Alliance Government
-
రైతు కుటుంబం బలవన్మరణం.. కూటమి సర్కార్ అవహేళన
వైఎస్సార్ జిల్లా: అప్పుల బాధ తాళలేక వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం దిద్దెకుంటలో రైతు నాగేంద్ర కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఈ విషాదాన్ని కూటమి ప్రభుత్వం అవహేళన చేసింది. నాగేంద్ర వద్ద డబ్బులు ఉన్నాయని, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని, వేరే కారణాలతో బలవన్మరణానికి పాల్పడి ఉంటారంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పవన్ వ్యాఖ్యలపై రైతులు, రైతుల సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కౌలుకు వేసిన పంటలు పండక రైతు నాగేంద్ర రూ. 15 లక్షల అప్పుల్లో కూరుకుపోయారు. దీంతో ఇటీవలే లోన్ ద్వారా తీసుకున్న ట్రాక్టర్ జప్తుకు గురి కావడం, కౌలు యజమాని డబ్బు అడిగితే ఏం చెప్పాలోనని ఆవేదన, అప్పు ఇచ్చిన వాళ్ళ ఒత్తడితో నాగేంద్ర తీవ్ర మనోవేదనకు గురయ్యారు. భార్య, కుమార్తె, కుమారుడికి ఉరి వేసి తానూ ఆత్మహత్య పాల్పడ్డారు.అయితే, ఇంతటి విషాదంలో రైతు కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవహేళన చేస్తూ మాట్లాడారు. రైతు నాగేంద్ర మరణంపై పోలీసుల విచారణ పూర్తిగాక ముందే పవన్ అత్యుత్సాహం ప్రదర్శించారు. ‘రైతు నాగేంద్ర వద్ద డబ్బులు ఉన్నాయని, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని, వేరే కారణాలతో బలవన్మరణానికి పాల్పడి ఉంటారంటూ’ బుకాయించే ప్రయత్నం చేశారు. మరోవైపు రైతు నాగేంద్ర, అతని కుటుంబ సభ్యుల ఆత్మహత్యలపై డీఎస్పీ విచారణ చేపట్టారు. విచారణలో అప్పుల బాధతోనే రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకుందని స్పష్టత ఇచ్చారు. అయినప్పటికీ రైతు కుటుంబానికి డబ్బు సమస్య కాదంటూ అవహేళనగా కూటమి నేతలు వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. -
ఇది సర్కారు లెక్క.. 95 మంది రైతుల ఆత్మహత్య
రేటు పతనమై.. బతుకు భారమై..గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన కౌలు రైతు యనగందుల వీరారావు (54) 30 ఏళ్లుగా వ్యవసాయం చేస్తుండేవాడు. గతేడాది అధిక వర్షాల వల్ల పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. పత్తి, మిరపకు మంచి ధరలు రావడంతో ఈ ఏడాది రూ.4 లక్షలు అప్పులు చేసి 2.5 ఎకరాల్లో మిరప సాగు చేశాడు. కోతలు ప్రారంభమయ్యే నాటికి క్వింటా రూ.15 వేలు ఉండడంతో, ధరలు పెరుగుతాయన్న ఆశతో కోల్డ్ స్టోరేజీలో పెట్టాడు. వ్యాపారులు సిండికేట్‌గా మారడంతో క్వింటా రూ.10 వేలకు పడిపోయింది. మరింత పడిపోతాయన్న ఆందోళనతో అమ్ముకోగా, కోల్డ్ స్టోరేజీ ఖర్చులన్నీ పోనూ రూ.70 వేలు మిగిలింది. గతంలో చేసిన వాటితో కలిపి రూ.10 లక్షల అప్పులు తీర్చే దారిలేక, అప్పులోళ్లకు ముఖం చూపించలేక గత నెల 23న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వీరారావు భార్య కూలీ పనికి వెళ్తోంది. ఉన్న ఇంటిని అమ్మి రేకుల షెడ్లో అద్దెకు ఉంటున్నామని, తల్లితో పాటు తన వద్ద ఉన్న బంగారాన్ని కుదవ పెట్టినా అప్పులు తీరలేదని, ఆదుకోవాల్సిన ప్రభుత్వం తమను పట్టించుకోలేదని వీరారావు కుమారుడు సుబ్బారావు కన్నీటి పర్యంతమయ్యాడు.సాగు నిజం.. వ్యవ‘సాయం’ దుర్లభంవైఎస్సార్ జిల్లా రామిరెడ్డిపల్లెకు చెందిన ఎన్.శ్రీనివాసులు రెడ్డి (47) గత నెల 28న, వేంపల్లికి చెందిన ఆశీర్వాదం (63) ఈ నెల 15న ఆత్మహత్యలకు పాల్పడ్డారు. శ్రీనివాసులురెడ్డికి సొంత పొలంతో పాటు 4 ఎకరాల కౌలు భూమి ఉండగా, సొసైటీలో రూ.5 లక్షలు, ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.20 లక్షల అప్పులున్నాయి. ఆశీర్వాదానికి సొంతంగా 2 ఎకరాలుండగా, 4 ఎకరాలు కౌలుకు చేస్తున్నాడు. ఆయన సొసైటీలో రూ.2 లక్షలు, ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.3 లక్షలు అప్పులు చేసి పెట్టుబడి పెట్టాడు. వర్షాభావ పరిస్థితుల వల్ల ఇద్దరి పంటలు పూర్తిగా దెబ్బ తినడంతో పొలంలో గుళికలు మింగి ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయితే అధికార పార్టీ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గి.. వీరిద్దరి ఆత్మహత్యలకు వ్యక్తిగత ఇబ్బందులే కారణమని అధికారులు తేల్చారు. పరిహారం అందక ఈ రెండు కుటుంబాలు రోడ్డునపడ్డాయి.టీడీపీ నేతల బెదిరింపులు తాళలేకబాపట్ల జిల్లా బుల్లికురువ మండలం వెలమవారిపాలెంలోని ఎస్సీ సామాజికవర్గానికి చెందిన చింతల శ్రీను(41) 25 ఏళ్లుగా సాగు చేస్తున్నాడు. తనకున్న 20 ఎకరాలను గ్రామానికి చెందిన టీడీపీ నేతలు ఆక్రమించుకొని అక్రమంగా ఆన్లైన్లో వారి పేరిట మార్చుకున్నారు. రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. టీడీపీ నేతల వేధింపులు తాళలేకపోతున్నానని, తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ అధికారులకు సమాచారమిచ్చినా స్పందన లేదు. చనిపోయే ముందు 100కు ఫోన్ చేసినా పట్టించుకోలేదు. చివరికి అద్దంకి సమీపంలోనే పురుగుల మందు తాగి విగతజీవిగా పడి ఉన్న శ్రీనును స్థానిక వైఎస్సార్సీపీ కార్తకర్తలు హుటాహుటిన ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ గత నెల 28న మృతి చెందాడు. తండ్రి చనిపోయిన తర్వాత కూడా టీడీపీ నేతల వేధింపులు కొనసాగుతున్నాయంటూ శ్రీను కుమారులు భూదేశ్వరరావు, వీరయ్యలు కన్నీటి పర్యంతమవుతున్నారు. పంపాన వరప్రసాదరావు – సాక్షి, అమరావతి/నెట్వర్క్ : ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి ఇల్లు గడిచే దారిలేక, పిల్లల చదువులు సాగక, పెళ్లిళ్లు ఆగిపోయి ఆర్థిక ఇబ్బందులతో ఆ కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ‘మేమున్నాం అని ధైర్యం చెప్పి ఆదుకోవాల్సిన ఆపన్న హస్తం కనిపించకపోవడంతో వారంతా రోడ్డున పడి దిక్కులు చూస్తున్నారు. అందలం ఎక్కింది మొదలు అన్నదాతపై కక్ష కట్టినట్టుగా వ్యవహరిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వ తీరుతో పుడమి తల్లి బిడ్డలు విసిగివేసారి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. సాగు వేళ తుపానులు, వరదలు, వర్షాభావ పరిస్థితులు ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా వైపరీత్యాలు ముప్పేట దాడి చేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతన్నల పాలిట ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు మృత్యు పాశాలుగా మారాయి. సూపర్ సిక్స్ హామీలను అటకెక్కించిన ప్రభుత్వం తమను వంచించడంతో పాటు తమకు న్యాయంగా దక్కాల్సిన పంటల బీమా పరిహారం కూడా అందకుండా చేయడంతో పెట్టుబడికి చేతిలో చిల్లిగవ్వలేక సాగు భారమై అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అధికారిక లెక్కల ప్రకారమే ఆరున్నర నెలల కూటమి పాలనలో ఆత్మహత్యలకు పాల్పడిన వారి సంఖ్య సెంచరీకి చేరువయ్యిందంటే రైతులు ఎంతటి దయనీయ స్థితిలో ఉన్నారో అర్థమవుతోంది. వీరంతా త్రీమెన్ కమిటీ నిర్ధారించిన వారే. ఇక వివిధ కారణాలతో కమిటీ వద్ద పెండింగ్‌లో ఉన్న కేసులు, తిరస్కరించిన కేసులు కలుపుకుంటే ఆత్మహత్య చేసుకున్న వారు 150కి పైగానే ఉన్నారు. ఆరున్నర నెలల్లో ఒక్కరంటే ఒక్కరికి కూడా పైసా పరిహారం ఇవ్వక పోవడంతో బాధిత కుటుంబాలు గుండెలవిసేలా రోదిస్తున్నాయి. తాజాగా వైఎస్సార్ జిల్లాకు చెందిన రైతు తన భార్య, కొడుకు, కుమార్తెలకు ఉరి వేసి.. తనూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రంలో రైతుల దుస్థితికి అద్దం పడుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల దయనీయ పరిస్థితి కంట నీరు తెప్పిస్తోంది.కూటమి ప్రభుత్వం రాకతో కష్టాలురాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు కష్టాలు మొదలయ్యాయి. ఏటా సీజన్‌కు ముందు అందే పెట్టుబడి సాయం లేదు. పంటల బీమా పరిహారం జాడ లేదు. కరువు సాయం ఊసే లేదు. సున్నా వడ్డీ రాయితీ లేదు. పోనీ రూ.3–5 వడ్డీలకు అప్పులు చేసి మరీ సాగు చేస్తుంటే సకాలంలో విత్తనాలు, ఎరువులు దొరక్క పడరాని పాట్లు పడాల్సి వస్తోంది. బహిరంగ మార్కెట్లో ఓ పక్క కల్తీలు రాజ్యమేలుతుంటే మరోపక్క బ్లాక్ మార్కెటింగ్ పెచ్చు మీరింది. ఇంటిల్లిపాది రెక్కలు ముక్కలు చేసుకొని ఆరుగాలం శ్రమించి సాగు చేస్తే ఓ వైపు వైపరీత్యాలు, మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం వారి కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ప్రతికూల పరిస్థితుల్లో సాగు చేసి పండించిన కొద్దిపాటిæ పంట చేతికొచ్చే సమయంలో ధర లేక అయినకాడకి తెగనమ్ముకుంటూ తమ కష్టాన్ని దళారుల పాల్జేయాల్సిన దుస్థితి ఏర్పడింది. వైపరీత్యాలకు తోడు ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతు కుటుంబాలను ఓదార్చే వారు కరువయ్యారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన ప్రజాప్రతినిధులు అటువైపు కన్నెత్తిచూడడం లేదు.ఆరున్నర నెలల్లోనే సడలిన నమ్మకంప్రభుత్వ నిర్వాకం, అస్తవ్యస్త విధానాల వల్ల అన్నదాతల్లో నమ్మకం పోతోంది. వెరసి జూన్ 12వ తేదీ నుంచి ఇప్పటి దాకా.. కేవలం ఆరున్నర నెలల్లో 95 మంది ఆత్మహత్యకు పాల్పడినట్టుగా త్రీమెన్ కమిటీ ధ్రువీకరించింది. తాజాగా వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో శనివారం ఆత్మహత్య చేసుకున్న వారితో కలుపుకుంటే ఈ సంఖ్య 97కు చేరుకుంది. త్రీమెన్ కమిటీ ధ్రువీకరించకుండా పెండింగ్‌లో ఉన్న కేసులు మరో 10–15 వరకు ఉంటాయని, తిరస్కరించిన కేసులు ఇంకో 50 ఉంటాయని అధికార వర్గాల సమాచారం. ఇప్పటి వరకు ఆత్మహత్య చేసుకున్న వారిలో రాయలసీమ జిల్లాలకు చెందిన వారే అత్యధికంగా ఉన్నారు. కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, గుంటూరు జిల్లాల్లోనే 51 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే అత్యధికంగా 30 మంది అర్ధాంతరంగా తనువు చాలించారు. దాదాపు ప్రతి జిల్లాలోనూ కనీసం ఇద్దరు ముగ్గురికి తక్కువ కాకుండా ఆత్మహత్యలకు పాల్పడిన రైతులున్నారు. వీరికి ఎంత పరిహారం ఇవ్వాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది.2014–19 మధ్య ఎన్నో ఆంక్షలుఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతులకు రూ.లక్ష పరిహారం ఇచ్చేవారు. రూ.లక్ష కోసమే రైతులు ఆత్మహత్య చేసుకుంటారంటూ చంద్రబాబు అవహేళనగా మాట్లాడడమే కాదు.. ఆ ఇచ్చే పరిహారాన్ని కూడా 2003లో ఆపేశారు. 2014లో పరిహారం పునరుద్ధరించగా, 2015 ఫిబ్రవరి 18వ తేదీ వరకు రూ.1.50 లక్షల చొప్పున పరిహారం ఇచ్చారు. ఆ తర్వాత రూ.5 లక్షలకు పెంచారు. దాంట్లో రూ.1.50 లక్షలను వన్ టైం సెటిల్మెంట్ కింద ఆత్మహత్యకు పాల్పడిన రైతుల అప్పుల ఖాతాకు జమ చేసేవారు. రూ.3.5 లక్షల పరిహారాన్ని విత్ డ్రా చేసుకునేందుకు వీలు లేకుండా డిపాజిట్ చేసి, దానిపై వచ్చే వడ్డీని మాత్రమే వాడుకునేలా ఆంక్షలు విధించారు. 2014–19 మధ్య ఐదారువేల మంది ఆత్మహత్యలకు పాల్పడితే అధికారికంగా గుర్తించింది కేవలం 1,223 మందిని మాత్రమే. కానీ పరిహారం ఇచ్చింది కేవలం 450 మందికి రూ.20.12 కోట్లే. కౌలు రైతుల ఊసే లేదు.పరామర్శ లేదు.. సాయం ఊసు లేదు ‘రైతు కుటుంబాల్లో జరగరానిది జరిగితే వెంటనే స్థానిక ఎమ్మెల్యేతో కలిసి కలెక్టర్ వారింటికి వెళ్లి ధైర్యాన్నివ్వాలి. అదేరోజు వీఆర్వో వెళ్లి వివరాలు సేకరించాలి. మండల స్థాయి కమిటీ విచారణ చేపట్టి, 24 గంటల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వాలి. డివిజన్ స్థాయి త్రీమెన్ కమిటి సిఫార్సు మేరకు నిర్దేశిత గడువులోగా పరిహారం అందించేలా జిల్లా ఉన్నతాధికారులు వ్యవసాయ శాఖకు నివేదిక సమర్పించాలి’ అనే విధానాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ మేరకు కూటమి ప్రభుత్వంలో రైతు ఆత్మహత్య తర్వాత బాధితులను కలెక్టర్, ఎమ్మెల్యే పరామర్శించిన పాపాన పోలేదు. తుది నివేదిక రూపకల్పనలో ప్రభుత్వ ఒత్తిళ్లు బలంగా పని చేస్తున్నాయి. సాగు కోసం చేసిన అప్పులు తీర్చలేక పొలంలోనే పురుగుల మందుతాగి ఆత్మహత్యలకు పాల్పడినా సరే, వ్యక్తిగత కారణాలతోనే చనిపోతున్నారంటూ నివేదికలు ప్రభుత్వం వద్దకు వెళ్తున్నాయి. బాధిత కుటుంబాలు స్పందనలో అర్జీలు ఇచ్చినా స్పందించడం లేదు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు లేవనే సాకుతో అన్యాయం చేస్తున్నారు.2019–24 మధ్య ఆదుకున్న ప్రభుత్వంవైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచింది. కారణాలు ఏమైనా సరే ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలను పార్టీలు, ప్రాంతాలు, కులమతాలకతీతంగా ఆదుకుంది. 2014–19 మధ్య ఆత్మహత్య చేసుకున్న రైతు ఘటనలకు సంబంధించి కూడా రీ వెరిఫికేషన్‌లో 474 మంది అర్హత పొందగా, వారికి పరిహారం అందజేసింది. ఈ విధంగా ఐదేళ్లలో 1,794 మందికి రూ.116.10 కోట్ల ఎక్స్‌గ్రేషియా జమ చేసింది. ఇందులో 495 మందిక కౌలు రైతులున్నారు. ఊరూరా ఆర్బీకేల ఏర్పాటు ద్వారా విత్తు నుంచి పంట కొనుగోలు వరకు రైతులను చేయి పట్టుకుని నడిపించింది. ఉచిత పంటల బీమా ద్వారా అండగా నిలిచింది. ఏటా వైఎస్సార్ రైతు భరోసా ద్వారా రూ.13,500 చొప్పున సాయం అందించింది. రూ.12,563 కోట్లు ఎగ్గొట్టిన కూటమి సర్కారుఅధికారంలోకి రాగానే ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామంటూ సూపర్ సిక్స్‌లో ఇచ్చిన హామీని చంద్రబాబు ప్రభుత్వం అటకెక్కించింది. వైఎస్సార్ రైతు భరోసా కింద గత ఐదేళ్లలో లబ్ధి పొందిన 53.58 లక్షల మందికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించాలంటే ఏటా రూ.10,718 కోట్లు అవసరం. ఇప్పటికీ దాని ఊసే ఎత్తడం లేదు. 2023–24 సీజన్‌కు రూ.930 కోట్ల రైతుల వాటా ప్రీమియం సొమ్ము చెల్లించక పోవడం వల్ల ఆ సీజన్లో కరువు వల్ల పంటలు దెబ్బ తిన్న దాదాపు 11 లక్షల మంది రైతులకు రూ.1,385 కోట్ల బీమా పరిహారం అందకుండా పోయింది. రబీ సీజన్ నుంచి స్వచ్ఛంద నమోదు పద్ధతిలో పంటల బీమా అమలు చేస్తుండడంతో బీమా ప్రీమియం భరించలేక రైతులు పంటల బీమాకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఖరీఫ్‌తోపాటు రబీ 2023–24 సీజన్లో కరువు ప్రభావంతో దెబ్బతిన్న 3.91 లక్షల మంది రైతులకు రూ.328 కోట్ల కరువు సాయం బకాయిలు ఎగ్గొట్టారు. సున్నా వడ్డీ రాయితీ కింద ఖరీఫ్ 2023 సీజన్‌కు సంబంధించి 6.31 లక్షల మందికి రూ.132 కోట్ల వరకు జమ చేయలేదు. ఇలా ఆరున్నర నెలల్లో అన్నదాత సుఖీభవ, పంటల బీమా, కరువు సాయం బకాయిలు, సున్నా వడ్డీ రాయితీలు కలిపి రైతులకు ఈ ప్రభుత్వం రూ.12,563 కోట్లు ఎగ్గొట్టింది.పెద్దదిక్కు కోల్పోయి రోడ్డున పడ్డారు..నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం రహిమానుపురానికి చెందిన సలీంద్ర మధు (35) సొంతంగా 1.50 ఎకరాలు, మరో 2 ఎకరాలు కౌలుకు తీసుకొని కంది, పత్తి, టమాటా, మిరప, ఉల్లి పంటలు సాగు చేసేవాడు. వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ ఏడాది కలిసి రాలేదు. సాగు కోసం రూ.5 లక్షల వరకు అప్పులు చేశాడు. వీటిని తీర్చే దారిలేక గత నెల 16న ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మధు మృతితో అతని భార్య సంధ్యాదేవి కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. ప్రభుత్వం నుంచి పైసా పరిహారం కూడా అందలేదని, ఏం చేయాలో పాలుపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది.పరిహారం కోసం ఎదురు చూపుప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం సిద్ధినాయునిపల్లికి చెందిన రుద్రపాటి చిన్న వెంకట చన్నయ్య (70) 30 ఏళ్లుగా వ్యవసాయం చేసేవాడు. సొంతంగా ఆరెకరాలు, కౌలుకు 2 ఎకరాలు తీసుకొని టమాటా, పొగాకు సాగు చేశాడు. అప్పులు చేసి మూడు బోర్లు వేసినా నీరందక అవస్థలు పడ్డాడు. సకాలంలో వర్షాలు కురవక పోవడంతో పాటు చీడపీడలు కారణంగా పంటలు దెబ్బతినగా, పెట్టుబడులు కూడా దక్కలేదు. రూ.9 లక్షలకుపైగా చేసిన అప్పులు తీర్చే దారిలేక గత నెల 8న సొంత పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. త్రీమెన్ కమిటీ విచారణలో కూడా ఇదే విషయం నిర్ధారణ అయింది. అయినా పరిహారం ఇవ్వ లేదంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.అప్పులోళ్ల ఒత్తిళ్లు భరించలేక..పల్నాడు జిల్లా వెల్దురికి చెందిన పల్లపోలు వేణుగోపాల రెడ్డి (68) 1.50 ఎకరాలు కౌలుకు తీసుకొని పదేళ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు. ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా పంటలు దెబ్బ తిన్నాయి. సాగు కోసం చేసిన అప్పులు రూ.20 లక్షల వరకు చేరుకున్నాయి. వాటిని తీర్చే దారిలేక, అప్పులోళ్ల ఒత్తిళ్లు భరించలేక గత నెల 22న ఇంట్లోనే ఉరి పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భర్త చనిపోవడంతో తామంతా రోడ్డున పడ్డామని, తమకు ఆసరా లేకుండాపోయిందని, పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కూలి పనికి వెళ్తోన్న భార్య లక్ష్మి వేడుకుంటోంది.స్వాతంత్య్రం వచ్చిన రోజే.. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం పందిర్లపల్లెకు చెందిన మహిళా రైతు మాదిగ సువర్ణ (39) తన 7 ఎకరాల భూమిలో ఆముదం, మిరప పంటలు సాగు చేసింది. వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు దెబ్బతిన్నాయి. చేసిన అప్పులు రూ.8 లక్షలకు పైగా ఉన్నాయి. వాటిని తీర్చే దారిలేక స్వాతంత్య్ర దినోత్సవం రోజైన ఆగస్టు 15న పొలంలోనే బావి వద్ద పురుగుల మందు తాగి తనువు చాలించింది. కుటుంబానికి జీవనాధారమైన సువర్ణ అర్ధాంతరంగా చనిపోవడంతో తనకున్న ముగ్గురు కుమార్తెలు, కుమారుడ్ని పోషించుకునే దారిలేక అనారోగ్యంతో బాధ పడుతున్న భర్త పాండు కన్నీటి పర్యంతమవుతున్నాడు.30 ఏళ్లకే తనువు చాలించి..అనంతపురం జిల్లా కాలువపల్లికి చెందిన యువ రైతు ఎర్రిస్వామి(30) అప్పుల బాధతో జూన్ 17న ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న ఐదెకరాల్లో సాగు కోసం అప్పులు చేసి మరీ బోరుబావులు తవ్వించాడు. నీరు పడలేదు. మరో ఐదెకరాలు కౌలుకు తీసుకొని కర్బుజా, టమాటా పంటలు సాగు చేశాడు. వర్షాభావ పరిస్థితులతో కలిసి రాలేదు. అప్పులు రూ.25 లక్షలు తీర్చే దారిలేక పొలం వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు ఇలా 30 ఏళ్లకే మృత్యువాత పడడంతో తల్లి లక్ష్మిదేవి, భార్య ప్రియాంకలు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే తమ గతేమిటని ప్రశ్నిస్తున్నారు. -
ఆరు నెలల్లో మూడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు: అమర్నాథ్రెడ్డి
సాక్షి,అన్నమయ్యజిల్లా: అధికారంలోకి రాకముందు ఎన్నోహామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వ పెద్దలు తీరా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే మూడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి విమర్శించారు. మంగళవారం(డిసెంబర్24) రాజంపేట వైఎస్సార్సీపీ కార్యాలయంలో అమర్నాథ్రెడ్డి మీడియాతో మాట్లాడారు.‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక మునుపు ఎన్నో హామీలు ఇచ్చింది. అధికారంలో వచ్చిన ఆరు నెలల్లోనే మూడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది. ఎస్సీ కాలనీలలో విద్యుత్ కనెక్షన్లు తొలగించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అధినేత వైఎస్ జగన్ పిలుపుమేరకు 27న విద్యుత్ ఛార్జీల బాదుడే బాదుడుపై వైఎస్సార్సీపీ పోరాటం చేయనుంది.ప్రతి నియోజక వర్గంలో ర్యాలీలు నిర్వహించి విద్యుత్ స్టేషన్ల ఎదుట ధర్నా చేయనున్నాం. విద్యుత్ వినియోగదారుల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం చేస్తోంది. ఈ నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలి’అని అమర్నాథ్రెడ్డి పిలుపునిచ్చారు. -
కూటమి పార్టీల్లో ‘బెనిఫిట్ షో’ వివాదం
సాక్షి,విశాఖపట్నం : కూటమి నేతల మధ్య బెనిఫిట్ షో వివాదం తలెత్తింది. బడా సినిమాల బెనిఫిట్ షోలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సమర్థించారు. మరోపక్క ఎంఎల్ఏలు విష్ణు కుమార్ రాజు, బండారు సత్యనారాయణమూర్తి బెనిఫిట్ షోను వ్యతిరేకించారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ‘బెనిఫిట్ షోలు రద్దు చెయ్యాలనేది నా అభిప్రాయం. బెనిఫిట్ షోల వల్ల ఎవరికి లాభం. ఒకవేళ షోలకు అనుమతిచ్చినప్పటికీ నియంత్రణ ఉండాలి.అల్లు అర్జున్‌పై పురందేశ్వరి, కిషన్‌రెడ్డి వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు’అని స్పష్టం చేశారు. మరోపక్క టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ‘బెనిఫిట్ షోలు ఎవరికోసం అనుమతినిస్తున్నారు.ఒక్కో హీరో వంద నుంచి 300 కోట్ల వరకు తీసుకుంటున్నారు. గతంలో బెనిఫిట్స్ అంటే చారిటీ కోసం వేసేవారు.ఇప్పుడు సినిమా నిర్మాతల కోసం బెనిఫిట్ షోలు వేస్తున్నారు.సినిమాలకు వేల కోట్ల ఆదాయం వస్తుంటే జీఎస్టీ,ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఏం చేస్తున్నారు.ఎవడబ్బ సొమ్మని బెనిఫిట్ షోలు వేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు’అని ప్రశ్నించారు. ఇదీ చదవండి: నేనే సీఎం.. డిప్యూటీ సీఎం -
ఏబీ వెంకటేశ్వరరావుకు కూటమి ప్రభుత్వ కానుక
సాక్షి,విజయవాడ: ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై కూటమి ప్రభుత్వం అన్ని విచారణలు నిలిపివేసింది. విచారణలు నిలిపివేస్తూ చీఫ్ సెక్రటరీ నీరబ్‌కుమార్ ప్రసాద్ శనివారం(డిసెంబర్21) ఉత్తర్వులు జారీ చేశారు. 2014 నుంచి 2019 దాకా టీడీపీ అధికారంలో ఉన్నపుడు ఏబీ వెంకటేశ్వర్రావుపై ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వర్రావుపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణకు ఆదేశించారు. ఈ విచారణలన్నింటిని ఎత్తివేస్తున్నట్లు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉత్తర్వులివ్వడంపై విస్మయం వ్యక్తమవుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే ఏబీ వెంకటేశ్వర్రావు ఐపీఎస్ అధికారిగా రిటైర్ అయ్యారు. -
AP: భారీగా అప్పుల సేకరణకు కేబినెట్ ఆమోదం
సాక్షి,విజయవాడ:ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. భారీగా అప్పుల సేకరణకు ఏపీ కేబినెట్ గురువారం(డిసెంబర్ 19) ఆమోదం తెలిపింది.పెద్ద ఎత్తున రూ.17 వేల కోట్ల రుణాలు సేకరించాలని కేబినెట్ నిర్ణయించింది.మార్క్‌ఫెడ్ ద్వారా రూ. 1000 కోట్ల అప్పులు సమీకరించేందుకు ఆమోద ముద్ర వేశారు.కెఎఫ్‌డబ్ల్యూ ఆర్థిక సంస్థ ద్వారా రూ. 5 వేల కోట్లు,హడ్కో ద్వారా రూ. 11 వేల కోట్ల రుణాలను సేకరించేందుకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కాగా, వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నపుడు ఏపీ ప్రభుత్వ అప్పులు పెరిగిపోతున్నాయని, ఏపీ శ్రీలంకలా మారిపోతోందని ప్రస్తుత కూటమి ప్రభుత్వ పెద్దలు, అప్పటి ప్రతిపక్షనేతలు గగ్గోలు పెట్టిన విషయం తెలిసిందే. వారే ఇప్పుడు ఎడాపెడా అప్పులు తీసుకుంటుండడంపై విస్మయం వ్యక్తమవుతోంది. -
రూ.70వేల కోట్ల అప్పు ఏం చేశారు ?: బొత్స సత్యనారాయణ
సాక్షి,విశాఖపట్నం:కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలయిందని, ఎన్నికల్లో హామీలేవీ నెరవేర్చలేదని మండలి ప్రతిపక్షనేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు,గుడివాడ అమర్నాథ్,మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీతో కలిసి విశాఖపట్నంలో బొత్స సోమవారం(డిసెంబర్2) మీడియాతో మాట్లాడారు.‘ఎన్నికల హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికుంది. ఎన్నికల హామీలకు బడ్జెట్లో కేటాయించిన నిధులకు పొంతన లేదు.హామీలు నెరవేర్చకపోగా ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపారు.యూనిట్‌కు 1రూపాయి20పైసలు పెంచారు.ప్రజలపై మొత్తం రూ.15 వేల కోట్ల భారం మోపారు. అప్పుల భారం పెంచుతున్నారని వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారు.మరి కూటమి ప్రభుత్వం అప్పులెందుకు చేస్తోంది. ఆరు నెలల్లో చేసిన రూ.70 వేల కోట్ల అప్పు ఎక్కడికి పోయిందో చెప్పాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలి’అని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. బొత్స ఇంకా ఏమన్నారంటే..ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిది.ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు బడ్జెట్ లో చోటు లేదు.హామీలకు బడ్జెట్ లెక్కలకు పొంతన లేదు.ఎన్నికలకు ముందు కూటమి నేతలు నిత్యావసర వస్తులు పెంచమని చెప్పారు.చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ధరలు పెంచమని పదే పదే చెప్పారు.యూనిట్ విద్యుత్ ధర 1.20 రూపాయలు పెరిగింది.రూ. 15 వేల కోట్ల విద్యుత్ బారాన్ని ప్రజలపై ఈ ప్రభుత్వం మోపుతుంది.విద్యుత్ చార్జీలు పెంచడం ఎంతవరకు సమంజసంఅన్ని పరిణామాలు ఆలోచించే కదా ఎన్నికల్లో చంద్రబాబు విద్యుత్ చార్జీలు పెంచమని చెప్పారు.రూ. 15 వేల కోట్ల బారాన్ని ప్రభుత్వమే భరించాలిప్రభుత్వమే డిస్కంలకు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాంరూ 67 వేల 237 కోట్లు అప్పు చేసింది కూటమి ప్రభుత్వంఈ మంగళవారం మళ్ళీ రూ. 4 వేల కోట్లు అప్పు చేయబోతున్నారు.మొత్తం అప్పు రూ. 70 వేల కోట్లకు చేరుతుంది.గతంలో మా ప్రభుత్వం డిస్కంలకు డబ్బులు చెల్లించాం.పెన్షన్ తప్ప ఒక్క పథకం కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉంటే ఈ ఆరు నెలల్లో రూ.18 వేల కోట్ల పేద ప్రజల ఖాతల్లో వేసేవాళ్ళం.గత సంవత్సరం ఇదే సమయానికి అమ్మఒడి,వసతి దీవెన,విద్యా దీవెన,రైతు భరోసా,సున్నా వడ్డీ,మత్స్యకార భరోసా,ఈబీసీ నేస్తం నిధులు ప్రజలకు ఇచ్చాంఈరోజుకి గత సంవత్సరంలో రూ. 18 వేల 200 కోట్లు ఇచ్చాంప్రజలకు పథకాలు ఇవ్వడం ఈ ప్రభుత్వం ప్రయారిటీ కాదుపేద ప్రజలకు పథకాలు ఎప్పటి నుంచి ఇస్తారురూ. 67 వేల కోట్లు అప్పు తెచ్చి దేనికి ఖర్చు చేశారుప్రజల తరఫున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాంపథకాలు ఇవ్వడం లేదు సరి కదా విద్యుత్ చార్జీల మోత మోగించి ప్రజల నడ్డి విరుస్తున్నారుమా ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పులు చేశామని గగ్గోలు పెట్టారు.. ఇప్పుడు అప్పులు చేసి మీరేం చేస్తున్నారుమీ సోకులకు వాడుకుంటున్నారా..?గతంలో కూడా చంద్రబాబు అప్పులు చేసి వెళ్తే మేం కూడా ఆ అప్పులు చెల్లించాంప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోయిందిగతంలో పథకాలు అందడం వలన మార్కెట్ మంచిగా ఉండేదిజీఎస్టీ తగ్గిపోతోంది..చాలా ఆందోళనగా ఉంది..వ్యాపారాలు ఏమి జరగడం లేదువాటాల కోసం ఎమ్మెల్యేలు తన్నుకుంటున్నారుదానికి సీఎం చంద్రబాబు పంచాయితీ ఏమిటిప్రభుత్వం అంటే భయం, భక్తి ఉండాలి.. ఏది లేకపోతే ఎలా..?నూతన మద్యం పాలసీ వచ్చాక బెల్టు షాపులు ఎక్కువయ్యాయిబెల్టు షాపులకు బహిరంగ వేలం వేస్తున్నారుమా సమీప గ్రామంలో బెల్టు షాపు రూ. 50 లక్షలకు వేలం వేశారుఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా..?ఈనాడు, జ్యోతి కథనాలనే నేను చెప్తున్నానుపవన్ కాకినాడ పర్యటన..గబ్బర్ సింగ్-3పవన్ కాకినాడ పర్యటన.. గబ్బర్ సింగ్..3ని తలపించిందిపీడీఎస్ బియ్యం అక్రమ రవాణా తప్పే.. చర్యలు తీసుకోండిఎమ్మెల్యేని కాంప్రమైస్ అయ్యావా..? అని పవన్ అడుగుతున్నారుపక్కన ఉన్న మీ మంత్రి మాటేంటి..?ఆయన చేతకాని వాడా..?పోర్టులో అక్రమాలు జరిగితే చర్యలు తీసుకోండిరెడ్డి, చౌదరి ఎవ్వరైనా తప్పు చేస్తే ఒకేలా స్పందించాలిబియ్యం అక్రమ రవాణాపై బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లి అనుమతులు ఇప్పించారునిజమా కాదా..? గుండెల మీద చెయ్యి వేసుకొని ఆలోచించుకోండి.. -
AP: సోషల్ మీడియా కార్యకర్తలపై పెరిగిన వేధింపులు
సాక్షి,తాడేపల్లి:ఏపీలో సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసుల వేధింపులు ఆగడం లేదు. సోషల్‌మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నవారిని టార్గెట్ చేసి మరీ భారీగా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఇప్పటికే ఒక్కొక్కరిపై పది నుంచి ఇరవైకి పైగా అక్రమ కేసులు నమోదు చేశారు. సజ్జల భార్గవ్‌పై11, అర్జున్ రెడ్డి మీద 11,వర్రా రవీంద్రరెడ్డిపై 21, ఇంటూరి రవికిరణ్ మీద16,పెద్దిరెడ్డి సుధారాణిపై 10,వెంకటరమణారెడ్డిపై 10 కేసులు పెట్టారు. ఇవి కాకుండా చంద్రబాబు సర్కారు రహస్యంగా మరికొన్ని కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.కేసులు నమోదైనవారిలో ఎవరైనా హైకోర్టులో హెబియస్ కార్పస్,క్వాష్, ముందస్తు బెయిల్ పిటిషన్లు వేస్తే వారిని పోలీసులు మరింతగా టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ,వాక్ స్వాతంత్రం అసలే కనిపించడం లేదని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. -
రాజ్యమేలుతున్న మారీచ తంత్రం!
వారి మాటల్లో మారీచ తంత్రం ఉంటుంది... ఓట్ల కోసం బంగారు జింకలమని చెప్పుకున్నారు కదా! చేతలు మరీచికా సదృశాలు... అమలుకాని హామీలు ఎండమావుల్ని తలపించడం లేదా? ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలిస్తున్న కూటమి సర్కార్ అనాటమీ ఓ కుతంత్రాన్ని తలపిస్తున్నది. గుండెల్లో గోబెల్స్‌ను పూజిస్తూ జెండాపై ఊసరవెల్లిని ఎగరేసినట్టుగా వారి చర్యల తాత్పర్యం తేటతెల్లం చేస్తున్నది. ఎన్నికల ముందు చేసిన బాసలకూ, ఇప్పుడు మాట్లాడుతున్న భాషకూ పొంతన కుదరడం లేదు. దగా, మోసం, వంచన... మూడు పార్టీల కూటమికి ముచ్చటైన స్ఫూర్తి వాచకాలేమో!గద్దెనెక్కడం వరకే ఈ దగా పర్వం పూర్తి కాలేదు. ప్రజల ప్రశ్నించే హక్కును హైజాక్ చేయడానికి డైవర్షన్ కమెండోలను రంగంలోకి దించుతున్నారు. ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననం కోసం పాతాళానికి దిగజారుతున్నారు. రణనీతిని రాక్షసరీతి కమ్మేసింది. అసత్యాలను కూడిక చేసి, హెచ్చ వేసి, ఆపైన అచ్చేసి మెదళ్లను కలుషితం చేస్తున్నారు. వారి పరిపాలనా వైఫల్యాలను ఎవరూ ప్రశ్నించకూడదు. ఎన్నికల మేనిఫెస్టో గురించి ఎవరూ మాట్లాడకూడదు. తాము ఎత్తిపోసిన బురదను కడుక్కునే పనికి మాత్రమే ప్రతిపక్షం పరిమితమై ఉండాలి. ఇదీ ఎత్తుగడ!కూటమి సర్కార్ వంచనా శిల్పం ప్రజాస్వామ్యాన్ని కూడా చెరబడుతున్నది. ప్రజల ప్రాథమిక హక్కయిన భావప్రకటనా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తున్నది. అసభ్య పోస్టింగ్‌లనే ముద్రవేసి హేతుబద్ధమైన విమర్శలపై సైతం లాఠీ ఝళిపిస్తున్నది. నోళ్లు నొక్కేయడానికి తెగిస్తున్న తీరు ఎమర్జెన్సీ కాలాన్ని మరిపిస్తున్నది. సమాచార విప్లవ ఫలితంగా ప్రభవించిన సోషల్ మీడియా యుగంలో ఉన్నాము. భావప్రకటనా స్వేచ్ఛను సకల జనులకూ అందుబాటులోకి తెచ్చిన యుగమిది. తప్పుడు హామీలిచ్చి తోక జాడిస్తే గతంలో మాదిరిగా ఇప్పుడు జనం మిన్నకుండిపోవడం లేదు. ప్రశ్నిస్తున్నారు. వారి ప్రశ్నలు సోషల్ మీడియాలో ప్రతిధ్వనిస్తున్నవి.ఏ నాయకుడు ఎప్పుడేమి మాట్లాడిందీ సాక్ష్యాధారాలతో జనం చేతిలో ఉంటున్నది కనుక ఇప్పుడు పబ్లిక్ ఆడిట్‌ను ఎవరూ తప్పించుకునే పరిస్థితి లేదు. అబద్ధాల పునాదులపై మొలకెత్తిన రాజకీయ నాయకులను ఈ పబ్లిక్ ఆడిట్ భయ పెడుతున్నది. ఈ భయపెడుతున్న మీడియానే భయపెట్టడానికీ, గొంతునొక్కడానికీ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని ఇప్పుడు ఏపీలో చూస్తున్నాం. రాజకీయ పోస్టులు పెడుతున్న దాదాపు 700 మందికి గత కొద్దిరోజులుగా పోలీసులు నోటీసులు పంపించారు. అందులో 176 మందిపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. 55 మందిని చెప్పాపెట్టకుండా అరెస్ట్‌లు చేసి, స్టేషన్ మార్చి స్టేషన్‌కు తిప్పారు. హైకోర్టులో హెబియస్ కార్పస్ దాఖలైతే తప్ప చాలా అరెస్టులను చూపనే లేదు. ఎమర్జెన్సీ కాలంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు జరగలేదు.అరెస్టయిన, కేసులను ఎదుర్కొంటున్న సోషల్ మీడియా యాక్టివిస్టుల పోస్టుల్లో అత్యధికం రాజకీయపరమైనవే. నిజమే, అసభ్య పోస్టులు అనే జాడ్యం సోషల్‌మీడియాలో ప్రమాదకరంగా మారింది. ఈ జాడ్యానికి మందు వేయాల్సిందే! కానీ ఈ పేరుతో సర్కార్ తనకు గిట్టని పోస్టులు పెడుతున్నవారిని వేటాడుతున్నది. తెలుగుదేశం పార్టీ తరఫున పని చేస్తూ బూతు పోస్టులు పెట్టే వారిపై ఇంతవరకూ ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం, వైసీపీకి అనుకూలంగా ఉండేవారినే వేటాడటం దేన్ని సూచిస్తున్నది? రాజకీయ కక్షనే కదా! ఈ కక్ష ఎంత దూరం వెళ్లిందంటే ఆర్గనైజ్డ్ క్రిమినల్స్‌పై పెట్టే సెక్షన్లను ఈ యాక్టివిస్టుల మీద పెడుతున్నారు. టెర్రరిస్టులు, స్మగ్లింగ్, డ్రగ్స్ ముఠాలు వగైరాలు ఈ వ్యవస్థీకృత నేరాల పరిధిలోకి వస్తాయి. పైగా రెండు మూడేళ్ల కిందటి పోస్టులకు కూడా ఈ యేడు జూలై 1వ తేదీన అమల్లోకి వచ్చిన బీఎన్ఎస్ సెక్షన్లను ఆపాదిస్తున్నారు. అలా చేయవద్దని ఉన్నత న్యాయస్థానాల తీర్పులున్నప్పటికీ మనవాళ్లు పట్టించుకోవడం లేదు. కొత్తగా వచ్చిన శిక్షాస్మృతి ప్రకారం సైబర్ నేరాలు ఆర్గనైజ్డ్ క్రైమ్ కేటగిరీలోకి వస్తాయి. సోషల్‌మీడియాను కూడా సైబర్ నేరాల పరిధిలోకి తీసుకొనిరావడమనేది అచ్చంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వ క్రియేటివిటీ. రాజకీయాలకు అనుబంధంగా పనిచేస్తూ సోషల్ మీడియాను హోరెత్తించే గ్రూపుల్లో అత్యంత ఆర్గనైజ్డ్ గ్రూప్ ‘ఐటీడీపీ’ అనే సంగతి జగమెరిగిన సత్యం. ఇది తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నదనే సంగతి కూడా తెలిసిందే. అసభ్య పోస్టులు, బెదిరింపు పోస్టులు పెట్టడంలో కూడా ‘ఐటీడీపీ’దే అగ్రస్థానమని విశ్లేషకులు ఎవరైనా చెబుతారు. ఇదే విషయాన్ని ప్రముఖ రాజకీయ వ్యాఖ్యాత ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా వెల్లడించారు. తనకు తెలిసినంత వరకూ ఏ రాజకీయ పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగం కూడా ఐటీడీపీ స్థాయిలో బూతులకూ, బెది రింపులకూ తెగబడలేదని ఆయన వెల్లడించారు. రాజకీయ ప్రత్యర్థులనే కాదు తన లాంటి తటస్థ రాజకీయ విశ్లేషకులను కూడా వాళ్లు వదిలిపెట్టడం లేదని ఆయన వాపోయారు. తెలుగు దేశం అభిమానులు అర్ధరాత్రి, అపరాత్రి కూడా ఫోన్లు చేసి తిడుతున్నారని ఆరోపించారు. తమకు గిట్టనివారు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపించకపోతే... ఈ–మెయిళ్ల ద్వారా బూతు పంచాంగాలు పంపించడం ఆ పార్టీ అభిమానులకు రివాజుగా మారింది. ఈ పత్రిక సంపాదకుడు కూడా ఇటువంటి బూతు మెయిళ్ల బాధితుడే!‘ఐటీడీపీ’ వంటి నెంబర్ వన్ ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా గ్రూప్ సభ్యులపై కేసు కూడా పెట్టలేదంటేనే ప్రభుత్వ ఉద్దేశమేమిటో స్పష్టమవుతున్నది. తమ రాజకీయ ప్రత్యర్థుల పైనా, వారి కుటుంబ సభ్యుల పైనా ఏ తరహా పోస్టులను ఈ గ్రూప్ సభ్యులు పెట్టారో తెలియదా? ఎంతగా వేధించారో తెలియదా? ఈ ఉద్యమకారుల సృజనాత్మకత కూడా చాలా పదునైనది. పేర్లను మార్చుకొని పరకాయ ప్రవేశం చేసి పెట్టిన కామెంట్లతో కల్లోలం సృష్టించడం వారికో హాబీ. వర్రా రవీందర్ రెడ్డి అనే వైసీపీ అభిమాని పేరుతో జగన్ మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యుల మీద ఓ తెలుగుదేశం అభిమాని పెట్టిన పోస్టులు కూడా అటువంటి కల్లోలాన్నే సృష్టించాయి. దీనిపై దర్యాప్తు జరిపిన పోలీసులు అది రవీందర్ రెడ్డి పెట్టిన పోస్టు కాదనీ, మరొకరు పెట్టిన ఫేక్ పోస్ట్ అనీ తేల్చారు. ఆ రంగులు మార్చిన మారీచు డిని కూడా గుర్తించారు.జరిగింది ఇదైతే... తెలుగుదేశం పార్టీ విభాగాలన్నీ కలిసి చేసిన నీచప్రచారం మరొకటి! నిన్న అసెంబ్లీలో కూడా ఈ దుష్ప్రచారపు బాణీనే ముఖ్యమంత్రి చంద్రబాబు అందిపుచ్చు కున్నారు. అసెంబ్లీ చరిత్రలో ఇంతకంటే బాధాకరమైన సన్నివేశం మరొకటి కనిపించదు. ‘ఐటీడీపీ’ చేయించిన తప్పుడు ప్రచారానికి ముఖ్యమంత్రి అసెంబ్లీలోనే తందానా అన్నారు. తల్లి మీద, చెల్లి మీద జగన్ నీచమైన ప్రచారం చేయించారని దారుణమైన నిందను మోపారు. ఇది హీనమైన ప్రచార మనీ, మీ పార్టీ వాళ్లే సృష్టించిన పన్నాగమనీ నిజంగానే మీకు తెలియదా బాబు గారూ! మీ సతీమణి భువనేశ్వరమ్మను అసెంబ్లీలో ఎవరో ఏదో అన్నారని మీరు వెక్కి వెక్కి ఏడ్చారే! మరి అసెంబ్లీలో ఒక దుష్ప్రచారాన్ని ఉటంకిస్తూ జగన్ తల్లి, చెల్లెలి ప్రస్తావన స్వయంగా మీరే తేవడం సమంజసమేనా?ఎన్నికల్లో గెలవడం కోసమే అలవిగాని హామీలిచ్చామనే సంగతి చంద్రబాబుకు స్పష్టంగా తెలుసు. ఆ వాగ్దానాలను నెరవేర్చలేమనే విషయాన్ని ఆయన నిన్నటి అసెంబ్లీ ప్రసంగంలో నర్మగర్భంగా చెప్పుకొచ్చారు. హామీల అమలుకు డబ్బుల్లేవు గానీ ఆలోచనలున్నాయని, ఆలోచనల్లోంచే సంపద సృష్టి జరుగుతుందనీ, అప్పుడు గానీ సంక్షేమ కార్యక్రమాలు అమలు కాబోవనేది ఆయన ప్రసంగంలోని సారాంశం. ఆయన మేధలో ఏయే విత్తనాలను నాటుకున్నారో మనకు తెలియదు. అవి మొలకెత్తి మొక్కగా మారి చెట్టయ్యేది ఎప్పటికో కూడా చెప్పలేము. ఆ చెట్టు పుష్పించి ఫలించిన రోజున ఆ ఫలాలను పేద వర్గాలకు అందజేయడం జరుగుతుందనే భరోసాతో ఎదురుచూడక తప్పదు. అందరికీ అంత ఓపిక ఉండకపోవచ్చు. తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేశారని జనం తిరగబడ వచ్చు. అందుకు విరుగుడు మంత్రమే... ఈ గోబెల్స్ నాజీల తరహా విషప్రచారం! ఫాసిస్టు పాలనను తలదన్నేలా అర్ధరాత్రి అరెస్టులు, బెదిరింపులు!జగన్ ఐదేళ్లపాటు విధ్వంస పాలన చేశాడనే విష ప్రచారాన్ని ఐదేళ్లపాటు తెలుగుదేశం నేతలు, యెల్లో మీడియా, ‘ఐటీడీపీ’ బృందాలు నిర్వహించాయి. నిరుపేద బిడ్డలకు కూడా నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నాన్ని ఈ కూటమి విధ్వంస పాలనగా పరిగణిస్తున్నది. పల్లెపల్లెకూ, గడప గడపకూ ప్రజావైద్యాన్ని అందుబాటులోకి తేవడం ఈ ముఠాకు విధ్వంసంగా కనిపించింది. ఐదేళ్లలో రెండు లక్షల డెబ్భయ్ మూడువేల కోట్ల ప్రజాధనాన్ని ప్రజల చేతికి చేర్చడమే వీరి దృష్టిలో విధ్వంస పాలనైందని అనుకోవాలి. వృద్ధాప్యంలో ఉన్న వారి ఇంటి తలుపు తట్టి, పింఛన్ డబ్బులు చేతిలో పెట్టడం అరాచక పాలనగానే కనిపించింది. గ్రామస్వరాజ్యాన్ని సాకారం చేసి, పదిహేను వేల మినీ రాజధానులను ఏర్పాటు చేయడం వినాశకర పాలనగా కనిపించింది. ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలేగానీ, పదిహేను వేల పల్లె రాజధానులెందుకని వారికి చిరాకు కలిగి ఉంటుంది.ఏకబిగిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతులు తెచ్చి, అందులో ఐదు కాలేజీలను ప్రారంభించడం విధ్వంసం కాక మరేమిటి? నాలుగు భారీ ఓడరేవులకు పనులు ప్రారంభించడమేమిటి? పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ఎందుకోసం? రైతుల కోసం ఊరూరా ‘ఆర్బీకే’ కేంద్రాలు అవసరమా? ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిని ఒక జిల్లాగా పునర్విభజించి పాలనా సంస్కరణలకు తెగబడటమేమిటి? అంతకు ముందు పధ్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న బాబుగారు ఒక్క జిల్లానైనా కొత్తగా చేర్చారా? అది కదా పొదుపంటే! ...ఇటువంటి అనేకా నేక కారణాల రీత్యా జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన చేశారనే ప్రచారాన్ని కూటమి ఉద్యమ స్థాయిలో చేపట్టింది. ముఖ్యమంత్రి నిన్నటి అసెంబ్లీ ప్రసంగంలో కూడా దానిని కొనసాగించారు. అప్పుల గురించి, అభివృద్ధి గురించి తెలుగు దేశం... యెల్లో మీడియా కూటమి చేసిన అరోపణలకు ఇప్పటికి కొన్ని డజన్ల పర్యాయాలు అధికారిక గణాంకాల ఉటంకింపులతో వైసీపీ వాళ్లు ధీటైన సమాధానాలు చెప్పారు. మొన్నటి బడ్జెట్ తర్వాత రెండు గంటల సుదీర్ఘ సమయాన్ని వెచ్చించి జగన్ మోహన్‌రెడ్డి కూటమి వాదనను పూర్వపక్షం చేశారు. అయినా సరే చంద్రబాబు నిన్న అదే పాటను మళ్లీ పాడారు. పాడిన పాటే పాడటంపై తెలుగులో మనకు చాలా సామెతలున్నాయి!వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
నా భర్తను చిత్రహింసలు పెట్టి వాంగ్మూలం తీసుకున్నారు: వర్రా కళ్యాణి
సాక్షి,వైఎస్సార్‌జిల్లా: తన భర్తను నవంబర్ 11వ తేదీన అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నది పూర్తిగా అబద్ధమని సోషల్‌మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి భార్య వర్రా కళ్యాణి చెప్పారు. ఈ మేరకు శనివారం(నవంబర్ 16) వర్రా కళ్యాణి మీడియాతో మాట్లాడారు.‘కర్నూలు టోల్‌ప్లాజా వద్ద నవంబర్ 8వ తేదీన నా భర్తను అదుపులోకి తీసుకున్నారు. ఆ వీడియో మీడియాకి విడుదల చేస్తున్నాను. మూడు రోజులు నా భర్తను చిత్రహింసలకు గురిచేసి తప్పుడు వాగ్మూలం తీసుకున్నారు. ఇదే విషయాన్ని మెజిస్ట్రేట్ ముందు కూడా రవీంద్రారెడ్డి చెప్పారు. నా భర్తకు జరిగిన అన్యాయం ప్రజలందరికీ తెలియాలి. అదుపులోకి తీసుకునే వరకూ పోలీసులకు వర్రా రవీంద్రారెడ్డి ఎవరో కూడా తెలియదు.మాస్కులు వేసి తీసుకెళ్ళి ఎక్కడెక్కడో తిప్పారని మెజిస్ట్రేట్ ముందు నా భర్త వాంగ్మూలం ఇచ్చారు. విపరీతంగా రవీంద్రారెడ్డిని కొట్టారని పక్కన ఉన్నవాళ్లు ఉదయ్,సుబ్బారెడ్డి చెప్తున్నారు. పోలీసులు తాము చెప్పినట్లు స్టేట్మెంట్ ఇవ్వాలని చిత్రహింసలు పెట్టారు. నా భర్తకు న్యాయం జరగాలి..స్వయంగా నేను గాయాలు చూశాను. అంత చిత్ర హింసలు పోలీసులు ఎందుకు పెట్టారు? వాళ్ళకు పై నుంచి ఉన్న ఒత్తిడి వల్లే ఇలా చిత్రహింసలు పెట్టారు. ఒప్పుకోకపోతే మీ భార్య,పిల్లలపై కూడా కేసులు పెడతామన్నారు. మా ఆయన ప్రశ్నించారంతే..అసభ్య పోస్టులు పెట్టలేదు. ఉదయ్ భూషణ్ అనే వ్యక్తి నా భర్త పేరుపై 18 ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి తప్పుడు పోస్టులు పెట్టాడు’అని వర్రా కళ్యాణి తెలిపారు. -
పన్నులు పెంచడమే సంపద సృష్టించడమా?: మార్గాని భరత్
సాక్షి,తూర్పుగోదావరిజిల్లా:ఒక శాతం అదనంగా జీఎస్టీ పెంచుకునేందుకు అవకాశం కల్పించాలని చంద్రబాబు కేంద్ర మంత్రిని కోరటం విడ్డూరంగా ఉందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి,రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. సంపద సృష్టించడం అంటే ట్యాక్స్‌లు పెంచేయడమా అని ప్రశ్నించారు. శనివారం(నవంబర్ 16) రాజమండ్రిలో మార్గాని భరత్ మీడియాతో మాట్లాడారు.‘రాజుల కాలంలో ప్రజలను దోచుకుని ఖజానాలు నింపుకునేవారు ..అది ఇదేనా?విజయవాడ వరదల్లో డబ్బు ఎలా పక్కదారి పట్టించారో అందరికీ తెలుసు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా విద్యుత్ స్మార్ట్ మీటర్లు.. ఉరితాళ్ళు అని ఈనాడులో రాశారు.ఇప్పుడు స్మార్ట్ మీటర్లు వచ్చేశాయ్ అని ఇదే అంశంపై ఈనాడులో కథనం వచ్చింది. చంద్రబాబు అధికారంలో ఉంటే ఒకలా..ప్రతిపక్షంలో ఉంటే మరోలా ప్రవర్తిస్తారు.ఐదు నెలల్లో రూ.57వేల కోట అప్పులు చంద్రబాబు చేశారు.ఐదు నెలల తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్లో టీడీపీ చెప్పిన అబద్ధాలు స్పష్టమయ్యాయి. గతంలో వైఎస్జగన్ రూ.14 లక్షల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా రూ. 6 లక్షల కోట్ల అప్పులు మాత్రమే ఉన్నాయని తేల్చారు. స్మార్ట్ మీటర్ల పేరు చెప్పి రూ.11వేల కోట్లు ప్రజలపై రుద్దేందుకు చంద్రబాబు ఏర్పాట్లు చేశారు. నవంబర్ 15 నుంచి యూనిట్ రూపాయి 58 పైసలు పెంచేందుకు బాదుడు సిద్ధం చేశారు.టీడీపీ ఎమ్మెల్యేలు యథేచ్చగా ఇసుక అమ్ముకుంటున్నారు. ఇసుక పాలసీపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే మండిపడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో వేలకోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం లభించేది. ఈనాడులో నిస్సిగ్గుగా వైఎస్జగన్ కుటుంబ సభ్యులపై వార్తలు రాయడం దారుణం. మనుషుల క్యారెక్టర్‌ను అసాసినేట్ చేసే విధంగా ఫేక్ అకౌంట్లు సృష్టిస్తున్నారు’అని మార్గాని భరత్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: బీజేపీ కోసం ఏపీ ప్రయోజనాలు పణం -
అక్రమ కేసులు.. నిర్బంధాలు.. చిత్రహింసలు.. అరాచకానికి పరాకాష్ట
‘‘మేము ఎలా పాలన సాగించినా ఎవరూ నోరెత్తకూడదు.. ఇది మా ప్రభుత్వం.. అంతా మా ఇష్టం.. తప్పు పట్టడానికి మీరెవరు? కాదు కూడదని మా నిర్ణయాలను ప్రశ్నిస్తే నాలుగు తగిలించడంతో పాటు నాన్ బెయిలబుల్ సెక్షన్లపై కేసులు పెట్టి బొక్కలో వేస్తాం. ఏం చేస్తారో చేసుకోండి. సుప్రీంకోర్టు, హైకోర్టుల సంగతి మా లాయర్లు చూసుకుంటారు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్లను కూడా వదిలి పెట్టం. మేం చెప్పినట్లు ఎన్ని తప్పుడు కేసులైనా పెట్టడానికి పోలీసులున్నారు. ఆ విధంగా వాళ్లను ట్యూన్ చేసుకున్నాం. ఎవరైనా తోక జాడించి మమ్మల్ని ప్రశ్నిస్తే ఏం చేస్తామో.. ఎలాంటి కేసులు పెడతామో మాకే తెలియదు’’ అన్నట్లు కూటమి సర్కారు గుడ్లురు ముతోంది. నియంతృత్వమే తమ చట్టం అని, రెడ్‌బుక్ తమ రాజ్యాంగమని స్పష్టం చేస్తోంది. తాలిబన్లు సైతం విస్తుపోయేలా వికటాట్టహాసం చేస్తూ, సోషల్ మీడియా యాక్టివిస్టులను భయభ్రాంతులకు గురిచేస్తూ రాజ్యమేలుతోంది. పక్కన పేర్కొన్న దయనీయ సంఘటనే ఇందుకు ఓ ఉదాహరణ. ఇలాంటి ఉదాహరణలు రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో ఉండటం ప్రజాస్వామ్య వాదులను విస్మయ పరుస్తోంది.సాక్షి, అమరావతి: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వారిపైకి పోలీసులను ఉసిగొలుపుతోంది. రాజ్యాంగ ధర్మాన్ని మంటగలుపుతూ పౌర హక్కులను కాలరాస్తోంది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు చట్టం, రాజ్యాంగం అనే వాటికి తిలోదకాలు వదిలారు. అధికార పారీ్టల నేతలు చెప్పిన వారందరిపై ఉన్నవీ లేనివీ కల్పించి ఎక్కడికక్కడ తప్పుడు కేసులు పెడుతున్నారు. ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులతో విరుచుకుపడుతున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని 24 గంటల్లో న్యాయస్థానంలో హాజరు పరచాలన్న చట్టాన్ని నిర్భీతిగా ఉల్లంఘిస్తున్నారు. మహిళలు, వృద్ధులు, మైనర్లు అని కూడా చూడకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ చిత్రహింసలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు అర్ధరాత్రి, అపరాత్రి అని కూడా చూడకుండా ఊళ్లపై పడి బీభత్సం సృష్టిస్తున్నారు. నిద్రిస్తున్న వారిని అపహరించుకుపోతున్నారు. ఎక్కడికి తీసుకువెళుతున్నారో చెప్పరు. పోలీసు స్టేషన్‌కు వెళ్లి అడిగితే మాకేం తెలీదనే సమాధానం వస్తుంది. పోలీసు వాహనాల్లో కుక్కి.. కొడుతూ ఎక్కడెక్కడో తిప్పుతున్నారు. గుర్తు తెలియని ప్రదేశాల్లో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఎందుకు కొడుతున్నారని అడిగితే లాఠీలే సమాధానమిస్తున్నాయి. మేం చేసిన తప్పేమిటని ప్రశ్నిస్తే పోలీసుల బూట్లే మాట్లాడుతున్నాయి. ఒక్కొక్కరిపై రెండు మూడు అక్రమ కేసులు నమోదు చేస్తూ ఒక పోలీస్ స్టేషన్ నుంచి మరో పోలీస్ స్టేషన్‌కు తిప్పుతున్నారు. మూడు నాలుగు రోజుల్లోనే ఏకంగా 110కి పైగా అక్రమ కేసులు నమోదు చేయడం ప్రభుత్వ దుర్మార్గానికి నిదర్శనం. ఇవన్నీ బాధితుల తరఫున లాయర్లు, గ్రామ పెద్దలు నిలదీస్తేనే అధికారికంగా ప్రకటించినవి కావడం గమనార్హం. అరెస్టు చూపకుండా వేధిస్తున్న కేసులు వేలల్లో ఉన్నాయనడం అక్షర సత్యం. ఒక్కో కేసులో ఒకరు మొదలు 10–20 మందిని సైతం నిందితులుగా చేరుస్తూ వేధిస్తున్నారు. సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా అరెస్ట్ చేయకూడదన్న సుప్రీంకోర్టు తీర్పును సైతం బేఖాతరు చేస్తున్నారు. 41 ఏ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలన్న ఆదేశాలు తమకు పట్టవన్నట్టు చెలరేగిపోతున్నారు. బాధిత కుటుంబాలు హెబియస్ కార్పస్ పిటీషన్లతో హైకోర్టును ఆశ్రయించినా సరే తమ నియంతృత్వాన్ని నిర్భీతిగా సమర్ధించుకోవడం దుర్మార్గం. ఇదీ చంద్రబాబు మార్కు పోలీసు రాజ్యం. మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగం! సోషల్ మీడియా యాక్టివిస్ట్ పెద్దిరెడ్డి సుధారాణి పట్ల పోలీసులు మహిళ అని కూడా చూడకుండా అత్యంత క్రూరంగా వ్యవహరించడం దారుణం. మూడు రోజుల పాటు ఆమెను, ఆమె భర్తను చిత్రహింసలకు గురిచేశారు. ‘నన్ను ఈ నెల 5వ తేదీన అదుపులోకి తీసుకున్నారు. నా భర్త వెంకటరెడ్డినీ చిత్రహింసలకు గురిచేశారు. చిలకలూరిపేట సీఐ రమేష్ దుర్భాషలాడారు. నోరెత్తితే ఇష్టానుసారం కొట్టారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల వద్ద జొన్నవాడలోని రాజరాజేశ్వరి ఆలయానికి వెళ్లినప్పుడు మమ్మల్ని పల్నాడు జిల్లా చిలకలూరిపేట సీఐ రమేష్ బృందం అదుపులోకి తీసుకుంది. చిలకలూరిపేట, ఒంగోలుకు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారు’ అని బాధితురాలు కన్నీటి పర్యంతమయ్యారు. తుదకు ఆమె తరఫు వారు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో శుక్రవారం సాయంత్రం కొత్త పేట పోలీసులు గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టారు. ఇదే విషయాన్ని ఆమె మెజిస్ట్రేట్ ఎదుటే చెప్పారు. పోలీసులు కొట్టడంతో అయిన గాయాలను సైతం చూపించారు. ఈమెపై ఏకంగా 6 అక్రమ కేసులు బనాయించారు. నా భర్తను చంపేస్తారేమో.. ‘సోషల్ మీడియా యాక్టివిస్టు అయిన నా భర్త వర్రా రవీందర్‌రెడ్డిని పోలీసులు చంపేస్తారేమోనని భయంగా ఉంది. రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇంత వరకు ఎక్కడున్నాడో ఆచూకీ తెలియడం లేదు. ఐ టీడీపీ, విశాఖకు చెందిన టీడీపీ సానుభూతిపరుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి పినపాల ఉదయ భూషణ్, చంద్ర కిరణ్‌లు మా ఆయన పేరుతో ఫేక్ ఐడీ సృష్టించి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. విచారణలో కూడా ఈ విషయం తేలింది. అయినా ఇప్పుడు దీనిపై కుట్ర చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. ఆయనేదో అంతర్జాతీయ టెర్రరిస్ట్ అన్నట్లు వ్యవహరిస్తున్నారు’ అని రవీందర్‌రెడ్డి భార్య కళ్యాణి శనివారం మీడియా ఎదుట కన్నీటి పర్యంతమవడం ప్రభుత్వ దుర్మార్గానికి పరాకాష్టగా నిలుస్తోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మహిళలను వేధించినట్లా? కూటమి ప్రభుత్వ పెద్దలు నివసిస్తున్న విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో అరాచకాలు, దుర్మార్గాలకు అంతే లేకుండా పోయింది. ఓ పోస్టును సాకుగా చేసుకుని కూటమి నాయకుడొకరు తన పార్టీ కార్యకర్తలతో ఈ నెల 2వ తేదీన పలు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులిప్పించాడు. అదే రోజు ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లలోనూ 42 కేసులు నమోదు చేశారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పెండ్యాలలో 172 మందికి నోటీసులిచ్చారు. శుక్రవారం నాటికి మొత్తంగా 260 మందికి నోటీసులు ఇచ్చారు. కూటమి సర్కారు వైఫల్యాలు, అక్రమాలపై ప్రశ్నిస్తే.. అమ్మాయిలపై తప్పుడు పోస్టు పెట్టారని అభాండాలు వేయడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. ‘నేను ఇటీవల ఓ వాట్సాప్ గ్రూప్‌లో వచ్చిన పోస్ట్‌ను చూశాను. ఈ మాత్రం దానికే నాకు సైబర్ పోలీసుల నుంచి నోటీసు వచ్చింది. స్టేషన్‌కు వచ్చి వివరణ ఇవ్వాలన్నారు’ అని గుంటూరుకు చెందిన ఆకుల మురళి అనే వ్యక్తి విస్మయం వ్యక్తం చేశారు. ఇది నేరమట!శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవులో ఈనెల 1వ తేదీన బైనపల్లి దానమ్మ అనే వృద్ధురాలు పింఛన్ కోసం గంటలతరబడి వేచి ఉంటూ సొమ్మసిల్లి పడిపోయింది. స్థానికులు వెంటనే ఓ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. ఇదే విషయాన్ని అదే మండలం కొండపల్లి గ్రామ ఉప సర్పంచ్ మడ్డు జస్వంత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇతని పాలిట ఇదే పాపమైపోయింది. పాలక పార్టీ పెద్దల ఆదేశాలతో పోలీసులు అక్రమంగా కేసు పెట్టారు. అంతటితో ఆగకుండా ఆయన్ను భయపెట్టాలని కూడా ఆదేశించారు. దీంతో పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. అప్పుడు ఆయన ఇంట్లో లేడు. గంటల కొద్దీ అక్కడే ఉండి ఆయన కుటుంబ సభ్యులను మానసికంగా వేధించారు. ఆ తర్వాత ఎటువంటి నోటీస్ ఇవ్వకుండానే జస్వంత్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ రోజు కార్తీక పూజ నిర్వహిస్తున్నామని, భోజనం చేసి వస్తానన్నా కూడా వదల్లేదు. ఫోన్‌ను కూడా లాగేసుకున్నారు. ఏం కేసు పెట్టారని అడిగినా అప్పుడు చెప్పలేదు. తర్వాత లాయర్ సాయంతో బయటకు వచ్చాడు. అయినా ఇప్పటికీ ఎప్పుడుపడితే అప్పుడు స్టేషన్‌కు రావాలంటూ ఫోన్లు చేసి పిలిపిస్తూ మానసికంగా వేధిస్తున్నారు. 192 బీఎన్ఎస్ సెక్షన్‌తో ఎఫ్ఐఆర్ (150/24) నమోదు చేశారు. శాంతిభద్రతలు నిల్.. వేధింపులు ఫుల్! వరుస హత్యలు, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. వీటిని అరికట్టాల్సిన చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. టీడీపీ గూండాలు కర్రలు, కత్తులతో గ్రామాలపై పడి బీభత్సం సృష్టిస్తున్నారు. కేవలం నాలుగు నెలల్లోనే రాష్ట్రంలో 177 మంది హత్యకు గురయ్యారు. 500కుపైగా హత్యాయత్నాలు జరిగాయి. 2 వేలకుపైగా దాడులతో రాష్ట్రం అల్లకల్లోలంగా మారింది. టీడీపీ గూండాల దాడులతో భీతిల్లి దాదాపు 3 వేల కుటుంబాలు గ్రామాలు విడిచిపెట్టి ఇతర ప్రాంతాల్లో తల దాచుకుంటున్నాయి. అత్యాచార పర్వానికి అంతు లేకుండా పోయింది. ఇళ్లల్లో ఉండే చిన్నారులు, పాఠశాలకు వెళ్లే విద్యార్ధినులు, యువతులపై అత్యాచారాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. నాలుగు నెలల్లోనే రాష్ట్రంలో 110 మందిపై అత్యాచారాలు, లైంగిక దాడులు జరిగాయి. అయినా శాంతిభద్రతలతో తమకు సంబంధం లేదన్నట్లు సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఓ ముస్లిం బాలిక కిడ్నాప్‌కు గురికాగానే ప్రభుత్వం స్పందించి ఉంటే ఇప్పుడు ఆ అమ్మాయి బతికుండేది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు జాన్ 16 ఏళ్ల బాలికకు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడితే ఏ మేరకు శిక్ష వేశారో పాలకులే చెప్పాలి. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం అరకటివేములలో టీడీపీ కార్యకర్త రవితేజ ఓ బాలికను అపహరించి తాడిపత్రి మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న ఐషర్ వాహనంలోకి తీసుకువెళ్లి తన స్నేహితుడు నాగేంద్రతో కలసి అత్యాచారానికి పాల్పడ్డాడు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల తోటపాలెంలో ఓ యువతిని టీడీపీ నేత లైంగికంగా వేధించాడు. ఇలాంటి వారందరిపై ఏ చర్యలూ లేవు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలోని బాత్ రూమ్‌లలో రహస్య కెమెరాలు పెట్టిన వారిపై దేశ వ్యాప్తంగా చర్చ జరిగినా ఇక్కడ మాత్రం ఏ చర్యలూ లేవు. అన్నా.. వాడిక ఆర్నెల్లు నడవలేడు⇒ సోషల్ మీడియా యాక్టివిస్టులను భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని నిరంకుశ పాలన సాగిస్తోంది. ఇందులో భాగంగా అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు వారి ఆచూకీ తెలియనీయకుండా, కోర్టులోనూ హాజరు పరచకుండా ఊళ్లు.. ఊళ్లు తిప్పుతూ.. వారిని ఏ విధంగా వేధిస్తున్నారో ఎప్పటికప్పుడు అధికార పార్టీ నేతలకు చెబుతుండటం గమనార్హం. ‘అన్నా.. మీరు చెప్పినట్లే వాడిని కుమ్మేశాను. ఏడాది.. కనీసం ఆర్నెల్లు వాడు నడవలేడు. ఆ తర్వాత కూడా వాడు కుంటుకుంటూ నడవాల్సిందే’ అని ఇటీవల ఓ ఎస్ఐ అధికార పార్టీ నేతకు చెప్పడం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది. ⇒ అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన సంజీవరెడ్డిని ఈ నెల 6వ తేదీ రాత్రి పుట్టపర్తి అర్బన్ సీఐ సునీత సిబ్బందితో వచ్చి ఇంటి నుంచి బలంవంతంగా లాక్కెళ్లింది. అప్పటి నుంచి సంజీవరెడ్డి ఆచూకీ తెలియడం లేదు. ⇒ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నిస్తున్నారనే కారణంతో విశాఖ జిల్లా గాజువాకకు చెందిన వెంకటేష్, ప్రకాశం జిల్లాకు చెందిన పవన్‌పై కర్నూలు జిల్లా పత్తికొండ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా తమకు ఊడిగం చేసే పోలీసులు ఎక్కడ ఉంటే అక్కడ అక్రమ కేసులు ఇష్టారాజ్యంగా నమోదు అవుతున్నాయి. ఇంకా వేలాది మందిపై తప్పుడు కేసులు పెట్టడానికి పోలీసులు కసరత్తు సాగిస్తున్నారు.⇒ వాస్తవాలు ఇలా ఉంటే.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, ఏబీఎన్ వంటి ఎల్లో మీడియా ఈ అరాచకానికి కొమ్ము కాస్తుండటం దారుణం. నిబద్ధత కలిగిన ఇతర మీడియా సంస్థలు ప్రభుత్వ దమననీతికి వ్యతిరేకంగా ఎలుగెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో బరితెగించి సాగిస్తున్న ప్రభుత్వ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యావత్ దేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ బాధితుల తరఫున న్యాయ పోరాటానికి దిగింది. చంద్రబాబు ప్రభుత్వ రాక్షసత్వాన్ని నిలదీస్తోంది. -
ఐదు నెలల కూటమి సర్కార్ వైఫల్యాలపై ఛార్జ్‌షీట్
సాక్షి, విజయవాడ: ఐదు నెలల కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ నేత పోతిన వెంకట మహేష్ ఛార్జ్‌షీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పాలనలో ఎన్నో అరాచకాలు జరిగాయన్నారు. కూటమి నేతలకు ఎలా పాలించాలో తెలియక వైఎస్ జగన్‌పై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. అవినీతి, అరాచకాలు, మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు ఇవే ఈ ఐదు నెలల్లో జరిగాయన్నారు.కేంద్రంతో పొత్తులో ఉండి కూడా కేంద్రాన్ని నిధుల కోసం నిలదీయడం లేదు. ప్రతీకారంపై పెట్టిన దృష్టి పథకాల అమలుపై పెట్టడం లేదు. అప్పుల మీద పెట్టిన దృష్టి సంక్షేమంపై పెట్టలేదు. గతంలో అమ్మఒడి పథకంపై అనేక ఆరోపణలు చేశారు. కూటమి వచ్చాక ప్రతీ బిడ్డకు తల్లికి వందనం ఇస్తామని చెప్పి అమలు చేయలేదు. రాష్ట్రంలో తల్లికి వందనం పథకం తలకిందులైంది. నాడు-నేడు పేరుతో వైఎస్ జగన్ చేసిన పాఠశాలల అభివృద్ధిని మీరు కొనసాగిస్తారా లేదా? దీనికి సమాధానం చెప్పాలి’’ అంటూ పోతిన మహేష్ నిలదీశారు.గతంలో డిజిటల్ విద్యపై విద్యార్థులను ట్రోల్ చేశారు. మరి ఇప్పుడు విద్యార్థులకు డిజిటల్ విద్యను ఎందుకు అందించలేకపోతున్నారు?. పేదల ఆరోగ్యానికి సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకం కూటమి వచ్చాక కుంటుపడింది. పేదలు హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకుందామంటే దానిపై 18 శాతం జీఎస్టీ వేస్తుంటే.. కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు?. రెడ్ బుక్ అమలు మీద పెట్టిన శ్రద్ధ మహిళల రక్షణ మీద పెట్టకపోవడం దారుణం. కూటమి వచ్చాకే మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయి. మహిళలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు.’’ అని పోతిన మహేష్ మండిపడ్డారు.వలంటీర్లకు రూ.10 వేలు ఇస్తామని చెప్పి వాళ్లని కూడా మోసం చేశారు. నిత్యావసర ధరలు తగ్గించడానికి సమావేశాలు పెట్టరు గానీ మద్యం పాలసీపై మాత్రం మంత్రి వర్గ సమావేశాలు పెడతారు. గతంలో కౌలు రైతులకు ఆర్థిక సాయం చేసిన పవన్ కళ్యాణ్.. అధికారంలోకి వచ్చాక కౌలు రైతుల ఊసే లేదు. రైతు భరోసా, పంట రుణాలు, పంట నష్టాలపై ఎందుకు మాట్లాడం లేదు?పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వాసితుల గురించి ఎందుకు మాట్లాడం లేదు? 30 వేల కోట్లు ఉంటేనే నిర్వాసితులకు న్యాయం చేయగలమని పవన్ మాట్లాడారు. ఆ 30 వేల కోట్లు మీరు ఇస్తారా? కేంద్రం నుంచి తెస్తారా?. ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగం తాండవిస్తోంది. యువత ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతుంటే.. వాళ్లను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లుగా మార్చడంపై చంద్రబాబు, పవన్ దృష్టి పెడుతున్నారు. నిరుద్యోగులకు మూడు వేల నిరుద్యోగ భృతి అన్నారు.. ఇప్పుడు దాని ఊసే లేదు ..రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులన్నీ ట్విట్టర్లోనే వస్తాయి కానీ రాష్ట్రానికి మాత్రం రావు. బీసీలను ఆకట్టుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, పవన్‌లు బీసీ రక్షణ చట్టం ఎందుకు చేయడం లేదు?. అమరావతి నిర్మాణానికి అప్పులు ఎందుకు చేయాల్సి వస్తోంది? ఇప్పటికే రూ.26 వేల కోట్లు అప్పు తెచ్చారు. అమరావతి నిర్మాణానికి అమరావతే నిధులు తెచ్చుకుంటుందన్న చంద్రబాబు ఇపుడు అప్పులెందుకు?. అమరావతి నిధుల కోసమే పశ్చిమ నియోజకవర్గం త్యాగం చేస్తున్నామన్నారు. కానీ ఇప్పుడా ఎమ్మెల్యే వారాలబ్బాయి లా తయారయ్యాడు.. దీనికి పవన్ కల్యాణ్ జవాబు చెప్పాలి’’ అని పోతిన మహేష్ డిమాండ్ చేశారు.పవన్ కల్యాణ్ ఆయన శాఖలను వదిలేసి ఇతర శాఖలలో తలదూర్చుతూ.. సకల శాఖామంత్రిగా పేరు తెచ్చుకున్నారు. చంద్రబాబు, పవన్‌లు జగన్ భజన మానేసి ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలి. జగన్, షర్మిళల విషయమేమి రాష్ట్ర సమస్య కాదు.. వారి మీద దృష్టి తగ్గించి ప్రజా సమస్యలపై మాట్లాడాలి. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని చట్ట పరంగా శిక్షించాలి అంతేగాని కక్షపూరిత రాజకీయాలు చేయకూడదు’’ అని పోతిన మహేష్ హితవు పలికారు. -
పోలీసులు పచ్చచొక్కాలు వేసుకుని డ్యూటీ చేస్తున్నారు: కాకాణి
సాక్షి,నెల్లూరు:సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయించడం దారుణమని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు.శనివారం(నవంబర్ 9) నెల్లూరులో ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి కాకాణి మీడియాతో మాట్లాడారు.‘జరుగుతున్న పరిణామాలపై జిల్లా ఎస్పీకి వివరించబోతున్నాం. కూటమి ప్రభుత్వంలో వాక్ స్వాతంత్య్రం కూడా కూడా లేకుండా పోయింది.నాపైనే పోలీసులు అక్రమంగా నాలుగు కేసులు నమోదు చేశారు.వైఎస్సార్సీపీ నేతలు నోరు తెరిచినా కూడా కేసులు పెడుతున్నారు.పోలీసులు మమ్మల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.థర్డ్ డిగ్రీ ప్రయోగించి చివరికి కుటుంబ సభ్యులను కూడా దుషిస్తున్నారు. అవినీతిని ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెడుతున్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్జగన్ను కించపరిచే విధంగా పోస్టులు పెడుతుంటే మాత్రం పోలీసులు పట్టించుకోవడం లేదు. జగన్ కుటుంబ సభ్యుల మీద కూడా నీచాతి నీచంగా పోస్టులు పెడుతుంటే అవి పోలీసులకు కనపడవా..? పోలీసులు ఖాకీ చొక్కాలు వదిలేసి..పచ్చ చొక్కాలు వేసుకుని డ్యూటీలు చేస్తున్నారు.వైఎస్సార్సీపీ నేతలు ఆవేదనతో ఉన్నారు..వారిని రెచ్చగొట్టొద్దు.శాంతిభద్రతలు అదుపుతప్పితే పోలీసులదే బాధ్యత.వైఎస్‌జగన్‌పై పోస్టింగ్‌లు పెడుతున్న వారిని వెంటనే అరెస్ట్ చెయ్యాలి. మేం అధికారంలోకి వస్తే ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వారిని వదిలే ప్రసక్తే లేదు.ఎక్కడ దాక్కున్నా లాక్కొస్తాం’అని కాకాణి హెచ్చరించారు.కాకాణికి రెండు కేసుల్లో నోటీసులు..కాకాని గోవర్ధన్‌రెడ్డికి వెంకటాచలం పోలీసులు రెండు కేసుల్లో నోటీసులు అందజేశారు. ఎమ్మెల్యే సోమిరెడ్డికి వ్యతిరేకంగా బీజేపీ నేత చేసిన ఆరోపణల వీడియోను ఫార్వర్డ్ చేసిన కేసులో ఒక నోటీసు, చంద్రబాబు 100 రోజుల పాలనపై విమర్శించినందుకు మరో నోటీసు అందజేశారు.ఈ కేసుల్లో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఒక మహిళను ఉగ్రవాదిలా హింసించారు: అంబటి -
ప్రశ్నించే స్వరం వినిపించకూడదా?: వైఎస్ జగన్
డీజీపీ చట్టం, న్యాయం వైపు నిలబడాలి. ఇప్పుడున్న డీజీపీ మా హయాంలో ఆర్టీసీ సీఎండీ స్థానంలో పని చేశారు. మంచి పదవి ఇచ్చి బాగా చూసుకున్నాం. కానీ ఈరోజు ఏ స్థాయికి దిగజారిపోయారంటే.. లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తుంటే.. ఆయన అధికార పార్టీ కార్యకర్తలా మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వంలో పోలీసులు సరిగా పనిచేయలేదని చెబుతున్నాడు. మరి ఆయన కూడా ఆ ప్రభుత్వంలో పనిచేశాడు కదా? మరి ఇప్పటి ప్రభుత్వం సవ్యంగా, బ్రహ్మాండంగా పని చేస్తోందా? ఆయన డీజీపీగా ఉన్న ప్రభుత్వం సవ్యంగా పని చేస్తే.. ఇన్ని హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు దొంగ కేసులు పెడుతున్నారు? ఐదు నెలలు తిరగక ముందే 91 మంది అక్క చెల్లెమ్మల మీద ఎందుకు అత్యాచారాలు జరిగాయి? ఎందుకు ఏడుగురు మహిళలు చనిపోయారు? చివరకు ప్రజల తరపున గొంతు విప్పుతున్న సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లను ఎందుకు అక్రమ నిర్భంధాలు చేస్తున్నారు?సాక్షి, అమరావతి: కూటమి సర్కారు అక్రమాలు, మోసాలు, వైఫల్యాలపై ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తుండటం.. సామాజిక స్పృహ ఉన్నవారు, సోషల్ మీడియా కార్యకర్తలు నిలదీస్తుండటంతో సీఎం చంద్రబాబు తట్టుకోలేక ప్రశ్నించే స్వరం వినిపిస్తే చాలు అక్రమ కేసులు బనాయించి నిర్బంధిస్తున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను, సోషల్ మీడియా కార్యకర్తలను హింసిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. రాష్ట్రంలో చీకటి రోజులు నడుస్తున్నాయని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసు సోదరులారా.. న్యాయం, ధర్మం వైపు నిలబడాలని సూచించారు. పోలీసులు టోపీపై కన్పించే 3 సింహాలకు సెల్యూట్ చేయాలేగానీ రాజకీయ నేతల చెప్పినట్టు తప్పుడు కేసులు బనాయిస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఎల్లకాలం ఈ ప్రభుత్వమే అధికారంలో ఉండదనే విషయాన్ని పోలీసులు గుర్తించుకోవాలన్నారు. రిటైర్ అయిన తర్వాత వెళ్లిపోతాం అని అనుకుంటున్నారేమో..! సప్త సముద్రాల అవతల ఉన్నా రప్పించి చట్టం ముందు దోçÙులుగా నిలబెడతామన్నారు. దొంగ కేసులు పెడుతున్న ప్రతి పోలీస్ అధికారిపై ప్రైవేటు కంప్లైంట్లు ఫైల్ చేస్తామన్నారు. ప్రతి బాధితుడికి వైఎస్సార్ సీపీ న్యాయ సహాయం అందిస్తుందని చెప్పారు. ఎన్నికల్లో మీరు చెప్పిన సూపర్ సిక్స్‌లు ఏమయ్యాయని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారన్నారు. వారం రోజుల్లో 101 మంది సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారని.. సుప్రీం తీర్పులనూ అవహేళన చేస్తున్నారన్నారు. తన కుటుంబ సభ్యులపై దుష్ప్రచారానికి పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా చిన్నారులు, మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? ప్రశ్నించే స్వరాలు ఉండకూడదా? అని నిలదీశారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ మీడియాతో మాట్లాడారు. ఈ రోజు బాధితులంతా.. రేపు రెడ్ బుక్ పెట్టుకుంటారు...పోలీసు అంటే గౌరవం ఉండాలి. వ్యవస్థలు బతకాలి కానీ నీరుగారిపోకూడదు. రాజకీయ నేతలు చెబుతున్నారని తెలిసి కూడా తప్పులు చేయడం పోలీసులకు మంచిది కాదు. తిరుపతిలో సుబ్బరాయుడు ఉన్నాడు. చంద్రబాబు తెలంగాణ నుంచి డిప్యూటేషన్‌పై తెచ్చుకున్నాడు. ఆ తర్వాత తెలంగాణ వెళ్లిపోతామని అనుకుంటున్నారేమో? తెలంగాణ నుంచి మళ్లీ పిలిపిస్తాం. సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా రప్పిస్తాం. రెడ్ బుక్ పెట్టుకోవడం పెద్ద పనికాదు. ఈ రోజు నష్టపోయిన బాధిత కుటుంబాల్లో ప్రతి ఒక్కరూ రెడ్ బుక్ పెట్టుకుంటారు. వాళ్లందరూ నా దగ్గరకు వచ్చి గ్రీవెన్స్ చెబుతారు. అప్పుడు నేను చూస్తూ ఊరుకోను.వారిని ఎందుకు అరెస్టు చేయరు?రెండేళ్ల క్రితం మా అమ్మ కారు టైర్ బరస్ట్ అయితే.. ఇది ఈరోజు కొత్తగా జరిగినట్లుగా చిత్రీకరించి.. తల్లిని చంపడానికి జగన్ ప్రయత్నించాడని టీడీపీ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో వికృత ప్రచారం చేశారు. ఇది ఫేక్ న్యూస్ కాదా..? అది తప్పుడు కథనం అని మా అమ్మ విజయమ్మ లేఖ విడుదల చేస్తే.. ఆ లేఖను కూడా ఫేక్ లెటర్‌గా చిత్రీకరిస్తూ టీడీపీ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో దుష్ఫ్రచారం చేయడం వాస్తవం కాదా? చివరకు మా అమ్మ వీడియో ద్వారా టీడీపీ దుష్ఫ్రచారాన్ని ఖండించారు. నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ టీడీపీ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో తప్పుడు ప్రచారం చేస్తున్న చంద్రబాబును ఎందుకు అరెస్టు చేయడం లేదు? లోకేష్‌ను ఎందుకు అరెస్టు చేయడం లేదు? కడప ఎస్పీకి నా భార్య ఫోన్ చేసిందని ఆంధ్రజ్యోతిలో వార్త రాశారు. అది తప్పుడు వార్త కాదా? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను ఎందుకు లోపల వేయరు? ‘డీజీపీ..! పోలీసు సోదరులారా..! మీ అందరికీ ఒకటే చెబుతున్నా. సీఎం చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ ఒత్తిళ్లకు తలొగ్గి ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడం మీ వృత్తిని మీరే కించపరిచినట్లు అవుతుంది. ఎల్లకాలం ఈ ప్రభుత్వమే ఉండదు.. జమిలి ఎన్నికలు వచ్చినా.. నాలుగేళ్ల తర్వాత ఎన్నికలు జరిగినా అధికారంలోకి వచ్చేది మేమే.. తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా నిర్భందించిన పోలీసు అధికారులు ఎక్కడున్నా వదలిపెట్టం.⇒ మహానంది మండలం యు.బొల్లవరం గ్రామానికి చెందిన తిరుమల కృష్ణను సీపీఎస్ పోలీసులు ఆదివారం అర్ధరాత్రి అరెస్ట్ చేసి కర్నూలు తీసుకెళ్లారు. కృష్ణ దివ్యాంగుడని తెలిసీ అరెస్ట్ చేసి ఇబ్బందులు పెట్టారు. ⇒ అన్నమయ్య జిల్లా రాయచోటిలో కె.హనుమంతరెడ్డిని రెండ్రోజుల క్రితం పోలీసులు తీసుకెళ్లారు. అరెస్ట్ చూపలేదు. ఎక్కడకు తీసుకెళ్లారో ఇప్పటివరకూ తెలియదు. ⇒ తెలంగాణలో ఉన్న వారినీ తీసుకొచ్చి వేధిస్తున్నారు. నల్గొండకు చెందిన అశోక్‌రెడ్డిని విజయవాడ సైబర్ పోలీసులు తీసుకొచ్చారు. కుటుంబీకులకూ సమాచారం ఇవ్వలేదు. రాజశేఖరరెడ్డి అనే వ్యకినీ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు. ఈ ఇద్దరినీ వేధిస్తున్నారు. ⇒ ఇప్పటివరకు 101 మందిపై కేసులు పెట్టారు. చట్టప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత వాటిని ఆన్లైన్లో ఉంచాలి. కానీ ఆన్లైన్లో పెట్టడం లేదు. కోర్టులకు అప్లోడ్ చేయడం లేదు. దేశంలో ఇంత అరాచక వ్యవస్థ ఎక్కడైనా ఉందా?వారం రోజుల్లో.. 101 మంది అరెస్టువారం రోజులుగా దాదాపు 101 మంది సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసులకు సంబంధించి సుప్రీం కోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. పోలీసులు ఇష్టం వచ్చినట్లు ఇంటికొచ్చి అరెస్ట్‌లు చేయకూడదు. ముందు 41 ఏ నోటీసు ఇచ్చి విచారణ చేయాలి. ఒకవేళ నిజంగా అరెస్ట్ చేయాల్సి వస్తే వారంట్ జారీ చేయాలి. తర్వాత మెజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలి. ఇది సుప్రీంకోర్టు తీర్పు సారాంశం (అమేష్కుమార్ వర్సస్ బిహార్ కేసులో 2014 జూలై 2న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును చదివి వినిపించారు). కానీ మన రాష్ట్రంలో ఈరోజు ఏం జరుగుతోంది? తప్పుడు కేసులు.. అక్రమ నిర్బంధాలు.. అరెస్ట్ చేసే అధికారం లేదని పోలీసులకు తెలుసు. 41 ఏ నోటీసు మాత్రమే ఇవ్వాలని తెలుసు. ఒక వేళ అరెస్ట్ చేయాల్సి వస్తే వారంట్ జారీ చేయాలి. మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలి. ఇదీ పద్ధతి. కానీ.. ఎవరైనా ప్రభుత్వంపై గొంతు విప్పితే చాలు.. రాత్రికి రాత్రే.. తెల్లవారుఝామున వారి ఇళ్లకు వెళ్లి అదుపులోకి తీసుకుంటున్నారు. కుటుంబ సభ్యులను వేధిస్తున్నారు. గంటల తరబడి.. కొన్ని సమయాల్లో రెండు మూడు రోజులు పోలీస్ స్టేషన్లలో నిర్బంధిస్తున్నారు. కొట్టడం, తిట్టడం, అవమానించడం చేస్తున్నారు. ఒక వ్యక్తిపై ఏకకాలంలో పలు స్టేషన్లలో టీడీపీ సానుభూతిపరులతో కేసులు పెట్టిస్తూ అరెస్టు చేస్తున్నారు. రెండు మూడు స్టేషన్లు తిప్పుతున్నారు. పోలీసుల తీరుపై స్థానికులు తిరగబడితే మరో కేసు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. ఎవరైనా అందుబాటులో లేకపోతే వారి కుటుంబ సభ్యులను స్టేషన్‌కు తీసుకొస్తున్నారు. కుటుంబ సభ్యులను స్టేషన్‌కు తీసుకొచ్చే అధికారం ఏ పోలీస్‌కూ లేదు. ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు, డిప్యూటీ సీఎం మాట్లాడిన మాటలు గమనిస్తే డీజీపీపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు స్పష్టమవుతోంది. దాంతో డీజీపీ దగ్గరుండి కేసులు పెట్టించి.. అక్రమ నిర్భంధాలు చేయిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా ఉన్న స్వరాలపై కేసులు పెట్టించే స్థాయికి, తట్టుకోలేని స్థాయికి వెళ్లిపోయారు.ప్రశ్నిస్తే.. కేసులు, అక్రమ నిర్బంధాలా?⇒ విజయవాడలో వరదల నియంత్రణ, సహాయ చర్యల్లో ముఖ్యమంత్రి సహా యంత్రాంగం దారుణ వైఫల్యం చెందడంపై ప్రశ్నిస్తే అక్రమ నిర్బంధాలు. వరద సహాయం పేరుతో కోట్లాది రూపాయలు మింగేసే చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలు. 1.50 కోట్ల మందికి ఆహారం అందించడానికి రూ.534 కోట్లు..! కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, మొబైల్ జనరేటర్లపై రూ.23 కోట్లు కొట్టేశారు అని అందరూ మాట్లాడారు. నీళ్లు ఉన్నప్పుడు అక్కడకు ఎలా వెళ్లారు? కరెంట్ ఇచ్చారో లేదో అందరికీ తెలుసు. కానీ.. ఈ అక్రమాలపై ప్రశ్నిస్తే చాలు అక్రమ నిర్భందాలు. మహిళలు, బాలికలు, చిన్నారులపై లైంగిక వేధింపులు, దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే.. వాటిపై ప్రశ్నిస్తే అక్రమ నిర్బంధాలు. ఎమ్మెల్యేలు, వారి మనుషులు రౌడీల్లా దౌర్జన్యం చేస్తుండటంపై ప్రశ్నిస్తే అక్రమ నిర్బంధాలు. ⇒ ఇసుక ఉచితంగా ఇస్తామన్నారు.. ఇప్పుడు ఇసుక ధరలు చూస్తే రెట్టింపు అయ్యాయి. ఈ డబ్బులు ఎవరి జేబుల్లోకి పోతున్నాయని ప్రశ్నిస్తే అక్రమ నిర్బంధాలు. రేట్లు తగ్గిస్తామని చెప్పిన మద్యంపై ఒక్కపైసా కూడా తగ్గించకుండా, పైపెచ్చు సిండికేట్లుగా మారి ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేటుకు అమ్ముతుండటంపై ప్రశ్నిస్తుంటే కేసులు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం షాపులను ప్రైవేటు వారికి ఎందుకు అప్పగించారయ్యా? అని ప్రశ్నిస్తే కేసులు. అధికారంలోకి వస్తే కరెంట్ చార్జీలు తగ్గిస్తామని చెప్పారు కదా..!కానీ ఐదు నెలలు కాకమునుపే ప్రజలపై దాదాపు రూ.6 వేల కోట్ల భారం మోపారు. మరో రూ.11 వేల కోట్లు అదనంగా బాదేందుకు సిద్ధం కావడంపై ప్రశ్నిస్తే.. మళ్లీ అక్రమ నిర్బంధాలు.⇒ మీరు వస్తే సంపద సృష్టిస్తామన్నారు కదా..? ప్రజల కోసం జగన్ సృష్టించిన సంపదను ఎందుకు అమ్మేస్తున్నారు? మీ స్కామ్‌ల కోసం కొత్తగా కడుతున్న మెడికల్ కళాశాలలను అమ్మేస్తున్నారు. మూడు ప్రైవేటు పోర్టులు..అందులో ఒకటి 80 శాతం, రెండు 50 శాతం పూర్తయ్యాయి.. వాటి నిర్మాణానికి నిధుల కొరత కూడా లేకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాం. ఇవన్నీ వస్తే కదా ప్రభుత్వాదాయాలు పెరుగుతాయి. ప్రభుత్వ సంపద పెరుగుతుంది. ఇటువంటివి ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నిస్తే.. అక్రమ నిర్భందాలు.ఇవేంటి.. తప్పుడు కేసులు కాదా?⇒ (సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు నమోదు చేసిన కొన్ని ఎఫ్ఐఆర్లను వైఎస్ జగన్ చదివి వినిపించారు..) ⇒ ‘విద్య వద్దు.. మద్యం ముద్దు’ సోషల్ మీడియా కార్యకర్త రాసిన మాటలు నిజమే కదా..? అమ్మ ఒడి ఇవ్వడం లేదు. విద్యాదీవెన ఇవ్వడం లేదు. వసతి దీవెన ఇవ్వడం లేదు.. నాన్నకు ఫుల్..అమ్మకు నిల్..! అని అన్నాడు. ఏం తప్పు అన్నాడు? ఈ మాట అన్నందుకు అక్రమంగా నిర్భందిస్తారా? చంద్రబాబు అభిమానుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు పెట్టారు. ⇒ ఇది మరో ఎఫ్ఐఆర్.. పోస్ట్‌లను ఫార్వర్డ్ చేసినా కేసులే! జనసేన నాయకులతో కాళ్లు పట్టించుకుంటున్న టీడీపీ నేతలు.. అనే వార్త అన్ని టీవీల్లో వచ్చింది. ఆ పోస్టును ఫార్వర్డ్ చేసిన కార్యకర్తపై కేసు పెట్టారు.⇒ ఇది మరో కేసు.. చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం విజయవాడ వరదల్లో రూ.534 కోట్లు ప్రజాధనం లూటీ చేశారు! 23 కోట్లు అగ్గిపెట్టెలు, క్యాండిల్స్ కోసమే లూటీ చేశారు..! ఇవి అందరూ అన్న మాటలే. వీటిని సోషల్ మీడియాలో పెట్టినందుకు కేసులు పెట్టారు.⇒ ఇంకో కేసు... తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు చేసిన అసత్య ఆరోపణలు దేవుడికి నచ్చడం లేదని ఓ సోషల్ మీడియా కార్యకర్త పోస్టు పెట్టారు.. అంతకన్నా ఏమీ అనలేదు. ఆ కార్యకర్తపై కూడా కేసు పెట్టారు.⇒ గాజువాకకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ బోడి వెంకటేష్‌ను దువ్వాడ పోలీసులు మధ్యాహ్నం 3.30 గంటలకు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తల్లిదండ్రులకు చెప్పలేదు. 41 ఏ నోటీసు ఇవ్వలేదు. ఇది సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘన కాదా?⇒ తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం వల్లభాపురానికి చెందిన సోషల్ మీడియా కార్యకర్త, రైతు ఆళ్ల జగదీష్‌రెడ్డి 2018లో పెట్టిన పోస్ట్‌కు సంబంధించి విజయవాడ క్రైమ్ సిటీ పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఇంట్లో సభ్యులకు కూడా చెప్పకుండా తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులు వెళ్లి అడిగితే మేం తీసుకెళ్లలేదు.. మాకు సంబంధం లేదని చెప్పారు. ఇంట్లో సీసీ కెమెరాలు పరిశీలిస్తే పోలీసులే దగ్గరుండి తీసుకెళ్లినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఇది అక్రమ అరెస్టు కాదా?⇒ చిలకలూరిపేటకు చెందిన పెద్దింటి సుధారాణి ఎన్నికల తర్వాత అరాచకాలు భరించలేక కుటుంబ సభ్యులతో హైదరాబాద్ వెళ్లిపోయారు. ఐదు నెలల తర్వాత ఆమెను కుటుంబ సభ్యులతో సహా హైదరాబాద్ నుంచి బలవంతంగా తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్లన్నీ తిప్పుతున్నారు. పిల్లలను తల్లికి దూరం చేశారు. ఎక్కడకు తీసుకెళ్తున్నారో కూడా చెప్పలేదు. నిన్న చిలకలూరిపేట పోలీస్ స్టేషన్లో ఉన్న ఆమెను ఒంగోలు పోలీస్‌లు అరెస్ట్ చేశారు. ఇది అక్రమ నిర్భంధం కాదా?⇒ తాడేపల్లిలో అయ్యప్పమాల ధరించిన నాని అనే సోషల్ యాక్టివిస్ట్‌ను మొదట వినుకొండ అని చెప్పి మార్కాపురం తరలించారు.⇒ నందిగామ నియోజకవర్గం పెండ్యాలలో వాట్సప్ గ్రూప్ అడ్మిన్‌ను అరెస్ట్ చేసి కొట్టారు. గ్రూపులో ఉన్న వాళ్లకు నోటీసులిచ్చారు. వీళ్లంతా ఒకే గ్రామానికి చెందినవారు. ⇒ గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన వెంకట్రామిరెడ్డి హైదరాబాద్‌లో ఉంటారు. మాచర్లలో తన బావ ఇంటికి రావడంతో ఫోన్ లొకేషన్ ఆధారంగా పోలీసులు అక్కడకు వెళ్లారు. వెంక్రటామిరెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఆయన బావను అరెస్ట్ చేశారు. వి«ధి నిర్వహణలో ఆటంకం కలిగించారని కేసు పెట్టారు.⇒ ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంకు చెందిన సన్నీ అనే కార్యకర్తను తిరువూరు పోలీసులు ఉదయం తీసుకెళ్లి కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు. 36 గంటల పాటు భోజనం కూడా లేకుండా చేశారు. గ్రామంలోని పెద్దలు వెళ్తే విడుదల చేస్తామని చెప్పి మళ్లీ గంపలగూడెం పోలీస్ స్టేషన్లోనే పెట్టారు.బాధితులకు తోడుగా న్యాయ పోరాటంప్రభుత్వం తరఫున అన్యాయంగా బాధలకు గురైన సోషల్ మీడియా కార్యకర్తలకు ప్రత్యేకంగా న్యాయ సహాయం అందించేందుకు ఫోన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చాం. మీ తరఫున పోరాటం చేయడానికి వైఎస్సార్ సీపీ సిద్ధంగా ఉంది. సోషల్ మీడియా పరంగా మా మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ అండగా ఉండి కోర్టులో పోరాటం చేస్తారు. పూర్తిగా ప్రైవేటు కంప్లైంట్లు వేసే కార్యక్రమంలో తోడుగా ఉంటారు. వైఎస్సార్ సీపీ ‘వియ్ స్టాండ్ ఫర్ ట్రూత్’ నినాదంతో ఎక్స్‌లో యాస్ ట్యాగ్‌తో ముందుకెళ్తోంది. జె.సుదర్శన్ రెడ్డి (సీనియర్ న్యాయవాది) 9440284455కొమ్మూరి కనకారావు (మాజీ చైర్మన్, మాదిగ కార్పొరేషన్) 9963425526దొడ్డా అంజిరెడ్డి (రాష్ట్ర సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్) 9912205535 -
విద్యుత్ చార్జీలు పెంచితే ఉద్యమిస్తాం: రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి
సాక్షి,వైఎస్ఆర్జిల్లా: చంద్రబాబు ఇచ్చిన మాట తప్పి నవంబర్ ఒకటవ తేదీ నుంచి విద్యుత్ చార్జీలు పెంచనున్నారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి విమర్శించారు. సోమవారం(అక్టోబర్ 28) ప్రొద్దుటూరులో రాచమల్లు మీడియాతో మాట్లాడారు.‘ఎన్నికలకు ముందు ఐదు సంవత్సరాల వరకు విద్యుత్ చార్జీలు పెంచేది లేదని బాబు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట తప్పి నవంబర్ ఒకటవ తేదీ నుంచి విద్యుత్ చార్జీలు పెంచనున్నారు. ఎన్నికల ముందు ఒక మాట,ఇప్పుడు ఇంకో మాట సరైన పద్ధతి కాదు. ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి..లేదంటే వైఎస్సార్సీపీ తీవ్రస్థాయిలో ఉద్యమిస్తుంది.విద్యుత్ చార్జీలు పెరిగితే ప్రజల జీవితాలు గాడాంధకారంలోకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. ప్రజలు 164 సీట్లు ఇచ్చి బాబుకు ఇస్తే, బాబు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలకు షాక్ ఇచ్చారు. మధ్య తరగతి ప్రజలపై అధిక భారం మోపనున్నారు. దీపావళి నుంచి గ్యాస్ సిలిండర్ ధరల తగ్గింపు పేరు చెప్పి,విద్యుత్ చార్జీల రూపంలో దండుకుంటున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ చార్జీలు పెంచి చేనేత,అమ్మ ఒడి,ఇతర సంక్షేమాలు రద్దు చేసి బాబు పాలన సాగిస్తున్నారు. రాష్ట్ర ఖజానాకు భారమైనా సరే రానున్న రోజుల్లో విద్యుత్ చార్జీలు పెంచకూడదు అని డిమాండ్ చేస్తున్నా. 2014 నుంచి 2019 వరకు బాబు పాలనలో దాదాపు 57 వేల కోట్లు విద్యుత్ కోసం అప్పు చేశారు. కోవిడ్ కాలంలో కూడా వైఎస్ జగన్ విద్యుత్ చార్జీలు పెంచలేదు. ఎలాంటి విపత్కర పరిస్థితి లేని ఈ సమయంలో బాబు ఎందుకు విద్యుత్ చార్జీలు పెంచుతున్నారు?వైఎస్ జగన్ హయాంలో దళితులకు ఉచిత విద్యుత్ అందించి దాదాపు రూ. 650 కోట్ల రూపాయల విద్యుత్ సబ్సిడీ చెల్లించారు. మద్యం బెల్ట్ షాపులు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పి మద్యం ఏరులై పారేలా చేస్తున్నారు. ఐదు సంవత్సరాలు ఇలాగే పాలన కొనసాగితే రాష్ట్ర ప్రజలు అప్పుల్లో కూరుకుపోతారు. ప్రభుత్వం మెడలు వంచి ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ చార్జీలు తగ్గించేలా పోరాడతాం. కరెంట్ ఆఫీసులను చుట్టుముడతాం,ఉద్యమం తీవ్రతరం చేస్తాం,దీక్షలకు పూనుకుంటాం’అని రాచమల్లు హెచ్చరించారు.ఇదీ చదవండి: చంద్రబాబు ఇది మీరిచ్చిన వాగ్దానామే: వైఎస్ జగన్ -
మంత్రి నాదెండ్ల టూర్.. కూటమిలో భగ్గుమన్న విభేదాలు
సాక్షి,ఏలూరుజిల్లా: మంత్రి నాదెండ్ల మనోహర్ ఏలూరు జిల్లా పర్యటన సందర్భంగా కూటమి పార్టీల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఉంగుటూరు మండలం చేబ్రోలు రైతు సేవ కేంద్రం వద్ద టీడీపీ, జనసేన నాయకుల మధ్య తోపులాట జరిగింది. చేబ్రోలులో మినుము విత్తనాలను మంత్రి చేతుల మీదుగా అందించడానికి పలువురు రైతులను అధికారులు గుర్తించారు.అయితే ఈ రైతులందరూ టీడీపీ వారేనని జనసేన శ్రేణులు ఆ రైతులందరూ టీడీపీ వారేనని జనసేన శ్రేణులు ఆందోళనకు దిగారు. దీంతో టీడీపీ,జనసేన నాయకుల మధ్య వాగ్వాదం,తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తం కాకుండా ఇరువర్గాలను పోలీసులు సముదాయించారు. ఇదీ చదవండి: బాబు ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువు -
పాడిరైతును చితగ్గొట్టి 'హెరిటేజ్‌కు మిల్క్‌షేక్'!
రోజుకు రూ.326 నష్టంఅనంతపురం జిల్లా రోటరీపురానికి చెందిన ఎర్రి స్వామి రోజూ 14 లీటర్ల పాలు అమూల్ కేంద్రానికి పోసేవారు. లీటర్ ఆవు పాలకు రూ.43 చొప్పున ఆరు లీటర్లకు రూ.258, గేదె పాలకు లీటర్ రూ.83 చొప్పున ఎనిమిది లీటర్లకు రూ.664 కలిపి.. మొత్తం రూ.922 ఆదాయం లభించేది. ఇప్పుడు ఈ కేంద్రం మూతపడింది. ఇదే అదనుగా ప్రైవేట్ డెయిరీలు ధర తగ్గించడంతో ఆవు పాలు లీటర్ రూ.30, గేదె పాలు రూ.52కి అమ్ముకోవాల్సి వస్తోంది. అంటే ఆవు పాలు లీటర్‌కు రూ.13 నష్టం, గేదె పాలు లీటర్‌కు రూ.31 నష్టం. ఫలితంగా రోజూ రూ.326 చొప్పున నష్టపోతున్నట్లు స్వామి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.ఒక్క గ్రామంలోనే రూ.1.34 లక్షలు నష్టం..అనంతపురం జిల్లా రోటరీపురంలో నిత్యం 16 మంది రైతులు 160 లీటర్ల ఆవు పాలు, 80 లీటర్ల గేదె పాలు జగనన్న పాలవెల్లువ కేంద్రానికి పోసేవారు. గేదె పాలకు లీటర్‌కు గరిష్టంగా రూ.84, ఆవు పాలకు రూ.43 చొప్పున దక్కేది. కూటమి ప్రభుత్వ నిర్వాకంతో ఈ కేంద్రం మూతపడింది. దీంతో గత్యంతరం లేక ప్రైవేట్ వ్యక్తులకు పాలు పోస్తుండటంతో లీటర్ ఆవు పాలకు రూ.30, గేదె పాలకు రూ.54 చొప్పున ఇస్తున్నారు. ఫలితంగా లీటర్‌పై ఆవుపాలకు రూ.13 చొప్పున రూ.2,080, గేదె పాలకు రూ.30 చొప్పున రూ.2,400లను ఈ గ్రామ పాడిరైతులు రోజూ నష్టపోతున్నారు. ఒక్క ఈ గ్రామంలోనే రోజుకు రూ.4,480 చొప్పున నెలకు రూ.1.34 లక్షలకు పైగా ఆదాయాన్ని పాడి రైతులు కోల్పోతున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మూతపడిన అమూల్ పాల కేంద్రాలతో ప్రతి నెలా రూ.100 కోట్లకు పైగా నష్టపోతున్నారు. పాలసేకరణ ధరలు దారుణంగా తగ్గిపోవడం వల్ల ప్రైవేట్ డెయిరీలకు పాలుపోసేవారు మరో రూ.వెయ్యి కోట్లకుపైగా నష్టపోతున్నారు.సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రైవేట్ డెయిరీల దోపిడీ మళ్లీ మొదలైంది. కూటమి ప్రభుత్వ నిర్వాకంతో పాల సేకరణ ధరలు గణనీయంగా తగ్గిపోయి పాడి రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ఒకపక్క పాడి పశువుల ధర రూ.లక్షల్లో ఉంది. మరోపక్క పెరుగుతున్న దాణా ఖర్చులతో పోషణ భారంగా మారింది. ఇలాంటి సమయంలో పాడి రైతుకు గిట్టుబాటు ధర దక్కేలా చూడాల్సిన ప్రభుత్వ పెద్దలు వారి పొట్టగొడుతున్నారు. తమ కుటుంబ సంస్థ హెరిటేజ్‌కు ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తిరుపతి పరిసరాల్లో గతంలో ఆవు పాలకు లీటర్‌కు రూ.30 నుంచి రూ.38 మధ్య చెల్లించిన హెరిటేజ్ డెయిరీ ప్రస్తుతం రూ.23 నుంచి రూ.31కి మించి చెల్లించడం లేదని రైతులు చెబుతున్నారు. ఇక గేదె పాలకు గతంలో రూ.40–రూ.50 వరకు చెల్లించిన హెరిటేజ్... తాజాగా రూ.35 నుంచి రూ.40కి మించి ఇవ్వడం లేదని పేర్కొంటున్నారు. అదే సమయంలో కాకినాడ జిల్లాలో సోమవారం అమూల్‌కు పాలుపోసిన రైతులకు గేదెపాలకు లీటరుకు గరిష్టంగా రూ.92–93, ఆవు పాలకు రూ.39–40 చెల్లించింది. ఇలా జగనన్న పాలవెల్లువ కేంద్రాల (అమూల్) ద్వారా దాదాపు నాలుగేళ్లపాటు లాభాలతో పొంగిపోయిన రాష్ట్రంలోని పాడి రైతులు కూటమి సర్కారు కక్షపూరిత చర్యలతో ఇప్పుడు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. కొత్త ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన నాలుగు నెలల్లోనే 11 జిల్లాల్లో ఈ కేంద్రాలు మూతపడ్డాయి. మిగిలిన జిల్లాల్లో కూడా సేకరణ అంతంత మాత్రంగానే పాక్షికంగా సాగుతోంది. ఏ గ్రామానికి వెళ్లినా వెతలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ప్రైవేట్ డెయిరీల దోపిడీతో పాలకు గిట్టుబాటు ధర లభించక, బ్యాంకు రుణాలు తీర్చే దారి కానరాక రాష్ట్రవ్యాప్తంగా 27 లక్షల పాడి రైతు కుటుంబాలు దిక్కు తోచని స్థితిలో కూరుకుపోయాయి. గతంలో చంద్రబాబు హయాంలో పులివెందుల, చిత్తూరుతో సహా 8 సహకార డెయిరీలు మూతపడ్డాయి. డెయిరీల పునరుద్ధరణ, పాడి రైతులకు గిట్టుబాటు ధర, ప్రైవేట్ డెయిరీల దోపిడీకి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా 2020లో వైఎస్ జగన్ ప్రభుత్వం సహకార రంగంలో దేశంలోనే నెం.1గా ఉన్న అమూల్‌తో ఒప్పందం చేసుకుని పాడి రైతులను ఆదుకుంది.అమూల్ రాకతో పాల విప్లవం.. ఎనిమిది సార్లు సేకరణ ధర పెంపుఅమూల్ తొలుత మూడు జిల్లాల్లో ప్రారంభమై 19 జిల్లాలకు విస్తరించింది. 400 గ్రామాల నుంచి 4,798 పల్లెలకు చేరుకుంది. 2020 అక్టోబర్‌లో 10 శాతం వెన్నతో లీటర్ ఆవు పాలకు రూ.25–28, గేదె పాలకు రూ.56–60 చొప్పున ప్రైవేట్ డెయిరీలు చెల్లించగా, అమూల్ ప్రారంభంలోనే 11 శాతం వెన్న, 9 శాతం ఘన పదార్థాలు (ఎస్ఎన్ఎఫ్)తో గేదె పాలకు లీటర్ రూ.71.47లు, 5.4 శాతం వెన్న, 8.7 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌తో ఆవు పాలకు రూ.34.20 చొప్పున చెల్లించింది. ఆ తర్వాత వరుసగా 8 సార్లు పాలసేకరణ ధరలను పెంచి గేదె పాలకు రూ.89.76, ఆవుపాలకు రూ.43.69 చొప్పున చెల్లించింది. ఇలా 40 నెలల్లో గేదెపాలకు లీటర్‌పై రూ.18.29, ఆవుపాలపై రూ.9.49 చొప్పున పెంచడంతో లీటర్‌పై రూ.4 అదనంగా లబ్ధి చేకూరుస్తామన్న హామీ కంటే మిన్నగా గేదె పాలపై రూ.15–20, ఆవు పాలపై రూ.10–15 వరకు అదనంగా లబ్ధి చేకూర్చింది.రికార్డు స్థాయిలో గిట్టుబాటు ధర..గతేడాది సెప్టెంబర్, అక్టోబర్‌లో వెన్న శాతాన్ని బట్టి కాకినాడ జిల్లాలో గేదె పాలకు లీటర్‌కు రూ.112, ఆవు పాలకు లీటర్‌కు రూ.53.86 చొప్పున అమూల్‌కు పాలుపోసిన రైతులకు దక్కిన దాఖలాలున్నాయి. వెన్న శాతాన్ని బట్టి లెక్కగట్టి అణా పైసలతో సహా ప్రతి 10 రోజులకోసారి రైతుల ఖాతాలో జమ చేసేవారు. లీటర్‌కు ఏటా రూ.2–5 పెంచడమే గగనంగా ఉండే ప్రైవేట్ డెయిరీలు అమూల్ పోటీని తట్టుకోలేక గేదె పాలకు లీటర్‌పై రూ.14, ఆవు పాలపై రూ.7 వరకు సేకరణ ధర పెంచక తప్పలేదు. ప్రైవేట్ డెయిరీలతో పోలిస్తే అమూల్ పాల సేకరణ ధరలు 10 శాతం అధికంగానే ఉండేవి. సీజన్‌తో సంబంధం లేకుండా వెన్న, ఘన పదార్థాల శాతాన్ని బట్టి అమూల్ ఒకే రీతిలో చెల్లించి పాడి రైతులకు మేలు చేసింది.80 శాతం కేంద్రాలు మూతగతంలో 19 జిల్లాలకు విస్తరించిన అమూల్ పాలసేకరణ కూటమి సర్కారు సహాయ నిరాకరణతో ప్రస్తుతం ఎనిమిది జిల్లాలకే అది కూడా పాక్షిక సేకరణకు పరిమితమైంది. 4,798 కేంద్రాల్లో జరిగిన పాల సేకరణ వెయ్యి కేంద్రాలకు తగ్గిపోయింది. ఐదు నెలల క్రితం అమూల్‌కు పాలు పోసే వారి సంఖ్య రోజుకు సగటున 1.25 లక్షలు ఉండగా నేడు 20 వేలకు క్షీణించింది. ఇదే సమయంలో పాల సేకరణ 3.95 లక్షల లీటర్ల నుంచి 1.30 లక్షల లీటర్లకు తగ్గిపోయింది.కుటుంబ సంస్థకు మేలు చేసేందుకే..సీఎం చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టింది మొదలు సొంత డెయిరీకి మేలు చేస్తూ అమూల్‌ను నీరుగార్చే చర్యలకు శ్రీకారం చుట్టారు. నాలుగు దశాబ్దాల క్రితం సహకార సమాఖ్యగా ఏర్పడిన విజయ డెయిరీ నిలదొక్కుకునేందుకు ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ (ఏపీడీడీసీఎఫ్) దాదాపు దశాబ్దం పాటు చేయూతనిచ్చింది. పాలసేకరణ, రైతుకు మద్దతు ధర, పాల ఉత్పత్తుల లభ్యతను నిర్ధారించేందుకు అవసరమైన యంత్రాంగాన్ని సమకూర్చారు. అదే రీతిలో అమూల్‌కు చేయూత నిచ్చేందుకు నియమించిన సిబ్బందిని కూటమి ప్రభుత్వం కొలువుదీరిన రెండో రోజే వెనక్కి రప్పించింది. అంగన్వాడీ కేంద్రాలకు రోజూ 50 వేల లీటర్ల పాల సరఫరా బాధ్యతల నుంచి సైతం అమూల్‌ను తప్పించింది. దీంతో సేకరణ కేంద్రాలను మూసివేసే దిశగా అమూల్ అడుగులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తొలుత అనంతపురం, తిరుపతి, శ్రీసత్యసాయి జిల్లాల్లో కేంద్రాలను నిలిపి వేసిన అమూల్ అనంతరం గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల సహా 11 జిల్లాల్లో పాలసేకరణను నిలిపి వేసింది. మిగిలిన జిల్లాల్లో నామమాత్రంగా సేకరణ జరుగుతోంది. ఇదే అదనుగా ప్రైవేట్ డెయిరీలు పాల సేకరణ ధరలను తగ్గించేయడంతో గ్రామీణ మహిళా పాడి రైతుల జీవనోపాధికి గండి పడింది. హెరిటేజ్ సహా ప్రధాన ప్రైవేటు డెయిరీలన్నీ పాల సేకరణ ధరలను లీటర్‌పై సగటున ఆవు పాలకు రూ.10–20, గేదె పాలకు రూ.15 నుంచి రూ.30 వరకు తగ్గించేశాయి. తాము చెప్పిందే ధర, ఇచ్చిందే తీసుకోవాలనే విధంగా వ్యవహరిస్తున్నాయి. వెన్న, ఎస్ఎన్ఎఫ్ శాతాలతో సంబంధం లేకుండా 15 రోజులకోసారి సగటు ధర నిర్ణయిస్తుండడంతో ఒక్కో పాడి రైతు సగటున రోజుకు రూ.100–500 వరకు నష్టపోతున్నారు.గత ప్రభుత్వం పాడి రైతులను ఆదుకుందిలా..180 రోజుల పాటు పాలుపోసే వారికి లీటర్‌కు రూ.0.50 చొప్పున బోనస్ రూపంలో రూ.6.50 కోట్ల అదనపు లబ్ధి చేకూర్చడమే కాకుండా లాభాపేక్ష లేకుండా నాణ్యమైన ఫీడ్ పంపిణీ చేశారు. వర్కింగ్ క్యాపిటల్ రూపంలో గేదెకు రూ.30 వేలు, ఆవుకు రూ.25 వేల చొప్పున, కొత్త పాడి కొనుగోలుకు గేదెకు రూ.93 వేలు, ఆవులకు రూ.76 వేల చొప్పున ఆర్ధిక చేయూతనిచ్చారు. ఒక్కొక్కటి రూ.12.81 లక్షల అంచనా వ్యయంతో 11,800 పాల సేకరణ కేంద్రాలు (ఏఎంసీయూ), ఒక్కొక్కటి రూ.20.42 లక్షల అంచనాతో 4,796 పాల శీతలీకరణ కేంద్రాల (బీఎంసీయూ) నిర్మాణానికి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మూతపడిన మదనపల్లి డెయిరీని అమూల్ సహకారంతో పునరుద్ధరించారు. చిత్తూరు డెయిరీకి ఉన్న రూ.182 కోట్ల అప్పులను తీర్చి రూ.385 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన అమూల్‌కు లీజుకిచ్చారు. రూ.70 కోట్లతో రోజుకు లక్ష లీటర్ల సామర్థ్యంతో మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ప్రారంభించారు.ప్రతి నెలా బోనస్ వచ్చేదిఅమూల్ కేంద్రానికి రోజూ 9 లీటర్లు పాలు పోశాం. ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్ శాతాన్ని బట్టి గరిష్టంగా లీటర్‌కు రూ.85–95 వరకు ఇచ్చేవారు. ప్రతి నెలా బోనస్ వచ్చేది. పది రోజులకోసారి బ్యాంక్ ఖాతాలో సొమ్ములు జమ చేసేవారు. అమూల్ కేంద్రం మూతపడడంతో ప్రెవేట్ డెయిరీకి పోయాల్సి వస్తోంది. ఎస్ఎన్ఎఫ్ శాతం ఎంత ఉన్నా లీటరుకి రూ.75కి మించి రావడం లేదు. సగటున రోజుకి రూ.100కిపైగా నష్టపోతున్నా. – ఎనుముల పవనకుమారి, పోతవరం, ప్రకాశం జిల్లా.పట్టించుకోకపోవడం దారుణంఅమూల్ కేంద్రానికి పూటకు 4 లీటర్లు పాలు పోసేవాళ్లం. గేదె పాలు లీటర్‌కు రూ.70కు పైగా వచ్చేది. ఇప్పుడు అమూల్ కేంద్రం మూతపడటంతో ప్రైవేట్ డెయిరీలు రూ.30కి మించి ఇవ్వడం లేదు. బ్యాంక్ రుణాలు ఎలా చెల్లించాలో తెలియడం లేదు. అమూల్ కేంద్రాలు మూతపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం. – ఎం.భారతి, సముదాయం, తిరుపతి జిల్లామళ్లీ బెంగళూరు వలస వెళ్లాల్సిందే...రోజూ 32 లీటర్ల పాలు అమూల్‌కు పోసేవాళ్లం. లీటరుకు రూ.42 చొప్పున రోజుకు రూ.1,300కిపైగా వచ్చేవి. రెండు రోజులుగా శ్రీజ డెయిరీకి పోస్తున్నా. ఇప్పుడు రోజుకు రూ.900 కూడా రావడం లేదు. అమూల్ ద్వారా మహిళా సహకార సంఘంలో నాలుగు ఆవులను రూ.2 లక్షల లోన్‌పై తీసుకున్నా. రుణ వాయిదాలు ఎలా చెల్లించాలో దిక్కు తోచడం లేదు. ఇలాగైతే పాడిని అమ్ముకోవడం మినహా గత్యంతరం లేదు. పాడి రైతులంతా గతంలో మాదిరిగా బెంగళూరు వలస వెళ్లాల్సిందే. – శశికళ, కౌలేపల్లి, శ్రీసత్యసాయి జిల్లాజగన్పై కోపాన్ని మాపై చూపిస్తున్నారు..రోజూ 20 లీటర్ల వరకు పాలు పోస్తాం. ఈ ఏడాది ఏప్రిల్, మే వరకు ఆవు పాలకు గరిష్టంగా లీటర్‌కు రూ.44, గేదె పాలకు గరిష్టంగా రూ.67 వరకు లభించింది. అత్తమీద కోపం దుత్తపై చూపినట్లు జగన్‌పై కోపాన్ని పాడి రైతులపై చూపిస్తున్నారు. ఇలాగైతే పాడి పశువులను అమ్ముకోవాల్సిందే. – పి.ఉమా, కురబాలకోట, అన్నమయ్య జిల్లాఇదే పరిస్థితి ఉంటే పాడిని వదిలేస్తాంవెన్న శాతాన్ని బట్టి గతంలో లీటరుకి రూ.82 వచ్చేది. ప్రస్తుతం వెన్న శాతం ఎంత ఉన్నా రూ.72కు మించి ఇవ్వడం లేదు. గతంలో రూ.80–100 ఉండే ఒక బొద్దు ఎండు గడ్డి ప్రస్తుతం రూ.120 చెల్లించి కొనుగోలు చేస్తున్నాం. గేదెలకు ఎండు గడ్డి వేయకపోతే వెన్న శాతం పెరగదు. తవుడు కిలో రూ.40 చొప్పున కొనుగోలు చేస్తున్నాం. జగన్ హయాంలో పాడి రైతులకు గిట్టుబాటు ధర లభించింది. ఇప్పుడు ప్రైవేటు డెయిరీలు పాలసేకరణ ధరలను దారుణంగా తగ్గించేస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే పాడిని వదిలేస్తాం. – ఎం.బ్రహ్మయ్య, రాళ్లపాడు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లామేం రోడ్డున పడ్డాం..అమూల్ కోసం మహిళా పాల సహకార సంఘం ద్వారా రోజూ 480 లీటర్ల వరకు సేకరించేవాడ్ని. లీటర్‌కు రూ.1.25 చొప్పున నెలకు రూ.18 వేలు కమిషన్ వచ్చేది. ఆ డెయిరీ మూత పడడంతో రోడ్డున పడ్డాం. ఆవులను అయినకాడికి అమ్ముకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు. అమూల్ కేంద్రాలు మూతపడకుండా చూడాలని వేడుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. – చంద్రమోహన్, కొండకమర్ల, శ్రీసత్యసాయి జిల్లా -
ప్రజలు ‘సూపర్‌సిక్స్’ కోసం చూస్తున్నారు: బొత్స
సాక్షి,విశాఖపట్నం: సూపర్‌సిక్స్ హామీల అమలుకు ముహూర్తం ఎప్పుడని మాజీ మంత్రి,వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. శనివారం(అక్టోబర్ 19) మరో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్తో కలిసి విశాఖపట్నంలో బొత్స మీడియాతో మాట్లాడారు.‘ఎన్నికల హామీల అమలును కూటమి ప్రభుత్వం విస్మరించింది. సూపర్ సిక్స్ హామీల అమలు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో సామాన్యులకు ఇసుక దొరకడం లేదు. విశాఖలో రూ.10వేలు, విజయనగరంలో రూ.7 వేలకు ఇసుక దొరకాలి. ఇప్పుడు దొరుకుతోందా? ధరలు పెరిగి సామాన్య ప్రజలు ఇబ్బందిపడుతున్నారు’అని బొత్స మండిపడ్డారు.బొత్స ఇంకా ఏమన్నారంటే..ప్రభుత్వానికి హామీలపై ఆరు నెలలు సమయం ఇద్దమనుకున్నాం.ఆరు నెలల తర్వాత కూడా ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైంది.ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు అమలు చేస్తారు.సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు.రెండున్నర ఏళ్లు మాత్రమే అధికారంలో ఉంటుందని చంద్రబాబు చెపుతున్నారు.వైఎస్సార్సీపీ పాలనలో పది వేల రూపాయాలకు వచ్చే ఇసుక నేడు 15 వేల లభిస్తుంది.ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పినా కూడా గత ప్రభుత్వం కంటే ఎక్కువ ధరకు ఇసుక అమ్ముతున్నారు.గత ప్రభుత్వ హయాంలో సినరేజ్ చార్జీలు రూ.375 వసూలు చేసేవారు.సినరేజ్ డబ్బులు ప్రభుత్వానికి ఆదాయ రూపంలో వచ్చేవి.కూటమి ప్రభుత్వం టన్నుకు 375 రూపాయలు సినరేజ్ వసూలు చేయకపోయినా టన్ను ఇసుక రేటు తగ్గలేదు.ట్రాక్టర్‌తో ఉచిత ఇసుక అనేది గత ప్రభుత్వ హయాంలో కూడా ఇచ్చేవారు.టీడీపీ ప్రభుత్వం హయంలో కొత్తగా ఏమీ ఇవ్వలేదు.మద్యం ధరలు తగ్గిస్తామని చెప్పారు, ఎక్కడ తగ్గించారు.నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్ని అంటాయి.తల్లికి వందనం, రైతు భరోసా ఒక్కరికైన ఇచ్చారా.ఖరీఫ్ ముగుస్తున్నా ఒక్క పైసా రైతు ఖాతాల్లో పడలేదు.అగ్గిపెట్టెలకు కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు.ప్రభుత్వ అవినీతిపై వార్తలు రాస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు.అగ్గి పెట్టె లెక్కలు మీ గెజిట్ పేపర్లోనే వచ్చాయి.టీడీపీ నేతల కుమ్ములాటలు వల్ల గుర్లలో పది మంది చనిపోయారు.నాలుగు నెలల నుంచి మంచి నీటిపై పర్యవేక్షణ లేదు.మంచినీటి సరఫరా కాంట్రాక్టు తమకు ఇవ్వాలంటే తమకు ఇవ్వాలని కుమ్మూలడుకుంటున్నారు.ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలి.ప్రభుత్వ నిర్లక్ష్యం వలన డయేరియా మరణాలు సంభవించాయి.పరిశుభ్రమైన మంచి నీటిని అందించలేదు.డయేరియాతో చనిపోయిన పది మందికి నష్ట పరిహారం చెల్లించాలి.ఇదీ చదవండి: ఇసుక,మద్యంలో కూటమి నేతల అవినీతి: కాకాణి -
బలంగా ఎదుగుదాం.. పార్టీని పటిష్టంగా నిర్మిద్దాం: వైఎస్ జగన్
మనం ఇంట్లో కూర్చుంటే.. ఏమీ జరగదు. మనం చొరవ తీసుకుని అన్ని అంశాలపై స్పందించాలి. గ్రామ, మండల, నియోజకవర్గాల స్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రజా సంబంధిత అంశాలపై స్పందించాలి. అన్యాయాలపై స్పందించాలి. బాధితులకు అండగా నిలవాలి. మనవైపు నుంచి స్పందన లేకపోతే ఆ అంశం మరుగున పడుతుంది. ప్రజలకు న్యాయం జరగదు. – వైఎస్ జగన్ఇసుక ధర రెట్టింపు.. మద్యం టెండర్లలో దారుణాలు.. యథేచ్ఛగా పేకాట క్లబ్లుఈ సోషల్ మీడియా కాలంలో వాళ్ల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా మనం సిద్ధం కావాలిఎప్పటికప్పుడు నివేదికలతో కష్టపడి పని చేసే వారికి గుర్తింపు, ప్రమోషన్లు సాక్షి, అమరావతి: గ్రామ, బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింత వ్యవస్థీకృతంగా నిర్మించడం ద్వారా దేశంలోనే బలమైన పార్టీగా నిలుపుదామని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. మన పార్టీ ఏర్పాటు చేసుకుని దాదాపు 15 ఏళ్లు అవుతోందని, ఈ సమయంలో వివిధ రకాల ఎన్నికలు చూశామని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నామని.. అధికారంలోనూ ఉన్నామని.. స్థానిక సంస్థలతో పాటు చాలా ఎన్నికల్లో పాల్గొన్నామని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నామని, గ్రామ స్థాయి నుంచి ప్రతి అడుగులోనూ పార్టీ యుద్ధం చేస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలో పార్టీ వ్యవస్థీకృతంగా ముందుకు సాగితేనే మంచి ఫలితాలను ఇస్తుందని, అప్పుడే మనం రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు శక్తివంతంగా ఉంటామని ఉద్బోధించారు. లోటుపాట్లు సరిదిద్దుకోవడానికి ఇప్పుడు తగినంత సమయం ఉందని, దానిని సద్వినియోగం చేసుకుందామని కోరారు. శాసససభ, పార్లమెంటుకు జమిలి ఎన్నికలు నిర్వహిస్తామంటున్నారని.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేద్దామని జిల్లా అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ నిర్మాణంలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్‌లో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. గ్రామ, బూత్ కమిటీలతో మరింత బలోపేతం ⇒ ఇప్పుడు మనం రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా కమిటీలు, నియోజకవర్గ స్థాయి, మండల, గ్రామ స్థాయి కమిటీల వరకు ఎలా ఉన్నాయన్న దానిపై పరిశీలన, అవగాహన పెంచుకోవాలి. ప్రతి ఒక్కరూ తమ పాత్రలను నిర్వర్తించాలి. ఆ దిశగా అడుగులు వేయాలి. మరో ఆరు నెలల్లో మళ్లీ సమావేశం నాటికి గ్రామ స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు కావాలి. అక్కడే యూత్, మహిళా, విద్యార్థి విభాగాలతో పాటు విలేజ్ కమిటీ, బూత్ కమిటీల వంటి అనుబంధ విభాగాలకు గ్రామ స్థాయిలో కూడా కమిటీలు ఏర్పాటు కావాలి. ⇒ ఈ కమిటీల ఏర్పాటు కాగితాలకే పరిమితం కాకూడదు. దాని వల్ల పార్టీకి ఎలాంటి లాభం ఉండదు. కమిటీల ఏర్పాటుపై మీ పర్యవేక్షణ, పరిశీలన ఉండాలి. ఇలా చేయగలిగితే.. దేశంలోకెల్లా నంబర్ వన్ పార్టీగా ఎదుగుతాం. పార్టీ క్షేత్ర స్థాయి నిర్మాణంలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి. గ్రామ స్థాయి నుంచి మనకు కమిటీలు, నాయకత్వం లేక కాదు. ప్రతి గ్రామంలోనూ ఆ గ్రామ సర్పంచ్ లేదా, పోటీ చేసిన అభ్యర్థి మన పార్టీ వారే ఉన్నారు. కాకపోతే వీరందరినీ నిర్మాణాత్మక వ్యవస్థల్లోకి తీసుకురావాలి. అప్పుడు మనం రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన పిలుపునకు గ్రామ స్థాయి వరకు ఉధృత స్పందన వస్తుంది. అది చేయగలగాలి. వైఎస్సార్సీపీ రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‌లో పార్టీ జిల్లాల అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు తదితరులు మన కార్యకర్తలు కాలర్ ఎగరేసుకుని తిరిగేలా⇒ ఇవాళ వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎవరైనా సగర్వంగా కాలర్ ఎగరేసుకుని ప్రతి ఇంటికీ వెళ్లగలం. కారణం మనం చెప్పిన ఎన్నికల మేనిఫెస్టో అన్నదాన్ని చెత్తబుట్టలో వేసే డాక్యుమెంటు కింద కాకుండా.. దేశ చరిత్రలోనే సరికొత్త అర్థం తీసుకువచ్చిన పార్టీ మనది. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తూ దానిలో చెప్పినవి తూచ తప్పకుండా అమలు చేశాం. ⇒ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌తో పాటే మనం పథకాలు అమలు చేసే తేదీలతో సహా సంక్షేమ క్యాలెండర్ రిలీజ్ చేసే వాళ్లం. నేరుగా బటన్ నొక్కి మధ్యలో దళారులు లేకుండా అక్కచెల్లెమ్మలకు ఆయా పథకాలు అందించింది కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. ఇంతకు ముందెన్నడూ ఇలా జరగలేదు. ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నదేమిటి? వాళ్లు ఎన్నికలప్పుడు చెప్పిన మాటలేమిటి? ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూసి ఉండం. ఎన్నికలప్పుడు ప్రచారంలో వారిలా మనం అబద్ధాలు చెప్పలేకపోయాం. అదే మనకు వాళ్లకూ తేడా. విలువలు, విశ్వసనీయత అన్నది ముఖ్యం. ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చుంటే తప్పేముంది? ప్రజల్లో ఆలోచన మొదలైంది ⇒ వైఎస్సార్సీపీ, జగన్ వల్ల జరిగిన మంచి ఏమిటి.. అంటూ మనం చేసిన మంచి పనుల గురించి ప్రజలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. చెప్పినవన్నీ జగన్ చేశాడని ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతోంది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చేశాడు. జగన్ మాకు పలావు పెట్టాడు. చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు. తీరా చూస్తే పలావు పోయింది.. బిర్యానీ లేదు.. అన్న చర్చ ప్రతి ఇంట్లోనూ జరుగుతోంది. ఫలానా మంచి మా హయాంలో జరిగిందని.. ప్రజల్లోకి మనం ధైర్యంగా వెళ్లగలుగుతాం. కానీ టీడీపీ కూటమి కార్యకర్తలు ధైర్యంగా వెళ్లగలుగుతారా? ⇒ టీడీపీ వాళ్లు ప్రజల ఇళ్లకు పోయే పరిస్థితులు లేవు. చంద్రబాబు అబద్ధాలకు రెక్కలు కట్టారు. మనం ప్రజల్లోకి వెళ్లినప్పుడు, ప్రతి ఇంటికీ మన నాయకులు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసినప్పుడు, ఎవరింటికి పోయినా అందరూ సంతోషంగా దీవించారు. అయితే ఒకవైపు ఈవీఎంల వ్యవహారం, మరోవైపు టీడీపీ మోసపూరిత హామీలతోనే ఓడిపోయాం. 4 నెలల్లోనే ఎప్పుడూ లేనంత వ్యతిరేకత ⇒ మనం అమలు చేసిన హామీలే మనకు శ్రీరామ రక్ష. కేవలం నాలుగు నెలల్లోనే ఎప్పుడూ చూడని వ్యతిరేకత ప్రభుత్వం మీద కనిపిస్తోంది. వాళ్లు ఎవరి ఇంటికైనా వెళితే మా రూ.15 వేలు ఏమయ్యాయని పిల్లలు అడుగుతారు. మా రూ.18 వేలు ఏమయ్యాయని మహిళలు, రూ.48 వేలు ఏమయ్యాయని అవ్వలు, మా రూ.20 వేలు ఏమయ్యాయని రైతులు, మా రూ.36 వేలు ఏమయ్యాయని నిరుద్యోగ యువత అడుగుతారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం మరింతగా ప్రిపేర్ అవ్వాలి. ఒకవైపు హామీల అమలు లేకపోగా, మరోవైపు రాష్ట్రంలో పాలన దారుణంగా తయారైంది. దాదాపు రూ.2,400 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆరోగ్య ఆసరా లేదు. ప్రభుత్వం ఆస్పత్రులు నిర్వీర్యం అయ్యాయి. ⇒ మూడు త్రైమాసికాలు వచ్చినా, విద్యా దీవెన, వసతి దీవెన లేదు. ఇంగ్లిష్ మీడియం లేదు. సీబీఎస్ఈ లేదు. టోఫెల్ క్లాసులు లేవు. గోరుముద్ద కూడా పాడైపోయింది. అన్ని రంగాలూ దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. వ్యవసాయ రంగంలో ఖరీఫ్ సీజన్ పూర్తవుతున్నా రైతులకు పెట్టుబడి సహాయం అందలేదు. ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. ఈ–క్రాప్ ఏమైందో తెలియదు. ఆర్బీకేలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి. రైతుల పంటలకు కనీస మద్దతు దక్కని పరిస్థితి. ⇒ ఇంటి వద్దకు వచ్చే అన్ని సేవలూ నిలిచిపోయాయి. ఏం కావాలన్నా మళ్లీ జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సిన పాలన వచ్చింది. ఇప్పటికే లక్షన్నర పెన్షన్లు తొలగించారు. లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఘోరంగా ఉంది. మహిళలకు భద్రత సున్నా. దిశ యాప్ ఏమైందో తెలియదు. గతంలో మన పాలనలో అక్కచెల్లెమ్మలు ఫోన్ తీసుకుని బయటకు వెళ్లినప్పుడు, ఆపద ఎదురై ఫోన్ చేస్తే.. పది నిమిషాల్లో పోలీసులు వచ్చి ఏమైందని అడిగే పరిస్థితి ఉండేది. అవేవీ ఇప్పుడు లేవు. రాష్ట్రంలో దారుణంగా చిన్నారులను సైతం వదలకుండా అత్యాచారాలు జరుగుతున్నాయి. పోలీసులు దొంగ కేసులకు పరిమితం అయ్యారు. విధి నిర్వహణ మరిచిపోయి మూడు సింహాలకు కాకుండా, రాజకీయ నాయకులకు మడుగులొత్తుతున్నారు. ఎక్కడ చూసినా స్కాంలే కనిపిస్తున్నాయి. ఇసుక ఉచితం అంటూ టెండర్లేంటి? ⇒ ఇసుక ఉచితం అంటూ రెండు రోజుల్లోనే గుట్టుచప్పుడు కాకుండా టెండర్లు నిర్వహించారు. మన హయాంలో కనీసం రాష్ట్ర ఖజానాకు డబ్బులు రావడంతోపాటు ప్రజలకు రీజనబుల్ రేట్లకు ఇసుక వచ్చేది. ప్రతి ఆదివారం ప్రతి నియోజకవర్గంలో ధరలు ఇచ్చే వాళ్లం. అక్రమాలకు పాల్పడితే కేసులు పెట్టేవాళ్లం. అంత కట్టుదిట్టంగా అమలు చేశాం. కానీ ఇప్పుడు దోచుకోవడానికి పాలసీని మార్చారు. అడ్డగోలుగా స్టాక్ యార్డులు, రీచ్‌ల్లోని ఇసుకను అధికారంలోకి వచ్చిన నెల రోజులకే ఖాళీ చేశారు. ప్రభుత్వానికి సున్నా ఆదాయం. మరోవైపు ధరలు రెండు, మూడు రెట్లు పెరిగాయి. ⇒ మద్యం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మన హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో దుకాణాలు నడిపాం. ఉన్న షాపులు తగ్గించి, పర్మిట్ రూమ్స్ తీసేసి, టైమింగ్స్ పక్కాగా పెట్టి, బెల్టుషాపులు లేకుండా చూసి, అమ్మకం వాల్యూమ్స్ తగ్గించి ప్రజలకు మంచి చేశాం. కానీ ఇప్పుడు మద్యం షాపుల కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉచిత వాటాలు అడుగుతూ బెదిరింపులకు దిగుతున్నారు. ఎన్నికలప్పుడు ప్రచారంలో వారిలా మనం అబద్ధాలు చెప్పలేకపోయాం. అదే మనకు వాళ్లకూ మధ్య తేడా. ప్రతిపక్షంలో కూర్చోడానికైనా మనం వెనకాడం కానీ, అబద్ధాలు చెప్పలేం. నేను చెప్పే ఈ మాటలు ఎవ్వరికీ నచ్చకపోవచ్చు. కానీ విలువలు, విశ్వసనీయత అనే పదాలకు అర్థం ఉండాలి. రాజకీయాల్లో అధికారం ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. కానీ మళ్లీ మనల్ని అధికారంలోకి తెచ్చేది మన విశ్వసనీయత, విలువలే. అవి లేనప్పుడు రాజకీయాలకు అర్థం లేదు. ఎన్నికలప్పుడు ఇంటింటికీ వెళ్లి ఆ ఇంట్లో చిన్న పిల్లలు కనిపిస్తే నీకు రూ.15 వేలు (అమ్మ ఒడి), ఆ పిల్లల తల్లి కనిపిస్తే నీకు రూ.18 వేలు (నెలకు రూ.1,500), వాళ్ల చిన్నమ్మ కనిపిస్తే నీకూ రూ.18 వేలు (నెలకు రూ.1,500), 50 ఏళ్లకుపై బడిన పెద్దమ్మ కనిపిస్తే నీకు రూ.48 వేలు (బీసీలకు 50 ఏళ్లకే పింఛన్), ఉద్యోగం కోసం చూస్తున్న యువకుడు కనిపిస్తే నీకు రూ.36 వేలు (నిరుద్యోగ భృతి), అదే ఇంట్లో మెడలో కండువాతో రైతు కనిపిస్తే చాలు నీకు రూ.20 వేలు (రైతు భరోసా) అని ఇంట్లో ఎవరు కనిపించినా.. నీకు ఇంత.. నీకు ఇంత.. అని ప్రచారం చేశారు. ఇప్పుడు వాటి మాటేంటి?గ్రామ స్థాయి నుంచి పార్టీ ప్రతి అడుగులోనూ యుద్ధం చేస్తోంది. కాకపోతే మనం వ్యవస్థీకృతం(ఆర్గనైజ్డ్)గా యుద్ధం చేస్తున్నామా? లేదా? అన్నది చాలా ముఖ్యం. పార్టీ వ్యవస్థీకృతంగా ముందుకు సాగితేనే మంచి ఫలితాలు ఉంటాయి. గ్రామ స్థాయి నుంచి మనకు కమిటీలు, నాయకత్వం లేక కాదు. ప్రతి గ్రామంలోనూ ఆ గ్రామ సర్పంచ్ లేదా, పోటీ చేసిన అభ్యర్థి మన పార్టీ వారే ఉన్నారు. 86 శాతం సర్పంచ్‌లు, 90 శాతం పైచిలుకు ఎంపీటీసీ సభ్యులు మన వాళ్లే ఉన్నారు. దాదాపు 15 ఏళ్లుగా ప్రతి గ్రామంలో మనకు ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే వీటిని నిర్మాణాత్మక వ్యవస్థల్లోకి తీసుకురావాలి. గ్రామ స్థాయిలో పార్టీ నిర్మాణం మరింత బలంగా ఉండాలి. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలి ⇒ ఇప్పుడు నడుస్తున్నది సోషల్ మీడియా కాలం. ఇది నియోజకవర్గ ఇన్ఛార్జ్ నుంచి గ్రామ స్థాయి లీడర్ వరకు ధ్యాస పెట్టాల్సిన అంశం. ఇవాళ మనం యుద్ధం చేసేది చంద్రబాబుతోనే కాదు. ఒక చెడిపోయిన వ్యవస్థతో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, టీడీపీ తప్పుడు సోషల్ మీడియాలతో యుద్ధం చేస్తున్నాం. వాళ్లే అబద్ధాలు సృష్టిస్తున్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అందుకే మనం మరింత బలంగా తయారు కావాలి. ప్రతి గ్రామంలోనూ పార్టీ కమిటీలన్నీ సోషల్ మీడియాకు అనుసంధానం కావాలి. ⇒ నియోజకవర్గ స్ధాయిలో జరుగుతున్న అన్యాయాలు, ఆకృత్యాలు చూపించగలగాలి. రెండో వైపున పార్టీ సందేశాలు కూడా గ్రామ స్థాయికి వెళ్లాలి. ఇది సవాల్‌తో కూడిన కార్యక్రమం. ఇది చేయగలిగే వ్యవస్థ మనకుంది. వచ్చే రోజుల్లో దీనిపై బాగా దృష్టి పెట్టాలి. వైఎస్సార్సీపీని దేశంలో అత్యంత బలమైన పార్టీగా తయారు చేయాలి. స్కామ్‌లలో కూడా ప్రజలను ఎలా కొత్తగా పిండాలా అని ఆలోచిస్తున్నారు. కనీసం ఇసుక టెండర్లు పిలుస్తున్నారన్న విషయం ఎవ్వరికీ తెలియదు. రెండే రెండు రోజులు టైం ఇచ్చారు. టెండర్లు వేయడానికి ఎవ్వరూ పోకుండా చూశారు. ఎన్నికలకు ముందు ఇసుక ఉచితం అన్నారు. ఎన్నికలు అయిన తర్వాత ఇసుక రేటు మన హయాం కన్నా డబుల్, ట్రిపుల్ రేటు. మన హయాంలో కనీసం రాష్ట్ర ఖజనాకు డబ్బులు రావడంతో పాటు ప్రజలకు రీజనబుల్ రేట్లకు ఇసుక వచ్చేది.ఈ ప్రభుత్వంలో మద్యం షాపుల కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు 30 శాతం ఇస్తావా, 40 శాతం ఇస్తావా.. అని బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. షాప్‌ల కోసం కిడ్నాప్‌లు కూడా చేస్తున్నారు. నిజంగా లిక్కర్ పాలసీలో దురుద్దేశాలు లేకపోతే ఎమ్మెల్యేలు ఎందుకు పోటీ పడుతున్నారు? అంత దారుణంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు. లిక్కర్ రేట్లు తగ్గిస్తామన్నారు. కానీ, రేట్లు అలాగే ఉన్నాయి. మళ్లీ పర్మిట్ రూమ్స్ తీసుకొస్తున్నారు. బెల్టుషాప్‌లు ఏర్పాటవుతున్నాయి. ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుండగా.. ప్రభుత్వ పెద్దలకు, వాళ్ల అనుచరులకు ఆదాయం పెరుగుతోంది.నాలుగు నెలల్లోనే ఈ ప్రభుత్వం వద్దురా.. అని ప్రజలు చెప్పే పరిస్థితి వచ్చింది. నేనెప్పుడూ ఇలాంటి ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు. అంత దారుణమైన పరిపాలన సాగుతోంది. ప్రభుత్వం ఎలా విఫలమైందో నాకన్నా.. నాయకులుగా మీరే బాగా చెబుతారు. ఎన్నికలప్పుడు వాళ్లు చెప్పిన మాటలేమిటి.. ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్లు చేస్తున్న పాలన ఏమిటిన్నది గమనిస్తే.. ఆశ్చర్యం కలిగించే వాస్తవాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల మాటేమిటి? సూపర్ సిక్స్‌లు ఏమయ్యాయని ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనని.. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక కనీసం బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టలేకపోతున్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తో నడుపుతున్న ప్రభుత్వం ఇది. ప్రతి నియోజకవర్గంలో 10 పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. ఆ నియోజకవర్గంలో గ్రావెల్ తోలుకోవాలన్నా, ఫ్యాక్టరీ పెట్టుకోవాలనుకున్నా.. వ్యాపారం చేయాలనుకున్నా.. ఎవరు ఏం చేయాలన్నా ఎమ్మెల్యేకు కప్పం కట్టాల్సిందే. డబ్బు ఇవ్వకపోతే వ్యాపారమే లేదు. పోలీసుల సహాయంతో బెదిరిస్తున్నారు.ప్రతి గ్రామంలోనూ పార్టీ కమిటీలన్నీ సోషల్ మీడియాకు అనుసంధానం కావాలి. కమిటీల్లోని ప్రతి ఒక్కరూ వాళ్ల సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండాలి. మీ పేజీలను మీరే నడపాలి. ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్‌స్ట్రాగామ్ పేజీలు తయారు చేసుకోవాలి. గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ ఆయా మాధ్యమాల్లో మీ అకౌంట్, మీ పేజీలు నిర్వహించాలి. ఎప్పుడైతే మీరు మీ పేజీలు నడుపుతారో అప్పుడే గ్రామ స్థాయిలో జరుగుతున్న అన్యాయాలను మనం ఎండగట్టగలుగుతాం.చీకటి తర్వాత వెలుగు సహజం పార్టీ భవిష్యత్తు బాధ్యతను పట్టుదలతో నిర్వర్తిస్తే మీకు, పార్టీకి మంచి జరుగుతుంది. మన పని వల్ల పార్టీకి మంచి జరుగుతుందనేది మనం మర్చిపోకూడదు. పార్టీ అధికారంలోకి వస్తే కొట్ల మంది ప్రజలకు, లక్షల మంది కార్యకర్తలకు, వేల మంది నాయకులకు మంచి జరుగుతుంది. ఇవన్నీ ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయి. అందరం కలిసికట్టుగా బాధ్యత తీసుకుని అడుగులు వేస్తున్నప్పుడు.. ఇది మన పార్టీ అనేది మన నరనరాల్లో ఇమిడి ఉండాలి. మనం వేసే ప్రతి అడుగు మన పార్టీ కోసం వేస్తున్నామన్నది మన ఒంట్లో ఎక్కించుకోవాలి. కష్టం లేనిదే మనకు అందలం రాదు. 16 నెలలు నేను జైలుకు పోతేనే ముఖ్యమంత్రి అయ్యాను. ఎవరూ చూడని వేధింపులు చూశాను. అకారణంగా 16 నెలలు ఒక వ్యక్తిని జైల్లో పెట్టడం అన్నది ఎప్పుడూ జరగలేదు. ఒక పార్టీ లేకుండా చేయాలని, ఒక వ్యక్తిని వేధించాలన్న ఉద్దేశంతోనే ఆ స్థాయి వేధింపులు చేశారు. అన్ని నెలలు జైల్లో పెట్టిన తర్వాత, ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చి ప్రజలకు మంచి చేసే అవకాశం దేవుడు ఇచ్చాడు. మనం మంచి చేయగలిగాం. దాని అర్థం అన్యాయం జరిగినప్పుడు ఒక మంచి జరుగుతుంది. చీకటి తర్వాత వెలుగు వస్తుంది. దేవుడు మంచికి తోడుగా ఉంటాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి. నష్టాలుంటాయి. ఒక్కోసారి జైలుకు కూడా పోవాల్సి ఉంటుంది. అయితే ఏంటి? ఇవన్నీ జరిగినప్పుడే మనిషి ఎదుగుతాడు. ప్రజల్లో, నాయకత్వం దగ్గర మన్ననలు ఉంటాయి. అన్నీ ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. మన భవిష్యత్ కోసం మనం చేస్తున్నామని గుర్తు పెట్టుకోండి. మన పార్టీ కోసం, మనం అధికారంలోకి రావాలన్న సంకల్పంతో పేదవాడికి మన వల్ల మంచి జరుగుతుందన్న స్థిరమైన నమ్మకంతో అడుగులు వేస్తున్నాం. ఈ విషయం ప్రతి ఒక్కరూ మనసులో పెట్టుకోండి. పనితీరు ఆధారంగా ప్రమోషన్లు జిల్లా అధ్యక్షులు, కమిటీల్లోని వారు.. మీ మీ పనితీరు ఆధారంగా మీ ప్రమోషన్లు ఉంటాయి. మీరు ప్రూవ్ చేసుకోండి. తప్పకుండా ప్రాధాన్యత, అవకాశాలు కల్పిస్తాం. మీకు ప్రమోషన్ ఇచ్చే బాధ్యత నాది. మనం అధికారంలోకి రాగానే మీలో ఎక్కువ మంది మంత్రివర్గంలో ఉండాలని ఆశిస్తున్నాం. జిల్లా అధ్యక్షులకు ఇదొక సువర్ణావకాశం. కష్టపడండి. మీ కష్టానికి ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. మీ జగన్ మీ కష్టాలకు తప్పకుండా ప్రాధాన్యత ఇస్తాడు. అనుబంధ సంఘాల అధ్యక్షులకూ మంచి అవకాశాలు వస్తాయి. మీ పనితీరుపై పరిశీలన, పర్యవేక్షణ ఉంటుంది. రీజినల్ జనరల్ సెక్రటరీలను తీసుకొచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జ్‌ల పనితీరుపైనా మదింపు ఉంటుంది. రిపోర్టుల ప్రకారం నిర్ణయాలు ఉంటాయి. బాగా పని చేసే వారికీ రేటింగ్స్ ఇస్తాం. -
దోచుకోవడంలో ‘స్కిల్’ నిజమే
సాక్షి, అమరావతి: ప్రజాధనాన్ని కొల్లగొట్టి అరెస్ట్ అయిన చంద్రబాబుకు సంబంధించిన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా మరోసారి కొరఢా ఝుళిపించింది. ఈ కేసులో ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు చంద్రబాబు ముఠాకు సహకరించిన షెల్ కంపెనీ డిజైన్ టెక్ ఎండీ వికాస్ వినాయక్ కన్విల్కర్, సీమెన్స్ కంపెనీ అప్పటి ఎండీ సుమన్ బోస్‌కు చెందిన రూ.23.54 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను అటాచ్ చేసింది. ఢిల్లీ, ముంబయి, పూణేల్లోని స్థిరాస్తులతోపాటు వారి పేరిట ఉన్న షేర్లు, బ్యాంకు ఖాతాల్లోని నిధులను అటాచ్ చేసినట్టు ఈడీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇదే కేసులో గతంలో డిజైన్ టెక్కు చెందిన రూ.31.20 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో మొత్తంగా రూ.54.74 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లయింది. తద్వారా 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం బరితెగించి సాగించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం మరోసారి చర్చనీయాంశంగా మారింది. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అవినీతికి పాల్పడినట్టు మరోసారి జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సిట్ చంద్రబాబును అరెస్ట్ చేయడం రాజకీయ కక్ష సాధింపు చర్య కాదన్నది స్పష్టమైంది. ఎందుకంటే కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ కూడా టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగినట్టు.. షెల్ కంపెనీల ద్వారా నిధులు అక్రమంగా తరలించినట్టు ఆధారాలతో సహా నిర్ధారించి కఠిన చర్యలను వేగవంతం చేయడమే అందుకు నిదర్శమని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో ఈడీ దూకుడు పెంచడంతో ‘స్కిల్’ క్రిమినల్స్‌లో గుబులు మొదలైంది.గత ఏడాది డిజైన్ టెక్ సిస్టమ్స్ ఎండీ, సీమెన్స్ ఎండీలను అరెస్టు చేసినట్లు ఈడీ చేసిన ట్వీట్ ప్రజాధనం కొల్లగొట్టడమే లక్ష్యంగా అడుగులు⇒ 2014లో అధికారంలోకి రాగానే ప్రజాధనాన్ని కొల్లగొట్టడమే చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరిట ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్‌ను తెరపైకి తెచ్చారు. భారత్‌లో ఆ కంపెనీ ఎండీగా ఉన్న సుమన్ బోస్, డిజైన్ టెక్ ఎండీ వికాస్ వినాయక్ కన్విల్కర్ సహకారంతో చంద్రబాబు అక్రమాలకు తెర తీశారు. ఏపీఎస్ఎస్డీసీ ద్వారా డిజైన్ టెక్ కంపెనీకి డబ్బు ఇచ్చేందుకు 2016లో సీఎంగా చంద్రబాబు చేసిన డిజిటల్ సంతకం ⇒ కేబినెట్ ఆమోదం లేకుండానే చంద్రబాబు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్ఎస్డీసీ) ఏర్పాటు చేసి, అనంతరం ఏపీఎస్ఎస్డీసీతో సీమెన్స్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నట్టు మభ్యపుచ్చారు. సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, ఇతర అంశాలకు సంబంధించిన ఇన్వాయిస్లు, ప్రాథమిక నివేదిక ప్రకారం రూ.370 కోట్లు మాత్రమే ఉన్న ప్రాజెక్ట్ విలువను అమాంతం రూ.3,300 కోట్లకు పెంచేశారు. ⇒ ప్రభుత్వం పది శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్ టెక్ 90 శాతం నిధులు పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు 2015 జూన్ 30న ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం సీమెన్స్–డిజైన్ టెక్ కంపెనీలు ప్రాజెక్ట్ వ్యయంలో 90 శాతాన్ని గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా సమకూరుస్తాయంటూ త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నారు. ⇒ ప్రాజెక్టు వ్యయంగా చెప్పుకున్న రూ.3,300 కోట్లలో 90 శాతం కాదు కదా కనీసం ఒక్క రూపాయి విలువైన ఆర్ధిక సహకారంగానీ, వస్తు సహాయాన్ని గానీ అందించ లేదు. కానీ ఏపీఎస్ఎస్డీసీ తన 10 శాతం వాటాను జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లు డిజైన్ టెక్ కంపెనీకి చెల్లించేసింది. దీనిపై అప్పటి ఆర్ధిక శాఖ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ మరీ నిధులు విడుదల చేయాలని సీఎం హోదాలో చంద్రబాబు ఆదేశించారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎస్ఎస్డీసీ ద్వారా డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు మంజూరు చేశారు. ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ నిధులు కొల్లగొట్టేందుకుగాను చంద్రబాబు ఏకంగా మొత్తం 13 నోట్ ఫైళ్లలో సంతకాలు చేశారు. ⇒ డిజైన్ టెక్కు చెల్లించిన రూ.371 కోట్లలో సాఫ్ట్వేర్ కొనుగోలు కోసం రూ.56 కోట్లు చెల్లించారు. మిగతా రూ.315 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి వివిధ దశల్లో అక్రమంగా తరలించారు. షెల్ కంపెనీల సృష్టికర్తలు, దళారుల కమీషన్లు పోనూ రూ.241 కోట్లు హవాలా మార్గంలో హైదరాబాద్‌లోని చంద్రబాబు బంగ్లాకు తరలించారు.కడిగిపారేసిన కాగ్రాజ్యాంగబద్ధ సంస్థ కాగ్ కూడా చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నిర్ధారించింది. ఆ ప్రాజెక్టులో రూ.355 కోట్ల మేర ఖజానాకు గండి పడిందని నిగ్గు తేల్చింది. వాస్తవ లెక్కల ప్రకారం ప్రాజెక్ట్ విలువను రూ.370 కోట్లుగా చూపించి ఉంటే ప్రభుత్వం తన వాటాగా రూ.33 కోట్లు మాత్రమే విడుదల చేయాలి. అయితే అంచనాలను అమాంతం పెంచేసి రూ.3,300 కోట్లుగా చూపించి ప్రభుత్వ వాటా 10 శాతంతోపాటు జీఎస్టీ, ఇతర అంశాలను కలిపి ఏకంగా రూ.371 కోట్లు విడుదల చేశారు. రూ.333 కోట్లు కొల్లగొట్టారు. ప్రాజెక్టు మొదలు కాకుండానే నిధులు విడుదల చేయడంతో ప్రభుత్వం రూ.22 కోట్లు వడ్డీ రూపంలో రావాల్సిన ఆదాయాన్ని కోల్పోయింది. వెరసి ప్రభుత్వ ఖజానాకు రూ.355 కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ తెలిపింది.ఏ–1గా తేలడంతో బాబు అరెస్ట్⇒ 2018లోనే కేంద్ర జీఎస్టీ అధికారులు షెల్ కంపెనీల్లో నిర్వహించిన తనిఖీల్లో ఈ వ్యవహారం బయట పడింది. దీనిపై అప్పట్లోనే జీఎస్టీ అధికారులు రాష్టఏసీబీకి సమాచారం ఇచ్చారు. కానీ చంద్రబాబు ఒత్తిడితో ఆ అంశాన్ని తొక్కిపెట్టారు. ఆ వెంటనే ఏపీఎస్ఎస్డీసీ ఆఫీసులో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫైళ్లను మాయం చేశారు. ⇒ 2019లో పూణెకు చెందిన ఓ సామాజిక కార్యకర్త ఈ కుంభకోణం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. దీంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్కిల్ స్కామ్‌పై విచారణకు సీఐడీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించింది. సిట్ దర్యాప్తులో చంద్రబాబు అవినీతి బాగోతం అంతా బట్టబయలైంది. ఈ కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ అంతా చంద్రబాబే అన్నది నిర్ధారణ అయింది. ఈ కేసు విచారణ కోసం చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షెల్ కంపెనీల ప్రతినిధి మనోజ్ పార్థసానిలకు సిట్ నోటీసులు జారీ చేయగానే వారిద్దరూ విదేశాలకు పరారయ్యారు. దాంతో ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేస్తున్నారని భావించి ఆయన్ను గత ఏడాది సెపె్టంబర్ 9న అరెస్ట్ చేసింది. ఈ కేసులో చంద్రబాబును ఏ–1గా పేర్కొంటూ ఆయనతోపాటు 9 మంది నిందితులను అరెస్ట్ చేసినట్టైంది. ⇒ సిట్ రిమాండ్ రిపోర్ట్‌తో ఏకీభవించిన విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం చంద్రబాబుకు రిమాండ్ విధించింది. దాంతో చంద్రబాబు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతరం బెయిల్‌పై విడుదల అయ్యారు.పరికరాలు సరఫరా చేయకుండానే చేసినట్టుగా..యువతకు ఉపాధి నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తామనే ప్రాజెక్ట్ పేరిట నిధులు కొల్లగొట్టినట్టు తమ దర్యాప్తులో వెల్లడైందని ఈడీ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టంగా వెల్లడించింది. ఈడీ తెలిపిన వివరాల ప్రకారం.. సీమెన్స్ కంపెనీకి అప్పటి ఎండీ సుమన్ బోస్, డిజైన్ టెక్ కంపెనీ ఎండీ వికాస్ వినాయక్ కన్విల్కర్ తమ సన్నిహితులు ముకుల్ చంద్ర అగర్వాల్ (స్కిల్లర్ కంపెనీ ప్రతినిధి), సురేశ్ గోయల్ (చార్టెడ్ అకౌంటెంట్) ద్వారా ప్రజాధనాన్ని అక్రమంగా దారి మళ్లించారు. ఏపీ ప్రభుత్వానికి ఎటువంటి పరికరాలు సరఫరా చేయకుండానే చేసినట్టుగా బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి నిధులు విడుదల చేశారు. ఆ నిధులను షెల్ కంపెనీల బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించి, ఏయే బ్యాంకు ఖాతాల నుంచి సింగపూర్‌కు తరలించారు.. తిరిగి ఆ నిధులు దేశంలోని ఏయే ఖాతాలకు వచ్చాయన్న విషయాన్ని ఈడీ గుర్తించింది. ఇప్పటికే రూ.70 కోట్లు హవాలా మార్గంలో తరలించినట్టు నిర్ధారించింది. చంద్రబాబుకు సన్నిహితులు, ఆ కుంభకోణంతో ప్రమేయమున్న షెల్ కంపెనీల ప్రతినిధులు మొత్తం 26 మందికి నోటీసులు జారీ చేసి పలువురిని విచారించింది. ఈ కేసులో నిందితులు సుమన్ బోస్, వికాస్ ఖన్విల్కర్, ముకుల్‌చంద్ర అగర్వాల్, సురేశ్ గోయల్‌లను అరెస్టు చేయడంతోపాటు విశాఖపట్నంలోని పీఎంఎల్ఏ న్యాయస్థానంలో చార్జ్‌షీట్ దాఖలు చేసింది.ఇక టీడీపీ ప్రభుత్వ పెద్దల పాత్రపై ఈడీ కన్నుస్కిల్ స్కాం కేసులో ప్రధాన నిందితుడి (ఏ1)గా చంద్రబాబును పేర్కొంటూ న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జ్‌షీట్ కాపీని సిట్ ఈ ఏడాది మార్చిలోనే ఈడీకి పంపింది. ఇప్పటికే షెల్ కంపెనీ అక్రమాలను వెలికి తీసి, కఠిన చర్యలు చేపట్టిన ఈడీ.. ఈ కుంభకోణం సూత్రధారులు, అంతిమ లబ్ధిదారులు అయిన టీడీపీ ప్రభుత్వ పెద్దల పాత్రపై దర్యాఫ్తు వేగవంతం చేస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. దాంతో ఫేక్ న్యూస్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చినట్టు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈడీ మంగళవారం జారీ చేసిన అధికారిక ప్రకటనలో చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చినట్టు ప్రకటించ లేదు. షెల్ కంపెనీల ప్రతినిధులపై తీసుకున్న చర్యలను తెలిపింది. సీబీఐకి అప్పగించాలి రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో గతంలో చంద్రబాబుపై సిట్ నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న కేసులను సీబీఐకి అప్పగించాలని కోరుతూ సామాజిక కార్యకర్త తిలక్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుల్లో ప్రధాన నిందితుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉండటంతో సిట్ దర్యాప్తు పారదర్శకంగా సాగదని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. కాబట్టి సీబీఐకి అప్పగించాలని కోరారు. ఈ పిటిషన్ న్యాయస్థానంలో విచారణలో ఉంది. -
టీడీపీ కూటమి 'వార్నింగ్‌లు.. వాటాలు'!
సాక్షి, అమరావతి: ‘‘మద్యం దుకాణం లైసెన్స్ దక్కించుకోవడం కాదు కదా.. కనీసం లైసెన్స్‌కు దరఖాస్తు చేసినా సరే అంతు చూస్తాం...!’’ టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు బరితెగించి సాగిస్తున్న బెదిరింపుల పర్వం ఇదీ...!! అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అంత ‘మర్యాదగా’ చెప్పిన తరువాత మద్యం దుకాణం లైసెన్స్‌కు దరఖాస్తు చేసేందుకు ఇతరులు సాహసిస్తారా..? టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీకి రాచబాట పరుస్తూ మద్యం దుకాణాల లైసెన్స్‌ల కేటాయింపునకు రంగం సిద్ధమవుతోంది. అదే సమయంలో అంతా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని మభ్యపుచ్చేందుకు టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు మరో ఎత్తుగడ వేశారు. తమ సిండికేట్ ద్వారానే భారీగా దరఖాస్తులు చేయిస్తూ బురిడీ కొట్టించేందుకు యత్నిస్తున్నారు. ప్రభుత్వ ముఖ్య నేత కనుసన్నల్లో పక్కా పన్నాగంతో మద్యం దోపిడీకి వేసిన స్కెచ్ ఇలా ఉంది..రాత్రికి రాత్రే తమ వారితో ఏకంగా 16 వేల దరఖాస్తులు టీడీపీ ఎమ్మెల్యేల హెచ్చరికలతో మద్యం దుకాణాలకు దరఖాస్తు చేయాలని ఆలోచించేందుకు సైతం సామాన్య వ్యాపారులు హడలెత్తిపోతున్నారు. మొత్తం 3,396 మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియ చేపట్టిన విషయం తెలిసిందే. మరొక్క రోజు మాత్రమే గడువు ఉండగా మద్యం సిండికేట్ సోమవారం రాత్రికి రాత్రే తమ వారితో ఏకంగా 16 వేల దరఖాస్తులు దాఖలు చేయించింది. దీంతో మంగళవారం సాయంత్రానికి దరఖాస్తుల సంఖ్యను 39,259కు చేర్చారు. ⇒ ఇప్పటికీ కూడా రాష్ట్రంలో 56 మద్యం దుకాణాలకు ఒక్కటంటే ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడం గమనార్హం. దీన్నిబట్టి టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు ఏ స్థాయిలో బెదిరింపులకు పాల్పడ్డారో స్పష్టమవుతోంది. ఆ దుకాణాలకు చివరి రోజు టీడీపీ కూటమి ఎమ్మెల్యేల బంధువులే దరఖాస్తు చేసి ఏకపక్షంగా దక్కించుకుంటారన్నది సుస్పష్టం. ⇒ ఇక 116 మద్యం దుకాణాలకు కేవలం ఒక్కో దరఖాస్తు మాత్రమే వచ్చాయి. టీడీపీ కూటమి ఎమ్మెల్యేల బెదిరింపుల ప్రభావం ఇదీ! ఇక ఆ మద్యం దుకాణాలన్నీ కూడా టీడీపీ సిండికేట్ పరమైనట్లే!⇒ 254 మద్యం దుకాణాలకు రెండేసి చొప్పున మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. ఆ రెండు కూడా టీడీపీ సిండికేట్‌కు చెందినవే. ఆ దుకాణాలను సైతం టీడీపీ సిండికేట్ గుప్పిట పట్టినట్టే. èలాటరీ ద్వారా ఎంపిక ప్రక్రియతో నిమిత్తం లేకుండా 426మద్యం దుకాణాలను టీడీపీ సిండికేట్ హస్తగతం చేసుకుందన్న విషయం స్పష్టమవుతోంది. ఇందులో తిరుపతి, కృష్ణా, కాకినాడ జిల్లాలు తొలి 3 స్థానాల్లో ఉన్నాయి. ⇒ తమను కాదని ఎవరైనా దరఖాస్తు చేసి దుకాణం దక్కించుకున్నా తన సహకారం లేకుండా వ్యాపారం చేయలేరని పత్తికొండలో అధికార పార్టీ ముఖ్యనేత హెచ్చరిస్తున్నారు. లాటరీలో దుకాణం దక్కించుకున్న వారు తనకు 30 శాతం వాటా ఇవ్వాల్సి ఉంటుందని ఆదోని మాజీ ఎమ్మెల్యే తన అనుచరులతో ఫోన్ల ద్వారా బెదిరిస్తున్నారు. ఎమ్మిగనూరు, కోడుమూరు, ఆలూరు నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి. ఆలూరులో టీడీపీ నేతలు మూడు గ్రూపులుగా విడిపోయి పర్యవేక్షిస్తున్నారు. కర్నూలులో ఓ మాజీ మంత్రి సోదరుడి కనుసన్నల్లో పాత సిండికేట్ నేతలంతా కలసి దరఖాస్తులు వేయిస్తున్నారు.రూ.2 కోట్లు పెట్టి 100 దరఖాస్తులు వేయించాసాక్షి, టాస్క్‌ఫోర్స్ : తెలుగు తమ్ముళ్లకు మద్యం షాపులు కట్టబెట్టేందుకు టీడీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బయటి వ్యక్తులకు షాపులు దక్కకుండా బెదిరింపులకూ దిగుతున్నారు. మంత్రి పొంగూరు నారాయణ తన సొంత డబ్బులు రూ.2 కోట్లు ఖర్చుచేసి 100 దరఖాస్తులు వేయించినట్లు చెబుతున్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన మంగళవారం పార్టీ కార్యకర్తలతో గ్రూప్ కాల్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. ‘నగరంలో కొందరు నన్ను బ్రాందీ షాపులు కావాలని అడిగారు. 5, 10%అయినా ఇప్పించండని అడిగారు. వారు ధరఖాస్తులకు అంత ఖర్చు పెట్టుకోలేరు కాబట్టి నేనే ఆ ఖర్చు భరిస్తున్నా. నెల్లూరులో రౌడీయిజం ఒప్పుకోను. దుకాణాల వద్దకు వచ్చి ఏ డిపార్ట్మెంట్ వాళ్లు అడిగినా ఒప్పుకోను. రూ.2 కోట్లు సొంత డబ్బు ఖర్చుపెట్టి 100 దరఖాస్తులు వేయిస్తున్నా. వాటిలో 4 నుంచి 5 షాపులు రావచ్చని అనుకుంటున్నాను. ఒక షాపునకు రూ.80 లక్షలు ఖర్చవుతుంది. 5 లేక 6 మంది కలిసి డబ్బులు రెడీ చేసుకుని సిండికేట్‌గా ఉండండి. బ్రాందీ షాపుల కేటాయింపులో మొదటి ప్రాధాన్యత డివిజన్ ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలకు ఇస్తున్నాను. వారు కూడా ముందుకు రాకపోతే డివిజన్ ఇన్చార్జిలు, బూత్ కన్వీనర్లకు అవకాశమిస్తా’ అంటూ మంత్రి చెప్పినట్లుగా ఈ ఆడియోలో ఉంది. ఆ ఆడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.బురిడీ కొట్టించేందుకే సిండికేట్‌తో భారీగా దరఖాస్తులురాష్ట్రంలో టీడీపీ మద్యం సిండికేట్ ఆగడాలు, బెదిరింపులపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇతరులు దరఖాస్తులు చేయకుండా టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు ఏ స్థాయిలో బెదిరింపులకు పాల్పడుతున్నారో దరఖాస్తుల సంఖ్యే వెల్లడించింది. తొలి ఆరు రోజుల్లో 3,396 దుకాణాలకు కేవలం 8,274 దరఖాస్తులు మాత్రమే రావడం దీనికి నిదర్శనం. దీంతో ప్రజల్ని మభ్యపెట్టేందుకు ‘ముఖ్య’నేత మరో ఎత్తుగడ వేశారు. తమ సిండికేట్ సభ్యుల ద్వారా పెద్ద ఎత్తున దరఖాస్తులు చేయించారు. అందులో భాగంగా సోమవారం రాత్రి తరువాతే తమ వారితో ఏకంగా 16 వేల దరఖాస్తులు దాఖలు చేయించారు. తద్వారా భారీగా దరఖాస్తులు వచ్చినట్లు కనికట్టు చేసేందుకు యత్నించారు. వీటిలో 90 శాతం దరఖాస్తులు టీడీపీ కూటమి సిండికేట్‌కు చెందినవే అన్నది అసలు లోగుట్టు. మద్యం దుకాణాలన్నీ ఏకపక్షంగా హస్తగతం చేసుకునేందుకు పక్కా పథకం వేసినట్లు దీన్నిబట్టి స్పష్టమవుతోంది. 30 శాతం వాటా ఇవ్వాల్సిందే..⇒ శ్రీసత్యసాయి జిల్లావ్యాప్తంగా 8 ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో 87 మద్యం దుకాణాలకు టెండర్లు ఆహ్వానించారు. పుట్టపర్తి, హిందూపురం, కదిరి నియోజకవర్గాల్లో ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయకుండా బెదిరించి అడ్డుకుంటున్నారు. మడకశిర, పెనుకొండలో ఇతరులెవరూ దరఖాస్తు చేయకుండా కట్టడి చేస్తూ సిండికేట్ చివరి రోజు దరఖాస్తులు దాఖలు చేసేందుకు సిద్ధమైంది. ⇒ వైఎస్సార్ కడప జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అధికార కూటమి నేతలే దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇతర పార్టీల నేతలు ఇందులో తలదూరిస్తే ఇబ్బందులు తప్పవని బెదిరిస్తున్నారు.⇒ అన్నమయ్య జిల్లాలో పీలేరు సహా అన్ని చోట్లా అధికార పార్టీ నేతల హడావుడే కనిపిస్తోంది. ⇒ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి, నెల్లూరు రూరల్, కావలి, కందుకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో సిండికేట్ మినహా ఇతరులు దరఖాస్తు చేయవద్దని స్థానిక ఎమ్మెల్యేలు హెచ్చరిస్తున్నారు. సర్వేపల్లిలో షాపు దక్కించుకున్న వారు తమకు 20 శాతం వాటాతో పాటు మద్యం దుకాణం పక్కన కూల్‌డ్రింక్స్ షాపు తాము సూచించిన వారికే ఇవ్వాలని ఎమ్మెల్యేలు ఆదేశించినట్లు తెలుస్తోంది.రూ. 30 లక్షలు కప్పం కట్టాలి⇒ పల్నాడు జిల్లాలో 129 మద్యం దుకాణాలు టీడీపీ సిండికేట్‌కే దక్కేలా అధికార పార్టీ ప్రజాప్రతిని«దులు పావులు కదుపుతున్నారు. ప్రతి దుకాణానికి రూ.20–30 లక్షలు కప్పం కట్టాలంటూ హుకుం జారీచేస్తున్నారు. తమని కాదని దుకాణాలు దక్కించుకుంటే ఎలా వ్యాపారం చేస్తారో చూస్తామని హెచ్చరిస్తున్నారు. జిల్లాకు చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే కుమారులు నియోజకవర్గంలో సిండికేట్ వ్యవహారాలు చక్కబెడుతున్నారు. ప్రతి దుకాణానికి నలుగురిని కేటాయించి వారే టెండర్లో పాల్గొనేలా ఆదేశాలు జారీ చేస్తున్నారు. మద్యం టెండర్ దక్కించుకున్న పాటదారుడు 25 శాతం వాటా పోను మిగిలిన 75 శాతం వాటాను తాను సూచించిన వారికి ఇవ్వాలని జిల్లాకు చెందిన మరో సీనియర్ ఎమ్మెల్యే హుకుం జారీ చేయడంతో ఇతరులు ముందుకు రావడం లేదు. షాపు దక్కించుకున్న వారు తనకు రూ.30 లక్షలు చెల్లించేందుకు సిద్ధపడితేనే టెండర్లు వేయాలని కొత్తగా ఎన్నికైన ఓ ఎమ్మెల్యే తన అనుచరులతో వర్తమానం పంపుతున్నారు.⇒ ప్రకాశం జిల్లాలో మద్యం దుకాణాలన్నింటినీ చేజిక్కించుకునేలా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు చక్రం తిప్పుతున్నారు. తమ అనుచరులు మినహా మరెవరూ దరఖాస్తు చేసుకోకుండా హుకుం జారీ చేశారు. గిద్దలూరు, మార్కాపురంలో ఎమ్మెల్యేల సోదరులు కథ నడిపిస్తున్నారు. ⇒ గుంటూరు జిల్లాలో ప్రత్తిపాడు పరిధిలో షాపు దక్కించుకున్నవారు 50 శాతం వాటా తమవారికి ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే ఆదేశించినట్లు తెలుస్తోంది. తమవారు మినహా బయటి వ్యక్తులు దరఖాస్తు చేస్తే ఊరుకునేది లేదని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర హెచ్చరిస్తున్నట్లు సమాచారం.⇒ కృష్ణా జిల్లాలో పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని యనమలకుదురు, ఈడ్పుగల్లు, తాడిగడపలో షాపులకు ఇతరులు ఎవరూ టెండర్లు వేయవద్దని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అనుచరులు ఫోన్ల ద్వారా హెచ్చరిస్తున్నారు. గన్నవరంతో పాటు ఇతర మండలాల్లో షాపులకు తమ అనుచరులే దరఖాస్తు చేస్తారని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తేల్చి చెబుతున్నారు. మచిలీపట్నం పరిధిలో చిన్నాపురం, మంగినపూడి, సుల్తానగరంలో షాపులకు టీడీపీ ద్వితీయశ్రేణి నాయకులు పోటీపడుతున్నారు. పెడనలో షాపులు దక్కించుకున్న నిర్వాహకులు స్థానిక ఎమ్మెల్యేకి పావలా వాటా ఇవ్వాలని, తాము చెప్పిన చోటే ఏర్పాటు చేయాలని కూటమి నాయకులు హెచ్చరిస్తున్నారు.⇒ ఎన్టీఆర్ జిల్లాలో లిక్కర్ మాఫియాగా పేరు పొందిన యలమంచిలి శ్రీనివాసరావు, గన్నే వెంకట నారాయణ భారీగా షాపులు దక్కించుకునేలా చక్రం తిప్పుతున్నారు. టీడీపీలో ద్వితీయ శ్రేణి నేత ఆలూరి చిన్న గొల్లపూడిలో 30 షాపులకు టెండర్లు వేస్తున్నట్లు తెలుస్తోంది. కంచికచర్ల నందిగామలో దేవినేని ఉమా అనుచరులు గోవర్థన్, గోగినేని అమరనాథ్ టెండర్లు వేస్తున్నారు. తమ పరిధిలో ఐదు షాపులకు ఎవరూ టెండర్లు వేయవద్దని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అనుచరులు హెచ్చరికలు జారీ చేశారు. మైలవరంలో మద్యం షాపుల కోసం ఎమ్మెల్యే బావమరిది ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ⇒ బాపట్ల జిల్లాలో టీడీపీ నేతలు సిండికేట్‌గా మారి ఇతరులు దరఖాస్తు చేయకుండా అడ్డుకుంటున్నారు. చీరాల, బాపట్ల, రేపల్లె తదితర చోట్ల మద్యం దుకాణాల కోసం పట్టుబడుతుండగా వేమూరు, పర్చూరు నియోజకవర్గాల్లో 20 శాతం వాటా డిమాండ్ చేస్తున్నారు.అంతా ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే..⇒ పశ్చిమ గోదావరి జిల్లాలో 175 మద్యం షాపులకు టెండర్ల ప్రక్రియ జరుగుతోంది. షాపుల కేటాయింపుల్లో గందరగోళం నెలకొంది. భీమవరం రూరల్‌లో 8, కాళ్ల మండలంలో 9 షాపులు కేటాయించగా ఉండి, వీరవాసరం మండలాలకు 4 చొప్పున మాత్రమే కేటాయించారు. ఎమ్మెల్యేలు, కుటుంబ సభ్యుల కనుసన్నల్లో సిండికేట్ వ్యవహారాలు నడుస్తున్నాయి. 50 నుంచి 75 శాతం వరకు పెట్టుబడిలోని పర్సంటేజీలు అడుగుతున్నట్టు తెలుస్తోంది. ఇతరులకు షాపులు మంజూరైనా పోలీస్ కేసులు తప్పవని బెదిరింపులకు దిగుతున్నారు. పట్టణాల్లో లైసెన్సు ఫీజు రూ.65 లక్షల వరకు ఉండగా రూ.50 లక్షల లోపే ఉండటంతో రూరల్ ఏరియాల్లో షాపులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. షాపులు దక్కించుకుని పట్టణానికి సమీపంలో ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. ⇒ కాకినాడ జిల్లాలో గతంలో టీడీపీ హయాంలో చక్రం తిప్పిన లిక్కర్ సిండికేట్లు మళ్లీ తెరపైకి వచ్చాయి. టీడీపీకి చెందిన ఓ మాజీ మంత్రి సోదరుడు, రామచంద్రపురం జనసేన సీటు ఆశించిన నాయకుడు కాకినాడ సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో చక్రం తిప్పుతున్నారు. తుని, ప్రత్తిపాడు, కాకినాడ సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే టెండర్లు నిర్వహిస్తున్నారు. తుని నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేత అనుచరులు.. దరఖాస్తులు వేయవద్దని ప్రత్యర్థి పార్టీ నేతలకు ఫోన్లు చేస్తున్నారు. ఇదే పరిస్థితి పెద్దాపురం, పిఠాపురం, కాకినాడ సిటీ నియోజకవర్గాల్లోనూ నెలకొంది.⇒ విశాఖ జిల్లాలో ఒక్కో వైన్ షాప్ కోసం ఇద్దరు ముగ్గురు మాత్రమే పోటీ పడుతుండడం సిండికేట్ దందాకు నిదర్శనంగా నిలుస్తోంది. 2019కి ముందు వరకు జనప్రియ ప్రసాద్ (చౌదరి), పుష్కరిణి గణేష్(కాపు)తో పాటు గాజువాక ప్రాంతానికి చెందిన మరొకరు వైన్‌షాపుల నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సహకారంతో ఇతరులు దరఖాస్తు చేయకుండా అడ్డుకుంటున్నట్లు సమాచారం.⇒ అనకాపల్లి జిల్లాలో గిరాకీ ఉండే నర్సీపట్నం, పాయకరావుపేట, యలమంచిలి, చోడవరం, అనకాపల్లి, సబ్బవరం, అచ్యుతాపురం, మాడుగుల, నక్కపల్లి, అడ్డరోడ్డుతోపాటు హైవే అనుకుని ఉన్న దుకాణాలను కూటమి నేతలు దక్కించుకునేందుకు సిండికేట్‌గా మారారు. చోడవరంలో స్థానిక ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.రాజుకు అత్యంత సన్నిహితుడైన టీడీపీ నేత, మద్యం వ్యాపారి గూనూరు మళ్లునాయుడుకు సంబంధించినవారే ఎక్కువగా దరఖాస్తు చేసినట్లు సమాచారం. హోంమంత్రి వంగలపూడి అనిత అనుచరులు, కూటమి నాయకులు 121 మంది జిల్లావ్యాప్తంగా డిమాండ్ ఉన్న దుకాణాలకు సిండికేట్‌గా ఏర్పడి దరఖాస్తు చేశారు. యలమంచిలిలో జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ సోదరుడు సతీష్‌కుమార్ అనుచరులు సిండికేట్‌గా ఏర్పడి దరఖాస్తు చేశారు. అనకాపల్లి నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, టీడీపీ నేత పీలా గోవింద్ అనుచరుల సిండికేట్ మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకుంది. -
అరాచకాలకు అడ్డాగా ఏపీ: మేరుగ నాగార్జున
సాక్షి,తాడేపల్లి:కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అరాచకాలకు అడ్డాగా మారిందని,దగ్గరుండి మరీ కూటమి నేతలే దాడులు చేయిస్తున్నారని మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు.ఆదివారం(సెప్టెంబర్29) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మేరుగ మాట్లాడారు.‘పోలీసులు కూడా దాడి చేసే వారికే సలాం కొడుతున్నారు.ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది.కూటమి ఎమ్మెల్యేలు రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారు.ఇళ్లకు వెళ్లి జనాల చొక్కాలు పట్టుకుని బయటకు లాగుతున్నారు.అడ్డగోలుగా దాడులు చేస్తున్నారు.చంద్రబాబు వైఖరి వల్లే ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి.ఈ దాడులను ఆపాలని ఏనాడూ చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదు?జగన్ సీఎంగా ఉన్నప్పుడు మా ఎమ్మెల్యేలు తప్పుదారిలో నడిస్తే చర్యలు తీసుకున్నారు.చంద్రబాబు హయాంలో ప్రత్యర్థులు కదిలినా మెదిలినా కేసులు పెడుతున్నారు. మక్కెలు విరగ్గొడతానంటూ ఏకంగా సీఎం చంద్రబాబే మాట్లాడటం దేనికి సంకేతం?మూడు నెలల్లోనే ఇంతటి దారుణాలకు ఎవరు బాధ్యులు?ఎమ్మెల్యేలు దాడులు చేయటానికి చంద్రబాబు లైసెన్సులు ఇచ్చేశారు.తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి వ్యవహారశైలికి నిరసనగా సొంత పార్టీ వారే ధర్నాలు చేశారు.తనను వ్యతిరేకించే వారిని ఇంటికొచ్చి కొడతానంటున్న కొలికిపూడిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?కాకినాడలో ప్రొఫెసర్ మీద ఎమ్మెల్యే నానాజీ దాడి చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు?ఇంకో ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఏకంగా అంబేద్కర్ ఫ్లెక్సీనే తొలిగిస్తే ఏం చర్యలు తీసుకున్నారు?అఖిలప్రియ దాడులకు పాల్పడితే ఏం చేశారు?కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి వాల్మీకి కులస్తులపై దాడి చేస్తే ఏం చర్యలు తీసుకున్నారు?ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అరాచకాలపై ఏం చర్యలు తీసుకున్నారు?ఇన్ని దారుణాలు మీ ఎమ్మెల్యేలే చేస్తుంటే చంద్రబాబు ఏం చేస్తున్నట్టు?ఇవే పరిస్థితులు కొనసాగితే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం’అని మేరుగ హెచ్చరించారు. -
నా మతం మానవత్వం... ఇదే నా డిక్లరేషన్... తేల్చిచెప్పిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి