UPSC
-
సునామీలో సర్వం కోల్పోయారు..కానీ ఆ అక్కా చెల్లెళ్లు ఐఏఎస్, ఐపీఎస్‌లుగా..
ప్రకృతి ప్రకోపానికి సర్వం కోల్పోయింది ఆ కుటుంబం. ఉండేందుకు నీడ కూడా లేకుండా రోడ్డున పడిపోయాయి జీవితాలు. ఒక్క రోజులో కథే మారిపోయింది. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితి. అలాంటి గడ్డు పరిస్థితిలో చదువుపై ధ్యాస పెట్టి ఉన్నతాధికారి కావాలనే ఆలోచన వైపుకే వెళ్లనంతగా జీవితం కటికి చీకటిమయంగా ఉంటుంది. అయితే అంతటి కటిక దారిద్య్రంలో బతికీడుస్తూ కూడా అన్నింటిని ఓర్చుకుని కన్నెరజేసిన ప్రకృతికే సవాలు విసిరారు. కష్టతర సాధ్యమైన హోదాలని అందుకున్నారు ఈ అక్కా చెల్లెళ్లు. ఎవ్వరూ ఊహించని విధంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారిణులై మనిషి సంకల్పానికి ఎలాంటి కష్టమైనా.. తోక ముడిచి తీరాల్సిందేనని చూపించారు. ఇంతకీ ఎవరా అక్కాచెల్లెళ్లు అంటే..తమిళనాడులోని కడలూరు జిల్లాకి చెందిన రైతు కుమార్తెలు ఆ అక్కాచెల్లెళ్లు. వారి పేర్లు సుష్మిత రామనాథన్, ఐశ్వర్య రామనాథన్. ఆర్థికంగా వెనుకబడిన వ్యవసాయం కుటుంబం వారిది. కటిక పేదరికంలో పెరిగారు. కనీస వనురుల లేక అల్లాడిపోయారు. అలాంటి కుటుంబం ప్రకృతి ప్రకోపానికి పూర్తిగా అల్లకల్లోలమైపోయింది. సరిగ్గా 2004 హిందూ మహాసముద్రం సునామీలో ఇల్లుతో సహా సర్వం కోల్పోయారు. అప్పటికీ అంతంత మాత్రంగా ఉన్నజీవితాలు పూర్తిగా రోడ్డున పడిపోయాయి. అయితే అక్కాచెల్లెళ్లు అంతటి భరించలేని పరిస్థితుల్లో కూడా చదువుని వదలలేదు. అదే తమ జీవితాలను మార్చే ఆయుధమని పూర్తిగా నమ్మారు. దానికే కట్టుబడి ఇరవురు యూపీఎస్సీకి సన్నద్ధమై అనుకున్నది సాధించారు. మరీ అక్కాచెల్లెళ్ల విజయ ప్రస్థానం ఎలా సాగిందంటే..ఐఏఎస్ ఐశ్వర్య రామనాథన్2018లో సివిల్ సర్వీసెస్ పరీక్షలో 628వ ర్యాంకు సాధించి రైల్వే అకౌంట్స్ సర్వీస్ (RAS)కి ఎంపికయ్యింది. కానీ ఆ పోస్టుతో సంతృప్తి చెందని ఐశ్వర్య మరోసారి 2019లో యూపీఎస్సీకి సన్నద్ధమైంది. అప్పుడు మెరుగైన ర్యాంకు సాధించి 22 ఏళ్లకే తమిళనాడు కేడర్‌కి చెందిన ఐఏఎస్ అధికారిణి అయ్యింది. ప్రస్తుతం ఆమె తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో అదనపు కలెక్టర్‌గా నియమితురాలైంది.ఐపీఎస్ సుష్మితా రామనాథన్చెల్లెలు ఐశ్వర్యలా సునాయాసంగా యూపీఎస్సీలో విజయం అందుకోలేకపోయింది. ఏకంగా ఐదు సార్లు విఫలమైంది. చెల్లలు కంటే ఎక్కువ కష్టపడి సివల్స్‌లో సక్సెస్ అయ్యింది. ఆమె 2022లో ఆరవ ప్రయత్నంలో సివిల్స్ పరీక్షలో 528వ ర్యాంకు సాధించి ఆంధ్రప్రదేశ్ కేడర్‌కి చెందిన ఐపీఎస్ అధికారిణి అయ్యింది. ఆమె ప్రస్తుతం దక్షిణ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ASP)గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. (చదవండి: ప్రపంచం అంతమయ్యేది అప్పుడే..! వెలుగులోకి న్యూటన్ లేఖ..) -
కార్పొరేట్ జాబ్ వదిలేసి మరీ సివిల్స్ ప్రిపరేషన్..ఏడు సార్లు వైఫల్యం..చివరికి..
యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్ అన్నది చాలామంది యువత డ్రీమ్. కానీ దాన్ని అందుకోవడం అంత ఈజీ కాదు. ఈ ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్ మాములుగా చుక్కలు చూపించదు. మూడు దశల ఎగ్జామ్‌లో ఎక్కడైనా ఏమరపాటుతో ఉన్నామో.. అంతే సంగతులు. అప్పటి దాక పడ్డ కష్టం క్షణంలో వృధా అయిపోతుంది. మళ్లీ మొదట నుంచి అంటే.. కన్నీళ్లు వచ్చేస్తాయి. అంత ఓపికతో వ్యవహరిస్తేనే తమ కలను సాకారం చేసుకోగలరు. అలాంటి వారెందరో ఉన్నారు కూడా. ఆ క్రమంలో కొందరూ ఎడతెగని వైఫల్యాలు ఎదర్కొంటే ఆత్మవిశ్వాసం శూన్యం అయిపోతుంది. అస్సలు గెలుపు అన్నది జీవితంలో లేదేమో అన్నంతగా డీలా పడిపోతారు. దారులన్నీ మూసుకుపోయినట్లుగా అయిపోతుంది. అలాంటి కఠినతర పరిస్థితులను కొందరు మాత్రం ఎదురొడ్డి నిలబడిన తమ కలను సాకారం చేసుకుంటారు. అలాంటి కోవకు చెందిందే ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వెన్నమ్ అనూష.ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాకు చెందిన వెన్నమ్ అనూష సివిల్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఫేస్ చేసిన కష్టాలు చూస్తే కన్నీళ్లు వచ్చేస్తాయి. బాబోయ్..! ఇంతలా భరిస్తూ అన్నిసార్లు ఎలా ప్రయత్నాలు చేసిందా..! అని ఆశ్చర్యపోతారు. అంతలా ఓటమిపాలవ్వుతున్నా..వెనక్కి తగ్గకుండా ఎప్పటికైనా గెలుపు తనని తప్పక వరిస్తుందన్న నమ్మకంతో ప్రయత్నించి విజయం సాధించింది. ఆమె టీనేజ్‌లో ఉన్నప్పుడు కూడా కష్టాలను ఎదుర్కొంది. ఇంటర్మీడియెట్ వరకు టాపర్‌గా ఉన్నఆమె తండ్రి మరణంతో తీవ్ర మానసిక వేదనకు గురై వెనకబడింది. ఆ ప్రభావం బీటెక్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌పై పడి..అందులో ఉత్తీర్ణత సాధించడానికి నానా ఇబ్బందుల పడింది. చివరికీ..ఏదో రకంగా సీటు తెచ్చుకుంది. అలా 2014లో బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఐటీలో బీటెక్ పూర్తి చేసింది. ఆ తర్వాత కొన్నాళ్లు ఓ ప్రైవేటు జాబ్ చేసింది. ఆ తర్వాత ఆ ఉద్యోగాన్ని వదిలేసి మరీ 2017 నుంచి సివిల్స్‌కి ప్రిపేరయ్యింది. ఇక అక్కడ నుంచి వరుసగా ఆ ఎగ్జామ్‌లో వైఫల్యాలే ఎదుర్కొంటూ వచ్చింది. అలా 2021 వరకు ఏడుసార్లు వైఫల్యం ఎదుర్కొంది. మొదటి ప్రయత్నంలో ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో జస్ట్ అర మార్కు తేడాతో పోయింది. పోనీలే అని మరోసారి రాస్తే.. ఈసారి మెయిన్స్. ఆ తర్వాత ఇంటర్వ్యూ రౌండ్‌కు చేరుకున్నాక తుది ఎంపికలో విఫలమైంది. అలా ఏకంగా ఏడుసార్లు వైఫల్యాలు చవిచూడటంతో పూర్తి నైరాశ్యంలో మునిగిపోయింది. ఇక ఏది గెలవలేనన్నా భయంతో డీలా పడింది. ఆ సమయంతో ఆమె గురువులో ఒకరు ఎందుకు యూపీఎస్సీ ఐఎఫ్ఎస్ ప్రయత్నించకూడదు. ఇన్నిసార్లు ఓటిమిని ఎదర్కొన్నప్పుడూ.. సంపాదించిన జ్ఞానం వృధాగా పోదని ప్రోత్సహించడంతో అనూష ఆ దిశగా అడుగులు వేసింది. ఈసారి గెలుపు తలుపు తట్టింది. విజయం ఆమె ఒళ్లోకి వచ్చి వాలింది. యూపీఎస్సీ ఐఎఫ్ఎస్ తొలి ప్రయత్నంలోనే 73వ ర్యాంకుతో అర్హత సాధించి ఐఎఫ్ఎస్ అధికారిణి అయ్యింది. ఈమె కథ ఓటములు వరుస పెట్టి పలకరించి బాధల్లోకి నెట్టేస్తే..భయంతో పారిపోకూడాదనే పాఠాన్ని నేర్పడమే గాక అలాంటి సమయంలో గురువులు లేదా శ్రేయాభిలాషుల అండదండలతో పుంజుకోవాని ప్రూవ్ చేసింది. పైగా ఓటిమికి దాసోహం కాకూడదని చెబుతోంది. దేవుడు అన్నిదారులు మూసి వేసినా ఒక్క తలుపు మనకోసం తెరిచే ఉంచుతాడంటారు. కాకపోతే ఆ తలుపు ఏదో వెతికేందుకుకే సమయం పడుతుంది అంతే..!.(చదవండి: వందేళ్ల నాటి పైథానీ చీరలో బరోడా మహారాణి రాధికా రాజే..! అచ్చమైన బంగారంతో..) -
Success Story: నాడు అమ్మతోపాటు గాజులమ్మి.. నేడు ఐఏఎస్ అధికారిగా..
బాల్యంలో కటిక దారిద్య్రం అనుభవిస్తూనే, చదువులు కొనసాగించిన కొందరు ఉన్నత స్థానానికి చేరుకున్న ఉదంతాల గురించి మనం అప్పుడప్పుడు వింటుంటాం. ఇదే కోవలోకి వస్తారు రమేష్ ఘోలాప్. ఈయన సాధించిన విజయం యువతకు స్ఫూర్తినిస్తుందనడంలో సందేహం లేదు.రమేష్ ఘోలాప్.. ఐఏఎస్ అధికారిగా మారేవరకూ సాగించిన ప్రయాణంలో చదువుపై ఆయన చూపిన అంకితభావం, శ్రద్ధ, కృషి మనకు కనిపిస్తాయి. మహారాష్ట్రలోని షోలాపూర్(Solapur) జిల్లాలోని మహాగావ్ అనే చిన్న గ్రామంలో జన్మించిన రమేష్ చిన్నప్పటి నుంచి అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. రమేష్ తండ్రి గోరఖ్ ఘోలాప్ ఒక చిన్న సైకిల్ మరమ్మతుల దుకాణం నడిపేవాడు. మద్యం అలవాటు కారణంగా అతని తండ్రి ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఇంట్లో పరిస్థితి అంతకంతకూ దిగజారింది. ఒకరోజు రమేష్ తండ్రి దుకాణం మూసివేశాడు.దీంతో రమేష్ తల్లి విమల్ ఘోలాప్ కుటుంబాన్ని పోషించేందుకు సమీప గ్రామాల్లో గాజులు అమ్మడం ప్రారంభించింది. ఆ సమయంలో రమేష్ తన తల్లికి సహాయం చేస్తూ వచ్చాడు. 2005లో రమేష్ తండ్రి మరణించాడు. కుటుంబసభ్యులు పొరుగింటివారి సాయంలో అంత్యక్రియలు(Funeral) నిర్వహించారు. ఈ ఘటన రమేష్‌ను అమితంగా ఆలోచింపజేసింది. పేదరికం నుండి బయటపడటానికి ఏకైక మార్గం విద్య అని రమేష్ గ్రహించాడు. చదువుపై దృష్టి సారించిన రమేష్ ఓపెన్ యూనివర్సిటీ నుండి ఆర్ట్స్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. 2009 లో ఉపాధ్యాయుడైన తర్వాత కూడా, తన ఆశయంపై దృష్టి సారిస్తూ ముందుకుసాగాడు.యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష (సీఎస్ఈ) కి సిద్ధం కావాలని నిర్ణయించుకుని, ప్రిపరేషన్ కోసం రమేష్ పూణేకు పయనమయ్యాడు. ఆ సమయంలో అతని తల్లి అండగా నిలిచింది. 2010లో రమేష్ తన మొదటి ప్రయత్నంలో యుపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష విఫలమయ్యాడు. పోలియో బాధితుడైన రమేష్ 2012లో వికలాంగుల కోటా(Disabled quota) కింద యూపీఎస్సీ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్ (ఏఐఆర్)287తో ఉత్తీర్ణుడయ్యాడు. ఐఎఎస్ అధికారి కావాలన్న తన కలను నెరవేర్చుకున్నాడు. ప్రస్తుతం ఐఏఎస్ రమేష్ ఘోలాప్ జార్ఖండ్ ఇంధన శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆయన కథ కోట్లాది మంది యువతకు ప్రేరణ కల్పిస్తుందనడంలో సందేహం లేదు.ఇది కూడా చదవండి: తమకు తామే పిండం పెట్టుకుని.. నాగ సాధువులుగా మారిన 1,500 మంది సన్యానులు -
UPSC Success Story: ఇటు ఉద్యోగం.. అటు చదువు.. శ్వేతా భారతి విజయగాథ
పట్టుదల ఉంటే సాధించలేదని ఏదీ లేదని అంటారు. దీనిని కొందరు నిజమని నిరూపించారు. ఈ కోవలోకే వస్తారు శ్వేతా భారతి. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే, మరోవైపు పోటీ పరీక్షలకు సిద్ధమైన శ్వేత తాను అనుకున్నది సాధించి, ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు.యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్ష(UPSC Civil Service Exam) ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన పరీక్షలలో ఒకటని చెబుతుంటారు. పలువురు అభ్యర్థులు యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమయ్యేందుకు కోచింగ్ తీసుకుంటారు. అయితే ఏమాత్రం కోచింగ్ అవసరం లేకుండానే యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణులైనవారు కూడా ఉన్నారు. ఇటీవలే బీహార్ కేడర్‌లో పోస్టింగ్ అందుకున్న ఐఏఎస్ శ్వేతా భారతి దీనికి ఉదాహరణగా నిలిచారు.బీహార్ యువతి శ్వేతా భారతి(Shweta Bharti) యూపీఎస్సీ పరీక్షకు ముందు బీపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణురాలయ్యారు. అయితే ఐఏఎస్ అధికారి కావడమే ఆమె కల. అందుకే ఆమె ప్రభుత్వ ఉద్యోగం దక్కించుకున్నప్పటికీ, యూపీఎస్సీకి ప్రపరేషన్ కొనసాగించారు. శ్వేతా భారతి ఉదయం పూట 9 గంటల పాటు పనిచేస్తూనే, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు.శ్వేతా భారతి బీహార్‌లోని నలంద జిల్లాలో జన్మించారు. ఆమెది సాధారణ కుటుంబ నేపధ్యం. శ్వేతా భారతి చిన్నప్పటి నుంచి చదువులో చాలా చురుకుగా ఉండేవారు. పట్నాలోని ఇషాన్ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్లో 12వ తరగతి వరకు చదువుకున్నారు. అనంతరం ఆమె భాగల్పూర్ ఇంజనీరింగ్ కళాశాల నుండి ఎలక్ట్రికల్,టెలికమ్యూనికేషన్‌లో బీటెక్ డిగ్రీని అందుకున్నారు. తరువాత ఆమె విప్రోలో ఉద్యోగం సంపాదించారు.లక్షల్లో జీతం అందుకుంటున్నప్పటికీ ఆమె ఐఏఎస్ అధికారి(IAS officer) కావాలని నిశ్చయించుకున్నారు. అందుకే ఒకవైపు ఉద్యోగం చేస్తూనే, మరోవైపు యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమవుతూ వచ్చారు. పగటిపూట ఉద్యోగం చేస్తూనే, రాత్రపూట చదువుకోసాగారు. 2020లో జరిగిన బీపీఎస్సీ పరీక్షలో శ్వేతా భారతి 65 వ ర్యాంకు సాధించారు. దీంతో ఆమెకు ప్రోగ్రామ్ ఆఫీసర్ (డీపీఓ)గా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. అయినప్పటికీ ఆమె తన లక్ష్యం నెరవేర్చుకునే దిశగానే ముందుకు సాగారు. ఎట్టకేలకు ఆమె కృషి ఫలించింది. 2021లో యూపీఎస్సీ పరీక్షలో 356వ ర్యాంక్ సాధించారు. శ్వేతా భారతి యూపీఎస్సీ2021 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ మహిళా అధికారి. ప్రస్తుతం బీహార్‌లోని భాగల్పూర్లో అసిస్టెంట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇది కూడా చదవండి: ISRO SpaDeX Mission: స్పేడెక్స్ ఉపగ్రహాల ప్రయోగం విజయవంతం: ఇస్రో -
'యూపీఎస్సీ చాట్ భండార్'..నాటి స్వాతంత్య్ర సంగ్రామాన్ని..!
ఎన్నో రకాల వీధి చాట్ భండార్ దుకాణాలు చూసుంటాం. కానీ ఇప్పుడు చెప్పబోయే చాట్ బండార్ మన భారతదేశ స్వాతంత్య్రం కోసం చేసిన సంగ్రామాన్ని గుర్తుచేస్తుంది. స్వతంత్ర్య భారతవని పోరుకి చిహ్నం అని చెప్పొచ్చు. ప్రస్తుతం అది ఆధునికంగా విస్తరించి మంచి లాభాదాయకమైన వ్యాపారంగా నిరాంటకంగా కొనసాగుతోంది. ఇంతకీ ఇదెక్కడ ఉంది? దీనికి యూపీఎస్సీ అనే పేరు ఎందుకు పెట్టారంటే..ఈ చాట్ భండార్ న్యూఢిల్లీలో(Delhi) యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్(UPSC) భవనం ఎదురుగా ఉంది. నిజానికి ఈ చాట్ దుకాణం పేరు "ప్రభు చాట్ భండార్" కానీ అందరూ యూపీఎస్సీ చాట్(UPSC Chaat Bhandar) అనే పిలుస్తారు. 1935లో బ్రిటిష్ పాలనా కాలం నుంచి నడుస్తున్న దుకాణం. దీని యజమాని నాథూ. ఆయన ఆ కాలంలో బ్రిటిష్ పోలీసుల చేత అనేక బెదిరింపులకు, వేధింపులకు గురయ్యేవాడు. అయినా ఇది నాదేశం.. అందుకోసం తన వంతుగా చేస్తున్న జీవన పోరాటంగా అని భావించేవాడు నాథూ. మంచి రోజులు రాకపోతాయనే అతడి ఆశ నెరవేరే రోజు రానే వచ్చింది. భారతదేశానికి స్వతంత్య్రం(Independence) రావడందాంతోపాటు తన దుకాణం కూడా కొంగొత్తగా రూపుదిద్దుకోవడం మొదలయ్యింది. అతడి దుకాణం ప్రభుత్వాధికారులు పనిచేసే సమీపంలో ఉండటంతో..వారే అతడి కస్టమర్లుగా ఉండేవారు. పైగా అనతికాలంలో ఆదాయ పన్ను చెల్లించే దుకాణాల లిస్ట్‌లో చేరిపోయింది. అంతలా లాభాలార్జిస్తూ దూసుకోపోతుంది. ప్రస్తుతం దీన్ని నాథూ మనవడు, కుమారుడు విజయవంతంగా నడుపుతున్నారు. ఈ దుకాణం గొప్పతనం దశాబ్దాల నుంచి అదే రుచి, నాణ్యతతో చాట్‌ని అందించడమే. అదీగాక ఇప్పుడు మరిన్ని విభిన్న రకాల చాట్లను కూడా జోడించారు. ఢిల్లీ ఎలా ఆధునికరించబడిందో.. అలానే ఈ దుకాణం కూడా కొద్దికొద్దీ మార్పులతో ఆధునిక దుకాణంలా రూపుదాల్చుతూ ఉంది. అందువల్లే ఢిల్లీలో ఈ దుకాణం సిటీ ఐకానిక్ ల్యాండ్‌మార్క్(Landmark)గా స్థిరపడిపోయింది. ఏవ్యాపారమైన కస్టమర్ నమ్మకాన్ని బలపర్చేలా నాణ్యతతో రాజీ పడకుండా చేస్తే దానికి తిరుగుండదు అనడానికి ఏళ్ల నాటి ఈ ఐకానిక్ చాట్ భండారే ఉదాహరణ కదూ..!.(చదవండి: Sudoku: ‘సుడోకు’ రావాలంటే గణితంతో పనిలేదు..! కేవలం..) -
పూజా ఖేద్కర్‌కు మరో షాక్.. అరెస్టు తప్పదా?
ఢిల్లీ : వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్‌కు మరో షాక్ తగిలింది. అధికార దుర్వినియోగంతో పాటు, ఐఏఎస్‌కు ఎంపిక అయ్యేందుకు నకిలీ పత్రాలు సమర్పించిన కేసులో ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. #BREAKING Delhi High Court denies anticipatory bail to former probationer IAS officer Puja Khedkar accused of “misrepresenting and falsifying facts" in her UPSC application. #PujaKhedkar #UPSC pic.twitter.com/mgw3QYhaux— Live Law (@LiveLawIndia) December 23, 2024పూజా ఖేద్కర్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సోమవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ చంద్ర ధరి సింగ్‌తో కూడిన ఏక సభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా..జస్టిస్ చంద్ర ధరి సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే.. పూజా ఖేద్కర్ ఉద్దేశ పూర్వకంగానే ఐఏఎస్ ఎంపిక అయ్యేందుకు అధికారులను మోసగించినట్లు తాము గుర్తించాం. ఆమె కుట్ర పూరితగా చర్యలు ఐఏఎస్‌కు అనర్హులు. ఆమెపై నమోదైన ఫోర్జరీ, మోసం వంటి అభియోగాలు ‘అధికారం కోసమే కాకుండా, దేశం మొత్తాన్ని మోసం చేశారనే దానికి ఉదాహరణ నిలుస్తారు.‘పిటిషనర్ (పూజా ఖేద్కర్) ప్రవర్తన పూర్తిగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను మోసం చేసే ఉద్దేశ్యంతో నకిలీ పత్రాలు సమర్పించారు. సమాజంలోని బలహీన వర్గాలకు అందిస్తున్న పథకాల ప్రయోజనాలను పొందేందుకు భారీ ఎత్తున మోసానికి తెరతీశారు.’ ‘ప్రస్తుతం కేసు దర్యాప్తు, అందుబాటులో ఉన్న రికార్డ్ల ఆధారంగా పూజా ఖేద్కర్ వెనుకబడిన వర్గాలకు ఉద్దేశించిన ప్రయోజనాలను పొందేందుకు అనర్హులు. దీంతో పాటు నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులతో కుమ్మక్కయ్యే అవకాశం ఉంది’. దీంతో ప్రభుత్వ అధికారులు, సంబంధిత విభాగాల్లో దర్యాప్తు చేసే అవకాశం ఉండననుంది.వివాదాస్పద కేసులో గతంలో పూజా ఖేదర్కర్ను అరెస్ట్ చేయొద్దని ఆదేశాలిచ్చిన జస్టిస్ చంద్ర ధరి సింగ్‌తో కూడిన ఏక సభ్య ధర్మాసనం.. ఈ రోజు విచారణలో ముందస్తు బెయిల్‌ను తిరస్కరించింది. కోర్టు నిర్ణయంతో పోలీస్ శాఖ పూజా ఖేద్కర్ అరెస్ట్ తప్పదన్న చర్చ మొదలైంది. వివాదం ఇదే..గొంతెమ్మ కోర్కెలతో మహారాష్ట్ర ప్రభుత్వ ఆగ్రహానికి గురైన ట్రెయినీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ వార్తల్లోకి ఎక్కారు. పుణెలో అసిస్టెంట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ.. ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండానే తన ఆడి కారుకు రెడ్-బ్లూ బీకన్ లైట్లు, వీఐపీ నంబర్‌ప్లేటు ఏర్పాటు చేసుకున్నారు. ‘మహారాష్ట్ర ప్రభుత్వం’ అనే స్టిక్కర్ అమర్చారు. తనకు ప్రత్యేక వసతి సౌకర్యాలు కల్పించాలని, తగినంత సిబ్బందితోపాటు ఓ కానిస్టేబుల్‌తో అధికారిక ఛాంబర్‌ను కేటాయించాలని పట్టుబట్టారు. అదనపు కలెక్టర్ అజయ్ మోర్ లేని సమయంలో.. ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఆయన గదిలో తన నేమ్‌ప్లేట్ పెట్టుకొని దాన్నే తన ఛాంబర్‌గా వినియోగించుకొన్నారు. వాస్తవానికి ప్రొబేషన్‌లో రెండేళ్లపాటు ఉండే జూనియర్ అధికారులకు ఈ సౌకర్యాలు లభించవు.ఆమె ఈ సౌకర్యాల కోసం కిందిస్థాయి అధికారులపై ఒత్తిడి తెస్తూ జరిపిన వాట్సాప్ సంభాషణల స్క్రీన్ షాట్లు కూడా వైరల్ అయ్యాయి. తనకు ఉన్నతాధికారి నుంచి ఈ సిబ్బంది నంబర్ లభించినట్లు ఆమె వాటిల్లో పేర్కొన్నారు. ఈసందర్భంగా ఆమె కొన్ని డిమాండ్లు చేసి.. తాను వచ్చే నాటికి వాటిని పూర్తిచేయాలన్నారు.అయితే పూజ వ్యవహారాన్ని పుణె కలెక్టర్ డాక్టర్ సుహాస్ దివాసే చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లడంతో తీగ లాగితే డొంక కదిలింది అన్న చందంగా యూపీఎస్సీ రాత పరీక్ష నుంచి ఆమె ట్రైనీ ఐఏఎస్ అధికారిగా ఎంపిక అవ్వడం వరకూ పూజా ఖేద్కర్ చేసిన అక్రమాలు అన్నీ వెలుగులోకి వచ్చాయి. దీంతో కేంద్రం ఆమెను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ నుంచి తొలిగిస్తున్నట్లు ప్రకటించింది. పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆమెపై కోర్టులో కేసు నడుస్తోంది. నియామకమే వివాదం.. 2022 ఏప్రిల్‌లో తొలిసారి దిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు పిలువగా ఆమె కొవిడ్ సాకుగా చూపించి వెళ్లలేదు. ఆ తర్వాత కూడా కొన్ని నెలలపాటు వైద్య పరీక్షలకు హాజరు కాలేదు. చివరికి ఆరోసారి పిలుపురాగా.. పాక్షికంగా పరీక్షలు చేయించుకొన్నారు. దృష్టి లోపాన్ని అంచనావేసే కీలకమైన ఎమ్మారై పరీక్షకు ఆమె హాజరుకాలేదు. కానీ, ఆమె సివిల్ సర్వీసెస్ అపాయింట్మెంట్ ఏదోరకంగా పూర్తయింది. ఆ తర్వాత కమిషన్ ఆమె ఎంపికను ట్రైబ్యూనల్‌లో సవాలు చేసింది. 2023 ఫిబ్రవరిలో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అయినా.. తన నియామకాన్ని కన్ఫర్మ్ చేసుకొంది. ఇక పూజా ఓబీసీ ధ్రువీకరణపైనా వివాదాలున్నాయి. దాని ఆధారంగానే ఆమెకు 841వ ర్యాంక్ వచ్చినా ఐఏఎస్ హోదాను పొందగలిగింది.ఐఏఎస్ సర్వీస్ నుంచి తొలగింపుఇలా వరుస వివాదాల నేపథ్యంలో కేంద్రం పూజా ఖేద్కర్‌పై విచారణకు ఆదేశించింది. విచారణాలో సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక అయ్యేందుకు ఓబీసీ, వికలాంగుల కోటాలో నకిలీ దృవీకరణ పత్రాలు సర్పించినట్లు సైతం తేలింది. అంతేగాక నిబంధనలకు మించి సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ.. ఆమెను ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించింది.నకిలీ పత్రాలతో పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు గుర్తించిన యూపీఎస్సీ దానిపై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులిచ్చింది. ఆమెపై ఫోర్జరీ కేసు నమోదు చేయడంతో పాటు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది.ముందస్తు బెయిల్ తిరస్కరణఈ వివాదంలో అరెస్ట్ కాకుండా ఉండేందుకు పూజా ఖేద్కర్ ఢిల్లీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు ఇప్పటికే పలు మార్లు ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేసింది. తాజాగా, సోమవారం సైతం ఢిల్లీ హైకోర్టు పూజా ఖేద్కర్‌కు ముందస్తు బెయిల్‌ను తిరస్కరించింది. -
20 ఏళ్లకే డాక్టర్, 22 ఏళ్లకు ఐఏఎస్ ఆఫీసర్..ఇవాళ ఏకంగా..!
ఒక విజయాన్ని అందుకోగానే హమ్మయ్యా..! అనుకుంటాం. ఏదో చాలా సాధించేశాం అన్నంతగా ఫోజులు కొడతాం. కానీ కొందరూ మాత్రం మహర్షి మూవీలో హీరో మహేష్ బాబు చెప్పినట్టుగా "సక్సెస్ అనేది గమ్యం కాదు, అదొక ప్రయాణం" అన్నట్లుగా విజయపరంపరతో దూసుకుపోతుంటారు. అబ్బా.. ! ఎన్ని విజయాలు అందుకున్నాడు..హీరో అంటే అలాంటి వాళ్లేనేమో అనే ఫీల్ కలుగుతుంటుంది మనకి. అలా వరుస విజయాలతో విస్మయానికి గురి చేస్తూ..ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు రాజస్థాన్‌కి చెందిన రోమన్ సైనీ. అతడి సక్సెస్ జర్నీ చూస్తే.. సాధించేయాలన్న పౌరుషం, కసి తన్నుకు రావాల్సిందే అన్నట్లుగా ఉంటుంది.రాజస్థాన్‌లో కోట్పుట్లీలోని రైకరన్పురా గ్రామానికి చెందిన రోమన్ సైనీ ప్రాథమిక విద్యాభ్యాసం అంతా అక్కడే సాగింది. తల్లి గృహిణి, తండ్రి ఇంజనీర్. మన రోమన్ సక్సెస్ జర్నీ 16 ఏళ్ల వయసులో ఎయిమ్స్‌లో అర్హత సాధించడంతో ప్రారంభమయ్యింది. అలా రోమన్ 21 ఏళ్లకి ఎంబీబీఎస్ పూర్తిచేసి, డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయినా ఏదో తెలియని వెలితి వెన్నాడుతూ ఉండేది. అప్పుడే ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్‌కి ప్రిపేరయ్యాడు. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. తొలి పోస్టింగ్ మధ్యప్రదేశ్ రావడంతో అక్కడ జిల్లా కలెక్టర్‌గా పనిచేయడం ప్రారంభించారు. అయినా రోమన్ తన లక్ష్యాన్ని సాధించిన అనుభూతి కలగలేదు. ఇంకా ఏదో తెలియని అసంతృప్తి మెదులుతూనే ఉంది. ఇక లాభం లేదనుకుని ఐఏఎస్ ఉద్యోగాన్ని కూడా వదిలేసి 2015లో గౌరవ్ ముంజాల్, హేమేష్ సింగ్‌లతో కలిసి సొంతంగా అన్ అకాడమీ అనే కోచింగ్ సెంటర్‌ని ప్రారంభించాడు.ప్రారంభంలో ఇదొక యూట్యూబ్ ఛానెల్. క్రమంగా ఇది ఒక ఎడ్టెక్గా మారి.. సివిల్స్ స్టడీ మెటీరియల్‌కి ప్రసిద్ధిగాంచింది. అలా ఇది కాస్త అన్ అకాడమీ సార్టింగ్ హ్యాట్ టెక్నాలజీస్ కంపెనీగా మారింది. ప్రస్తుతం దీని విలు రూ. 2600 కోట్లు. యూపీఎస్సీ వంటి పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వారికి సరసమైన ధరల్లో నాణ్యమైన కోచింగ్‌ని అందించే స్టడీ సెంటర్‌గా పేరుతెచ్చుకుంది. ఈ అకాడమీ నుంచి ఏటా వేలాది మంది విద్యార్థులు కోచింగ్ పొందుతున్నారు. రోమన్ అచంచలమైన కృషికి నిదర్శనంగా చాలా తక్కువ వ్యవధిలోనే మంచి కోచింగ్ సెంటర్‌గా పేరుతెచ్చుకుంది. అంతేగాదు ఈ అకాడమీతో రోమన్ ఆర్జించే జీతం తెలిస్తే విస్తుపోతారు. దగ్గర రూ. 88 లక్షల పైమాటే..!. ఇది కదా సక్సెస్‌కి సరైన నిర్వచనం..!.(చదవండి: వామ్మో ఇదేం సంస్కృతి..! ‘డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్’ అంటున్న యువత..) -
Success Story: పట్టుదలకు మారుపేరు అనురాగ్ గౌతమ్
పట్టుదల, ఏకాగ్రత విజయానికి మూలసూత్రాలని చెబుతారు. వీటిని ఆశ్రయించినవారు ఏ రంగంలోనైనా రాణిస్తారని అంటారు. పట్టుదలతో చదివి విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినవారిని మనం చూసేవుంటాం. అలాంటి వారిలో ఒకరే అనురాగ్ గౌతమ్.యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తాజాగా ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ (ఐఈఎస్) పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. జార్ఖండ్‌లోని బొకారోకు చెందిన అనురాగ్ గౌతమ్ ఐఈఎస్ ఫలితాల్లో దేశంలోనే మొదటి స్థానాన్ని సాధించాడు. ఆల్ ఇండియా ర్యాంక్ వన్ (ఏఐఆర్ 1) సాధించి, అనురాగ్ అందరి అభినందనలు అందుకుంటున్నాడు.అనురాగ్ గౌతమ్ బొకారో డీపీఎస్ స్కూలులో చదువుకున్నాడు. అతని తండ్రి అనుపమ్ కుమార్ బొకారో స్టీల్ ప్లాంట్‌లో అధికారి. అతని తల్లి కుమారి సంగీత గృహిణి. చిన్నతనం నుంచే అనురాగ్‌కు చదువుపై అమితమైన ఆసక్తి ఉంది. పాఠశాల విద్య పూర్తిచేసిన అనురాగ్ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఉన్నత విద్యాభ్యాసం చేశారు.తన కుమారుడు ఎన్టీఎస్ఈ, కేవీపీవై తదితర పరీక్షలలో విజయం సాధించాడని అనురాగ్ తండ్రి అనుపమ్ కుమార్ తెలిపారు. అయితే ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ (ఐఈఎస్) అధికారి కావడం అనురాగ్ కల అని, తొలి ప్రయత్నంలో విఫలమైనా ధైర్యం కోల్పోకుండా, రాత్రి పగలు కష్టపడి ఎట్టకేలకు ఈ పరీక్షలో విజయం సాధించాడన్నారు. రెండవ ప్రయత్నంలో దేశం మొత్తం మీద అగ్రస్థానంలో నిలిచి అనురాగ్ తన కలను నెరవేర్చుకున్నాడన్నారు.అనురాగ్ సాధించిన విజయం గురించి తెలుసుకున్న డీపీఎస్ బొకారో ప్రిన్సిపాల్ డాక్టర్ గంగ్వార్ కూడా అనురాగ్‌ను అభినందించారు. ఈ విజయం అతని కుటుంబానికే కాకుండా, రాష్ట్రానికే గర్వకారణమన్నారు. ఎవరైనా అంకితభావంతో పనిచేస్తూ, లక్ష్యం దిశగా పయనించినప్పుడు ఏ సవాలూ పెద్దది కాదనేందుకు ఈ విజయం ఉదాహరణగా నిలుస్తుందన్నారు.ఇది కూడా చదవండి: అతనిది హర్యానా.. ఆమెది ఫ్రాన్స్.. ప్రేమ కలిపిందిలా.. -
యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోమవారం విడుదల చేసింది. మెయిన్స్ పరీక్ష రాసిన అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ upsc.gov.in ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు ఇంటర్వ్యూకు అర్హత సాధించిన అభ్యర్థుల హాల్‌టికెట్ నంబర్లతో జాబితాను విడుదల చేసింది. కాగా ఈ ఏడాది మొత్తం 1056 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు యూపీఎస్సీ గతంలో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. జూన్ 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించి జులై 1న ఫలితాలు వెల్లడించారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి సెప్టెంబర్ 20 నుంచి 29 వరకు మెయిన్ పరీక్షలు నిర్వహించారు. ఈ ఫలితాలను యూపీఎస్సీ తాజాగా విడుదల చేసింది. త్వరలో న్యూ ఢిల్లీలోని షాజహాన్ రోడ్‌లోని ధోల్పూర్ హౌస్‌లో ఉన్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఈ ఇంటర్వ్యూలో ఎంపికైన వారిని ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్, ఇతర కేంద్ర సర్వీసులకు ఎంపిక చేస్తారు. -
యూపీఎస్సీ కోసం.. అధిక జీతం వదులుకుని.. ‘కనిష్క్’ సక్సెస్ స్టోరీ
న్యూఢిల్లీ: విజేతల కథనాలు ఎవరికైనా సరే శక్తివంతమైన ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. అడ్డంకులను అధిగమించడానికి, లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించడానికి ప్రేరణ కల్పిస్తాయి. కష్టపడి పనిచేయడమే విజయం వెనుకనున్న రహస్యం అని అవగతమయ్యేలా చేస్తాయి. యూపీఎస్సీలో ఉత్తీర్ణత సాధించడమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్న ఒక యువకుడు కోటి రూపాయల జీతం వచ్చే ఉద్యోగాన్ని కాదనుకున్నాడు. పట్టుదలగా చదివి తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీలో ఆల్ ఇండియా ర్యాంక్ (ఏఐఆర్)ను సాధించాడు.కనిష్క్ కటారియాది రాజస్థాన్‌లోని జైపూర్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బొంబాయి నుండి కంప్యూటర్ సైన్స్‌లో పట్టభద్రుడయ్యారు. అనంతరం అతనికి దక్షిణ కొరియాలోని శామ్సంగ్ కంపెనీలో కోటి రూపాయల జీతంతో ఉద్యోగానికి ఆఫర్ వచ్చింది. వెంటనే ఆయన ఆ సంస్థలో డేటా సైంటిస్ట్‌గా చేరారు. కొన్నేళ్ల తర్వాత కనిష్క్ భారత్‌కు తిరిగి వచ్చి బెంగళూరులో ఉన్న ఒక అమెరికన్ స్టార్టప్‌లో చేరారు. ఆ ఉద్యోగంలో అధిక జీతం వస్తున్నప్పటికీ, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఎఎస్)లో చేరాలనే తన ఆశయాన్ని నెరవేర్చుకునేందుకు ఉద్యోగాన్ని వదిలి జైపూర్‌కు తిరిగి వచ్చాడు.తరువాత రాజధాని ఢిల్లీకి చేరుకుని యూపీఎస్సీ పరీక్షకు కోచింగ్ తీసుకున్నాడు. తన మొదటి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా ర్యాంక్ సాధించాడు. గణితాన్ని తన ఐచ్ఛిక సబ్జెక్ట్‌గా ఎంచుకుని పరీక్షలో విజయం సాధించారు. కనిష్క్ రాత పరీక్షలో 942 మార్కులు, పర్సనాలిటీ టెస్ట్‌లో 179 మార్కులు సాధించారు. మొత్తం మీద 2025 మార్కులకు గాను 1,121 మార్కులు దక్కించుకున్నారు.రాజస్థాన్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన అతని తండ్రి సన్వర్ మల్ వర్మ నుండి కనిష్క్ ప్రేరణ పొందారు. తండి అడుగుజాడల్లో నడుస్తూ తన కలను సాకారం చేసుకున్నారు. కనిష్క్ కటారియా రాజస్థాన్ ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ (డీఓపీ)లో జాయింట్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఇది కూడా చదవండి; లండన్‌లో రేడియో జాకీగా రాణిస్తున్న హైదరాబాదీ -
జీవో 29తో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం
సాక్షి, సిద్దిపేట: కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 29 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఈబీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు టాప్ మార్కులు వచ్చినా జనరల్‌గా కాకుండా, రిజర్వేషన్‌గా పరిగణించడం వల్ల మరో రిజర్వ్డ్ అభ్యర్థికి అవకాశం లేకుండా పోతోందని స్పష్టం చేశారు. యూపీఎస్సీ అమలు చేస్తున్నా.. ఆ విధానాన్ని టీజీపీఎస్సీ ఎందుకు అమ లు చేయడం లేదని నిలదీశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు జీవో 55 ప్రకారం అన్నివర్గాల నిరుద్యోగులు, విద్యార్థులకు న్యాయం చేశారని పేర్కొన్నా రు. శనివారం సిద్దిపేటలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ కోసం రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని సదస్సులు నిర్వహిస్తుంటే.. తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి రా జ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆ వర్గానికి ప్రతినిధిగా ఉండి మౌనం వహిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఇదే అంశాన్ని అడిగితే భట్టి విక్రమార్క పరిశీలిస్తామన్నారు. దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డిని నిలదీసి బలహీన వర్గాల హక్కులను కాపాడాలి.విద్యార్థులు, నిరుద్యోగుల ఆర్తనాదాలతో అశోక్‌నగర్ ప్రాంతం మార్మోగుతోంది. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని, రిజర్వేషన్లు అమలు చేయాలని విద్యార్థులు రోడ్డెక్కితే వారిని కొడుతున్నారు. ఆడపిల్లల్ని కూడా అర్ధరాత్రి పోలీసు స్టేషన్లలో పెడుతున్నారు. వారేమైనా టెర్రరిస్టులు, హంతకులు, గూండాలా? లాఠీలు, ఇనుప కంచెలను రేవంత్‌రెడ్డి నమ్ముకున్నారు. అవి అణచేయవు. ఉద్యమం మరింత ఉధృతం అవుతుంది. సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా అశోక్‌నగర్‌కు వెళ్లాలి. కోదండరాం స్పందించడం లేదేం? కాంగ్రెస్ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్‌లో ప్రకటించినవి ఒక్కటైనా అమలు చేశారా? అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. పది నెలలు గడిచినా ఒక్క నోటిఫికేషన్ లేదు. కేసీఆర్ ప్రభుత్వమే ప్రక్రియ అంతా పూర్తిచేసిన ఉద్యోగాలకు కాగితాలు పంచి.. 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. కోదండరాం ఎందుకు మౌనంగా ఉంటున్నారు? నిరుద్యోగుల ఎజెండా.. నా ఎజెండా అన్నారు. ఎమ్మెల్సీ అయ్యాక గొంతు మూగబోయింది. కోదండరాం, రియాజ్, నవీన్, ఆకునూరి మురళిలకు ఉద్యోగాలు వచ్చాయి. నిరుద్యోగులకు రాలేదు. కాంగ్రెస్ బీజేపీ చీకటి ఒప్పందం బట్టబయలు గ్రూప్–1 అభ్యర్థుల నిరసన సాక్షిగా కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉన్న చీకటి ఒప్పందం మరోమారు బట్టబయలైంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ నిరసన తెలుపుతుంటే అడ్డుకోని కాంగ్రెస్ ప్రభుత్వం.. బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయడం దుర్మార్గం. జీవో 29 రద్దు చేసి గ్రూప్స్ అభ్యర్థులకు న్యాయం చేయాలని జూలై 29న నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడే ప్రభుత్వం మొండిపట్టు వీడి ఉంటే ఇప్పుడు విద్యార్థులు, అభ్యర్థుల మీద లాఠీలు విరిగేవి కాదు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం వద్దు. రాజకీయాలు పక్కనబెట్టి విద్యార్థుల సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాలి..’’అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. -
పండక్కి ఊరెళ్తున్నారా? మీ ఇంటి తాళాన్ని యజమానికి ఇచ్చి వెళ్తున్నారా?
అద్దె ఇంట్లో నివసిస్తున్నారా? పండుగలకు, పబ్బాలకు ఊరెళుతున్నారా? ఊరు వెళ్లే సమయంలో మీ ఇంటికి తాళం వేస్తున్నారా? ఆ తాళం ‘కీ’ని మీ ఇంటి యజమానికి ఇచ్చి వెళుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.తూర్పు ఢిల్లీ షకర్పూర్ ప్రాంతంలో కలకలం రేగింది. ఓ ఇంటి యజమాని కుమారుడు దారుణానికి ఒడిగాట్టాడు. తన ఇంట్లో అద్దెకు ఉంటున్న విద్యార్థిని బెడ్ రూం, బాత్రూంలలో కెమెరాల్ని అమర్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే? తూర్పు ఢిల్లీ పోలీసుల వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన విద్యార్థిని సివిల్ సర్వీస్ పరీక్షల కోచింగ్ నిమిత్తం షకర్పూర్ ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటుంది. అయితే మూడు నెలల క్రితం యువతి ఉత్తరప్రదేశ్‌లోని తన స్వగ్రామానికి వెళ్లింది. వెళ్లే ముందు ఇంటి తాళాన్ని ఇంటి యజమానికి ఇచ్చి వెళ్లింది. అప్పుడే యజమాని కుమారుడు కరణ్ తన దుర్భుద్దిని చూపించాడు.ఏదో జరుగుతుంది..యువతి వెళ్లిన తర్వాత ఆమె ఇంట్లో బెడ్రూమ్లోని బల్బులలో, బాత్రూంలో ఉండే బల్బులలో స్పై కెమెరాల్ని అమర్చాడు. ఊరెళ్లిన యువతి మళ్లీ తిరిగి వచ్చింది. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతుంది. కానీ ఇంటికి వచ్చిన తర్వాత తన చుట్టూ ఏదో జరుగుతుందని అనుమానం వ్యక్తం చేస్తుండేంది. కానీ ఏం జరుగుతుందో తెలిసేది కాదు.👉చదవండి : సీఎం యోగి కొత్త రూల్స్ వాట్సప్‌తో బట్టబయలుఈ నేపథ్యంలో ఓ రోజు ఆమె అనుమానం నిజమైంది. ఎవరో అగంతకులు తన వాట్సప్‌ను ల్యాప్‌ట్యాప్‌లో లాగిన్ అయినట్లు గుర్తించింది. దీంతో భయాందోళనకు గురైన యువతి వాట్సప్‌ను బ్లాక్ చేసింది. ఆ తర్వాత మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్న ఆమె తన పరిసరాల్ని, ఇంట్లోని ప్రతి అణువణువునూ పరీక్షించింది. చివరిగా తాను అద్దెకు ఉంటున్న ఇంటి బెడ్రూం, బాత్రూం బల్బుల్లో స్పై కెమెరాల్ని గుర్తించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.బెడ్ రూం, బాత్రూంలో మూడు స్పై కెమెరాలుసమాచారం అందుకున్న పోలీసులు ఇంట్లో సోదాలు నిర్వహించారు. మూడు కెమెరాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంటి గురించి,ఇంటి యజమాని గురించి ఆరా తీశారు. ఇంట్లో కరెంట్ పనులు చేయించాలనిపోలీసుల విచారణలో ఇంటి యజమానికి కుమారుడు ఆకాష్..ఆ స్పై కెమెరాల్ని అమర్చినట్లు నిర్ధారించారు. నిందితుడు అమర్చిన స్పై కెమెరాలో రికార్డయిన డేటాను ఆన్లైన్లో చూసేందుకు వీలు లేదు. ఆ డేటా అంటే స్పై కెమెరాల్లో ఉన్న మెమోరీ కార్డ్‌లలో స్టోరేజీ అయ్యేది. మెమోరీ కార్డ్‌లలో స్టోరేజీ అయిన డేటాను చూసేందుకు ఇంట్లో కరెంట్ పని ఉందని పలు మార్లు తాను రహస్యంగా ఉంచిన మెమోరీ కార్డ్‌లను తీసుకున్నట్లు నిందితుడు ఆకాష్ ఒప్పుకున్నాడు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
యూపీఎస్సీకి పూజా ఖేద్కర్ సవాల్!
ఢిల్లీ : తన అభ్యర్థిత్వం రద్దు చేసే హక్కు యూపీఎస్సీకి లేదని వివాదాస్పద మాజీ ఐఏఎస్ ట్రైనీ అధికారిణి పూజా ఖేద్కర్ వాదిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తన అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ రద్దు చేయడంపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. ఈ తరుణంలో ఒకసారి ఎంపికై ప్రొబేషనర్‌గా నియమితులైన తర్వాత, యూపీఎస్సీ తన అభ్యర్థిత్వాన్ని అనర్హులుగా ప్రకటించే అధికారం లేదన్నారు. ఒకవేళ చర్యలు తీసుకోవాలనుకుంటే కేవలం డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ) మాత్రమే ఉందని, ఆల్ ఇండియా సర్వీసెస్ యాక్ట్, 1954 సీఎస్ఈ 2022 రూల్స్‌లోని రూల్ 19 ప్రకారం ప్రొబేషనర్ రూల్స్ ప్రకారం చర్య తీసుకోవచ్చు’అని ఖేద్కర్ పేర్కొన్నారు.పూజా ఖేద్కర్ కేసు ఈ ఏడాది జులైలో మహారాష్ట్ర వాసిం జిల్లా సూపర్ న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్ హోదాలో ఉన్న పూజా ఖేద్కర్ జిల్లా కలెక్టర్ స్థాయిలో తనకూ అధికారిక సదుపాయాలు, వసతులు కల్పించాలని డిమాండ్ చేయడంతో ఆమె వ్యవహార శైలి తొలిసారిగా వార్తల్లోకి ఎక్కింది. ప్రత్యేకంగా ఆఫీస్‌ను కేటాయించాలని, అధికారిక కారు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు సొంత ఖరీదైన కారుపై ఎర్ర బుగ్గను తగిలించుకుని తిరిగారు. దీంతో పుణెలో అసిస్టెంట్ కలెక్టర్ హోదా నుంచి ఆమెను వాసిమ్ జిల్లాలో సూపర్‌న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్‌గా ప్రభుత్వం బదిలీచేసింది.ఆ తర్వాత ఆమె తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి సివిల్స్‌లో ఆమె ఆలిండియా 821వ ర్యాంక్ సాధించారని ఆరోపణలు రావడంతో యూపీఎస్సీ విచారణ చేపట్టింది. విచారణలో ఆమె తప్పుడు వైకల్య ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్లు తేలింది. దీంతో పూజా ఖేద్కర్ అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ రద్దు చేసింది. యూపీఎస్సీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ తరుణంలో పూజా ఖేద్కర్ యూపీఎస్సీ గురించి పై విధంగా వ్యాఖ్యలు చేశారు. -
ఢిల్లీ హైకోర్టులో పూజా ఖేద్కర్‌కు ఊరట
ఢిల్లీ: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఆమెను ఆగస్టు 21 వరకు అరెస్ట చేయోద్దని కోర్టు పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. యూపీఎస్సీ పరీక్షలో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పూజా ఖేద్కర్ తనకు ముందస్తు బెయిల్‌ను జిల్లా కోర్టు నిరాకరించింది. దీంతో జిల్లా కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు సోమవారం విచారణ జరిపింది.ఈ కేసులో కుట్రను వెలికితీసేందుకు పూజా ఖేద్కర్‌ను కస్టడీకి ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో సమాధానం ఇవ్వాలని ఢిల్లీ పోలీసులు, యూపీఎస్సీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపపరి చేపట్టే విచారణ (ఆగస్ట్ 21) వరకు ఆమెను పోలీసు అరెస్ట్ చేయవద్దని జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ అన్నారు. తక్షణ కస్టడీకి తరలించాల్సిన అవసరం లేద పేర్కొన్నారు. ‘ప్రస్తుతానికి పూజా ఖేద్కర్‌ను తక్షణ కస్టడీ తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్లు కనిపించడం లేదు’ అని జస్టిస్ ప్రసాద్ యూపీఎస్సీ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది నరేష్ కౌశిక్‌కు తెలిపారు.చదవండి: పూజా ఖేద్కర్ ఎపిసోడ్లో మరో ట్విస్ట్.. ఆమె తండ్రిపై కేసు ఫైల్ -
పారదర్శకతే సరైన మార్గం
-
పారదర్శకతే సరైన మార్గం
యాదృచ్ఛికమే కావొచ్చుగానీ... జాతీయ స్థాయి పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు వరసపెట్టి లీక్ అవుతున్న తరుణంలోనే ట్రెయినీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ ఎంపిక వ్యవహారం బద్దలై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శిగా పనిచేసి నాలుగేళ్ల క్రితం రిటైరైన ప్రీతి సుదాన్కు సంస్థ సారథ్యం అప్పగించారు. ఆమె యూపీఎస్సీని చక్కదిద్దుతారన్న నమ్మకం అందరిలోవుంది.సాధారణంగా ప్రశ్నపత్రాల లీక్ ఉదంతాలు చోటుచేసుకున్నప్పుడల్లా యూపీఎస్సీని అందరూ ఉదాహరణగా చూపేవారు. దాన్ని చూసి నేర్చుకోవాలని హితవు పలికేవారు. అలాగని యూసీఎస్సీపై అడపా దడపా ఆరోపణలు లేకపోలేదు. ముఖ్యంగా అంగవైకల్యం ఉన్నట్టు చూపటం, తప్పుడు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు దాఖలుచేయటం వంటి మార్గాల్లో అనర్హులు సివిల్ సర్వీసులకు ఎంపికవు తున్నారన్న ఆరోపణలు అధికం. ఫలితాల ప్రకటనలో ఎడతెగని జాప్యం సరేసరి. అయితే వీటికిసంతృప్తికరమైన సంజాయిషీలు రాలేదు. పరీక్ష నిర్వహణ మాటెలావున్నా ధ్రువీకరణ పత్రాల తనిఖీకి ఆ సంస్థ పకడ్బందీ విధానాలు పాటించడం లేదన్న విమర్శలున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో క్రమంలో పొరపాట్లు చోటుచేసుకునే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. వెనువెంటనే ఆరా తీసి సరిదిద్దుకుంటే అవి పునరావృతమయ్యే అవకాశాలు ఉండవు. విమర్శలు, ఆరోపణలు వచ్చిన ప్రతిసారీ తక్షణం స్పందించే లక్షణం ఉండాలంటే జవాబుదారీతనం, పారదర్శకత తప్పని సరి. అవి లోపించాయన్నదే యూపీఎస్సీపై ప్రధాన ఫిర్యాదు. ఒకపక్క అభ్యర్థులకు నైతిక విలువల గురించి ప్రశ్నపత్రం ఇస్తూ అలాంటి విలువలు సంస్థలో కిందినుంచి పైవరకూ ఉండటంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని గుర్తించకపోతే అంతిమంగా న ష్టం కలిగేది సంస్థకే. పూజ గురించిన వివాదాలు సామాజిక మాధ్యమాల్లో బయటికొచ్చాక ఇప్పటికే సర్వీసులో చేరిన కొందరిపై ఆరోపణలు వెల్లు వెత్తాయి. కాళ్లకు సంబంధించి అంగ వైకల్యం ఉన్నట్టు చూపి ఉద్యోగం పొందారంటూ ఒక అధికారి వీడియో బయటికొచ్చింది. అందులో ఆయన నిక్షేపంగా ఉండటమేగాక సైక్లింగ్, రన్నింగ్ చేస్తున్నట్టు కనబడుతోంది. ఆయన నిజంగానే అలాంటి తప్పుడు పత్రంతో చేరారా లేక ఆ అధికారిపై బురద జల్లారా అనేది తెలియదు. తక్షణం స్పందించే విధానం రూపొందించుకుంటే తప్పుడు ఆరోపణలు చేసినవారిపై చర్య తీసుకునే వీలుంటుంది. లేదా సంబంధిత అధికారినుంచి సంజాయిషీ కోరే అవ కాశం ఉంటుంది. రెండూ లేకపోతే ఎవరికి తోచినవిధంగా వారు అనుకునే పరిస్థితి ఏర్పడుతుంది. యూపీఎస్సీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న మనోజ్ సోనీ రాజీనామా ఉదంతంలో కూడా సక్రమంగా వ్యవహరించలేదు. నిరుడు మే 16న చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సోనీ అయిదేళ్ల కాల వ్యవధికి చాలా చాలా ముందే ఎందుకు తప్పుకున్నారు? చూసేవారికి స్పష్టంగా పూజ ఎంపిక వ్యవహారం తక్షణ కారణంగా కనబడుతుంది. కానీ ఆ సంస్థ అదేం కాదంటోంది. ‘వ్యక్తిగత కార ణాలే’ అని సంజాయిషీ ఇస్తోంది. అటు కేంద్రం సైతం ఏమీ మాట్లాడదు. దీనివల్ల ప్రజల్లో అనుమా నాలు తలెత్తితే... మొత్తంగా అది సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీయదా? అభ్యర్థులు తాము బాగా రాసినా అక్కడేదో జరిగిందన్న అపోహలుపడే పరిస్థితి తలెత్తదా? అసలు ఇలాంటివి జరుగుతున్నాయన్న నమ్మకాలు బలపడితే అభ్యర్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలకూ, ఆ తర్వాత ఇంటర్వ్యూలకూ హాజరు కాగలరా? నూతన సారథి ఈ అంశాలపై ఆలోచన చేయాలి. పూజ ఉదంతంలో కోల్పోయిన విశ్వసనీయతను పెంపొందించుకోవటానికి ఏమేం చర్యలు అవసరమన ్న పరిశీలన చేయాలి. అభ్యర్థుల మదింపు విషయంలో అనుసరించే విధానాల గురించి... ముఖ్యంగా వారి జవాబుపత్రాల దిద్దుబాటుకూ, ఆ తర్వాత జరిగే ఇంటర్వ్యూలో అభ్యర్థులిచ్చే జవాబుల ద్వారా వారి శక్తియుక్తు లనూ, సామర్థ్యాన్ని నిర్ధారించే పద్ధతులకూ ఎలాంటి ప్రమాణాలు పాటిస్తారో తెలపాలి. చదువుల్లో, సమస్యలను విశ్లేషించే సామర్థ్యంలో మెరికల్లా ఉండటం, సమాజంలో అపరిష్కృతంగా మిగిలిపోతున్న అంశాల విషయంలో ఏదో ఒకటి చేయాలన్న తపన, తాపత్రయంఉండటం, నాయకత్వ లక్షణాలు ప్రదర్శించటం సివిల్ సర్వీసుల అభ్యర్థులకు అవసరమని చాలా మంది చెబుతారు. నిజానికి ఈ సర్వీసుల్లో పనిచేసేవారి జీతభత్యాలకు అనేక రెట్లు అధికంగా సాఫ్ట్వేర్ రంగంలో లేదా వ్యాపారాల్లో మునిగితేలేవారు సంపాదిస్తారు. అందుకే ఎంతో అంకిత భావం ఉండేవారు మాత్రమే ఇటువైపు వస్తారు. కానీ అలాంటివారికి యూపీఎస్సీ ధోరణి నిరాశ కలిగించదా? నీతిగా, నిజాయితీగా పాలించటం చేతకాని పాలకుల ఏలుబడిలో పనిచేయాల్సి వచ్చి నప్పుడు సర్వీసులో కొత్తగా చేరిన యువ అధికారులు ఎంతో నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారు. అసలు యూపీఎస్సీయే నిర్లక్ష్యం లోనికో, నిర్లిప్తత లోనికో జారుకుంటే ఎవరిని నిందించాలి? పూజా ఖేడ్కర్‌కు సంబంధించి ఇంకా దోష నిర్ధారణ జరగలేదు. ప్రస్తుతం ఆమె కేవలం నిందితురాలు మాత్రమే. పునః శిక్షణకు రావాలన్న సూచనను బేఖాతరు చేయటంతో ఇప్పటికే యూపీఎస్సీ ఆమె ఎంపికను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. మరోపక్క పోలీసులూ, యూపీఎస్సీ నియమించిన కమిటీ ఆమె సమర్పించిన ధ్రువీకరణ పత్రాలపై ఆరా తీస్తున్నారు. ఆమె ముందస్తు బెయిల్ దరఖాస్తును న్యాయస్థానం తిరస్కరించింది. ఈ పరిణామంతో ఆమె దుబాయ్‌కి పరారీ అయ్యారన్న కథనాలు కూడా మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ ఉదంతంలోనైనా జరిగిందేమిటో వివరిస్తే, ఇది పునరావృతం కాకుండా తీసుకున్న చర్యలేమిటో చెబితే యూపీఎస్సీపై విశ్వసనీయత పెరుగుతుంది. దాని ప్రతిష్ఠ నిలబడుతుంది. -
పూజా ఖేద్కర్ వివాదం.. కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ వైకల్య ధ్రువీకరణ పత్రాల వివాదం నేపథ్యంలో సివిల్ సర్వెంట్ల నియామకం, శిక్షణ, నిర్వహణ సంబంధిత కార్యకలాపాలు నిర్వహించే కేంద్ర విభాగానికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ)విభాగం అప్రమత్తమైంది. ఆరుగురు సివిల్ సర్వెంట్ల వైకల్య ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వారిలో ఐదుగురు ఐఏఎస్, ఒకరు ఐఆర్ఎస్ అధికారి ఉన్నట్లు సమాచారం.లగ్జరీ సౌకర్యాల కోసం అతిగా ప్రవర్తించి మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ పలు సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. ఉద్యోగం కోసం ఓబీసీ సర్టిఫికెట్తో పాటు కంటి, మానసిక సంబంధిత సమస్యలపై తప్పుడు పత్రాలు సమర్పించినట్లు ఆరోపణలు వచ్చాయి. వీటిని నిర్ధారించేందుకు నిర్వహించే వైద్య పరీక్షలకు ఖేద్కర్ ఆరుసార్లు గైర్హాజరవ్వడం వంటి వరుస వివాదాలు ఆమె ఐఏఎస్ అభ్యర్థితత్వం రద్దుకు దారి తీసింది. ట్రైనీ ఐఎస్ఎస్ అధికారిణి చేసిన తప్పుల్ని గుర్తించిన యూపీఎస్సీ ఆమె ఎంపికను రద్దు చేసింది. భవిష్యత్తులో సివిల్స్ పరీక్షల్లో పాల్గొనకుండా ఆమెపై జీవితకాల నిషేధం విధించింది.తదుపరి చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆమెపై ఢిల్లీ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే తన అరెస్ట్ తప్పదేమోనన్న అనుమానంతో ఖేద్కర్ ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు ముందస్తు బెయిల్‌ను నిరాకరించింది. ఈ వరుస పరిణామాలతో ఖేద్కర్ విదేశాలకు పారిపోయినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.Puja Khedkar case: Following the row over #IAS probationer #PujaKhedkar, the Department of Personnel and Training (#DoPT) will now scrtutinise the disability certificates of six other civil servants.https://t.co/F4bXZs7rL9— Business Today (@business_today) August 2, 2024 -
ఢిల్లీ రావూస్ కోచింగ్ సెంటర్ విషాదం : ఎస్యూవీ డ్రైవర్‌కు బెయిల్
ఢిల్లీ : ఢిల్లీ రావుస్ కోచింగ్ సెంటర్లో విద్యార్ధుల మరణాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎస్యూవీ డ్రైవర్ మను కతురియాకు ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.జులై 27న ఢిల్లీలో రావుస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి నీరు చేరి ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ముగ్గురు విద్యార్థుల మరణానికి పరోక్షంగా ఎస్యూవీ డ్రైవర్ మను కతురియా కారణమంటూ ఢిల్లీ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు.తన అరెస్ట్‌ని సవాల్ చేస్తూ కతురియా ఢిల్లీ జిల్లా తీస్ హజారీ కోర్టును ఆశ్రయించారు. గురువారం విచారణ చేపట్టిన కోర్టు రూ.50వేల పూచికత్తుతో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. [Rajendra Nagar deaths] A Delhi Sessions Court grants bail to Manuj Kathuria, an SUV driver arrested by Delhi Police in connection with the case. Kathuria was denied bail by the Magistrate Court on Wednesday. #UPSCaspirants #RajendraNagar #bail pic.twitter.com/RDOmIdyIAH— Bar and Bench (@barandbench) August 1, 2024జులై 27న సాయంత్రం ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. దాంతో వరదలు పోటెత్తాయి. ఈ క్రమంలో ఓల్డ్ రాజేందర్ నగర్‌లోని రావూస్ సివిల్స్ కోచింగ్ సెంటర్లో సెల్లార్లోకి భారీగా వరద నీరు చేరింది. అదే సమయంలో రావుస్ కోచింగ్ సెంటర్ ఎదురుగా ఉన్న రోడ్డుపై మను కతురియా తన ఎస్యూవీ వాహనాన్ని వేగంగా డ్రైవింగ్ చేయడంతో వరద నీరు సెల్లార్లోకి చేరుకుంది. దీంతో వరదలో చిక్కుకుని సెల్లార్‌లోని లైబ్రరీలో చదువుకుంటున్న ముగ్గురు విద్యార్ధులు మరణించారు. ఈ దుర్ఘటనలో విద్యార్ధుల మరణానికి మను కతురియా కారకుడేనంటూ ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. తన అరెస్ట్‌ను కతురియా సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించగా.. విచారణ చేపట్టిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. -
పూజా ఖేద్కర్‌కు మరో ఎదురు దెబ్బ
ఢిల్లీ : సివిల్ సర్వీస్ పరీక్షల్లో గట్టెక్కేందుకు నకిలీ పత్రాలు సృష్టించిన కేసులో మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆమె ముందుస్తు బెయిల్ పిటిషన్‌ను గురువారం ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. నకిలీ పత్రాల కేసులో ఖేద్కర్ తరుఫు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా.. తనని (ఖేద్కర్) ఓ అధికారి లైంగికంగా వేధించారని, ఆయనపై ఫిర్యాదు చేసినందుకు తనని టార్గెట్ చేసినట్లు పేర్కొన్నారు. తానెలాంటి తప్పు చేయలేదని నిరూపించుకునేందుకు ముందస్తు బెయిల్‌ను కోరుతున్నారని పేర్కొన్నారు. అనంతరం ఖేద్కర్ వ్యవస్థను మోసం చేశారని కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అనంతరం ఆమె ముందుస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. మహారాష్ట్రకు చెందిన ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ ఎంపికను యూపీఎస్సీ రద్దు చేసింది. భవిష్యత్తులో సివిల్స్ పరీక్షల్లో పాల్గొనకుండా ఆమెపై జీవితకాల నిషేధం విధించింది. పరీక్ష నిబంధనల్ని అతిక్రమిస్తూ నకిలీ ధ్రువపత్రాలతో పరీక్షను రాసినట్టు గుర్తించిన యూపీఎస్సీ ఈ మేరకు ఆమెపై చర్యలు చేపట్టింది. ఈ తరుణంలో ఆమె ఢిల్లీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. #Justin: Delhi's Patiala House Court denying bail to #IAS Puja Khedkar says she's able to breach the wall of #UPSC not only once but repeatedly with deceitful means.It also says that she snatched rights of other eligible aspirants with disability benchmark quota@CNNnews18 pic.twitter.com/YCR2bfzoPr— Ananya Bhatnagar (@anany_b) August 1, 2024పలు సెక్షన్ల కింద కేసులు నమోదు ఖేద్కర్‌పై ఢిల్లీ పోలీసులకు యూపీఎస్సీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఐటీ యాక్ట్, డిసెబిలిటీ యాక్ట్ కింద ఫోర్జరీ,చీటింగ్ కేసుల్ని నమోదు చేశారు. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం ఖేద్కర్ ఢిల్లీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆమె బెయిల్ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాత్సవ ఈ కేసులో దర్యాప్తు "చాలా ప్రారంభ దశలో ఉంది" అని వాదించారు. కేసు తదుపరి విచారణ కోసం ఆమెను కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరమని వాదించారు.పూజా ఖేద్కర్ లాంటి వారి పట్ల కఠినంగా వ్యహరించాలి" వాదన సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఖేద్కర్ గురించి ప్రస్తావిస్తూ.. వ్యవస్థల్ని మోసం చేసే ఇలాంటి వ్యక్తుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాలి. ఇప్పటికే చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేశారు. ఇంకా దుర్వినియోగం చేసే అవకాశాలు ఇంకా ఉన్నాయి " అని అన్నారు. -
పూజా ఖేద్కర్‌కు యూపీఎస్సీ షాక్.. అన్ని పరీక్షల నుంచి శాశ్వత డిబార్
న్యూఢిల్లీ: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ ప్రొవిజినల్ అభ్యర్ధిత్వాన్ని యూపీఎస్సీ కమిషన్ రద్దు చేసింది. అదే విధంగా భవిష్యత్తులోనూ కమిషన్ నిర్వహించే ఏ ఇతర పరీక్షలకు హాజరు అవ్వకుండా ఆమెపై నిషేధం విధించింది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(సీఎస్ఈ) నిబంధనలను ఉల్లంఘించినందుకు పూజా దోషిగా తేలినట్లు నిర్ధారించిన కమిషన్ ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు.కాగా పూజా ఖేద్కర్‌కు 18 జూలైగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆమెపై వచ్చిన అవినీతి ఆరోపణలపై జూలై 25 లోపు సమాధానం చెప్పాలని కోరింది. అయితే ఆమె ఆగస్టు 4 వరకు సమయం కావాలని కోరగా.. యూపీఎస్సీ జూలై 30 వరకు డెడ్‌లైన్ విధించింది. ఇదే చివరి అవకాశం అని కూడా స్పష్టం చేసింది. గడువులోగా స్పందన రాకపోతే చర్యలు తీసుకునే విషయంపై కూడా యూపీఎస్సీ ఆమెకు వెల్లడించింది. ఇక నిర్ణీత సమయంలో వివరణ ఇవ్వడంతో పూజా విఫలమవ్వడంతో ఆమె ప్రొవిజినల్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తున్నట్లు కమిషన్ పేర్కొంది.యూపీఎస్సీ పరీక్ష నిబంధనల్ని అతిక్రమిస్తూ అవకాశాలు వాడుకొని ఆమె నకిలీ పత్రాలతో పరీక్షను క్లియర్ చేసినట్లు గుర్తించామని గతంలో కమిషన్ పేర్కొంది. సివిల్ సర్వీసెస్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత పొందడం కోసం తప్పుడు పత్రాల సమర్పణ, అంగ వైకల్యం, మానసిక వైకల్యాల గురించి అబద్దాలు చెప్పడమే కాకుండా సాధారణ కేటగిరీలో అనుమతించిన ఆరు కంటే ఎక్కువ సార్లు పరీక్ష రాసినట్లు తెలిపింది. .తన పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఫొటోగ్రాఫ్/సంతకం, ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, చిరునామాకు సంబంధించిన పత్రాలన్నీ మార్చడం ద్వారా మోసపూరిత ప్రయత్నాలకు పాల్పడినట్లు వివరించింది. పుణెలో అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న పూజా ఖేద్కర్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో మహారాష్ట్ర సర్కార్ ఆమెను మరో చోటుకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఆమె వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తుంది. యూపీఎస్సీలో తప్పుడు పత్రాలు సమర్పించడం, మెడికల్ టెస్టులకు హాజరు కాకపోవడం బయటపడింది. దీంతో పూజా ఐఏఎస్ ఎంపికను రద్దు చేస్తూ యూపీఎస్సీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఖేద్కర్ తండ్రి ప్రభుత్వ మాజీ అధికారి దిలీప్ ఖేద్కర్‌పై పలు అవినీతి ఆరోపణల కేసులు నమోదయ్యాయి. ఖేద్కర్ తల్లి మనోరమ కూడా భూ వివాదం కేసులో రైతలను తుపాకీతో బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలోవైరల్ అవ్వడంతో ఆమెను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. మరోవైపు ఫీసర్ పూజా ఖేద్కర్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. -
UPSC: యూపీఎస్సీ కొత్త చైర్‌పర్సన్‌గా ప్రీతిసుదాన్
సాక్షి, ఢిల్లీ: కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి ప్రీతి సుదన్.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా, ప్రస్తుతం ఆమె యూపీఎస్సీ సభ్యురాలిగా పనిచేస్తున్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రీతిసుదాన్.. 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి.కాగా, ఆగస్టు ఒకటో తేదీన, రాజ్యాంగంలోని ఆర్టికల్ 316ఏ ప్రకారం ఆమె బాధ్యతలు స్వీకరిస్తారని ఓ ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు. ప్రస్తుతం యూపీఎస్సీ కమిషన్‌లో సభ్యురాలిగా ఉన్నారు. కొన్ని రోజుల క్రితం వ్యక్తిగత కారణాల వల్ల మనోజ్ సోని రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 2029 మే 15 వరకూ పదవీ కాలం ఉన్నప్పటికీ ఆయన ఐదేళ్ల ముందుగానే వ్యక్తిగత కారణాలతో వైదొలిగిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో ప్రీతి సుదన్ ఆ బాధ్యతలు స్వీకరించనున్నారు.ఇక, ప్రీతిసుదాన్.. 29 ఏప్రిల్ 2025 వరకు సేవలందిస్తారు. కాగా, సుడాన్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి ఎకనామిక్స్ అండ్ సోషల్ పాలసీ అండ్ ప్లానింగ్‌లో ఆమె డిగ్రీలు పొందారు. వాషింగ్టన్లో పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్లో శిక్షణ తీసుకున్నారు. మరోవైపు.. ఆంధ్రా కేడర్‌కు చెందిన 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ప్రీతిసుదాన్. సుడాన్ గతంలో ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. రక్షణ మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీ వంటి వివిధ కేంద్ర, రాష్ట్ర స్థాయి స్థానాల్లో పనిచేశారు. అలాగే విపత్తు నిర్వహణ, పర్యాటక రంగానికి సంబంధించిన హోదాలో పనిచేశారు. ఆమె ప్రపంచ బ్యాంకులో సలహాదారుగా కూడా పనిచేశారు. అలాగే కరోనా సమయంలో ఆమె క్రియాశీలకంగా విధులు నిర్వహించారు. ~ 1983 batch IAS officer Preeti Sudan will be the new UPSC Chairperson, with effect from 1st August 2024. ~ President Droupadi Murmu approves the appointment@rashtrapatibhvn #UPSC pic.twitter.com/parkcQUv9f— DD News Odia (@DDNewsOdia) July 31, 2024 -
ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటన.. విచారణకు కమిటీ
న్యూఢిల్లీ: ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ సెంటర్ ఘటనపై కేంద్రప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై విచారణ కోసం కమిటీని నియమించింది. ఢిల్లీ రాజేంద్రనగర్‌లోని రావుస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో వరద పోటెత్తి సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దుమారం రేగడంతో కేంద్ర ప్రభుత్వం విచారణకు తాజాగా కమిటీని నియమించింది. -
నారాయణ, చైతన్య సహా కోచింగ్ సెంటర్లను నిషేదించాలి : ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్రనగర్‌లో రావుస్ ఐఏఎస్ స్టడీ సెంటర్ బేస్మెంట్లోకి వరద నీరు పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతిచెందారు. ఈ విషాదంపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విచారం వ్యక్తం చేశారు. మరణించిన విద్యార్ధులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాజ్యసభలో సివిల్ కోచింగ్ సెంటర్లో విద్యార్థుల మరణంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారు. 👉పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీల్లో విద్యాప్రమాణాలు పెంచాలి.👉విద్య ప్రమాణాలు ఉంటే కోచింగ్ సెంటర్లు అవసరం ఉండదు.👉విద్య సంస్థలను బలోపేతం చేసి కోచింగ్ సెంటర్లు నిషేధించాలి.👉ఢిల్లీలో రావుస్,ఏపీలో నారాయణ, చైతన్య కోచింగ్ సెంటర్లు కనీసం మౌలిక సదుపాయాలు, ప్రమాణాలు కల్పించడం లేదు.👉దేశంలో ప్రతిచోటా అనేక ఘటనలు జరుగుతున్నాయి..కొన్ని బయటకు రావడం లేదు.👉కోచింగ్ సెంటర్లను నిషేధించాలి లేదంటే నియంత్రించాలి.👉ఢిల్లీలో జరిగిన ఘటనను ఆప్,బీజేపీ రెండు ప్రభుత్వాలు బాధ్యత వహించాలి.👉ప్రపంచంలో ఇరుకైన సిటీలో ఢిల్లీ 44 వ స్థానంలో ఉంది.👉వేల సంఖ్యలో యూపీఎస్సీ కోచింగ్ కోసం యువత ఢిల్లీ వస్తారు.👉ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి👉ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ ఎంసీడీ అధికారులపై చర్యలు తీసుకోవాలి.👉మృతి చెందిన విద్యార్థుల కుటుంబ సభ్యులకు మూడు కోట్ల రూపాయల నష్టపరిహారం అందించాలి. -
సుప్రీంకోర్టుకు చేరిన యూపీఎస్సీ అభ్యర్థుల మృతి కేసు
ఢిల్లీ : యూపీఎస్సీ అభ్యర్థులు దుర్భుర జీవితాన్ని గడుపుతున్నారంటూ యూపీఎస్సీ అభ్యర్థి అవినాష్ దూబే సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.గత వారం సెంట్రల్ ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్రనగర్‌లోని రావూస్ ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి వరదనీరు పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతిచెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే విద్యార్ధుల మృతికి కారణమైన అధికారులు, ఇతర నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవూ చంద్రచూడ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.రాజేంద్ర నగర్, ముఖర్జీ నగర్ వంటి ప్రాంతాలలో పేలవమైన మౌలిక సదుపాయాలపై అవినాష్ దూబే ధ్వజమెత్తారు.మున్సిపల్ కార్పొరేషన్ నిర్లక్ష్యం,డ్రైనేజీ సమస్యలు నిర్లక్ష్యం వల్ల తరచూ సంభవించే వరదలు వల్ల నివాసితులు,విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. నివాసితులు, విద్యార్థుల ప్రాథమిక హక్కులను కాపాడాలని కోరారు.స్పందించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మరోవైపు ఢిల్లీలో ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థుల మృతి ఘటనపై రాజ్యసభలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడారు. నిర్లక్ష్యం జరిగింది. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చూసుకోవడం మన బాధ్యత అని వ్యాఖ్యానించారు.#WATCH | Union Education Minister Dharmendra Pradhan in Rajya Sabha speaks on the incident of death of 3 UPSC aspirants in Delhi"...There was negligence. Only when accountability is fixed, there will be a solution...It is our responsibility to ensure that such an incident is… pic.twitter.com/PTE3ghhe8n— ANI (@ANI) July 29, 2024 -
కోచింగ్ సెంటర్లోకి వరదనీరు..
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఓ భవనం బేస్మెంట్లో నిర్వహిస్తున్న యూపీఎస్సీ కోచింగ్ సెంటర్లోకి వరద నీరు ప్రవేశించి ఇద్దరు విద్యార్థులు చనిపోగా మరొకరు గల్లంతయ్యారు. సెంట్రల్ ఢిల్లీ ప్రాంతంలో శనివారం రాత్రి 7 గంటల సమయంలో భారీ వర్షం కురిసింది. దీంతో, ఓల్డ్ రాజీందర్ నగర్‌లోని ఓ భవనం బేస్మెంట్లో నడుస్తున్న రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి వరద ప్రవేశించింది. దీంతో కొందరు విద్యార్థులు అందులో చిక్కుకుపోయారు. వరదతో బేస్మెంట్ పూర్తిగా నిండిపోయినట్లు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని నీటిని బయటకు తోడారు. సహాయక చర్యల్లో ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభించాయి. గల్లంతైన మరో విద్యార్థి జాడ కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు. -
యూపీఎస్సీపై మరక తొలగేదెలా?
ఐఏఎస్ ప్రొబేషనర్ పూజా ఖేడ్కర్ వివాదం యూపీఎస్సీ ఎంపిక ప్రక్రియలోని లోపాలను ఎత్తిచూపింది. పదవిలో ఉన్నప్పుడే కాకుండా, పదవీ అనంతరం కూడా ఎన్నో అత్యున్నత నియామకాలను సివిల్ సర్వీసెస్ వాళ్లు పొందుతున్నారు. అలాంటప్పుడు ఇందులోకి ఎలాగోలా ప్రవేశించడానికి న్యాయమో, అన్యాయమో ఒక కోటాను వాడుకోవడానికి అవకాశం ఉంది. బుగ్గకారు, అధికారిక వసతి వంటి అప్రధాన అంశాలకు ప్రాధాన్యం ఇచ్చే స్వార్థపరులకు ఈ వ్యవస్థ తలుపులు తెరిచి ఉంచింది. అన్ని దశలలో క్లిష్టమైన మానసిక సామర్థ్యాలు అవసరమయ్యే సివిల్ సర్వీస్ కోసం వైకల్యం కోటాలో మానసిక వైకల్యాన్ని అనుమతించడంలోని హేతుబద్ధతను సిబ్బంది–శిక్షణా సంస్థ(డీఓపీటీ) తప్పనిసరిగా వివరించాలి. వ్యవస్థను సంస్కరించడానికీ, ఆచరణాత్మక సమస్యలను పరిష్కరించడానికీ నిర్మాణాత్మకమైన బహుముఖ విధానం అవసరం.ఐఏఎస్ ప్రొబేషనర్ పూజా ఖేడ్కర్ చుట్టూ అలుముకున్న వివాదం ఏమిటంటే, ట్రెయినీ ఐఏఎస్‌గా పుణె కలెక్టరేట్లో నియమితురాలైన ఆమె బంగ్లా, కారు లాంటివి కావాలని అల్లరి చేయడమే! ఇది తెలిసి మన అత్యున్నత శిక్షణా విభాగం అంతా బాగానే ఉందా అని ప్రజలు ఆశ్చర్యపోయారు. నేడు అందరి దృష్టీ ఖేడ్కర్ మీద ఉంది. కానీ ఈ ఉదంతంపై త్వరలోనే సిబ్బంది, శిక్షణా విభాగం(డీఓపీటీ) అదనపు కార్యదర్శి నివేదిక వెల్లడించిన తర్వాత, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) స్వయంగా దీనిపై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.ఈ ఉదంతాన్ని ఖేడ్కర్తో ప్రారంభించాలంటే, రెండు వేర్వేరు పేర్లతో వైకల్య ధ్రువీకరణ కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు ఆమె మనస్సులో ఏముంది అనేది ఆలోచించాలి. ఆమె మొదటి సందర్భంలో ఏ విభాగపు వైకల్యం కోసం దరఖాస్తు చేసుకున్నారు? కొన్ని మీడియా వార్తలు సూచించినట్లుగా ఆమె వాస్తవానికి మరొకదానికి మారారా లేక మరో వక్రమార్గాన్ని జోడించారా? ఆమె తండ్రి ప్రకటించిన వార్షిక ఆదాయం 8 లక్షల రూపాయల గరిష్ఠ పరిమితి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు కూడా, నాన్–క్రీమీలేయర్ ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) ధ్రువీకరణను ఎలా పొందగలిగారు? అక్కడి తహసీల్దార్ కూడా ఖేడ్కర్ తండ్రీ కూతుళ్ల కోరిక మేరకు ఈ సృజనా త్మక రచనలో తన సముచిత వాటాను పూర్తి చేసినట్లు తెలుస్తోంది.వైకల్యాలున్న వ్యక్తుల హక్కుల (ఆర్పీడబ్ల్యూడీ) చట్టం– 2016, దీర్ఘకాలిక ప్రాతిపదికన ఒక నిర్దిష్ట విభాగంలో కనీసం 40 శాతం వైకల్యం ఉన్నట్లుగా, వైద్యాధికారి ధ్రువీకరించిన వ్యక్తినే ‘బెంచ్‌మార్క్ వైకల్యం’ ఉన్న వ్యక్తిగా నిర్వచించింది. ‘మానసిక వికలాంగుల’ విభాగంలో ఉపాధి కోసం ఆమోదించబడిన వైకల్యపు కనీస శాతం 35. ఖేడ్కర్ ఉదంతంలో చాలామంది ఆమె 35 శాతం మానసిక వైకల్యం సమీపంలో కూడా లేదనీ, తన కేసును ముందుకు తీసుకు రావడానికి ఆమె ఉదహరించిన రెండు వైకల్యాల్లో ఇది ఒకటనీ హామీపూర్వకంగా చెబుతున్నారు.పూజా ఖేడ్కర్ కేసు సముద్రంలో నీటిబొట్టంతే కావచ్చు. సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియ నిస్సందేహంగా, కొన్ని వందల ఉద్యోగాల కోసం లక్షకుపైబడిన వార్షిక దరఖాస్తుదారులతో తీవ్రాతితీవ్రమైన పోటీతో కూడి ఉంటుంది. అభ్యర్థులు వాస్తవానికి, డబ్బు, సమయం పరంగా భారీగా పెట్టుబడి పెడతారు. సగటున, వారు తమ అమూల్య మైన కాలంలో రెండు–మూడు సంవత్సరాలు కేవలం సన్నాహకాల్లోనే గడుపుతారు. ఉత్తమంగా ప్రయత్నాలు చేసినప్పటికీ, దానిని సాధించే విషయంలో అత్యంత చురుకైన వారికి కూడా ఎలాంటి హామీ ఉండదు. అటువంటి అత్యున్నత ప్రయోజనాలతో కూడిన వ్యవస్థలో న్యాయమో, అన్యాయమో వైకల్యం సహా వివిధ కోటాలను పోస్టుకు హామీగా ఉపయోగించుకోవడానికి చాలామంది ఆకర్షితులు కావచ్చు. విచారణ పరిధిని విస్తరించడానికి అన్ని వైకల్య కేసులను ఈ దృక్కోణం నుండి చూడటం సిబ్బంది–శిక్షణా సంస్థ(డీఓపీటీ)కి మంచిది.సివిల్ సర్వీసెస్‌లోకి ప్రవేశించడానికి అభ్యర్థులు ఎంత దూరమైనా వెళతారు అనేందుకు తగు కారణాలు స్పష్టంగా ఉన్నాయి. ఇది సర్వీసులో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా పదవీ విరమణ తర్వాత కూడా ప్రతిష్ఠాత్మకమైన, సవాలుతో కూడిన కెరీర్ ఎంపికలను వాగ్దానం చేస్తుంది. చాలామంది మాజీ సివిల్ సర్వెంట్లను ప్రభుత్వం ట్రిబ్యునళ్లు, కమిషన్లు, రెగ్యులేటరీ అథారిటీలు, గవర్నర్ పదవులకు కూడా నియస్తుంటుంది. పలువురు వ్యక్తులు ప్రైవేట్ రంగంలో కూడా అత్యున్నత నియామకాలను అందుకుంటారు. అతి పెద్ద కన్సల్టింగ్ సంస్థలు ఇప్పుడు నయా ట్రెండ్! ప్రభుత్వం లోపల తమ నెట్వర్క్ లను ప్రభావితం చేయాలనే ఆశ వీరికుంటుంది.సర్వీసులో ఉండగానే వీరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో కీలక పదవులు నిర్వహిస్తున్నారు. ఇరవైల మధ్య నుండి చివరి వరకు మాత్రమే వయస్సు గల ఒక వ్యక్తి తరచుగా చిన్న ఐరోపా దేశాల పరిమాణంలో ఉన్న జిల్లాకు ప్రపంచంలో మరెక్కడైనా నాయకత్వం వహించగలరా?అన్ని దశలలో క్లిష్టమైన మానసిక సామర్థ్యాలు అవసరమయ్యే సివిల్ సర్వీస్ కోసం వైకల్యం కోటాలో మానసిక వైకల్యాన్ని అనుమ తించడంలోని హేతుబద్ధతను సిబ్బంది, శిక్షణా సంస్థ(డీఓపీటీ) తప్పనిసరిగా వివరించాలి. కీలకమైన మరొక ప్రశ్న ఏమిటంటే యూపీఎస్సీ పరీక్ష సమర్థత గురించి! పునరావృత అభ్యసన, అరగంట ఇంటర్వ్యూలకు ప్రాధాన్యత ఇవ్వడమే అభ్యర్థులను ఎంపిక చేయడానికి ఉత్తమమైన మార్గమా? సమగ్రత, సహానుభూతి, సాను కూల నాయకత్వం, సమస్య పరిష్కారం వంటి లక్షణాలను అస్సలు అంచనా వేయలేము. డిఫెన్స్ సర్వీసెస్ విషయంలో లాగా కాకుండా, ఇక్కడ యోగ్యతా పరీక్ష లేదు. తత్ఫలితంగా, మన సివిల్ సర్వీసులను నిర్వహించే విషయంలో ప్రస్తుత సందర్భంలో లాగా, మనకు తక్కువ భావోద్వేగాలు ఉన్న వ్యక్తులు ఉన్నారు. బుగ్గకారు, అధికారిక వసతి వంటి అప్రధాన అంశాలకు ప్రాధాన్యం ఇచ్చే స్వార్థపరులకు ఈ వ్యవస్థ తలుపులు తెరిచి ఉంచింది.దరఖాస్తుదారులకు ప్రయోజనాలను తగ్గించడానికీ, తద్వారా మోసం, రిగ్గింగ్ అవకాశాలను తగ్గించడానికీ ఒక మార్గం ఏమిటంటే ఎంపిక ప్రక్రియ వ్యవధిని తగ్గించడం. బహుశా సాంకేతికతను ఉపయోగించడం. ప్రతి దశలో మూల్యాంకన ప్రమాణాలు, మార్కింగ్ ప్రమాణాలు, ఇతర సంబంధిత సమాచారాన్ని బహిర్గతం చేయడం ద్వారా పారదర్శకతను పెంచడం అవసరం. తద్వారా సవాళ్లు అధిగమించబడతాయి, పరిష్కరించబడతాయి. వాస్తవానికి, అడ్మినిస్ట్రేటివ్ స్థానాల్లోకి అధిక అర్హత కలిగిన నిపుణులు, డొమైన్ నిపుణుల ప్రవేశం కేవలం పేరును బట్టి ఉండకూడదు. బలమైన పార్శ్వ ప్రవేశ ప్రక్రియ సివిల్ సర్వీసును దాని యధాస్థానంపై నిలిపి ఉంచుతుంది.యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత దేశ సివిల్ సర్వెంట్లు వారి ఉద్యోగాల కోసం శిక్షణ పొందే లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ భారీ పాత్రను పోషించాలి.రెండు సంవత్సరాల శిక్షణ ఒక అధికారి భవిష్యత్తుకు, ఆమె/అతను పరిస్థితులతో వ్యవహరించే విధానానికి పునాది వేస్తుంది. పేద గిరిజన రైతు జక్తు గోండ్‌పై కార్యకర్త హర్‡్ష మందర్ చేసిన కేస్ స్టడీలు నేటికీ చాలామంది మనస్సులలో నిలిచిపోయాయి. పేదరికానికి సంబంధించిన సమస్యలతో వ్యవహరించడంలో ఇవి ఒక తరం అధికారులను ప్రభావితం చేస్తూ వచ్చాయి.విచ్ఛిన్నమైన వ్యవస్థలతో పోరాడటం కంటే మనం వాటిని సరిదిద్దాలి. ఒక ప్రక్రియపై, దాని న్యాయబద్ధతపై మనకు విశ్వాసం ఉంటే, మనం ఫలితాలను ఆమోదించగలము. ఏదైనా వ్యవస్థను సంస్కరించడానికీ, ఆచరణాత్మక సమస్యలను పరిష్కరించడానికీ నిర్మాణాత్మకమైన బహుముఖ విధానం అవసరం. రోజులు గడు స్తున్నకొద్దీ, ఎంపిక ప్రక్రియను మోసగించిన అధికారుల ప్రవేశానికీ, ఇటీవలి నీట్ వైఫల్యానికి దారితీసిన లోపాలకూ మధ్య వింతైన సారూప్యత నొక్కి చెప్పబడుతోంది. ఫలితంగా ఈ దేశవ్యాప్త పరీక్షలపై ప్రజల విశ్వాసం సన్నగిల్లింది. ఇలాంటివి జరగకుండా చేయలేని మన లాంటి విశాల దేశానికి ఇది దురదృష్టకరం. వ్యవస్థను సరిగ్గా అమర్చడంలో, దానిపై విశ్వాసాన్ని పునరుద్ధరించడంలో డీఓపీటీ, యూపీఎస్సీ సరిగ్గా వ్యవహరిస్తాయని ఆశిద్దాము.– అశోక్ ఠాకూర్ ‘ కేంద్ర మాజీ విద్యా కార్యదర్శి– ఎస్.ఎస్. మంథా ‘ ‘ఏఐసీటీఈ’ మాజీ చైర్మన్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
విషాదం.. రోడ్డుపై వరద, కరెంట్ షాక్‌కు గురై యువకుడి మృతి
న్యూఢిల్లీ: దేశ రాజధాని విషాదం చోటుచేసుకుంది. యూపీఎస్సీ పరీక్షలకు సన్నధమవుతున్న ఓ విద్యార్ధి విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు విడిచాడు. మృతుడిని నీలేష్ రాజ్‌గా గుర్తించారు. పటేల్ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది.వివరాలు.. నీలేష్ రాజ్ అనే యువకుడు పటేల్ నగర్ హాస్టల్లో ఉంటూ సివిల్స్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. అయితే వర్షం కారణంగా రోడ్డుపై నీరు నిలవడంతో అటువైపు వెళ్తున్న నీలేష్ విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే కుప్పకూలాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా.. రోడ్డు పక్కనున్న ఇనుప గేటు గుండా కరెంట్ పాస్ అవ్వడంతో విద్యుదాఘాతానికి గురైనట్లు తెలిపారు. నీలేష్‌ను వెంటనే ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గేట్‌కు కరెంట్ ఎలా పాస్ అయ్యిందో తెలుసుకునేందనే విషయంపై దర్యాప్తు చేపట్టారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ అమాయక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని స్థానికులు మండిపడుతున్నారు. -
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా.. ఇంకా ఇతర అప్డేట్స్
-
పూజా ఖేద్కర్‌కు UPSC షాక్.. అభ్యర్థిత్వం రద్దు
వివాదాస్పద ట్రెయినీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్‌కు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) షాకిచ్చింది. నకిలీ దృవీకరణ పత్రాలు సమర్పించారని తేలడంతో యూపీఎస్సీ ఆమె ఐఏఎస్ సెలక్షన్‌ను క్యాన్సిల్ చేస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆమెపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడంతో పాటు భవిష్యత్‌లో యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో పాల్గొనకుండా డీబార్ చేసింది. UPSC has, initiated a series of actions against her, including Criminal Prosecution by filing an FIR with the Police Authorities and has issued a Show Cause Notice (SCN) for cancellation of her candidature of the Civil Services Examination-2022/ debarment from future… pic.twitter.com/ho417v93Ek— ANI (@ANI) July 19, 2024శుక్రవారం (జులై 19) యూపీఎస్సీ కమిషన్ పూజా ఖేద్కర్ వివాదంపై అధికారికంగా స్పందించింది. యూపీఎస్సీ నిర్వహించిన విచారణలో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్-2022 లో ఉత్తీర్ణత సాధించేందుకు పూజా మనోరమ దిలీప్ ఖేద్కర్ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారు.సివిల్ సర్వీస్ ఎగ్జామ్ గట్టెక్కేందుకు తన పేరుతో పాటు తల్లిదండ్రులు, ఫొటోలు,సంతకాలు, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, ఇంటి అడ్రస్‌తో పాటు ఇతర వివరాలన్నీ తప్పుడు ధృవీకరణ పత్రాలను అందించినట్లు తమ విచారణలో తేలిందని యూపీఎస్సీ అధికారికంగా ప్రకటిస్తూ మీడియోకు ఓ నోట్‌ను విడుదల చేసింది.ఆ నోట్లో మోసపూరిత కార్యకాలాపాలకు పాల్పడినందుకు పూజా ఖేద్కర్‌పై అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ షోకాజు నోటీసులు ఇచ్చినట్లు తెలిపింది. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్-2022 నిబంధనల ప్రకారం.. భవిష్యత్‌లో యూపీఎస్సీ పరీక్షలు రాయకుండా, అభ్యర్ధిత్వాన్ని ప్రకటించకుండా డీబార్ చేసినట్లు పేర్కొంది. పరీక్షల్లో మోసపూరితంగా వ్యవహరించడంతో పూజా ఖేద్కర్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్లో పోలీసులు ఆమెపై క్రిమినల్ కేసులు పెట్టినట్లు యూపీఎస్సీ వెల్లడించింది. -
ట్రెయినీ ఐఏఎస్ పూజ వ్యవహారంపై పీఎంవో ఆరా
పుణెలో అసిస్టెంట్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి డాక్టర్ పూజా ఖేడ్కర్ చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. మహారాష్ట్ర కేడర్‌కు చెందిన 2022 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు నకిలీ అంగవైకల్యం, ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ)సర్టిఫికేట్లను సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ వివాదం కొనసాగుతుండగా.. పూజా ఖేడ్కర్ నియామకం గురించి ప్రధాని కార్యాలయం (పీఎంవో) ఆరా తీస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.పూజా ఖేడ్కర్ పూణే కలెక్టర్ కార్యాయంలో అధికారిక హోదా కోసం ప్రయత్నించి వార్తల్లో నిలిచారు. ఉన్నతాధికారుల అనుమతిలేకుండా ప్రైవేట్ ఆడి కారును రెడ్ బ్లూ బెకన్ లైట్, వీఐపీ నెంబర్ ప్లేట్‌ను ఉపయోగించడం, అదనపు కలెక్టర్ అజయ్ మోర్ లేని సమయంలో.. ఆయన ఛాంబర్‌ను వినియోగించడంతో వివాదం తలెత్తింది. ఆమె తీరుపై పూణె కలెక్టర్ డాక్టర్ సుహాస్ దివాసే చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో మహరాష్ట్ర ప్రభుత్వం ఆమెను పుణె నుంచి వాశిమ్ జిల్లాకు బదిలీ చేసింది. ప్రొబేషన్ కాలం పూర్తయ్యేవరకు అక్కడే సూపర్ న్యూమరరీ అసిస్టెంట్ కలెక్టర్‌గా వ్యవహరించనున్నారుఈ క్రమంలో బుధవారం పీఎంవో కార్యాలయం అధికారులు పూజా ఖేడ్కర్ గురించి పూణే కలెక్టర్ సుహాస్ నుంచి నివేదికను కోరడం మరింత చర్చాంశనీయంగా మారింది. దీంతో పాటు సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు శిక్షణ ఇచ్చే ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (LSBNAA) లో ఆమె గురించి ఆరా తీసింది. ఆమె పూణె నుంచి వాశిమ్ జిల్లాకు బదిలీ చేయడంపై నివేదిక కోరింది. పూర్తి నివేదికను ఎల్ఎస్బీఎన్ఏఏ అకాడమీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు పంపనుంది.మహరాష్ట్ర చీఫ్ సెక్రటరీ (సీఎస్) సుజాత సౌనిక్ ఆమోదం తర్వాత నివేదిక పంపాలని ఎల్ఎస్బీఎన్ఏఏ డిప్యూటీ డైరెక్టర్ శైలేష్ నావల్ సంబంధిత పరిపాలన విభాగానికి విజ్ఞప్తి చేశారు. -
సివిల్స్‌లో విజయం సాధించిన మిస్ ఇండియా ఫైనలిస్ట్!
ఓ మోడల్ గ్లామర్ రంగంలో రాణిస్తూ ప్రతిష్టాత్మకమైన సివిల్స్ ఎగ్జామ్ వైపుకి అడుగులు వేసింది. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. గ్లామరస్ రోల్‌కి విభిన్నమైన రంగంలోకి అడుగుపెట్టడమే గాక ఎలాంటి కోచింగ్ లేకుండా విజయ సాధించి అందరికీ స్పూర్తిగా నిలిచింది ఈ మోడల్. ఆమె ఎవరంటే..రాజస్థాన్‌కు చెందిన ఐశ్వర్య షియోరాన్ సైనిక నేపథ్య కుటుంబానికి చెందింది. అందువల్లే ఆమె దేశానికి సేవ చేసే ఈ సివిల్స్ వైపుకి మళ్లింది. ఆమె తన ప్రాథమిక విద్యనంతా చాణక్యపురిలోని సంస్కతి పాఠశాల్లో పూర్తి చేసింది. ఇంటర్లో ఏకంగా 97.5 శాతం మార్కులతో పాసయ్యింది. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు మోడలింగ్ పోటీల్లో పాల్గొంది. అలా మొదలైన ఆమె ప్రస్థానం పలు మోడలింగ్ పోటీల్లో పాల్గొనడంతో సాగిపోయింది. ఆ విధంగా ఆమె 2015లో మిస్ ఢిల్లీ కిరీటం, 2014లో మిస్ క్లీన్ అండ్ కేర్ ఫ్రెష్ ఫేస్, 2016లో మిస్ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్‌గా నిలిచింది. ఈ మోడలింగ్ అనేది ఆమె అమ్మకల అని అందుకే ఈ రంగంలోకి వచ్చానని తెలిపింది ఐశ్వర్య. ఆ తర్వాత కెరీర్‌పై పూర్తి ఫోకస్ పెట్టినట్లు తెలిపారు. 2018లో ఐఐఎం ఇండోర్‌కు ఎంపికైన తాను సివిల్స్ వైపే దృష్టి సారించినట్లు తెలిపారు. అలా 2018-2019లో సివిల్స్ ప్రిపరేషన్లో మునిగిపోయింది. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా తనకు తానుగా ప్రిపేర్ అయ్యింది. తొలి ప్రయత్నలోనే సివిల్స్ 2019లో విజయం సాధించి..93వ ర్యాంక్ సాధించారు. తన ప్రిపరేషన్ గురించి మాట్లాడుతూ..ఇక తాను ఈ సివిల్స్ ప్రిపరేషన్ కోసం 10+8+6 టెక్నిక్ ఫాలో అయ్యానని చెప్పారు. అంటే పదిగంటలు నిద్ర, ఎనిమిది గంటలు నిద్ర, ఆరుగంటలు ఇతర కార్యకలాపాలు. ఇక కోచింగ్ దగ్గర కొచ్చేటప్పటికీ వారి వ్యక్తిగత అభిరుచికి సంబధించింది అని అన్నారు. ఎప్పుడైనా ఇలాంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే ముందు సాధించగలమా లేదా అనేదానిపై పూర్తి అవగాహన ఉండాలి. అప్పుడే దిగాలి అని చెప్పుకొచ్చారు ఐశ్వర్య. ఇక ఆమె తండ్రి విజయ్ కుమార్ ఆర్మీలో కల్నల్. ఆమె తల్లి సుమన్ షియోరాన్ గృహిణి. రాజస్థాన్‌లో జన్మించిన ఐశ్వర్య ఢిల్లీలో ఉన్నత విద్యను పూర్తి చేసింది. ఈ మధ్యే తెలంగాణలో రాష్ట్రం కరీంనగర్‌కు బదిలీ అయ్యింది. కల్నల్ అజయ్ కుమార్ కరీంనగర్ ఎన్సీసీ తొమ్మిదో బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్. ప్రస్తుతం ఐశ్వర్య ఐఎఫ్ఎస్ ఆఫీసర్‌గా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పనిచేస్తోంది. మోడల్ నుంచి ప్రజలకు సేవ చేసే అత్యున్నత రంగంలోకి రావడమే గాక కేవలంలో ఇంట్లోనే జస్ట్ పదినెల్లలో ప్రిపేర్ అయ్యి సివిల్స్‌లో విజయం సాధించింది. తపన ఉంటే ఎలాగైనా సాధించొచ్చు అనేందుకు స్ఫూర్తి ఐశ్వర్యనే అని చెప్పొచ్చు కదూ..!(చదవండి: కేబినెట్ మంత్రి చిరాగ్ పాశ్వాన్ ఇష్టపడే రెసిపీ ఇదే..!) -
సివిల్స్‌లో తెలుగు తేజాలు
సాక్షి, హైదరాబాద్: సివిల్స్‌లో ర్యాంకు సాధించడం దేశంలో చాలామంది కల. ఇందులో ఈసారీ తెలుగు విద్యార్థులు సత్తా చాటి తమ లక్ష్యాన్ని అందుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన దోనూరు అనన్యరెడ్డి మూడో ర్యాంకు సాధించారు. వంద లోపు ర్యాంకుల్లో ముగ్గురు తెలుగువాళ్లే ఉన్నారు. నందాల సాయి కిరణ్ 27వ ర్యాంకు సాధిస్తే, కేఎన్ చందన జాహ్నవి 50, మెరుగు కౌశిక్ 82వ ర్యాంకు సాధించారు. మొత్తం ర్యాంకుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు 36 మంది ఉన్నారు. అలాగే, ఇతర కేంద్ర సర్వీసులకు 20 మందికిపైగా ఎంపికయ్యారు. మొత్తమ్మీద కేంద్ర సర్వీసులకు 56 మందికిపైగా తెలుగు తేజాలు ఎంపికవడం విశేషం. అఖిల భారత సర్వీసుల్లో పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్స్– 2023 కోసం గత ఏడాది మే 28న ప్రిలిమ్స్ నిర్వహించింది. ప్రిలిమినరీలో అర్హత పొందిన వారికి గత నవంబర్‌లో మెయిన్స్ పరీక్ష నిర్వహించగా, ఈ పరీక్ష ఫలితాలను డిసెంబర్ 8న వెల్లడించారు. మెయిన్స్‌లోనూ అర్హత పొందిన వారికి జనవరి 2, ఏప్రిల్ 9 మధ్య వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించారు. మొత్తంగా పొందిన మార్కుల ఆధారంగా ర్యాంకులను యూపీఎస్సీ మంగళవారం ప్రకటించింది. ఆలిండియా టాపర్‌గా లక్నోకు చెందిన ఆదిత్య శ్రీవాత్సవ నిలవగా, ఒడిశాకు చెందిన అనిమేష్ ప్రదాన్ రెండో స్థానంలో నిలిచారు. తెలంగాణకు చెందిన అనన్య రెడ్డి మూడో ర్యాంకు సాధించారు. 2022 సివిల్స్‌లోనూ తెలుగు విద్యార్థి ఉమాహారతి మూడో స్థానం పొందడం విశేషం. 1,016 మంది ఎంపిక సివిల్స్–2023 కోసం యూపీఎస్సీ 1,016 మందిని ఎంపిక చేసింది. ఇందులో జనరల్ కేటగిరీలో 347 మంది ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ కోటా నుంచి 115, ఓబీసీ నుంచి 303, ఎస్సీల నుంచి 165, ఎస్టీ విభాగం నుంచి 86 మంది ఎంపికయ్యారు. పోస్టుల వారీగా చూస్తే ఐఏఎస్ సర్వీసులకు 180 మంది, ఐఎఫ్ఎస్కు 37 మంది, ఐపీఎస్‌కు 200 మంది ఎంపికయ్యారు. సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్–ఏ కేటగిరీకి 613 మంది, గ్రూప్ బీ సర్వీసెస్‌కు 113 మంది ఎంపికైనట్టు యూపీఎస్సీ వెల్లడించింది. అభ్యర్థులు పొందిన మార్కులను 15 రోజుల్లో తమ వెబ్సైట్లో ఉంచుతామని ప్రకటించింది. విజేతలకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు సివిల్స్ ఫలితాల్లో మెరిసిన తెలుగు రాష్ట్రాల విజేతలకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ, ఏపీ నుంచి ఈసారి 50 మందికి పైగా ఎంపికవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించిన పాలమూరుకు చెందిన దోనూరి అనన్య రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. మహేష్ భగవత్ కృషి ఫలించింది సివిల్స్ పరీక్షల్లో సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ భగవత్ గైడెన్స్ మంచి ఫలితాలను ఇచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా శిక్షణ పొందుతున్న వారితో ప్రత్యక్షంగా, ఇతర రాష్ట్రాల వారితో ఆన్లైన్ ద్వారా ఆయన ఇచ్చిన సూచనలతో 200 మందికి పైగా ర్యాంకులు సాధించారు. అందులో తెలంగాణ నుంచి అనన్య రెడ్డి సహా జాతీయ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ శిక్షణ పొందుతున్న వారు కూడా ఉన్నారు. సివిల్స్ ప్రిపేరయ్యే వారికి వ్యక్తిత్వ వికాసం, పరీక్ష సమయాల్లో ఒత్తిడి, సమయ పాలన, ఇంటర్వ్యూలో వ్యవహరించాల్సిన తీరు తదితర అంశాలపై మహేష్ భగవత్ సూచనలు చేశారు. -
సివిల్స్‌లో ఉదయగిరి యువతి సత్తా
ఉదయగిరి: యూపీఎస్సీలో మండలంలోని గంగులవారి చెరువుపల్లికి చెందిన బడబాగ్ని వినీష ప్రతిభ చూపింది. మంగళవారం ఫలితాలు విడుదల చేయగా 821 ర్యాంకు సాధించింది. ఆమె తండ్రి శ్రీనివాసులు వ్యవసాయాధికారి. తల్లి విజయభారతి గుంటూరు వ్యవసాయ కమిషనర్ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వినీష ప్రాథమిక విద్యాభ్యాసం నెల్లూరులో జరిగింది. ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లో పూర్తి చేసింది. మద్రాస్ ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివింది. అమెరికాలో ఎంఎస్సీ చేసింది. అనంతరం గ్రూప్–1 పరీక్షలు రాసి మున్సిపల్ కమిషనర్‌గా ఎంపికై ంది. ప్రస్తుతం విజయవాడలో పనిచేస్తోంది. తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీలో ర్యాంకు సాధించడం విశేషం. వినీష సోదరుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్. అతను కూడా సివిల్స్‌కు సిద్ధమవుతున్నాడు. మారుమూల గ్రామంలో జన్మించి, చదువులో రాణించి సివిల్స్‌లో ర్యాంకు సాధించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
UPSC: సివిల్స్ ఫలితాల్లో మెరిసిన తెలుగు తేజాలు
సాక్షి, ఢిల్లీ: యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో 1,016 మంది ఎంపికయ్యారు. ఆదిత్య శ్రీవాత్సవకు మొదటి ర్యాంకు, అనిమేష్ ప్రధాన్‌కు రెండో ర్యాంకు, దోనూరి అనన్యరెడ్డికి మూడో ర్యాంకు దక్కింది. ఇక ఈ యూపీఎస్సీ ఫలితాల్లో వరంగల్‌కు చెందిన ఇద్దరు సెలక్ట్ అయ్యారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ర్యాంకుల పంట పండింది. మొత్తం 1,016 మంది ఎంపికయితే.. అందులో తెలుగు అభ్యర్థులు కనీసం 50కి పైగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దోనూరు అనన్యారెడ్డికి మూడో ర్యాంకు అన్షుల్ భట్ 22వ ర్యాంకు నందల సాయి కిరణ్‌కు 27 ర్యాంకు మెరుగు కౌశిక్‌కు 82వ ర్యాంకు పింకిస్ ధీరజ్ రెడ్డి 173 ర్యాంకు అక్షయ్ దీపక్ 196 ర్యాంకు భానుశ్రీ 198 ర్యాంకు ప్రదీప్ రెడ్డి 382 ర్యాంకు వెంకటేష్ 467 ర్యాంకు హరిప్రసాద్ రాజు 475వ ర్యాంకు పూల ధనుష్ 480 ర్యాంకు కె. శ్రీనివాసులు 526 ర్యాంకు సాయితేజ 558 ర్యాంకు కిరణ్ సాయింపు 568 ర్యాంకు మర్రిపాటి నాగభరత్ 580 ర్యాంకు పీ. భార్గవ్ 590 ర్యాంకు అర్పిత 639 ర్యాంకు ఐశ్వర్య నీలిశ్యామల 649 ర్యాంకు సాక్షి కుమార్ 679 ర్యాంకు రాజ్‌కుమార్ చౌహన్ 703 ర్యాంకు జి.శ్వేత 711 ర్యాంకు ధనుంజయ్ కుమార్ 810 ర్యాంకు లక్ష్మీ భానోతు 828 ర్యాంకు ఆదా సందీప్ కుమార్ 830 ర్యాంకు జె.రాహుల్ 873 ర్యాంకు హనిత వేములపాటి 887 ర్యాంకు కె.శశికాంత్ 891 ర్యాంకు కెసారపు మీనా 899 ర్యాంకు రావూరి సాయి అలేఖ్య 938 ర్యాంకు గోపద నవ్యశ్రీ 995 ర్యాంకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ముగ్గురికి ర్యాంకులు వచ్చాయి. వరంగల్ నగరానికి చెందిన జయసింహారెడ్డికి 103వ ర్యాంకు వచ్చింది. గీసుకొండ మండలం అనంతరం గ్రామానికి చెందిన సయింపు కిరణ్‌కు 568 ర్యాంకు వచ్చింది. శివనగర్ కు చెందిన కోట అనిల్ కుమార్‌కు 764వ ర్యాంకు వచ్చింది. జయసింహారెడ్డికి IAS వచ్చే అవకాశం ఉంది. కిరణ్‌కు IPS లేదా IRS రావొచ్చు. అనిల్ కుమార్‌కు IRS వచ్చే అవకాశం ఉంది. (సయింపు కిరణ్) గతేడాది మే 28వ తేదీన యూపీఎస్పీ ప్రిలిమ్స్ పరీక్ష జరిగాయి. ప్రిలిమ్స్ పరీక్షల అనంతరం మేయిన్స్ పరీక్షలు సెప్టెంబర్ 15, 16, 17, 23, 24 తేదీల్లో జరిగాయి. మేయిన్స్ పరీక్షల ఫలితాలను డిసెంబర్ ఎనిమిదో తేదీన విడుదల చేశారు. అనంతరం జనవరి రెండో తేదీ నుంచి ఏప్రిల్ రెండు నుంచి ఏప్రిల్ తొమ్మిదో తేదీ వరకు ఇంటర్వ్యూలు జరిగాయి. నేడు తుది ఫలితాలు వెలువడ్డాయి. UPSC has announced the final results of the Civil Services Examination. Congratulations to all achievers who have cleared this prestigious milestone! Your hard work and dedication have paid off.#Upsc_final_result#UPSC2024 #upsc#upsc2023 pic.twitter.com/jkj3sCPoSD — आदर्श यादव(Adarsh Yadav) (@AdarshY59491482) April 16, 2024 -
యూపీఎస్సీ ఇంటర్వ్యూకు వెళ్లి.. ఎంపీ టిక్కెట్‌తో తిరిగొచ్చి..
ఎన్నికల సమయంలో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటుంటాయి. వీటిని విన్నప్పుడు ఒకపట్టాన నమ్మాలని అనిపించదు. ఒకప్పుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకు హాజరుకాబోతున్న యువకునికి కాంగ్రెస్ ఎన్నికల టిక్కెట్టు ఇచ్చింది. ఈ ఉదంతం బీహార్ కాంగ్రెస్ నేత రామ్ భగత్ పాశ్వాన్ విషయంలో జరిగింది. 1970లో బీహార్‌లోని దర్బంగాకు చెందిన రామ్‌భగత్ పాశ్వాన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. అనంతరం ఇంటర్వ్యూ కోసం ఢిల్లీకి వెళ్లారు. ఇదే సమయంలో ఆయన కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటు మాజీ మంత్రులు లలిత్ నారాయణ్ మిశ్రా, వినోదానంద్ ఝా, నాగేంద్ర ఝాలను కలుసుకున్నారు. ఆ సమయంలో వారంతా లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేయాలని పాశ్వాన్‌ను కోరారు. దీనికి ఎంటనే ఆయన అంగీకరించారు. గతంలో రాజకీయాలతో సంబంధం లేనప్పటికీ, పాశ్వాన్ ఎన్నికల బరిలో దిగేందుకు ఆసక్తి చూపారు. 1971 లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లోని రోస్రా పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టిక్కెట్‌పై పాశ్వాన్ బరిలోకి దిగారు. సైకిల్‌పై ప్రచారం సాగించారు. నాటి ఎన్నికల్లో ఆయన సంయుక్త సోషలిస్టు పార్టీ అభ్యర్థి రామ్‌సేవక్ హజారీని ఓడించారు. రోస్రా ఎంపీగా ఎన్నికయ్యారు. అనంతరకాలంలో కాంగ్రెస్ అతనిని రాజ్యసభకు పంపింది. దాదాపు 17 ఏళ్ల పాటు రామ్‌భగత్ పాశ్వాన్ ఎంపీగా ఉన్నారు. నాడు రామ్‌భగత్ పాశ్వాన్ పోస్ట్‌మాస్టర్‌గా ఉంటూనే సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అయ్యారు. ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయన పోస్ట్‌మాస్టర్ ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అప్పట్లో అతని జీతం నెలకు రూ.150. ఉద్యోగం మానేయడంతో భార్య జీతం రూ.75పైనే ఆయన ఆధారపడాల్సి వచ్చింది. భర్త ఎంపీ అయిన తర్వాత కూడా రామ్‌భగత్ పాశ్వాన్ భార్య విమలాదేవి ఉద్యోగం వదల్లేదు. ఆమె ప్రధానోపాధ్యాయురాలిగా పదవీ విరమణ చేసి, ప్రస్తుతం లాహెరియాసరాయ్లో ఉంటున్నారు. రామ్‌భగత్ పాశ్వాన్ దంపతులకు ముగ్గురు కుమారులు. ఇద్దరు కుమార్తెలు. -
సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా
న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా పడింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది. ముందుగా వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం మే 26న జరగాల్సిన రాతపరీక్షను.. జూన్ 16వ తేదీకి వాయిదా వేసినట్లు పేర్కొంది. ఈ మేరకు UPSC తన వెబ్సైట్లో ఓ ప్రకటనలో తెలిపింది. ‘త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ కారణంగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష - 2024ను వాయిదా వేయాలని కమిషన్ నిర్ణయించింది. మే 26న కాకుండా జూన్ 16న పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. ఇది ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ స్క్రీనింగ్ టెస్ట్‌కు కూడా వర్తిస్తుంది’ అని పేర్కొంది. కాగా యూపీఎస్సీ-2024 నోటిఫికేషన్ ఫిబ్రవరి 14 విడుదలైంది. సివిల్ సర్వీసెస్ పరీక్ష దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటిగా పరిగణిస్తారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎఎస్ అయ్యేందుకు ప్రతి సంవత్సరం లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారు. -
రూ.5 వేలకు చిరు ఉద్యోగం, అయిదు సార్లు ఓటమి..కట్ చేస్తే..!
విజయం సాధించాలంటే ఎంత కష్టమైనా భరించాలి. నిబద్దత, పట్టుదల ఉంటే చాలు ఓటమి ఎన్నిసార్లు వెక్కిరించినా విజయం వచ్చి ఒడిలో వాలుతుంది. కావాల్సిందల్లా సాధించాలనే కసి. కడు పేదరికం నుంచి కూడా ఓర్పు, అభిరుచి ఉంటే విజయం సాధించ వచ్చు. అలాంటి సక్సెస్ స్టోరీని తలుసుకుందాం...రండి..! తమిళనాడులోని కోయంబత్తూర్ పాలక్కాడ్‌కు చెందిన ఆర్ ముత్తులక్ష్మి, ఆర్ చంద్రశేఖర్‌ల ఏకైక కుమార్తె రమ్య. తల్లిదండ్రుల కష్టాలను చూస్తూపెరిగిన రమ్య చదులు రాణించింది. పదవతరగతి ఆ తరువాత పాలిటెక్నిక్ డిప్లమా చేసింది. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ,ఆ తర్వాత IGNOUలో ఎంబీఏ చేసింది. ఐఏఎస్ కావాలను కలలు కంది.ఇంతలో తండ్రి అనూహ్య మరణంతో కుటుంబ బాధ్యతను భుజాన వేసుకుంది. బెంగళూరుకు చెందిన ఇన్స్ట్రుమెంటేషన్ కంపెనీలో మూడేళ్లపాటు పనిచేసింది. ఉద్యోగం చేస్తూనే ఐఏఎస్ ఆఫీసర్ కలలు కంది. క్రమంగా ఆ కల నెర్వేర్చుకోవాలనే పట్టుదలా పెరిగింది. అలా 2017 లో యూపీఎస్సీ నోటిఫికేషన్ రావడం ఆలస్యం, ఉద్యోగానికి రాజీనామా చేసి చెన్నైకి వెళ్లిపోయింది. కానీ తన ఖర్చులకైనా ఏదో ఒక పని చేసుకోవాలి అందుకే రోజుకు మూడు గంటలు పనిచేసేలా డేటా ఎంట్రీ ఉద్యోగంలో చేరింది. ఆ సమయంలో ఆమె వేతనం ఐదు వేలు మాత్రమే. మిగిలిన సమయాన్ని చదువుకోసం కేటాయించేది. కానీ తొలి పరీక్షలో కనీసం ప్రిలిమ్స్ కూడా పాస్ కాలేక పోయింది. అయినా పట్టువీడలేదు. ఐదు సార్లు ఫలితం దక్కక పోయినా ఏ మాత్రం నిరాశ పడలేదు. అపజయాలే విజయానికి సోపానాలు అన్న మాటను అక్షరాలా నిజం చేస్తూ 2021 లితాల్లో ఏకంగా జాతీయ స్థాయిలో 46వ ర్యాంకు, రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించారు. తల్లి సహకారం, తోడ్పాటుతోనే ఈ విజయం సాధించానంటూ ఆమో సంతోషంతో ఉప్పొంగిపోయింది. ప్రస్తుతం ఆమె ఐఎఫ్ఎస్ అధికారిణిగా పనిచేస్తున్నారు. -
ఐఏఎస్ కొడుకు ఐఏఎస్ అయితే కిక్ ఏముంటుంది? ఈ సక్సెస్ స్టోరీ తెలిస్తే..!
Govind Jaiswal IAS Sucess Story: పేదరికాన్ని భరించడం కష్టంగానే ఉంటుంది. కానీ ఆ కష్టంలోంచి, బాధలోంచి పుట్టిన పట్టుదల, చిత్తశుద్ధి మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. విజయం సాధించేదాకా నిద్ర పోదు. అలాంటి ఐఏఎస్ స్ఫూర్తిదాయకమైన కథను తెలుసుకుందాం. యాక్టర్ కొడుకు, యాక్టర్.. కలెక్టర్ సన్ కలెక్టర్ , డాక్టర్ తనయుడు డాక్టర్ అయితే స్టోరీ ఎలా అవుతుంది. రిక్షా నడుపుకునే సాధారణ వ్యక్తి కుమారుడు ఐఏఎస్ అవ్వడంలోనే సక్సెస్ కిక్ ఉంటుంది. కార్మికుడి కొడుకుగా అవమానాల్ని, అవహేళల్ని ఎదుర్కొని ఐఏఎస్‌గా నిలిచిన స్టోరీ ఆదర్శవంతంగా నిలుస్తుంది. గోవింద్ జైస్వాల్ వారణాసికి చెందినవారు.గోవింద్ జైస్వాల్ తండ్రి నారాయణ్ జైస్వాల్ ఒక గవర్నమెంట్ రేషన్ షాప్ లో పని చేసేవాడు. అయితే ఆ రేషన్ షాప్ అనుకోకుండా మూసివేయడంతో ఉపాధి కోల్పోయాడు. తన దగ్గర డబ్బులతో కొన్ని రిక్షాలను కొన్నాడు. వాటిని అద్దెకు తిప్పేవాడు. ఇంతలో గోవింద్ తల్లి తీవ్ర అనారోగ్యం పాలైంది. వైద్య ఖర్చుల నిమిత్తం ఉన్నదంతా ఖర్చయిపోయింది.దురదృష్టవశాత్తు 1995లో ఆమె కన్నుమూసింది దీంతో గోవింద్ తండ్రి పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఎలాగోలా ఆడపిల్లకు పళ్లి చేసాడు. కానీ కొడుకుని చదివించాలన్న పట్టుదలతో నారాయణ స్వయంగా రిక్షా తొక్కడం మొదలు పెట్టాడు. అయితే తనతో పాటు చదువుకుంటున్న స్నేహితుల ఇంటికి వెళ్లినపుడు వారి తల్లిదండ్రులు గోవింద్‌ను అవమానించారు. తమ కుమారుడితో ఎప్పుడూ కనిపించొద్దంటూ దురుసుగా ప్రవర్తించారు. అదే అతని జీవితాన్ని మలుపు తిప్పింది. ఎలాగైనా గౌరవంగా బతకాలని నిశ్చయించుకున్నాడు తాను కలెక్టర్ చదువుతానని తండ్రికి చెప్పాడు. దీంతో ఆయన కష్టమైనా సరే రూ 40వేల వెచ్చించి ఢిల్లీలోని ఒక కోచింగ్ సెంటర్లో చేర్పించాడు. అక్కడ తన ఖర్చుల కోసం గోవింద్ జైస్వాల్ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ వచ్చాడు. రాత్రి పగలు కష్టపడి చదివాడు. 2006లో గోవింద్ తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో యూపీఎస్సీలో 48వ ర్యాంక్ సంపాదించుకున్నాడు. గోవాలో స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా,ఆరోగ్య మంత్రిత్వ శాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేశారు. జైస్వాల్ భార్య ఐపీఎస్ చందన్ చౌదరి. వీరికి ఒక కుమారుడున్నాడు. 12th ఫెయిల్ స్టోరీలా, మరో బయోపిక్: ఐఏఎస్ అధికారి గోవింద్ జైస్వాల్ జీవితం ఆధారంగా కమల్ చంద్ర దర్శకత్వంలో ‘అబ్ దిల్లీ దుర్ నహీ’ మూవీ కూడా సిద్దమవుతోంది. -
యూపీఎస్సీ సివిల్స్ నోటిఫికేషన్ విడుదల
ఢిల్లీ: దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థుకుల గుడ్ న్యూస్. అఖిల భారత సర్వీసుల్లో 1,056 ఉద్యోగాల భర్తీకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్(CSE)-2024 పరీక్షకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC)బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు యూపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పరీక్షకు నేటి నుంచి మార్చి 5వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రిలిమినరీ పరీక్ష మే 26న, మెయిన్స్ అక్టోబర్ 19న నిర్వహించన్నుట్లు యూపీఎస్సీ పేర్కొంది. ఇది కూడా చదవండి: యూపీఎస్సీ సివిల్స్‌లో రాణించేందుకు నిపుణుల మెలకువలు అర్హత: భారతదేశంలోని సెంట్రల్ లేదా స్టేట్ లెజిస్లేచర్ చట్టం లేదా పార్లమెంటు చట్టం ద్వారా స్థాపించబడిన ఇతర విద్యా సంస్థలు లేదా సెక్షన్-3 ప్రకారం విశ్వవిద్యాలయంగా పరిగణించబడుతున్నట్లు ప్రకటించబడిన ఏదైనా విశ్వవిద్యాలయాల డిగ్రీ యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ చట్టం, 1956, లేదా సమానమైన అర్హతను కలిగి ఉండాలి. వయోపరిమితి (01/08/24 నాటికి): 21 - 32 సంవత్సరాలు ఎన్ని సార్లు రాయొచ్చంటే: సాధారణ అభ్యర్థులు: 06 OBC అభ్యర్థులు: 09 SC/ST అభ్యర్థులు: పరిమితి లేదు పరీక్ష ప్రణాళిక: సివిల్ సర్వీసెస్ 2024 పరీక్ష రెండు వరుస దశలను కలిగి ఉంటుంది. మెయిన్ పరీక్షకు అభ్యర్థుల ఎంపిక కోసం సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్); మరియు వివిధ సర్వీసులు మరియు పోస్టుల్లో అభ్యర్థుల ఎంపిక కోసం సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష (వ్రాత మరియు ఇంటర్వ్యూ). -
జేఈఈ, యూపీఎస్సీలలో ఏది కష్టం?.. ఆనంద్ మహీంద్రా ఏం చెప్పారంటే..
భారతదేశంలో అత్యంత కఠినమైన ఎగ్జామ్ ఏదంటే దాదాపు చాలామంది UPSC లేదా ఐఐటీ జేఈఈ అని చెబుతారు. అయితే ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఇటీవల తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ప్రపంచంలో అత్యంత కష్టమైన ఎగ్జామ్ ఏదనే దానికి సంబంధించి 'ది వరల్డ్ ర్యాంకింగ్' రూపొందించిన ఒక లిస్ట్ పోస్ట్ చేశారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన పోస్ట్‌లో అత్యంత కఠినమైన పరీక్షగా చైనా నిర్వహించే 'గావోకో పరీక్ష' (Gaokao Exam) అని తెలిసింది. ఆ తరువాత జాబితాలో వార్సుపైగా ఇండియాలో నిర్వహించే IIT JEE, UPSC ఎగ్జామ్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. గేట్ ఎగ్జామ్ కూడా దేశంలో నిర్వహించే కఠినమైన పరీక్షగా ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. బిజినెస్ మ్యాన్ ఆనంద్ మహీంద్రా 12th ఫెయిల్ సినిమా చూసిన తర్వాత జేఈఈ, యూపీఎస్సీలలో ఏది కఠినమైన పరీక్ష అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలను కోరారు. ఇందులో కొందరు యూపీఎస్సీ అని, మరి కొందరు జేఈఈ అని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఒక ఐఐటీ గ్రాడ్యుయేట్ తాను UPSC పరీక్ష రాశానని, ఐఐటీ జేఈఈతో పోలిస్తే యూపీఎస్సీ చాలా కఠినమైందని వెల్లడించారు. ఇదీ చదవండి: రూ. 700లకు థార్ అడిగిన బుడ్డోడు.. ఫ్యాక్టరీలో హల్చల్ చేశాడు - వీడియో నెటిజన్లు చెప్పిన సమాధానాలను బట్టి చూస్తే తప్పకుండా ర్యాంకింగ్స్ అప్డేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ట్వీట్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. వేలమంది వీక్షించిన ఈ పోస్ట్.. లెక్కకు మించిన లైక్స్ పొందింది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. After seeing #12thFail I checked around and spoke to a number of young people about the relative difficulty of our entrance exams. One of them was a graduate of IIT who is involved in a business startup but who has also taken the UPSC exam. He stated EMPHATICALLY that UPSC is… https://t.co/NvGTIHWkrz — anand mahindra (@anandmahindra) February 4, 2024 -
విదేశీ ఉద్యోగానికి నో చెప్పింది!
సంకల్పం గట్టిగా ఉంటే.. సక్సెస్ కాళ్ల దగ్గరకు రావాల్సిందే. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు 'అంబిక రైనా' (Ambika Raina). ఇంతకీ ఈమె ఎవరు ఈమె సాధించిన సక్సెస్ ఏంటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన అంబిక రైనా మంచి శాలరీలు వచ్చే ఉద్యోగాలను సైత వదులుకుని, అనుకున్న విధంగా ఐఏఎస్ సాధించి అందరికి ఆదర్శంగా నిలిచింది. అంబిక తండ్రి ఇండియన్ ఆర్మీలో మేజర్ జనరల్ కావడంతో చిన్నప్పటి నుంచే.. క్రమశిక్షణ, దృఢ సంకల్పాన్ని నింపారు. తండ్రి ఇండియన్ ఆర్మీ ఉద్యోగి కావడంతో చదువు వివిధ రాష్ట్రాల్లో సాగింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని సీఈపీటీ యూనివర్శిటీ నుంచి ఆర్కిటెక్చర్లో డిగ్రీని పూర్తి చేసి.. ఆ తరువాత స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లోని ఒక కంపెనీ నుంచి ఇంటర్న్‌షిప్ ఆఫర్‌తో పాటు ఇతర కంపెనీల నుంచి ఉద్యోగ ఆఫర్లను కూడా పొందింది. అందివచ్చిన ఉద్యోగాలను సైతం వదులుకుని ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో అటువైపుగానే అడుగులు వేసింది. మొదటి రెండు ప్రయత్నాలలో అనుకున్న లక్ష్యాన్ని చేజిక్కించుకోలేకపోయినప్పటికీ.. పట్టు వదలకు మూడవ సారి ఐఏఎస్ జాబ్ కొట్టేసింది. ఇదీ చదవండి: లీటరు పెట్రోల్ రూ.450 - ఫిబ్రవరి నుంచి అమలు.. ఎక్కడంటే? నిజానికి అబ్రాడ్‌లో ఉద్యోగమంటే చాలామంది ఎగిరి గంతేసి మరీ వెళ్ళిపోతారు. ఎందుకంటే కొందరు జీతమే లక్ష్యంగా పని చేస్తారు, మరి కొందరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి అడుగులు వేస్తారు. ఈ విధంగా ముందుకు వెళ్లే క్రమంలో ఎన్ని గొప్ప అవకాశాలు వచ్చినప్పటికీ, వాటన్నింటిని వదులుకుని ముందుకు వెళ్ళిపోతారు. -
వివాదాలు లేని వ్యక్తులకే చైర్మన్ పదవి
-
యూపీఎస్సీలా టీఎస్పీఎస్సీ!
సాక్షి, న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్విసు కమిషన్ (యూపీఎస్సీ) తరహాలో ‘తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)’ను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని, ఇందుకోసం సహకరించాలని యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనిని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి కోరారు. టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ మొదలు పోస్టుల భర్తీ వరకు యూపీఎస్సీ తరహాలోనే జరిగేలా తగిన మార్గనిర్దేశం చేయాలని విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల పర్యటన కోసం ఢిల్లీ వచ్చిన రేవంత్‌రెడ్డి శుక్రవారం యూపీఎస్సీ చైర్మన్‌తో, అనంతరం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లతో విడివిడిగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. వినతిపత్రాలు సమర్పించారు. తగిన సహకారం అందించండి మంత్రి ఉత్తమ్, సీఎస్ శాంతికుమారి, ఇతర అధికారులతో కలసి ఢిల్లీలోని యూపీఎస్సీ కార్యాలయంలో చైర్మన్ మనోజ్ సోని, కార్యదర్శి శశిరంజన్‌కుమార్‌లతో రేవంత్ భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ భేటీలో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అంశంపై చర్చించారు. వివాద రహితంగా పరీక్షల నిర్వహణ, నియామకాల్లో పారదర్శకత విషయంలో సహకరించాలని వారిని కోరారు. యూపీఎస్సీ పారదర్శకత పాటిస్తోందని, అవినీతి మరక అంటకుండా సమర్థవంతంగా పనిచేస్తోందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ ప్రశంసించారు. ఏడాది చివరికల్లా రెండు లక్షల ఉద్యోగాలు తెలంగాణలో చేపట్టే నియామకాల్లో నూతన విధానాలు, పద్ధతులను పాటించాలని నిర్ణయించినట్టు యూపీఎస్సీ చైర్మన్, కార్యదర్శికి సీఎం రేవంత్ వివరించారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి రెండు లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాలని.. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలని భావిస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకాన్ని రాజకీయం చేసి.. కమిషన్‌ను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిందని ఆరోపించారు. ఫలితంగా పేపర్ లీకులు, నోటిఫికేషన్ల జారీ, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి ఓ ప్రహసనంగా మారిందని పేర్కొన్నారు. తాము రాజకీయ ప్రమేయం లేకుండా టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకం చేపడతామని.. అవకతవకలకు తావులేకుండా సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన నియమిస్తామని చెప్పారు. సీఎం దృష్టి సారించడం అభినందనీయం టీఎస్పీఎస్సీ నియామకాల ప్రక్రియపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి సారించడం అభినందనీయమని యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోని పేర్కొన్నారు. యూపీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకంలో ఎటువంటి రాజకీయ జోక్యం ఉండదని.. సమర్థత ఆధారంగా ఎంపిక ఉంటుందని ఆయన వివరించారు. టీఎస్పీఎస్సీని యూపీఎస్సీ తరహాలో తీర్చిదిద్దే ప్రయత్నానికి తాము సహకారం అందిస్తామని చెప్పారు. టీఎస్పీఎస్సీ చైర్మన్‌తోపాటు సభ్యులకు కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తామని వివరించారు. ఈ భేటీలో టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, రాష్ట్ర మహిళా, శిశుసంక్షేమ శాఖ కార్యదర్శి వాణిప్రసాద్ తదితరులు కూడా పాల్గొన్నారు. రక్షణశాఖ భూములను రాష్ట్రానికి ఇవ్వండి యూపీఎస్సీ చైర్మన్‌తో భేటీ తర్వాత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో రాష్ట్ర బృందం భేటీ అయి చర్చించింది. ఈ సందర్భంగా పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లింది. హైదరాబాద్ నగరంలో రహదారులు, ఎలివేటెడ్ కారిడర్ల నిర్మాణం, విస్తరణ కోసం.. రక్షణశాఖ పరిధిలో ఉన్న పలు భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని రాజ్‌నాథ్‌సింగ్‌ను సీఎం రేవంత్ కోరారు. ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు మెహిదీపట్నం రైతుబజార్ వద్ద స్కైవాక్ నిర్మిస్తున్నామని.. అక్కడ రక్షణశాఖ పరిధిలో ఉన్న కాస్త భూమిలో మినహా మిగతా భాగం పూర్తయిందని వివరించారు. ఆ భూమిని వెంటనే బదిలీ చేస్తే.. నిర్మాణం పూర్తయి, అందుబాటులోకి వస్తుందన్నారు. ఇక హైదరాబాద్ నుంచి కరీంనగర్–రామగుండంను కలిపే రాజీవ్ రహదారిలో.. ప్యారడైజ్ జంక్షన్ నుంచి ఔటర్‌రింగు రోడ్డు జంక్షన్ వరకు 11.3 కిలోమీటర్ల మేర ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. ఎంట్రీ, ఎగ్జిట్ ర్యాంపుల నిర్మాణం కోసం 83 ఎకరాల రక్షణ శాఖ భూమి అవసరమని.. దానిని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. నాగ్‌పూర్ హైవే (ఎన్‌హెచ్–44)పై కూడా కండ్లకోయ సమీపంలోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి ఔటర్ రింగ్‌రోడ్డు వరకు 18.30 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదించామని.. ఇందులో 12.68 కిలోమీటర్ల మేర నిర్మాణం, నాలుగు ప్రాంతాల్లో ఎగ్జిట్, ఎంట్రీలు, భవిష్యత్తులో డబుల్ డెక్కర్ (మెట్రో కోసం) కారిడార్, ఇతర నిర్మాణాల కోసం మరో 56 ఎకరాల రక్షణ శాఖ భూములను బదిలీ చేయాలని కోరారు. ఈ విజ్ఞప్తులపై కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్‌కు ప్రత్యేక నిధులివ్వండి 15వ ఆర్థిక సంఘం నుంచి తెలంగాణకు రావాల్సిన రూ.2,233.54 కోట్లను త్వరగా విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ సందర్భంగా సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పథకం కింద 2019–20 నుంచి 2023–24 వరకు ఏటా రూ.450 కోట్ల చొప్పున మొత్తం రూ.1,800 కోట్లు రావాల్సి ఉందని, వెంటనే ఇవ్వాలని కోరారు. వీటితోపాటు హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. -
పరీక్షలు ఆలస్యం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్ బి.జనార్దన్‌రెడ్డి ఇప్పటికే రాజీనామా చేయడం, ఐదుగురు సభ్యులు కూడా ఒకటీ రెండురోజుల్లో గవర్నర్‌ను కలిసి రాజీనామాలు సమర్పించే అవకాశమున్న నేపథ్యంలో కమిషన్ నిర్వహించాల్సిన పరీక్షలు అనివార్యంగా ఆలస్యం కానున్నాయి. టీఎస్పీఎస్సీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, ఎలాంటి లీకేజీలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారు. అయితే కొత్త చైర్మన్‌ను, సభ్యులను నియమించాల్సి ఉండటం, అందుకు సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో గ్రూప్–1 (మెయిన్స్), గ్రూప్–2, గ్రూపు–3లతో పాటు సంక్షేమ అధికారి పరీక్షలు ఆలస్యం అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. టీఎస్పీఎస్సీపై ముఖ్యమంత్రి మంగళవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్త కమిషన్ ఆధ్వర్యంలో పూర్తి పారదర్శకంగా పరీక్షల నిర్వహణ ద్వారా నిరుద్యోగుల్లో ఆత్మవిశ్వాసం నింపేలా చర్యలకు ఉపక్రమించారు. నూతన కమిషన్ ఏర్పాటు, చైర్మన్, సభ్యుల నియామకానికి సంబంధించిన నిబంధనలు, కమిషన్ కార్యాచరణ తదితరాలపై అధికారులతో చర్చించారు. సీఎస్ శాంతికుమారి, సీఎం కార్యదర్శి శేషాద్రి, డీజీపీ రవిగుప్తా, అదనపు డీజీ సీవీ ఆనంద్, టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్, ఆర్థిక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి, ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారానికి సంబంధించిన కేసును విచారిస్తున్న సిట్ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎలా నిర్వహిస్తున్నారో తెలుసుకోండి టీఎస్పీఎస్సీ ద్వారా చేపడుతున్న నియామకాలు, జారీ చేసిన నోటిఫికేషన్లు, నిర్వహించిన పరీక్షలు, మిగతా పరీక్షల నిర్వహణకు సంబంధించిన వివరాలను సీఎం రేవంత్‌రెడ్డి.. కమిషన్ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగ నియామకాలు, ఉద్యోగ ప్రవేశ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహిస్తున్న యూపీఎస్సీతో పాటు ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పనితీరును అధ్యయనం చేసి సవివరమైన నివేదిక సమర్పించాలని ఆదేశించారు. యూపీఎస్సీకి, ఇతర రాష్ట్రాలకు ఉన్నతాధికారుల బృందాన్ని పంపి అక్కడి నియామకాల ప్రక్రియపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించించాలని సూచించారు. కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా తగు నిబంధనలు రూపొందించాలని ఆదేశించారు. కమిషన్‌కు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, కావాల్సిన సిబ్బందిని, ఇతర సదుపాయాలను వెంటనే కల్పించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో కమిషన్‌ను సమూల ప్రక్షాళన చేయాలని సీఎం నిర్ణయించినట్లు తెలిసింది. ప్రస్తుతం కమిషన్ ఉద్యోగులు ఎవరెవరికి ఏయే బాధ్యతలున్నాయి? మార్పులు చేర్పులు, ఖాళీలు, కొత్తగా ఉద్యోగాల భర్తీ తదితరాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై నమోదైన కేసు, దర్యాప్తు పురోగతిపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. దర్యాప్తును వేగవంతం చేయాలని సిట్‌ను ఆదేశించినట్లు తెలిసింది. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ మేరకు పరీక్షలు! గత ప్రభుత్వ హయాంలో జారీ చేసిన నోటిఫికేషన్లకు అనుగుణంగా వివిధ ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించారు. గ్రూప్–1(మెయిన్స్), గ్రూప్–2, గ్రూప్–3, హెచ్‌డబ్ల్యూఓ, లెక్చరర్ కొలువులకు సంబంధించి పరీక్షలు నిర్వహించలేదు. మరోవైపు పరీక్షలు నిర్వహించిన వాటికి వివిధ కారణాల వల్ల ఫలితాలను వెల్లడించలేదు. తాజాగా టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు ముఖ్యమంత్రి పూనుకోవడం, కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన జాబ్ క్యాలెండర్‌కు అనుగుణంగా ఉద్యోగ అర్హత పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఆయా పరీక్షల నిర్వహణకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని టీఎస్పీఎస్సీ వర్గాలు వివరిస్తున్నాయి. సీఎంను కలిసిన కమిషన్ సభ్యులు టీఎస్పీఎస్సీ సభ్యులు కారం రవీందర్‌రెడ్డి, సత్యనారాయణ, బి.లింగారెడ్డి, సుమిత్రా ఆనంద్ తనోబా, కోట్ల అరుణ మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. చైర్మన్ రాజీనామా నేపథ్యంలో తాము కూడా రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు సాయంత్రమే గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ను కలిసేందుకు రాజ్‌భవన్‌కు వెళ్లారు. కానీ గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో ఆమె వచ్చిన తర్వాత బుధ, గురువారాల్లో రాజీనామా లేఖలు సమర్పించాలని నిర్ణయించుకున్నారు. కాగా సభ్యుడు ఆర్.సత్యనారాయణ రాష్ట్ర నిరుద్యోగులను ఉద్దేశించి ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. ఎలాంటి పొరపాటు చేయనప్పటికీ సభ్యుడి హోదా నుంచి తప్పుకుంటున్నట్లు అందులో పేర్కొన్నారు. -
యూపీఎస్సీ మెయిన్స్ ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: అఖిల భారత సరీ్వసులకు ఉద్యోగుల ఎంపిక నిమిత్తం నిర్వహించిన యూపీఎస్సీ–2023 మెయిన్స్ ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. మెయిన్స్ పరీక్షలను గత సెపె్టంబర్లో నిర్వహించడం తెలిసిందే. గత మే నెలలో నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షలను దాదాపు 13 లక్షల మంది రాశారు. 15 వేల మంది మెయిన్స్‌కు ఎంపికయ్యారు. వారిలో దాదాపు 2,500 మంది తాజాగా ఇంటర్వ్యూకు అర్హత సాధించినట్టు సమాచారం. ఇంటర్వ్యూ తేదీలతో త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది. ఈసారి మొత్తం 1,105 మందిని సివిల్ సరీ్వసులకు యూపీఎస్సీ ఎంపిక చేయనుంది. -
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఫలితాలు విడుదల.. బాపట్ల యువకుడికి ఫస్ట్ ర్యాంక్
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్ఎస్) ఎగ్జామినేషన్-2022 తుది ఫలితాలను యూపీఎస్సీ జులై 1న విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 147 మందిని ఐఎఫ్ఎస్కు యూపీఎస్సీ ఎంపిక చేసింది. కాగా బాపట్లకు చెందిన కొల్లూరు వెంకట శ్రీకాంత్ మొదటి ర్యాంకు సాధించాడు. హైదరాబాద్‌కు చెందిన సాహితిరెడ్డికి 48, తొగరు సూర్యతేజకు 66వ ర్యాంకు వచ్చింది. జనరల్ క్యాటగిరీలో 39 మంది, ఈడబ్ల్యూఎస్- 21, ఓబీసీ 54, ఎస్సీ-22- ఎస్టీ 11.. మొత్తం 147 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. కాగా ఐఎఫ్ఎస్ పరీక్షకు సంబంధించి గతేడాది నవంబర్‌లో రాత పరీక్షలను నిర్వహించగా.. ఇంటర్వ్యూలను ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
సీఎం జగన్‌ను కలిసిన యూపీఎస్సీ(సీఎస్ఈ) ర్యాంకర్లు
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని యూపీఎస్సీ(సీఎస్ఈ) 2022 ర్యాంకర్లు శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా యూపీఎస్ఈ ర్యాంకర్లను సీఎం జగన్ అభినందించారు. ర్యాంకర్ల కుటుంబ నేపథ్యం, విద్యార్హతలు, సివిల్స్ ప్రిపరేషన్‌కు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం.. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ముందుండాలని సూచించారు. మంచి పరిపాలనలో భాగస్వాములై ప్రజా సేవలో తనదైన ముద్ర వేయాలని ర్యాంకర్లకు సీఎం సూచించారు. చదవండి: పేదల పట్ల ప్రేమ చూపిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే: సీఎం జగన్ -
UPSC 2023: సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
సాక్షి, ఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన అఖిల భారత సర్వీస్ ‘ప్రిలిమ్స్ పరీక్షా’ ఫలితాలు సోమవారం విడుదల అయ్యాయి. ఈ ఏడాది మే 28వ తేదీన ఈ పరీక్ష జరగ్గా.. పరీక్ష రాసిన వాళ్ల నుంచి 14, 264 మంది సివిల్స్ మెయిన్స్‌కు అర్హత సాధించారు. UPSC షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 15వ తేదీన మెయిన్స్ పరీక్ష జరగాల్సి ఉంది. ఇక ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయినవాళ్లు.. మెయిన్స్ కోసం మళ్లీ డిటైల్డ్ ఫామ్-1 నింపి.. దరఖాస్తు చేసుకోవాలని యూపీఎస్సీ చెబుతోంది. త్వరలోనే ఇందుకు తేదీలను ప్రకటించనుంది. ఫలితాల కోసం క్లిక్ చేయండి https://www.upsc.gov.in/ -
Hyderabad: సివిల్స్ విజేతల సరికొత్త ఫ్యాక్టరీ!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: సివిల్ సర్వీసెస్..దేశంలో కోట్లాది మంది యువత మదిలో మెదిలే అత్యున్నత ఉద్యోగం. అన్ని పరీక్షల కంటే అత్యంత క్లిష్టంగా, అనేక వడపోతలతో సాగే ఈ ప్రక్రియ గురించి వింటేనే..వామ్మో మనకెలా సాధ్యం..? అని అన్పిస్తుంది. ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఐఎస్, ఐడీఈఎస్.. ఇలా 24 అఖిల భారత సర్వీసులకు ఎంపికయ్యేందుకు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షల కోసం ఒకప్పుడు ఢిల్లీకి వెళ్లి మరీ సన్నద్ధులైన తెలుగు రాష్ట్రాల వారిని పరిశీలిస్తే ఫెయిల్యూర్ స్టోరీలే ఎక్కువ. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఈ ప్రాంతం క్రమంగా పట్టు బిగిస్తోంది..ర్యాంకుల సాధనలో సక్సెస్ అవుతోంది. 2021–2022 సివిల్స్ ఫలితాలే అందుకు నిదర్శనం అని నిపుణులు అంటున్నారు. తాజాగా ర్యాంకులు సాధించినవారిలో 46 మంది ఇక్కడివారే కావటం కొత్త చరిత్రగా పేర్కొంటున్నారు. హైదరాబాద్ సివిల్స్ విజేతల ఫ్యాక్టరీగా రూపుదిద్దుకున్న ఫలితమే గడిచిన నాలుగేళ్లుగా తెలుగింటి బిడ్డల జైత్రయాత్ర అని చెబుతున్నారు. సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో ఎప్పుడూ టాప్‌లో ఉండే ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్తాన్ రాష్ట్రాల సరసన ఇప్పుడు తెలంగాణ కూడా చేరుతోంది. అమెరికా, ఐటీలొద్దంటూ.. ఇంజనీరింగ్, మెడికల్ ఇతర ప్రొఫెషనల్ చదువుల అనంతరం ఉన్నత ఉద్యోగం, అమెరికా లేదా ఇండియాలో ఐటీ ఉద్యోగాల్లో చేరేందుకు ఉత్సాహం చూపే ప్రతిభావంతుల్లో ఎక్కువమంది దృష్టి ఇప్పుడు సివిల్స్ వైపు మళ్లుతోంది. సమాజం నుంచి తీసుకున్న దాంట్లో కొంతైనా సేవా రూపంలో తిరిగి సమాజానికి ఇవ్వాలనే లక్ష్యంతో కొందరు సివిల్స్ వైపు అడుగులేస్తున్నారు. ఢిల్లీ ఐఐటీలో గోల్డ్‌మెడల్ సాధించిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అజ్మీరా సంకేత్ జపాన్‌లో మంచి ప్యాకేజీతో ఉన్నత ఉద్యోగం సంపాదించాడు. అయితే తన స్నేహితుడు కట్టా రవితేజ సివిల్స్‌కు ఎంపికై సమాజానికి చేస్తున్న సేవ, అందులోని సంతృప్తిని గమనించి తానూ సివిల్స్ రాసి 35వ ర్యాంకు సాధించాడు. తనకు మిత్రుడు రవితేజ రోల్‌మోడల్ అని సంకేత్ సాక్షికి చెప్పారు. అవగాహన పెరిగింది గతంలో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు ఏం చేస్తారు? వారి విధులు ఎలా ఉంటాయి? సమాజంలో వారు తీసుకొచ్చే మార్పు ఎలా ఉంటుందనే అంశాలపై పెద్దగా అవగాహన ఉండేది కాదు. చాలామందికి డాక్టర్లు, ఇంజనీర్లే ఎక్కువ అనే భావన ఉండేది. మరోవైపు సివిల్స్ పరీక్షలకు కోచింగ్ సెంటర్లు చాలావరకు ఢిల్లీ కేంద్రంగానే ఉండేవి. దీంతో ఢిల్లీతో ఎక్కువ అనుసంధానమై ఉండే ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువ ఎంపిక అయ్యేవారు. అయితే ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. సివిల్స్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలో ఈజీగా తెలిసిపోతోంది. హైదరాబాద్ కేంద్రంగానూ మంచి కోచింగ్ సెంటర్లు వచ్చాయి. అలాగే అఖిల భారత సర్వీసులకు సంబంధించిన అవగాహన పెరిగింది. ఫలితంగా మనవారు ఇప్పుడు సివిల్స్‌పై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. విజయం సాధిస్తున్నారు. – దురిశెట్టి అనుదీప్ (సివిల్స్–2017 ఆలిండియా టాపర్, మెట్పల్లి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా), (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్) ఫ్యామిలీ సపోర్ట్ చేస్తే సాధించొచ్చు నాన్న వెంకటేశ్వర్లు పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. నేను బీటెక్‌లో ఉన్నప్పుడే మా కలెక్టర్ అలా అన్నారు. ఎస్పీ ఇలా అన్నారు అంటూ వారి గురించి గొప్పగా చెబుతుండేవారు. అప్పుడే నేనూ నిర్ణయించుకున్నా కలెక్టర్ కావాలని. అందుకోసం ఐదేళ్లు కష్టపడ్డా. కుటుంబసభ్యులు అందించిన సహకారంతో చివరకు జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్ సాధించా. నాలా అందరికీ ఫ్యామిలీ సపోర్ట్ దొరికితే రాష్ట్రం నుంచి అనేకమంది ఐఏఎస్, ఐపీఎస్‌లు వస్తారు. – ఉమా హారతి, సివిల్స్ 3వ ర్యాంకర్ నాలాంటి వాళ్లకు సాయం చేయాలని.. నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. అమ్మ మధ్యాహ్న భోజన కార్మికురాలిగా పనిచేస్తూ నన్ను, అన్న, చెల్లెల్ని చదివించింది. మా కోసం ఆమెపడే కష్టం ఎప్పుడూ కళ్ల ముందే ఉండేది. అందుకే సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉంటూ ఇంటర్ వరకు చదివా. ఐఐటీ చెన్నైలో సీటు వచ్చినప్పుడు కనీస ఫీజు సరే అక్కడికి వెళ్లేందుకు, ఇతర ఖర్చులకు కూడా డబ్బుల్లేవు. అయితే కొందరు దాతలు ముందుకొచ్చి సహాయం చేయడంతో ఐఐటీ çపూర్తి చేశా. ఆపై ఓఎన్జీసీలో ఉన్నత ఉద్యోగం సంపాదించా. కానీ ఏదో వెలితిగా అనిపించేంది. నేను కూడా కొంత మందికి సహాయం చేయాలంటే మరింత ఉన్నత స్థితిలో ఉండాలనుకుని ఉద్యోగానికి రాజీనామా చేసి రెండవ ప్రయత్నంలోనే సివిల్స్‌లో 410 ర్యాంకు సాధించా. – డొంగ్రి రేవయ్య, ఆసిఫాబాద్ జిల్లా ఇప్పుడు అన్నీ హైదరాబాద్‌లోనే.. ఒకప్పుడు సివిల్స్ రాయాలంటే ఢిల్లీ వెళ్లాలి. అక్కడ ఉండి కోచింగ్ తీసుకోవాలి. అక్కడి వాతావరణం, ఆహారం, భాష అన్నీ మనకు కొత్తగా అనిపించేవి. దాంతో ఎక్కువగా ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల వారే సివిల్స్‌లో రాణించేవారు. కానీ ఇప్పుడు అన్నింటికీ హైదరాబాద్ అడ్డా అయ్యింది. నిపుణుల కొరత లేదు. దీంతో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, అమెరికా లాంటి దేశాలపై మోజు తగ్గించుకుని మరీ సివిల్స్ వైపు వస్తున్నారు. గడిచిన కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా ఎంపికవుతుండటంతో, ఇతరులు వారిని ఆదర్శంగా తీసుకుని విజేతలవుతున్నారు. – ఎం.బాలలత, సివిల్స్ ట్రైనర్ మాధోపట్టి..సివిల్స్ విజేతల పుట్టినిల్లు! యూపీ రాజధాని లక్నోకు 300 కి.మీ. దూరంలో ఉన్న మాధోపట్టి గ్రామంలో మొత్తం 75 ఇళ్లు. అందులో సివిల్స్ సాధించిన వారు ఏకంగా నలభై మంది ఉండటం అబ్బురపరిచే విషయం. ఇక్కడ ఉపాధికి సరిపోయే భూమి లేక అందరూ ఉన్నత చదువులనే ఆ«ధారం చేసుకున్నారు. ఇలా 1952లో డాక్టర్ ఇందుప్రకాష్ తొలిసారి యూపీఎస్సీ పరీక్షల్లో రెండో ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకున్న ఆయన నలుగురు సోదరులు ఐఏఎస్ ను సాధించారు. అందులో వినయ్‌సింగ్, ఛత్రçసల్సింగ్లు బిహార్, తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేశారు. ఇలా మాధోపట్టి మేధావులకు నిలయంగా మారింది. పురుషులతో పాటు మహిళలు కూడా ఐఏఎస్, ఐపీఎస్‌లకు ఎంపికయ్యారు. అలా మాధోపట్టి ఐఏఎస్‌ల ఫ్యాక్టరీగా మారింది. -
సివిల్స్ ఫలితాల్లో ఇద్దరికి ఓకే ర్యాంకు.. తేల్చేసిన యూపీఎస్సీ?
సివిల్ సర్వీస్ పరీక్ష ఫలితాలు ఇటీవల వెల్లడైన విషయం తెలిసిందే. సివిల్ సర్వీసెస్ 2022 తుది ఫలితాల్లో మొత్తం 933 మంది అభ్యర్థులను యూపీఎస్సీ ఎంపిక చేంది. . వీరిలో IAS సర్వీసెస్‌కు 180 మందిని ఎంపిక చేసింది. అలాగే IFSకు 38 మందిని, IPSకు 200 మంది ఉన్నారు. ఇక సెంట్రల్ సర్వీసెస్, గ్రూప్-Aకు 473 మంది, గ్రూప్-Bకి 131 మందిని ఎంపిక చేసింది. గ్రూప్-B కలుపుకుంటే ఎంపిక అయిన అభ్యర్థుల సంఖ్య 1022 అయింది. కాగా యూపీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాక మధ్యప్రదేశ్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు యువతులకు ఒకే ర్యాంక్ వచ్చింది. ముందుగా సివిల్స్‌కు ఎంపిక అవ్వడంతో అంతులేని ఆనందానికి లోనయ్యారు. తమ శ్రమ ఫలించిందనుకున్నారు. ఇంతలోనే తన పేరు, ర్యాంకు, రోల్ నంబర్లతో మరో అమ్మాయి ఉందని తెలియడంతో నిర్ఘాంతపోయారు. ఆ ర్యాంకు నాదంటే.. నాదంటూ యూపీఎస్సీకి తమ అడ్మిట్ కార్డులను సమర్పించారు. ఒకే పేరుతో ఇద్దరు దేవాస్ జిల్లాకు చెందిన ఆయేషా ఫాతిమా (23), అలీరాజ్‌పూర్‌కు చెందిన ఆయేషా మక్రాని (26) ఇద్దరూ ఇటీవల వెల్లడించిన యూపీఎస్సీ ఫలితాల్లో అర్హత సాధించారు. వారిరువురికీ 184వ ర్యాంకు వచ్చింది. వీరిద్దరి రోల్ నంబర్లు కూడా ఒకటే. దీంతో అసలు సమస్య వచ్చిపడింది. ఆ ర్యాంకు నాదంటే.. నాదంటూ ఇద్దరూ యూపీఎస్సీకి తమ అడ్మిట్ కార్డులను సమర్పించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదులు చేశారు. చదవండి: చితికి చేరుతున్న చీతాలు.. ‘ప్రాజెక్ట్ చీతా’పై కొత్త కమిటీ తేల్చేసిన యూపీఎస్సీ వారిద్దరి అడ్మిట్ కార్డులను గమనిస్తే కొన్ని వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ఇంటర్వ్యూ నిర్వహించిన తేదీ ఇక్కడ కీలకంగా మారింది. వీరిద్దరికీ ఏప్రిల్ 25, 2023న పర్సనాలిటీ టెస్టు నిర్వహించారు. అయితే.. మక్రానీ అడ్మిట్‌కార్డులో గురువారం ఉండగా.. ఫాతిమా కార్డులో మంగళవారం అని స్పస్టంగా ఉంది. క్యాలెండర్ ప్రకారం ఆ రోజు మంగళవారమే. అంతేకాకుండా ఫాతిమా అడ్మిట్‌కార్డులో యూపీఎస్సీ వాటర్ మార్కుతోపాటు క్యూఆర్ కోడ్ సైతం ఉంది. మక్రానీ అడ్మిట్‌కార్డుపై ఇవేం లేవు. దీంతో యూపీఎస్సీ అధికారులు ఫాతిమానే అసలు అభ్యర్థి అని పేర్కొన్నారు. మరోచోట కూడా మరోవైపు తుషార్ అనే పేరుతోనూ ఇలాంటి సమస్యే ఎదురైంది. తమకు 44వ ర్యాంక్ వచ్చిందని హరియాణాకు చెందిన తుషార్, బిహార్‌కు చెందిన తుషార్ కుమార్ చెప్పారు. దీంతో దర్యాప్తు చేపట్టిన యూపీఎస్పీ.. బిహార్‌కు చెంది తుషార్ కుమార్ నిజమైన అభ్యర్థిగా గుర్తించింది. ఆయేషా మక్రాని (26)తో సహా బిహార్‌కు చెందిన తుషార్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు యూపీఎసీ పేర్కొంది. యూపీఎస్సీ పరీక్షల్లో మరోసారి ఇలాంటి పొరపాట్లు జరగబోవని హామీ ఇచ్చారు. చదవండి: లండన్‌లో ఉద్యోగం వదిలేసి సివిల్స్ వైపు.. థర్డ్ అటెంప్ట్‌లో ఫస్ట్ ర్యాంక్ -
సివిల్స్ లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు
-
సివిల్స్‌లో నారీ భేరి
న్యూఢిల్లీ: సివిల్ సర్విసెస్–2022 తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్విసు కమిషన్(యూపీఎస్సీ) మంగళవారం విడుదల చేసింది. మొదటి నాలుగు ర్యాంకులను మహిళలే కైవసం చేసుకోవడం విశేషం. ఢిల్లీ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ ఇషితా కిశోర్ తొలి ర్యాంకు సాధించారు. గరీమా లోహియా, తెలుగు యువతి నూకల ఉమా హారతి, స్మృతీ మిశ్రా వరుసగా రెండు, మూడు, నాలుగో ర్యాంకు సొంతం చేసుకున్నారు. టాప్–25 ర్యాంకర్లలో 14 మంది మహిళలు, 11 మంది పురుషులు ఉన్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది. ఈ పరీక్షలో మొత్తం 933 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరిలో 613 మంది పురుషులు, 320 మంది మహిళలు ఉన్నారు. సివిల్స్‌లో టాప్–3 ర్యాంకులు మహిళలే సాధించడం ఇది వరుసగా రెండో సంవత్సరం కావడం గమనార్హం. సివిల్స్–2021లో శృతి శర్మ, అంకితా అగర్వాల్, గామినీ సింగ్లా తొలి మూడు ర్యాంకులు దక్కించుకున్న సంగతి తెలిసిందే. మూడో ప్రయత్నంలో తొలి ర్యాంక్ ఈసారి సివిల్స్ తొలి ర్యాంకర్ ఇషితా కిశోర్ ఆప్షనల్ సబ్జెక్టుగా పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎంచుకొని మూడో ప్రయత్నంలో విజయం సాధించారు. ఆమె యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ పరిధిలోని శ్రీరామ్ కాలేజీ ఆఫ్ కామర్స్ నుంచి ఎకనామిక్స్(ఆనర్స్)లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. రెండో ర్యాంకర్ గరీమా లోహియా యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ పరిధిలోని కిరోరీమల్ కాలేజీ నుంచి కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ అభ్యసించారు. సివిల్స్‌లో కామర్స్ అండ్ అకౌంటెన్సీని ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకున్నారు. రెండో ప్రయత్నంలో రెండో ర్యాంక్ సాధించారు. మూడో ర్యాంకర్ నూకల ఉమా హారతి ఐఐటీ–హైదరాబాద్ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తిచేశారు. ఆంథ్రోపాలజీని ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకున్నారు. ఐదో ప్రయత్నంలో మూడో ర్యాంక్ సొంతం చేసుకున్నారు. ఇక స్మృతీ మిశ్రా మూడో ప్రయత్నంలో నాలుగో ర్యాంకు దక్కించుకున్నారు. ఆమె ఢిల్లీలోని మిరండా హౌజ్ కాలేజీలో బీఎస్సీ చదివారు. జువాలజీ ఆప్షనల్ సబ్జెక్టుగా సివిల్స్‌లో జయకేతనం ఎగురవేశారు. ఐదో ర్యాంకర్ మయూర్ హజారికా తొలి ప్రయత్నంలోనే అనుకున్నది సాధించారు. అస్సాంకు చెందిన హజారియా ఎంబీబీఎస్ చదివారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థల నుంచి రాక టాప్–25 ర్యాంకర్ల విద్యార్హతలను గమనిస్తే చాలామంది ఐఐటీ, ఎన్ఐటీ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీ, జాదవ్‌పూర్ యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల నుంచి ఇంజనీరింగ్, హుమానిటీస్, సైన్స్, కామర్స్, మెడికల్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినవారే ఉన్నారు. మెయిన్స్ పరీక్షలో ఎక్కువ మంది ఆంథ్రోపాలజీ, కామర్స్ అండ్ అకౌంటెన్సీ, ఎకనామిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, లా, హిస్టరీ, మ్యాథ్స్, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఫిలాసఫీ, సోషియాలజీ, జువాలజీని ఆప్షనల్ సబ్జెక్టులుగా ఎంచుకున్నారు. రిజర్వ్ లిస్టులో 178 మంది అర్హత సాధించిన వారిలో 345 మంది జనరల్ కేటగిరీ, 99 మంది ఆర్థికంగా వెనుకబడిన తరగతి(ఈడబ్ల్యూఎస్), 263 మంది ఇతర వెనుకబడిన తరగతులు(ఓబీసీ), 154 మంది షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీ), 72 మంది షెడ్యూల్డ్ తెగల(ఎస్టీ) వర్గానికి చెందినవారున్నారు. 178 మంది అభ్యర్థులను రిజర్వ్ జాబితాలో చేర్చినట్లు యూపీఎస్సీ తెలియజేసింది. మొత్తం విజేతల్లో 41 మంది దివ్యాంగులు ఉన్నారు. నా కల నెరవేరింది సివిల్స్‌లో తొలి ర్యాంకు సాధించడం ద్వారా నా కల నెరవేరింది. ఐఏఎస్ అధికారిగా మహిళా సాధికారత కోసం, అణగారిన వర్గాల సంక్షేమ కోసం కృషి చేస్తా. మొదటి ర్యాంకు లభించడం చాలా సంతోషంగా ఉంది. ఇందుకు తొలుత నా కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేయాలి. సివిల్స్‌లో మొదటి రెండు ప్రయత్నాలు విఫలమైనప్పటికీ వారు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. మెరుగైన ర్యాంకు సాధించాలన్న లక్ష్యంతో ప్రతిరోజూ 8 గంటల నుంచి 9 గంటలపాటు చదివాను. నా కఠోర శ్రమకు ఈ ఫలితం దక్కిందని భావిస్తున్నా. నా ప్రాధాన్యత ఉత్తరప్రదేశ్ క్యాడర్. ఈసారి సివిల్స్‌లో మొదటి నాలుగు ర్యాంకులు మహిళలు సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది – ఇషితా కిశోర్, సివిల్స్ ఫస్ట్ ర్యాంకర్ రెండో ర్యాంకు ఊహించలేదు ‘‘సివిల్స్ సాధించాలన్నది నా చిన్నప్పటి కల. ఏకంగా రెండో ర్యాంకు సాధిస్తానని ఊహించలేదు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించా. ఈ ప్రయాణంలో మా అమ్మ, కుటుంబ సభ్యులు నాకు తోడుగా నిలిచారు. ప్రిపరేషన్ నిరంతరం కాకుండా మధ్యలో అప్పుడప్పుడు విరామం ఇచ్చా. బంధుమిత్రులను కలుసుకున్నా. స్ఫూర్తి, సొంతంగా చదుకోవడం, విశ్లేషణతో ఎవరైనా పరీక్షల్లో విజయం సాధించవచ్చు. సరైన మార్గనిర్దేశం కూడా అవసరమే. పెద్ద నగరంలో ఉంటున్నామా, చిన్న పట్టణంలో ఉంటున్నామా అనేది సమస్య కాదు. ఇంట్లో ఉండి చదువుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. సర్విసులో చేరాక మహిళాభివృద్ధి, యువత సంక్షేమం కోసం పనిచేస్తా’’ – గరీమా లోహియా, సివిల్స్ రెండో ర్యాంకర్ 15 రోజుల్లోగా మార్కుల వివరాలు యూపీఎస్సీ వెబ్సైట్ http//www.upsc. gov.in ద్వారా ఫలితాలు, సివిల్స్ విజేతల వివరాలు తెలుసుకోవచ్చు. అభ్యర్థులకు ఏదైనా సమాచారం కావాలంటే 011– 23385271/ 23381125/ 23098543 ఫోన్ నంబర్ల ద్వారా పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా సంప్రదించవచ్చని యూపీఎస్సీ సూచించింది. సివిల్స్–2022లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను 15 రోజుల్లోగా వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలియజేసింది. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షను గత ఏడాది జూన్ 5న నిర్వహించారు. 11,35,697 మంది దరఖాస్తు చేసుకోగా, 5,73,735 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 13,090 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. గత ఏడాది సెపె్టంబర్లో జరిగిన మెయిన్స్ పరీక్షలో 2,529 మంది అభ్యర్థులు పర్సనాలిటీ టెస్టు(ఇంటర్వ్యూ)కు ఎంపికయ్యారు. తుది ఫలితాల్లో 933 మంది అర్హత సాధించారు. విజేతలకు మోదీ అభినందనలు సివిల్స్–2022 విజేతలకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. దేశానికి సేవలందించే అవకాశం రావడం, ప్రజల జీవితాన్ని సానుకూల మార్పును తీసుకొచ్చే అదృష్టం లభించడం గొప్ప విషయమంటూ ట్వీట్ చేశారు. విజయం సాధించలేకపోయినవారు నైపుణ్యాలను, బలాలను ప్రదర్శించేందుకు దేశంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. ర్యాంకర్లకు కేంద్ర మంత్రులు అమిత్ షా, జితేంద్ర సింగ్ తదితరులు అభినందనలు తెలియజేశారు. హెడ్ కానిస్టేబుల్‌కు 667వ ర్యాంక్ ఢిల్లీ పోలీసు శాఖలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న రామ్‌భజన్ కుమార్ సివిల్స్‌లో 667వ ర్యాంకు సాధించి, అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ఆయన వయసు 34 ఏళ్లు. ఎనిమిదో ప్రయత్నంలో ర్యాంకు సాధించడం గమనార్హం. ప్రస్తుతం సైబర్ సెల్ పోలీసు స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నారు. సివిల్స్ ఫలితాలు వెలువడిన తర్వాత రామ్‌భజన్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సహచరులు, సీనియర్ అధికారులు ఆయనను అభినందించారు. ఓబీసీ కేటగిరీకి చెందిన రామ్‌భజన్‌కు తొమ్మిది సార్లు సివిల్స్ రాసేందుకు అనుమతి ఉంది. ఎట్టకేలకు ర్యాంకు సాధించడం ద్వారా తన కల నెరవేర్చుకున్నానని ఆయన చెప్పారు. ఒకవేళ ఈసారి విఫలమైనా తొమ్మిదోసారి పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఇప్పటిదాకా ఏడు ప్రయత్నాలు సఫలం కాకపోయినా నిరాశ పడలేదని అన్నారు. తన భార్య అందించిన అండదండలతో ముందుకు సాగానని వివరించారు. తాను రాజస్తాన్ నుంచి వచ్చానని, అక్కడ తన తండ్రి కూలీగా పనిచేస్తున్నాడని వెల్లడించారు. కష్టాల్లోనే పుట్టి పెరిగానని పేర్కొన్నారు. అంకితభావం, కఠోర శ్రమ, సహనంతో అనుకున్న లక్ష్యం సాధించడం సులువేనని సూచించారు. కానిస్టేబుల్‌గా పనిచేస్తూ 2019లో యూపీఎస్సీ పరీక్షలో ర్యాంకు సాధించిన ఫిరోజ్ ఆలం తనకు స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. రామ్‌భజన్ 2009లో పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా చేరారు. -
వంట మనిషి కొడుకు ‘సివిల్స్’ కొట్టాడు..
సాక్షి, ఆదిలాబాద్: కష్టాలు ఎన్ని ఎదురైనా ఆ యువకుడి అంకితభావం ముందు నిలువలేకపోయాయి. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే వంట మనిషి కుమారుడు యూపీఎస్సీలో విజేతగా నిలిచాడు. ఉమ్మడి ఆదిలాబాద్‌కు చెందిన యువకుడు డోంగ్రి రేవయ్య సివిల్స్‌లో 410వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. రేవయ్య.. తల్లి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తోంది. తండ్రి అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయిన కానీ తల్లి ఉన్నత చదువులు చదివించింది.. సివిల్స్ ర్యాంకు సాధించి తల్లి కలను నేరవేర్చారు.. కష్టే ఫలి.. పట్టుదలతో చదివితే సాధించలేనిది ఏదీ లేదని పలువురు విద్యార్థులు నిరూపిస్తున్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కర్నాటిపేటకు చెందిన యువకుడు అజ్మీరా సంకేత్ 35 ర్యాంకు సాధించాడు. తన కుమారుడు సివిల్స్ ర్యాంకు సాధించడంతో తల్లిదండ్రులు స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. గ్రామస్తులు అజ్మీరా సంకేత్‌ను అభినందించారు. శాఖమూరి సాయిహర్షిత్ సివిల్స్‌లో ఓరుగల్లు బిడ్డ ప్రతిభ సివిల్స్‌లో ఓరుగల్లు బిడ్డ తన ప్రతిభ కనబర్చాడు. హన్మకొండ అడ్వకేట్స్ కాలనీకి చెందిన శాఖమూరి సాయిహర్షిత్ 40వ ర్యాంక్ సాధించాడు. 22 సంవత్సరాల హర్షిత్.. ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్‌లో ర్యాంకు సాధించాడు. వరంగల్ పబ్లిక్ స్కూల్లో పదవ తరగతి, ఇంటర్మీడియట్ శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో చదివాడు. చదవండి: ‘సివిల్స్’లో సత్తా చాటిన తెలుగు తేజాలు.. టాప్‌లో ఉమా హారతి -
యూపీఎస్సీ సివిల్స్ ఫైనల్ ఫలితాలు ఎప్పుడంటే..?
న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022 ఇంటర్వ్యూలు ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. యూపీఎస్సీ సివిల్స్ ఫైనల్ ఫలితాలను మే 22వ తేదీలోపు ఎప్పుడైనా విడుదల చేసే అవకాశం ఉంది. ఈసారి యూపీఎస్సీ 861 సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల భర్తీకి నోటీఫికేషన్ విడుదల చేయగా, ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలకు హాజరైనట్లు తెలుస్తోంది. దేశం మొత్తం మీద 2,529 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకి అర్హత సాధించారు. యూపీఎస్సీ సివిల్స్ ఫైనల్ ఫలితాలు విడుదలైన తర్వాత టాప్ ర్యాంకర్ల ఇంటర్వ్యూలను సాక్షి ఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు. -
లక్షల జీతం కాదనీ.. ఈ లక్ష్యం కోసమే ఐఏఎస్ కొట్టానిలా.. కానీ..
విదేశాల్లో లక్షల జీతం వచ్చే ఉద్యోగం ఉన్న.. అలాగే అన్ని సౌకర్యాలు ఉన్నా.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్స్‌లో సక్సెస్ అయితే ఆ కిక్కే వేరు.. ఎందుకంటే.. దానికున్న గౌరవం.. విలువ చాలా గొప్పది. ఆయన నానో టెక్నాలజీ మీద ఎన్నో పరిశోధనలు చేశాడు. ఆ పరిశోధనలకు గాను.. ఆయనకు అమెరికాలో లక్షల జీతం వచ్చే ఉద్యోగం వచ్చింది. అయితే.. ఆ లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని కూడా వదిలేసి.. యూపీఎస్సీ సివిల్స్‌కు ప్రిపేరయ్యాడు. ఈ సివిల్స్ సాధించడం కోసం ఎంతోకష్టపడ్డాడు. ఆయన కష్టాన్నికి యూపీఎస్సీ సివిల్స్ 2020 ఫలితాల్లో జాతీయ స్థాయిలో.. ఏకంగా 29వ ర్యాంక్ సాధించాడు. చివరికి ఐఏఎస్ కావలనే కలను నిరవేర్చుకున్నాడు. ఈయనే.. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ ప్రాంతానికి చెందిన ప్రఖర్ సింగ్. ఈ నేపథ్యంలో ప్రఖర్ సింగ్ సక్సెస్ స్టోరీ మీకోసం.. కుటుంబ నేపథ్యం : ప్రఖర్ సింగ్.. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ ప్రాంతానికి చెందిన వారు. తండ్రి కేదార్ సింగ్. ఇన్స్పెక్టర్గా పదవీ విరమణ చేశారు. ప్రఖార్ చిన్నతనంలోనే.. అతని తండ్రి పని కారణంగా బయట ఉండవలసి వచ్చింది. అలాంటి పరిస్థితిలో, అతని తల్లి సవితా సింగ్ కుటుంబాన్ని చూసుకునేది. ఆమె జూనియర్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలు. ప్రఖర్ తన తల్లి నుంచి ప్రేరణ పొందేవాడు. తండ్రి దగ్గరే క్రమశిక్షణ నేర్చుకున్నాడు. ఒక ఐపిఎస్ అధికారి పాత్రబాధ్యత ఏమిటో కూడా అతను చెప్పేవారు. ఎడ్యుకేషన్ : ప్రఖర్ సింగ్ .. తొలినాళ్ల నుంచి చదువుతో ప్రతిభ కనబరిచే వారు. రాంపూర్‌లోని దయావతి మోదీ అకాడమీలో 12వ తరగతి వరకు చదివాడు. 12వ తరగతిలో 98 శాతం మార్కులు సాధించాడు. ఆ తర్వాత ఐఐటీ రూర్కీలో ప్రవేశం పొందాడు. 2015 నుండి 2019 వరకు, అతను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివాడు. ఈ క్రమంలో యూఎస్ వెళ్లే అవకాశం కూడా వచ్చింది. 2018 సంవత్సరంలో, మూడవ సంవత్సరం ముగింపులో, అతను ఇంటర్న్‌షిప్‌పై US వెళ్ళాడు. అక్కడ నానోటెక్నాలజీలో పరిశోధన చేసి తిరిగి వచ్చాడు. స్కాలర్షిప్ ద్వారా యుఎస్ వెళ్లాడు. ఆ స్కాలర్షిప్ ద్వారా దేశం నలుమూలల నుంచి 19 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఇందుకు సంబంధించి భారత్, అమెరికా ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అలాంటిది అవన్నీ వదలుకోని యూపీఎస్సీ కోసం కసరత్తులు చేశాడు. సివిల్స్ పరీక్షకు సన్నద్ధం కావడంలో స్థిరత్వం క్రమశిక్షణ పాటించాలని ప్రఖర్ చెప్పారు. అలాగే పరధ్యానాన్ని విస్మరించండి. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోండి. తల్లిదండ్రులు, స్నేహితులతో సంతోషంగా మాట్లాడండి. అలాగే వీరితో సన్నిహితంగా ఉండండి. మిమ్మల్ని మీరు ఒంటరిగా ఉంచుకోవాల్సిన అవసరం లేదు. పరీక్షను ఆధారిత పద్ధతిలో చదవండి. మీపై మీరు విశ్వాసాన్ని ఉంచుకోండి. యూపీఎస్సీ ప్రయాణం మారథాన్ లాంటిదని ప్రఖర్ సింగ్ అన్నారు. ఇది ఒక సంవత్సరం లేదా ఆరు నెలల తయారీ కాదు. మీ వ్యక్తిత్వం.. మీ ఆలోచన ప్రక్రియ దీర్ఘకాలం మీద ప్రభావం చూపుతుంది. నేను చిన్నప్పటి నుంచి న్యూస్ పేపర్లు చదివేవాడిన. దీని వల్ల జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ వైపు మొగ్గు చూపాను. ప్రతి వ్యక్తి జీవితంలో పోరాటం ఉంటుంది. ఎవరో జాబ్ చేస్తున్నారో లేదో.. మీకు అవసరం లేదు. మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ కాకపోయినా, కాస్త సమయం కేటాయించి మంచి పుస్తకాలు చదవాలి. అతను ఎల్లప్పుడూ తన ఆలోచన విధానాన్ని రిఫ్రెష్ చేసేవాడు. మీలో కొత్త ఆలోచనలు రావాలి. నేర్చుకోవడం అనేది జీవితకాల ప్రక్రియ. ఇది ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండాలి. ఎప్పుడూ కొత్త పుస్తకాలు చదవండి. కొత్త వ్యక్తులను కలవండి. కొత్త ఆలోచనలను వినండి. ఆశావహులు ప్రిపరేషన్లో బిజీగా ఉంటారు. మీరు ప్రిపరేషన్లో స్థిరత్వం.., క్రమశిక్షణను పాటిస్తే.. మీరు బెస్ట్‌గా నిలుస్తారు. స్నేహితుల నుంచి మారల్ మద్దతు లభిస్తుంది. ఏం చదవాలి, ఎలా చదవాలి అనే చర్చ జరుగుతోంది. మనం సరైన దారిలో వెళ్తున్నామా లేదా అనేది చూపిస్తుందన్నారు ప్రస్తుతం సోషల్ మీడియా మంచి పాత్ర పోషిస్తోందని చెప్పారు. చాలా వెబ్సైట్లలో మంచి కంటెంట్‌ను చూడవచ్చు. అలాగే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి బదులుగా, మీరు దాన్ని ఉపయోగించండి. మీరు వారి నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. ప్రిపరేషన్ సమయంలో నేను తన సోషల్ మీడియా ఖాతాను కూడా డీయాక్టివేట్ చేయలేదు. -
కర్మయోగి స్ఫూర్తితో...
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ఐఇఎస్–2022)లో హైదరాబాద్‌కు చెందిన పవన్ స్వరూప్ రెడ్డి 5వ ర్యాంక్ సాధించాడు. సూరత్ ‘నిట్’ లో సివిల్ ఇంజనీరింగ్ చేసిన పవన్ స్వరూప్‌రెడ్డి ఐఐటీ, కాన్పూర్‌లో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ చేశాడు. ‘మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పేరుగాంచిన డా.శ్రీధరన్ ఆటోబయోగ్రఫీ ‘కర్మ యోగి’ చదివాడు పవన్ స్వరూప్. ఈ పుస్తకం తనలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. బలమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడానికి కారణం అయింది. శ్రీధరన్ చేసిన ప్రతిష్ఠాత్మకమైనప్రాజెక్ట్లతో స్ఫూర్తి పొందిన పవన్ స్వరూప్ ఇంజనీరింగ్ సర్వీస్‌లలోకి రావాలనుకున్నాడు. తనను ఐ.ఇ.ఎస్ ఆఫీసర్‌గా చూడాలనేది తల్లి కల. తండ్రి ఆంజనేయులురెడ్డి ఇదే పరీక్షల్లో ఒకప్పుడు 13వ ర్యాంక్ సాధించాడు. ప్రస్తుతం ఆయన సౌత్ సెంట్రల్ రైల్వే, సికింద్రాబాద్‌లో చీఫ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. బెంగళూరులోని అమెరికాకు చెందిన ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలో స్ట్రక్చరల్ ఇంజనీర్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు రోజుకు 5–6 గంటలు, సెలవు రోజు 8–10 గంటల పాటు ‘ఐఇఎస్’ పరీక్షల కోసం ప్రిపేరయ్యేవాడు. ‘ఒకవైపు ఉద్యోగబాధ్యతలకు వందశాతం న్యాయం చేయాలి. మరోవైపు ఆఫీస్ నుంచి వచ్చిన తరువాత పరీక్షలకు గట్టిగా ప్రిపేర్ కావాలి’ అనుకొని రంగంలోకి దిగాడు. స్మార్ట్‌ఫోన్‌ను పక్కన పెట్టాడు. స్టడీ మెటీరియల్ మాత్రమే తన కళ్ల ముందు కనిపించేది. స్వరూప్ కష్టం వృథాపోలేదు. ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌లో 5వ ర్యాంకుతో విజయకేతనం ఎగరేశాడు. ‘ఒక్కసారి మీ ప్రయత్నంలో విఫలం అయితే ఎంతమాత్రం నిరాశ పడనక్కర్లేదు. మనం చేసిన తప్పుల నుంచి కూడా ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. ఏంచేయకూడదో తెలుసుకోవచ్చు. మనం నిర్దేశించుకున్న లక్ష్యంపై గట్టి సంకల్పబలం ఉంటే విజయం దక్కడం కష్టమేమీ కాదు’ అంటున్న పవన్ స్వరూప్‌రెడ్డి తన వృత్తిజీవితంలో విజయాలు సాధించాలని ఆశిద్దాం. -
తెలంగాణలో ‘కన్ఫర్డ్’ కిరికిరి! ఎస్సీఎస్ కోటా విషయమే తెలియదంటూ లబోదిబో!
సాక్షి, హైదరాబాద్: నాన్ స్టేట్ సివిల్ సర్వీస్ కేటగిరీలో కన్ఫర్డ్ ఐఏఎస్‌ల భర్తీ కోసం కొనసాగించిన దరఖాస్తు ప్రక్రియ, ప్రభుత్వం రూపొందించిన ప్రాథమిక జాబితాలోని అధికారుల సీనియార్టీపై అధికారవర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు అధికారులు ఈ మేరకు తమకు సమాచారమే అందలేదని అంటుండడం చర్చనీయాంశమవుతోంది. అవకాశం కోల్పోయిన సీనియర్ అధికారుల్లో దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారిగా.. ఐఏఎస్... అఖిల భారత సర్వీసులో అత్యున్నతమైన పోస్టు. ఈ కొలువుకు సివిల్ సర్వీసెస్ ద్వారా ఎంపిక కావడం ఒక పద్ధతైతే.. రాష్ట్ర స్థాయిలో అర్హత కలిగిన కొందరు సీనియర్ అధికారుల జాబితాను యూపీఎస్సీకి పంపిస్తే.. అక్కడ జరిగే ఇంటర్వ్యూలో ఉత్తీర్ణతతో కన్ఫర్డ్ ఐఏఎస్‌గా ఎంపిక కావడం మరో విధానం. పలువురు సీనియర్ రెవెన్యూ అధికారులు ఎస్సీఎస్ (స్టేట్ సివిల్ సర్వీస్) కోటాలో పదోన్నతులతో ఐఏఎస్‌లుగా ఎంపికవుతుండగా.. ఇతర విభాగాలకు చెందినవారు నాన్ ఎస్సీఎస్ పద్ధతిలో సెలక్షన్ విధానంతో అతి తక్కువ సంఖ్యలో కన్ఫర్డ్ ఐఏఎస్‌లు అవుతుంటారు. ఈ క్రమంలోనే 2021 సంవత్సరానికి సంబంధించి నాన్ ఎస్సీఎస్ కేటగిరీలో ఐఏఎస్ (తెలంగాణ కేడర్) పోస్టుల ఎంపికకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గతేడాది నవంబర్ 25వ తేదీన సచివాలయంలోని అన్ని ప్రభుత్వ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు లేఖ రాశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలిసారిగా నాన్ ఎస్సీఎస్ కేటగిరీలో కన్ఫర్డ్ ఐఏఎస్ ప్రక్రియ మొదలు పెట్టారు. ఇందులో భాగంగా అర్హతలున్న అధికారులు 2022 డిసెంబర్ 3వ తేదీ నాటికి పూర్తిస్థాయి వివరాలతో కూడిన దరఖాస్తులను సమర్పించాలని కోరారు. ఆ మేరకు దరఖాస్తులు స్వీకరించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఐదు పోస్టులకు 1:5 నిష్పత్తిలో 25 మందితో ప్రాథమిక జాబితాను రూపొందించి యూపీఎస్సీకి పంపింది. ఈనెల 24, 27వ తేదీల్లో యూపీఎస్సీ వారికి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలోనే ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ, ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలు అధికారవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. అర్హులైనా గడువులోపు ఏసీఆర్లు అందక... నాన్ ఎస్సీఎస్ కేటగిరీలో కన్ఫర్డ్ ఐఏఎస్ కోసం శాఖల వారీగా అర్హులైన అభ్యర్థుల నుంచి పూర్తిస్థాయి బయోడేటాతో కూడిన దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం వారం రోజుల గడువును మాత్రమే ఇస్తున్నట్లు లేఖలో స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన లేఖ సంబంధిత శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు చేరడం.. అక్కడ్నుంచి సంబంధిత శాఖ ఉన్నతాధికారి (కమిషనర్/డైరెక్టర్)కు వెళ్లడం, ఆ తర్వాత కిందిస్థాయిలో ఉద్యోగులకు చేరడం, ఈ మేరకు ఫైళ్లు రూపొందించడం.. ఈ యావత్ ప్రక్రియకు బాగా సమయం పడుతుంది. అయితే ప్రభుత్వం వారం రోజులు మాత్రమే గడువు ఇవ్వగా.. పలు శాఖల్లోని అధికారులకు ఈ మేరకు సమాచారమే అందలేదని తెలుస్తోంది. కొన్ని శాఖల అధికారులకు గడువు తేదీ ముగిసిన తర్వాత తెలియడంతో నిరాశకు గురికాగా.. మరికొందరికి చివరి నిమిషంలో తెలిసినప్పటికీ ఏసీఆర్ (యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్)లు అందక దరఖాస్తు చేసే అవకాశం లేకపోవడంతో లబోదిబోమన్నారు. ప్రభుత్వం ఇదివరకు కనిష్టంగా నెలరోజుల గడువు ఇచ్చేదని, ఆ తర్వాత కూడా అధికారుల వినతుల మేరకు మరో వారం నుంచి పక్షం రోజుల వరకు గడువు పొడిగించేదని పలువురు అధికారులు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేనట్లుగా కేవలం వారం రోజుల గడువే ఇవ్వడంతో అన్నిరకాల అర్హతలున్న వారు కూడా కనీసం దరఖాస్తు కూడా చేయలేక పోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లీకులు... పైరవీలు నాన్ ఎస్ఈసీ కన్ఫర్డ్ ఐఏఎస్‌ల ప్రక్రియకు సంబంధించిన సమాచారం కొందరికి ముందస్తుగానే లీకైనట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలోని కీలక మంత్రుల వద్ద ప్రత్యేక విధుల్లో పనిచేస్తున్న కొందరు అధికారులు, ప్రభుత్వ స్థాయిలో పరపతి కలిగిన అధికారులు ముందు జాగ్రత్తగా దరఖాస్తుకు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారాన్ని సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విధంగా ముందస్తుగా సమాచారం తెలిసి సిద్ధమైన వారే దరఖాస్తులు సమర్పించగలిగారని అంటున్నారు. ఆలస్యంగా సమాచారం అందుకున్న సీనియర్లు సైతం అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయారని చెబుతున్నారు. కొన్నిచోట్ల ఒకరిద్దరు సీనియర్లు అన్నిరకాల సమాచారాన్ని సమర్పించినప్పటికీ ప్రాథమిక జాబితాలో వారి పేర్ల స్థానంలో జూనియర్ల పేర్లు ఎంపికయ్యాయని కొందరు అధికారులు ఆరోపిస్తున్నారు. ఇదివరకు ఏసీబీ వలలో చిక్కి విధుల నుంచి సస్పెండ్ అయ్యి, జైలుకు సైతం వెళ్లిన ఓ అధికారి పేరు జాబితాలో ఉండటం అధికార వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరో నలుగురు అధికారులు పరిపాలన విభాగంలో గత కొంత కాలంగా విధులు నిర్వహించనప్పటికీ వారు కూడా జాబితాలో చోటు దక్కించుకోవడం గమనార్హం. మొత్తంగా పైస్థాయిలో పైరవీలతో జాబితా రూపొందించారనే ప్రచారం జరుగుతుండగా, ప్రభుత్వం దీనిపై స్పందించి తగిన చర్యలు చేపట్టాలని పలువురు అధికారులు డిమాండ్ చేస్తున్నారు. నాన్ ఎస్సీఎస్ కేటగిరీలో కన్ఫర్డ్ ఐఏఎస్‌కు అర్హతలు ►అత్యుత్తమ ప్రతిభా సామర్థ్యాలు కలిగిన డిప్యూటీ కలెక్టర్ హోదా పే స్కేల్ కలిగిన అధికారి ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ►2022 జనవరి ఒకటో తేదీ నాటికి రాష్ట్ర ప్రభుత్వంలో 8 సంవత్సరాల నిరంతర సర్వీసులో ఉండాలి. ►ఎంపిక ప్రక్రియ మొదలైన ఏడాది నాటికి 56 ఏళ్ల కంటే తక్కువ వయసుండాలి. ►ఇదివరకు సెలక్షన్ లిస్టులో పేరు ఉన్నట్లైతే వారికి అవకాశం ఉండదు. ►దరఖాస్తు చేసుకునే అధికారి శాఖా పరంగా ఎలాంటి క్రమశిక్షణ చర్యలకు గురై ఉండకూడదు. విచారణలు పెండింగ్‌లో సైతం ఉండొద్దు. -
మరోసారి వార్తల్లో నిలిచిన సివిల్స్ టాపర్ టీనా దాబీ.. మార్క్‌షీట్ వైరల్
యూపీఎస్సీ టాపర్, ఐఏఎస్ అధికారి టీనా దాబీ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె సీబీఎస్ఈ 12వ తరగతి మార్క్‌షీట్ సోషల్ మీడియాలో వైరల్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. దీని ప్రకారం టీనాకు హిస్టరీ, పాలిటికల్ సైన్స్‌లో 100కు 100 మార్కులు వచ్చినట్లు కొన్ని మీడియా సంస్థలు చెప్పాయి. అయితే ఈ మార్క్‌షీట్ నిజంగా టీనాదేనా అనే విషయంపై క్లారిటీ లేదు. ఆమెకు రెండు సబ్జెక్టుల్లో 100 మార్కులు రావడాన్ని ధ్రువీకరించాల్సి ఉంది. అసలు టీనా మార్క్‌షీట్ నెట్టింట్లో లేదని తెలుస్తోంది. అయితే టీనా 2011 సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో 93శాతం మార్కులు సాధించినట్లు సమాచారం. ఢిల్లీలోని కాన్వెంట్ ఆఫ్ జీసస్ అండ్ మేరీ స్కూల్లో చదివిన ఆమె.. టాపర్‌గా నిలిచింది. ఢిల్లీ యూనివర్సిటీ లేడీ శ్రీరాం కాలేజీలో పొలిటికల్ సైన్స్‌లో బీఏ పూర్తి చేసింది. తన ప్రతిభకు గానూ 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' అవార్డు కూడా అందుకుంది. 2015 యూపీఎస్సీ పరీక్షల్లో తొలి ప్రయత్నంలోనే టాపర్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం రాజస్థాన్‌లో జైసల్మేర్ జిల్లా కలెక్టర్‌గా పని చేస్తోంది. తరచూ వార్తల్లో టీనా సివిల్స్‌లో టాపర్ అయినప్పటి నుంచి తరచూ వార్తల్లో నిలుస్తోంది. 22 ఏళ్లకే ఐఏఎస్ అయిన దళిత యువతిగా అరుదైన ఘనత సాధించింది. అయితే సివిల్స్ రెండో ర్యాంకర్ అయిన అథర్ అమీర్ ఖాన్‌తో ఆమె రిలేషన్లో ఉన్నట్లు 2016లో సోషల్ మీడియాలో ప్రకటించడం పెద్ద చర్చకు దారితీసింది. ఆ సమయంలో మతపరమైన చర్చతో పెను దుమారమే చెలరేగింది. అయినా వెనక్కి తగ్గకుండా 2018లో వీళ్లిద్దరూ పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ 2020లో విడిపోతున్నట్లు ప్రకటించారు. అనంతరం జైపూర్ కోర్టు నుంచి అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత డాక్టర్ ప్రదీప్ గవాండేను(2013 ఐఏఎస్ బ్యాచ్)ను రెండో వివాహం చేసుకుంది టీనా. దాదాపు ఏడాదిపాటు డేటింగ్లో ఉన్న ఈ జంట పెళ్లి 2022లో జరిగింది. ఇది కూడా ప్రేమ వివాహమే కావడం గమనార్హం. చదవండి: జర భద్రం..! ఆ దేశానికి వెళ్లే వారికి కేంద్రం హెచ్చరిక -
యూపీఎస్సీ వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ సదుపాయం
న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నిర్వహించే పరీక్షలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఇకపై ప్రతిసారి తమ వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేదు. అభ్యర్థుల సౌకర్యార్థం వన్‌టైమ్ రిజిస్ట్రేషన్(ఓటీఆర్) విధానాన్ని యూపీఎస్సీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓటీఆర్ వేదికపై ఒకసారి వ్యక్తిగత సమాచారం, ఇతర వివరాలు రిజస్ట్రేషన్ చేసుకుంటే చాలు. వేర్వేరు పరీక్షలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నప్పుడు ఓటీఆర్ నంబర్ తెలియజేస్తే సరిపోతుంది. వారి వివరాలన్నీ దరఖాస్తు పత్రంలో ప్రత్యక్షమవుతాయి. దీనివల్ల అభ్యర్థులకు సమయం ఆదా కావడంతోపాటు దరఖాస్తుల ప్రక్రియ మరింత సులభతరంగా మారుతుందని, దరఖాస్తుల్లో పొరపాట్లకు అవకాశం ఉండదని యూపీఎస్సీ వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఓటీఆర్‌లో నమోదు చేసుకున్న అభ్యర్థుల సమాచారం యూపీఎస్సీ సర్వర్లలో భద్రంగా ఉంటుందని తెలిపాయి. ఆన్లైన్ దరఖాస్తు పత్రంలో ఈ ఓటీఆర్ నంబర్ నమోదు చేస్తే 70 శాతం దరఖాస్తును పూర్తిచేసినట్లే. యూపీఎస్సీ నిర్వహించే అన్నిపరీక్షలకు ఓటీఆర్ ఉపయోగపడుతుంది. upsc.Govt.in లేదా upsconline.nic.in వెబ్సైట్ల ద్వారా ఎప్పుడైనా సరే ఓటీఆర్‌లో అభ్యర్థులు వివరాలు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని యూపీఎస్సీ ఒక ప్రకటనలో సూచించింది. ఇదీ చదవండి: కాంగ్రెస్ యూట్యూబ్ చానల్ తొలగింపు -
సివిల్స్ ప్రిలిమినరీ ఫలితాల విడుదల
సాక్షి, హైదరాబాద్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఈనెల 5న నిర్వహిం చిన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను బుధవారం వెల్లడించింది. మెయిన్స్‌కు అర్హత సాధించిన వారి నంబర్లను యూపీఎస్సీ వెబ్ సైట్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. వీరంతా ఫామ్–1ను ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ప్రిలిమ్స్ ‘కీ’, కటాఫ్ మార్కులు సివిల్స్–2022 ముగిసిన తర్వాత వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతా మని యూపీఎస్సీ తెలిపింది. -
భర్త, అత్త వేధింపులను తట్టుకుని.. ‘శివాంగి గోయల్’ సక్సెస్ స్టోరి
న్యూఢిల్లీ: కట్నం వేధింపులతో అత్తింటి నుంచి పుట్టింటికి చేరుకున్న ఆమె తన కల సాకారం చేసుకోవడమే కాక గృహహింస బాధితురాళ్లకు ఆదర్శంగా నిలిచారు. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాకు చెందిన శివాంగి గోయల్ తాజాగా వెలువడిన యూపీఎస్సీ ఫలితాల్లో ఆలిండియా 177వ ర్యాంకు సాధించారు. ఆమెకు పెళ్లై, ఏడేళ్ల వయసు కుమార్తె ఉంది. భర్త, అత్తింటి వారు కట్నం కోసం పెడుతున్న వేధింపులతో విసిగి పుట్టింటికి చేరుకున్నారు. ప్రస్తుతం విడాకుల కేసు నడుస్తోంది. ‘‘నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి అంటూ నాన్న అభయహస్తమిచ్చారు. యూపీఎస్సీకి మరోసారి ఎందుకు సిద్ధం కాకూడదని అప్పుడే ఆలోచించా’’ అని శివాంగి చెప్పారు. ‘‘స్కూల్లో చదివే రోజుల్లోనే యూపీఎస్సీకి ప్రిపేర్ కావాలంటూ ప్రిన్సిపాల్ సలహా ఇచ్చారు. అప్పటి నుంచే ఐఏఎస్ కావాలని కలలుగనేదాన్ని. అదే నా లక్ష్యంగా ఉండేది’’ అని అన్నారు. ‘‘రెండుసార్లు యూపీఎస్సీ పరీక్ష రాశాక పెళ్లయింది. అత్తింటి వారి వేధింపులతో కూతురితో పుట్టింటికి వచ్చేశా’’ అని అన్నారు. ‘‘చిన్ననాటి కల నిజం చేసుకోవాలనే పట్టుదలతో ఎన్ని అవాంతరాలున్నా ప్రిపరేషన్‌పైనే దృష్టిపెట్టా. సోషియాలజీ సబ్జెక్టుగా సొంతంగా చదువుకుని పరీక్షకు ప్రిపేరయ్యా. అనుకున్నది సాధించా’’ అన్నారు. ‘‘నా తల్లిదండ్రులు, కుమార్తె రైనా సహకారం వల్లే ఈ విజయం సాధ్యమైంది. నేటి మహిళలు అత్తింట్లో జరగరానిది జరిగితే, భయపడకూడదు. ధైర్యంగా నిలబడి సొంత కాళ్లపై నిలబడాలి. ఇదే వారికి నేనిచ్చే సలహా. కావాలనుకుంటే ఏదైనా చేయగలరు. కష్టపడి చదువుకుంటే ఐఏఎస్ కూడా అసాధ్యమేమీ కాదు’’ అన్నారామె. శివాంగి తండ్రి రాజేశ్ గోయెల్ వ్యాపారి కాగా, తల్లి సామాన్య గృహిణి. -
సివిల్స్ సర్విసెస్‌లో అమ్మాయిల హవా
-
అడవిబిడ్డలకు ఉన్నత విద్యను అందిస్తోన్న ఏపీ ప్రభుత్వం
-
దివ్యాంగులు ఐపీఎస్‌కు అర్హులే..
న్యూఢిల్లీ: దివ్యాంగులు సైతం ఐపీఎస్, ఢిల్లీ, అండమాన్ నికోబార్ దీవులు, డయ్యూ డామన్, దాద్రా నగర్ హవేలి, లక్షద్వీప్ పోలీసు సర్వీసు(డీఏఎన్‌ఐపీఎస్), ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీసు(ఐఆర్పీఎఫ్ఎస్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తెలియజేసింది. సివిల్ సర్వీసెస్‌లతో ఆయా సర్వీసులను ప్రాధాన్యతలుగా ఎంచుకోవడానికి అనుమతించింది. సంబంధిత దరఖాస్తు పత్రాలను ఏప్రిల్1లోగా యూపీఎస్సీకి సమర్పించాలని దివ్యాంగ అభ్యర్థులకు సూచించింది. ఐపీఎస్, డీఏఎన్‌ఐపీఎస్, ఐఆర్పీఎఫ్ఎస్ పోస్టుల నుంచి దివ్యాంగులను మినహాయిస్తూ కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 18న జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తదుపరి విచారణను ఏప్రిల్ 18కి వాయిదా వేసింది. చదవండి: (Ukraine Russia War: కీవ్‌లో కల్లోలం.. ఏ క్షణంలోనైనా) -
‘సివిల్స్’ అటెంప్ట్‌లు, వయోపరిమితిని సడలించం
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ పరీక్ష(సీఎస్ఈ)కు సంబంధించి ప్రయత్నాల సంఖ్య(అటెంప్ట్స్), వయో పరిమితిపై ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలను మార్చడం సాధ్యం కాదని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ గురువారం రాజ్యసభలో వెల్లడించారు. కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో వయో పరిమితి, అటెంప్ట్‌ల సంఖ్యలో సడలింపులు ఇవ్వాలంటూ సివిల్స్ అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు అందుతున్నాయని చెప్పారు. ఈ విషయంలో కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారని, రిట్ పిటిషన్లు దాఖలు చేశారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుల ప్రకారం.. సివిల్స్ ఎగ్జామ్ విషయంలో ప్రయత్నాల సంఖ్య(అటెంప్ట్స్), వయో పరిమితిపై ఇప్పుడున్న నిబంధనలను మార్చలేమని లిఖితపూర్వక సమాధానంలో జితేంద్ర సింగ్ తేల్చిచెప్పారు. సడలింపుల అంశాన్ని న్యాయస్థానం సమగ్రంగా పరిశీలించి, తీర్పులిచ్చిందని గుర్తుచేశారు. కోవిడ్–19 ప్రొటోకాల్స్ సక్రమంగా పాటిస్తూ సివిల్ సర్వీసెస్ పరీక్షలు నిర్వహించేందుకు యూపీఎస్సీ, ఎస్ఎస్సీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయని వివరించారు. -
మన రక్షణా దళంలో ఆ ముగ్గురు... స్ఫూర్తి ప్రదాతలు..!
CRPF Assistant Commandant: విమానాశ్రయాలు, ఓడరేవులు, అణు ఇంధన సంస్థలు... ఇలా ఏ సున్నిత ప్రాంతమైనా అది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) పహారాలో ఉంటుంది. ఈ దళంలో పని చేయడానికి ఎంపికైన వారికి హైదరాబాద్ శివార్లలో ఉన్న హకీంపేటలోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీలో (నిసా) ట్రైనింగ్ ఇస్తారు. ఈసారి శిక్షణ పొందిన 62 మందిలో స్నేహ ప్రదీప్ పాటిల్, భూమిక వార్షినే, కీర్తి యాదవ్ అనే ముగ్గురు మహిళలున్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి... మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతానికి చెందిన స్నేహ ప్రదీప్ పాటిల్ తండ్రి రైతు. తల్లి గృహిణి. కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ చేసిన స్నేహ... యూపీఎస్సీ పరీక్షల కోసం ఢిల్లీలో శిక్షణ తీసుకున్నారు. ఆమెతో పాటు శిక్షణపొందిన అనేక మంది సీఐఎస్‌ఎఫ్‌లోకి అడుగుపెట్టారు. ఆ స్ఫూర్తితో ఆమె సీఐఎస్ఎఫ్ను ఎంచుకున్నారు. ‘శిక్షణలో పురుషులకు, స్త్రీలకు వేర్వేరు అంశాలు ఉండవు. ఈ నేపథ్యంలో మహిళలు మరింత కష్టపడాల్సి ఉంటుంది. సివిల్స్ రాసి ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారిగా దేశ సేవ చేయాలన్నది నా లక్ష్యం. అది సాధ్యం కాకుంటే సీఐఎస్ఎఫ్ ద్వారా సేవ చేస్తా’ అన్నారు స్నేహ. చదవండి: గుడ్‌న్యూస్.. ఈ ప్రొటీన్‌తో బట్టతల సమస్యకు శాశ్వత పరిష్కారం..! తండ్రిని చూసి స్ఫూర్తి పొంది... హర్యానా, రివాడీ జిల్లాకు చెందిన కీర్తి యాదవ్ తండ్రి ప్రతాప్ సింగ్ ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి. ప్రస్తుతం వారెంట్ ఆఫీసర్. కోల్‌కతాలోని సెయింట్ జేవియర్ కాలేజ్ నుంచి బీఎస్సీ కెమిస్ట్రీ (ఆనర్స్) చేశారామె. ఢిల్లీలో ఉండి సివిల్స్‌కు తర్ఫీదు పొందుతుండగా... సీఏపీఎఫ్ (సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్సెస్) ద్వారా నిసాలో అడుగుపెట్టారు. ‘నిసాలో శిక్షణ అనేక కొత్త విషయాలను నేర్పింది. సెప్టెంబర్‌లో జరిగిన వారం రోజుల గ్రేహౌండ్స్ శిక్షణలో జంగిల్ క్యాంప్ జరిగింది. ఆ సమయంలో తీవ్ర వర్షాలు కురుస్తుండటంతో టాస్క్ కష్టసాధ్యమైంది. నా టార్గెట్ సివిల్స్’ అని కీర్తి తెలిపారు. ఎన్సీసీలో సక్సెస్ కావడంతో... ఉత్తరప్రదేశ్, బదాయు ప్రాంతానికి చెందిన భూమిక వార్షినే అలహాబాద్ యూనివర్శిటీ నుంచి బీటెక్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్) చేశారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన భూమిక కళాశాల రోజుల నుంచి ఎన్సీసీలో కీలకంగా వ్యవహరించే వారు. ఈమె చూపిన ప్రతిభ ఫలితంగా యూత్ ఎక్సేంజ్ కార్యక్రమంలో శ్రీలంక వెళ్లి వచ్చారు. ఆ సమయంలోనే రక్షణ బలగాల్లో చేరాలని బలంగా నిర్ణయించుకున్నారు. ‘నిసాలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా. వార్షిక క్రీడా పోటీల్లో ఉత్తమ అథ్లెట్‌గా పీవీ సింధు చేతుల మీదుగా సత్కారం అందింది. శిక్షణలో చూపిన ప్రతిభతో పాసింగ్ ఔట్ పరేడ్‌లో ప్లటూన్ కమాండర్ అయ్యా. మహిళలకు స్ఫూర్తిదాయకంగా మారాలని, నన్ను చూసి మరింత మంది యువతులు సీఐఎస్‌ఎఫ్‌లోకి అడుగుపెట్టాలన్నదే నా లక్ష్యం’ అని భూమిక వివరించారు. ముగ్గురివీ అత్యత్తమ ర్యాంకులే... యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ (యూపీఎస్సీ) నిర్వహించిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్సెస్ (సీఏపీఎఫ్) పరీక్ష ద్వారా అసిస్టెంట్ కమాండెంట్స్ (ఏసీ) శిక్షణకు ఎంపికయ్యారు ఈ ముగ్గురూ. గతేడాది జరిగిన ఈ పరీక్షకు ఐదు లక్షల మందికి పైగా హాజరయ్యారు. అనేక వడపోతల తర్వాత 62 మంది నిసా వరకు వచ్చారు. ఈ పరీక్ష ఆలిండియా ర్యాంకుల్లో భూమికకు తొమ్మిది, కీర్తికి 26, స్నేహకు 52వ ర్యాంక్ లు వచ్చాయి. – శ్రీరంగం కామేష్, సిటీబ్యూరో, హైదరాబాద్ చదవండి: మెదడు ఆరోగ్యానికి మేలుచేసే చేపలు! స్ట్రోక్ సమస్యకు కూడా.. -
Civils Prilimanary Exam: నేడు సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష
సాక్షి, తిరుపతి: సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు ఆదివారం ఉదయం ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారు. ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించి తిరుపతిలో 16 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 7,201 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ఉదయం 9.30 నుంచి 11.30 వరకు.. మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 వరకు పరీక్షలు జరగనున్నాయి. జనవరి 7న మెయిన్స్ పరీక్ష జరగనుంది. అభ్యర్థులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అరగంట ముందుగా పరీక్షా కేంద్రం వద్దకు చేరుకోవాలని అధికారులు సూచించారు. బస్టాండ్ నుంచి పరీక్ష కేంద్రాలకు ప్రత్యేక బస్ సర్వీసులు నడుపుతున్నారు. ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. తెలంగాణ... తెలంగాణ వ్యాప్తంగా 53,015 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. హైదరాబాద్ లో 101 పరీక్ష కేంద్రాల్లో 46,953 మంది, వరంగల్‌లో 14 కేంద్రాల్లో 6,062 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. తెలంగాణ బస్ భవన్ ప్రెస్ నోట్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2021 కి హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత రవాణా అందించడానికి టీఎస్ఆర్టీసీ నిర్వహణ నిర్ణయం తీసుకుంది. అభ్యర్థులు తమ హాల్ టికెట్ చూపించడం ద్వారా హైదరాబాద్, వరంగల్‌లోని మూడు నగరాల్లోని మెట్రో, ఏసీ బస్సులతో సహా అన్ని రకాల సిటీ బస్సులలో ఈ ఉచిత రవాణా సేవను పొందవచ్చు అని తెలిపారు. ఈ క్రమంలో వీసీ సజ్జనార్ సివిల్ సర్వీస్ పరీక్ష -2021 కి హాజరయ్యే అభ్యర్థులకు టీఎస్ఆర్టీసీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది అన్నారు. -
యూపీఎస్సీ ఉద్యోగాలు.. ఆన్లైన్లో దరఖాస్తులు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ).. వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 59 ► పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ఇంజనీర్–12, సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్–02, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్–09, ప్రిన్సిపల్ సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్–01, అసిస్టెంట్ సర్వే ఆఫీసర్–04, స్టోర్స్ ఆఫీసర్–01,అసిస్టెంట్ డైరెక్టర్–30. ► విభాగాలు: నావల్ క్వాలిటీ అష్యూరెన్స్, నేవీ, జియోలాజికల్ సర్వే, ఎకనమిక్ ఇన్వెస్టిగేషన్. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. అనుభవం ఉండాలి. ► వయసు: పోస్టుల్ని అనుసరించి 30ఏళ్లు, 35ఏళ్లు మించకుండా ఉండాలి. ► ఎంపిక విధానం: రిక్రూట్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 14.10.2021 ► వెబ్సైట్: upsconline.nic.in శాయ్‌లో 12 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్).. అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► మొత్తం పోస్టుల సంఖ్య: 12 ► అర్హత: 2019లో యూపీఎస్సీ ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులు అర్హులు. ► వయసు: 01.08.2019 నాటికి 32ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. ► ఎంపిక విధానం: యూపీఎస్సీ మార్కులు, క్రీడా విజయాలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 11.10.2021 ► వెబ్సైట్: sportsauthorityofindia.nic.in -
Civils Ranker: ఎవరి కోసమూ ఎదురు చూడొద్దు..
సాక్షి, హైదరాబాద్: జీవితంలో సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదని, అలా అని అంత ఈజీగా ఏదీ దక్కదని సివిల్స్‌లో 20వ ర్యాంకు సాధించిన డాక్టర్ పొడిశెట్టి శ్రీజ అన్నారు. ఎంబీబీఎస్ పూర్తవ్వగానే తండ్రి శ్రీనివాస్ ప్రోత్సాహంతోనే ఐఏఎస్ కోచింగ్ తీసుకున్నట్లు తెలిపారు. సివిల్స్‌లో తాను 100 లోపు ర్యాంక్‌ను ఊహించానని ఇంత మంచి ర్యాంకు వస్తుందనుకోలేదని ఆనందం వ్యక్తం చేశారు. శనివారం ర్యాంకర్ శ్రీజ తన కెరియర్ విశేషాలను ‘సాక్షి’కి వివరించారు. అమ్మ ప్రేరణే డాక్టర్‌గా మలిచింది తన చిన్న తనంలోనే అమ్మ నర్సుగా సేవలందిస్తున్న అంశాలు తనను ప్రేరేపించడంతో ఎంబీబీఎస్ చేసి డాక్టరయ్యానని శ్రీజ తెలిపారు. విద్యాభ్యాసం రెండవ తరగతి నుంచి 10 వ తరగతి వరకు చైతన్యపురిలోని రఘునాథ హైస్కూల్లో, ఇంటర్ శ్రీ చైతన్య కళాశాలలో, ఎంబీబీఎస్ ఉస్మానియా యూనివర్సిటీ(2019)లో పూర్తి చేసినట్లు తెలిపారు. అక్కడి నుంచి సివిల్స్ కోచింగ్ ప్రిపరేషన్ ప్రారంభించానన్నారు. కూతురుకు మిఠాయి తినిపిస్తున్న శ్రీజ తల్లిదండ్రులు, శ్రీనివాస్, శ్రీలత, చిత్రంలో సోదరుడు సాయిరాజ్ మహిళా సాధికారతకు కృషి... డాక్టర్‌గా సేవలందించాలనుకున్న తనకు అమ్మతో పాటు నాన్న ప్రోత్సాహం తోడైందని..అక్కడ నుంచి తన సేవలను కొద్ది మందికి కాకుండా మరింత మందికి అందించాలన్న ఆశయంతో సివిల్స్ వైపు అడు గులు వేసినట్లు తెలిపారు. మహిళ ఉన్నత చదువు చదివితే ఆ ప్రభావం కుటుంబపై ఎలా చూపుతుందో తెలుసుకున్నట్లు తెలిపారు. మహిళా సాధికారతతోపాటు విద్యాభివృద్ధికి కృషిచేస్తానన్నారు. యువతకు సూచన ఎవ్వరూ తమను తాము తక్కువ అంచనా వేసుకోకూడదని, అందరూ సమర్థులేనని గుర్తించి ముందుకు సాగాలని శ్రీజ పేర్కొన్నారు. ఎవ్వరి ప్రోత్సా హం కోసం ఎదురు చూడొద్దని.. ఎవరికి వారు తమకు తాముగా ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగితే ఎలాంటి వాటినైనా సాధించుకోవచ్చన్నారు. సివిల్స్ ర్యాంకర్ డాక్టర్ పొడిశెట్టి శ్రీజ తండ్రి కల నెరవేర్చిన కూతురు చదువులో చురుగ్గా ఉండే శ్రీజ తన తండ్రి కోరిక మేరకు మొదటి ప్రయత్నంలోనే ఎంబీబీఎస్ సాధించడంతో తండ్రి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అంతటితో ఆగకుండా కూతురును ఐఏఎస్ చదివించాలనే కోరిక తండ్రిలో బలపడింది. అదే విషయాన్ని శ్రీజకు చెప్పి ఒప్పించాడు. అతి సాధారణ కుటుంబం నుంచి ఐఏఎస్ వరకు... అతి సాధారణ కుటుంబ నుంచి వచి్చను శ్రీజ సివిల్స్ బెస్ట్ ర్యాంక్ సాధించడంతో శ్రీనివాస్ స్నేహితులు చిలుకానగర్ డివిజన్ సాయినగర్‌కాలనీలో సంబరాలు చేసుకుంటున్నా రు. 20 సంవత్సరాల క్రితం నగరానికి వచ్చిన శ్రీనివాస్ పలు ఆటోమొబైల్ షోరూమ్స్‌లో పని చేశారు. ప్రస్తుతం ఉప్పల్ చిలుకానగర్ డివిజన్ పరిధిలో సాయినగర్‌లో డబుల్ బెడ్ రూం ఇంటిలో అద్దెకుంటున్నారు. శ్రీజకు ఓ సోదరుడు సాయిరాజ్ కూడా ఉన్నాడు. అతను బీబీఏ పూర్తి చేశాడు. -
పెళ్లికాని మహిళలు మాత్రమే అర్హులన్న UPSC
-
నేషనల్ డిఫెన్స్ పరీక్షలో అవివాహిత మహిళలకు చాన్స్
న్యూఢిల్లీ: నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ), నావల్ అకాడమీ పరీక్షకు అవివాహిత మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తెలిపింది. గత నెలలో సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు వారికి ఈ అవకాశం కల్పిస్తున్నట్లు శుక్రవారం యూపీఎస్సీ ఒక ప్రకటనలో వివరించింది. జాతీయత, వయస్సు, విద్య తదితర అంశాల్లో అర్హులైన అవివాహిత మహిళలు ఈనెల 24 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా మాత్రమే upsconline.nic.inలో పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. అక్టోబర్ 8వ తేదీ సాయంత్రం 6 గంటల తర్వాత వచ్చే దరఖాస్తులను స్వీకరించబోమని స్పష్టం చేసింది. మహిళా అభ్యర్థులకు పరీక్ష దరఖాస్తు రుసుము ఉండదని తెలిపింది. శారీరక దారుఢ్య ప్రమాణాలు, ఖాళీల సంఖ్యపై రక్షణ శాఖ నుంచి వివరాలు అందాక నోటిఫికేషన్ విడుదల చేస్తామని పేర్కొంది. పరీక్ష నవంబర్ 14వ తేదీన ఉంటుందని వివరించింది. -
సివిల్స్-2020 ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: సివిల్స్-2020 తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. మొత్తం 761 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. వీరిలో 545 మంది పురుషులు, 216 మంది మహిళలు ఉన్నారు. 263 మంది జనరల్, 229 ఓబీసీ, 122 ఎస్సీ, 61 ఎస్టీ, 86 మంది ఈడబ్య్లూఎస్ కేటగిరి అభ్యర్థులు ఎంపికయ్యారు. సివిల్స్-2020 తుది ఫలితాల్లో ఐఐటీ బాంబే నుంచి బీటెక్(సివిల్ ఇంజనీరింగ్) చేసిన శుభం కుమార్‌కు మొదటి ర్యాంకు రాగా, భోపాల్ నిట్ నుంచి బీటెక్(ఎలక్రికల్ ఇంజనీరింగ్) చేసిన జాగృతి అవస్తికి రెండో ర్యాంకు వచ్చింది. మహిళల విభాగంలో అవస్తి టాపర్‌గా నిలవడం విశేషం. కాగా ఈ ఏడాది జనవరిలో సివిల్ సర్వీసెస్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించిన అనంతరం శుక్రవారం సాయంత్రం తుది ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. ఇక సివిల్స్‌లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు ► పి. శ్రీజకు 20వ ర్యాంకు ►మైత్రేయి నాయుడుకు 27వ ర్యాంకు ►జగత్ సాయికి 32వ ర్యాంకు ►దేవగుడి మౌనికకు(కడప) 75వ ర్యాంకు ►రవి కుమార్‌కు 84వ ర్యాంకు ►యశ్వంత్ కుమార్ రెడ్డికి 93వ ర్యాంకు సివిల్స్-2020 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
సివిల్స్– 2021 ప్రిలిమ్స్ పరీక్ష.. ఈ నాలుగు సక్సెస్‌కు కీలకం
సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష... ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సహా 19 ఉన్నత స్థాయి సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే మూడంచెల ఎంపిక ప్రక్రియలో తొలిదశ! ప్రిలిమ్స్‌లో ప్రతిభ చూపితే.. సివిల్స్‌లో విజయం దిశగా మొదటి అడుగు పడినట్లే! ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా దాదాపు పది లక్షల మంది పోటీ పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి లక్ష మంది వరకూ దరఖాస్తు చేసుకున్నారని అంచనా! ఇంతటి తీవ్ర పోటీ నెలకొన్న సివిల్స్ ప్రిలిమ్స్‌లో గట్టెక్కి.. మలిదశ మెయిన్‌కు ఎంపికయ్యేందుకు అభ్యర్థులు ఎంతో శ్రమిస్తుంటారు. సివిల్స్ ప్రిలిమ్స్–2021 పరీక్ష.. అక్టోబర్ 10న జరుగనుంది. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో అభ్యర్థులు అనుసరించాల్సిన ప్రిపరేషన్ వ్యూహాలు, ఫోకస్ చేయాల్సిన అంశాలపై ప్రత్యేక కథనం... సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష.. అక్టోబర్ 10వ తేదీన జరగనుంది. అంటే.. అభ్యర్థులకు అందుబాటులో ఉన్న సమయం 33 రోజులు మా త్రమే. ప్రిలిమ్స్ అనే మైలురాయిని దాటేందుకు ఈ సమయం ఎంతో కీలకం. సివిల్స్ అభ్యర్థులు ఈ అమూల్యమైన సమయంలో ముఖ్యంగా నాలుగు విజయ సూత్రాలు పాటించాలి అంటున్నారు నిపు ణులు. అవి..విశ్లేషణాత్మక అధ్యయనం, పునశ్చరణ, సమయ పాలన, ప్రాక్టీస్. ఈ నాలుగు సూత్రాలు పక్కాగా అమలు చేస్తే..ప్రిలిమ్స్‌లో విజయావకా శాలు మెరుగుపరచుకోవచ్చని సూచిస్తున్నారు. సమయ పాలన ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో అభ్యర్థులకు టైం మేనేజ్మెంట్ చాలా అవసరం. జనరల్ స్టడీస్ పేపర్లో పేర్కొన్న ఏడు విభాగాలకు సంబంధించిన సిలబస్‌ను పరిశీలించి.. దానికి అనుగుణంగా ప్రతి సబ్జెక్ట్‌ను నిత్యం చదివేలా టైమ్ ప్లాన్ రూపొందించుకోవాలి. ప్రతి రోజు కనీసం ఎనిమిది నుంచి పది గంటల సమయం ప్రిపరేషన్‌కు కేటాయించాలి. దీంతోపాటు ప్రతి వారం అధ్యయనం పూర్తిచేసిన టాపిక్స్‌పై సెల్ఫ్ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లు రాయాలి. తద్వారా ఆయా అంశాలపై తమకు లభించిన అవగాహనను విశ్లేషించుకోవాలి. గత ప్రశ్న పత్రాల సాధన కూడా లాభిస్తుంది. కరెంట్ అఫైర్స్‌తో కలిపి సిలబస్‌లో పేర్కొన్న కోర్ టాపిక్స్‌ను కరెంట్ అఫైర్స్‌తో సమ్మిళితం చేసుకుంటూ చదవాలి. ఎందు కంటే.. ఇటీవల కాలంలో ప్రిలిమ్స్‌లో ప్రశ్నలు.. కరెంట్ అఫైర్స్ సమ్మిళితంగా అడుగుతున్నారు. కాబట్టి అభ్యర్థులు 2020 జూలై నుంచి 2021 జూలై వరకూ జరిగిన.. ముఖ్యమైన కరెంట్ ఈవెంట్స్‌పై దృష్టిపెట్టాలి. వాటిని సంబంధిత సబ్జెక్ట్ అంశాలతో అనుసంధానం చేసుకుంటూ అధ్యయనం చేయాలి. సంఘటనల నేపథ్యం, ప్రభావం, ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు అంచనా.. వంటి అంశాలను విశ్లేషించుకుంటూ చదవడం చాలా అవసరం. అనుసంధానం చేసుకుంటూ ప్రిలిమ్స్ ప్రిపరేషన్లో భాగంగా అభ్యర్థులు ఆయా సబ్జెక్ట్‌లను ఇతర సబ్జెక్ట్లతో అనుసంధానం చేసు కుంటూ చదవాలి. ముఖ్యంగా ఎకానమీ–పాలిటీ, ఎకానమీ–జాగ్రఫీ, జాగ్రఫీ–ఎకాలజీ; జాగ్రఫీ–సైన్స్ అండ్ టెక్నాలజీ, హిస్టరీ–పాలిటీ విభాగాలను అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. దీనివల్ల ప్రిపరేషన్ పరంగా ఎంతో విలువైన సమయం కలిసొస్తుంది. ఇలా మిగిలిన సమయంలో తాము క్లిష్టంగా భావించే.. ఇతర ముఖ్య టాపిక్స్‌పై దృష్టిపెట్టొచ్చు. ముఖ్యాంశాల గుర్తింపు ప్రస్తుతం సమయంలో..అభ్యర్థులు సబ్జెక్ట్ వారీగా ముఖ్యాంశాలను గుర్తించాలి. అందుకోసం గత నాలుగైదేళ్ల ప్రశ్న పత్రాలను పరిశీలించాలి. వాటిల్లో సబ్జెక్టుల వారీగా ఏఏ అంశాలకు ఎక్కువ ప్రాధా న్యం లభించిందో గుర్తించాలి. ఉదాహరణకు చరిత్రలో.. సాంస్కృతిక చరిత్ర, రాజ్య వంశాలు వంటి వి. అలాగే ఇంటర్నేషనల్ ఈవెంట్స్‌లో గత ఏడాది కాలంలో సంభవించిన ముఖ్యమైన పరిణామాలపై దృష్టి సారించాలి. ప్రధానంగా కరోనా పరిస్థితులు, ప్రపంచ వాణిజ్యంపై చూపిన ప్రభావం, వివిధ దేశాలు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలు ముఖ్యమైనవిగా గుర్తించాలి. అదే విధంగా..ఆయా దేశాల మధ్య ఒప్పందాలు–వాటి ఉద్దేశం–అంతర్జాతీయంగా, జాతీయంగా వాటి ప్రభావం తదితర అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి. కొత్త అంశాలు చదవాలా విస్తృతమైన సివిల్స్ సిలబస్ ప్రిపరేషన్ క్రమంలో అభ్యర్థులు కొన్ని టాపిక్స్‌ను వదిలేస్తుంటారు. అలా విస్మరించిన అంశాలను ఇప్పుడు చదవడం సరైందేనా.. అనే సందేహాన్ని చాలామంది అభ్య ర్థులు వ్యక్తం చేస్తుంటారు. గతంలో చదవకుండా వదిలేసిన టాపిక్స్‌లో కొరుకుడు పడని అంశాలుం టే.. అనవసర ఆందోళనకు దారితీస్తుంది. కాబట్టి విస్మరించిన అంశాలను ఇప్పుడు కొత్తగా చదవడం సరికాదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే పట్టు బిగించిన వాటినే మరింత లోతుగా అధ్యయనం చేయాలని సూచిస్తున్నారు. ఒకవేళ కొత్త అంశాలను చదవాల్సిన పరిస్థితి ఏర్పడితే.. కాన్సెప్ట్లపై అవగాహన పొందితే సరిపోతుంది. పేపర్–2కు కూడా సమయం అభ్యర్థులు పేపర్–2(సీశాట్)కు కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. దీన్ని అర్హత పేపర్‌గానే పేర్కొ న్నప్పటికీ.. ఇందులో 33 శాతం మార్కులు సాధి స్తేనే.. పేపర్–1 మూల్యాంకన చేస్తారు. దాని ఆధా రంగానే మెయిన్‌కు ఎంపిక చేస్తారు. పేపర్–2లో అర్హత మార్కులు సాధించేందుకు ప్రధానంగా మ్యాథమెటిక్స్, లాజికల్ రీజనింగ్ స్కిల్స్, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ అంశాలను ప్రాక్టీస్ చేయాలి. రెండుసార్లు రివిజన్ సిలబస్ అంశాల ప్రిపరేషన్ సెప్టెంబర్ చివరికల్లా పూర్తి చేసుకునేలా ప్లాన్ చేసుకోవాలి. ప్రతి రోజూ కొంత సమయం రివిజన్‌కు కేటాయిస్తూ.. ప్రతి సబ్జెక్ట్‌ను కనీసం రెండుసార్లు పునశ్చరణ చేయాలి. రివిజన్‌కు ఉపకరించేలా ప్రిపరేషన్ సమయంలోనే ఎప్పటికప్పుడు షార్ట్‌నోట్స్ రాసుకోవాలి. మెమొరీ టిప్స్ ప్రిపరేషన్ సమయంలో అభ్యర్థులు మెమొరీ టిప్స్ సాధన చేయాలి. పాయింటర్స్, ఫ్లో చార్ట్స్, విజువలైజేషన్ టెక్నిక్స్, అన్వయించుకోవడం వంటి వాటి ద్వారా మెమొరీ పెంచుకోవాలి. ఇలా ప్రతి విష యంలో నిర్దిష్ట వ్యూహంతో అడుగులు వేస్తే.. ప్రిలి మ్స్‌లో విజయావకాశాలు మెరుగుపరచుకోవచ్చు. సబ్జెక్ట్ వారీగా ఇలా కరెంట్ అఫైర్స్: కరోనా పరిణామాలు, అభివృద్ధి కారకాలపై చూపుతున్న ప్రభావం; గత ఏడాది కాలంలో ఆర్థిక ప్రగతికి సంబంధించిన గణాం కాలు; ముఖ్యమైన నియామకాలు; అంతర్జా తీయంగా పలు సంస్థల నివేదికల్లో భారత్‌కు సంబంధించిన గణాంకాలు. చరిత్ర: ఆధునిక భారత చరిత్ర; జాతీయోద్యమం; ప్రాచీన, మధ్యయుగ భారత చరిత్రకు సంబంధించి సాహిత్యం, కళలు, మత ఉద్యమాలు, రాజకీయ–సామాజిక–ఆర్థిక చారిత్రక అంశాలు. ఆధునిక చరిత్రలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన–పరిపాలన విధానాలు; బ్రిటిష్‌కు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లు–ఉద్యమాలు,సంస్కరణోద్యమాలు. ముఖ్యంగా స్వాతంత్య్ర పోరాటం. పాలిటీ: రాజ్యాంగం: రాజ్యాంగ పరిషత్, రాజ్యాం గ సవరణ ప్రక్రియ, పీఠిక, ఇప్పటివరకు జరిగిన ముఖ్య రాజ్యాంగ సవరణలు–వాటికి సంబంధించిన రాజ్యాంగ ప్రకరణలు. రాజకీయ వ్యవస్థ: పార్లమెంటరీ వ్యవస్థ, అర్థ సమాఖ్య, రాష్ట్రపతి,గవర్నర్, పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్నికల కమిషన్, ఆర్థిక కమిషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు,అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్ వంటి వాటికి సంబంధించి రాజ్యాంగ ప్రకరణలు. పంచాయతీరాజ్ వ్యవస్థ: బల్వంత్రాయ్, అశోక్‌మెహతా, హన్మంతరావ్, జి.వి.కె.రావ్, సింఘ్వీ కమిటీల సిఫార్సులు, 73వ రాజ్యాంగ సవరణ చట్టం. ప్రభుత్వ విధానాలు: విధానాల రూపకల్పన జరిగే తీరు; విధానాల అమలు, వాటి సమీక్ష; ఇటీవల ప్రభుత్వం తీసుకున్న ముఖ్య విధానపర నిర్ణయాలు; కేంద్ర–రాష్ట్ర సంబంధాలు; గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన న్యాయ వ్యవస్థ క్రియాశీలత. ఎకానమీ: ఆర్థికాభివృద్ధిలో సహజ వనరులు– మూలధన వనరుల పాత్ర. ► ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాల ప్రగతి(ముఖ్యంగా వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవారంగం వంటివి). ► ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో దేశంలో ఆర్థిక–సాంఘికాభివృద్ధి. ► పారిశ్రామిక తీర్మానాలు–వ్యవసాయ విధానం ► పంచవర్ష ప్రణాళికలు–ప్రణాళిక రచన–వనరుల కేటాయింపు–10, 11 పంచవర్ష ప్రణాళికలు ► బ్యాంకింగ్ రంగం ప్రగతి–సంస్కరణలు– ఇటీ వల కాలంలో బ్యాంకింగ్ రంగంలో స్కామ్‌లు, ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావం; ► తాజా మానవాభివృద్ధి, ప్రపంచ అభివృద్ధి నివేదికలు. సైన్స్ అండ్ టెక్నాలజీ: గత ఏడాది కాలంలో ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాలు; ఇటీవల కాలంలో సంక్రమిస్తున్న వ్యాధులు–కారకాలు; సైబర్ సెక్యూరిటీ యాక్ట్; రక్షణ రంగంలో కొత్త మిస్సైల్స్ ప్రయోగాలు; ముఖ్యమైన వన్యమృగ సంరక్షణ కేంద్రాలు–పర్యావరణ పరిరక్షణ ఒప్పందాలు, చర్యలు; వివిధ ఐటీ పాలసీలు. జాగ్రఫీ: జనగణనకు సంబంధించిన ముఖ్యాంశాలు; అత్యధిక, అత్యల్ప జనాభా కలిగిన రాష్ట్రాలు; అత్యధిక, అత్యల్ప జనసాంద్రత గల రాష్ట్రాలు; స్త్రీ, పురుష నిష్పత్తి; స్త్రీ, పురుష అక్షరాస్యత శాతం; గత పదేళ్లలో జనన, మరణ రేట్లు. పర్యావరణ సమస్యలు– ఎక్కువగా కేంద్రీకృతమైన ప్రాంతాలు, దేశాలు. ► సౌర వ్యవస్థ, భూమి అంతర్ నిర్మాణం, శిలలు, జియలాజికల్ టైం స్కేల్, రుతుపవనాలు, ప్రపంచ పవనాలు, చక్రవాతాలు, ఉష్ణోగ్రత విలోమం, భూకంపాలు, సునామీలు. ► మన దేశంలో నగరీకరణ; రుతుపవనాలు, నదులు; జలాల పంపిణీ; వివాదాలు. సివిల్స్ ప్రిలిమ్స్–2021 ముఖ్యాంశాలు ► మొత్తం పోస్ట్‌ల సంఖ్య: 712 ► ప్రిలిమినరీ పరీక్ష తేది: అక్టోబర్ 10, 2021 ► రెండు పేపర్లు.. 400 మార్కులకు పరీక్ష (ఒక్కో పేపర్‌కు 200 మార్కులు). ► ప్రిలిమ్స్‌లో ప్రతిభ ఆధారంగా 1:12 లేదా 1:12.5 నిష్పత్తిలో మలి దశ మెయిన్‌కు ఎంపిక ► తెలుగు రాష్ట్రాల్లో.. అనంతపురం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్‌లలో పరీక్ష కేంద్రాలు. -
కంటతడిపెట్టిన దీదీ.. కారణమిదే
కోల్‌కతా: కేంద్రప్రభుత్వ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కన్నీటి పర్యంతమయ్యారు. సెంట్రల్ పోలీస్ ఫోర్స్ సేవల కోసం పరీక్షలు నిర్వహించే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. తాను నిర్వహించే పరీక్షల్లో బీజేపీ అడగమన్న ప్రశ్నలే అడుగుతోందని.. ఈ చర్యలు దాని పునాదిని బలహీనపరుస్తున్నాయని మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. ఆ వివరాలు.. సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్‌లో సివిల్, సాయుధ పోలీసుల ఉద్యోగాల కోసం నిర్వహించే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) పరీక్షలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల హింసపై ప్రశ్న అడిగారు. ఈ అంశంపై స్పందిస్తూ.. మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. తమ రాష్ట్ర పరువు ప్రతిష్టలకు బీజేపీ తీవ్ర నష్టం కలిగిస్తుందంటూ దీదీ కంటతడిపెట్టారు. బీజేపీ అడగమన్న ప్రశ్నలనే యూపీఎస్సీ అడుగుతున్నదని మండిపడ్డారు. ‘‘బీజేపీ చెప్పిన ప్రశ్నలనే యూపీఎస్సీ అడుగుతుంది. యూపీఎస్సీ నిష్పక్షపాతంగా ఉండేది, కానీ ప్రస్తుతం బీజేపీ తాను అడగాలనుకున్న ప్రశ్నలను యూపీఎస్సీ బోర్డు చేత అడిగిస్తుంది. అలానే యూపీఎస్సీ పేపర్లో రైతుల నిరసనపై ప్రశ్న కూడా రాజకీయ ప్రేరేపితమే' అని మమతా బెనర్జీ విమర్శించారు. యూపీఎస్సీ వంటి సంస్థలను బీజేపీ నాశనం చేస్తోందని ఆమె ఆరోపించారు. బెంగాల్లో కరోనా ఆంక్షలను సడలిస్తున్నట్లు ప్రకటించిన సందర్భంగా మమత ఈ వ్యాఖ్యలు చేశారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో పెద్ద ఎత్తున హింస చేలరేగిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యకం చేసింది. మమతా బెనర్జీ కావాలనే తమ పార్టీ కార్యకర్తలను టార్గెట్ చేసి.. వారిపై దాడి చేయించారని బీజేపీ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను టీఎంసీ ఖండించింది. చిన్న గొడవలను బీజేపీ పెద్దదిగా చేసి చూపుతోందని.. ఫేక్ వీడియోలు, ఫోటోలతో జనాలను మోసం చేస్తుందని మండిపడింది. -
షాకింగ్: బైజూస్ రవీంద్రన్‌పై ఎఫ్ఐఆర్
సాక్షి,ముంబై: ప్రముఖ ఎడ్టెక్ కంపెనీ బైజూస్ కంపెనీ యజమాని మీద ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. యూపీఎస్సీ సిలబస్‌కు సంబంధించి తప్పుడు సమాచారాన్ని అందించారనే ఆరోపణలతో బైజూస్ యజమాని రవీంద్రన్ మీద ఎఫ్ఐఆర్ నమోదు అయింది. క్రిమోఫోబియా అనే సంస్థ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా నేరపూరిత కుట్ర, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 69 (ఎ) కింద జూలై 30 న ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ముంబై పోలీసులు తెలిపారు. బైజూస్ కంపెనీ యూపీఎస్సీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని అందించిందని క్రిమియోఫోబియా వ్యవస్థాపకుడు స్నేహిల్ ధాల్ ఆరోపించారు. యుపీఎస్సీ ప్రిపరేటరీ మెటీరియల్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)ను యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ట్రాన్స్‌నేషనల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ (యుఎన్‌టీఓసీ)కి నోడల్ ఏజెన్సీగా పేర్కొన్నట్లు తెలిపారు. ఈ విషయాన్నిగమనించిన వెంటనే కంపెనీకి అవసరమైన మార్పులు చేయమని కోరుతూ ఒక ఇ-మెయిల్ పంపామన్నారు. అయితే బైజూస్ సమాధానంపై సంతృప్తికంరంగా లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించినట్టు తెలిపారు. మరోవైపు ఈ ఫిర్యాదుపై బైజూస్ స్పందించింది. ఎఫ్ఐఆర్ కాపీని తమ న్యాయవాదులు పరిశీలిస్తున్నారని వెల్లడించారు. అలాగే క్రిమియోఫోబియా లేఖను కూడా ధృవీకరించిన సంస్థ తాము అందించిన మెటీరియల్ వాస్తవంగా సరైందనని భావిస్తున్నామన్నారు. దీనికి సంబంధించి హో మంత్రిత్వ శాఖ జారీ చేసిన బహిరంగంగా అందుబాటులో ఉన్న 2012, ఏప్రిల్ 30 నాటి అధికారిక కాపీని క్రిమియోఫోబియాకు షేర్ చేసినట్టు తెలిపారు. -
జర్నలిజంలో అనుభవం ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 1.42 లక్షల వేతనం
న్యూఢిల్లీ: కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖలో సీనియర్ గ్రేడ్ ఆఫ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ పోస్టుల(34 ఖాళీలు) భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. హిందీ/ఇంగ్లీష్‌లో మాస్టర్ డిగ్రీ లేదా జర్నలిజం/ మాస్ కమ్యూనికేషన్లో డిప్లోమా లేదా పీజీ డిప్లోమా ఉన్న వారిని అర్హులుగా ప్రకటించింది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌తో పాటు పలు భాషల్లో జర్నలిజంలో అనుభవం ఉన్నవారిని నియమించనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేసుకోవడానికి 2021 ఆగస్ట్ 12 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ https://www.upsc.gov.in/ లో చూడవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు https://upsconline.nic.in/ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసేముందు నోటిఫికేషన్ చదివి విద్యార్హతలు, వయసు తదితర అంశాలను తెలుసుకోవాలి. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీలు- 34 తెలుగు- 5 హిందీ- 9 ఇంగ్లీష్- 3 పంజాబీ- 3 ఒడియా- 3 బెంగాలీ- 1 మరాఠీ- 5 గుజరాతీ- 1 అస్సామీ- 2 మణిపూరి- 2 పోస్టులు: సీనియర్ గ్రేడ్ ఆఫ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ సంఖ్య: 34 దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్ట్ 12, 2021 విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ లేదా జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్లో డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అనుభవం: ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయంప్రతిపత్తిగల సంస్థలు, లిస్టెడ్ ప్రైవేట్ సంస్థలకు చెందిన న్యూస్ ఏజెన్సీ, న్యూస్పేపర్లో జర్నలిజం, పబ్లిసిటీ, పబ్లిక్ రిలేషన్ విభాగాల్లో రెండేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. వయస్సు: 30 ఏళ్ల లోపు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది. వేతనం: ఏడో పే కమిషన్‌లో లెవెల్ 7 పే స్కేల్ వర్తిస్తుంది. అంటే రూ.44,900 బేసిక్ వేతనంతో మొత్తం రూ.1,42,400 వేతనం లభిస్తుంది. -
ఎంబీబీఎస్‌తో.. కేంద్ర ప్రభుత్వ కొలువు
ఎంబీబీఎస్ అర్హతతో.. కేంద్ర ప్రభుత్వ కొలువుకు మార్గం.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే.. కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎంఎస్ఈ)! ఈ పరీక్షలో విజయం సాధించి.. ఆ తర్వాత ఇంటర్వ్యూలోనూ ప్రతిభ చూపితే.. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పలు శాఖల్లో కొలువు సొంతమవుతుంది. అంతేకాకుండా రూ.56,100–1,77,500 వేతన శ్రేణి అందుకోవచ్చు. ఇటీవల యూపీఎస్సీ సీఎంఎస్ఈ–2021 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. సీఎంఎస్ఈ పరీక్ష వివరాలు, అర్హతలు, ఎంపిక విధానం, పరీక్షలో విజయానికి ప్రిపరేషన్ గైడెన్స్.. ఎంబీబీఎస్‌లో చేరిన విద్యార్థులు.. వైద్య రంగంలో ఉన్నత కెరీర్ సొంతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. అందుకోసం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంబీబీఎస్ తర్వాత స్పెషలైజేషన్లు చదవాల్సిన ఆవశ్యకత నెలకొంది. కాని యూపీఎస్సీ నిర్వహించే సీఎంఎస్ఈ ద్వారా ఎంబీబీఎస్ చివరి సంవత్సరంలో ఉన్నప్పుడే కేంద్ర కొలువుల సాధన దిశగా అడుగులు వేయొచ్చు. మొత్తం పోస్టుల సంఖ్య 838 యూపీఎస్సీ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం–కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నాలుగు విభాగాల్లో రెండు కేటగిరీలుగా మొత్తం 838 వైద్యుల పోస్ట్‌లు భర్తీ చేయనున్నారు. కేటగిరీ–1: సెంట్రల్ హెల్త్ సర్వీస్‌లో జూనియర్ స్కేల్ పోస్ట్‌లు – 349. కేటగిరీ–2: రైల్వేస్‌లో అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ పోస్ట్‌లు–300. ► న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్లో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్ట్‌లు–5. ► ఈస్ట్, నార్త్, సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లలో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్(గ్రేడ్–2) పోస్ట్‌లు –184. అర్హత ► ఎంబీబీఎస్ ఫైనల్ రాత పరీక్షలు, ప్రాక్టికల్స్ ఉత్తీర్ణులై ఉండాలి. ► చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు ఇంటర్వ్యూ సమయానికి సర్టిఫికెట్లు చూపించాల్సి ఉంటుంది. ► కంపల్సరీ రొటేటింగ్ ఇంటర్న్‌షిప్‌లో ఉన్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి ఇంటర్న్‌షిప్ పూర్తయ్యాకే అపాయింట్మెంట్ ఖరారు చేస్తారు. వయో పరిమితి ► ఆగస్ట్ 1, 2021 నాటికి 32ఏళ్లు మించకూడదు. ► సెంట్రల్ హెల్త్ సర్వీసెస్‌లో జూనియర్ టైమ్ స్కేల్ పోస్ట్‌ల అభ్యర్థులకు ఆగస్ట్ 1,2021 నాటికి 35ఏళ్లు మించకూడదు. ► ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. వేతనాలు ► ఇండియన్ రైల్వేలో అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్‌గా గ్రూప్–ఎ జూనియర్ స్కేల్‌తో.. రూ.56,100–రూ.1,77,500 వేతన శ్రేణితో ప్రారంభ వేతనం లభిస్తుంది. ► సెంట్రల్ హెల్త్ సర్వీస్,ఇతర విభాగాల్లోనూ ఇదే వేతన శ్రేణితో ప్రారంభ వేతనం అందుతుంది. ► ఆయా విభాగాల్లో సర్వీస్‌లో చేరిన అభ్యర్థులు నిర్దిష్ట కాలంపాటు ప్రొబేషన్గా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ప్రొబేషన్ పిరియడ్‌లో సంతృప్తికరమైన పనితీరు కనబర్చిన వారికే శాశ్వత కొలువు ఖరారవుతుంది. రెండంచెల ఎంపిక ప్రక్రియ ► కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ పోస్ట్‌ల భర్తీకి రెండంచెల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ► తొలి దశలో సీఎంఎస్ఈ రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో నిర్దిష్ట కటాఫ్‌లు సొంతం చేసుకున్న వారితో మెరిట్ జాబితా రూపొందించి..ఒక్కో పోస్ట్‌కు ఇద్దరు చొప్పున పర్సనాలిటీ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. పర్సనాలిటీ టెస్ట్‌లోనూ విజయం సాధిస్తే.. తుది విజేతల జాబితాలో నిలిచి కొలువు ఖాయం చేసుకున్నట్లే! రాత పరీక్ష.. 500 మార్కులు ► సీఎంఎస్ఈ ఎంపిక ప్రక్రియలో తొలిదశ రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లు ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కు 250 మార్కులు చొప్పున 500 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ► పేపర్–1: జనరల్ మెడిసిన్ అండ్ పిడియాట్రిక్స్. ఈ పేపర్లో జనరల్ మెడిసిన్ నుంచి 96 ప్రశ్నలు, పిడియాట్రిక్స్ నుంచి 24 ప్రశ్నలు చొప్పున మొత్తం 120 ప్రశ్నలు అడుగుతారు. ► పేపర్–2ను మూడు భాగాలుగా వర్గీకరించారు. అవి..ఎ)సర్జరీ; బి)గైనకాలజీ అండ్ ఆబ్స్టెట్రిక్స్; సి)ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్. ► ఒక్కో విభాగం నుంచి 40 ప్రశ్నలు అడుగుతారు. మొత్తం మార్కులు 120. ► నెగెటివ్ మార్కుల విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి సదరు ప్రశ్నకు కేటాయించిన మార్కుల నుంచి 1/3ను తగ్గిస్తారు. చివరి దశ.. పర్సనాలిటీ టెస్ట్ ► అయిదు వందల మార్కులకు నిర్వహించే రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా.. చివరి దశలో అభ్యర్థులకు పర్సనాలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. ఆయా శాఖల్లోని పోస్ట్‌ల సంఖ్యను అనుసరించి.. 1:2 లేదా 1:2.5 నిష్పత్తిలో పర్సనాలిటీ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. ఈ పర్సనాలిటీ టెస్ట్‌లో అభ్యర్థుల్లోని జనరల్ నాలెడ్జ్‌ను, వైద్యరంగం పట్ల వారికున్న ఆసక్తిని, సేవాదృక్పథాన్ని, వ్యక్తిత్వాన్ని, నాయకత్వ లక్షణాలను పరిశీలిస్తారు. ఇందులోనూ ప్రతిభ చూపితే తుది ఎంపిక ఖరారవుతుంది. సర్వీసు ప్రాధాన్యత అవకాశం ► సీఎంఎస్ఈ రాత పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులు.. ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు దరఖాస్తు చేసుకునే డిటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్‌లో తమకు ఆసక్తి ఉన్న సర్వీసుల ప్రాధాన్యతను వరుస క్రమంలో పేర్కొనొచ్చు. తుది విజేతల జాబితాను రూపొందించేటప్పుడు ఈ ప్రాధాన్యతలను, అభ్యర్థులు పొందిన మార్కు లను బేరీజు వేస్తూ ఆయా విభాగాల కేటాయింపులో తుది నిర్ణయం తీసుకుంటారు. సీఎంఎస్ఈ–2021 ముఖ్య సమాచారం ► మొత్తం పోస్టుల సంఖ్య: 838 ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ:జూలై 27,2021 ► ఆన్లైన్ దరఖాస్తు ఉపసంహరణకు అవకాశం: ఆగస్ట్ 3–ఆగస్ట్ 9 ► సీఎంఎస్ఈ పరీక్ష తేదీ: నవంబర్ 21, 2021 ► తెలుగు రాష్ట్రాల్లో రాత పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం. ► వివరాలకు వెబ్సైట్: www.upsc.gov.in ► ఆన్లైన్ దరఖాస్తు వెబ్సైట్: https://upsconline.nic.in రాత పరీక్షలో విజయానికి ► పేపర్–1(జనరల్ మెడిసిన్, పిడియాట్రిక్స్) లో..కార్డియాలజీ, రెస్పిరేటరీ డిసీజెస్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్, జెనిటో యూరినరీ, న్యూరాలజీ, హెమటాలజీ, ఎండోక్రైనాలజీ, మెటాబాలిక్ డిసీజెస్, ఇన్ఫెక్షన్స్–కమ్యూనికబుల్ డిసీజెస్, న్యూట్రిషన్/గ్రోత్, డెర్మటాలజీ, మస్కులోస్కెలిటిల్ సిస్టమ్,సైకియాట్రీ, జనరల్ అంశాలపై పట్టు సాధించాలి. దీంతోపాటు పిడియాట్రిక్స్‌కు సంబంధించి.. కామన్ చైల్డ్‌హుడ్ ఎమర్జెన్సీస్, బేసిక్∙న్యూబార్న్‌కేర్, నార్మల్ డెవలప్మెంటల్ మైల్‌స్టోన్స్, ఇమ్యునైజేషన్ ఇన్ చిల్డ్రన్, ప్రత్యేక అవసరాలున్న చిన్నారులను గుర్తించడం, వారికి చికిత్స మార్గాలు తదితర అంశాలపై అభ్యర్థులు దృష్టిపెట్టాలి. పేపర్–2కు ఇలా ► పేపర్–2లోని మూడు విభాగాలకు సంబంధించి దృష్టి పెట్టాల్సిన అంశాలు.. ► సర్జరీ: జనరల్ సర్జరీకి సంబంధించి గాయా లు, కాలేయం, రక్త నాళాలు, పేగులు, కణితులు, ఉదర సంబంధ సమస్యలు తదితరాలకు సంబంధించిన శస్త్రచికిత్స అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటితోపాటు యూరాలజికల్ సర్జరీ, న్యూరో సర్జరీ, ఈఎన్టీ సర్జరీ, థొరాసిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, ఆప్తమాలజీ, అనస్థీషియాలజీ, ట్రామటాలజీ అంశాలను అవపోసన పట్టాలి. ► గైనకాలజీ అండ్ ఆబ్స్టెట్రిక్స్: గైనకాలజీలో అప్లయిడ్ అనాటమీ, అప్లయిడ్ ఫిజియాలజీ, జెనిటల్ ట్రాక్ట్‌లో ఇన్ఫెక్షన్లు, నియోప్లాస్మా, గర్భాశయం స్థానంలో మార్పులు, కన్వెన్షనల్ కాంట్రాసెప్టివ్స్, యూడీ, ఓరల్ పిల్స్, ఆపరేటివ్ ప్రొసీజర్, మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంశాలపై దృష్టి సారించాలి. ► ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్: సోషల్ అండ్ కమ్యూనిటీ మెడిసిన్, కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్, డిసీజ్, ప్రివెంటివ్ మెడిసిన్, హెల్త్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ప్లానింగ్, డెమోగ్రఫీ అండ్ హెల్త్ స్టాటిస్టిక్స్, ఎన్విరాన్మెంటల్ హెల్త్, న్యూట్రిషన్ అండ్ హెల్త్, ఆక్యుపేషనల్ హెల్త్, జెనిటిక్స్ అండ్ హెల్త్, ఇంటర్నేషనల్ హెల్త్, మెడికల్ సోషియాలజీ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్, మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్, నేషనల్ ప్రోగ్రామ్స్ అంశాలపై ప్రత్యేక శ్రద్ధతో చదవాలి. అకడమిక్ పుస్తకాలు ఆలంబనగా రాత పరీక్షలో మెరుగ్గా రాణించడానికి అభ్యర్థులు తమ అకడమిక్ పుస్తకాలనే ఆలంబనగా చేసుకుని ముందడుగు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. సిలబస్‌ను పరిశీలించి.. అకడమిక్స్‌లోని అంశాలతో బేరీజు వేసుకుంటూ.. అప్లికేషన్ దృక్పథంతో చదవాలి. పాత ప్రశ్న పత్రాల సాధన కూడా ఎంతో ఉపకరిస్తుంది. -
ఈ కథ ఎంతోమందికి ప్రేరణ.. 6 నెలల పాటు గదిలో బంధించుకుని
వెబ్‌డెస్క్: ప్రభుత్వ ఉద్యోగం అంటే యువతలో చాలా క్రేజ్. అందులోనూ ఐఏఎస్ అంటే ఇక మరి చెప్పనక్కర్లేదు. వందల్లో ఉండే పోస్టులకు ఏటా లక్షల్లో అప్లై చేస్తుంటారు. కానీ కొందరు మాత్రమే ఉద్యోగం సాధిస్తారు. లక్షల మంది అప్లై చేస్తే.. కొందరిని మాత్రమే విజయం వరిస్తుంది. ఎందుకంటే కలల కొలువు కోసం వారు అహర్నిశలు శ్రమిస్తారు. స్నేహితులు, సరదాలు ఏం ఉండవు. వారి ధ్యాస అంత తమ ధ్యేయం మీదనే ఉంటుంది. ఈ క్రమంలో కొలువు సాధించడం కోసం కొందరు అందరికి భిన్నంగా ప్రయత్నిస్తారు. ఈ కోవకు చెందిన వారే హరియాణా గురుగ్రామ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి నిధి సివాచ్. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలు కనే ప్రతి ఒక్కరికి ఆమె కథ ప్రేరణగా నిలుస్తుంది. ఆ వివారలు.. గురుగ్రామ్‌కు చెందిన నిధి సివాచ్ చదువులో ఎప్పుడు ముందుండేవారు. పదో తరగతి, ఇంటర్మీడియెట్‌లో 95, 90 శాతం మార్కులు సాధించారు. హరియాణ సోనిపాట్‌లోని దీనబంధు ఛోటురామ్ యూనివర్శిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. చదువు పూర్తయిన వెంటనే నిధికి హైదరాబాద్ టెక్ మహీంద్రాలో డిజైన్ ఇంజనీర్‌గా ఉద్యోగం వచ్చింది. కొన్నాళ్లపాటు జాబ్ చేసినప్పటికి ఆమెకు సంతృప్తి లేకపోయింది. ఐఏఎస్ కావాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో 2017లో జాబ్‌కు రాజీనామా చేసి.. యూపీఎస్సీకి చదవడం ప్రారంభించారు. ఇంగ్లీష్ మీడియంలో పరీక్ష రాయాలని భావించారు నిధి. ఆప్షనల్ సబ్జెక్ట్‌గా చరిత్రను ఎంచుకున్నారు. తాను తొమ్మిది, పదో తరగతిలో చదివని సిలబస్ యూపీఎస్సీ ప్రిపరేషన్‌కు ఎంతో మేలు చేస్తుందని భావించి.. చరిత్రను ఆప్షనల్ సబ్జెక్ట్‌గా ఎంచుకున్నారు నిధి. మొదటి రెండు ప్రయత్నాల్లో విజయం సాధించలేకపోయారు నిధి. ఓటమి ఆమెలో మరింత కసిని పెంచింది. ఈసారి తప్పకుండా ఉద్యోగం సాధించాలని బలంగా నిర్ణయించుకున్నారు. దానికోసం నిధి పెద్ద సాహసమే చేశారని చెప్పవచ్చు. మూడో సారి తన ప్రిపేరషన్ పంథాను పూర్తిగా మార్చేశారు నిధి. తనను తాను 6 నెలల పాటు గదిలో బంధించేసుకున్నారు. వేరే దేని మీదకు తన ధ్యాస మళ్లకుండా రూమ్‌కే పరిమితయ్యారు. కుటుంబ సభ్యులు ఆమెకు కావాల్సిన ఆహారం, ఇతర వస్తువులు అందించేవారు. అలా ఆరు నెలల పాటు రూమ్‌కే అంకితం అయ్యి.. శ్రద్ధగా చదివిన నిధిని చూసి ఓటమి పారిపోయింది. ఈసారి ఏకంగా ఆల్ ఇండియా లెవల్లో 87వ ర్యాంకు సాధించారు నిధి. ప్రస్తుతం ఆమె గుజరాత్లో ఐఏఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. కోరుకున్న ఉద్యోగం కోసం ఆమె చేసిన ప్రయత్నం ఎందరికో ప్రేరణగా నిలుస్తుంది. -
యూపీఎస్సీ–కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2021
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ).. 838 పోస్టుల భర్తీకి కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్–2021 నోటిఫికేషన్ విడుదల చేసింది. ► కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2021 ► మొత్తం పోస్టుల సంఖ్య: 838 పోస్టుల వివరాలు ► కేటగిరీ–1: సెంట్రల్ హెల్త్ సర్వీస్‌లో జూనియర్ స్కేల్ పోస్టులు– 349. ► కేటగిరీ–2: రైల్వేలో అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్–300. –న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్లో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్–05. –జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్2 (ఈడీఎంసీ, ఎన్డీఎంసీ,ఎస్డీఎంసీ)–184. ► అర్హతలు: ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి ఉండాలి. ఎంబీబీఎస్ ఫైనల్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ► వయసు: 01.08.2021 నాటికి 32ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. ► ఎంపిక విధానం: రాత పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 27.07.2021 ► రాత పరీక్ష తేది: 21.11.2021 వెబ్సైట్: https://www.upsc.gov.in -
ఇంటర్‌తోనే.. కొలువు + చదువు
ఇంటర్మీడియెట్ పూర్తి చేసుకొని.. ఉన్నత కొలువుతోపాటు చదువు కూడా కొనసాగించాలనుకునే వారికి చక్కటి అవకాశం.. యూపీఎస్సీ ఎన్డీఏ, ఎన్ఏ ఎగ్జామినేషన్! ఈ పరీక్షలో ప్రతిభ చూపితే త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో పర్మనెంట్ కమిషన్డ్ ర్యాంకు హోదాతో ఉన్నత ఉద్యోగం లభిస్తుంది! 21 లేదా 22ఏళ్ల వయసులోనే.. త్రివిధ దళాల్లో అడుగుపెట్టి.. ఉజ్వల కెరీర్ సొంతం చేసుకోవచ్చు!! శిక్షణ సమయంలోనే నెలకు రూ.56వేలకుపైగా అందుకోవచ్చు. తాజాగా ఎన్డీఏ,ఎన్ఏ(2)–2021కు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. ఎన్డీఏ, ఎన్ఏ వివరాలు, పరీక్ష విధానం, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్, శిక్షణ, కెరీర్ స్కోప్‌పై ప్రత్యేక కథనం.. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీలను సంక్షిప్తంగా ఎన్డీఏ, ఎన్ఏగా పేర్కొంటారు. ఉత్సాహవంతులైన, సాహసవంతులైన యువతను త్రివిధ దళాలకు ఎంపిక చేసే ఉద్దేశంతో యూపీఎస్సీ ఏటా రెండుసార్లు ఎన్డీఏ, ఎన్ఏ నోటిఫికేషన్ విడుదల చేస్తోంది. ఇంటర్మీడియెట్ అర్హతతోనే ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైతే ఎన్డీఏ, ఎన్ఏ అకాడమీల్లో శిక్షణ పూర్తయ్యాక ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, నేవల్ అకాడమీలలో పర్మనెంట్ కమిషన్డ్ ర్యాంకుతో ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంటర్మీడియెట్ పూర్తి చేసుకున్న విద్యార్థులు.. ఒకే సమయంలో కొలువుతోపాటు బీఏ/బీఎస్సీ/బీటెక్ పట్టాను సొంతం చేసుకునేందుకు మార్గం ఎన్డీఏ, ఎన్ఏ పరీక్ష. ► మొత్తం ఖాళీల సంఖ్య: 400 ► నేషనల్ డిఫెన్స్ అకాడెమీ: 370 (ఆర్మీ–208; నేవీ–42; ఎయిర్ ఫోర్స్–120) ► నేవల్ అకాడమీ:10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్:30 ► ఎయిర్ ఫోర్స్ అకాడమీకి కేటాయించిన ఖాళీ ల్లో 28 ఖాళీలను గ్రౌండ్ డ్యూటీ విభాగంలో భర్తీ చేస్తారు. అర్హతలు ► ఆర్మీ వింగ్: ఏ గ్రూప్‌లోనైనా ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులవ్వాలి. ► ఎయిర్‌ఫోర్స్, నేవీ, నేవల్ అకాడమీ: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్లతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత ఉండాలి. ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. ► వయోపరిమితి: జనవరి 2,2003–జనవరి 1, 2006 మధ్యలో జన్మించి ఉండాలి. రెండంచెల ఎంపిక ప్రక్రియ ► ఎన్డీఏ, ఎన్ఏ ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది. ముందుగా యూపీఎస్సీ.. ఎన్డీఏ, ఎన్ఏ రాత పరీక్షను నిర్వహిస్తుంది. ఇందులో చూపిన ప్రతిభ ఆధారంగా.. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో పేర్కొన్న ప్రాథమ్యాలను పరిగణనలోకి తీసుకొని.. మెరిట్ జాబితా రూపొందిస్తారు. వీరికి తదుపరి దశలో ఎస్ఎస్బీ ఆధ్వర్యంలో ఇంటెలిజెన్స్–పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది. ► ఎన్డీఏ, ఎన్ఏ రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతాయి. పేపర్ 1–మ్యాథమెటిక్స్–300 మార్కులకు; పేపర్ 2–జనరల్ ఎబిలిటీ టెస్ట్–600 మార్కులకు నిర్వహిస్తారు. ఇలా మొత్తం 900 మార్కులకు రాత పరీక్ష జరుగుతుంది. ఒక్కో పేపర్‌కు పరీక్ష సమయం రెండున్నర గంటలు. ► జనరల్ ఎబిలిటీ టెస్ట్‌లో.. పార్ట్–ఎలో ఇంగ్లిష్ 200 మార్కులకు; పార్ట్–బీలో 400 మార్కులకు జనరల్ నాలెడ్జ్ పరీక్ష ఉంటుంది. ► పేపర్–2 పార్ట్–బిలో మొత్తం ఆరు విభాగాలు (ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్ సైన్స్, హిస్టరీ, భారత స్వాతంత్య్రోద్యమం, జాగ్రఫీ; కరెంట్ ఈవెంట్స్) నుంచి ప్రశ్నలడుగుతారు. ఫిజిక్స్‌కు 25 శాతం; కెమిస్ట్రీకి 15శాతం, జనరల్ సైన్స్‌కు 10 శాతం, హిస్టరీ,స్వాతంత్య్రోద్యమానికి 20 శాతం, జాగ్రఫీకి 20 శాతం, కరెంట్ ఈవెంట్స్‌కు పది శాతం వెయిటేజీ ఉంది. పేపర్–1, పేపర్–2లలో నిర్దేశిత కటాఫ్ మార్కులు సాధించిన వారిని తదుపరి దశకు ఎంపిక చేస్తారు. మలి దశ.. ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ ► ఎన్డీఏ, ఎన్ఏ రాత పరీక్షలో విజయం సాధించి.. మెరిట్ జాబితాలో నిలిచిన అభ్యర్థులకు మలిదశలో 900 మార్కులకు ఎస్ఎస్బీ టెస్ట్/ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ► అభ్యర్థులు దరఖాస్తు సమయంలో పేర్కొన్న ప్రాథమ్యాలు, రాత పరీక్షలో పొందిన మెరిట్ ఆధారంగా.. ఎస్ఎస్బీ(సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్) నిర్వహించే ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్‌లోనూ నెగ్గాల్సి ఉంటుంది. ఎయిర్‌ఫోర్స్ విభాగాన్ని ఎంపిక చేసుకున్న అభ్యర్థులు.. కంప్యూటరైజ్డ్ పైలట్ సెలక్షన్ సిస్టమ్‌లో కూడా విజయం సాధించాలి. ► ఎస్ఎస్బీ ఎంపిక ప్రక్రియలో భాగంగా ఇంటెలిజెన్స్ టెస్ట్, వెర్బల్ టెస్ట్, నాన్ వెర్బల్ లెస్ట్, సామాజిక అంశాలపై ఉన్న అవగాహన, తార్కిక విశ్లేషణ సామర్థ్యాలను పరీక్షిస్తారు. అదే విధగా పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ నిర్వహిస్తారు. మొత్తం అయిదు రోజులపాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్డీఏ, ఎన్ఏలో శిక్షణ ఎన్డీఏ, ఎన్ఏ ఎంపిక ప్రక్రియ రెండు దశల్లోనూ విజయం సాధించి.. తుది జాబితాలో నిలిచిన అభ్యర్థులకు వారు ఎంచుకున్న విభాగం ఆధారంగా శిక్షణ ఉంటుంది. తొలుత నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ)లో మూడేళ్లపాటు శిక్షణ ఇస్తారు. మొదటి రెండున్నర సంవత్సరాలు అన్ని విభాగాల అభ్యర్థులకు ఉమ్మడి శిక్షణ ఉంటుంది. చివరి ఆరు నెలలు అభ్యర్థులు ఎంపికైన విభాగం ఆధారంగా ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తారు. ఇలా మొత్తం మూడేళ్ల శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు వారు ఎంపిక చేసుకున్న కోర్సు ఆధారంగా జేఎన్‌యూ–ఢిల్లీ.. బీఏ, బీఎస్సీ, బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) డిగ్రీలను అందిస్తుంది. ఎయిర్‌ఫోర్స్, నేవల్ విభాగాలను ఎంచుకున్న వారికి బీటెక్ పట్టా లభిస్తుంది. నేవల్ అకాడెమీ 10+2 క్యాడెట్ ఎంట్రీ ఎన్ఏ 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌కు ఎంపికైన వారికి నేవల్ అకాడమీ(ఎజిమల)లో నాలుగేళ్లపాటు ప్రత్యేకంగా శిక్షణనిస్తారు. ఆ తర్వాత వీరికి అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, నేవల్ ఆర్కిటెక్చర్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్రాంచ్‌లలో ఏదో ఒక బ్రాంచ్‌తో బీటెక్ సర్టిఫికెట్ అందిస్తారు. ఫిజికల్ ట్రైనింగ్ ఎన్డీఏలో మూడేళ్ల శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఎంపికైన విభాగంలో మళ్లీ ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుంది. ఆర్మీ క్యాడెట్లకు ఐఎంఏ(డెహ్రాడూన్), నేవీ క్యాడెట్స్‌కు నేవల్ అకాడమీ(ఎజిమల), ఎయిర్‌ఫోర్స్ క్యాడెట్లకు ఎయిర్‌ఫోర్స్ అకాడమీ(హైదరాబాద్)లలో ఫీల్డ్ ట్రైనింగ్ ఇస్తారు. శిక్షణ సమయంలో రూ.56,100 స్టయిఫండ్‌గా లభిస్తుంది. ఫీల్డ్ ట్రైనింగ్ కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి రూ.56,100–1,77,500 వేతన శ్రేణితో కెరీర్ ప్రారంభం అవుతుంది. ప్రాథమికంగా ఆర్మీ విభాగంలో లెఫ్ట్‌నెంట్, నేవీ విభాగంలో సబ్ లెఫ్ట్‌నెంట్, ఎయిర్‌ఫోర్స్ విభాగంలో ఫ్లయింగ్ ఆఫీసర్ కేడర్‌తో కెరీర్ ప్రారంభమవుతుంది. రాత పరీక్షలో విజయం ఇలా ► ఎన్డీఏ, ఎన్ఏ రాత పరీక్షలో విజయం సాధించాలంటే.. అభ్యర్థులు సిలబస్‌పై పట్టు సాధించాల్సి ఉంటుంది. ► పూర్తిగా కాన్సెప్ట్ ఆధారితంగా ఉండే పేపర్–1 (మ్యాథమెటిక్స్)లో మంచి మార్కుల కోసం అల్జీబ్రా, మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్, అనలిటికల్ జామెట్రీ, ఇంటిగ్రల్ కాలిక్యులస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, వెక్టార్ అల్జీబ్రా, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, ట్రిగ్నోమెట్రీ అంశాలపై పట్టు సాధించాలి. ఇందుకోసం ఇంటర్మీడియెట్ స్థాయి పుస్తకాలను అధ్యయనం చేయాలి. ప్రాక్టీస్ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లు రాయడం మేలు చేస్తుంది. ప్రశ్నలన్నీ కాన్సెప్ట్ బేస్డ్గా ఉంటాయి. కాబట్టి బేసిక్స్‌పై స్పష్టత, ఫార్ములాలపై అవగాహన పెంచుకోవాలి. ప్రాక్టీస్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ► పేపర్–2 జనరల్ ఎబిలిటీలో రాణించేందుకు బేసిక్ ఇంగ్లిష్, గ్రామర్, వొకాబ్యులరీ రీడింగ్ కాంప్రహెన్షన్‌లపై పట్టు సాధించాలి. ► జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించి..ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్ సైన్స్, చరిత్ర–భారత స్వాతంత్య్రోద్యమం, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్‌లపై అవగాహన చేసుకోవాలి. పాత ప్రశ్న పత్రాలు, ఆయా విభాగాలకు ఇచ్చిన వెయిటేజీ ఆధారంగా ప్రిపరేషన్ ప్రణాళిక రూపొందించుకోవాలి. ► ఫిజిక్స్‌లో ఎలక్ట్రోమాగ్నటిజం, మెకానిక్స్, డైనమిక్స్‌లోని అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ► కెమిస్ట్రీలో కెమికల్ అనాలసిస్,ఇనార్గానిక్ కాంపౌండ్స్, పిరియాడిక్ టేబుల్స్, కాన్సెప్ట్ ఆఫ్ ఫిజికల్ కెమిస్ట్రీ, ఈక్విలిబ్రియమ్, థర్మోడైనమిక్స్, క్వాంటమ్ మెకానిక్స్‌పై ప్రధానంగా దృష్టిసారించాలి. ► జనరల్ సైన్స్‌లో వ్యాధులు–కారకాలు, ప్లాంట్ అనాటమీ, మార్ఫాలజీ, యానిమల్ కింగ్ డమ్లను చదవాలి. ► కరెంట్ అఫైర్స్ కోసం పరీక్ష తేదీకి ముందు ఆరు నెలల వ్యవధిలో జరిగిన సమకాలీన పరిణామాలపై దృష్టి సారించాలి. ► హిస్టరీ విభాగాలకు సంబంధించి.. స్వాతంత్రోద్యమ సంఘటనలు, రాజులు–రాజ్య వంశాలు, చారిత్రక కట్టడాలు, యుద్ధాల సంబంధిత అంశాలను అధ్యయనం చేయాలి. ► జాగ్రఫీ విషయంలో ప్రకృతి వనరులు, విపత్తులు, నదులు, పర్వతాలు, పర్యావరణం వంటి అంశాల్లో పట్టు సాధించడం మేలు చేస్తుంది. ► ఎన్డీఏ రాత పరీక్షలో అడుగుతున్న ప్రశ్నలన్నీ ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచే ఉంటున్నాయి. కాబట్టి ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ఎన్సీఈఆర్టీ పుస్తకాలను చదవడం ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ:జూన్ 29, 2021 ► ఆన్లైన్ దరఖాస్తు ఉపసంహరణ: జులై 6 నుంచి జులై 12 వరకు ► ఎన్డీఏ అండ్ ఎన్ఏ పరీక్ష తేదీ: సెప్టెంబర్ 5, 2021 ► తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం ► వెబ్సైట్: www.upsc.gov.in