అసభ్య ప్రవర్తన కేసులో వ్యక్తికి జైలు | Jail punishment to harassment case criminal | Sakshi
Sakshi News home page

అసభ్య ప్రవర్తన కేసులో వ్యక్తికి జైలు

Published Mon, Oct 24 2016 10:13 PM | Last Updated on Mon, Sep 4 2017 6:11 PM

మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించి అవమాన పరచిన కేసులో నిందితుడైన భువనగిరి మహేష్‌కు ఏడాది జైలు శిక్ష..

గుంటూరు లీగల్‌:  మహిళ పట్ల  అసభ్యంగా ప్రవర్తించి  అవమాన  పరచిన కేసులో నిందితుడైన భువనగిరి మహేష్‌కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ స్పెషల్‌ మొబైల్‌ మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ పిజె సుధ సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం గుంటూరు రూరల్‌ మండలం గోరంట్లకు చెందిన భువనగిరి మహేష్‌ ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. గోరంట్లలోని అన్నపూర్ణనగర్‌కు చెందిన ఓ మహిళ భర్త 11 సంవత్సరాల క్రితం మరణించడంతో ఒంటరిగా ఉంటుంది. ఆమె హెచ్‌ఐవి బాధితురాలు. షిప్‌ అనే స్వచ్ఛంద సేవా సంస్థలో హెచ్‌ఐవి కౌన్సిలర్‌గా విధులు నిర్వహిస్తుంది. రోజూ ఆఫీస్‌కు మహేష్‌ ఆటోలో Ðð ళ్ళి వస్తుంది.  రమణాదేవి ఒంటరిగా ఉంటున్న విషయం గమనించిన మహేష్‌ ఆమెను వేధించడం ప్రారంభించాడు. వేధింపులు భరించలేని రమణాదేవి అతని ఆటోలో వెళ్ళడం మానివేయటంతోపాటు ఇళ్ళు కూడా వేరేచోటకు మారింది. అయిప్పటికి మహేష్‌ ఆమె ఆఫీసుకు వెళ్ళి వచ్చేటప్పుడు వెంటపడుతూనే ఉన్నాడు.  నిందితుడిపై నేరం రుజువు చేయడంతో జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి సుధ తీర్పు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement