అద్దె ఇంట్లో నివసిస్తున్నారా? పండుగలకు, పబ్బాలకు ఊరెళుతున్నారా? ఊరు వెళ్లే సమయంలో మీ ఇంటికి తాళం వేస్తున్నారా? ఆ తాళం ‘కీ’ని మీ ఇంటి యజమానికి ఇచ్చి వెళుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.
తూర్పు ఢిల్లీ షకర్పూర్ ప్రాంతంలో కలకలం రేగింది. ఓ ఇంటి యజమాని కుమారుడు దారుణానికి ఒడిగాట్టాడు. తన ఇంట్లో అద్దెకు ఉంటున్న విద్యార్థిని బెడ్ రూం, బాత్రూంలలో కెమెరాల్ని అమర్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
తూర్పు ఢిల్లీ పోలీసుల వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన విద్యార్థిని సివిల్ సర్వీస్ పరీక్షల కోచింగ్ నిమిత్తం షకర్పూర్ ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటుంది. అయితే మూడు నెలల క్రితం యువతి ఉత్తరప్రదేశ్‌లోని తన స్వగ్రామానికి వెళ్లింది. వెళ్లే ముందు ఇంటి తాళాన్ని ఇంటి యజమానికి ఇచ్చి వెళ్లింది. అప్పుడే యజమాని కుమారుడు కరణ్ తన దుర్భుద్దిని చూపించాడు.
ఏదో జరుగుతుంది..
యువతి వెళ్లిన తర్వాత ఆమె ఇంట్లో బెడ్‌రూమ్‌లోని బల్బులలో, బాత్రూంలో ఉండే బల్బులలో స్పై కెమెరాల్ని అమర్చాడు. ఊరెళ్లిన యువతి మళ్లీ తిరిగి వచ్చింది. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతుంది. కానీ ఇంటికి వచ్చిన తర్వాత తన చుట్టూ ఏదో జరుగుతుందని అనుమానం వ్యక్తం చేస్తుండేంది. కానీ ఏం జరుగుతుందో తెలిసేది కాదు.
👉చదవండి : సీఎం యోగి కొత్త రూల్స్
వాట్సప్‌తో బట్టబయలు
ఈ నేపథ్యంలో ఓ రోజు ఆమె అనుమానం నిజమైంది. ఎవరో అగంతకులు తన వాట్సప్‌ను ల్యాప్‌ట్యాప్‌లో లాగిన్ అయినట్లు గుర్తించింది. దీంతో భయాందోళనకు గురైన యువతి వాట్సప్‌ను బ్లాక్ చేసింది. ఆ తర్వాత మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్న ఆమె తన పరిసరాల్ని, ఇంట్లోని ప్రతి అణువణువునూ పరీక్షించింది. చివరిగా తాను అద్దెకు ఉంటున్న ఇంటి బెడ్రూం, బాత్రూం బల్బుల్లో స్పై కెమెరాల్ని గుర్తించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బెడ్ రూం, బాత్రూంలో మూడు స్పై కెమెరాలు
సమాచారం అందుకున్న పోలీసులు ఇంట్లో సోదాలు నిర్వహించారు. మూడు కెమెరాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంటి గురించి,ఇంటి యజమాని గురించి ఆరా తీశారు.
ఇంట్లో కరెంట్ పనులు చేయించాలని
పోలీసుల విచారణలో ఇంటి యజమానికి కుమారుడు ఆకాష్..ఆ స్పై కెమెరాల్ని అమర్చినట్లు నిర్ధారించారు. నిందితుడు అమర్చిన స్పై కెమెరాలో రికార్డయిన డేటాను ఆన్‌లైన్‌లో చూసేందుకు వీలు లేదు. ఆ డేటా అంటే స్పై కెమెరాల్లో ఉన్న మెమోరీ కార్డ్‌లలో స్టోరేజీ అయ్యేది. మెమోరీ కార్డ్‌లలో స్టోరేజీ అయిన డేటాను చూసేందుకు ఇంట్లో కరెంట్ పని ఉందని పలు మార్లు తాను రహస్యంగా ఉంచిన మెమోరీ కార్డ్‌లను తీసుకున్నట్లు నిందితుడు ఆకాష్ ఒప్పుకున్నాడు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment