Diagnostics
-
స్కానింగ్ సెంటర్ వికృత చేష్టలపై కలెక్టర్ సీరియస్.. నలుగురి కమిటీ
నిజామాబాద్‌నాగారం: స్కానింగ్ కోసం వచ్చే మహిళల అశ్లీల వీడియోలను రికార్డు చేస్తున్న ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. స్కానింగ్ సెంటర్‌కు వచ్చే మహిళల ఫొటోలు, వీడియోలు తీసి.. వారికి ఫోన్లు చేసి సోషల్ మీడియాలో పెడతానని వేధించడం సంచలనంగా మారింది. సెంటర్లోని ఓ ఆపరేటర్ ఈ అకృత్యాలకు పాల్పడడం కలవరం సృష్టిస్తోంది. దీంతో స్కానింగ్ సెంటర్లలో మహిళల భద్రతపై అనుమానాలు తలెత్తుతున్నా యి. నగరంలోని అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో కొంత కాలంగా ఈ తతంగం కొనసాగుతుండడంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. అందులో పనిచేసే ఆపరేటర్ ఒక్కరే చేశారా..? వెనుక ఉండి ఎవరైనా చేయించారా అనే అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై సీపీ ఆదేశాల మేరకు పోలీసులు ఇప్పటికే విచారణ చేపట్టారు. తాజాగా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు సీరియస్‌గా స్పందించి నోటీసులివ్వ డంతో పాటు.. విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. అధికారుల తనిఖీస్కానింగ్ కోసం వచ్చిన మహిళల అశ్లీల చిత్రీకరణ చేసి బ్లాక్ మెయిల్‌కు పాల్పడిన ఘటనపై కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్యాధికారి స్కా నింగ్ సెంటర్‌కు నోటీసులు జారీచేసి నలుగురి తో కూడిన విచారణ కమిటీ వేశారు. కమిటీలో జిల్లా జనరల్ ప్రభుత్వ ఆస్పత్రి రేడియోలాజిస్ట్ డాక్టర్ శ్రావణి, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ అంజనాదేవి, గైనకాలజిస్టులు డాక్టర్ అనుపమ, డాక్టర్ లావణ్యలున్నారు. వారం రోజుల్లో విచారణ చేసి నివేదిక సమరి్పంచాలని ఆదేశించారు. అలాగే సీపీ ఆదేశాల మేరకు పోలీసులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. జరిగిందిలా.. నిజామాబాద్ నగరంలో పదుల సంఖ్యలో స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. అయితే అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ప్రారంభమైన కొన్ని రోజులకే అశ్లీల ఫొటోలు, వీడియోల చిత్రకరణకు తెరలేపారు. ఇందులో పనిచేసే ఓ ఆపరేటర్ స్కానింగ్ కోసం వచ్చిన మహిళల అశ్లీల చిత్రాలను, వీడియోలను గుట్టుచప్పుడు కాకుండా తీసేవాడు. అనంతరం మహిళలకు ఫోన్లు చేసి వీడియోలు సోషల్ మీడి యాలో వైరల్ చేస్తానని బెదిరింపులకు పాల్పడడం గమనార్హం. పదుల సంఖ్యలో మహిళలతో ఇలా వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఈ తతంగం కొంత కాలంగా కొనసాగుతోంది. ఈ విషయం స్కానింగ్ సెంటర్లో నిర్వాహకులకు, వైద్యులకు తెలిసే జరిగిందని ఆరోపణలున్నాయి. ఓ ఆపరేటర్ ఇలాంటి దుశ్యర్యలకు పాల్పడుతున్నాడంటే నిర్వాహకులు పసిగట్టలేదంటే నమ్మేటట్లు కనిపించడంలేదు. గతంలోనూ ఇలా చేసినా నిర్వాహకులు తొలగించకపోవడంతోనే మరింత రెచ్చిపోయినట్లు సమాచారం. సీపీని కలిసిన ఐఎంఏ నాయకులుసీపీ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో పోలీసులు తనిఖీలు చేసి విచారణ చేపట్టారు. పలుమార్లు స్కానింగ్సెంటర్లో ఏం జరిగిందో క్షుణ్ణంగా తెలుసుకున్నట్లు సమాచారం. సద రు ఆపరేటర్‌ను సైతం అరెస్ట్ చేశారు. అయితే ఐఎంఏ నాయకులు ఎంటరై నిర్వాహకులకు మద్ద తుగా వెళ్లి సీపీని కలిశారు. ఆపరేటర్ తప్పు చేస్తే నిర్వాహకులకు సంబంధం లేదని చెప్పినట్లు సమా చారం. అయితే సీపీ స్పందిస్తూ ఐఎంఏ నాయకులపై మండిపడ్డారు. తప్పు చేసిన వారికి అండగా నిలబడడంపై ఆగ్రహించారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన వారి్నంగ్ ఇచ్చారు. వివరాలు ఇవ్వాలని సీపీ కార్యాలయానికి వైద్యశాఖ లేఖ సీపీ ఆధ్వర్యంలో అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో విచారణ చేపట్టగా.. ఇందుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ నెల మొదటి వారంలో విన్నవించారు. కానీ వివరాలు రావడంలో ఆలస్యమైంది. ఎన్నికల కోడ్ కారణంగా సీపీ, అధికారులు బిజీబిజీగా ఉన్నారు. దీంతో వివరాలు ఇంకా శాఖకు రాలేదని వైద్యాధికారి తెలిపారు.ఫిర్యాదుతో వెలుగులోకి.. అయప్ప స్కానింగ్ సెంటర్లో మహిళల అశ్లీల చిత్రాలు, వీడియోలు సామాజిక మధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఇందులో తమ ఇంటి మహిళల వీడియో కనిపించడంతో ఓ వ్యక్తి నేరుగా స్కానింగ్ సెంటర్‌కు వెళ్లి ప్రశ్నించారు. అనంతరం నిజామాబాద్ ఒకటో టౌన్లో ఈనెల 7న రాతపూర్వగా ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. సీపీ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు పోలీసులు సెంటర్లో తనిఖీలు చేపట్టారు. -
టెక్నీషియన్ కాదు..కీచకుడు స్కానింగ్ సెంటర్లో ఘోరాలు
-
మహిళల అశ్లీల వీడియోలు సీక్రెట్ గా రికార్డ్...
-
డయాగ్నస్టిక్ వ్యవస్థను కుప్పకూల్చడం బాధాకరం: హరీశ్ రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డయాగ్నస్టిక్ వ్యవస్థ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే టీ.హరీశ్‌రావు మండిపడ్డారు. డయాగ్నస్టిక్స్ కేంద్రాల్లో పని చేస్తున్న వైద్యులకు, సిబ్బందికి ఆరు నెలల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘రాష్ట్ర ప్రజలకు పూర్తి ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన తెలంగాణ డయాగ్నస్టిక్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలలలోనే కుప్పకూల్చడం బాధాకరమని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా 36 డయాగ్నస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేసి, 134 రకాల వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకువచ్చి వైద్య సేవల్లో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపారు. లక్షలాది నిరుపేద, సామాన్య ప్రజలకు ఆర్థిక భారం లేకుండా చేసి, నాణ్యమైన వైద్య పరీక్షలను అందించిన డయాగ్నస్టిక్ కేంద్రాలు ఇప్పుడు నిర్వహణ లోపంతో కొట్టుమిట్టాడుతున్నాయి. సిబ్బందికి ఆరు నెలలుగా వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి. ప్రజారోగ్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి డయాగ్నస్టిక్స్ కేంద్రాల్లో పని చేస్తున్న వైద్యులకు, సిబ్బందికి ఆరు నెలల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి. డయాగ్నొస్టిక్ కేంద్రాల ద్వారా అన్ని రకాల పరీక్షలు, వైద్య సేవలు ప్రజలకు అందే విధంగా చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం’అని హరీశ్‌రావు ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రజలకు పూర్తి ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన తెలంగాణ డయాగ్నస్టిక్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలలలోనే కుప్పకూల్చడం బాధాకరం.కెసిఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా 36 డయాగ్నస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేసి, 134 రకాల వైద్య పరీక్షలను… pic.twitter.com/CwnErdltSu— Harish Rao Thanneeru (@BRSHarish) May 20, 2024 -
మీకు తెలుసా! వ్యాధుల నిర్థారణ వైఫల్యతతో..ఏటా 8 లక్షల ప్రాణాలు బలి
రోగాలను నిర్థారించడంలో తలెత్తిన లోపాల కారణంగా ఏటా లక్షలాదిమంది ప్రాణాలను కోల్పోతున్నారట. ఈ విషయాన్ని యూఎస్‌కి చెందిన ఓ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ తన నివేదికలో పేర్కొంది. ప్రతి ఏడాది దాదాపు ఎనిమిది లక్షల మంది దాక చనిపోతున్నట్లు యూఎస్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ తన నివేదికలో వెల్లడించింది. ఈ మేరకు జాన్ హాప్కిన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు నిర్వహించిన సర్వే ప్రకారం ..ప్రతి ఏడాది వ్యాధులను సరిగా గుర్తించడంలో వైఫల్యం కారణంగా ఏటా మూడు లక్షల మరణాలు, నాలుగు లక్షల మందికి అంగవైకల్యం, మరికొందరూ ఇతర శారీరక రుగ్మతలతో బాధ పడుతున్నట్లు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ తన అధ్యయనంలో పేర్కొంది. శాస్త్రవేత్తలు 15 రకాల వ్యాధులను గుర్తించడంలో వైద్యులు విపలమవుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈ రోగ నిర్థారణ లోపాల్లో చాలా వరకు ఆస్పత్రుల్లో సరైన విధంగా వనరులు అందుబాటులో లేకపోవడమే ప్రధాన కారణమని అని తెలిపింది. ఇక వైద్యులు ఊపితిత్తుల క్యాన్సర్, సెప్సిన్, న్యుమోనియా, సిరలలో రక్తం గడ్డకట్టడం, స్ట్రోక్, తదితర వ్యాధులను తప్పుగా నిర్థారిస్తున్నట్లు పేర్కొంది. ఈ వ్యాధులు సాధారణ వ్యాధుల లక్షణాలను చూపించడంతో తరుచుగా వైద్యులు ఆయా వ్యాధులను గుర్తించడంలో విఫలమవుతున్నట్లు జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో న్యూరాలజిస్ట్ డాక్టర్ డేవిడ్ న్యూమాన్-టోకర్ వెల్లడించారు. (చదవండి: ఈ ఆహారం తింటే..చినుకుల్లో చింత ఉండదు) -
విజయవాడలో లుపిన్ ల్యాబొరేటరీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డయాగ్నోస్టిక్స్ సేవల్లో ఉన్న లుపిన్ తాజాగా విజయవాడలో కేంద్రాన్ని నెలకొల్పింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ల్యాబ్ ఏర్పాటైందని, నిపుణులైన సిబ్బంది ఇక్కడ కొలువుదీరారని కంపెనీ తెలిపింది. దేశవ్యాప్తంగా లుపిన్ డయాగ్నోస్టిక్స్‌కు 27 ల్యాబొరేటరీలు, 410 కలెక్షన్ సెంటర్స్ ఉన్నాయి. చదవండి: రూ.190 కోట్లతో లగ్జరీ బంగ్లా కొన్న గ్లామర్ క్వీన్, ఆ నిర్మాత ఇంటిపక్కనే! -
దక్షిణాదికి లుపిన్ డయాగ్నోస్టిక్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డయాగ్నోస్టిక్స్ సేవల్లో ఉన్న లుపిన్ డయాగ్నోస్టిక్స్ దక్షిణాదిలో అడుగుపెట్టింది. రీజినల్ రెఫరెన్స్ ల్యాబొరేటరీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. దీంతో సంస్థ ఖాతాలో దేశవ్యాప్తంగా ల్యాబ్స్ సంఖ్య 24కు చేరిందని లుపిన్ డయాగ్నోస్టిక్స్ సీఈవో రవీంద్ర కుమార్ బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘నవీ ముంబైలో నేషనల్ రెఫరెన్స్ ల్యాబొరేటరీ ఉంది. 380కిపైగా ఎక్స్‌క్లూజివ్ కలెక్షన్ సెంటర్లు (లుపిమిత్ర) ఉన్నాయి. 400 మందికి పైచిలుకు సిబ్బంది పనిచేస్తున్నారు. లుపిమిత్ర కేంద్రాల ఏర్పాటుకు ఫ్రాంచైజీలను ఆహ్వానిస్తున్నాం. ఏడాదిలో దేశవ్యాప్తంగా 100 ల్యాబ్స్ నెలకొల్పుతాం. ప్రతి ల్యాబ్ ఏర్పాటైన 18 నెలల్లోనే ఎన్ఏబీహెచ్ ధ్రువీకరణ పొందాలన్నదే మా లక్ష్యం’ అని ఆయన వివరించారు. -
తెలంగాణ డయాగ్నొస్టిక్స్‌కు జాతీయ గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ డయాగ్నొస్టిక్ సేవలకు జాతీయ గుర్తింపు దక్కింది. నాణ్యమైన వైద్యమే కాకుండా బాధితులు/ రోగులకు రోగ నిర్ధారణ పరీక్షలు సై తం ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం తెలంగాణ డయాగ్నొస్టిక్ సేవలను ప్రారంభించింది. పరీక్షల నిర్వహణ, ఫలితాలలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నందుకు తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంట్ర ల్ ల్యాబ్‌కు మెడికల్ టెస్టింగ్ విభాగంలో నేషనల్ అక్రిడేషన్ బోర్డు ఫర్ టెస్టింగ్ అండ్ కాల్బ్రేషన్ లేబొ రేటరీస్ (ఎన్ఏబీఎల్) సర్టిఫికేషన్ లభించింది. దీనిపై ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన వైద్య సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచనతో అన్ని జిల్లాల్లో ప్రారంభమై 57 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నాయని, పరీక్షల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నామని మంత్రి చెప్పారు. -
మోల్బియోలో టెమసెక్ పెట్టుబడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య పరికరాల తయారీలో ఉన్న మోల్బియో డయాగ్నోస్టిక్స్ తాజాగా అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ టెమసెక్ నుంచి రూ.695 కోట్ల నిధులను అందుకుంది. ఆధునిక సాంకేతిక ఉత్పత్తుల అభివృద్ధికి ఈ నిధులను వెచ్చిస్తామని కంపెనీ ప్రకటించింది. క్షయ వ్యాధి నిర్ధారణకు ఉపయోగించే ట్రూనాట్ పరికరాన్ని మోల్బియో డయాగ్నోస్టిక్స్ రూపొందించింది. 40కిపైగా దేశాల్లో ఈ పరికరాన్ని వినియోగిస్తున్నారు. చదవండి: స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో కొత్త రూల్స్ వచ్చాయ్.. ఇది తప్పనిసరి! -
ఏషియా కుబేరుడు గౌతమ్ అదానీ నెక్ట్స్ టార్గెట్ ఇదే?
న్యూఢిల్లీ: పోర్టులు, విమానాశ్రయాల నుంచి సిమెంటు, ఇంధనం వరకూ వివిధ రంగాల్లోకి విస్తరించిన అదానీ గ్రూప్ తాజాగా హెల్త్‌కేర్ (ఆరోగ్య సంరక్షణ) విభాగంపైనా దృష్టి పెట్టింది. భారీ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ చెయిన్స్, ఆఫ్‌లైన్..డిజిటల్ ఫార్మసీల కొనుగోళ్ల ద్వారా భారీ స్థాయిలో కార్యకలాపాలు విస్తరించే యోచనలో ఉంది. ఇందులో భాగంగా మే 17న అదానీ హెల్త్ వెంచర్స్ (ఏహెచ్‌వీఎల్) పేరిట పూర్తి అనుబంధ సంస్థను ఏర్పాటు చేసినట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలకు అదానీ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. ఆస్పత్రులు, వైద్య పరీక్షా కేంద్రాలు, రీసెర్చ్ కేంద్రాలు ఏర్పాటు సహా హెల్త్‌కేర్ సంబంధ వ్యాపార కార్యకలాపాలను ఏవీహెచ్ఎల్ త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపింది. హెల్త్‌కేర్ విభాగంలో ఎంట్రీకి సంబంధించి గ్రూప్ ఇప్పటికే పలు పెద్ద సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు, దాదాపు 4 బిలియన్ డాలర్ల వరకూ ఇన్వెస్ట్ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇటీవలే స్విస్ దిగ్గజం హోల్సిమ్ ఇండియా వ్యాపారాన్ని 10.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడం ద్వారా అదానీ గ్రూప్ సిమెంటు రంగంలోకి కూడా ప్రవేశించింది. హెచ్ఎల్ఎల్ కొనుగోలుకు పోటీ.. ప్రభుత్వ రంగ ఫార్మా సంస్థ హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ (హెచ్ఎల్ఎల్)ను కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్, పిరమాల్ హెల్త్‌కేర్ పోటీ పడుతున్నట్లు సమాచారం. హెచ్ఎల్ఎల్లో 100 శాతం వాటాలను ప్రైవేట్ సంస్థలకు విక్రయించాలని 2021 డిసెంబర్లో ప్రభుత్వం నిర్ణయించుకుంది. కంపెనీ కొనుగోలుకు ప్రాథమికంగా ఏడు బిడ్లు వచ్చాయి. దేశీయంగా హెల్త్‌కేర్ మార్కెట్లో స్థానిక, ప్రాంతీయ సంస్థలదే హవా ఉంటోంది. ఇటీవలి ఆన్లైన్ ఫార్మసీ విభాగంలో పెద్ద స్థాయిలో విలీనాలు, కొనుగోళ్ల డీల్స్ నమోదయ్యాయి. ఆన్లైన్ ఫార్మసీ నెట్‌మెడ్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 620 కోట్లతో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది. టాటా గ్రూప్ కూడా 1ఎంజీ కొనుగోలు ద్వారా ఆన్లైన్ ఫార్మా వ్యాపారంలోకి ప్రవేశించింది. హెల్త్‌కేర్ రంగంలోకి ఎంట్రీతో గౌతమ్ అదానీ (అదానీ గ్రూప్ చీఫ్), ముకేశ్ అంబానీల (రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్) మధ్య పోరు మరింతగా పెరుగుతుందనే అభిప్రాయం నెలకొంది. అయితే, హెల్త్‌కేర్ ఇన్ఫ్రాపై అదానీ, రిటైల్ వ్యవస్థను పటిష్టం చేసుకోవడంపై అంబానీ .. వేర్వేరు విభాగాలపై దృష్టి పెడుతున్నారని పేర్కొన్నాయి. చదవండి: అదిరిందయ్యా అదానీ.. ‘పవర్’ఫుల్ లాభాలు! -
డయాగ్నోస్టిక్స్ సేవల్లోకి యోధ లైఫ్‌లైన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ డయాగ్నోస్టిక్స్ సేవల్లోకి యోధ లైఫ్‌లైన్ ప్రవేశించింది. ఆధునిక వైద్య పరికరాలతో అమీర్‌పేటలో 24,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది ఏర్పాటైంది. బయోకెమిస్ట్రీ, బయోకెమికల్ జెనెటిక్స్, సైటోజెనెటిక్స్, కోవిడ్–19, జీనోమిక్స్, మాలిక్యులార్ డయాగ్నోస్టిక్స్, మైక్రోబయాలజీ, పాథాలజీ, ఫార్మకోజినోమిక్స్, రేడియాలజీ సేవలను పరిచయం చేసింది. టెస్ట్‌ల కోసం ఆన్లైన్లో బుక్ చేస్తే నమూనాలను ఇంటి వద్ద నుంచే సేకరిస్తారు. తక్కువ సమయంలో పరీక్ష ఫలితాలను అందించనున్నట్టు కంపెనీ తెలిపింది. నిపుణుల నుంచి సలహాలూ పొందవచ్చని వివరించింది. యోధ లైఫ్‌లైన్‌ను అత్యాధునిక కంప్యూటింగ్, మాలిక్యులార్ డయాగ్నోస్టిక్స్ రంగంలో విశేష అనుభం ఉన్న సుధాకర్ కంచర్ల స్థాపించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అందుబాటు ధరలో డయాగ్నోస్టిక్స్ సేవలను అందించనున్నట్టు తెలిపారు. యూఎస్ఏలో మూడు ఐటీ కంపెనీలతోపాటు సీఎల్ఐఏ ఆమోదం పొందిన ప్రపంచ స్థాయి డయాగ్నోస్టిక్స్ సెంటర్స్‌ను ఆయన ఏర్పాటు చేశారు. -
‘కరోనా టెస్టులను వ్యాపారంగా చూడొద్దు’
సాక్షి, హైదరాబాద్: కరోనా పరీక్షలను వ్యాపార కోణంలో చూడొద్దని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ డయాగ్నొస్టిక్స్ ప్రతినిధులకు సూచించారు. సాధారణ పరీక్షలకు, కరోనా టెస్టులకు చాలా తేడా ఉందని చెప్పారు. వీటిలో సర్వైలెన్స్, ట్రేసింగ్, ట్రీటింగ్ విధానాలు ఇమిడి ఉన్నాయని తెలిపారు. కరోనా పరీక్షలు చేస్తున్న డయాగ్నొస్టిక్స్ ప్రతినిధులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాజిటివ్ వచ్చిన ప్రతి కేసు వివరాలను ప్రభుత్వ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని, ఇంటికి వెళ్లి పరీక్షలు చేయొద్దని చెప్పారు. విమానాల్లో వచ్చిన వారికి లక్షణాలు లేకపోయినా టెస్టులు చేయాలని సూచించారు. (ఆర్మీ జవాన్ తల్లిపై దాడి) టెస్టులు చేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లకు పీపీఈ కిట్లను తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పారు. లేదంటే వారి ద్వారా కరోనా మిగిలిన వారికి అంటుతుందని హెచ్చరించారు. ఐసీఎంఆర్ నిబంధనలకు అనుగుణంగా టెస్టులు చేయాలని కోరారు. (డేంజర్ బెల్స్ !) -
రాష్ట్రంలో 17 సెంట్రల్ డయాగ్నొస్టిక్ హబ్‌లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ జిల్లాలను అనుసంధానిస్తూ 17 సెంట్రల్ డయాగ్నొస్టిక్ హబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఎన్హెచ్ఎం ‘ఉచిత రోగ నిర్ధారణ కార్యక్రమం’కింద అదనంగా 17 హబ్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కేంద్రాలతో పీహెచ్సీ మొదలు అన్ని ఆస్పత్రులను అసుసంధానిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ఆరోగ్య కేంద్రాలన్నింటిలో తగినన్ని ల్యాబ్ సౌకర్యాలున్నాయని తెలిపారు. ప్రస్తుతం వచ్చినవి 99 శాతం వైరల్ జ్వరాలేనని, బాధ్యతలేని నాయకులు ప్రజల్లో భయం కలిగించడం సరికాదన్నారు. పేదలకు సకాలంలో నాణ్యమైన సేవలందించేందుకు, జ్వరాలు రాకుండా పంచాయతీ, మున్సిపల్ శాఖల సమన్వయంతో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇప్పటికే తాను 11 జిల్లాల్లో పర్యటించినట్టు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రోగుల సంఖ్య తగ్గుతోందని చెప్పారు. శనివారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో డయాగ్నస్టిక్ సెంటర్లలో సదుపాయాలపై ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ వేసిన ప్రశ్న, ఎమ్మెస్ ప్రభాకర్ వేసిన అనుబంధ ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రుల్లో కేన్సర్ నిర్ధారణ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి ఈటల తెలిపారు. హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిని 200 పడకల నుంచి 450కు పెంచేందుకు చర్యలు చేపడతామన్నారు. వరంగల్‌లో ప్రాంతీయ కేన్సర్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని 2017 డిసెంబర్లో కేంద్రానికి సమర్పించిన ప్రతిపాదన పెండింగ్‌లో ఉందని తెలిపారు. హైదరాబాద్ ఎంఎన్‌జే తరహాలో రాష్ట్రంలోని 2, 3 చోట్ల కేన్సర్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నట్టు సభ్యుడు ఉల్లోళ్ల గంగాధరగౌడ్ వేసిన ప్రశ్నకు బదులిచ్చారు. ప్రీప్రైమరీ తరగతులపై త్వరలో నిర్ణయం... ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్లలో ప్రీప్రైమరీ తరగతులను ప్రారంభించే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి వెల్లడించారు. అంగన్వాడీ కేంద్రాల ఆవరణలోనే మూడేళ్లు దాటిన పిల్లలకు తరగతులు నిర్వహించే అంశంపై శిశు సంక్షేమ, విద్యా «శాఖలు కలసి పనిచేస్తున్నాయని చెప్పారు. అన్నం, గుడ్డు పెట్టే కేంద్రాలుగానే అంగన్వాడీలను చూడకుండా ప్రీప్రైమరీ విద్యను అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి వేసిన ప్రశ్నకు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, టీచర్ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి వేసిన అనుబంధ ప్రశ్నలకు మంత్రి పైవిధంగా సమాధానమిచ్చారు. ఈ లెక్చరర్ల క్రమబద్ధీకరణకు సంబంధించి పాలక, విపక్షాలు చట్టపరమైన అంశాలపై చర్చించి, గతంలోని కేసులు ఉపసంహరించుకుంటే సీఎం ఇచ్చిన హామీ తొందరగా నెరవేరే అవకాశం ఉంటుందన్నారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టి.జీవన్‌రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి, పురాణం సతీష్ వేసిన అనుబంధ ప్రశ్నలకు ఈ సందర్భంగా మంత్రి బదులిచ్చారు. 23 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నందున వాటిని భర్తీ చేయాలని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు స్పెషల్ మెన్షన్ కింద ప్రస్తావించారు. మల్బరీ సాగు ప్రోత్సహానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటున్నట్టు సభ్యుడు ఎగ్గె మల్లేశం వేసిన ప్రశ్నకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సమాధానమిచ్చారు. బహుళ పంటలను ప్రోత్సహించే ఆలోచనతో ప్రభుత్వం ఉందని, రాబోయే రోజుల్లో ఉపాధి హామీతో మల్బరీ సాగును అనుసంధానించే ఆలోచన ఉందని తెలిపారు. -
గిరిజనం వద్దకే వైద్య పరీక్షలు!
సాక్షి, హైదరాబాద్: గిరిజనుల వైద్యంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో మొబైల్ డయాగ్నొస్టిక్స్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గిరిజన ప్రాంత ప్రజలకు అన్ని రకాల రక్త, మూత్ర పరీక్షలు చేసేలా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం అధునాతన యంత్రాలను కొనుగోలు చేసి మొబైల్ వాహనాల్లో గిరిజన ప్రాంతాలకే వెళ్లి పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. ఆ శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో అధికారులు ఇప్పటికే యంత్రాలను పరిశీలించారు. ఒక్కొక్కటి రూ.40 లక్షల వ్యయంతో 12 నుంచి 15 అత్యాధునిక యంత్రాలు కొనుగోలు చేయడానికి వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తెలంగాణ వచ్చాక గిరిజన వైద్యానికి పెద్దపీట గతంలో గిరిజన గ్రామాల్లో ప్రజలు అనారోగ్యం బారిన పడితే సరైన వైద్యం అందకపోవడంతో మరణాల సంఖ్య కూడా అధికంగా ఉండేది. వర్షాలు ప్రారంభమైతే మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, అతిసారం వంటి వ్యాధులు గిరిజనుల పాలిట శాపంగా మారేవి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం గిరిజన వైద్యానికి పెద్దపీట వేసింది. క్షేత్రస్థాయిలో సిబ్బంది వైద్యసేవలను మెరుగుపర్చడంతో పాటు ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో వ్యాధుల నివారణ సాధ్యమైంది. గత మూడేళ్లుగా గిరిజన గూడేల్లోని మలేరియా మరణాలకు బ్రేక్ పడింది. ఏటా వందల సంఖ్యలో ఉండే మరణాలను పూర్తిగా నివారించగలిగింది. ప్రాథమిక దశలోనే వ్యాధులను నిర్ధారించి చికిత్సలు చేయడంతో ఏజెన్సీలో గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా పలు వ్యాధులకు కారణమయ్యే దోమకాటుకు గురికాకుండా గిరిజన ప్రజలకు దోమతెరలు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే వ్యాధులను ముందుగానే నిర్ధారించేందుకు డయాగ్నొస్టిక్స్ సెంటర్లను వారి చెంతకే తీసుకెళ్లనున్నారు. ప్రస్తుతం అధికారులు ఎంపిక చేసిన యంత్రం సాయంతో ఒక్కసారే 200 మందికి సంబంధించిన రక్త నమూనాలకు గంట వ్యవధిలోనే వివిధ రకాల పరీక్షలు నిర్వహించవచ్చు. ప్రతి గ్రామంలో నెలకు కనీసం ఒకసారి ఈ యంత్రాల సాయంతో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య పరీక్షలు చేయనున్నారు. ప్రస్తుతం గిరిజన ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నప్పటికీ, అక్కడ అవసరమైన రోగ నిర్ధారణ యంత్రాలు లేవు. ఏదైనా రోగం వస్తే, అది ముదిరే వరకు గిరిజనులు ఆస్పత్రులకు రావడంలేదు. దీంతో ప్రాణ నష్టం జరుగుతోంది. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో విష జ్వరాలు, వైరస్లు విజృంభించే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా మొబైల్ ల్యాబ్‌లు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి ఈటల రాజేందర్ అధికారులకు సూచించారు. -
మీలో మానసిక బలం ఎంత?
అనారోగ్యం శారీరకమైనదే కాదు. మానసికమైనది కూడా. కొంతమంది శారీరక రుగ్మతలతో బాధపడుతున్నా మానసికంగా వాటన్నింటినీ జయిస్తుంటారు. మరికొందరేమో శారీరకంగా బాగున్నా, లేనిపోని భయాలతో అనవసర సమస్యలను కొని తెచ్చుకుంటుంటారు. మరి మీ సంగతేమిటి? మీలో మానసిక బలం ఎంత? ఒకసారి విశ్లేషించుకునేందుకే ఈ సెల్ఫ్ చెక్. 1. ప్రపంచాన్ని చుట్టుముడుతున్న వివిధ వ్యాధుల గురించి తెలుసుకోవాలని అమిత ఆసక్తి చూపుతుంటారు. ఎ. అవును బి. కాదు 2. మీ ఆరోగ్యం గురించి నిత్యం ఆందోళనకు గురవుతుంటారు. ఎ. అవును బి. కాదు 3. రాత్రిపూట సరిగా నిద్రపట్టడం లేదన్న చింత మిమ్మల్ని వేధిస్తుంటుంది. ఎ. అవును బి. కాదు 4. వయసుకు తగిన బరువు, ఎత్తు లేనన్న సంశయం మనసును తొలిచేస్తుంటుంది. ఎ. అవును బి. కాదు 5. వైద్యపరంగా సరైన నిర్ధారణలు లేని వ్యాధులు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయనే దిగులు మీలో ఎక్కువవుతోంది. ఎ. అవును బి. కాదు 6. ఒంట్లో బాగుండటం లేదని తరచుగా ఆఫీసుకు సెలవు పెడుతుంటారు. ఎ. అవును బి. కాదు 7. ఒత్తిళ్లు ఎదురైనప్పుడు మీ గుండె చాలా వేగంగా కొట్టుకుని గుండెపోటు వచ్చేలా ఉందని భయపడుతుంటారు. ఎ. అవును బి. కాదు 8. పెరుగుతున్న వయసు, మృత్యుభయం తరచూ మీపై స్వైరవిహారం చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఎ. అవును బి. కాదు మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరు అంతకంటే ఎక్కువ వస్తే మీలో విపరీతమైన ఆందోళనలు ఉన్నాయని చెప్పవచ్చు. చిన్న ఒత్తిడిని కూడా తట్టుకోలేరు. మీది సానుభూతి కోరుకునే తత్వం. ఈ లక్షణాలను మీరు ఇలాగే పెంచి పోషించుకుంటే భవిష్యత్తులో మీరు అన్నింటికీ అవస్థలు పడాల్సిందే. ‘ఎ’లు కన్నా ‘బి’ ఎక్కువగా వస్తే మానసిక సంబంధమైన సమస్యలకు మీరు చాలావరకు దూరంగా ఉన్నట్లే లెక్క. మీ గురించి మీకు ఆందోళనలు కాస్తోకూస్తో ఉన్నా అవి సాధారణ స్థాయిలోనే ఉన్నట్లు భావించవచ్చు. -
క్యాన్సర్‌ను ఇట్టే పట్టేస్తుంది..
లండన్ : క్యాన్సర్ చికిత్స, నియంత్రణలో ముందడుగు పడింది. కేవలం ఒకే పరీక్షతో ఎనిమిది రకాల క్యాన్సర్లను గుర్తించే పద్ధతిని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. పలు ప్రాణాంతక క్యాన్సర్లను హోలీ గ్రెయిల్‌గా పిలిచే పరీక్షతో ముందుగానే పసిగట్టవచ్చు.ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ పరీక్షను సాధారణ వైద్యులు కూడా సులభంగా చేయడంతో పాటు ఎలాంటి లక్షణాలు కనపడని దశలోనూ క్యాన్సర్లను గుర్తించవచ్చని భావిస్తున్నారు. ఈ పరీక్ష అందుబాటులోకి వస్తే వ్యాధిని త్వరగా గుర్తించే వీలుండటంతో క్యాన్సర్ రోగులను ప్రాణాపాయం నుంచి కాపాడే అవకాశం ఉంది. ఈ పరీక్ష అత్యంత సామర్థ్యం కలిగినదని దీన్ని అభివృద్ధి చేసిన బృందానికి నేతృత్వం వహించిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్‌కు చెందిన డాక్టర్ గెట్ అటార్డ్ చెప్పారు. స్కానింగ్‌లు, కొలనోస్కోపీ వంటి పద్ధతుల అవసరం లేకుండా హోలీ గ్రెయిల్‌గా పిలిచే రక్త పరీక్షతో క్యాన్సర్‌ను గుర్తించవచ్చని ఆయన తెలిపారు. -
తెలంగాణ డయాగ్నస్టిక్స్
సాక్షి, హైదరాబాద్ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రారంభిస్తోంది. వైద్య సేవలు, చికిత్సలో కీలకమైన రోగ నిర్ధారణ పరీక్షలను ఉచితంగా అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ డయాగ్నస్టిక్స్ పేరిట రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రారం భించనున్నారు. తొలుత ఈ వారంలోనే నగరంలో ప్రయోగాత్మకంగా ఉచిత రోగ నిర్ధారణ పరీక్షల కార్యక్రమాన్ని ప్రారంభిం చడానికి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేసింది. ప్రయోగాత్మక కార్యక్రమంలో వచ్చే ఇబ్బందులను సరి చేసి సంక్రాంతిలోపు పూర్తి స్థాయిలో ఈ సేవలను ప్రారంభించనున్నారు. మొదట పాత జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులు, ఆ తర్వాత కొత్త జిల్లాల కేంద్రాలకు విస్తరిస్తారు. ఆ తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఈ సేవలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.10 కోట్ల నిధులను విడుదల చేసింది. కార్పొరేట్, ప్రైవేట్ డయాగ్నస్టిక్స్‌కు దీటుగా ప్రభుత్వ పరంగా ఈ సేవలను అందించేలా అధునాతన సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం) ఆవరణలోని ల్యాబ్‌కు అదనంగా మరో అత్యాధునిక డయాగ్నస్టిక్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉచిత రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న వారు ఎక్కడైనా నివేదికలు తీసుకునేలా ఎప్పటికప్పుడు వీటిని ఆన్లైన్లో పొందుపరచనున్నారు. రోగనిర్ధారణ పరీక్షలే కీలకం.. వైద్య సేవలలో డయాగ్నస్టిక్స్ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. రోగ నిర్ధారణలో ఎంత స్పష్టత ఉంటే అంత మెరుగైన వైద్యం అందించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రులలో ఇన్ పేషెంట్లకే ఉచితంగా ఈ సేవలు అందుతున్నాయి. అయితే ఔట్ పేషెంట్లుగా వచ్చే పేద వర్గాలకు ఇది ఇబ్బందిగా ఉంటోంది. బీపీ, మధుమేహం, మూత్ర పరీక్షలకు సైతం ప్రైవేటు డయాగ్నస్టిక్స్ కేంద్రాలకే వెళ్లాల్సి వస్తోంది. రోగ నిర్ధారణకు వైద్యులు సిఫారసు చేసినా డబ్బులు లేక పరీక్షలు చేయించుకోలేని పరిస్థితి ఉంటోంది. దీంతో వారు సరైన చికిత్స తీసుకోలేకపోతున్నారు. ఫలితంగా మరింత అనారోగ్యానికి గురవుతున్నారు. ఇదిలా ఉండగా అధికశాతం ప్రభుత్వ ఆస్పత్రులలో పరికరాలు, సిబ్బంది సరిగాలేక సాధారణ పరీక్షలు సైతం నిర్వహించడంలేదు. ఈ నేపథ్యంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కొత్తగా ప్రారంభిస్తున్న పథకంతో ఈ పరిస్థితులు మారనున్నాయి. ఔట్ పేషెంట్లకూ ఉచితం.. ఇకపై ఔట్ పేషెంట్లకు కూడా ఉచిత పరీక్షల సేవలు అందిస్తారు. అన్ని రకాల రోగ నిర్ధారణ పరీక్షలకు అవసరమైన పరికరాలను సిద్ధం చేస్తున్నారు. పరీక్షలకు అవసరమైన సాంకేతిక సిబ్బందిని కూడా నియమిస్తున్నారు. కాగా, ఆయా ఆస్పత్రుల స్థాయి ఆధారంగా ఉచిత రోగ నిర్ధారణ పరీక్షల సేవలను అందించనున్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో 39 రకాల సేవలు అందుబాటులో ఉంటాయి. అన్ని స్థాయిల ఆస్పత్రుల్లోనూ ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు రక్తం, మూత్ర, మల పరీక్షలకు సంబంధించిన నమూనాలు సేకరిస్తారు. ఆయా ఆస్పత్రుల నుంచి సాయంత్రం ఐదు గంటలలోపు ఐపీఎంలోని రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రానికి వాటిని చేరుస్తారు. మరుసటి రోజు ఉదయం నమూనాలను పరీక్షించి, మధ్యాహ్నం రెండు గంటలలోపు పరీక్ష నివేదికలను ఆన్లైన్లో సంబంధిత ఆస్పత్రికి పంపిస్తారు. ఆస్పత్రి నుంచి రోగికి ఆన్లైన్లో చేరవేస్తారు. అవసరమైతే రోగికి నేరుగా నివేదికలను ఇస్తారు. కాగా, తీవ్రమైన వ్యాధులకు సంబంధించిన పరీక్షలను ఐపీఎంలో నిర్వహించగా, ఇతర సాధారణ పరీక్షలను స్థానికంగా నిర్వహిస్తారు. వైద్య సేవల్లో మార్పులు: వాకాటి కరుణ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ తెలంగాణ డయాగ్నస్టిక్స్‌తో రాష్ట్రంలోని వైద్య సేవలలో ఎన్నో మార్పులు వస్తాయి. వైద్య సేవలలో కీలకమైన రోగ నిర్ధారణ పరీక్షలను ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేశాం. వారంలోనే ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లో ఈ సేవలు మొదలవుతాయి. రెండోవారంలో అధికారికంగా పూర్తి స్థాయిలో సేవలను అందిస్తాం. -
నేడే థైరోకేర్ లిస్టింగ్
న్యూఢిల్లీ: డయాగ్నస్టిటిక్ సర్వీసుల చెయిన్ థైరోకేర్ టెక్నాలజీస్ నేడు(సోమవారం) బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో లిస్ట్ కానున్నది. రూ.480 కోట్ల థైరోకేర్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) 73.55 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. ఈ కంపెనీ ఐపీఓ గత నెల 27న ప్రారంభమై, 29న ముగిసిన ఈ ఐపీఓకు ఇష్యూ ధర రూ. 446. డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్, ఎస్ఆర్ఎల్ డయాగ్నస్టిక్స్ వంటి కంపెనీలతో థైరోకేర్ పోటీపడుతోంది. -
‘సూపర్’ దోపిడీ
=అవసరం లేకున్నా టెస్టులు రాసేస్తున్న వైద్యులు =రోగ నిర్ధారణ పేరుతో నిలువు దోపిడీ =ఒక్కో ఆస్పత్రిలో ఒక్కో రేటు =టెక్నాలజీ పెరిగినా తగ్గని ఖర్చులు =ఇదీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల తీరు సాక్షి, సిటీబ్యూరో : తలనొప్పికి ఎంఆర్ఐ స్కాన్... అసిడిటీకి టూడీ ఎకో టెస్ట్.. మోకాలి నొప్పికి.. స్పైన్ ఎక్స్‌రే.. ఇదీ నగరంలో పలు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల తీరు. ‘అవసరమున్నా లేకున్నా ఎడాపెడా టెస్టులు రాసేయ్... అందిన కాడికి రోగులను దోచేయ్’ అన్న సూత్రాన్ని ఒంటబట్టించుకొని వైద్యాన్ని వైట్ కాలర్ వ్యాపారంగా మార్చేస్తున్నాయవి. రోగనిర్ధారణ పరీక్షల పేరుతో పేషెంట్లను నిలువుదోపిడీ చేసేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి పలు రాయితీలు పొందే ఈ ‘సూపర్’ ఆస్పత్రులు.. ఆ మేరకు ఉచిత సేవలందించే బాధ్యత మాత్రం విస్మరిస్తున్నాయి. ఓ సాధారణ డయాగ్నోస్టిక్స్‌లో సీబీపీ (కంప్లీట్ బ్లడ్ పిక్చర్)కి రూ.50 ఖర్చు అవుతుంది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఇదే పరీక్షకు రూ.350కి పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది. చెస్ట్ ఎక్స్‌రేకు బయట రూ.100-150 ఖర్చు అవుతుండగా, కార్పొరేట్ ఆస్పత్రుల్లో మాత్రం రూ.500 వరకు చార్జీ చేస్తున్నారు. అదే విధంగా తెల్లరేషన్ కార్డులేని రోగులకు గాంధీలో ఎంఆర్ఐ బ్రెయిన్ టెస్ట్‌కు రూ.2000 చార్జీ చేస్తుండగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ. 8500 నుంచి రూ. 12,000 వరకు వసూలు చేస్తున్నారు. నిజానికి గత పదేళ్లతో పోలిస్తే నగరంలో డయాగ్నోస్టిక్ సెం టర్ల సంఖ్యతోపాటు సాంకేతిక పరిజ్ఞానం కూడా పెరిగింది. అదేస్థాయిలో ఆయా టెస్టుల కోసం ఉపయోగించే మిషనరీ ఖర్చులు కూడా భారీగా తగ్గాయి. కానీ వైద్య పరీక్షల ఖర్చులు తగ్గకపోగా, భారీగా పెరగడాన్ని పరిశీలిస్తే రోగ నిర్ధారణ పేరుతో కార్పొరేట్ ఆస్పత్రులు ఏ స్థాయిలో దోపిడీకి పాల్పడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒకే టెస్టు, ఒకే కంపెనీ మిషన్, కానీ రోగ నిర్ధారణ పరీక్షల పేరుతో ఆస్పత్రులు వసూలు చేస్తున్న చార్జీల్లో మాత్రం భారీగా వ్యత్యాసం కానవస్తోంది. వైద్యులకూ టార్గెట్లు... నగరంలోని పలు కార్పోరేట్ ఆస్పత్రులు అందులో పనిచేస్తున్న వైద్యులకు టార్గెట్లు పెడుతున్నాయి. దీంతో వారు అవసరం లేకపోయినా రోగనిర్ధారణ పరీక్షలు రాస్తున్నారు. సాధారణ జ్వరంతో బాధపడుతున్న రోగికి సీబీపీ, సీయూఎస్, ప్లేట్లెట్స్ కౌంట్ టెస్టులతో పాటు జబ్బుతో సంబంధం లేని పరీక్షలు రాస్తున్నారంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ‘నేను కొంతకాలంగా ఛాతీలో మంట, గ్యాస్ట్రిక్ ట్రబుల్ వంటి సమస్యతో బాధపడుతున్నాను. వైద్యుడికి చూపించుకుందామని ఎర్రమంజిల్ సమీపంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్తే, అక్కడి వైద్యులు ఎండోస్కోపి, కొలనోస్కోపిలే కాదు, సమస్యతో సంబంధం లేని సీబీపీ, సీయూపీ, ఈసీజీ, టూడీఎకో వంటి టెస్టులన్నీ రాశారు. వైద్యులు సిఫార్సు చేశారు కదా! అని ఆయా పరీక్షలన్ని చేయించుకుని రిపోర్టులు తీసుకెళ్లి సంబంధిత వైద్యుడికి చూపిస్తే కడుపులో ఏమీ లేదన్నారు. చివ రకు మసాలాలు కలిగిన ఆహారం తగ్గిస్తే సరిపోతుందన్నారు’ అని బంజారాహిల్స్‌కు చెందిన రఘురామ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నాకు ఇటీవల మోకాళ్ల నొప్పులు ఎక్కువయ్యాయి. ప్యారడైజ్‌లోని ఓ ఆస్పత్రికి వెళ్తే స్పైన్ ఎక్స్‌రే, సీటీస్కాన్, ఎంఆర్ఐ వంటి టెస్టులన్నీ రాసి రూ.50 వేలకు పైగా బిల్లు వేసి చేతికిచ్చారు. పరీక్షలన్నీ చేయించుకురి రిపోర్టులు తీసుకుని వైద్యుడి వద్దకు వెళ్తే ఏ సమస్య లేదని చెప్పి పంపారు’ అని నల్లగొండకు చెందిన రవీందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘రోగుల ఆర్థిక పరిస్థితి చూస్తే జాలేస్తుంది. కానీ మేము మాత్రం ఏమి చేయగలం. ఆస్పత్రిలో వేతనం తీసుకుంటున్నందుకు యాజమాన్యం చెప్పినట్లు వినాల్సి వస్తోంది. అవసరం లేకపోయినా ఆస్పత్రి అవసరాల దృష్ట్యా రోగ నిర్ధారణ పరీక్షలు రాయాల్సి వస్తోంది. లేదంటే వైద్యులకూ పనిష్మెంట్లు తప్పడం లేదు’ అని సోమాజిగూడలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ సీనియర్ కార్డియాలజిస్ట్ ఆవేదన వ్యక్తం చేశారు. రాయితీలు పొందినా.. ఉచిత సేవలేవి? రోగ నిర్ధారణలో కీలకమైన ఎంఆర్ఐ, సీటీస్కాన్, ఆల్ట్రాసౌండ్ స్కానింగ్, ఎండోస్కోపి, కొలనోస్కోపి, ఎక్స్‌రే తదితర మిషన్లలో చాలావరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నవే. ప్రభుత్వం వీటికి రాయితీ కూడా ఇస్తుంది. మిషనరీపై ప్రభుత్వం నుంచి రాయితీ పొందినందుకు గానూ ఒప్పందం ప్రకారం ఆస్పత్రుల్లో 20 శాతం ఉచిత సేవలు అందించాల్సి ఉండగా.. నగరంలోని ఏ ఒక్క ఆస్పత్రి కూడా ఈ నిబంధనలు పాటించడం లేదు. చివరకు వైద్య సేవల పేరుతో ఆస్పత్రుల ఏర్పాటు కోసం ప్రభుత్వం నుంచి ఖరీదైన భూములు పొందిన వైద్యులు సైతం వీటిని అమలు చేయడం లేదు. డయాగ్నోస్టిక్ సెంటర్లోనూ, ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ ఒకే కంపెనీకి చెందిన ఎంఆర్ఐ, సిటీస్కాన్, ఆల్ట్రాసౌండ్, ఎక్స్‌రే యంత్రాలే ఉన్నా... టెస్టుల పేరుతో అవి వసూలు చేస్తున్న చార్జీల్లో మాత్రం భారీ వ్యత్యాసం కన్పిస్తూ ఉండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెరుగుతున్న ఈ రోగ నిర్ధారణ ఖర్చులను ఎప్పటికప్పుడు నియంత్రించాల్సిన ప్రభుత్వం వీటిని పట్టించుకోవడం లేదు. నిర్వహణ వ్యయం పెరగడం వల్లే.. నిజానికి ఆస్పత్రులతో పాటు ఎంఆర్ఐ, సీటీస్కాన్, ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ వంటి యంత్రాల సంఖ్య పెరిగినప్పుడు రోగ నిర్ధారణ పరీక్షల ఖర్చు తగ్గాలి. కానీ గత పదేళ్లతో పోలిస్తే ఆస్పత్రుల నిర్వహణ వ్యయం రెట్టింపైంది. దీనికి తోడు పదేళ్ల క్రితం ఎంఆర్ఐ ధర రూ.1.5 కోట్లు ఉంటే, ప్రస్తుతం రూ.3-6 కోట్లకు చేరింది. పెరిగిన ధరల భారాన్ని రోగులపై మోపక తప్పడం లేదు. - డాక్టర్ భాస్కర్‌రావు, ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ వైట్‌కాలర్ వ్యాపారమైన వైద్యం మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు.. వైద్యాన్ని వైట్ కాలర్ వ్యాపారంగా మార్చేశాయి. ఇక్కడ పనిచేస్తున్న కొంతమంది వైద్యులు రోగుల ఆరోగ్య, ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా అవసరం లేకపోయినా ప్రతి చిన్న సమస్యకూ ఎంఆర్ఐ వంటి ఖరీదైన టెస్టులు రాస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై తప్పుడు ప్రచారం చేస్తూ రోగుల దృష్టిని మరల్చుతున్నారు. - డాక్టర్ నాగేందర్, ఉస్మానియా శాఖ అధ్యక్షుడు, తెలంగాణ వైద్యుల సంఘం తలనొప్పితో వెళ్తే ఎంఆర్ఐ రాశారు ఇటీవల తలనొప్పి రావడంతో కొత్తపేటలోని ఓ ఆస్పత్రికి వెళ్లాను. అక్కడి వైద్యుడు ఎంఆర్ఐ తీసుకోవాలన్నాడు. రూ.8500 చెల్లించి బ్రెయిన్ ఎంఆర్ఐ తీయించాను. రిపోర్టు తీసుకుని మళ్లీ వైద్యుడి వద్దకు వెళ్తే, తీరా ఏమీ లేదని చెప్పి సాధారణ తలనొప్పి మాత్రలు రాసి పంపారు. - ఎన్.కేశవరాజు, నల్లగొండ