anticipatory bail
-
జత్వానీ కేసులో ఐపీఎస్ అధికారులకు ముందస్తు బెయిల్
సాక్షి, అమరావతి: సినీ నటి జత్వానీ (kadambari jethwani) కేసులో ఐపీఎస్‌తో పాటు ఇతర పోలీస్ అధికారులకు హైకోర్టు (andhra pradesh high court) ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఐపీఎస్ కాంతి రాణా టాటా, విశాల్ గున్నితో పాటు ఏసీపీ హనుమంతరావు ఇతర పోలీసు అధికారులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు (anticipatory bail) చేస్తూ తీర్పు వెల్లడించింది.మంగళవారం జత్వానీ ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం కాంతిరాణా టాటా, విశాల్ గున్నీ, కె.హనుమంతరావు, ఎం.సత్యనారాయణ,న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. గత విచారణలో కొద్ది రోజుల క్రితం డాక్యుమెంట్ల ఫోర్జరీ కేసులో విచారణ చేసి అరెస్ట్ చేసినందుకే సినీనటి కాదంబరి జత్వానీ కక్షపూరితంగా తమపై తప్పుడు కేసు పెట్టారని ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్నీ, పోలీసు అధికారులు హనుమంతరావు, సత్యనారాయణలు హైకోర్టుకు నివేదించారు. కాంతిరాణా టాటా తదితరులపై కేసు నమోదు వెనుక దురుద్దేశాలు ఉన్నాయని వారి తరఫు సీనియర్ న్యాయవాదులు సుబ్రహ్మణ్యం శ్రీరాం, వేములపాటి పట్టాభి, వినోద్‌కుమార్ దేశ్‌పాండే వివరించారు.జత్వానీ ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం కాంతిరాణా టాటా, విశాల్ గున్నీ, కె.హనుమంతరావు, ఎం.సత్యనారాయణ, న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్ శుక్రవారం మరోసారి విచారణ జరిపారు. కాంతిరాణ టాటా తదితరుల తరఫు సీనియర్ న్యాయవాదులు సుబ్రహ్మణ్య శ్రీరాం, వేములపాటి పట్టాభి, వినోద్ కుమార్ దేశ్‌పాండే వాదనలు వినిపిస్తూ ‘పోలీసు అధికారులుగా తమకు వచ్చిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్ట ప్రకారం జత్వానీని విచారించడమే తప్పు అన్నట్లుగా పిటిషనర్లపై కేసులు నమోదు చేశారు.విధి నిర్వహణలో భాగంగా చేసిన చర్యలకు నేరాన్ని ఆపాదించడానికి వీల్లేదు. కేసు కట్టి విచారణ జరపడాన్ని నేరంగా పరిగణించిన దాఖలాలేవీ గతంలో లేవు. చట్ట ప్రకారం నిందితులను విచారించడం నేరం ఎలా అవుతుంది? జత్వానీ ఇచ్చిన ఫిర్యాదులో పేర్లు లేకపోయినప్పటికీ పోలీసులు కొందరిని నిందితులుగా చేర్చారు. ఆమెను విచారించిన పోలీసు అధికారులు ఎవరో కూడా జత్వానీకి తెలియదు. అలాంటప్పుడు పోలీసులు కేసు ఎలా నమోదు చేస్తారు?జత్వానీ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో ఇదే హైకోర్టు ప్రధాన నిందితుడు విద్యాసాగర్‌కు బెయిల్ మంజూరు చేసింది. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని పిటిషనర్లకు ముందుస్తు బెయిల్ మంజూరు చేయాలి..’ అని కోర్టును కోరారు. అనంతరం సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ జత్వానీ విషయంలో పిటిషనర్లందరూ కుట్ర పూరితంగా వ్యవహరించారన్నారు. ఈ కుట్ర వెనుక ఎవరున్నారో తేల్చేందుకు వారిని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. జత్వానీ తరఫు న్యాయవాదులు వాసిరెడ్డి ప్రభునాథ్, నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. -
వివాదాస్పద మాజీ ట్రెయినీ IAS అధికారిణి పూజాకు ఖేద్కర్ కు షాక్
-
మోహన్ బాబుకు దక్కని ఊరట.. ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చిన హైకోర్టు!
తెలంగాణ హైకోర్టులో సినీనటుడు మోహన్ బాబుకు మరోసారి చుక్కెదురైంది. ముందస్తు బెయిల్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన వేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. అనంతరం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.మోహన్‌బాబు పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానంలో ఇవాళ విచారణ జరిగింది. ఈ సందర్భంగా మోహన్ బాబు దుబాయ్ వెళ్తున్నారని ప్రతివాదుల తరఫున న్యాయవాది ఆరోపించారు. అయితే అలాంటిదేం లేదంటూ మోహన్ బాబు లాయర్ కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలంటూ ఇరు వర్గాలను ఆదేశించింది.అసలేం జరిగిందంటే..మోహన్ బాబు, ఆయన తనయుడు మనోజ్‌కు మధ్య వివాదం తలెత్తింది. జల్పల్లిలోని ఇంట్లోకి తనను రానివ్వలేదంటూ మంచు మనోజ్ మీడియా తీసుకుని ఆ ఇంటివద్దకు వెళ్లారు. అదే సమయంలో సెక్యూరిటీ మనోజ్ దంపతులను లోపలికి అనుమతించలేదు. ఈ క్రమంలోనే మనోజ్ గేటు బద్దలుకొట్టి ఇంట్లోకి వెళ్లారు. అక్కడే ఉన్న మోహన్‌బాబును ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ఆయన ఆగ్రహాని గురయ్యారు. అతని మైక్‌తోనే మీడియా ప్రతినిధిని కొట్టారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే తనపై నమోదైన కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు మోహన్ బాబు. ఇవాళ విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. -
అందరిపైనా సెక్షన్ 111 కుదరదు
సాక్షి, అమరావతి: సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్ 111 కింద వ్యవస్థీకృత నేరమంటూ కొందరిపై పోలీసులు ఉద్దేశపూర్వకంగా పెడుతున్న అడ్డగోలు కేసుల విషయంలో హైకోర్టు ఒకింత స్పష్టతనిచ్చింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌లను కించపరిచేలా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరుకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ పెసల శివశంకర్‌రెడ్డి ఫేస్బుక్లో పోస్టులు పెట్టారంటూ కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు పులి శ్రీనివాసరావు గత నెల 8న పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివశంకర్‌రెడ్డిపై పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 111 కింద కేసు నమోదు చేశారు. దీంతో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని శివశంకర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ నూనేపల్లి హరినాథ్... బీఎన్ఎస్ సెక్షన్ 111 గురించి కొంతమేర స్పష్టతను ఇస్తూ వ్యవస్థీకృత నేరాలకు సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను ఉదహరించారు.‘ఏవరైనా ఒక వ్యక్తిపై బీఎన్ఎస్ సెక్షన్ 111 కింద కేసు పెట్టాలంటే... అతనిపై గత పదేళ్లలో ఒకటి కంటే ఎక్కువ చార్జిషీట్లు దాఖలై ఉండాలి. వాటిని సంబంధిత కోర్టు విచారణకు స్వీకరించి ఉండటం తప్పనిసరి. బీఎన్ఎస్ సెక్షన్ 111 మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నిరోధక చట్టంతోపాటు గుజరాత్ ఉగ్రవాద, వ్యవస్థీకృత నేరాల నిరోధక చట్టాలను పోలి ఉంది. మహారాష్ట్ర, గుజరాత్ చట్టాలు ఏ సందర్భాల్లో వర్తిస్తాయో సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టం చేసింది. ఆ చట్టాలు కూడా నిందితునిపై గత పదేళ్లలో ఒకటి కంటే ఎక్కువ చార్జిషీట్లు దాఖలై ఉండాలని, వాటిని సంబంధిత కోర్టు విచారణకు స్వీకరించి ఉండటం తప్పనిసరి అని చెబుతున్నాయి. కేరళ హైకోర్టు సైతం ఇదే రకమైన తీర్పు ఇచ్చింది.’ అని స్పష్టంచేశారు. ప్రస్తుత కేసులో పిటిషనర్‌కు బీఎన్ఎస్ సెక్షన్ 111 వర్తిస్తుందా? లేదా? అన్నది దర్యాప్తు అధికారి తన విచారణలో తేల్చాల్సి ఉంటుందని న్యాయమూర్తి తెలిపారు.ఐటీ యాక్ట్ సెక్షన్–67 పైనా స్పష్టత... ఐటీ చట్టంలోని సెక్షన్ 67 ఏ సందర్భంలో వర్తిస్తుందన్న విషయంలోను న్యాయమూర్తి స్పష్టత ఇచ్చారు. ‘అసభ్యంగా ఉన్న దాన్ని ఎల్రక్టానిక్ రూపంలో ప్రచురించడం, ప్రసారం చేయడం చేశారంటూ ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద కేసు పెట్టారు. ఏది అసభ్యత కిందకు వస్తుందన్న దాన్ని తేల్చే ముందు సమకాలీన విలువలను, జాతీయ ప్రమాణాలను ఆధారంగా తీసుకోవాలే తప్ప, సున్నిత మనసు్కలతో కూడిన సమూహం నిర్దేశించిన ప్రమాణాలను కాదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. అసభ్యతను నిర్ధారించే ముందు విషయం మొత్తాన్ని చూడాలే తప్ప, అందులో ఓ భాగం ఆధారంగా అసభ్యతను నిర్ణయించడానికి వీల్లేదని కూడా సుప్రీంకోర్టు చెప్పింది’అని జస్టిస్ హరినాథ్ తన తీర్పులో గుర్తుచేశారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ పిటిషనర్ పెసల శివశంకర్‌రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రూ.10వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని అతన్ని ఆదేశించారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనేపల్లి హరినాథ్ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. -
సజ్జల రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట
సాక్షి,గుంటూరు: వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను మంగళవారం(డిసెంబర్10) ఏపీ హైకోర్టు విచారించింది. సజ్జల కేసు విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు గతంలో ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు మరో రెండు వారాలపాటు పొడిగించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్పీ నేతలకు వేధింపులు ఎక్కువయ్యాయని సజ్జల తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తనపై 41ఏ నోటీసుకు వీలులేని సెక్షన్లు పెట్టి అరెస్టు చేయాలని చూస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని సజ్జల ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఇదీ చదవండి: బరితెగించిన ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ పోరాటం -
టాటా, గున్నీ ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టేయండి
సాక్షి, అమరావతి : సినీ నటి కాదంబరి జత్వానీ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్నీ, పోలీసు అధికారులు హనుమంతరావు, సత్యనారాయణ, న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర్లు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేయాలని సీఐడీ హైకోర్టును అభ్యర్థించింది. ఈమేరకు సీఐడీ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీ సరిత వేర్వేరుగా కౌంటర్లు దాఖలు చేశారు. వారికి ముందస్తు బెయిల్ ఇస్తే సాక్షులపై ఒత్తిడి తెచ్చి సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఆ కౌంటర్లలో హైకోర్టును సీఐడీ కోరింది. కుక్కల విద్యాసాగర్‌తో కలిసి కుట్రలో పాల్గొనడం ద్వారా పోలీసు మాన్యువల్ ఆర్డర్‌ను ఉల్లంఘించారని చెప్పింది. ఈ కుట్రలో న్యాయవాది వెంకటేశ్వర్లు సైతం పాలుపంచుకున్నారని తెలిపింది. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 2న చేపట్టనుంది.విద్యాసాగర్‌కు బెయిల్ ఇవ్వొద్దు..జత్వానీ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేయాలని సీఐడీ హైకోర్టును కోరింది. విద్యాసాగర్ రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి అని, బెయిల్‌పై బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని తెలిపింది. ఈ మేరకు సీఐడీ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. -
తెలుగువారిపై వివాదాస్పద కామెంట్స్.. కస్తూరికి షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు!
ప్రముఖ నటి కస్తూరి తెలుగు వారిపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆమెపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో కస్తూరి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఆమెను అరెస్ట్ చేసేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.ముందస్తు బెయిల్ నిరాకరణ..ఈ కేసులో నటి కస్తూరి ఇప్పటికే మద్రాస్ హైకోర్ట్‌ను ఆశ్రయించింది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్ ధర్మాసనం ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది.క్షమాపణలు చెప్పిన కస్తూరిఅయితే తన వ్యాఖ్యల పట్ల నటి కస్తూరి క్షమాపణలు చెప్పింది. తనకు తెలుగు గడ్డ మెట్టినిల్లు అని, తెలుగు ప్రజలను తాను కించపరిచే విధంగా మాట్లాడలేదని చెప్పింది. తాను చేసిన వ్యాఖ్యలను డిఎంకే పార్టీ నేతలే తప్పుగా ప్రచారం చేశారని వారిపై ఆమె ఫైర్ అయింది. దీంతో ఆ పార్టీ నేతలే తనను టార్గెట్ చేస్తున్నారని కూడా ఆరోపించింది. అయినప్పటికీ కస్తూరి వ్యాఖ్యలపై చెన్నై,మదురై వంటి ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి.ఇంటికెళ్లిన పోలీసులు..ఆమె కేసులు నమోదు చేసిన పోలీసులు సమన్లు జారీ చేసేందుకు కస్తూరి ఇంటికి వెళ్లారు. అయితే, తన ఇంటికి తాళం వేసి ఉందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఫోన్ కూడా ఆఫ్ చేసి ఉందని సమాచారం. కేసుల భయంతో ఆమె పరారీలో ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, ఈ కేసుల విషయంలో ఆమె ఒక లాయర్‌ను సంప్రదించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.అసలేం జరిగిందంటే..హిందూ పీపుల్స్ పార్టీ ఆఫ్ తమిళనాడు తరపున బ్రాహ్మణులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ నటి కస్తూరి తెలుగువారిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసింది. సుమారు 300 ఏళ్ల క్రితం రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తమిళనాడుకు తెలుగు వారు వచ్చారని ఆమె వ్యాఖ్యలు చేసింది. అలా వచ్చిన వారంతా ఇపుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆమె కామెంట్ చేసింది. అలా అయితే, ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి తెలుగువారు ఎవరు..? అని ఆమె ప్రశ్నించింది. ఇదే వేదికపై ఆమె డిఎంకే పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ పలు విమర్శలు చేయడం వల్ల ఆ పార్టీ నేతలు తనపై కుట్రకు ప్లాన్ చేస్తున్నారని ఆమె ఆరోపించింది. -
హర్షసాయి కేసులో బిగ్ ట్విస్ట్.. యూట్యూబర్‌కు భారీ ఊరట!
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ హర్షసాయికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తనపై పెట్టిన కేసు చెల్లదంటూ హర్షసాయి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటీషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. హర్షసాయికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.లైంగికంగా వేధించాడని కేసుహర్షసాయి తన దగ్గర రూ. 2 కోట్లు తీసుకోవడంతో పాటు లైంగికంగా వేధించాడంటూ ఓ నటి పోలీసులను ఆశ్రయించారు. దీంతో సెప్టెబర్ 24న హర్షసాయిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి హర్షసాయి పరారీలోనే ఉన్నాడు.తను ఎలాంటి తప్పు చేయలేదని, న్యాయంగా పోరాడడానికి తాను సిద్ధమని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఆ తర్వాత హర్ష సాయి ఎక్కడా కనిపించలేదు. పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేసిన ఫలితం లేకుండా పోయింది. అజ్ఞాతంలో ఉండే..ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేశాడు.‘మెగా’ విషయంలో విభేదాలుగుడ్ మెసేజ్.. హెల్పింగ్ హ్యాండ్ తరహా వీడియోలతో హర్షసాయి తెలుగు స్టేట్‌లోనే కాకుండా సౌత్‌లోనూ పాపులారిటీ సంపాదించుకున్నాడు. తాజాగా సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టాడు. ఆయన హీరోగా ‘మెగా’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీ కాపీరైట్స్ విషయంలోనే విభేదాలు రావడంతో సదరు నటి హర్షసాయిపై కేసు పెట్టినట్లు తెలుస్తోంది. ‘మెగా’ కాపీరైట్స్ కోసమే లైంగికంగా వేధించారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. హర్ష సాయితో పాటు ఆయన తండ్రిపై కూడా ఫిర్యాదు చేసింది. . దీంతో అప్పటి నుంచే వారిద్దరు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేయగా.. ఇన్నాళ్లకు వారి ప్రయత్నం ఫలించింది. -
YSRCP నేతలకు సుప్రీంకోర్టులో ఊరట
-
వైఎస్సార్సీపీ నేతలకు సుప్రీంకోర్టులో ఊరట
సాక్షి, ఢిల్లీ: టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైఎస్సార్సీపీ నేతలకు ఊరట లభించింది. సర్వోన్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దేవినేని అవినాష్, జోగి రమేష్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, గవాస్కర్‌లకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తునకు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 4కి ధర్మాసనం వాయిదా వేసింది. వైఎస్సార్సీపీ తరఫున న్యాయవాదులు కపిల్ సిబల్, నీరజ్ కిషన్ కౌశల్, అల్లంకి రమేష్ తమ వాదనలు వినిపించారు.కాగా, వైఎస్సార్సీపీ నేతలపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. అక్రమ కేసులు బనాయించి కుట్రలకు తెరలేపింది. ‘‘2021లో టీడీపీ కార్యాలయం పై దాడి జరిగిన సమయంలో అక్కడ వైఎస్సార్సీపీ నేతలు ఎవరూ లేరు. అయితే, ప్రభుత్వం మారగానే టీడీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. మూడేళ్ల తర్వాత ఈ కేసులో లేనివారిని కొత్తగా నిందితులుగా చేరుస్తోంది. 307 లాంటి హత్యయత్నం కేసులు పెట్టారు. కక్ష సాధింపు చర్యల నుంచి రక్షణ కల్పించాలి’’ అని వైఎస్సార్సీపీ తరఫు న్యాయవాదులు కోరారు. వారి వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు.. వైఎస్సార్సీపీ నేతలకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.ఇదీ చదవండి: కాలేజీలపై 'చంద్రబాబు' కత్తి! -
జైల్లో ఉన్న నిందితుడు మరో కేసులో ముందస్తు బెయిల్ కోరొచ్చు
న్యూఢిల్లీ: జైల్లో ఉన్న నిందితుడు వేరొక కేసులో ముందస్తు బెయిల్ కోరవచ్చని సుప్రీంకోర్టు తేలి్చచెప్పింది. వేరొక కేసులో అతను అరెస్టు కానంతవరకు దాంట్లో ముందస్తు బెయిల్ కోరడానికి అర్హుడేనని వివరించింది. ఒక కేసులో నిందితుడు కస్టడీలో ఉన్నాడనేది.. రెండో కేసులో అతని ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సెషన్స్ కోర్టు, హైకోర్టులు నిర్ణయం తీసుకోవడానికి అడ్డంకి కాదని స్పష్టం చేసింది. కస్టడీలో ఉన్నంతమాత్రాన మరో కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని చట్టంలో ఎక్కడా లేదని చీఫ్ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ‘అరెస్టు చేస్తారనే భయమున్నపుడు ముందస్తు బెయిల్‌ను కోరే హక్కును సీఆర్పీసీ సెక్షన్ 438 కలి్పంచింది. ప్రజాస్వామ్యదేశంలో వ్యక్తి స్వేచ్ఛ, స్వాతంత్య్రం ప్రాధాన్యతను గుర్తించడానికే ఈ సెక్షన్ ఉంది. 438 సెక్షన్‌కు ఆంక్షలను పెట్టకూడదు. అలాచేస్తే అది ఈ సెక్షన్ సారాంశానికి, చట్టం ఉద్దేశానికి వ్యతిరేకమే అవుతుంది’ అని పేర్కొంది. వివిధ హైకోర్టులు ఈ అంశంలో భిన్న వైఖరులు తీసుకోవడంతో సర్వోన్నత న్యాయస్థానం సోమవారం స్పష్టతనిచి్చంది. జైళ్లో ఉన్న నిందితుడు మరోకేసులో ముందస్తు బెయిల్‌ను కోరలేడని రాజస్తాన్, ఢిల్లీ, అలహాబాద్ హైకోర్టులు తీర్పులిచ్చాయి. బాంబే, ఒడిశా హైకోర్టులు ముందస్తు బెయిల్ కోరవచ్చని అభిప్రాయపడ్డాయి. ‘నిందితుడికి ముందస్తు బెయిల్ కోరే చట్టబద్ధమైన హక్కుని నిరాకరించడం తగదు. మొదటి కేసులో కస్టడీ నుంచి విడుదలయ్యే దాకా మరో కేసులో ముందస్తు బెయిల్ కోరలేరనడంలో అర్థం లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
సహజీవనానికి సాక్ష్యంగా... కోర్టుకు ‘ఎంవోయూ’ సమర్పించాడు!
ముంబై: పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ముంబైకి చెందిన వ్యక్తిపై ఓ 30 ఏళ్ల మహిళ కేసు పెట్టింది. నిందితుడు మాత్రం తాము పరస్పర అంగీకారం మేరకే సహజీవనం చేశామని వాదించాడు. ‘‘ఆ మేరకు మేం ఒప్పందం కూడా చేసుకున్నాం. దాని ప్రకారం ఈ కేసు చెల్లదు’’అంటూ రుజువుగా సదరు అవగాహన ఒప్పందాన్నే (ఎంవోయూ) కోర్టుకు సమర్పించాడు. దాంతో వారు పరస్పర అంగీకారంతోనే కలిసి బతికారని కోర్టు తేల్చింది. అతనికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది! ముంబైకి చెందిన వీరిద్దరూ 2023 అక్టోబర్ 6న కలిశారు. 2024 ఆగస్టు 1 నుంచి 2025 జూన్ 30 దాకా 11 నెలల పాటు సహజీవనం కోసం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) రాసుకున్నారు. అప్పటికే విడాకులు తీసుకున్న ఆమెను పెళ్లి చేసుకుంటానని అతను చెప్పాడు. కానీ అతనికి మరో మహిళతో సంబంధమున్నట్టు కలిసి బతకడం మొ దలుపెట్టాక ఆమె గుర్తించింది. దాంతో, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఫిర్యాదు చేసింది. ‘‘నేను గర్భవతినయ్యా. అబార్షన్ మాత్రలు వేసుకోమంటూ బలవంతం చేశాడు. అతనికి అప్పటికే పెళ్లయిందని తర్వాత తెలిసింది. ఇదేమిటని నిలదీస్తే అశ్లీల వీడియోలతో బ్లాక్మెయిల్ చేశాడు. తనతో సంబంధం కొనసాగించాలంటూ పట్టుబట్టాడు. నేను లొకేషన్లు మారినా వేధిస్తున్నాడు. నా కొడుకును తీసుకెళ్తానని బెదిరించాడు’’అని ఆరోపించింది. అత్యాచార ఆరోపణలు నిరాధారమని నిందితుడు వాదించాడు. తమ అగ్రిమెంట్‌ను రుజువుగా సమర్పించాడు. దానిపై తాను సంతకం చేయలేదని సదరు మహిళ వాదించింది. ఒప్పంద పత్రం ప్రామాణికతను నిర్ధారించే ఆధారాల్లేవన్న జడ్జి శయనా పాటిల్, ‘ఇది పరస్పర అంగీకారంతో మొదలై చివరికి వికటించిన సంబంధంగా కనిస్తోంది’అని అభిప్రాయపడ్డారు. కస్టడీ విచారణ అవసరం లేదని తేల్చారు. వైరలవుతున్న ఒప్పందం వారి ఒప్పంద పత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అందులో పలు నిబంధనలున్నాయి. ‘ఏడాది పాటు అతనింట్లో కలిసుండాలి. ఆ సమయంలో పరస్పరం లైంగిక వేధింపుల కేసులు పెట్టుకోకూడదు. ఎవరికి నచ్చకపోయినా నెల ముందు నోటీసిచ్చి విడిపోవచ్చు’అని రాసుకున్నారు! -
Supreme Court: కులం పేరిట వేధిస్తేనే... ఎస్సీ, ఎస్టీ కేసు
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ వేధింపుల (నిరోధక) చట్టం వర్తింపు విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ప్రత్యేకించి కులం పేరిట వేధించినప్పుడు మాత్రమే ఆ చట్టం వర్తిస్తుంది. అంతే తప్ప కేవలం బాధితులు ఆ సామాజికవర్గాలకు చెందినంత మాత్రాన వర్తించబోదు‘ అని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద అభియోగాలు ఎదుర్కొంటున్న షాజన్ స్కారియా అనే యూట్యూబర్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కేరళకు చెందిన ఎమ్మెల్యే పీవీ శ్రీనిజన్ ఆయనపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద క్రిమినల్ కేసు పెట్టారు. మరుణదాన్ మలయాళీ అనే యూట్యూబ్ చానల్ నడుపుతున్న షాజన్ అందులో పెట్టిన ఒక వీడియోలో తనను ఉద్దేశపూర్వకంగా అవమానించారని ఆరోపించారు. షాజన్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కేరళ హైకోర్టు తిరస్కరించింది. దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన ధర్మాసనం, ‘బెదిరింపులకు, లేదా అవమానాలకు గురైన వ్యక్తి కేవలం ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గానికి చెందినంత మాత్రాన సదరు నేరానికి ఎస్సీ, ఎస్టీ వేధింపుల (నిరోధక) చట్టం సెక్షన్ 3(1)(ఆర్) వర్తించబోదు. కులం పేరిట అవమానించినప్పుడు, వేధించినపుడు మాత్రమే వర్తిస్తుంది. సదరు చట్టంలో పేర్కొన్న మేరకు అంటరానితనం వంటి దురాచారాన్ని పాటించినప్పుడు, అగ్ర కులస్తులు మైల, పవిత్రత అంటూ నిమ్నవర్ణాల వారిపట్ల కులం పేరిట దురహంకారపూరితంగా ప్రవర్తించినప్పుడు ఈ సెక్షన్ వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీలను కులం పేరిట వేధించకుండా చూసేందుకే కఠినమైన సెక్షన్లు చేర్చారు. కనుక ఈ చట్టం వర్తింపులో నిందితుని ఉద్దేశం చాల ముఖ్యం‘ అని స్పష్టం చేసింది. ‘షాజన్ కేసులో అదేమీ కని్పంచడం లేదు. సదరు వీడియో ద్వారా ఎస్సీ, ఎస్టీల పట్ల ఉద్దేశపూర్వకంగా ద్వేషం, శతృత్వ భావం, దురుద్దేశాల వంటివి వెళ్లగక్కినట్టు ఎక్కడా రుజువు కాలేదు. ఎమ్మెల్యేను కేవలం వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకున్నారు‘ అని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసులో ప్రాథమికంగా అభియోగాలు నిర్ధారణ అయితే తప్ప ముందస్తు బెయిల్‌ను తిరస్కరించలేమని స్పష్టం చేసింది. -
Supreme Court of India: ఇవేం బెయిల్ షరతులు!
న్యూఢిల్లీ: వైవాహిక విభేదాల కేసుల్లో ముందస్తు బెయిల్ షరతుల విషయంలో కోర్టులు అసాధ్యమైన షరతులు విధిస్తున్నాయంటూ సుప్రీంకోర్టు ఆవేదన వెలిబుచ్చింది. వరకట్న నిషేధ తదితర చట్టాల కింద ఆరోపణలెదుర్కొంటున్న ఓ వ్యక్తికి పట్నా హైకోర్టు విధించిన ముందస్తు బెయిల్ షరతులపై ధర్మాసనం శుక్రవారం విస్మయం వెలిబుచ్చింది. దంపతులు కలిసుండేందుకు ఒప్పుకోవడంతో దిగువ కోర్టు వారిని ఉమ్మడి అఫిడవిట్ వేయాలని ఆదేశించింది. విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకునే షరతుపై పిటిషనర్‌కు బెయిలిచ్చేందుకు అంగీకరించింది. అయితే, ‘గౌరవప్రదమైన జీవనం సాగించేందుకు, ఆమె శారీరక, ఆర్థిక అవసరాలన్నిటినీ తీర్చుతానని హామీ ఇవ్వండి’ అని షరతు పెట్టింది. దీన్ని సవాల్ చేస్తూ పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ షరతును తొలగిస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి ఆచరణ సాధ్యం కాని షరతులను ఇవ్వొద్దని కోర్టులకు సూచించింది. గౌరవంగా జీవించే హక్కును గుర్తించాలని, విచారణ న్యాయబద్ధంగా సాగేలా చూడాలని కోరింది. -
పూజా ఖేద్కర్‌కు మరో ఎదురు దెబ్బ
ఢిల్లీ : సివిల్ సర్వీస్ పరీక్షల్లో గట్టెక్కేందుకు నకిలీ పత్రాలు సృష్టించిన కేసులో మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆమె ముందుస్తు బెయిల్ పిటిషన్‌ను గురువారం ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. నకిలీ పత్రాల కేసులో ఖేద్కర్ తరుఫు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా.. తనని (ఖేద్కర్) ఓ అధికారి లైంగికంగా వేధించారని, ఆయనపై ఫిర్యాదు చేసినందుకు తనని టార్గెట్ చేసినట్లు పేర్కొన్నారు. తానెలాంటి తప్పు చేయలేదని నిరూపించుకునేందుకు ముందస్తు బెయిల్‌ను కోరుతున్నారని పేర్కొన్నారు. అనంతరం ఖేద్కర్ వ్యవస్థను మోసం చేశారని కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అనంతరం ఆమె ముందుస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. మహారాష్ట్రకు చెందిన ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ ఎంపికను యూపీఎస్సీ రద్దు చేసింది. భవిష్యత్తులో సివిల్స్ పరీక్షల్లో పాల్గొనకుండా ఆమెపై జీవితకాల నిషేధం విధించింది. పరీక్ష నిబంధనల్ని అతిక్రమిస్తూ నకిలీ ధ్రువపత్రాలతో పరీక్షను రాసినట్టు గుర్తించిన యూపీఎస్సీ ఈ మేరకు ఆమెపై చర్యలు చేపట్టింది. ఈ తరుణంలో ఆమె ఢిల్లీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. #Justin: Delhi's Patiala House Court denying bail to #IAS Puja Khedkar says she's able to breach the wall of #UPSC not only once but repeatedly with deceitful means.It also says that she snatched rights of other eligible aspirants with disability benchmark quota@CNNnews18 pic.twitter.com/YCR2bfzoPr— Ananya Bhatnagar (@anany_b) August 1, 2024పలు సెక్షన్ల కింద కేసులు నమోదు ఖేద్కర్‌పై ఢిల్లీ పోలీసులకు యూపీఎస్సీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఐటీ యాక్ట్, డిసెబిలిటీ యాక్ట్ కింద ఫోర్జరీ,చీటింగ్ కేసుల్ని నమోదు చేశారు. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం ఖేద్కర్ ఢిల్లీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆమె బెయిల్ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాత్సవ ఈ కేసులో దర్యాప్తు "చాలా ప్రారంభ దశలో ఉంది" అని వాదించారు. కేసు తదుపరి విచారణ కోసం ఆమెను కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరమని వాదించారు.పూజా ఖేద్కర్ లాంటి వారి పట్ల కఠినంగా వ్యహరించాలి" వాదన సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఖేద్కర్ గురించి ప్రస్తావిస్తూ.. వ్యవస్థల్ని మోసం చేసే ఇలాంటి వ్యక్తుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాలి. ఇప్పటికే చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేశారు. ఇంకా దుర్వినియోగం చేసే అవకాశాలు ఇంకా ఉన్నాయి " అని అన్నారు. -
పిన్నెల్లి వ్యాజ్యాలపై తీర్పు రిజర్వ్
సాక్షి, అమరావతి : పోలీసులు నమోదు చేసిన మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాలపై వాదనలు ముగిశాయి. న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఈ వ్యాజ్యాల్లో తీర్పు వెలువరించే వరకు పొడిగిస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగఢ మల్లికార్జునరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈవీఎం ధ్వంసం కేసులో హైకోర్టు పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసిన వెంటనే పోలీసులు ఆయనపై రెండు హత్యాయత్నం కేసులతో సహా మూడు కేసులు నమోదు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో పిన్నెల్లి పాల్గొనకుండా పెట్టిన ఈ తప్పుడు కేసులపై పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు.. కౌంటింగ్‌లో పాల్గొనేందుకు పిన్నెల్లికి ఈ నెల 6వ తేదీ వరకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తరువాత ఈ ఉత్తర్వులను పొడిగిస్తూ వచ్చింది. గురువారం ఈ వ్యాజ్యాలు మరోసారి విచారణకు వచ్చాయి.పోలీసులు కోర్టును తప్పుదోవ పట్టించారు.. తీవ్రంగా పరిగణించండిఈ సందర్భంగా పిన్నెల్లి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఎన్నికల సంఘం, పోలీసుల తీరును ఎండగట్టారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి తీరాలన్న లక్ష్యంతో ఎన్నికల కమిషన్ అసాధారణ రీతిలో ఉత్తర్వులిచ్చిందని, గతంలో ఎన్నడూ కమిషన్ ఇలా వ్యవహరించలేదని అన్నారు. పోలీసులు పరిధి దాటి వ్యవహరించారన్నారు. తప్పుడు వివరాలతో కోర్టును సైతం తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఈవీఎం కేసులో పిన్నెల్లికి హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వనున్నట్లు సంకేతాలు రావడంతో ఆ వెంటనే హత్యాయత్నం కేసులు బనాయించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారన్నారు. గత నెల 22న హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వగా, 23న ఇతర కేసుల్లో పిన్నెల్లిని నిందితునిగా చేర్చారని తెలిపారు. హైకోర్టుకు మాత్రం 22నే చేసినట్లు చెప్పారని, తరువాత ఇది అబద్ధమని తేలడంతో 23నే నిందితునిగా చేర్చినట్లు పోలీసులు అంగీకరించక తప్పలేదన్నారు. ఇదే విషయాన్ని హైకోర్టు సైతం తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొందని తెలిపారు. పోలీసుల తీరును తీవ్రంగా పరిగణించాలన్నారు. హత్యాయత్నం చేశారని చెప్పినంత మాత్రాన ఆ సెక్షన్ కింద కేసు నమోదుకు వీల్లేదని, అందుకు నిర్దిష్ట విధానం ఉందని వివరించారు. సహ నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పిన్నెల్లిపై పెట్టిన మరో కేసు చెల్లదని చెప్పారు.నేర చరిత్రను పరిగణనలోకి తీసుకోండిపోలీసుల తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ వాదనలు వినిపిస్తూ.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసం కేసు నమోదు చేశామని తెలిపారు. 2019లో కూడా ఇదే తరహా కేసు నమోదైందన్నారు. మధ్యంతర ముందుస్తు బెయిల్ షరతులను పిన్నెల్లి ఉల్లంఘించారని, సాక్షులను బెదిరించారని తెలిపారు. పిన్నెల్లి, అతని అనుచరుల దాడిలో కారెంపూడి సీఐ నారాయణస్వామి తీవ్రంగా గాయపడ్డారన్నారు. పిటిషనర్ నేర చరిత్రను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. బాధితుల తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ, ఈవీఎం ధ్వంసాన్ని అడ్డుకునేందుకు వచ్చిన శేషగిరిరావు, ప్రశ్నించిన మరో మహిళపై పిన్నెల్లి, అతని అనుచరులు దాడికి పాల్పడ్డారన్నారు.అశ్వనీ కుమార్ నియామకం చట్ట విరుద్ధంఅనంతరం పిన్నెల్లి న్యాయవాది నిరంజన్‌రెడ్డి పోలీసుల తరఫున అశ్వనీ కుమార్ హాజరు కావడంపై అభ్యంతరం తెలిపారు. ఆయన నియామకం సీఆర్పీసీ నిబంధనలకు అనుగుణంగా జరగలేదన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేదా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకం గురించే నిబంధనల్లో ఉంది తప్ప, స్పెషల్ కౌన్సిల్ గురించి లేదన్నారు. తప్పును సరిచేసుకుని చట్ట ప్రకారం ఆయన్ను నియమించుకుంటే అభ్యంతరం లేదన్నారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. -
కర్ణాటక హైకోర్టులో ప్రజ్వల్ తల్లి భవానికి ముందస్తు బెయిల్
బెంగళూరు: లైంగిక వేధింపు కేసులో నిందితుడు ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీ రేవణ్ణకు కర్ణాటక హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న ఆర్కే.నగర్‌కు చెందిన బాధితురాలి కిడ్నాప్ కేసులో మంగళవారం హైకోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చింది. భవానీ రేవణ్ణ ఇప్పటికే సిట్ అడిగిన 85 ప్రశ్నలకు సమాధానమిచ్చారని కోర్టు తెలిపింది. ఆమె విచారణకు సహకరించడం లేదని సిట్ చెప్పడం సరికాదని కోర్టు పేర్కొంది.Karnataka High Court grants anticipatory bail to Bhavani Revanna, mother of suspended JD(S) leader Prajwal Revanna. The bail has been granted to her on the condition that she is not allowed to enter Mysuru and Hassan. Court says that when she has already answered 85 questions…— ANI (@ANI) June 18, 2024 తన ఇంట్లో పనిచేసే ఆర్కే నగర్‌కు చెందిన మహిళ కిడ్నాప్ కేసులో భవానీ రేవణ్ణ నిందితురాలు. ఆ మహిళ ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడి కేసులో కర్ణాటక ప్రభుత్వం విచారణ కోసం సిట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మే 31న జర్మనీ నుంచి వచ్చిన ప్రజ్వల్‌ను సిట్ అధికారులు బెంగళూరు ఎయిర్‌పోర్టులోనే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ప్రజ్వల్‌పై సిట్ విచారణ కొనసాగుతోంది. -
ముందస్తు బెయిల్ ఇవ్వండి: కోర్టుకు ప్రజ్వల్ రేవణ్ణ
బెంగళూరు: మహిళలపై లైంగిక దౌర్జన్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ బెంగళూరు ప్రజాప్రతినిధుల కోర్టులో బుధవారం(మే29) ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. ప్రజ్వల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై కోర్టు పోలీసులకు నోటీసులు జారీ చేసింది. గురువారమే బెయిల్ పిటిషన్‌పై విచారణ జరపాల్సిందిగా ప్రజ్వల్ తరపు న్యాయవాది కోరగా కౌంటర్ దాఖలు చేయడానికి సిట్ సమయం కోరింది. దీంతో జడ్జి సంతోష్ గజానన్ విచారణను మే 31కి వాయిదా వేశారు. లైంగిక దౌర్జన్యం వీడియోలు వెలుగు చూసిన తర్వాత ఏప్రిల్‌లో ప్రజ్వల్ విదేశాలకు పారిపోయారు. ప్రస్తుతం జర్మనీలో ఉన్న ప్రజ్వల్ మే31న భారత్ వస్తానని ఇప్పటికే ఒక వీడియో సందేశం విడుదల చేశారు. తాజాగా కోర్టు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను 31కే వాయిదా వేయడంతో ఆయన ఆరోజు వస్తారా మళ్లీ ఏదైనా తేదీ ప్రకటిస్తారా అనేదానిపై సందిగ్ధత నెలకొంది.ప్రజ్వల్ ఎన్డీఏ కూటమి తరపున జేడీఎస్ పార్టీ నుంచి హసన్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. రెండో విడత లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 26న కర్ణాటకలో పోలింగ్ ముగిసింది. -
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
సాక్షి, అమరావతి: పచ్చ బ్యాచ్, పోలీసులకు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఓట్ల కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనకుండా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అడ్డుకునేందుకు వారు పన్నిన కుట్రలను పటాపంచలు చేసింది. రామకృష్ణారెడ్డికి మధ్యంతర ముందస్తు బెయిల్ రాకుండా చేసేందుకు తెలుగుదేశం పార్టీ, పోలీసులు కుమ్మక్కయినా కూడా ప్రయోజనం లేకపోయింది. రికార్డులను తారుమారు చేసి, బాధితులను ముందు పెట్టి పిన్నెల్లి ముందస్తు బెయిల్‌ను అడ్డుకునేందుకు పన్నిన కుట్రలు విఫలమయ్యాయి. రామకృష్ణారెడ్డిపై పోలీసులు నమోదు చేసిన మూడు కేసుల్లో హైకోర్టు ఆయనకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అరెస్ట్‌తో సహా పిన్నెల్లిపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఈ నెల 6వ తేదీ వరకు ఈ బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. జేసీ అస్మిత్‌రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, చింతమనేని ప్రభాకర్, పరిమి సోమశేఖర్ నాయుడు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తరహాలోనే పిన్నెల్లికి కూడా బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్‌కు పలు షరతులు విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసుల చర్య చాలా తీవ్రమైనదిఈ మూడు కేసుల్లో పోలీసుల తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. మిగిలిన నిందితులను 16వ తేదీనే అరెస్ట్ చేసినప్పటికీ, వారిని 23వ తేదీన నిందితులుగా చేర్చినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో చెప్పడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఇది చాలా తీవ్రమైన విషయమని స్పష్టం చేసింది. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే ఇలా చేయడం డీకే బసు కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని తేల్చి చెప్పింది. పిన్నెల్లిని 22వ తేదీనే నిందితునిగా చేర్చారని పోలీసులు చెప్పిన విషయాన్ని, కింది కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో 23వ తేదీ రాత్రి 8 గంటలకు నిందితునిగా చేర్చినట్లు పేర్కొనడాన్ని హైకోర్టు తన ఉత్తర్వుల్లో ప్రముఖంగా ప్రస్తావించింది. దీనిపై తుది విచారణ సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరింత వివరణనివ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.మధ్యంతర ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు...ఈవీఎం కేసులో హైకోర్టు ఈ నెల 23న పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసిన వెంటనే పోలీసులు ఆయనపై రెండు హత్యాయత్నం కేసులతో సహా మూడు కేసులు నమోదు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనాల్సి ఉన్నందున మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ రామకృష్ణారెడ్డి హైకోర్టులో వేర్వేరుగా మూడు అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేశారు. పిన్నెల్లి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి, న్యాయవాది ఎస్.రామలక్ష్మణరెడ్డి వాదనలు వినిపించారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన జస్టిస్ జ్యోతిర్మయి ఆ మూడు అనుబంధ వ్యాజ్యాలను అనుమతిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఇవీ షరతులు..పిన్నెల్లిపై నిఘా ఉంచేలా పోలీసులను ఆదేశించాలని ఎన్నికల సంఘానికి హైకోర్టు స్పష్టం చేసింది. ఎలాంటి నేరపూరిత చర్యల్లో పాల్గొనకూడదని, పునరావృతం చేయరాదని పిన్నెల్లిని ఆదేశించింది. జిల్లాలో శాంతిభద్రతల సమస్య సృష్టించకూడదని చెప్పింది. ప్రజాశాంతికి, సాక్షుల రక్షణకు ఎలాంటి విఘాతం కలగకుండా చూడాలని, అనుచరులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా చూడాలని పిన్నెల్లిని ఆదేశించింది. అనుచరుల బాధ్యత రామకృష్ణారెడ్డిదేనని స్పష్టం చేసింది. ఈ కేసు గురించి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడవద్దని ఆదేశించింది. సాక్షులు, బాధితులతో సంభాషించవద్దని, వారిని బెదిరించడం వంటివి చేయరాదని తెలిపింది. పార్లమెంటరీ నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో మాత్రమే ఉండాలని, ఒకవేళ కౌంటింగ్ కేంద్రం మరో చోట ఉంటే లెక్కింపు రోజున ఆ కేంద్రానికి వెళ్లొచ్చునని తెలిపింది. ప్రతి రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 లోపు పల్నాడు ఎస్పీ ముందు హాజరు కావాలని పిన్నెల్లిని ఆదేశించింది. నర్సరావుపేటలో తాను ఎక్కడ ఉంటున్నదీ, తన మొబైల్ నంబరు వివరాలను పోలీసులకు తెలియచేయాలని ఆదేశించింది. స్థానిక కోర్టుల్లో పాస్‌పోర్ట్ జమ చేయాలని, కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడానికి వీల్లేదని ఆదేశించింది. బాధితులకు తగిన రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది. అయితే, ఓ షరతును కొద్దిగా సవరించాలని పిన్నెల్లి తరఫు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి అభ్యర్థించారు. కౌంటింగ్ రోజున ఎస్పీ ముందు హాజరయ్యేంత సమయం ఉండదని, అందువల్ల ఆ రోజున రిటర్నింగ్ అధికారి ముందు హాజరవుతారని తెలిపారు. ఇందుకు న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి సమ్మతించి ఆ మేరకు ఆ షరతును సవరించారు. ప్రజా ప్రతినిధులు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ చర్యల విషయంలో చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తన ఉత్తర్వుల్లో న్యాయమూర్తి స్పష్టం చేశారు. ‘న్యాయ చక్రాలు నెమ్మదిగా కదిలినప్పటికీ, అవి గొప్పగా కదులుతాయి,’ అంటూ ఓ తీర్పులో సుప్రీంకోర్టు చెప్పిన కొటేషన్‌తో న్యాయమూర్తి తన ఉత్తర్వులను ముగించారు. -
పెద్ద రెడ్డి కి హైకోర్టులో ఊరట
-
ముందస్తు బెయిల్ లేకుండా విదేశాలకు చంద్రబాబు
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో జరిగిన పలు కుంభకోణాల్లో ప్రధాన నిందితుడుగా ఉన్న మాజీ సీఎం చంద్రబాబు గుట్టుచప్పుడు కాకుండా అమెరికా వెళ్లడం కలకలం రేపుతోంది. ఒకవైపు చంద్రబాబుపై సీఐడీ జారీ చేసిన లుక్ అవుట్ నోటీసు అమలులో ఉండగా మరోవైపు ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లు సుప్రీంకోర్టులో ఇంకా విచారణలోనే ఉన్నాయి. దీంతో హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు చంద్రబాబును శనివారం తెల్లవారుజామున కొద్దిసేపు నిలువరించారు. చంద్రబాబు దేశం విడిచి వెళ్లకూడదని సీఐడీ గతేడాది లుక్ అవుట్ నోటీసు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. విదేశీ ప్రయాణానికి కోర్టు అనుమతి ఉందా? అని ప్రశ్నించడంతో చంద్రబాబు కంగు తిన్నారు. తటపటాయిస్తూ సుదీర్ఘ వివరణ ఇచ్చిన తరువాత ఇమిగ్రేషన్ అధికారులు పలు దఫాలు సీఐడీ అధికారులతో చర్చించారు. అనంతరం ఎట్టకేలకు అనుమతించారు. పార్టీ ఖాతాల్లోకి అవినీతి నిధులు..టీడీపీ హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌తోపాటు ఫైబర్ నెట్, అసైన్డ్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణాల్లో చంద్రబాబును ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ సీఐడీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ ఆయన్ని అరెస్ట్ చేయగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనంతరం బెయిల్‌పై విడుదల అయ్యారు. కాగా ఫైబర్ నెట్ కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించడంతో చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ సీఐడీ వాదనలు వినిపించింది. కుంభకోణాల ద్వారా కొల్లగొట్టిన నిధులను టీడీపీ బ్యాంకు ఖాతాలకు తరలించిన విషయాన్ని న్యాయస్థానానికి నివేదించింది. దీనిపై చంద్రబాబును కస్టడీకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. షరతులు బేఖాతర్!స్కిల్ స్కామ్ కేసులో నిందితులైన చంద్రబాబు, ఆయన మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, కిలారు రాజేష్‌పై సీఐడీ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. సీఐడీ అదనపు డీజీ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని అందులో స్పష్టం చేసింది. అయితే సీఐడీ ముందస్తు అనుమతి లేకుండానే చంద్రబాబు అమెరికా వెళ్లేందుకు సిద్ధపడ్డారు. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ న్యాయస్థానంలో విచారణలో ఉంది. దీంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో చంద్రబాబు న్యాయవాదులు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో సీఐడీ అధికారులతో చర్చించారు. స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ నెట్, అసైన్డ్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణాల్లో చంద్రబాబును ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఇప్పటికే న్యాయస్థానంలో చార్జ్షీట్లు దాఖలు చేసిన విషయాన్ని సీఐడీ అధికారులు ఇమిగ్రేషన్ అధికారులకు తెలియచేశారు. సీఐడీకి సమాచారం ఇచ్చిన తరువాతే విదేశాలకు వెళ్లాలని చెప్పారు. చార్జ్షీట్లను పరిగణలోకి తీసుకున్న తరువాత న్యాయస్థానం విధించే షరతులను పాటించాలన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతానికి అమెరికా వెళ్లేందుకు సమ్మతించారు. సీఐడీ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని మరోసారి చంద్రబాబుకు నోటీసులు జారీ చేస్తామని సీఐడీ అధికారులు పేర్కొన్నారు. న్యాయస్థానం విధించే షరతులు, ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి ఉండాలన్నారు. అనంతరం ఇమ్మిగ్రేషన్ అధికారులు అనుమతించడంతో చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో కలసి దుబాయి మీదుగా అమెరికా వెళ్లారు.చికిత్స కోసం అంటున్న టీడీపీ వర్గాలుచంద్రబాబు తన విదేశీ పర్యటన గురించి చివరి వరకు ఎవరికీ తెలియనివ్వలేదు. కొద్ది రోజుల పాటు దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించిన ఆయన అమెరికా పర్యటన విషయంలో మాత్రం గోప్యత పాటించారు. వైద్య పరీక్షల కోసమే ఆయన అమెరికా వెళ్లినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. గతంలోనూ చంద్రబాబు చికిత్స కోసం అమెరికా వెళ్లారు. వారం తర్వాత ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని పార్టీ నాయకులు తెలిపారు. మరోవైపు నారా లోకేష్ కూడా నాలుగు రోజుల క్రితం చడీ చప్పుడు లేకుండా అమెరికా వెళ్లినట్లు సమాచారం. -
నేడు సుప్రీం కోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ
-
సీఐడీ అధికారుల ఎదుట లొంగిపోయిన చంద్రబాబు
సాక్షి, అమరావతి/ నగరంపాలెం: టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్మెంట్లో అక్రమాలు, మద్యం కొనుగోళ్లలో అక్రమాలు, ఉచిత ఇసుక దోపిడీ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న నారా చంద్రబాబునాయుడు సీఐడీ అధికారుల ఎదుట శనివారం లొంగిపోయారు. ఆ కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పూచీ కత్తులు సమ ర్పించారు. ఈ మూడు కేసుల్లో హైకోర్టు చంద్రబాబుకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుల్లో దర్యాప్తు అధికారుల ఎదుట లొంగిపోయి ఒక్కో కేసులో ఇద్దరు పూచీకత్తుతో పాటు రూ.లక్ష చొప్పున ష్యూరిటీ బాండ్లు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. విచారణ కోసం దర్యాప్తు అధికారి పిలిచినప్పుడు హాజరుకావాలని కూడా పేర్కొంది. ఆ మేరకు హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్న బాబు పార్టీ నేతలతో కలసి ముందుగా విజయవాడ తులసీనగర్‌లోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లారు. ఇసుక కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ కోసం పూచీకత్తులు సమ ర్పించారు. అనంతరం తాడేç³ల్లిలోని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కార్యాలయానికి వెళ్లారు. ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్మెంట్లో అక్రమాల కేసులో ముందస్తు బెయిల్‌కు అవసరమైన పూచీకత్తులు సమ ర్పించారు. చివరిగా గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి చేరుకున్న బాబు మద్యం కుంభకోణం కేసులో పూచీకత్తులు సమర్పించారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ నేత కొల్లు రవీంద్ర, అప్పటి ఎక్సైజ్ శాఖ కమిషనర్ శ్రీనరేష్ కూడా ముందస్తు బెయిల్‌కోసం పూచీకత్తులు సమర్పించారు. స్పందించని కేడర్ బాబు రాకను పురస్కరించుకుని అందరూ సీఐడీ కార్యాలయానికి రావాలని తెలుగుదేశం గ్రూపుల్లో నిన్నటి నుంచి మెస్సేజులు పెట్టినా కేడర్ స్పందించలేదు. చంద్రబాబు కారుని సీఐడీ కార్యాలయంలోకి అనుమతించగా, కొంతమంది తెలుగు తమ్ముళ్లు ఆకారుతో లోనికి వెళ్లేందుకు పోటీపడ్డారు. అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లను నెట్టేశారు. యువత అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కొద్దిసేపు గలాటా స్పష్టించారు. చంద్రబాబు రాకను కవర్ చేసేందుకు వచ్చిన సాక్షి మీడియాపై టీడీపీ నేతలు దుర్బాషలాడుతూ.. అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ గొడవ చేశారు. బాబుకు నిరసన సెగ కంకిపాడు: పెనమలూరు సీటు సెగ టీడీపీ అధినేత చంద్రబాబుకే నేరుగా తగిలింది. టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం కృష్ణాజిల్లా తాడిగడపలోని సీఐడీ కార్యాలయానికి వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో పెనమలూరు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బోడే ప్రసాద్ అనుచరులు నిరసనకు దిగారు. పెనమలూరు టికెట్ బోడే ప్రసాద్‌కే ఇవ్వాలని సీఐడీ కార్యాలయం వద్ద బారికేడ్లను తోసుకుంటూ వెళ్లి ప్రసాద్‌కు అనుకూలంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. -
షరతులతో చంద్రబాబుకు ముందస్తు బెయిల్
సాక్షి, అమరావతి: ఇన్నర్ రింగ్ భూ కుంభకోణం, ఉచిత ఇసుక, మద్యం విధానాల్లో అక్రమాలపై సీఐడీ నమోదు చేసిన కేసుల్లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అలాగే మద్యం కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఎక్సైజ్ శాఖ అప్పటి కమిషనర్ శ్రీ నరేష్ లకు కూడా ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఈ సందర్భంగా హైకోర్టు పలు షరతులు విధించింది. ఇప్పటి నుంచి వారంలోపు దర్యాప్తు అధికారి ముందు లొంగిపోవాలని చంద్రబాబు, రవీంద్ర, శ్రీ నరేష్‌లను హైకోర్టు ఆదేశించింది. రూ. లక్షకు రెండు వ్యక్తిగత పూచీకత్తులు సమర్పించాలంది. ముందస్తు బెయిల్‌పై విడుదలైన తరువాత ఎప్పుడు పిలిస్తే అప్పుడు దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని చంద్రబాబు తదితరులను ఆదేశించింది. అయితే 48 గంటల ముందు నోటీసు ఇవ్వాలని దర్యాప్తు అధికారికి స్పష్టం చేసింది. దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది. ఈ కేసుల గురించి తెలిసిన వ్యక్తిని.. ఆ కేసుల వాస్తవాలను కోర్టుకు గానీ, పోలీసులకు గానీ చెప్పకుండా బెదిరించడం గానీ, ప్రలోభపెట్టడం గానీ, వాగ్దానాలు చేయడం గానీ ఎంత మాత్రం చేయడానికి వీల్లేదంది. ఈ కేసులకు సంబంధించి ఎలాంటి బహిరంగ ప్రకటనలు చేయడానికి వీల్లేదని బాబు తదితరులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు బుధవారం తీర్పులు వెలువరించారు. కేసు పూర్వాపరాల్లోకి వెళ్లడంలేదు.. తాను వెలువరించిన ఈ తీర్పులు కేసు పూర్వాపరాల్లోకి వెళ్లి ఇవ్వడం లేదని, ఇందులో వ్యక్తం చేసిన అభిప్రాయాలు కేవలం ప్రాథమికమైనవేనని, కేవలం ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ల విచారణకే ఈ అభిప్రాయాలు పరిమితమని న్యాయమూర్తి తన తీర్పుల్లో పేర్కొన్నారు. ఈ తీర్పుల్లో వ్యక్తం చేసిన అభిప్రాయాలకు ప్రభావితం కాకుండా దర్యాప్తును కొనసాగించుకునే స్వేచ్ఛ దర్యాప్తు సంస్థకు ఉందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ ఇటీవల కొన్ని మీడియా చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా, సాక్షులను బెదిరించేలా మాట్లాడారని, ఈ విషయాన్ని ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పునిచ్చే సమయంలో పరిగణనలోకి తీసుకోవాలన్న సీఐడీ మెమోపై కూడా న్యాయమూర్తి తన తీర్పులో చర్చించారు. లోకేశ్ ఇంటర్వ్యూ ఆధారంగా బాబు ముందస్తు బెయిల్‌ను నిర్ణయించజాలమని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. గతంలో పూర్తయిన వాదనలు కావాల్సిన వారి కోసం ఐఆర్ఆర్ అలైన్మెంట్లో మార్పులతో పాటు క్విడ్ ప్రో కోకు పాల్పడినందుకు సీఐడీ కేసు నమోదు చేసి అప్పటి సీఎం చంద్రబాబు, అప్పటి మంత్రులు నారాయణ, లోకేశ్ తదితరులను నిందితులుగా చేర్చింది. అలాగే, ఉచిత ఇసుక పథకం పేరుతో కోట్లాది రూపాయలు ఖజానాకు నష్టం కలిగించినందుకు సీఐడీ పలువురిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక బాబు సీఎంగా ఉండగా తమ పార్టీకి చెందిన నేతల డిస్టిలరీలు, బార్లకు లబ్ధి చేకూర్చడం వల్ల ఖజానాకు రూ. 1,500 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ప్రాథమిక విచారణ జరిపిన సీఐడీ, అప్పటి ఎక్సైజ్ కమిషనర్ శ్రీనరేష్, అప్పటి ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, చంద్రబాబులపై కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ వారు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై వేర్వేరుగా న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు విచారణ జరిపారు. ఇటీవల ఈ వ్యాజ్యాలపై వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలన్నింటిపై బుధవారం మధ్యాహ్నం ఆయన తన తీర్పును వెలువరించారు. ఓటుకు కోట్లు కేసు విచారణ ఏప్రిల్‌కు వాయిదా సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసు విచారణ సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఓటుకు కోట్లు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పేరు చేర్చాలని, ఈ కేసును సీబీఐకు అప్పగించాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ బుధవారం జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ అరవిందకుమార్‌లతో కూడిన ధర్మాసనం ముందుకువచ్చింది. తెలంగాణ రాష్ట్రం తరఫు న్యాయవాది విచారణ వాయిదా వేయాలని లెటర్ సర్క్యులేట్ చేసిన కారణంగా విచారణ వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణ ఏప్రిల్ జాబితాలో చేర్చాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. -
బాబుకి ముందస్తు: ఆ మూడు కేసుల్లో జరిగింది ఇదే!
గుంటూరు, సాక్షి: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. అన్ని కేసుల్లో చంద్రబాబుకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉన్నత న్యాయస్థానం బుధవారం మధ్యాహ్నాం తీర్పు ఇచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులోనూ, ఇసుక కుంభకోణం, లిక్కర్ స్కాంకు సంబంధించి రాష్ట్ర నేర దర్యాప్తు సంస్థ(సీఐడీ) చంద్రబాబుపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. విచారణ నేపథ్యంలో తనను అరెస్ట్ చేయొచ్చంటూ.. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. IRR భలే మలుపు.. టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణమే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు. ఈ కేసులో కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే. లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్‌లో భూములు కట్టబెట్టారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మూడుసార్లు మార్పు చేశారు. అలైన్మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్‌ప్రోకో జరిపారు. 2015 జూలై 22, 2017 ఏప్రిల్ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్‌రింగ్ అలైన్మెంట్లో మార్పులు చేశారు. ఇన్నర్ రింగ్‌రోడ్డును ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు కట్టబెట్టారు. అలైన్‌మెంట్‌ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం చేకూరింది. ఇన్నర్‌రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలో అలైన్మెంట్ జరిగింది. కరకట్ట కట్టడం.. క్విడ్‌ప్రోకో కిందే చంద్రబాబుకు అప్పగించారు లింగమనేని. కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం జరిగింది. లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్‌దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏడేళ్లుగా నివాసంగా.. సీఎంగా, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు కొనసాగుతున్నారు. ఇసుకను అలా.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది ఇసుక కుంభకోణం. 2014లో రాష్ట్ర విభజనకు ముందు రీచ్‌ల వారీగా వేలం పాటలు నిర్వహించారు. చంద్రబాబు వచ్చాక పలు మార్పులు జరిపారు. తొలుత డ్వాక్రా మహిళా సంఘాలకు రీచ్‌లు అప్పగిస్తున్నామని ప్రకటించారు. మహిళా సంఘాల ముసుగులో ఇసుకపై పూర్తి నియంత్రణ టీడీపీ నేతలదే కొనసాగుతూ వచ్చింది. మంత్రివర్గ ఆమోదం లేకుండానే ఇసుకపై చంద్రబాబు నిర్ణయాలు తీసుకున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, పలుకుబడి ఉన్న టీడీపీ నేతల ఇష్టారాజ్యంగా సాగింది. చంద్రబాబు ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉన్న కృష్ణా నదిలో కూడా భారీ ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయి. ఏపీలో 2014-19 మధ్య జరిగిన ఇసుక అక్రమాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సీరియస్ అయ్యింది. చంద్రబాబు ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయల జరిమానా సైతం విధించింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఇప్పుడు టీడీపీకి మద్దతు ఇస్తున్న న్యాయవాది శ్రవణ్ కుమార్ ఆ రోజుల్లో టీడీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. కేవలం ఇసుకలోనే పదివేల కోట్ల దోపిడీ జరిగిందని ఎన్.జి.టి.కి ఫిర్యాదు చేశారు. APMDC ఫిర్యాదుతో కేసు నమోదు చేసింది నేర దర్యాప్తు సంస్థ సీఐడీ. ఈ ఇసుక అక్రమాల కేసులో ఏ2గా ఉన్నారు చంద్రబాబు. మద్యంనూ వదలని బాబు అండ్ కో ఇది కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగింది. ఇష్టానుసారంగా మద్యం కంపెనీలకు అనుమతి ఇచ్చారు చంద్రబాబు. ఆయన నిర్ణయాల వల్ల రాష్ట్ర ఖజనాకు రూ.1500 కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ సైతం తేల్చింది. టీడీపీ నేతల బార్లు, డిస్టిల్లరీలకు అనుకూలంగా చంద్రబాబు నిర్ణయాలు ఉండడం గమనార్హం. ఈ కేసులో ప్రాథమిక విచారణ జరిపిన సీఐడీ.. అప్పటి ఎక్సైజ్ కమిషనర్ శ్రీనరేష్, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, సీఎం చంద్రబాబుపై కేసు నమోదు చేసింది. ఈ మూడు కేసుల్లోనూ చంద్రబాబు తరపున సీనియర్ కౌన్సిలర్ సిద్ధార్ధ్ లూధ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు ఏపీ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలను విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నేడు ఈ కేసులన్నింటిలోనూ తీర్పు వెల్లడించింది. చంద్రబాబుతో పాటు మద్యం కేసులో నిందితుడిగా ఉన్న కొల్లు రవీంద్రకు కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. -
ముందస్తు బెయిల్ ఎలా పడితే అలా ఇవ్వడానికి వీల్లేదు
సాక్షి, అమరావతి: ఇన్నర్ రింగ్ రోడ్డు భూ కుంభకోణంపై సీఐడీ నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు వెలువరించాల్సిన వేళ హైకోర్టు అసలు ముందస్తు బెయిల్ ఎప్పుడు ఇవ్వాలన్న దానిపై కీలక తీర్పు వెలువరించింది. ముందస్తు బెయిల్ ఎలా పడితే అలా ఇవ్వడానికి వీల్లేదని స్పష్టం చేసింది. సీఆర్పీసీ సెక్షన్ 438 కింద ముందస్తు బెయిల్ విషయంలో హైకోర్టుకున్న అధికారం అసాధారణమైనదని తేల్చి చెప్పింది. ఈ అధికారాన్ని చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ‘ముందస్తు బెయిల్ మంజూరు అధికారాన్ని అసాధారణ కేసుల్లో మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ముందస్తు బెయిల్ మంజూరు చేయడం అన్నది కొంతవరకు దర్యాప్తు విషయంలో జోక్యం చేసుకోవడమే అవుతుంది. ముందస్తు బెయిల్ మంజూరు అధికారాన్ని ఉపయోగించే విషయంలో న్యాయస్థానాలు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. దర్యాప్తు దశలో ముందస్తు బెయిల్ మంజూరు చేయడం అంటే.. నిందితుడిని విచారించడం, అవసరమైన సాక్ష్యాలను సేకరించడం, దాచిపెట్టిన వాస్తవాలను వెలికి తీయడం వంటి విషయాల్లో దర్యాప్తు సంస్థకు ఆశాభంగం కలిగించడమే. ఇంటరాగేషన్ దశలో నిందితుడు, అనుమానిత వ్యక్తికి ముందస్తు బెయిల్ ద్వారా రక్షణ లభిస్తే, అతను దర్యాప్తు అధికారుల విచారణ నుంచి తప్పించుకోవడంలో విజయవంతమైనట్టే. ముందస్తు బెయిల్‌ను రొటీన్ విధానంలో మంజూరు చేయడానికి వీల్లేదన్నది ఇప్పటికే రూఢీ అయిన న్యాయ సూత్రం. ముందస్తు బెయిల్ వంటి అసాధారణ ప్రత్యామ్నాయాన్ని ఉపయోగించాల్సిన అసాధారణ పరిస్థితులు ఉన్నాయని సంతృప్తి చెందినప్పుడు మాత్రమే న్యాయస్థానాలు ఆ దిశగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది’ అని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. 65 ఏళ్ల వృద్ధుడికి ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ఇటీవల కీలక తీర్పు వెలువరించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇన్నర్ రింగ్ రోడ్డు పేరుతో భారీ భూ కుంభకోణానికి పాల్పడిన చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న హైకోర్టు ఎలా స్పందిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వచ్చే వారం నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. వరకట్న వేధింపుల కేసులో.. ఓ మహిళ ఫిర్యాదు మేరకు ఆమె భర్త చంద్రశేఖర్‌తోపాటు అతని తండ్రి రామయ్య (65), మరికొందరిపై నెల్లూరు దిశ పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రశేఖర్‌కు కింది కోర్టు ముందస్తు బెయిల్, అతని తండ్రి రామయ్యకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. కాగా.. బెయిల్‌పై విడుదలయ్యే సమయంలో చంద్రశేఖర్, అతని తండ్రి రామయ్య నకిలీ సాల్వెన్సీ సర్టిఫికెట్లు సమర్పించారంటూ చంద్రశేఖర్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రశేఖర్ బెయిల్ రద్దు చేయాలంటూ కింది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన కింది కోర్టు చంద్రశేఖర్ బెయిల్‌ను రద్దు చేసింది. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. అంతకు ముందే నకిలీ సాల్వెన్సీ సర్టిఫికెట్లు సమర్పించిన ఆరోపణలపై నెల్లూరు జిల్లా జడ్జి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నెల్లూరు చిన్నబజార్ పోలీసులు చంద్రశేఖర్, రామయ్యపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో తనను ప్రతివాదిగా చేర్చుకుని వాదనలు వినాలంటూ చంద్రశేఖర్ సతీమణి ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రశేఖర్, అతని తండ్రి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే.. కింది కోర్టు చంద్రశేఖర్‌కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన హైకోర్టులో తన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకోగా.. అతని తండ్రి రామయ్య వ్యాజ్యాన్ని మాత్రం కొనసాగించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత చంద్రశేఖర్ భార్య దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు విచారణ జరిపారు. ప్రధాన నిందితునిగా ఉన్న చంద్రశేఖర్‌కు కింది కోర్టు ఇప్పటికే పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేసిందని, అందువల్ల అతని తండ్రి రామయ్యకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అంతేకాక.. సాల్వెన్సీ సర్టిఫికెట్ సమర్పించే సమయంలో వరకట్న వేధింపు కేసులో రామయ్య జైలులో ఉన్నారని, అందువల్ల ఆయన నకిలీ సాల్వెన్సీ సర్టిఫికెట్ సమర్పించే అవకాశం ఎంతమాత్రం లేదన్నారు. నకిలీ సాల్వెన్సీ సర్టిఫికెట్ల సమర్పణకు అతన్ని బాధ్యుడిగా చేయడం తగదన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని, అందువల్ల ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని అటు పోలీసులు, ఇటు చంద్రశేఖర్ భార్య కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు పిటిషనర్ రామయ్య వాదనను తోసిపుచ్చారు. నేరం చేశారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయంటూ రామయ్య ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేస్తూ.. ముందస్తు బెయిల్ ఎలాంటి సందర్భాల్లో ఇవ్వాలో న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారు. -
లోకేశ్ అరెస్టుకు అనుమతివ్వండి
సాక్షి, అమరావతి: ఇన్నర్ రింగ్ రోడ్డు భూ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ అరెస్టుకు అనుమతివ్వాలని కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద ఇచ్చిన నోటీసులో నిర్దేశించిన షరతులను లోకేశ్ ఉల్లంఘించారని న్యాయస్థానానికి తెలియజేసింది. రెడ్‌బుక్ పేరుతో పోలీసులను, సాక్షులను బెదిరిస్తూ.. భయపెట్టేందుకు ప్రయత్నించారని వివరించింది. న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా పలు చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో లోకేశ్ ఆరోపణలు చేశారని పేర్కొంది. సీఐడీ స్పెషల్ పీపీ శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి ఈ పిటిషన్ గురించి శుక్రవారం ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి దృష్టికి తీసుకువచ్చారు. ఉద్దేశపూర్వకంగానే బెదిరించారు.. ‘ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంలో లోకేశ్ 14వ నిందితునిగా ఉన్నారు. విచారణ నిమిత్తం తమ ముందు హాజరుకావాలని లోకేశ్‌కు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద గతంలో నోటీసు ఇచ్చాం. అందులో పలు షరతులు విధించాం. ఈ కేసుతో సంబంధమున్న ఏ వ్యక్తినైనా బెదిరించడం గానీ, ప్రలోభపెట్టడం గానీ చేయకూడదని ఆ నోటీసులో స్పష్టంగా పేర్కొన్నాం. ఆ తర్వాత ఆయన ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు సీఐడీ అతన్ని 2 రోజుల పాటు విచారించింది. ఈ నేపథ్యంలో లోకేశ్ ఈనెల 19న ఏబీఎన్, ఈటీవీ తదితర చానళ్లకు ఇంటర్వ్యూలిచ్చారు. ఈ సందర్భంగా ఈ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న నారా చంద్రబాబునాయుడు పాత్రపై దర్యాప్తు చేస్తున్న పోలీసులను, అతని పాత్ర గురించి వాస్తవాలు తెలిసిన వ్యక్తులను బెదిరించారు. సాక్షులను భయపెట్టాలన్న ఉద్దేశంతోనే లోకేశ్ ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడారు. కోర్టులను కించపరిచేలా పలు ఆరోపణలు కూడా చేశారు. 53 రోజుల పాటు తన తండ్రి చంద్రబాబును రిమాండ్‌కు పంపడమన్నది రాష్ట్ర ప్రభుత్వం ‘వ్యవస్థలను మేనేజ్ చేయడం’ ద్వారానే జరిగిందని లోకేశ్ అన్నారు. నిందితులను రిమాండ్‌కు పంపడం న్యాయ ప్రక్రియలో భాగం. కానీ న్యాయవ్యవస్థను లక్ష్యంగా చేసుకుని లోకేశ్ మాట్లాడారు. ఆయన ఆరోపణల వల్ల ప్రజల్లో న్యాయవ్యవస్థ ప్రతిష్ట దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. అలాగే ఓ రెడ్ బుక్‌ను సిద్ధం చేస్తున్నామని.. తాము అధికారంలోకి వస్తే అందులో ఉన్న వ్యక్తులు జైలుకెళ్లడం ఖాయమంటూ లోకేశ్ బెదిరించారు. చంద్రబాబు, లోకేశ్‌లపై దర్యాప్తు చేస్తున్న పోలీసులను దృష్టిలో పెట్టుకునే ఆయన ఈ బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ ఇంటర్వ్యూలను, అందుకు సంబంధించిన వివరాలను సీడీలో కోర్టు ముందుంచాం. వాటిని పరిగణనలోకి తీసుకుని లోకేశ్ అరెస్ట్‌కు ఆదేశాలివ్వండి’ అని దుష్యంత్‌రెడ్డి ఏసీబీ కోర్టును కోరారు. నేరుగా అరెస్టు చేయవచ్చు కదా? ఏసీబీ కోర్టు జడ్జి స్పందిస్తూ.. 41ఏ కింద నిర్దేశించిన షరతులను ఉల్లంఘిస్తే, మీరే నేరుగా అరెస్ట్ చేయవచ్చు కదా? అని ప్రశ్నించారు. కోర్టు అనుమతి తీసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ పిటిషన్ దాఖలు చేశామని దుష్యంత్ బదులిచ్చారు. అలా అయితే ముందు తాను లోకేశ్ ఇంటర్వ్యూలను చూసి, ఆ తర్వాత స్పందిస్తానని జడ్జి చెప్పారు. ఇంటర్వ్యూలను చూసిన తర్వాత లోకేశ్‌కు నోటీసులు జారీ చేసి.. వారి వివరణ కూడా తెలుసుకుంటామన్నారు. అనంతరం తగిన ఉత్తర్వులు జారీ చేస్తానని తెలిపారు. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబూ ఉల్లంఘించారు.. పోలీసులను, సాక్షులను పలు ఇంటర్వ్యూల్లో లోకేశ్ బెదిరించిన విషయాన్ని సీఐడీ హైకోర్టు దృష్టికి కూడా తెచ్చింది. ఆయన ఇంటర్వ్యూలను పెన్ డ్రైవ్‌లో ఉంచి వాటిని ఓ మెమో రూపంలో సీఐడీ స్పెషల్ పీపీ దుష్యంత్ శుక్రవారం హైకోర్టు జడ్జి జస్టిస్ తల్లాప్రగఢ మల్లికార్జునరావు ముందుంచారు. చంద్రబాబు, లోకేశ్‌లు ఎంతో పరపతి కలిగిన వ్యక్తులని ఆయన తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబుకు బెయిల్ మంజూరు సందర్భంగా హైకోర్టు పలు షరతులను విధించిందని గుర్తు చేశారు. కేసు గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని, సాక్షులను ప్రభావితం చేయడంగానీ, ప్రలోభపెట్టడం గానీ చేయరాదని స్పష్టం చేసిందన్నారు. సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించిందన్నారు. కానీ సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా చంద్రబాబు స్కిల్ స్కామ్ గురించి మాట్లాడారని తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై తీర్పు వెలువరించే ముందు చంద్రబాబు, లోకేశ్‌లు మాట్లాడిన మాటలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని దుష్యంత్ కోర్టును కోరారు. దీనిపై చంద్రబాబు తరఫు న్యాయవాది ఎస్.ప్రణతి అభ్యంతరం తెలిపారు. చంద్రబాబు పిటిషన్‌పై ఇప్పటికే వాదనలు ముగిశాయని.. ఈ దశలో ఈ కేసుతో సంబంధం లేని వివరాలతో దాఖలు చేసిన మెమోను పరిగణనలోకి తీసుకోవదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. సీఐడీ మెమోపై అభ్యంతరాలుంటే వాటిని తమ ముందుంచాలని ప్రణతిని ఆదేశించారు. వాటిని పరిశీలించాక చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం తీసుకుంటామన్నారు. తదుపరి విచారణను శనివారానికి వాయిదా వేశారు. -
ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌నెట్ కేసుకు సంబంధించి టీడీపీ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై గురువారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తీర్పు తరువాత ఫైబర్ నెట్ కేసు విచారిస్తామని ధర్మాసనం గతంలో పేర్కొంది. అయితే గురువారం నాటి జాబితాలో స్కిల్ కేసు తీర్పు అంశం లేదు. ఈ నేపథ్యంలో ఫైబర్ నెట్ కేసు విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
‘మద్యం’ కేసులో బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ నేటికి వాయిదా
సాక్షి, అమరావతి: ‘మద్యం’ కేసులో మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. చంద్రబాబు సీఎంగా ఉండగా వారి పార్టీ నేతల డిస్టిలరీలు, బార్లకు లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకున్నారు. వీటి వల్ల ఖజానాకు రూ.1,500 కోట్ల మేర నష్టం వాటిల్లింది. దీనిపై సీఐడీకి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ జరిపిన సీఐడీ.. అప్పటి ఎక్సైజ్ కమిషనర్ శ్రీనరేష్, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, సీఎం చంద్రబాబుపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు, కొల్లు రవీంద్ర, శ్రీనరేష్ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. చంద్రబాబు, రవీంద్రల వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు మంగళవారం విచారణ జరిపారు. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మద్యం దుకాణాలు, బార్లకు శాసన సభ ఆమోదంతోనే ప్రివిలేజ్ ఫీజు తొలగించినట్లు చెప్పారు. ఇందుకు గవర్నర్ సైతం ఆమోదముద్ర వేశారన్నారు. ప్రివిలేజ్ ఫీజు తొలగిస్తూ ఎక్సైజ్ చట్టానికి చేసిన సవరణకు అప్పటి మంత్రి మండలి ఆమోదం కూడా ఉందన్నారు. రాజ్యాంగంలోని అధికరణ 163 (3) ప్రకారం గవర్నర్‌కు మంత్రులు చేసిన సూచనలపై న్యాయ సమీక్ష కుదరదని అన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసు నమోదు చేశారన్నారు. కొల్లు రవీంద్ర తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. సీఐడీ వాదనల నిమిత్తం విచారణను న్యాయమూర్తి బుధవారానికి వాయిదా వేశారు. కాగా, ముందస్తు బెయిల్ కోసం శ్రీనగేష్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను జస్టిస్ మల్లికార్జునరావు ఈ నెల 28కి వాయిదా వేశారు. -
చంద్రబాబుకు సుప్రీంలో నో రిలీఫ్
సాక్షి, న్యూఢిల్లీ: ఫైబర్‌నెట్ కుంభకోణం కేసులో ముందస్తు బెయిలు కోరుతూ మాజీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు నవంబరు 9వ తేదీకి వాయిదా వేసింది. శుక్రవారం ఈ పిటిషన్ జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం వద్దకు రాగా చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. మొత్తంగా మూడు ఎఫ్ఐఆర్లు దాఖలు కాగా ఒకటి తీర్పు రిజర్వు అయిందని నివేదించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తీర్పు వెలువడే వరకు ఈ కేసులో వేచి చూద్దామా? అని జస్టిస్ బోస్ ప్రశ్నించగా, ఆ విషయాన్ని ధర్మాసనానికే వదిలేస్తున్నట్లు లూథ్రా బదులిచ్చారు. అయితే, చంద్రబాబుకు మధ్యంతర రక్షణ కొనసాగించాలని లేదంటే ఈ పిటిషన్‌కు కాలపరిమితి ముగిసిపోతుందన్నారు. ఈ దశలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది రంజిత్‌కుమార్ జోక్యం చేసుకుంటూ ఒక వ్యక్తి ఒకసారి కస్టడీలో ఉన్నప్పుడు మరోసారి అరెస్టు ఉత్పన్నం కాదని, జ్యుడీషియల్ కస్టడీ కొనసాగుతుందని తెలిపారు. ఇదే అంశాన్ని కౌంటర్ అఫిడవిట్లో పేర్కొన్నట్లు చెప్పారు. స్కిల్ కేసులో తీర్పు కోసం వేచి చూస్తున్నామన్నారు. చంద్రబాబు కస్టడీలో ఉన్నందున ప్రశ్నించుకోవచ్చని జస్టిస్ బోస్ పేర్కొనగా, ఇంటరాగేషన్ చేయాలంటే కోర్టు అనుమతి అవసరమని, సెక్షన్ 267 కింద వారెంటు జారీ చేశామని రంజిత్ కుమార్ తెలిపారు. చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాతే పోలీసు కస్టడీని కోరగలమన్నారు. ఈ సమయంలో లూథ్రా జోక్యం చేసుకుంటూ ఇదంతా అబద్ధమని, చట్టాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపణలు చేశారు. సెప్టెంబరు 9న కస్టడీలో తీసుకున్న నాటి నుంచి చంద్రబాబును ఏ ప్రశ్నా అడగలేదన్నారు. ఈ సమయంలో జస్టిస్ బోస్ జోక్యం చేసుకుంటూ ముందస్తు బెయిలుపై నవంబరు 8న విచారిస్తామని తొలుత ప్రకటించారు. అయితే విచారణను నవంబరు 9కి వాయిదా వేయాలని సిద్ధార్థ లూథ్రా అభ్యర్థిచడంతో న్యాయస్థానం అందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంపై తొలుత తీర్పు వెలువరిస్తామని, తర్వాత ఈ అంశాన్ని పరిగణిస్తామని ధర్మాసనం పేర్కొంది. అప్పటి వరకు చంద్రబాబు అరెస్టు ఉండదని తెలిపింది. కాగా, ఈ నెల 29వ తేదీ వరకు సుప్రీంకోర్టుకు సెలవులు కావడంతో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో తీర్పు ఆ తర్వాతే వెలువడే అవకాశం ఉంది. -
చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై నేడు కోర్టులో విచారణ
-
చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
-
ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్
-
ఏమీ తెలియదంటూ.. 17ఏ రక్షణ కావాలంటే ఎలా?
సాక్షి, నూఢిల్లీ: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం గురించి తనకేమీ తెలియదన్నప్పుడు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ద్వారా రక్షణ కావాలని చంద్రబాబు ఎలా అడుగుతారని ఏపీ ప్రభుత్వ సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ప్రశ్నించారు. అలా కోరడంలో అర్థం లేదన్నారు. ‘అధికార విధులు నిర్వర్తించడమంటే అవినీతికి పాల్పడడం కాదు కదా? చట్టాల్లో నిజాయితీపరులకే రక్షణ కల్పించారు. సెక్షన్ 17ఏ కూడా అలాంటివారి కోసమే’ అంటూ దీనిపై సుప్రీంకోర్టు ఇచ్చిన పలు రూలింగ్‌లను ప్రస్తావించారు. ‘స్కిల్ డెవలప్మెంట్’ స్కామ్‌లో గవర్నరు అనుమతి లేకుండా తనను అరెస్టు చేశారు కనక... మొత్తం కేసును కొట్టేయాలంటూ చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. నేరం జరిగిందా? లేదా? అన్న అంశంపై కాకుండా టెక్నికల్‌గా చంద్రబాబు అరెస్టు చెల్లదు కాబట్టి కేసును కొట్టేయాలంటూ ఆయన లాయర్లు కోరటంతో శుక్రవారం కూడా ఈ విషయంపైనే వాదనలు కొనసాగాయి. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఎదుట... చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు హరీశ్‌సాల్వే, సిద్ధార్థ లూథ్రా, ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. మరోవైపు ఫైబర్‌నెట్ కుంభకోణం కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్ కూడా ఇదే ధర్మాసనం ముందుకు వచ్చింది. రెండు కేసుల విచారణను మంగళవారానికి కోర్టు వాయిదా వేసింది. సవరణకు ముందు జరిగిన ఘటనకు పాత చట్టమే... ‘రద్దు చేసిన సెక్షన్ల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చా అని ఈ ధర్మాసనం ఇదివరకు అడిగింది. సరిగ్గా ఇదే పాయింట్‌పై ఓ తీర్పు ఉంది’ అంటూ ఎంసీ గుప్తా కేసును ముకుల్ రోహత్గీ ప్రస్తావించారు. 1947లో చట్టం రద్దు చేశాక దాంట్లోని నిబంధనల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయజాలరని ఎంసీ గుప్తా కేసులో పిటిషనర్ వాదించారన్నారు. కానీ కొత్త చట్టం అమల్లోకి రాకముందే నేరం జరిగిన విషయాన్ని కోర్టు గుర్తించిందని... చట్టాన్ని రద్దు చేసినా, వెనక్కి తీసుకున్నా నేరం జరిగే నాటికి ఉన్న చట్టమే వర్తిస్తుందని తీర్పునిచ్చిందని చెప్పారు. సరిగ్గా చంద్రబాబు కేసులోనూ అంతే జరిగిందన్నారు. చంద్రబాబుపై సెక్షన్ 13 (సీ),(డీ) కింద అభియోగాలు మోపారని, వాటిని తర్వాత రద్దు చేసినప్పటికీ, రద్దుకు ముందు నేరం జరిగిందని రోహత్గీ వివరించారు. ‘చట్ట సవరణలు సాధారణం. పాత చట్టాల్లో కొంత భాగం పోతుంది. కానీ సవరణకు ముందు జరిగిన ఘటనలకు మాత్రం ఆ పాత చట్టమే వర్తిస్తుంది’ అని వ్యాఖ్యానించారు. ఈ కేసుకు ఎట్టి పరిస్థితుల్లోనూ సెక్షన్ 17ఏ వర్తించదని రోహత్గీ తేల్చి చెప్పారు. ‘సెక్షన్ 17ఏ జూలై 2018లో అమలులోకి వచ్చింది. నేరం 2015–2016 మధ్య జరిగింది. ఆ సమయంలో చట్టంలో సెక్షన్ 17ఏ లేదు’ అని రోహత్గీ తెలిపారు. చట్ట సవరణకు ముందు కేసు కాబట్టి 17ఏ వర్తించదన్నారు. సుప్రీంకోర్టులో ఎన్నడూ ఇలా జరగలేదు... దర్యాప్తు ప్రారంభించిన ఐదు–పది రోజుల్లోనే విచారణను అడ్డుకోవడానికి కోర్టు అంగీకరించే అవకాశం లేదని ముకుల్ రోహత్గీ చెప్పారు. హైకోర్టులో కస్టడీని వ్యతిరేకిస్తూ వాదించి, అదే రోజున సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం తాను ఎన్నడూ చూడలేదన్నారు. విచారణ ప్రారంభమైందనడానికి 2018 మే, జూన్ నెలల డాక్యుమెంట్లున్నాయని, వీటిని హైకోర్టుకు కూడా ఇచ్చామని, తమ వాదనలతో కోర్టు ఏకీభవించిందని చెప్పారు. బాబుకు డబ్బు అందినట్లు ఎలా గుర్తించారు? చంద్రబాబు అనుకున్నది జరిగితే దర్యాప్తు ప్రాథమిక దశలోనే నిలిచిపోతుందని, ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కాకుండా ఎన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేశాయో చూడాలని రోహత్గీ కోరారు. ‘ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రెండు సంస్థలతో ఒప్పందం చేసుకోవడం కోసం ప్రారంభమైంది. ఎలాంటి టెండర్ లేదు. సంస్థలు 90 శాతం పెట్టుబడి పెడతాయన్నది ఆలోచన’ అని రోహత్గీ చెబుతుండగా.. ఈ నిర్ణయం ఏ స్థాయిలో తీసుకున్నారని జస్టిస్ త్రివేది ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకున్నారని రోహత్గీ తెలిపారు. చంద్రబాబుకు సొమ్ములు అందాయని ఎలా గుర్తించారని న్యాయమూర్తి ప్రశ్నించగా.. సొమ్ములు షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకు, ఆయన పార్టీ ఖాతాలకు చేరాయని, అది ప్రజాధనమని, దీనిపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని రోహత్గీ తెలిపారు. దీంతో మరో రోజు విచారణ చేపడతామని జస్టిస్ బోస్ పేర్కొంటూ మంగళవారానికి వాయిదా వేశారు. అరెస్ట్ భయం ఉంది... అనంతరం ఫైబర్‌నెట్ కుంభకోణం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిలు పిటిషన్‌పై లూథ్రా వాదనలు ప్రారంభించారు. ఒక కేసులో అరెస్టు చేశాక... పలు కేసులు తెరపైకి తెచ్చారన్నారు. 2021లో ఎఫ్ఐఆర్ నమోదైందని, తర్వాత ఏమీ జరగకున్నా.. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టయ్యాక సెప్టెంబరు 19న ఫైబర్‌నెట్ కేసులో నిందితుడిగా చేర్చి కోర్టు ముందు హాజరు కావాలని అధికారులు పీటీ వారెంట్ దాఖలు చేశారన్నారు. పీటీ వారెంట్‌ను ఏసీబీ కోర్టు అనుమతించిందని, ఇప్పుడు అరెస్టు చేస్తారేమో అని లూథ్రా ఆందోళన వ్యక్తం చేశారు. విచారణ పూర్తి చేశామంటున్నారని, ఇక్కడ కూడా సెక్షన్ 17ఏ వర్తిస్తుందని, అయినప్పటికీ అధికారులు పరిగణనలోకి తీసుకోవడం లేదని లూథ్రా చెప్పారు. ఈ కేసులో ముగ్గురు ఇప్పటికే ముందస్తు బెయిలుపై బయట ఉన్నారని, మరో ముగ్గురు రెగ్యులర్ బెయిలుపై ఉన్నారని చెప్పారు. ఈ కేసులో చంద్రబాబును అరెస్టు చేయాల్సిన అవసరం లేదన్నారు. త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయన్నారు. ఈ కేసులోనూ సెక్షన్ 17ఏ వర్తిస్తుందా అని జస్టిస్ బోస్ ప్రశ్నిస్తూ.. షార్ట్ నోటీసు ఇచ్చి మంగళవారం విచారణ చేపడతామన్నారు. -
చంద్రబాబు, లోకేష్ ల ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ
-
ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ
-
లోకేష్ అరెస్టనా..?
-
ఐదు పేజీల తీర్పుపై... 60 పేజీల సారాంశమా!
న్యూఢిల్లీ: ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఐదు పేజీల తీర్పును సవాలు చేసేందుకు అనుమతి కోరుతూ దరఖాస్తు రూపంలో సుప్రీంకోర్టులో ఏకంగా 60 పేజీల సినాప్సిస్ (సారాంశం) సమర్పించాడో వ్యక్తి! దీనిపై విస్మయం వ్యక్తం చేయడం న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం వంతయింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేయడమే గాక పిటిషన్‌దారుకు రూ.25 వేల జరిమానా కూడా విధించింది! ఆ మొత్తాన్ని ఏదన్నా స్వచ్ఛంద సేవా సంస్థకు విరాళంగా ఇవ్వాలని ఆదేశించింది. అయితే ఆరోగ్య కారణాలతో అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇలాంటి సుదీర్ఘ దరఖాస్తులపై సుప్రీంకోర్టు గతేడాది అసహనం వ్యక్తం చేసింది. వాటిలో పేజీల సంఖ్యపై తక్షణం పరిమితి విధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. -
‘స్కిల్’ కుంభకోణం కేసులో 4 వరకు లోకేశ్‌ను అరెస్ట్ చేయొద్దు
సాక్షి, అమరావతి : స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హైకోర్టులో శుక్రవారం అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి విచారణ జరిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి అక్టోబర్ 4వ తేదీ వరకు లోకేశ్‌ను అరెస్టు చేయవద్దని సీఐడీని ఆదేశించారు. తదుపరి విచారణను అదే రోజుకు వాయిదా వేశారు. సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో లోకేశ్‌ను ఇప్పటివరకు నిందితునిగా చేర్చలేదని కోర్టుకు నివేదించారు. నిందితుడు కానప్పుడు అరెస్ట్ చేయడమన్న ప్రశ్నే తలెత్తదన్నారు. కేవలం భయాందోళనతోనే ఈ పిటిషన్ దాఖలు చేశారని వివరించారు. ఇప్పటికైతే అరెస్ట్ గురించి ఆందోళన అవసరం లేదన్నారు. ఒకవేళ అరెస్టు చేయాలనుకుంటే ఎప్పుడో చేసి ఉండేవాళ్లమని, తాము ఏం చేసినా చట్ట ప్రకారం చేస్తామని చెప్పారు. చంద్రబాబు అరెస్టు సందర్భంగా సీఐడీ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో అంశాల ఆధారంగా వాళ్లు భయాందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. టీడీపీకి లోకేశ్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారని, ఆయన తండ్రి అధ్యక్షుడిగా ఉన్నారని చెప్పారు. టీడీపీ బ్యాంకు ఖాతాల్లోకి పెద్ద మొత్తంలో డబ్బు జమ అయిందని, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తమ వద్ద ఆధారాలున్నాయని వివరించారు. ఆ రిమాండ్ రిపోర్టును ఆధారంగా 20 రోజుల తరువాత ఇప్పుడు పిటిషన్ దాఖలు చేశారన్నారు. లోకేశ్ చెబుతున్న కారణాల్లో సదుద్దేశం కనిపించడంలేదని, సంబంధం లేని అంశాలన్నింటినీ లేవనెత్తుతున్నారని చెప్పారు. నిందితునిగా చేర్చకుండానే బెయిల్ ఇవ్వాలంటూ ఎలా కోర్టుకొస్తారని ప్రశ్నించారు. కొంత సమయం ఇస్తే పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామన్నారు. బుధవారం లేదా గురువారం విచారణ జరిపినా అభ్యంతరం లేదని, అప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని ఏజీ కోర్టుకు నివేదించారు. అంతకు ముందు లోకేశ్ తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్దార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. తాము మధ్యంతర ముందస్తు బెయిల్ కోరుతున్నామన్నారు. చంద్రబాబు రిమాండ్ సందర్భంగా దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారులు చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులని పేర్కొందని, సీఐడీ ఉద్దేశాన్ని ఇది స్పష్టం చేస్తోందని చెప్పారు. చంద్రబాబునే సీఐడీ అధికారులు ఈ కేసులో అక్రమంగా, అన్యాయంగా ఇరికించారని, తప్పుడు కేసు బనాయించారని అన్నారు. లోకేశ్ విషయంలో కూడా అదే రీతిలో చేస్తారని, సీఐడీని విశ్వసించే పరిస్థితి లేదని అన్నారు. 4వ తేదీ వరకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని, కావాలంటే ఆ తరువాత విచారణ జరిపి ముందస్తు బెయిల్‌పై ఏ నిర్ణయమైనా తీసుకోండని కోర్టును అభ్యర్థించారు. -
లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను మూసివేసిన హైకోర్టు
సాక్షి, అమరావతి : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మాటున సాగించిన భూ దోపిడీపై సీఐడీ నమోదు చేసిన కేసులో 14వ నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి నారా లోకేశ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు మూసివేసింది. లోకేశ్‌కు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసు జారీ చేసి, అవసరమైనప్పుడు విచారణకు రావాలని కోరతామని సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు వివరించారు. ఈరోజు వరకు ఆయన అరెస్టు విషయంలో భయపడాల్సిన అవసరంలేదని చెప్పారు. దర్యాప్తు ప్రయోజనాల దృష్ట్యా లోకేశ్ విచారణ విషయంలో హైకోర్టు ఏ షరతులైనా విధించవచ్చని తెలిపారు. ఏజీ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, వాటిని రికార్డ్ చేసింది. తప్పనిసరిగా సీఆర్పీసీ సెక్షన్ 41ఏను అనుసరించే ముందుకు వెళతామని ఏజీ స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో, లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తదుపరి ఉత్తర్వులు అవసరం లేదని స్పష్టం చేసింది. అందువల్ల పిటిషన్‌ను మూసివేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ డిజైన్ల ముసుగులో అప్పటి ప్రభుత్వ పెద్దలు సాగించిన భూదోపిడీపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. ఇందులో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి పొంగూరు నారాయణ, చంద్రబాబు సన్నిహితులు, వ్యాపారవేత్తలు లింగమనేని రమేష్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ డైరెక్టర్ అంజనీ కుమార్ తదితరులను నిందితులుగా చేర్చింది. చంద్రబాబు కుమారుడు, అప్పటి మంత్రి లోకేశ్‌ను సైతం 14వ నిందితునిగా చేర్చింది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోరుతూ లోకేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. లోకేశ్‌పై కేసులో సెక్షన్లను సవరించామని తెలిపారు. అవినీతి నిరో«దక చట్టం కింద మరిన్ని సెక్షన్లు చేర్చామని వివరించారు. దర్యాప్తు అధికారి చట్ట ప్రకారం నడుచుకుంటారని తెలిపారు. లోకేశ్‌కు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసు ఇవ్వాలని దర్యాప్తు అధికారి నిర్ణయించారన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. అరెస్టు గురించి ఆందోళన చెందుతున్నారా అని లోకేశ్ తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ను ప్రశ్నించారు. అరెస్ట్ చేస్తారని అనుకుంటే ఎప్పుడైనా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చునన్నారు. దర్యాప్తు నకు సహకరించాలని స్పష్టం చేశారు. దీనికి దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ.. ఏజీ చెప్పిన వివరాలను రికార్డ్ చేయాలని కోరారు. అరెస్టు విషయంలో కనిపించని ఆందోళన ఉందన్నారు. వరుసగా సెలవులు వస్తున్నాయని తెలిపారు. సీఐడీ అనుసరించే విధానం (మోడస్ ఆపరెండీ) వేరుగా ఉంటుందని, సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చిన తరువాత కూడా అరెస్ట్ చేసేందుకు వెనుకాడబోదని తెలిపారు. పాలనాపరంగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు మోడస్ ఆపరెండీ అన్న పదం ఉపయోగించడంపై ఏజీ శ్రీరామ్ అభ్యంతరం తెలిపారు. ఈ పదం నిందితులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. లోకేశ్‌పై నమోదు చేసిన సెక్షన్లన్నింటినీ ఏజీ చదివి వినిపించారు. ఈ సెక్షన్లన్నీ వర్తిస్తాయా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. పాలనాపరంగా లోకేశ్‌తో పాటు అప్పటి ప్రభుత్వ పెద్దలు పలు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని, అందువల్ల ఆ సెక్షన్లన్నీ ఆయనకు వర్తిస్తాయని తెలిపారు. దర్యాప్తునకు సహకరించాలని లోకేశ్‌ను ఆదేశించాలని కోర్టును కోరారు. దమ్మాలపాటి స్పందిస్తూ.. దర్యాప్తు అధికారి పిటిషనర్‌ను విచారణకు పిలవాలనుకుంటే ముందే ఆ విషయాన్ని తెలిపి సహేతుక సమయాన్ని ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ముందు రోజు నోటీసు ఇచ్చి, మరుసటి రోజు హాజరు కావాలంటే కష్టమని చెప్పారు. -
బాబు కనుసన్నల్లోనే ఐఆర్ఆర్ అలైన్మెంట్ మార్పు
సాక్షి, అమరావతి : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) అలైన్మెంట్లో మార్పులు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగాయని సీఐడీ హైకోర్టుకు తెలిపింది. అలైన్మెంట్ ఎలా ఉండాలో ముందే ఓ నిర్ణయానికి వచ్చి, దానికి అనుగుణంగా ప్రాజెక్టు పనులు దక్కించుకున్న సంస్థ చేత అలైన్‌మెంట్‌ను తయారు చేయించారని వివరించారు. ఈ మార్పుల ద్వారా వ్యాపారవేత్త లింగమనేని రమేశ్‌కు చంద్రబాబు లబ్ధి చేకూర్చారని చెప్పింది. అందుకు ప్రతిఫలంగా రమేష్ కృష్ణానది కరకట్ట సమీపంలో ఉన్న తన ఇంటిని చంద్రబాబుకు ఇచ్చారని తెలిపింది. ఇది క్విడ్ ప్రోకోయేనని వెల్లడించింది. ఇప్పటికే స్కిల్ కుంభకోణం కేసులో అరెస్టయి రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు.. ఐఆర్ఆర్ ముసుగులో జరిగిన భూ దోపిడీ కేసులో ముందస్తు బెయిలు కోరుతూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి శుక్రవారం మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు. అలైన్మెంట్ మార్పు వల్ల రమేశ్ భూములను కాపాడటమే కాక, వాటి విలువ ఎంతో పెరిగేలా చేశారని ఆయన వివరించారు. రమేశ్ బ్యాంకు ఖాతాల్లో పెద్ద ఎత్తున డబ్బు కూడా జమ చేశారని, అందుకు లెక్కలు కూడా చూపలేదన్నారు. దానిని ఇంటి అద్దెగా చంద్రబాబు తదితరులు చెబుతున్నారని తెలిపారు. రెండేళ్ల తరువాత అద్దె చెల్లించడంలో అంతరార్థం ఏమిటో తెలుసుకోవాల్సి ఉందని అన్నారు. ఇందుకోసం చంద్రబాబును కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు అమలు వెనుక అవినీతి జరిగింది కాబట్టే అవినీతి నిరోధక చట్టం కింద కూడా చంద్రబాబుపై కేసు నమోదు చేశామని చెప్పారు. ఐఆర్ఆర్ అలైన్మెంట్ ప్రాజెక్టును నామినేషన్ పద్ధతిలో అప్పగించడాన్ని అప్పటి సీఆర్డీఏ అధికారులు వ్యతిరేకించారని, వాటిని పట్టించుకోకుండా చంద్రబాబు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దురుద్దేశంతో అర్హత నిబంధనలు కుదించేశారన్నారు. అలైన్మెంట్ పరిధిలోకి కావాల్సిన వారి భూములు రాకుండా జాగ్రత్త పడ్డారని తెలిపారు. మాస్టర్ ప్లాన్‌ను సైతం అలాగే రూపొందించారని వివరించారు. ప్రాజెక్టు రూపకల్పన, అమలు, దాని వెనుక ఉన్న ఉద్దేశాలను చూడాలని కోర్టును కోరారు. ఈ ప్రాజెక్టు వెనుక క్విడ్ ప్రో కో ఉందన్నారు. ఐఆర్ఆర్ పేరుతో ఆస్తులు అమ్ముకుని, డబ్బు గడించారని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబు అరెస్టయి రిమాండ్‌లో ఉన్న నేపథ్యంలో ఈ కేసులో కూడా ఆయన అరెస్ట్ అయినట్లు భావించడానికి వీల్లేదన్నారు. అలా భావిస్తే దర్యాప్తునకు తీవ్ర విఘాతం కలుగుతుందని చెప్పారు. అందువల్ల ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టును కోరారు. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. లింగమనేనికి చెల్లించిన అద్దెపై సీఐడీకి అనుమానాలుంటే చంద్రబాబుకు నోటీసులు జారీ చేసి వివరణ కోరితే పూర్తి వివరాలు సమర్పించే వారిమని అన్నారు. ఇంత చిన్న దానికి కస్టోడియల్ విచారణ అవసరం ఏముందన్నారు. తాము చెల్లించిన డబ్బుకు రమేశ్ లెక్కలు చూపకుంటే అది చంద్రబాబు తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. ఈ కేసులో సీఐడీ వాస్తవాలను కప్పిపుచ్చుతోందన్నారు. సీఐడీ దర్యాప్తు మొత్తం పక్షపాతంతో సాగుతోందన్నారు. కోర్టు సమయం ముగియడంతో న్యాయమూర్తి తదుపరి విచారణను అక్టోబర్ 3కి వాయిదా వేశారు. -
ఫైబర్‌గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వండి
సాక్షి, అమరావతి : ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున ఆర్థిక అక్రమాలు జరిగాయంటూ సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ఫైబర్ గ్రిడ్ కేసు పూర్తి వివరాలను తమ ముందుంచాలని సీఐడీని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 4కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. 2021 సెప్టెంబర్‌లో నమోదు చేసిన కేసులో చంద్రబాబును సీఐడీ ఇటీవల 25వ నిందితునిగా చేర్చిందని తెలిపారు. ఆ మేర ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేసిందన్నారు. ఇదీ కేసు.. : చంద్రబాబు ప్రభుత్వం హయాంలో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుకు సంబంధించి రూ.321 కోట్ల మేర కుంభకోణం జరిగింది. ఈ ప్రాజెక్టు టెండర్‌ను టెరాసాఫ్ట్ కంపెనీకి అప్పగించారని, ఇందులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, దీని వెనుక అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందంటూ ఏపీ ఫైబర్ నెట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ 2021లో సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. -
ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్
-
అంగళ్ళు విధ్వంసం కేసులో బెయిల్ కోసం చంద్రబాబు ప్రయత్నాలు
-
వియ్యంకుల వారి భూ విందు
సాక్షి, అమరావతి: ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా..? చంద్రబాబు బృందం అమరా వతిలో ఏకంగా రూ.5,600 కోట్ల విలువైన 1,400 ఎకరాల అసైన్డ్ భూములను కొల్లగొట్టితే ఆయన మంత్రివర్గ సహచరులు పొంగూరు నారాయణ, గంటా శ్రీనివాసరావు అదే రీతిలో భారీ భూదోపిడీకి పాల్పడ్డారు. వియ్యంకులు కూడా అయిన వారిద్దరూ బినామీల పేరిట 48 ఎకరాల అసైన్డ్ భూములను కాజేసినట్లు సీఐడీకి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆధారాలతో సహా వెలికి తీసింది. టీడీపీ సర్కారు ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వకుండానే అసైన్డ్ భూములను రాజధాని కోసం తీసుకుంటుందని బడుగు రైతులను బెదిరించి నారాయణ – గంటా తమ పన్నాగాన్ని అమలు చేశారు. అందుకోసం సీఆర్డీఏ అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారు. అసైన్డ్ భూముల చట్టాన్ని ఉల్లంఘించి తమ విద్యా సంస్థల సిబ్బంది, సమీప బంధువులు 37 మందిని బినామీలుగా చేసుకుని 142 సేల్ డీడ్ల ద్వారా 150 ఎకరాలను దక్కించుకు న్నారు. దీనిపై సిట్ అధికారులు పూర్తి ఆధారా లతో కేసు నమోదు చేశారు. రూ.18 కోట్లతో హస్త గతం చేసుకున్న ఆ 150 ఎకరాల విలువ ల్యాండ్ పూలింగ్ వర్తింపజేసిన అనంతరం అమాంతం రూ.550 కోట్లకు చేరుకోవడం గమనార్హం. బినామీల ఖాతాల్లోకి డబ్బులు.. వియ్యంకులైన పొంగూరు నారాయణ, గంటా శ్రీనివాసరావులు పన్నాగం పన్ని, అధికార బలంతో అమరావతిలో అసైన్డ్ భూములను కొల్లగొట్టారు. అనంతవరం, కృష్ణాయపాలెం, కురగల్లు, లింగాయపాలెం, మందడం, నెక్కళ్లు, నవులూరు, రాయపూడి, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెం, వెంకటపాలెంలోని అసైన్డ్ భూములపై కన్నేశారు. భూసమీకరణ కింద తీసుకునే అసైన్డ్ భూములకు ప్రభుత్వం పరిహారం ఇవ్వదని సీఆర్డీఏ, రెవెన్యూ అధికారుల ద్వారా ఆయా గ్రామాల్లోని పేద రైతులను నమ్మించారు. అనంతరం తమ బినామీలు అయిన ఆర్కే హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులతో ఆ భూములను కారు చౌకగా కొనుగోలు చేసేందుకు సంప్రదింపులు జరిపారు. అందుకోసం నారాయణ విద్యా సంస్థల ద్వారా రూ.18 కోట్లను ఆర్కే హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు మళ్లించారు. నారాయణ విద్యా సంస్థల సిబ్బంది, తమ సమీప బంధువులను బినామీలుగా చేసుకుని వారి పేరిట బ్యాంకు ఖాతాలు తెరిచారు. ఆర్కే హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఆ బినామీల బ్యాంకు ఖాతాల్లోకి నిధులు మళ్లించారు. అనంతరం నారాయణ విద్యా సంస్థల సిబ్బంది, తమ సమీప బంధువుల పేరిట అసైన్డ్ భూములను సేల్ డీడ్ ద్వారా హస్తగతం చేసుకున్నారు. మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కేంద్రంగా 37 మంది పేరుతో 142 సేల్డీడ్లు రిజిస్టర్ చేయడం గమనార్హం. ఇలా కేవలం రూ.18 కోట్లకు 150 ఎకరాలను గుప్పిట పట్టారు. ఈ వ్యవహారం అంతా 2015 సెప్టెంబరు, అక్టో బర్, నవంబరులో పూర్తి చేశారు. రూ.532 కోట్లు నష్టపోయిన అసైన్డ్ రైతులు అసైన్డ్ పేద రైతుల నుంచి 150 ఎకరాలు తమ హస్తగతం అయ్యాక నారాయణ, గంటాలు అసలు విషయాన్ని తెరపైకి తెచ్చారు. అప్పటికే చంద్రబాబు పన్నాగం ప్రకారం అసైన్డ్ భూము లకు కూడా భూసమీ కరణ ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు. అసైన్డ్ భూములు తమ గుప్పిట్లోకి వచ్చిన తరువాత ఆ నిర్ణయాన్ని తాపీగా 2016 ఫిబ్రవరి లో ప్రకటించారు. అంతేకాదు అసైన్డ్ చట్టానికి విరుద్ధంగా అసైన్డ్ భూములను కొనుగోలు చేసినవారికి కూడా భూసమీకరణ ప్యాకేజీ వర్తింపజేస్తామని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం. తద్వారా అమరావతిలో భూముల మార్కెట్ విలువ అమాంతం పెరిగేలా చేశారు. అమరావతిలో ఎకరా మార్కెట్ విలువ రూ.4 కోట్లు అని నాడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే చెప్పడం గమనార్హం. నారాయణ, గంటా బినామీల ద్వారా దక్కించుకున్న 150 ఎకరాలకు భూసమీకరణ ప్యాకేజీని వర్తింపచేసుకున్నారు. దీని ప్రకారం జరీబు భూములకు ఎకరాకు వెయ్యి గజాల నివాస స్థలం, 450 గజాల వాణిజ్య స్థలం కేటాయించారు. ఈమేరకు 150 ఎకరాలకుగాను 1.50 లక్షల గజాల నివాస స్థలం, 67,500 గజాల వాణిజ్య స్థలం దక్కాయి. మార్కెట్ విలువ ప్రకారం ఆ భూముల విలువ దాదాపు రూ.550 కోట్లకు చేరింది. కేవలం రూ.18 కోట్లతో అక్రమంగా భూములను దక్కించుకుని 3 నెలల్లో ఆ భూముల విలు వను రూ.550 కోట్లకు పెంచేసుకున్నారు. అస త్య ప్రచారాలు, బెదిరింపులకు పాల్పడకుండా ఉంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అసైన్డ్ రైతుల భూముల విలువ రూ.550 కోట్లకు పెరి గి ఆ ప్రయోజనం వారికే దక్కేది. దశాబ్దాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు సాగు చేసుకుంటున్న భూములను నారాయణ, గంటా బెదిరించి కా రుచౌకగా గద్దల్లా తన్నుకుపోయారు. కాగా, నారాయణ ఇప్పటికే ముందస్తు బెయిల్‌పై ఉన్నారు. -
ముందస్తు బెయిల్ పిటిషన్లు ఇన్నాళ్లు పెండింగ్‌లోనా..!
సాక్షి, అమరావతి: అమరావతి రాజధాని ముసుగులో 1,100 ఎకరాల అసైన్డ్, లంక భూములను కాజేసిన వ్యవహారంలో 2020లో సీఐడీ నమోదు చేసిన కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ మాజీ మంత్రి పొంగూరు నారాయణ, ఆయన సమీప బంధువులు, బినామీలు దాఖలు చేసిన వ్యాజ్యాలు దాదాపు ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉండటంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్లు ఏడాది పెండింగ్‌లో ఉండటం తామెన్నడూ చూడలేదని తెలిపింది. ఇదే సమయంలో వాదనలు వినిపించేందుకు నారాయణ, ఇతరుల తరఫు న్యాయవాదులు మరోసారి సమయం కోరడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇలానే వాయిదాలు కోరుతుంటే, నారాయణ తదితరులను అరెస్ట్ చేయవద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేస్తామని, అప్పుడు తీరిగ్గా వాదనలు వినిపించుకోవచ్చునని ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి ఎలాంటి వాయిదాలు వేసే ప్రసక్తే లేదని, ఇదే చివరి అవకాశమని నారాయణ తదితరులకు హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే ఒకవైపు ముందస్తు బెయిల్ పిటిషన్లు, మరో వైపు కేసు కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్లు సమాంతరంగా దాఖలు చేయడంపైనా హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇలా ఎలా రెండు రకాల పిటిషన్లు దాఖలు చేస్తారని, అవి ఎలా నిలబడతాయని ప్రశ్నించింది. ఇలాంటి ఫైలింగ్‌ను తామెన్నడూ చూడలేదని వ్యాఖ్యానించింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాయిదాలతో కాలం వెళ్లదీస్తున్నారు... తాజాగా ఈ వ్యాజ్యాలు బుధవారం మరోసారి విచారణకు వచ్చాయి. నారాయణ తదితరుల తరఫు న్యాయవాదులు ఎస్.ప్రణతి, అజయ్ తదితరులు స్పందిస్తూ, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తమ తరఫున వాదనలు వినిపించాల్సి ఉందని, వ్యక్తిగత కారణాలరీత్యా ఆయన హాజరు కాలేకపోతున్నందున విచారణను వాయిదా వేయాలని కోర్టును కోరారు. దీనిపై సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. సీనియర్ న్యాయవాది పేరుతో వాయిదాల మీద వాయిదాలు తీసుకుంటున్నారని, ఇది ఎంత మాత్రం సమంజసం కాదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఏడాది కాలంగా ఇలాగే ఈ వ్యాజ్యాల్లో విచారణను సాగదీస్తూ వస్తున్నారని తెలిపారు. అరెస్ట్‌పై స్టేను అడ్డం పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారని కోర్టుకు ఏఏజీ నివేదించారు. ఈ సమయంలో న్యాయస్థానం జోక్యం చేసుకుంటూ, ఇలా పదే పదే వాయిదాలు కోరుతుంటే ఏఏజీ ప్రభుత్వానికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని నారాయణ న్యాయవాదులను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. దాదాపు ఏడాదిగా ముందస్తు బెయిల్ పిటిషన్లు పెండింగ్‌లో ఉండటం ఎన్నడూ చూడలేదని, ముందస్తు బెయిల్ పిటిషన్లు, క్వాష్ పిటిషన్లు సమాంతరంగా దాఖలు చేయడం ఏంటని ప్రశ్నించింది. దీనికి నారాయణ తరఫు న్యాయవాది ఎస్.ప్రణతి స్పందిస్తూ, రెండు రకాల పిటిషన్లు దాఖలు చేయవచ్చునని, ఇందుకు సంబంధించిన తీర్పులను వాదనల సమయంలో కోర్టు ముందుంచి, సంతృప్తికర వివరణ ఇస్తామని తెలిపారు. ఆమె వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ వ్యాజ్యాల్లో తదుపరి ఎలాంటి వాయిదాలు ఇచ్చే ప్రసక్తేలేదని తేల్చి చెప్పింది. వాయిదాలు ఇవ్వడం ఇదే చివరి సారి అని పేర్కొంటూ.. తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది. ఏక కాలంలో రెండు పిటిషన్లా.. సీఐడీ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ నారాయణ 2022 హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే సమయంలో ఆయన సమీప బంధువులు, బినామీలు తమపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్లు వేశారు. నారాయణ కూడా తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ 2023లో క్వాష్ పిటిషన్ వేశారు. 2022లో ముందస్తు బెయిల్ కోసం నారాయణ దాఖలు చేసిన పిటిషన్‌ను అప్పట్లో విచారించిన హైకోర్టు, కేన్సర్ శస్త్రచికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు వీలుగా మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. నారాయణ సమీప బంధువులు, బినామీలు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో స్పందించిన హైకోర్టు, సీఆర్పీసీ 41ఏను అనుసరించాలని సీఐడీని ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఈ వ్యాజ్యాల్లో విచారణ పలుమార్లు వాయిదా పడింది. తమకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఉండటంతో నారాయణ తదితరులు ఏదో ఒక కారణం చూపుతూ వాయిదాల మీద వాయిదాలు కోరుతూ వచ్చారు. దర్యాప్తు సంస్థ న్యాయవాదులు కూడా ఒకటి రెండు సార్లు వాయిదాలు అడిగారు. -
టీడీపీ నేతల ముందస్తు బెయిల్ పిటిషన్ల తిరస్కరణ
మదనపల్లె: ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగళ్లు, పుంగనూరులలో ఆగస్టు 4న చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన అల్లర్ల ఘటనలో నమోదైన కేసులకు సంబంధించి పరారీలో ఉన్న 13 మంది టీడీపీ నేతలు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తూ రెండో ఏడీజే కోర్టు న్యాయమూర్తి అబ్రహాం గురువారం తీర్పునిచ్చారు. అంగళ్లు, పుంగనూరు ఘటనలకు సంబంధించి నమోదైన కేసుల్లో 106 మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి బెయిల్ పిటిషన్లను ఇదివరకే కోర్టు తిరస్కరించింది. కాగా, అరెస్ట్ కాకుండా అజ్ఞాతంలో ఉన్న 13 మంది ముందస్తు బెయిల్‌కు సంబంధించి ఆగస్టు 29న రెండో ఏడీజే కోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును 31వ తేదీకి వాయిదా వేశారు. చదవండి: బాబు ష్యూరిటీనా.. నమ్మేదెలా? -
నిందితులను యాంత్రికంగా అరెస్టు చేయొద్దు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష పడే కేసులో నిందితులను యాంత్రికంగా, అనవసరంగా అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని అన్ని హైకోర్టులకు, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల డీజీపీలకు సూచించింది. వైవాహిక వివాదానికి సంబంధించిన కేసులో జార్ఖండ్ హైకోర్టు తనకు ముందస్తు బెయిల్ ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ మహ్మద్ అష్పాక్ అలామ్ అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. జార్ఖండ్ హైకోర్టు ఉత్తర్వును తోసిపుచ్చుతూ నిందితుడికి ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. -
Viveka Case : సునీత పిటిషన్ జులై 3కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్ వివేకా హత్య కేసులో.. సునీతారెడ్డి పిటిషన్‌పై విచారణను వచ్చే నెల(జులై) 3వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ సునీతారెడ్డి వేసిన పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎంఎం సుందరేష్ నేతృత్వంలోని బెంచ్ ఇవాళ(జూన్ 19, సోమవారం) విచారణ జరిపింది. సునీత తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఈ నెలాఖరు (జూన్ 30) కల్లా వివేకా హత్య కేసుపై సిబిఐని దర్యాప్తు పూర్తి చేయమని ఇప్పటికే సుప్రీంకోర్టు గడువు విధించింది. ఈ విషయాన్ని సిద్ధార్థ లూథ్రా న్యాయస్థానానికి గుర్తు చేశారు. ఈ నెలాఖరుతో సిబిఐ దర్యాప్తు గడువు ముగుస్తున్నందున ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ను వెంటనే రద్దు చేయాలని కోరారు. అయితే ఈ విజ్ఞప్తిని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎంఎం సుందరేష్ నేతృత్వంలోని బెంచ్ అంగీకరించలేదు. కేసు విచారణను జులై 3వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. తదుపరి విచారణ కోసం చీఫ్ జస్టిస్ CJI బెంచ్ ముందు లిస్ట్ చేయాలని ఆదేశించింది. అలాగే ఈ కేసులో వాదనలు వినిపించాల్సిందిగా ప్రతివాదులయిన అవినాష్ రెడ్డి, CBIలకు నోటీసులు జారీ చేసింది. Supreme Court is hearing a plea by the daughter of former MP late YS Vivekananda Reddy against a Telangana High Court order granting anticipatory bail to Kadapa MP YS Avinash Reddy in connection with her father's murder.#SupremeCourt #SupremeCourtofIndia pic.twitter.com/Xs5HCAjpXz — Bar & Bench (@barandbench) June 19, 2023 పిటిషన్‌కు కాలం చెల్లే అవకాశం! వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తునకు ఈ నెలాఖరు సుప్రీంకోర్టు డెడ్‌లైన్‌గా విధించిన సంగతి తెలిసిందే. అలాగే సునీతా రెడ్డి పిటిషన్ ను జులై 3కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో.. CBI చార్జిషీట్ దాఖలు చేస్తే గనుక ముందస్తు బెయిల్ రద్దు చేయాలన్న సునీత పిటిషన్ కు కాలం చెల్లిపోయే అవకాశం ఉంది. గత విచారణలో సునీత తీరుపై అసంతృప్తి వివేకా కేసుకు సంబంధించి సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న అవినాష్‌రెడ్డికి మే 31వ తేదీన షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. ఈ ఆదేశాల్ని సవాల్ చేస్తూ సునీతారెడ్డి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసింది. గత విచారణ సమయంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాలను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును కోరింది సునీత. అంతే కాదు, హైకోర్టు మినీ ట్రయల్ ను నిర్వహించిందని, తమ వాదనల్లో మెరిట్ పరిశీలించకుండా బెయిల్ ఇచ్చిందని తెలిపింది. దీనిపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అవినాష్ ను అరెస్ట్ చేయించాలన్న తాపత్రయం సునీతలో కనిపిస్తోందని, కేవలం ఇగో క్లాషెస్ కోసం వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోందని మొన్నటి విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. Justice Surya Kant: Returnable on 7th July. Counsel: There is a connected matter. Justice Kant: List before first bench on 3rd July 2023, after getting appropriate orders from CJI. #SupremeCourt #SupremeCourtOfIndia — Live Law (@LiveLawIndia) June 19, 2023 తన వాదనే వినాలి, తాను చెప్పిందే నమ్మాలి అన్నట్టుగా కనిపించిన సునీత తీరు ఆశ్చర్యకరంగా ఉంది. ఏ న్యాయస్థానమయినా.. ఎలాంటి అభియోగాలపైనా అయినా.. వాదనలతో పాటు దానికి సంబంధించిన ఆధారాలను పరిశీలించిన పిమ్మటే నిర్ణయం తీసుకుంటుందన్న విషయాన్ని సునీత విస్మరించినట్టు కనిపించింది. ఇదీ చదవండి: మీ తీరు పంతాలకు పోయినట్టుంది.. సునీతతో సుప్రీంకోర్టు అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌కి కారణం ఇదే.. -
YS Viveka Case: మీ తీరు పంతాలకు పోయినట్టుంది.. సునీతతో సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ సునీతారెడ్డి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. సునీత రెడ్డి వేసిన పిటిషన్‌పై సీబీఐకి నోటీసులు ఇచ్చేందుకు నిరాకరించింది సుప్రీం కోర్టు. కేసును ఈ నెల 19కి వాయిదా వేసింది సర్వోన్నత న్యాయస్థానం. సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ A.అమానుల్లా నేతృత్వంలోని బెంచ్ ముందుకు ఈ పిటిషన్ విచారణకు రాగా కేసులో తానే వాదనలు వినిపిస్తానంటూ సునీతారెడ్డి ముందుకు వచ్చింది. దీనిపై స్పందించిన జస్టిస్ విక్రమ్ నాథ్ ఎవరైనా లాయర్ ను పెట్టుకోవాలని సూచించింది. సీనియర్ అడ్వొకేట్ సిద్ధార్థ లుథ్రాను సునీతకు సాయం చేయాలని కోరింది. సునీత : సీబీఐ దర్యాప్తునకు అవినాష్ ఏ మాత్రం సహకరించడం లేదు. ఏప్రిల్ 24 తర్వాత 3 సార్లు నోటీసులిచ్చినా విచారణకు రాలేదు జస్టిస్ విక్రమ్ నాథ్ : ఈ కేసులో అంత అత్యవసరమైన పరిస్థితి ఏముంది? వెకేషన్ ముందున్న బెంచ్‌కు రావాల్సిన పరిస్థితి ఉందా? జస్టిస్ A.అమానుల్లా : ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలా? లేదా అన్నది దర్యాప్తు సంస్థ చూసుకుంటుంది. ఎవరిని ఎప్పుడు అరెస్టు చేయాలో, ఎవరిని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలో CBIకి తెలుసు. ఈ కేసులో చాలా సాంకేతిక అంశాలు ముడిపడి ఉన్నాయి. సునీత : ఇతర నిందితులతో కలిసి అవినాష్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారు. ఇదే కేసులో సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా హైకోర్టు ఆదేశాలిచ్చింది సుప్రీంకోర్టు : అవినాష్ రెడ్డి CBI ముందు హాజరవుతున్నారు కదా, అలాగే దర్యాప్తుకు సహకరిస్తున్నప్పుడు CBIకి కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరం ఏముంది? ఈ కేసులో మీరు తొందరపడి వ్యక్తిగతంగా వాదనలు వినిపించాలనుకుంటే నష్టపోతారు, మీరు (సునీతను ఉద్దేశించి) న్యాయశాస్త్రంలో నిష్ణాతులు కాకపోవచ్చు. మీ పిటిషన్ ను కోర్టు డిస్మిస్ చేస్తే.. తర్వాత వచ్చే లాయర్ కు సమస్య ఎదురవుతుంది. సెలవుల తర్వాత ఈ కేసును పరిశీలిద్దామా? సీనియర్ లాయర్ లుథ్రా: ఈ నెలాఖరులోగా సిబిఐకి ఇచ్చిన దర్యాప్తు గడువు ముగుస్తుంది సుప్రీంకోర్టు : మిస్టర్ లుథ్రా.. మీరు సమస్యలు సృష్టిస్తున్నారు. వాదనలు వద్దంటున్నా.. మీరు తలదూర్చాలనుకుంటున్నారు. ఈ కోర్టులోనే ఒక బెంచ్ విధించిన గడువుపై మేం మళ్లీ ఉత్తర్వులు ఇవ్వాలా? సునీత : ఈ కేసులో విచారణకు హాజరు కావాలని సిబిఐని ఆదేశించండి సుప్రీంకోర్టు : అలాంటి ఉత్తర్వులు మేమేలా ఇస్తాం? ఈ పిటిషన్ లో విచారణకు రావాలా లేదా అన్నది CBI ఇష్టం. జులై 3న రండి సునీత : హైకోర్టు అనేక అంశాలను పరిగణలోకి తీసుకోలేదు. సీబీఐ సేకరించిన సాక్ష్యాలను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా హైకోర్టు ఆదేశాలిచ్చింది. హైకోర్టు ఉత్తర్వులను సమీక్షించే తుది అధికారం సుప్రీంకోర్టుకు ఉందని గతంలో మీరు చెప్పారు కదా జస్టిస్ A.అమానుల్లా : మీరు ఆరోపణలు చేస్తున్న నిందితుడు మీ కజినా? సునీత : అవును, అవినాష్ రెడ్డి నాకు సెకండ్ కజిన్ సీనియర్ లాయర్ లుథ్రా: ఈ కేసును రేపు పరిశీలించండి. రేపు అడ్వొకేట్ ఆన్ రికార్డును కోర్టు ముందుంచుతాం. నేను వాదనలు వినిపిస్తాను సుప్రీంకోర్టు : మీరు అడిగినట్టు CBIకి నోటీసులు ఇవ్వలేం. కేసును జూన్ 19వ తేదీకి (వచ్చే సోమవారం) వాయిదా వేస్తున్నాం తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ జారీ చేసిన బెయిల్‌ను సవాల్ చేస్తూ సునీతా రెడ్డి వేసిన పిటిషన్లో సిబిఐకి నోటీసులు జారీ చేయాలని కోరినా.. సుప్రీంకోర్టు అంగీకరించలేదు. ఈ కేసులో సునీత తీరు పంతాలకు పోయి వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోందని అభిప్రాయపడింది. కేవలం అవినాష్ రెడ్డిని జైల్లో వేయించడమే లక్ష్యంగా సునీత తీరు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. కేసుకు సంబంధించి అదనపు పత్రాలు సమర్పించేందుకు సునీతకు అవకాశమిచ్చింది సుప్రీంకోర్టు. ఈ కేసును జూన్ 19న పరిశీలిస్తానని తెలిపింది. -
అవినాష్‌రెడ్డి సహకరిస్తున్నా.. లేదంటూ మెన్షన్!
సాక్షి, ఢిల్లీ: వివేకా హత్య కేసులో సుదీర్ఘ వాదనలు జరిగిన అనంతరం తెలంగాణ హైకోర్టు(వెకేషన్ బెంచ్) కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్మంజూరు చేసింది. అయితే ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్ సునీతారెడ్డి వేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు తెలిపింది. జూన్ 13న జస్టిస్ అనురుద్ధ బోస్, జస్టిస్ రాజేశ్ బిందాల్‌తో కూడిన ధర్మాసనం సునీత దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణ చేపట్టనుంది. తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ అవినాష్ రెడ్డికి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలన్నది సునీత పిటిషన్ సారాంశం. ఇవాళ(శుక్రవారం) సుప్రీంకోర్టులో పిటిషన్‌పై మెన్షన్ చేసిన సునీత తరపు న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా విచారణ చేపట్టాలని కోరారు. వివేకా కేసులో దర్యాప్తు కోసం రావాలని సీబీఐ కోరుతున్నా.. అవినాష్‌రెడ్డి హాజరు కాలేదని న్యాయవాది లూథ్రా కోర్టుకు తెలిపారు. అయితే, ఇప్పటివరకు 7 సార్లు అవినాష్ రెడ్డి సీబీఐ ముందు హాజరు అయిన విషయం తెలిసిందే. బెయిల్ తర్వాత కూడా శనివారం రోజున అవినాష్‌రెడ్డి సీబీఐ ముందు హాజరయ్యారు. ఈ విషయాన్ని సమగ్రంగా వివరించకుండా.. అవినాష్‌రెడ్డి లక్ష్యంగా కొన్ని తప్పుడు వాదనలు వినిపించారు సునీత తరపు న్యాయవాది. ఇక తెలంగాణ హైకోర్టులో వెకేషన్ బెంచ్ ముందు జరిగిన వాదనల సందర్భంగా హైకోర్టు లేవనెత్తిన ప్రశ్నలను మాత్రం సునీత తన పిటిషన్లో సుప్రీంకోర్టు ముందు ఉంచకపోవడం గమనార్హం. ఎలాంటి ఆధారాలు లేకుండా, కేవలం హియర్ సే పేరుతో, కొన్ని కల్పిత కథనాలను సృష్టించి, వాటిని తెలుగుదేశం సహకారంతో ఎల్లో మీడియాలో పబ్లిష్ చేయించి వాటి ఆధారంగానే మరోసారి సుప్రీంకోర్టును సునీత ఆశ్రయించినట్టు తాజా పిటిషన్ ద్వారా అవగతమవుతోంది. దర్యాప్తునకు అవినాష్‌రెడ్డి అన్నివిధాలుగా సహకరిస్తున్నప్పటికీ.. సునీత తరపు న్యాయవాది మాత్రం ఆయన దర్యాప్తును అడ్డుకుంటున్నారంటూ ధర్మాసనానికి వినిపించారు. దీనిపై స్పందించిన బెంచ్.. పిటిషన్‌పై మంగళవారం విచారణ జరుపుతామని తెలిపింది. ఇదీ చదవండి: ఇది వ్యక్తిగత దాడి మాత్రమే కాదు! -
ఆలస్యమైనా..న్యాయమే గెలిచింది
-
ఏబీఎన్, మహా టీవీ వీడియోలను కోర్డుకు ఇవ్వండి
-
నిందితులు ఇచ్చిన స్టేట్ మెంట్ లో అవినాష్ రెడ్డి పేరు లేదు: లాయర్లు
-
YS Avinash Reddy: అందుకే అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిల్ వచ్చింది
సాక్షి, హైదరాబాద్: వివేకా హత్య కేసులో విచారణ జరుపుతున్న దర్యాప్తు సంస్థ సీబీఐ.. ఎంపీ అవినాష్ రెడ్డిని టార్గెట్ చేసిందని, ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లామని, కోర్టు ఆ వాదనతో ఏకీభవించి ముందస్తు బెయిల్ మంజూరు చేసిందని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు ‘సాక్షి’కి తెలిపారు. అంతేకాదు వివేకా కేసులో అవినాష్‌కు సంబంధం ఉన్నట్లు ఒక్క ఆధారం లేదని.. అందుకే కోర్టు ఆ తీర్పు ఇచ్చిందని అంటున్నారు. వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి బుధవారం ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఊరట ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. ఈ క్రమంలో తీర్పు అనంతరం బయటకు వచ్చిన ఆయన తరపున న్యాయవాదులు సాక్షితో మాట్లాడారు. అవినాష్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన విషయాన్ని ఆయన తరపు న్యాయవాది నాగార్జున రెడ్డి సాక్షికి వివరించారు. ‘‘సీబీఐ అవినాష్‌రెడ్డిని టార్గెట్ చేసిందని కోర్టుకు తెలిపాం. నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్లో అవినాష్ పేరు లేదని బెంచ్ దృష్టికి తీసుకెళ్లాం. టీడీపీ ప్రభుత్వ హయాంలో వివేకా హత్య జరిగింది. ఆ సమయంలో సిట్ ఏర్పాటు చేసి.. వందల మందిని విచారించారు. కానీ, ఏ ఒక్కరు కూడా అవినాష్ రెడ్డి పేరు చెప్పలేదు. కావాలనే అవినాష్‌రెడ్డిని టార్గెట్ చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లాం. ఆ వాదనతో కోర్టు ఏకీభవించి.. కస్టడీ విచారణ అవసరం లేదని అభిప్రాయపడింది. అదే సమయంలో విచారణకు సహకరించాలంటూ అవినాష్ రెడ్డిని కోర్టు ఆదేశించింది. ప్రతీ శనివారం అవినాష్ రెడ్డి సీబీఐ కార్యాలయానికి వెళ్లాలి. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్యలో సీబీఐ కార్యాలయానికి హాజరు కావాలని ఆ ఆదేశాల్లో పేర్కొందని వివరించారు. అవినాష్ రెడ్డికి ఈకేసుతో సంబంధం ఉందని ఒక్క ఆధారం లేదు. అందుకే ముందస్తు బెయిల్ ఇచ్చారు అని ఆయన తరపు న్యాయవాది నాగార్జున రెడ్డి సాక్షికి తెలిపారు. సిబిఐ చెప్పిన రాజకీయ కారణాలు కూడా సహేతుకంగా లేవని కోర్టుకు విన్నవించాం. కేవలం కక్ష సాధింపులో భాగంగా, ప్రత్యర్థులపై బురద జల్లేలా సిబిఐ చేసిన ఆరోపణలున్నాయని, పైగా అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీతో పాటు దానికి అనుబంధంగా ఉన్న ఎల్లో మీడియాలో చేసిన ఆరోపణలనే సిబిఐ తన వాదనలుగా చేర్చిందని కోర్టుకు తెలిపామని న్యాయవాదులు వివరించారు. కేవలం హియర్ సే ఆధారంగా ఒకరిపై బురద జల్లడం సరికాదని, నిందారోపణలు చేసినంత మాత్రానా న్యాయం అందకుండా పోదన్న విషయం రుజువయిందన్నారు. ఇదీ చదవండి: ముందస్తు బెయిల్‌కు హైకోర్టు విధించిన షరతులు ఇవే.. -
అవినాష్ రెడ్డికి ఊరట
-
అవినాష్ రెడ్డిని బుధవారం వరకు అరెస్ట్ చేయొద్దన్న హైకోర్టు
-
31వరకు అవినాష్ అరెస్ట్ వద్దు, CBIకి హైకోర్టు సూచన
హైదరాబాద్: అవినాష్‌రెడ్డిని ఈ నెల 31 వరకు (బుధవారం) అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు సిబిఐకి సూచించింది. ఎంపీ అవినాష్ రెడ్డి పిటిషన్ పై సుదీర్ఘ వాదనల అనంతరం హైకోర్టు ఈ సూచనలు చేసింది. 31న తుది ఉత్తర్వులు ఇస్తామని, అప్పటివరకు ఎలాంటి కఠిన చర్య తీసుకోవద్దని సూచించింది. నిన్నటికి కొనసాగింపుగా ఇవ్వాళ కూడా అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందు సుదీర్ఘ విచారణ జరిగింది. నిన్న అవినాష్ రెడ్డి, సునీత వాదనలు పూర్తి కాగా, ఇవ్వాళ సీబీఐ తరఫు న్యాయవాది ప్రభుత్వ ప్రత్యేక ప్రాసిక్యూటర్ అనిల్ వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా CBI SP వికాస్ సింగ్, ASP ముఖేష్ శర్మతో పాటు సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి కోర్టు హాల్ కు వచ్చారు. కేసు దర్యాప్తులో అవినాష్ రెడ్డి ఆటంకాలు కలిగిస్తున్నారని, విచారణకు సహకరించడం లేదని సిబిఐ లాయర్ అనిల్ ఆరోపించారు. హత్యకు రాజకీయ కారణాలున్నాయని తెలిపింది. దీనిపై హైకోర్టు వెకేషన్ బెంచ్ కొన్ని ప్రశ్నలు అడిగింది. మీ పద్ధతి సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం కాదా? అవినాష్‌రెడ్డిపై ఏ ఆధారాల మేరకు అభియోగాలు మోపుతున్నారని హైకోర్టు ప్రశ్నించగా.. దానికి కొందరు సాక్షుల వాంగ్మూలాల మేరకేనని సిబిఐ తెలిపింది. ఒక సీల్డ్ కవర్లో సాక్షుల వాంగ్మూలాలు కోర్టుకు సమర్పిస్తామని సిబిఐ తెలిపింది. దీనిపై స్పందించిన హైకోర్టు.. సాక్షుల వాంగ్మూలాల వివరాలను పిటిషనర్ అయిన అవినాష్ రెడ్డికి కూడా ఇస్తారా అని ప్రశ్నించింది. దీనిపై సిబిఐ వివరణ ఇచ్చింది. సాక్షుల వివరాలను కేవలం కోర్టుకు మాత్రమే ఇస్తామని, ప్రస్తుత దశలో బయటపెట్టలేమని తెలిపింది. సిబిఐ స్పందనపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. సాక్షుల వాంగ్మూలాలపై అవినాష్ రెడ్డి వాదనలు వినకుండా ఎలా పరిగణనలోకి తీసుకున్నారు? వాటిని కోర్టు ఎలా పరిగణించాలి అని ప్రశ్నించింది. ఏ కేసులోనయినా,.. ఏ ఆధారంపైనయినా.. ఇరుపక్షాల వాదనలు వినాలని సూచించింది. సిబిఐ తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం కాదా అని హైకోర్టు ప్రశ్నించింది. అ అవసరం అవినాష్‌కు ఏముంది? ‘అవినాష్ ఇంట్లో ఎ-2 నిందితుడు ఉన్నారని ఎలా చెబుతున్నారు?, ఆధారాల సేకరణకు ఎందుకు ఆలస్యమైంది? లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిత్వం కోసమే వివేకా హత్య జరిగిందని ఎలా చెప్తున్నారు? లోక్‌సభ అభ్యర్ధిగా అవినాష్‌ను అనధికారికంగా ముందే ప్రకటించారని మీ చార్జ్‌షీట్‌లో చాలామంది స్టేట్మెంట్లు ఉన్నాయి కదా? అవినాష్ అభ్యర్థిత్వాన్ని అందరూ సమర్ధించిన స్టేట్మెంట్లు ఉన్నాయి కదా?, అవినాష్ చాలా బలమైన కుటుంబ నేపథ్యమని మీరే అంటున్నారు. అలా అయితే 2017 ఎమ్మెల్సీ ఎన్నికలను మేనేజ్ చేసి ఉండొచ్చు కదా?, వివేకాను హత్య చేయాల్సిన అవసరం అవినాష్‌కు ఏముంది?. వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్‌కుమార్ రెడ్డి అరెస్ట్‌కు కారణాలేంటి?. కస్టడీలో వారిద్దరి నుంచి ఏం తెలుసుకున్నారు?’ అని సీబీఐ న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై రిప్లై వాదనల్లో తమ వాదన వినిపించారు అవినాష్ తరపు న్యాయవాది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమికి అవినాష్ కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఓటర్లు ఓట్లు వేయకపోవడం వల్లే వివేకా ఓడిపోయారు తప్ప.. దాన్ని అవినాష్ కు ఎలా అంటగడతారని ప్రశ్నించారు. అది ఎవిడెన్స్ ట్యాంపర్ ఎలా అవుతుంది? ‘గదిలో రక్తం మరకలు తుడిచేస్తే ఏమవుతుంది.. శరీరంపై గాయాలు ఉంటాయి కదా? ఒక లీడర్ హత్య జరిగిందంటే ప్రజలు ఊరుకుంటారా? వివేకా మృతదేహం చూడగానే గాయాలు కనిపించాయా?, హత్య అని తెలుస్తున్నప్పుడు గదిలో రక్తపు మరకలతో అవసరం ఏముంది?’, అని సీబీఐ న్యాయవాదికి ప్రశ్నలు సంధించింది హైకోర్టు. గంగిరెడ్డిని whatsapp చాట్ గురించి అడిగారా? వాట్సాప్ ద్వారా అవినాష్ సంభాషించాడంటూ సిబిఐ చేసిన వాదనలపై హైకోర్టు పలు ప్రశ్నలు లేవనెత్తింది. అవినాష్ డేటా వినియోగించాడంటున్నారు.. అది వాట్సాప్ కాల్ అని ఎలా చెప్పగలరు? ఒక వేళ అవినాష్ వాట్సాప్ కాల్ చేశాడని చెబుతున్నారు? ఎవరెవరితో మాట్లాడారు? అవినాష్ IPDR డాటా ఎప్పుడు సేకరించారు? అవినాష్ డాటా తీసుకున్నప్పుడు.. ఇతర నిందితుల వాట్సాప్ డేటా కూడా తీసుకున్నారా? A1 ఉన్న గంగిరెడ్డిని వాట్సాప్ చాట్ గురించి అడిగారా? అని హైకోర్టు ప్రశ్నలు సంధించింది దీనికి సీబీఐ సమాధానం చెబుతూ.. విచారణలో అవినాష్‌తో చాట్ చేయలేదని గంగిరెడ్డి చెప్పాడని తెలిపింది. మరి తెల్లవారుజామున అవినాష్‌రెడ్డి ఎవరితో చాట్ చేశారు’ అని హైకోర్టు అడగ్గా.. వాట్సాప్ కాల్ చేసినట్లు మాత్రమే భావిస్తున్నామని సీబీఐ తెలిపింది. వాట్సాప్ కాల్ ఎవరితో మాట్లాడారో ఇంటర్నెట్ ద్వారా గుర్తించలేమని స్పష్టం చేసింది. మరి అవినాష్ వాట్సాప్ లో ఉన్న సమయంలో గంగిరెడ్డి వాట్పాప్ బిజిగా ఉందా? అని ప్రశ్నించింది హైకోర్టు. ఇంత నత్త నడక దర్యాప్తు ఏమిటి? కేసు దర్యాప్తు విషయంలో CBI తీరును ప్రశ్నించింది హైకోర్టు. అసలు అవినాష్ రెడ్డి డేటాను ఎప్పుడు సేకరించారని హైకోర్టు ప్రశ్నించగా.. ఈ నెల 12నే సేకరించామని తెలిపింది. CBI సమాధానంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. వివేకా హత్య వెనక భారీ కుట్ర జరిగిందని, అందులో అవినాష్ పాత్ర ఉన్నట్టు ఎప్పటినుంచో అనుమానిస్తున్నామని చెబుతున్న CBI దర్యాప్తులో ఇంత ఆలస్యం ఎందుకు చేసినట్టని హైకోర్టు ప్రశ్నించింది. హత్య జరిగి ఇన్నాళ్లయిన తర్వాత అవినాష్ పాత్ర కోసం CBI చేస్తున్న ప్రయత్నంపై అసహనం వ్యక్తం చేసింది. నిజంగా మీకు ముందు నుంచే అనుమానం ఉండి ఉంటే.. అవినాష్ రెడ్డి మొబైల్ ఫోన్ ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? కీలక అంశాలపై ఇంత నత్త నడక దర్యాప్తు ఏమిటి? అని నిలదీసింది హైకోర్టు. వివేక హత్య జరిగిన కరెక్ట్ సమయం చెప్పమని సీబీఐని హైకోర్టు ప్రశ్నించగా, మే 15 తెల్లవారు జామున 1:10 గంటల నుంచి 1:30 గంటల మధ్య వివేక హత్య జరిగినట్లు భావిస్తున్నామని సీబీఐ తెలిపింది. -
అవినాశ్ ముందస్తు బెయిలుపై నిర్ణయానికి ఇన్ని రోజులా!
సాక్షి, న్యూఢిల్లీ: ఎంపీ అవినాశ్‌రెడ్డి ముందస్తు బెయిలుపై నిర్ణయం తీసుకోవడానికి ఇన్ని రోజులా అని తెలంగాణ హైకోర్టుపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తంచేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చినా ఉత్తర్వులు జారీ చేయకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తంచేసింది. అవినాశ్ పిటిషన్‌పై ఈ నెల 25న హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరిపి తగిన ఆదేశాలివ్వాలని ఆదేశించింది. గతంలో మరో బెంచ్ విచారించినప్పటికీ వెకేషన్ బెంచ్ విచారణకు అడ్డంకి కాదని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో ముందస్తు బెయిలు పిటిషన్ విచారణకు (జూన్ 5) వచ్చే వరకు సీబీఐ నుంచి మధ్యంతర రక్షణ కల్పించాలని లేదా తన పిటిషన్‌ను వెకేషన్ బెంచ్ విచారించేలా ఆదేశాలివ్వాలంటూ అవినాశ్‌రెడ్డి దాఖలు చేసిన అప్లికేషన్‌పై ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఏప్రిల్‌లో సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత హైకోర్టు విచారించలేదా అని జస్టిస్ నరసింహ ప్రశ్నించారు. హైకోర్టు రెండుసార్లు విచారించిందని, ఉత్తర్వులు ఇవ్వలేదని, జూన్ 5కు వాయిదా వేసిందని, మే 15న సీబీఐ నుంచి నోటీసులు వచ్చాయని అవినాశ్ తరపున సీనియర్ న్యాయవాది వి.గిరి తెలిపారు. ఆ తర్వాత ఏం జరిగిందని ధర్మాసనం ప్రశ్నించగా.. సీబీఐ నోటీసులు ఇచ్చిందన్నారు. ‘హైకోర్టులో విచారణ ఉండగా సీబీఐ నోటీసులు ఇవ్వడం గమనార్హం’ అని అభిప్రాయపడిన ధర్మాసనం.. సీబీఐ విచారణకు హాజరు కాలేదు కదా అని అనగా.. ఏడుసార్లు పిటిషనర్ హాజరయ్యారని గిరి తెలిపారు. ఒక్క రోజు వ్యవధిలో రావాలని నోటీసులు ఇవ్వడంతో మూడు రోజులు సమయం కోరామన్నారు. సీబీఐ తరపున ఎవరైనా హాజరయ్యారా అని ధర్మాసనం ప్రశ్నించగా.. ఎవరూ హాజరు కాలేదని వైఎస్ వివేకా కుమార్తె సునీత తరపు న్యాయవాది లూత్రా తెలిపారు. హైకోర్టులో ఏప్రిల్ 27న ఇద్దరి పిటిషన్లూ విచారణకు వచ్చాయని, సీజే వద్దకు వెళ్లినా ఎలాంటి ఆర్డర్ రాలేదని, జూన్ 5న మేటర్ జాబితా అయిందని లూత్రా వివరించారు. జస్టిస్ నరసింహ జోక్యం చేసుకొని.. ఏమైనా అరెస్టు భయం ఉందా అని ప్రశ్నించారు. తాను మొదటి నుంచి అదే చెబుతున్నానని, ఇప్పటికే అవినాశ్ తండ్రి అరెస్టయ్యారని, తల్లి ఆసుపత్రిలో ఉన్నారని గిరి చెప్పారు. ఈ సమయంలో లూత్రా జోక్యం చేసుకోవడంతో గిరి ఒకింత అసహనం వ్యక్తం చేశారు. గిరిని ధర్మాసనం మందలించడంతో ఆయన ధర్మాసనానికి క్షమాపణలు తెలిపారు. బెయిలు కోరే హక్కు పిటిషనర్‌కు ఉందని ధర్మాసనం లూత్రానుద్దేశించి వ్యాఖ్యానించింది. హైకోర్టు వెకేషన్ బెంచ్ గురించి ఆరా తీసింది. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లు వెకేషన్ బెంచ్ వినాలని సూచిస్తామని తెలిపింది. హైకోర్టుకు వెళ్లాలని ఇరువర్గాలకు తెలిపింది. అవినాశ్ వద్దకు వెళ్లాలని సీబీఐ ప్రయత్నించగా వందలాది మంది అనుచరులు అడ్డుకున్నారని లూత్రా అనగా.. అవన్నీ సీబీఐ న్యాయవాది చెబుతారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అనంతరం జస్టిస్ నరసింహ ఉత్తర్వులు వెలువరించారు. Justice Narasimha: He has the right to... Mr. Luthra you can take all these objections when the anticipatory bail is taken up by vacation bench. — Live Law (@LiveLawIndia) May 23, 2023 Bench: ...We are inclined to accept the prayer as the anticipatory bail taken up for hearing pursuant to our order was heard, but no order was passed...We direct the Criminal LP...will be placed before next vacation bench on 25.05.2023... — Live Law (@LiveLawIndia) May 23, 2023 ఇది కూడా చదవండి: టీడీపీ మీడియాకే స్వేచ్ఛ ఉంటుందా.. విలువలు లేకుండా ఇంతలా దిగజారాలా? -
ఆ బీజేపీ ఎమ్మెల్యేకు ఈ రేంజ్లో వెల్కం.. ఏందిరా నాయనా..?
బెంగళూరు: రూ.6 కోట్ల అవినీతి కేసులో ముందస్తు బెయిల్ పొందిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మదల్ విరూపాక్షప్పకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కమలం పార్టీ కార్యకర్తలు ఆయనపై పూలవర్షం కురిపించారు. బాణసంచా పేల్చి హంగామా చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు చలోక్తులు విసిరారు. దేశాన్ని ఉద్దరించిన వాళ్లకు కూడా ఇలాంటి స్వాగతం లభించదురా నాయనా? అని నవ్వుకుంటున్నారు. దేశం కోసం ధర్మం కోసం అంటే ఇదేనంటారా? అని సెటైర్లు వేశారు. Celebration after MLA was given a bail after his son Prashanth Madal was caught red-handed by the Lokayukta police while accepting Rs 40 lakh bribe, The Lokayukta police also seized Rs 6 crore in cash during the searches his house.pic.twitter.com/WFSWPuE8RK — Mohammed Zubair (@zoo_bear) March 7, 2023 కాగా.. విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ రూ.40లక్షలు లంచం తీసుకుంటూ లోకాయుక్తా అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన విషయం తెలిసిందే. ఆరోజే విరూపాక్షప్ప నివాసాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు రూ.6కోట్ల అక్రమ నగదు, ఆభరణాలు గుర్తించారు. కుమారుడు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికినా విరూపాక్షప్ప మాత్రం ఇందులో తన ప్రమేయం లేదని చెప్పడం గమనార్హం. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జంట్స్ లిమిటెడ్ ఛైర్మన్ పదవి నుంచి ఆయన తప్పుకున్నారు. ఈ తర్వాత ఈ కేసులో అరెస్టు నుుంచి రక్షణ కల్పించేలా కోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఈ సందర్భంగానే పార్టీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. చదవండి: 44 ఏళ్ల వ్యాపారవేత్తతో 26 ఏళ్ల యువకుడి రిలేషన్.. పెళ్లి కుదిరినా అందుకు ఒప్పుకోలేదని దారుణంగా.. -
నారాయణ, లింగమనేని దేశం విడిచి వెళ్లరాదు!
సాక్షి, అమరావతి: అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ డిజైన్ల ముసుగులో సాగిన భూ దోపిడీపై ఇటీవల సీఐడీ నమోదు చేసిన కేసులో నిందితులుగా ఉన్న మాజీమంత్రి పొంగూరు నారాయణ, వ్యాపారవేత్త లింగమనేని రమేశ్, అతని సోదరుడు లింగమనేని వెంకటసూర్య రాజశేఖర్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ డైరెక్టర్ కేపీవీ అంజనీకుమార్‌లకు హైకోర్టు ఊరటనిచ్చింది. సీఐడీ నమోదు చేసిన కేసులో వారికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కానీ, కొన్ని షరతులు విధించింది. ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేసేంత వరకు దేశంలోనే ఉండాలని నిందితులను హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ దేశం విడిచి వెళ్లాలంటే సంబంధిత కోర్టు అనుమతి తీసుకోవాలని వారికి స్పష్టంచేసింది. రూ.50వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మంగళవారం తీర్పు వెలువరించారు. ఆళ్ల ఫిర్యాదు.. సీఐడీ కేసు.. అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్ డిజైన్ల మార్పు ముసుగులో భారీ భూ దోపిడీ జరిగిందంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా మాజీ సీఎం చంద్రబాబునాయుడు, మాజీమంత్రి పొంగూరు నారాయణ, వ్యాపారవేత్త లింగమనేని రమేశ్, అతని సోదరుడు లింగమనేని వెంకటసూర్య రాజశేఖర్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ డైరెక్టర్ కేపీవీ అంజనీకుమార్ తదితరులపై సీఐడీ ఈ ఏడాది మే 9న కేసు నమోదు చేసింది. ఈ కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ నారాయణ, లింగమనేని సోదరుడు, అంజనీకుమార్ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు విచారణ జరిపారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి జూన్ 17కు తీర్పును వాయిదా వేశారు. తీర్పు రిజర్వ్ చేసిన రెండున్నర నెలల తరువాత న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. -
టెర్రరిజం కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు ముందస్తు బెయిల్
ఇస్లామాబాద్: టెర్రరిజం కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్(పీటీఐ) చైర్మన్ ఇమ్రాన్ ఖాన్‌కు కొంత ఊరట లభించింది. ఆయనకు మూడు రోజులపాటు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఇస్లామాబాద్ హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత వారం రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన ఓ ర్యాలీలో ఇమ్రాన్ ప్రసంగించారు. పోలీసులను, న్యాయ వ్యవస్థను, ప్రభుత్వ వ్యవస్థలను దూషిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు ఆయనపై యాంటీ టెర్రరిజం యాక్ట్ కింద కేసు పెట్టారు. దీనిపై ఆయన ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ మొహిసిన్ అక్తర్ కయానీ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించింది. ప్రభు త్వం ఉద్దేశపూర్వకంగానే ఇమ్రాన్‌ను వేధిస్తోందని ఆయన తరఫు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇమ్రాన్‌కు బెయిల్ ఇవ్వాలని కోరారు. దీంతో ముందస్తు బెయిల్ ఇస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. -
రెజ్లర్ సుశీల్‌కు చుక్కెదురు.. ముందస్తు బెయిల్ కొట్టివేత
న్యూఢిల్లీ: యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో నిందితుడిగా ఉన్న భారత రెజ్లింగ్ స్టార్ సుశీల్ కుమార్‌కు కోర్టులోనూ చుక్కెదురైంది. గత రెండు వారాలుగా పరారీలో ఉన్న అతనికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అరెస్ట్ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో తనకు బెయిల్ ఇవ్వాలంటూ సోమవారం స్థానిక రోహిణి కోర్టులో సుశీల్ పిటిషన్ దాఖలు చేయగా... మంగళవారం అతని విజ్ఞప్తిని అడిషనల్ సెషన్స్ జడ్జి జగదీశ్ కుమార్ కొట్టి పారేశారు. ఘటనలో ప్రధాన కుట్రదారుడిగా సుశీల్‌పై ఉన్న అభియోగాలు తీవ్రమైనవవి న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. మే 4న ఛత్రశాల్ స్టేడియం ముందు రెండు వర్గాలు కొట్టుకున్న ఘటనలో జాతీయ మాజీ జూనియర్ చాంపియన్ సాగర్ రాణా మరణించగా... సుశీల్‌పై ఆరోపణలు రావడంతో అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 37 ఏళ్ల సుశీల్ భారత్ తరఫున 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం, 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజతం... 2010 ప్రపంచ చాంపియన్ షిప్లో స్వర్ణం... 2010 ఢిల్లీ, 2014 గ్లాస్గో, 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లలో స్వర్ణం... 2006 దోహా ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించాడు. దర్యాప్తునకు సహకరిస్తాం... బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుశీల్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లుథ్రా హాజరయ్యారు. ‘సదరు ఘటనతో నాకు ఎలాంటి సంబంధం లేదు. దర్యాప్తు మొత్తం నాకు వ్యతిరేకంగా పక్షపాత ధోరణిలో సాగుతోంది. విచారణ ముగిసేవరకు నేను సహకరించి వాస్తవాలు ఏమిటో చెబుతా. బాధితుల స్టేట్మెంట్లు ఇప్పటికే రికార్డు చేశారు. ఘటన జరిగిన స్థలం వద్ద నాకు సంబంధించిన ఎలాంటి వస్తువులు లభ్యం కాలేదు. అక్కడ జరిగినట్లుగా చెబుతున్న కాల్పులతో కూడా నాకు ఎలాంటి సంబంధం లేదు. పోలీసులకు లభించిన తుపాకీ, వాహనం నావి కావు. ఇలాంటి స్థితిలో నన్ను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించాల్సిన అవసరం లేదు’ అని సుశీల్ తన బెయిల్ పిటిషన్లో పేర్కొన్నాడు. గొడవ సమయంలో అక్కడే ఉన్న సోనూ అనే వ్యక్తి రౌడీషీటర్ అని... తనతో విభేదాలు ఉన్న సోనూ నుంచి సుశీల్‌కు హాని జరిగే అవకాశం కూడా ఉందని లుథ్రా వాదించారు. సాక్ష్యాలు బలంగా ఉన్నాయి... అయితే నిందితుడి తరఫు వాదనతో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాత్సవ విభేదించారు. ‘సుశీల్‌కు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు ఉన్నాయి. చేతిలో కర్రతో అతడు కొడుతున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. మొత్తం ఘటనలో అతనే ప్రధాన నిందితుడు. దాడి చేయడంలో అతనిదే కీలకపాత్ర. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిపుణులు కూడా నేరం చేయడంలో సుశీల్ చురుగ్గా పాల్గొన్నాడని నిర్ధారించారు. కేసులో వాస్తవాలు వెలికితీయాలంటే సుశీల్‌ను కస్టడీలోకి తీసుకొని విచారించడం తప్పనిసరి. అతను దేశం విడిచి వెళ్లి పారిపోకుండా ఇప్పటికే పాస్‌పోర్ట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నాం’ అని వాదించారు. దీనిని అంగీకరిస్తూ న్యాయమూర్తి బెయిల్ తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. ‘విచారణ ఇంకా కొనసాగుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో కొందరు ఇంకా అరెస్టు కాలేదు. సుశీల్‌పై ఇప్పటికే నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్ జారీ అయింది. ఇలాంటి స్థితిలో ముందస్తు బెయిల్ కుదరదు’ అని స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు 302 (హత్య) సహా ఐపీసీ, ఆయుధాల చట్టంలోని 11 వేర్వేరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ముందస్తు బెయిల్ కుదరదు చదవండి: Sushil Kumar: ఆచూకీ చెబితే రూ.1 లక్ష! -
భార్గవ్రామ్కు కోర్టులో చుక్కెదురు..
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్రామ్కు సికింద్రాబాద్ కోర్టులో చుక్కెదురయ్యింది. భార్గవ్‌రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో 19 మందిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. హఫీజ్‌పేట భూవివాదం నేపథ్యంలో జరిగిన ఈ కిడ్నాప్ కేసులో ముఖ్య నిందితులు అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్, సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి, అనుచరుడు గుంటూరు శ్రీను, భార్గవ్‌రామ్ తల్లిదండ్రులతో సహా మరో 9 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. (చదవండి: ఈవెంట్‌లా కిడ్నాప్.. ఎవరెవరి పాత్రలు ఏంటంటే) అఖిలప్రియకు బెయిల్ మంజూరు అఖిలప్రియకు శుక్రవారం సెసెషన్స్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేల పూచీకత్తుతో ఇద్దరు షూరిటీలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న అఖిలప్రియ.. రేపు(శనివారం) జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. చదవండి: డిసెంబర్లోనే స్కెచ్ వేశారు! -
‘అత్యాచారం జరిగాక నిద్రపోవడం ఏంటి?’
బెంగళూరు: కర్ణాటక హై కోర్టు బుధవారం సంచలన వ్యాఖ్యలు చేసింది. అత్యాచారం కేసులో నిందితుడికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ.. ‘అత్యాచారం జరిగిన తర్వాత ఓ భారతీయ మహిళ నిద్రపోవడం అనేది అసాధరణమైన విషయం’ అని కోర్టు అభిప్రాయపడింది. నిందితుడు రాకేశ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్ ఈ వ్యాఖ్యలు చేశారు. బార్ అండ్ బెంచ్‌లోని నివేదిక ప్రకారం.. జస్టిస్ కృష్ణ తీర్పు వెల్లడిస్తూ.. ‘ఈ దారుణం జరిగిన తరువాత అలసిపోయి నిద్రపోయానని సదరు యువతి వివరణ ఇచ్చింది. తన జీవితం నాశనం అయ్యిందని తెలిసిన తర్వాత ఓ మహిళ స్పందన ఇలా ఉండదు. మరి ముఖ్యంగా భారతీయ మహిళలు ఎవరు ఇలా స్పందించరు’ అని పేర్కొన్నారు. అంతేకాక బెయిల్ మంజూరు చేయడానికి మరొక కారణం ఏమిటంటే, బాధితురాలు రాత్రి 11 గంటలకు నిందితుడి కార్యాలయానికి ఎందుకు వెళ్లిందో వివరించడంలో విఫలమయ్యిందని తెలిపారు. అంతేకాక నేరం జరిగినట్లు ఆరోపించిన నాటి రాత్రి ఆమె నిందితుడితో కలిసి మద్యం తాగడానికి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు అని జస్టిస్ కృష్ణ పేర్కొన్నారు. (‘డేటింగ్ ఫ్రెండే’ దోచేసింది) ఇదిలావుండగా, బెయిల్ మంజూరు చేస్తూ నిందితుడు రాకేష్‌కు కోర్టు అనేక షరతులు విదించింది. నిందితుడు అనుమతి లేకుండా ట్రయల్ కోర్టు అధికార పరిధి దాటి వెళ్లకూడదని తెలిపింది. ప్రతి నెల ప్రతి రెండవ, నాల్గవ శనివారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సంతకం చేయాలని కోర్టు ఆదేశించింది. బాధితురాలు గత రెండేళ్లుగా నిందితుడి వద్ద పని చేస్తుంది. అయితే వివాహం చేసుకుంటానని చెప్పి రాకేష్ తనతో శారీరక సంబంధం పెట్టుకున్నట్లు ఆమె కోర్టుకు తెలిపింది. -
బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన ఇస్లాం ఖాన్
న్యూఢిల్లీ : తనపై నమోదైన దేశ ద్రోహ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఢిల్లీ మైనార్టీ కమిషన్ చైర్మన్ జఫారుల్ ఇస్లాం ఖాన్ శుక్రవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన ల్యాప్‌టాప్, ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోవద్దని కోరారు. తాను ఎలాంటి నేరం చేయలేదని, తనను బెదిరించి బయపెట్టాలనే ఉద్దేశంతోనే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే తాను ప్రభుత్వ ఉద్యోగిని అని, 72 సంవత్సరాల వయస్సు కలిగిన సీనియర్ సిటిజన్ అనే కారణాలతో ఖాన్ ముందుస్తు బెయిల్ కోరారు. గుండె జబ్బులు, రక్తపోటు సమస్యలతో బాధపడుతున్నట్లు అలాగే కోవిడ్-19 వచ్చే అవకాశం ఎక్కువ ఉందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాని కేసు నుంచి తనకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని ఖాన్ తరఫు న్యాయవాదులు వ్రిందా గ్రోవర్, రత్న అప్పెండర్, సౌతిక్ బెనర్జీ పిటిషన్ దాఖలు చేశారు. (ఢిల్లీ మైనారిటీస్ కమిషన్ చైర్మన్‌పై దేశద్రోహం కేసు) కాగా ఏప్రిల్ 28న జఫారుల్ ఇస్లాం తన సోషల్ మీడియా ఖాతా ద్వారా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు అతనిపై దోశ ద్రోహ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఖాన్ వ్యాఖ్యలు మత భవాలను రెచ్చగొట్టే విధంగా, సమాజానికి విఘాతం కలిగించేలా ఉన్నాయని వసంత్ కంజ్ ప్రాంతానికి చెందిన నివాసితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జఫారుల్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ మేరకు సెక్షన్ 124 ఏ(దేశద్రోహం), సెక్షన్ 153ఏ (జాతి వివక్ష వ్యాఖ్యలు) కింద ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ కేసులు నమోదు చేసింది. (జులై 1 నుంచి సీబీఎస్ఈ పరీక్షలు) -
చిదంబరం కస్టడీ అవసరమే
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ప్రధాన నిందితుడని ప్రాథమికంగా తెలుస్తోందనీ, ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని ఢిల్లీ హైకోర్టు మంగళవారం వ్యాఖ్యానించింది. ఈ కేసుకు సంబంధించి అవినీతి, నగదు అక్రమ చలామణి కేసుల్లో చిదంబరం దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో చిదంబరంను అరెస్టు చేసేందుకు సీబీఐ, ఈడీలకు మార్గం సుగమమైంది. మంగళవారం రాత్రే సీబీఐ, ఈడీ అధికారుల బృందాలు ఢిల్లీలోని చిదంబరం ఇంటికి చేరుకోగా, ఆ సమయంలో ఆయన ఇంట్లో లేరని సమాచారం. 3రోజుల్లో తాము సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నాననీ, అంతవరకు తనను అరెస్టు చేయకుండా తాత్కాలిక రక్షణ కల్పించాలని చిదంబరం కోరినా హైకోర్టు ఒప్పుకోలేదు. దీంతో ముందస్తు బెయిలు కోసం సుప్రీంకోర్టులో బుధవారమే అత్యవసర విచారణ కోరాలని చిదంబరం లాయర్లు నిర్ణయించారు. విచారణను నీరుగార్చలేం.. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు తనకు ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ చిదంబరం ఢిల్లీ హైకోర్టులో గతంలో పిటిషన్ వేశారు. గురువారం పదవీ విరమణ పొందనున్న న్యాయమూర్తి జస్టిస్ సునీల్ గౌర్ చిదంబరం అభ్యర్థనను తోసిపుచ్చారు. చిదంబరమే ప్రధాన నిందితుడనీ ప్రాథమికంగా తెలుస్తున్నందున, న్యాయపరమైన అడ్డంకులను సృష్టించి దర్యాప్తు సంస్థలను విచారణను నీరుగార్చలేమని ఆయన అన్నారు. హైకోర్టులో ఎలాంటి ఉపశమనమూ లభించకపోవడంతో చిదంబరం ఆ వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడ కూడా ఆయనకు తక్షణ ఉపశమనమేదీ లభించనప్పటికీ, ఆయన పిటిషన్ బుధవారం విచారణకు రానుంది. చిదంబరం ఇంటికి సీబీఐ, ఈడీ చిదంబరానికి ముందస్తు బెయిలును నిరాకరిస్తూ సాయంత్రం 3.40 గంటల సమయంలో ఢిల్లీ హైకోర్టు తీర్పునివ్వడంతో రాత్రికే సీబీఐ, ఈడీ అధికారులు ఢిల్లీలోని చిదంబరం ఇంటికి చేరుకున్నారు. మొదట సీబీఐ, ఆ తర్వాత కొద్దిసేపటికే ఈడీ అధికారులు వెళ్లారు. అయితే అధికారులు ఎవ్వరూ మీడియాతో మాట్లాడలేదు. చిదంబరం ఇంటికి రావడం వెనుక ఉన్న ఉద్దేశమేంటని ప్రశ్నించినా వారు నోరు మెదపలేదు. అధికారులు వెళ్లిన సమయంలో చిదంబరం ఇంట్లో లేరని సమాచారం. ‘ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం ప్రధాన నిందితుడని ప్రాథమికంగా తెలుస్తోంది. ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని మేం భావిస్తున్నాం. చిదంబరం పార్లమెంటు సభ్యుడు అయినంత మాత్రాన ఆయనకు ముందస్తు బెయిలు ఇవ్వలేం. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా చిదంబరంపై ఈ కేసులు పెట్టారని ఇప్పుడే చెప్పడం అర్థం లేని పని.’ – ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ సునీల్ గౌర్ ‘మరో రెండ్రోజుల్లో పదవీ విరమణ పొందనున్న న్యాయమూర్తి జస్టిస్ సునీల్ గౌర్ హడావుడిగా సాయంత్రం 3.40 గంటలకు ఈ తీర్పు చెప్పారు. ఈ తీర్పును ఈ ఏడాది జనవరిలోనే రిజర్వ్‌లో ఉంచారు. మరో మూడు రోజులు ఆగి తీర్పును వెలువరించాలని కోరాం. అయినా జస్టిస్ గౌర్ మా విజ్ఞప్తిని పట్టించుకోకుండా మంగళవారమే తీర్పు ఇచ్చారు.’ – కపిల్ సిబల్, చిదంబరం తరఫు న్యాయవాది ఐఎన్ఎక్స్ కేసు ఇదీ.. 2007– ఐఎన్ఎక్స్ మీడియా సంస్థకు విదేశాల నుంచి రూ. 305 కోట్ల నిధులు అందుకోవడానికి ఆమోదం తెలిపిన విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్ఐపీబీ). ఆ సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం. ఎఫ్ఐపీబీ ఆమోదం లభించడం వెనుక అవకతవకలు ఉన్నాయని ఆరోపణలు. ► 2017 మే 15: ఐఎన్ఎక్స్ మీడియా వ్యవహారంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ. ► 2018 : ఐఎన్ఎక్స్ మీడియాపై మనీలాండరింగ్ కేసు పెట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ). ► 2018 మే 30 : సీబీఐ కేసులో తనకు ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన చిదంబరం. ► 2018 జూలై 23:ఈడీ కేసులోనూ ముందస్తు బెయిలు ఇవ్వాలని మరోసారి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిన చిదంబరం. ► 2018 జూలై 25 : ఈ రెండు కేసుల్లోనూ అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పిస్తూ తొలిసారి ఉత్తర్వులిచ్చిన ఢిల్లీ హైకోర్టు. ఆ తర్వాత పలుమార్లు ఆ గడువు పొడిగింపు. ► 2019 జనవరి 25: ముందస్తు బెయిలుపై తీర్పును రిజర్వ్‌లో ఉంచిన ఢిల్లీ హైకోర్టు. ► 2019 ఆగస్టు 20 : తీర్పు చెబుతూ, చిదంబరం బెయిలు అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు. -
‘బిగ్‌బాస్’కు ఊరట
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-3 నిర్వాహకులకు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. బిగ్‌బాస్ కోఆర్డినేటర్ టీమ్ సభ్యులకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బిగ్‌బాస్ కోఆర్డినేటర్స్ మహిళలను వేధిస్తున్నారంటూ.. జర్నలిస్ట్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా కార్యక్రమ నిర్వాహకులు అభిషేక్, రవికాంత్, రఘులపై బంజారాహిల్స్ , రాయదుర్గం పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. బిగ్‌బాస్ అగ్రిమెంట్ వ్యవహారంతో పాటు క్యాస్టింగ్ కౌచ్ ఉన్నట్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ పోలీసులు వారిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. విచారణ నిమిత్తం నోటీసులు అందజేశారు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ టీమ్ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. వారి వాదనలు విన్నధర్మాసనం బిగ్‌బాస్ టీం సభ్యులకు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. -
రవి ప్రకాశ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు
సాక్షి, హైదరాబాద్ : ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసుల్లో నిందితుడిగా ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు తెలంగాణ హైకోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల విచారణకు సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. వారానికి ఒకసారి పోలీసుల ముందు హాజరు కావాలని హైకోర్టు పేర్కొంది. అదే విధంగా కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి ఎక్కడికి వెళ్లకూడదని రవిప్రకాశ్‌ను ఆదేశించింది. కాగా గతంలో రవిప్రకాశ్ రెండు సార్లు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడిన రవిప్రకాశ్‌కు బెయిల్ మంజూరు చేస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారని, కేసు దర్యాప్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉండేలా చేయగలరని ఆయనకు బెయిల్ ఇవ్వద్దని న్యాయవాదులు కోరారు. దాంతో తెలంగాణ హైకోర్టు రవిప్రకాశ్‌కు బెయిల్ నిరాకరించింది. అయితే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రవి ప్రకాశ్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, అక్కడ కూడా ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకే వెళ్లాలని సుప్రీం కోర్టు రవి ప్రకాశ్‌కు సూచించిన సంగతి తెలిసిందే. -
రవిప్రకాశ్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దు
సాక్షి, హైదరాబాద్: టీవీ9 యాజమాన్యం దాఖలు చేసిన కేసులో నిందితుడైన ఆ చానల్ మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో గట్టిగా వాదించింది. బెయిల్ మంజూరు చేస్తే రవిప్రకాశ్ సాక్షులను, ఆధారాలను ప్రభావితం చేస్తారని, పైగా మరో నిందితుడు నటుడు శివాజీ పరారీలో ఉన్నారని, దీంతో రవిప్రకాశ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశాలు బాగా ఉన్నాయంది. కింది కోర్టే కాకుండా సుప్రీంకోర్టు సైతం రవిప్రకాశ్‌కు బెయిల్ ఇవ్వలేదని తెలంగాణ పోలీసుల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరేన్ రావల్ వాదించారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రవిప్రకాశ్ దాఖలు చేసిన వ్యాజ్యంపై సోమవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గండికోట శ్రీదేవి ఎదుట వాదప్రతివాదనలు జరిగాయి. ఇప్పటికే కింది కోర్టు రవిప్రకాశ్ బెయిల్ దరఖాస్తును కొట్టివేసిందని, సుప్రీంకోర్టుకు వెళితే అరెస్ట్ నోటీసుకు 48 గంటల గడువు ఇవ్వాలని పేర్కొందని హరేన్ రావల్ చెప్పారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ ‘కింది కోర్టు ఉత్తర్వులకు ఇక్కడ సంబంధం లేదు. సుప్రీంకోర్టు రవిప్రకాశ్‌ను అరెస్ట్ చేయాలని ఆర్డర్ ఏమీ ఇవ్వలేదు’అని వ్యాఖ్యానించారు. రవిప్రకాశ్‌ను అరెస్ట్ చేయకూడదని కూడా సుప్రీంకోర్టు పేర్కొనలేదని, 48 గంటల ముందు నోటీసు ఇవ్వాలని మాత్రమే చెప్పిందని న్యాయవాది బదులిచ్చారు. ఏబీసీఎల్లో రవిప్రకాశ్‌కు పది శాతమే వాటా ఉందని, 40 వేల షేర్లను రూ.20 లక్షలకు నటుడు శివాజీకి అమ్మినట్లుగా గత ఏడాది తప్పుడు పత్రాలు సృష్టించారని హరేన్ రావల్ చెప్పారు. గత ఏడాది ఫిబ్రవరిలోనే వాటాల్ని విక్రయించడం నిజమైతే ఆ విషయాల్ని ఆదాయపు పన్ను శాఖకు అందజేసిన రిటర్న్‌లో ఎందుకు పేర్కొనలేదన్నారు. షేర్ల అమ్మకాల గురించిగానీ, తద్వారా వచ్చిన రూ.20 లక్షల సొమ్ము గురించిగానీ రవిప్రకాశ్ లేదా శివాజీ ఆదాయపు పన్ను పత్రాల్లోనే కాకుండా రికార్డుల్లో కూడా ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు. రూ.140 కోట్లతో 90 శాతం టీవీ9 వాటాల కొనుగోలుకు ఏబీసీఎల్, అలందాల మధ్య ఒప్పందం కుదిరిందని తెలిపారు. అయితే, ఫోర్జరీ ద్వారా తప్పుడు పత్రాల్ని సృష్టించి అమ్మకాలను అడ్డుకునేందుకు రవిప్రకాశ్ కుట్ర పన్నారని ఆరోపించారు. టీవీ9, బ్రాండ్ పేరును రవిప్రకాశ్ రూ.99 వేలకు చట్ట వ్యతిరేకంగా అమ్మేయడమే కాకుండా మరో మీడియా సంస్థకు అక్రమంగా నిధులు మళ్లించారని పేర్కొన్నారు. తప్పు చేశారు కాబట్టే రవిప్రకాశ్ తప్పించుకు తిరిగారని, ఇప్పటికీ శివాజీ పరారీలో ఉన్నారని హరేన్ రావల్ వాదించారు. కేసు విచారణకు హాజరుకాకుండా కోర్టుల చుట్టూ తిరిగి బెయిల్ మంజూరు కోసం చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాక పోలీసుల దర్యాప్తునకు రావ డం ప్రారంభించారని పేర్కొన్నారు. దర్యాప్తులో కూడా పొంతనలేని జవాబులు చెబుతున్నారని, మీడియా రంగంలో ఉన్న నేపథ్యంలో ఆయనకు ఉన్న పరిచయాల దృష్ట్యా సాక్షుల్ని ప్రభావితం చేయవచ్చని, ఈ దశలో రవిప్రకాశ్‌కు బెయిల్ మంజూరు చేయవద్దని రావల్ వాదించారు. మౌనంగా ఉండటమూ హక్కే.. తొలుత రవిప్రకాశ్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దిల్జిత్ సింగ్ అహ్లూవాలియా వాదిస్తూ.. బెయిల్ మంజూరుకు ఎలాంటి షరతులు విధించినా అభ్యంతరం లేదన్నారు. పోలీసులు 40 గంటలపాటు విచారించారని, పోలీసులు తాము కోరుకున్న జవాబులు రాబట్టాలని ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటం కూడా హక్కేనని చెప్పారు. టీవీ9లో శ్రీనిరాజుకు ఉన్న 90 శాతం వాటాను కొనుగోలుకు సైఫ్ మారిషస్‌తో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించారని, జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ నుంచి సైఫ్ మారిషస్ స్టే ఉత్తర్వులు ఉన్నా వేరే వారికి రూ.500 కోట్లకు విక్రయించారని తెలిపారు. ఒక్కసారిగా సైఫ్ మారిషస్ ఆ కేసును వెనక్కి తీసుకుందని, దీని వెనుక రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు. ఫెమా చట్టాన్ని ఉల్లంఘించి లావాదేవీలు నిర్వహించారని, రూ.294 కోట్లు టెర్రరిస్టుల్లాంటి వారికి అందే హవాలా తరహాలో బదిలీలు జరిగాయని, దీనిపై రవిప్రకాశ్ సీబీఐ, ఈడీలకు ఫిర్యాదు చేశాక రాష్ట్ర ప్రభుత్వం ఆయన వెంటపడిందని చెప్పారు. ఈ కేసుల వెనుక కుట్ర ఉందని, ఒక కేసులో స్టేషన్ హౌస్ ఆఫీసర్ కాకుండా ఏసీపీ స్థాయి అధికారి విచారిస్తున్నారని చెప్పగా, హరేన్ రావల్ కల్పించుకుని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఈ విధంగా విచారించే వీలుందన్నారు. విచారణ మంగళవారానికి వాయిదా పడింది. -
సుప్రీంకోర్టులో రవిప్రకాశ్‌కు చుక్కెదురు
సాక్షి, న్యూఢిల్లీ : ఫోర్జరీ, డేటా చౌర్యం కేసులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు మరోసారి చుక్కెదురైంది. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన మూడు కేసుల్లో ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసును హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. ఈ విషయంలో గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పక్కనపెడుతూ తాజాగా మెరిట్ ఆధారంగా కేసును విచారించాలని హైకోర్టును ఆదేశించింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడాన్ని సవాల్ చేస్తూ రవిప్రకాశ్ ఇటీవల దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఇందూ మల్హోత్రా, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున మాజీ సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. సీఆర్పీసీ సెక్షన్లు 160, 41ఏ కింద రెండు సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ రవిప్రకాశ్ విచారణకు హాజరుకాలేదని వాదించారు. రవిప్రకాశ్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. రవిప్రకాశ్‌ను అరెస్టు చేసే ఉద్దేశంతోనే పోలీసులు పదేపదే ఆయన ఇంటికొచ్చి సోదాలు చేస్తున్నారని చెప్పగా, అది తప్పుడు విశ్లేషణ అంటూ తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది కౌంటర్ చేశారు. కాగా, సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద పోలీసులు నోటీసులు జారీ చేస్తే తప్పుకుండా విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసిన ధర్మాసనం, ఈ కేసులో తాము ముందస్తు బెయిల్ ఇవ్వబోమని తెలిపింది. ముందస్తు బెయిల్ కోసం తిరిగి హైకోర్టునే ఆశ్రయించాలని చెప్పింది. హైకోర్టు రవిప్రకాశ్ బెయిల్ పిటిషన్‌ను మెరిట్స్ ఆధారంగా విచారణ జరపకుండా కొట్టేయడంతో.. ఈ కేసును హైకోర్టు తిరిగి విచారించాలని ఆదేశించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పక్కనపెట్టింది. జూన్ 10న మెరిట్స్ ఆధారంగా కేసును విచారించి తేల్చాలని ఆదేశించింది. పోలీసులు ఒకవేళ రవిప్రకాశ్‌ను అరెస్టు చేయదలిస్తే 48 గంటల ముందు నోటీసులు జారీ చేసి అరెస్టు చేయవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రవిప్రకాశ్‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ
-
తప్పించుకు తిరుగువాడు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కేసుల విషయంలో పోలీసుల వ్యూహాలు ఫలిస్తున్నాయి. ఈ కేసుల్లో నిందితులంతా దేశం వదిలిపోకుండా ఇప్పటికే విమానాశ్రయాలు, షిప్‌యార్డుల్లో లుక్అవుట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు వేట ముమ్మరం చేశారు. ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తుండటం, నిందితుల సన్నిహితులు, స్నేహితులపై నిఘా తీవ్రతరం చేస్తున్నారు. ఈ కేసుల్లో తప్పకుండా పురోగతి ఉంటుందని, వారిని తప్పకుండా పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బిజీగా ఉన్న పోలీసులు ఇప్పుడు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు. దీనికితోడు మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో నిందితులకు వాతావరణం ప్రతికూలంగా మారుతోంది. దీంతో పోలీసుల చేతికి చిక్కకుండా ఉండేందుకు ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేశారు. ఇప్పుడు తమ లాయర్ల ద్వారా కోర్టులను ఆశ్రయిస్తూ ముందస్తు బెయిళ్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రెండు కేసుల్లోను ముఖ్య నిందితులంతా.. ఏపీలో తలదాచుకున్నారన్న విమర్శలు రావడం, ఇప్పుడు రాజకీయంగా వారికి ప్రతికూల వాతావరణం ఏర్పడిందని సమాచారం. దీంతో ఆ ప్రాంతం తమకు అంత సురక్షితం కాదని భావించి ఇప్పటికే మరో చోటుకు మకాం మార్చారని సమాచారం. పట్టువదలని డాకవరం.. జాతీయస్థాయిలో సంచలనం రేపిన డేటా చౌర్యం కేసులో ప్రధాన నిందితుడు, ఐటీ గ్రిడ్ సంస్థ అధినేత డాకవరం అశోక్ అరెస్టును తప్పించేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఈ కేసులో ఫిబ్రవరి 23 తర్వాత కేసు నమోదైంది. అప్పటికే డాకవరం రాష్ట్రం సరిహద్దులు దాటి పారిపోయాడు. అతనికి ఏపీలోని కొందరు ఆశ్రయమిచ్చినట్లు సమాచారం. పైగా అప్పటి ఏపీలోని ప్రభుత్వం పెద్దలు అశోక్‌కు బహిరంగంగా మద్దతివ్వడం కూడా చర్చనీయాంశమైంది. పోలీసులు తన కోసం గాలిస్తుండగానే.. అశోక్ మాత్రం హైకోర్టును ఆశ్రయించగా అక్కడ ఆయనకు చుక్కెదురైంది. దీంతో అశోక్ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. విచిత్రంగా మే 24 నుంచి ఈసారి ఎల్బీనగర్ కోర్టును ఆశ్రయించగా కోర్టు అతని అప్పీల్‌ను తిరస్కరించింది. దీంతో ఆయన తిరిగి బుధవారం హైకోర్టును ఆశ్రయించాడు. రవిప్రకాశ్ ఏకంగా సుప్రీంకే..! డేటాచౌర్యం, ఫోర్జరీ కేసులో పరారీలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్, మరో నిందితుడు, సినీనటుడు శివాజీలు ఇప్పటిదాకా పోలీసులకు చిక్కలేదు. ఇప్పటికే రెండుసార్లు సీఆర్పీసీ సెక్షన్ 160, 41ఏల కింద 2 సార్లు నోటీసులు ఇచ్చినా.. ఇంతవరకూ పోలీసుల ఎదుట హాజరుకాలేదు. ముందస్తు బెయిలు కోసం 2 సార్లు హైకోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. తాజాగా రవిప్రకాశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పోలీసులు ఆయనపైనా లుక్అవుట్ నోటీసులు జారీ చేసి దేశం వదిలిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ కేసులో రవిప్రకాశ్ ఇప్పటికే ఏపీ వదిలి ఉత్తరభారతానికి పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రత్యేక పోలీసు బృందాలు ఆయన కోసం గాలిస్తున్నాయి. -
ఐటీ గ్రిడ్స్ నిందితుల బెయిల్ దరఖాస్తు
సాక్షి, హైదరాబాద్: ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ డాకవరం అశోక్, ఆ సంస్థ డైరెక్టర్, ఆయన భార్య శ్రీలక్ష్మి హైకోర్టులో వ్యాజ్యాల్ని దాఖలు చేశారు. అత్యంత కీలకమైన ఓటర్, ఆధార్, వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేశారని ఐటీ గ్రిడ్స్‌పై డేటా విశ్లేషకులు టి.లోకేశ్వర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిపై సంజీవ్‌రెడ్డినగర్, మాదాపూర్ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఓటర్ల డేటా చౌర్యానికి పాల్పడ్డామని పోలీసులు తమపై అన్యాయంగా కేసులు నమోదు చేశారని, తమను అరెస్ట్ చేసే అవకాశమున్నందున ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని వారు రిట్ పిటిషన్లలో కోర్టును కోరారు. ముందస్తు బెయిల్ కోసం వారు చేసుకున్న దరఖాస్తులను రంగారెడ్డి జిల్లాకోర్టు ఈ నెల 25న తిరస్కరించిన నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించారు. ఐటీ గ్రిడ్స్‌తో తెలుగుదేశం పార్టీ చేతులు కలిపి కీలకమైన ఓటర్ల వివరాలను అందజేసిందని, అందులో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకమని భావించిన వారి ఓట్లను తొలగించే ప్రయత్నం చేశారని లోకేశ్వర్‌రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసులు నమోదు చేసి దర్యాప్తునకు హాజరుకావాలని పోలీసులు ఇచ్చిన నోటీసులకు అశోక్, శ్రీలక్ష్మి స్పందించలేదు. ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
పోలీసులు అరెస్ట్ చేస్తారని.. గోడ దూకి పారిపోయా
సాక్షి, హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. బంజారాహిల్స్ పోలీసులు తనను అరెస్ట్ చేయడానికి రావడంతో గోడ దూకి పారిపోయానని, పోలీసులు అరెస్టు చేయకుండా తనకు ముందుస్తు బెయిల్ మంజూరు చేయాలన్న రవిప్రకాశ్ అభ్యర్థనను తోసిపుచ్చింది. పోలీసులు నమోదు చేసిన మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం రవిప్రకాశ్ దాఖలు చేసుకున్న మూడు పిటిషన్లను కొట్టేసింది. రవిప్రకాశ్ విషయంలో సీఆర్పీసీ సెక్షన్ 41–ఏ ప్రకారం నడుచుకోవాలని పోలీసులకు స్పష్టం చేసింది. ఇప్పటికే పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 41–ఏ కింద నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ముందస్తు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ. రాజశేఖర్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏబీసీపీఎల్ కార్పొరేషన్ యాజమాన్యం మార్పిడి, వాటాల బదిలీ తదితర అంశాలపై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో కేసులు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని పోలీసులు పట్టించుకోకుండా తనపై కేసులు నమోదు చేశారని, ఈ కేసుల నమోదు వెనుక దురుద్దేశాలున్నాయని, అందువల్ల తనకు ముందుస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రవిప్రకాశ్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి విచారణ జరిపారు. కేసుల నమోదు వెనుక దురుద్దేశాలున్నాయి... ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది దల్జీత్‌సింగ్ అహ్లువాలియా వాదనలు వినిపిస్తూ రవిప్రకాశ్‌ను అరెస్ట్ చేసి తీరాలన్న ఉద్దేశంతో పోలీసులు ఉన్నారని తెలిపారు. అందుకే ఒకే అంశానికి సంబంధించి మూడు వేర్వేరు కేసులు నమోదు చేశారన్నారు. పిటిషనర్ కొన్ని డాక్యుమెంట్లను ఫోర్జరీ చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారని, వాస్తవానికి ఆ డాక్యుమెంట్లు గతేడాది ఏప్రిల్ 18న జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)కు సమర్పించారని తెలిపారు. దాదాపు ఏడాది తరువాత పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. ఎన్సీఎల్టీ ముందు విచారణలో ఉన్న వ్యవహారంలో కేసు నమోదు చేయడం దురుద్దేశాలతో కూడుకున్నదని వివరించారు. దురు ద్దేశాలతో కేసు నమోదు చేసినప్పుడు, ముందస్తు బెయిల్ మంజూరు చేయవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందని తెలిపారు. ఈ సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సి.ప్రతాప్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ పిటిషనర్‌కు ఇప్పటికే సీఆర్సీపీ సెక్షన్ 41–ఏ, సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేసినా రవిప్రకాశ్ స్పందించలేదన్నారు. ముందు ఆయనను పోలీసుల ముందు హాజరై విచారణకు సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. అందుకే అప్పుడు గోడ దూకి పారిపోయారు... ఈ సమయంలో అహ్లువాలియా స్పందిస్తూ ఇటీవల టీవీ9 స్టూడియాలోకి వచ్చిన పోలీసులు రవిప్రకాశ్ అరెస్ట్‌కు ప్రయత్నించడంతో ఆయన గోడ దూకి పారిపోయారని తెలిపారు. ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్ల గురించి పోలీసులు కేసు పెట్టారని, అవి ఫోర్జరీవో కావో తేల్చాల్సింది ఎన్సీఎల్టీ తప్ప పోలీసులు కాదని వివరించారు. ఉద్దేశపూర్వకంగా పోలీసులు ఈ వాస్తవాలను తొక్కిపెట్టారని తెలిపారు. ఇదే సమయంలో రవిప్రకాశ్ ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించలేదన్నారు. అందువల్ల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని, ఏ షరతులు విధించినా కట్టుబడి ఉంటామన్నారు. బయట ఉండి సాక్షులను ప్రభావితం చేస్తున్నారు... అయితే ఈ వాదనను ప్రతాప్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. కావాలంటే కేసును 15 రోజులకు వాయిదా వేయవచ్చునని, ఈలోగా పిటిషనర్‌ను పోలీసులు ముందు హాజరై విచారణకు సహకరించేలా ఆదేశాలు ఇవ్వొచ్చునన్నారు. రవిప్రకాశ్ బయట ఉండి సాక్షులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నారని, ఎటువంటి వాంగ్మూలాలు ఇవ్వొద్దని ఒత్తిడి చేస్తున్నారని, ఇందుకు వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారని ఆయన కోర్టుకు నివేదించారు. తామేమీ రవిప్రకాశ్ విషయంలో కఠిన చర్యలేవీ తీసుకోబోమన్నారు. దీనికి అహ్లువాలియా స్పందిస్తూ, ఆ 15 రోజుల వరకైనా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. ముందు విచారణకు వస్తే ఆ తరువాత బెయిల్ గురించి ఆలోచించవచ్చునని ప్రతాప్‌రెడ్డి చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ముందస్తు బెయిల్ కోసం రవిప్రకాశ్ దాఖలు చేసిన మూడు పిటిషన్లను కొట్టేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో రవిప్రకాశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. పారిపోయి విలువల గురించి లెక్చర్! టీవీ9 వాటాల వివాదంలో ఫోర్జరీ, డేటా చౌర్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్... సమాజం, విలువలంటూ మరోసారి ఉపదేశమిచ్చారు. కేసులకు భయపడి తెలంగాణ వదిలి పారిపోయిన ఆయన.. పోలీసులపై, ఈ వివాదంపై వార్తలు రాస్తున్న జర్నలిస్టులపై అక్కసు వెళ్లగక్కారు. తనపై వస్తున్న ఆరోపణలు, నమోదైన కేసుల నేపథ్యం గురించి బుధవారం రవిప్రకాశ్ మీడియాకు మరో వీడియోను విడుదల చేశారు. తనకు, కొత్త యాజమాన్యానికి ఎక్కడ విభేదాలు వచ్చాయి? అవి ఎలా మొదలయ్యాయి? అంటూ వీడియోలో సుదీర్ఘ వివరణ ఇచ్చుకున్నారు. తనకు, సిటీనటుడు శివాజీ మధ్య తలెత్తిన వాటాల వివాదం ఎన్సీఎల్టీ పరిధిలో ఉండగా పోలీసులు కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. ఈ విషయంలో తెలంగాణ పోలీసులది అజ్ఞానమని అక్కసువెళ్లగక్కారు. కొన్ని మీడియా సంస్థలు తనను ఉగ్రవాదితో పోలుస్తూ పారిపోయానంటూ వార్తలు రాయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మీడియాకు పాఠాలు కూడా చెప్పారు. వీడియో సాంతం.. విలువలు, సమాజహితం అంటూ పదేపదే వల్లె వేసిన రవిప్రకాశ్... ఇంతకీ తానెందుకు పారిపోయానన్నది మాత్రం చెప్పలేదు. కోర్టులపై, చట్టాలపై విజ్ఞత ప్రదర్శిస్తూనే పోలీసులను ఎందుకు తప్పుబడుతున్నదీ మాత్రం చెప్పలేకపోయారు. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు.. మధ్యలో మీడియా మీద పడటం, వార్తల విషయంలో హితబోధ చేస్తూ అక్కసును బయటపెట్టుకున్నారు. వీడియోను పరిశీలిస్తున్న పోలీసులు.. రవిప్రకాశ్ వీడియో బయటకు రాగానే సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. వీడి యోను ఎక్కడ షూట్ చేశారు, ఎప్పుడు అప్లోడ్ చేశారో గుర్తించే పనిలో పడ్డారు. ఇప్పటికే సిమ్‌కార్డులు, ఫోన్లు మారుస్తూ పోలీసులకు తన జాడ చిక్కకుండా జాగ్రత్త పడుతున్న రవిప్రకాశ్‌కు ఈ వీడియో తీయడంలో ఎవరైనా సాయం చేశారా? అతని ఫోన్ నుంచే అప్లోడ్ చేశారా? అనే విషయాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ విషయంలో ఇప్పటికే వారు పురోగతి సాధించినట్లు సమాచారం. -
ముందస్తు బెయిలివ్వండి
సాక్షి, హైదరాబాద్: పరారీలో ఉన్న టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ తనకు ముందుస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేసిన మూడు వేర్వేరు కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం ఆయన మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై బుధవారం (22న) హైకోర్టు విచారణ జరపనుంది. ఏబీసీపీఎల్ కార్పొరేషన్ యాజమాన్య మార్పిడి, వాటాల బదిలీ తదితర అంశాలపై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో కేసులు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని పోలీసులు పట్టించుకోకుండా తనపై కేసులు నమోదు చేశారని రవిప్రకాశ్ తన పిటిషన్లలో పేర్కొన్నారు. ఎన్సీఎల్టీలో ఉన్న వివాదం గురించి తాను పోలీసులకు తెలియచేశానన్నారు. ఏబీసీపీఎల్‌ను అలందా మీడియాకు అప్పగించే విషయంలో ఎటువంటి అభ్యంతరాలు చెప్పకుండా ఉండేందుకే తనపై కేసులు నమోదు చేశారన్నారు. తనపై కేసులు నమోదు చేయడం వెనుక దురుద్దేశాలు ఉన్నాయన్నారు. తనను అరెస్ట్ చేయడం ద్వారా ఒత్తిడి తెచ్చి ఎన్సీఎల్టీ ముందున్న కేసులను కొనసాగించకుండా చేయడమే ఈ కేసుల వెనకున్న ఉద్దేశమన్నారు. కొత్త యాజమాన్యం తనపై చేస్తున్న ఆరోపణల్లో ఎంత మాత్రం వాస్తవం లేదని తెలిపారు. ఒకే అంశానికి సంబంధించి పలు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం చెల్లదని ఆయన అన్నారు. ఎన్సీఎల్టీలో పెండింగ్‌లో ఉన్న వివాదానికి సంబంధించి కేసులు నమోదు చేయడం సరికాదని ఆయన తన పిటిషన్లలో పేర్కొన్నారు. పాత తేదీతో డాక్యుమెంట్ సృష్టించారని పోలీసులు చెబుతున్నారని, వాస్తవానికి ఆ విషయాన్ని ఎన్సీఎల్టీ తేల్చాల్సి ఉందన్నారు. ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు తనకు ఏ షరతులు విధించినా అభ్యంతరం లేదన్నారు. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే, దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని రవిప్రకాశ్ తెలిపారు. -
గాడ్సే వ్యాఖ్యలు : కమల్‌కు హైకోర్టులో ఊరట
చెన్నై : గాడ్సే వ్యాఖ్యలపై సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ నేత కమల్ హాసన్‌కు మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ సోమవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తమిళనాడులోని అరవకురిచ్చిలో ఎన్నికల ప్రచారం సందర్భంగా మహాత్మ గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే భారత్‌లో తొలి హిందూ ఉగ్రవాది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఓ హిందూ సంస్థకు చెందిన కార్యకర్త ఫిర్యాదు మేరకు కరూర్ జిల్లాలోని అరవకురిచ్చి పోలీసులు కమల్ హాసన్‌పై కేసు నమోదు చేశారు. మతపరమైన విశ్వాసాలను ప్రేరేపించడం, భిన్న గ్రూపులకు చెందిన వారి మధ్య శత్రుత్వాన్ని పెంచడం వంటి అభియోగాలపై కమల్ హాసన్‌పై 153ఏ, 295ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా ప్రజల్లో తనకున్న మంచిపేరును చెడగొట్టేందుకే తనపై కక్షసాధింపునకు దిగుతున్నారని కమల్ హాసన్ ఆరోపించారు. గాడ్సేపై తన వ్యాఖ్యలను కమల్ సమర్ధించుకుంటూ గాంధీ హత్య కేసు విచారణ సందర్భంగా దేశ విభజనకు కారణమైన గాంధీని హిందువైన తాను చంపానని గాడ్సే స్వయంగా అంగీకరించారని చెప్పుకొచ్చారు. తాను గాంధీని ఎందుకు చంపాను అనే పుస్తకంలో సైతం గాడ్సే ఇదే విషయం చెప్పారని అన్నారు. కాగా, ముందస్తు బెయిల్ మంజూరుకు అవసరమైన షరతులకు లోబడతానని కమల్ న్యాయస్దానంలో పేర్కొన్నారు. -
రాహుల్‌గాంధీ బావకు ఊరట
న్యూఢిల్లీ: లండన్‌లో ఆస్తుల కొనుగోలు కేసులో నగదు అక్రమ రవాణాకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రా తాత్కాలిక బెయిల్‌ను ఢిల్లీ కోర్టు గురువారం పొడిగించింది. ఈ కేసులో ఇప్పటికే మార్చి 27 వరకు రాబర్ట్ వాద్రాకు తాత్కాలిక బెయిల్ ఇచ్చిన ఢిల్లీ కోర్టు తాజాగా ఏప్రిల్ 1వ తేదీ వరకు బెయిల్ పొడిగింపునకు అనుమతిని ఇచ్చింది. అప్పటివరకు వాద్రాను అరెస్ట్ చేయరాదని దర్యాప్తు సంస్థకు ఈ సందర్భంగా కోర్టు సూచించింది. గురువారం ఈ కేసులో వాదనలు జరిగాయి. ఇంటరాగేషన్ కోసం రాబర్ట్ వాద్రాను అప్పగించాలని ప్రత్యేక న్యాయమూర్తి అర్వింద్ కుమార్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోరింది. అయితే వాద్రా తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కేటీఎస్ తులసి వాదనలు వినిపిస్తూ, వాద్రాపై వచ్చినవి నిరాధార ఆరోపణలని, కోర్టు మంజూరు చేసిన తాత్కాలిక బెయిల్‌ను ఆయన దుర్వినియోగం చేయలేదని న్యాయమూర్తికి వివరించారు. -
మనీల్యాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు ఊరట
-
చిదంబరానికి ఊరట
న్యూఢిల్లీ: ఎయిర్‌సెల్–మ్యాక్సిస్ కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరంనకు ఊరట లభించింది. ఆయన్ను ఆగస్ట్ 7వ తేదీ వరకు అరెస్ట్ చేయరాదంటూ సీబీఐ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అదే విధంగా ఈ కేసుకు సంబంధించి చిదంబరం పెట్టుకున్న దరఖాస్తుకు 3 వారాల్లోగా బదులివ్వాలని స్పెషల్ కోర్టు జడ్జి సీబీఐను ఆదేశించారు. ఎయిర్‌సెల్–మ్యాక్సిస్ కేసులో చిదంబరంతోపాటు ఆయన కొడుకు కార్తీపై సీబీఐ చార్జిషీటు వేసింది. దీంతో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. విదేశాలకు వెళ్లేందుకు కార్తీకి అనుమతి ఎయిర్‌సెల్–మ్యాక్సిస్, ఐఎన్ఎక్స్ మీడియా కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న చిదంబరం కొడుకు కార్తీ విదేశాలకు వెళ్లేందుకు సుప్రీంకోర్టు ఓకేచెప్పింది. వ్యక్తిగత కారణాల రీత్యా ఈనెల 23 నుంచి 31వ తేదీ వరకు బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికాలకు వెళ్లేందుకు కోర్టు షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది. చిదంబరం కుటుంబంపై అసంతృప్తి సాక్షి ప్రతినిధి, చెన్నై: విదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలను దాచిన కేసులో చిదంబరం కుటుంబం విచారణకు హాజరు కాకపోవడాన్ని చెన్నై ఎగ్మూరు న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భార్య నళిని, కొడుకు కార్తీ, కోడలు శ్రీనిధిలకు బ్రిటన్, అమెరికాలో ఉన్న ఆస్తులకు సంబంధించి నల్లధనం చట్టం కింద ఐటీ శాఖ కేసు వేసింది. ఈ కేసు సోమవారం విచారణకు రాగా ఆ ముగ్గురూ హాజరు కాలేదు. దీంతో వారిపై న్యాయమూర్తి మలర్విళి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈనెల 30వ తేదీన వారంతా తప్పనిసరిగా కోర్టుకు హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు.