harrasment
-
టీడీపీ కార్యకర్త అరాచకం.. కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందు కలిపి లైంగిక దాడి
సాక్షి, ఆమదాలవలస: ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడిన నాటి నుంచి పచ్చ టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. వారే అధికారంలో ఉన్నారనే కారణంగా పలు అఘాయిత్యాలు, నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. టీడీపీ కార్యకర్త ఒకరు కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందు కలిపి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో, ఆమె గర్భవతి కాగా.. బెదిరింపులకు దిగాడు.టీడీపీ కార్యకర్త ప్రేమ పేరుతో బాలికను గర్భవతిని చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో జరిగింది. ఈ దారుణ ఘటనపై ఎస్ఐ బాలరాజు తెలిపిన వివరాలు.. కోటిపల్లి రాజు అనే యువకుడు 9వ తరగతి విద్యార్థినికి మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో మోసం చేశాడు. బాలిక గర్భిణి అని తేలడంతో బాధితురాలి తల్లి ఆదివారం ఆమదాలవలస పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.అయితే, తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో బాలికకు మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడని, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దంటూ బాలికను బెదిరించినట్టు సమాచారం. ఈ విషయమై యువకుడిని ప్రశ్నించగా తాను టీడీపీ కార్యకర్తనని, తనకు పార్టీ నేతల అండదండలున్నాయంటూ బెదిరిస్తున్నాడని బాలిక తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
నాన్నతోనే లైంగిక వేధింపులు.. చెప్పుతో కొట్టేవాడు : ఖుష్భూ
ఏ బిడ్డకు అయినా తండ్రే సూపర్ హీరో. ముఖ్యంగా ఆడపిల్లలు నాన్న అంటేనే ఎక్కువ ఇష్టపడతారు. ఎవరైనా వేధిస్తే నాన్నతో చెప్పుకోవాలనుకుంటారు. కానీ నాన్నే వేధిస్తే.. లైంగిక దాడికి పాల్పడితే?.. ఈ కష్టాలను తట్టుకొని నిలబడింది సీనియర్ నటి ఖుష్భూ(Khushboo Sundar). పలు సందర్భాల్లోనూ తన తండ్రి వల్ల లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానంటూ బహిరంగంగా చెప్పింది. తాజాగా మరోసారి తన తండ్రి వల్ల ఆమె పడిన కష్టాలు, ఫ్యామిలీకి ఎదురైన సమస్యల గురించి బయటపెట్టింది. తనపై తండ్రి చేసిన లైంగిక దాడి బయటకు చెబితే ఎక్కడ ఇబ్బంది పెడతారోనని భయపడి చాలా కాలం దాచానని ఆమె చెప్పారు. కెరీర్ పరంగా బాగా సెట్ అయిన తర్వాత తండ్రిని ఎదురించానని చెప్పింది.మా నాన్నతోనే నాకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. నా తల్లిని, సోదరులను దారుణంగా హింసించేవాడు. బెల్టు, చెప్పులు, కర్ర.. ఇలా ఏది దొరికితే దాడితో కొట్టేవాడు. చిన్నతనంలోనే నేను ఇలాంటి వేధింపులను చూశా. నాపై జరుగుతున్న లైంగిక వేధింపులు బయటకు చెబితే ఇంకెంత హింసిస్తారోనని భయపడి చెప్పలేదు. చెన్నైకి వచ్చి, నా కాళ్లపై నేను బతకడం ప్రారంభించిన తర్వాత నాలో ఆత్మస్థైర్యం పెరిగింది. ఆ తర్వాత కూడా మా నాన్న నన్ను వేధించాడు. దీంతో నేను ఎదురు తిరిగాను .అది తట్టుకోలేక షూటింగ్ ప్రదేశానికి వచ్చి అందరి ముందు కొట్టేవాడు. ఉబిన్ అనే ఒక హెయిర్ డ్రెస్సర్ నాకు తోడుగా ఉండి ధైర్యం చెప్పింది. 14 ఏళ్ల వయసులో మా నాన్న చేసిన లైంగిక వేధింపుల గురించి బయటకు చెప్పాను. ఆ తర్వాత ఆయన మమ్మల్ని వదిలేసి వెళ్లాడు. ఆయన ఎక్కడి వెళ్లాడని కూడా మేము ఆరా తీయలేదు. ఎప్పుడు ఆయనను కలవలేదు. గతేడాది ఆయన చనిపోయాడని విషయం బంధువుల ద్వారా తెలిసింది. కానీ నేను మాత్రం ఆయనను చూసేందుకు కూడా వెళ్లలేదు’ అని ఖుష్భూ చెప్పింది. -
AP: సోషల్ మీడియా కార్యకర్తలపై పెరిగిన వేధింపులు
సాక్షి,తాడేపల్లి:ఏపీలో సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసుల వేధింపులు ఆగడం లేదు. సోషల్‌మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నవారిని టార్గెట్ చేసి మరీ భారీగా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఇప్పటికే ఒక్కొక్కరిపై పది నుంచి ఇరవైకి పైగా అక్రమ కేసులు నమోదు చేశారు. సజ్జల భార్గవ్‌పై11, అర్జున్ రెడ్డి మీద 11,వర్రా రవీంద్రరెడ్డిపై 21, ఇంటూరి రవికిరణ్ మీద16,పెద్దిరెడ్డి సుధారాణిపై 10,వెంకటరమణారెడ్డిపై 10 కేసులు పెట్టారు. ఇవి కాకుండా చంద్రబాబు సర్కారు రహస్యంగా మరికొన్ని కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.కేసులు నమోదైనవారిలో ఎవరైనా హైకోర్టులో హెబియస్ కార్పస్,క్వాష్, ముందస్తు బెయిల్ పిటిషన్లు వేస్తే వారిని పోలీసులు మరింతగా టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ,వాక్ స్వాతంత్రం అసలే కనిపించడం లేదని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. -
పోలీసులు పచ్చచొక్కాలు వేసుకుని డ్యూటీ చేస్తున్నారు: కాకాణి
సాక్షి,నెల్లూరు:సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయించడం దారుణమని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు.శనివారం(నవంబర్ 9) నెల్లూరులో ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి కాకాణి మీడియాతో మాట్లాడారు.‘జరుగుతున్న పరిణామాలపై జిల్లా ఎస్పీకి వివరించబోతున్నాం. కూటమి ప్రభుత్వంలో వాక్ స్వాతంత్య్రం కూడా కూడా లేకుండా పోయింది.నాపైనే పోలీసులు అక్రమంగా నాలుగు కేసులు నమోదు చేశారు.వైఎస్సార్సీపీ నేతలు నోరు తెరిచినా కూడా కేసులు పెడుతున్నారు.పోలీసులు మమ్మల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.థర్డ్ డిగ్రీ ప్రయోగించి చివరికి కుటుంబ సభ్యులను కూడా దుషిస్తున్నారు. అవినీతిని ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెడుతున్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్జగన్ను కించపరిచే విధంగా పోస్టులు పెడుతుంటే మాత్రం పోలీసులు పట్టించుకోవడం లేదు. జగన్ కుటుంబ సభ్యుల మీద కూడా నీచాతి నీచంగా పోస్టులు పెడుతుంటే అవి పోలీసులకు కనపడవా..? పోలీసులు ఖాకీ చొక్కాలు వదిలేసి..పచ్చ చొక్కాలు వేసుకుని డ్యూటీలు చేస్తున్నారు.వైఎస్సార్సీపీ నేతలు ఆవేదనతో ఉన్నారు..వారిని రెచ్చగొట్టొద్దు.శాంతిభద్రతలు అదుపుతప్పితే పోలీసులదే బాధ్యత.వైఎస్‌జగన్‌పై పోస్టింగ్‌లు పెడుతున్న వారిని వెంటనే అరెస్ట్ చెయ్యాలి. మేం అధికారంలోకి వస్తే ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వారిని వదిలే ప్రసక్తే లేదు.ఎక్కడ దాక్కున్నా లాక్కొస్తాం’అని కాకాణి హెచ్చరించారు.కాకాణికి రెండు కేసుల్లో నోటీసులు..కాకాని గోవర్ధన్‌రెడ్డికి వెంకటాచలం పోలీసులు రెండు కేసుల్లో నోటీసులు అందజేశారు. ఎమ్మెల్యే సోమిరెడ్డికి వ్యతిరేకంగా బీజేపీ నేత చేసిన ఆరోపణల వీడియోను ఫార్వర్డ్ చేసిన కేసులో ఒక నోటీసు, చంద్రబాబు 100 రోజుల పాలనపై విమర్శించినందుకు మరో నోటీసు అందజేశారు.ఈ కేసుల్లో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఒక మహిళను ఉగ్రవాదిలా హింసించారు: అంబటి -
AP: ఉద్యోగులకూ తప్పని ‘రెడ్‌బుక్’ వేధింపులు
సాక్షి,విజయవాడ: రెడ్‌బుక్ వేధింపులు ఉద్యోగులను వదలడం లేదు. తాజాగా ఏపీ సచివాలయంలో ఉద్యోగులు రెడ్‌బుక్ వేధింపులకు గురయ్యారు. పలువురు మిడిల్ లెవెల్ అధికారులను కూటమి ప్రభుత్వం సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ)కు బదిలీ చేసింది. కులం, మతం ఆధారంగా ఎంఎల్ఓలను జీఏడీకి బదిలీ చేశారు. ఆరుగురు ఎంఎల్ఓలు జీఏడీకి రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెడ్‌బుక్ వేధింపుల పట్ల సచివాలయ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఎన్నడూ లేని దుష్ట సంప్రదాయాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచారశాఖలోనూ ఇద్దరు అధికారులకు ఇదే తరహా బదిలీలు తప్పలేదు. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా సెక్రటేరియట్‌కు అటాచ్చేస్తూ ఉత్తర్వులిచ్చారు. పది రోజులుగా సచివాలయం, హెచ్‌వోడీల ఉద్యోగులు రెడ్‌బుక్ వేధింపులు ఎదుర్కొంటుండడం గమనార్హం. ఇదీ చదవండి.. రైతుల భవనాన్ని కూల్చేసిన టీడీపీ -
లోన్‌యాప్ వేధింపులు.. యువకుడి ఆత్మహత్య
సాక్షి,కుత్బుల్లాపూర్: లోన్‌యాప్ వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. కుత్బుల్లాపూర్‌కు చెందిన విద్యార్థి భానుప్రకాష్(22) పేట్‌బషీరాబాద్ పీఎస్ పరిధిలోని ఫాక్స్ సాగర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం శుక్రవారం(సెప్టెంబర్6) వెలుగులోకి వచ్చింది. భానుప్రకాష్ మృతిపై గురువారం జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. భానుప్రకాష్ ఆరోరా కళాశాలలో పీజీ చదువుతున్నాడు. మొబైల్‌ఫోన్ లొకేషన్ ద్వారా భానుప్రకాష్ ఆచూకీ కనుక్కున్నారు. చెరువు వద్దకు వెళ్లి చూడగా అతని దుస్తులు,వాహనం గట్టుపై ఉండటంతో పోలీసులకు సమాచారమందించారు. దీంతో పోలీసులు చెరువు నుంచి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి మొబైల్లో లోన్ యాప్ కు సంబంధించిన చాటింగ్ లభ్యమైంది. -
లైంగికవేధింపుల కేసు: యడ్యూరప్పకు నోటీసులు
బెంగళూరు: లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్పకు సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. బాలికను లైంగికంగా వేధించిన కేసులో విచారణకు హాజరవ్వాలని నోటీసుల్లో కోరారు. అయితే తాను ఢిల్లీలో ఉండటం వల్ల విచారణకు రాలేకపోతున్నానని వచ్చిన వెంటనే హాజరవుతానని యడ్యూరప్ప పోలీసులకు సమాధానమిచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన కూతురుతో కలిసి యడ్యూరప్పకు ఇంటికి వెళ్లినపుడు ఆయన తన కూతరుపై అత్యాచారం చేశారని 17 ఏళ్ల బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ వ్యవహారంలో పోలీసులు యడ్యూరప్పపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికేవ ఈ కేసులో యడ్యూరప్ప పోలీసుల ఎదుట విచారణకు మూడుసార్లు హాజరయ్యారు. -
లైంగిక వేధింపుల కేసు: భారత్‌కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
బెంగళూరు: హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అభ్యంతర వీడియోలు కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించినవిగా కొన్ని అభ్యంతర వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో ఆయన దేశం వదిలి.. జర్మనీ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రజ్వల్ ఇండియాకు తిరిగి రానున్నట్లు తెలుస్తోంది. ఆయన భారత్ రానున్న విషయంలో.. జర్మనీ నుంచి ఇండియాకు బుక్ చేసుకున్న విమానం టికెట్ బలం చేకూరుస్తోంది. ప్రస్తుతం ప్రజ్వల్ బుక్ చేసిన విమాన టికెట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రజ్వల్ బుక్ చేసుకున్న టికెట్ ప్రకారం ఆయన ఈరోజు (బుధవారం) రాత్రికి భారత్‌కు చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక.. ఇప్పటికే ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై నమోదైన లైంగిక దాడి కేసుకు సంబంధించి పోలీసులు ముమ్మరంగా దర్యప్తు చేస్తున్నారు. హాసన్‌కు చెందిన జేడీఎస్ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రజ్వల్‌పై పోలీసుల కేసు నమోదు చేశారు.అభ్యంతర వీడియోల వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే కర్ణాటక ప్రభుత్వం ప్రజ్వల్‌పై దర్యాప్తు కోసం ‘సిట్’ ఏర్పాటు చేసింది. అప్పటికే జర్మనీ వెళ్లినపోయిన ప్రజ్వల్ కోసం పోలీసులు.. బ్లూ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు. ప్రజ్వల్ ఇండియా వస్తే.. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు మరింత ముందుకు సాగనుంది. -
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
బెంగళూరు: మహిళ కిడ్నాప్, లైంగిక ఆరోపణల కేసులో కర్ణాటక మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణను బెంగళూరు పోలీసులు శనివారం(మే4) అరెస్టు చేశారు. రేవణ్ణ తన తండ్రి మాజీ ప్రధాని దేవెగౌడ నివాసంలో ఉండగా పోలీసులు వచ్చి అరెస్టు చేశారు. కిడ్నాప్ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని రేవణ్ణ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను బెంగళూరు కోర్టు తిరస్కరించిన గంటల వ్యవధిలోనే పోలీసులు రేవణ్ణను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ సంచలనం రేపిన సెక్స్ వీడియోల స్కాండల్ కేసులో కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణతో పాటు రేవణ్ణ కూడా నిందితుడిగా ఉన్నారు. కాగా, ప్రజ్వల్ రేవణ్ణ ప్రస్తుతం జర్మనీలో ఉన్నారు. ఈయనపై సెక్స్ స్కాండల్ కేసులో పోలీసులు ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. -
Alexi Navalni: కుటుంబ సభ్యులనూ వదలని పుతిన్
మాస్కో: రష్యాలోని జైలులో ఇటీవల వివాదస్పద స్థితిలో మృతి చెందిన ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్ని కుటుంబాన్ని కూడా పుతిన్ ప్రభుత్వం వదలడం లేదు. అలెక్సీ నావల్ని తమ్ముడు ఒలెగ్ నావల్నిపై గతంలో ఉన్న క్రిమినల్ కేసులకు తోడు అక్కడి ప్రభుత్వం తాజాగా మరో కేసు పెట్టింది. ఈ విషయాన్ని అక్కడి అధికారిక వార్తా ఏజెన్సీ టాస్ వెల్లడించింది. అయితే ఏ సెక్షన్‌పై ఎందుకు ఒలెగ్పై కేసు పెట్టారన్న వివరాలు తెలపలేదు. కేసు నమోదైన వెంటనే పోలీసులు ఒలెగ్ కోసం గాలింపు చేపట్టారు. ఒలెగ్ ఇప్పటికే పోలీసుల వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. 2014లో ఓ కేసులో ఒక ఫ్రాడ్ కేసులో ఒలెగ్‌కు మూడున్నర సంవత్సరాల జైలు శిక్ష కూడా పడింది. అప్పట్లో అన్న అలెక్సీపై ఒత్తిడి పెంచడానికి అతడి తమ్ముడు ఒలెగ్పై రష్యా ప్రభుత్వం అక్రమ కేసులు మోపిందనే ఆరోపణలున్నాయి. కాగా, మరోవైపు అలెక్సీ మరణంపై దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో సహా పలు ప్రపంచ దేశాల అధినేతలు అలెక్సీ మరణానికి పుతినే కారణమన్నట్లుగా పరోక్ష వ్యాఖ్యలు కూడా చేశారు. అలెక్సీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన భార్య ఇప్పటికే ప్రతిజ్ఞ కూడా చేసింది. ఇదీ చదవండి.. పుతిన్ ప్రేమలో పడ్డారా.. ఆమెతో సన్నిహితంగా -
నా గురించి తెలుసుకదా..! అలా చేయలేదంటే మిమ్మల్నీ?
కరీంనగర్: ‘బిల్లులో ఏముందనేది సంబంధం లేదు.. నేను చెప్పిందానికి సంతకం పెట్టలేదంటే అంతే. మీ ఎంబడి పడుడైతది చెబుతున్నా.. నా గురించి తెలుసు కదా.. నన్ను ఏ కొడుకు.. ఏం చేయలేడు’.. ఇది నగరపాలకసంస్థలో ఓ డీఈ దౌర్జన్యకాండ. నగరపాలక సంస్థలో పనులు పూర్తికాకున్నా బిల్లులపై సంతకాల కోసం ఇంజినీరింగ్ అధికారులపై వివాదాస్పద డీఈ వేధింపులు మళ్లీ మొదలయ్యాయి. నిత్యం వివాదాల్లో ఉండే సదరు డీఈ కాంట్రాక్టర్ల తరఫున రంగంలోకి దిగాడు. ఏఈలు, డీఈలను సంతకాలకోసం బెదిరిస్తుండగా, వారు సెలవుపై వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నారు. పూర్తి కాని, నాణ్యత పాటించని పనులకు.. ఓ వైపు స్మార్ట్ సిటీ, సీఎంఏ తదితర నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో వందల కోట్ల రూపాయల అవినీతి అక్రమాలు జరిగాయని అధికార, విపక్షాలనే తేడా లేకుండా ఫిర్యాదులు చేస్తుంటే.. మరో వైపు ఎలాంటి భయం లేకుండా పూర్తి కాని, నాణ్యత పాటించని పనులకు రికార్డులు తయారుచేసి బిల్లులు ఎత్తే పనిని సదరు డీఈ విజయవంతంగా పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యాడు. దీనికోసం ఏఈలు, సహచర డీఈలపై బెదిరింపులకు దిగుతున్నాడు. సంతకాలు పెట్టకపోతే మీ సంగతి చెబుతానంటూ బూతులందుకుంటున్నాడు. మళ్లీ వేధింపులు షురూ! బల్దియాలో వివాదాస్పద అధికారిగా పేరొందిన సదరు డీఈ బెదిరింపులు మళ్లీ మొదలయ్యాయి. గతంలో ఉన్నతాధికారులను సైతం అసభ్యపదజాలంతో దూషించిన వ్యవహారం అప్పట్లో కలకలం సృష్టించింది. కొద్దికాలంగా స్థబ్దుగా ఉన్న ఆయన నాలుగైదు రోజుల నుంచి కిందిస్థాయి, సహచర, ఉన్నత అనే తేడా లేకుండా ఇంజినీరింగ్ అధికారులపై దూషణలకు దిగుతున్నాడు. వారి పరిధిలోని పనులకు సంబంధించిన బిల్లుల తయారీలో సంతకాలు పెట్టాలంటూ ఒత్తిడి తెస్తున్నాడు. సెలవులో వెళ్లేందుకు ప్రయత్నం సదరు డీఈ ఆగడాలు ఎక్కువవుతున్న క్రమంలో సెలవులో వెళ్లేందుకు అధికారులు సిద్ధపడుతున్నారు. నగరపాలకసంస్థలో ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు ముఖ్యంగా ఇంజినీరింగ్ అధికారులు ఒత్తిడిలో ఉన్నారు. ఈ క్రమంలో డీఈ సంతకాల కోసం దౌర్జన్యానికి దిగుతుండడంతో తాము సంతకాలు చేసి ఉద్యోగాలను ఫణంగా పెట్టలేమని అధికారులు పేర్కొంటున్నారు. దీనికన్నా సెలవులో వెళ్లడం మేలని, అవసరమైతే బదిలీకి కూడా సిద్ధపడుతున్నారు. కాగా నగరంలో అభివృద్ధి పనుల్లో జరుగుతున్న అక్రమాలు, సదరు డీఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరిపించి ఆయన ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉన్నతాధికారులపై ఉంది. ఇవి చదవండి: నేరడిగొండ జెడ్పీఎస్‌ఎస్‌లో ఓ ఉపాధ్యాయుడు.. -
'పదో తరగతి పరీక్షల' పేరుతో విద్యార్థినిలపై అసభ్యకరంగా..
ఆదిలాబాద్: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి వారి భవిష్యత్‌కు బాటలు వేయాల్సిన ఓ ఉపాధ్యాయుడు వెకిలిచేష్టలకు పాల్పడుతున్నాడని నేరడిగొండ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. శుక్రవారం తరగతి గదులను విడిచి పాఠశాల ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. కొంతకాలంగా సీనియర్ ఉపాధ్యాయుడినంటూ పదో తరగతి పరీక్షలు నా చేతిలోనే ఉంటాయని విద్యార్థులను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా విద్యార్థినిలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు వారు కంటతడి పెట్టారు. విషయం తెలుసుకున్న మండల పరిషత్ ఉపాధ్యక్షుడు ఏలేటి మహేందర్‌రెడ్డి పాఠశాలకు చేరుకొని విద్యార్థులకు నచ్చజెప్పాడు. దీంతో వారు అక్కడి నుంచి తరగతి గదుల్లోకి వెళ్లిపోయారు. అలాగే పాఠశాలలో మధ్యాహ్న భోజనం సైతం సరిగ్గా అందించడం లేదని విద్యార్థులు తెలిపారు. ఈ విషయాలపై ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మను వివరణ కోరగా ఈ విషయాలు తన దృష్టికి రాలేదని తెలిపారు. ఎంఈఓ భూమారెడ్డిని వివరణ కోరగా రెండు రోజుల నుంచి సెలవులో ఉన్నానని, పాఠశాలలో ఉపాధ్యాయుల మధ్య విభేదాల కారణంగా విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా సంబంధితశాఖ అధికారులు ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇవి కూడా చదవండి: ఒకే చితిపై భార్యాభర్తల అంత్యక్రియలు -
కదిరి ఆర్టీసీ బస్టాండ్ లో ఐ-టీడీపీ కార్యకర్త సతీశ్ లైంగిక వేధింపులు
-
బలవంతంగా ఆటోలో ఎక్కించి.. వివాహితపై కిరాతకంగా..
సాక్షి, ఆదిలాబాద్: వివాహితను వేధించిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై దుబ్బక సునీల్ తెలిపారు. ఎస్సై వివరాల ప్రకారం... మహారాష్ట్రకు చెందిన ఓ వివాహిత (30) తమ బంధువులుంటున్న అందర్‌బంద్ గ్రామానికి వెళ్లడానికి ఆదిలాబాద్ బస్టాండ్‌కు వచ్చింది. అక్కడి నుంచి ఇంద్రవెల్లి మండలంలోని దుర్వగూడ గ్రామానికి చెందిన పుసం హరిక్రిష్ణ, దుర్వ కాంతులతో పాటు మల్లాపూర్ గ్రామానికి చెందిన పుసం సుభాష్‌లు వివాహితను బలవంతంగా ఆటోలో ఎక్కించి ఇంద్రవెల్లి మండలానికి తీసుకొస్తూ అసభ్యకరంగా ప్రవర్తించి లొంగదీసుకునేందుకు యత్నించాడు. ప్రతిఘటించడంతో ఆటో నుంచి తోసేశారు. దీంతో వివాహిత కుడికాలుకు గాయమైంది. బుధవారం బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
న్యూడ్ ఫొటోలుగా మార్చి.. పలువురికి పంపించి బెదిరించడంతో..
సాక్షి, ఖమ్మం: తక్కువ వడ్డీ అంటూ చెప్పే మాయమాటలు నమ్మిన పలువురు అమాయకులు ఆ తర్వాత వేధింపులకు బలవుతున్నారు. నేలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ చిరు వ్యాపారి తన వ్యాపార అవసరాల కోసం యాప్ ద్వారా పది రోజుల క్రితం రూ.15 వేల రుణం తీసుకున్నాడు. అందులో ఇప్పటికే రూ.14 వేలు చెల్లించినా ఇంకా రూ.15 వేలు చెల్లించాలని గత మూడు రోజుల నుంచి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. ఆయన ససేమిరా అనడంతో అసభ్యకరమైన రీతిలో ఫొటోలు తయారుచేసి తొలుత బాధితుడికి పంపించారు. దీంతో ఆయన బతిమిలాడగా ఒక రోజు ఆగిన నిర్వాహకులు శుక్రవారం చెప్పినట్లుగానే పలువురికి ఫొటోలు పంపించారు. అంతేకాక ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషిస్తుండడంతో సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇవి చదవండి: ఒక్కసారిగా చిదిమిన జీవితాలు.. ఆ గ్రామంలో విషాదఛాయలు.. -
ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. బాలికపై బాలుడు లైంగిక దాడి!
సాక్షి, సంగారెడ్డి: బాలికపై బాలుడు అత్యాచారం చేసిన ఘటన దూళ్మిట్ట మండల పరిధిలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లో వెళ్తే.. దూళ్మిట్ట మండల పరిధిలోని ఓ గ్రామంలో ఈ నెల 16న బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో గ్రామానికి చెందిన బాలుడు అత్యాచారం చేశాడు. కొద్ది రోజులుగా అనారోగ్యంగా ఉంటున్న బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లగా అత్యాచారం జరిగినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం పై పోలీసులను వివరణ కోరగా సదరు బాలుడిపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
కీలక పరిణామం.. బ్రిజ్‌భూషణ్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్ఐ) మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌కు ఢిల్లీ కోర్టు శుక్రవారం సమన్లు జారీ చేసింది. ఆరుగురు మహిళా రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ సింగ్ తమను లైంగిక వేదించడంతో పాటు బెదిరింపు చర్యలకు పాల్పడినట్లు ఆరోపించారు. దీనిని పరిగణలోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు బ్రిజ్‌భూషణ్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు బ్రిజ్ భూషణ్ సింగ్‌కు సమన్లు జారీ చేసింది. జూలై 18న కోర్టుకు హాజరుకావాలని కోరింది. బ్రిజ్ భూషణ్ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్‌కు కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. జూన్ 2న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణల ఆధారంగా ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లతో పాటు 10 ఫిర్యాదులు నమోదు చేశారు. డబ్ల్యుఎఫ్ఐ చీఫ్‌పై వచ్చిన ఫిర్యాదుల్లో మహిళా రెజ్లర్లను అనుచితంగా తాకడం, వారి చాతీపై చేయి వేయడం, నడుము బాగాన్ని చేతితో తడమడం లాంటివి చేసేవాడంటూ పేర్కొన్నారు. చదవండి: #ManchesterUnited: ఇంగ్లండ్ స్టార్‌కు కళ్లు చెదిరే మొత్తం.. అవి డబ్బులా ఇంకేమైనా! #HappyBirthdayMSD: '30 లక్షలు సంపాదించి రాంచీలో ప్రశాంతంగా బతికేస్తా' -
బెయిల్‌పై బయటికి.. వెంటనే పృథ్వీ షాపై కేసు
టీమిండియా క్రికెటర్ పృథ్వీ షాపై ఇటీవలే దాడి జరిగిన సంగతి తెలిసిందే. సెల్ఫీ అడిగితే ఇవ్వలేదన్న కారణంతో పృథ్వీ షాపై దాడి చేసిన వారిలో సోషల్ మీడియా స్టార్ సప్నా గిల్ కూడా ఉన్నట్లు తేలడంతో పోలీసులు ఆమెతో పాటు మరో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. తాజాగా సప్నా గిల్ బెయిల్‌పై బయటకు వచ్చింది. కాగా మిగతా ఎనిమిది మందిని మాత్రం జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. అయితే సప్నా గిల్ వచ్చీ రావడంతో పృథ్వీ షాతో పాటు అతని స్నేహితుడు ఆశిష్ యాదవ్‌పై రివర్స్ కేసు పెట్టడం ఆసక్తి కలిగించింది. పృథ్వీ షానే తమను తొలుత రెచ్చగొట్టినట్టు సప్నా గిల్ ఆరోపించింది. తనను అసభ్యంగా తాకాడని, నెట్టాడని.. అందుకే ప్రతిఘటించాల్సి వచ్చిందని సప్నా గిల్ తెలిపింది. దీంతో పృథ్వీ షా, సప్నా గిల్ల మధ్య వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. సప్నాగిల్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 15న ఓ క్లబ్‌కు వెళ్లానని, సదరు క్రికెటర్‌ను చూడగానే అతడు మద్యం మత్తులో ఉన్నట్లు అనిపించిందని ఫిర్యాదులో తెలిపింది. తన స్నేహితుడు శోభిత్ ఠాకూర్ సెల్ఫీ కోసం పృథ్వీషాను సంప్రదించగా వాగ్వాదానికి దిగాడని, అతడు బలవంతంగా తన స్నేహితురాలి ఫోన్‌ను తీసుకుని నేలపై హింసాత్మకంగా విసిరి పాడుచేశాడని ఆరోపించింది. తను క్రికెట్‌ను అంతగా అభిమానించనని, అసలు పృథ్వీషా ఎవరో కూడా తనకు తెలియదని స్పష్టం చేసింది. కావాలనే అతడు, అతడి స్నేహితులు తమపై దాడి చేశారని, నేను వద్దని వారించినప్పటికీ తన మాటలను వినకుండా అనుచితంగా ప్రవర్తించారని పేర్కొంది. ఆ సమయంలో పృథ్వీ తనను అసభ్యంగా తాకాడని, నెట్టాడని తెలిపింది. మరోవైపు పృథ్వీషా.. తనపై కేసు పెట్టడంపై కూడా సప్నా గిల్ స్పందించింది. "నేను 50 వేలు అడిగానని చెబుతున్నారు. ఈ రోజుల్లో 50 వేలు అంటే ఏంత? నేను రెండు రీళ్లు చేసి ఒక్క రోజులో అంత సంపాదించగలను. ఆరోపణ చేయాలంటే కనీసం కొంత స్థాయి అయినా ఉండాలి." అని సప్నా గిల్ తెలిపింది. #PrithviShaw https://t.co/EXqoU6AgJO pic.twitter.com/3UfmJCAYwO — Suraj Ojha (@surajojhaa) February 16, 2023 చదవండి: టీమిండియా క్రికెటర్ పృథ్వీ షాపై దాడి టీమిండియా క్రికెటర్‌పై దాడి.. నటి అరెస్ట్ -
భార్య నుంచి కాపాడాలని మొర
సాక్షి, బనశంకరి: భార్య వేధింపులు భరించలేక భర్త బెంగళూరు డీజీపీ, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. రామనగర తాలూకాకు చెందిన రామచంద్ర రూ. 5 లక్షల కోసం తనపై భార్య, కుమారుడితో కలిసి దాడికి చేస్తోందని ఆరోపించారు. ఈ మేరకు డీజీపీకి ఫిర్యాదు చేసిన రామచంద్ర న్యాయం లభించకపోతే ఆత్మహత్యకు పాల్పడతానని ఆవేదన వ్యక్తం చేశారు. భోజనం పెట్టరు నేను కట్టిన ఇంట్లో ఉండనివ్వరని వాపోయాడు. (చదవండి: పథకం ప్రకారమే లయస్మిత హత్య ?) -
గోడు చెప్పుకోవడానికొచ్చి.. ఉసురు తీసుకోబోయారు
ఇందూరు(నిజామాబాద్ అర్బన్)/వరంగల్: నిజామాబాద్, వరంగల్ జిల్లాల కలెక్టరేట్లలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాల్లో కలకలం చెలరేగింది. తమ సమస్యలు పరిష్కరించడం లేదని ముగ్గురు ఆత్మహత్యకు యత్నించారు. నిజామాబాద్‌లో ఇద్దరు, వరంగల్‌లో ఒకరు ఈ అఘాయిత్యానికి యత్నించగా అధికారులు, పోలీసులు అప్రమత్తమై అడ్డుకున్నారు. ఓ మహిళ ఫినాయిల్ తాగగా వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. లైంగికంగా వేధిస్తున్నారని.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వర్నిరోడ్‌కు చెందిన నాగలక్ష్మి తన కూతురితో కలసి కలెక్టరేట్‌కు వచ్చింది. నామ్‌దేవ్, ఎర్రం గణపతి అనే వ్యక్తులు లైంగికంగా వేధిస్తున్నారని, తన ఆత్మహత్యకు వారే కారణమని సూసైడ్ నోట్ రాసుకుంది. వెంట తెచ్చుకున్న ఫినాయిల్ తాగేసింది. భర్త లేని తనకు ఉద్యోగం ఇప్పిస్తామంటూ వారు ఆశచూపినా లొంగకపోవడంతో మంత్రాలు చేస్తున్నానని కాలనీలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే నాగలక్ష్మిని జిల్లా ఆస్పత్రికి తరలించగా ప్రాణాపాయం నుంచి బయటపడింది. వేధించినవారిని విచారించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. భూమిని కబ్జా చేశారని.. ప్రభుత్వం తనకు ఇచ్చిన మూడెకరాల వ్యవసాయ భూ మిని కబ్జా చేసిన పెద్దోళ్ల గంగారెడ్డిపై అధికారులు చర్య లు తీసుకోవడం లేదంటూ జక్రాన్‌పల్లి మండలం అర్గుల్‌కు చెందిన మేకల చిన్న చిన్నయ్య అనే దళిత రై తు నిజామాబాద్ ప్రజావాణికి వచ్చాడు. ఉన్నట్టుండి ఒంటిపై పెట్రోల్ పోసుకునేందుకు యత్నించగా పోలీసులు వారించారు. గంగారెడ్డి గతేడాది జూన్‌లో తన భూమిని ఆక్రమించి దున్నాడని, ప్రశ్నించినందుకు చం పుతానని బెదిరిస్తున్నాడని చిన్నయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయాడు. చిన్నయ్యను పోలీసులు కలెక ్టర్ వద్దకు తీసుకెళ్లి ఫిర్యాదు ఇప్పించారు. భాగస్వాములు మోసం చేశారని.. వరంగల్ నగరానికి చెందిన జిన్నింగ్ మిల్స్ వ్యాపారి రఘునందన్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించేందుకు వచ్చారు. తన వ్యాపార భాగస్వాములు లెక్కల్లో మోసం చేసి కేవలం రూ.40 లక్షల వరకు బకాయి పడినట్లు చూపుతున్నారని కలెక్టర్‌కు వివరిస్తూ వినతిపత్రం అందించారు. ఆ వెంటనే పెట్రోల్‌ను ఒంటిపై పోసుకోవడంతోనే అక్కడున్న సిబ్బంది అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలే తప్ప ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దని, ఇది ప్రైవేటు సమస్య అయినందున సీపీకి సిఫారసు చేస్తున్నానని తెలిపారు. తర్వాత సుబేదారి పోలీసులు రఘునందన్‌ను బయటకు తీసుకెళ్లారు. -
మాట వినకపోతే ఆ ఫొటోలు బయటపెడతా.. భర్త బెదిరింపు
శివమొగ్గ: మాట వినకపోతే నగ్న ఫొటోలు బయటపెడతా అంటూ సాక్షాత్తూ తాళికట్టిన భర్త బెదిరింపు చేయడంపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన శివమొగ్గ జిల్లా భద్రావతి పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు... స్థానికంగా నివాసం ఉంటున్న భార్యభర్తల మధ్య విభేదాలు పొడసుపాయి. అదే సమయంలో నీచుడు భార్య నగ్న ఫొటోలను రహస్యంగా తీశాడు. నేను చెప్పినట్లు వినకపోతే నగ్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని భార్యను బెదిరించాడు. దీంతో విసిగిపోయిన బాధితురాలు మంగళవారం భద్రావతి పేపర్ టౌన్ పోలీసులు ఫిర్యాదు చేసింది. -
తరచూ ఇంటికి వచ్చి వేధిస్తున్నాడు: పోలీసులకు ప్రముఖ నటి ఫిర్యాదు
ప్రముఖ మలయాళ నటి పార్వతి తిరువొత్తు పోలీసులను ఆశ్రయించింది. అసభ్యకరమైన మెసెజ్‌లు పంపిస్తూ ఓ వ్యక్తి వేధిస్తున్నాడని ఆరోపించింది. దీంతో ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసుల నిన్న(డిసెంబర్ 20) అతడిని అరెస్టు చేశారు. కాగా పోలీసుల సమాచారం ప్రకారం.. హర్ష అనే 35 ఏళ్ల వ్యక్తి రెండేళ్లుగా తన వెంటపడి వేధిస్తున్నాడు. చదవండి: పుష్ప స్పెషల్ సాంగ్‌పై సమంత హాట్ కామెంట్స్, సెక్సీగా కనిపించాలంటే.. ఈ క్రమంలో డెలివరి బాయ్ అవతారమెత్తి ఆమెకు తరచూ ఫుడ్ ఫార్శిల్ తీసుకుని ఏకంగా ఇంటికే వచ్చి రచ్చ చేసేవాడు. దీంతో పార్వతితో పాటు ఆమె కుటుంబ సభ్యులు వద్దని అతడిని హెచ్చరించిన అతడు వినలేదని ఆమె వాపోయింది. ఆమెకు ఇబ్బంది కలిగిస్తూనే ఇంటికి వస్తుండేవాడని, ఈ క్రమంలో సెక్యూరిటీతో కూడా గొడవ పెట్టుకునేవాడట. ఇలా కొంతకాలంగా వేధిస్తూనే మరొపక్క తన సెల్‌ఫోన్‌కు అసభ్యకర రీతిలో సందేశాలు పంపిస్తున్నాడంటూ నటి పార్వతి పోలీసులతో పేర్కొంది. చదవండి: ఆ నటుడితో స్టార్ హీరో మాజీ భార్య లవ్ ఎఫైర్!, ఇదిగో ఫ్రూఫ్ దీంతో ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిపై ఐపీసీ 354 సెక్షన్ కింద కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేశారు. కాగా గతంలో కూడా ఓ వ్యక్తి తనని వేధిస్తున్నాడంటూ పార్వతి 2019లో పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కిషోర్ అనే వ్యక్తి తనను తాను లాయర్, ఫిల్మ్ మేకర్‌గా పార్వతి కుటుంబాన్ని పరిచయం చేసుకున్నాడు. హీరోయిన్ని వేధింపులకు గురి చేసినట్లు ఆమె తెలిపింది. కాగా పార్వతి తిరువొత్తు చార్లీ, బెంగళూరు డేస్, టేకాఫ్ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. -
లైంగిక వేధింపుల కేసులో తరుణ్ తేజ్‌పాల్‌కు ఊరట
-
తప్పులో కాలేసిన టెలీకాలర్, కట్‌చేస్తే న్యూడ్ వీడియో కాల్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ఓ సంస్థలో టెలీకాలర్‌గా పని చేస్తున్న యువతి చేసిన చిన్న పొరపాటు ఆమెకే శాపంగా మారింది. తన విధులకు సంబంధించిన ప్రాథమిక సూత్రాన్ని విస్మరించి వేధింపులు పాలైంది. వేళగాని వేళల్లో ఫోన్లు, సందేశాలతో పాటు న్యూడ్ వీడియో కాల్స్ చేస్తూ ఇబ్బందులకు గురి చేసిన నిందితుడిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపిన మేరకు.. ఉత్తర మండల పరిధిలోని సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన యువతి ఓ ప్రైవేట్ సంస్థలో టెలీకాలర్‌గా పని చేస్తోంది. వృత్తిలో భాగంగా నిత్యం అనేక మందితో సంస్థ ఫోన్ నుంచి కాల్స్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. అయితే టెలీకాలర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ క్లైంట్స్‌కు వ్యక్తిగత ఫోన్ నెంబర్లు, వివరాలు అందించకూడదనేది ప్రాథమిక సూత్రం. ఓ సందర్భంలో ఈ యువతి ఛత్రినాక ప్రాంతానికి చెందిన చంద్రవేగ్కు ఫోన్ చేసి తమ సంస్థ వ్యాపారం విషయం మాట్లాడింది. ఆ సంస్థకు కస్టమర్‌గా మారే విషయాన్ని తాను పరిశీలిస్తానంటూ చెప్పిన చంద్రవేగ్ కాస్త సమయం కావాలన్నాడు. సమాధానం చెప్పడం కోసం సంప్రదించడానికంటూ ఆమె వ్యక్తిగత ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ప్రైవేట్ ఉద్యోగి అయిన ఇతగాడు అప్పటి నుంచి ఆమెను రకరకాలుగా వేధించడం మొదలెట్టాడు. అర్ధరాత్రి వేళల్లో ఫోన్లు చేయడం, సందేశాలు పంపడం చేస్తున్నాడు. ఇటీవల కాలంలో విచక్షణ కోల్పోయిన ఇతగాడు బాధితురాలికి న్యూడ్ వీడియో కాల్స్ చేయడం మొదలెట్టాడు. విసిగివేశారిన బాధితురాలు ఇటీవల సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సాంకేతికంగా దర్యాప్తు చేసిన అధికారులు చంద్రవేగ్ నిందితుడిగా గుర్తించారు. గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
నా కోరిక తీర్చు.. లేదంటే నీ భర్త, కొడుకును..
సాక్షి, బంజారాహిల్స్: తనతో స్నేహం చేయాలంటూ వివాహితను తరచూ వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిపై, అతడికి సహకరించిన మరో ముగ్గురిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెం.1లో నివాసముంటున్న వివాహిత(36) ఓ బ్యూటీ, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ క్లినిక్‌లో మెడికల్ హెడ్‌గా పనిచేస్తోంది. ఇటీవల వరప్రసాద్ అనే క్లైంట్ వెంట క్లినిక్‌కు వచి్చన విశ్వనాథ్ అనే వ్యక్తి ఆమె ఫోన్ నంబర్‌ను సేకరించి తరచూ ఫోన్లు చేస్తున్నాడు. తనతో స్నేహం చేయాలంటూ ఒత్తిడి తీసుకురావడంతో ఫోన్ నంబర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. అయినప్పటికీ వెంట్రుకలకు సంబంధించిన సమస్య ఉందంటూ తరచూ క్లినిక్‌కు వచ్చి అక్కడ పనిచేస్తున్న వారితో స్నేహం పెంచుకున్నాడు. బాధితురాలికి సంబంధించిన కుటుంబ వివరాలు, చిరునామాను తెలుసుకున్న విశ్వనాథ్ ఆమె ఉంటున్న అపార్ట్మెంట్లోనే ఓ ఫ్లాట్‌ను నాగరాజు అనే వ్యక్తి పేరుతో తీసుకున్నాడు. అక్కడే ఉంటూ బాధితురాలి కుమారుడికి చాక్లెట్లు, బొమ్మలు ఇస్తూ మచ్చిక చేసుకున్నాడు. తన కోరిక తీర్చకపోతే కొడుకుతో పాటు భర్తను అంతం చేస్తానంటూ బెదిరింపులు ప్రారంభించాడు. ఆమె కదలికలపై సమాచారం సేకరించేందుకు కారులో జీపీఎస్ పరికరాన్ని రహస్యంగా అమర్చాడు. ఇదిలా ఉండగా ఇటీవల అతడి వేధింపులు ఎక్కువ కావడంతో భర్తకు విషయాన్ని చెప్పింది. దీంతో అతడు నివాసముంటున్న ఫ్లాట్‌కు వెళ్లడంతో అక్కడి నుంచి విశ్వనాథ్ పరారయ్యాడు. కారులో తనిఖీ చేయగా జీపీ ఎస్ పరికరం దొరికింది. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని మరోసారి విశ్వనాథ్ నీ భార్య జోలికి రాడంటూ సురేష్ అనేవ్యక్తి ఫోన్ చేశాడు. పులి శ్రీకాంత్ పటేల్ అనే రాజకీయ నేత కూడా ఫోన్లు చేస్తూ రాజీకుదుర్చుకుందామని లేకపోతే అంతు చూస్తామంటూ బెదిరింపులకు దిగాడు. ఈ మేరకు బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితులు వై.విశ్వనాథ్, సురేష్, శ్రీకాంత్ పటేల్, నాగరాజు అనే వ్యక్తులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
భర్త రెండో పెళ్లి.. భార్యపై వేధింపులు.. ఆ తర్వాత
సాక్షి, కుషాయిగూడ: భార్య, పిల్లలు ఉండగానే మరో మహిళను వివాహం చేసుకున్న వ్యక్తికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ శుక్రవారం మల్కాజిగిరి కోర్టు తీర్పు చెప్పింది. ఆయనతో పాటు వేధింపులకు పాల్పడ్డ వారికి జరిమానా, జైలు శిక్ష విధించింది. పోలీసుల సమాచారం మేరకు... కాప్రా భవానీనగర్‌కు చెందిన ఎల్.భవాని (గాయత్రి), ప్రేమ్‌కుమార్‌లకు 2002లో వివాహం జరిగింది. ప్రేమ్‌కుమార్ రైల్వే ఉద్యోగి. వీరికి ఇద్దరు సంతానం. ఇదిలా ఉండగా... ప్రేమ్‌కుమార్‌కు పనిచేసే చోట కవిత అనే వివాహితతో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యలో ప్రేమ్‌కుమార్ తన భార్యను వదిలించుకునేందుకు వేధింపుల పర్వానికి తెరలేపి నిత్యం వేధించసాగాడు. భర్తతోపాటు అత్త లాకావత్ లత, ఆడపడుచు లాకావత్ అర్చన సైతం భవానీని వేధింపులకు పాల్పడేవారు. ఇదిలా ఉండగా 2014 జూలై 4న ప్రేమ్‌కుమార్, కవితలు ఎవరికీ తెలియకుండా రెండో వివాహం చేసుకున్నారు. ఆ సమయంలోనే ప్రేమ్‌కుమార్ అదృశ్యంపై కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో, కవిత అదృశ్యంపై మల్కాజిగిరి పోలీస్స్టేషన్లలో మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. వివాహం అనంతరం ప్రేమ్‌కుమార్, కవిత కుషాయిగూడ పోలీస్ట్‌షన్‌కు వచ్చి ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో 2016 మే 5న అతిగా మద్యం సేవించిన ప్రేమ్‌కుమార్ మొదటి భార్య లావణ్య పట్ల దురుసుగా వ్యవహరించి, బూతులు తిడుతూ చేయిచేసుకున్నాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో లావణ్య పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని వేడుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు రెండో వివాహం చేసుకున్న ప్రేమ్‌కుమార్, కవితతో పాటు వేధింపులకు పాల్పడ్డ లత, అర్చనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఐఓ ఎస్ఐ నాగేశ్వర్రావు దర్యాప్తు చేసి కోర్టుకు తగిన ఆధారాలతో చార్జిషీట్‌ను సమర్పించారు. కేసు పూర్వాపరాలు.. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి శుక్రవారం ప్రేమ్‌కుమార్‌కు మూడేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ. 5,500 జరిమానా, మిగతా వారికి ఏడాది జైలు శిక్ష జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారని పోలీసులు తెలిపారు. -
మద్యం మత్తు: భర్త ముందే భార్యతో అసభ్య ప్రవర్తన
సాక్షి, కుషాయిగూడ: మద్యం మత్తులో ఓ ఇంట్లోకి చొరబడి భర్త ఎదుటే ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యకితోపాటు... అతడిపై దాడి చేసిన నలుగురిపై ఆదివారం కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ శ్రీనివాస్ సమాచారం మేరకు... రాంపల్లి సత్యనారాయణ కాలనీకి చెందిన శ్యామల లింగస్వామి ఆటో డ్రైవర్. మద్యానికి బానిసైన అతడు తరచు గొడవలు పడేవాడు. కొడుకు తీరుతో విసిగిపోయిన తల్లిదండ్రులు కొంత కాలం క్రితమే ఎస్‌ఆర్‌నగర్‌కు మకాం మార్చారు. ఈ నెల 26 ఇక్కడికొచ్చిన లింగస్వామి మిత్రులతో కలిసి మద్యం సేవించాడు. రాత్రి మత్తులో అంబేడ్కర్‌నగర్‌కు చెందిన నిఖిత ఠాగూర్ అనే మహిళ ఇంట్లోకి ప్రవేశించాడు. భర్త ఎదుటే ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఇరుగుపొరుగు వారు లింగస్వామిని మందలించారు. బాధితురాలి సోదరుడి సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు లింగస్వామిని అదుపులోకి తీసుకున్నారు. అతడికి 41 నోటీసు జారీ చేసి వదిలేశారు. ఈ క్రమంలో చిన్న చర్లపల్లిలోని ఓ ఫాస్ట్ పుడ్ సెంటర్ వద్ద ఉన్న లింగస్వామిని గుర్తించిన మహిళ భర్త, సోదరుడు పృథ్వీ, మనీష్ఠాగూర్ అతడి మిత్రులు సిరాజ్, ప్రవీణ్‌లు మాట్లాడుకుందామని ఆయనను కారులోకి బలవంతంగా ఎక్కించుకున్నారు. కారులోనే అతడిపై దాడికి పాల్పడ్డారు. అనంతరం చర్లపల్లిలోని ఓ పాస్ట్ పుడ్ సెంటర్‌కు తీసుకెళ్లి ఓ గదిలో తాళ్లతో బంధించి విచక్షణ రహితంగ చితకబాదారు. దాడి దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించారు. అవికాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. బాధితుడి తల్లి సైదమ్మ ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడ్డ నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: ప్రాంక్ అంటూ 300 అశ్లీల వీడియోలు.. మహిళా ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపులు.. -
ఏనుగుపై దాడి.. మీరు మనుషులా రాక్షసులా!
కోయంబత్తూరు: నోరు లేని జంతువులపై దాడులు చేయడం మనుషులతో పాటు వాటికి శిక్షణ ఇచ్చేవారికి కూడా ఓ అలవాటుగా మారిపోతోంది. జంతు ప్రేమికులు ఎన్ని ఆందోళనలు చేపట్టినా మనుషుల్లో మార్పు రావటం లేదు. ఇలాంటి ఓ ఘటన కోయంబత్తూరులో చోటు చేసుకుంది. ఇద్దరు ఏనుగు మావటిలు ఓ ఏనుగును విక్షణరహితంగా కర్రలతో కొట్టారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్లితే.. శ్రీవిల్లిపుత్తూరులోని ఆండల్ ఆలయానికి చెందిన 19 ఏళ్ల ఆడ ఏనుగు ‘జయమల్యత’ను మావటిలు వినీల్ కుమార్, శివప్రసాద్ గోలుసులతో చెట్టుకు కట్టేసి మరీ కర్రలలో విపరీతంగా కొట్టారు. దిక్కుతోచని ఆ ఏనుగు ఆ దెబ్బల నొప్పికి అరుస్తూ విలపించింది. మావటీలు చెప్పినట్లుగా ఏనుగు వినకపోవడంతో దాని ప్రవర్తన వారికి నచ్చక కోపంతో ఈ దాడికి దిగినట్లు తెలుస్తోంది. అయితే నోరు లేని ఏనుగుపై అలా కర్రలతో దాడి చేయడం సరికాదని జంతుప్రేమికులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ వీడియోను తమ దృష్టికి వచ్చిందని ఏగునుపై దాడి చేసిన మావటిల సస్పెన్షన్ పెండింగ్‌లో ఉందని హెచ్‌ఆర్‌అండ్‌ఈసీ(హిందూ రిలిజియస్ అండ్ ఛారిటబుల్ ఎండోమెంట్స్)అధికారులు తెలిపారు. తమిళనాడు, పుదుచ్చేరిలోని వివిధ దేవాలయాలు, మఠాల నుంచి 26 ఏనుగుకు రెండు నెలల పాటు శిక్షణ ఇవ్వాలని కోయంబత్తూరు జిల్లాలోని తేకంపట్టికి తీసుకువచ్చారు. ఏనుగు దాడి వీడియో సోషల్ మీడియాలో చూసిన నెటిజన్లు.. ‘ఏనుగుపై దాడి దారుణం, మీరు మనుషులా రాక్షసులా, మీలో మానవత్వం చచ్చిపోయింది, దాడిచేసిన వారిని కఠిన చర్యలు తీసుకోవాలి’ అని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: బుర్రను బీరువాలో పెట్టి వచ్చిందని.. -
ఓవర్టేక్ చేసి.. టీవీ నటితో అసభ్య ప్రవర్తన
న్యూఢిల్లీ: మద్యంమత్తులో యువకులు ఓ టీవీ నటిపై రెచ్చిపోయారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ వేధింపులకు గురి చేశారు. ఆమెను వెంబడించి భయాందోళనకు గురి చేశారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన న్యూఢిల్లీలోని రోహిణీ ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. టీవీ నటి ప్రాచీ తెహ్లాన్ బాస్కెట్ బాల్ ప్లేయర్ కూడా. మంగళవారం అర్ధరాత్రి భర్తతో కలిసి ఢిల్లీలో జరిగిన ఓ వేడుకకు వెళ్లింది. తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో నలుగురు వ్యక్తులు కారును వెంబడించారు. మధువన్ చౌక్‌కు చేరుకోగానే ఆ దుండగులు కారును దాటి రోడ్డుకు అడ్డంగా వారి వాహనాన్ని నిలబెట్టారని ప్రాచీ ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలో దుండుగులను ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్లామని ఆమె తెలిపారు. అయినా వారు తమను వెంబడించి వేధింపులకు దిగారని, తమ కాలనీ గేటు వరకూ తమను ఫాలో అయ్యారని చెప్పారు. ప్రశాంత్ విహార్‌లోని తాము ఇంటికి చేరుకోగానే వారు వాహనం నుంచి దిగి తనను, తన భర్తను అసభ్యంగా దూషిస్తూ బెదిరించారని, తమపై దాడికి పాల్పడ్డారని ఆమె తన భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు స్పందించి ఘటనా స్ధలానికి చేరుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారిని ప్రస్తుతం విచారిస్తున్నారు. మద్యంమత్తులో వారు ఆ విధంగా చేశారని తెలుస్తోంది. కాగా ప్రాచీ తెహ్లాన్ భారత బాస్కెట్ బాల్ క్రీడాకారిణి. గతంలో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. 2010లో కామన్వెల్త్ క్రీడా పోటీలకు ప్రాతినిథ్యం వహించింది. అనంతరం 2016లో టీవీ నటిగా మారింది. ‘దియా ఔర్ బాతీ హమ్’ అనే టీవీ షోతో గుర్తింపు పొందింది. 2017లో పంజాబీ సినిమా ‘అర్జన్’లో ప్రాచీ నటించింది. -
'సౌమ్య కోరుకున్నట్టే వరప్రసాద్‌ను కఠినంగా శిక్షిస్తాం'
సాక్షి, గుంటూరు : జిల్లాలోని మేడికొండూరు మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన సౌమ్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడి శనివారం ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మహిళా చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. 'వరప్రసాద్ ప్రేమ వేధింపులకు గురై సౌమ్య చనిపోవడం బాధాకరం. సౌమ్య మృతిపై ఆమె తల్లిదండ్రులతో మాట్లాడాం.. వారి బాధ వర్ణణాతీతం. ఈ విషయం ఇంట్లో చెబితే పరువు పోతుందని భావించిన సౌమ్య ఆ విషయాన్ని తన మనసులోనే దాచుకుంది. ఈ నేపథ్యంలో వరప్రసాద్ వేధింపులు ఎక్కువవడంతో భరించలేక గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కాగా డాక్టర్లు సౌమ్యను బతికించడానికి తీవ్రంగా కృషి చేశారు. వెంటిలేటర్ పై ఉన్నప్పుడు తాను పడ్డ బాధను సౌమ్య వీడియోలో చెప్పింది.(చదవండి :‘దయచేసి ఆ అబ్బాయికి శిక్ష పడేలా చేయండి’) సౌమ్య కోరుకున్నట్టే వరప్రసాద్‌ను కఠినంగా శిక్షిస్తాం. ఇప్పటికే పోలీసులు వరప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు.. వారం రోజులలో అతనిపై చార్జిషీట్ కూడా దాఖలు చేస్తారు. గ్రామంలో ఆకతాయిలు వల్ల ఇబ్బందులు పడుతున్నామని మహిళలు మా దృష్టి కి తెచ్చారు.. వెంటనే పికెట్ ఏర్పాటు చేయమని పోలీసులను ఆదేశించాం. జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ప్రభుత్వం ద్వారా వచ్చే సహాయంను అందిస్తాం. మహిళల రక్షణ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చాలా సీరియస్ గా ఉన్నారు. ఒంగోల్ లో జరిగిన భువనేశ్వరి సజీవదహనం అనుమానాస్పదంగా ఉంది. అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఒంగోలు వెళ్తున్నానంటూ ' తెలిపారు. -
వైద్య విద్యార్థిని కిడ్నాప్, దారుణ హత్య
లక్నో: యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో మహిళలు, చిన్నారులపై నేరాలు గణనీయంగా పెరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా వైద్య విద్యార్థిని దారుణ హత్యకు గురవ్వడం కలకలం రేపోతుంది. వివరాలు.. ఢిల్లీకి చెందిన డాక్టర్ యోగిత గౌతమ్(25) ఆగ్రా ఎస్ ఎన్ మెడికల్ కాలేజీలో గైనకాలజీ విభాగంలో వైద్యురాలిగా పని చేస్తున్నారు. దాంతో పాటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతోంది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం నుంచి ఆమె కనిపించడం లేదు. దాంతో కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఆమె హత్యకు గురయినట్లు తెలిసింది. యోగిత మృతదేహం బమ్రోలి అహిర్ ప్రాంతంలో లభ్యమయ్యింది. ఢిల్లీ శివపూరి ప్రాంతానికి చెందిన యోగిత ప్రస్తుతం మాస్టర్ సర్జరీ చదవుతున్నారు. మంగళవారం వెలువడిన ఫలితాల్లో ఆమె సర్జన్‌గా క్వాలిఫై అయ్యారు. (ప్రాణాపాయంలో యువతి.. ఇదేం పని) ఆ మరుసటి రోజే ఆమె హత్యకు గురవ్వడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. తమ కుమార్తెను కిడ్నాప్ చేసి హత్య చేశారని ఆరోపిస్తున్నారు. యోగిత చివరి సారిగా మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో కాలేజీలో ప్రాంగణంలో కనిపించినట్లు సమాచారం. బుధవారం ఉదయం ఆమె తల్లిదండ్రులు ఆగ్రా ఎంఎం గేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిలో యోగిత మోరదాబాద్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిందని తెలిపారు. యోగిత సీనియర్, కాన్పూర్‌కు చెందిన వివేక్ తివారి తనను వివాహం చేసుకోవాల్సిందిగా యోగితను వేధిస్తుండేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. యోగిత తనను వివాహం చేసుకోకపోతే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని తివారి తమను బెదిరించాడని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మాటలతో భయపడిన తాము యోగితను తీసుకెళ్లేందుకు బుధవారం ఆగ్రా చేరుకున్నామని.. కానీ అప్పటికే ఆమె కనిపించకపోవడంతో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. యోగిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు వికాస్ తివారి మీద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. -
బాలికపై సామూహిక అత్యాచారం
రాజమహేంద్రవరం క్రైం: ఆవారాగా తిరుగుతూ దోపిడీలు చేసే బ్లేడ్ బ్యాచ్ ఓ బాలికను బంధించి, చిత్ర హింసలకు గురిచేస్తూ నాలుగు రోజుల పాటు సామూహిక అత్యాచారం చేసిన దారుణ ఘటన తూర్పుగోదావరిలో జరిగింది. శనివారం రాజమహేంద్రవరం నార్త్‌జోన్ డీఎస్పీ టీఎస్ఎన్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. ► కోరుకొండ మండలం మధురపూడికి చెందిన ఓ మహిళకు ముగ్గురు కుమార్తెలు. భర్త చాలాకాలం క్రితం మృతి చెందాడు. ► టెన్త్ పాసయిన రెండో కుమార్తెకు రాజమహేంద్రవరంలోని ఓ దుకాణంలో పని ఇప్పిస్తానని స్థానికంగా ఉండే అనిత ఈ నెల 12న తీసుకెళ్లింది. సాయంత్రం అనిత మాత్రమే తిరిగిరావడంతో తన కుమార్తె గురించి తల్లి ఆరా తీసింది. ► తనకు తెలియదని అనిత చెప్పడంతో ఆ తల్లి కోరుకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి 16వ తేదీ రాత్రి బాలిక ఆచూకీ గుర్తించారు. ► అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ► కోలుకున్న తర్వాత ఆ బాలిక జరిగిన ఘటనను వివరించింది. ► మత్తు మందుకు అలవాటు పడ్డ అనితకు క్వారీ మార్కెట్ ప్రాంతానికి చెందిన బ్లేడ్ బ్యాచ్‌తో పరిచయాలు ఉన్నాయి. ► బాలికను ఆ బ్లేడ్ బ్యాచ్ యువకులకు అప్పగించింది. ► రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ వద్ద ఓ రూమ్‌కు బాలికను తీసుకుని వెళ్లిన ఆ బ్యాచ్ యువకులు బాలికకు మత్తు మందు ఇచ్చి, ఆమెను బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా చిత్రహింసలకు గురి చేసినట్లు బాలిక ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ► అత్యాచారానికి పాల్పడిన ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశామని, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిందితులు ఎంతమంది ఉన్నా అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. (ప్రేమకు లాక్డౌన్ అడ్డంకి.. ఆపై ప్రియురాలి హత్య..) -
కుమార్తెలపై తండ్రి కర్కశత్వం
నరసాపురం: గల్ఫ్‌లో ఉన్న భార్య తన జల్సాలకు డబ్బులు పంపించడంలేదని ఆగ్రహించి, తన ఇద్దరు కుమార్తెలను బెల్టుతో ఇష్టానుసారం కొడుతూ వీడియోలు తీసి భార్యకు పంపించి బ్లాక్ మెయిల్ చేశాడో కర్కోటకుడు. ఆ వీడియో వైరల్ కావడంతో పోలీసులు అతణ్ని కటకటాల వెనక్కి పంపారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం పెదసారవ గ్రామానికి చెందిన ఉల్లంపర్తి ఏలీజా పెయింటింగ్ పని చేస్తుండేవాడు. భార్య మహాలక్ష్మి ఏడాది క్రితం ఉపాధి కోసం కువైట్ వెళ్లింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. కీర్తి (9) నాలుగో తరగతి చదువుతుండగా, మరియమ్మ (6) ఒకటో తరగతి విద్యార్థిని. మహాలక్ష్మి ప్రతీనెలా తన సంపాదనను భర్తకు పంపేది. ఆ సొమ్ముతో ఏలీషా 24 గంటలూ తాగుతూ జల్సాలు చేసేవాడు. విషయం తెలుసుకున్న మహాలక్ష్మి భర్తకు డబ్బులు పంపడం మానేసింది. ఆగ్రహించిన ఏలీజా కుమార్తెలిద్దరిని స్కూల్‌కు పంపడం ఆపేశాడు. బెల్టు, సెల్ ఛార్జర్ వైరుతో ఇస్టానుసారం కొట్టేవాడు. పిల్లలను కొడుతున్న దృశ్యాలను వీడియోతీసి, భార్యకు పంపించి, డబ్బులు పంపకపోతే వారు శవాలుగా మారతారని బెదిరించాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై నరసాపురం పోలీసులు కేసు నమోదు చేసి, ఏలీషాను అదుపులోకి తీసుకున్నారు. ఏలీషా సోదరి లక్ష్మి కూడా సహకరించి, వీడియో తీసినట్టుగా పిల్లలు చెప్పడంతో ఆమెపై కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాష్ట్ర శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత ఘటనపై స్పందించి నరసాపురం డీఎస్పీ కార్యాలయానికి చేరుకుని పిల్లలతో మాట్లాడారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. పిల్లల సంరక్షణను ప్రభుత్వం తీసుకుంటుందని ప్రకటించారు. -
ఉన్నతాధి(బే)కారి చేష్టలు..
సాక్షి, నెల్లూరు : నెల్లూరు ఇరిగేషన్ కార్యాలయంలో పనిచేసే ఉన్నతాధికారి వేధింపులతో ఉద్యోగినులు ఆందోళన చెందుతున్నారు. ఆ అధికారి క్యాబిన్లోకి వెళ్లాలంటే మహిళలు జంకుతున్నారు. ఇరిగేషన్‌శాఖ అధికారిగా ఆయన రెండేళ్ల క్రితం బదిలీపై వచ్చారు. ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఏడాదిపాటు తన కార్యాలయంలో పనిచేసే మహిళలను చూపులతో విసిగించేవాడు. వారిని సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టేవాడు. ఆయన ఉన్నతాధికారి కావడంతో మహిళలు బయటకు చెప్పుకోలేక సతమతమవుతున్నారు. అవసరం లేకున్నా మహిళలను క్యాబిన్లోకి పిలిపించడం, హాయ్ మేడమ్.. మీ చీర బాగుంది.. మీకు డ్రస్ బాగాలేదు.. మీరు చీర కడితేనే చాలా బాగుంటారు.. అంటూ విసిగించేవాడు. ఉన్నతాధికారి కావడంతో ఎదురు చెబితే ఎక్కడ టార్గెట్ చేస్తాడోనని మహిళలు బయటకు చెప్పుకోలేక లోలోన కుమిలిపోతున్నారు. అధికారి చేష్టలకు.. ఇరిగేషన్ కార్యాలయంలో సదరు విభాగంలో ఇద్దరు, ఫీల్డ్‌లో ఇద్దరు, మిగిలిన విభాగాల్లో మరో ముగ్గురు మహిళలు పనిచేస్తున్నారు. అందులో కొందరు మహిళలు ఉన్నతాధికారి వికృత చేష్టలకు ఇబ్బందిపడిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఫీల్డ్‌లో ఉన్న ఓ మహిళా అధికారి అధికారి వేధింపులు తట్టుకోలేక సెలవుపై వెళ్లినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రులు మహిళలకు ఫోన్లు చేయడం, వివిధ రకాలుగా మేసేజ్‌లు పెడుతూ వారికి నరకం చూపిస్తున్నాడు. నన్ను ఒక్కసారి గమనిస్తే పదోన్నతులు, ఇక్రిమెంట్లు ఇప్పిస్తానంటూ ప్రలోభాలకు గురిచేస్తున్నాడు. మరోవైపు తన కార్యాలయాన్నే ఉన్నతాధికారి బార్గా మార్చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. తన క్యాబిన్‌లోనే మద్యం సేవిస్తున్నట్లుగా కొందరు ఉద్యోగులు చెబుతున్నారు. రాత్రివేళలో అర్ధరాత్రి వరకు ఉంటూ అక్కడే ఓ చిరుద్యోగి ద్వారా మద్యం తెప్పించుకొని ఎంజాయ్ చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. గత టీడీపీ హయాంలో జిల్లాకు చెందిన మాజీ మంత్రితో ఆయనకు సాన్నిహిత్యం ఉండడంతో ఆ అధికారిపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చినా కూడా కనీస విచారణకు కూడా జరగని పరిస్థితి నెలకొంది. -
2047లో ఊపిరి ఆడదా?
స్వాతంత్య్రం వచ్చిన వందేళ్లకు..ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రగామిగా .మానవహక్కుల పరిరక్షణలో నంబర్‌వన్‌గా..భావప్రకటనకు తలమానికంగా.. స్త్రీ, పురుష సమానత్వంలోముందంజగా ఉంటుందని మన విశ్వాసం! కాని ఒక సమాజంగా మనం వెనకబడిపోతున్నామని.. శీలమనే గోడల మధ్య బందీ అవుతామని.. స్వేచ్ఛకు ఊపిరాడదనీ.. ఇలాంటి భావవ్యక్తీకరణల్లో ఈ కథనం ముందంజలో ఉంది. 2047... ఆర్యావర్త ప్రాంతం... మిలిటరీ తరహా ప్రభుత్వ పాలన.. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న దేశం. అలాంటి సహజ వనరులను తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి.. ఆ ప్రాంతాన్ని పూర్తిగా హిందూ దేశంగా.. ఆర్యావర్తగా మార్చే ప్రయత్నం మొదలై.. అది కొంత సఫలమై అప్పటికి మూడేళ్లు. హిందువుల్లో కూడా మళ్లీ కుల విభజన, వర్గ విభజన ఆ పాలన నైజం. అందుకే ఎటు చూసినా సెక్టార్లు.. హద్దులుగా పెద్ద పెద్ద గోడలు. అగ్ర కులాలు.. అందునా ఉన్నత ఉద్యోగులకు.. ఒక సెక్టార్.. నిమ్న కులాలు.. వర్కింగ్ క్లాస్‌కు ఇంకో సెక్టార్.. దళితులకు ఆ హద్దులన్నిటికీ ఆవల.. స్లమ్స్‌లో నివాసం. ఈ ఆర్యావర్త ప్రభుత్వం వాళ్లకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తూంటుంది. చాలా పరిమితంగా. ఒకరకంగా చెప్పాలంటే వెలివాడలవి. ... అందునా కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న మహిళలైతే బానిసలు. అలా పెళ్లిళ్లు చేసుకున్న, తమ హక్కుల కోసం గొంతెత్తిన ఆడవాళ్లను వెదికి మరీ పట్టుకొచ్చి ‘‘వనితా విముక్తి కేంద్రం’’లో పెడ్తారు. ఆ ఆడవాళ్లు తమ పవిత్రతను పరీక్షించుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజూ జవాన్ల బూట్లు తుడవాలి. ఉన్నతులైన పురుషులు తిన్న ఎంగిలి విస్తళ్లల్లో పొర్లుదండాలు పెట్టాలి. తొట్టిలోని మురికి నీటిలో స్నానం చేయాలి. ఆ మానసిక హింస గాయపెట్టకుండా పూట పూటకు స్టెరాయిడ్స్లాంటి మాత్రలు వేసుకోవాలి. ఇవన్నీ మౌనంగా సహిస్తూ.. క్రమశిక్షణ పాటిస్తున్న వాళ్లను పవిత్రతను నిరూపించుకునే పరీక్షకు ఎంపిక చేస్తారు. అలా నిరూపించుకున్న వాళ్లను విముక్తులను చేసి బయటకు అంటే వాళ్ల తల్లిదండ్రుల దగ్గరకు పంపిచేస్తారు. ఫెయిలైన వాళ్లను లేబర్ క్యాంప్‌కు తరలిస్తారు. పిల్లలు.. ఆర్యావర్త సంస్కృతీ, సంప్రదాయాలకు సార«థులు.. వారధులు. కులాంతర, మతాంతర వివాహాల వల్ల పుట్టిన పిల్లలను సంకరజాతిగా పరిగణించి.. ‘‘ప్రాజెక్ట్ బలీ’’ అనే ఆర్యావర్త ప్రభుత్వ కార్యక్రమం కోసం ఉపయోగిస్తుంటారు. తిరోగమనమా? పురోగమనమా? అనిపిస్తోంది కదా! ఇప్పటి కొన్ని పరిస్థితులకూ అద్దం పడ్తోందన్న మాటా వినిపిస్తోంది. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘లేలా’ అనే వెబ్‌సిరీస్ కథ. ప్రయాగ్ అక్బర్ (బీజేపీ మాజీ మంత్రి, లైంగిక వేధింపుల ఆరోపణలున్న ఎమ్జె అక్బర్ కొడుకు) రాసిన నవలను అదే పేరుతో తెరకెక్కించారు ప్రముఖ సినీ దర్శకురాలు దీపా మెహతా. లేలా... షాలిని (హుమా ఖురేషి)... బాగా చదువుకున్న, ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్న ఒక హిందూ స్త్రీ. రిజ్వాన్ చౌదురి(రాహుల్ ఖన్నా) అనే ముస్లిం యువకుడిని ప్రేమించి పెళ్లిచేసుకుంటుంది. వాళ్లకు పుట్టిన బిడ్డే లేలా. ఆ బిడ్డ కోసం షాలినీ అన్వేషణే ఈ సిరీస్. మంచి ఉద్యోగాలు చేస్తూ.. ఏ లోటూ లేకుండా ప్రశాంతంగా... కూతురే లోకంగా బతుకుతూంటారు షాలినీ, రిజ్వాన్‌లు. అప్పటికే ఆర్యావర్త ప్రభుత్వం ఏర్పడి యేడాది అవుతుంది. ఒకరోజు.. ఇంట్లోని స్విమ్మింగ్ పూల్‌లో షాలిని, రిజ్వాన్‌లు తమ కూతురు లేలాకు ఈత నేర్పిస్తుంటే దుండగులు జొరబడి రిజ్వాన్ తల బాది.. షాలినీని ఎత్తుకుపోతారు. ఈ హఠాత్పరిణామానికి బిక్కచచ్చిపోతుంది నాలుగేళ్ల లేలా. స్విమ్మింగ్ పూల్‌లో రిజ్వాన్ అచేతనమైపోతాడు. రెండేళ్లు.. షాలినీని వనితా విముక్తి కేంద్రంలో పెడ్తారు. అన్నీ సహిస్తూనే అక్కడి నుంచి పారిపోవడానికి దారి వెదుకుతూంటుంది ఆమె. అంతలోకే కులాంత వివాహం చేసుకుందని ఇంకో అమ్మాయినీ తీసుకొస్తారు అక్కడికి. వీళ్లతోపాటు ఒక లేడీ డాక్టర్, ఆస్తి హక్కు కోసం తల్లిదండ్రుల మీద కేసు పెట్టిన మహిళ.. కులాంతర వివాహం చేసుకొని చంటిబిడ్డలతో సహా పట్టుకొచ్చిన తల్లులూ ఉంటారు ఆ కేంద్రంలో. వీలైనంత త్వరగా ప్యూరిటీ టెస్ట్ పెట్టించుకొని అక్కడి నుంచి వెళ్లిపోవాలనుకుంటున్న ఒక మహిళ.. ఆ కేంద్రాన్ని పర్యవేక్షిస్తున్న గురు మా (పురుషుడే)కు ఇన్ఫార్మర్గా మారుతుంది. ఈ క్రమంలో ఆ కేంద్రంలోని చంటి పిల్లల ప్యూరిటీ టెస్ట్ కోసం ఓ వైద్యబృందం వస్తుంది. ఒక బిడ్డ రక్తనమూనాల్లో తల్లితోపాటు తక్కువ కులంలోని తండ్రి రక్తమూ ఉందని ఆ పసికందును తీసుకెళ్లిపోతారు. ఆ పాప ప్రక్షాళన కోసం ఆమెకు కుక్కతో పెళ్లి జరిపిస్తారు. ఆ అవమానం తట్టుకోలేక ఆమె ఆ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. ఇది సద్దుమణిగేలోపే కులాంతర వివాహం చేసుకున్న ఆ కొత్త బందీ ప్రెగ్నెంట్ అని తేలుతుంది. గురుమాకు తెలిసి అబార్షన్ చేయమని లేడీ డాక్టర్‌కు ఆర్డర్ వేస్తాడు. చేశానని చెప్తుంది కాని డాక్టర్.. అబార్షన్ చేయదు. దీన్ని ఆ ఇన్ఫార్మర్ పసిగట్టి.. గురుమాకు చెప్పబోతుంటే ఆమెను బాత్రూమ్లో బంధించి ఆ అవకాశాన్ని తాను ఉపయోగించుకుని ప్యూరిటీ టెస్ట్‌తో బయట పడాలనుకుంటుంది షాలిని. వెళ్లి గురుమాకు చెప్తుంది ఆ కొత్తమ్మాయికి అబార్షన్ జరగలేదు అని. నిజం చెప్పి షాలిని.. ఆర్యావర్తకు అభిమాన పాత్రురాలైందని.. తెల్లవారే ఆమె ప్యూరిటీ టెస్ట్‌కు ఏర్పాట్లు చేస్తాడు గురుమా. ఆ టెస్ట్‌లో లేడీ డాక్టర్‌ను, ఆ కొత్త బందీని రెండు వేర్వేరు సెల్స్‌లో పెడ్తారు. షాలినికి ఒక డివైజ్ ఇచ్చి... బటన్ నొక్కమని చెప్తాడు గురుమా. ఆ బటన్ నొక్కితే ఆ ఇద్దరూ ఉన్న సెల్స్‌లోకి గ్యాస్ విడుదలై వాళ్ల ప్రాణాలు గాల్లో కలుస్తాయి. షాలిని విముక్తురాలై బయటకు వెళ్లిపోతుంది. షాలిని.. ఆ పని చేయదు. దాంతో ఆ ఇన్ఫార్మర్ను పిలిపిస్తాడు గురుమా. ఈ చాన్స్ కోసమే ఎదురు చూస్తున్న ఆ మహిళ.. వెంటనే బటన్ నొక్కుతుంది. గ్యాస్ విడుదలై ఆ ఇద్దరూ చచ్చిపోతారు. రెండేళ్లు అందులో మగ్గిన షాలినీని.. ప్యూరిటీ టెస్ట్ ఫెయిలయిందని లేబర్ క్యాంప్‌కు పంపిస్తారు. ప్యూరిటీ టెస్ట్ పాసైనా ఆ ఇన్ఫార్మర్ను వనితా విముక్తి కేంద్రంలోనే ఉంచుతారు. ఆమెను తీసుకెళ్లడానికి తల్లిదండ్రులు, అన్న, తమ్ముడు రాలేదని. బయటకు వెళితే స్త్రీకి రక్షణ ఉండదని. లేబర్ క్యాంప్ విముక్తి కేంద్రం నుంచి లేబర్ క్యాంప్‌కు తీసుకెళ్తున్నప్పుడే తప్పించుకుని తన కూతురి కోసం రిజ్వాన్ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్తుంది షాలిని. కూతురు అక్కడ ఉండకపోగా షాలిని మరిది.. ఆమె మీద విరుచుకుపడ్తాడు. ‘‘నువ్వు మా అన్నను పెళ్లి చేసుకోవడం వల్లే ఇదంతా జరిగింది’’ అంటూ. విస్తుపోతుంది అతని ప్రవర్తనకు. ఈలోపు లేబర్ క్యాంప్ గార్డ్ భాను (సిద్దార్థ) ఈ ఇంటికి వచ్చి షాలినీని తీసుకొని వెళ్లిపోతాడు. లేబర్ క్యాంప్ ద్వారా ఆమెకు ఒక ఇంజనీర్ ఇంట్లో సర్వెంట్ ఉద్యోగం దొరుకుతుంది. నగరానికి ఎయిర్ కండిషన్ డోమ్స్‌ను ఏర్పాటు చేయడానికి ఆ ఎన్ఆర్ఐ ఇంజనీర్‌ను అమెరికా నుంచి రప్పిస్తుంది ప్రభుత్వం. ఆ ఏసీ డోమ్స్ వల్ల విపరీతమైన వేడి పుట్టి.. రేడియేషన్‌కు చుట్టుపక్కల ఉన్న స్లమ్స్ అన్నీ మాడి మసైపోతాయని.. ఇది ఒకరకమైన మారణహోమం అని.. దాన్ని ఎలాగైనా ఆపాలని.. ఆర్యావర్త సిద్ధాంతాలను వ్యతిరేకిస్తున్న విప్లవకారులను కోరుతాడు ఆ ఇంజనీర్. వాళ్లతో రహస్య సంబంధాలు పెట్టుకుంటాడు. వాళ్లలో ఒకడే భాను. ఆర్యావర్త ప్రణాళికలను తెలుసుకోవడానికి లేబర్ క్యాంప్ గార్డ్‌గా పనిచేస్తుంటాడు. ఆ నిజం షాలినీకి తెలుస్తుంది. సహకరిస్తే.. ఆమె కూతురును వెదకడంలో సహాయం చేస్తానంటాడు భాను. అసలామె వనితా విముక్తి కేంద్రానికి రావడానికి.. ఆ సిబ్బందికి ఉప్పందించింది ఆమె మరిదేననే సీక్రెట్ కూడా చెప్తాడు. హతాశురాలవుతుంది షాలిని. ఇంకోవైపు ఎయిర్‌కండిషన్ డోమ్స్‌ను తయారు చేస్తున్న ఇంజనీర్ మీద అనుమానం వచ్చి అతని కుటుంబాన్నీ చంపేయిస్తుంది ఆర్యావర్త ప్రభుత్వం. ఎలాగైనా ఆ మారణహోమాన్ని ఆపాలని.. ఆ ప్లాన్ వివరాలు ఆర్యావర్త ప్రభుత్వాధినేత జోషి తర్వాత వ్యక్తి అయిన రావు ఆఫీస్‌లో ఉంటాయని.. అది తమకు అందివ్వాలని చెప్తాడు భాను. అందుకు ఆమెను రావు ఇంట్లో సర్వెంట్‌గా చేరుస్తాడు. రావుగారింట్లో.. ఆర్యావర్త ప్రభుత్వం బ్యాన్చేసిన పాకిస్తానీ కవి, రచయిత.. ఫైజ్ అహ్మద్ఫైజ్కు వీరాభిమాని.. రావు. రహస్యంగా ఫైజ్ పాటలను వింటూంటాడు. ఈ బలహీనతను అడ్డం పెట్టుకుని భాను అడిగిన వివరాలను లాగొచ్చని అనుకుంటుంది షాలినీ. శ్రద్ధగా పనిచేస్తూ.. అతని అనుంగు సేవకులలో ఒకరిగా చేరుతుంది. చాటుగా ఫైజ్ పాటలను తెచ్చిస్తూ అతని నమ్మకాన్ని సంపాదిస్తుంది. ఆ చనువుతో ఆమె గతాన్ని తెలుసుకుంటాడు అతను. కూతురు లేలీ గురించీ చెప్పేస్తుంది. జాలిపడ్తాడు రావు. ఆర్యావర్త పట్ల తనకున్న అసమ్మతినీ వెళ్లగక్కుతాడు. ఈ చాన్స్‌ను ఉపయోగించుకుందామని షాలినీ ప్లాన్ చేసుకునే లోపే.. షాలినీకున్న కూతురి బలహీనతను తన రాజకీయ ఎత్తుగడకు వాడుకుందామనుకుంటాడు. కూతురి ఆచూకీ పట్ల ఉన్న తన ఆరాటాన్ని, తపనను.. అటు విప్లవకారులు.. ఇటు రాజకీయ నేతలు పావుగా మలచుకుంటున్న తీరుకు కుమిలిపోతుంది షాలిని. కాని తప్పదు.. బిడ్డ ముఖ్యం అని మనసును స్థిరం చేసుకుంటుంది. ఈ వేటలో లేలా ఎక్కడో కాదు.. ఇంతకు ముందు తనకు సర్వెంట్‌గా పనిచేసిన అమ్మాయి ఇంట్లోనే ఉందని తెలుస్తుంది. ఆ సర్వెంట్ కుటుంబం ఇప్పుడు బాగా సంపన్న కుటుంబంగా మారిపోతుంది. తన కూతురి పేరు విజయా యాదవ్‌గా మార్చేస్తుందా సర్వెంట్. ఆమె భర్త జోషీకి పీఏగా ఉంటూంటాడు. రావు ఇంట్లోని ఆఫీస్‌కు వస్తూంటాడు. ఒకసారి రాత్రి పూట.. రావు ఆఫీస్‌లో ఎయిర్ కండీషన్స్ డోమ్స్ ఆపరేషన్ ఫైల్స్‌ను ఫోటో తీస్తుంటే చూస్తాడు. కూతురిని మరచిపోతే కాపాడ్తానని, లేదంటే జైలే అని బెదిరిస్తాడు. సరే అన్నట్టుగా తలూపుతుంది షాలినీ. భానుకి అన్నీ చెప్తుంది. త్వరలోనే షాలిని కూతురు చదువుతున్న స్కూల్లో ఫంక్షన్ ఉంటుంది. అక్కడ గ్యాస్ బాంబ్‌ను ప్రయోగించమని ఆ బాంబ్‌ను షాలినీకిస్తాడు భాను. తను క్రిమినల్‌ను కాదని.. అలాంటివి చేయలేనంటుంది. కూతురు కావాలంటే తప్పదు అని హెచ్చరిస్తాడు. బాంబ్ తీసుకొని ఫంక్షన్‌కు వెళ్తుంది. దానికి ఆర్యావర్త అధినేత జోషీ వస్తాడు. అతనిని సన్మానించే వాళ్ల జాబితాలో ఆమె పేరూ పెడ్తాడు రావు. సన్మానం పేరుతో జోషీ దగ్గరకు వెళ్లిన షాలినీ తన చేతిలోని బాంబును చూపించి అతణ్ణి బెదిరిస్తుంది. పోలీసులు వస్తారు. అక్కడితో ఫస్ట్ సీజన్ ఎండ్! -
కనిపించని అభ్యర్థికి ప్రచారం!
ఉత్తరప్రదేశ్‌లోని ఘోసి లోక్‌సభ నియోజకవర్గంలో మే 19వ తేదీన పోలింగ్ జరగనుండటంతో ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. ఇక్కడ బీఎస్పీ అభ్యర్థి అతుల్ రాయ్ తరఫున బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత మాయావతి, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్‌లు స్వయంగా ప్రచారం చేస్తున్నారు. అంతే కాకుండా అతుల్ కోసం విస్తృతంగా ప్రచారం చేయాల్సిందిగా వారు పార్టీ శ్రేణులకు ఆదేశిస్తున్నారు. ఇందులో విశేషమేముంది...అనుకుంటున్నారా...వారు ఎవరికోసమైతే ప్రచారం చేస్తున్నారో ఆ అభ్యర్థి అతుల్ రాయ్ పదిహేను రోజుల నుంచి కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్లాడో కూడా తెలియడం లేదు. అంటే ‘కనిపించని’ అభ్యర్థి కోసం భారీ ఎత్తున ప్రచారం జరుగుతోందన్నమాట. ఇంతకీ అతుల్ అదృశ్యానికి కారణం, ఆయనపై అత్యాచారం కేసు నమోదు కావడం. అతుల్ రాయ్ తనపై అత్యాచారం చేశారని ఒక విద్యార్థిని వారణాసి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు మే 1న అతుల్‌పై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఆయన కనిపించడం లేదు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని కొందరు, మలేసియా పారిపోయారని ఇంకొందరు చెబుతున్నారు.ఆయన లేకపోయినా ఆయన తరఫున ప్రచారం మాత్రం సాగిపోతోంది. బీజేపీ వాళ్లు కుట్రతో తమ అభ్యర్థిపై బూటకపు కేసు పెట్టించారని మాయావతి, అఖిలేశ్‌లు చెబుతున్నారు. అతుల్ రాయ్‌ని తప్పనిసరిగా గెలిపించి బీజేపీ కుట్రను భగ్నం చేయాలని కూడా వారు ఓటర్లను కోరుతున్నారు. మరోవైపు మే 23 వరకు అతుల్‌ను అరెస్టు చేయకుండా చూడాలని ఆయన లాయరు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దానిపై ఈ రోజు విచారణ జరగనుంది. -
సీజేఐ గొగోయ్‌కు క్లీన్చిట్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల్లో ఆయన క్లీన్చిట్ పొందారు. ఆయనపై వచ్చిన ఆరోపణలను రుజువు చేసే ఆధారాలు లేవని సుప్రీంకోర్టు అంతర్గత విచారణ కమిటీ స్పష్టం చేసింది. సీజేఐ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని సుప్రీంకోర్టు మాజీ మహిళా ఉద్యోగి ఆరోపించడం తెల్సిందే. దీంతో జస్టిస్ బాబ్డే నేతృత్వంలో ముగ్గురు సభ్యుల అంతర్గత విచారణ కమిటీ ఏర్పాటైంది. కమిటీలో ప్రస్తుతం జడ్జీలు జస్టిస్ ఇందూ మల్హోత్రా, ఇందిరా బెనర్జీలు సభ్యులుగా ఉన్నారు. 14 రోజుల పాటు విచారణ జరిపిన ఈ కమిటీ నివేదికను సమర్పించింది. అయితే ఆ నివేదికను బహిర్గతం చేయలేమని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ సోమవారం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ‘సీజేఐపై మాజీ ఉద్యోగిని చేసిన ఆరోపణల విషయంలో ఆధారాలు లేవని కమిటీ గుర్తించింది’ అని తెలిపారు. కమిటీ నివేదికను ఆదివారమే సమర్పించింది. కోర్టులో సీజేఐ తర్వాత సీనియర్ జడ్జి అయిన జస్టిస్ బాబ్డేకు నివేదికను అందజేసింది. ఈ కమిటీని ఏర్పాటు చేసినప్పుడు జస్టిస్ ఎన్వీ రమణ సభ్యుడిగా ఉన్నారు. అయితే ఆయన సభ్యుడిగా ఉండటంపై మహిళా ఉద్యోగి అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో కమిటీ నుంచి ఆయన తప్పుకున్నారు. తీవ్ర అన్యాయం జరిగింది.. సీజేఐకు క్లీన్చిట్ ఇవ్వడంపై ఆయనపై లైంగిక ఆరోపణలు చేసిన మహిళ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ నివేదిక తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని పేర్కొన్నారు. తాను భయపడుతున్నట్లే జరిగిందని, ఓ భారతీయ మహిళగా తనకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన న్యాయవాదితో చర్చించి తదుపరి కార్యాచరణను వెల్లడిస్తానని చెప్పారు. ఈ ఆరోపణల వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, దానిపై విచారణ జరపాలని దాఖలైన పిటిషన్‌పై త్వరలోనే విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు పేర్కొంది. సీజేఐకు క్లీన్చిట్ ఇవ్వడాన్ని ప్రముఖ న్యాయకోవిదుడు సోలి సొరబ్జీ స్వాగతించారు. కమిటీ నిష్పక్షపాతంగా, స్వతంత్రంగానే విచారణ జరిపిందని పేర్కొన్నారు. సీజేఐ గొగోయ్‌కు క్లీన్చిట్ ఇవ్వడానికి కమిటీ చాలా తొందరపడిందని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సోమవారం ట్వీట్ చేశారు. సీజేఐపై కేసులో పూర్వాపరాలు ► ఏప్రిల్ 19: సీజేఐ వేధించారంటూ 22 మంది సుప్రీం జడ్జీలకు లేఖలు పంపిన మాజీ ఉద్యోగిని. ► ఏప్రిల్ 22: లైంగిక వేధింపుల బూటకపు కేసులో సీజేఐని ఇరికించేందుకు కుట్ర జరుగుతోందని న్యాయవాది ఉత్సవ్ సింగ్ బెయిన్స్ ఆరోపణ. ► ఏప్రిల్ 23: మాజీ ఉద్యోగిని ఆరోపణలపై విచారణ జరిపేందుకు జస్టిస్ బాబ్డే, జస్టిస్ రమణ, జస్టిస్ ఇందిరా బెనర్జీల అంతర్గత త్రిసభ్య విచారణ కమిటీ ఏర్పాటు. జస్టిస్ రమణ ఆ కమిటీలో ఉండటం, ఒక్కరే మహిళా జడ్జి ఉండటంపై మాజీ ఉద్యోగిని అభ్యంతరం. ఏప్రిల్ 25న విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ రమణ. దీంతో కమిటీలోకి మరో మహిళా జడ్జి జస్టిస్ ఇందూ ► ఏప్రిల్25: సీజేఐని ఇరికించేందుకు కుట్ర జరుగుతోం దన్న ఆరోపణలపై విచారణకు సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఏకే పట్నాయక్ సభ్యుడిగా ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు. లైంగిక వేధింపులపై విచారణ కాకుండా, కుట్ర కోణంపై జస్టిస్ పట్నాయక్ విచారణ జరుపుతారని వెల్లడి. ► ఏప్రిల్ 26: త్రిసభ్య కమిటీ ఎదుట రహస్య విచారణకు తొలిసారి హాజరైన మాజీ ఉద్యోగిని. మొత్తంగా మూడుసార్లు విచారణకు హాజరు. అనంతరం ఈ కమిటీతో న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదంటూ విచారణ నుంచి నిష్క్రమణ. n మే 6: సీజేఐపై ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పిన అంతర్గత త్రిసభ్య కమిటీ. -
నారా లోకేష్ పప్పు అని మరోసారి రుజువైంది
-
లోకేష్ మామూలు పప్పు కాదు: రోజా ధ్వజం
సాక్షి, హైదరాబాద్ : ప్రతిష్టాత్మకమైన ప్రజాసంకల్పయాత్ర చేపట్టిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి వస్తున్న ప్రజాధరణను చూసి టీడీపీకి కంటి మీద కునుకు లేకుండా పోయిందని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్ నిజంగానే పప్పు అని మరోసారి రుజువైందన్నారు. కంపెనీలు తెచ్చామని లోకేష్ గొప్పలు చెబుతున్నారనీ, కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే వాటిని కూడా తమ ఖాతాలో వేసుకున్న లోకేష్‌ను పప్పు అని కాకుండా ఇంకేమని పిలవాలంటూ ఆమె మండిపడ్డారు. పప్పు అంటే ఇన్నిరోజులు విటమిన్ ఉన్న పప్పు అనుకున్నారు, కానీ అది గన్నేరు పప్పు అని ఏపీ సీఎం చంద్రబాబు త్వరలోనే తెలుసుకుంటారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడారు. గత నాలుగేళ్లలో నిర్వహించిన పారిశ్రామిక సదస్సుల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని మీరు గొప్పలు చెబితే పచ్చ పత్రికలు అదే విషయాన్ని రాశాయి. కానీ కేవలం 16,900 కోట్ల రూపాయాల పెట్టుబడులు వచ్చాయని నివేదికల్లో తేలిందన్నారు. ‘తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీకి వస్తే ఆయన కాళ్లు పట్టుకోవడానికే మంత్రి దేవినేమి ఉమాను చంద్రబాబు పంపారు. గతంలో ఆడా.. మగా ఎవరు అని దేవినేనిని కేసీఆర్ ప్రశ్నించారు. కళా వెంకట్రావు లేఖలో ప్రతి లైన్‌కు వివరణ ఇస్తాం. టీటీడీని భ్రష్టు పట్టించింది చంద్రబాబు. సంబంధం లేని వ్యక్తులను టీటీడీలో చేర్చి శ్రీవారి ఆగ్రహానికి గురైంది చంద్రబాబే. సంబంధం లేని వాళ్లను టీటీడీలో సభ్యులుగా చేశారు. పొరుగురాష్ట్ర బీజేపీ మంత్రి భార్యను టీటీడీ బోర్డులో సభ్యురాలిని చేశారు. నాలుగేళ్లుగా బీజేపీతో కుమ్మక్కు రాజకీయాలు చేసింది టీడీపీనే. ఏ రోజూ మేం బీజేపీతో కలవలేదు.. కలుస్తామని చెప్పలేదు. అమిత్ షా వస్తే రమణ దీక్షితులు వెళ్లారని ఆయనను ప్రధాన అర్చకులు పదవి నుంచి తొలగించారు. అవినీతి అంటూ ఇంకా పాతపాటే పాడుతున్నారు. కానీ, నాలుగేళ్లు కేంద్రలోని బీజేపీతో అంటకాగిన చంద్రబాబు.. ఎందుకు ఆధారాలు చూపించలేక పోయారు ?. లక్షకోట్ల ఆస్తి ఉందని నిరూపించాలని, కేవలం తనకు 10శాతం ఆస్తి ఇస్తే చాలని వైఎస్ జగన్ అసెంబ్లీలోనే సవాల్ విసిరారు. తమ ఆరోపణల్లో వాస్తవం లేదని టీడీపీ నేతలే పరోక్షంగా అంగీకరించారు. వ్యవసాయంపై చంద్రబాబు చిన్నచూపు కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి ఏరువాక చేస్తున్న చంద్రబాబుపై రైతులు పోరువాక చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. గతంలో వ్యవసాయం దండగ అన్న వ్యక్తి నేడు ఏరువాక కార్యక్రమాల్లో పాల్గొన్నా చంద్రబాబును ఎవరు నమ్మరు. రుణమాఫీ అని రైతులను మోసం చేశారు. రైతులకు రూ.87వేల కోట్లు బాకీపడ్డ చంద్రబాబు బాండ్లు అంటూ వాళ్లను మభ్యపెట్టే యత్నం చేశారు. ఆ బాండ్లు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావు. బాబు హయాం అంటే మహిళలపై వేధింపులే.. సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే.. 2014లో మహిళలపై వేధింపులలో దేశంలో ఏపీ9వ స్థానంలో ఉంటే.. నేడు ఏపీ 4వ స్థానానికి వచ్చిందంటే చంద్రబాబు ఎంత గొప్పగా పాలిస్తున్నారో తెలుస్తుంది. పచ్చ దొంగలు అమరావతిని భ్రష్టుపట్టించినట్లే షికాగోలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టేందుకు వెనుకాడటం లేదు. కాల్‌మనీ సెక్స్ రాకెట్ కేసులో తాను పోరాడితే.. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలను రక్షించుకునేందుకు మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా ఏడాదిపాటు నిషేధించడాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకుంటారు. టీడీపీ నేత సజ్జా బుజ్జి గౌతమి అనే యువతిని నమ్మించి పెళ్లిచేసుకుని ఆపై హత్యచేశాడు. గౌతమి చెల్లెలు పావని పోరాటంతో టీడీపీ నేతలే హంతకులు అని, వారి హస్తం ఉందని తేలింది. ఎమ్మార్వో వనజాక్షి ఇసుక మాఫియాను అడ్డుకున్నప్పుడు ఆమెపై టీడీపీ నేత చింతమనేని దాష్టీకానికి పాల్పడగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యేవి కావు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి అమ్మాయిలకు అన్యాయం జరగకుండా చూడాలని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని రిషితేశ్వరి తల్లిదండ్రులు కోరితే టీడీపీ నేతల రంగు బయటపడుతుందని అందుకు చంద్రబాబు వెనుకంజ వేశారు. నారాయణ కాలేజీల్లో జరిగిన విద్యార్థుల ఆత్మహత్యలు, వేధింపులపై కేసులు ఉండవు. తాజాగా టీడీపీ సర్పంచ్ హరిణికుమారిని ఆమె భర్త, టీడీపీ యూత్ లీడర్ భీమవరపు యతేంద్ర రామకృష్ణ చిత్ర హింసలు పెట్టినా కేసులపై విచారణ జరపరు. ప్రభుత్వం టీడీపీది అయినప్పుడు పోలీసులు కేసులు నమోదు చేయడం లేదని చెప్పడం సమంజసం కాదన్నారు. మదమెక్కి టీడీపీ నేతలు ప్రవర్తిస్తున్నారు. మద్యం తాగిస్తూ రాష్ట్రాన్ని మరింత వెనక్కి తీసుకెళ్తున్నారు. ఏపీలో మహిళలపై దౌర్జన్యాలు, వేధింపులు ఏడాదికి 9.4 శాతం పెరుగుతుందంటే.. వ్యవసాయంలో కానీ, పరిశ్రమల ఏర్పాటుల్లో మాత్రం అభివృద్ధి లేనందుకు సీఎం చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి. సీఎం రమేష్‌కు స్టీల్‌ప్లాంట్ ఇప్పుడు గుర్తుకొచ్చిందా.. మనకు రావాల్సింది ఏదీ రాకపోయినా.. కేంద్రంలో టీడీపీ ఎంపీలు, రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రి పదవులు అనుభవించారు. ఇప్పటికిప్పుడు కడపకు ఏదో అన్యాయం జరిగిందంటూ టీడీపీ నేత సీఎం రమేష్ దొంగ దీక్షలు చేస్తున్నారు. కానీ 1995-2004 మధ్య కాలంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబుకు స్టీల్‌ప్లాంట్ ఎందుకు గుర్తుకు రాలేదు. ఆపై దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్సార్ స్టీల్‌ప్లాంట్ దిశగా అడుగులు వేయగా అడ్డుకుంది టీడీపీ నేతలే అని ఏపీ ప్రజలకు తెలుసు. ఆపై 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్లాంట్ ఏర్పాటు వివరాలు 6 నెలల్లో ఇవ్వాలని కోరగా.. అక్కడ స్టీల్‌ప్లాంట్‌కు అవకాశమే లేదని చెప్పుకుంటూ టీడీపీ నేతలు తగిన రిపోర్టులు సమర్పించలేదని ఆర్కే రోజా విమర్శించారు. హోదా కోసం టీడీపీ ఎంపీలు ఏం చేశారు ? బీజేపీతో లాలుచీ పడి వైఎస్సార్సీపీపై నిందలు వేస్తున్నారు. నాలుగేళ్లుగా విభజన హామీలపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం, ఏపీ అభివృద్ధి కోసం రాజీనామా చేశారు. ఉక్కు పరిశ్రమ కోసం టీడీపీ నేతల్లో చిత్తశుద్ధి లేదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పలుమార్లు స్పష్టం చేశారని ఈ సందర్భంగా రోజా గుర్తుచేశారు. విభజన హామీల కోసం టీడీపీ నేతలు ఏ రోజూ పోరాడలేదన్నారు. టీడీపీ నేతలు ఓట్ల కోసం వస్తే తరిమి కొట్టాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా పిలుపునిచ్చారు. -
కృష్ణా జిల్లాలో టీడీపీ నేత నిర్వాకం
-
టీడీపీ నేత బాగోతాన్ని బయటపెట్టిన భార్య
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో సామాన్య మహిళలకే కాదు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు కూడా న్యాయం జరగదని మరోసారి రుజువైంది. టీడీపీ నేతలు ఏం చేసినా, ఎన్ని అరాచకాలకు పాల్పడ్డా.. చట్టాల నుంచి, కేసుల నుంచి తప్పించుకోవచ్చునన్న తీరుగా వ్యవహరిస్తున్నారని ఓ మహిళా సర్పంచ్ తన ఆవేదనను వెల్లగక్కారు. తన భర్త భీమవరపు యతేంద్ర రామకృష్ణ కృష్ణా జిల్లా టీడీపీ యువనేత. ఆయన పెట్టే శారీరక, మానసిక వేధింపులు భరించలేకపోతున్నానని మహిళానేత, తెలప్రోలు గ్రామ సర్పంచ్ హరిణికుమారి ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదట. తాజాగా మరోసారి ఫిర్యాదు చేసిన ఆమె ప్రయోజనం లేదని భావించారు. పోలీసులు తనకు న్యాయం చేయరని సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తెలుగింటి ఆడపడుచుకు న్యాయం చేయాలంటూ ఆమె విజ్ఞప్తి చేశారు. ఆమె చేసిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె పోస్టులో ఏం పేర్కొన్నారంటే.. నాపేరు హరిణికుమారి. తెలప్రోలు గ్రామ సర్పించ్‌ని(టీడీపీ). నా భర్త భీమవరపు యతేంద్ర రామకృష్ణ కృష్ణా జిల్లా టీడీపీ యూత్ లీడర్. గతేడాది నుంచి శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. దీనిపై గతేడాది గన్నవరం పీఎస్‌లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు. సీఐ మీద నా భర్త యతేంద్ర ఒత్తిడి తీసుకువచ్చి నాతో కేసు వాపస్ తీసుకునేలా చేశారు. న్యాయం జరగదని భావించి ఇలా అందరికీ నా భాద చెప్పుకుంటున్నాను. ఇక నా భర్త నన్ను ప్రాణాలతో ఉంచుతాడనే ఆశ నాకు లేదు. కనీసం పిల్లల ప్రాణాలైనా కాపాడండి. ఇలాంటి పరిస్థితి మరొక ఆడపడుచుకి రాకుండా చూడండి’ అని తన ఫేస్బుక్ పోస్ట్‌లో బాధితురాలు హరిణికుమారి కోరారు. చెత్త రాజకీయ నాయకుడ్ని మీరు సమర్థిస్తారా? ‘టీడీపీ యూత్ లీడర్ ఓ బుకీ, పేకాటరాయుడు, అమ్మాయిలతో సంబంధాలు కొనసాగిస్తాడు. ఇలాంటి రాజకీయనాయకుల వల్ల మాకు పోలీస్స్టేషన్లలో కూడా న్యాయం జరగడం లేదు. ప్రభుత్వానికి చేరేంతవరకు ఈ పోస్టును షేర్ చేయండి. బాధితురాలు మీ సోదరి’ అని హరిణికుమారి మరో పోస్ట్‌లో భర్త వ్యసనాలు, దురలవాట్లను బయటపెట్టారు. భర్త ఫొటోను షేర్ చేస్తూ కనబడటం లేదని, ఎవరికైనా కనిపిస్తే తనకు తెలియజేయాలని బాధిత మహిళా సర్పంచ్ కోరారు. ఫేస్బుక్లో మహిళా సర్పంచ్ హరిణికుమారి పోస్టులు -
సైకో ప్రేమికుడి హల్చల్
సాక్క్షి, హైదరాబాద్ : గోషామహల్‌లోని షాహీనాయత్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా నివసిస్తోన్న బాలు అనే యువకుడు, చుడీబజార్లోని ఓ దుకాణంలో పనిచేస్తోన్న యువతిని కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. రోజూ ఆ యువతి పనిచేస్తోన్న దుకాణం వద్దకు వెళ్లి ఇబ్బంది పెడుతున్నాడు. బాలును గమనించి స్థానికులు మందలించారు. కోపోద్రిక్తుడై సైకోగా మారిన బాలు, మరో మైనర్ బాలుడి సహాయంతో స్థానికులపై కత్తులతో దాడి చేశాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో సంఘటనాస్థలానికి వచ్చి ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బాలుపై గతంలో ఆయా పోలీస్స్టేషన్లలో పలు కేసులు ఇదివరకే నమోదైనట్లు గుర్తించారు. ఈ సారి బాలుపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. -
లుంగీతో ఆఫీస్‌కు.. ఉద్యోగినుల ఫిర్యాదు!
మధిర : మహిళల అభివృద్ధికోసం ఏర్పాటుచేసిన ఐసీడీఎస్ శాఖలో ఉద్యోగినులకు భద్రత కరువైంది. పద్ధతి మార్చుకోమని సూచించిన పై స్థాయి అధికారిపై జూనియర్ అసిస్టెంట్ దురుసుగా ప్రవర్తించిన సంఘటన గురువారం మధిర ఐసీడీఎస్ కార్యాలయంలో చోటుచేసుకుంది. మధిర ఐసీడీఎస్ కార్యాలయ ఇన్చార్జ్ సీడీపీఓగా కనకదుర్గ విధులు నిర్వరిస్తున్నారు. గతంలో మధిర ఐసీడీఎస్ శాఖలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు విధి నిర్వహణలో అలసత్వం వహించేవారు. దాన్ని కనకదుర్గ గ్రహించి పనితీరును మార్చుకోవాలని వారికి సూచించారు. అదే సమయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉన్న దేవకుమార్ను సైతం మందలించారు. అయితే దేవకుమార్ ఆమె మాటలను పెడచెవినపెట్టి లుంగీతో కార్యాలయానికి రావడం ప్రారంభించారు. దీంతో తమకు ఇబ్బందిగా ఉందని మహిళా ఉద్యోగులు సీడీపీఓకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఇది సరైన విధానం కాదని, పద్ధతి మార్చుకోవాలని మరోసారి తీవ్రంగా దేవకుమార్ను సీడీపీఓ మందలించారు. దీనిని దృష్టిలో ఉంచుకొని అంగన్వాడీ కేంద్రాల అద్దె చెల్లింపు విషయంపై ఉన్నతాధికారులకు ఆన్‌లైన్‌ద్వారా సమాచారం అందిస్తుండగా.. అప్పుడే కార్యాలయానికి వచ్చిన దేవకుమార్ తన కంప్యూటర్ను ఎందుకు ఉపయోగిస్తున్నారంటూ ఉన్నతాధికారిణి అనికూడా చూడకుండా దుర్భాషలాడాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న సిబ్బంది.. దేవకుమార్ వ్యవహార శైలిపై ఖమ్మం పీడీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో సీడీపీఓ కనకదుర్గ కన్నీటి పర్యంతమై.. ఈ ఉద్యోగి తమకొద్దని.. ఉన్నతాధికారులకు దండం పెడతానని ఇక్కడినుంచి పంపించాలంటూ విలేకరుల ఎదుట వాపోయారు. -
చంపడానికి వెళుతూ...దొరికిపోయారు..
హైదరాబాద్ : ప్రేయసిని వేధిస్తున్నవారిని చంపడానికి వెళ్తుండగా ఇద్దరు యువకులు పోలీసులకు దొరికిపోయారు. వివరాలు.. ఈ నెల 21న ఎల్బీ నగర్ పోలీస్‌లు సాగర్ రింగ్ రోడ్డు అలేక్య టవర్స్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అలీ రషీద్, మీర్జా మోహసీన్ అనే ఇద్దరు యువకులు పల్సర బైక్‌పై గుర్రంగూడ వైపు వెళ్తుండగా పోలీసులు అనుమానంతో వారిని ఆపారు. వారి వద్ద ఉన్న బ్యాగ్‌ని చూపించాలని అడగడంతో అలీ రషీద్ తన వద్ద మూడు కత్తులతో ఉన్న బ్యాగ్‌ని వదిలేసి పారిపోయాడు. పోలీసులు అప్రమత్తమై అక్కడే ఉన్న మరో యువకుడు మీర్జా మోహసీన్‌ని అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తరలించి విచారించగా తన ప్రేయసిని వేధిస్తున్న ఆసిఫ్, ఫయాజ్ అనే ఇద్దరు వ్యక్తులను చంపడానికి గుర్రంగుడా వైపు వెళ్తున్నామని తెలిపారు. దీంతో ప్రధాన నిందితుడు కోసం బృందాలుగా ఏర్పడి అలీ రషీద్ నివాస ప్రాంతం శాలిబండ వద్ద పహారా కాసి చాకచక్యంగా ఈ నెల 22న పట్టుకున్నారు. ఈ మేరకు శుక్రవారం పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడించారు. వారి వద్ద నుంచి మూడు కత్తులు, ఒక పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. -
ప్రియుడి వేధింపులు..యువతి ఆత్మహత్యాయత్నం
బంజారాహిల్స్: ప్రేమించిన యువకుడి వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా, పెద్దపూడి కడకుదురు గ్రామానికి చెందిన యువతి(20) ప్రగతినగర్‌లో ఉంటూ డిప్లోమా చేస్తోంది. ఆమె కొంతకాలంగా సూరారం కాల నీకి చెందిన హరీష్ అనే యువకుడిని ప్రేమిస్తోంది. తన తల్లిదండ్రులను ఒప్పించి పెళ్ళి చేసుకుంటానని నమ్మించిన హరీష్ ఎనిమిది నెలలుగా కనిపించకుండా పోయాడు. ఇంకో పెళ్ళి చేసు కుంటే అంతు చూస్తానని నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ వేధిస్తున్నాడు. హరీష్ కుటుంబసభ్యులు తమ పెళ్లి విషయమై చర్చించేందుకు ఆసక్తి చూపనందున తన పెళ్లి కాదని భావించిన బాధితురాలు గురువారం తన గదిలోనే ఆత్మహత్యాయత్నా నికి పాల్పడింది. హరీష్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జైలుకు వెళ్లినా బుద్ధిమారలేదు
బనశంకరి : జైలుకు వెళ్లినా ఓ కామాంధుడు తన వక్ర బుద్ధిని మార్చుకోలేదు. తన దగ్గరకు రావాలంటూ ఓ మహిళను వేధింపులకు దిగిన సంఘటన బ్యాటరాయనపుర పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. వివరాలు... బ్యాటరాయనపుర మురికివాడలో సెల్వకుమార్ నివాసం ఉంటున్నాడు. ఇతని ఇంటి ముందు నివాసం ఉంటున్న పద్మావతిపై ఇతని కన్నుపడింది. ఆమె బయటకు వచ్చే సమయంలో సెల్వ కుమార్ వేధించడం మొదలుపెట్టాడు. దీంతో బాధితురాలు సెల్వ తల్లిండ్రులకు తెలిపినా కూడా వారు అతనికే మద్దతు పలికారు. పద్మావతిని భయపెట్టడానికి ఓ రోజు బైక్‌తో ఢీకొట్టాడు. దీంతో గర్భిణి అయిన ఆమె తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రి పాలైంది. ఈ కేసులో సెల్వకుమార్‌ను పోలీసులు జైలుకు తరలించారు. బెయిల్‌పై బయటకు వచ్చినా కూడా సెల్వకుమార్ పద్దతి మార్చుకోలేదు. ఇతడి ఆగడాలను భరించలేని పద్మావతి ఇంటి ముందు సీసీ కెమెరాలు అమర్చుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా సర్దుకుపోండి అని చెప్పడంతో ఆమె దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. -
రాత్రి 10.30కు ఎవ్వరు లేని చోట కారు ఆపి..
సాక్షి, బెంగళూరు : ఓలా క్యాబ్ డ్రైవర్ ఓ మహిళను బెంబేలెత్తించాడు. అసభ్యంగా తాకుతూ బెదిరిస్తూ ఆమెకు దాదాపు గుండె ఆగినంత పనిచేశాడు. అదృష్టవశాత్తు బయటపడిన బాధితురాలు ఆ రోజు రాత్రి తనకు కాలరాత్రి అంటూ తన భయానక అనుభవాన్ని వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. ఓ కంపెనీలో ఫ్యాషన్ స్టైలిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్న 23 ఏళ్ల మహిళ ఆదివారం రాత్రి 10.30కు కంపెనీ రప్పించిన ఓలా కారులో ఎక్కింది. సరిగ్గా ఆగ్నేయ బెంగళూరు రింగ్ రోడ్డు వైపు ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో డ్రైవర్ కారును ఆపేశాడు. అప్పుడే ఆమె ఫోన్ బ్యాటరీ అయిపోవచ్చింది. అదే సమయంలో కారు ఆపిన డ్రైవర్ ఆమె కాళ్లను అసభ్యంగా తాకడం మొదలుపెట్టాడు. ' ఆ రోజు రాత్రి రోడ్డుపై ఏ ఒక్కరూ లేరు. అతడు అనూహ్యంగా కారు ఆపగానే కారు అద్దంలో నుంచి బయటకు చూశా. అతడు నన్ను అసభ్యంగా తాకడం మొదలుపెట్టాడు. నేను అతడి బెదిరించాను. కారును ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాను. వదిలేశాడు. ఓ ఆటో రిక్షా దొరికే వరకు నేను పరుగెత్తాను.అతడు నాకు ఫోన్ చేయడం మొదలుపెట్టాను. నంబర్ బ్లాక్ చేశాను. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాను' అని ఆమె వివరించింది. ఈ సంఘటనపై ఓలా సంస్థ ఆమెకు క్షమాపణలు చెప్పింది. కేసు విషయంలో పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేస్తామని హామీ ఇచ్చింది. -
ఆ ఫొటోలు పంపితేనే ఉద్యోగం.. లేదంటే!
సాక్షి, హైదరాబాద్ : అశ్లీల ఫొటోలు పంపితేనే ఉద్యోగం వచ్చేలా చేస్తానంటూ ఓ యువతిని వేధిస్తున్న నిందితుడిని హైదరాబాద్ షీ–టీమ్స్ సోమవారం అరెస్టు చేసినట్లు అదనపు సీపీ స్వాతిలక్రా వెల్లడించారు. సదరు యువతి ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న ప్రముఖ సంస్థలో నిందితుడు హెచ్ఆర్ విభాగం అధిపతిగా ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇటీవలే ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఓ యువతి సిటీకి చెందిన ప్రముఖ కంపెనీలో ఐటీ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇంటర్వ్యూ సైతం పూర్తి చేసిన ఆమెకు ఉద్యోగం వచ్చింది, లేనిది తర్వాత చెప్తానంటూ చెప్పిన ఆ సంస్థ హెచ్ఆర్ విభాగాధిపతి బి.నరేందర్ సింగ్ తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత ఈ నెంబర్‌కు యువతి వాట్సాప్ ద్వారా సంప్రదించి తన ఉద్యోగం విషయం ఏమైందంటూ అడిగారు. దీనికి సమాధానంగా ‘నీ హాట్ ఫొటోస్ పంపాలంటూ’ అతడి నుంచి సమాధానం వచ్చింది. దీంతో షాక్‌కు గురైన బాధితురాలు కొన్నాళ్ల వరకు మిన్నకుండిపోయారు. ఆపై మరోసారి సంప్రదించగా.. అలాంటి సమాధానమే వచ్చింది. తాను మరికొన్ని ప్రముఖ సంస్థలకూ రిక్రూట్మెంట్స్ చేస్తుంటానని, హాట్ హాట్ ఫొటోలు పంపితేనే ఉద్యోగం వచ్చేలా చేస్తానని, లేకుంటే భవిష్యత్తులోనూ ఎక్కడా ఉద్యోగం రాకుండా చేస్తానంటూ బెదిరించాడు. ఈ పరిణామంతో షాక్‌కు గురైన బాధితురాలు సిటీ షీ–టీమ్స్‌కు ఫిర్యాదు చేశారు. సాంకేతిక ఆధారాలను బట్టి దర్యాప్తు చేసిన అధికారులు సోమవారం నిందితుడిని అరెస్టు చేశారు. వేధింపులు ఎదుర్కొంటున్న బాధితులు ఎవరైనా ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని స్వాతిలక్రా కోరారు. వారి వివరాలను పూర్తి గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. -
కుమార్తెను వేధించవద్దన్నందుకు దాడి
ఇబ్రహీంపట్నం: మైనర్ బాలికను ఎందుకు వేధిస్తున్నావంటూ ప్రశ్నించిన కుటుంబసభ్యులపై దాడి చేసిన సంఘటన సోమవారం ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. ప్రధాన రహదారిపై బాలిక తండ్రి, బంధువులపై దాడికి దిగడంతో ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానిక సీఐ స్వామి కథనం ప్రకారం... నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న బాలికను ప్రతినిత్యం స్థానిక బస్టాండ్‌లో ఇమ్రాన్ (23) ముష్రాఫ్(22)లు వేధింపులకు గురిచేస్తుండేవారు. దీంతో ఆ బాలిక తన తండ్రి నజిరుద్దీన్‌కు ఈ విషయం చెప్పడంతో బస్టాండ్‌లో ఆ యువకులను హెచ్చరించి వెళ్లిపోయారు. అనంతరం ఇమ్రాన్, ముష్రాఫ్‌లు మరికొంత మంది యువకులతో కలిసి వచ్చి స్థానిక అంబేద్కర్ చౌరస్తా సమీపంలో ఉన్న నజిరుద్దీన్‌కు చెందిన ఏపీ బోర్‌వెల్స్, అతని సోదరుడికి చెందిన ఎస్ఎస్ ఎర్త్ మూవర్స్, స్పేర్ పార్ట్స్ దుకాణాలపై, అక్కడున్న వారిపై ఇనుపరాడ్లతో దాడి చేశారు. దుకాణంలోని ఆయిల్ డబ్బాలు పగిలి రోడ్లపై ఏరులైపారాయి. ఈ సందర్భంగా అక్కడున్న నజిరుద్దీన్‌తోపాటు అతని బంధువులైన ఎండీ ఇర్షాద్(25), సోహైల్, (21)వాజిద్(22) ఎండీ రషీద్‌లు గాయపడ్డారు. కాసేపు ఆ ప్రాంతంలో భయానక వాతావారణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. నిందితుల్లో ముగ్గురు పట్టుబడగా.., మిగతా వారు పరారయ్యారు. గాయపడిన వారు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఈ ఘటనలో ఆయిల్ డబ్బాలు పగిలి రోడ్లపై రోడ్డుపై పారుతుండటంతో ద్విచక్ర వాహనాలు జారి పలువురికి గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు జేసీబీతో మట్టి తెప్పించి రోడ్డుపై ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. బాలిక తండ్రి నజిరుద్దీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు చెప్పారు. -
అసభ్య ప్రవర్తన కేసులో వ్యక్తికి జైలు
గుంటూరు లీగల్: మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించి అవమాన పరచిన కేసులో నిందితుడైన భువనగిరి మహేష్‌కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ స్పెషల్ మొబైల్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ పిజె సుధ సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం గుంటూరు రూరల్ మండలం గోరంట్లకు చెందిన భువనగిరి మహేష్ ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. గోరంట్లలోని అన్నపూర్ణనగర్‌కు చెందిన ఓ మహిళ భర్త 11 సంవత్సరాల క్రితం మరణించడంతో ఒంటరిగా ఉంటుంది. ఆమె హెచ్ఐవి బాధితురాలు. షిప్ అనే స్వచ్ఛంద సేవా సంస్థలో హెచ్ఐవి కౌన్సిలర్‌గా విధులు నిర్వహిస్తుంది. రోజూ ఆఫీస్‌కు మహేష్ ఆటోలో Ðð ళ్ళి వస్తుంది. రమణాదేవి ఒంటరిగా ఉంటున్న విషయం గమనించిన మహేష్ ఆమెను వేధించడం ప్రారంభించాడు. వేధింపులు భరించలేని రమణాదేవి అతని ఆటోలో వెళ్ళడం మానివేయటంతోపాటు ఇళ్ళు కూడా వేరేచోటకు మారింది. అయిప్పటికి మహేష్ ఆమె ఆఫీసుకు వెళ్ళి వచ్చేటప్పుడు వెంటపడుతూనే ఉన్నాడు. నిందితుడిపై నేరం రుజువు చేయడంతో జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి సుధ తీర్పు చెప్పారు. -
'సీఎంగారు రక్షించండి.. వేధిస్తున్నారు'
ఆగ్రా: నజియా అనే ఆ అమ్మాయి గొప్ప సాహసికురాలుగా పేరు తెచ్చుకుంది. ఈ ఏడాది కిడ్నాపర్ల చెర నుంచి ఓ ఆరేళ్ల బాబును రక్షించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ చేతుల మీదుగా ఆగస్టులో వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయి అవార్డును అందుకుంది. కానీ, అలాంటి బాలిక ఇప్పుడు మాత్రం అదే ముఖ్యమంత్రికి 'తనను రక్షించండి' అంటూ వరుసగా ట్వీట్లు చేసింది. గ్యాంబ్లింగ్ ఆడేవాళ్ల ఆకృత్యాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయని ఆమె సీఎం అఖిలేశ్ కు విజ్ఞప్తి చేసింది. ఆగ్రాలోని మంటోలా ఏరియాలో ఓ గ్యాంబ్లింగ్ బ్యాచ్ మట్కా గ్యాంబ్లింగ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. దీంతో వారిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలా ఫిర్యాదుచేసినప్పటి నుంచి వారి వేధింపులు మొదలయ్యాయి. పోలీసులు, గ్యాంబ్లర్స్ కలిసి తనను వేధిస్తున్నారని, తనకు అపఖ్యాతి తెచ్చేలా ప్రవర్తిస్తున్నారని సీఎంకు ట్వీట్ ద్వారా తెలిపింది. తనను ఈ వేధింపుల నుంచి రక్షించాలని సీఎంను వేడుకుంది. అలాగే, ఓ వ్యక్తిపై కేసు నమోదు చేశారని, అతడిని ఇంత వరకు అరెస్టు చేయకపోవడంతో అతడి వల్ల తమ కుటుంబానికి ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. 'ఇలాగే తన పోరాటం కొనసాగించమని ముఖ్యమంత్రి నా భుజం తట్టి చెప్పారు. ఎప్పుడు నా గొంతు విప్పినా నా జీవితాన్ని ఓ సమస్యల సుడిగుండంలా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. నేను ఫిర్యాదు చేసినవారిని కాకుండా పోలీసులు నన్ను పిలిచి విచారిస్తున్నారు. నేను జూలైలో ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు ఒక్క చర్య కూడా తీసుకోలేదు' అని ఆ బాలిక నేరుగా సీఎం అఖిలేశ్‌కు ట్వీట్ ద్వారా విజ్ఞప్తి చేసింది. -
స్థలం అడిగిన పాపానికి!
ప్రత్తిపాడు: ‘నివేశన స్థలం అడగడమే మేం చేసిన పాపమా. ముఖ్యమంత్రిని కలిసి సమస్యను విన్నవించుకోవాలనుకోవడమే మేం చేసిన నేరమా.. ఏం తప్పు చేశాడని మావాడిని పోలిస్ స్టేషనుకు తీసుకెళ్లారు. మీరూ వద్దూ.. మీ స్థలం వద్దు.. మా పిల్లాడిని మాకు అప్పగించండి..’ అంటూ కోయవారిపాలెం ఎస్టీ మహిళలు తమ ఆవేదనను, ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు. వివరాలలోనికి వెళితే ప్రత్తిపాడు మండలం కోయవారిపాలెంలో రోడ్డు వెంబడి కొందరు ఎస్టీ వాసులు పట్టాలు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరు నివేశన స్థలాలు కావాలంటూ గతంలో అనేకమార్లు తహశీల్దార్లకు, ఆర్డీవోలకు, కలెక్టర్లకు, మంత్రులకు వినతి పత్రాలు అందజేశారు. అయినా ఫలితం లేకపోవడంతో ఈనెల 21వ తేదీన వారంతా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును కలిసేందుకు సీఎం కార్యాలయానికి వెళ్లారు. పోలీస్ స్టేషనుకు పిలిపించడంతో.. సీఎం కార్యాలయానికి వెళ్లినందుకు బాణావత్ కరుణకుమార్ అనే యువకుడిని మంగళవారం ఉదయం పోలీసులు చేబ్రోలు పోలీస్‌స్టేషనుకు తీసుకువెళ్లడం, సాయంత్రం చేబ్రోలు సీఐ జి రవికుమార్ కోయవారిపాలెంకు వచ్చి ఎస్టీలతో మాట్లాడటంతో కాలనీ వాసుల్లో ఆందోళన నెలకొంది. ఏ నిమిషానికి ఏమి జరుగుతుందోనని భయాందోళనలకు గురవుతున్నారు. అసలు కరుణకుమార్ ఏం నేరం చేశాడని పోలీస్ స్టేషనుకు తీసుకువెళ్లారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. మాకు చదువులేదు కదా అని కరుణకుమార్‌ను సాయం కోసం తోడు తీసుకువెళ్లామని, తోడు వచ్చినందుకు ఆ కుర్రోడిని పోలీసులు స్టేషనుకు తీసుకువెళ్లడం ఏంటంటూ మహిళలు మండిపడుతున్నారు. ఆ కుర్రాడి బదులు మమ్మల్ని తీసుకెళ్లి కూర్చోబెట్టండి అంటూ ఆక్రోశాన్ని వెలిబుచ్చారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు వెళ్లివచ్చిన తరువాత మంత్రి రావెలను కలిసి తమ గోడును వెల్లబోసుకునేందుకు మంత్రి రావెల కార్యాలయానికి వెళ్లామని, కార్యాలయంలోనికి రానివ్వకుండా, మంత్రిని కలవనివ్వకుండా మంత్రి అనుచరులు మమ్మల్ని కార్యాలయం నుంచి బయటకు తరిమేశారని మహిళలు ఆరోపిస్తున్నారు. -
మిస్సయిన ఫోన్.. సాఫ్ట్వేర్ ఉద్యోగినికి వేధింపులు
హైదరాబాద్: సాఫ్ట్వేర్ ఉద్యోగిని పోగొట్టుకున్న సెల్‌ఫోన్..ఓ ఆకతాయికి దొరికింది. అదే అవకాశంగా తీసుకున్న ఆ యువకుడు సదరు యువతిని అసభ్య మెసేజ్‌లతో వేధించటం ప్రారంభించాడు. బాధితురాలి ఫిర్యాదుతో సదరు యువకుడిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. వివరాలు... మాదాపూర్‌లోని సాఫ్ట్వేర్ సంస్థలో ఓ యువతి పనిచేస్తోంది. ఇటీవల అనుకోకుండా ఆమె తన సెల్‌ఫోన్‌ను పోగొట్టుకుంది. అది సిద్ధు అనే యువకుడికి దొరికింది. ఆ ఫోన్లో ఉన్న సదరు యువతికి సంబంధించిన వ్యక్తిగత ఫొటోలను, ఇతర వివరాలను అతడు చూశాడు. వాటిని ఉపయోగించుకుని ఆమెను వేధించటం మొదలుపెట్టాడు. అసభ్యకర సందేశాలను పంపిస్తున్నాడు. మొదట్లో సెల్ పోయిన విషయాన్ని పట్టించుకోని బాధితురాలు...వేధింపులతో విసిగిపోయింది. చివరికి మాదాపూర్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఫోన్‌కాల్స్‌ను ట్రేస్ చేసి, సిద్దును అదుపులోకి తీసుకున్నారు. అతనిపై 354డి, 506, 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. -
కాపురానికి రాలేదని...
భార్యపై సైకో భర్త దాడి.. ఆపై ఆత్మహత్యాయత్నం సోంపేట మార్కెట్లో సంచలనం సోంపేట : సోంపేట పట్టణంలోని కూరగాయల మార్కెట్ (బజారు)లో మంగళవారం పట్టపగలు అందరూ చూస్తుండగానే ఓ ప్రబుద్ధుడు భార్యపై దాడిచేశాడు. బ్లేడుతో ఆమె పీకను కోయడమే కాకుండా తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన మార్కెట్ వ్యాపారులు, ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేశారు. సోంపేట పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... బీన పద్మ (23), బీన శ్రీనివాసరావు (27)భార్య భర్తలు. కంచిలి మండలం పెద్ద శ్రీరాంపురం గ్రామానికి చెందిన పర్రి కేశవరావు, లోలమ్మ కుమార్తె పద్మను ఒడిశాలోని ఖుర్దా రోడ్డు చెందిన శ్రీనివాసరావుతో మూడేళ్ల క్రితం వివాహంచేశారు. శ్రీనివాసరావు పెళ్లినాటి నుంచి సైకోలా వ్యవహారిస్తూ హింసిస్తున్నాడని పద్మ తల్లిదండ్రులకు చెప్పుతూ ఉండేది. తల్లిదండ్రులు సర్దుకుపోమ్మంటూ సలహా ఇస్తూ ఉండేవారు. పద్మ గర్భవతిగా ఉన్నప్పుడు కూడా ఒకటి రెండు సార్లు శ్రీనివాసరావు చేయి చేసుకున్నాడని తల్లిదండ్రులు తెలిపారు. ఆరు నెలల క్రితం పద్మకు ఒక కుమారుడు పుట్టి చనిపోయాడు. అప్పటి నుంచి పద్మ కన్నవారి ఇంటి వ ద్దే ఉంటోంది. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావు పద్మను కాపురానికి రావాలని కోరగా, ఆమె ససేమిరా అంది. ఆపై, ఆమె భర్త హింసను తట్టుకోలేకపోతున్నానంటూ కంచిలి పోలీస్ స్టేషన్లో వారం క్రితం ఫిర్యాదు చేయడంతో శ్రీనివాసరావుపై గృహహింస చట్టంపై కేసు నమోదయింది. కంచిలి ఎస్ఐ వేణుగోపాలరావు అతడిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. దీంతో భార్యపై శ్రీనివాసరావు కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం పెద్ద శ్రీరాంపురం గ్రామం నుంచి పద్మ తన పిన్ని సంతోషితో కలసి సోంపేట మార్కెట్‌కు రాగా, శ్రీనివాసరావు వెళ్లి ఆమెతో ఘర్షణకు దిగాడు. తనవెంట తెచ్చుకున్న బ్లేడుతో పద్మ మెడపై, గెడ్డంపై దాడి చేశాడు. ఆపై అతడూ కంఠం పై బ్లేడుతో కోసుకున్నాడు. దీంతో మార్కెట్లో ఒక్కసారిగా అలజడి రేగింది. ఇద్దరినీ స్థానికులు సోంపేట సామాజిక ఆస్పత్రికి తరలించారు. సోంపేట సీఐ సూరినాయుడు భార్య, భర్తల వద్ద నుంచి వివరాలు సేకరించారు. సోంపేట ఇన్చార్జి ఎస్ఐ వేణుగోపాలరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పని మనిషిపై ప్రొఫెసర్ వేధింపులు
అత్తాపూర్: ఇంట్లో పనిచేస్తున్న యువతికి మాయమాటలు చెప్పి లైంగికంగా వేధింపులకు గురి చేశాడో ప్రొఫెసర్. ఈ సంఘటన నార్సింగ్ పరిధిలో పప్పులగూడలో శనివారం వెలుగు చూసింది. స్థానికంగా నివాసముండే ఓ ప్రొఫెసర్ తన ఇంట్లో పని చేస్తున్న యువతితో మసాజ్ సెంటర్ పెట్టిస్తానని, ఆర్థికంగా లోటు ఉండదని మాయమాటలు చెప్పాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో భయాందోళనకు గురైన ఆమె శనివారం ఉదయం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసలు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎస్ఐ వేధింపులతో విషం తాగి టవరెక్కాడు
లింగాల : పోలీసుల వేధింపులు భరించలేక వైఎస్సార్ జిల్లా లింగాలకు చెందిన ఒక కూలీ గురువారం ఉదయం పురుగుల మందు తాగి టవర్ ఎక్కాడు. వివరాలు లింగాలకు చెందిన నారాయణరెడ్డి (35)పై వివాహేతర సంబంధం విషయమై ఒక వ్యక్తి ఫిర్యాదు ఇచ్చాడు. ఈ మేరకు లింగాల పోలీసులు నారాయణరెడ్డిని స్టేషన్‌కు పిలిపించి పగలంతా స్టేషన్లో ఉంచి రాత్రిపూట వదిలేవారు. పైగా ఎస్ఐ వేధింపులకు గురి చేసేవారని అతని కుటుంబ సభ్యులు అంటున్నారు. దాంతో అతను పనులకు వెళ్లక పోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువడంతో మనస్థాపం చెందిన నారాయణరెడ్డి ఈ రోజు ఉదయం తహశీల్దార్ కార్యాలయం వద్దకు వచ్చి పురుగుల మందు తాగాడు. తర్వాత అక్కడే ఉన్న బీఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు అతణ్ణి దించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. నారాయణ రెడ్డి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. -
'కలెక్టర్ వేధింపులు ఎక్కువయ్యాయి'
గిరీంపేట: చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ తమను ఇబ్బందులు పెడుతున్నారంటూ రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. మంగళవారం విధులు బహిష్కరించిన ఉద్యోగులు పాత కలెక్టర్ బంగ్లా నుంచి కలెక్టరేట్ వద్దకు ర్యాలీగా తరలివచ్చి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేతలు మాట్లాడుతూ స్వాతంత్య్ర దినం సందర్భంగా తమకు కనీసం ప్రశంస పత్రాలు కూడా ఇవ్వలేదని, ఇటీవలి కాలంలో ఆయన వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. ఆయనను వెంటనే బదిలీ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఆ ప్రాంత ఉద్యోగులు మినహా అందరూ విధులు బహిష్కరించారు. చిత్తూరులో జరిపిన ఆందోళన కార్యక్రమానికి దాదాపు వెయ్యిమంది ఉద్యోగులు తరలివచ్చారు. -
వేధింపులు భరించలేక విద్యార్థి అదృశ్యం
శ్రీకాకుళం : సీనియర్ల వేధింపులు భరించలేక విద్యార్థి అదృశ్యమైన సంఘటన శ్రీకాకుళం పట్టణంలో బుధవారం జరిగింది. వివరాలు.. శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థి సీనియర్ల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటానని లేఖ రాసి ఇంట్లో పెట్టి వెళ్లిపోయాడు. సాయంత్రం వరకు అతను ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది ఇంట్లో వెతగ్గా లేఖ కనిపించింది. దాంతో వారు పోలీసులను ఆశ్రయించారు. లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు అన్నీ కోణాల్లో విచారణ చేస్తున్నారు. -
ఆర్టీసీ ఉద్యోగులు అరెస్ట్
మియాపూర్: ఆకతాయిల వేధింపుల నుంచి ప్రయాణికులకు రక్షణగా నిలవాల్సిన ఆర్టీసీ ఉద్యోగులు ఇద్దరు కీచక అవతారం ఎత్తారు. బస్టాప్‌లో సివిల్ డ్రెస్‌లో ఉన్న'షీ' పోలీసుతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఆర్టీసీ డ్రైవర్, కానిస్టేబుల్ అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మియాపూర్ బస్టాప్‌లో మంగళవారం సాయంత్రం జరిగింది. షీ పోలీసు బృందానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ అమృత సాధారణ డ్రెస్‌లో ప్రయాణికురాలి మాదిరిగా బస్టాప్‌లో నింలబడి ఉంది. ఆ సమయంలో అక్కడకు వచ్చిన డ్రైవర్ జి.మనోహర్(46), కానిస్టేబుల్ షేక్‌వాహిద్ (26) ఆమెతో అసభ్యకరంగా వ్యవహరించడమే కాకుండా ఫోన్ నెంబర్ అడిగి, అందుకు ఆమె అంగీకరించకపోయినా బలవంతంగా తీసుకునే ప్రయత్నం చేశారు. వీరి వ్యవహారాన్ని సమీపం నుంచి గమనిస్తున్న షీ పోలీసులు వెంటనే అప్రమత్తమై మనోహర్, వాహిద్‌లను అరెస్ట్ చేసి మియాపూర్ పోలీసులకు అప్పగించారు. -
మహిళా సీటీఓకు వేధింపులు
-
కీచక పర్వం
-
భార్యను రోడ్డుకీడ్చి.. చావబాదాడు!
-
నాన్నా.. ఎందుకిలా చేశావ్ నాన్నా..?
-
ప్రేమిస్తున్నానంటూ విద్యార్థిని వేధిస్తున్న సీనియర్
-
కాల్ మనీ నిర్వాహకుల కొత్త కోణం
-
భార్యను గొలుసులతో బంధించిన భర్త
-
క్రూరం.. కర్కశం!
*వివాహమైన నాటి నుంచి తప్పని నరకం *ఆరేళ్లుగా మరీ దుర్మార్గం *పెళ్లి పేరుతో మహిళకు ఇల్లే కారాగారం కోటవురట్ల, న్యూస్‌లైన్: బతుకే కారాగారం.. బయిటపడే దారి శూన్యం.. అందరు యువతుల మాదిరిగానే కోటి కలలతో కాపురానికి వస్తే, జీవితం వాడిపోయి, బతుకు బండబారిపోయిన విషాదం.. ఇదీ 43 ఏళ్ల నాగమల్లేశ్వరికి ఎదురైన దారుణ అనుభవం. ఏనాడో 22 ఏళ్ల క్రితం పెళ్లయింది మొదలు.. ఆమె బతుకు కన్నీటి సంద్రమే అయింది. దినమొక గండంగాకాలం గడిచింది. జీవితమంతా తోడుండాల్సిన భర్త నిర్దయుడే అయి, నిత్యం నరకాన్ని అనుభవంలోకి తెస్తే, కన్నీరు కూడా ఇంకిపోయింది. ఆరేళ్లుగా బతుకు మరీ దుర్భరమైంది. తనది అనుకున్న అత్తవారింటిలో ఓ చిన్నగది ఆమెకు ఖైదుగా మారింది. పగలూ, రాత్రీ ఆ గదే ఆమెకు నెలవైంది. బయిట నుంచి భర్త గడియ పెట్టి, ఓ పాశవికంగా వ్యవహరిస్తే మూగరోదనే గతయింది. కుమార్తెలా చూసుకోవాల్సిన అత్త, సోదరిగా భావించాల్సిన ఆడపడచు మాటలతో హింసిస్తే, కుమిలిపోవడమే బతుకైంది. ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చిన కోటవురట్ల వాస్తవ్యుడు పి.వి.ఎస్.జె.ప్రసాద్ ఇల్లాలి దీనగాథ ఇది.. బియ్యమే గతి.. భార్య పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించిన ప్రసాద్ ఆమెకు కడుపు నిండా భోజనం పెట్టకుండా హింసించేవాడు. ‘నెలకు ఐదు కిలోల బియ్యం ఇచ్చేవారు. గదిలో ఉన్న స్టౌపై ఆ బియ్యాన్ని ఉడకబెట్టి గెంజితో తినాల్సి వచ్చేది. ఆరేళ్ల క్రితం కాస్త మాంసం పెట్టారు. అదే నేను తిన్న కూర’ అని ఆమె కన్నీళ్లతో, బలహీనమైన గొంతుతో శుక్రవారం పోలీసులకు వివరిస్తూ ఉంటే విన్నవారికి గుండె కరిగిపోయింది. ‘రోగం వచ్చినా దిక్కు లేదు.. ఈ ఇంటికన్నా ఖైదు మేలు’ అని ఆమె చెబుతూ బావురుమంది. గదిలో లైట్ కూడా వేసుకునే స్వేచ్ఛలేదని ఆమె రోదిస్తూ పోలీసులకు చెప్పింది. గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన సోదరులు ఇప్పుడు స్పందించక పోవడంతో ఆమె బతుకు మరీ దయనీయమైంది. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాగమల్లేశ్వరికి న్యాయం ఏ రీతిన లభిస్తుందో వేచిచూడాల్సి ఉంది.