ఢిల్లీ : సివిల్ సర్వీస్ పరీక్షల్లో గట్టెక్కేందుకు నకిలీ పత్రాలు సృష్టించిన కేసులో మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆమె ముందుస్తు బెయిల్ పిటిషన్‌ను గురువారం ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.
నకిలీ పత్రాల కేసులో ఖేద్కర్ తరుఫు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా.. తనని (ఖేద్కర్) ఓ అధికారి లైంగికంగా వేధించారని, ఆయనపై ఫిర్యాదు చేసినందుకు తనని టార్గెట్ చేసినట్లు పేర్కొన్నారు. తానెలాంటి తప్పు చేయలేదని నిరూపించుకునేందుకు ముందస్తు బెయిల్‌ను కోరుతున్నారని పేర్కొన్నారు. అనంతరం ఖేద్కర్ వ్యవస్థను మోసం చేశారని కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అనంతరం ఆమె ముందుస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.
మహారాష్ట్రకు చెందిన ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ ఎంపికను యూపీఎస్సీ రద్దు చేసింది. భవిష్యత్తులో సివిల్స్ పరీక్షల్లో పాల్గొనకుండా ఆమెపై జీవితకాల నిషేధం విధించింది. పరీక్ష నిబంధనల్ని అతిక్రమిస్తూ నకిలీ ధ్రువపత్రాలతో పరీక్షను రాసినట్టు గుర్తించిన యూపీఎస్సీ ఈ మేరకు ఆమెపై చర్యలు చేపట్టింది. ఈ తరుణంలో ఆమె ఢిల్లీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం.
#Justin: Delhi's Patiala House Court denying bail to #IAS Puja Khedkar says she's able to breach the wall of #UPSC not only once but repeatedly with deceitful means.
It also says that she snatched rights of other eligible aspirants with disability benchmark quota@CNNnews18 pic.twitter.com/YCR2bfzoPr— Ananya Bhatnagar (@anany_b) August 1, 2024
పలు సెక్షన్ల కింద కేసులు నమోదు
ఖేద్కర్‌పై ఢిల్లీ పోలీసులకు యూపీఎస్సీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఐటీ యాక్ట్, డిసెబిలిటీ యాక్ట్ కింద ఫోర్జరీ,చీటింగ్ కేసుల్ని నమోదు చేశారు. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం ఖేద్కర్ ఢిల్లీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆమె బెయిల్ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాత్సవ ఈ కేసులో దర్యాప్తు "చాలా ప్రారంభ దశలో ఉంది" అని వాదించారు. కేసు తదుపరి విచారణ కోసం ఆమెను కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరమని వాదించారు.
పూజా ఖేద్కర్ లాంటి వారి పట్ల కఠినంగా వ్యహరించాలి
" వాదన సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఖేద్కర్ గురించి ప్రస్తావిస్తూ.. వ్యవస్థల్ని మోసం చేసే ఇలాంటి వ్యక్తుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాలి. ఇప్పటికే చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేశారు. ఇంకా దుర్వినియోగం చేసే అవకాశాలు ఇంకా ఉన్నాయి " అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment