సాక్షి,తాడేపల్లి:ఏపీలో సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసుల వేధింపులు ఆగడం లేదు. సోషల్‌మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నవారిని టార్గెట్ చేసి మరీ భారీగా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఇప్పటికే ఒక్కొక్కరిపై పది నుంచి ఇరవైకి పైగా అక్రమ కేసులు నమోదు చేశారు.
సజ్జల భార్గవ్‌పై11, అర్జున్ రెడ్డి మీద 11,వర్రా రవీంద్రరెడ్డిపై 21, ఇంటూరి రవికిరణ్ మీద16,పెద్దిరెడ్డి సుధారాణిపై 10,వెంకటరమణారెడ్డిపై 10 కేసులు పెట్టారు. ఇవి కాకుండా చంద్రబాబు సర్కారు రహస్యంగా మరికొన్ని కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
కేసులు నమోదైనవారిలో ఎవరైనా హైకోర్టులో హెబియస్ కార్పస్,క్వాష్, ముందస్తు బెయిల్ పిటిషన్లు వేస్తే వారిని పోలీసులు మరింతగా టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ,వాక్ స్వాతంత్రం అసలే కనిపించడం లేదని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment