సాక్షి,తాడేపల్లి:టీడీపీకి చట్టం అంటే గౌరవం లేదని,వాళ్ళు చేసిందే చట్టం అనుకుంటున్నారని మండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. సోమవారం(ఫిబ్రవరి3) తాడేపల్లిలో బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.
‘తిరుపతి లో మా వాళ్లు ప్రయాణిస్తున్న బస్సు అద్దాలు పగులగొట్టారు. పోలీసులు ఎన్నికలను పట్టించుకోలేదు. కోరం ఉంటే ఎన్నిక వాయిదా పడేది కాదు. చట్టాన్ని చేతిలో తీసుకొని అన్యాయంగా గెలవాలని చూస్తున్నారు. టీడీపీ కూటమికి ఎన్నికల్లో 160కి పైగా సీట్లు వచ్చాయి. అయినా సరే చిన్న పదవుల కోసం తాపత్రయ పడుతున్నారు.
మేయర్,డిప్యూటీ మేయర్ పదవులు ఉంటే ఏంటి..లేక పోతే ఏంటి..? ఎన్నికలు పెట్టడం ఎందుకు. నామినేటెడ్ చేసుకుంటే సరిపోయేది.కూటమికి ఎన్నికల్లో అన్ని సీట్లు వచ్చినా ఇంకా అభద్రతా భావంతోనే ఉన్నారు.ముద్రగడ ఇంటిపైనా దాడి జరిగింది.పోలీసు వ్యవస్థ అంటే భయం లేక పోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి.ఎన్నికల కమిషన్ నిస్సహాయ స్థితిలో ఉంది’అని బొత్స అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment