సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ఫలితాల విడుదల | UPSC Civil Services prelims result 2018 | Sakshi
Sakshi News home page

సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ఫలితాల విడుదల

Published Sun, Jul 15 2018 3:35 AM | Last Updated on Sat, Sep 22 2018 7:37 PM

UPSC Civil Services prelims result 2018 - Sakshi

న్యూఢిల్లీ: ఐఏఎస్, ఐపీఎస్‌ తదితర సర్వీసుల ఎంపికకు నిర్వహించిన సివిల్‌ సర్వీసెస్‌–2018 ప్రిలిమ్స్‌ ఫలితాలను యూపీఎస్సీ శనివారం విడుదల చేసింది. మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. తెలంగాణ నుంచి సుమారు 12 వేల మంది ఈ పరీక్షకు హాజరు కాగా, 600 మంది మెయిన్స్‌కు అర్హత పొందారు. సెప్టెంబర్‌ 20 నుంచి అక్టోబర్‌ 7 వరకు మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నాయి. దానికి మూడు వారాల ముందు ఈ–అడ్మిట్‌ కార్డులు, టైం టేబుల్‌ను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ప్రిలిమ్స్‌ గట్టెక్కిన అభ్యర్థులు మెయిన్స్‌కు దరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యేకంగా డిటెయిల్డ్‌ అప్లికేషన్‌ ఫారం(డీఏఎఫ్‌)ను నింపాలి. ఈ నెల 23 నుంచి ఆగస్టు 6 మధ్య యూపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఆ ఫారం అందుబాటులో ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement