీతో ఉద్యోగాలు రాని పరిస్థితి నుంచి వాటిని మరింత మెరుగ్గా చేయడానికి ఎడెక్స్ అనే సంస్థ సహాయంతో ఆన్లైన్ వర్టికల్స్ తీసుకొచ్చాం. ఇందులో మన డిగ్రీ విద్యార్థి తనకు నచ్చిన కోర్సులు తీసుకునే విధంగా.. స్టాన్‌ఫర్డ్, హార్వర్డ్, ఎంఐటీ వంటి పెద్ద, పెద్ద విదేశీ యూనివర్సిటీలు కోర్సులు ఆఫర్ చేసేలా చేశాం. ఆ కోర్సులు ఇక్కడ తీసుకుని పరీక్షలు రాస్తే.. వాటికి ఆ యూనివర్సిటీలు సర్టిఫికెట్స్ ఇస్తాయి. ఆయా యూనివర్సిటీల నుంచి డేటా అనలైటిక్స్, అసెట్స్ మేనేజిమెంట్ వంటి కోర్సుల్లో సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి. ఇలాంటి కోర్సుల కోసం ఆలోచన చేసి వారికి విద్యాదీవెన, వసతి దీవెనతో సహా ఏర్పాటు చేయడమే విజన్.గ్రామ స్థాయిలో ప్రివెంటివ్ కేర్చదువులు, వైద్యం మనిషిని ఎప్పుడైనా అప్పుల్లోకి నెట్టేస్తాయి. వైద్యం కోసం ఏ పేదవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని, ఆరోగ్య శ్రీ పరిధిని 3,300 ప్రొసీజర్స్‌కు తీసుకుని పోయి రూ.25 లక్షల వరకు ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం అందేట్టు చేశాం. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో నాడు–నేడు పనులతో రూపురేఖలు మార్చాం. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో జీరో వేకెన్సీ పాలసీ తీసుకుని వచ్చాం. ప్రభుత్వ ఆసుపత్రిలో స్పెషలిస్టు డాక్టర్ల కొరత దేశ వ్యాప్తంగా 67 శాతం ఉంటే... మన రాష్ట్రంలో మాత్రం దాన్ని కేవలం 4 శాతానికి పరిమితం చేశాం. ప్రతి ఆసుపత్రిలో జీఎంపీ, డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలతో కూడిన మందులు ఉండేలా చేశాం. గ్రామ స్థాయిలో విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తెచ్చాం. గ్రామ స్థాయిలోనే ప్రివెంటివ్ కేర్ అంటే వివిధ రోగాలు తొలి దశలో ఉన్నప్పుడే గుర్తించి, వాటిని నివారించడానికి గొప్ప అడుగులు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే పడ్డాయి. ఇదీ విజన్.పోర్టులు, ఫిషింగ్ హార్బర్లతో ప్రగతి..ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒకేసారి రూ.13వేల కోట్లకుపైగా వ్యయంతో రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం పోర్టుల నిర్మాణాన్ని, రూ. 3,500 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని చేపట్టాం. ఇవి అందుబాటులోకి రావడం వల్ల వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున పరిశ్రమలు కూడా వస్తాయి. భారీ సంఖ్యలో యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి. తద్వారా రాష్ట్ర ప్రగతికి దోహదపడతాయి. ఇదీ విజన్. రైతును చేయి పట్టుకుని నడిపించాంరైతుకు ఇబ్బంది రాకుండా, వారిని చేయి పట్టుకుని నడిపించేందుకు ఒక అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్‌ను ఆర్బీకే కేంద్రంగా కూర్చోబెట్టడం విజన్. ప్రతి ఎకరాను ఈ–క్రాప్ చేయడమే కాకుండా.. రైతుకు తోడుగా ఉంటూ ఇన్సూ్యరెన్స్ చేసుకున్నా, లేకున్నా.. విపత్తు వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ఇన్సూ్యరెన్స్ వచ్చేట్టు ఉచిత పంటల బీమా తీసుకు రావడం విజన్. రైతుకు దళారీ వ్యవస్థ లేకుండా ఆర్బీకేల దగ్గరే కొనుగోలు చేసి.. పూర్తి గిట్టుబాటు ధర ఇచ్చేట్టు చేయడం ఒక విజన్. ఈ రకంగా వ్యవసాయ రంగంలో మార్పులు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే జరిగాయి.ఇంటి వద్దకే సేవలుమన ప్రభుత్వం రాకమనుపు ఒక రూపాయి ప్రభుత్వం ఇస్తే.. అది నేరుగా ప్రజల దగ్గరకు వెళ్లే పరిస్థితి ఉంటుందని ఎవరైనా అనుకున్నారా? అలాంటి విజన్‌ను తీసుకొచ్చిందే వైఎస్సార్సీపీ ప్రభుత్వం. గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థ.. అందులో 540 రకాల సేవలు అందుబాటులోకి తీసుకుని రావడం.. 60–70 ఇళ్లకు ఒక వలంటీర్... కులం, మతం, ప్రాంతం చూడకుండా.. లంచాలు లేకుండా ప్రతి ఇంటికి ప్రతి పథకం చేర్చగలిగే పరిస్థితి వైఎస్సార్‌సీపీప్రభుత్వంలోనే వచ్చింది. ఇదీ విజన్ అంటే. -
చంద్రబాబు ఒక్కడికే అది సాధ్యం వైఎస్ జగన్ సెటైర్లు
-
జగన్ పిలుపు ప్రభుత్వం వణుకు
-
సూపర్ సిక్స్ హామీలతో కూటమి డకౌట్
-
చంద్రబాబు మోసాలపై రైతుపోరు నేడే
సాక్షి, అమరావతి: రెండు సీజన్లు గడుస్తున్నా పెట్టుబడి సాయం రూ.20 వేలు అందక.. గిట్టుబాటు ధర దక్కక.. ఉచిత పంటల బీమా రద్దుతో ధీమా లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతన్నలకు వైఎస్సార్ సీపీ దన్నుగా నిలిచింది. అన్నదాతను దగా చేస్తున్న కూటమి సర్కారు నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఆ పిలుపునందుకున్న వైఎస్సార్సీపీ అన్ని జిల్లాల కేంద్రాల్లో శుక్రవారం రైతులతో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించనుంది. అన్నదాతల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు అందించనున్నారు.కుడి, ఎడమల దగా..కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే సూపర్ సిక్స్‌లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందుతుందని అన్నదాతలు ఆశించారు. అయితే రెండు వ్యవసాయ సీజన్లు గడిచిపోతున్నా కూటమి సర్కారు పైసా సాయం జమ చేసిన పాపాన పోలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెట్టుబడి సాయం కింద రూ10,718 కోట్లు చెల్లించాల్సి ఉండగా బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లే విదిలించిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు రూపాయి కూడా ఇవ్వలేదు. మరోవైపు పంటల బీమా ప్రీమియం బకాయిలను ఎగ్గొట్టి రైతులకు దక్కాల్సిన రూ.1,385 కోట్ల పంటల బీమా పరిహారాన్ని అందకుండా చేసింది. సున్నా వడ్డీ రాయితీ కింద రూ.131.68 కోట్ల ఊసెత్తడం లేదు. రబీలో కరువు సాయం బకాయిలు రూ.319.59 కోట్లు ఎగ్గొట్టింది. ఖరీఫ్ ధాన్యాన్ని కొనే నాధుడు లేక రైతులు అల్లాడిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్నెల్లలోనే రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడింది. గత ఐదేళ్ల పాటు వెన్నుదన్నుగా నిలిచిన వైఎస్సార్ ఉచిత పంటల బీమాను కూటమి సర్కారు రాగానే అటకెక్కించడంతో ఆ భారం భరించలేక, బ్యాంకుల చుట్టూ తిరగలేక, అవస్థలు పడలేక అన్నదాతలు పంటల బీమాకు దూరమవుతున్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ఏకంగా 70 మంది వరకు రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడగా ఏ ఒక్కరికీ ఆర్థిక సాయాన్ని అందించి ఆదుకోలేదు.రైతన్నకు బాసటగా జగన్..కూటమి ప్రభుత్వం దగా చేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతన్నలకు వైఎస్ జగన్ దన్నుగా నిలిచారు. ప్రభుత్వంపై పోరాటానికి పిలుపునిచ్చారు. ఈమేరకు వైఎస్సార్సీపీ శ్రేణులు అన్ని జిల్లా కేంద్రాల్లో రైతులతో కలసి శుక్రవారం భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించనున్నాయి. టీడీపీ కూటమి సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రభంజనంలా కదిలి వచ్చేందుకు రైతన్నలు సన్నద్ధమయ్యారు. అన్నదాతల సమస్యలను పరిష్కరించాలని పేర్కొంటూ కలెక్టర్లకు డిమాండ్ పత్రాలను అందించనున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో పేర్కొన్న ప్రకారం రైతులకు పెట్టుబడి సాయంగా తక్షణమే రూ.20 వేలు అందించాలని కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు సమర్పించనున్నారు. ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పించాల్సిందేనని.. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని.. ధాన్యంలో తేమ శాతం లెక్కలతో రైతులను ఇబ్బంది పెట్టడం మానుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నారు. తక్షణమే ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలని.. రైతులపై అదనపు భారం మోపే చర్యలను కూటమి ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేయనున్నారు.నాడు... చెప్పిన దాని కంటే మిన్నగారైతు భరోసా కింద ఏడాదికి రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలను పెట్టుబడి సాయంగా అందిస్తానని నాడు పాదయాత్రలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రాగానే ఎవరూ అడగకపోయినా సరే ఆ సాయాన్ని రూ.13,500కి పెంచడమే కాదు.. ఐదేళ్లలో ఒక్కో రైతుకు పెట్టుబడి సాయంగా రూ.67,500 అందజేశారు. చెప్పిన దాని కంటే మిన్నగా సాయం అందించి రైతు పక్షపాతినని నిరూపించుకున్నారు. ఇక రైతులపై పైసా భారం పడకుండా వైఎస్ జగన్ అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. నోటిఫై చేసిన పంటలకు సాగు చేసిన ప్రతీ ఎకరాకు యూనివర్శల్ కవరేజీ కల్పిస్తూ ఉచిత పంటల బీమాను అమలు చేశారు. దెబ్బతిన్న పంటలకు సంబంధించి బీమా పరిహారాన్ని మరుసటి ఏడాది అదే సీజన్ ముగిసేలోగా అందించి రైతులకు అండగా నిలిచారు. పంట నష్ట పరిహారమైతే ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి సంబంధించి అదే సీజన్ ముగిసేలోగానే రైతుల ఖాతాల్లో జమ చేశారు. సున్నా వడ్డీ రాయితీని ప్రతి ఏటా క్రమం తప్పకుండా జమ చేశారు. విత్తు నుంచి విక్రయం వరకు గ్రామస్థాయిలో రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు సచివాలయాలకు అనుబంధంగా నెలకొల్పిన ఆర్బీకేల ద్వారా సర్టిఫై చేసిన విత్తనాలు, నాన్ సబ్సిడీ విత్తనాలతో పాటు ఎరువులు, పురుగుల మందులను కూడా రైతుల ముంగిటికే అందించారు. లక్ష మందికి పైగా అభ్యుదయ రైతులతో ఏర్పాటు చేసిన వ్యవసాయ సలహా మండళ్ల ద్వారా సీజన్‌కు ముందుగానే పంటల ప్రణాళికలు రూపొందించి సాగులో రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించారు. రైతన్నలు పండించిన ధాన్యాన్ని మిల్లర్లు, దళారీల ప్రమేయం లేకుండా కళ్లాల నుంచే నేరుగా కొనుగోలు చేశారు. ప్రతీ గింజకు కనీస మద్దతు ధర కల్పించడమే కాకుండా గన్నీ బ్యాగ్స్, లోడింగ్, రవాణా (జీఎల్టీ) భారాన్ని సైతం భరిస్తూ ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసేలా వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారు. మార్కెట్లో ధరలు పతనమైన ప్రతీసారి మార్కెట్ ఇంటర్ వెన్షన్ స్కీమ్ కింద జోక్యం చేసుకొని మద్దతు ధరలకు ఆయా పంట ఉత్పత్తులను సేకరించి రైతన్నలకు ప్రతి అడుగులోనూ అండగా నిలిచారు. ఇలా వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా 2019–24 మధ్య ఐదేళ్లలో అన్నదాతలకు ఏకంగా రూ.1,88,541 కోట్ల మేర ప్రయోజనాన్ని వైఎస్ జగన్ చేకూర్చారు. -
Andhra Pradesh: చంద్రబాబు ప్రభుత్వం హై ఓల్టేజ్ షాక్
సాక్షి, అమరావతి: ‘ఓట్లేయ్యండి తమ్ముళ్లూ..! అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలను పెంచం.. పైగా తగ్గిస్తాం.. నేను గ్యారెంటీ..!’ అంటూ ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఐదు నెలలకే మాట తప్పి రాష్ట్ర ప్రజలకు వరుసగా విద్యుత్ షాక్‌లు ఇస్తోంది. సూపర్ సిక్స్ హామీలను తుంగలో తొక్కినట్లుగానే విద్యుత్ చార్జీలపై చేసిన వాగ్దానాన్ని మరచి ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారు. విద్యుత్తు చార్జీల మోత మోగిస్తూ హై వోల్టేజీ షాకులిస్తున్నారు. రూ.15,485.36 కోట్ల చార్జీల బాదుడుకు తెర తీశారు. విద్యుత్తు వాడకం తక్కువగా ఉండే శీతకాలంలోనే బిల్లులు ఇలా పేలిపోతుంటే ఇక తరువాత నెలల్లో ఏ స్థాయిలో షాక్‌లు ఉంటాయోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఓవైపు ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకూ గత ప్రభుత్వం ఇచ్చిన ఉచిత విద్యుత్‌ను దూరం చేసి బిల్లులతో బాదేస్తున్న కూటమి ప్రభుత్వం ఇతర వర్గాలపై పెనుభారం మోపింది.నివ్వెరపోతున్న వినియోగదారులు..ఈ నెల 2వ తేదీ నుంచి మీటర్ రీడింగ్ తీసి విద్యుత్తు సిబ్బంది ప్రజలకు అందిస్తున్నారు. వాడిన దానికి మించి విద్యుత్ బిల్లులతో షాక్‌లకు గురి చేస్తున్నారు. అదనంగా వసూలు చేస్తున్నారని గ్రహించి గగ్గోలు పెడుతున్నారు. ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో రూ.6,072.86 కోట్ల భారాన్ని గత నెల విద్యుత్ వినియోగం నుంచి వినియోగదారులపై ప్రభుత్వం వేస్తోంది. సర్దుబాటు చార్జీ ప్రతి యూనిట్‌కు సగటున రూ.1.27గా నిర్ణయించిన ఏపీఈఆర్సీ దీనిని 15 నెలల్లో వసూలు చేయాలని సూచించడంతో ప్రతి నెలా వినియోగదారులపై ఈ సర్దుబాటు భారం యూనిట్‌కు సగటున రూ.0.63 చొప్పున పడుతోంది.వచ్చే నెల నుంచి మరింత మోత..ప్రస్తుతం వసూలు చేస్తున్న రూ.6,072.86 కోట్లకే ప్రజలపై ఇంత భారీగా చార్జీల భారం పడుతుంటే వచ్చే నెల నుంచి కూటమి ప్రభుత్వం విద్యుత్ వినియోగదారుల మీద మరో పిడుగు వేయనుంది. రూ.9,412.50 కోట్ల చార్జీల వసూలుకు డిస్కమ్‌లు సిద్ధమవుతున్నాయి. డిసెంబర్ నెల వినియోగం నుంచి అంటే జనవరి మొదటి వారం నుంచి వచ్చే విద్యుత్ బిల్లుల్లో ఈ చార్జీలను ప్రభుత్వం వసూలు చేయనుంది. అసలే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు ఆకాశన్నంటుతుంటే దానికి తోడు విద్యుత్ చార్జీల బాదుడుతో సామాన్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మనుబోలులో నివసించే గడ్డం రమణారెడ్డికి నవంబరులో రూ.1,620 విద్యుత్ బిల్లు రాగా ఈ నెల ఏకంగా రూ.2,541 బిల్లు వచ్చింది. గత నెలతో పోలిస్తే 56 శాతం అదనంగా పెరిగి రూ.921 అధికంగా బిల్లు రావడంతో ఆయన లబోదిబోమంటున్నారు. నవంబర్,డిసెంబరు నెలల బిల్లులు చిత్తూరులోని కొంగారెడ్డిపల్లెలో అద్దె ఇంట్లో నివసించే రమేష్‌కు ప్రతి నెలా రూ.300 – రూ.400 మధ్య కరెంట్ బిల్లు వస్తుంది. అక్టోబర్‌లో రూ.363 వచ్చింది. నవంబర్లోనూ రూ.385కి మించలేదు. అలాంటిది ఈ నెల ఏకంగా రూ.679 రావడంతో షాక్ తిన్నాడు. వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్లలోని ప్రకాశ్‌నగర్ కాలనీలో అద్దె ఇంట్లో నివసించే కత్తి రామక్క నలుగురు సంతానం అనారోగ్యంతో బాధపడుతున్నారు. చిరు వ్యాపారంతో ఆమె కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఎస్సీలకు ఉచిత విద్యుత్తు పథకాన్ని వర్తింపచేయడంతో ఐదేళ్లుగా ఆమెకు కరెంటు బిల్లు ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం రాలేదు. కూటమి ప్రభుత్వం రాగానే కరెంటు బిల్లు కట్టాలంటూ విద్యుత్ శాఖ అధికారులు ఇంటి వద్దకు వచ్చారు. రూ.3,464 బిల్లు కట్టాలని, 2018 నుంచి బకాయిలు చెల్లించాలని హెచ్చరిస్తూ కరెంట్ కట్ చేయడంతో అంధకారంలో మగ్గిపోతోంది. విద్యుత్ ఛార్జీలు పెంచనన్నారుగా బాబు 16/08/2023: టీడీపీ విజన్ డాక్యుమెంట్– 2047 విడుదల సందర్భంగా విద్యుత్ చార్జీలు పెంచం.. వీలైతే తగ్గిస్తామని ప్రకటించిన చంద్రబాబు ⇒ మా ఇంటికి వైఎస్సార్ సీపీ హయాంలో ఉచిత విద్యుత్తు అందించారు. 200 యూనిట్ల లోపే వినియోగిస్తున్నాం. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నుంచి బిల్లు కట్టమని విద్యుత్ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ⇒ కన్నేపల్లి కుమారి (ఎస్సీ సామాజిక వర్గం), సిటిజన్ కాలనీ, గాంధీ గ్రామం, చోడవరం మండలం, అనకాపల్లి జిల్లా (02 వీఎస్సీ 803)కర్నూలులోని బుధవారపేటలో అద్దె ఇంట్లో నివసించే ప్రైవేట్ ఉద్యోగి అజయ్‌కి (సర్వీస్ నెంబర్ 8311102106824) గత నెలలో విద్యుత్ బిల్లు రూ.688 రాగా ఈ నెలలో ఏకంగా రూ.1,048 రావడంతో గుండె గుభిల్లుమంది. ఆ కుటుంబంపై ఒక్క నెలలోనే రూ.360 అదనపు ఆర్థిక భారం పడింది. ఈ నెల నుంచి పెరిగిన విద్యుత్ బిల్లుల బాదుడు స్పష్టంగా కనిపిస్తోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో 88 యూనిట్లకు రూ.348.97 బిల్లు రాగా ప్రస్తుతం 91 యూనిట్లకు రూ.463.91 బిల్లు వచ్చినట్లు కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన కె.సూర్యకాంత్ తెలిపారు. అదనంగా వాడిన మూడు యూనిట్లకు రూ.114.94 బిల్లు ఎక్కువగా రావడంతో ఆయన షాక్ తిన్నాడు. ఉచిత విద్యుత్తు ఇచ్చిన వైఎస్ జగన్వైఎస్సార్ సీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా అందించిన విద్యుత్‌ను కూడా పాత బకాయిలుగా చూపిస్తూ కూటమి సర్కారు బలవంతపు వసూళ్లకు దిగుతోంది. రూ.లక్షలు.. వేలల్లో బకాయిలు చెల్లించాలంటూ ఆదేశిస్తోంది. అంత డబ్బు కట్టలేని పేదల కరెంట్ కనెక్షన్లను విద్యుత్ సిబ్బంది నిర్దాక్షిణ్యంగా కట్ చేస్తూ మీటర్లను తొలగిస్తున్నారు. పాత బకాయిల పేరుతో విద్యుత్తు సిబ్బంది కరెంట్ మీటర్లు తొలగించి తీసుకుపోతున్నారు. బకాయిలు చెల్లిస్తేనే విద్యుత్‌ను పునరుద్ధరిస్తామని తేల్చి చెబుతుండటంతో పేదలు తీవ్ర షాక్‌కు గురవుతున్నారు. తాటాకు ఇళ్లు, రేకుల షెడ్లు, ప్రభుత్వ కాలనీల్లో నివసించే వారంతా చీకట్లోనే కాలం గడుపుతున్నారు. దాదాపు 250 కుటుంబాలు నివసించే అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం రాఘవరాజపురం హరిజనవాడలో బకాయిలు చెల్లించాలంటూ విద్యుత్‌శాఖ సిబ్బంది బిల్లులు జారీ చేయడంతో స్థానికులు ఇటీవల నిరసనగా దిగారు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ఏడాది జనవరి వరకు 15,29,017 ఎస్సీ కుటుంబాలకు ఉచిత విద్యుత్తుతో రూ.2,361.95 కోట్ల మేర లబ్ధి చేకూరగా 4,57,586 ఎస్టీ కుటుంబాలకు రూ.483.95 కోట్ల మేర ప్రయోజనం కలిగింది. మొత్తం 19,86,603 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.2,845.90 కోట్ల మేర ఉచిత విద్యుత్తు ద్వారా మేలు చేశారు.‘‘ఈ చిత్రంలో కనిపిస్తున్న బి.శివాజీ. విజయవాడలోని కానూరులో ఉంటారు. ఆయన ప్రతి నెలా దాదాపు రూ.600 విద్యుత్ బిల్లు చెల్లిస్తుండగా ఈ నెల రూ.813 బిల్లు వచ్చింది. దాదాపు 35 శాతం అదనంగా చార్జీలు పడటంతో శివాజీ గగ్గోలు పెడుతున్నాడు. ఇంత భారం మోపితే కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టంగా ఉంటుందని ఆందోళన చెందుతున్నాడు. పాలకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా అడిగేవారే లేరా? అని నిస్సహాయంగా ప్రశ్నిస్తున్నాడు.విజయవాడలోని ప్రసాదంపాడుకు చెందిన ఏ.సహిల్‌కు ఈ నెల (నవంబర్ వినియోగం)రూ.1,321 బిల్లు వచ్చింది. గత నెల ఇదే సర్వీసుకు ఆయన చెల్లించిన బిల్లు రూ.861 మాత్రమే. అంటే ఈ నెల బిల్లులో ఏకంగా 53 శాతం అదనంగా భారం పడింది. -
ప్రజల గొంతుకగా ప్రశ్నిద్దాం: వైఎస్ జగన్
కేవలం ఆరు నెలల్లోనే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పనితీరుపై ప్రజలు కోపంతో రగిలిపోతున్నారు. ఓ వైపు ఎక్కడ చూసినా అక్రమాలు, కమీషన్లు, మామూళ్ల గోల. పరిశ్రమ నడుపుకోవాలన్నా, వ్యాపారాలు చేయాలన్నా కప్పం కట్టాల్సిందే. వేలం పాటలుపెట్టి ఊరూరా బెల్ట్ షాపులు కేటాయిస్తున్నారు. అన్నింటికీ నీకింత.. నాకింత అని పంచుకుంటున్నారు. ఎమ్మెల్యే మొదలు సీఎం వరకు వాటాలు. ఇంకో వైపు సంక్షేమ పథకాలన్నీ పడకేశాయి. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. ఆరోగ్యశ్రీ నిర్వీర్యమైపోతోంది. భరోసా ఇచ్చే వారు లేక అన్నదాతలు విలవిల్లాడిపోతున్నారు. విద్యుత్ చార్జీల షాక్‌లతో ప్రజలకు దిక్కుతోచడం లేదు. ఈ పరిస్థితిలో బాధిత వర్గ ప్రజల తరఫున నిలబడాల్సింది మనమే. వారి గొంతుకగా నిలిచి ఈ దుర్మార్గ ప్రభుత్వంపై పోరాడుదాం.– పార్టీ శ్రేణులతో వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: రాష్ట్రంలో సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీలను తుంగలో తొక్కి.. అన్ని వర్గాలనూ దగా చేస్తున్న చంద్రబాబునాయుడి ప్రభుత్వంపై ఆరు నెలల్లోనే ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత పెల్లుబుకుతోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. కనీస మద్దతు ధర దక్కక రైతులు.. ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థులు.. కరెంటు ఛార్జీల బాదుడుతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ మోసాలు, అక్రమాలు, వైఫల్యాలపై ప్రశ్నించే స్వరం వినిపించకూడదనే దురాలోచనలతో అక్రమ కేసులు పెడుతూ అరాచక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. సమస్యల్లో ఉన్న ప్రజలకు అండగా నిలబడి, వారి తరఫున కూటమి ప్రభుత్వంపై పోరాటం చేయాలని ఆ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించి.. ప్రజల పక్షాన కూటమి ప్రభుత్వంపై పోరాటం చేయడానికి కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేశారు. పార్టీని మరింతగా బలోపేతం చేయడంలో భాగంగా చేపట్టాల్సిన చర్యలపై నేతలకు మార్గ నిర్దేశం చేశారు. ‘చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైంది. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఎప్పూడూ చూడని విధంగా విపరీతమైన వ్యతిరేకత కనిపిస్తోంది. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ఇంతటి వ్యతిరేకత ఎక్కడా చూడలేదు. ఎన్నికలప్పుడు చెప్పిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ వాగ్దానాలు గాలికెగిరిపోయాయి. వాటిని పక్కన పెట్టి మిగిలినవి చూస్తే.. చెప్పిన అబద్ధాలు, చేసిన మోసాలు ప్రజల్లో కోపం కింద మారి ఎక్కడికక్కడ వారు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. మరోవైపు రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నీరు గారిపోయాయి. నానాటికీ వ్యవస్థలన్నీ దిగజారిపోతున్నాయి’ అని చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ప్రజల సమస్యలపై పోరాటం చేయాలని నేతలకు దిశానిర్దేశం చేస్తున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ అందడం లేదు ⇒ ఫీజు రీయింబర్స్మెంట్ చూస్తే.. మన ప్రభుత్వ హయాంలో ప్రతి క్వార్టర్ (మూడు నెలలు) అయిపోయిన వెంటనే అంటే.. జనవరి, ఫిబ్రవరి, మార్చి ముగిసిన వెంటనే ఏప్రిల్‌లో వెరిఫికేషన్ చేసి మే నెలలో విడుదల చేసే వాళ్లం. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్‌లో ఇవ్వాల్సిన ఆ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు సరి కదా.. ఏకంగా మూడు త్రైమాసికాల సొమ్ము పెండింగ్‌లో పెట్టారు. ⇒ ఈ డిసెంబర్ గడిస్తే నాలుగు క్వార్టర్లు ఇవ్వని పరిస్థితి. జనవరి వస్తే ఏకంగా రూ.2,800 కోట్లు విద్యా దీవెన బకాయిలు పిల్లలకు ఇవ్వాల్సి ఉంటుంది. వసతి దీవెనకు సంబంధించి రూ.1,100 కోట్లు పెండింగ్ ఉంది. మొత్తంగా రూ.3,900 కోట్లు పెండింగ్ పెట్టారు. మరో వైపు ఫీజులు కడితే తప్ప కాలేజీలకు రావొద్దని పిల్లలకు యాజమాన్యాలు చెబుతున్నాయి. దీంతో పిల్లలు చదువులు మానేసి పనులకు వెళ్తున్నారు.ఆరోగ్యశ్రీకి అనారోగ్యం ఆరోగ్య శ్రీ బకాయిలు కూడా అలాగే ఉన్నాయి. మార్చి నుంచి ఇంత వరకు నెట్వర్క్ ఆస్పత్రులకు సంబంధించిన బకాయిలు ఇవ్వలేదు. మార్చి నుంచి నవంబరు వరకు దాదాపు 9 నెలలకు సుమారు రూ.2,400 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. నెట్వర్క్ ఆస్పత్రులు గొడవ చేస్తే ఏదో రూ.200 కోట్లు ఇచ్చారు. పేషంట్లు ఆస్పత్రులకు వెళ్తే ఉచితంగా వైద్యం అందే పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీ పూర్తిగా నీరుగారిపోతోంది. ఇంకా 108, 104 ఉద్యోగులకు సంబంధించి నాలుగు నెలల జీతాలు పెండింగ్. వాళ్లు సర్వీసు అందించే పరిస్థితి లేదు. ధాన్యం సేకరణ.. మద్దతు ధర లేదు ⇒ ఏ జిల్లాలో కూడా రైతులకు ధాన్యం సేకరణలో కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ) లభించడం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ–క్రాప్ చేసి, ఆర్బీకేల ఆధ్వర్యంలో కొనుగోలు చేసే వాళ్లం. ప్రతి రైతుకూ కనీస మద్దతు ధర వచ్చేది. ఇదొక్కటే కాకుండా జీఎల్టీ (గన్నీ బ్యాగ్స్, లేబర్, ట్రాన్స్పోర్ట్) ఛార్జీలు కూడా చెల్లించే వాళ్లం. జీఎల్టీ కింద ప్రతి రైతుకు, ప్రతి ఎకరాకు అదనంగా రూ.10 వేలు వచ్చే పరిస్థితి ఉండేది.⇒ ఇవాళ రైతులకు కనీస మద్దతు ధర కూడా అందడం లేదు. 75 కేజీల బస్తా కనీస మద్దతు ధర రూ.1,725 అయితే ఆ ధర ఎక్కడా ఇవ్వడం లేదు. కావాలనే ధాన్యం కొనుగోలు చేసే కార్యక్రమం నిలిపివేశారు. గత్యంతరం లేక రైతులు దళారులు, రైస్ మిల్లర్లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్లు రైతుల నుంచి రూ.300 నుంచి రూ.400 తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. ధాన్యం సేకరణ చాలా అన్యాయమైన పరిస్థితుల్లో జరుగుతోంది. మరోవైపు వర్షాలతో రైతులు పూర్తిగా దెబ్బతిని కుదేలవుతున్నారు. ధాన్యం రంగు మారుతోంది. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు ⇒ కరెంటుకు సంబంధించి ఇప్పటికే రూ.6 వేల కోట్ల బాదుడు మొదలైంది. మరో రూ.9 వేల కోట్ల బాదుడు వచ్చే నెల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ స్థాయిలో రూ.15 వేల కోట్ల బాదుడు కార్యక్రమాన్ని భారతదేశ చరిత్రలో చంద్రబాబు తప్ప మరెవ్వరూ చేసి ఉండరు. ఆరు నెలల్లోనే ఎవరూ రోడ్డు మీదకు రాకూడని, ఎవరూ నిరసన వ్యక్తం చేయకూడదని తప్పుడు కేసులు పెడుతున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలు, ఎమ్మెల్యే అభ్యర్థుల మీద కూడా తప్పుడు కేసులు పెడుతున్నారు. ⇒ కేసులు మ్యానుఫ్యాక్చర్ చేసి, ఎవిడెన్సెస్ మ్యానుఫ్యాక్చర్ చేసి ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఎప్పుడూ జరగలేదు. రాష్ట్రమంతా భయాందోళన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఆయన చేస్తున్న బాదుడు కార్యక్రమాన్ని నిరసిస్తూ ఎవరూ రోడ్డు మీదకు రాకూడదని ఇలా చేస్తున్నారు. ఎవరైనా ఆందోళన చేయాలనుకుంటే కేసులు పెడతారేమోనని భయపడే పరిస్థితులు కల్పిస్తూ పోలీసులను ఉపయోగించుకున్నారు. అవినీతి విచ్చలవిడిగా సాగుతోంది. రెడ్‌బుక్ రాజ్యాంగం యథేచ్ఛగా నడుస్తోంది.ఇసుక, మద్యం మాఫియా ⇒ అధికారంలోకి వస్తే ఇసుక ఉచితంగా ఇస్తామన్నారు. కానీ, దాన్ని అమలు చేయడం లేదు. ఇప్పుడు ప్రభుత్వానికి పైసా ఆదాయం రాకపోగా, మన ప్రభుత్వం కంటే డబుల్ రేట్లకు ఇసుక అమ్ముతున్నారు. నీకింత.. నాకింత అని.. చంద్రబాబు, లోకేష్ మొదలు ఎమ్మెల్యేల వరకు పంచుకుంటున్నారు. గతంలో ప్రభుత్వం నడిపిన మద్యం షాపులను పూర్తిగా ఎత్తివేశారు. మొత్తం షాపులన్నింటినీ చంద్రబాబు, ఆయన మనుషులు చేతిలోకి తీసుకున్నారు. దాని కోసం కిడ్నాప్లతో పాటు, పోలీసుల ద్వారా బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. లాటరీలో ఎవరికైనా షాపులు వస్తే వారి దగ్గర నుంచి బలవంతంగా రాయించుకున్నారు. పైగా గ్రామంలో వీళ్లే వేలం పాటలు పెట్టి బెల్ట్‌షాప్‌లు కేటాస్తున్నారు. ⇒ ఈ రోజు బెల్ట్‌షాప్‌లు లేని వీధి, గ్రామం లేదు. ఒక్కో బెల్ట్‌షాప్‌కు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వేలం పాట పెడుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. ఏ నియోజకవర్గంలో పరిశ్రమ నడుపుకోవాలన్నా, మైనింగ్ యాక్టివిటీ జరగాలన్నా, ఏది కావాలన్నా ఎమ్మెల్యేకు ఇంత.. కడితే తప్ప జరిగే పరిస్థితి లేదు. ప్రతి దానికీ కమీషన్లు ఇచ్చుకోవాల్సిందే. మాఫియా సామ్రాజ్యాన్ని నడుపుతున్నారు. ఎమ్మెల్యేలకు ఇంత, చంద్రబాబుకు ఇంత అని చెల్లించుకోవాల్సిందే. రౌడీ మామూళ్ల కోసం కూడా గొడవలు జరుగుతున్నాయి. నెల్లూరులో ఏకంగా క్వార్ట్జ్ గనులు కొట్టేయడానికి పక్కా ప్లాన్ చేశారు. ప్రజల పక్షాన నిలబడదాం.. వారి గొంతుక వినిపిద్దాం ⇒ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో కోపం ఈరోజు తీవ్ర స్ధాయిలో కనిపిస్తోంది. మనం కూడా ప్రజల తరఫున గళం విప్పాల్సిన సమయం వచ్చింది. అనుకున్న దానికంటే ముందుగానే ఆ సమయం వచ్చింది. మామూలుగా ఏడాది వరకు వేచి చూసే పరిస్థితి నుంచి.. ఆరు నెలలకే అలాంటి పరిస్థితి తలెత్తింది.⇒ కరెంటు ఛార్జీల పెంపు, ధాన్యం సేకరణలో దళారీల రాజ్యం, మద్దతు ధర దక్కక పోవడం, ఫీజు రీయింబర్స్మెంట్ అంశాలు ప్రజలను ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాయి. మీ మీ నియోజకవర్గాల్లో జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే అభ్యర్థులు, సమన్వయకర్తలతో కలిసి వారిని ఇన్వాల్వ్ చేస్తూ, కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకు అవసరం అయినప్పుడు మనం వారి తరఫున నిలబడాలి. వారి పక్షాన పోరాడాలి. అటువైపు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నప్పుడు మనం వారికి దగ్గరగా ఉంటూ వారి తరఫున పోరాటం చేయాలి. వారి తరఫున నిలబడాలి. ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి ఇది కచ్చితంగా చేయాలి.సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటనసంక్రాంతి తర్వాత నా జిల్లాల పర్యటన కార్యక్రమం మొదలవుతుంది. ప్రతి బుధ, గురువారాల్లో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశం అవుతాను. ‘జగనన్న.. పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం’ పేరుతో నేను పర్యటిస్తాను. నా పర్యటన వచ్చేసరికి మీరు జిల్లా, నియోజకవర్గ, మండల కమిటీల నియామకాలు పూర్తి చేయాలి. ప్రతి కార్యకర్తకు ఫేస్ బుక్, ఎక్స్ (ట్విట్టర్), యూట్యూబ్ అకౌంట్ ఉండాలి. జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి కార్యకర్త ప్రశ్నించాలి. అప్పుడే గ్రామ స్థాయిలో తెలుస్తుంది. మా ఆస్పత్రులు ఎందుకు ఇలా ఉన్నాయి? మా స్కూళ్లు ఎందుకు ఇలా ఉన్నాయి? మా ధాన్యాన్ని ఎందుకు కనీస మద్ధతు ధరకు అమ్ముకోలేకపోతున్నాం.. అని ప్రశ్నించాలి. రాబోయే రెండున్నరేళ్లు మనం, మన పార్టీని మరింత బలోపేతం చేయాలి. ఆప్పుడే మనం చేయబోయే పోరాటాలకు మద్దతు బలంగా ఉంటుంది. ఇదంతా పక్కాగా జరగాలంటే జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న పార్టీ కమిటీల నియామకాలను త్వరితగతిన పూర్తి చేయాలి.మూడు ప్రధాన అంశాలపై కార్యాచరణప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి ముఖ్యంగా మూడు ప్రధానమైన అంశాలు.. రైతుల ఇబ్బందులు, కరెంటు ఛార్జీల బాదుడే బాదుడు, ఫీజులు కట్టలేని పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల మీద వైఎస్సార్సీపీ ఉద్యమ బాట పట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.ఈ నెల 11న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టర్ల కార్యాలయాల వద్ద రైతులకు సంబంధించి ధాన్యం సేకరణలో జరుగుతున్న అన్యాయంపై నిలదీయాలి. ధాన్యం సేకరణలో వారికి కనీస మద్ధతు ధర కల్పించాలని డిమాండ్ చేయాలి. పెట్టుబడి సాయం కింద ఇస్తామన్న రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయాలి. ఇప్పటి వరకు రైతులకు అందుతున్న ఉచిత పంటల బీమాను వర్తింప చేయాలని కూడా డిమాండ్ చేయాలి. రైతులతో కలిసి ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్లకు వినతిపత్రం ఇవ్వాలి.చంద్రబాబు ప్రభుత్వ కరెంటు ఛార్జీల బాదుడే బాదుడు కార్యక్రమానికి నిరసనగా డిసెంబర్ 27న ఆందోళన చేపట్టాలి. ఎన్నికలప్పుడు తాను కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని ఇచ్చిన హామీని విస్మరించిన నేపథ్యంలో పెంచిన కరెంటు ఛార్జీలు, జనవరిలో పెంచబోయే కరెంటు ఛార్జీలు కూడా తగ్గించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే రూ.6 వేల కోట్ల బాదుడుతో పాటు, రానున్న నెలలో మరో రూ.9 వేల కోట్ల ఛార్జీల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లాల్లో ఎస్ఈ, సీఎండీ కార్యాలయాల వద్ద ప్రజల తరపున నిరసన తెలపాలి. ప్రజలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి.. పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించమని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వినతి పత్రం అందజేయాలి.జనవరి 3న అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల వద్ద ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆందోళన చేపట్టబోతున్నాం. పిల్లలకు అందించాల్సిన పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన.. మొత్తంగా దాదాపు రూ.3,900 కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేయాలి. ఇప్పటి వరకు ఏడాదిగా అంటే నాలుగు త్రైమాసికాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఫీజులు చెల్లించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. చదువుకుంటున్న పిల్లలకు తోడుగా నిలబడే కార్యక్రమంలో భాగంగా పిల్లలతో కలిసి కలెక్టర్ల కార్యాలయాలకు వెళ్లి, వినతిపత్రాలు సమర్పించి, డిమాండ్ చేయాలి.ఈ మూడు సమస్యలతో పాటు సూపర్ సిక్స్ హామీల అమలుకు డిమాండ్ చేద్దాం. -
రూ.70వేల కోట్ల అప్పు ఏం చేశారు ?: బొత్స సత్యనారాయణ
సాక్షి,విశాఖపట్నం:కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలయిందని, ఎన్నికల్లో హామీలేవీ నెరవేర్చలేదని మండలి ప్రతిపక్షనేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు,గుడివాడ అమర్నాథ్,మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీతో కలిసి విశాఖపట్నంలో బొత్స సోమవారం(డిసెంబర్2) మీడియాతో మాట్లాడారు.‘ఎన్నికల హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికుంది. ఎన్నికల హామీలకు బడ్జెట్లో కేటాయించిన నిధులకు పొంతన లేదు.హామీలు నెరవేర్చకపోగా ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపారు.యూనిట్‌కు 1రూపాయి20పైసలు పెంచారు.ప్రజలపై మొత్తం రూ.15 వేల కోట్ల భారం మోపారు. అప్పుల భారం పెంచుతున్నారని వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారు.మరి కూటమి ప్రభుత్వం అప్పులెందుకు చేస్తోంది. ఆరు నెలల్లో చేసిన రూ.70 వేల కోట్ల అప్పు ఎక్కడికి పోయిందో చెప్పాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలి’అని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. బొత్స ఇంకా ఏమన్నారంటే..ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిది.ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు బడ్జెట్ లో చోటు లేదు.హామీలకు బడ్జెట్ లెక్కలకు పొంతన లేదు.ఎన్నికలకు ముందు కూటమి నేతలు నిత్యావసర వస్తులు పెంచమని చెప్పారు.చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ధరలు పెంచమని పదే పదే చెప్పారు.యూనిట్ విద్యుత్ ధర 1.20 రూపాయలు పెరిగింది.రూ. 15 వేల కోట్ల విద్యుత్ బారాన్ని ప్రజలపై ఈ ప్రభుత్వం మోపుతుంది.విద్యుత్ చార్జీలు పెంచడం ఎంతవరకు సమంజసంఅన్ని పరిణామాలు ఆలోచించే కదా ఎన్నికల్లో చంద్రబాబు విద్యుత్ చార్జీలు పెంచమని చెప్పారు.రూ. 15 వేల కోట్ల బారాన్ని ప్రభుత్వమే భరించాలిప్రభుత్వమే డిస్కంలకు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాంరూ 67 వేల 237 కోట్లు అప్పు చేసింది కూటమి ప్రభుత్వంఈ మంగళవారం మళ్ళీ రూ. 4 వేల కోట్లు అప్పు చేయబోతున్నారు.మొత్తం అప్పు రూ. 70 వేల కోట్లకు చేరుతుంది.గతంలో మా ప్రభుత్వం డిస్కంలకు డబ్బులు చెల్లించాం.పెన్షన్ తప్ప ఒక్క పథకం కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉంటే ఈ ఆరు నెలల్లో రూ.18 వేల కోట్ల పేద ప్రజల ఖాతల్లో వేసేవాళ్ళం.గత సంవత్సరం ఇదే సమయానికి అమ్మఒడి,వసతి దీవెన,విద్యా దీవెన,రైతు భరోసా,సున్నా వడ్డీ,మత్స్యకార భరోసా,ఈబీసీ నేస్తం నిధులు ప్రజలకు ఇచ్చాంఈరోజుకి గత సంవత్సరంలో రూ. 18 వేల 200 కోట్లు ఇచ్చాంప్రజలకు పథకాలు ఇవ్వడం ఈ ప్రభుత్వం ప్రయారిటీ కాదుపేద ప్రజలకు పథకాలు ఎప్పటి నుంచి ఇస్తారురూ. 67 వేల కోట్లు అప్పు తెచ్చి దేనికి ఖర్చు చేశారుప్రజల తరఫున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాంపథకాలు ఇవ్వడం లేదు సరి కదా విద్యుత్ చార్జీల మోత మోగించి ప్రజల నడ్డి విరుస్తున్నారుమా ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పులు చేశామని గగ్గోలు పెట్టారు.. ఇప్పుడు అప్పులు చేసి మీరేం చేస్తున్నారుమీ సోకులకు వాడుకుంటున్నారా..?గతంలో కూడా చంద్రబాబు అప్పులు చేసి వెళ్తే మేం కూడా ఆ అప్పులు చెల్లించాంప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోయిందిగతంలో పథకాలు అందడం వలన మార్కెట్ మంచిగా ఉండేదిజీఎస్టీ తగ్గిపోతోంది..చాలా ఆందోళనగా ఉంది..వ్యాపారాలు ఏమి జరగడం లేదువాటాల కోసం ఎమ్మెల్యేలు తన్నుకుంటున్నారుదానికి సీఎం చంద్రబాబు పంచాయితీ ఏమిటిప్రభుత్వం అంటే భయం, భక్తి ఉండాలి.. ఏది లేకపోతే ఎలా..?నూతన మద్యం పాలసీ వచ్చాక బెల్టు షాపులు ఎక్కువయ్యాయిబెల్టు షాపులకు బహిరంగ వేలం వేస్తున్నారుమా సమీప గ్రామంలో బెల్టు షాపు రూ. 50 లక్షలకు వేలం వేశారుఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా..?ఈనాడు, జ్యోతి కథనాలనే నేను చెప్తున్నానుపవన్ కాకినాడ పర్యటన..గబ్బర్ సింగ్-3పవన్ కాకినాడ పర్యటన.. గబ్బర్ సింగ్..3ని తలపించిందిపీడీఎస్ బియ్యం అక్రమ రవాణా తప్పే.. చర్యలు తీసుకోండిఎమ్మెల్యేని కాంప్రమైస్ అయ్యావా..? అని పవన్ అడుగుతున్నారుపక్కన ఉన్న మీ మంత్రి మాటేంటి..?ఆయన చేతకాని వాడా..?పోర్టులో అక్రమాలు జరిగితే చర్యలు తీసుకోండిరెడ్డి, చౌదరి ఎవ్వరైనా తప్పు చేస్తే ఒకేలా స్పందించాలిబియ్యం అక్రమ రవాణాపై బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లి అనుమతులు ఇప్పించారునిజమా కాదా..? గుండెల మీద చెయ్యి వేసుకొని ఆలోచించుకోండి.. -
బాధ్యత మరచి ఎదురుదాడా!
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఆర్నెల్లు గడుస్తున్నా తన వైఫల్యాలను, తప్పిదాలను ఒప్పుకోకుండా వైఎస్సార్ సీపీపై బురద చల్లేందుకు ఆపసోపాలు పడటం సిగ్గుచేటనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా ప్రజలపై రూ.15 వేల కోట్లకుపైగా విద్యుత్తు చార్జీల భారాన్ని మోపడం.. మరోవైపు నిత్యం జగన్ జపం చేస్తూ ఎల్లో మీడియాలో బురద కథనాలకే పరిమితమైందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇసుక నుంచి మద్యం వరకు.. కాకినాడలో పీడీఎస్ బియ్యం నుంచి ధాన్యం రైతులను తుపాన్‌కు వదిలేయడం దాకా అడుగడుగునా కూటమి సర్కారు వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని గుర్తు చేస్తున్నారు.ఇసుకలో లూటీ చేసేదీ వారే..! బెల్టు షాపులకు అనుమతి ఇచ్చేదీ వారే..! బియ్యాన్ని ఎగుమతి చేసేది వారే.. మళ్లీ స్మగ్లింగ్ జరుగుతోందంటూ హడావుడి చేసేదీ వారేనని పేర్కొంటున్నారు. అసలు కాకినాడ పోర్టుకు రేషన్ బియ్యం ఎందుకు వస్తోంది? పీడీఎస్ బియ్యం వస్తుంటే గత ఆర్నెల్లుగా ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? ఎవరు పంపుతున్నట్లు? కూటమి పార్టీల ప్రజాప్రతినిధులే దోపిడీ చేసి అమ్ముకుంటున్నారు కదా? తన పార్టీకి చెందిన మంత్రి పౌరసరఫరాల శాఖను పర్యవేక్షిస్తుంటే డిప్యూటీ సీఎం వచ్చి హడావుడి చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. స్థానిక ఎంపీ కూడా అదే పార్టీకి చెందిన వారని ప్రస్తావిస్తున్నారు. సీఎంఆర్ బియ్యం బకాయిల విడుదలలో కమీషన్ల పర్వం వెలుగులోకి రావడంతో దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించడం.. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, గత సర్కారుపై బురద చల్లడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోందంటున్నారు. ఊరూరా బెల్ట్ షాపులు తెరిచి.. బెల్ట్ తీస్తామంటారా?మద్యం దుకాణాలను లాటరీ పేరుతో కూటమి శ్రేణులకు కట్టబెట్టిన ప్రభుత్వ పెద్దలు.. టీడీపీ కార్యకర్తలకు లబ్ధి చేకూర్చడం కోసం ఊరూరా బెల్ట్ షాపులను తెరిపించారు. సీఐ, ఎస్ఐలను పంపి ఇతరులకు మద్యం దుకాణాలు దక్కకుండా బెదిరింపులకు పాల్పడ్డారు. ఊరూరా ఒక్కో బెల్ట్ షాపును వేలం వేసి వచ్చిన డబ్బులను టీడీపీ కార్యకర్తలకు పంచిపెట్టారు. రూ.2 లక్షల నుంచి మూడు లక్షల దాకా వసూలు చేస్తూ నీకింత.. నాకింత! అని వాటాల దందా నడిపిస్తున్నారు. బెల్ట్ షాపులతో వాడవాడలా మద్యం ఏరులై పారుతోంది. ఈ అక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు.. బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తానంటూ సీఎం చంద్రబాబు బీరాలు పలుకుతుండటంపై ఎక్సైజ్‌శాఖ వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. స్వయంగా హోంమంత్రి అనిత ఇలాకాలో కూడా బెల్టు షాపుల దందా తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.కాకినాడ కేంద్రంగా బియ్యం డ్రామా!ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం పంపిణీ కోసం సేకరించిన వరి ధాన్యాన్ని మర ఆడించేందుకు పౌరసరఫరాల శాఖ మిల్లర్లకు అప్పగిస్తుంది. మిల్లర్లు మర ఆడించి సీఎంఆర్ కింద బియ్యాన్ని తిరిగి అప్పగిస్తారు. దీనికి సంబంధించి సుమారు రూ.1,600 కోట్ల వరకు మిల్లర్లకు ప్రభుత్వం చెల్లించాలి. ఆ బిల్లుల చెల్లింపులో భారీ ఎత్తున కమీషన్లు చేతులు మారాయని రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కాకినాడ కేంద్రంగా సరి కొత్త డ్రామాకు తెర తీశారు.స్మగ్లింగ్‌కు కాకినాడ పోర్టు అడ్డాగా మారిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించడం విస్మయానికి గురి చేస్తోంది. కాకినాడ యాంకరేజ్ పోర్టు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోనే ఉంటుంది. బియ్యం ఎగుమతి.. ఎరువుల దిగుమతి అంతా యాంకరేజ్ పోర్టు మీదుగానే సాగుతుంది. కాకినాడ యాంకరేజ్ పోర్టుకు.. కాకినాడ పోర్టుకు ఎలాంటి సంబంధం ఉండదు. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న యాంకరేజ్ పోర్టు ద్వారా బియ్యం అక్రమ రవాణా ఎలా సాధ్యమవుతుందని అధికార వర్గాలే ప్రశ్నిస్తున్నాయి. పారదర్శక వ్యవస్థను తొలగించి ఇంటికే పౌరసేవలా?ప్రభుత్వ సేవలు, పథకాలను పారదర్శకంగా ఇంటి గుమ్మం వద్దే ప్రజలకు అందించే లక్ష్యంతో వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా దేశంలోనే ఎక్కడా లేనివిధంగా గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టింది. తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల గౌరవ వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నమ్మబలికారు. తీరా అధికారంలోకి వచ్చాక 2.60 లక్షల మంది వలంటీర్లను తొలగించి దారుణంగా వంచించారు. వలంటీర్ వ్యవస్థను రద్దు చేసిన సీఎం చంద్రబాబు తాజాగా ఇంటి గుమ్మం వద్దకే పౌర సేవలు అందిస్తానని చెప్పడంపై విస్తుపోతున్నారు. వలంటీర్లు లేకపోవడంతో టీడీపీ నేతలు లబ్ధిదారులను పెన్షన్ల కోసం ఇళ్ల వద్దకు రప్పించి చుట్టూ తిప్పుకుంటున్నారు. సచివాలయాల వద్ద ప్రజలు పడిగాపులు కాస్తున్న ఫోటోలు మీడియాలోనూ వచ్చాయి. మరోవైపు కూటమి సర్కారు దాదాపు లక్షన్నర పెన్షన్లను కుదించింది. ఇక పౌరసేవలు, పథకాలను ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.విద్యుత్ చార్జీలు తగ్గిస్తామంటూ బాదుడే బాదుడు..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ చారీలను ఏమాత్రం పెంచబోమని.. వాటిని తగ్గిస్తామని ఎన్నికల్లో చంద్రబాబు ఊరూవాడా ప్రచారం చేశారు. అయితే హామీని నిలబెట్టుకోకుండా అధికారంలోకి వచ్చాక ఇప్పటికే రూ.15,485.36 కోట్ల భారాన్ని విద్యుత్ చార్జీల రూపంలో ప్రజలపై మోపారు. విద్యుత్ చార్జీల మంటతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. దాంతో ఆ నెపాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నెడుతూ సీఎం చంద్రబాబు బురద చల్లుతున్నారు.ధాన్యం రైతుకు దగా..ధాన్యం రైతులకు మద్దతు ధర కల్పించి ఆదుకోవడంలో కూటమి సర్కారు దారుణంగా విఫలమైంది. ఎమ్మెస్పీ దక్కకపోవడంతో అన్నదాతకు బస్తాకు రూ.300 – రూ.400 వరకు నష్టం వాటిల్లింది. దళారులకు అయినకాడికి అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పుడు తుపాన్ కారణంగా అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. నాలుగు రోజులు ముందే తుపాన్ హెచ్చరికలున్నా సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షించి ముందస్తు జాగ్రత్తలు చేపట్టలేదు. ప్రభుత్వం పంటను కొనుగోలు చేయకుండా చోద్యం చూసింది. గోనె సంచులు సమకూర్చలేదు. పంట చేతికందే సమయంలో వర్షాలకు ధాన్యం తడిచిపోవడంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది.అప్పులపై అవే అబద్ధాలు..వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని.. రూ.పది లక్షల కోట్లు.. రూ.12 లక్షల కోట్లు.. రూ.14 లక్షల కోట్లు అప్పు చేసిందని ఎన్నికలకు ముందు చంద్రబాబు, కూటమి నేతలు, ఎల్లో మీడియా ప్రచారం చేసింది. ఎన్నికల్లో సూపర్ సిక్స్‌తోపాటు వందల హామీలను ప్రజలకు చంద్రబాబు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్తోసహా ఎన్నికల హామీల అమలు నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి అప్పులతోపాటు రోజుకో డ్రామాకు తెర తీస్తున్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2024–25 బడ్జెట్ సాక్షిగా రాష్ట్ర అప్పు రూ.6.46 లక్షల కోట్లేనని కూటమి ప్రభుత్వమే అంగీకరించింది. అయినా సరే రాష్ట్రం అప్పు రూ.పది లక్షల కోట్లు కంటే ఎక్కువ ఉందంటూ సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలను వల్లె వేస్తూ.. ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా ఉండటం వల్లే హామీలను అమలు చేయలేకపోతున్నానని సమర్థించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.పోలవరానికి ద్రోహం..వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ఎత్తును 41.15 మీటర్లకే తగ్గిస్తున్నారంటూ చంద్రబాబు, టీడీపీ నేతలు దుష్ఫ్రచారం చేశారు. అయితే ఇప్పటికే స్పిల్ వేను 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా నిర్మించామని.. పోలవరం ప్రధాన డ్యామ్‌ను కూడా అదే రీతిలో నిర్మిస్తామని.. కావాలంటే టేపు తీసుకుని వచ్చి కొలుచుకోవాలని నాడు సీఎంగా ఉన్న వైఎస్ జగన్ సవాల్ విసరడంతో తోక ముడిచారు. పోలవరంలో నీటిని నిల్వ చేసే ఎత్తును 45.72 మీటర్ల నుంచి ఒక్క అంగుళం కూడా తగ్గించబోమని అప్పటి కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సైతం పార్లమెంట్ ఉభయ సభల్లో అనేక మార్లు స్పష్టం చేశారు.కానీ.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఏడాది ఆగస్టు 28న పోలవరంలో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వను పరిమితం చేస్తూ కేంద్ర కేబినెట్ తీర్మానం చేయడం గమనార్హం. దీనిపై ఆ సమావేశంలో పాల్గొన్న టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి కె.రామ్మోహన్నాయుడు నోరు మెదపలేదు. పోలవరానికి కూటమి ప్రభుత్వం తలపెట్టిన ద్రోహానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన దుష్ఫ్రచారాన్నే సీఎం చంద్రబాబు, మంత్రి నిమ్మల ఇప్పుడూ చేస్తుండటం గమనార్హం.ఇసుకపై ఇష్టారాజ్యంగా.. ఇసుక ఉచితంగా ఇస్తామంటూ ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీలిచ్చారు. వర్షాకాలంలో అవసరాల కోసం గత సర్కారు స్టాక్ పాయింట్లలో నిల్వ చేసిన 80 లక్షల టన్నుల ఇసుకలో 40 లక్షల టన్నులను అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే టీడీపీ నేతలు తెగనమ్మి సొమ్ము చేసుకున్నారు. అందరూ దసరా పండుగ సందడిలో ఉన్న సమయంలో కేవలం రెండు రోజులే గడువు ఇచ్చి ఇసుక రీచ్‌లకు టెండర్లు నిర్వహించారు. ఇసుక రీచ్‌లన్నీ టీడీపీ నేతలకే కట్టబెట్టారు. ఇసుక ధరలను పచ్చ ముఠాలు ఇష్టారాజ్యంగా వసూలు చేయడంపై వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహాన్ని తప్పించుకునేందుకు సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరతీశారు. -
పోస్టాఫీసులకు పోటెత్తుతున్న మహిళలు
అనంతపురం సిటీ: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రధాన పోస్టాఫీసులన్నీ వేలాదిగా తరలివస్తున్న మహిళలతో కిటకిటలాడుతున్నాయి. 18 ఏళ్లు పైబడిన మహిళలందరి వ్యక్తిగత ఖాతాల్లో సీఎం చంద్రబాబు రూ.1,500 జమ చేస్తారన్న విస్తృత ప్రచారంతో మహిళలంతా పోస్టాఫీసులకు పరుగులు పెడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో అనంతపురం, హిందూపురంలో హెడ్ పోస్టాఫీసులు ఉన్నాయి. ఇక్కడ ప్రతిరోజూ మహిళలు ఐపీపీబీ ఖాతాల కోసం చలిని సైతం లెక్కచేయకుండా ఉదయం 5 గంటల నుంచే క్యూ కడుతుండటంతో హెడ్ పోస్టాఫీసులు జాతరను తలపిస్తున్నాయి. నెల రోజులుగా మహిళలు పోస్టాఫీసులకు వెళ్తున్నప్పటికీ.. నాలుగు రోజుల నుంచి వీరి సంఖ్య విపరీతంగా పెరిగింది. సోమవారం వేలాదిగా మహిళలు తరలి రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. సూపర్ సిక్స్ పథకాల కోసమంటూ..టీడీపీ కూటమి ఎన్నికల ముందు ఇచి్చన హామీల మేరకు సూపర్‌సిక్స్ పథకాలు ఒక్కొక్కటిగా అమలవుతాయంటూ కూటమి నేతలు పదేపదే చెబుతున్నారు. ఇందులో భాగంగా 18 ఏళ్లు నిండిన మహిళల ఖాతాల్లో రూ.1,500 జమ చేస్తారన్న ప్రచారంతో మహిళలు పోస్టాఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. కొందరు మహిళలైతే చంటి బిడ్డలను చంకన వేసుకుని వస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోస్టల్ అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదు. తొక్కిసలాట నేపథ్యంలో కొందరు ఊపిరి ఆడక అల్లాడిపోయారు. ఏమవుతుందోనన్న ఆందోళన అందరిలో కనిపించింది. పోలీసులు సైతం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. అధికారులంతా తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తుండడంతో పరిస్థితి చెయ్యి దాటిపోయేలా ఉంది. ఏదైనా జరగరాని ఘటన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారో కూడా అంతుబట్టడం లేదు.అసలు సంగతి ఏమిటంటే..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన నగదు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ) ఖాతాల్లో జమ అవుతాయి. ఇప్పటికే ఐపీపీబీ ఖాతాలు గల లబ్ధిదారులు కొత్తగా ఖాతాలు తెరవాల్సిన అవసరం లేదు. అయితే, ఐపీపీబీ ఖాతాలు కలిగి ఆధార్ లింక్ అయినంత మాత్రానా డబ్బు జమ కాదు. కచ్చితంగా ఆధార్ సీడింగ్ అయి ఉండాలి. బ్యాంకర్లు ఖాతాలకు ఆధార్ లింక్ చేస్తున్నా.. సీడింగ్ చేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కారణంగా చాలామంది మహిళలు పోస్టల్ శాఖ ఇచ్చే ఐపీపీబీ ఖాతాలు తెరిచేందుకు ఎగబడుతున్నారు. ఇప్పటివరకు బ్యాంక్ ఖాతాలకు ఆధార్ సీడింగ్ కానివారు అనంతపురం జిల్లాలో సుమారు 3 లక్షలకు పైబడి ఉన్నట్టు సమాచారం.బ్యాంకుల్లో ఆధార్ సీడింగ్ కాని వారు ఐపీపీబీ ఖాతాలు తెరిచేందుకు వస్తుండగా.. ఆధార్ లింకేజీ, సీడింగ్ అయిన వారు కూడా ఐపీపీబీ ఖాతాల కోసం పోస్టాఫీసులకు పరుగులు పెడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి.. మహిళలకు రూ.1,500 చొప్పున ఖాతాల్లో ఎప్పుడు జమ చేస్తారు, అందుకోసం మహిళలు ఏం చేయాలి, ఇప్పటికే బ్యాంక్ ఖాతాలున్న మహిళలు ఏంచేయాలి, ఖాతాలు లేనివారు ఏ పోస్టాఫీసుకు లేదా ఏ బ్యాంకును సంప్రదించాలనే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ధర్మం చంద్రబాబు పాదం మీదే నడుస్తుందా..?
-
CBNlies: ‘మాట మార్చడంలో డాక్టరేట్ ఇవ్వాలేమో!’
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రివర్గ సభ్యులు చేస్తున్న ప్రకటనలపై శాస్త్రీయంగా ఒక అధ్యయనం జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే... ఎన్నికల ముందు చేసిన ప్రకటనలు.. ఆ తరువాత ఇస్తున్న సందేశాలు అంత ఆసక్తికరంగా ఉన్నాయి మరి! మాటలు మార్చడం ఇంత తేలికా అన్నట్టుగా ఉన్నాయి ఇటీవలి కాలంలో వీరు చేస్తున్న ప్రకటనలు. ఏమాత్రం జంకు గొంకూ లేకుండా అసత్యాలెలా చెప్పగలుగుతున్నారు? అసలు వీరి మాటలను ప్రజలు పట్టించుకుంటున్నారా? అన్న అనుమానాలూ వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఏమన్నారు..? తన రాజకీయ అనుభవంతో ప్రజలపై భారం పడకుండా సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాననే కదా? ఈ మాటలన్నింటికీ పవన్ కళ్యాణ్ ఊకొట్టడమే కాకుండా నిజం నిజం అంటూ బాబును ఆకాశానికి ఎత్తేశారా లేదా? వందిమాగధుల చందంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలు పొడగ్తలతో బాబుకు ఎలివేషన్ కూడా ఇచ్చాయే..!! జగన్ సంక్షేమ కార్యక్రమాలను వృథా ఖర్చులంటూ, బటన్ నొక్కడం తప్ప ఆయన చేసిందేమీ లేదంటూ విమర్శించిన ఈ మీడియా సంస్థలు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రెండు, మూడు రెట్ల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారని సూపర్ సిక్స్ అంటూ హోరెత్తించాయి కూడా. జగన్ చేస్తే తప్పట. అదే చంద్రబాబు ఇంకా అధికంగా చేస్తానని చెబితే సూపర్ అట. ఇలా సాగిపోయింది వారి ప్రచారం. కానీ... టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక మొత్తం ఒక్కసారిగా అందరి గొంతు మారిపోయింది. వారి అసలు స్వరూపాన్ని బయటబెట్టుకుంటున్నారు. ఇచ్చిన హామీలు అన్నింటిలోనూ యూటర్న్ తీసేసుకున్నారు. ఇందుకు ఏమాత్రం సిగ్గుపడటమూ లేదు సరికదా.. దబాయింపులు, బుకాయింపులతో పాలన సాగిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యుత్ ట్రూ అప్ ఛార్జీలు పిసరంత పెంచినా బాదుడే, బాదుడు.. విద్యుత్ ఛార్జీలు ఘోరంగా పెరిగాయి అంటూ టీడీపీ, ఎల్లో మీడియా గొంతు చించుకునేవి. ఈ ప్రభావం ప్రజలపై కూడా కొంత పడింది. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, తగ్గిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక అదే ట్రూ అప్ ఛార్జీలను మరింత అధికంగా బాదుతున్నారు. ఏకంగా రూ.17 వేల కోట్ల భారం మోపడానికి ఆమోదం పొంది, రూ.ఆరు వేల కోట్లకు పైగా మొత్తాన్ని తక్షణం వసూలు చేయడం ఆరంభించారు. అదేమిటంటే జగన్ ప్రభుత్వం నిర్వాకం వల్ల పెంచాల్సి వస్తోందని కొత్త రాగం అందుకున్నారు. దీంతో సంపద సృష్టి అంటే జగన్ టైమ్‌లో కంటే ఎక్కువ ఛార్జీలు వసూలు చేయడమా? అని ప్రజలు నివ్వెర పోతున్నారు. ఇంకో ఉదాహరణ... రోడ్లపై గోతులు పూడ్చి, రోడ్ల నిర్వహణకు సంబంధించి చంద్రబాబు చేసిన ప్రకటన చూడండి. జగన్ టైమ్‌లో రహదారులను బాగు చేసినప్పటికీ రాష్ట్రంలో రోడ్లన్ని పాడైపోయినట్లు ఈనాడు మీడియా ప్రచారం చేసింది. వర్షాల వల్ల గోతులు పడినా, అదంతా జగన్ ప్రభుత్వ వైఫల్యంగా చూపించే ప్రయత్నం చేశారు. ఈ ప్రచారం ఎంత స్థాయికి చేరుకుందంటే.. చంద్రబాబు, పవన్‌లు అధికారంలోకి రాగానే రహదారులపై గోతులు ఆమాంతం మాయమైపోతాయని, అద్దాల్లా మెరిసిపోతాయని ప్రజలు అనుకున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే.. వీరు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కావస్తున్నా మారింతి వీసమెత్తు కూడా లేదు. చంద్రబాబు నాయుడు అట్టహాసంగా హెలీకాప్టర్ వేసుకుని ఓ గ్రామం వద్ద రహదారి గోతిపై మట్టిపోసి రావడం తప్ప! తాజా అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మళ్లీ గొంతు మార్చేశారు. రహదారుల నిర్వహణ ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నామన్నారు. వాహనదారుల నుంచి యూజర్ ఛార్జీలు వసూలు చేసి ప్రైవేట్ సంస్థలే రహదారులను మరమ్మతు చేస్తాయని, ఉభయ గోదావరి జిల్లాల్లోనే తొలి పైలట్ ప్రాజెక్టు మొదలు పెడాతమని ప్రకటించారు. పైగా ప్రజలను ఈ పద్ధతికి ఒప్పించే బాధ్యతను ఆయన ఎమ్మెల్యేలపై నెట్టడం.. వారు ఒప్పుకోకుండా గుంతల్లోనే తిరుగుతామని అంటే తనకు అభ్యంతరం ఏమీ లేదని చెప్పడం కొసమెరుపు!! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఏ పన్ను వేసినా, ఏ ఆదాయ వనరు పెంచినా, ప్రభుత్వ దోపిడీ అని అభివర్ణించిన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా ప్రజల నుంచి వసూలు చేసే పన్నులు కాకుండా, అన్నిటిపై ముక్కు పిండి యూజర్ ఛార్జీలు వసూలు చేయాలని అనుకుంటున్నారన్నమాట. నిజానికి 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రులలో యూజర్ ఛార్జీలను ప్రవేశపెట్టారు. దానిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మండల స్థాయి రోడ్లకు కూడా యూజర్ ఛార్జీలు అంటున్నారు. ఎన్నికల ప్రణాళికలో ఈ పద్దతి అమలు చేస్తామని చెబితే తప్పు కాదు. అప్పుడేమో అంతా ఫ్రీ అని, ఆ తర్వాత ఏదీ ఉచితం కాదని, డబ్బులు మీరే ఇవ్వాలని జనాన్ని అంటుంటే వారు నిశ్చేష్టులవడం తప్ప చేసేది ఏమి ఉంటుంది? ఇక్కడ మరో సంగతి చెప్పాలి. రోడ్లు,భవనాల శాఖ మంత్రి జనార్ధనరెడ్డి మాత్రం రహదారులపై టోల్ గేట్లు ఉత్తదే అని ప్రకటన చేశారు. కాని మంత్రి గాలి తీస్తూ చంద్రబాబు యూజర్ చార్జీల ప్రకటన చేసేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వ సూచన ప్రకారం స్థానిక సంస్థలు పారిశుద్ద్యం నిర్వహణకు నెలకు ఏభై నుంచి వంద రూపాయలు వసూలు చేస్తే జగన్ ప్రభుత్వం చెత్తపన్ను వేశారని, ఇది చెత్త ప్రభుత్వం అని దుర్మార్గపు ప్రచారం చేశారు. ఇప్పుడేమో వేల రూపాయల చొప్పున యూజర్ ఛార్జీలు వసూలు చేయడానికి సిద్ధమవుతున్నారు. లేకుంటే గోతులే మీకు గతి అని బెదిరిస్తున్నారు. ఇప్పుడు దీనిని రోడ్లపై గుంతలకు కూడా జనం నుంచి డబ్బు వసూలు చేసే రోత ప్రభుత్వం అని ఎవరైనా విమర్శిస్తే తప్పులేదేమో! ఒకవైపు అమరావతి రాజధాని పేరుతో వేల కోట్ల అప్పులు తెస్తున్నారు. ఆ అప్పులు రాష్ట్రం అంతా కట్టాల్సిందే. అమరావతిలో మాత్రం కొత్త రోడ్లపై టోల్ గేట్లు పెట్టి డబ్బలు వసూలు చేస్తామని చెప్పడం లేదు. అమరావతిలో విలాసవంతమైన కార్లలో తిరిగే ఖరీదైన షరాబులే అధికంగా ఉంటారు. వారు తిరిగే రోడ్లపై అంతా ఫ్రీ. పేదలు, మధ్య తరగతి వారు ఎక్కువగా తిరిగే గ్రామీణ రోడ్లపై మాత్ర టోల్ వసూళ్లు. ఇసుక ,మద్యం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇసుక మొత్తం ఉచితం అనుకున్న ప్రజలకు గతంలో కన్నా అధిక రేట్లు పెట్టి కొనాల్సి రావడం అనుభవం అయింది. మద్యం ధరలు తగ్గిస్తారనుకుంటే ఎమ్.ఆర్.పి కన్నా ఎక్కువ రేట్లే వసూలు చేస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. కేంద్రం ప్రతిపాదించిన సంస్కరణలలో భాగంగా గత ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను పెడితే చంద్రబాబు, లోకేష్ , పవన్ కళ్యాణ్‌లు నానా యాగీ చేశారు. స్మార్ట్ మీటర్లు రైతులకు ఉరితాళ్లుగా దుర్మార్గపు ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక వాటినే కూటమి ప్రభుత్వం కొనసాగిస్తోంది. అప్పట్లో స్మార్ట్ మీటర్లపై వ్యతిరేక కథనాలు ఇచ్చిన ఈనాడు మీడియా ఇప్పుడు స్మార్ట్ మీటర్లు వచ్చేశాయి.. అని హెడింగ్ పెట్టి ప్రజలను పండగ చేసుకోమన్నట్లుగా స్టోరీలు ఇస్తోంది. వివిధ కారణాల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగిపోయాయి. వాటిని అదుపు చేసే యంత్రాంగం లేకుండా పోయింది. అప్పట్లో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయా సరుకుల రేట్లు పెరిగిపోయాయని యాగీ చేసిన టీడీపీ, ఈనాడు, జ్యోతి తదితర ఎల్లో మీడియా ఇప్పుడు అంతకు రెట్టింపు ధరలు పెరిగినా నోరు మెదిపితే ఒట్టు. ప్రజలకు జగన్ టైమ్ లో వచ్చిన స్కీముల డబ్బుతో పేదల జీవితం చాలావరకు సాఫీగా సాగేది. ఆయన ఇచ్చిన డబ్బు కంటే ఇంకా ఎక్కువ ఇస్తామని కూటమి నేతలు అబద్దాలు చెప్పి, ఇప్పుడు దాదాపు అన్నిటిని ఎగవేసే పనిలో ఉన్నారు.దాంతో మండుతున్న ధరలతో జనం అల్లాడుతున్నారు. ప్రస్తుతం పిండుతున్న అదనపు వసూళ్లు చాలవన్నట్లు జీఎస్టీపై ఒక శాతం సర్ఛార్జ్ వసూలు చేసుకునేలా అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని చంద్రబాబు నాయుడు కోరారు. అది కూడా వస్తే ఏపీలో పన్నులు మరింతగా పెరుగుతాయి. నిత్యావసర వస్తువుల ధరలు మండుతాయి. ప్రజల జీవితం మరింత భారంగా మారుతుంది. చేసిన బాసలకు, చేస్తున్న పనులకు సంబంధం లేకుండా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పరిశోధనార్హమే అవుతుందేమో! బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని టీడీపీ సూపర్ సిక్స్ నినాదం. కాని అది ఇప్పుడు బాబు ష్యూరిటీబాదుడే, బాదుడుకు గ్యారంటీగా మారిందా! ఇప్పుడు జనం రాష్ట్రానికి ఇదేం ఖర్మ అని అనుకోరా! కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ప్రజలకు షాక్‌లు.. సర్కారు సోకులు 'వాతలపై వాకౌట్'
సాక్షి, అమరావతి: కూటమి సర్కారు విద్యుత్తు షాకులపై శాసన మండలి దద్ధరిల్లింది. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలను పెంచబోమని... అవసరమైతే చార్జీలను ఇంకా తగ్గిస్తామన్న హామీని కూటమి నేతలు గాలికొదిలేయడంతోపాటు ఐదు నెలల్లోనే ప్రజలపై ఏకంగా రూ.17 వేల కోట్లకుపైగా కరెంట్ చార్జీల భారాన్ని మోపడాన్ని ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ మండలి సాక్షిగా నిగ్గదీసింది. గత సర్కారుపై బురద చల్లే యత్నాలను ఎండగట్టింది. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా డిస్కమ్‌లకు (విద్యుత్తు పంపిణీ సంస్థలు) సకాలంలో రాయితీలను అందించి ఆదుకుందని, ఐదేళ్లలో ఏకంగా రూ.45 వేల కోట్లకు పైగా అందచేసిందని గుర్తు చేసింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సబ్సిడీలు భరించేందుకు నిరాకరిస్తూ వినియోగదారులపై నిర్దాక్షిణ్యంగా రూ.17 వేల కోట్లకుపైగా చార్జీల భారాన్ని మోపుతోందని మండిపడింది. విద్యుత్తు చార్జీల వాతలు, సూపర్ సిక్స్ పథకాలకు కేటాయింపులు లేకపోవడం, రాష్ట్రంలో పూర్తిగా క్షీణించిన శాంతి భద్రతలకు నిరసనగా ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ సోమవారం మండలి నుంచి వాకౌట్ చేసింది. శాసన మండలిలో ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఈ అంశాలను ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వం నిర్వాకాలపై నిప్పులు చెరిగారు. సామాన్య ప్రజలపై విద్యుత్తు చార్జీల భారాన్ని ఎందుకు మోపుతున్నారని నిలదీశారు. ఎన్నికల్లో వాగ్దానాలు చేసిన తరువాత ఆ కార్యక్రమాల వ్యయాన్ని ఆయా ప్రభుత్వాలే భరించాలని హితవు పలికారు. ‘ఎన్నికల సమయంలో మీరే వాగ్దానం చేశారు కదా? హామీలను ఎందుకు అమలు చేయడం లేదు? సబ్సిడీ కింద ప్రభుత్వం నిధులు కేటాయించి వినియోగదారులకు ఊరట కల్పించవచ్చు కదా? ఇప్పటికే రూ.ఆరు వేల కోట్లకుపై భారాన్ని ప్రజలపై మోపారు. ఇంకో రూ.11 వేల కోట్లకుపైగా భారాన్ని కూడా వేసి ఏం చేద్దామనుకుంటున్నారు?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల హామీల అమలులో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైందని, ఆలస్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టినా సూపర్ సిక్స్ పథకాలకు కేటాయింపులు జరపకపోవడం మోసపూరితమని మండిపడ్డారు. అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తూ సూపర్ సిక్స్ హామీలను ఎగ్గొట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ‘రాష్ట్ర విభజన తరువాత విద్యుత్ బకాయిలు, అప్పులు రూ.ఏడు వేల కోట్ల దాకా ఉంటాయి. 2014–19 మధ్య టీడీపీ సర్కారు వాటిని రూ.29 వేల కోట్ల వరకు తీసుకెళ్లింది. వైఎస్సార్ సీపీ హయాంలో రూ.395 కోట్లకు మించి ఐదేళ్లలో డిస్కంలపై భారం పడలేదు. అదే నాడు టీడీపీ హయాంలో రూ.22 వేల కోట్ల మేర భారం వేశారు. ఇక టీడీపీ అధికారంలో ఉండగా ఐదేళ్లలో డిస్కంలకు రూ.15 వేల కోట్లు మాత్రమే సబ్సిడీ కింద ఇవ్వగా వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.45 వేల కోట్లకుపైగా విద్యుత్ రంగానికి అందచేసి ఆదుకుంది’ అని గణాంకాలతో కూటమి సర్కారు షాకులను ఎండగట్టారు. అనంతరం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం సవరణ బిల్లును వైఎస్సార్ సీపీ వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించి నిరసనగా పార్టీ సభ్యులందరితో కలసి వాకౌట్ చేశారు. అప్పులపై తప్పుడు ప్రచారం.. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండు మూడు నెలల్లోనే పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడం ఆనవాయితీ. ఇంత ఆలస్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టినా సూపర్ సిక్స్ పథకాలకు ఎటువంటి కేటాయింపులు లేకపోగా ఎప్పటి నుంచి అమలు చేస్తారన్న విషయంపై కూడా స్పష్టత లేదంటే ఇది మోసపూరిత బడ్జెట్ కాక ఇంకేమంటారు? మాజీ ఆర్ధికమంత్రి రూ.14 లక్షల కోట్ల అప్పలు అంటారు! ముఖ్యమంత్రి రూ.పది లక్షల కోట్లు అంటారు! ఆర్థిక మంత్రి రూ.6.46 లక్షల కోట్లు అని బడ్జెట్లో అంటారు! మరి ఇందులో ఏది నిజం? ఎవరు తప్పుడు లెక్కలు చెబుతున్నారో సభకు స్పష్టత ఇవ్వాలి. గత ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం నిర్దేశించిన పరిమితికి లోబడి అందులో 86 శాతం మాత్రమే అప్పులు తీసుకుంది. సూపర్ సిక్స్ ఎక్కడ? సూపర్‌సిక్స్ పథకాలకు కేటాయింపులు ఎక్కడ? స్కూలుకు వెళ్లే పిల్లలకు తల్లికి వందనం ఎక్కడ? నీకు 15 వేలు.. నీకు 15 వేలు అనేది ఇప్పుడు తెగ ప్రచారమవుతోంది. పాఠశాల విద్యార్థులు 80 లక్షల మందికిపైగా ఉంటే బడ్జెట్లో కేటాయించిన రూ.5,000 కోట్లు ఎలా సరిపోతాయి? ఆడబిడ్డ నిధి ఎప్పుడు ఇస్తారు? 50 ఏళ్లు దాటిన వారికి ఫించను హామీని ఎప్పుడు అమలు చేస్తారు? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఆలస్యం ఎందుకు? 20 లక్షల ఉద్యోగాలు సృష్టించలేనప్పుడు కనీసం నిరుద్యోగ భృతి అయినా ఇవ్వాలి కదా? దిగజారిన శాంతి భద్రతలు.. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఉప ముఖ్యమంత్రే చెప్పారని బొత్స పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు, హత్యాచారాలపై మండలిలో చర్చ సందర్భంగా అధికార – ప్రతిపక్ష సభ్యుల వాగ్యుద్ధం చోటు చేసుకుంది. హోంమంత్రి అనిత జవాబిచ్చిన తీరును బొత్స ఖండించారు. సభ్యుల ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పకుండా మంత్రి రాజకీయ ఉపన్యాసాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. గత ఐదు నెలల కాలంలో మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు, వేధింపులు విచ్చలవిడిగా జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, కల్పలత ఆందోళన వ్యక్తం చేశారు. యథేచ్ఛగా మద్యం బెల్ట్ షాపులు ఏర్పాటవుతున్నా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు జరిగిన నేరాల్లో 24–48 గంటల్లోనే నిందితులను అరెస్టు చేశామని హోంమంత్రి అనిత చెప్పారు. కాగా వైఎస్ జగన్ కుటుంబ సభ్యులను ప్రస్తావిస్తూ ఈ సందర్భంగా మంత్రి పలు వ్యాఖ్యలు చేశారు. కాగా శాంతి భద్రతలు విఫలమయ్యాయని డిప్యూటీ సీఎం అనలేదని టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఔను.. ఒక్క సిలిండరే ఉచిత గ్యాస్ సిలెండర్ హామీపై బొత్స గట్టిగా నిలదీయండంతో కూటమి ప్రభుత్వం దిగొచ్చి అసలు విషయాన్ని బయటపెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క సిలెండర్ మాత్రమే ఉచితంగా ఇస్తామని, ఏడాదికి మూడు ఉచిత సిలెండర్ల హామీని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సభలో స్పష్టం చేశారు. ఇమామ్, మౌజాన్లకు గౌరవ వేతనం పెంపు ప్రతిపాదన లేదు.. ఇమామ్, మౌజాన్లకు గౌరవ వేతనాల పెంపు ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని మంత్రి ఫరూక్ తెలిపారు. విజయవాడ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారికి మాత్రమే ప్రభుత్వం రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తుందని చెప్పారు. మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా వైఎస్సార్ ఎమ్మెల్సీలు ఇసాక్ బాషా, మహ్మమద్ రుహల్లాలు ఈ అంశాలను ప్రస్తావించారు. మోటర్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రసక్తే లేదు: మంత్రి గొట్టిపాటి రవి రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రసక్తే లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. మండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ఉపప్రశ్నకు మంత్రి గొట్టిపాటి ఈ మేరకు బదులిచ్చారు. బిల్లును వ్యతిరేకిస్తున్నాం: లక్ష్మణ్‌రావు, పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం సవరణ బిలును మేం వ్యతిరేకిస్తున్నాం. ఈ ప్రభుత్వం ఇప్పటికే తొలిదశలో రూ.6 వేల కోట్ల భారాన్ని విద్యుత్తు వినియోగదారులపై మోపింది. ఇప్పుడు మరో రూ.11 వేల కోట్ల బాదుడుకు సిద్ధమైంది. మొత్తం సుమారు రూ.17 వేల కోట్ల భారాన్ని ప్రజలపై వేస్తోంది. వినియోగదారులకు ఇది మోయరాని భారం. ఇలాంటి బిల్లు ఇప్పుడు అవసరమా? దీన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. మూజువాణితో ఆమోదం... మండలిలో విద్యుత్ సుంకం సవరణ బిల్లుపై చర్చకు విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానిచ్చారు. గత ప్రభుత్వం ఎంతో మేలు చేసినట్లు బొత్స సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడారని విమర్శించారు. ఇది సవరణ మాత్రమేనని, గత ప్రభుత్వమే ప్రజలపై భారం వేసిందని చెప్పారు. గత ప్రభుత్వం తెచ్చిన చట్టంలో లోపాలను సరిదిద్దడానికే ఈ బిల్లును ప్రవేశపెడుతున్నామన్నారు. అనంతరం బిల్లుపై సభలో తీర్మానం ప్రవేశపెట్టగా మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు చైర్మన్ మోషేన్‌రాజు ప్రకటించారు. -
ప్రతీ ఇంటికీ మూడు సిలెండర్లు ఇస్తామని గతంలో చంద్రబాబు హామీ
-
సూపర్ సిక్స్ ని నమ్మి ఓటేశారు.. ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుంది