సాక్షి,విశాఖపట్నం: సూపర్‌సిక్స్ హామీల అమలుకు ముహూర్తం ఎప్పుడని మాజీ మంత్రి,వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. శనివారం(అక్టోబర్ 19) మరో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌తో కలిసి విశాఖపట్నంలో బొత్స మీడియాతో మాట్లాడారు.
‘ఎన్నికల హామీల అమలును కూటమి ప్రభుత్వం విస్మరించింది. సూపర్ సిక్స్ హామీల అమలు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో సామాన్యులకు ఇసుక దొరకడం లేదు. విశాఖలో రూ.10వేలు, విజయనగరంలో రూ.7 వేలకు ఇసుక దొరకాలి. ఇప్పుడు దొరుకుతోందా? ధరలు పెరిగి సామాన్య ప్రజలు ఇబ్బందిపడుతున్నారు’అని బొత్స మండిపడ్డారు.
బొత్స ఇంకా ఏమన్నారంటే..
- ప్రభుత్వానికి హామీలపై ఆరు నెలలు సమయం ఇద్దమనుకున్నాం.
- ఆరు నెలల తర్వాత కూడా ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైంది.
- ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు అమలు చేస్తారు.
- సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు.
- రెండున్నర ఏళ్లు మాత్రమే అధికారంలో ఉంటుందని చంద్రబాబు చెపుతున్నారు.
- వైఎస్సార్‌సీపీ పాలనలో పది వేల రూపాయాలకు వచ్చే ఇసుక నేడు 15 వేల లభిస్తుంది.
- ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పినా కూడా గత ప్రభుత్వం కంటే ఎక్కువ ధరకు ఇసుక అమ్ముతున్నారు.
- గత ప్రభుత్వ హయాంలో సినరేజ్ చార్జీలు రూ.375 వసూలు చేసేవారు.
- సినరేజ్ డబ్బులు ప్రభుత్వానికి ఆదాయ రూపంలో వచ్చేవి.
- కూటమి ప్రభుత్వం టన్నుకు 375 రూపాయలు సినరేజ్ వసూలు చేయకపోయినా టన్ను ఇసుక రేటు తగ్గలేదు.
- ట్రాక్టర్‌తో ఉచిత ఇసుక అనేది గత ప్రభుత్వ హయాంలో కూడా ఇచ్చేవారు.
- టీడీపీ ప్రభుత్వం హయంలో కొత్తగా ఏమీ ఇవ్వలేదు.
- మద్యం ధరలు తగ్గిస్తామని చెప్పారు, ఎక్కడ తగ్గించారు.
- నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్ని అంటాయి.
- తల్లికి వందనం, రైతు భరోసా ఒక్కరికైన ఇచ్చారా.
- ఖరీఫ్ ముగుస్తున్నా ఒక్క పైసా రైతు ఖాతాల్లో పడలేదు.
- అగ్గిపెట్టెలకు కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు.
- ప్రభుత్వ అవినీతిపై వార్తలు రాస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు.
- అగ్గి పెట్టె లెక్కలు మీ గెజిట్ పేపర్‌లోనే వచ్చాయి.
- టీడీపీ నేతల కుమ్ములాటలు వల్ల గుర్లలో పది మంది చనిపోయారు.
- నాలుగు నెలల నుంచి మంచి నీటిపై పర్యవేక్షణ లేదు.
- మంచినీటి సరఫరా కాంట్రాక్టు తమకు ఇవ్వాలంటే తమకు ఇవ్వాలని కుమ్మూలడుకుంటున్నారు.
- ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలి.
- ప్రభుత్వ నిర్లక్ష్యం వలన డయేరియా మరణాలు సంభవించాయి.
- పరిశుభ్రమైన మంచి నీటిని అందించలేదు.
- డయేరియాతో చనిపోయిన పది మందికి నష్ట పరిహారం చెల్లించాలి.
ఇదీ చదవండి: ఇసుక,మద్యంలో కూటమి నేతల అవినీతి: కాకాణి
Comments
Please login to add a commentAdd a comment