సుప్రీంకోర్టు స్పషీ్టకరణ
న్యూఢిల్లీ: జైల్లో ఉన్న నిందితుడు వేరొక కేసులో ముందస్తు బెయిల్ కోరవచ్చని సుప్రీంకోర్టు తేలి్చచెప్పింది. వేరొక కేసులో అతను అరెస్టు కానంతవరకు దాంట్లో ముందస్తు బెయిల్ కోరడానికి అర్హుడేనని వివరించింది. ఒక కేసులో నిందితుడు కస్టడీలో ఉన్నాడనేది.. రెండో కేసులో అతని ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సెషన్స్ కోర్టు, హైకోర్టులు నిర్ణయం తీసుకోవడానికి అడ్డంకి కాదని స్పష్టం చేసింది.
కస్టడీలో ఉన్నంతమాత్రాన మరో కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని చట్టంలో ఎక్కడా లేదని చీఫ్ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ‘అరెస్టు చేస్తారనే భయమున్నపుడు ముందస్తు బెయిల్‌ను కోరే హక్కును సీఆర్‌పీసీ సెక్షన్ 438 కలి్పంచింది. ప్రజాస్వామ్యదేశంలో వ్యక్తి స్వేచ్ఛ, స్వాతంత్య్రం ప్రాధాన్యతను గుర్తించడానికే ఈ సెక్షన్ ఉంది. 438 సెక్షన్‌కు ఆంక్షలను పెట్టకూడదు. అలాచేస్తే అది ఈ సెక్షన్ సారాంశానికి,
చట్టం ఉద్దేశానికి వ్యతిరేకమే అవుతుంది’ అని పేర్కొంది. వివిధ హైకోర్టులు ఈ అంశంలో భిన్న వైఖరులు తీసుకోవడంతో సర్వోన్నత న్యాయస్థానం సోమవారం స్పష్టతనిచి్చంది. జైళ్లో ఉన్న నిందితుడు మరోకేసులో ముందస్తు బెయిల్‌ను కోరలేడని రాజస్తాన్, ఢిల్లీ, అలహాబాద్ హైకోర్టులు తీర్పులిచ్చాయి. బాంబే, ఒడిశా హైకోర్టులు ముందస్తు బెయిల్ కోరవచ్చని అభిప్రాయపడ్డాయి. ‘నిందితుడికి ముందస్తు బెయిల్ కోరే చట్టబద్ధమైన హక్కుని నిరాకరించడం తగదు. మొదటి కేసులో కస్టడీ నుంచి విడుదలయ్యే దాకా మరో కేసులో ముందస్తు బెయిల్ కోరలేరనడంలో అర్థం లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment