Spy cameras
-
తస్మాత్ జాగ్రత్త..! కనిపించని కన్ను చూస్తోంది..!
వరంగల్: టెక్నాలజీ.. మానవాళికి ఎంత మంచి చేస్తోందో.. ఆకతాయిలు, సంఘ విద్రోహుల చేతిలో పడి అంతే చెడు చేస్తోంది. ఫేస్బుక్, వాట్సాప్, యూ ట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలను అనుసరించి వ్యాపార అభివృద్ధి, స్నేహం, నాలెడ్జి పెంచుకుంటున్న వారు కొందరైతే.. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల సరఫరా, ఉద్యోగాల పేరుతో మోసానికి పాల్పడుతున్న వారు మరికొందరు. కాగా, ఇటీవల ట్రయల్ రూమ్, హాస్టల్ గదుల్లో స్పై కెమెరాలు (సీక్రెట్ కెమెరా) అమర్చిన ఘటనలు వింటున్నాం. విస్తరిస్తున్న టెక్నాలజీని ఇలా అడ్డదిడ్డంగా వినియోగిస్తే తర్వాత జైలుకెళ్లడం ఖాయం.స్వల్ప పరిమాణంలో ఉండే ఈ స్పై కెమెరాలతో ఆకృత్యాలకు ఒడిగడుతున్న వారు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. షాపింగ్ మాళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, లాడి్జలు..ఇలా పబ్లిక్ ప్రదేశాల్లో ఎక్కడ ఏ కెమెరా కన్ను మనపై ఉందో తెలియని పరిస్థితి ఎదురవుతోంది. ముఖ్యంగా మహిళలు ఇలాంటి కెమెరాలకు బలవుతున్న ఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. అయితే కాస్త అప్రమత్తంగా ఉండి టెక్నాలజీని ఎలా వినియోగించాలో తెలిస్తే స్పై కెమెరాలను ఇట్టే గుర్తించే వీలుంది. అలా గుర్తించి పోలీసుల దృష్టికి తీసుకెళ్తే ఆకతాయిల పని పట్టేందుకూ అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో స్పై కెమెరా పని విధానం, ఆ కెమెరాను గుర్తించే వివిధ మార్గాల గురించి ‘సాక్షి’ ప్రత్యేక కథనం..మోషన్ డిటెక్షన్, సౌండ్ టెక్నాలజీ..కొన్ని శక్తివంతమైన స్పై కెమెరాల్లో బ్యాటరీని ఆదా చేయడం కోసం సౌండ్, మోషన్ డిటెక్షన్ టెక్నాలజీ పొందుపరుస్తారు. గతంలో హాస్టళ్లలో జరిగిన ఘటనలు పరిశీలిస్తే ఒక్కొక్కటి సుమారు రూ.3వేల లోపు విలువైన స్పై కెమెరా సౌండ్ యాక్టివేటెడ్ ఫీచర్స్ కలిగి ఉన్నాయి. మహిళలు బాత్రూం రావడానికి ముందు డోర్ తీయగానే ఆ శబ్దానికి ఆటోమేటిక్‌గా కెమెరా యాక్టివేట్ అయి వీడియో రికార్డ్ చేస్తుంది. వ్యక్తుల కదలికలను బట్టి దానంతట అదే రికారి్డంగ్ అవుతుంది. ఒకసారి చార్్జచేస్తే రెజల్యూషన్ బట్టి నాలుగైదు గంటల పాటు నిరంతరాయంగా ఈ కెమెరాలు వీడియో రికార్డ్ చేస్తాయి.స్పై కెమెరాలతో ప్రమాదాలు..స్పై కెమెరాల ద్వారా మహిళల నగ్న దృశ్యాలను రికార్డ్ చేసి వాటిని పోర్న్ సైట్లలో అప్లోడ్ చేస్తున్న వారు ఇటీవల అధికమవుతున్నారు. మరికొంత మంది ఆ వీడియోలను సంబంధిత మహిళలకు పంపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఎక్కడైనా ఇలా అనుమానాస్పదంగా ఉన్న స్పై కెమెరాలను గుర్తిస్తే వాటికి సంబంధించిన ఆధారాలను స్టార్ట్ఫోన్లో వీడియో, ఫొటోల రూపంలో రికార్డు చేయాలి. సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. షాపింగ్ మాల్స్ వంటి వాటిలో ఫ్లోర్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లాలి. వీడియో ఫుటేజీ రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తుంటే, వెంటనే కుటుంబ సభ్యులతో చర్చించి పోలీసుల దృష్టికి తీసుకెళ్లడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో భాగంగా చాలా మంది మహిళలు నగరాల్లో హాస్టల్స్‌లో ఉంటున్నారు. వారు ఉండే గదులు, బాత్రూమ్లను నిశితంగా పరిశీలించాలి. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ స్పై కెమెరాలకు చెక్ పెట్టాలి.మొబైల్స్‌తోనూ..స్పై కెమెరాలు మాత్రమే కాదు, నిరంతరం మొబైల్ ద్వారా కూడా పబ్లిక్ ప్లేస్ల్లో మహిళల కదలికలు రికార్డు చేస్తున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఎవరికీ అనుమానం రాకుండా ప్రివ్యూ కూడా కనిపించకుండా బ్యాక్ గ్రౌండ్లో వీడియోని రికార్డ్ చేసే యాప్స్‌ని వాడుతున్నారు.ఎన్నో రకాలు..చాలా మంది అనుకుంటున్నట్లు చూడటానికి కెమెరా మాదిరి ఉండదు. మనకు ఏ మాత్రం అనుమానం రాకుండా రకరకాల వస్తువుల రూపంలో రూపొందిస్తారు. అనేక స్పై కెమెరాలను గమనిస్తే జేబులో పెన్, షర్టు బటన్స్, టేబుల్ మీద పెట్టే చిన్న క్లాక్‌లు, రిస్ట్ వాచీలు, ఫ్లవర్ వాజ్‌లు, కీచైన్లు, హ్యాంగర్స్, ఇంట్లో ఉండే ఫొటో ఫ్రేమ్‌లు, మొక్కలు, స్విచ్‌బోర్డులు, బల్బులు ఇలా అనేక విధాలా స్పై కెమెరాలు దొరుకుతున్నాయి.అనేక రకాల పరీక్షలు..స్పై కెమెరాలను గుర్తించేందుకు టెక్నిక్స్ ఉన్నాయి. కొన్ని రకాల కెమెరాలున్న ప్రదేశాల్లో ఫోన్ కాల్ చేసేందుకు ప్రయత్నిస్తే ఆది కాల్ డ్రాప్ అవుతుంది. ఆయా కెమెరాల్లో ఉండే మ్యాగ్నటిక్ తరంగాల వల్ల ఇలా జరుగుతుంది. ఇటీవల కాల్ డ్రాప్ అనేది తరచూ ఎదుర్కొనే సమస్య కావడంతో స్పై కెమెరా ఉందని అనుమానించలేని పరిస్థితి. ఇక ట్రయల్ రూమ్స్‌లో అమర్చే అద్దాలు రెండు రకాలుంటాయి. సహజంగా అద్దం ఒకవైపు మన రూపాన్ని చూపిస్తూ, దాని వెనుక భాగంలో వేరే రంగుతో కోటింగ్ చేయబడి ఉంటుంది. కానీ కొన్ని అద్దాలు పారదర్శకంగా ఉండి, ఇవతలి దృశ్యాలను అవతలికి చూపిస్తుంటాయి. మీకు అలాంటి అనుమానం వస్తే అద్దంలో కొద్దిగా ఖాళీ స్థలం ఉండాలి. అలా కాకుండా రెండు టచ్ అయినట్లు ఉంటే ఆ అద్దం అవతలి వైపు మీ దృశ్యాలను చూపిస్తుందని గ్రహించాలి. లైట్లన్నీ ఆఫ్ చేసి, ఫ్లాష్ లైట్‌ని అద్దం మీద వేసినప్పుడు అవతలి వైపు ఏదైనా ఉందేమో తెలుస్తుంది.గుర్తించడం ఎలా?స్మార్ట్ఫోన్లు వాడేవారికి గూగుల్ ఫ్లే స్టోర్‌లో హిడెన్ కెమెరా డిటెక్టర్ అనే యాప్ చాలా సందర్భాల్లో పనిచేస్తుంది. ఐ ఫోన్లు వినియోగించే వారికి స్పై హిడెన్ కెమెరా డిటెక్టర్ యాప్ ఉపయోగపడుతుంది. స్పై కెమెరాలు వెలువరించే ఇన్ఫ్రారెడ్ కిరణాలను గుర్తించడం ద్వారా గదిని పూర్తిగా డార్క్ చేసినప్పుడు నిర్దిష్ట స్థలంలో కెమెరా ఉందా లేదా అనే విషయం గమనించి మొబైల్ అప్లికేషన్లో వాటిని చూపిస్తాయి. స్పై కెమెరాలను గుర్తించడానికి బగ్ డిటెక్టర్ అనే ప్రత్యేక పరికరాలుంటాయి.ఇవి చదవండి: అమెరికాను వణికిస్తున్న హరికేన్ హెలెన్ -
పండక్కి ఊరెళ్తున్నారా? మీ ఇంటి తాళాన్ని యజమానికి ఇచ్చి వెళ్తున్నారా?
అద్దె ఇంట్లో నివసిస్తున్నారా? పండుగలకు, పబ్బాలకు ఊరెళుతున్నారా? ఊరు వెళ్లే సమయంలో మీ ఇంటికి తాళం వేస్తున్నారా? ఆ తాళం ‘కీ’ని మీ ఇంటి యజమానికి ఇచ్చి వెళుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.తూర్పు ఢిల్లీ షకర్పూర్ ప్రాంతంలో కలకలం రేగింది. ఓ ఇంటి యజమాని కుమారుడు దారుణానికి ఒడిగాట్టాడు. తన ఇంట్లో అద్దెకు ఉంటున్న విద్యార్థిని బెడ్ రూం, బాత్రూంలలో కెమెరాల్ని అమర్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే? తూర్పు ఢిల్లీ పోలీసుల వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన విద్యార్థిని సివిల్ సర్వీస్ పరీక్షల కోచింగ్ నిమిత్తం షకర్పూర్ ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటుంది. అయితే మూడు నెలల క్రితం యువతి ఉత్తరప్రదేశ్‌లోని తన స్వగ్రామానికి వెళ్లింది. వెళ్లే ముందు ఇంటి తాళాన్ని ఇంటి యజమానికి ఇచ్చి వెళ్లింది. అప్పుడే యజమాని కుమారుడు కరణ్ తన దుర్భుద్దిని చూపించాడు.ఏదో జరుగుతుంది..యువతి వెళ్లిన తర్వాత ఆమె ఇంట్లో బెడ్రూమ్లోని బల్బులలో, బాత్రూంలో ఉండే బల్బులలో స్పై కెమెరాల్ని అమర్చాడు. ఊరెళ్లిన యువతి మళ్లీ తిరిగి వచ్చింది. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతుంది. కానీ ఇంటికి వచ్చిన తర్వాత తన చుట్టూ ఏదో జరుగుతుందని అనుమానం వ్యక్తం చేస్తుండేంది. కానీ ఏం జరుగుతుందో తెలిసేది కాదు.👉చదవండి : సీఎం యోగి కొత్త రూల్స్ వాట్సప్‌తో బట్టబయలుఈ నేపథ్యంలో ఓ రోజు ఆమె అనుమానం నిజమైంది. ఎవరో అగంతకులు తన వాట్సప్‌ను ల్యాప్‌ట్యాప్‌లో లాగిన్ అయినట్లు గుర్తించింది. దీంతో భయాందోళనకు గురైన యువతి వాట్సప్‌ను బ్లాక్ చేసింది. ఆ తర్వాత మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్న ఆమె తన పరిసరాల్ని, ఇంట్లోని ప్రతి అణువణువునూ పరీక్షించింది. చివరిగా తాను అద్దెకు ఉంటున్న ఇంటి బెడ్రూం, బాత్రూం బల్బుల్లో స్పై కెమెరాల్ని గుర్తించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.బెడ్ రూం, బాత్రూంలో మూడు స్పై కెమెరాలుసమాచారం అందుకున్న పోలీసులు ఇంట్లో సోదాలు నిర్వహించారు. మూడు కెమెరాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంటి గురించి,ఇంటి యజమాని గురించి ఆరా తీశారు. ఇంట్లో కరెంట్ పనులు చేయించాలనిపోలీసుల విచారణలో ఇంటి యజమానికి కుమారుడు ఆకాష్..ఆ స్పై కెమెరాల్ని అమర్చినట్లు నిర్ధారించారు. నిందితుడు అమర్చిన స్పై కెమెరాలో రికార్డయిన డేటాను ఆన్లైన్లో చూసేందుకు వీలు లేదు. ఆ డేటా అంటే స్పై కెమెరాల్లో ఉన్న మెమోరీ కార్డ్‌లలో స్టోరేజీ అయ్యేది. మెమోరీ కార్డ్‌లలో స్టోరేజీ అయిన డేటాను చూసేందుకు ఇంట్లో కరెంట్ పని ఉందని పలు మార్లు తాను రహస్యంగా ఉంచిన మెమోరీ కార్డ్‌లను తీసుకున్నట్లు నిందితుడు ఆకాష్ ఒప్పుకున్నాడు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
Covert Creatures: పావురాల నుంచి డాల్ఫిన్ల దాకా..
బెలుగా జాతికి చెందిన అరుదైన పెద్ద గూఢచారి తిమింగలం ‘హవాల్దిమీర్’దక్షిణ నార్వే తీరంలో బుల్లెట్ గాయాలతో విగతజీవిగా కనిపించడం ఇటీవల అంతర్జాతీయ వార్తాంశంగా నిలిచింది. దీంతో అసలు మనిషి ఇంతవరకు ఏ జాతుల జీవులను నిఘా కోసం గూఢచారులుగా వినియోగించుకున్నాడన్న చర్చ మొదలైంది. గూఢచారులుగా ఈ జంతువులు నిర్వర్తించిన విధుల్లేంటి. వాటిల్లో అత్యుత్తమ గూఢచారి ఏది? వంటి ఆసక్తికర అంశాలపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.. గూఢచార జీవులు... అత్యాధునిక పరికరాలు, చిన్న నిఘా కెమెరాలు రాకముందు సుదూర ప్రాంతాలకు రహస్య సమాచారాన్ని సురక్షితంగా చేరవేయడం ఓ సవాలుగా ఉండేది. దీంతో సందేశాలు పంపడానికి పావురాలను ఉపయోగించేవారు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో నిఘా కోసం జర్మన్ సైన్యం ప్రత్యేకంగా బుల్లి కెమెరాలు రూపొందించి వాటిని పావురాలకు కట్టింది. వాటిల్లో రికార్డయ్యే సమాచారంతో శత్రు జాడ తెల్సుకునేది. రెండో ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాలూ గూఢచర్యానికి పావురాలనే నమ్ముకున్నాయి. 1970లలో అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) తన ప్రత్యేక నిగా ఆపరేషన్ ‘టకానా’లో భాగంగా బుల్లి కెమెరాలు అమర్చిన పావురాలను సోవియట్ రష్యాలోకి పంపింది. ఇలా పావురాలు మాత్రమే కాదు.. పిల్లులు, తిమింగలాలు, డాల్ఫిన్లు, ఇంకొన్ని రకాల పక్షులు, చనిపోయిన జంతువులు కూడా కోవర్ట్ ఆపరేటర్లుగా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాయి. డాల్ఫిన్లతో ప్రత్యేకంగా.. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో సోవియట్ నావికాదళం సముద్ర క్షీరదాలతో వివిధ కార్యక్రమాలను చేపట్టింది. వీటిలో ఒకటి డాల్ఫిన్లకు శిక్షణ ఇవ్వడం. అమెరికా నావికాదళం సముద్ర క్షీరదాల కార్యక్రమం(ఎంఎంపీ) కింద సముద్రజలాల్లో నిఘా కోసం డాల్ఫిన్లను ఉపయోగించింది. 1960లలో ప్రాజెక్ట్ ఆక్సిగాస్లో భాగంగా శత్రు నౌకలకు పేలుడు పరికరాలను అమర్చేందుకు సీఐఏ డాల్ఫిన్లకు శిక్షణ ఇచి్చంది. ఈ కార్యక్రమానికి సముద్రాల్లో స్వేచ్ఛగా తిరిగే రెండు ‘బాటిల్‌నోస్’డాల్ఫిన్లను ఉపయోగించారు. ప్రపంచంలోని అత్యంత తెలివైన జంతువులుగా డాల్ఫిన్లు ప్రసిద్ధి చెందాయి. క్రిమియాలోని సెవాస్టోపోల్ నల్లసముద్రంలోని నౌకాదళ స్థావరంలో శత్రు డైవర్లను గుర్తించడానికి, ఎదుర్కోవడానికి డాల్ఫిన్లకు శిక్షణ ఇచ్చేందుకు రష్యా గత సంవత్సరం ఒక క్షీరద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని బ్రిటిష్ ఇంటెలిజెన్స్ నివేదిక బహిర్గతంచేసింది. 2023 ఏప్రిల్ నుంచి జూన్ వరకు సెవాస్టోపోల్ నౌకాశ్రయంలో తేలియాడే క్షీరదాల బోనుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు బ్రిటిష్ సైనిక నిఘా ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడైంది. పిల్లుల చెవులకు మైక్రో ఫోన్లు పిల్లులను తెలివైన జంతువులుగా భావిస్తారు. సీఐఏ 1960వ దశకంలో పిల్లులను ఉపయోగించి ‘ఆపరేషన్ అకౌస్టిక్ కిట్టీ’అనే ప్రాజెక్టును అభివృద్ధి చేసింది. దీని కోసం 2 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. ప్రాజెక్టులో భాగంగా పిల్లుల చెవుల్లో మైక్రోఫోన్లను ఏర్పాటు చేసింది. ఇవి సోవియట్ దౌత్యవేత్తలు, ఏజెంట్ల సంభాషణలను రహస్యంగా రికార్డ్ చేస్తాయి. పిల్లి పెంపుడు జంతువు. అది బహిరంగ ప్రదేశాలు, కొన్ని రహస్య ప్రదేశాల్లో అవి ప్రత్యక్షమవడం శత్రు దేశాలకు అనుమానాలు పెంచే అవకాశం ఉంటుంది. అదీగాక పిల్లులను నియంత్రించడం అంత సులభం కాదు. శిక్షణాసమయంలో వాటిని శిక్షకులు నియంత్రించలేక చేతులెత్తేశారు. పిల్లులు వాటికి సూచించిన ప్రాంతాలకు కాకుండా తమకిష్టమైన ప్రదేశాల్లో చక్కర్లు కొట్టాయి. దీంతో చేసేదిలేక చివరికి 1967లో ఈ కార్యక్రమానికి ఫుల్స్టాప్ పెట్టేశారు. టాప్ ఏజెంట్.. పావురం పిల్లులు, చనిపోయిన ఎలుకల వంటివాటిని రంగంలోకి దింపి పని కానిచి్చనప్పటికీ వివిధ దేశాల నిఘా సంస్థలు శతాబ్దాలుగా ఎక్కువ నమ్మకం పెట్టుకున్నది పావురం మీదనే. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ ఇంటెలిజెన్స్ నిర్వహించిన అత్యంత విజయవంతమైన గూఢచారి కార్యక్రమం ‘ఆపరేషన్ కొలంబా’పావురాలతోనే విజయంవంతమైంది. జర్మన్ సైనిక కార్యకలాపాలను, సున్నితమైన సైనిక స్థానాలపై నిఘాను హోమింగ్ జాతి పావురాలు సేకరించాయి. పేపర్‌పై రాసిన సందేశాలను సూక్ష్మ డబ్బాల్లో పెట్టి పక్షి కాలికి కట్టేశారు. ఈ రహస్య సందేశాలలో నాజీ దళాల కదలికలు, నాజీల కొత్త ఆయుధాలపై నివేదికలు, ప్రణాళికాబద్ధమైన రాకెట్ దాడుల వివరాలను వేగులు సేకరించి పావురాల ద్వారా ప్రధాన కేంద్రానికి రహస్యాన్ని పంపేవారు. రచయిత గోర్డాన్ కోరేరా ‘ఆపరేషన్ కొలంబా: ది సీక్రెట్ పీజియన్ సరీ్వస్’పుస్తకంలో ఇలాంటి ఎన్నో వివరాలు ఉన్నాయి. బ్రిటిష్ ఇంటెలిజెన్స్ 1941 నుంచి 1944 మధ్య నాజీ ఆక్రమిత ఐరోపాపై 16,000 హోమింగ్ జాతి పావురాలను వాడారు. అన్నింటికన్నా ముఖ్యంగా పక్షుల ద్వారా గూఢచర్యం విజయవంతంకావడంతో నూతన టెక్నాలజీలకూ కపోతమే స్ఫూర్తిగా నిలిచింది. గత నెలలో చైనా అచ్చం పావురంలాగా ఉండే చిన్నపాటి నిఘా డ్రోన్‌ను ఆవిష్కరించడం తెల్సిందే. గూఢచార పావురాలని... భారత ఉపఖండంలో సందేశాలను పంపించడానికి పావురాలను ఉపయోగించినట్టుగా చరిత్ర చెబుతోంది. 2020 మేలో కశ్మీర్‌లోని ఓ గ్రామంలో నంబర్ల సెట్ ఉంగరం కలిగిన పావురం కనిపించింది. దానిని పట్టుకున్న గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. పాకిస్తాన్‌కు చెందిన గూఢచారి పావురమై ఉంటుందని, దానిపై ఉన్నది కోడ్ అని అనుమానించిన పోలీసులు.. డీ క్రిప్ట్ చేయడానికి ప్రయట్నించారు. చివరికది గూఢచారి పావురం కాదని తేలడంతో విడిచిపెట్టారు. 2016 అక్టోబర్‌లో భారత ప్రధానిని బెదిరిస్తూ మరో పావురం కనిపించింది. పంజాబ్‌లోని పఠాన్ కోట్లో ఈ పావురాన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 2023 మేలో ముంబైలో దొరికిన పావురాన్ని చైనా గూఢచారిగా అనుమానిస్తూ ఎనిమిది నెలల పాటు బోనులో ఉంచి దాని ఆనుపానాలు సేకరించారు. ఆ పావురం కాలుకు ఉంగరాలు కట్టి, దాని రెక్కల కింది భాగంలో చైనీస్ భాషలో ఏదో రాశారు. అయితే అది తైవాన్‌లో రేసింగ్ పోటీలో పాల్గొన్న పక్షి అని ఫిబ్రవరిలో తేలడంతో ఎట్టకేలకు దానిని అధికారులు వదిలేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రెడ్ ఐ పై కన్నెర్ర చేద్దాం!
‘గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజ్ లేడీస్ హాస్టల్ బాత్రూంలో 29వ తేదీ సాయంత్రం హిడెన్ కెమెరా పట్టు బడింది’. రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన ఇది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అసాంఘిక కార్యకలాపాలకు దుర్వినియోగం చేస్తున్న వాళ్లు కూడా విద్యావంతులే. ఇలాంటి ఒక సంఘటన జరిగినప్పుడు వ్యవస్థ మొత్తం నిద్రలేవడం, ఆ తర్వాత మర్చిపోవడమే జరుగుతోంది. స్పై కెమెరాల దుర్వినియోగం మీద నిఘా వ్యవస్థ రోజూ పని చేయాల్సిందేనన్నారు ‘యాంటీ రెడ్ ఐ’ యాక్టివిస్ట్ వరలక్ష్మి. ఈ డేగకన్ను గురించి సామాన్యుల్లో అవగాహన కల్పించడానికి సినిమా హాళ్లలో ప్రకటనల రూపంలో స్పై కెమెరాలు ఎన్ని రకాలుగా అమర్చే అవకాశం ఉంటుందో బొమ్మలతో చూపిస్తూ న్యూస్ రీల్ వేయాలన్నారు. తరచూ తనిఖీలు తప్పనిసరి! విద్యాసంస్థలకు అనుమతులిచ్చేటప్పుడే అమ్మాయిలు, అబ్బాయిల హాస్టల్ భవనాలు ఏ దిశలో ఉన్నాయి. రెండు భవనాల్లో బాత్రూమ్లు ఒకరికొకరు కనిపించని విధంగా నిర్మాణం ఉండాలి. షీ టీమ్స్, భరోసా టీమ్ సభ్యులు ప్రతి విద్యాసంస్థ నుంచి కొందరు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ ఉమెన్ క్యాడెట్లను సమీకరించి వర్క్‌షాపులు నిర్వహించాలి. ఆ ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు తమ విద్యాసంస్థలో వర్క్‌షాపులు నిర్వహిస్తూ స్పై కెమెరాలను గుర్తించడం, గుర్తించిన వెంటనే ఇంటర్నల్ కమిటీలకు తెలియచేయడం మీద చైతన్యవంతం చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ పట్టణం, నగరంలోని విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, హాస్పిటళ్లు, హోటళ్లు, షాపింగ్ మాల్స్‌లో తనిఖీలు చేసి ‘ఫలానా తేదీన, ఫలానా టైమ్‌లో తనిఖీ జరిగింది. అసాంఘికంగా ఎటువంటి స్పై కెమెరాలు లేవు’ అనే స్టిక్కర్ అతికించాలి. స్పై కెమెరాను గుర్తిస్తే ఆ విద్యాసంస్థ, వ్యాపార సంస్థ ఏదైనా సరే తక్షణమే మూసివేయడం, యజమాని మీద నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం వంటి కఠినచర్యలు ఉండాలి. రోజూ నగరంలో ఏదో ఒక చోట తనిఖీలు జరుగుతుంటే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు కళ్లెం పడుతుంది. వ్యాపార సంస్థల ప్రకటనల హోర్డింగ్‌లో స్పై కెమెరా లోగో, ‘మహిళల భద్రత మా బాధ్యత’ అనే క్యాప్షన్ ముద్రించడం తప్పనిసరి చేయాలి. స్పై కెమెరాలు లక్షల్లో అమ్ముడవుతున్నాయి! స్పై కెమెరాల అమ్మకం మీద కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. స్పై కెమెరా కొంటున్న వారి ఆధార్ నంబరు, స్పై కెమెరా కొంటున్న అవసరం ఏమిటో స్పష్టంగా తెలియచేయాలనే నిబంధన పెట్టాలి. ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో లోకల్ కమిటీలున్నాయి. జిల్లా కలెక్టర్, షీ టీమ్స్ సేవలను విస్తృతం చేయడంతోపాటు బాధితులు సమాచారం అందించడానికి జిల్లాకో ఫోన్ నంబరును ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. అప్పుడే ఇలాంటి దుశ్చర్యలకు అడ్డుకట్ట పడుతుంది. కెమెరా లేదనే భరోసానిద్దాం! హెవెన్ హోమ్స్ సొసైటీ ద్వారా ఆపదలో ఉన్న అమ్మాయిలను రక్షించడం, వారికి సాధికారమైన ఉ΄ాధి కల్పించడం, వివిధ సామాజికాంశాలపై అవగాహన కోసం సదస్సులు, శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ‘యాంటీ రెడ్ ఐ’ పేరుతో స్పై కెమెరాల మీద యుద్ధం మొదలు పెట్టాం. ఈ దుర్మార్గాన్ని అరికట్టడానికి ఒక నియమావళిని రూపొందించాను. ఆ సూచనలతో తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 15న స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా మహిళల భద్రత కోసం ‘నో హిడెన్ కెమెరా ఇన్సైడ్’ అనే ప్రోగ్రామ్ మొదలు పెట్టింది. సీసీటీవీలున్న చోట ‘మీరు సర్వేలెన్స్ కెమెరా నిఘాలో ఉన్నారు’ అనే హెచ్చరిక ఉన్నట్లే... ‘స్పై కెమెరా లేదా హిడెన్ కెమెరా లేదు, మీరు ధైర్యంగా ఉండవచ్చు’ అని భరోసా కలిగించే క్యాప్షన్ కూడా ఉండాలి. నిర్భయ నిధులు ప్రతి రాష్ట్రానికీ విడుదలవుతుంటాయి. కానీ ఖర్చు చేయకుండా ఉండి పోతుంటాయి. ఆ నిధులను ఇలా సద్వినియోగం చేయాలి. – అడపా వరలక్ష్మి, సామాజిక కార్యకర్త – వాకా మంజులారెడ్డి,సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
పిల్లల స్వేచ్ఛను హరించొద్దు..!
పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎంత బాధ్యతగా వ్యవహరిస్తారో చెప్పాల్సిన పనిలేదు. అది శృతి మించేలా చెయ్యొద్దు. తల్లిదండ్రుల బాధ్యత వారికి భారంగా మారి స్వేచ్ఛను హరించేలా చేయకూడదు. పేరెంట్స్ ప్రవర్తనకు తట్టుకోలేక ఇంటి నుంచి పారిపోయే పరిస్థితి తెచ్చుకుని దోషులుగా మిగిలిపోవద్దు. చైనాలో అలాంటి దారుణమైన ఘటన చోటు చేసుకుంది. కన్న కూతురు తప్పుదారి పట్టకూడదని తల్లిదండ్రులు అతి జాగ్రత్తతో చేసిన పని ఆ అమ్మాయిని పోలీసులను ఆశ్రయించే పరిస్థితికి దారితీసింది.అసలేం జరిగిందంటే..?.. 20 ఏళ్ల చైనా యువతి తన పేరెంట్స్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను కంట్రోల్ చేయాలనే ధోరణి తారాస్థాయికి చేరిపోయిందని భరించలేనంటూ కన్నీళ్లు పెట్లుకుంది. అందువల్ల తనకు సాయం చేయాల్సిందిగా పోలీసులను కోరింది. సదరు బాధితురాలిని లీ అనే అమ్మాయిగా గుర్తించారు పోలీసులు. తన తల్లిదండ్రులు తన పట్ల మరింత ఘోరంగా ప్రవర్తిస్తున్నారని గత నెల జూలై 26నే గుర్తించానని అంటోంది. తన తప్పు చేసిన ప్రతిసారి తనఫోన్ నేలకేసి కొట్టి దారుణంగా తిట్టేవారిని చెప్పింది. అస్సలు ఇంత చిన్న పాటి తప్పలు కూడా వాళ్ల ఎలా కనిపెడుతున్నారో అర్థం కాలేదు. ఆ తర్వాత తనకు తెలిసిందని.. తన బెడ్రూంలో స్పై కెమెరాను అమర్చి తన ప్రతి కదలికలను గమనిస్తున్నారని తెలిపింది. తన పేరెంట్స్ కంట్రోల్ పేరుతో తన స్వేచ్ఛను హరిస్తున్నారని, పైగా ఇది పీక్ స్థాయికి చేరిపోయిందంటూ వేదనగా చెప్పుకొచ్చింది. అందుకే ఇంట్లోంచి వెళ్లిపోవాలనే నిర్ణయానికి వచ్చిచనట్లు పేర్కొంది. అంతేగాదు బతకడం కోసం పార్ట్ టైం జాబ్‌లు కూడా వెతుకున్నట్లు పోలీసులకు తెలిపింది. ఐతే ఇంట్లో తను కనిపించకపోవడంతో తన పేరెంట్స్ ఎక్కడ మిస్సింగ్ కేసు పెడతారన్న భయంతో ముందుగానే పోలీసులకు ఈ విషయం చెప్పి వెళ్లిపోవాలనుకున్నట్లు కన్నీటి పర్యంతమయ్యింది. ఆమె గాథ విని పోలీసు అధికారి జాంగ్ చువాన్బిన్ లీని ఓదార్చే ప్రయత్నం చేశారు. అలాగే లీ పట్ల తల్లిందండ్రుల ప్రవర్తన సరైనది కాదని, సంరక్షణ తప్పు మార్గంలో ఉందని అన్నారు. వెంటనే ఆమె తల్లిందడ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించారు. పిల్లలు వస్తువులు కారని, వాళ్లకు కాస్త స్పేస్ ఉండాలని చెప్పారు. ఇలా ఇంట్లోనే కెమెరాలతో నిఘా పెట్టి అభద్రతా భావానికి గురి చెయ్యకూడదన్నారు. ఈ ప్రవర్తన వారిని ఇంటినుంచి వెళ్లిపోయేలా చేయడమే గాక తప్పుడు మార్గంలో పయనించేందుకు కారణమవుతుంది కూడా అని గట్టిగా హెచ్చరించారు. లీ తల్లిందండ్రులు కూడా వారి చేసిన తప్పిదం ఏంటో గ్రహించడమే గాక ఆ కెమెరాలను తీసేందుకు అంగీకరించారు. ఇక లీ కూడా తిరిగి ఇంటికి వెళ్లేందుకు ఒప్పుకుంది. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అయితే నెటిజన్లు పలు రకాలుగా స్పదించారు. కనీసం జైలు కూడా ఇంతలా ఉండకదా అంటూ ఆ తల్లిదండ్రుల ప్రవర్తన పట్ల ఫైర్ అయ్యారు. పైగా ఇది చాటా భయంకరమైనదిగా పేర్కొంటూ పోస్టులు పెట్టారు. (చదవండి: Nail Art: కాలేజ్‌కి కూడా వెళ్లలేదు.. కానీ ఏడాదికి ఏకంగా రూ. 5 కోట్లు..!) -
స్కానింగ్ సెంటర్ వికృత చేష్టలపై కలెక్టర్ సీరియస్.. నలుగురి కమిటీ
నిజామాబాద్‌నాగారం: స్కానింగ్ కోసం వచ్చే మహిళల అశ్లీల వీడియోలను రికార్డు చేస్తున్న ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. స్కానింగ్ సెంటర్‌కు వచ్చే మహిళల ఫొటోలు, వీడియోలు తీసి.. వారికి ఫోన్లు చేసి సోషల్ మీడియాలో పెడతానని వేధించడం సంచలనంగా మారింది. సెంటర్లోని ఓ ఆపరేటర్ ఈ అకృత్యాలకు పాల్పడడం కలవరం సృష్టిస్తోంది. దీంతో స్కానింగ్ సెంటర్లలో మహిళల భద్రతపై అనుమానాలు తలెత్తుతున్నా యి. నగరంలోని అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో కొంత కాలంగా ఈ తతంగం కొనసాగుతుండడంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. అందులో పనిచేసే ఆపరేటర్ ఒక్కరే చేశారా..? వెనుక ఉండి ఎవరైనా చేయించారా అనే అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై సీపీ ఆదేశాల మేరకు పోలీసులు ఇప్పటికే విచారణ చేపట్టారు. తాజాగా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు సీరియస్‌గా స్పందించి నోటీసులివ్వ డంతో పాటు.. విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. అధికారుల తనిఖీస్కానింగ్ కోసం వచ్చిన మహిళల అశ్లీల చిత్రీకరణ చేసి బ్లాక్ మెయిల్‌కు పాల్పడిన ఘటనపై కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్యాధికారి స్కా నింగ్ సెంటర్‌కు నోటీసులు జారీచేసి నలుగురి తో కూడిన విచారణ కమిటీ వేశారు. కమిటీలో జిల్లా జనరల్ ప్రభుత్వ ఆస్పత్రి రేడియోలాజిస్ట్ డాక్టర్ శ్రావణి, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ అంజనాదేవి, గైనకాలజిస్టులు డాక్టర్ అనుపమ, డాక్టర్ లావణ్యలున్నారు. వారం రోజుల్లో విచారణ చేసి నివేదిక సమరి్పంచాలని ఆదేశించారు. అలాగే సీపీ ఆదేశాల మేరకు పోలీసులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. జరిగిందిలా.. నిజామాబాద్ నగరంలో పదుల సంఖ్యలో స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. అయితే అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ప్రారంభమైన కొన్ని రోజులకే అశ్లీల ఫొటోలు, వీడియోల చిత్రకరణకు తెరలేపారు. ఇందులో పనిచేసే ఓ ఆపరేటర్ స్కానింగ్ కోసం వచ్చిన మహిళల అశ్లీల చిత్రాలను, వీడియోలను గుట్టుచప్పుడు కాకుండా తీసేవాడు. అనంతరం మహిళలకు ఫోన్లు చేసి వీడియోలు సోషల్ మీడి యాలో వైరల్ చేస్తానని బెదిరింపులకు పాల్పడడం గమనార్హం. పదుల సంఖ్యలో మహిళలతో ఇలా వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఈ తతంగం కొంత కాలంగా కొనసాగుతోంది. ఈ విషయం స్కానింగ్ సెంటర్లో నిర్వాహకులకు, వైద్యులకు తెలిసే జరిగిందని ఆరోపణలున్నాయి. ఓ ఆపరేటర్ ఇలాంటి దుశ్యర్యలకు పాల్పడుతున్నాడంటే నిర్వాహకులు పసిగట్టలేదంటే నమ్మేటట్లు కనిపించడంలేదు. గతంలోనూ ఇలా చేసినా నిర్వాహకులు తొలగించకపోవడంతోనే మరింత రెచ్చిపోయినట్లు సమాచారం. సీపీని కలిసిన ఐఎంఏ నాయకులుసీపీ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో పోలీసులు తనిఖీలు చేసి విచారణ చేపట్టారు. పలుమార్లు స్కానింగ్సెంటర్లో ఏం జరిగిందో క్షుణ్ణంగా తెలుసుకున్నట్లు సమాచారం. సద రు ఆపరేటర్‌ను సైతం అరెస్ట్ చేశారు. అయితే ఐఎంఏ నాయకులు ఎంటరై నిర్వాహకులకు మద్ద తుగా వెళ్లి సీపీని కలిశారు. ఆపరేటర్ తప్పు చేస్తే నిర్వాహకులకు సంబంధం లేదని చెప్పినట్లు సమా చారం. అయితే సీపీ స్పందిస్తూ ఐఎంఏ నాయకులపై మండిపడ్డారు. తప్పు చేసిన వారికి అండగా నిలబడడంపై ఆగ్రహించారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన వారి్నంగ్ ఇచ్చారు. వివరాలు ఇవ్వాలని సీపీ కార్యాలయానికి వైద్యశాఖ లేఖ సీపీ ఆధ్వర్యంలో అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో విచారణ చేపట్టగా.. ఇందుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ నెల మొదటి వారంలో విన్నవించారు. కానీ వివరాలు రావడంలో ఆలస్యమైంది. ఎన్నికల కోడ్ కారణంగా సీపీ, అధికారులు బిజీబిజీగా ఉన్నారు. దీంతో వివరాలు ఇంకా శాఖకు రాలేదని వైద్యాధికారి తెలిపారు.ఫిర్యాదుతో వెలుగులోకి.. అయప్ప స్కానింగ్ సెంటర్లో మహిళల అశ్లీల చిత్రాలు, వీడియోలు సామాజిక మధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఇందులో తమ ఇంటి మహిళల వీడియో కనిపించడంతో ఓ వ్యక్తి నేరుగా స్కానింగ్ సెంటర్‌కు వెళ్లి ప్రశ్నించారు. అనంతరం నిజామాబాద్ ఒకటో టౌన్లో ఈనెల 7న రాతపూర్వగా ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. సీపీ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు పోలీసులు సెంటర్లో తనిఖీలు చేపట్టారు. -
టెక్నీషియన్ కాదు..కీచకుడు స్కానింగ్ సెంటర్లో ఘోరాలు
-
రహస్య కెమెరాలను ఇలా పట్టేయవచ్చు!
హోటల్ గదిలో రహస్యంగా స్పై కెమెరాలను అమర్చిన సంఘటనలు ఇటీవల మనం కొన్ని వినే ఉంటాం. కంటికి నేరుగా కనిపించని ఈ కెమెరాల సాయంతో మన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను షూట్ చేసి రకరకాల నేరాలకు పాల్పడుతున్న విషయమూ మనం వార్తల్లో చూసుంటాం. అయితే ఇ రహస్యంగా అమర్చిన కెమెరాల గురించి తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదని అంటున్నారు నిపుణులు. అమెరికాలోని ఓ ఛానల్ ఈమధ్యే ఈ అంశంపై ఓ ప్రయోగమూ చేసింది. స్పైకామ్లను ఏర్పాటు చేసేందుకు అవకాశాలున్న ప్రాంతాలు, వాటిని గుర్తించేందుకు ఉన్న పద్ధతులను కూడా ఇలా వివరించింది... ఎక్కడెక్కడ అమర్చే అవకాశాలు స్పైక్యామ్‌లు చాలా చిన్నవిగా ఉంటాయి పైగా కొనుగోలు చేయడం సులభం. ఉదాహరణకు, హోటల్స్‌లో ఫోటో ప్రేమ్‌లు, గడియారాలు, కెమెరాను స్మోక్ డిటెక్టర్లు, ఎయిర్ ఫిల్టర్ పరికరాలు, పుస్తకాలు, గోడపై ఏదైనా, డెస్క్ ప్లాంట్, టిష్యూ బాక్స్, స్టఫ్డ్ టెడ్డీ బేర్, డిజిటల్ టీవీ బాక్స్, హెయిర్ డ్రైయర్, వాల్ క్లాక్, పెన్ లేదా క్లాత్‌లో ఆఖరికి టూత్ బ్రష్ హోల్డర్‌లో దీన్ని దాచవచ్చు. అంతేకాదు బాత్రూమ్ షవర్లు, పైకప్పులు, తలుపు రంధ్రాలు, డెస్క్ పాన్‌లో కూడా హిడెన్ కెమెరాలు అమర్చి ఉంటాయి. ఈ నేపథ్యంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఒక రూంలో 27 రహస్య కెమెరాలను అమర్చిన సీఎన్‌బీసీ టీం మొత్తం 5 రౌండ్లలో వివిధ సాధనాల ద్వారా పరీక్షించింది. దీని ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. నేకెడ్ ఐ టెస్ట్ నేకెడ్ ఐ లేదా బేర్ ఐ లేదా అన్ ఎయిడెడ్ ఐ అని కూడా అంటాం. భూతద్దం లాంటివి ఏమీ లేకుండా మన కళ్లతోనే పరిసరాలను జాగ్రత్తగా గమనించడం. అనుమానం వచ్చిన వస్తువులను చెక్ చేసుకోవడం. దీని ద్వారా ఈ టీం ఒక కెమెరాను మాత్రమే గుర్తించింది. మొబైల్ ఫోన్ వైఫై నెట్‌వర్క్‌లను స్కాన్ చేసే ‘ఫింగ్’యాప్ ద్వారా కెమెరా లెన్స్‌ను గుర్తుపట్టొచ్చు. ఇది ఎన్ని కెమెరాలున్నాయో ఇది ఇట్టే గుర్తు పడుతుంది. అయితే ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పలేదు. ఇందుకు స్మార్ట్‌ఫోన్‌లోని ఫ్లాష్‌లైట్‌ను వాడవచ్చు. ఈ విధానం ద్వారా ఫింగ్ 22 డివైస్‌లు వైఫైకి కనెక్ట్ అయినట్టు గుర్తించింది కానీ, కెమెరాలు ఎక్కడ ఉన్నదీ కనిపెట్టలేదు. ఇంటి ప్రధాన నెట్వర్క్ కాకుండా, కెమెరా కోసం రెండో వైర్లెస్ నెట్‌వర్క్‌ను కూడా ఏర్పాటు చేశారట. అయినా కూడా కెమెరాల ఉనికిని గుర్తించింది. ఈ పద్దతిలో టీం మూడు కెమెరాలను గుర్తించగలిగింది. ఒకటి వైఫై డివైస్, రెండు షర్ట్ బటన్, టెడ్డీ బేర్‌లో మూడోది దొరికింది. రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్టర్ దీని ద్వారా స్పై కెమెరాను గుర్తించగానే బీప్ సౌండ్ సంకేతాన్నందిస్తుంది. కెమెరాలను ఆన్ చేసి, Wi-Fiకి కనెక్ట్ అయినపుడు మాత్రమే కనిపిస్తాయి.ఎస్డీ కార్డ్‌లను ఉపయోగించే కెమెరాలను గుర్తించలేవు.అంతర్నిర్మిత లెన్స్ డిటెక్టర్ కూడా ఉంటుంది. లెన్స్ డిటెక్టర్ ప్రాథమిక లెన్స్ డిటెక్టర్, చౌకైనది, పోర్టబుల్ , ఉపయోగించడానికి సులభమైనది. ఇన్ఫ్రా రెడ్ కాంతిని విడుదల చేస్తుంది, తద్వారా కెమెరా లెన్స్ గుర్తించినపుడు ఎరుపు డాట్ కనిపిస్తుంది. కానీ ఇక్కడ కూడా రెండు కెమెరాలను మాత్రమే కనుగొంది టీం. అధునాతన లెన్స్ డిటెక్టర్ బైనాక్యులర్లను పోలి ఉండే అధునాతన లెన్స్ డిటెక్టర్. ఇది కెమెరా లెన్స్ నుండి ప్రతిబింబించే కాంతిని కూడా పెంచుతుంది. అయితే, ఈ పరికరం దూరం నుండి పని చేస్తుంది. అలాగే తక్కువ-కాంతి లేదా చీకటిలోమాత్రమే కెమెరాలను గుర్తించగలదు. అదీ కూడా ఒక ప్రత్యేక యాంగిల్లో చూసినపుడు మాత్రమే కెమెరాలను గుర్తించడం సులభమైంది ఈ పద్దతిలో టిష్యూ బాక్స్, లెదర్ బ్యాగ్, డెస్క్ కింద ఫైల్స్మధ్య ఇలా మొత్తం 11 కెమెరాలను టీం గుర్తించింది. -
గుండెల్లో మోగిందే నీ కబురే!
నిఖిల్, ఐశ్వర్యా మీనన్ జంటగా ఆర్యన్ రాజేష్, సన్యా ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ ఫిల్మ్ ‘స్పై’. ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో కె.రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ మూవీలోని ‘‘మొదటిసారిగా చూపు తగిలే... గుండెల్లో మోగిందే నీ తొలి కబురే, జుమ్ జుమ్మనే గుండెల్లోన యుద్ధాలే.. సిద్ధంగా ఉంచా నీకే ఏడుజన్మలే..’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను చిత్రయూనిట్ ఆదివారం విడుదల చేసింది. కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, రమ్యా బెహ్రా పాడారు. స్వాతంత్య్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకి కెమెరా: వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్, సంగీతం: శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్. -
మహిళా యజమాని బెడ్రూంలో సీక్రెట్ కెమెరా పెట్టిన పనోడు..ఆ తర్వాత..
గురుగ్రాంలో షాకింగ్ ఘటన జరిగింది. పనిమనిషి తనకు తెలియకుండా బెడ్రూంలో సీక్రెట్ కెమెరా పెట్టాడని ఓ మహిళ ఆరోపించింది. ఆపై తన ప్రైవేటు వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి రూ.2లక్షలు డిమాండ్ చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ విషయంపై వారు విచారణ చేపట్టారు. యజమాని చెప్పిన వివరాల ప్రకారం.. కొద్దిరోజుల క్రితం ఓ ప్లేస్మెంట్ ఏజెన్సీ ద్వారా ఈమె పనిమనిషిని నియమించుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి అతడు బెడ్రూంలో స్పై కెమెరా ఫిక్స్ చేశాడు. ఆ తర్వాత ఆమె ప్రైవేటు వీడియోలను సేకరించాడు. అయితే గతవారం ఇల్లు శుభ్రం చేసే సమయంలో యజమానికి సీక్రెట్ కెమెరా కన్పించింది. దీంతో వెంటనే పనిమనిషిని పనిలోనుంచి తీసేసింది. ఈ విషయం ఎవరికీ తెలియవద్దనే భయంతో పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. కానీ.. పనిమనిషి డబ్బుకోసం యజమానిని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. రూ.2 లక్షలు ఇవ్వకపోతే ఆమె ప్రైవేటు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించాడు. దీంతో గత్యంతరం లేక ఆమె ఫోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు కేసు నమోదు చేసుకుని నిందితుడు శుభం కుమార్‌ను అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. చదవండి: ఇంటి ఓనర్ పాడు పని.. అమ్మాయిలకు తెలియకుండా బెడ్రూమ్, బాత్రూంలో... -
మొబైల్ చార్జర్ మాదిరిగా ఉండే స్పై కెమెరాను అమర్చి..
బనశంకరి: మంచి కోసం ఉపయోగించాల్సిన సాంకేతికతను అడ్డుపెట్టుకుని నగ్నచిత్రాలను తీయడం మొదలుపెట్టాడో సైకో. వాటిని చూపి బెదిరిస్తున్న కామోన్మాదిని ఈశాన్య విభాగ పోలీసులు అరెస్ట్ చేశారు. స్పై కెమెరా వినియోగించి ఈ దందాకు పాల్పడుతున్న వ్యక్తి మైసూరు జిల్లా టీ.నరసిపురకు చెందిన మహేశ్. ఇన్‌స్టా ద్వారా వేధింపుల పర్వం ఒక యువతి ఫిర్యాదుతో ఇతని బాగోతం బయటపడింది. ఆ యువతి ఇన్‌స్టా అకౌంట్‌కు మహేశ్ నుంచి మెసేజ్ రాగా, ఎవరో అపరిచితుడు అని బ్లాక్ చేసింది. మళ్లీ వేరే ఇన్‌స్టా ఖాతా నుంచి మెసేజ్‌లు చేసి, తనతో చనువుగా చాట్ చేయాలని డిమాండ్ చేశాడు. లేకపోతే మీ నగ్న వీడియో తన వద్ద ఉందని బెదిరించాడు. ఆమె పట్టించుకోలేదు. దీంతో దుండగుడు నిజంగానే ఒక వీడియోను ఆమెకు పంపాడు. అది చూసి బాధితురాలు భయభ్రాంతురాలైంది. ఎందుకంటే ఆ వీడియో ఆమె ప్రైవేటు రూమ్‌లో చిత్రీకరించినట్లు తెలుసుకుని ఈశాన్య విభాగ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న సీఈఎన్ పోలీసులు తీవ్రంగా గాలించి మైసూరులో మహేశ్ ను శనివారం అరెస్ట్ చేశారు. ఇతడి వద్ద నుంచి స్పై కెమెరా, ల్యాప్‌టాప్, రెండు మెమొరీ కార్డులు, పెన్ డ్రైవ్, రెండు సెల్పోన్లను స్వాదీనం చేసుకున్నారు. ఎలా చేశాడంటే.. నిందితుడు మహేశ్, ఫిర్యాదురాలికి పరిచయస్తుడు కాగా ఆమె ఇంటికి వెళ్లిన సమయంలో ఆమె రూమ్‌లో మొబైల్ చార్జర్ మాదిరిగా ఉండే స్పై కెమెరాను అమర్చాడు. ఇంకా ఎన్ని చోట్ల ఇలాంటి నేరాలకు పాల్పడ్డాడు అనేదానిపై విచారణ ప్రారంభించారు. ఈశాన్య విభాగం డీసీపీ అనూప్ ఏ.శెట్టి, సీఐ సంతోష్ రామ్ ఈ కేసును దర్యాప్తు చేశారు. (చదవండి: ముంబైలో రూ.5 కోట్ల కొకైన్ పట్టివేత ) -
ఎంబసీ బాత్రూమ్లో స్పై కెమెరాల కలకలం
రాయబార కార్యాలయంలోని ఆడవాళ్ల బాత్రూమ్లో స్పై కెమెరాల గుర్తింపుతో ఒక్కసారిగా కలకలం రేగింది. బ్యాంకాక్(థాయ్‌లాండ్)లోని ఆస్ట్రేలియా ఎంబసీ ఛాంబర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు శనివారం కాన్బెర్రా నుంచి ఒక అధికారిక ప్రకటన వెలువడింది. ఎంబసీలో పని చేసిన మాజీ ఉద్యోగి పనే ఇదని తెలుస్తోంది. రాయల్ థాయ్ పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి.. విచారిస్తున్నట్లు సమాచారం. గతేడాది చివర్లో ఓ అధికారిణి బాత్రూమ్ ఫ్లోర్ మీద మెమొరీ కార్డును గుర్తించడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. దీంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి.. థాయ్ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి.. జనవరి 6వ తేదీనే ఫిర్యాదు నమోదు అయినట్లు తెలుస్తోంది. కెమెరాలు ఎప్పటి నుంచి ఉన్నాయి? అనే విషయంపై నిర్ధారణ కోసం దర్యాప్తు కొనసాగుతోంది. -
ఫుడ్ కంటైనర్‌లో స్పై కెమెరా!
మనం ఏదైన మాల్స్‌కి వెళ్లితే అక్కడ పెద్ద పెద్ద షోరూంల వాళ్లు భద్రత దృష్ట్యా స్పైకెమరాలు, సీసీ కెమరాలు వంటివి ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకంటే ఎక్కవ జనసందోహం ఉంటుంది. పైగా అక్కడ ఉన్న ఖరీదైన వస్తువుల చోరికి గురికాకుండా ఉండే నిమిత్తం ఈ ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. అయితే ఒక కస్టమర్ తన పెంపుడు పిల్లులు కోసం కొనుగోలు చేసిన ఫుడ్ కంటైనర్‌లో ఉన్న స్పై కెమెరాను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. (చదవండి: ఫుల్‌గా తాగి సెక్యూరిటీ గార్డ్‌తో గొడవపడిన మహిళ) అసలు విషయంలోకెళ్లితే..ఒక వ్యక్తి లిల్లిపుట్, గోలియత్ అనే రెండు పెంపుడు పిల్లులు ఉంటాయి. సదరు వ్యక్తి తన పిల్లులకు సంబంధించిన ఆహారాన్ని స్థానిక కో-ఆపరేటివ్ ఫ్రాంచైజీ వెల్కమ్ స్టోర్‌లో కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఒకరోజు అతను తన భార్యను ఆ ఆహార ప్యాకెట్లను తీసుకురమ్మని చెబుతాడు. దీంతో ఆమె ఆ ప్యాకెట్‌ని తీసుకుని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఆ ఫుడ్ ప్యాకెట్‌పై ఉన్న పిల్లి బొమ్మ తల మీద ఒక స్పై కెమెరా ఉంటుంది. దీంతో ఆమె ఈ విషయాన్ని తన భర్తకు తెలియజేసింది. అయితే అతను కూడా ఒక్కసారిగా షాక్‌కి గురవుతాడు. బహుశా సెక్యూరిటీ నిమిత్తం ఇలా షాపు వాళ్లు ఇలా ఏర్పాటు చేశారేమో పొరపాటున మనకు వచ్చేసిందేమో అని అనుకుంటారు. ఆ తర్వాత ఇంతవరకు ఆ కెమెరాలో ఏమైన రికార్డు అయ్యిఉందేమో అని సీసీఫుటేజ్ నిమిత్తం తనిఖీ చేసి చూడగా మరోసారి షాక్‌కి గురవుతాడు. ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే ఆ స్పై కెమెరాలో బ్యాటరీలు లేవు అందువల్ల అది వేటిని రికార్డు చేయలేదు. ఇంతవరకు స్టోర్ అయి ఉన్న డేటా ఏమి లేదని ఇది చూడటానికి ఆశ్చర్యంగానూ వింతగానూ ఉందని సదరు వ్యక్తి స్థానిక మీడియాకి తెలిపాడు. (చదవండి: రష్యా బస్సు ప్రమాదంలో ఐదుగురు మృతి) -
సైబర్ క్రైమ్: ఫోన్లో గూఢచర్యం..
ఊరు నుంచి వచ్చాక అల్మారా తెరిచి చూసిన సుమిత్ర(పేరుమార్చడమైనది) షాక్ అయ్యింది. తను భద్రంగా ఉంచిన బంగారం కనిపించలేదు. అల్మరా తాళాలు ఎక్కడ పెట్టిందో తనకు మాత్రమే తెలుసు. అవి ఎక్కడ ఉంచిందో అక్కడే జాగ్రత్తగా ఉన్నాయి కూడా. ఇంట్లో కొడుకు కోడలిని అడిగితే తమకేమీ తెలియదని, పెద్ద కోడలికి ఇచ్చారేమో అంటూ నిష్టూరంగా మాట్లాడారు. సుమిత్రకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. అందరి పెళ్లిళ్లు అయ్యాయి. భర్త సంపాదించినది, తన దగ్గర ఉన్న బంగారం ఇంకా పిల్లలకు పంచలేదు. ఇద్దరు కొడుకులు ఉద్యోగ రీత్యా మంచి స్థాయిలో ఉండటంతో వారు సొంతిళ్లు కట్టుకుని ఉంటున్నారు. చిన్నకొడుకు ఆర్థికంగా స్థిరపడకపోవడంతో తల్లిదండ్రులతోనే కలిసి ఉంటున్నాడు. చిన్న చిన్న మనస్పర్థలు వచ్చినా సుమిత్ర, ఆమె భర్త రఘునాథం సర్దుకుపోయేవారు. కానీ, ఈ మధ్య ఆస్తి వ్యవహారంలో కొడుకుల మధ్య తరచూ గొడవలు వస్తున్నాయి. కోడలు ప్రవర్తన మరింత విచిత్రంగా ఉంది. బంగారం పోవడంతో పోలీసులను సంప్రదించారు సుమిత్ర, ఆమె భర్త. ఫోన్ సంభాషణతో చౌర్యం ఇంటి పరిస్థితి కనుక్కుంటే కొన్ని నెలలుగా తమ కొడుకు, కోడలు తమపై గూఢచర్యం చేస్తున్నారని, తమ పిల్లలతోనూ, బంధువులతోనూ తాము ఫోన్లో మాట్లాడుకున్న విషయాలు కూడా వారికి తెలిసిపోతున్నాయని, ఇంట్లో ప్రశాంతత కోల్పోయామని చెప్పుకున్నారు సుమిత్ర దంపతులు. వారి దగ్గర ఉన్న ఫోన్ చెక్ చేసి చూస్తే అందులో చిన్న కోడలు స్పై యాప్‌ని ఇన్స్టాల్ చేసి, రికార్డర్ వాయిస్‌ను తన ఈ మెయిల్‌కు లింక్ చేసినట్టుగా గుర్తించారు. దీని ద్వారా కుటుంబంలో మిగతావారితో జరిగే ఫోన్ సంభాషణ అంతా కొడుకు, కోడలు వినేవారని తెలిసింది. అందులో భాగంగా సుమిత్ర తన కూతురి తో ఫోన్లో మాట్లాడినప్పుడు అల్మరాలో ఉంచిన బంగారం, రహస్యంగా ఉంచిన తాళాల గురించి చెప్పింది. అది తెలుసుకున్న కొడుకు కోడలు ఆ బంగారాన్ని దొంగతనం చేసి, తమకేమీ తెలియదని, మిగతా కొడుకులకు, కూతురుకు ఇచ్చి ఉంటారని దురుసుగా మాట్లాడారు. ఇదో మానసిక జాడ్యం కుటుంబ సంబంధాలలో అనుమానాలు ఉంటేనే ఇలాంటివి జరుగుతుంటాయి అనుకుంటే పొరబాటే. బయటి వారు కూడా ఇతరులను ఇరకాటంలో పెట్టడానికి ఇలాంటి చర్యలకు పూనుకోవచ్చు. వారిలో అత్యంత సన్నిహితులు అనదగిన వారు కూడా ఉండవచ్చు. సాధారణంగా ఎన్ఆర్ఐ మ్యారేజీ విషయాల్లో కాబోయే భాగస్వామి పట్ల అనుమానంతో ఇలాంటి గూఢచర్యం చేస్తుంటారు. భార్యాభర్తల సంబంధం విషయంలోనూ అనుమానం వల్లే ఇలాంటి స్పైవేర్లు పుట్టుకు వస్తాయి. ఫోన్ సర్వీస్ పాయింట్లలోనూ ఇలాంటి స్పై కెమరా యాప్‌లు ఇన్స్టాల్ చేసి, వాటి ద్వారా అమ్మాయిల వ్యక్తిగత సమాచారాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త అవసరం. యాంటీ స్పై వేర్... ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు మన ఫోన్ ఇవ్వకుండా ఉండటం మొదటగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త. ► మాల్వేర్ లేదా స్పై వేర్ యాప్ ఇన్స్టాల్ చేసినట్టుగా కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు. ► ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ త్వరగా ఖాళీ అవుతుంటుంది. ► పాప్ అప్ యాడ్స్ నిరంతరం వస్తూ ఉంటాయి. ► డేటా వినియోగం పెరిగినట్టుగా చూపుతుంది. ► ఇతర పాప్ అప్ యాప్ నోటిఫికేషన్స్ విరివిగా వస్తుంటాయి. ► మాల్వేర్ లేదా స్పై వేర్ ఉందని అనుమానించినట్లయితే యాంటీ వైరస్, యాంటీ మాల్వేర్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేయాలి. ఫోన్‌ని స్కాన్ చేయాలి. అవసరం లేని యాప్స్‌ను తొలగించాలి. అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
దూరదర్శన్ కేంద్రం: మహిళల బాత్రూమ్లో సీక్రెట్ కెమెరా
తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురం దూరదర్శన్ కేంద్రంలోని మహిళల బాత్రుమ్‌లో సీక్రెట్ కెమెరాను కనిపించింది. ఈ కెమెరాను ఆదివారం ఓ మహిళ గుర్తించగా.. ఈ విషయంపై దూరదర్శన్ అధికారులు బుధవారం పోలీసులను సంప్రదించారు. దీనిపై తిరువనంతపురం సైబర్ సెల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: వన్ డ్రైవ్ రెస్టారెంట్ కేసులో వెలుగులోకి కొత్త విషయాలు కాగా ఆఫీసులో తాత్కాలిక ఉద్యోగిగా జాయిన్ అయిన ఓ వ్యక్తి ఈ రహస్య కెమెరాను అరేంజ్ చేసినట్లు తెలిసింది. కెమెరాను తీసేయడంతో పాటు అక్కడ పెట్టిన ఉద్యోగిని విధుల్లో నుంచి తొలగించినట్లు అధికారులు తెలిపారు. మెయిన్ స్టూడియోకి సమీపంలోని వాష్‌రూమ్‌లో ఈ కెమెరాను అమర్చినట్లు పేర్కొన్నారు. అయితే పోలీసులతోపాటు ఈ విషయాన్ని దూరదర్శన్ కేంద్రంలోని మహిళా కమిటీ, క్రమశిక్షణా కమిటీ అధికారులు అంతర్గతంగా విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉండగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ వన్ డ్రైవ్ ఇన్ ఫుడ్‌కోర్టులోని మహిళల టాయిలెట్లో సెల్‌ఫోన్ పెట్టి వీడియోలు చిత్రీకరిస్తున్నారనే విషయం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఫుడ్‌కోర్టుకు తన స్నేహితులతో కలిసి వెళ్లిన ఓ యువతి రెస్ట్రూమ్కు వెళ్లింది. అక్కడి బాత్రూమ్లో కెమెరా ఆన్‌చేసిన సెల్‌ఫోన్‌ను గుర్తించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. -
మహిళలను భయపెడుతున్న షాపింగ్ మాల్స్ ట్రయల్ రూమ్స్
-
వన్ డ్రైవ్ రెస్టారెంట్ కేసు: జువైనల్ హోంకు బాలుడి తరలింపు
సాక్షి, బంజారాహిల్స్(హైదరాబాద్): జూబ్లీహిల్స్ రోడ్ నం.10లోని ఓ ఫుడ్కోర్ట్ బాత్రూమ్లో సెల్‌ఫోన్ కెమెరా ఆన్ చేసి ఉంచి వీడియో రికార్డు చేసిన ఘటనలో నిందితుడైన మైనర్ బాలుడి(17)ని జువైనల్ హోమ్‌కు పంపించగా మేనేజర్ శ్రీకాంత్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు రోజులుగా ఇక్కడ హౌజ్ కీపింగ్ బాయ్ ఓ బాత్రూమ్లో కెమెరా ఏర్పాటు చేయగా ఓ యువతి గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొబైల్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు 20 మంది యువతుల నగ్న దృశ్యాలు ఉన్నట్లు గుర్తించారు. మొబైల్లో మొత్తం 5 గంటల ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. చదవండి: Jubilee Hills:వాష్‌రూమ్‌లో స్పై కెమెరా: వన్ డ్రైవ్ రెస్టారెంట్‌పై కేసు నమోదు -
వన్ డ్రైవ్ రెస్టారెంట్ కేసులో వెలుగులోకి కొత్త విషయాలు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని వన్ డ్రైవ్ రెస్టారెంట్ వాష్‌రూమ్‌లో మొబైల్ అమర్చిన కేసులో నిందితుడైన మైనర్ బాలుడిని జువెనైల్ హోమ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఫుడ్ కోర్టు సీసీ ఫుటేజీని మొత్తం స్వాధీనం చేసుకున్న పోలీసులు.. చైతన్య ఇంటిలో సోదాలు జరుపుతున్నారు. విచారణలో మైనర్ బాలుడు బెనర్జీ పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడని, అతని మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు తెలిపారు . అయితే ఈ కేసులో కేశవ్ పాత్రపై ఇంకా పోలీసులకు క్లారిటీ రాలేదు. కాగా వన్ డ్రైవ్ రెస్టారెంట్ వాష్‌రూమ్‌లో సీక్రెట్ ప్లేస్‌లో మొబైల్ అమర్చిన ఈనెల 22వ తేదిన ఓ యువతి ఫిర్యాదు చేసిందని జూబ్లీహిల్స్ ఎస్ఐ నవీన్ రెడ్డి తెలిపారు. నిందితుడు మైనర్ బాలుడు అరు నెలలుగా ఈ హోటల్లో పని చేస్తున్నడని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ వన్ డ్రైవ్ ఇన్ ఫుడ్‌కోర్టులోని మహిళల టాయిలెట్లో సెల్‌ఫోన్ పెట్టి వీడియోలు చిత్రీకరిస్తున్నారనే విషయం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఫుడ్‌కోర్టుకు తన స్నేహితులతో కలిసి వెళ్లిన ఓ యువతి రెస్ట్రూమ్కు వెళ్లింది. అక్కడి బాత్రూమ్లో కెమెరా ఆన్‌చేసిన సెల్‌ఫోన్‌ను గుర్తించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చదవండి: జూబ్లీహిల్స్: ఫుడ్కోర్ట్ టాయిలెట్లో సెల్‌ఫోన్ పెట్టి.. వీడియోలు రికార్డింగ్ పర్సనల్ పని కోసం యువతి బాత్ రూం వెళ్ళినప్పుడు సీక్రెట్ ప్లేస్‌లో యువతి స్పై కెమెరా గమనించిందన్నారు. వెంటనే మేనేజ్మెంట్ దృష్టికి ఆ తర్వాత పోలీసుల దృష్టికి తీసుకు వచ్చిందని చెప్పారు. మైనర్ బాలుడు వారం రోజుల క్రితమే ఆ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశాడని, వాష్ రూమ్‌లో వీడియో చిత్రీకరించే సమయంలో ఫోన్లో సిమ్ కార్డ్ లేదని వెల్లడించారు. 14 వేలకు ఫోన్ కొన్నాడని, తన ఫోన్ నుంచి ఎవరికీ ఆ వీడియోలు పంపినట్లు తాము కనుగొనలేదని వెల్లడించారు. (చదవండి: ఓయో రూమ్‌కు వస్తే ఉద్యోగం ఇస్తా..) నిందితుడిది సైకో మనస్తత్వం హోటల్ యజమాని చైతన్యను పీఎస్‌కు పిలిపించి విచారించాము. హోటల్లో ఉన్న అక్కడి సీసీటీవీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నాం. తమ ఫుటేజ్ ఉందా అని పోలీస్ స్టేషన్‌కు ఎవరూ రాలేదు. కేశవ్ వ్యక్తి అక్కడ ఘటన జరిగినప్పుడు అక్కడ ఉన్నాడు. అతని ప్రమేయం ఏముందో తెలియాలి. కేశవ్ అనే వ్యక్తి గురుంచి మాకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు. నిందితుడిది సైకో మనస్తత్వం. మానసిక స్థితి సరిగాలేదు. కేసులో ప్రమేయం వున్న వారందరిని విచారిస్తాం. ఒక్కడే ఈ చర్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. మైనర్ బాలునిపై ఐపీసీ 354, 506 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. వన్ డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు హోటల్ పై కేసు నమోదు చేశాం’ అని పోలీసులు తెలిపారు. స్పై కెమెరా పెట్టింది అతనే కాగా తమ హోటల్లో స్పై కెమెరా పెట్టింది హౌజ్ కీపింగ్ బాయ్ బెనర్జీనే అని, అతడికి యాజమాన్యం సహకరించింది లేదని వన్ డ్రైవ్ ఇన్ ఫుడ్‌కోర్టు యజమాని చైతన్య తెలిపారు. ఈ వ్యవహారంపై ఫుడ్ కోర్టు యజమాని చైతన్య స్పందించాడు. చైతన్య మాట్లాడుతూ.. ‘‘మా హోటల్లో స్పై కెమెరా పెట్టింది హౌజ్ కీపింగ్ బాయ్ బెనర్జీనే. అతనికి హోటల్ యాజమన్యం సహకరించింది లేదు. నిందితుడు ఫోన్ కొని నాలుగు రోజులే అవుతుంది. ఫోన్ వాష్ రూంలో పెట్టిన రోజే గుర్తించారు. ఆరు నెలల నుంచి ఫోన్ పెట్టలేదు. ఆ వార్తలు అవాస్తవం. పోలీసులకు నేను సహకరిస్తున్నాను. ఎవరూ ఆందోళన చెందవద్దు’’ అని కోరాడు. -
‘స్పై’ కెమెరాలపై ‘స్పై’..మూడో కన్నుతో చూడొద్దు!
స్పై కెమెరాల ద్వారా జరిగే అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని ‘యాంటీ రెడ్ ఐ’ పేరుతో ఐదేళ్ల క్రితం ముందుకు వచ్చారు హైదరాబాద్ వాసి వరలక్ష్మి. స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాల్లో ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తూ ‘అమ్మాయిలూ జాగ్రత్తగా ఉండండి’ అని చెబుతూ వచ్చారు. ‘‘ఈ క్రమంలోనే జనంలోకి వెళుతున్నకొద్దీ మహిళలు, పిల్లలపై జరుగుతున్న దాడులు, వేధింపులు, హింస.. ఏ స్థాయిలో ఉందో అర్థమైంది. విషయాలు తెలుస్తున్నకొద్దీ నేరాలకు అడ్డుకట్ట వేయలేమా.. అనే ఆలోచన ఎక్కువైంది’’ అంటారు వరలక్ష్మి. ఆ దిశగానే మహిళల రక్షణ విషయంలో అనేక కోణాల్లో పరిశీలించి ‘వాయిస్ ఆఫ్ భారత్’ ను తీసుకొచ్చాను అని వివరించారు. మహిళలు, పిల్లల రక్షణ కోసం చట్టాలు కఠినతరం చేయాలంటూ నినదించే వరలక్ష్మి ‘సాక్షితో పంచుకున్న విషయాలు... ‘‘మహిళల రక్షణపై దాదాపు వందమంది సెలబ్రిటీలు, స్త్రీ, పురుషుల వాయిస్‌ను 45 రోజులు పాటు వీడియో రూపంలో రికార్డు చేశాను. వారందరూ మాట్లాడిన విషయాలో ముఖ్యమైన పాయింట్స్‌ను క్రోడీకరించారు. అడ్వకేట్ అభిప్రాయాన్ని కూడా తీసుకొని 24 ముఖ్యమైన పాయింట్ల జాబితాను తీసుకొచ్చాను. రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు అధికారులను సంప్రదించి, ఆ జాబితాను అమలు పరిచాలని కోరుతున్నాను. రోజు రోజుకూ నేరాలుపెరుగుతున్న నేపథ్యంలో మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఒక ఎజెండా ఇది. 2017లో ‘యాంటీ రెడ్ ఐ’ పేరుతో జనంలోకి వెళ్లినప్పుడు కొత్త కొత్త సమస్యలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆగస్టు 15, 2020 నుంచి పబ్లిక్ నుంచి వాయిస్ తీసుకోవడం మొదలుపెట్టాను. తెలంగాణ, ఆంధ్రాలోని అన్ని రాజకీయ పార్టీలు, పోలీసు డిపార్ట్మెంట్ నుంచి కూడా వాయిస్ తీసుకున్నాం. తెలుగు రాష్ట్రాల్లో మహిళలు, పిల్లలపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయడానికి, నిరోధించడానికే నా ప్రయత్నం అంతా. దీంట్లో భాగంగానే మహిళలకు శిక్షణా తరగతులు, క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్స్, బాలకార్మికులకు సంబంధించినవి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ అవగాహన, ఆరోగ్య శిబిరాలు.. ఇవన్నీ ఒక దగ్గర చేర్చడానికి ‘హెవెన్ హోమ్ సొసైటీ’ పేరుతో ఎన్జీవోను ఏర్పాటు చేశాను. సీసీ కెమెరాలు, పుటేజీ ‘వాయిస్ ఆఫ్ భారత్’లో భాగంగా గ్రామణస్థాయి నుంచి నా కార్యాచరణను మొదలుపెట్టాను. అప్పుడే పిల్లలు, మహిళలపై అఘాయిత్యాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయనేది అర్ధమైంది. ఏదైనా నేరం జరిగిన వార్త తెలిసినప్పుడు ‘అయ్యో’ అనేసి ఊరుకుంటున్నాం. కానీ, చాలా వరకు గురుకులాలు, కార్యాలయాలు, పాఠశాలల్లో... సీసీ కెమెరాల ఏర్పాటు, వాటికి సంబంధించిన పుటేజీ రికార్డులో ఉండటం అనేది ఏ మాత్రం జరగడం లేదు. ఎక్కడా రికార్డు కాకపోవడంతో నేరాలు కూడా వెలుగు చూడటం లేదు. నేరస్థులు నిర్భయంగా బయట తిరుగుతున్నారు. మిస్సింగ్ అయిన కథనాలెన్నో.. లాక్డౌన్ తర్వాత వరుస చిన్నారులు మిస్సింగ్ కథనాలు ఎక్కువగా వినవస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ దమ్మాయిగూడలో నలుగురు పిల్లలు మిస్సింగ్ న్యూస్ ప్రధానమైంది. అందులో ఒక చిన్నారిని అత్యంత దారుణంగా రేప్ చేసి, చంపారు. మరో రెండు కేసులు వెలుగులోకే రాలేదు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట రావాలంటే అన్నిచోట్లా సిసి కెమెరాల ఏర్పాట్లు పెంచాలి. సెక్షన్లు త్వరగా అమల్లో పెట్టాలి. పార్టీలతో సంబంధంలో లేకుండా మహిళల రక్షణకు సంబంధించిన విషయాలన్నీ వారి ఎజెండాలో పెట్టాలి. ప్రతి మహిళా ఆలోచించాల్సిన తరుణం ఇది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిల్లలు, మహిళల భద్రత విషయాల పట్ల వెంటనే స్పందించి, అమలులో పెట్టాలి. అఘాయిత్యాలు చోటు చేసుకున్నాక కాదు రక్షణ గురించి ఆలోచించడం కాదు, ముందే బతికుండటానికి రక్షణ కావాలన్నదే ‘వాయిస్ ఆఫ్ భారత్’ నినాదం. మహమ్మారి టైమ్ కరోనా టైమ్‌లో బయట తిరిగే వారి సంఖ్య తగ్గింది, క్రైమ్ తగ్గింది అనుకుంటున్నారు. నిజానికి పరిస్థితి అలా లేదు. దీనికి సంబంధించిన డేటా కోసం అన్ని పోలీసు విభాగాల్లోనూ వివరాలను సేకరించాను. ఒక్కో పోలీస్ స్టేషన్ పరిధిలో కనీసం ఐదు కేసులు ఫైల్ అవుతున్నాయి. గృహహింస అయితే మరీ దారుణం. కరోనా కారణంగా ఎవరి ప్రాణాలు వారు కాపాడుకోవడంలో మునిగిపోయి ఈ తరహా క్రైమ్ వినడానికి, చెప్పుకోవడానికి ఎవరూ పట్టించుకోవడం లేదు. మూడో కంటితో చూడొద్దు... యాంటీ రెడ్ ఐ షాపింగ్ మాల్స్, కాంప్లెక్సులు, హోటల్ గదులు, అద్దె ఇల్లు.. ఇలా ప్రతి చోట అమ్మాయిలు, మహిళలను స్పై కామ్ ద్వారా నగ్న వీడియోలు, ఫొటోలు తీసి వాటిని సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేసే నేరగాళ్లు పెరిగారు. దీనివల్ల జరిగే అనర్థాలకు అడ్డుకట్టవేసే ఉద్దేశంతోనే మూడో కన్నుతో చూడొద్దు అని ‘యాంటీ రెడ్ ఐ’ ఏర్పాటు చేశాను. దాదాపు ఐదేళ్లుగా ఈ స్పై కెమరా నేరాలకు సంబంధించి వర్క్ చేస్తున్నాను. ఎంతోమంది సాయంగా! మహిళల భద్రతకు సంబంధించిన ‘యాప్’ ను తీసుకురావాలని ప్రభుత్వాలను కోరుతూ, మహిళల రక్షణకు సంబంధించిన విషయాలను ప్రింట్ చేస్తూ వాటిని అధికారులకు అందజేస్తూ వస్తున్నాను. వేధింపులు, అఘాయిత్యాలకు గురైన బాధితులకు సాయం చేయమంటూ వేడుకోళ్లు వస్తూనే ఉంటాయి. దానికి తగినట్టుగానే అడ్డుకోవడానికి ‘చంపేస్తాం’ అంటూ ఎన్నో బెదిరింపులు వచ్చాయి. ఇలాంటప్పుడు కుటుంబం శ్రేయస్సు గురించి ఆలోచించి, విడిగా ఉంటూ ఈ పనులు చూస్తున్నాను. ఈ సంస్థ ముందుకెళ్లడానికి నా స్నేహితుల సాయమే నాకు కొండంత అండగా నిలుస్తోంది’’ అని వివరించారు వరలక్ష్మి. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: రాజేష్ రెడ్డి నోముల -
జీతం అడిగితే.. అశ్లీల వీడియోలు
మీరట్ : యూపీలోని మీరట్‌లో స్కూల్ యాజమాన్యం వికృత చర్యలు ఆలస్యంగా వెలుగుచూశాయి. జీతాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసిన మహిళా ఉపాధ్యాయులను వేధించడమే గాక టాయిలెట్స్‌లో రహస్యంగా స్పై కెమెరాలు ఏర్పాటు చేసి అశ్లీల వీడియోలు తీసినట్లు బయటపడింది. వివరాలు.. మీరట్‌లోని సర్ధార్ బజార్లో రిషబ్ అకాడమీ స్కూల్ నడుపుతున్నారు. లాక్డౌన్ ఉండడంతో పాఠశాలను మూసివేశారు. దీంతో ఆ స్కూల్లో పనిచేస్తున్న పలువురు మహిళా ఉపాధ్యాయులు తమకు అందాల్సిన జీతాలను ఇవ్వాలంటూ స్కూల్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. పాఠశాల సెక్రటరీగా ఉన్న రంజీత్ జైన్ అతని కొడుకు అభినవ్ జైన్లు జీతాలు ఇవ్వకుండా వేధించడమే గాక మహిళల టాయిలెట్ రూంలో రహస్యంగా స్పై కెమెరాలు అమర్చినట్లు తేలింది.(చదవండి : విషాదం: సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య) జీతాలు అడగానికి వచ్చిన సదరు మహిళా ఉపాధ్యాయులకు వారి వీడియోలు చూపిస్తూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడినట్లు తెలిసింది. దీంతో పాఠశాల గేటు ఎదుట నిరసన వ్యక్తం చేసిన ఉపాధ్యాయులు అక్కడినుంచి మీరట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రంజిత్, అభినవ్‌లపై ఫిర్యాదు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా తండ్రీ, కొడుకులు తమకు తెలియకుండా తీసిన రహస్య వీడియోలను చూపించి చనువుగా ఉండాలంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని ఒక మహిళ ఉపాధ్యాయురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ తాము వారికి లొంగకపోతే చేతబడి చేయించి మమ్మల్ని చంపేందుకు కూడా వెనకాడమని బెదిరించారంటూ మరికొందరు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. (చదవండి : ప్రణయ్‌ని చంపినట్లు చంపుతామని..) -
ఆర్పీఎఫ్కు అత్యాధునిక పరికరాలు
న్యూఢిల్లీ: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) ఆధునీకరణలో భాగంగా రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్పీఎఫ్ పోలీసులకు బాడీ కెమెరాలు, డ్రోన్లు, స్పై కెమెరాలు, వాయిస్ రికార్డర్ వంటి అత్యాధునిక పరికరాలు అందించేందుకు అంగీకరించింది. అలాగే ఈ అత్యాధునిక పరికరాలను కొనుగోలు చేసే అధికారాన్ని రైల్వే డివిజినల్, జోనల్ అధికారులకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీని ప్రకారం డ్రోన్ కెమెరాలు, బ్యాగేజ్ స్కానర్లు, డ్రాగన్ సెర్చ్లైట్లు, ఫైరింగ్ సిమ్యులేటర్లు, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్ఎఫ్ఐడీ) ఆధారిత వ్యవస్థలు, కాల్ డేటా రికార్డర్, నైట్ విజన్ వంటి పరికరాలను డివిజినల్, జోనల్ అధికారులు కొనుగోలు చేయవచ్చు. -
లేడీస్ హాస్టల్లో స్పై కెమెరాలు
చెన్నై: దక్షిణ భారతంలో అతిపెద్ద నగరం చెన్నైలోని తిళ్లై గంగానగర్‌లో అది ఒక లేడీస్ హాస్టల్. దాని యజమాని సంపత్‌రాజ్ అలియాస్ సంజయ్. రెండు నెలల క్రితమే ఒక అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకొని హాస్టల్ నడుపుతున్నాడు. నెలకి రూ. 5,500 అద్దె చెల్లిస్తే ఆ హాస్టల్లో ఉండొచ్చు. ధర అందుబాటులో ఉండటంతో విద్యార్థినులు, ఉద్యోగినులు ఆ హాస్టల్లో చేరారు. కానీ కొద్ది రోజుల్లోనే ఆ హాస్టల్ ఎంత ప్రమాదకరమో, అమ్మాయిల బతుకుల్ని ఎలా బజారుపాలు చేస్తోందో వెలుగులోకి వచ్చింది. డిసెంబర్ 2న ఒక అమ్మాయి తలంటు స్నానం చేసి జుట్టు ఆరబెట్టుకోవడానికి బాత్రూమ్లోనే ఉన్న ప్లగ్ పాయింట్లో హెయిర్ డ్రయర్‌ను పెట్టింది. కానీ అది ప్లగ్‌లోకి సరిగ్గా వెళ్లకపోగా, ఏదో అడ్డుపడినట్టుగా అనిపించింది. దీంతో ఆ అమ్మాయికి అనుమానం వచ్చింది. ఆ ప్లగ్ పాయింట్‌ను గట్టిగా పీకి చూసేసరికి ఇంకేముంది ఆమె అనుమానమే నిజమైంది. అందులో రహస్య కెమెరా అమర్చి ఉంది. షాక్ తిన్న ఆమె వెంటనే ఆడంబాక్కం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు హాస్టల్ అంతా పరిశీలిస్తే ఎక్కడ పడితే అక్కడే ఉన్న స్పై కెమెరాలు బయటపడ్డాయి. ప్లగ్ సాకెట్లలో మూడు కెమెరాలు, బల్బుల్లోపల రెండు కెమెరాలు, వార్డ్రోబ్ హ్యాంగర్లలో ఒక కెమెరా, గోడ గడియారాలలో మూడు కెమెరాలు, చివరికి బెడ్ రూమ్ కర్టెన్లలో కూడా రహస్య కెమెరాలు దొరకడంతో పోలీసు అధికారులే ఆశ్చర్యపోయారు. సంపత్ రాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎక్కడైనా ఉండొచ్చు జాగ్రత్త! ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. ఎంత మంచి ఉందో, అంత ప్రమాదకరంగానూ మారుతోంది.అతి చిన్న సైజులో రహస్య కెమెరాలు తయారీ జరుగుతూ ఉండటంతో ఎక్కడ పడితే అక్కడ వాటిని అమరుస్తున్నారు. అమ్మాయిల నగ్న వీడియోలు తీసి ఇంటర్నెట్లో ఉంచుతామని బెదిరింపులు, ఆ సీడీలను అమ్ముకోవడం.. అదంతా ఒక విషవలయం. అందుకే అమ్మాయిలెవరైనా ఎక్కడికెళ్లినా ఒకటికి రెండు సార్లు స్పై కెమెరాలు ఉన్నాయేమోనని చెక్ చేసుకోవాలి. హాస్టల్స్‌లోనే కాక షాపింగ్ మాల్స్ ట్రయల్ రూమ్స్‌లో, హోటల్ రూమ్స్ ఇలా రహస్య కెమెరాలు ఎక్కడైనా ఉండొచ్చు. సరదాగా మీరు ఏ షాపింగ్ మాల్కో వెళితే గోడల మీద రంధ్రంలాంటి డిజైన్లు ఏమైనా కనిపిస్తే, కచ్చితంగా వాటిని అనుమానించాల్సిందే. ఆ రంధ్రాల మాటున రహస్య కెమెరా ఉండడానికి అవకాశం ఉంది. ఇక బయటకి సాధారణంగా కనిపించే ఎలక్ట్రికల్ సాకెట్లలో కూడా పెట్టే అతి సూక్ష్మమైన కెమెరాలు కూడా వచ్చేశాయి. బట్టలు పెట్టుకునే వంకీల మాదిరిగా ఉండే కెమెరాలు కూడా మార్కెట్లో ఉన్నాయి. చివరికి ఎవరి ఊహకూ అందని రీతిలో మరుగుదొడ్లను శుభ్రం చేసే బ్రష్లలో కూడా స్పై కెమెరాలను అమరుస్తున్నారంటే ఎంతటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కేవలం దృశ్యాలను చిత్రీకరించేవి మాత్రమే కాదు, వాయిస్ రికార్డు కెమెరాలు కూడా అమరుస్తున్నారు. ఈ కెమెరా లు చాలా వరకు రీచార్జ్ చేసుకునేవే. మనుషుల కదలికలు, మాటలకు ఆటోమేటిక్‌గా ఆన్ అయ్యే కెమెరాలు కూడా ఉన్నాయి. ఎక్కడికెళ్లినా ఎంత అప్రమత్తంగా ఉండాలో, స్పై కెమెరాలను ఎలా గుర్తించాలో అమ్మాయిలు నేర్చుకోవాలి. -
కంటికి కన్ను
చిల్లర సరుకుల్లా.. స్పై కెమెరాలు ఫుట్‌పాత్ మీద కూడా దొరుకుతున్నాయి. కొనేవారికి హద్దులు లేవు, అమ్మేవారికి పరిమితులు లేవు. ఫలితం.. మన అమ్మ, అక్క, చెల్లి, వదిన.. వీళ్ల నగ్నచిత్రాలు వీధికెక్కుతున్నాయి. అవమానంతో కృంగిపోయి.. వాళ్ల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇలాంటి మరణాలను అరికట్టడానికే ‘హెవెన్ హోమ్ సొసైటీ’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి ‘యాంటీ రెడ్ ఐ’ పేరుతో ఓ ఉద్యమ పోరాటం చేస్తున్నారు వరలక్ష్మి. అందులో భాగంగా షార్ట్‌ఫిల్మ్‌లు తీసి ప్రజల్లో ఈ సమస్యపై చైతన్యం తెస్తున్నారు. మిస్డ్ కాల్‌తో ఓటింగ్ ద్వారా సమస్యను చట్టసభల్లోకి తీసుకెళ్లబోతున్నారు. ‘‘నరకాసుర వధకు ఓ స్త్రీ శక్తి సరిపోయిందేమో కాని, ఈ స్పై కెమెరా విష సంస్కృతిని సమూలంగా ఛేదించడానికి అందరి చేయూత కావాలి’’ అంటున్నారు వరలక్ష్మి. ఆ అమ్మాయి షాపింగ్‌మాల్‌కి వెళ్లింది. డ్రెస్ సెలక్ట్ చేసుకుంది. ట్రైల్ రూమ్‌లోకి వెళ్లి సైజు సరిపోయిందో లేదో చూసుకుంది. మళ్లీ తన డ్రెస్ వేసుకుని బయటకు వచ్చేసింది. కావలసిన బట్టలు కొనుక్కుంది. వారం తర్వాత.. ట్రైల్ రూమ్‌లో తను బట్టలు మార్చుకున్న వీడియోలు నెట్లో సర్క్యులేట్ అవడం గమనించి షాక్ తింది. సిగ్గుతో చచ్చిపోయింది. ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకుంది. సురేఖ దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతోంది. ఒకరోజున వారి ఏకాంతానికి సంబంధించిన ఫొటోలు వాట్సాప్‌కి వచ్చాయి. భార్యాభర్తలిద్దరూ ఆశ్చర్యపోయారు. ఇది ఎలా జరిగిందా అని ఆలోచించారు. ఇంటి గోడలకున్న చిన్న చిన్న మేకులలో స్పై కెమెరాలు ఉన్నట్లు తెలిసింది. ఆ దంపతులు చాలాకాలం ఎవ్వరికీ కనపడకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.నిజామాబాద్ మాక్లూర్ మండలానికి చెందిన బీటెక్ విద్యార్థి రమ్యకృష్ణ. ఆమెకు ప్రసాద్ అనే వ్యక్తి ఫేస్బుక్లో పరిచయమయ్యాడు. వృత్తిరీత్యా అతడు కువైట్‌లో ఉంటున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ విషయం ఆమెకు తెలియకపోవడంతో, అతనితో స్నేహం చేసింది. తెలియక చేసిన స్నేహానికి ఇప్పుడు ఆమెను సాధిస్తున్నాడు. ఇవే కాదు..! కేరళలో ఒక ఫొటోగ్రాఫర్ వివాహ వేడుకలో ఫొటోలు తీయడానికి వచ్చాడు. అక్కడ ఫొటోలు తీసి, వాటిని మార్ఫింగ్ చేసి 50 వేల మందికి సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు. భద్రాచలంలో ఒక యువకుడు తనకు సోదరి వరుస అయిన యువతి నగ్న చిత్రాలు తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. బోయినపల్లిలో ఒక యువతికి తెలియకుండా వీడియో తీసి బ్లాక్మెయిల్ చేయడంతో ఆ యువతి సజీవదహనం అయిపోయింది. విచ్చలవిడి విష సంస్కృతి ఇటువంటి అనేక ఘటనలు అనునిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఎంతోమంది ఆడపిల్లలు తమకు తెలియకుండానే స్పైటెక్ వలలో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. మనోవ్యధ చెందుతున్నారు. ఇటువంటి బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. తమకు తెలియకుండా జరుగుతున్న ఈ అఘాయిత్యాలను ఎలా ఎదుర్కోవాలో తెలియని పరిస్థితి. ఒక మహిళను ఆమె అనుమతి లేకుండా ఫొటో లేదా వీడియోలో షూట్ చెయ్యడం, వాటిని షేర్ చేయడం తీవ్రమైన నేరం. అయినప్పటికీ ఈ తరహా నేరాలు ఆగడం లేదంటే అందుకు ఉపకరిస్తున్నవి స్పై కెమెరాలు. ఈ సంస్కృతికి అడ్డుకట్టు వేసేదెలా మరి? ‘‘దేశవ్యాప్తంగా విచ్చలవిడిగా జరుగుతున్న స్పై కెమెరాల అమ్మకాలను క్రమబద్ధీకరించాలి. ప్రతి సంస్థ మహిళా కస్టమర్ల భద్రతని తమ స్వంత బాధ్యతగా తీసుకొని వారి వ్యాపార సంస్థలు, హోటల్స్, మాల్స్, హాస్టల్స్ వంటి వాటిలో తమ సిబ్బంది కాని, ఎవరైనా ఇతరులు కాని స్పై కెమెరాలు బిగించారా అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. చట్టపరంగా కూడా బాధితులకు తక్షణ న్యాయం జరగేలా చూడాలి’’ అంటున్నారు ‘యాంటీ రెడ్ ఐ’ వ్యవస్థాపకురాలు శ్రీమతి జి. వరలక్ష్మి. యాంటీ రెడ్ ఐ ఆవిర్భావం వరలక్ష్మి ఖమ్మం జిల్లాలో జన్మించారు. తండ్రి సూర్య ప్రకాశ్ పోలీసు డిపార్ట్మెంట్లో పనిచేశారు. తల్లి సౌదామిని గృహిణి. భర్త జి. ఎన్. వి. సంజయ్ కుమార్ సొంతంగా వ్యాపారం చేస్తున్నారు. అమ్మాయి భార్గవి ఉద్యోగం చేస్తోంది. అబ్బాయి కిరీటి బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. వరలక్ష్మి ఫిల్మ్ సెన్సార్ బోర్డు మెంబరుగా పని చేస్తున్న రోజుల్లో కొన్ని కేసులను టెక్నికల్ టీమ్ ఇన్వెస్టిVó ట్ చేస్తున్నప్పుడు చూశారు. స్పయింగ్ ఎలా జరుగుతోందో తెలుసుకుని కదిలిపోయారు. ఎంతోమంది ఇటువంటి సంఘటనల కారణంగా మనోవ్యధకు గురవుతున్నారని, కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారని తెలుసుకున్నాను. స్పై కెమెరాలను దుర్వినియోగం చేయడం వల్ల అత్యాచారాలు కూడా జరుగుతున్నాయని, స్పై కెమెరాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా యాంటీ రెడ్ ఐ క్యాంపెయిన్ ప్రారంభించారు. షీ టీమ్‌లను పెంచాలి చట్టాల్లోని లొసుగులతో ఇటువంటి నేరాలకు పాల్పడుతున్న వారంతా వెంటనే బెయిలు మీద బయటకు వచ్చేస్తున్నారు. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానికి కూడా ఒక షాపింగ్ మాల్లో ఇలాంటి చేదు అనుభవమే ఎదురైనప్పుడు నిందితులు ఐదు వేల రూపాయలు జరిమానా కట్టి, మర్నాడే బయటకు వచ్చేశారంటే సాధారణ మహిళ భద్రత సంగతి ఏమిటి? ‘‘కఠిన చట్టాలు ఉండాలి. అవి సక్రమంగా అమలవ్వాలి. ఓటింగ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం చట్టాలు అమలుచేసేలా రాజకీయ నేతలు, అధికారులు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు... అందరూ సమన్వయంతో మహిళల తరఫున పోరాడటమే దీనికి పరిష్కారం’’ అంటున్నారు వరలక్ష్మి. స్పయింగ్ని రూట్ లెవల్ నుంచి పెకలించడానికి షీటీమ్స్ పెంచడం ఆమె సూచిస్తున్న ఒక మార్గం. దురదృష్టం ఏమిటంటే.. వరలక్ష్మి ఎనిమిది నెలల పాటు దీనిపై గ్రౌండ్ వర్క్ చేసి, అనేక సంఘటనల నేపథ్యం అర్థం చేసుకుని, కోర్టులో పిల్ వేసి ఏడాది గడుస్తున్నా, ఇంతవరకు ఆ కేసు బెంచ్ మీదకు రాకపోవడం! నివేదిక ఇవ్వలేదు! ‘‘ప్రస్తుత సమాజం మొత్తం టెక్నాలజీ మీదే నడుస్తోంది. ముందు ముందు ఈ సాంకేతికత కారణంగా సమాజం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. పిల్ వేసిన తరవాత, డీజీపీ నెలరోజులలో నివేదిక ఇవ్వాలి.ఇవ్వలేదు! వారే కనుక వెంటనే యాక్షన్ తీసుకుని నివేదిక కోర్టుకి ఇచ్చి ఉంటే కొన్నైనా ఇలాంటి ఘటనలు జరక్కుండా ఉండేవి’ అని వరలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘దక్షిణ కొరియాలో ఇటీవల మహిళలు పెద్ద ఎత్తున స్పై కెమెరాలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. వారి పోరాటం ఫలించింది. ఆ పని మన దేశానికి ఎందుకు చేతనవడం లేదు?’’ అని ప్రశ్నిస్తున్నారు వరలక్ష్మి. రోజుకో ఘటన! ఆ మధ్య ఓ మంత్రిగారి చొరవతో, ఓ షోరూమ్ లో ట్రయల్ రూమ్‌లో బయటపడిన సీసీ కెమెరాలు, ఎంత మంది అమ్మాయిల మానసిక క్షోభకు కారణమయ్యాయో తెలిసిందే. పబ్లిక్ ప్లేసులు, ప్రైవేట్ స్థలాలు, హోటల్ రూమ్స్ చివరకు కట్టుకున్న భార్యపై అనుమానంతో బెడ్రూమ్లో కెమెరా అమర్చిన శాడిస్ట్, భార్య స్నానపు దృశ్యాలనే కెమెరాలో బంధించి, స్నేహితులకు షేర్ చేసిన పైశాచికపు మృగాడు.చెప్పుకుంటూ పోతే రోజుకో ఘటన, పూటకో అవమానం, క్షణానికో అఘాయిత్యం. నాన్ బెయిలబుల్ అవ్వాలి మన దగ్గర గన్ ఉండాలంటే అనుమతి కావాలి. డ్రగ్స్ తీసుకోవాలంటే అనుమతి కావాలి. లిక్కర్ తీసుకోవాలంటే అనుమతి కావాలి. నిద్ర మాత్రలు వేసుకోవాలంటే అనుమతి కావాలి. మరి స్పై కెమెరాల కొనుగోలుకు అనుమతి ఎందుకు అవసరం లేదు. ఇష్టానుసారం కొనుక్కుని, వాడుకోవచ్చా! ప్రభుత్వం వీటిని నియంత్రించాలి. ఆన్లైన్లో ఆఫ్‌లైన్‌లో స్పై కెమెరాల అమ్మకం సరైన మార్గంలో ఉండాలి. 354సి, 2013 యాక్టులో నాన్‌బెయిలబుల్ చేయాలి. పోర్న్ ఫొటోగ్రఫీ మీద సైట్లు 40 లక్షల దాకా ఉన్నాయి. వాటిని నియంత్రించాలి. ఇందుకోసం ప్రతిఒక్కరూ8099259925కి మిస్డ్ కాల్ ఇవ్వండి. యాంటీ రెడ్ ఐ టీమ్ ద్వారా మహిళలకు ఈ సమస్యను ఎదుర్కోవటానికి కావలసిన సాంకేతిక అవగాహన మేము కలిగిస్తాం. – జి. వరలక్ష్మి సంభాషణ: వైజయంతి పురాణపండ -
దక్షిణ కొరియాలో రహస్య లైంగిక దోపిడి
ఈ నినాదం ఇప్పుడు దక్షిణ కొరియాను ఊపేస్తుంది. దాదాపు 20 వేల మంది మహిళలు రోడ్లపైకి వచ్చి దేశంలో మహిళల పట్ల జరుగుతున్న ‘రహస్య లైంగిక దోపిడి’కి వ్యతిరేకంగా నినాదించారు. ప్రస్తుతం కొరియా దేశాల వైపే ప్రపంచం మొత్తం చూస్తోంది. దానికి కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ భేటీ కాగా మరొకటి దక్షిణ కొరియాలో రహస్య లైంగిక దోపిడీకి వ్యతిరేకంగా వేల సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి రావడం. వివరాలు.. 2010 నుంచి దక్షిణ కొరియాను పోర్న్ భూతం పట్టిపిడిస్తుంది. రహస్య కెమెరాలలో నగ్నంగా చిత్రికరించబడి సామాజిక మాధ్యమాల్లోకి ఎక్కినవారు కోకొల్లలు. బస్సుల్లో, బస్ స్టాపుల్లో, పబ్లిక్ టాయిలెట్లలో ఎక్కడపడితే అక్కడ రహస్య కెమెరాలు పెట్టి మహిళల జీవితాలను ఆన్లైన్ పాలు చేస్తున్నారు. ఈ రహస్య పోర్న్ భూతానికి బలైంది కేవలం మహిళలే కాదు, ఈ జాబితాలో మగవారు కూడా ఉండటం గమనార్హం. గత నెల ఓ ప్రముఖ యూనివర్సిటీలో 25 ఏళ్ల యువకుడి నగ్న ఫొటోలను రహస్యంగా చిత్రీకరించిన యువతి వాటిని సామాజిక మాధ్యమాల్లో, పోర్న్ సైట్లలో పెట్టింది. ఆ యువకుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసినా పూర్తి స్థాయి దర్యాప్తును నిర్లక్ష్యం చేస్తున్నారు. దాంతో దేశంలో పెరిగిపోతున్న ‘స్పై కెమెరా పోర్న్’ను ప్రభుత్వం పట్టించుకోట్లేదని ప్రజలు ఉద్యమాన్ని లేవనెత్తారు. ఈ భారీ ర్యాలీ నిర్వహించిన సంస్థ ‘కరేజ్ టూ బీ అన్‌కంఫర్టబుల్’ గతంలో కూడా ఇలాంటి ర్యాలీని చేపట్టింది. ఈ రహస్య పోర్న్‌ను దక్షిణ కొరియాలో ‘మోల్కా’ గా పేర్కొంటారు. దాదాపు 6000 మందికి పైగా ఈ మోల్కా కేసులలో అరెస్ట్ అయ్యారు. ఇందులో మగవారితో పాటు ఆడవారు కూడా ఉన్నారు. ఈ రహస్య పోర్న్ వీడియోల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం ఈ ఆధునిక టెక్నాలజీనే అని నిపుణుల అభిప్రాయపడుతున్నారు. -
‘సమంత, మెహ్రీన్ ఎంతో ఆవేదన చెందారు’
సాక్షి, హైదరాబాద్: స్పై కెమెరాల నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని సినీనటి సనా అన్నారు. మహిళల జీవితాలతో చెలగాటమాడుతున్న రహస్య కెమెరాలు విచ్చలవిడిగా అమ్మకుండా చూడాలని కోరారు. ఆన్లైన్లో స్పై కెమెరాలు కేవలం రూ.250కే దొరకటం విచారకరమన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో స్వచ్ఛంద సంస్థ హెవెన్ హోమ్స్ సొసైటీ ఆధ్వర్యంలో ‘యాంటి రెడ్ ఐ’ పేరుతో చేపడుతున్న మిస్డ్‌కాల్ (8099259925) క్యాపెయినింగ్ బ్రోచర్‌ను సనా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సనా మాట్లాడుతూ.. స్పై కెమెరాల వల్ల కలిగే అనర్థాలపై నటీమణులు సమంత, మెహ్రీన్‌లు ఎంతో ఆవేదన వ్యక్తం చేసి తమతో కలిసి ఈ మిస్డ్‌కాల్ క్యాపెయినింగ్‌లో భాగస్వాములయ్యారని తెలిపారు. రహస్య కెమెరాలను దుర్వినియోగం చేస్తూ మహిళలను సమిధలుగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షాంపు బాటిల్స్, టూత్‌బ్రష్ తదితర వస్తువుల్లో సులువుగా స్పై కెమెరాలు పెట్టేస్తున్నారని తెలిపారు. తుపాకులకు లైసెన్సులు పెట్టినట్టుగానే రహస్య కెమెరాల విక్రయాలకూ లైసెన్స్‌లు తప్పనిసరి చేయాలన్నారు. కార్యక్రమంలో హెవెన్ హోమ్స్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు జి. వరలక్ష్మీ, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్పర్సన్ భువనేశ్వరి, సీనియర్ లాయర్ రాధా రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.