అయ్యప్ప డయాగ్నోస్టిక్స్‌కు నోటీసులు
మహిళల అశ్లీల వీడియోల చిత్రీకరణపై కలెక్టర్ సీరియస్
నలుగురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు
వారంలో నివేదిక ఇవ్వాలని ఆదేశం
నిజామాబాద్‌నాగారం: స్కానింగ్ కోసం వచ్చే మహిళల అశ్లీల వీడియోలను రికార్డు చేస్తున్న ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. స్కానింగ్ సెంటర్‌కు వచ్చే మహిళల ఫొటోలు, వీడియోలు తీసి.. వారికి ఫోన్‌లు చేసి సోషల్ మీడియాలో పెడతానని వేధించడం సంచలనంగా మారింది. సెంటర్‌లోని ఓ ఆపరేటర్ ఈ అకృత్యాలకు పాల్పడడం కలవరం సృష్టిస్తోంది. దీంతో స్కానింగ్ సెంటర్లలో మహిళల భద్రతపై అనుమానాలు తలెత్తుతున్నా యి.
నగరంలోని అయ్యప్ప స్కానింగ్ సెంటర్‌లో కొంత కాలంగా ఈ తతంగం కొనసాగుతుండడంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. అందులో పనిచేసే ఆపరేటర్ ఒక్కరే చేశారా..? వెనుక ఉండి ఎవరైనా చేయించారా అనే అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై సీపీ ఆదేశాల మేరకు పోలీసులు ఇప్పటికే విచారణ చేపట్టారు. తాజాగా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు సీరియస్‌గా స్పందించి నోటీసులివ్వ డంతో పాటు.. విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.
అధికారుల తనిఖీ
స్కానింగ్ కోసం వచ్చిన మహిళల అశ్లీల చిత్రీకరణ చేసి బ్లాక్ మెయిల్‌కు పాల్పడిన ఘటనపై కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్యాధికారి స్కా నింగ్ సెంటర్‌కు నోటీసులు జారీచేసి నలుగురి తో కూడిన విచారణ కమిటీ వేశారు. కమిటీలో జిల్లా జనరల్ ప్రభుత్వ ఆస్పత్రి రేడియోలాజిస్ట్ డాక్టర్ శ్రావణి, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ అంజనాదేవి, గైనకాలజిస్టులు డాక్టర్ అనుపమ, డాక్టర్ లావణ్యలున్నారు. వారం రోజుల్లో విచారణ చేసి నివేదిక సమరి్పంచాలని ఆదేశించారు. అలాగే సీపీ ఆదేశాల మేరకు పోలీసులు మంగళవారం తనిఖీలు చేపట్టారు.
జరిగిందిలా..
నిజామాబాద్ నగరంలో పదుల సంఖ్యలో స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. అయితే అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ప్రారంభమైన కొన్ని రోజులకే అశ్లీల ఫొటోలు, వీడియోల చిత్రకరణకు తెరలేపారు. ఇందులో పనిచేసే ఓ ఆపరేటర్ స్కానింగ్ కోసం వచ్చిన మహిళల అశ్లీల చిత్రాలను, వీడియోలను గుట్టుచప్పుడు కాకుండా తీసేవాడు. అనంతరం మహిళలకు ఫోన్‌లు చేసి వీడియోలు సోషల్ మీడి యాలో వైరల్ చేస్తానని బెదిరింపులకు పాల్పడడం గమనార్హం. పదుల సంఖ్యలో మహిళలతో ఇలా వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఈ తతంగం కొంత కాలంగా కొనసాగుతోంది. ఈ విషయం స్కానింగ్ సెంటర్‌లో నిర్వాహకులకు, వైద్యులకు తెలిసే జరిగిందని ఆరోపణలున్నాయి. ఓ ఆపరేటర్ ఇలాంటి దుశ్యర్యలకు పాల్పడుతున్నాడంటే నిర్వాహకులు పసిగట్టలేదంటే నమ్మేటట్లు కనిపించడంలేదు. గతంలోనూ ఇలా చేసినా నిర్వాహకులు తొలగించకపోవడంతోనే మరింత రెచ్చిపోయినట్లు సమాచారం.
సీపీని కలిసిన ఐఎంఏ నాయకులు
సీపీ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు అయ్యప్ప స్కానింగ్ సెంటర్‌లో పోలీసులు తనిఖీలు చేసి విచారణ చేపట్టారు. పలుమార్లు స్కానింగ్‌సెంటర్‌లో ఏం జరిగిందో క్షుణ్ణంగా తెలుసుకున్నట్లు సమాచారం. సద రు ఆపరేటర్‌ను సైతం అరెస్ట్ చేశారు. అయితే ఐఎంఏ నాయకులు ఎంటరై నిర్వాహకులకు మద్ద తుగా వెళ్లి సీపీని కలిశారు. ఆపరేటర్ తప్పు చేస్తే నిర్వాహకులకు సంబంధం లేదని చెప్పినట్లు సమా చారం. అయితే సీపీ స్పందిస్తూ ఐఎంఏ నాయకులపై మండిపడ్డారు. తప్పు చేసిన వారికి అండగా నిలబడడంపై ఆగ్రహించారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన వారి్నంగ్ ఇచ్చారు.
వివరాలు ఇవ్వాలని సీపీ కార్యాలయానికి వైద్యశాఖ లేఖ
సీపీ ఆధ్వర్యంలో అయ్యప్ప స్కానింగ్ సెంటర్‌లో విచారణ చేపట్టగా.. ఇందుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ నెల మొదటి వారంలో విన్నవించారు. కానీ వివరాలు రావడంలో ఆలస్యమైంది. ఎన్నికల కోడ్ కారణంగా సీపీ, అధికారులు బిజీబిజీగా ఉన్నారు. దీంతో వివరాలు ఇంకా శాఖకు రాలేదని వైద్యాధికారి తెలిపారు.
ఫిర్యాదుతో వెలుగులోకి..
అయప్ప స్కానింగ్ సెంటర్‌లో మహిళల అశ్లీల చిత్రాలు, వీడియోలు సామాజిక మధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఇందులో తమ ఇంటి మహిళల వీడియో కనిపించడంతో ఓ వ్యక్తి నేరుగా స్కానింగ్ సెంటర్‌కు వెళ్లి ప్రశ్నించారు. అనంతరం నిజామాబాద్ ఒకటో టౌన్‌లో ఈనెల 7న రాతపూర్వగా ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. సీపీ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు పోలీసులు సెంటర్‌లో తనిఖీలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment